ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు సీసీ కెమెరాల సాయం తీసుకోనుంది. ప్రాక్టికల్ పరీక్షలు జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపడుతోంది. తద్వారా ప్రాక్టికల్స్‌లో ఒక్కో పాఠ్యాంశంలో 30కి 30 మార్కులు వేసే పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతోంది. పారదర్శకత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, మాస్ కాపీయింగ్‌ను నిరోధించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆన్‌లైన్ చర్యలకు శ్రీకారం చుట్టింది.