Inter practical exams
-
వసూళ్ల మధ్య.. ప్రయోగం మిథ్య!
కర్నూలు బిర్లా గేటు దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సం చదువుతున్న విద్యార్థులకు ఇంతవరకు ప్రాక్టికల్ క్లాస్‌లు చెప్పలేదు. ఈ కాలేజీకి చెందిన మరో బ్రాంచ్ కర్నూలు కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారిలో ఉంది. అక్కడ వారం రోజుల నుంచి ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. కర్నూలులోని ఓ కార్పొరేట్ కాలేజీ యాజమాన్యం అడ్మిషన్ తీసుకునే సమయంలో ప్రాక్టికల్ పరీక్షలు పాస్ చేయించేందుకు బైపీసీ విద్యార్థుల నుంచి రూ. 2 వేలు, ఎంపీసీ విద్యార్థుల నుంచి వెయ్యి రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తోంది. కర్నూలు సిటీ: ఇంటర్లో సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎంతో కీలకం. అందులో మార్కులు తగ్గితే ఎంసెట్, నీట్, ఐఐటీ–జేఈఈలో వెయిటేజీ తగ్గిపోతుంది. అయితే జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు కాగితాలపైనే కనిపిస్తున్నాయి. ప్రాక్టికల్స్ గడువు ముంచుకొస్తుండగా అభ్యసనంపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. కొన్ని జూనియర్ కళాశాలల్లో వసతులు లేవు. మరికొన్ని చోట్ల వసతులు ఉన్నా అవసరమైన పరికరాలు, రసాయనాలు లేవు. ప్రయోగ పరీక్షల్లో ఆయా సెంటర్ల ఎగ్జామినర్లను ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు మేనేజ్ చేస్తూ అత్యధిక మార్కులు వేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు నాలుగు విడతల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను జబ్లింగ్ పద్ధతిలో జరిపేందుకు బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. ప్రయోగశాలలేవీ? జిల్లాలో మొత్తం 299 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 265 కాలేజీలు మాత్రమే పని చేస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 44, ఏపీ మోడల్ స్కూళ్ల కాలేజీలు 35, ఎయిడెడ్ కాలేజీలు10, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు 14, రెసిడెన్షియల్ కాలేజీలు 2, ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలు 3, కో–ఆపరేటివ్ కాలేజీలు 1, ఇన్సెంటివ్ కాలేజీలు 4, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు 113, ఒకేషనల్ కాలేజీలు 14, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కొత్తగా ఇంటర్ విద్య అమలు చేస్తున్న కళాశాలలు 23 ఉన్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర బైపీసీ 13,177, ఎంపీసీ 9,449 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు తమ పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాలు కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇందుకు బోర్డు నిబంధనల ప్రకారం వారానికి రెండు పీరియడ్లు కేటాయించాలి. ఎంపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ.. బైపీసీ విద్యార్థులైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలలో ప్రయోగాలు చేయాలి. ఎంపీసీలో 60కి, బైపీసీలో 120 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. అయితే అధిక శాతం ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రయోగ శాలలు లేవు. కొన్నిచోట్ల మొక్కుబడిగా దర్శనమిస్తుండగా, మరికొన్ని చోట్ల అసలు గదులు కేటాయింపే జరగలేదు. ఫలితంగా అధికశాతం విద్యార్ధులు ప్రాజెక్ట్ రికార్డులు కూ డా తయారు చేయలేని దుస్థితిలో ఉన్నారు. సాధారణంగా సైన్సు విద్యార్థులకు ప్రతి ఏడాది బొటానికల్ టూర్‌కు తీసుకుపోవాలి. క్షేత్ర స్థాయిలో వివిధ మొక్కలను సేకరించి, వాటిని భద్రపరిచి హెర్బిరియంను విద్యార్థులతో తయారు చేయించాలి. అయితే ఏ ఒక్క ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీ విద్యార్థులను బొటానికల్ టూర్‌కు తీసుకపోవడం లేదు. అధ్యాపకులే రెడీమేడ్ హెర్బేరియంను విద్యార్థులతో కొనుగోలు చేయిస్తున్నారు. రికార్డులను సైతం ఇతరులతో రాయించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రాక్టికల్ పరీక్షల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ఇంటర్ బోర్డు జంబ్లింగ్ విధానం అమల్లోకి తెచ్చినా..కొందరు అధికారులతో కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు లోపాయికారీ ఒప్పందాలు చేసుకొని గట్టెక్కుతున్నాయి. చర్యలు తీసుకుంటాం.. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షల కోసం అదనంగా ఫీజులను వసూళ్లు చేసినట్లు మా దృష్టికి రాలేదు. తనిఖీలకు వెళ్లిన సమయంలో ల్యాబ్‌లు పని చేస్తున్నాయని చెబుతున్నారు. మరోసారి కాలేజీలను తనిఖీలు చేస్తాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. – సాలాబాయి, ఇంటరీ్మడియట్ ప్రాంతీయ కార్యాలయ అధికారి -
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సీసీ కెమెరాల నిఘా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు నిర్వహణకు ఇంటర్ బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టింది. తాగునీరు, విద్యుత్ సదుపాయం, టాయిలెట్ వంటి వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకు అవసరమయ్యే నిధులను జిల్లా అధికారుల ద్వారా కాకుండా నేరుగా ప్రిన్సిపాళ్ల ఖాతాలకే చేరేలా చర్యలు చేపట్టింది. ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలన్నింటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. మూల్యాంకన లోపాలు తలెత్తకుండా మూల్యాంకన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ విధానంలో పర్యవేక్షించాలని నిర్ణయించింది. ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువు సోమవారంతో ముగిసింది. దీంతో వచ్చే మార్చిలో మొత్తంగా 9,65,493 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు లెక్కలు వేసింది. వెబ్ క్యాస్టింగ్ విధానంలో పర్యవేక్షణ..: వచ్చే మార్చి 4వ తేదీ నుంచి జరిగే రాత పరీక్షల కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి, వాటి జంబ్లింగ్ ప్రక్రియను చేపట్టింది. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం అయ్యే ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల గుర్తింపును పూర్తి చేసింది. రాత పరీక్షల నిర్వహణ కోసం 1,317 కేంద్రాలను గుర్తించింది. ప్రాక్టికల్ పరీక్షల కోసం (జనరల్) 1,517 కేంద్రాలను, వొకేషనల్ ప్రాక్టికల్స్ కోసం 449 కేంద్రాలను గుర్తించింది. -
సీసీ కెమెరాలతో కనిపెడతాం
-
కెమెరాలతో కనిపెడతాం
