Sirivennela Sitaramasastri And Director Trivikram Srinivas Relation: సిరివెన్నెల సీతారామశాస్త్రికి -డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు చాలా దగ్గరి రిలేషన్ ఉంది. స్వయంవరం సినిమాతో రైటర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రివిక్రమ్.. నువ్వేకావాలి సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు. అప్పటివరకు మూసధోరణిలో వెళ్తున్న సినిమాలకు తన రైటింగ్ స్కిల్స్‌తో కొత్త దారిని పరిచయం చేశాడు.
తేలికైన పదాలతోనే పవర్‌ఫుల్ పంచుడైలాగులు రాయడం ఆయన స్పెషాలిటీ. త్రివిక్రమ్ సినిమాల గురించి తెలిసినంతగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కెరీర్ పరంగా త్రివిక్రమ్ అప్పటికే రైటర్‌గానే కాకుండా డైరెక్టర్‌గానూ మాంచి ఫామ్‌లో ఉన్నాడు. త్రివిక్రమ్ ప్రతిభతో పాటు అతని వ్యక్తిత్వం నచ్చిన సిరివెన్నెల స్వయంగా తమ ఇంట్లో పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారట.
అయితే అక్కడికి వెళ్లిన త్రివిక్రమ్ ఆ అమ్మాయిని కాకుండా వాళ్ల చెల్లిని ఇష్టపడ్డాడట. ఇదే విషయాన్ని చెప్పగా, మొదట కాస్త సంశయించినా, తర్వాత అర్థం చేసుకొని వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. అలా త్రివిక్రమ్-సౌజన్యల వివాహం జరిగింది. సిరివెన్నెల సీతారామశాస్త్రికి స్వయానా సోదరుడి కూతురే సౌజన్య. అలా వీరి పెళ్లి సినిమా స్టోరీని తలపించే విధంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment