relation
-
అంతరాలు పెరిగితే మొదటికే మోసం
హాయ్, హలో ఎలా ఉన్నారు? గుర్తున్నానా? లేదా రెండు వారాల గ్యాప్ వచ్చింది కాబట్టి మర్చిపోయారా? నిజాయితీగా మీ సమాధానం కామెంట్స్ లో చెప్పండి. సరే, ఈ రోజు టాపిక్ ఈ గ్యాప్ పైనే.మొన్నా మధ్య మా కౌన్సెలింగ్ సెంటర్ కు ఓ జంట వచ్చారు. ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారం క్లయింట్ల పేర్లు చెప్పకూడదు కాబట్టి అరుణ, సాగర్ అనుకుందాం. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఇద్దరూ కలిసి నెలకు నాలుగైదు లక్షలు సంసాదిస్తున్నారు. గచ్చిబౌలి లో ఫ్టాట్, మంచి కారు, వీకెండ్ పార్టీలు, మంత్లీ ట్రిప్స్, ఏడాదికోసారి ఇంటర్నేషనల్ టూర్. హ్యాపీ లైఫ్. ఇది అందరికీ కనిపించే విషయం.కానీ లోలోపల అగ్గి రగులుతోంది. ఇద్దరి మధ్యా వాదనలు పెరిగాయి. దూరం పెరిగింది. గత ఆరునెలలుగా తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. చివరకు విడిపోదామని నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం ఒక లాయర్ ను సజెస్ట్ చేయమని ఫ్రెండ్ ను అడిగారు. విడాకులకు అప్లయ్ చేశాక కూడా కౌన్సెలింగ్ కు వెళ్లాలని, దానికన్నా ముందే వెళ్లడం మంచిదని నా పేరు సజెస్ట్ చేశారు. అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు. మొదటి సెషన్ లో వారిద్దరితో విడివిడిగానూ, కలివిడిగానూ మాట్లాడి సమాచారం తీసుకున్నా. వారిద్దరూ విడిపోవడానికి కారణం ప్రేమ లేకపోవడం కాదని, పెరుగుతున్న దూరమని అర్థమైంది. ఒకే ఇంట్లో ఉంటున్నా, శారీరికంగా కలుస్తున్నా, ఎమోషనల్ గా, సైకలాజికల్ గా దూరమవుతున్నారని వారి మాటల ద్వారా తెలిసింది. కౌన్సెలింగ్, మేరిటల్ థెరపీ, రిలేషన్షిప్ ఎక్సర్ సైజ్ ల ద్వారా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగేలా చేశాను. దాంతో విడాకుల ఆలోచనకు స్వస్తి పలికి ఇద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో జంటల మధ్య ఏర్పడే వివిధ రకాల అంతరాలు, అదేనండీ గ్యాప్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.అంతరాలను అర్థం చేసుకోవడం...పగలెలా ఉన్నా రాత్రికి ఒక్కటైతే చాలు, అన్ని సమస్యలూ మాయమవుతాయని పెద్దలు చెప్తుంటారు. అది ఆ కాలంలో నడిచిందేమో కానీ, ఈ కాలంలో వర్కవుట్ కాదు. జంట మధ్య శారీరక దూరంతో పాటు, ఎమోషనల్, సైకలాజికల్, ఇంటలెక్చువల్, స్పిరిచ్యువల్ గ్యాప్స్ కూడా ఏర్పడవచ్చు. వాటికి సకాలంలో అడ్రస్ చేయకపోతే ఇద్దరి మధ్య కనిపించని అగాధం ఏర్పడుతుంది. అందుకే వాటి గురించి తెలుసుకుని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది.ఎమోషనల్ డిస్టెన్స్...జంటలు తమ ఆలోచనలు, భావాలు, అనుభవాలు, భావోద్వేగాలు పంచుకోవడం తగ్గించినప్పుడు, మానివేసినప్పుడు ఎమోషనల్ గ్యాప్ ఏర్పడుతుంది. ఉదాహరణకు, అరుణ తన కెరీర్ పడుతున్న స్ట్రెస్ గురించి సాగర్ కు చెప్పినప్పుడు, అది అందరికీ ఉండేదేగా, ప్రత్యేకం ఏముంది? అంటూ కొట్టిపడేశాడు. ఒకటి రెండు సార్లు అలా అనేసరికి తన ఒత్తిళ్ల గురించి చెప్పడం మానేసింది. తన కష్టాల్లో సాగర్ అండగా లేడని బాధపడటం మొదలుపెట్టింది. అది వారిద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ కు కారణమైంది.ఇంటలెక్చువల్ డిస్టెన్స్...తమకు ఎక్సయిట్మెంట్, ఇంటలెక్చువల్ స్టిములేషన్ కలిగించిన విషయాల గురించి మాట్లాడుకోవడం మానేసినప్పుడు ఇది జరుగుతుంది. అరుణకు యద్దనపూడి నవలలంటే ఇష్టం. సాగర్ నాన్ ఫిక్షన్ చదువుతాడు. అది అతనిష్టం. కానీ ఈ కాలంలో యద్దనపూడి నవలలు చదవడమేంటని అరుణను వెక్కిరిస్తాడు. దాంతో వారిద్దరి మధ్య ఇంటలెక్చువల్ షేరింగ్ పూర్తిగా ఆగిపోయింది. దూరం పెరిగింది.ఎక్స్ పీరియన్షియల్ డిస్టెన్స్... ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండకపోవడమే కాదు, జంట మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలా చేయనప్పుడు దూరం పెరుతుంది. అరుణ, సాగర్ బిజీ వర్క్ లో పడిపోయారు. కలిసి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం తగ్గిపోయింది. కలిసి వంట చేయడం సంగతి సరేసరి. ఎక్కువ సందర్భాల్లో స్విగ్గీ, జొమాటోలపైనే ఆధారపడుతున్నారు.స్పిరిచ్యువల్ డిస్టెన్స్... భాగస్వాముల నమ్మకాలు, ఆచారాలు ఏకోన్ముఖంగా లేనప్పుడు ఈ దూరం ఏర్పడుతుంది. అరుణకు ఓ గురువంటే అమితమైన భక్తి. సాగర్ నాస్తికుడు. ఆ గురువు మోసగాడని రోజూ విమర్థిస్తుంటాడు. కాలక్రమేణా, అది వారిద్దరి మధ్య నిశ్శబ్దానికి దారితీసింది.ఫిజికల్ డిస్టెన్స్... శారీరక దూరం అంటే సెక్స్ లేకపోవడం అని అర్థం కాదు, కానీ రోజువారీ పనుల్లో స్పర్శ, ఆప్యాయత లేకపోవడం. ఆప్యాయంగా అరుణ చేతులు పట్టుకోవడం, సున్నితంగా కౌగిలించుకోవడం సాగర్ పూర్తిగా మర్చి పోయాడు. దూరాలను తగ్గించుకోవాలి... అరుణ, సాగర్ లానే మీ మధ్య కూడా ఇలాంటి దూరాలు, అంతరాలు ఉన్నాయా? భయపడాల్సిన అవసరమేం లేదు. ఆ అంతరాలను తగ్గించుకోవడానికి మీరిద్దరూ ప్రయత్నం చేస్తే చాలు. అరుణ, సాగర్ లకు చెప్పిన కొన్ని టిప్స్ ఇప్పుడు మీకు కూడా చెప్తా. మీ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రతిరోజూ సమయాన్ని కేటాయించండి. గంటలు గంటలు అవసరం లేదు. కాఫీ తాగుతూ కూడా మాట్లాడుకోవచ్చు. అయితే ఆ సమయంలో మొబైల్ చూడకుండా పార్టనర్ చెప్పేది వినాలి. మీ మీ వ్యక్తిగత అభిరుచులను అలాగే ఉంచుకుంటూ, ఇద్దరికీ ఇష్టమైన ఇంటలెక్చువల్ అంశం కనుక్కోండి, తరచూ దాని గురించి చర్చించుకోండి. మీరిద్దరూ ఎంజాయ్ చేసే వనులకు తప్పనిసరిగా సమయాన్ని కేటాయించండి. ఇది కలిసి వంట చేయడం, నడవడం లేదా అడ్వంచర్ ట్రిప్ లాంటిది ఏదైనా కావచ్చు.ఒకరి ఆధ్యాత్మిక విశ్వాసాలను మరొకరు గౌరవించుకోండి. మీ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, కలిసి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయండి. శారీరక సాన్నిహిత్యం అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. దగ్గరగా కూర్చోవడం, చేతులు పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం, కౌగలించుకోవడం లాంటి చిన్న చిన్న పనులు ఫిజికల్ ఇంటిమసీని పెంచుతాయి. కొన్ని జంటలు ఈ పనులన్నీ చేస్తున్నా గ్యాప్ పెరుగుతూనే ఉంటుంది. ఇరువురి మధ్య పరిష్కరించుకోని వైరుధ్యాలు, కనిపించని ఒత్తిళ్లు, కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్, ఫియర్ ఆఫ్ వల్నరబిలిటీ అందుకు కారణం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగేకంటే కౌన్సెలింగ్ సెంటర్ కు వెళ్లడం మంచిదని గుర్తించండి. విష్ యూ హ్యాపీ లైఫ్.-సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066Psy.vishesh@gmail.com -
ఏడాదిలో భారత్- యూఏఈ బంధం ఎలా బలపడింది?
ప్రధాని నరేంద్ర మోదీ తన 2 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం(ఫిబ్రవరి 13) యూఏఈ చేరుకోనున్నారు. ఫిబ్రవరి 14న అబుదాబిలో నిర్మించిన బీఏపీఎస్ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. కాగా గత ఏడాది కాలంలో భారతదేశం- యూఎఈ మధ్య సంబంధాలలో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. అనేక అంశాల్లో కలిసి పని చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. గడచిన ఏడాదిలో రెండు దేశాల మధ్య ఐదు ఉన్నత స్థాయి పర్యటనలు జరిగాయి. ప్రధాని మోదీ జూలై 2023లో ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం యూఏఈ వెళ్లి, అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను అబుదాబిలో కలిశారు. దుబాయ్‌లో కాప్-28లో పాల్గొంటున్నప్పుడు కూడా అంటే గత ఏడాది నవంబరు 30 ప్రధాని మోదీ యూఏఈ సందర్శించారు. అప్పుడు ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, వైస్ ప్రెసిడెంట్‌ను కలుసుకున్నారు. భారతదేశ మద్దతుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్‌లో సభ్యదేశంగా చేరింది. వాణిజ్య రంగంలో కూడా ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఊపందుకున్నాయి. సరిహద్దు లావాదేవీల కోసం రూపాయి, దిర్హమ్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ భారతదేశంలో 3.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించింది. 2024, జనవరి 10న యూఎఈ అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ గుజరాత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. 2026-39 వరకు అంటే 14 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం కింద 1.2 ఎంఎంటీ ఎల్ఎన్జీ కొనుగోలు చేయడానికి ఐఓసీఎల్, ఏడీఎన్ఓసీ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇది భారత్, యూఏఈ మధ్య కుదిరిన మొదటి దీర్ఘకాలిక ఒప్పందం. తాజాగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీ) గ్యాస్ గెయిల్ ఇండియాకు సంవత్సరానికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీని సరఫరా చేసేందుకు 10 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగంలో గత ఏడాది కాలంలో రెండు దేశాల మధ్య ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. 2024 జనవరిలో భారత్-యూఎఈల ద్వైపాక్షిక సైనిక కసరత్తు రాజస్థాన్‌లో జరిగింది. 2024, జనవరి 21న భారత్- యూఏఈ, ఫ్రాన్స్‌ల వైమానిక దళాలతో కూడిన ఎక్సర్సైజ్ డెసర్ట్ నైట్ యూఏఈలోని అల్ దఫ్రా విమానాశ్రయంలో జరిగింది. ఇటీవల ఎడ్జ్, హెచ్‌ఏఎల్‌లు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం క్షిపణి వ్యవస్థల ఉమ్మడి రూపకల్పన, అభివృద్ధితో సహా సహకార రంగాలలో ఇరు దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోనున్నాయి. -
పాక్, ఇరాన్ దోస్తీ ఎందుకు చెడింది? భారత్‌కు ఏం దక్కింది?
పాకిస్తాన్, ఇరాన్‌లు స్నేహపూర్వక సంబంధాలు కలిగిన దేశాలు. ఈ రెండూ ముస్లిం దేశాలు కావడంతో ఈ సంబంధం మరింత బలపడింది. 1965, 71లో భారత్-పాక్ యుద్ధ సమయంలో ఇరాన్.. పాకిస్తాన్‌కు పూర్తి సాయం అందించింది. పలు అంతర్జాతీయ ఫోరమ్‌లలో కూడా, ఇరాన్.. భారత్‌ను వ్యతిరేకించి, పాకిస్తాన్‌కు మద్దతునిచ్చింది. ఇప్పుడు ఈ రెండు దేశాలు బద్ధ శత్రువులుగా మారడానికి కారణం ఏమిటి? పాకిస్తాన్‌పై ఇరాన్ వైమానిక దాడి నేపధ్యంలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడటానికి కారణమేమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అదే సమయంలో పాకిస్తాన్‌కు మిత్రదేశంగా ఉన్న ఇరాన్.. భారత్‌తో ఎందుకు సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది? 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం జరిగినప్పుడు పాకిస్తాన్, ఇరాన్‌ల మధ్య స్నేహంలో చీలిక ఏర్పడింది. దీని తరువాత ఆఫ్ఘన్ జిహాద్ సమయంలో పాకిస్తాన్ సౌదీ ప్రేరణతో వహాబీ ఇస్లాం వైపు మొగ్గు చూపింది. ఇక్కడి నుంచే ఇరు దేశాల మధ్య అపార్థాలు పెరగడం మొదలైంది. పాకిస్తాన్ జనాభాలో అధికశాతంలో సున్నీ ముస్లింలు ఉన్నారు. ఇరాన్లో షియా ముస్లింల సంఖ్య అధికంగా ఉంది. షియా.. సున్నీ గ్రూపులు రెండూ ముస్లిం మతానికే చెందినవైనప్పటికీ వారి నమ్మకాలు, సిద్ధాంతాలలో తేడా ఉంది. సాధారణంగా సున్నీలను ఫండమెంటలిస్టులుగా పరిగణిస్తారు. షియా ముస్లింలను మితవాదులని అంటారు. కొన్ని శతాబ్దాల క్రితం ఇస్లాం స్థాపకుడు ప్రవక్త మహమ్మద్‌ను షియా ముస్లింలు హత్య చేసిన దరిమిలా షియా.. సున్నీ ముస్లింల మధ్య వివాదం మొదలైంది. విభజన సమయంలో.. 1947 ఆగస్టు 14న భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు, పాకిస్తాన్‌ను ఒక దేశంగా గుర్తించిన మొదటి దేశం ఇరాన్. ఈ రెండు దేశాలు భౌగోళికంగా దగ్గరి అనుసంధానంతో 990 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. 1947 తరువాత ఇరాన్, పాకిస్తాన్ మధ్య పలు స్నేహపూర్వక ఒప్పందాలు కుదిరాయి. ఇరాన్లో పాకిస్తాన్ తన తొలి రాయబార కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది. భారత్- పాక్ యుద్ధ సమయంలో.. 1965లో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ అనేక బాంబర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ సామగ్రిని పాకిస్తాన్‌కు అందించింది. ఈ ఉదంతాన్ని చూస్తే పాకిస్తాన్, ఇరాన్ మధ్య స్నేహాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో ఇరాన్.. పాకిస్తాన్‌కు పూర్తిస్థాయిలో దౌత్య, సైనిక మద్దతు ఇచ్చింది. అంతే కాదు బలూచ్‌లు పాకిస్తాన్‌పై తిరుగుబాటును ప్రారంభించినప్పుడు, బలూచ్‌ల నిరసనను అణచివేయడంలో ఇరాన్.. పాకిస్తాన్‌కు సహాయం చేసింది. ప్రతిఫలంగా పాకిస్తాన్ అణు శాస్త్రవేత్తలు ఇరాన్లో అణు కార్యక్రమాలను అభివృద్ధి చేయడంలో సహకరించారు. షియా, సున్నీల అంతర్గత పోరు 1990వ దశకంలో పాకిస్తాన్లో షియా, సున్నీల మధ్య అంతర్గత పోరు ఊపందుకున్నప్పుడు, ఇరాన్ షియాలను రెచ్చగొడుతోందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మొదలైంది. దీనికితోడు లాహోర్‌లో ఇరాన్ దౌత్యవేత్త సాదిక్ గంజి హత్య, 1990లో పాకిస్తాన్-ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను దారుణంగా హతమార్చడం వంటివి ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్, ఇరాన్‌ల వైరుధ్య విధానాలు కూడా ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి కారణంగా నిలిచాయి. పాకిస్తాన్ నిరంతరం తాలిబాన్‌కు మద్దతు పలుకుతుంటుంది. ఈ నేపధ్యంలో ఇరాన్.. పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2014లో ఐదుగురు ఇరాన్ సైనికులను పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఉల్-అద్ల్ కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఇరాన్.. పాక్‌పై సైనిక చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఉద్రిక్తంగా పాక్- ఇరాన్ సంబంధం నిపుణుల అభిప్రాయం ప్రకారం 2021 నుండి పాకిస్తాన్-ఇరాన్ సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇరు దేశాలు పలు ఒప్పందాలు, సంయుక్త సైనిక విన్యాసాలపై సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యం కూడా పెరగడం ప్రారంభమైంది. దీనికితోడు ఈ రెండు దేశాలు విద్యుత్ పంపిణీ లైన్‌ను ప్రారంభించాయి. 2023లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటించారు. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులపై పట్టు బిగించలేకపోయింది. అయితే ఇటీవల ఇరాన్లో జరిగిన ఉగ్రదాడిలో పాక్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో పాకిస్తాన్‌పై ఇరాన్ ఆకస్మిక దాడి చేసింది. దీంతో పాకిస్తాన్-ఇరాన్ సంబంధాలు తిరిగి ఉద్రిక్తంగా మారాయి. బలపడిన భారత్- ఇరాన్ బంధం పాకిస్తాన్, ఇరాన్ మధ్య సంబంధాలు క్షీణించిన తరువాత, భారత్, ఇరాన్ మధ్య సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. 2001లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇరాన్లో పర్యటించి, పలు కీలక ఒప్పందాలు చేసుకున్న దరిమిలా భారత్-ఇరాన్ సంబంధాలు మరింత బలపడ్డాయి. అటల్ తరహాలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2016లో ఇరాన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో 12కి పైగా కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాత 2018లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ భారత్‌కు వచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలో ధృడత్వం ఏర్పడింది. 2022 సంవత్సరంలో మొదటిసారిగా సమర్కండ్లో ప్రధాని మోదీ..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కలుసుకున్నప్పుడు భారత్-ఇరాన్ సంబంధాల బలోపేతాన్ని అన్ని దేశాలు చూశాయి. -
2023లో భారత్- చైనా సంబంధాలు ఎలా ఉన్నాయి?
భారత్‌లోని తూర్పు లడఖ్‌లో 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత కూడా చైనా తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మోహరించిన అదనపు దళాలను పూర్తిగా ఉపసంహరించుకోలేదు. ఈ విషయంలో చైనా అనుసరించిన వైఖరి కారణంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 2023లో కూడా సాధారణ స్థాయికి రాలేదు. ఈ నేపధ్యంలో జరిగిన పలు దౌత్య, సైనిక చర్చల ఫలితాలు నిరాశనే మిగిల్చాయి. లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా దళాలతో గతంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘర్షణల్లో నలుగురు చైనా సైనికులు మరణించారు. ఈ ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో అప్పటికే కొనసాగుతున్న ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించి, లడఖ్‌లోని సరిహద్దుల్లో చైనా వేలాది మంది సైనికులను మోహరించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య రెండు అనధికారిక శిఖరాగ్ర సమావేశాలు జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రతిష్టంభనలోనే ఉన్నాయి. పాంగోంగ్ లేక్ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణల తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో 2020, మే 5 నుంచి ప్రతిష్టంభన నెలకొంది. 2020, జూన్‌లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. తూర్పు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారత్, చైనా సైనికుల మధ్య మూడేళ్లకు పైగా ప్రతిష్టంభన నెలకొంది. చైనా-భారత్ సంబంధాల ప్రస్తుత స్థితికి సంబంధించి చైనాలోని మాజీ భారత రాయబారి అశోక్ కాంత్ మాట్లాడుతూ 2020 నుండి నాలుగు సంవత్సరాలుగా రెండు వైపులా మోహరించిన అదనపు దళాల ఉపసంహరణకు సంబంధించి గణనీయమైన పురోగతి కనిపించలేదు. చైనా చేపట్టిన ఏకపక్ష చర్య కారణంగా, తూర్పు లడఖ్‌లోని సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉంది. ఇరు దేశాల సంబంధాలలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారతదేశం కృషి చేస్తోందని ఆయన అన్నారు. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరస్పర ఆమోదయోగ్యమైన, వేగవంతమైన పరిష్కారం కోసం భారతదేశం, చైనాలు 20 రౌండ్ల చర్చలు జరిపాయి. ఈ చర్చల ద్వారా ఐదు సంఘర్షణ పాయింట్ల నుండి దళాలను ఉపసంహరించుకున్నట్లు కాంత్ తెలిపారు. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పితే తప్ప చైనాతో సంబంధాలు సాధారణ స్థాయికి చేరవని భారత్ చెబుతోంది. అయితే ద్వైపాక్షిక సంబంధాలను పక్కనపెట్టి, సరిహద్దుల్లోని పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలని చైనా.. భారత్‌పై ఒత్తిడి తెస్తోంది. ఇది కూడా చదవండి: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు! -
చంద్రమోహన్, కె విశ్వనాథ్‌కు రిలేషన్.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
తెలుగు సినిమారంగంలో కళాతపస్విగా గుర్తింపు తెచ్చుకున్న కె.విశ్వనాథ్ చేసిన సేవలు ఎనలేనివి. ఆయన చివరి శ్వాస వరకు కళామతల్లికి సేవలందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన కన్నుమూశారు. తాజాగా మరో సినీ దిగ్గజాన్ని టాలీవుడ్ కోల్పోయింది. దాదాపు 932 సినిమాల్లో నటించిన మరో కళామతల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో ఓకే ఏడాదిలో రెండు సినీ దిగ్గజాలను కోల్పోవడాన్ని తెలుగు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కె. విశ్వనాథ్, చంద్రమోహన్ మధ్య రిలేషన్ ఏంటి? అసలు వీరిద్దరికీ ఉన్న బంధుత్వమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం. అదే విధంగా ఎస్పీబాలుకు, వీరిద్దరికి బంధుత్వం ఎలా వచ్చిందో చూద్దాం. (ఇది చదవండి: Chandra Mohan Death: విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత) కె విశ్వనాథ్‌కి, సీనియర్ నటుడు చంద్రమోహన్‌తోనూ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. శంకరాభరణం చిత్రానికి విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించగా.. చంద్రమోహన్ కీలపాత్ర పోషించారు. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే సూపర్ హిట్‌గా నిలిచి..జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఎస్పీ బాల సుబ్రమణ్యం పాటలు పాడారు. అయితే కె విశ్వనాథ్ 1966లో ఆత్మ గౌరవం అనే చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయం కాగా.. అదే ఏడాది రంగులరాట్నం చిత్రంతో నటుడిగా చంద్రమోహన్ టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) పెదనాన్న కుమారుడే విశ్వనాథ్! ఇదిలా ఉండగా మా పెదనాన్న కుమారుడే కె.విశ్వనాథ్ అని చంద్రమోహన్ చెప్పారు. తన అన్నయ్య విశ్వనాథ్ చనిపోయినప్పుడు పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. చంద్రమోహన్ పెదనాన్న రెండో భార్య కొడుకు కె.విశ్వనాథ్ కాగా.. చంద్రమోహన్ తల్లి, కె.విశ్వనాథ్ తండ్రి మొదటి భార్య అక్కా చెల్లెల్లు కావడంతో వీరద్దరు అన్నదమ్ములు అవుతారు. వీరిద్దరి కాంబినేషన్లో సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, సీతకథ చిత్రాలు వచ్చాయి. నాలో ఉన్న ప్రతిభను బయటికి తీసి అద్భుతమైన నటుడిగా తీర్చిదిద్దింది ఆయనేనని చంద్రమోహన్ గతంలో వెల్లడించారు. గతంలో కె. విశ్వనాథ్ గురించి చంద్రమోహన్ మాట్లాడుతూ..'సినిమా బంధం కంటే మా ఇద్దరి మధ్య కుటుంబ బాంధవ్యమే ఎక్కువ. అందరికంటే నేను ఆయనకు చాలా దగ్గరివాడిని. మద్రాసులో ఉన్నప్పుడు ఒకేచోట స్థలం కొనుకున్నాం. పక్క పక్కనే ఇళ్లు కూడా కట్టుకుని 25 ఏళ్ల ఉన్నాం. అంతటి అనుబంధం మాది' అని అన్నారు. ఎస్పీ బాలుతోనూ బంధుత్వం సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యంతోనూ వీరిద్దరి బంధుత్వం ఉంది. చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. అలా వీరి మధ్య కూడా అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇలా అనుకోకుండా ముగ్గురికి కుటుంబాల పరంగా మంచి అనుబంధం ఉంది. చివరికీ వరుసకు ముగ్గురు అన్నదమ్ములు కావడం మరో విశేషం. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన శంకరాభరణం సినిమా ఇండస్ట్రీలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గురుపత్వంత్ సింగ్ ఎవరు? భారత్- కెనడాల మధ్య ఎలా చిచ్చుపెడుతున్నాడు?
భారతదేశం-కెనడాల మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్నాయి. కెనడా ప్రభుత్వం తమ దేశంలో ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలను అరికట్టకపోవడమే ఇందుకు కారణం. ఢిల్లీలో ఇటీవల జరిగిన జీ-20 సదస్సులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై పీఎం నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించలేదు. ఈ కఠినమైన ప్రవర్తనకు స్పందనగా ట్రూడో తమ దేశంలోని సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) గ్రూప్‌తో సంబంధం ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించింది. అలాగే ఒక అగ్రశ్రేణి భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఒక సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కెనడావి నిరాధార ఆరోపణలు కెనడా ఆరోపణలను అసంబద్ధమని, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలుగా భారత్ అభివర్ణించింది. కెనడాలో రక్షణ పొందుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చేందుకే కెనడా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) పేర్కొంది. భారతదేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే ఖలిస్తాన్ మద్దతుదారులపై అక్కడి ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కెనడాలో ఖలిస్థాన్ అనుకూల తీవ్రవాదుల భారత వ్యతిరేక నిరసనల సంఖ్య పెరిగింది. ఆ భారత దౌత్యవేత్తలను హత్య చేయాలంటూ.. ఈ ఘటనల్లో నిషేధిత ఖలిస్థానీ అనుకూల గ్రూప్ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) హస్తం ఉన్నట్లు తేలింది.ఈ సంఘంతో సంబంధం ఉన్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల కెనడాలో నివసిస్తున్న హిందువులను దేశం విడిచి వెళ్లాలని కోరింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ అమృత్సర్ జిల్లాలోని ఖాన్కోట్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి పంజాబ్ స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డులో ఉద్యోగి. పంజాబ్ యూనివర్శిటీ, చండీగఢ్‌లో న్యాయ పట్టా పొందిన పన్నూ.. సిక్ ఫర్ జస్టిస్‌కు న్యాయ ప్రతినిధి. అతనికి కెనడాతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. భారత్‌ను వదిలి విదేశాలకు వెళ్లిన పన్నూ తొలుత అక్కడ డ్రైవర్‌గా పనిచేశాడు. కొంతకాలం తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టాడు. జులై 2023లో ఒక వీడియోను విడుదల చేసిన పన్నూ.. ఉత్తర అమెరికా, యూరప్‌లోని భారతీయ దౌత్యవేత్తలను హత్య చేయాలని పిలుపునిస్తూ పోస్టర్లను ముద్రించాడు. భారత ప్రభుత్వం గురుపత్వంత్ సింగ్ పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్ సిక్కుల మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నదంటూ.. కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయించడమే కాకుండా పన్నూ మరో వీడియోలో ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను కూడా బెదిరించాడు. పన్నూపై భారత్‌లో దేశద్రోహ కేసుతో సహా 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఖలిస్తాన్‌కు మద్దతుగా పన్నూ అమెరికా, కెనడా తదితర దేశాల్లో కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాడు. భారతదేశం సిక్కుల మానవ హక్కులను ఉల్లంఘిస్తోందనే ఆరోపణలు గుప్పిస్తున్నాడు. అతనిపై అంతర్జాతీయ స్థాయిలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని భారత్ కోరినప్పటికీ ఇంటర్‌పోల్ ఇంకా నోటీసు జారీ చేయలేదు. కెనడా క్యాబినెట్లో నలుగురు సిక్కు మంత్రులు కెనడాలో సిక్కు జనాభా గణనీయంగా ఉంది. ఇమ్మిగ్రేషన్ విధానం చాలా ఉదారంగా ఉన్న పాశ్చాత్య దేశాలలో కెనడా ఒకటని చెబుతారు. కెనడాలో గణనీయమైన సంఖ్యలో భారత సంతతికి చెందినవారు ఉన్నారు. అందులో ముఖ్యంగా సిక్కులు అధికంగా ఉన్నారు. కెనడాలో ఏడున్నర లక్షల మందికి పైగా సిక్కులు నివసిస్తున్నారు. అక్కడ వారు వ్యాపార రంగం మొదలుకొని రాజకీయ రంగం వరకూ ప్రభావవంతంగా ఉన్నారు. ఈ నేపద్యంలో ఈ సిక్కు ఓటు బ్యాంకుకు ట్రూడో కాపాడుకుంటూ వస్తున్నారు. ట్రూడో తన మొదటి టర్మ్‌లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు సిక్కులకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చారు. ఆయన క్యాబినెట్లో నలుగురు సిక్కు మంత్రులు ఉన్నారు. అందుకే ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోకూడదని ట్రూడో భావిస్తున్నారని విశ్లేషకుల వాదన. అయితే కెనడాలోని చాలా మంది సిక్కులు అతని భావజాలానికి మద్దతునివ్వడం లేదని సమాచారం. ఎయిర్ ఇండియా విమానంపై బాంబు దాడి 1980 నుండి భారతదేశం- కెనడా మధ్య అగాధం పెరిగింది. 1985లో కెనడాకు చెందిన ఖలిస్తానీ వేర్పాటువాద బృందం ఎయిర్ ఇండియా విమానంపై బాంబు దాడి చేయడంతో ఇది మొదలయ్యింది. ఈ పేలుడులో విమానంలోని మొత్తం 329 మంది చనిపోయారు. ఈ బాంబు పేలుడుపై జరిగిన దర్యాప్తులో ఇంకా ఖచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. కాగా కొన్ని నెలల క్రితం బ్రాంప్టన్‌లో జరిగిన పరేడ్‌లో మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ చిత్రం రక్తంతో తడిసిన చీరలో కనిపించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. గత కొన్ని నెలలుగా కెనడాలో భారత వ్యతిరేక నిరసనలు తరచూ కనిపిస్తున్నాయి. కెనడా ప్రభుత్వం వాటిని నియంత్రించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చదవండి: ఖలిస్తాన్ అంటే ఏమిటి? పంజాబ్‌ను ఎందుకు వేరు చేయాలంటున్నారు? -
రైలు కదిలేముందు జర్క్ ఎందుకు? న్యూటన్ నియమంతో సంబంధం ఏమిటి?
భారతదేశంలో దాదాపు 125 కోట్ల మంది నివసిస్తున్నారు. వీరిలో చాలామంది దూర ప్రయాణాలకు రైళ్లను ఆశ్రయిస్తుంటారు. అయితే కొన్ని రైళ్లు బయలుదేరేముందు ఒక కుదుపునకు గురి చేసి, ఆ తర్వాత ముందుకు కదలడాన్ని మీరు గమనించేవుంటారు. ఇది ప్రతి రైలులోనూ జరగదు. కొన్ని రైళ్లలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఇటువంటి రైళ్ల ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రైళ్లలోనే జర్క్ అనుభూతి నిజానికి ఈ జర్క్కు కారణం రైలు కోచ్. కొన్ని రకాల కోచ్‌లు ఉన్న రైళ్లలో మాత్రమే మనకు ఈ జర్క్ అనేది వస్తుంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కలిగిన రైళ్లలో ఇటువంటి జర్క్ మనకు అనుభవానికి వస్తుంది. ఈ తరహా కోచ్‌లలో ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే కప్లింగ్ల డిజైన్ చాలా పాతదై ఉంటుంది. దీంతో వాటి స్థాయి ఇటువంటి జర్క్లను నియంత్రించేందుకు అనువుగా ఉండదు. వీటిలో తక్కువ జర్క్ ఐసీఎఫ్ కోచ్‌లు కలిగివున్న రైళ్లు వాటి కప్లింగ్లలో జర్క్ రెసిస్టెంట్ సస్పెన్షన్లను కలిగి ఉంటాయి. ఐసీఎఫ్ కోచ్‌లతో రైలు నడుస్తున్నప్పుడు చాలా స్వల్పస్థాయి జర్క్ మాత్రమే సంభవిస్తుంది. కప్లింగ్‌లు గుండ్రంగా ఉండి, రెండు కోచ్‌లు ఒకదానికొకటి అనుసంధానమయ్యే చోట ఉంటాయి. న్యూటన్ మొదటి నియమం.. న్యూటన్ మొదటి నియమం కూడా ఇటువంటి జర్క్కు కారణంగా నిలుస్తుంది. అదే జడత్వ నియమం. వాస్తవానికి మీరు రైలులో కూర్చున్నప్పుడు, మీ శరీరం స్థిరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో రైలు అకస్మాత్తుగా ముందుకు కదులుతున్నప్పుడు.. మీ శరీరం దాని స్థానంలో అది ఉన్నప్పటికీ, రైలు కదలిక కారణంగా జర్క్ అయినట్లు అనుభూతి కలుగుతుంది. ఇది కూడా చదవండి: శాంతినికేతన్‌తో చైనాకు లింకు ఏమిటి? -
అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ అజయ్ రాయ్ ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇదే స్థానంలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 1967లో ఏర్పడిన అమేథీ.. నాటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా 1970-1990వ దశకాల ప్రారంభంలో మినహా, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు లేదా వారి విధేయులు ఈ నియోజకవర్గంలో గెలుపొందుతూ వస్తున్నారు. అమేథీతో నెహ్రూ-గాంధీ కుటుంబానికి గల దశాబ్దాల నాటి సంబంధం గురించి ఇప్పుడు తెలుకుందాం. సంజయ్ గాంధీ (1980–81) గాంధీ-నెహ్రూ కుటుంబంలో అమేథీ లోక్‌సభ నుంచి పోటీ చేసిన తొలి వ్యక్తి సంజయ్ గాంధీ. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే జరిగిన 1977 లోక్‌సభ ఎన్నికల్లో సంజయ్ అమేథీ నుంచి పోటీ చేశారు. అయితే జనాభా నియంత్రణ కోసం సంజయ్ చేపట్టిన బలవంతపు స్టెరిలైజేషన్ కార్యక్రమం కారణంగా అతను ఘోరమైన ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. నాటి ఎన్నికల్లో జనతా పార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. సంజయ్ గాంధీ తిరిగి 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి, ఎంపీ అయ్యారు. అయితే 1981లో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ మరణించారు. అమేథీ ఎంపీగా స్వల్పకాలమే పనిచేశారు. రాజీవ్ గాంధీ (1981–1991) సంజయ్ మరణంతో రాజీవ్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981 మే 4న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఇందిరా గాంధీ తన చిన్న కుమారుని పేరును అమేథీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ సభ్యులందరూ ఈ సూచనను ఆమోదించారు. అనంతరం రాజీవ్ అమేథీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు. రాజీవ్ నాటి ఉప ఎన్నికలో అఖండ విజయాన్ని సాధించారు. లోక్‌దళ్ అభ్యర్థి శరద్ యాదవ్‌పై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజీవ్ 1981 ఆగస్టు 17న అమేథీ నుంచి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత కూడా రాజీవ్ 1984, 1989,1991లో అమేథీ నుండి గెలిచారు. దాదాపు దశాబ్దం పాటు ఈ సీటును నిలబెట్టుకున్నారు. 1991లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం రాజీవ్ గాంధీని హత్య చేసిన తర్వాత అమేథీలో తిరిగి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 1996 ఎన్నికల్లోనూ ఆయన తన విజయాన్ని పునరావృతం చేశారు. ఇది కూడా చదవండి: నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా! సోనియా గాంధీ (1999–2004) 1999లో రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ అమెథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఇక్కడి జనం నెహ్రూ-గాంధీ కుటుంబానికిచెందిన చెందిన నేతకు మరోసారి ఓటు వేశారు. అయితే అదే స్థానం నుంచి ఆమె మరోమారు ఎన్నికల బరిలోకి దిగలేదు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా స్వయంగా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయగా, రాహుల్ గాంధీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ (2004-2019) రాహుల్ తన తొలి ప్రయత్నం(2004)లోనే అమేథీ నుంచి గెలుపొందారు. 2009లో 3.70 లక్షల ఓట్ల భారీ తేడాతో తిరిగి ఎన్నికయ్యారు. 2014లో కూడా రాహుల్ ఇక్కడి నుంచే గెలిచారు. అయితే నాడు అతని ప్రత్యర్థి స్మృతి ఇరానీ అతనికి గట్టి పోటీనిచ్చారు. అయితే స్మృతి ఇరానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ను ఓడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ మళ్లీ అమేథీలో సత్తా చాటుతారని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం ఇందుకు కలసివస్తాయనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: కళలతో కోట్లు.. వీరి టర్నోవర్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..! -
Happy Friendship Day 2023: ఆత్మబంధానికి మించి బంధం మరొకటి లేదు!
ఒక మంచి మిత్రుడు వందసార్లు అలిగినా బతిమలాడటం నేర్చుకో. ఎందుకంటే.. నీ కంఠహారంలో ఒక్క బంగారు పూస జారితేనే దొరికేదాకా వెతుకుతావు కదా!నీ మనసెరిగిన స్నేహితుడు అంతకంటే ఎక్కువే మరి! ఈ కొటేషన్ స్నేహం విలువకు అసలైన నిర్వచనం. ఆస్తిపాస్తులు, ఆధునిక హంగులు ఎన్ని ఉన్నా, మనిషికి.. ఆత్మపరిశీలనను మించిన ప్రక్షాళన లేదు. మనసుకు.. ఆత్మబంధాలను మించిన ఆహ్లాదమూ ఉండదు. పుట్టుకతో రక్తసంబంధాలు ఏర్పడితే, ప్రవర్తనతో ఆత్మబంధాలు ముడిపడతాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు, వాటి నుంచి పుట్టే హావభావాలను బట్టే ఆ స్నేహాలు తోడుగా నిలుస్తాయి. గాలి మేఘంతో.. మేఘం నీటితో.. నీరు నేలతో.. నేల మొక్కతో.. మొక్క పువ్వుతో.. పువ్వు పరిమళంతో.. ఇలా సఖ్యత కుదిరిన ప్రతి చోటా స్నేహం వికసిస్తుంది. అయితే, స్వేచ్ఛ నెరిగిన పరిమళం వినువీధుల్లో విహరించేందుకు.. తిరిగి గాలితోనే జత కట్టినప్పుడు.. ప్రకృతి సహజమైన చక్రభ్రమణం ఏర్పడుతుంది. అదే సృష్టి పరిణామం. మరి అన్నివేళలా స్నేహ హస్తాన్ని అందించే గాలి విలువను పెంచాలన్నా, తుంచాలన్నా ఆ పరిమళం చేతిలోనే ఉంటుంది. ఎలా అంటే గాలిని అలముకున్నది సువాసనే అయితే, దాన్ని చుట్టూ ఉన్నవాళ్లు అమితంగా ఆస్వాదిస్తారు. అదే దుర్గంధమైతే ముక్కు చిట్లించి, ఉమ్మివేసి అవమానిస్తారు. ప్రతిమనిషి నేర్చుకోవాల్సిన మిత్రలాభ తంత్రం ఇదే.‘ధనసాధన సంపత్తి లేనివారయ్యియు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని, స్వకార్యములు సాధించుకొందురు’ అనేది ‘మిత్రలాభం’లోని మొదటి వాక్యం. అంటే డబ్బు, సంపద లేకపోయినా బుద్ధిమంతులైన వాళ్లు ఒకరితో ఒకరు స్నేహం చేసి పరస్పర ప్రయోజనాలు సాధించుకోగలరు అని అర్థం. కలిగినదాన్ని పంచుకోవడం, రహస్యాలను చెప్పుకోవడం, సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం, ఆపదలో ఒకరిని ఒకరు రక్షించుకోవడం.. ఇవే స్నేహాన్ని, ప్రీతిని తెలిపే గుణాలు. కానుకలిస్తే దేవతలే సంతోషిస్తారు. కేవలం గడ్డి వేసినందుకు.. తన దూడ సంగతైనా చూడకుండా, గడ్డి వేసినవాడికి ఆవు పుష్కలంగా పాలిస్తుంది. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నప్పుడే నిజమైన ప్రేమతో కూడిన స్నేహం బలపడుతుంది. ఇదే స్నేహధర్మం. సినిమాల్లో కొన్ని స్నేహాలు ప్రేమదేశం (1996): స్నేహం కోసం ప్రేమనే త్యాగం చేసే స్నేహితుల కథ. స్నేహం కోసం (1999): స్నేహానికి.. సేవకుడు, యజమాని అనే తేడా లేదని చూపించిన సినిమా. ఇద్దరు మిత్రులు (1999): స్నేహానికి ఆడ, మగ అనే లింగభేదం ఉండదని తెలిపే కథ. స్నేహమంటే ఇదేరా (2001): ‘కుటుంబం ఎక్కువా? స్నేహమెక్కువా?’ అంటే నేస్తాన్నే ఎంచుకున్న గొప్ప స్నేహితుడి జీవితం. నీ స్నేహం (2002): తన జీవితాన్నే త్యాగం చేసేంత గొప్ప స్నేహితుడు.. మన జీవితంలో ఉంటే ఎంత బాగుంటుందో అనిపించే సినిమా. వసంతం (2003): ఫ్రెండ్ జీవితం బాగుండాలని తనకిష్టమైన గమ్యాన్ని వదిలిపెట్టిన ఓ స్నేహితుడి కథ. హ్యాపీ డేస్ (2007): ఎన్ని అపార్థాలొచ్చినా నిజమైన స్నేహం ఎప్పటికీ విడిపోదని చూపిన సినిమా. ఉన్నది ఒకటే జిందగీ (2017): ఈ ప్రపంచంలో మనిషిగా నిలబడాలంటే స్నేహితులు కావాల్సిందేనని చెప్పిన సినిమా. కేరాఫ్ సూర్య (2017): ఏ ఆపదైనా తనని దాటాకే.. తన స్నేహితుడ్ని చేరాలనుకునే దమ్మున్న ధీరుడి కథ. మహర్షి (2019): ఫ్రెండ్ తన కోసం చేసిన త్యాగాలను తెలుసుకుని.. తిరిగి ఆ ఫ్రెండ్ కళ్లల్లో ఆనందం చూడటానికి ఎన్నో మెట్లు దిగిన గొప్ప స్నేహితుడి పరిచయం ఈ సినిమా. ఆర్ఆర్ఆర్ (2022): ఇద్దరు స్నేహితుల ఆశయాలూ గొప్పవే. కానీ ప్రయత్నాలే వేరు. వారి స్నేహం, బంధం అన్నదమ్ముల్ని తలపిస్తూ ఉంటుంది. న్యాయపోరాటంలో ఇద్దరి అడుగులూ ఒక్కటిగా కదిలే కథనమిది. పాటల్లో మైత్రి ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా (ప్రేమ దేశం), దోస్త్ మేరా దోస్త్ (పెళ్లి పందిరి), మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ (స్నేహమంటే ఇదేరా), కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట (నీ స్నేహం), పాదమెటుపోతున్నా పయనమెందాకైనా (హ్యాపీ డేస్), ట్రెండు మారినా ఫ్రెండు మారడే (ఉన్నది ఒకటే జిందగీ) 12 మనస్తత్వాలమిత్రులు మనకోసం ‘శత్రువు ఒక్కడైనా ఎక్కువే.. మిత్రులు వందమంది అయినా తక్కువే’ అన్నారు స్వామీ వివేకానంద. జీవితంలో ఎంతమంది మిత్రులున్నా స్నేహాన్వేషకులకు చాలదు. ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఈ 12 రకాల స్నేహితులు దక్కితే.. జిందగీ సాఫీగా సాగుతుందట. 1. ఎమోషనల్ పర్సన్ నీ ముఖంలో చిరునవ్వు చెదిరితే తన కళ్లల్లో నీళ్లొచ్చేంత భావోద్వేగం తనలో ఉంటే.. ఆ బంధం మరణం దాకా శాశ్వతంగా ఉంటుంది. ఇలాంటి దోస్తులు ఆపదలో వెన్నంటే ఉంటారు. 2. మార్గదర్శి బంధువుల్లో, పొరుగువారిలో లేదా తెలిసినవారిలో ఆదర్శంగా నిలిచినవారే ఈ మార్గదర్శి. ఇలాంటి వారితో స్నేహం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కెరీర్లో సెటిల్ కావడానికి.. భవిష్యత్తులో ముందడుగు వేయడానికి వీరి సలహాలు ఎంతో ఉపయోగపడతాయి. 3. నాయకత్వ లక్షణాలతో ఉన్నవారు.. ఇలాంటి వారు సామాజికంగా చాలా చురుకుగా ఉంటారు. వీరికి మంచి నెట్వర్క్ ఉంటుంది. సేవాగుణం కూడా ఉంటుంది. ఇలాంటి వారికి చాలా విషయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది. మనం ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు ఇలాంటివాళ్ల సాయంతో సురక్షితంగా బయటపడొచ్చు. 4. డిఫరెంట్ మైండ్ సెట్.. మనకు మనలానే ఆలోచించే స్నేహితులుంటే ప్రపంచానికి మనం దూరమయ్యే ప్రమాదం ఎక్కువ. అందుకే మన ఆలోచనలకు వ్యతిరేక దిశలో ఆలోచించే స్నేహితులు కూడా ఉండాలి. అప్పుడే మనలో మానసిక సంఘర్షణ మొదలవుతుంది. మంచి, చెడులతో పాటు లోకం పోకడ అర్థమవుతుంది. ఇలాంటి వారితో స్నేహం.. వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పడుతుంది. కొన్ని మంచి కొటేషన్లు స్నేహితుడు దైవంతో సమానం. కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది. – మహాత్మా గాంధీ నేను కాంతిలో ఒంటరిగా కాకుండా.. చీకటిలో స్నేహితుడితో నడవడానికి ఇష్టపడతాను. – హెలెన్ కెల్లర్, అమెరికన్ రచయిత్రిఒక వ్యక్తి మరో వ్యక్తితో... ఇక్కడ నేనే ఉన్నాను అనుకున్నాను. నువ్వు కూడా ఉన్నావా? అన్నప్పుడు స్నేహం మొదలవుతుంది. – సీఎస్ లెవిస్, బ్రిటిష్ రచయితనా స్నేహితులే నా ఆస్తి. – ఎమిలీ డికిన్సన్, అమెరికన్ కవయిత్రి (చదవండి: ‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పనెందుకు!) -
డైరెక్టర్‌తో బుల్లితెర నటి రిలేషన్?.. భర్త ఉండగానే!
గుప్పెడంత మనసు సీరియల్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి జ్యోతి రాయ్. కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటి దాదాపు 20కి పైగా సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ కనిపించింది. శాండల్‌వుడ్‌లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో జ్యోతిరాయ్ ఒకరు. ప్రస్తుతం సీరియల్స్‌తో పాటు ప్రెట్టీ గర్ల్ అనే క్రైమ్ థిల్లర్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తాజాగా శాండల్‌వుడ్ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం. బుల్లితెర భామ జ్యోతిరాయ్ ఓ యువ దర్శకుడితో రిలేషన్లో ఉందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే వీరి బంధం నిజమేనని తెలుస్తోంది. గతంలో శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుకు పుర్వాజ్‌తో రిలేషన్లో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాలు రెండూ ఓటీటీ వేదికగా అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ అనే చిత్రాన్ని సుకు తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: అసలు ఆ డైలాగ్స్ ఏంటి.? ఆలియా భట్ మూవీపై తీవ్ర అభ్యంతరం!) వీరిద్దరూ సన్నిహితంగా ఉంటూ ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేయడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతే కాకుండా వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు సీరియల్ నటి సుజాత పెట్టిన కామెంట్ చూస్తే తెలిసిపోతుంది. సుజాత 'లవ్ లవ్ అండ్ లవ్ యూ బోత్.. కీప్ రాకింగ్ ఆల్వేస్' అంటూ కామెంట్ పెట్టగా.. ‘థాంక్యూ డియర్’ అంటూ జ్యోతిరాయ్ కూడా రిప్లై ఇచ్చింది. కాగా.. జ్యోతిరాయ్‌కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా.. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. జ్యోతిరాయ్ నటి కావడానికి కూడా అతనే కారణమని కన్నడ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. దీంతో జ్యోతిరాయ్.. దర్శకుడు సుకు పుర్వాజ్ అలియాస్ సురేశ్ కుమార్‌తో రిలేషన్లో ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. సీరియల్స్‌తో పాటు కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. రాయ్ దియా, గంధాడ గుడి లాంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది జ్యోతి రాయ్. (ఇది చదవండి: మద్యానికి బానిసైన సన్నీ లియోన్ తల్లి.. ఆ వీడియోల వల్లే!) కర్ణాటకలోని మడికేరిలో జన్మించిన జ్యోతిరాయ్.. మంగళూరులో చదివుకుంది. జ్యోతి రాయ్ కన్నడలో విను బలాంజ సీరియల్ 'బందె బరాటవ కాలా' ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్‌లో నటించింది. జ్యోతి 'జోగుల', 'జో జో లల్లీ', 'గెజ్జేపూజే', 'శుభమంగళ', 'లవలవికే', 'ప్రేరణ', 'కిన్నెరి', 'సిల్లీ లల్లీ', 'సవలిగే సై', 'మురు గంటు', 'శాంతల', 'కన్యాశుల్కం' వంటి సినిమాల్లోనూ కనిపించింది. 20కి పైగా సీరియల్స్‌లో నటించిన జ్యోతిరాయ్.. తుళు, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో నటించారు. వీటితో పాటు 'సీతారామ కళ్యాణ', 'గంధాడ్ గుడి', '99', 'దియ వర్ణపాటల' సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు వెబ్ సిరీస్‌ల వైపు మళ్లింది. View this post on Instagram A post shared by Suku Purvaj (Suresh Kumar) (@sukupurvaj) View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) -
36 ఏళ్లుగా అతనినే తండ్రి అనుకుంది.. తల్లి అసలు రహస్యం చెప్పగానే..
ఒక్కోసారి కుటుంబంలోని ఎవరో ఒకరు ఏళ్ల తరబడి దాచివుంచే రహస్యాలు బయటపడితే ఆ క్షణంలో ఇంటిలోనివారి అనుబంధంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. ఇంగ్లండ్‌లోని టిఫనీ గార్డ్నర్ తన తండ్రి క్యాన్సర్‌తోనే మరణించాడనే భావనతోనే పెరిగిపెద్దయ్యింది. అతని తల్లి, సవతి తండ్రి ఏలోటూ లేకుండా ఆమెను ఆలనాపాలనా చూస్తున్నారు. అయితే టిఫనీ చిన్నప్పటి నుంచి తన అసలు తండ్రి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూవస్తోంది. మృతి చెందిన తన తండ్రి ఔరక్ మేక్ నుంచి తనకు ఏ గుణాలు వచ్చాయో తెలుసుకోవాలనుకునేది. తన తండ్రి బతికి ఉంటే అతనితో తన అనుబంధం ఎలా ఉండేదోనని ఆలోచిస్తుండేది. మూడు దశాబ్ధాలుగా తన కన్న తండ్రి మరణించాడని భావిస్తూ వచ్చిన ఆమెకు ఒకరోజు అసలు నిజం తెలిసింది. 2018లో టిఫనీకి.. తాను ఒక అజ్ఞాత వ్యక్తి డొనేట్ చేసిన స్మర్మ్ నుంచి పుట్టినదానినని తెలిసింది. దీంతో తన తండ్రి ఎక్కడో ఒకచోట బతికే ఉంటాడని ఆమెకు అనిపించింది. టిఫనీ ‘ది మిర్రర్’తో మాట్లాడుతూ తన తల్లి.. తన పెంపుడు తండ్రి దగ్గర ఒక మాట తీసుకున్నదని, దాని ప్రకారం తన నిజమైన తండ్రి ఎవరో తనకు చెప్పకూడదని తన తల్లిదండ్రులిద్దరూ నిర్ణయించుకున్నారని తెలిపింది. పైగా 1982లో వైద్యులు కూడా ఇన్‌ఫెర్టైల్ బాధితులకు తాము ఎవరి నుంచి స్మెర్మ్ తీసుకున్నామనేది గోప్యంగా ఉంచేవారు. తన జీవితం ఒక్కసారిగా మారిపోయిన రోజును టిఫనీ ఎప్పటికీ మరచిపోలేదు. టిఫనీకి తన 36వ జన్మదినాన ఈ విషయం తెలిసింది. ఇంటిలోని వంటగదిలో తల్లి స్వయంగా ఈ విషయాన్ని టిఫనీకి తెలిపింది. తల్లి మాటలు వినగానే టిఫనీకి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లయ్యింది. అయితే ఆలోచించుకుంటే.. తన మంచి కోసమే తల్లి ఇన్నాళ్లూ ఈ సంగతిని దాచివుంచిందని ఆమెకు అనిపించింది. తనకు తల్లీదండ్రులతో సహజమైన అనుబంధం కొననాగాలనే ఉద్దేశంతోనే ఈ విషయం ఇన్నాళ్లూ చెప్పలేదని టిఫనీకి తల్లి చెప్పింది. ఇది కూడా చదవండి: పామును పట్టి, బస్తాలో బంధించి.. ఆసుపత్రిలో యువకుని హల్చల్! -
ట్రంప్ దిగజారితే, కొడుకు ఏం తక్కువ తిన్నాడు? వేధించి వశపర్చుకున్నాడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తండ్రికి ఏమాత్రం తగ్గని రీతిలో అతని కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా వ్యవహరిస్తున్నాడనే వార్తలు గుప్పుముంటున్నాయి. తాజాగా అమెరికన్ గాయని ఆబ్రే ఓ డే.. జూనియర్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. సుదీర్ఘ కాలంగా జూనియర్ ట్రంప్‌తో తనకు అఫైర్ ఉన్నట్లువస్తున్న ఆరోపణలు ఒక స్వలింగ సంపర్కుల క్లబ్‌లోని బాత్రూమ్లో మొదలయ్యాయన్నారు. పాడ్‌కాస్ట్‌లో వివరాలు వెల్లడి.. మైకేల్ కోహెనెకు చెందిన ‘మేయా కుల్పా’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న 34 ఏళ్ల ఆబ్రే ఓ డే తొలిసారిగా తనకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని వెల్లడించింది. తనను జూనియర్ ట్రంప్ వేధించి లైంగికంగా సంబంధం ఏర్పరుచుకున్నాడని ఆరోపించింది. మేము మొదటిసారి ఒక గే క్లబ్‌కు వెళ్లాం. అప్పుడు అతను నా వైపు చెడుగా చూశాడు. ఈ రాత్రికి క్లబ్‌లోనే ఉంటానని అన్నాడు. అది న్యూయార్క్‌లో అతి పెద్ద క్లబ్. దాని భారీ ఎత్తున గే పార్టీలు జరుగుతుంటాయి. ఆబ్రే ఓ డేకు అప్పుడు మరో మార్గం లేదు అని అనుకుంది. అతని ఇన్‌స్టాగ్రామ్‌లో.. పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆబ్రే ఓ తాను అతని ఇన్‌స్టాగ్రామ్‌ని మొదటిసారి చూశానని, దానిలో గే కమ్యూనిటీని కించపరిచే అన్ని రకాల జోక్‌లు ఉన్నాయని తెలిపారు. మేము మొదటిసారిగా గే క్లబ్ బాత్రూమ్లో లైంగిక చర్యలో పాల్గొనడం చాలా సౌకర్యంగా ఉంది అని అతను పేర్కొన్నాడని ఆమె ఆరోపించింది. ఈ జంట శారీరకంగా కలవడం ఇదే మొదటిసారి అయినప్పటికీ, మాజీ డానిటీ కేన్ ఫ్రంట్ వుమన్.. వీరు గతంలోనే బలమైన భావోద్వేగ బంధాన్ని పంచుకున్నారని వెల్లడించింది. ‘సెలబ్రిటీ అప్రెంటిస్’లోనూ.. ఆబ్రే ఓ డే తెలిపిన వివరాల ప్రకారం ఈ జంట 2011లో ‘సెలబ్రిటీ అప్రెంటిస్’లో తొలిసారిగా కలుసుకున్నారు. ఒకరిని చూసి మరొకరు నవ్వుకున్నారు. పార్టీలో ఏదైనా ఫన్నీగా జరిగిప్పుడు మేము ఒకరినొకరు చూసుకున్నాం. అప్పుడే సన్నిహితులమయ్యాం అని ఆమె తెలిపింది. తాను ఎప్పటికీ అతనిని ప్రేమిస్తూనే ఉంటానని ఆబ్రే ఓ పేర్కొంది. కాగా గత ఏడాది పేజ్ సిక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆబ్రే ఓ తనకు జూనియర్ ట్రంప్‌తో ఉన్నసంబంధం గురించి ప్రస్తావించింది.అయితే జూనియర్ ట్రంప్ దీనిపై స్పందించలేదు. ఇదికూడా చదవండి: అతను 16 సార్లు వ్యోమనౌకలో భూమిని చుట్టబెట్టాడు.. అంతలోనే.. -
Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్‌కు ఎలా పరిచయం?
టాలీవుడ్ నుంచి బాలీవుడ వరకు అందరి చూపు ప్రభాస్ 'ఆదిపురుష్' పైనే ఉంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో తాజాగా అందరి చూపు ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్‌పై పడింది. ఈ పేరు ఇప్పుడు భారతదేశం అంతటా మారుమోగుతోంది. ఎవరితను..? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎన్ని సినిమాలు చేశాడు? అంటూ గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అతను ముంబయిలో పుట్టాడు.. తల్లి నీనా టెలివిజన్ నిర్మాత అయితే కాగా తండ్రి భరత్ కుమార్ ఒక జర్నలిస్ట్, రాజ్యసభ సభ్యుడు కూడా.. ఓం రౌత్ తాత సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అందుకే ఇతనికి సినిమాలంటే ఫ్యాషన్ ఏర్పడింది. (ఇదీ చదవండి: Adipurush: హనుమాన్కు కేటాయించిన సీట్ ఇదే) మొదట అతను బాల నటుడిగా పని చేశాడు, అలాగే కాలేజీలో జరిగే నాటకాల పోటీల్లో కూడా పాల్గొనేవాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే కథానాయకుడిగా 'కారమతి కోట్' అనే సినిమా చేశాడు. ఆ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఒక కీ రోల్ చేశాడు. మరాఠీ భాషలో 'లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్' అనేది ఆయనకు మొదటి సినిమా. ఓం రౌత్, అతని తల్లి నీనా ఇద్దరూ కలిపి 'నీనా రౌత్ ఫిలిమ్స్' పేరుతో నిర్మించారు. ఇది అందరి ప్రసంశలు అందుకున్న సినిమానే కాకుండా, బెస్ట్ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అతనికి వచ్చింది. మొదటి సినిమాతోనే అక్కడ భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. (ఇదీ చదవండి: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ) ప్రభాస్‌తో ఓం రౌత్ పరిచయం ఎక్కడ జరిగిందంటే టి సిరీస్ సంస్థతో ప్రభాస్‌కు మంచి అనుబంధం వుంది. సాహో , రాధే శ్యామ్ సినిమాల సమయంలో వారి సంస్థతో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చారట. అప్పటికే అదే సంస్థలో వున్న ఓం రౌత్ అప్పుడు జపాన్‌కి చెందిన సినిమా 'రామాయణ: ది లెజెండ్ అఫ్ ప్రిన్స్ రామ' అనే హిందూ పురాణ కథ ఆధారంగా నిర్మించిన సినిమా నుండి స్ఫూర్తి పొందాడు. ఇది 1992లో జపాన్‌లో విడుదల అయింది. ఈ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి ఆధునిక సాంకేతిక సాయంతో ఎందుకు రామాయణం తీయకూడదు అనే ఆలోచన వచ్చి అదే విషయాన్ని టి సిరీస్ సంస్థ ప్రతినిదులకు చెప్పడంతో.. అలా ఆదిపురుష్‌కు అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత టీ సిరీస్ వల్ల అతనికి ప్రభాస్ పరిచయం అయ్యాడు. మొత్తానికి ఓం రౌత్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు.. ఆ సినిమాలు అన్ని విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కూడా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. -
శ్రీముఖితో ఉన్న రిలేషన్ ను బయట పెట్టిన సాయి శ్రీ చరణ్...
-
శ్రీముఖి తో వున్న రీలేషన్ ని రివీల్ చేసిన సాయి చరణ్..
-
బంగారం కొనుగోళ్లకు డాలర్‌కు సంబంధమేంటి?
‘అంతర్జాతీయ డబ్బు సంబంధిత వ్యవహారాల్లో నిన్న మొన్నటి వరకూ తిరుగులేని రాజైన అమెరికా డాలర్ నెమ్మదిగా తన పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. 2022 మార్చి నాటికి ప్రపంచ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా దాదాపు 58 శాతానికి పడిపోయింది. ఇది 1994 నుంచీ అత్యంత కనిష్ఠం. ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సెంట్రల్ (కేంద్రీయ) బ్యాంకులు పాత ఆనవాయితీకి విరుద్ధంగా డాలర్లకు బదులు తమ బంగారం నిల్వలను విపరీతంగా పెంచుకుంటున్నాయి. ఒక్క 2022 సంవత్సరంలోనే ఈ సెంట్రల్ బ్యాంకులు తమ ఖజానాలకు అదనంగా 1126 టన్నుల బంగారాన్ని కొని తరలించాయి. 1950 తర్వాత ఇంత మొత్తంలో బంగారం కొనుగోళ్లు చేయడం ఇదే మొదటిసారి. ఇంతకన్నా మరో ఆశ్చర్యకర విషయం ఏమంటే, అనేక దేశాలు తమ మధ్య వాణిజ్యాన్ని, పెట్టుబడులను తమ సొంత లేదా థర్డ్ పార్టీ కరెన్సీలతో నిర్వహించుకుంటున్నాయి,’ ఈ తరహా వార్తలు గడచిన మూడు నాలుగు నెలలుగా మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ మారకం కరెన్సీగా డాలర్ భవితవ్యంపై అమెరికా కాని, ఇతర ధనిక, పారిశ్రామిక దేశాలు గాని ఎక్కువగా దిగులు పడడంలేదు. అమెరికా 21వ శతాబ్దంలో తనకు అవసరమైనప్పుడల్లా తన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు పెంచడానికి ఎడాపెడా తన కరెన్సీని ప్రింట్ చేసి విడుదల చేస్తోందనీ, దీని వల్ల ఇతర ఆర్థిక వ్యవస్థలు ముఖ్యంగా వర్ధమాన దేశాలపై వ్యతిరేక ప్రభావం పడుతోందనేది కొందరు అంతర్జాతీయ నిపుణులు, కొన్ని పారిశ్రామిక దేశాల ఆరోపణ. అత్యవసర పరిస్థితుల్లో ఏ దేశమైనా తన సొంత కరెన్సీని తాత్కాలికంగా పరిమితికి మించి ప్రింట్ చేయడం తప్పేమీ కాదనే సిద్ధాంతం కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఎప్పటిలాగానే అంతర్జాతీయ ఆర్థిక వ్యవహరాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ కథ 1944లో మొదలైంది ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత పాత మారకపు కరెన్సీ అయిన బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ స్థానంలో అమెరికా డాలర్ ఎలా వచ్చిందీ ఓసారి గుర్తుచేసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1944లో అమెరికాలో బ్రెటన్ వుడ్స్లో జరిగిన అనేక దేశాల అంతర్జాతీయ సమావేశం నిర్ణయాల ఫలితంగా బ్రిటిష్ పౌండు స్థానంలో అమెరికా డాలర్ అంతర్జాతీయ మారకపు కరెన్సీగా వేగంగా అవతరించింది. ఈ యుద్ధంలో ఇంగ్లండ్ సహా అనేక ఐరోపా దేశాలు ఆర్థికంగా దివాలా స్థితికి రావడంతో డాలర్ ప్రపంచ వాణిజ్య యవనికపై దర్శనమిచ్చి అప్పటి నుంచి అలా నిలిచిపోయింది. మధ్యలో కొన్నిసార్లు అమెరికా ఆర్థిక ఇబ్బందుల వల్ల డాలర్ బలహీనపడిన మాట నిజమే గాని ప్రతిసారీ అది పుంజుకుని తన పూర్వ స్థానం నిలబెట్టుకుంటూనే ఉంది. మరో ముఖ్య విషయం ఏమంటే.. బంగారానికి (ఈ లోహానికి ఉన్న అనేక సుగుణాల వల్ల) ప్రపంచవ్యాప్తంగా ప్రాచీనకాలం నుంచీ విలువ ఉంది. కాలంతో పాటు మనుషులకు ఈ లోహంపై మోజు మరీ పెరిగిపోతోంది. డాలర్ మారకం విలువ తగ్గినప్పుడల్లా బంగారం కొనుగోలు ధర పెరుగుతుంది. ఈ కారణంగా ప్రపంచంలో బంగారం కొనుగోళ్లు విపరీతంగా జరిగినప్పుడల్లా డాలర్ పని ఇక అయిపోయిందనే మాటలు, పుకార్లు వినిపిస్తాయి. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో అత్యంత ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీతోపాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో అమెరికాకు ఉన్న ఆధిపత్యం కారణంగా ఈ దేశానికి ఆర్థిక సంక్షోభాలు తాత్కాలికమేనని, మారకద్రవ్యంగా డాలర్‌కు ఉన్న ప్రాధాన్యానికి ఎదురయ్యే సవాళ్లు కొన్ని మాసాలకు మాత్రమే పరిమితమని గడచిన దాదాపు 75 ఏళ్ల చరిత్ర చెబుతోంది. ప్రసిద్ధ ఆర్థికవేత్తలు సైతం ఇప్పట్లో అమెరికా డాలర్ అంతర్జాతీయ మారకపు కరెన్సీగా తన హోదాను కోల్పోయే ప్రమాదమేమీ లేదని గట్టిగా వాదిస్తున్నారు. అనేక ఇతర కారణాల వల్ల బంగారానికి డిమాండు పెరగడానికి, దాని ధర కూడా పైకి ఎగబాకడానికి అవకాశాలున్నాయి గాని అమెరికా డాలర్ పతనం నిరంతరాయంగా జరగదని పలువురు ఆర్థిక శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. (రూపాయి సింబల్ ₹, డాలర్ $, పౌండ్ £...వీటి వెనుక కథ ఏమిటంటే...) -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
నా మొగుడు ఏం చేసినా పర్లేదు.. అమ్మాయిలతో తిరిగినా నాకు కావాల్సింది అదే!
వాషింగ్టన్: భార్యాభర్తల బంధం అన్నింటికంటే దృఢమైంది అంటారు. పెళ్లయ్యాక పతియే తన సర్వస్వంగా భావిస్తుంటారు మహిళలు. ఒకరిపైఒకరు ప్రేమానురాగాలు చూపుతూ ఆనందంగా జీవిస్తారు. వైవాహిక బంధంలో నిజాయితీ, విధేయతతో ఉండాలనుకుంటారు. అలాంటిది తన భర్త మరో మహిళలో సన్నిహితంగా మెలిగితే? మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుంటే? ఏ భార్య అయినా భరిస్తుందా? ఆమె కోపం ఎలా ఉంటుందో కూడా ఉహించుకోలేం.. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. తన భర్తను ఇతర మహిళలతో సన్నిహితంగా ఉండమని ఆమే ప్రోత్సహిస్తోంది. వాళ్లతో శారీరకంగా కలిసినా పర్వాలేదు అంటోంది. ఆయన ఎవరితో వెళ్లినా, ఏం చేసినా సరే.. సంతోషంగా ఉంటే చాలట. ఆయన హ్యాపీగా ఉంటే తనకు అదే చాలు అని ఆనందంగా చెబుతోంది. ఇది భార్యగా తన బాధ్యత అంటోంది. ఈ మాటలు విన్నాక ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి. ఈరోజుల్లో ఇలాంటి భార్యలు కూడా ఉంటారా? అని అనుకుంటారు కదా.. భర్తకు ఇంత ఫ్రీడం ఇచ్చి ఈమె పేరు మోనికా హల్ట్. వయసు 37 ఏళ్లు. భర్త పేరు జాన్. పెళ్లయ్యాక ఇంటికే పరిమితమైంది. రోజంతా ఇంటిపనులే చేస్తూ తీరకలేకుండా ఉంటోంది. జాన్‌కు ఇష్టమైన వంటలు చేసిపెట్టడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం, ఇతర పనులు చేసుకోవడమే ఈమె దినచర్య. అందుకే జాన్‌తో బయటకు వెళ్లే సమయం కూడా ఉండదు. ఈ కారణంగానే భర్తను ఇష్టమైన వారితో గడపమని ఆమే స్వయంగా చెబుతోంది. జాన్‌కు ఏదీ సంతోషం అయితే అది నిరభ్యంతరంగా చేసుకోవచ్చని ప్రోత్సహిస్తోంది. అతను ఇతర మహిళలతో శృంగారంలో పాల్గొన్నా తాను అసలు బాధపడనని అంటోంది. అలాగే తాను రోజు ఏ దుస్తులు ధరించాలో కూడా భర్తే డిసైడ్ చేస్తాడని, ఆయన చెప్పింది తూచ తప్పకుండా పాటిస్తాని మోనికా పేర్కొంది. సెక్సీ, స్పోర్టీ డ్రస్సులంటే తన భర్తకు ఇష్టమని తాను ఇంట్లో అవే ధరిస్తానని వివరించింది. తాను మేకప్ వేసుకుంటే జాన్‌కు అస్సలు నచ్చదని, అందుకే నేచురల్‌గానే ఉంటానంటోంది. భర్తలు వేరే వాళ్లతో మాట్లాడితేనే ఊరుకోని మహిళలు ఉన్న ఈరోజుల్లో ఇలాంటి భార్య దొరకడం నిజంగా జాన్ అదృష్టం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..! -
ప్రభాస్ కి నాకు మధ్య ఉంది ఇదే
-
వాలంటైన్స్ డే: తమన్నా-విజయ్ వర్మ రిలేషన్‌పై క్లారిటీ వచ్చేసింది?
ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెరపై తన అందం, అభినయం, డాన్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది. అలా మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే ఇప్పటికీ గాసిప్స్‌కు దూరంగా ఉన్న తమన్నా ఈ ఏడాది న్యూఇయర్ నుంచి డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లోకి ఎక్కింది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో నటుడు విజయ్ వర్మకు లిప్‌లాక్ ఇచ్చి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. దీంతో అతడితో తమన్నా రిలేషన్లో ఉందంటూ ఒక్కసారిగా గాసిప్స్ గుప్పుమన్నాయి. దీనిపై ఇప్పటి మిల్కీ బ్యూటీ దీనిపై స్పందించకపోవడం గమనార్హం. అయితే తమన్నా రిలేషన్ స్టేటస్‌పై అభిమానులంతా సందేహంలో ఉన్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాలంటైన్స్ డే సందర్భంగా తమన్నాతో డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు నటుడు విజయ్. ప్రేమికుల రోజును పురస్కరించుకుని విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో ఎదురెదురుగా నిలుచుని ఉండి, ఇద్దరి కాళ్ల మధ్యలో హార్ట్ ఎమోజీని జత చేసి ఫొటో పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫొటోలో వారి ముఖాలు కనపడకుండ జాగ్రత్త పడ్డాడు. విజయ్ ఎదురుగా ఉన్నది తమన్నా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు ఈ వ్యక్తి వేసుకున్న షూ, జాకెట్ ఆధారంగా అది తమన్నానే అంటూ పట్టేశారు నెటిజన్లు. గతంలో తమన్నా అచ్చం అలాంటి షూ, చేతిలో జాకెట్ పట్టుకుని ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాలంటైన్స్ డే రోజు స్పెషల్ పోస్ట్ షేర్ చేసి పరోక్షంగా తమన్నాతో రిలేషన్ రూమర్స్‌పై స్పష్టత ఇచ్చాడని నెటిజన్లంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇదే విషయాన్ని కన్ఫాం చేస్తూ తమన్నా ఫ్యాన్ పేజీలో ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ కూడా షేర్ చేశారు. దీంతో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా తమన్నా ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ చిత్రంతో బిజీగా ఉండగా.. తమిళం, హిందీలో పలు చిత్రాలు చేస్తోంది. Exclusive Confirmed 👌🏻 Happy Valentine's day to #VijayVarma Live in partner @tamannaahspeaks parents arent in favour of Tamanna living with Vijay and getting married with him after few months. Her parents tried hard to change decision but she's behaving adamant. Look at choice pic.twitter.com/KJ07mDK1oM — ♥️Sneha Tamannaah 😘 💫 (@Tamannaahspeakk) February 14, 2023 -
విడాకులు తీసుకుని పీకల్లోతు ప్రేమలో ఉన్న హీరో, హీరోయిన్
-
సిరివెన్నెలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏమవుతాడో తెలుసా?
Sirivennela Sitaramasastri And Director Trivikram Srinivas Relation: సిరివెన్నెల సీతారామశాస్త్రికి -డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు చాలా దగ్గరి రిలేషన్ ఉంది. స్వయంవరం సినిమాతో రైటర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రివిక్రమ్.. నువ్వేకావాలి సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు. అప్పటివరకు మూసధోరణిలో వెళ్తున్న సినిమాలకు తన రైటింగ్ స్కిల్స్‌తో కొత్త దారిని పరిచయం చేశాడు. తేలికైన పదాలతోనే పవర్ఫుల్ పంచుడైలాగులు రాయడం ఆయన స్పెషాలిటీ. త్రివిక్రమ్ సినిమాల గురించి తెలిసినంతగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కెరీర్ పరంగా త్రివిక్రమ్ అప్పటికే రైటర్‌గానే కాకుండా డైరెక్టర్‌గానూ మాంచి ఫామ్‌లో ఉన్నాడు. త్రివిక్రమ్ ప్రతిభతో పాటు అతని వ్యక్తిత్వం నచ్చిన సిరివెన్నెల స్వయంగా తమ ఇంట్లో పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారట. అయితే అక్కడికి వెళ్లిన త్రివిక్రమ్ ఆ అమ్మాయిని కాకుండా వాళ్ల చెల్లిని ఇష్టపడ్డాడట. ఇదే విషయాన్ని చెప్పగా, మొదట కాస్త సంశయించినా, తర్వాత అర్థం చేసుకొని వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. అలా త్రివిక్రమ్-సౌజన్యల వివాహం జరిగింది. సిరివెన్నెల సీతారామశాస్త్రికి స్వయానా సోదరుడి కూతురే సౌజన్య. అలా వీరి పెళ్లి సినిమా స్టోరీని తలపించే విధంగా ఉంటుంది. -
భారత్-చైనా సంబంధాలు మరింత దిగజారుతాయి
-
హత్యకు నేపథ్యం.. వివాహేతర సంబంధం
ఏలూరు అర్బ¯ŒS : ఇద్దరు మహిళల మధ్య వివాహేతర సంబంధం కోసం ఏర్పడిన వివాదం ఓ మహిళ దారుణ హత్యకు దారితీసింది. తనకూ ప్రియుడికి మధ్య ఉన్న మహిళను అడ్డుతొలగించుకునేందుకు పథకం రచించిన మహిళ ఆరుగురు వ్యక్తుల సాయంతో ఆమెను హత్య చేయించింది. ఈ కేసులో ఏడుగురిని పెదవేగి పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి టీఎస్ 05 ఈఎం 2786 నెంబరు మారుతీ కారు, 5 సెల్ఫోన్లు, రూ.4,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, సీఐ అడపా నాగమురళీ ఆదివారం ఏలూ రు రూరల్ పోలీస్‌స్టేష¯ŒSలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. పెదవేగి మండలం లక్ష్మీపురం సమీపంలోని పోలవరం కుడికాలువ గట్టుపై ఈనెల 6న ఓ మహిళ శవమై కన్పించింది. దీనిపై పెదవేగి ఎస్సై వి.రామకోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళీ, ఎస్సైలు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు మహిళల వివాహేతర సంబంధంలో ఏర్పడిన వివాదం హత్యకు దారి తీసిం దని గుర్తించారు. ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన అలజంగి నాగమ ణి అనే మహిళ భర్త చనిపోయిన తర్వా త అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పసుపులేటి దుర్గబాబు అలియాస్ దుర్గారావుతో కొంత కాలంగా సహజీవనం చేస్తోంది. అయితే దుర్గారావు అదే గ్రామానికి చెందిన వేముల నాగలక్ష్మి అలియాస్ బుజ్జి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన నాగమణి దుర్గారావును నిలదీసింది. దుర్గారావు తీరుమారకపోవడంతో రెండు నెలల క్రితం నాగమణి ఘర్షణకు దిగింది. నాగలక్ష్మి బతికి ఉంటే దుర్గారావు తనకు దక్కడని భావించిన నాగమణి హత్యకు పథకం సిద్ధం చేసింది. తన కుమారుడు, అతని స్నేహితులు, నాగలక్ష్మి సన్నిహితుడైన ఆది ఏసుబాబు, అతని రెండో భార్యతో హత్యకు వ్యూ హరచన చేసింది. దీనిలో భాగంగా ఆదిఏసు నాగలక్ష్మి వద్దకు వెళ్లి అప్పు ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. దీంతో ఈనెల 5న ఆదిఏసు భార్యతో కలిసి నాగలక్ష్మి భీమడోలు వెళ్లింది. అక్కడ కారులో నాగమణి కుమారుడు నాగమునీశ్వరరావు అలియాస్ ముని అలి యాస్ ప్రసాద్, కారు మెకానిక్ సురేష్, కారు డ్రైవర్ మరియదాసు అలియాస్ దాసు, నాగమణి చె ల్లెలు కుమారుడు గంగాధరరావు ఉ న్నారు. వారంతా నాగలక్షి్మని కారులో ఏలూరు తీసుకువచ్చారు. నాగలక్షి్మకి మాయమాటలు చెప్పి చీకటిపడిన తర్వాత భీమడోలు తీసుకువచ్చారు. భీమడోలులో నాగమణి కారులో ఎక్కడంతో ఆమెను చూసిన నాగలక్ష్మి అనుమానం వచ్చి దిగేందుకు ప్రయత్నించింది. దీంతో మిగిలిన వారంతా నాగలక్షి్మని కారులోనే కదలకుండా ఉంచి జంగారెడ్డిగూడెం రోడ్డువైపు తీసుకువెళ్లారు. పెదవేగి 7వ మైలు వద్ద నాగలక్ష్మి మెడకు నైలా¯ŒS కారు బెల్టును బిగించి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. నాగలక్ష్మి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని పోలవరం కాలువలో పడవేయాలనే ఉద్దేశంతో కాలువ గట్టుపై నుంచి కిందకు తోసేశారు. -
చంద్రుడి మీదకు వెళ్లిన వారికి హార్ట్ ఎటాక్!
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాలలో మానవాళి దూసుకుపోతోంది. భూ ఉపగ్రహం చంద్రుడితో పాటు సౌరకుటుంబంలోని గ్రహాలు, ఇతర నక్షత్ర మండలాలపై సైతం మానవుడి ప్రయోగాలు కొనసాగుతున్నాయి. విశ్వంలో భూమితో పాటు జీవులకు ఇంకేమైనా నివాసయోగ్య స్థలాలు ఉన్నాయా అని శాస్త్రవేత్తలు నిరంతర అన్వేషణ చేస్తున్నారు. అయితే.. అంతరిక్ష యాత్రికులకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. జేమ్స్ ఇర్విన్ అనే అంతరిక్ష యాత్రికుడు చంద్రుడిపై అడుగుపెట్టిన రెండేళ్ల తరువాత మొదటిసారి హార్ట్ ఎటాక్ బారిన పడ్డాడు. అయితే అప్పుడు నాసా డాక్టర్లు అతడి అంతరిక్ష యాత్రకు, హార్ట్ ఎటాక్‌కు ఎలాంటి సంబంధం లేదని.. ప్రీ ఫ్లైట్ టెస్టింగ్‌లో సైతం ఇర్విన్ హార్ట్ బీట్‌లో చిన్న చిన్న తేడాలు గుర్తించామని కొట్టిపారేశారు. తరువాత 61 ఏళ్ల వయసులో ఇర్విన్ హార్ట్ ఎటాక్తోనే మరణించాడు. అపోలో యాత్రలో ఇర్విన్ సహచరుడు రాన్ ఇవాన్స్ సైతం.. ఇర్విన్ మరణానికి ఏడాది ముందుగా, నిద్రలో హార్ట్ ఎటాక్ వచ్చి తన 56 ఏళ్ల వయసులోనే మృతి చెందాడు. చంద్రుడిపై మొదటిసారి కాలు మోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ సైతం 2012లో హార్ట్ ఎటాక్తోనే మరణించాడు. అమెరికాలో ప్రతియేటా సుమారు 6 లక్షల మంది హృదయ సంబంధిత వ్యాధులతో మృతి చెందుతున్నారు. ఆస్ట్రోనాట్లు సైతం గుండె, రక్తనాళాల సంబంధిత సమస్యలకు అతీతులు కారు. అయినప్పటికీ సాధారణ పౌరులలో గుండె జబ్బులతో మరణించే వారితో పోల్చినప్పుడు ఆస్ల్రోనాట్లలో ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ విషయంపై పరిశోధన జరిపిన ఫ్లోరిడా స్టేట్ యూనిర్సిటీ డాక్టర్ మైఖెల్ డెల్ప్ మాట్లాడుతూ.. శాంపిల్ పరిమాణం చిన్నదిగా ఉన్నందున దీనిని ఇప్పుడే నిర్ధారించలేమని, అయితే ఆస్ట్రోనాట్లకు.. గుండె సంబంధ వ్యాధులకు ఉన్న సంబంధాన్ని కొట్టిపారేయలేమని వెల్లడించారు. -
పాక్ తో కాంగ్రెస్ కూడా సత్సంబంధాలు కోరుకుంటోంది
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనల వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం విమర్శించారు. గురువారం మీరట్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వే శంకుస్థాపన సందర్భంగా మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడిన నేపథ్యంలో చిదంబరం శుక్రవారం ప్రతిస్పందించారు. ప్రభుత్వానికి ప్రతిపక్షంగా కాంగ్రెస్ సహకరిస్తున్నా మోదీ అనవసరంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని చిదంబరం వాపోయారు. భారతీయ జనతాపార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయిందని చిదంబరం విమర్శిచారు. జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్‌ను తప్పుపట్టడం సరికాదని, కాంగ్రెస్‌కు ఆ బిల్లుపై స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌తో కాంగ్రెస్ కూడా సత్సంబంధాలను కోరుకుంటుందని, అయితే హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు, యూటర్న్లు సత్ఫలితాలను ఇవ్వవని ప్రధాని పాక్ పర్యటనను ఉద్దేశించి చిదంబరం మాట్లాడారు. లోక్‌సభలో 67 బిల్లులు, రాజ్యసభలో 45 బిల్లులు పాస్ కావడానికి కాంగ్రెస్ పార్టీ సహకరించిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను అకారణంగా ప్రధాని విమర్శించడం సరికాదన్నారు.