- సీసీ కెమెరాల నిఘా నీడన ఇక ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ - ఇష్టారాజ్యం మార్కుల విధానానికి అడ్డుకట్ట వేసే చర్యలు - ఆన్లైన్లో పరీక్ష పత్రం.. అప్పటికప్పుడే మార్కుల నమోదు - పరీక్ష కేంద్రాల జంబ్లింగ్‌కు పట్టుదలతో ఉన్న ప్రభుత్వం - ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు సీసీ కెమెరాల సాయం తీసుకోనుంది. ప్రాక్టికల్ పరీక్షలు జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపడుతోంది. తద్వారా ప్రాక్టికల్స్‌లో ఒక్కో పాఠ్యాంశంలో 30కి 30 మార్కులు వేసే పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతోంది. పారదర్శకత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, మాస్ కాపీయింగ్‌ను నిరోధించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆన్లైన్ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు జరిగే ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణను నిఘా నీడన చేపట్టడంతో పాటు నిర్ణీత సమయంలో ఆన్లైన్లోనే ప్రశ్నాపత్రం డౌన్లోడ్ చేయడం, వాల్యుయేషన్ చేసిన తరువాత నిర్ణీత సమయంలో ఆన్లైన్లోనే మార్కుల నమోదు వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీంతోపాటు ఈసారి ప్రయోగ పరీక్షలకు జంబ్లింగ్ పెట్టాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అయితే దీనిపై ఇంటర్ బోర్డు ఏ నిర్ణయం తీసుకోలేదు. ‘ప్రైవేటు’ కేంద్రాల్లోనూ కెమెరాలు ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం అమల్లో ఉంది. ప్రైవేటు కాలేజీల్లో కూడా మిగతా 3వ పేజీలోu వీటిని తప్పనిసరి చేయనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే ప్రతి పరీక్ష కేంద్రంలో యాజమాన్యం ఇప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందే. వాటికే పరీక్ష కేంద్రాలను కేటాయించేలా బోర్డు చర్యలు చేపట్టింది. వీటితోపాటు కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయం తప్పని సరి. ఇక వారిష్టం కుదరదు... గతంలో యాజమాన్యాలు సూచించిన విద్యార్థులకు వారు కోరుకున్న పేపరు ఇవ్వడం, ముందుగానే ప్రాక్టికల్ పరీక్ష పేపరును లీక్ చేయడం, యాజమాన్యాల నుంచి ఎగ్జామినర్లు ముడుపులు పుచ్చుకొని ప్రతిభావంతులు కాకపోయినా విద్యార్థులకు 30కి 30 మార్కులు వేయడం వంటి అక్రమాలకు పాల్పడేవారు. దీనికి బోర్డు చెక్ పెట్టనుంది. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రికార్డు చేస్తారు. తద్వారా ఎగ్జామినర్ ఇష్టానుసారం వ్యవహరించలేరు. బయటివారు పరీక్ష కేంద్రంలోకి వచ్చే వీలు ఉండదు.గతంలో ముందుగా ఎగ్జామినర్‌కు వచ్చిన ప్రశ్నాపత్రాల సెట్లోని ఏ కోడ్ పేపర్లో ఏ ప్రయోగంపై ప్రశ్న ఇచ్చారన్న విషయాలను విద్యార్థులకు తెలియజేసేవారు. దాంతో విద్యార్థి కోరుకున్న కోడ్ కలిగిన ప్రశ్నాపత్రాన్ని ఆ విద్యార్థికి ఇచ్చే వారు. ఇప్పుడు అలాంటి మార్పులకు ఆస్కారం ఉండదు. ర్యాండమ్‌గా ఇంటర్ బోర్డే విద్యార్థి హాల్‌టికెట్ ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని సదరు విద్యార్థికి కేటాయిస్తుంది. పైగా అది ఎగ్జామినర్‌కు కూడా ముందుగా తెలియదు. పరీక్ష సమయానికి అరగంట ముందుగా ఎగ్జామినర్ బోర్డు వెబ్సైట్లో పరీక్షకేంద్రం ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యాక, అతని మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఉపయోగించిన ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేస్తారు. అందులో ఏ హాల్‌టికెట్ నెంబరు విద్యార్థికి ఏ ప్రశ్నాపత్రం అన్నది ఉంటుంది. వాటి ఆధారంగా ప్రయోగాలు చేయించాలి. ప్రతి రోజు రెండు బ్యాచ్‌లుగా విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రాక్టికల్స్ చేయిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. అవి పూర్తి కాగానే ఎగ్జామినర్ ఆ బ్యాచ్‌లోని 20 మంది విద్యార్థుల రికార్డులను దిద్ది, ప్రాక్టికల్స్ ఫలితాలను, మార్కుల వివరాలను 12 గంటల నుంచి 2 గంటలలోగా అప్లోడ్ చేయాలి. నిర్ణీత వేళలో అప్లోడ్ చేయకుంటే వెబ్సైట్ క్లోస్ అవుతుంది. ఆ విద్యార్థి మార్కులు ఆన్లైన్లో నమోదు కావు. దీంతో అక్రమాలు జరక్కుండా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు జరిగే రెండో బ్యాచ్‌కీ ఇదే పద్ధతి అమలు చేస్తారు. గతంలో ఎగ్జామినర్ అదే పరీక్ష కేంద్రంలో 3 రోజులు విధులు నిర్వహించేవారు కనుక యాజమాన్యాలతో బేరం కుదుర్చుకొని ఇష్టారాజ్యంగా యాజమాన్యం సూచించిన వారికి ఎక్కువ మార్కులు వేసేవారు. చివరలో మూడో రోజు విద్యార్థులు అందరి మార్కులను వేసి వెళ్లేవారు. ఇప్పుడు అలా కుదరదు. ఎప్పటికప్పుడు మార్కులను అప్లోడ్ చేయాలి. తద్వారా బేరసారాలకు అస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఏం జరిగేది.. యాజమాన్యాలు సూచించిన విద్యార్థులకు వారు కోరుకున్న పేపరు ఇవ్వడం, ముందుగానే ప్రాక్టికల్ పరీక్ష పేపరును లీక్ చేయడం, యాజమాన్యాల నుంచి ఎగ్జామినర్లు ముడుపులు పుచ్చుకొని ప్రతిభావంతులు కాకపోయినా విద్యార్థులకు 30కి 30 మార్కులు వేయడం వంటి అక్రమాలకు పాల్పడేవారు. ఇప్పుడు ఏం చేస్తారు.. ప్రాక్టికల్ పరీక్షలు జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి. ర్యాండమ్‌గా ఇంటర్ బోర్డే విద్యార్థి హాల్‌టికెట్ ఆధారంగా ప్రశ్నపత్రాన్ని కేటాయిస్తుంది. పరీక్ష పూర్తి కాగానే ఎగ్జామినర్ విద్యార్థుల రికార్డులను దిద్ది, ప్రాక్టికల్స్ ఫలితాలను, మార్కుల వివరాలను 12 గంటల నుంచి 2 గంటలలోగా అప్లోడ్ చేయాలి. నిర్ణీత వేళలో అప్లోడ్ చేయకుంటే వెబ్సైట్ క్లోస్ అవుతుంది. ఆ విద్యార్థి మార్కులు ఆన్లైన్లో నమోదు కావు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే రెండో బ్యాచ్‌కీ ఇదే పద్ధతి అమలు చేస్తారు. -
రేపటినుంచి 24 వరకూ ఇంటర్ ప్రాక్టికల్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి ఈ నెల 24 వరకూ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. 1319 సెంటర్లలో ప్రాక్టికల్స్ పరీక్షకు 3,08,482 మంది విద్యార్ధులు హాజరకానున్నారు. -
ఈ 'సారీ' జంబ్లింగ్ లేనట్టే!
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఇప్పట్లో జంబ్లింగ్ విధానానికి మోక్షం కలిగేటట్లు కనిపించించడంలేదు. మూడేళ్లగా ప్రాక్టికల్స్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని ప్రభుత్వం, ఇంటర్‌బోర్డు చెబుతూ వస్తున్న పరీక్షల ముందుకొచ్చేసరికి మాట తప్పుతున్నాయి. దీంతో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ప్రతిభ కలిగిన విద్యార్థులకు తీసిపోని విధంగా సాధారణ విద్యార్థులు సైతం మార్కులు అందిపుచ్చుకుంటున్నారు. దీంతో ప్రతిభకు పాతరేసినట్లవుతోంది. కాగా కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల ఆగడాలకు ఇప్పట్లో అడ్డుకట్ట వేసే విధానమేదీ కనిపించడంలేదు స్వయం గా ఓ కార్పొరేట్ కళాశాలల అధినేతే రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తూ, ముఖ్యనేతకు సన్నిహితంగావుంటూ అంతా తానై చక్రం తిప్పుతుండటంతో ఇప్పట్లో జంబ్లింగ్ విధానం అమలయ్యే అవకాశమే లేదని విద్యావేత్తలు, విశ్రాంత ఇంటర్ విద్యాధికారుల అభిప్రాయం. ప్రాక్టికల్స్‌కు 12,179 మంది జిల్లాలో 43 ప్రభుత్వ కళాశాలలు, 11 సాంఘిక, 4 గిరిజన, 14 మోడల్, కోపరేటివ్ 2, ప్రైవేటు 89 కళాశాలను కలుపుకొని మొత్తం 163 జూనియర్ కళాశాలలు ఉన్నాయి.ఈ ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు జిల్లా నుంచి 57,829 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 27,294 మంది జనరల్, 1,621 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరుకానుండగా... ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ప్రైవేటు, ఒకేషనల్, జనరల్ కలిపి 28,915 మంది హాజరుకానున్నారు. కాగా ప్రాక్టికల్ పరీక్షలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులకు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రాక్టికల్ పరీక్షలకు సైన్స్ గ్రూపులకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రాక్టికల్స్‌కు 16,160 మంది విద్యార్థులు హాజరుకానుండగా... ఇందు లో బైపీసీ నుంచి 3,981 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానుండగా, మిగిలిన (12179) వారంతా ఎంపీసీ విద్యార్థులు. జంతర్ మంతర్ అస్త్రాలకు సిద్ధం! ఫిబ్రవరి 12 నుంచి నాలుగు విడతల్లో జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలు ఈ ఏడాది కూడా జంబ్లింగ్ విధానంలో లేకపోవడంతో ఇప్పటికే కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటాయి. చాలావరకు కళాశాలల్లో కనీస సదుపాయాలు లేనప్పటికీ ప్రాక్టికల్స్‌ను తమ కళాశాలల కేంద్రాలుగానే నిర్వహించుకునేందుకు అధికారులతో కుమ్మక్కవుతున్నట్లు విమర్శలు వస్తున్నారు. ప్రాక్టికల్స్ విడతలవారీగా జరుగుతుండటంతో సమీప కేంద్రాల్లో ప్రాక్టికల్స్ ముగిసిన తర్వాత వాటిని తమ కళాశాలకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పర్యవేక్షణాధికారుల వివరాలు తెలుసుకుని వారితో లాబీయింగ్‌లకు షురూ చేస్తున్నారు. డీవోలుగా ఇతర శాఖల ఉద్యోగులు? ప్రాక్టికల్ పరీక్షలకు డిపార్ట్మెంటల్ అధికారులు(డీవో)గా ఇతరశాఖల ఉద్యోగులు, సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి ప్రాక్టికల్ పరీక్షలకు జేఎల్స్, ఎంటీఎస్, సీఎల్స్ అధ్యాపకులనే డీవోలుగా నియమించడం ఆనవాయితీ. అయితే అధికారులు, లెక్చరర్లు లాబీయింగ్‌లకు పాల్పడుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని భావించిన సర్కారు ఇతర శాఖల ఉద్యోగులను తెరపైకి తీసుకొచ్చింది. డీవోలగా ఇతరశాఖ ఉద్యోగులు, సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. చేతనైతే జంబ్లింగ్‌లో నిర్వహించాలి! కార్పొరేట్ లాబీయింగ్‌లకు అలవాటు పడ్డ ప్రభుత్వం చేతనైతే జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అంతే తప్ప లెక్చరర్లను కాదని ఇతర శాఖల సిబ్బందిని డీవోలులగా నియమిస్తే ఊరుకునేది లేదు. - వి.వెంకటేశ్వరరావు, జేఎల్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోభావాలను దెబ్బతీయొద్దు ఇంటర్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి దశాబ్దాల కాలంగా ప్రాక్టికల్స్ పరీక్షలకు డీవోలుగా లెక్చరర్లనే నియమించడం అనయివాతీగా వస్తోంది. అలాకాదని కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యే ఇతరశాఖల సిబ్బందిని నియమించి అధ్యాపకుల మనోభావాలను దెబ్బతీయూలని చూస్తే ప్రతిఘటిస్తాం! - బి.శ్యామ్‌సుందర్, జేఎల్స్ అసోసియేషన్ ప్రతినిధి ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు చేసుకోవాలి ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 12 నుంచి నాలుగు విడతలపాటు జరుగుతాయి. అన్ని కళాశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకోవాలి. పరికరాలు సిద్ధం చేసుకోవాలి. విద్యార్థులకు ఎలాంటి అసౌర్యం కలుగుజేసినా కేంద్రాలను రద్దుచేస్తాం. డీవోలుగా ఎవరిని నియమించలన్నది ప్రభుత్వం, ఇంటర్ బోర్డు నిర్ణయిస్తుంది. - ఎ.అన్నమ్మ, ఇంటర్ బోర్డు జిల్లా ఆర్ఐవో