
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఓదెల-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్ సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. అశోక్ తేజ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ థ్రిల్లర్ మూవీ ఈనెల 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 8న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా ముంబయిలోనే ఉంటోంది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు, సిరీస్‌లు చేసిన తమన్నా.. ప్రముఖ నటి రవీనా టాండన్ కూతురు రషా తడానీతో సన్నిహితంగా ఉంటోంది. అంతే కాదు..వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. తరచుగా బీటౌన్‌లో పార్టీలకు హాజరవుతూ సందడి చేస్తుంటారు. అలా వీరిద్దరి స్నేహం బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే దాదాపు 15 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న రషాతో మీకు స్నేహమేంటని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
(ఇది చదవండి: ఆ న్యూస్ చూసి ఏడ్చేశాను: హీరోయిన్ తమన్నా)
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన తమన్నా ఈ విషయంపై స్పందించింది. ఈ మధ్య కాలంలోనే నేను రషా తడానీని కలిసినట్లు తమన్నా చెప్పుకొచ్చింది. ఇద్దరు కలిసి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశామని.. డ్యాన్స్ కూడా చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత నుంచి మేమిద్దరం చాలా సన్నిహితంగా మెలిగినట్లు మిల్కీ బ్యూటీ పేర్కొంది. మా ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది.. వయసుతో మాకు ఎలాంటి ఇబ్బందిలేదని వెల్లడించింది. ఎందుకంటే మా రిలేషన్‌లో ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమీ లేవు.. కేవలం నచ్చిన వారితో కొద్ది సమయం ఎంజాయ్ చేస్తామని అంటోంది తమన్నా. కాగా.. ఇటీవల తమన్నా భాటియా బాలీవుడ్ చిత్రనిర్మాత ప్రగ్యా కపూర్‌తో స్నేహంగా ఉంటున్నారు. ఈ ముగ్గురూ కలిసి ఇటీవల హోలీ పార్టీలో సందడి చేశారు.