Tollywood Actress
-
గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. భర్తతో కలిసి సాయం!
టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. చాలా ఏళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే అంతకుముందే తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి అభిమానులకు షాకిచ్చింది ముద్దుగుమ్మ.ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తోన్న ముద్దుగుమ్మ.. గతేడాది చివరిసారిగా ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా అనే మూవీలో కనిపించింది. ఈ చిత్రాన్ని గతంలో విడుదలైన హసీన్ దిల్‌రుబాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. అంతకుముందు షారూఖ్ ఖాన్ నటించిన డుంకీ చిత్రంలోనూ కనిపించింది. ప్రస్తుతం గాంధారీ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కనికా థిల్లాన్ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు.అయితే తాజాగా హీరోయిన్ తాప్సీ తన మంచి మనసును చాటుకుంది. సినిమాలే కాదు సమాజ సేవలోనూ ముందుంటానని చెబుతోంది. వేసవికాలం కావడంతో ఎంతోమంది పేదలకు అండగా నిలిచింది. ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థతో కలిసి రేకుల షెడ్డుల్లో నివాసముంటున్న పేదలకు టేబుల్ ఫ్యాన్స్, కూలర్లను అందజేసింది. తన భర్త మథియోస్ బోతో కలిసి వారి ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందించింది. దీంతో తాప్సీ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది చూసిన అభిమానులు తాప్సీ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే తన బయోలో లింక్ కూడా ఉందని ఇన్‌స్టాలో షేర్ చేసింది హీరోయిన్ తాప్సీ. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Hemkunt Foundation (@hemkunt_foundation) -
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
మెనోపాజ్ గురించి ఎంత మాట్లాడితే అంత అర్థమవుతుంది.. అర్థమైతేనే దాని మేనేజ్మెంట్ తెలుస్తుంది! అందుకే మెనోపాజ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకోవడానికి ముందుకొచ్చారు టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి.. ప్లాట్‌ఫామ్ దొరికినప్పుడల్లా మెనోపాజ్ గురించి మాట్లాడుతూంటే అది చర్చగా మారుతుంది. అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల పట్ల కేర్ పెరుగుతుంది అంటున్నారు...నిజంగా చెప్పాలంటే ఇది నేను ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్న ఫేజ్. మానసికంగా ఇదెంత ప్రభావం చూపుతోందంటే.. కోపం.. బాధ.. దుఃఖం.. ఆవేశం.. ఇలా ఎమోషన్స్ ఏవీ మన కంట్రోల్లో ఉండవు. దేనికి ఎలా రెస్పాండ్ అవుతున్నామో తెలియదు. ఒకరకమైన అలజడి. వణుకు తెప్పిస్తుంది. భయపెడుతుంది. మనల్ని మనమే గుర్తుపట్టలేని పరిస్థితిని కల్పిస్తుంది.గట్టి దెబ్బే కొడుతుంది.. దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఈ మూడ్ స్వింగ్స్ వల్ల మనమేం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ సమయంలో మన పనులు డ్యామేజింగ్‌గా కూడా ఉండొచ్చు. అది ఎదుటి వ్యక్తులను హర్ట్ చేయొచ్చు. మన ఈ ప్రవర్తన ఇంట్లో వాళ్లకూ అర్థమవడం కష్టం. ఫ్రెండ్స్‌కి చెప్పుకుందామనుకుంటే.. ఎక్కడి నుంచి .. ఎలా మొదలుపెట్టాలో తెలియదు. అసలు ఇది షేర్ చేసుకునే విషయమేనా అనే సంశయం. ఇలా అన్నిరకాలుగా ఇది మనల్ని ఒంటరిని చేస్తుంది. మానసికంగా గట్టి దెబ్బే కొడుతుంది.ముందు మనల్ని మనం.. ఈ ఫేజ్‌ను డీల్ చేస్తూ నేను తెలుసుకున్నదేంటంటే.. డైట్, మెడిసిన్ అంతగా హెల్ప్ చేయవని. ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే ఈ మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్నిస్తుందని. అందుకే ఎక్సర్సైజ్, యోగాను లైఫ్ స్టయిల్ లో భాగం చేసుకోవాలి. ట్రావెల్ లేదా మనకు నచ్చిన పనితో మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి. నేను నేర్చుకున్నది ఇదే! దీన్ని ఫాలో అవుతూ నా ప్రొఫెషనల్ లైఫ్ ప్రభావితం కాకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే అదే ఇన్కమ్ సోర్స్ కాబట్టి. అంతేకాదు మన వ్యక్తిగత సమస్యలు వర్క్ ప్లేస్‌లో చర్చకు తావు ఇవ్వకూడదు! ఇంకో విషయం ఏంటంటే.. మన మూడ్‌స్వింగ్స్ నేరుగా ప్రభావం చూపించేది కుటుంబం మీదనే. ఎంత ఇబ్బంది అయినా వర్క్ ప్లేస్‌లో ఒక ఎరుకతో ఉంటాం.. ఉండాలి కూడా! అందుకే ముందు మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్లతో మన పరిస్థితిని వివరించి.. వాళ్ల సపోర్ట్ కూడా తీసుకోవాలి. దీనివల్ల వర్క్ ప్లేస్‌లో డీల్ చేయడమూ తేలికవుతుంది. సందర్భం దొరికినప్పుడు.. ఈ ఫేజ్‌లోని ఆడవాళ్లకు కచ్చితంగా సపోర్ట్ కావాలి. ఆల్రెడీ ఆ ఫేజ్‌ను అధిగమించిన వాళ్లు తమ అనుభవాలను, డీల్ చేసిన తీరును షేర్ చేసుకోవడం వల్ల ఆ ఫేజ్‌లోకి ఎంటర్ అయిన మహిళలు ధైర్యం తెచ్చుకుంటారు. ఈజీగా మేనేజ్ చేయగలమనే భరోసా వస్తుంది. దీనివల్ల సిస్టర్హుడ్ డెవలప్ అవుతుంది. అంతేకాదు ఇలాంటి సందర్భం, ప్లాట్‌ఫామ్ దొరికినప్పుడల్లా సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన మహిళలు దీనిగురించి మాట్లాడటమో.. తమ అనుభవాన్ని పంచుకోవడమో చేస్తే.. మెనోపాజ్ మీద అందరికీ అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల సమస్యలు, బాధలు అర్థమవుతాయి. ఇంటా, బయటా కూడా సపోర్ట్ అందే ఆస్కారం పెరుగుతుంది. నార్మలైజ్ చేయాలి‘మెనోపాజ్‌ను అనకూడని, వినకూడని మాటలా భావిస్తారు మన సమాజంలో! దీని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే.. ఎంతగా చర్చిస్తే అంతగా అవగాహన పెరుగుతుంది.. అంత ఎక్కువగా మహిళలకు మద్దతు అందుతుంది. సమాజం మీద సెలబ్రిటీల ప్రభావం ఎక్కువ కాబట్టి ఈ బాధ్యతలోనూ వాళ్లు ముందుండాలి. మెనోపాజ్ గురించి మాట్లాడుతూ దాన్ని నార్మలైజ్ చేయాలి!’– లారా దత్తా, బాలీవుడ్ నటి.– శిరీష చల్లపల్లి -
నా రెండో పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకు?.. రేణు దేశాయ్ ఆగ్రహం
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తన రెండో పెళ్లిపై మీకు ఎంత ఆసక్తి అని ప్రశ్నించారు. ఇలాంటి వార్తలతో సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? అని రేణు దేశాయ్ నిలదీశారు. సోషల్ మీడియాలో తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలపై ఆమె మండిపడ్డారు.కాగా.. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ మాట్లాడారు. దీంతో పాటు పలు అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రాజకీయాల్లోకి రావడంపై కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే సమాజంలో జరుగుతున్న పలు విషయాలపై కూజా మాట్లాడారు. ఇవన్నీ వదిలేసి కేవలం తన రెండో పెళ్లినే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ రేణు దేశాయ్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు.రేణు దేశాయ్ సోషల్ మీడియాలో రాస్తూ..' మీడియా వాళ్లు నా రెండో పెళ్లి గురించి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నారని నాకు అర్థమైంది. నేను గంటకు పైగా మాట్లాడిన పాడ్‌కాస్ట్‌లో మన సమాజానికి ఉపయోగమైన చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడా. కానీ వాటిని గురించి చర్చ చేయరు. సమస్యల కంటే నా రెండో పెళ్లికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నేను మీ అందరినీ కోరుకునేది ఒక్కటే.. దయ చేసి ఈ 44 ఏళ్ల మహిళ వివాహం గురించి మీ దృష్టిని మరల్చండి'అని పోస్ట్ చేశారు. -
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఓదెల-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్ సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. అశోక్ తేజ డైరెక్షన్లో వస్తోన్న ఈ థ్రిల్లర్ మూవీ ఈనెల 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 8న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా ముంబయిలోనే ఉంటోంది. బాలీవుడ్లో కొన్ని సినిమాలు, సిరీస్‌లు చేసిన తమన్నా.. ప్రముఖ నటి రవీనా టాండన్ కూతురు రషా తడానీతో సన్నిహితంగా ఉంటోంది. అంతే కాదు..వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. తరచుగా బీటౌన్‌లో పార్టీలకు హాజరవుతూ సందడి చేస్తుంటారు. అలా వీరిద్దరి స్నేహం బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే దాదాపు 15 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న రషాతో మీకు స్నేహమేంటని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.(ఇది చదవండి: ఆ న్యూస్ చూసి ఏడ్చేశాను: హీరోయిన్ తమన్నా)తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన తమన్నా ఈ విషయంపై స్పందించింది. ఈ మధ్య కాలంలోనే నేను రషా తడానీని కలిసినట్లు తమన్నా చెప్పుకొచ్చింది. ఇద్దరు కలిసి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశామని.. డ్యాన్స్ కూడా చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత నుంచి మేమిద్దరం చాలా సన్నిహితంగా మెలిగినట్లు మిల్కీ బ్యూటీ పేర్కొంది. మా ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది.. వయసుతో మాకు ఎలాంటి ఇబ్బందిలేదని వెల్లడించింది. ఎందుకంటే మా రిలేషన్లో ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమీ లేవు.. కేవలం నచ్చిన వారితో కొద్ది సమయం ఎంజాయ్ చేస్తామని అంటోంది తమన్నా. కాగా.. ఇటీవల తమన్నా భాటియా బాలీవుడ్ చిత్రనిర్మాత ప్రగ్యా కపూర్‌తో స్నేహంగా ఉంటున్నారు. ఈ ముగ్గురూ కలిసి ఇటీవల హోలీ పార్టీలో సందడి చేశారు. View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) -
తెలుగమ్మాయి క్రేజ్.. బాలీవుడ్లో అడుగుపెడుతున్న అనన్య నాగళ్ల!
తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలని తక్కువ చేసి చూస్తారు. ముఖ్యంగా తెలుగమ్మాయిలకు హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరనే భావన చాలా మందిలో ఉంది. కానీ హార్డ్ వర్క్, డెడికేషన్ ఉంటే కచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని కొంతమంది తెలుగమ్మాయిలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్లలో అనన్య నాగళ్ల ముందు వరుసలో ఉంటారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినా అనన్య.. కెరీర్ ప్రారంభంలో 'షాదీ' వంటి షార్ట్ ఫిల్మ్ లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తర్వాత 'మల్లేశం' మూవీతో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. ఆ సినిమాలో చక్కని కట్టు బొట్టుతో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. వెంటనే 'ప్లే బ్యాక్' అనే సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. అనంతరం 'తంత్ర' 'పొట్టేల్' 'బహిష్కరణ'(వెబ్ సిరీస్) ' శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనన్య స్మాల్ స్కేల్ వుమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. అనన్యతో రూ.5 కోట్ల బడ్జెట్లో లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అవి ఈజీగా మార్కెట్ అవుతున్నాయి. 'తంత్ర' 'పొట్టేల్' 'బహిష్కరణ' 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటివి ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ముఖ్యంగా 'తంత్ర' హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్‌లో టాప్ -2 లో ట్రెండ్ అవుతుండగా.. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశ వ్యాప్తంగా ఇప్పటికీ టాప్- 5లో ట్రెండింగ్‌లో ఉంది. ఇకపై దర్శకనిర్మాతలు రూ.5 కోట్ల బడ్జెట్లో తీసే లేడి ఓరియంటెడ్ సినిమాలకు అనన్య నాగళ్ల బెస్ట్ ఆప్షన్ భావిస్తున్నారు. తెలుగమ్మాయి అనన్య ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. ఆమె మెయిన్ రోల్లో ఒక హిందీ ప్రాజెక్టు కూడా రూపొందుతుంది. -
ఖరీదైన బైక్ కొన్న టాలీవుడ్ బుల్లితెర జంట.. ధర ఎన్ని లక్షలంటే?
బుల్లితెరపై తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటి విష్ణు ప్రియ. తెలుగులో త్రినయని, జానకి కలగనలేదు వంటి సీరియల్స్‌తో ఫేమస్ అయింది. అంతేకాకుండా తమిళంలోనూ పలు సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత విష్ణుప్రియ తన సీరియల్ కో-స్టార్ సిద్ధార్థ్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అభిషేకం, కుంకుమ పువ్వు, ఇద్దరు అమ్మాయిలు వంటి సీరియల్స్‌తో తెలుగులో ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 11/ఏ ఏటిగట్టు అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది.అయితే తాజాగా ఈ బుల్లితెర బ్యూటీ ఖరీదైన బైక్‌ను కొనుగోలు చేసింది. ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన బీఎండబ్లూ బైక్‌ను కొనేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన ఫ్యామిలీతో కలిసి ద్విచక్రవాహనంపై దిగిన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ బైక్ ధరలు దాదాపు లక్షల్లోనే ఉంటాయి. బీఎండబ్ల్యూ బ్రాండ్‌లో వీటి ప్రారంభ ధరలే దాదాపు రూ.3 లక్షల నుంచి మొదలవుతాయి. విష్ణు ప్రియ కొనుగోలు చేసిన ఈ ఖరీదైన బైక్ ధర దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) -
హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక.. ఎందుకంటే?
హీరోయిన్ హన్సిక మోత్వానీ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టి వేయాలంటూ బాంబే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆమె సోదరుడి భార్య, నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్‌కు నోటీసులు జారీ చేసింది. మార్చి 24న హన్సిక పిటిషన్ వేయగా.. ఇవాళ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. కాగా.. ఇప్పటికే ఈ కేసులో హన్సిక మోత్వానీకి ముంబై సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.కాగా.. గతంలో హన్సికతో పాటు ఆమె తల్లిపై సోదరుడి భార్య ముస్కాన్ నాన్సీ జేమ్స్ గృహ హింస కేసు పెట్టారు. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ.. బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత విభేదాలు రావడంతో 2022లోనే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే తనను వేధింపులకు గురి చేశారంటూ హన్సికతో పాటు సోదరుడు ప్రశాంత్, ఆమె తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే తమపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ హన్సిక బాంబే హైకోర్ట్‌ను ఆశ్రయించింది. -
స్పెషల్ సాంగ్స్‌కి సై
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనేది సామెత. చిత్ర పరిశ్రమలో ఈ సామెత బాగా వర్తిస్తుంది. ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో.. క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి, అటు ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఇటు బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెంచుకోవాలి. ఇందుకు కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా ట్రెండ్‌కి తగ్గట్టుగా కెరీర్‌ని మలచుకుంటూ స్పెషల్ సాంగ్స్‌కి కూడా సై అంటున్నారు పలువురు కథానాయికలు.పైగా ప్రత్యేక పాటల్లో నటించే వారికి పారితోషికం కూడా భారీగా ఇస్తుండటంతో స్పెషల్ సాంగ్స్‌లో నర్తించేందుకు హీరోయిన్లు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే, శ్రియ, నేహా శెట్టి, కేతికా శర్మ, రెబా మోనికా జాన్, చంద్రికా రవి వంటి హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.రెట్రోకి హైలైట్ ‘ఇష్టం’ (2001) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రియా శరణ్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించి, స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు శ్రియ. ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్పెషల్ సాంగ్స్‌పై దృష్టి పెట్టారు శ్రియ. ప్రత్యేక పాటల్లో నర్తించడం ఆమెకు కొత్త కాదు. రామ్‌ని హీరోగా, ఇలియానాని హీరోయిన్గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ‘దేవదాసు’ (2006) సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో చిందేశారు శ్రియ.ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007), వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ‘తులసి’ (2007), పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘పులి’, సందీప్ కిషన్, సాయిదుర్గా తేజ్ నటించిన ‘నక్షత్రం’ (2017) వంటి తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ, హిందీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన శ్రియ తాజాగా ‘రెట్రో’ సినిమాలో ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొదుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటించారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో సూర్యతో కాలు కదిపారు శ్రియ. గోవాలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో సూర్య, శ్రియలపై ఈ పాట చిత్రీకరించారు మేకర్స్. సూర్య, జ్యోతిక, కార్తికేయ సంతానం నిర్మించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ముచ్చటగా మూడోసారినాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పూజా హెగ్డే. ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోలకి జోడీగా నటించి, తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నర్తించారు.రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ (2018) సినిమాలోని ‘జిల్ జిల్ జిగేల్ రాణి...’ పూజా చేసిన తొలి స్పెషల్ సాంగ్. ఈ పాటలో రామ్‌చరణ్, పూజా హెగ్డే మాస్ డ్యాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘ఎఫ్ 3’ (2022) సినిమాలో ‘అధ్యక్షా... లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా...’ అనే సాంగ్‌లో రెండోసారి చిందేసిన పూజ ముచ్చటగా మూడోసారి ‘కూలీ’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు.రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొదిన చిత్రం ‘కూలీ’. అనిరు«ధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీలోని ప్రత్యేక పాట చాలా వెరీ వెరీ స్పెషల్‌గా ఉంటుందట. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సన్న్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘కూలీ’ నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించలేదు.అది దా సర్ప్రైజ్అది దా సర్ప్రైజ్ అంటున్నారు కేతికా శర్మ. ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు కేతిక. 2021 అక్టోబరు 21న విడుదలైన ఈ మూవీలో ఈ అమ్మడు అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘లక్ష్య, రంగరంగ వైభవంగా, బ్రో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కేతికా శర్మ తొలిసారి ‘రాబిన్‌హుడ్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొదిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్’.శ్రీలీల హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో ‘అది దా సర్ప్రైజ్...’ అంటూ సాగే ప్రత్యేక పాటలో కేతికా శర్మ సందడి చేశారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించిన ఈ పాటని ఇటీవలే విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి పాడగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.నా ముద్దుపేరు స్వాతి రెడ్డి శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవర గమన’ (2023) సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు రెబా మోనికా జాన్. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ బ్యూటీ క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ‘మృత్యుంజయ్’ మూవీలో శ్రీవిష్ణుతో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. ఓ వైపు హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ మరోవైపు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’.కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంకా జవాల్కర్, మురళీధర్ గౌడ్, డైరెక్టర్ కేవీ అనుదీప్ కీలక పాత్రలు పోషించారు. ‘మ్యాడ్’కి (2023) సీక్వెల్‌గా రూపొదిన ‘మ్యాడ్ స్క్వేర్’లో రెబా మోనికా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.‘నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి... నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి...’ అంటూ సాగే ఈ పాటలో హుషారైన స్టెప్పులు వేశారు రెబా. సురేష్ గంగుల సాహిత్యం అందించిన ఈ పాటని స్వాతి రెడ్డి, భీమ్స్ ఆలపించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది.మొదటి సారి...ఆకాశ్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘మెహబూబా’ (2018) సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగుకి పరిచయం అయ్యారు కన్నడ బ్యూటీ నేహా శెట్టి. ఆ సినిమా తర్వాత ‘గల్లీ రౌడీ, డీజే టిల్లు, బెదురులంక 2012, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి సినిమాల్లో నటించి, మెప్పించారామె. సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాలో రాధిక పాత్రతో కుర్రకారు మనసులు దోచేశారీ బ్యూటీ. ఈ మూవీలో ఆమె నటన, గ్లామర్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇదిలా ఉంటే నేహా శెట్టి తొలిసారి ఓ ప్రత్యేక పాటలో చిందేశారు. పవన్ కల్యాణ్ హీరోగా ‘సాహో’ మూవీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్, శ్రియా రెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో పవన్ కల్యాణ్‌తో కలిసి చిందేశారట నేహా శెట్టి. థాయ్‌ల్యాండ్‌లో ఈ పాటని చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్.టచ్‌లో ఉండు ఓ రబ్బీ...తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా నటించిన చంద్రికా రవి ఓ స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. 2019లో విడుదలైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాలో ఓ ప్రత్యేక పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారీ బ్యూటీ. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ (2023) మూవీలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే...’ అనే స్పెషల్ సాంగ్‌లో తనదైన గ్లామర్, డ్యాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేశారు చంద్రిక.తాజాగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేశారామె. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దర్శక ద్వయం నితిన్, భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పిల్లి కథానాయికగా నటించారు. యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొదిన ఈ మూవీలో ‘టచ్‌లో ఉండు ఓ రబ్బీ... ఓ రబ్బీ...’ అంటూ చిందేశారు చంద్రిక.ఈ పాటకి చంద్రబోస్ మాస్ లిరిక్స్ అందించగా, లక్ష్మీ దాస, పి. రఘు పాడారు. రధన్ తనదైన హుషారైన సంగీతం అందించారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై రూపొదిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఏప్రిల్ 11న విడుదల కానుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో చిరంజీవితో కలిసి ఊర్వశీ రౌతేలా చిందేయనున్నారని టాక్. ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలో ‘వేర్ ఈజ్ ద పార్టీ...’ అనే ప్రత్యేక పాటలో చిరంజీవి– ఊర్వశీ రౌతేలా తమదైన స్టెప్పులతో అలరించిన సంగతి తెలిసిందే.ఈ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ‘విశ్వంభర’లోనూ చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్‌లో ఊర్వశి మెరవనున్నారట. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ మూవీ ఈ వేసవిలో విడుదల కానుందని టాక్. ఇదిలా ఉంటే... బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్’. ఈ మూవీలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర కీలక పాత్రధారులు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో హీరోయిన్ నిధీ అగర్వాల్ మెరవనున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. కాగా ‘విశ్వంభర’లో ఊర్వశీ రౌతేలా, ‘జాట్’లో నిధీ అగర్వాల్ స్పెషల్ సాంగ్స్ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.వీరే కాదు.. మరి కొందరు హీరోయిన్లు కూడా ప్రత్యేక పాటల్లో సందడి చేయనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
బెట్టింగ్ యాప్ కేసు.. భారీగా డబ్బులు వచ్చాయన్న విష్ణుప్రియ
బెట్టింగ్ యాప్స్ కేసు టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో బిగ్‌బాస్ బ్యూటీ, యాంకర్ విష్ణుప్రియ ఇవాళ పోలీసుల విచారణకు హాజరైంది. తన లాయర్‌తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఈ విచారణలో విష్ణు ప్రియ పలు కీలక విషయాలను వెల్లడించింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు పోలీసుల ఎందుట అంగీకరించింది.అయితే తాను దాదాపు 15 రకాల బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు పోలీసులకు వివరించింది. అలా ఒక్కో యాప్‌నకు దాదాపు రూ.90 వేలు ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఈ విచారణలో విష్ణుప్రియ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు.. ఆమె మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఈ కేసులో ఆమెను సుమారుగా రెండు గంటలకు పైగా విచారించినట్లు తెలుస్తోంది.కాగా.. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు యూట్యూబర్లతో పాటు సినీతారలపై కూడా కేసులు నమోదయ్యాయి. విష్ణు ప్రియతో పాటు సుప్రీత, టేస్టీ తేజ మరో 11 మంది బుల్లితెర నటులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నేను చాలా సేఫ్‌గా ఉన్నా.. దయచేసి అవన్నీ నమ్మొద్దు: సుప్రీత విజ్ఞప్తి
త్వరలోనే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న సుప్రీత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బిగ్‌బాస్ -7 రన్నరప్ అమర్దీప్ చౌదరితో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. సుప్రీత హోలీ పండుగ రోజును అభిమానులను ఉద్దేశించి ఓ వీడియోను రిలీజ్ చేసింది. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్‌ను తాను కూడా ప్రమోట్ చేశానని వెల్లడించింది. దయచేసి ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. మీరు కూడా అందరూ ఇలాంటి వారికి దూరంగా ఉండాలని ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.అయితే గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్, యూట్యూబర్లపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ తారలపై కేసు కూడా నమోదు చేశారు. వీరిలో సుప్రీత, టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూచౌదరి లాంటి వారి పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన సురేఖవాణి కూతురు సుప్రీత.. ఎందుకంటే?)అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై సురేఖ వాణి కూతురు సుప్రీత స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా మరో వీడియోను విడుదల చేసింది. దయచేసి సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దు.. అవన్నీ ఫేక్ స్పష్టం చేసింది. ప్రస్తుతం నేను మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నానని సుప్రీత వెల్లడించింది.సుప్రీత మాట్లాడుతూ..'హాయ్.. అందరికీ నమస్కారం.. నేను మీ సుప్రీత. సోషల్ మీడియాతో పాటు టీవీ ఛానెల్స్‌లో నాపై వస్తున్న ప్రచారాలన్నీ అబద్ధాలు. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను. మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.' అంటూ వీడియోను రిలీజ్ చేసింది. -
చైతూ టాటూ తొలగించిన సమంత.. నెటిజన్ల రియాక్షన్ చూశారా?
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన సమంత ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో చేయడం లేదు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో మాత్రమే కనిపించింది. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్ వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సామ్ రిలేషన్లో ఉన్నట్లు చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరు కలిసి తరచుగా ఈవెంట్లకు హాజరు కావడంతో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి.ఇవన్నీ పక్కనపెడితే తాజాగా సోషల్ మీడియాలో సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను నిర్మిస్తోన్న కొత్త మూవీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అందులో తన టీమ్‌తో ఉన్న ఫోటోలకు వరుసగా క్యాప్షన్ ఇస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే సామ్ షేర్ చేసిన తొలి ఫోటోపైనే అందరి కళ్లు పడ్డాయి. ఎందుకంటే ఆ ఫోటోలో సామ్ చేతికి టాటూ కనిపించడమే కారణం. టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రేమలో ఉన్నప్పుడు ఆ టాటూ వేయించుకుంది. ప్రస్తుతం ఆ టాటూను తొలగించుకున్నప్పటికీ.. కొద్ది కొద్దిగా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి నాగచైతన్యకు గుర్తుగా వేయించుకున్న టాటూను తొలగించుకున్నారంటూ కొందరు కామెంట్స్ చేశారు. సమంత ఎట్టకేలకు చైతూ టాటూను తొలగించినట్లు కనిపిస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇప్పటి నుంచి మీ స్వంత రియాలిటీని సృష్టించండి అంటూ రాసుకొచ్చారు. టాటూను తొలగించుకున్నందుకు మంచిది.. ఇకపై మీ భాగస్వామి పేరును ఎప్పుడూ టాటూలుగా వేయించుకోకండి అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ ఫోటోలతో పాటు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న పిక్‌ను కూడా సమంత పోస్ట్ చేసింది.కాగా.. చైతూ సినిమాలో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సమంత.. చాలా కాలం పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే వీరిద్దరూ విడిపోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆ ఆ తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
అనగనగా ఒక కథ
తెలుగు సినిమాల కలెక్షన్స్ స్పీడ్‌గా ముందుకెళుతున్నాయి. కానీ తెలుగు సినిమా కథలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి. అరవై – డెబ్బై ఏళ్ల క్రితం నాటి కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు తెలుగు హీరోలు పాత కాలం కథలను ఓకే చేస్తున్నారు. ఇలా ‘కట్ చేస్తే... అనగనగా ఒక కథ’ అంటూ కొందరు స్టార్ హీరోలు చేస్తున్న పీరియాడికల్ ఫిల్మ్స్ గురించి తెలుసుకుందాం...అడవిలో అడ్వెంచర్మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా సాగే పీరియాడికల్ ఫిల్మ్ అని సమాచారం. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రకథను, రచయిత విజయేంద్రప్రసాద్ రెడీ చేశారనే ప్రచారం సాగుతోంది.ఇక ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది. మహేశ్‌బాబు, ప్రియాంకాచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027ప్రారంభంలో రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.సైనికుడి స్టోరీప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా 1940 నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడిగా కనిపిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ఖేర్ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. మరోవైపు ప్రభాస్ చేస్తున్న హారర్ అండ్ కామెడీ ఫిల్మ్ ‘రాజా సాబ్’. మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ కూడా పీరియాడికల్ చిత్రమే. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ ఈ మూవీలో హీరోయిన్స్‌గా చేస్తున్నారు.టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. ‘రాజా సాబ్’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని గతంలో యూనిట్ ప్రకటించింది. కానీ ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కావడం లేదని, త్వరలోనే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారని తెలిసింది.డ్రాగన్ వార్హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌పై 1969 అని కనిపిస్తోంది. సో... ఈ ‘డ్రాగన్’ పీరియాడికల్ యాక్షన్ మూవీ అని ఆల్మోస్ట్ ఖరారైపోయినట్లే. కథ ప్రధానంగా కోల్కత్తా నేపథ్యంలో సాగుతుందని తెలిసింది.ఓ పెద్ద డ్రగ్స్ మాఫియా ఈ సినిమాలోని మరో ముఖ్య అంశమని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2026 జనవరి 9న ‘డ్రాగన్’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆటగాడు‘క్రికెట్, కుస్తీ, కబడ్డీ’... ఈ మూడు స్పోర్ట్స్ ఆడుతున్నారట రామ్‌చరణ్. మరి... మల్టీస్పోర్ట్స్ పర్సన్‌గా రామ్‌చరణ్ ఎందుకు మారారు? అనేది ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో చూడాలి. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 1970–1980 నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగుతుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో క్రికెట్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కానీ ఈ చిత్రకథలో... కుస్తీ, కబడ్డీ.. ఖోఖో ఆటల ప్రస్తావన కూడా ఉంటుందట. అయితే మెయిన్ స్పోర్ట్‌గా కబడ్డీ ఉంటుందట. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘పెద్ది’ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఆ రోజున ఈ సినిమా టీజర్ రిలీజ్ అవుతుందని, ఆ సమయంలోనే ఈ మూవీ రిలీజ్‌పై కూడా ఓ స్పష్టత వస్తుందని సమాచారం.విలేజ్‌లో యాక్షన్విలేజ్లో యాక్షన్‌కు సై అన్నారు శర్వానంద్. సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ రూరల్ పీరియాడికల్ ఫిల్మ్ తెరకెక్కనుంది. కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ 1960 నేపథ్యంలో సాగుతుంది. ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దుప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఓ పెద్ద సెట్‌ను క్రియేట్ చేశారు.అలాగే శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర డైరెక్షన్లో ఓ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా మూడు తరాల నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలోని మేజర్ సీన్స్ 1990లో ఉంటాయని తెలిసింది. విక్రమ్ సమర్పణలో వంశీ – ప్రమోద్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో శర్వానంద్ ఓ బైక్ రేసర్‌గా నటిస్తున్నారు.కింగ్డమ్హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ ‘కింగ్డమ్’. ఈ పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తారని తెలిసింది. అలాగే విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట.ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఈ మూవీని మే 30న రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాటు రవికిరణ్ కోలా డైరెక్షన్లో ‘రౌడీ జనార్ధన’ అనే మూవీ చేయనున్నారు విజయ్ దేవరకొండ. ఈ రూరల్ యాక్షన్ డ్రామా కూడా పీరియాడికల్ చిత్రమే అని తెలిసింది. ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది.మాస్ సంబరాలుసాయిదుర్గా తేజ్ కెరీర్లోనే అత్యధిక భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘సంబరాల యేటిగట్టు’. రూ. 125 కోట్ల బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల, సంజయ్ దత్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘సంబరాల యేటిగట్టు’ మూవీ సెప్టెంబరు 25న విడుదల కానుంది.చాంపియన్బ్రిటిష్ పరిపాలన కాలంలో ఓ యువ ఫుట్‌బాల్ ఆటగాడి జీవితం ఏ విధంగా సాగిందనే కథాంశంతో రూపొందుతున్న సినిమా ‘ఛాంపియన్’. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చేస్తున్న ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి చెందిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ ఇటీవల తెలిపారు. ఇలా పీరియాడికల్ ఫిల్మ్స్ చేస్తున్న మరికొంతమంది హీరోలు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
భర్తతో సాక్షి అగర్వాల్ హోలీ సెలబ్రేషన్స్.. అనన్య నాగళ్ల బోల్డ్ లుక్స్!
మూవీ సెట్లో ప్రియాంక చోప్రా హోలీ సెలబ్రేషన్స్..రవీనా టాండన్ కూతురు రషా తడానీ హోలీ లుక్స్..కుటుంబంతో కలిసి హోలీ వేడుకల్లో రాశీ ఖన్నా..భర్తతో కలిసి తొలిసారి హోలీ జరుపుకున్న సాక్షి అగర్వాల్..శారీలో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల బోల్డ్ లుక్స్... View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
హీరోల చేతిలో ముచ్చటగా మూడు
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు... మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు. చిరంజీవి, ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, నాని, నితిన్, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్ వంటి హీరోల చేతిలో ముచ్చటగా మూడు ప్రాజెక్టులున్నాయి. మరికొందరు నాలుగు సినిమాలు చేస్తున్నారు... ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.. చిరంజీవి... భలే జోరు తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి భలే జోరుమీదున్నారు. ఈ సీనియర్ హీరో వరుసగా ప్రతిభావంతులైన యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి వంటి స్టార్‌తో అందివచ్చిన అవకాశాన్ని నిరూపించుకుని, ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో దర్శకులు సైతం ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న వశిష్ఠ మల్లిడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధం అవుతోంది.చిరంజీవి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత ‘విశ్వంభర’తో రిపీట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ‘విశ్వంభర’ తర్వాత కూడా చిరంజీవి యంగ్ డైరెక్టర్స్‌తో పని చేయనున్నారు. కెరీర్ ఆరంభం నుంచి వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నట్లు చిరంజీవి ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే తొలి చిత్రం ‘దసరా’తో (నాని హీరో) సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు చిరంజీవి పచ్చజెండా ఊపారు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ మూవీ రూపొందిస్తున్నారు. మరి చిరంజీవి ముందుగా అనిల్ మూవీని సెట్స్‌కి తీసుకెళతారా? శ్రీకాంత్ ఓదెల మూవీ చేస్తారా? అనేది వేచి చూడాలి. ఇక ‘వాల్తేరు వీరయ్య’ మూవీ దర్శకుడు బాబీ కూడా చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. పవన్ కల్యాణ్... తీన్మార్‘బ్రో’ (2023) సినిమా తర్వాత పవన్ కల్యాణ్ వెండితెరపై కనిపించలేదు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారాయన. ప్రస్తుతం ఆయన చేతిలో కూడా మూడు చిత్రాలున్నాయి. వాటిలో ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఒకటి. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్యప్రోడక్షన్స్ పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడనుందని టాక్. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ అనే ఓ మూవీ చేస్తున్నారు పవన్. అలాగే ‘గబ్బర్ సింగ్’ తర్వాత హీరో పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్... ఫుల్ స్వింగ్‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు హీరో ప్రభాస్. ఆ చిత్రాల తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారాయన. గత ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో (‘కన్నప్ప’ చిత్రంలో అతిథి పాత్ర) బిజీ బిజీగా ఉన్నారు.మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీని ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే విధంగా ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. అలాగే మంచు విష్ణు హీరోగా రూపొందిన ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా అతిథి పాత్ర చేశారు. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్: పార్ట్ 1–సీజ్ఫైర్’కి కొనసాగింపుగా ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ రూపొందనున్న సంగతి తెలిసిందే.హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్న ఈ పాన్ ఇండియన్ మూవీ 2026లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’తో పాటు మరో రెండు సినిమాలు ప్రభాస్ తమ బ్యానర్లో చేయనున్నట్లు హోంబలే ఫిల్మస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2027, 2028లో వరుసగా ఈ సినిమాలు విడుదలవుతాయి. నితిన్... జోరుగా‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ’ మూవీతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ 2024ని మిస్ అయ్యారు. కానీ ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో జోరుగా ఉన్నారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.అదే విధంగా ‘వకీల్ సాబ్’ మూవీ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నారు నితిన్. ఇందులో సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అక్కా తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో నితిన్‌కి అక్కగా లయ నటిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా మే 9న విడుదల కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలానే తొలి మూవీ ‘బలగం’తో బంపర్ హిట్ సాధించిన వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేయనున్నారు నితిన్. ఏప్రిల్ లేదా మేలో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుందట. ఎన్టీఆర్... యమా స్పీడు ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్ యమా స్పీడుమీదున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని ప్రెజంట్ చేయనున్నారు ప్రశాంత్ నీల్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. కాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘దేవర 2’ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు కొరటాల శివ. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. నాని... ఫుల్ జోష్హీరో నాని ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓ వైపు హీరోగా రెండు మూడు చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారాయన. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. యునానిమస్ప్రోడక్షన్స్ తో కలిసి నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్‌గా పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు నాని.‘హిట్’ సిరీస్‌లో మూడవ భాగంగా ఈ చిత్రం రానుంది. ఇదిలా ఉంటే... ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఫుల్ రా రస్టిక్ పాత్ర చేస్తున్నారు నాని.తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్, స్పానిష్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో 2026 మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ రెండు సినిమాల తర్వాత ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు నాని. భారీ యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని సమాచారం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీ నిర్మించనున్నారు. శర్వానంద్... బిజీ బిజీహీరో శర్వానంద్ బిజీ బిజీగా ఉన్నారు. ‘మనమే’ (2024) చిత్రంతో ప్రేక్షకులను నవ్వించిన ఆయన ప్రస్తుతం మూడుప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘శర్వా 36’ (వర్కింగ్ టైటిల్). విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్న్స్పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బేస్డ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారు. అదే విధంగా శర్వానంద్ నటిస్తున్న 37వ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య, సంయుక్త కథానాయికలు.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న 38వ చిత్రం ‘శర్వా 38’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. 1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. ఈ మూవీలో 60ల నాటి పాత్రను పోషించడానికి మేకోవర్ అవుతున్నారు శర్వానంద్. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సిద్ధు జొన్నలగడ్డ... హుషారుగా...‘డీజే టిల్లు’ (2022), ‘టిల్లు స్క్వేర్’(2024) వంటి వరుస హిట్స్‌తో జోరుగా హుషారుగా దూసుకెళుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ’జాక్ – కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘తెలుసు కదా’.ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాలతో పాటు ‘టిల్లు క్యూబ్’ కూడా చేయనున్నారు సిద్ధు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే ప్రకటించారు ఆ చిత్రనిర్మాత నాగవంశీ.పైన పేర్కొన్న కథానాయకులే కాదు... మరికొందరు కూడా మూడుప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇంకొందరు హీరోల చేతిలో రెండు సినిమాలు ఉండగా మూడో సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – డేరంగుల జగన్ మోహన్ -
బర్త్ డే పార్టీలో జంటగా సమంత, రాజ్ నిడిమోరు.. మరోసారి డేటింగ్ వార్తలు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే చెన్నైలో జరిగిన బిహెండ్వుడ్స్ హాల్ ఆప్ ఫేమ్ అవార్డుల వేడుకకలో మెరిసింది. ఈ వేదికపై సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటనకు అవార్డ్ కూడా అందుకుంది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో ప్రత్యేకమైన అవార్డ్‌తో సమంతను సత్కరించారు. అయితే ఈ వేడుకల్లో సిటాడెల్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరు సైతం సందడి చేశారు. సమంతతో కలిసి వేదికపై కనిపించారు.అయితే గత కొన్ని నెలలుగా సమంత- రాజ్ నిడిమోరుపై డేటింగ్ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే పికిల్ బాల్ టోర్నమెంట్లోనూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ సమయంలోనూ సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. తాజాగా మరోసారి సామ్- రాజ్ నిడిమోరు ఓ పార్టీలో మెరిశారు. తన స్నేహితురాలు, డిజైనర్ క్రేషా బజాజ్ పుట్టినరోజు వేడుకలకు సమంత, నిడిమోరు హాజరయ్యారు. దీంతో మరోసారి వీరిద్దరిపై నెట్టింట చర్చ మొదలైంది. నెల రోజుల్లోపే రెండోసారి జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. తాజాగా వీరిద్దరు కలిసి బర్త్ డే పార్టీలో దిగిన ఫోటో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఏదేమైనా సమంత, రాజ్ నిడిమోరు క్లారిటీ ఇస్తే కానీ ఈ వార్చలకు ఇప్పట్లో చెక్ పడేలా లేదు. అయితే తమపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై ఇప్పటి వరకు సామ్ కానీ, రాజ్ ఎవరూ కూడా స్పందించలేదు.ఇక సినిమాల విషయానికొస్తే సమంత గతేడాది సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీలో కనిపించింది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జోడీగా నటించింది. ప్రస్తుతం సమంత తెలుగులో ఓ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషిలో నటించింది. -
ధైర్యంగా బతకాలి... ప్రశాంతంగా ఉండాలి: నదియా
‘‘మీ విలువ మీరు తెలుసుకోండి... మీకు నచ్చినట్లు మీరు బతకండి’’ అంటున్నారు నదియా. హీరోయిన్గా 1980–1990లలో విజయవంతమైన కెరీర్‌ని చూసిన నదియా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, అమెరికాలో సెటిలయ్యారు. 1994లో సినిమాలకు దూరమై, 2004లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌కి వచ్చారు. ‘కారవాన్’ వాహన సౌకర్యాలు లేని రోజులను, ఇప్పుడు ఆ సౌకర్యాలు ఉన్న రోజులనూ చూస్తున్నారు నదియా. ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి నదియా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలోని విశేషాలు తెలుసుకుందాం. ‘‘నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులెత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోను షేర్ చేసి, చిరంజీవి పేర్కొన్నారు⇒ టీనేజ్‌లో హీరోయిన్ అయిన మీకు అప్పటి షూటింగ్ వాతావరణం, అంతమంది వ్యక్తులతో పని చేయడం వంటివి ఇబ్బందిగా అనిపించేదా? మలయాళంలో నా తొలి సినిమా ‘నోకెత్త దూరత్తు కన్నుమ్ నాట్టు’ (1984). ఈ సినిమా తమిళంలో ‘పూవే పూచ్చూడవా’గా రీమేక్ అయింది. తమిళంలోనూ నేనే నటించాను. తమిళంలో నాకు తొలి సినిమా. ఆల్రెడీ ఒక భాషలో చేసిన సినిమా కావడం ఒక ప్లస్. మలయాళం సినిమా డైరెక్టర్ ఫాజిల్ తమిళంలోనూ చేశారు. అలాగే నాకు తమిళ్ అస్సలు రాకపోవడంతో ఓ ట్యూటర్‌ను పెట్టి, నేర్పించారు. దాంతో ఈజీ అయింది. షూటింగ్ పరంగా ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. దాంతో భయపడాల్సిన అవసరం రాలేదు. అలాగే ఆ సినిమా హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోనంతగా బిజీ అయ్యాను.⇒ సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం అంటారు... ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంటుంది... నేను నా అనుభవాల గురించి మాట్లాడతాను. నాతో పాటు మా నాన్న షూటింగ్‌కి వచ్చేవారు. ఒక్క నిమిషం కూడా ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టేవారు కాదు. ఆయన అంతగాప్రొటెక్ట్ చేయడంతో నాకు ప్రెజర్ ఉండేది కాదు. అలాగే వచ్చిన ప్రతి సినిమా కమిట్ చేయించేసి, నాతో ఓవర్ వర్క్ చేయించలేదు. వర్క్‌ని ఎంజాయ్ చెయ్ అన్నారు. నా పక్కన ఓ గైడింగ్ ఫోర్స్ (తండ్రిని ఉద్దేశించి) ఉండటంతో నాకెప్పుడూ ‘అన్‌సేఫ్’ అనిపించలేదు.⇒షూటింగ్ స్పాట్లో స్టార్స్‌కి ఏర్పాటు చేసే ‘కారవాన్’ వాహన సౌకర్యం అప్పట్లో లేదు. పల్లెల్లో షూటింగ్స్ చేసినప్పుడు కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి, ఇతర వ్యక్తిగత విషయాలకూ పడిన ఇబ్బందుల గురించి? మాకు బోలెడంత ప్రేమ దక్కేది. విలేజెస్లో ఎవరో ఒకరింట్లో కాస్ట్యూమ్స్ మార్చుకునేంత అభిమానం మా మీద ఉండేది. ‘ఏం ఫర్వాలేదు. మీ ఇల్లులా అనుకోండి’ అనేవాళ్లు. ఎలాంటి భయాలూ ఉండేవి కావు. ఇప్పడున్నన్ని సౌకర్యాలు లేకపోయినా హ్యాపీగానే ఉండేది.⇒ అప్పట్లో సౌకర్యం లేకపోయినా హ్యాపీగానే గడిచిందన్నారు... సో.. ఇప్పుడు కారవాన్ తదితర సౌకర్యాలు పొందుతున్న నటీమణుల లైఫ్ ఇంకా హ్యాపీ అనుకోవచ్చా... మాతో పోల్చుకుంటే ఇప్పటి అమ్మాయిలు హ్యాపీ కాదు. అన్ని సౌకర్యాలతో పాటు సమస్యలూ ఎక్కువే. ప్రతి క్షణం ఎవరో ఒకరు మనల్ని గమనిస్తున్న ఫీలింగ్. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ వల్ల పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ జనరేషన్‌కి ఆ ప్రెజర్ ఎక్కువ.⇒మరి... ఈ ప్రెజర్‌ని ఎలా అధిగమించాలి? ప్రపంచం మారిపోయింది. మనమూ అందుకు తగ్గట్టు మారాలి. పరిస్థితులు ఇలా ఉన్నాయేంటని భయపడకుండా మన జాగ్రత్తల్లో మనం ఉండటమే. ⇒ నెగటివిటీ ఎక్కువ శాతం ఉన్న ఈ మోడ్రన్ వరల్డ్‌లో అమ్మాయిలు తమ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలంటారు? ధైర్యంగా, గర్వంగా బతకాలి. ఎందుకంటే ఆ దేవుడు సృష్టించిన ప్రత్యేకౖమైనమనుషులం మనం. ఎక్కడ ఉన్నా మనం సౌకర్యంగా ఉండటం మనకు ముఖ్యం. సౌకర్యం అంటే లగర్జీస్ కాదు. మనకు నచ్చినట్లుగా మనం ఉండటం. అలాగే మనం అనుకున్నది నిర్మొహమాటంగా చెప్పాలి. మన విలువని మనం తెలుసుకోవాలి. మనం మన గురించి ఏమనుకుంటున్నామో అదే మనం. తక్కువగా అనుకుంటే తక్కువగా... ఉన్నతంగా అనుకుంటే ఉన్నతంగా. అందుకే మన గురించి మనం ఉన్నతంగా అనుకోవాలి. ఆత్మవిశ్వాసంతో బతకాలి. ⇒ఇద్దరు అమ్మాయిల తల్లిగా మీ పిల్లలకు ఈ విషయాలు చెబుతుంటారా? చెబుతాం. మా అమ్మాయిలకు బాగా స్వేచ్ఛ ఇస్తాం. వాళ్ల ఇష్టాలను కాదనం. వద్దని చెప్పాల్సి వస్తే ఎందుకు వద్దో చెబుతాం. ఎంత జాగ్రత్తగా ఉండాలో వివరిస్తాం. ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాటలను పిల్లలు వినేవాళ్లు. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిన ఈ కాలంలో పిల్లలు చెప్పేది కూడా పెద్దలు వినాలి. మేం మా పిల్లలతో బాగా కమ్యూనికేట్ అవుతాం. మా పిల్లలకే కాదు... ఎవరికైనా నేను చెప్పేదేంటంటే... ధైర్యంగా బతకాలి... ప్రశాంతంగా ఉండాలి.నా జీవితం హ్యాపీ నా జీవితం మొత్తం సాఫీ. హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, మా ఆయనతో అమెరికాలో సెటిలయ్యాను. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ లైఫ్‌ని పరిపూర్ణంగా ఆస్వాదించాను. చాలా గ్యాప్ తర్వాత సినిమాలకు చాన్స్ వచ్చింది. ‘నటిగా నీ పూర్తి ప్రతిభని నువ్వు వినియోగించుకోలేదు.. సినిమాలు కంటిన్యూ చెయ్’ అని మా ఆయన, ‘మళ్లీ యాక్ట్ చెయ్ అమ్మా’ అని పిల్లలు అన్నారు. వచ్చాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నాను. -
సోదరుడి మరణం.. రాజమండ్రికి జయప్రద
ఇటీవల అలనాటి సినీ నటి జయప్రద ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆమె సోదరుడు రాజా బాబు మరణించారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన గురువారం (ఫిబ్రవరి 27) తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జయప్రద సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాజాగా జయప్రద తన సోదరుడు రాజా బాబు అస్థికలను రాజమండ్రిలోని గోదావరి నది పుష్కర ఘాట్‌లో కలిపారు. ఈ సందర్భంగా తన సోదరుడి గురించి ఆమె మాట్లాడారు. ఆయన మా జీవితాల నుంచి దూరంగా వెళ్లిపోయినందుకు మాకు చాలా బాధగా ఉందన్నారు. ఆయన కుమారుడు సామ్రాట్‌తో కలిసి రాజాబాబు జన్మస్థానంలో అక్కడే అస్థికలు కలిపేందుకు వచ్చామని జయప్రద తెలిపారు.నా సోదరుడు రాజా బాబు ఇక్కడే పుట్టి పెరిగాడు. ఇక్కడే చదువుకున్నాడు. అతనితో ఉన్న ఎన్నో మరవలేని క్షణాలు గుర్తుగా ఉండిపోయాయి. నేను రాజమండ్రి ఎప్పుడొచ్చినా నా సోదరుడితోనే కలిసి వచ్చేదాన్ని. మొదటిసారి ఆయన లేకుండా ఇక్కడికి వచ్చా. మా జీవితాల్లో రాజాబాబు లేకపోవడం బాధగా ఉంది. అతని కుమారుడైన సామ్రాట్‌తో కలిసి ఈ రోజు అస్థికలు ప్రదానం చేయడానికి వచ్చాం. నా సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని అన్నారు.ఇక జయప్రద విషయానికొస్తే 14 ఏళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించారు. 1976 నుంచి 2005 వరకు దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. మరోవైపు రాజకీయాల్లోనూ ఉన్నారు. 1994లో తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ నాయకులతో గొడవల కారణంగా రెండేళ్లకే బయటకొచ్చి, సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ప్రస్తుతానికైతే బీజేబీలో కొనసాగుతున్నారు. అలానే ప్రభాస్ 'ఫౌజీ'లోనూ ప్రస్తుతం నటిస్తున్నారు. -
నాగచైతన్యతో మొదటి సీన్.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంతకు ఇటీవల అరుదైన గౌరవం దక్కింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్‌ను అందుకుంది. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో సమంతకు అవార్డ్‌ను బహుకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన తొలి చిత్రం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అక్కినేని హీరో నాగచైతన్యతో ఏ మాయ చేశావే మూవీతో సామ్ సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు.తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి సమంత మాట్లాడింది. ఈ సినిమాలో ప్రతి షాట్ తన జీవితాంతం గుర్తుండిపోతుందని వెల్లడించింది. అయితే ఈ 15 ఏళ్లలో తనకు మార్గనిర్దేశం చేసేవారు లేకపోవటం వల్ల కొన్ని మంచి సినిమాలు చేయలేకపోయాననని తెలిపింది. అంతేకాకుడా తనకు తమిళం రాకపోవడం వల్ల ఇబ్బంది పడినట్లు సామ్ చెప్పింది.అయితే సమంతా 2010లో రాహుల్ రవీంద్రన్తో మాస్కోయిన్ కావేరిలో నటించింది. అయితే ఆ సినిమా ఏమాయ చేశావే కంటే ముందే చిత్రీకరించినప్పటికీ విడుదల కాలేదు. ఆ సినిమా కంటే తనకు నాగ చైతన్యతో చేసిన సినిమాలోని ప్రతి షాట్ గుర్తుండిపోతుందని సమంత చెబుతోంది. ఈ చిత్రంలో జెస్సీ పాత్రలో కార్తీక్‌ను కలిసే మొదటి సన్నివేశం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని సమంత వెల్లడించింది. గౌతమ్ మీనన్‌తో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవమని తెలిపింది.కాగా.. 2010లో సినీ కెరీర్ ప్రారంభించిన సమంత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో బృందావనం, మహేశ్ బాబు దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషిలో నటించింది. అంతేకాకుండా గతేడాది వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో నటించింది. -
పెళ్లి కూతురిలా మీనాక్షి చౌదరి.. బ్లూ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ!
బెంగళూరు ఈవెంట్లో డాకు మహారాజ్ బ్యూటీ..పెళ్లి కూతురిలా ముస్తాబైన మీనాక్షి చౌదరి...బ్లూ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ..తమిళంలో మొదటి ఆడిషన్ ఫోటోలు పంచుకున్న డ్రాగన్ బ్యూటీ..ప్రకృతి ఆస్వాదిస్తోన్న టాలీవుడ్ నటి శివాని రాజశేఖర్.. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) -
మిల్కీ బ్యూటీపై స్కామ్ ఆరోపణలు.. ఘాటుగా స్పందించిన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం కేవలం బాలీవుడ్‌కే పరిమితమైంది. తమన్నా చివరిసారిగా సికందర్ కా ముఖద్దర్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో తెరకెక్కుతోన్న ఓదెల-2 మూవీలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు నిర్మించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.టఅయితే తాజాగా మిల్కీ బ్యూటీపై క్రిప్టో కరెన్సీ స్కామ్‌లో పాత్ర ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న కథనాలపై తమన్నా స్పందించింది. రూ. 2.4 కోట్ల క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపింది. తనకు ఎలాంటి మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం లేదని పేర్కొంది. తనపై వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ సమస్యను న్యాయపరంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని తెలిపింది.తమన్నా మాట్లాడుతూ.. 'క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో నా ప్రమేయం ఉందని వార్తలు రావడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి నకిలీ, తప్పుదోవ పట్టించేలా వదంతులు ప్రసారం చేయవద్దని మీడియాలోని నా స్నేహితులను అభ్యర్థించాలనుకుంటున్నా. అలా చేసిన వారిపై తగిన చర్య తీసుకోవడానికి నా టీమ్ పనిచేస్తుంది' అని తెలిపింది. తనపై వస్త్నున తప్పుడు ఆరోపణలపై తమన్నా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా.. ఇవాళ ఉదయం నుంచి క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో విచారణ కోసం తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్‌లను పుదుచ్చేరి పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమన్నా స్పందించింది.అసలేం జరిగిందంటే?కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంగా క్రిప్టో కరెన్సీ పేరుతో 2022లో ఓ కంపెనీ ప్రారంభించారు. దీనికి తమన్నా(Thamannah Bhatia) తదితరులు హాజరయ్యారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన సంస్థ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. తర్వాత ముంబైలోని క్రూయిజ్ నౌకలో గ్రాండ్ గా పార్టీ నిర్వహించి, పెట్టుబడులు పెట్టేలా ప్రజల్ని ఆకర్షించారు.ఈ క్రమంలోనే అత్యధిక లాభాల్ని రిటర్న్ ఇస్తామని చెప్పిన క్రిప్టో కరెన్సీ సంస్థ.. పుదుచ్చేరిలో వేలాది మంది నుంచి రూ.3.4 కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ ను కూడా ఈ కేసులో భాగంగా ఇప్పుడు పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వార్తల్లో నిలిచింది. -
డ్రాగన్ సక్సెస్.. టాలీవుడ్ యంగ్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!
ఇటీవల డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు హీరోయిన్ కాయాదు లోహర్. లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా నటించింది. ఈ చిత్రానికి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. ఇందులో తమిళంతో పాటు తెలుగులోనూ మాట్లాడి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అస్సాం బ్యూటీ.. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.అయితే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే టాలీవుడ్లో యంగ్ హీరోతో జత కట్టనుందని లేటేస్ట్ టాక్. అందుకే తెలుగు భాషను నేర్చుకుంటోందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాస్ కా దాస్ నటించబోయే ఫంకీ మూవీలో కాయదు లోహర్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనైతే ఇంకా రావాల్సి ఉంది. ఈ మూవీ జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో గ్లామర్ బ్యూటీ నటిస్తే యూత్ ఆడియన్స్‌కు మరింత కనెక్ట్ అవుతుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా.. కాయదు లోహర్ ఇప్పటికే శ్రీవిష్ణు సరసన అల్లూరి సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.కాయాదు లోహర్ తెలుగులో మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు. నేను త్వరలో టాలీవుడ్లో సినిమా కనిపించబోతున్నా. మీ అందరూ నన్ను బాగా ఆదరించారు. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు' అని వీడియోను పోస్ట్ చేసింది. కాగా.. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న ఫంకీ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) -
సెట్లో అడుగుపెట్టిన అక్కినేనివారి కోడలు.. పెళ్లి తర్వాత తొలి ప్రాజెక్ట్
తెలుగమ్మాయి, హీరోయిన్ శోభిత ధూళిపాల గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడింది. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో టాలీవుడ్ నుంచి ప్రముఖ సినీతారలు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే చైతూతో పెళ్లి తర్వాత ఇటీవల తండేల్ మూవీ ఈవెంట్లో మెరిసింది అక్కినేని కోడలు. తాజాగా తన పెళ్లి తర్వాత తొలిసారిగా మూవీ సెట్లో అడుగుపెట్టింది శోభిత. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో షూటింగ్లో పాల్గొన్నారామె. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చైతూతో పెళ్లి తర్వాత నటిస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.అంతకుముందు బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది శోభిత ధూళిపాల. బాలీవుడ్లో 'మేడ్ ఇన్ హెవెన్', 'ది నైట్ మేనేజర్' లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. Here are some photos of #SobhitaDhulipala shooting for her next film. ✨#Celebs pic.twitter.com/PTAXN54Ab4— Filmfare (@filmfare) February 24, 2025 -
రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్.. ఆర్జీవీ శారీ హీరోయిన్ లేటేస్ట్ పోజులు!
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్..బార్బీ లుక్‌లో మెరిసిపోతున్న డార్లింగ్ బ్యూటీ నభా నటేశ్..శ్వేతబసు ప్రసాద్ లేటేస్ట్ ఫోటోషూట్ పిక్స్...బ్లాక్ డ్రెస్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ హోయలు..ఎలిఫెంట్స్తో చిల్ అవుతోన్న సురేఖవాణి, కూతురు సుప్రీత..ఆర్జీవీ శారీ హీరోయిన్ లేటేస్ట్ లుక్.. View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
సందీప్ కిషన్ 'మజాకా'.. అభిమానులను అలరిస్తోన్న ఫోక్ సాంగ్
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘మజాకా’. ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన సాంగ్‌కు ఆడియన్స్‌ను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరో క్రేజీ పాటను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా మజాకా మూవీ నుంచి అద్భుతమైన జానపద పాటను విడుదల చేశారు. సొమ్మసిల్లి పోతున్నావే.. ఓ చిన్నా రాములమ్మా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రాము రాథోడ్, ప్రసన్న కుమార్ బెజవాడ లిరిక్స్ అందించగా.. రేవంత్ ఆలపించారు. ఈ క్రేజీ ఫోక్ సాంగ్‌కు లియోన్ జేమ్స్ సంగీతమందించారు. ఈ చిత్రంలో మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. నల్ల నల్లాని కళ్ళతో, నాజూకు నడుముతో నన్ను ఆగమే జేస్తివే 🎶❤️🔥The Most Viral Folk Sensation Of The Year - #SommasilliPothunnave Out Now✨️— https://t.co/JCqj0HaZyi🎵 @leon_james🎤 @singerrevanth✍🏻#RamuRathod @KumarBezwada#MazakaOnFeb26th #Mazaka @sundeepkishan @riturv… pic.twitter.com/8gEID6cJL0— AK Entertainments (@AKentsOfficial) February 21, 2025 -
కారాన్ని ఇంగ్లీషులో ఏమంటారు?.. శ్రీలీల క్యూట్ వీడియో చూశారా?
పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల పుష్ప-2లో కిస్సిక్ సాంగ్‌తో అభిమానులను కట్టిపడేసిన భామ బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ కార్తీక్ ఆర్యన్ సరసన క్రేజీ ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల.అయితే తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. పల్లీల పొడిని కారంలో కలుపుకుని తింటున్న వీడీయోను శ్రీలీల టీమ్ ట్విటర్లో షేర్ చేసింది. ఇందులో పీనట్ పొడిలో కారం కలుపుకుని ప్రతి రోజు తింటానంటోంది ముద్దుగుమ్మ. అంతేకాకుండా కారం పొడిని ఇంగ్లీషులో ఏమంటారని క్యూట్‌గా అడిగింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. శ్రీలీలీ బాలీవుడ్‌లోనూ ఎంట్రీకి సిద్ధమైంది. కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించనుంది ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోను ఇటీవలే మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్, అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. Cutest video on internet ❤️❤️🥹@sreeleela14 #Sreeleela pic.twitter.com/o8xckGmsor— Team Sreeleela™️ (@Teamsreeleela) February 19, 2025 -
మా పెళ్లిని సింపుల్‌గా చేసుకోవడానికి కారణం అదే: రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీని పెళ్లాడింది ముద్దుగుమ్మ. గతేడాది ఫిబ్రవరి 2024లో గోవాలో ఓ ప్రైవేట్ వేడుకలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తన పెళ్లికి సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను షేర్ చేసుకుంది. మీ పెళ్లిని ఎందుకు ప్రైవేట్‌గా ఉంచారన్న ప్రశ్నపై రకుల్ స్పందించింది.రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..'మేము ఎల్లప్పుడూ చాలా సింపుల్‌గా ఉండాలని కోరుకుంటా. మేము సౌకర్యంగానే ఉండటానికి ఇష్టపడతాం.. కానీ ఎక్కువ లగ్జరీగా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. అన్నిటికంటే ఎక్కువగా ఆ మధురమైన క్షణాలు, సంతోషంగా ఉండేందుకే ఎక్కువ విలువ ఇస్తాం. అందుకే మా పెళ్లిని అతిథులతో కలిసి ఆస్వాదించాలనుకున్నాం. ఆ మూడు రోజులు మా జీవితంలో గుర్తుండిపోవాలని ఆశించాం. అందువల్లే నో-ఫోన్ పాలసీ పెట్టాం. అంతే తప్ప ఫోటోలు లీక్ చేస్తారని కాదు. మా పెళ్లి చిత్రాలను మేమే మొదట బయట పెట్టాలకున్నాం. అలాగే పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాం. నా పెళ్లి దుస్తుల్లో కూడా డ్యాన్స్ చేశాను.' అని తెలిపింది. కాగా.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మేరే హస్బెండ్ కి బివి చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కానుంది. -
సందీప్ కిషన్ 'మజాకా'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం మజాకా. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో మన్మధుడు హీరోయిన్ అన్షు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమాకు సంబంధించి క్రేజీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'హేయ్ పగిలి పగిలి అంటూ సాగే' లిరికల్ పాటను రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. కాగా.. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతమందించారు. -
మాల్దీవుస్‌లో సాక్షి అగర్వాల్ చిల్.. సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ లేటేస్ట్ లుక్!
మజాకా ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా మన్మధుడు హీరోయిన్ అన్షు..సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ లేటేస్ట్ లుక్స్..లైప్ ఈజ్ బూమరాంగ్ అంటోన్న మేఘా ఆకాశ్..బ్లాక్ బ్యూటీలా మెరిసిపోతున్న శ్రీలీల..మాల్దీవుస్‌లో చిల్ అవుతోన్న సాక్షి అగర్వాల్.. View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) -
అనుపమ బర్త్ డే.. పరదా టీమ్ స్పెషల్ విషెస్
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తోన్న తాజా చిత్రం పరదా. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్లో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.(ఇది చదవండి: నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్)ఇవాళ అనుపమ బర్త్ డే కావడంతో ఓ వీడియోను విడుదల చేశారు. దాదాపు 20 సెకన్లపాటు ఉన్న మూవీ క్లిప్‌ను షేర్ చేస్తూ అనుపమకు పుట్టినరోజ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నమైన సోషియో ఫాంటసీ కథగా రానున్న ఈ చిత్రంలో అనుపమ సుబ్బు అనే పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను పెళ్లాడిన టాలీవుడ్ బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి మాన్షి జోషి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. గతేడాది అక్టోబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవ్‌ను పెళ్లాడింది. బెంగళూరులోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాన్షికి అభినందనలు చెబుతున్నారు.కన్నడలో పలు సీరియల్స్‌లో నటించిన మాన్షి జోషి.. తెలుగులో దేవత అనే సీరియల్లో కనిపించింది. ఈ సీరియల్లో అర్జున్ అంబటి, చంటిగాడు హీరోయిన్ సుహాసిని కీలక పాత్రల్లో నటించారు. అంతేకాకుండా కన్నడలో పారు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. రాధ రమణ, అంబుదాన్ ఖుషీ, గీతాంజలి, రాధ రాఘవ్ లాంటి సీరియల్స్‌తో మెప్పించింది. -
వాటితో జీవితానికి ఎలాంటి ఉపయోగం లేదు: రష్మిక ఆసక్తికర కామెంట్స్
వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న బ్యూటీ, నేషనల్ క్రష్ నటి రషి్మక మందన్నా. మాతృభాష అయిన కన్నడ చిత్రపరిశ్రమలో కథానాయకిగా పరిచయమైంది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించే స్థాయికి చేరుకున్నారు. ఇటీవల ఈమె తెలుగులో అల్లు అర్జున్ ఫ్యాషన్ నటించిన పుష్ప– 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో అందం, అభినయంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఇటీవల హిందీలో గుడ్ బై అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా ఆ చిత్రం నుంచి ఆశించిన విజయాన్ని సాధించకపోయినా.. అక్కడ వరుసగా అవకాశాలు మాత్ర వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత నటించిన యానిమల్ చిత్రం ఈ కన్నడ బ్యూటీని నేషనల్ క్రష్‌గా మార్చింది. తాజాగా విక్కీ కౌశల్‌తో సరసన ఛావా అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా శుక్రవారం తెరపైకి వచ్చింది. మొదటి రోజే ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుంది.ఇందులో నటి రష్మిక మహారాణి పాత్రలో తన సత్తాను చాటారు. ఈ సందర్భంగా నేషనల్ క్రష్ వంటి బిరుదులు జీవితంలో ఏ విధంగానూ ఉపకరించవని పేర్కొన్నారు. దీని గురించి రష్మిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో లభించే బిరుదులు , పేర్లు జీవితంలో ఉపయోగపడవు అన్నారు. అవీ అభిమానుల ఆదరాభిమానాలతో వచ్చేవి అన్నారు. అందుకే అవి కూడా పేర్లు మాత్రమేనని పేర్కొన్నారు.అయితే తన మంచిని కోరేవారిని తాను గుండెల్లో పెట్టుకున్నారని, అందుకే అభిమానులు ఆదరించే చిత్రాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభిమానుల ప్రేమనే ప్రధానంగా భావిస్తానన్నారు. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. ఇప్పుడు దక్షిణాది ఉత్తరాది చిత్రాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం శ్రమగా మారిందన్నారు. అదే సమయంలో అభిమానుల ప్రేమ కోసం తాను తన నిద్రకే గుడ్ బై చెబుతున్నానని నటి రష్మిక మందన్నా. -
'విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్'.. రష్మిక పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌కు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్‌ను అందించారు. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ రౌడీ హీరో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కింగ్డమ్ టీజర్ పోస్టర్‌ను పంచుకుంది. 'ది మ్యాన్ కమ్స్ విత్ సమ్‌థింగ్ మెంటల్.. విజయ్ను చూస్తుంటే గర్వంగా ఉంది' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్..టాలీవుడ్లో ఈ జంటపై కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలాసార్లు వీరిద్దరు పెట్టిన పోస్టులతో ఫ్యాన్స్‌కు దొరికిపోయారు. గతేడాది దీపావళికి సైతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ చేసుకుంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత మరోసారి ఈ జంటపై రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా కింగ్డమ్ టీజర్‌ను రష్మిక షేర్ చేయడంతో మరోసారి చర్చ మొదలైంది. కాగా.. వీరిద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించారు. ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది రష్మిక. ఈ బాలీవుడ్ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. -
ఈ ప్రపంచంలో మీకు నచ్చినట్లు ఉండొచ్చు: సమంత పోస్ట్ వైరల్
ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్య- శోభిత పెళ్లి తర్వాత సామ్ పేరు ఏదో ఒక సందర్భంలో బయటికి వినిపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్‌తో డేటింగ్లో ఉందంటూ మరోసారి రూమర్స్ వైరలైన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలోనే సమంత చేసిన తాజా పోస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నాగచైతన్య సైతం తన పెళ్లి, విడాకుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీంతో సమంత చేసిన క్రిప్టిక్ పోస్ట్‌పై నెట్టంట చర్చ మొదలైంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం పదండి.సమంతా తన పోస్ట్‌లో ఆధ్యాత్మిక గురువు సద్గురు చెప్పిన కోటేషన్‌ను షేర్ చేసింది. అందులో.. 'ఒక మనిషిగా ఈ ప్రపంచంలో మీరు శాశ్వతం కాదు. ఇది ఎప్పటికప్పుడు మారుతూ నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇక్కడ ఏదీ స్థిరంగా ఉండదు. ఈ ప్రపంచంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండవచ్చు.' అని ఆ కోట్లో రాసి ఉంది. ఈ పోస్ట్‌ను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. విడాకులపై స్పందించిన నాగచైతన్య..టాలీవుడ్ హీరో నాగచైతన్య తన మాజీ భాగస్వామి సమంత గురించి మొదటిసారి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వారు వివాహబంధం నుంచి విడిపోయిన తర్వాత పలుమార్లు సమంత రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ, నాగచైతన్య ఇప్పటి వరకు విడాకుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు. సమంతతో విడిపోయిన తర్వాత చాలా నెగటివ్ కామెంట్లు వచ్చాయని ఆయన అన్నారు. తను, నేను ఇద్దరం ఆలోచించే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ చాలామంది నెగటివ్ కామెంట్లు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు.నా లైఫ్‌లో రియల్ హీరో ఆమెనే..నటి శోభితాతో పెళ్లి విషయం గురించి ప్రకటించిన తర్వాత కూడా నెగటివ్‌గానే కామెంట్లు చేశారని చైతన్య అన్నారు. 'ఆమె నా జీవితంలోకి చాలా ఆర్గానిక్గానే ప్రవేశించింది. మా ఇద్దరి మధ్య మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం అయింది. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. కానీ, తన గురించి బ్యాడ్‌గా మాట్లాడటం చాలా తప్పు. నా పర్సనల్ లైఫ్ గురించి ఆమె చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తుంది. నా జీవితంలో నిజమైన హీరో శోభితానే..' అంటూ పేర్కొన్నారు.కాగా.. సమంత, నాగ చైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పరస్పర నిర్ణయంతో 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరు కలిసి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ఏ మాయ చేసావే'లో స్క్రీన్‌ను పంచుకున్నారు. ఆ తర్వాత వివాహానికి ముందు పలు చిత్రాలలో నటించారు.ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. -
నాకు ఎదురైన వాటి గురించే మాట్లాడతా.. అలా చేయొద్దంటోన్న అనసూయ
టాలీవుడ్ నటి అనసూయ ఇటీవలే పుష్ప-2 సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రంలో తనదైన పాత్రలో అభిమానులను మెప్పించారు. పుష్ప పార్ట్-1లో దాక్షాయణిగా అలరించిన అనసూయ.. పార్ట్-2లోనూ మరోసారి సినీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రస్తుతం అరి మూవీ(Ari)తో అభిమానులను పలకరించనుంది. పేపర్ బాయ్ ఫేం జయ శంకర్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌లో సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా కీలక పాత్రల్లో నటించారు. గతేడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.(ఇది చదవండి: స్టార్ హీరో ‘అడిగితే’ నో చెప్పా.. చాలా కోల్పోయా: అనసూయ)అయితే తాజాగా అనసూయ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ నేను కేవలం నా అనుభవాన్ని మాత్రమే పంచుకున్నట్లు తెలిపింది. అవగాహన కల్పించడం కోసమే నా కెరీర్లో ఎదురైన సంఘటనల గురించి మాత్రమే మాట్లాడనని పేర్కొంది. నా మాటలను ఎవరూ వక్రీకరించవద్దని ప్రేక్షకులను, మీడియాను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నట్లు ట్వీట్లో రాసుకొచ్చింది. ఇలాంటివీ నన్ను క్యారెక్టర్‌ను డిసైడ్ చేయలేవ్.. నిజమే ఎప్పటికీ నిలుస్తుంది. నన్ను అర్థం చేసుకున్న వారికి ప్రేమను పంచుతూనే ఉంటా అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. I shared my experience—what I faced, I spoke. Not to blame, but to bring awareness. I sincerely request the audience and media not to twist my words into something I never meant. The noise doesn’t define me—truth does. Sending love to those who understand. ❤️ #StayStrong— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 11, 2025 -
టాలీవుడ్ బుల్లితెర నటి మాన్షీ జోషి హల్దీ వేడుక.. ఫోటోలు
-
అప్పుడు గేమ్ ఛేంజర్.. ఇప్పుడు తండేల్.. వారికి నిర్మాత వార్నింగ్
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.పైరసీపై స్పందించిన తండేల్ నిర్మాతఅయితే తండేల్ విడుదలైన రెండో రోజే ఆన్లైన్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై తండేల్ మూవీ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఇప్పటికీ పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీకి అవరోధంగా మారిందన్నారు. అలాంటి పనులకు పాల్పడేవారిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాను సైతం లోకల్ ఛానెల్లో ప్రదర్శించారు. ఇప్పుడు తండేల్‌ను పైరసీ చేసినవారిని కేసులు పెడతామని నిర్మాత బన్నీవాసు హెచ్చరించారు.తండేల్కు సక్సెస్ టాక్..ఈనెల 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన తండేల్కు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల్లో రూ. 41.20 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన చూస్తే మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్కును దాటనుంది. ఈ నేపథ్యంలో తండేల్ మూవీ నిర్మాతలు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. -
ఫ్యాషన్ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ ప్రణీత..మరింత గ్లామరస్‌గా టిల్లు భామ నేహాశెట్టి..!
ఫ్యాషన్ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ ప్రణీత...లవ్ యాపా మూడ్‌లో బాలీవుడ్ భామ ఖుషీకపూర్...మరింత గ్లామరస్‌గా టిల్లు భామ నేహాశెట్టి..గేమ్ ఛేంజర్ హీరోయిన్ భర్త స్పెషల్ విషెస్..అలాంటి డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ నుస్రత్ బరుచ్చా.. View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
వేడిలో సెగలు పుట్టిస్తున్న అదా శర్మ ఫోటోస్
-
కవ్వించే అందాలతో ఊరిస్తున్న దక్ష నాగర్కర్ ఫోటోస్
-
Happy Birthday: బర్త్ డే రోజు రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న హీరోయిన్ రెబా మోనికా ఫోటోలు
-
దివి నుంచి భువికి వచ్చిన దేవకన్యలా.. నభా నటేష్ ...
-
అందంతో మతిపోగొడుతున్న ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ ఫోటోలు.
-
అందం, అభినయం కొంటె చూపులతో కవ్విస్తోన్న రుక్సార్ ధిల్లాన్ ఫోటోలు
-
స్టార్ హీరో ‘అడిగితే’ నో చెప్పా.. చాలా కోల్పోయా: అనసూయ
ఆడ, మగ జాతల మధ్య అట్రాక్షన్ అనేది కామన్. ఏ రంగంలోనైనా ఇది ఉంటుంది. సినిమా అనేది రంగుల ప్రపంచం కాబట్టి ఇక్కడ స్పెషల్ ఫోకస్ ఉంటుంది. చాన్స్‌ల పేరుతో అమ్మాయిలను లోబర్చుకునే అవకాశం ఇక్కడ ఎక్కువ. అలా కాకుండా కళను నమ్మి అవకాశాలు ఇచ్చే రోజులు రావాలి. ఆ అమ్మాయి మనదగ్గరకు ‘రాకపోతే’ ఏంటి.. క్యారెక్టర్ బాగా చేస్తుంది కదా అని హీరోతో పాటు దర్శకనిర్మాతలు అనుకోవాలి. అప్పుడే చాలా మంది అమ్మాయిలు సినిమా రంగంలో రాణిస్తారు’ అని అంటోది యాంకర్, నటి అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj ). ఎలాంటి విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే అనసూయ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా రంగంలో అమ్మాయిలపై ఎలాంటి దృష్టికోణం ఉంది? అమ్మాయిలు ఎలా ఉండాలి? తదితర విషయాలపై ఓపెన్‌గా మాట్లాడింది.‘నో’ చెప్పడం కాదు..ఎదుర్కొవాలిచాన్స్ల పేరుతో వాడుకునేందుకు చాలా మంది హీరోలతో పాటు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తారు. నా విషయంలో కూడా అలా జరిగింది. ఓ స్టార్ హీరో ‘అడిగితే’ నో చెప్పాను. అలాగే ఓ పెద్ద డైరెక్టర్ అడిగితే సున్నితంగా తిరస్కరించాను. దాని వల్ల నాకు సినిమా చాన్స్‌లు పోయాయి. నో చెప్పడం కాదు అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను కూడా ఎదుర్కొనే ధైర్యం అమ్మాయిల్లో ఉండాలి. ప్రపోజల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడే ప్రపోజ్ చేశారు. నో చెప్పాను. అలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి ప్రపోజల్స్ వచ్చాయి. అప్పుడు ఎలా నో చెప్పానో ఇప్పుడు అలానే చెప్పాను. వాళ్లు కోరుకునేది ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అలా చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. దాని కోసం కాకుండా కళను చూసి పాత్రలు ఇస్తే బాగుంటుంది. ‘ఆమె రాకపోతే ఏంటి..ఆ క్యారెక్టర్ అయితే బాగా చేస్తుంది కదా’అని అనుకోవాలి. అప్పుడే చాలా మంది అమ్మాయిలు ఈ రంగంలోకి వస్తారు.ఈజీ కాదు.. కరెక్ట్ అనిపించేదే చెయ్చాలా మంది ఎన్నో ఆశలలో సినిమా రంగంలోకి వస్తారు. కానీ ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. చాన్స్‌ల కోసం ఈజీ పద్దతి వెతుకుతారు. అది తప్పు. ఏది కరెక్ట్ అయితే అదే చెయ్. పది మంది తప్పు చేస్తున్నారు కదా..నేను కూడా తప్పు చేస్తా అనడం కరెక్ట్ కాదు. నువ్వు తప్పు చేయకుండా ఉండు. ఈజీ వేలో కాకుండా నీ కష్టాన్ని, కళను నమ్ముకొని ప్రయత్నించు. అలాంటి వారిని ప్రోత్సహించే రోజులు రావాలి.నాపై మీ పెత్తనం ఏంటి?ఇక సోషల్ మీడియాలో అనసూయ పెట్టె పోస్టులు ఎంత వైరల్ అవుతాయో అందరికి తెలిసిందే. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానుల్ని అలరిస్తారు. ఆమె డ్రెస్సింగ్‌పై కొంతమంది నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తారు. తాజాగా దీనిపై కూడా అనసూయ స్పందించింది. ‘నన్ను ఇష్టపడేవాళ్ల కోసం నేను ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తుంటాను. నేను ఎలాంటి ఫోటోలు అయినా షేర్ చేస్తా. అది నా ఇష్టం. నేను ఏం డ్రెస్ వేసుకోవాలి? బికినీ వేసుకోవాలా లేదా మొత్తం విప్పి తిరుగాలా’ అనేది నా ఇష్టం. దాన్ని వల్ల నేను ఇవరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ నెగెటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల నన్ను ఇబ్బంది పెడుతున్నారు కదా? అయినా నాపై మీ పెత్తనం ఏంటి? అంటూ అనసూయ మరోసారి నెటిజన్స్‌పై మండిపడింది. -
పూల చీరలో మెరిసిపోతున్న వైష్ణవి.. వైరల్ అవుతున్న ఫోటోస్
-
కన్నడ బ్యూటీ శాన్వి... ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్
-
మోడ్రన్ లుక్స్ తో అదరగోడుతున్న ఆషికా రంగనాథ్ ఫోటోలు
-
పెళ్లి తర్వాత నా భర్తనే మారిపోయాడు: వరలక్ష్మి శరత్ కుమార్
దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మదగజరాజా. ఈ చిత్రంలో విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ చిత్రం జనవరి 31 తెలుగులో విడుదలైంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అదేంటో తెలుసుకుందాం.గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి తన భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లి తర్వాత తన కోసం పూర్తిగా మారిపోయాడని తెలిపింది. నా కోసం ముంబయి నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నారని పేర్కొంది. ప్రతి విషయంలో నాకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటారని వెల్లడించింది. నా కోసం ఆయన తన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చుకున్నారని వివరించింది.ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ..'నికోలయ్‌తో పెళ్లి తర్వాత నా జీవితం ఏమీ మారలేదు. నాకోసం అతని జీవితాన్నే పూర్తిగా మార్చుకున్నాడు. నా కోసం ఆయనే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. అంతేకాదు తన పేరును నికోలయ్ సచ్దేవ్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌గా మార్చుకున్నారు. నా కెరీర్ పరంగా ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారు. నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉండేది కాదు. వివాహం అనేది నాకు సెట్ కాదనుకునేదాన్ని. కానీ నికోలయ్‌తో పరిచయం తర్వాత నా జీవితానికి అతనే సరైన భాగస్వామి అని అర్థమైంది. అలా పెద్దల అంగీకారంతో వివాహాబంధంలోకి అడుగుపెట్టాం' అని చెప్పింది. సినిమాల విషయానికొస్తే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వీరసింహారెడ్డి, కోట బొమ్మాళి, హనుమాన్ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది కన్నడలో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మూవీలోనూ కీలకపాత్ర పోషించింది.పెళ్లి తర్వాత నా కోసం మా ఆయన చాలా మార్చుకున్నాడు - Actress #VaralaxmiSarathkumar#NicholaiSachdev #MadhaGajaRaja #TeluguFilmNagar pic.twitter.com/doquPrV0ft— Telugu FilmNagar (@telugufilmnagar) January 31, 2025 -
వయ్యారి భామ అషురెడ్డి.. అందాలతో రచ్చ (ఫోటోలు )
-
జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా...’ అంటూ అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణకుమారి అప్పట్లో సిల్వర్ స్క్రీన్‌పై చేసిన సందడిని నాటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకూ అంటే... జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా... అంటూ కొందరు కథానాయికలు డైరీలో నాలుగుకి మించిన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ హీరోయిన్లు చేస్తున్నసినిమాల గురించి తెలుసుకుందాం...రెండు దశాబ్దాలు దాటినా బిజీగా...చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా ప్రయాణం పూర్తి చేసుకున్నారు త్రిష. అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పటికీ ఫుల్ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అంతేకాదు.. అందం విషయంలోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి అరడజను సినిమాలున్నాయి. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె.‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే మోహన్‌లాల్ లీడ్ రోల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు త్రిష. అదే విధంగా అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్న ‘విడాముయర్చి’, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడీ అగ్లీ’, కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం రూపొందిస్తున్న ‘థగ్ లైఫ్’, సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘సూర్య 45’ (వర్కింగ్ టైటిల్) వంటి తమిళ చిత్రాల్లో నటిస్తూ జోరు మీద ఉన్నారు త్రిష. తెలుగులో లేవు కానీ...తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా స్థానం సొంతం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా నటిస్తున్నారు. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్‌లో నటిస్తున్నారు పూజా హెగ్డే. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు. జోరుగా లేడీ సూపర్ స్టార్ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. నటిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. కథానాయికగా ఫుల్ క్రేజ్‌లో ఉన్నప్పుడే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో 2022 జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు నయనతార. వీరిద్దరికీ ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. తమిళంలో ‘టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, రాక్కాయీ’ వంటి సినిమాలతో పాటు పేరు పెట్టని మరో తమిళ చిత్రం, ‘డియర్ స్టూడెంట్’తో పాటు మరో మలయాళ మూవీ, ‘టాక్సిక్’ అనే కన్నడ సినిమాతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు నయనతార. అయితే 2022లో విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదామె.అరడజను సినిమాలతో‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే... నా మనసులోకి’ అంటూ రష్మికా మందన్నాని ఉద్దేశించి పాడుకుంటారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా వారిని ఆకట్టుకున్నారామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు ఈ కన్నడ బ్యూటీ. ఓ వైపు కథానాయకులకి జోడీగా నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. అదే విధంగా ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో హీరోయిన్గా చేశారు రష్మిక. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.ఇక సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. అదే విధంగా నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ హీరోయిన్గా నటించారు ఈ బ్యూటీ. మరోవైపు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు రష్మికా మందన్నా.ఏడు చిత్రాలతో బిజీ బిజీగా...మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. ‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు ఈ మలయాళ బ్యూటీ. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో తెలుగులోనే ఐదు చిత్రాలుండగా, ఓ హిందీ ఫిల్మ్, ఓ మలయాళ సినిమా కూడా ఉంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’, శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందుతున్న ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ‘హైందవ’, బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాల్లో నటిస్తున్నారు సంయుక్తా మీనన్. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారామె.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలాగే ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మోహన్‌లాల్ లీడ్ రోల్లో జీతూ జోసెఫ్ దర్వకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్తా మీనన్. ఇలా ఏడు సినిమాలతో ఫుల్ బీజీ బీజీగా ఉన్నారామె. హుషారుగా యంగ్ హీరోయిన్టాలీవుడ్లో మోస్ట్ సెన్సేషన్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ (2021) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ని సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ (2022) సినిమాతో తెలుగులో తొలి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల వరుస చిత్రాలతో యమా జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ చిత్రం ఉన్నాయి.నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’, రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు శ్రీలీల. అదే విధంగా శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె.హిందీలోనూ...దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతా రామం’ (2022) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు మృణాళ్ ఠాకూర్. ఆ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. మృణాళ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో ‘హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ ‘కల్కి: 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్ర చేశారు. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారారు. ఆమె హిందీలో ‘పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2’, తుమ్ హో తో’ వంటి చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా అడివి శేష్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు మృణాళ్ ఠాకూర్.రెండు తెలుగు... రెండు హిందీ ప్రేక్షకుల హృదయాల్లో అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీలో ఎంట్రీ ఇచ్చారు. యూత్ కలల రాణిగా మారారు ఈ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా నాలుగు సినిమాలుఉన్నాయి. వాటిలో రెండు తెలుగు కాగా రెండు హిందీ మూవీస్.రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 2’ సినిమా కూడా ఉండనే ఉంది. అదే విధంగా హిందీలో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి, పరమ్ సుందరి’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
బీచ్‌లో అనన్య నాగళ్ల చిల్.. స్టన్నింగ్ లుక్‌లో సలార్ నటి!
బీచ్‌లో అనన్య నాగళ్ల చిల్..స్టన్నింగ్ లుక్‌లో సలార్ నటి శ్రియా రెడ్డి..పింక్ డ్రెస్‌లో సింగర్ మధు ప్రియ పోజులు..బ్లూ డ్రెస్‌లో కాజల్ అగర్వాల్ క్రేజీ అవుట్‌ఫిట్..లేటేస్ట్ పిక్ షేర్ చేసిన మిహికా బజాజ్.. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
ఈ ముద్దుగుమ్మ చీరకడితే అలా చూస్తూ ఉండాల్సిందే
-
తెగ వైరల్ అవుతున్న అందాల తార సెబాస్టియన్ ఫొటోలు
-
వావ్.. గ్లామర్ షోతో అదరగొట్టిన హెగ్డే ఫోటోలు
-
తమన్నా భాటియా అందాల జాతర.. లెహంగా లుక్ అదిరిందిగా (ఫోటోలు)
-
వైట్ డ్రెస్ లో కియారా అద్వానీ.. కళ్లు చెదిరిపోయే క్లిక్స్
-
'అలాంటి వ్యక్తి అంటే చాలా ఇష్టం'.. రిలేషన్‌షిప్‌పై రష్మిక ఆసక్తికర కామెంట్స్
పుష్ప భామ రష్మిక మందన్నా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది పుష్ప-2తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలో బాలీవుడ్ చిత్రం ఛావాతో అభిమానులను పలకరించనుంది. ఇటీవల తన కాలికి గాయమైనప్పటికీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఛావా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన రిలేషన్షిప్ గురించి తొలిసారి ఓపెన్ అయిపోయింది.రష్మిక మాట్లాడుతూ.. " నా ఇల్లే అత్యంత సంతోషకరమైన ప్రదేశం. అది నాకు ఎప్పటికీ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. జీవితంలో గెలుపు అనేది వస్తూ, పోతూ ఉంటుంది. విజయమనేది మన లైఫ్‌లో శాశ్వతం కాదు. కానీ నా ఇల్లు ఎప్పటికీ శాశ్వతం. అందుకే అక్కడి నుంచే పనిచేస్తున్నా. అక్కడ నేను పొందిన ప్రేమ, కీర్తి ఎప్పటికీ గుర్తుంటాయి. ఒక వ్యక్తి పట్ల ఆకర్షణ విషయానికొస్తే తన కళ్లే ప్రధానమని నేను నమ్ముతా. అంతే కాదు తాను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను.. అంటే ఎప్పుడు స్మైలీ ఫేస్‌తో పాటు తన చుట్టు ఉన్నవారిని గౌరవించే వాళ్లంటే నాకు ఇష్టం.' అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.రిలేషన్‌పై రూమర్స్..కాగా.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ కూడా రిలేషన్ షిప్లో ఉన్నట్లు బయటికి చెప్పారు. అయితే ఎవరనేది మాత్రం పేరును వెల్లడించలేదు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ వివరాలను పంచుకుంటానని కూడా స్పష్టం చేశాడు.అయితే రష్మిక మందన్నా చాలాసార్లు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే పండుగ వేడుకల్లో మెరిసింది. గతేడాది విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. చాలాసార్లు తన ఫోటోలతో అభిమానులకు దొరికిపోయింది. విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదిక షేర్ చేస్తూనే ఉంటుంది. దీంతో విజయ్, రష్మిక రిలేషన్లో ఉన్నట్లు ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు రిలేషన్‌పై క్లారిటీ ఇస్తే కానీ వీటికి ఎండ్ కార్డ్ పడేలా కనిపించడం లేదు. కాగా.. ప్రస్తుతం రష్మిక నటిస్తోన్న ఛావా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. -
హిట్ మూవీతో హిట్ కొట్టేసిన అందాల భామ నువేక్ష (ఫోటోలు)
-
అనన్య నాగళ్ల కొత్త ఫోటోలు చూశారా? ఆహా అనిపించేలా అందాలు
-
నభా నటేశ్ ఓవర్ డోస్ గ్లామర్.. బుట్టబొమ్మ స్టన్నింగ్ పిక్స్
నభా నటేశ్ ఓవర్ డోస్ గ్లామరస్ పిక్స్..మరింత బోల్డ్నెస్తో బుట్టబొమ్మ పూజా హెగ్డే..గుర్రంపై మృణాల్ ఠాకూర్ సవారీ..అదిరిపోయే లుక్‌తో లక్ష్మీ రాయ్ పోజులు..సముద్రంలో చిల్ అవుతోన్న శిల్పా శెట్టి.. View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
పులిబిడ్డతో ఇనయ సుల్తానా ఆటలు (ఫోటోలు)
-
చీరకట్టులో అదిరేటి పోజులుతో ఈషా రెబ్బ (ఫోటోలు)
-
Malavika Mohanan: రాజాసాబ్‌లో ప్రభాస్‌తో జోడీ కట్టిన బ్యూటీ.. ఎంతందంగా ఉందో!(ఫోటోలు)
-
Pooja Hegde: రెడ్ మిర్చిలా ఘాటు రేపుతున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
-
తెలుగులో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ 'దియా మీర్జా' ఫోటోలు
-
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై( J. C. Prabhakar Reddy) ఫిల్మ్ ఛాంబర్లో నటి మాధవీలత(Madhavi Latha) ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజికి(Siva Balaji) పిర్యాదు పత్రాన్ని ఆమె అందజేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని తన సోషల్‌మీడియాలో ఆమె పేర్కొన్నారు.లేఖలో మాధవీలత పేర్కొన్న అంశాలు'జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.' అని ఆమె అన్నారు.మేము సినిమాల్లో నటిస్తే.. వాళ్లు సమాజంలో నటిస్తున్నారు: శివ బాలాజీ లేఖపై శివ బాలాజీ ఇలా స్పందించారు. 'మాధవీలత చాలా బాధతో ఉన్నారని అర్థమైంది. ఒక మహిళను బాధపెట్టడం ఎవరికీ మంచిది కాదు. ఒక పోస్టర్ చూసి అపార్థం చేసుకుని ఆమెపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడడం మానేసి ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు. ఎంతో మంది నటీనటులు పొలిటిషియన్స్ అయ్యారు. కానీ ఏ పొలిటిషియన్ కూడా పేరున్న యాక్టర్ కాలేదు. మేము కెమెరా ముందే నటిస్తాం. రాజకీయ నాయకులు సమాజంలో కూడా నటిస్తారు. ఇండస్ట్రీ జోలికి రాజకీయ నాయకులు రావొద్దు. మాధవిలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం'. అని ఆయన అన్నారు.(ఇదీ చదవండి: చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్‌కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌటేలా)సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద వ్యభి చారి అని, ఇలాంటి వ్యక్తులతోనా తమకు నీతులు చెప్పించేది అంటూ ఆయన ఒక సందర్భంలో ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.మాధవిపై జేసీ వ్యాఖ్యలు ఎందుకు చేశారు..?నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు.బెదిరేది లేదని ఘాటుగానే మాధవి రియాక్షన్అయితే, జేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారని ఆమె గుర్తుచేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు.మాధవికి క్షమాపణలు చెప్పిన జేసీతన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. 'ఆవేశంలో నోరు జారాను,టంగ్ స్లిప్ అయింది..సారీ'అని జేసీ అన్నారు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మాధవి కన్నీళ్లు పెట్టుకుని ఒక వీడియో పంచుకుంది. 'మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ..' కన్నీళ్లు పెట్టుకుంది. -
బీచ్ ఒడ్డున నివేదా.. బిగ్ బాస్ దివి చిల్
బీచ్ ఒడ్డున నివేదా థామస్..చిల్ అవుతోన్న బిగ్‌బాస్ దివి..యోగాసనాలతో బిజీగా మంచు లక్ష్మి..ఆధ్యాత్మిక యాత్రలో రేణు దేశాయ్..గోవాలో ఎంజాయ్ చేస్తోన్న కల్యాణి ప్రియదర్శన్..లండన్‌లో బాలీవుడ్ భామ నోరా ఫేతేహి.. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
మరోసారి మోకాళ్లపై 'తిరుమల కొండ' ఎక్కిన తెలుగు హీరోయిన్
సినిమాల కోసం మాత్రమే గ్లామర్ లుక్‌లో కనిపించే నందిని రాయ్(Nandini Rai) సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, ఆమెలో ఆధ్యాత్మికత చింతన చాలా ఎక్కువని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆమె చాలాసార్లు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో ఒకసారి మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నందిని.. తాజాగా మరోసారి మోకాళ్లపై అలిపిరి నుంచి తిరుమల కొండ (Tirumala Temple) చేరుకున్నారు. ఇన్‌స్టాలో ఎప్పుడూ ఆమె గ్లామర్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెలో దాగివున్న భక్తికి ఫిదా అవుతున్నారు.( ఇదీ చదవండి: గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటానో ఆ దేవుడికే తెలియాలి: రష్మిక)టాలీవుడ్లో చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించిన నందినీ రాయి.. బిగ్ బాస్ 2 తెలుగు సీజన్‌తో చాలామందికి దగ్గరైంది. అయితే, 2011లోనే 'ఫ్యామిలీ ప్యాక్' బాలీవుడ్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మాత్రం '040' మూవీతో అడుగుపెట్టింది. కోలీవుడ్‌లో విజయ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్‌కు జోడిగా నందిని రాయ్ నటించింది. తెలుగులో మాయ,మోసగాళ్లకు మోసగాడు,సిల్లీ ఫెలోస్,భాగ్ సాలే,శివరంజని వంటి చిత్రాల్లో ఆమె మెరిసింది.వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని నందిని రాయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. మోకాళ్ల పర్వతం వద్ద ఆమె కెమెరాలకు కనిపించారు. అక్కడ మోకాళ్లపై ఎక్కుతూ కనిపించడంతో చాలామంది అభినందించారు. అయితే, సుమారు రెండేళ్ల క్రితం కూడా నందిని రాయ్ మోకాళ్లపై నుంచే కొండ మీదకు వెళ్లి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆమె ఫోటోల కింద గోవిందా గోవిందా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో ..దివంగత నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో సినిమాల్లోకి వచ్చానని చెప్పిన నందిని రాయ్ పుట్టింది.. పెరిగింది... హైదరాబాద్‌లోనే. ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైంలోనే అంతర్జాతీయ మోడలింగ్‌గా పేరు సంపాదించుకున్నారు. 2009లో మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకున్నారు. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. తెలుగుతోపాటు ఓ తమిళ్, కన్నడ, మళయాళం చిత్రంలో ఆమె నటించారు.అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న నందినిగతంలో తను ఓ ఇంటర్వ్యూలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని ఇలా చెప్పింది. 'కెరియర్ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా' అని చెప్పింది. View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) క్షమాపణలు చెప్పారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో చేసిన కామెంట్స్‌పై సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన శ్రీముఖి నిర్మాత దిల్ రాజు, శిరీష్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలోనే రామ, లక్ష్మణుల పేర్లను కూడా ప్రస్తావించింది. దీంతో అది కాస్తా వివాదానికి దారితీసింది.అసలేం జరిగిందంటే..'నిర్మాతలు దిల్ రాజు(dil raju), శిరీష్‌ను పొగిడే క్రమంలో.. రామ, లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్(ఊహజనిత పాత్రలు) అని మనం విన్నాం.. కానీ సాక్షాత్తూ ఇప్పుడు నా కళ్లముందే కూర్చున్నారు.. వారిలో ఒకరు దిల్ రాజు అయితే.. మరొకరు శిరీష్ గారు అంటూ ప్రశంసలు కురిపించింది'.రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనడంతో శ్రీముఖి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నీకు రామాయణం తెలుసా? అని చాలామంది ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే శ్రీముఖి క్షమాపణలు కోరుతూ వీడియోను రిలీజ్ చేసింది.వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ..' రీసెంట్ టైమ్స్‌లో నేను హోస్ట్ చేసిన ఓ ఈవెంట్లో పొరపాటున రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం జరిగింది. నేను ఒక హిందువునే.. నేను దైవ భక్తురాలినే.. అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంతగా జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే మీ అందరికీ క్షమాపణ కోరుతున్నా. దయచేసి మీరంతా పెద్ద మనసుతో నన్న క్షమిస్తారని వేడుకుంటున్నా.. జై శ్రీరామ్' అంటూ మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొంగల్ బరిలో సంక్రాంతికి వస్తున్నాం..వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసి, చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిజామాబాద్‌లో నిర్వహించారు. 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్ర కేవలం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’((Sankranthiki Vasthunnam Movie) జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందట.అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్‌కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అన్నారు. "I will file a case if you don't apologise for this comments" @MukhiSree https://t.co/VbhguoJwqI— Siri Vennela Goud Palle (@VennelaPalle) January 8, 2025 View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
రీతూ చౌదరికి ఆల్రెడీ పెళ్లయిందా? అందుకేనా ఆ సలహా! (ఫోటోలు)
-
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్‌పై ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్‌బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్‌బాబు. రాజమౌళి డైరెక్షన్‌లోని కొత్త సినిమా కోసమే మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్‌తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్‌లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్‌తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్‌తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్‌తో మరో గెటప్‌లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్‌చరణ్ క్లీన్ షేవ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్‌తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్‌చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్‌తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్‌చరణ్ హెయిర్ స్టైల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్‌కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్‌లో ఫుల్ వైట్ హెయిర్‌తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్‌తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్‌లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్‌స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్‌లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్‌లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్‌కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్‌తో, కరెక్ట్ ఫిజిక్‌తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్‌లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్‌గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్‌ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్‌లో.. మాసీ లుక్స్‌తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్‌లో నటించాలంటే స్పెషల్‌గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్‌గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్‌నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్‌తో, స్ట్రాంగ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో స్టార్స్.. ప్రభాస్ ఎక్కడంటే..?
2024కి బై చెప్పి... 2025కి వెల్కమ్ చెప్పడానికి అందరూ సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కొందరు స్టార్స్ అయితే కొత్త సంవత్సరం జరుపుకోవడానికి విదేశాలు వెళ్లారు. షూటింగ్స్‌కి కాస్త విరామం దొరకడంతో వెకేషన్ ప్లాన్ చేసుకునే అవకాశం ఈ స్టార్స్‌కి దక్కింది. వారి ఈ వెకేషన్ గురించి తెలుసుకుందాం...ఈ ఏడాది మహేశ్‌బాబు ఇప్పటికే రెండుసార్లు జర్మనీ వెళ్లొచ్చారు. అయితే ఇది హాలిడే ట్రిప్ కాదు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ప్రిపరేషన్లో భాగంగా జర్మనీ వెళ్లారని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఏడాది మహేశ్‌బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫారిన్లో జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా ఫారిన్లోనే మహేశ్‌బాబు ప్లాన్ చేశారని సమాచారం. మహేశ్‌బాబు మోస్ట్లీ యూరప్‌కు వెళ్లనున్నారట. ఇక ప్రభాస్ ఆల్రెడీ యూరప్‌లో ఉన్నారని తెలిసింది. ఇటీవల ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రభాస్ కాలికి గాయమైంది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. యూరప్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని, ప్రభాస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే అని టాక్. విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘రాజా సాబ్, ఫౌజి’ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చిత్రాన్ని ఆరంభిస్తారు ప్రభాస్. ఇక ‘దేవర’ సక్సెస్ జోష్‌లో ఉన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్ ‘వార్ 2’ (ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో) లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు చెందిన ఓ లెంగ్తీ షూట్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారని తెలిసింది. సో... ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లండన్‌లోనే అని ఊహించవచ్చు. లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్‌తో ఎన్టీఆర్ బిజీ అవుతారట. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హీరోయిన్ పూజా హెగ్డే స్పెయిన్ వెళ్లారు. రష్మికా మందన్నా ఆల్రెడీ ఫారిన్లోనే ఉన్నారని తెలిసింది. హీరోయిన్ తమన్నా, ఫరియా అబ్దుల్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను అమెరికాలో ప్లాన్ చేశారని తెలిసింది. వీరితో పాటు మరి కొందరు టాలీవుడ్ యాక్టర్స్ గోవా, మాల్దీవ్స్‌లో వేడుకలు ప్లాన్ చేశారని సమాచారం. భర్త విఘ్నేష్ శివన్‌తో నయనతార దుబాయ్ వెళ్లారు. అక్కడే మాధవన్, ఆయన భార్య సరిత కూడా ఉన్నారు. సో... ఈ రెండు ఫ్యామిలీస్ ఒకే చోట వేడుక చేసుకోనున్నారు. కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ట్ హీరో హృతిక్ రోషన్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్పాట్‌గా దుబాయ్‌నే ఎంచుకున్నారు. ఇంకా ఫ్యామిలీతో కలిసి దియా మీర్జా శ్రీలంక వెళ్లారు. అర్జున్ రాంపాల్ సెలబ్రేషన్స్ గోవాలో జరుతాయని సమాచారం. ఫ్యామిలీతో కలిసి కరీనా కపూర్ స్విట్జర్లాండ్‌లో, శిల్పాశెట్టి లండన్‌లో, భర్త జహీర్ ఇక్భాల్‌తో కలిసి హీరోయిన్ సోనాక్షీ సిన్హా ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ ఫిన్‌ల్యాండ్ వెళ్లారు. -
Year Ender 2024: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సీనీ తారలు వీళ్లే
‘శ్రీరస్తూ శుభమస్తు... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం... ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’... ‘పెళ్ళి పుస్తకం’ చిత్రంలోని ఈ పాట తెలుగింటి పెళ్లి వేడుకల్లో వినబడుతుంటుంది. 2024లో పెళ్లితో ‘కల్యాణం... కమనీయం...’ అంటూ తమ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన స్టార్స్ చాలామందే ఉన్నారు. ఇక ఏయే తారలు ఏయే నెలలో, ఏ తేదీన పెళ్లి చేసుకున్నారనే విశేషాలు తెలుసుకుందాం.ఫిబ్రవరిలో... నార్త్, సౌత్‌లో హీరోయిన్గా ఓ మంచి స్థాయికి వెళ్లిన ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది ఇంటి కోడలు అయ్యారు. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 21న ఆమె ఏడడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. పెద్దల సమ్మతితో గోవాలో పెళ్లి చేసుకున్నారు. మార్చిలో... పంజాబీ భామ కృతీ కర్బందా, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో మార్చి 15న ఏడు అడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. గుర్గావ్లో వీరి వివాహం జరిగింది. ⇒ సౌత్, నార్త్‌లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోని 23న వివాహం చేసుకున్నారు. పదేళ్లు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. జూన్‌లో... నటుడు అర్జున్ పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్యా అర్జున్, తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతిల వివాహం చెన్నైలో జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఐశ్వర్య–ఉమాపతి పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షీ సిన్హా, బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. 23న వీరి వివాహం ఘనంగా జరిగింది. జూలైలో... వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రేమికుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలయ్ సచ్దేవ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో థాయ్‌ల్యాండ్‌లో 2న వీరి పెళ్లి జరిగింది. ఆగస్టులో... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో తెలుగులో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. రీల్ లైఫ్‌లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్‌లో భార్యాభర్తలయ్యారు. ఆ మూవీ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కర్నాటకలోని కూర్గ్‌లో 22న కిరణ్–రహస్య వివాహం చేసుకున్నారు. సెప్టెంబరులో... హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. వీరి వివాహం 15న చెన్నైలో ఘనంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో మేఘా ఆకాశ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో ఏడడుగులు వేశారు. ⇒ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో సిద్ధార్థ్, హీరో యిన్ అదితీరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తొలుత తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో మార్చి 27న, ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో సెప్టెంబరు 16న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబరులో... ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి పీటలెక్కారు. డాక్టర్ ప్రీతీ చల్లాతో 11న ఆయన ఏడడుగులు వేశారు. ‘వేదం, గమ్యం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు క్రిష్. ప్రీతీతో ఆయన వివాహం హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ⇒ తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి 15న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న సుబ్బరాజు పెళ్లి పీటలెక్కారు. స్రవంతితో ఆయన ఏడడుగులు వేశారు. 26న వీరి వివాహం జరిగింది. డిసెంబరులో.. హీరో అక్కినేని నాగచైతన్య– హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక పెళ్లి పందరిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా చైతన్య–శోభితల పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లి పీటల వరకూ వచ్చింది. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ⇒ ‘కలర్ ఫొటో’ (2020) సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావుతో కలిసి ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమలలో 7న వీరి వివాహం జరిగింది. ‘కలర్ ఫొటో’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో ఆయన పెళ్లి జరగడం విశేషం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ⇒ ‘నువ్వేకావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సాయికిరణ్. ఆ తర్వాత సీరియల్స్ వైపు వెళ్లిన ఆయన బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెల 9న ఆయన స్రవంతి అనే సీరియల్ ఆర్టిస్ట్‌ని వివాహం చేసుకున్నారు. ⇒ మహానటిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో ఈ నెల 12న ఏడడుగులు వేశారు. వీరిద్దరి మధ్య 15 ఏళ్లుగా స్నేహం, ప్రేమ కొనసాగుతోంది. ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో గోవాలో వీరి వివాహం జరిగింది. ⇒ ‘మత్తు వదలరా, మత్తు వదలరా 2’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీసింహా (సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు). ఆయన వివాహం నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో దుబాయ్‌లో 14న జరిగింది. ⇒ ఇలా 2024లో ఎక్కువమంది తారలు వివాహబంధంలోకి అడుగుపెట్టం విశేషం. -
శాంటా లుక్‌లో ఉప్పెన బ్యూటీ.. నా సామిరంగ హీరోయిన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్
శాంటాక్లాజ్ లుక్‌లో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి..క్రిస్మస్ సెలబ్రేషన్స్ నా సామిరంగ హీరోయిన్..ఆదిపురుష్ భామ క్రిస్మస్ లుక్..మరింత హాట్ హాట్‌గా పూనమ్ బజ్వా..బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి?: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
హీరోయిన్, నటి రేణుక దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. అయితే రేణు ప్రస్తుతం ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు.ఇక సినిమాల విషయం పక్కనపెడితే రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలని అందరికీ తెలిసిందే. పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ అవగాహన కల్పిస్తూనే ఉంటుంది. అంతేకాదు.. క్యాట్స్, డాగ్స్ కోసం ప్రత్యేకంగా షెల్టర్ హోమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. వాటికోసం ప్రత్యేకంగా ఒక ఎన్జీవోను స్థాపించింది. తన పిల్లల పేరు మీదే షెల్టర్ హోమ్ ఏర్పాటు చేసిన రేణు దేశాయ్ ఆంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతలా మూగజీవాల కోసం తనవంతు కృషి చేస్తోంది.మూగజీవాలంటే తన ప్రాణంగా భావించే రేణు దేశాయ్‌కి ఓ వ్యక్తి చేసిన పని విపరీతమైన కోపం తెప్పించింది. ఓ చిన్న కుక్క పిల్లను కాలితో తన్నుతో ఆ వ్యక్తి కనిపించాడు. అక్కడే దూరంగా ఉన్న కుక్క పిల్ల తల్లి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన తన బిడ్డను రక్షించుకుంది. ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన రేణు.. ఇలాంటి వాళ్లను ఏం చేయాలి ఫ్రెండ్స్? అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూస్తుంటే తనకు మూగజీవాలపై ఉన్న ప్రేమ ఏంటో ఎవరికైనా అర్థమవుతుంది. -
13 ఏళ్లకే నటన.. లైఫ్ మార్చిన కాలేజీ సినిమా.. తమన్నా గురించి ఇవి తెలుసా? (ఫోటోలు)
-
వెన్నెలనీ దోచినదీ నీవేనా.. నవయవ్వనంగా మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఎవరు? (ఫోటోలు)
-
ప్రొఫెషనల్ బాక్సర్.. అనుకోకుండా స్టార్ హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
అసలే దురదృష్టం.. ఆపై యాక్సిడెంట్.. ఈ హీరోయిన్‌కి అన్నీ కష్టాలే! (ఫొటోలు)
-
టీనేజీలోనే టాలీవుడ్ హీరోయిన్గా.. ఇప్పుడేమో అలా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
రెడ్ గులాబీలా మెరిసిపోతున్న నభా నటేశ్.. యూత్ ఐకాన్‌గా లైగర్ భామ!
మాల్దీవుస్‌లో చిల్ అవుతోన్న హన్సిక..బ్లూ డ్రెస్‌లో సోనాలి బింద్రే హోయలు..వైట్ డ్రెస్‌లో అనన్య నాగళ్ల బ్యూటీ లుక్స్..యూత్ ఐకాన్‌గా లైగర్ భామ అనన్య పాండే..శారీలో జాన్వీకపూర్ సిస్టర్ ఖుషీకపూర్ హోయలు..రెడ్ గులాబీ మెరిసిపోతున్న నభా నటేశ్.. View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) -
వైట్ శారీలో ఆర్జీవీ హీరోయిన్.. మరింత క్యూట్‌గా ఆషిక రంగనాథ్!
వైట్ శారీలో ఆర్జీవీ శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి స్టన్నింగ్ లుక్స్...ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వేడుకలో మెరిసిన ప్రియమణి..నా సామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్ క్యూట్ లుక్స్...ఈ కోట తనకెంతో ప్రత్యేకమన్నా ఆదితి రావు హైదరీ..ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌తో లైగర్ భామ అనన్యపాండే..తెల్లటి చీరలో శ్రీలీల స్మైలీ లుక్స్.. బంగారం లాంటి చీరలో మెరిసిన శ్రియా శరణ్.. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Manoj Kumar Katokar (@media9manoj) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) -
సరికొత్త కాన్సెప్ట్‌తో ఎంఫోర్ఎం.. ఫస్ట్ రోజే లక్ష గెలిచే ఛాన్స్!
జో శర్మ, సంబీత్ ఆచార్య జంటగా నటిస్తోన్న చిత్రం 'ఎంఫోర్ఎం'. ఈ చిత్రానికి మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు డైరెక్టర్ తెలిపారు. సినీ చరిత్రలో ఇప్పటివరకు రానీ కాన్సెప్టుతో ఈ సినిమా చేసినట్లు వెల్లడించారు. రాబోయే పదేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారనే నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ.. 'ఇటీవల హిందీ ట్రైలర్ గోవా ఫిలిం ఫెస్టివల్లో విడుదల చేశాం. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మా సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాం. హీరోయిన్ జో శర్మ తన ఫర్మార్మెన్స్‌తో సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించాం. కథ, కథనాలను నమ్ముకునే సినిమా తీశాం. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే చూసి ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కోక్కరికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.కాగా.. ఈ చిత్రంలో శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ, ఎంఆర్సీ వడ్లపట్ల, పసునూరి శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి వసంత్ సంగీతమందిస్తున్నారు. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించారు. -
బై మిస్టేక్ హీరోయిన్.. లేదంటే కారు రేసర్! ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ తారలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా హేమ, సురేఖవాణి!
-
వింటేజ్ అవుట్‌ఫిట్‌లో తంగలాన్ బ్యూటీ.. గ్రీన్ శారీలో సంయుక్త మీనన్!
వింటేజ్ అవుట్‌ఫిట్‌లో తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్..బుల్లితెర బ్యూటీ జ్యోతి కిల్లింగ్ లుక్స్...బ్లాక్ బ్యూటీలా మారిపోయిన మిల్కీ బ్యూటీ తమన్నా..గ్రీన్ శారీలో సంయుక్త మీనన్ హోయలు..బుట్టబొమ్మ పూజా హేగ్డే క్రేజీ లుక్స్... View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ramya Krishnan (@meramyakrishnan) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఉదయ్ కిరణ్‌తో మొదటి సినిమా!
ప్రముఖ బుల్లితెర నటి అదితి దేవ్ శర్మ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు జన్మించిందని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. తన రాక కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశామంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన భర్తతో దిగిన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.కాగా.. 2014లో బుల్లితెర నటుడు సర్వర్ అహుజాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నారు. హిందీలో టీవీ సీరియల్స్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆదితి శర్మ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండె ఝల్లుమంది మూవీతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఓం శాంతి, బబ్లూ లాంటి చిత్రాల్లో మెరిసింది. బుల్లితెర నటిగా గంగా, సిల్సిలా బదల్తే రిష్టన్ కా, కథా అంకాహీ సీరియల్స్‌లో పాత్రలకు గుర్తింపు తెచ్చుకుంది. గంగా, కథా అంకహీ లాంటి టీవీ షోలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆదితి శర్మ హిందీ, తెలుగు చిత్రాలతో పాటు పంజాబీ సినిమాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Aditi Sharma (@aditidevsharma) -
అదే ట్రెండ్ ఫాలో అవుతోన్న నాగచైతన్య- శోభిత!
మరి కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ హీరో నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. డిసెంబర్ 4న వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా శోభిత- చైతూ ఒక్కటి కానున్నారు. ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ నడుస్తోంది. తమ పెళ్లి వేడుక చిరకాల గుర్తుండిపోయేలా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే గ్రాండ్ వెడ్డింగ్‌ను ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. గతంలోనూ హన్సిక, నయనతార సైతం ఇదే ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. వీరిద్దరి బాటలోనే శోభిత- నాగచైతన్య నడుస్తున్నట్లు సమాచారం. తమ పెళ్లి వేడుకను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్‌తోపాటు మరికొన్ని ఓటీటీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవల కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.కాగా.. అన్నపూర్ణ స్టూడియోస్‌లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వీరి పెళ్లి వేడుకను సిద్ధం చేశారు. తాతయ్య ఆశీస్సుల కోసమే ఇరు కుటుంబాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగచైతన్య వెల్లడించారు. పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరాడని నాగార్జున తెలిపారు. అందుకే పెళ్లి పనులు కూడా వారిద్దరే చూసుకుంటున్నారని పేర్కొన్నారు. -
పురాతన ఆలయంలో పెళ్లి.. ముందుగా ప్లాన్ చేయలేదు: ఆదితిరావు హైదరీ
కోలీవుడ్ సిద్ధార్థ్ - అదితిరావు హైదరీ ఈ ఏడాదిలో వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే తాజాగా సాహిత్య ఆజ్‌తక్ -2024 సదస్సుకు హాజరైన ఆదితిరావు హైదరీ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాము కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే మా పెళ్లి కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్ చేయలేదని పేర్కొంది. 400 ఏళ్లనాటి ఆలయం మా తాత, నానమ్మకు సెంటిమెంట్.. అక్కడే పెళ్లి చేసుకుంటే వారి ఆశీర్వాదాలు ఉంటాయని అన్నారు. మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం.. ఆమె హైదరాబాద్‌లో పాఠశాలను ప్రారంభించిందని ఆదితిరావు తెలిపింది.ఆదితి రావు హైదరీ మాట్లాడుతూ.. 'మా పెళ్లి పెద్దగా ప్లాన్ చేయలేదు. పెళ్లి జరిగిన ఆలయం మా పూర్వీకులు కట్టారు. దాదాపు 400 ఏళ్లుగా మా కుటుంబంలో భాగంగా ఉంది. అంతేకాదు ఆ ఆలయం నా కుటుంబంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అలాగే నానా, నానమ్మకు చాలా ఇష్టమైన గుడి. అందుకే అక్కడ వివాహం చేసుకోవడం వారికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. వారి ఆశీస్సులు కూడా మాకు అందాయి' అని తెలిపింది.కాగా.. ఆదితి రావు హైదరీ ఈ ఏడాది హీరామండి వెబ్ సిరీస్‌లో కనిపించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. -
బుంగమూతితో క్యూట్‌గా ఉప్పెన భామ.. నా సామిరంగ హీరోయిన్ నాటీ లుక్స్!
నా సామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్ క్యూట్ లుక్స్..సెల్ఫీలవ్ అంటోన్న సారా అలీఖాన్..నవంబర్ మెమొరీస్ షేర్ చేసిన శ్రద్ధాదాస్..బంగారం లాంటి శారీలో అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత..బుంగమూతితో మరింత క్యూట్‌గా ఉప్పెన భామ కృతిశెట్టి.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
బర్త్ డే మూడ్‌లో బుల్లితెర బ్యూటీ.. బ్లాక్ డ్రెస్‌లో రామ్ చరణ్ హీరోయిన్!
బర్త్ డే మూడ్‌లో బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ..బ్లాక్ బ్యూటీలా ఎవడు హీరోయిన్ అమీ జాక్సన్..చిల్ అవుతోన్న హీరోయిన్ హన్సిక.. గ్రీన్ డ్రెస్‌లో విష్ణుప్రియ లేటేస్ట్ లుక్స్ View this post on Instagram A post shared by Ritesh Deshmukh - रितेश विलासराव देशमुख (@riteish) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) -
చీరలో ముద్దుగుమ్మలా అలరిస్తున్న మేఘా ఆకాష్ (ఫోటోలు)
-
జిగేల్మనే అందాలతో ట్రెండింగ్‌లో హన్సిక మోత్వానీ (ఫోటోలు)
-
సరికొత్త ఫ్యాషన్‌తో శోభిత ధూళిపాళ్ల.. రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్స్!
సరికొత్త ఫ్యాషన్ లుక్‌లో శోభిత ధూళిపాళ్ల..రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్...ఆ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుందన్న రష్మిక మందన్నాకలర్ఫుల్ డ్రెస్‌లో హన్సిక మోత్వానీ హోయలు..శారీలో మెరిసిపోతున్న మేఘా ఆకాశ్.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
హీరోయిన్ శ్రీదేవి భర్త - కూతురిని చూశారా? క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
తెలుగు హీరోతో పెళ్లి.. రెండేళ్లకే విడాకులు.. ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
హల్లో హీరోయిన్ గారు.. నెక్ట్స్ ఏంటి?
‘వాట్ నెక్ట్స్’ అంటూ కొందరు స్టార్ హీరోయిన్ల అభిమానులు ప్రశ్నించుకుంటున్నారు. కారణం ఆ కథానాయికలు తెలుగులో కొత్త సినిమా ఏదీ సైన్ చేయకపోవడమే. అభిమాన నాయికలు వేరే భాషల్లో సినిమాలు చేసినా తెలుగు తెరపై కనిపించక΄ోతే టాలీవుడ్ ఫ్యాన్స్‌కి నిరుత్సాహంగానే ఉంటుంది. మరి... టాలీవుడ్లో కొత్త సినిమా అంగీకరించని ఆ తారల గురించి తెలుసుకుందాం. మా ఇంటి బంగారం ఏమైంది? తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సమంత. టాలీవుడ్లో మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ, శర్వానంద్ వంటి హీరోలకి జోడీగా నటించి సందడి చేశారామె. అలాగే ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ అలరించారీ బ్యూటీ. విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ సినిమా తర్వాత సమంత నటిస్తున్న తెలుగు చిత్రంపై ఎలాంటి స్పష్టత లేదు. ‘ఖుషి’ 2023 సెపె్టంబరు 1న విడుదలైంది. ఈ మూవీ రిలీజై ఏడాది దాటిపోయినా ఇప్పటికీ తెలుగులో మరో సినిమాకి పచ్చజెండా ఊపలేదు సమంత. అయితే ‘మా ఇంటి బంగారం’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటించనున్నట్లు ప్రకటించారు సమంత. ఈ సినిమాని తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించారు కూడా. తన బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న విడుదల చేసిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం పోస్టర్ చూస్తే ఆమె గృహిణి పాత్రలో కనిపిస్తారని తెలిసింది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అనే విషయాన్ని ప్రకటించలేదు. అలాగే సమంత బర్త్ డే తర్వాత ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా సెట్స్‌పై ఉందా? లేదా అనే సందేహం సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఖుషి’ సినిమా తర్వాత సమంత నటిస్తున్న తెలుగు చిత్రం ఏది? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే హిందీలో సమంత నటించిన ‘సిటాడెల్: హనీ–బన్నీ’ వెబ్ సిరీస్ ఈ నెల 6 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు సమంత. అక్కడ ఫుల్... ఇక్కడ నిల్టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’(2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారామె. ఆ తర్వాత ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోల సరసన సినిమాలు చేశారు పూజా హెగ్డే. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు పూజ. ఈ మూవీలో రామ్‌చరణ్‌కి జోడీగా నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘ఎఫ్ 3’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో మెరిశారు. అయితే ‘ఆచార్య’ విడుదలై రెండున్నరేళ్లు అవుతున్నా హీరోయిన్గా మరో తెలుగు చిత్రం కమిట్ కాలేదు పూజా హెగ్డే. ఈ గ్యాప్‌లో హిందీ సినిమాలు చేశారామె. షాహిద్ కపూర్, పూజా హెగ్డే జోడీగా రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించిన ‘దేవ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ 69వ చిత్రం, సూర్య 44వ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు పూజ. అయితే తెలుగులో ఒక్క సినిమా కూడా కమిట్ కాకపోవడంతో ఆమె అభిమానులు నిరాశగా ఉన్నారు. మహానటి అక్కడ బిజీ ‘నేను శైలజ’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు కీర్తీ సురేశ్. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా 2016 జనవరి 1న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘నేను లోకల్ (నాని), అజ్ఞాతవాసి(పవన్ కల్యాణ్), మహానటి, మిస్ ఇండియా, రంగ్ దే (నితిన్), గుడ్ లక్ సఖి, సర్కారువారి పాట (మహేశ్ బాబు), దసరా (నాని), భోళా శంకర్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. మహానటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ‘మహానటి’ (2018) చిత్రంలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు కీర్తీ సురేశ్. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారామె. ‘భోళా శంకర్’ సినిమాలో హీరో చిరంజీవికి చెల్లెలుగా నటించారు కీర్తి. ఆ సినిమా 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఆ మూవీ తర్వాత మరో తెలుగు చిత్రానికి కీర్తీ సురేష్ పచ్చజెండా ఊపలేదు. అయితే ఈ గ్యాప్‌లో తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారామె. అంతేకాదు.. ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తి. ఈ చిత్రంలో హీరో వరుణ్ ధావన్‌కి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తెలుగులో కీర్తీ సురేష్ నటించనున్న సినిమా ఏంటి? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బేబమ్మకి గ్యాప్ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా అభిమానం సొంతం చేసుకున్నారు కృతీ శెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారామె. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా 2021 ఫిబ్రవరి 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత నాని (శ్యామ్ సింగరాయ్), నాగచైతన్య(బంగార్రాజు, కస్టడీ), రామ్ (ది వారియర్), నితిన్ (మాచర్ల నియోజక వర్గం), సుధీర్ బాబు (ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి), శర్వానంద్(మనమే) వంటి యువ హీరోలకి జోడీగా నటించారు కృతీ శెట్టి. ‘మనమే’ సినిమా ఈ ఏడాది జూన్ 7న రిలీజైంది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఆర్నెళ్లు కావస్తున్నా తెలుగులో ఇప్పటికీ మరో సినిమా కమిట్ కాలేదామె. టొవినో థామస్ హీరోగా నటించిన ‘ఏఆర్ఎమ్’ సినిమా ద్వారా మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతీ శెట్టి తమిళ చిత్ర పరిశ్రమలోనూ అడుగుపెడుతున్నారు. వరుసగా మూడు సినిమాలు (వా వాతియార్, లవ్ ఇన్య్సూరెన్స్ కంపెనీ, జీనీ) వంటి చిత్రాల్లో నటిస్తూ దూసుకెళుతున్నారీ బ్యూటీ. కోలీవుడ్‌లో బిజీగా ఉండటంతో తెలుగులో ఆమె కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదా? అనేది వేచి చూడాలి. నాలుగో సినిమా ఏంటి? తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు మృణాళ్ ఠాకూర్. ‘సీతా రామం’ (2022) సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారామె. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు మృణాళ్. ఆ తర్వాత నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అతిథి పాత్రతో ఆకట్టుకున్నారు. ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజైంది. ఆ సినిమా విడుదలై ఏడు నెలలు దాటినా ఆమె నటించనున్న మరో తెలుగు చిత్రంపై స్పష్టత లేదు. ఈ బ్యూటీ తెలుగులో ఏ సినిమాకి కమిట్ కాకపోయినా బాలీవుడ్లో మాత్రం దూసుకెళుతున్నారు. ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు మృణాళ్. అయితే రాఘవా లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆర్ఎల్ 25’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి.. మృణాళ్ ఠాకూర్ తర్వాతి తెలుగు సినిమా ఏంటి? అంటే వేచి చూడాలి. ఈ కథానాయికలే కాదు... మెహరీన్, డింపుల్ హయతి వంటి మరికొందరు హీరోయిన్లు నటించనున్న కొత్త తెలుగు సినిమాలపైనా స్పష్టత లేదు. -డేరంగుల జగన్ -
అనన్య నాగళ్ల గొప్పమనసు.. అలాంటి వారికోసం తానే స్వయంగా!
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవలే పొట్టేల్ మూవీతో అభిమానులను అలరించింది. సాహిత్ మోత్కూరి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మూవీలో అనన్య నటిస్తోంది. ఎస్డీటీ18 వర్కింగ్ టైటిల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.అయితే తెలుగమ్మాయి అయిన అనన్య సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ముందుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో అభాగ్యులకు అండగా నిలిచారు. అసలే చలికాలం.. రోడ్లపై ఎక్కడపడితే ఎంతోమంది నిరాశ్రయులు నివసిస్తున్నారు. అలాంటి వారికోసం తానే స్వయంగా దుప్పట్లు అందించింది. బస్టాండ్‌లో నిద్రిస్తున్న వారికి తన వంతుసాయంగా వారికి దుప్పట్లు అందజేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ అనన్య చేసిన మంచిపనికి అభినందిస్తున్నారు. కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అనన్య ప్రధాన పాత్రలో తంత్ర మూవీతో ఆకట్టుకుంది. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. A warm gesture by @AnanyaNagalla as she distributes blankets to those in need 😍Truly Heartwarming #Humanity 💫#AnanyaNagalla 🫶🏻pic.twitter.com/JQQsbxaYWU— #𝐒𝐫𝐢𝐧𝐢𝐯𝐚𝐬 (@srinureddypalli) November 12, 2024 -
పర్వతాల్లో చిల్ అవుతోన్న సంయుక్త మీనన్.. రెడ్ డ్రెస్‌లో తాప్సీ !
రెడ్ డ్రెస్‌లో తాప్సీ పన్ను హోయలు..భూటాన్ పర్వతాల్లో చిల్ అవుతోన్న సంయుక్త మీనన్..మెహందీ లుక్ అంటోన్న మేఘా ఆకాశ్..బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్..క మూవీ హీరోయిన్ లేటేస్ట్ స్టిల్స్.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) -
చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ ఛాన్స్ ఇవ్వట్లేదు.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ముత్యం లాంటి నవ్వుతో ప్రియాంక మోహన్.. చూస్తే ఫిదానే! (ఫొటోలు)
-
గులాబీ రంగు చీరలో అందాల ‘రాశీ’ ఖన్నా (ఫొటోలు)
-
అనుష్క శెట్టి బర్త్ డే.. అరుంధతిని మరిపిస్తోన్న గ్లింప్స్!
టాలీవుడ్ స్వీటీ అనుష్క బాహుబలి తర్వాత పెద్దగా సినిమాలు చేయడం లేదు. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ద్వారా ప్రేక్షరులను పలకరించింది. ఆ తర్వాత మళ్లీ ఏ ప్రాజెక్ట్‌లోనూ కనిపించలేదు. దీంతో అనుష్క ఫ్యాన్స్ సినిమాలకు గుడ్ బై చెప్పేయనుందా అన్న డైలామాలో పడ్డారు.అయితే ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా అనుష్క ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె నటిస్తోన్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఘాటీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. దాదాపు 47 సెకన్ల పాటు ఉన్న గ్లింప్స్ అనుష్క ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో కొడవలి పట్టుకున్న అనుష్క ఫుల్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టేశారు. ఈ సినిమాను మహిళ ఓరియంటెడ్ కథగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క పాత్ర చూస్తుంటే ఓ రేంజ్లో ఉండనుందని గ్లింప్ల్తోనే అర్థమవుతోంది. మరోసారి అరుంధతి రేంజ్ నటనను ఘాటీ గుర్తుకు తెచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. -
దీపావళి పటాకా మాదిరి గ్లామర్‌తో పేల్చేసిన హన్సిక (ఫోటోలు)
-
సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్.. కెరీర్ డౌన్ ఫాల్.. మెహ్రీన్ ఇప్పుడేం చేస్తోంది? (ఫొటోలు)
-
నాన్న చనిపోయిన నెలకే అమ్మ తీసుకున్న నిర్ణయంతో బంధువులు దూరమయ్యారు: మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
మినీ సంక్రాంతిగా నవంబర్ సీజన్
-
ట్రెడిషినల్ లుక్‌లో హీరోయిన్ ప్రణీత (ఫోటోలు)
-
రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. ఆ టాలీవుడ్ హీరో ఇంట్లోనే!
పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియావ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న బ్యుటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం పుష్ప-2తో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా మెప్పించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీపావళి సందర్భంగా పుష్ప-2 పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.అయితే ఈ ముద్దుగుమ్మ దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాలో పంచుకుంది. దీపాలు పళ్లెంలో పట్టుకుని సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. అంతే కాకుండా పిక్ క్రెడిట్స్ ఆనంద్ దేవరకొండ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అంటే దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించారు. గతంలోనూ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలా ఎప్పుడెళ్లినా ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోయింది. ఈ సారి కూడా దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ జంట తమ రిలేషన్‌పై ఎక్కడా కూడా బయటికి చెప్పలేదు. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
చిన్న తప్పుతో టాలీవుడ్‌కి దూరం.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ.. ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
శోభిత ధూళిపాళ్ల దీపావళి విషెస్.. ఆ ఫోటోను షేర్ చేస్తూ!
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలోనే అక్కినేని వారి కోడలు కానుంది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి పీటలెక్కనుంది. వీరి పెళ్లి తేదీపై ఇప్పటికే అక్కినేని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 4న పెళ్లి వేడుక జరగనుందని ప్రకటించారు. ఇటీవల ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లోనూ శోభిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాబోయే కోడలిని చిరంజీవికి నాగార్జున పరిచయం చేశారు.ఈరోజు దీపావళి సందర్భంగా శోభిత ఇన్‌స్టా ద్వారా విషెస్ తెలిపింది. టపాసులపై తన ఫోటోను ముద్రించి ఉన్న వాటిని షేర్ చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపింది. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పెళ్లి పనులతో బిజీగా శోభిత..శోభితా ధూళిపాళ్ల ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పసుపు దంచుతూ పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. త్వరలోనే జరగనున్న చైతూ- శోభిత గ్రాండ్ వెడ్డింగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరి పెళ్లి వేదిక ఎక్కడనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. -
ప్రేమకు వ్యతిరేకం కాదు.. అలాంటి వ్యక్తికే నా లైఫ్‌లో చోటు: నిత్యా మీనన్
టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ధనుశ్ హీరోగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు జంటగా రుచిత్రంబలం (తెలుగులో ‘తిరు’) మూవీలో నటించారు. ఈ సినిమాలో నటనకు గానూ నిత్యాకు జాతీయ ఉత్తమ నటి అవార్డ్‌ను దక్కించుకుంది. ఇటీవల తనకు అవార్డ్ రావడం పట్ల నిత్యామీనన్ స్పందించింది. జాతీయ అవార్డ్ వస్తుందని తానెప్పుడూ ఊహించలేదని తెలిపింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నిత్యామీనన్ వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. ప్రేమ పట్ల నాకు ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు లేవని తెలిపింది. అయితే తనకిప్పుడు ప్రేమ, పెళ్లి ఇంపార్టెంట్ కాదని.. ప్రస్తుతం తన కెరీర్‌తో సంతోషంగా ఉన్నానని చెబుతోంది. వాటికి కూడా టైమ్ వస్తుందని.. అది ఎప్పుడైనా కావొచ్చు అంటోంది నిత్యామీనన్.నిత్యా మీనన్ మాట్లాడుతూ..'నా జీవితంలో ప్రేమకు అవకాశం లేదని కాదు. అలాగని ప్రేమకు వ్యతిరేకం కాదు. నా జీవితంలోనూ ఎవరైనా రావాల్సిందే. కానీ అది ఇప్పుడే పెళ్లి చేసుకో అనే మాటలు నేను నమ్మను. ప్రేమ, పెళ్లి విషయంలో చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నా. ఆ సందర్భం ఎప్పుడైనా రావొచ్చు. అది 50 ఏళ్ల వయసులో వచ్చినా సరే నేను సంతోషిస్తా. లైఫ్‌లో ఒక వ్యక్తిగా చాలా ఎదుగుతున్నప్పటికీ మరింత నేర్చుకుంటూనే ఉంటా. అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే నా జీవితంలోకి వస్తాడు. ప్రస్తుతం నేను దాని కోసం వెతకడం లేదు. జీవితం అనేది చాలా విషయాలతో ముడిపడి ఉంది. ' అని తమ మనసులో మాట చెప్పుకొచ్చింది. -
‘లగ్గం’ మూవీ హీరోయిన్ ప్రజ్ఞా నాగ్రా అందమైన (ఫొటోలు)
-
అక్కినేని ఇంట పెళ్లి సందడి.. నాగచైతన్య- శోభిత వివాహం అప్పుడేనా?
అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల ఈ ఏడాదిలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఇవాళ పెళ్లి పనులు మొదలైనట్లు శోభిత ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. పసుపు దంచడంతో చైతూ- శోభిత పెళ్లి సందడి మొదలెట్టారు. పెళ్లి పనుల్లో సంప్రదాయ దుస్తుల్లో శోభిత ధూళిపాళ్ల మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.అయితే పెళ్లి పనులు మొదలు కావడంతో అందరి దృష్టి వివాహం ఎప్పుడనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది. ఈనెలలోనే ఉంటుందా? లేదంటే నవంబర్, డిసెంబర్లోనా అని అందరు తెగ ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా వీరి పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.(ఇది చదవండి: నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల ఇంట మొదలైన పెళ్లి పనులు)తాజా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక డిసెంబర్ మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాబోయే జంట నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల తమ గ్రాండ్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్‌లోని ప్యాలెస్‌ని ఎంపిక చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే వీరి పెళ్లి తేదీ, వేదికపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉంది. ఆ తర్వాతే చైతూ-శోభిత పెళ్లి తేదీలు, వేదికపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 8న హైదరాబాద్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. -
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే?
అనన్య నాగళ్ల ప్రస్తుతం పొట్టేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తంత్ర, డార్లింగ్ సినిమాలతో అలరించిన అనన్య మరోసారి అభిమానులను అలరించనుంది. సాహిత్ మోతూకూరి డైరెక్షన్లో వస్తోన్న పొట్టేల్ మూవీలో అనన్య లీడ్ రోల్లో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.అయితే ఈవెంట్‌కు హాజరైన అనన్య నాగళ్లకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ జర్నలిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి అడిగింది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడతారు? ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలంటే కమిట్మెంట్ అడుగుతారని టాక్ ఉంది.. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా? అని అనన్యను ప్రశ్నించింది.(ఇది చదవండి: అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్ వచ్చేసింది!)దీనిపై అనన్య మాట్లాడుతూ..'నాకైతే ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. మీరు తెలుసుకోకుండా వందశాతం ఉంటుందని ఎలా చెబుతున్నారు. ఇండస్ట్రీలో అలా జరుగుతుంది అని చెప్పడం వందశాతం తప్పు. అవకాశం రావడం కంటే ముందే కమిట్మెంట్ అనేది టాలీవుడ్లో లేదు. ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్ అనేది సమానంగా ఉంటాయి. మీకు అనుభవం లేకపోయినా ఎలా అడుగుతున్నారు.. నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవు' అని అన్నారు. కాగా.. అనన్య నటించిన పొట్టేల్ సినిమా ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాస్టింగ్ కౌచ్ గురించి జర్నలిస్ట్ నోరు మూయించిన అనన్య 💥#AnanyaNagalla #Pottel #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/3hlxsVeu4c— Telugu FilmNagar (@telugufilmnagar) October 18, 2024 -
ఫ్లైట్‌లోనూ వదల్లేదు.. ఇలా కూడా చేస్తారా!
టాలీవుడ్ హీరోయిన్, తెలుగుమ్మాయి అనన్య నాగళ్ల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ ఏడాదిలో ఇటీవలే తంత్ర, డార్లింగ్ లాంటి చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పొట్టేల్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రంలో యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్నారు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ నిర్మించారు. కాగా.. పొట్టేల్ చిత్రాన్ని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందించారు.అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మూవీ టీమ్. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో పొట్టేల్ చిత్రబృందం వచ్చినా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఏకంగా వారు ప్రయాణించే ఫ్లైట్‌లోనే సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. ఫ్లైట్‌లో కూర్చుని ఉన్న ప్రయాణికులకు పొట్టేల్ మూవీ పోస్టర్లను అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాం' అంటూ అనన్య నాగళ్ల వీడియోను ట్విటర్లో పంచుకుంది. కాగా.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.(ఇది చదవండి: ఎందుకింత నెగెటివిటీ?.. నెటిజన్స్‌పై మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!)కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది.ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాంPottel promotions in flight #ananyanagalla #pottelonoct25th pic.twitter.com/TwftS1dxBn— Ananya Nagalla (@AnanyaNagalla) October 17, 2024 -
ఓటీటీకి తెలుగు వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన అలరించిన టాలీవుడ్ వెబ్ సిరీస్. గతేడాది జూన్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. 2016లో హిందీలో వచ్చిన 'అఫీషియల్ చుక్యాగిరి' అనే వెబ్ సిరీస్‌కు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కార్పొరేట్ వరల్డ్‌లో ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనేదే అసలు కథ. తొలి సీజన్ ఐదు ఎపిసోడ్లుగా తెరకెక్కించారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజన్-2 అలరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. కాగా.. ఈ సిరీస్ మొదటి సీజన్లో హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ కీలక పాత్రలు పోషించారు. అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్ బ్యానర్లపై బి.సాయికుమార్, శరణ్ సాయికుమార్ నిర్మించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
రాయలసీమ నేపథ్యంలో వస్తోన్న లవ్ స్టోరీ.. ట్రైలర్ చూశారా?
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం లవ్ రెడ్డి. ఈ సినిమాను గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా స్మరన్ రెడ్డి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ - 'లవ్ రెడ్డి సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. 20 మంది యంగ్ టాలెంటెడ్ హీరోలు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు.లవ్ రెడ్డి సినిమా ట్రైలర్ చూస్తే లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యంలో ఈ ప్రేమకథను రూపొందించారు. ఈ ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరిందనేది ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. రాయలసీమ నేపథ్యంతో, అక్కడి యాసలో సినిమా ప్రేక్షకుల ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
అందుకు భిన్నంగా ఈ సిరీస్‌లో చేశా: సమంత కామెంట్స్
సమంత రూత్ ప్రభు, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ- బన్నీ. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఈవెంట్లో సమంత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న టాలెంటెడ్ నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపింది. ఇండస్ట్రీలో మహిళల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ప్రశ్నపై సామ్ ఈ విధంగా స్పందించింది.సమంత మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ఇప్పటికే కొంత మార్పులు వచ్చాయి. అందులో నేనూ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అప్పుడే మన ప్రతిభ ఏంటో మనకు తెలుస్తుంది. స్పై జానర్లో సిరీస్, సినిమా అయినా సరే ఎప్పటికీ పురుషులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. వారికే యాక్షన్, డైలాగ్స్ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా ఈ సిరీస్‌లో నేను కూడా యాక్షన్ చేశా అని తెలిపింది.కాగా.. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కీలక పాత్రల్లో నటించిన హాలీవుడ్ సిరీస్ సిటాడెల్. దీనికి ఇండియన్ వెర్షన్ సిటాడెల్: హనీ -బన్నీ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సిరీస్‌కు రాజ్, డీకే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
ఎందుకింత నెగెటివిటీ?.. నెటిజన్స్‌పై మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!
టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అంతకుముందు తంత్ర అనే హారర్ మూవీతో మెప్పించింది. ప్రస్తుతం పొట్టేల్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల అనన్య ఓ వీడియో షేర్ చేసింది. దానిపై ఓ రేంజ్లో నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి.దీంతో తన వీడియోపై వస్తున్న ట్రోల్స్‌పై అనన్య స్పందించింది. ఎందుకింత నెగెటివీటీ అంటూ మండపడింది. ప్లాస్టిక్ వాడకం తగ్గించమని వీడియో షేర్ చేశా. దానిపై కొందరు విమర్శలు చేశారు. నేను చెప్పిన విషయం నచ్చితే చేయండి.. అంతేకానీ ఎందుకింత నెగటివిటీ ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించింది. అది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. సోషల్‌మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే అనన్య.. ఇటీవల ఓ వీడియో షేర్ చేశారు. అందులో స్ట్రా సాయం లేకుండా కొబ్బరిబొండం నీళ్లు తాగుతూ కనిపించారు. మాములుగా నేను స్టీల్ స్ట్రా వెంట తెచ్చుకుంటాను.. అది లేని పక్షంలో ఈ విధంగా కొబ్బరినీళ్లు తాగుతా. ప్లాస్టిక్ వాడకాన్ని కాస్త తగ్గిద్దాం. చిన్న చిన్న పనులే పెద్ద మార్పులకు శ్రీకారం చుడతాయి అని రాసుకొచ్చారు. దీనిపై పలువురు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు.2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. తాజాగా ఆమె నటించిన పొట్టేల్ అక్టోబర్ 25న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో సమంత.. చాలా రోజుల తర్వాత!
సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తర్వాత మరింత సామ్ ఒక్కసారిగా మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌కొచ్చిన సమంత జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసింది. ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవడంతో ఆధ్యాత్మిక బాట పట్టింది సామ్. అందులో భాగంగానే ఇటీవల కొయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేసింది.ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న సమంత.. తన క్లోజ్ ఫ్రెండ్ చిన్మయి శ్రీపాదను కలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా సమంత నవరాత్రి పూజల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సమంతతో కలిసి పూజలు చేసిన పిక్‌ను చిన్మయి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇందులో సమంత తన చేతిలో శారీ పట్టుకుని కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్ వర్షన్ సిటాడెల్లో కనిపించనుంది. ఆ తర్వాత బంగారం అనే మూవీలో నటించనుంది. -
ప్రెగ్నెన్సీతో టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రామ్ చరణ్‌పై సమంత ప్రశంసలు..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తోన్న పొలిటికల్ యాక్షన్ చిత్రం గేమ్ ఛేంజర్. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రా మచ్చా మచ్చా అంటూ సాగే పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ సాంగ్‌లో రామ్ చరణ్ తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించారు.అయితే ఈ సాంగ్ చూసిన హీరోయిన్ సమంత.. చెర్రీ డ్యాన్స్‌కు ఫిదా అయిపోయింది. ఈ సాంగ్ వీడియోను రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన సామ్ నిన్నెవరూ మ్యాచ్ చేయలేరు అంటూ.. అన్‌మ్యాచబుల్ అంటూ కామెంట్ చేసింది. అంతే కాకుండా ఇదే పోస్ట్‌కు రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా రిప్లై ఇచ్చింది. మిస్టర్ సీ.. మీ డ్యాన్స్‌తో హై ఓల్టేజ్ పుట్టించారని కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా.. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా డిసెంబర్లో క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఎస్జే సూర్య, శ్రీకాంత్, జయరామ్, నవీన్‌చంద్ర, అంజలి, ప్రకాశ్‌రాజ్ కీలక ప్రాతల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
హీరోయిన్ శ్రుతి హాసన్ మెంటల్ హెల్త్ టిప్స్
-
ఫెస్టివ్ సీజన్లో చీరలే ప్రత్యేకం: నటి పిల్లుమణి చీరందం (ఫోటోలు)
-
టాలీవుడ్ హీరోయిన్‌కు గ్లామన్ మిసెస్ ఇండియా- 2024 అవార్డు
టీవీ యాంకరింగ్ చేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన నటి హేమలత రెడ్డి. తాజాగా గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు -బెస్ట్ టాలెంట్- బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికల మీద అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.ఈ సందర్భంగా హీరోయిన్ హేమలత రెడ్డి మాట్లాడుతూ ..' నేను ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నా. జెమిని టీవీ లో ఒక యాంకర్‌గా మొదలుపెట్టి సీరియల్స్ చేశాను. ఆ తరువాత ప్ప్రొడ్యూసర్ కావాలనుకుని ఒక సినిమా తీశా. కోవిడ్ టైంలో ఫ్యాషన్ సైడ్ ట్రై చేశా. మలేషియా కాంపిటీషన్లో గెలిచాను. మన మాతృ భాష తెలుగులోనే నేను అక్కడ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా. అటు నటన.. అలాగే ఇటు గ్లామర్ రెండు కష్టమైన పనులే. ఆడవారు గ్లామర్ మాత్రమే కాదు.. ప్రతి రంగంలో ముందుండాలి. ఆఫర్ వాస్తే ఎలాంటి రోల్స్ అయిన చేస్తా.' అని అన్నారు. -
'దేవర'లో జాన్వీ ఫ్రెండ్‌గా తెలుగమ్మాయి బిందు భార్గవి (ఫొటోలు)
-
దుబాయ్‌లో బుట్టబొమ్మ చిల్.. బంగారంలా మెరిసిపోతున్న తంగలాన్ బ్యూటీ!
డార్లింగ్ హీరోయిన్ నభా నటేశ్ స్మైలీ లుక్స్.. దుబాయ్‌లో చిల్ అవుతోన్న పూజా హెగ్డే.. దసరా టీమ్‌తో కీర్తీ సురేశ్ ఓనం సెలబ్రేషన్స్.. బంగారువర్ణంలా మెరిసిపోతున్న తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్.. మరింత గ్లామరస్ లుక్‌లో కల్కి బ్యూటీ దిశా పటానీ.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
విరాట్ కోహ్లీ మరదలు టాలీవుడ్లో హీరోయిన్.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ఇండస్ట్రీలో ఇలా జరగడం దురదృష్టకరం: ఉప్పెన భామ
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కన్నడ భామ కృతి శెట్టి. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించింది. తాజాగా మలయాళ చిత్రం ఏఆర్ఎమ్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది భామ. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కృతి శెట్టి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించింది. హేమ కమిటీ నివేదిక తర్వాత చోటు చేసుకున్న సంఘటనలపై కృతి శెట్టి మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు చాలా దురదృష్టకరమని హీరోయిన్ పేర్కొంది. అయితే వీటి వల్ల ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక అవగాహన వస్తుందని కృతి శెట్టి అన్నారు. దీని వల్ల భవిష్యత్తులో సానుకూల మార్పులు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.(ఇది చదవండి: ఏఆర్ఎమ్ నాకో పెద్ద సవాల్: కృతీ శెట్టి)కృతి శెట్టి మాట్లాడుతూ..'ఇలాంటి విషయాలు కచ్చితంగా ఎక్కువ స్థాయిలో మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. ప్రతి ఒక్కరూ మా పరిశ్రమ మాత్రమే చెడ్డదని నమ్మించేందుకు ప్రయత్నిస్తారు. కానీ నేను మాత్రం చాలా సెన్సిటివ్ పర్సన్. మహిళలపై వేధింపులు లాంటి విషయాలను తలచుకుంటే నిజంగానే ఆందోళనకు గురవుతా. ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధాలు లేకుండా కేవలం నటిగా మాత్రమే ఉండాలని కోరుకుంటా. కానీ ఎవరైనా కొత్తగా నటనలో అడుగుపెట్టాలనుకునే వారు మాత్రం నిర్ణయాన్ని ఒకసారి ప్రశ్నించుకోవాలని సలహా ఇస్తా' అని అన్నారు. -
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్.. టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్!
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. బెంగళూరులో ఓ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదికపై స్పందించింది. చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. అయితే తనకు మాత్రం ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని వెల్లడించింది.శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ..' నా వరకు అయితే ఇండస్ట్రీలో సురక్షితంగా ఉన్నా. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని నా ఉద్దేశం కాదు. నేను సేఫ్‌గానే ఉన్నప్పటికీ.. పనిచేసే చోట అభద్రతగానే ఉండొచ్చని నా అభిప్రాయం. గత ఎనిమిదేళ్లుగా నేను సినిమాల్లో ఉన్నా. ఇండస్ట్రీలో నాకు ఎలాంటి ఇబ్బంది కలగకపోవటం నా అదృష్టం. కానీ అందరి విషయాల్లో ఇలా ఉంటుందని మాత్రం చెప్పను. కొందరు ఇండస్ట్రీలో ఇబ్బందులు పడతూనే ఉన్నారని' చెప్పుకొచ్చింది. అయితే ఈ వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి..సెట్లో మహిళలకు భద్రత కల్పించాలని కోరారు.కాగా.. శ్రద్ధా శ్రీనాథ్ 2015లో మలయాళ చిత్రం కోహినూర్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్లో నాని సరసన జెర్సీతో అరంగేట్రం చేసింది. అంతేకాకుండా యు-టర్న్, విక్రమ్ వేద చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం తెలుగులో విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. అంతేకాకుండా హిందీలో లెటర్స్ టు మిస్టర్ ఖన్నా, కోలీవుడ్‌లో కలియుగం సినిమాల్లో నటిస్తోంది. -
గుడ్‌న్యూస్ అంటూ వీడియో రిలీజ్ చేసిన హేమ
బెంగళూరు రేవ్‌పార్టీ ఛార్జ్‌షీట్‌లో తన పేరు రావడంపై టాలీవుడ్ నటి హేమ స్పందించారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదన్నారు. బెంగళూరు పోలీసులు బ్లడ్ షాంపిల్స్ కూడా తీసుకోలేదని పేర్కొన్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు వారు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని హేమ ప్రకటించారు. అయితే,ఛార్జీషీట్లో తన పేరు ఉన్నట్లు సమాచారం వచ్చిందన్నారు.డ్రగ్స్ తీసుకున్న హేమబెంగళూరు పోలీసులు మాత్రం నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారని మరోసారి ఛార్జ్‌షీట్ ద్వారా తెలిపారు. ఈ మేరకు 1086 పేజీలతో ఛార్జ్‌షీట్‌ను రెడీ చేసిన పోలీసులు కోర్టుకు అందించారు. హేమ ఫ్రెండ్ వాసు అనే వ్యక్తి ఆహ్వానించడం వల్లే ఆమె రేవ్ పార్టీకి వెళ్లినట్లు బెంగుళూరు పోలీసులు పేర్కొన్నారు.చార్జిషీట్లోనూ నెగెటివ్తాజాగా హేమ.. గుడ్‌న్యూస్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అఫీషియల్ చార్జిషీట్లోనూ నాకు నెగెటివ్ వచ్చిందని రాశారు. అనవసరంగా నాపై కొందరు నిందలు వేస్తున్నారు. నేను ఎవర్నీ వదిలిపెట్టను. చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటాను అని వీడియోలో మాట్లాడారు. ఈ వీడియో కింద నెటిజన్లు ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా బాబూ అని కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
హోంమంత్రి అనిత మాటలు పచ్చి అబద్ధం: హీరోయిన్ మాధవీలత
ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత వినాయక విగ్రహాల చలాన్లపై పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కేవలం మండపాలకే మాత్రమే రుసుములు ఉండేవని తెలిపారు. విగ్రహాల అడుగుల ఎత్తు, ఎకో గణేశా పేరిట ప్రత్యేకంగా ఎలాంటి చలాన్లు లేవని ఆమె స్పష్టం చేశారు. ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ అని వెల్లడించారు. అయితే పది రోజుల క్రితం హోంమంత్రి అనిత ప్రెస్మీట్లో ఈ రూల్స్ ప్రకటించడం అక్షర సత్యమన్నారు. కొత్తగా తెచ్చిన రూల్స్ గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీదే కదా? అని మాధవీలత ప్రశ్నించారు. మేము కాషాయ కండువాలు మోసే వాళ్లమని..డబ్బులతో నన్ను ఎవరూ కొనలేరని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్)మాధవీలతపై నెటిజన్ల ప్రశంసలు..ఆమె వీడియో చూసిన నెటిజన్స్ మాధవీలతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తప్పును ధైర్యంగా ప్రశ్నించారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు నిజాయితీగా ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపారని.. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలంటూ మాధవీలతను ప్రశంసిస్తున్నారు. కాగా.. అంతకుముందు వినాయక విగ్రహాలకు ఇష్టారీతిన చలాన్లు విధించండంపై హీరోయిన్ మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేసింది. వినాయక చవితి సందర్భంగా చలాన్లపై ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని ఆమె మండిపడ్డారు. డబ్బులు కావాలంటే దానం చేస్తాం.. అంతే కానీ ఇలా మండపాల దగ్గర చిల్లర అడుక్కోవడమేంటి అక్కా? అంటూ హోంమంత్రిని ప్రశ్నించారు. ఏపీలో చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందని హోంమంత్రిని మాధవీలత నిలదీశారు. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Serve NGO ll (@actressmaadhavi) -
మన్మధుడు హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
మాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని చోట్లా ఉంది: భానుప్రియ సిస్టర్
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదికపై టాలీవుడ్ నటి శాంతి ప్రియ స్పందించారు. ఇలాంటి వేధింపులు కేవలం మాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని చోట్లా జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునవరావృతం కాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. మన భవిష్యత్ తరాలకు భరోసానిచ్చేలా చర్యలు ఉండాలని సూచించారు.అంతేకాకుండా మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రాజీనామా చేయడం ఎంతవరకు సబబు అని శాంతి ప్రియ ప్రశ్నించారు.హేమ కమిటీ నివేదిక తర్వాత ఆరోపణలు వస్తున్న సమయంలో తప్పుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే బాధితులకు న్యాయం చేసేందుకు అండగా నిలబడాల్సిందని అన్నారు. బాధితులకు భరోసా కల్పించే బాధ్యత అమ్మ సభ్యులపై ఉందని ఆమె గుర్తు చేశారు. తనకెప్పుడు ఎదురవ్వలేదు..అయితే తనకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురు కాలేదని.. తన అదృష్టమని శాంతి ప్రియ వెల్లడించారు. నేను భానుప్రియ సోదరురాలిని అయినందువల్లే ఎవరూ టచ్ చేయలేదని తెలిపింది. ఎందుకంటే ఇండస్ట్రీలో మా కుటుంబానికి ఉన్న గౌరవమేంటో అందరికీ తెలుసున్నారు. కాగా.. కాబోయే అల్లుడు తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శాంతి ప్రియ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించింది. 1980-90ల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. కాగా.. హేమ కమిటీ నివేదిక బయటకొచ్చాక మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ల సంఘాన్ని రద్దు చేశారు. ఇందులో సభ్యులుగా ఉన్న 17 మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన దర్యాప్తు ప్రారంభించింది. -
ప్లేయర్‌గా మారిన సమంత.. ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో వరుణ ధావన్ సరసన నటిస్తున్నారు. ఇటీవల తాను ఓ ఫ్రాంజైజీని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. క్రీడారంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది. వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ లీగ్‌లో తాను చెన్నై ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని పోస్ట్ చేసింది.తాజాగా పికిల్ బాల్ లీగ్‌లో సందడి చేసింది. బ్యాట్ చేత పట్టుకుని ప్లేయర్‌గా ఆడుతూ కనిపించింది. పికిల్ బాల్ ఆడుతూ డ్యాన్స్ చేస్తూ ఆటను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను సమంత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కొద్దిరోజుల క్రితమే బిగ్ సర్ప్రైజ్ అంటూ ఈ లీగ్ పార్ట్నర్గా అడుగుపెడుతున్న సామ్ తన అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. -
ప్రేమ అంటేనే త్యాగం.. అవతలి వైపు ఆశించొద్దు: సమంత పోస్ట్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. రాజ్ నిడిమోరు, డీకే డైరెక్షన్లో వస్తోన్న ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన కనిపించనుంది. ఆ తర్వాత బంగారం అనే మరో మూవీలో కనిపించనుంది. అయితే ఇటీవల నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో పలురకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్లో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే తాజాగా ప్రేమ, స్నేహం, బంధం గురించి సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. "చాలా మంది వ్యక్తులు స్నేహాలు, సంబంధాలను పరస్పరం కొనసాగిస్తారు. వీటిని నేను కూడా అంగీకరిస్తున్నాను. మీరు ప్రేమను పంచుతారు. నేను కూడా తిరిగి ఇస్తాను. కానీ కొన్నేళ్లుగా నేను నేర్చుకున్నది ఏంటంటే.. మనం ప్రేమను పంచే ఎదుటి వ్యక్తి తిరిగి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా ప్రేమను అందజేస్తాం. ఎందుకంటే ప్రేమ అనేది ఓ త్యాగం. మనకు అవతలి వైపు నుంచి ప్రేమ, అప్యాయతలు అందకపోయినా.. ఇప్పటికీ తమ ప్రేమను ధారపోస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు." అంటూ పోస్ట్ చేసింది. నాగ చైతన్య నిశ్చితార్థం తర్వాత ప్రేమ, త్యాగం అంటూ సమంత పోస్ట్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. -
Megha Akash: త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు!
-
'ఇది చిన్న కథ కాదు'.. రిలీజ్ ఎప్పుడంటే?
నివేదా థామస్, ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం '35-చిన్న కథ కాదు'. నంద కిషోర్ ఈమని దర్శకత్వం వహించిన ఈ మూవీని రానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని టాలీవుడ్ హీరో రానా ట్విటర్ ద్వారా షేర్ చేశారు.ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానున్నట్లు వెల్లడించారు. ప్రియదర్శి బర్త్ డే కావడంతో రిలీజ్ తేదీతో పాటు స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ చూస్తే ఈ సినిమాను ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమెషన్స్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీలో విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. Get ready to experience the heartwarming Story of every household ❤️ ✨️ "Chinna Katha Kaadu"#35Movie in Theatres on SEPTEMBER 6th!#35CKK @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @gautamitads #NandaKishore @nikethbommi #VivekSagar @siddharthr87 @srujanyarabolu1… pic.twitter.com/aanB0IcZq5— Rana Daggubati (@RanaDaggubati) August 25, 2024 -
యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం!
టాలీవుడ్ ప్రముఖ యాంకర్, నటి రష్మీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తాతయ్య ఈనెల 17న అనారోగ్యంతో మరణించినట్లు ఆమె వెల్లడించింది.ఈ విషయాన్ని రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మా తాత నిజమైన స్త్రీవాది అని.. చివరికీ మా బామ్మను స్వర్గంలో కలుసుకున్నారని ట్వీట్ చేసింది. గడిచిన ఏడాదిన్నరగా తన గురించే మాట్లాడేవారని రాసుకొచ్చింది. వారి ప్రేమ అలాంటిదని ఆమె తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.కాగా.. తెలుగులో యాంకర్‌గా కెరీర్ మొదలెట్టిన రష్మీ గౌతమ్ సినిమాల్లోనూ నటించింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కేవలం యాంకర్‌గానే కాదు.. నటిగానూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. గుంటూరు టాకీస్, తను వచ్చేనంటా, అంతం, బొమ్మ బ్లాక్‌బస్టర్, అంతకుమించి లాంటి చిత్రాలతో మెప్పించింది. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
Nidhhi Agerwal: ప్రభాస్, పవన్ కల్యాణ్ మీదే ఆశలు.. నిధి అగర్వాల్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
వెంకటేశ్‌తో మొదటి సినిమా.. ఖుష్బు ఎమోషనల్ పోస్ట్!
కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. తొలి సినిమాతోనే విక్టరీ వెంకటేష్‌తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించింది. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో పాటు దక్షిణాదిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. ఇవాళ ఆమె నటించిన మొదటి చిత్రం కలియుగ పాండవులు రిలీజై 38 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా ఖుష్బు ఎమోషనల్ పోస్ట్ చేసింది.ఖుష్బు ట్వీట్లో రాస్తూ..'నా సౌత్ ఇండియా మొదటి సినిమా 14 ఆగస్టు 1986న విడుదలైంది. వెంకటేశ్ పక్కన నటించడం నా అదృష్టం.. ఇప్పటికీ ఆయన నా ఫ్రెండ్‌గా ఉన్నారు. ఈ చిత్ర యూనిట్ అంతా ఒక కుటుంబంలా నన్ను ఆదరించారు. తెలుగు ప్రేక్షకులు నా పట్ల చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. డి రామానాయుడు నిర్మించారు. ఖుష్బు చివరిసారిగా అరణ్మనై-4 చిత్రంలో కనిపించింది. It's been 38 years since my very first south Indian film released. #KaliyugaPandavalu released on 14th August 1986. I am eternally grateful to my dearest @VenkyMama for being the most precious co star & friend till date. @SureshProdns for treating me like a family.… pic.twitter.com/FOwH0wdrpw— KhushbuSundar (@khushsundar) August 14, 2024 -
ప్రభాస్ కల్కిలో ఆఫర్.. రిజెక్ట్ చేశా: కీర్తి సురేశ్
దసరా బ్యూటీ కీర్తి సురేశ్ ప్రస్తుతం రఘుతాత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ భామ డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ నటిచిన కల్కి 2898 ఏడీ సినిమాలో బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసింగే. తాజా ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో నాగ్ అశ్విన్ తనకు ఓ రోల్ ఆఫర్ చేశారని తెలిపింది. కానీ దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించింది.కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'కల్కి 2898 ఏడీ చిత్రంలో ఓ రోల్ కోసం డైరెక్టర్ నన్ను సంప్రదించారు. కానీ ఆ పాత్ర నేను చేయలేనని చెప్పా. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలనుందని మెసేజ్ చేశా. ఆ తర్వాత ఆయన కాల్ చేసి బుజ్జి రోల్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగారు. నాకు మొదట అర్థం కాలేదు. షూట్లో నేను కూడా భాగం కావాల్సిన అవసరం లేదా? అని అడిగా. లేదు కేవలం వాయిస్ ఓవర్ ఇస్తే చాలు అన్నారు. దీంతో నేను వెంటనే ఓకే చెప్పా. వాయిస్ ఓవర్ విషయంలో నాగ్ అశ్విన్ నాకెంతో సాయం చేశారు' అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా కల్కి పార్ట్ -2 కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అయితే తనకు కల్కిలో ఆఫర్ చేసిన పాత్ర ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. కీర్తి ప్రధానపాత్రలో సుమన్‌కుమార్ తెరకెక్కించిన రఘు తాత ఆగస్టు 15న విడుదల కానుంది. I was offered some other role in #Kalki2898AD which I said no & opted for #Bujji voice. My best dubbing till date, lot of fun and waiting for #Kalki2898AD Part 2👌#Bujji voice is getting such fame that Bhardwaj wanted to end episode with that voice👌🤩.@keerthyofficial #Prabhas pic.twitter.com/iIOUhIu8zB— Pakistan Prabhas Fanclub (@Pak_PrabhasFC) August 11, 2024 -
ప్రకృతి ఒడిలో సీతారామం బ్యూటీ.. రాజస్థాన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ చిల్!
ప్రకృతి ఆస్వాదిస్తోన్న సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.. రాజస్థాన్‌లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ.. దసరా మూడ్‌లోనే కీర్తి సురేశ్.. కళ్లతోనే మాయ చేస్తోన్న పూనమ్ బజ్వా.. రెడ్ డ్రెస్‌లో శ్రద్ధాకపూర్ అందాలు.. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
'ఐ యామ్ నాట్ సింగిల్'.. దసరా భామ ఆసక్తికర కామెంట్స్!
దసరా హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రస్తుతం రఘుతాత మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుమన్‌కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్ తొలిసారి కోలీవుడ్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ.ఇదిలా ఉండగా కీర్తి సురేశ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీరు సింగిల్‌గా ఉంటున్నారు కదా? అని ఆమెను ప్రశ్నించారు. దీంతో తన రిలేషన్షిప్ గురించి దసరా భామ నోరువిప్పారు. దీనికి బదులిస్తూ.. 'నేనేప్పుడు సింగిల్ అని చెప్పలేదుగా' అమటూ సమాధానమిచ్చింది.కాగా.. గతంలో ఆమె పెళ్లిపై చాలాసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ చేసిన కామెంట్స్ నెట్టంటి తెగ వైరలవుతున్నాయి. అయితే తాను సింగిల్ కాదని చెప్పడంపై.. ఇప్పటికే రిలేషన్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే పరోక్షంగా హింట్ ఇచ్చిందని చెబుతున్నారు. మరోవైపు కీర్తి సురేశ్ బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. బేబీ జాన్ సినిమాతో వరుణ్ ధావన్ సరసన నటించనున్నారు. -
మొహం నిండా గాయాలతో అనసూయ.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ అనసూయ యాంకర్‌గా కెరీర్ మొదలెట్టి ఏకంగా స్టార్ నటిగా ఎదిగింది. పుష్ప, రంగస్థలం లాంటి సినిమాలతో ఎక్కడా లేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పుష్ప-2లోనూ నటిస్తోన్న అనసూయ.. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సింబా. ఈ మూవీ ఇవాళ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన సింబాలో అనసూయ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో తన పాత్రకు సంబంధించిన ఫోటోలను తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసింది. మొహమంతా రక్తంతో తడిసి ఉన్న ఫోటోలు చూసి ఆడియన్స్ షాక్‌కు గురి అవుతున్నారు. అయితే ఈ పిక్స్ కేవలం సింబా చిత్రంలో స్టిల్స్ మాత్రమేనని.. సింబా ది ఫారెస్ట్ మ్యాన్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. పర్యావరణాన్ని మనం ఎలా కలుషితం చేస్తున్నామో... దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూశాక కనీసం ఒక్కరిలో మార్పు వచ్చినా సంతోషమే అని గతంలో అనసూయ అన్నారు. ఇందులో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. -
Genelia Deshmukh: హ.హ్హ.. హాసిని.. అల్లరిపిల్లగా నచ్చేసింది (ఫోటోలు)
-
శివం భజే హీరోయిన్‌కు ఊరట.. అసలేం జరిగిందంటే?
ఇటీవల శివం భజే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ దిగంగనా సూర్యవన్షి. అశ్విన్ బాబు సరసన హీరోయిన్గా నటించింది ముద్దుగుమ్మ. ఆగస్టు 1న థియేటర్లో రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అప్సర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మహేశ్వర్ రెడ్డి నిర్మించారు. అయితే ముంబయికి చెందిన ఈ ముద్దుగుమ్మ సింగర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.తాజాగా దిగంగనా సూర్యవన్షికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆమెపై నమోదైన ఓ కేసును కోర్టు కొట్టివేసింది. గతంలో ఆమెపై దర్శక-నిర్మాత అయిన మనీష్ హరిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై నిర్మాత చేసిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా దిగంగనా ముంబయి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.అసలేం జరిగిందంటే..ఈ ఏడాది జూన్‌లో ఎంహెచ్ ఫిల్మ్స్, మనీష్ ప్రొడక్షన్ హౌస్ మేకర్స్ దిగంగనా మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షో స్టాపర్ వెబ్ సిరీస్‌కు వ్యాఖ్యాతలుగా నటుడు అక్షయ్ కుమార్‌ను తీసుకొస్తానని తమ వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పిందని మనీష్ హరిశంకర్ ఆరోపించారు. అంతేకాకుండా హరిశంకర్‌ను బెదిరించిం డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారని ఆమెపై ఆరోపణలు చేశారు. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ దిగంగన సూర్యవంశీ.. నిర్మాత మనీశ్ హరిశంకర్‌కు పరువు నష్టం నోటీసులు పంపారు. అతను తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ పోలీసులకు వివరించింది. కాగా.. షో స్టాపర్ అనే వెబ్ సిరీస్‌లో జీనత్ అమన్, జరీనా వహాబ్, శ్వేతా తివారీ, సౌరభ్ రాజ్ జైన్ లాంటి బాలీవుడ్ తారలు నటించారు. అయితే ఈ సిరీస్ వివాదంలో చిక్కుకుంది. చాలామంది నటీనటులతో పాటు, సిబ్బందికి పారితోషికం చెల్లించలేదని నిర్మాతపై ఫిర్యాదు చేశారు. -
విష్ణు విశాల్‌కు జంటగా.. 'మమిత బైజూ'
ఏ యాక్టర్‌కైనా బ్రేక్ అనేది ఒక చిత్రంతోనే వస్తుంది. ఆ తరువాత వారి లైఫే మారిపోతుంది. ఇలా చాలా మంది హీరోహీరోయిన్ల జీవితంలో జరిగింది. అలా ప్రేమలు అనే మలయాళ చిత్రంతో నటి మమిత బైజూ లైఫే మారిపోయింది. ఆ చిత్రం మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు వంటి దక్షిణాది భాషల్లోనూ అనువాదం అయ్యి మంచి వసూళ్లను సాధించింది.ఆ విషయం పక్కన పెడితే అందులో నాయకిగా నటించిన మమిత బైజూకు పిచ్చ క్రేజ్ వచ్చింది. దీంతో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా తమిళంలో ఇప్పటికే జీవీ ప్రకాశ్ కుమార్‌కు జంటగా రెబల్ చిత్రంలో నటించారు. తాజాగా విష్ణు విశాల్‌తో రొమాన్స్ చేస్తున్నట్లు సమాచారం. విష్ణు విశాల్ ప్రస్తుతం రామ్‌కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన రాక్షసన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది.దీంతో తాజాగా దర్శకుడు రామ్‌కుమార్, విష్ణు విశాల్ కలిసి మరో చిత్రం చేస్తున్నారు. ఇందులోనే నటి మమిత బైజూ నాయకిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇది నటుడు విష్ణువిశాల్ కథానాయకుడిగా నటిస్తున్న 21వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటి మమిత బైజూ దీంతో పాటు మరో తమిళ చిత్రంలోనూ నటిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ కేరళా కుట్టి కోలీవుడ్‌లో బాగానే పాగా వేస్తున్నారన్న మాట. -
సీరియల్ నటిగా సూపర్ హిట్.. కానీ సినిమాల్లోనే! ఆకాంక్ష సింగ్ బర్త్‌డే (ఫొటోలు)