'అలాంటి వ్యక్తి అంటే చాలా ఇష్టం'.. రిలేషన్‌షిప్‌పై రష్మిక ఆసక్తికర కామెంట్స్ | Actor Rashmika Mandanna confirms being in a relationship | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: 'అలాంటి వ్యక్తి అంటే చాలా ఇష్టం'.. రిలేషన్‌పై రష్మిక కామెంట్స్ వైరల్

Jan 28 2025 5:06 PM | Updated on Jan 28 2025 5:17 PM

Actor Rashmika Mandanna confirms being in a relationship

పుష్ప భామ రష్మిక మందన్నా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది పుష్ప-2తో బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలో బాలీవుడ్‌ చిత్రం ఛావాతో అభిమానులను పలకరించనుంది. ఇటీవల తన కాలికి గాయమైనప్పటికీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఛావా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న నేషనల్ క్రష్‌ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన రిలేషన్‌షిప్ గురించి తొలిసారి ఓపెన్ అయిపోయింది.

రష్మిక మాట్లాడుతూ.. " నా ఇల్లే అత్యంత సంతోషకరమైన ప్రదేశం. అది నాకు ఎప్పటికీ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. జీవితంలో గెలుపు అనేది వస్తూ, పోతూ ఉంటుంది. విజయమనేది మన లైఫ్‌లో శాశ్వతం కాదు. కానీ నా ఇల్లు ఎప్పటికీ శాశ్వతం. అందుకే అక్కడి నుంచే పనిచేస్తున్నా. అక్కడ నేను పొందిన ప్రేమ, కీర్తి ఎప్పటికీ గుర్తుంటాయి. ఒక వ్యక్తి పట్ల ఆకర్షణ విషయానికొస్తే తన కళ్లే ప్రధానమని నేను నమ్ముతా. అంతే కాదు తాను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను.. అంటే ఎప్పుడు స్మైలీ ఫేస్‌తో పాటు తన చుట్టు ఉన్నవారిని గౌరవించే వాళ్లంటే నాకు ఇష్టం.' అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

రిలేషన్‌పై రూమర్స్..

కాగా.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ కూడా రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు బయటికి చెప్పారు. అయితే ఎవరనేది మాత్రం పేరును వెల్లడించలేదు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ వివరాలను పంచుకుంటానని కూడా స్పష్టం చేశాడు.

అయితే రష్మిక మందన్నా చాలాసార్లు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే పండుగ వేడుకల్లో మెరిసింది. గతేడాది విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. చాలాసార్లు తన ఫోటోలతో అభిమానులకు దొరికిపోయింది. విజయ్‌ ఇంట్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదిక షేర్ చేస్తూనే ఉంటుంది. దీంతో విజయ్, రష్మిక రిలేషన్‌లో ఉన్నట్లు ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు రిలేషన్‌పై క్లారిటీ ఇస్తే కానీ వీటికి ఎండ్ కార్డ్ పడేలా కనిపించడం లేదు. కాగా..  ప్రస్తుతం రష్మిక నటిస్తోన్న ఛావా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement