sirivennela sitarama sastry
-
సిరివెన్నెల స్మృతిలో 'స్వప్నాల నావ' సాంగ్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్
మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు వీఎన్ ఆదిత్య తాజా ప్రాజెక్టు 'స్వప్నాల నావ'. శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డల్లాస్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గోపీకృష్ణ కొటారు ఈ సాంగ్‌ను రూపొందించారు. అంతే కాకుండా గోపికృష్ణ కుమార్తె శ్రీజ ఈ పాటను ఆలపించడంతో పాటు నటించారు.ఈ'స్వప్నాల నావ' థీమ్ దివంగత స్టార్ లిరిసిస్ట్ అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందించారు . ఈ పాటకు ప్రముఖ సినీ నిర్మాత శ్రీమతి మీనాక్షి అనిపిండి సమర్పకులుగా వ్యవహరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని. యశ్వంత్ ఈ పాటకి సాహిత్యం అందించారు.'సిరివెన్నెల సీతారామశాస్త్రి' అంటే దర్శకులు వి.ఎన్.ఆదిత్యకు ఎంతో అభిమానం. ఆయన సూపర్ హిట్ సినిమా 'మనసంతా నువ్వే' లో కూడా సిరివెన్నెలతో గుర్తుండిపోయే ఓ పాత్రని చేయించారు. ఇప్పుడు 'స్వప్నాల నావ' తో సిరివెన్నెల గొప్పతనాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. అందుకే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో 1 మిలియన్ వీక్షణలు వచ్చాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
సిగరేట్ పెట్టెపై ‘అర్థశతాబ్దపు..’ పాట రాశాడు : కృష్ణవంశీ
దివంగత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రితో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. శాస్త్రిని ఆయన గురువుగా చెప్పుకుంటారు. శాస్త్రి కూడా కృష్ణవంశిని దత్త పుత్రుడు అని సంభోధించేవాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి శాస్త్రి లిరిక్స్ అందించాడు. కొన్ని పాటలు అయితే ఇప్పటికీ మర్చిపోలేం. అందులో ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా’ అనే పాట ఒకటి. ఆ పాట అప్పుడే కాదు ఇప్పుడు విన్నా గూస్బంప్స్ వచ్చేస్తాయి. ఇంత గొప్ప పాటను రాయడానికి సీతారామ శాస్త్రి కేవలం గంట సమయం మాత్రమే తీసుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ తెలిపాడు. అంతేకాదు ఆ పాటని రోడ్డు మీద పడేసిన సిగరేట్ పెట్టమీద రాశాడట. ‘ఆర్జీవీ తెరకెక్కించిన ‘శివ’, ‘క్షణ క్షణం’, ‘అంతం’ సినిమాల ద్వారా శాస్త్రితో నాకు స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత నేను దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి శాస్త్రిగారితో లిరిక్స్ రాయించుకున్నాను. నా ప్రతి సినిమా కథను ముందుగా శాస్త్రికి చెప్పడం అలవాటు. అలాగే కాపీ వచ్చిన తర్వాత కూడా ఆయనకే చూపించేవాడిని. అలా సింధూరం సినిమా కాపీని ఆయనకు చూపించాను. అది చూసిన తర్వాత శాస్త్రి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ‘ఏంటి గురువుగారు’ అంటే ‘పేపర్ ఏదైనా ఉందా?’అని అడిగాడు. అప్పుడు నా దగ్గర పేపర్ లేదు. దీంతో రోడ్డు మీద సిగరెట్ పెట్టె పడి ఉంటే తీసి ఇచ్చాను. దాని మీద లిరిక్స్ రాసుకొని..వెంటనే ఇంటికెళ్లి గంటలో పాట రాసిచ్చాడు. అంతేకాదు ‘నువ్వు ఏం చేస్తావో తెలియదు.. సినిమాలో ఫలాన చోట ఈ పాట రావాలి’అని చెప్పారు. ఇదంతా సినిమా విడుదలకు రెండు రోజుల ముందు జరిగింది. ఏం చేయాలో అర్థం కాక..బాలు దగ్గరికి వెళ్లి చెప్పాను. చివరకు రికార్డు చేసి విడుదల చేశాం. రిలీజ్ తర్వాత సినిమాకు అదే కీలకం అయింది’ అని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. ‘నిన్నే పెళ్లాడతా సినిమాలో ‘కన్నుల్లో నీ రూపమే’ పాట సందర్భం వివరిస్తూ.. ‘హీరో హీరోయిన్ల ఇళ్లల్లో పెద్దవాళ్లు లేరు. వారిద్దరు కలవాలి.ఎంతైనా చెప్చొచ్చు.. కానీ ఏమి చెప్పకూడదు’అని చెబితే.. ‘నువ్వు నాశనం.. నేను నాశనం’ అని వ్యంగ్యంగా నన్ను తిడుతూ శాస్త్రిగారు ‘కన్నుల్లో నీ రూపమే’ పాట రాశారు’అని కృష్ణవంశీ చెప్పారు. -
సింగపూర్‌లో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు వారి ఆద్వర్యంలో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఒన్ కాన్ బెర్రా పంక్షన్ హాల్లో, 19 మే ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది, పుస్తక రచయిత, సివిల్స్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమానిగా ఆకెళ్ళ రాఘవేంద్ర అందరికీ సుపరిచితులు. ఈ కార్యక్రమంలో పాట షికారుకొచ్చింది పుస్తక రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకూ దాదాపు 200 పైగా వేదికల మీద మాట్లాడినా కుటుంబ సమేతంగా ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తొలిసారి ఇక్కడే కుదిరిందని, ఇంతకు ముందు ఎన్ని సార్లు ప్రయత్నించినా వీలు కానిది ఈ సింగపూరు సభ ద్వారా జరగడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. తన గురువు సిరివెన్నెల జీవితాన్ని సమతుల్యం చేస్తూ రాసిన పుస్తకం అని రచయిత తెలిపారు. ఈ సందర్బంగా సిరివెన్నెలతో తనకు ఉన్న అనుబందాన్ని, తనను ప్రోత్సహించిన వైనాన్ని పంచుకున్నారు. సింగపూరులో శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుందని ప్రశంసించారు. ఇకపై సంస్థ నిర్వహించే కార్యక్రమాలను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సిరివెన్నెల అబిమానులందరికీ కృతజ్ఞతలు అని భావోద్వేగానికిలోనయ్యారు. సుబ్బు వి పాలకుర్తి సభ నిర్వహణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోసంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ సిరివెన్నెల జయంతి అయిన మే 20వ తేదీకి ఒక్కరోజు ముందు ఆయన జీవిత పుస్తకాన్ని, పుస్తక రచయిత, సిరివెన్నెల ఆత్మీయ శిష్యులు ఆకెళ్ళ రాఘవేంద్ర ద్వారా సింగపూర్‌లో ఆవిష్కరించుకోవడం చాలా ఆనందం అని, కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలును తెలియచేసారు. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సిరివెన్నెల స్మరించుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా మరొక్కసారి అందరికీ దక్కిందన్నారు. తెలుగు అక్షరం ఉన్నంత వరకూ సిరివెన్నెల పాట తెలుగు వారి నోటివెంట వినబడుతూనే ఉంటుందని తెలియచేసారు.ఈ కార్యక్రమమునకు రామాంజనేయులు చమిరాజు, సునీల్ రామినేని, మమత మాడబతుల సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. 50 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమము, ఆన్లైన్ ద్వారా 1000కి పైగా వీక్షించారు. సిరివెన్నెల అభిమానులు షర్మిల, కృష్ణ కాంతి, మాధవి, పణీష్ తమ పాటలు, కవితలు వినింపించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమము చివర్లో ఆకెళ్ళ సిరివెన్నెల అద్భుతమైన ప్రసంగంతో తండ్రికి తగ్గ తనయగా ప్రశంసలు పొందారు. అతిదులందరికి విందు భోజన ఏర్పాట్లను రేణుక, అరుణ, శ్రీలలిత తదితరులు పర్యవేక్షించారు. -
సిరివెన్నెలకు నివాళిగా ‘నా ఉచ్చ్వాసం కవనం’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
‘తానా ప్రపంచసాహిత్య వేదిక’
డెట్రాయిట్, అమెరికా: ఉత్తరఅమెరికా తెలుగుసంఘం సాహిత్యవిభాగం – ‘తానా ప్రపంచసాహిత్య వేదిక’ ఆద్వర్యంలో ప్రముఖ సినీకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సమగ్రసాహిత్యాన్ని సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మొత్తం ఆరు సంపుటాలలో ముద్రించి సిరివెన్నెల అభిమానులకు, సాహితీ ప్రియులకు ఇటీవలే కానుకగా అందించిన సంగతి విదితమే. ఇప్పడు అదే స్ఫూర్తితో సుప్రసిద్ధ కవి, రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సమగ్ర సాహిత్యాన్ని తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర గారి నేతృత్వంలో ముద్రించి త్వరలో తెలుగు భాషాభిమానులకు, సాహితీప్రియులకు అందజేయనున్నామని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కొసరాజుగారి 37వ వర్దంతి (అక్టోబర్ 27) సందర్భంగా ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఇది తానా సంస్థ ఒక మహాకవికి ఇచ్చే ఘన నివాళిగా నిలుస్తుందని ఆయన అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “దాదాపు నాల్గు దశాబ్దాలుగా సాగిన కవిరత్న, జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సాహితీ ప్రయాణంలో “ఏరువాక సాగాలోరన్న”; “అయయో చేతిలో డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే”; “భలే ఛాన్సులే భలే ఛాన్సులే, ఇల్లరికంలో ఉన్న మజా”; “సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు కాల్చు సిగరెట్టు”; “రామయతండ్రి, ఓ రామయ తండ్రి, మానోములన్ని పండినాయి రామయ తండ్రీ”; “ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, అలుపూ సొలుపేమున్నది” లాంటి పాటలలో అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టు భాషలోని చమత్కారాలు, విరుపులు కొసరాజు గారి కలంనుండి రెండువందల చిత్రాలలో వెయ్యికి పైగా పాటలు జాలువారాయి. కేవలం సినిమా పాటలేగాక కొసరాజు గారు “గండికోట యుద్ధము” అనే ద్విపద కావ్యము; “కడగండ్లు” అనే పద్యసంకలనం, “కొసరాజు విసుర్లు”, “కొండవీటి చూపు”, “నవభారతం”, “భానుగీత” లాంటి గ్రంధాలు, యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళ పాటలు, గంగిరెద్దుల గీతాలు లాంటవి ఎన్నో రాశారని అన్నారు”. ఈ సందర్భంగా కొసరాజు గారి కుటుంబసభ్యులతో మాట్లాడి ఎన్నో విషయాలను ఇప్పటికే సేకరించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కొసరాజు గారి కుటుంబసభ్యులకు, కొసరాజు గారి సమగ్ర సాహిత్యాన్ని త్వరలో తెలుగు ప్రజలకు అందించే తానా ప్రపంచసాహిత్యవేదిక తలపెట్టిన సాహితీ మహాయజ్ఞంలో ప్రముఖ పాత్ర పోషించనున్న పేరెన్నికగన్న సాహితీవేత్త, పరిశోధకులు, అనుభవజ్ఞులు అయిన అశోక్ కుమార్ పారా (మనసు ఫౌండేషన్) కు కృతజ్ఞతలు అన్నారు తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర. -
ఘనంగా సిలికానంధ్ర సంస్థాపక దినోత్సవ వేడుకలు
ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర 22వ సంస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనం ఈ వేడకకు వేదికయ్యింది. గత 22ఏళ్ల ఆనవాయితీ ప్రకారం.. ఈ సభ కూడా బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రిగారి వేదాశ్వీరచనంతో మొదలయ్యింది. సంస్థాపక దినోత్సవ వేడుకలో ప్రముఖ ఆకర్షణగా కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో, ఆకెళ్ల రచించిన శ్రీనాథుడు పూర్తి నిడివి తెలుగు పద్య నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో గుమ్మడి గోపాలకృష్ణ శ్రీనాథుడి పాత్ర పోషించగా, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు మిగిలిన పాత్రలు పోషించారు. నాటకాన్ని తిలకించిన ప్రేక్షకులు పాత్రలతో మమేకమైపోయారు. శ్రీనాథుడి జీవిత చరమాంక సన్నివేశాల్లో సభలో కంటతడి పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదు. నాటకం అనంతరం డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా గుమ్మడి గోపాలకృష్ణకు సన్మానం జరిగింది. ఆయనకు శాలువా కప్పి పదివేల డాలర్ల బహుమతి కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బూదరాజు శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఒక పద్యనాటక ప్రదర్శన చూడలేదని పేర్కొన్నారు. సిలికానంద్ర కుటుంబానికి ఆప్తులు, సన్నిహితులు దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికంతా పొగ కమ్మేయగా సిరివెన్నెలే వచ్చారా అన్నట్టుగా వారి కుమారుడు యోగిని వాళ్ళ నాన్నగారిలా వేదిక మీదకి రావడం ఆహూతులకు ఆశ్చర్యానంద అనుభూతిని కలిగించింది.సిరివెన్నెల కుటుంబసభ్యుల సమక్షంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర తెలుగు శాఖలో వచ్చే ఏడాది నుంచి సిరివెన్నెల ఆచార్య పీఠం ప్రారంభిస్తున్నట్టు యూనివర్సిటీ అధ్యక్షులు డా. కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు. అలానే ప్రతీ సంవత్సరం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభలో సిరివెన్నెల స్మారకోపన్యాసము, సిరివెన్నెల స్మారక పతకం ఇవ్వనున్నట్టు తెలియజేశారు. -
సీఎం జగన్‌ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వరశర్మ, రాజా, కుమార్తె శ్రీలలితాదేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్ శాస్త్రిలు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్‌ను కలిసి సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, తమ కుటుంబానికి విశాఖలో ఇంటి స్థలం మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు వైఎస్సార్‌తో సిరివెన్నెలకు ఉన్న అనుబంధాన్ని సీఎంతో పంచుకున్నారు. సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్ మరోమారు భరోసానిచ్చారు. చదవండి: తెలుగు నేలపై విరిసిన పద్మాలు -
నిశ్శబ్ద పాటల విప్లవం సిరివెన్నెల
‘‘చీకటిలో దారి చూపించే వెన్నెల ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం. నిశ్శబ్ద పాటల విప్లవం ‘సిరివెన్నెల’. భాషా ప్రావీణ్యం కన్నా విషయ ప్రావీణ్యం మరింత గొప్పదని ఆయన్ని చూసి తెలుసుకోవచ్చు’’ అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కుటుంబం ఆధ్వర్యంలో ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి పుస్తకా విష్కరణ సభ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి, ‘సిరివెన్నెల’ సతీమణి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సిరివెన్నెల’గారు ఆర్థిక ఆలంబన కోసం కాకుండా అర్థవంతమైన సాహిత్యంతో తనకంటూ ప్రత్యేక రచనా విధానాన్ని కొనసాగించారు. ప్రతి పాటలో, మాటలో సందేశాన్ని ఇవ్వడం ఆయన ప్రత్యేకత. నేను రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిరోజూ ఉదయాన్నే అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగార్ల పాటలతో పాటు సీతారామశాస్త్రిగారి సాహిత్యాన్ని వినేవాణ్ణి. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఆయనతో కాలక్షేపం చేసేవాణ్ణి. ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను. కృష్ణశాస్త్రి, దాశరథి, సి.నారాయణ రెడ్డి, వేటూరి, ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు పాటలకు పట్టాభిషేకం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో హింస, అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగులు శృతి మించాయి. ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు భాషకు గౌరవాన్ని పెంచితే ప్రస్తుత సమాజం తెలుగు భాషను విస్మరిస్తోంది.. ఇంగ్లిష్ మోజులో పడి తెలుగును విస్మరిస్తున్నారు. తెలుగు భాష మన కళ్లు అయితే, ఇతర ప్రపంచ భాషలు కళ్లద్దాలవంటివి. ప్రస్తుతం సమాజంలో వివక్ష పెరిగిపోయింది.. కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాలు క్యాస్ట్, క్యాష్, కమ్యూనిటీగా మారాయి’’ అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ–‘‘సీతారామశాస్త్రిగారితో ఎన్నో వెన్నెల రాత్రులు గడిపాను.. ఆయన స్వతహాగా పాడిన పాటలు విని ఆస్వాదించేవాణ్ణి’’ అన్నారు. ‘‘ఆయన పాటలను పుస్తకంగా తీసుకురావడం వెనుక ‘సిరివెన్నెల’గారి సాహిత్యం గొప్పతనం ఉంది’’ అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ‘‘సిరివెన్నెల’గారి సినిమా పాటలతో 4 సంపుటాలు, సినిమాయేతర రచనలతో మరో రెండు సంపుటాలు విడుదల చేస్తాం. త్వరలోనే ‘తానా సిరివెన్నెల విశిష్ట పురస్కారం’ కూడా విడుదల చేయనున్నాం’’ అని ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ అధ్యక్షుడు లావు అంజయ్య, మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, తమన్, జాగర్లమూడి క్రిష్, ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పక్కా కమర్షియల్ నుంచి ఫస్ట్ సింగిల్, ఆకట్టుకుంటున్న లిరిక్స్..
మ్యాచో హీరో గోపీచంద్‌తో విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్‌లో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు మూవీ విడుదల తేదీని ప్రకటించిన ప్రకటించిన చిత్రం బృందం, తాజాగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. పాటలోని లిరిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఓ ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇదికావడం విశేషం. సిరివెన్నెల గారు చివరిగా రాసిన జీవిత సారాంశం ఈ పాటలో కనిపిస్తుంది. పూజలు పునస్కారాలు నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియల్.. దేవుడు జీవుడు భక్తులు అగత్తులు అన్నీ పక్కా కమర్షియల్.. ఎయిర్ ఫ్రీయా.. నో.. నీరు ఫ్రీయా.. నో.. ఫైర్ ఫ్రీయా.. నో.. నువ్ నుంచున్న జాగా ఫ్రీయా.. అన్నీ పక్కా పక్కా పక్కా కమర్షియల్.. జన్మించినా మరణించినా అవదా ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు.. ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. సిరివెన్నెల గారిని గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్‌లో ఉంటాయని మారుతి చెప్పారు. -
సిరివెన్నెల చివరి అక్షరమాల.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్
Maruthi Emotional On Pakka Commercial Title Song Lyricist Sirivennela: మాచో స్టార్ గోపిచంద్ సినిమాలపై జోరు పెంచాడు. సీటిమార్ సినిమా తర్వాత వెంటనే మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ అయిన 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్ ను ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ టీజర్లో గోపిచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. 'పక్కా.. పక్కా.. పక్కా కమర్షియలే' అంటూ సాగుతున్న ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తుంది. అయితే ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇది. సిరివెన్నెల చివరిసారిగా రాసిన ఈ పాటలో జీవిత సారాంశం ఉండనుందట. దీంతో డెరెక్టర్ మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు. జన్మించిన మరణించినా ఖర్చే ఖర్చు అంటూ సాగే అందమైన పాట రాశారని మారుతి పేర్కొన్నారు. మరణం గురించి ముందే తెలిసినట్లు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ సిరివెన్నెలను గుర్తు చేసుకున్నారు మారుతి. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యంతోపాటు ఈ సాంగ్‌లో మరెన్నో అద్భుతాలు ఉన్నాయని మారుతి తెలిపారు. -
సిద్ శ్రీరామ్ పాడిన అమ్మా వినమ్మా.. సాంగ్ విన్నారా?
Akhil Akkineni releases Amma song From Sharwanand Movie: ‘అమ్మా.. వినమ్మా’ అంటూ ‘ఒకే ఒక జీవితం’ చిత్రం నుంచి ఓ ఎమోషనల్ సాంగ్ విడుదలైంది. శర్వానంద్, రీతూ వర్మ జంటగా, అమల కీలక పాత్ర పోషించిన చిత్రం ఇది. అమల, శర్వానంద్ తల్లీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం కోసం దివంగత ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన అమ్మ పాటను అఖిల్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘అనునిత్యం వెంటాడే తీపి జ్ఞాపకాలతో ఈ పాట అమ్మకి అంకితం’’ అని పేర్కొన్నారు శర్వానంద్. ‘‘అమ్మా.. వినమ్మా’ అంటూ ఈ పాట ఆరంభమవుతుంది. జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ డ్రామాగా ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో విడుదల కానుంది. -
Rewind 2021: వాళ్లను కలిపింది.. వీళ్లను దూరం చేసింది
2021 కొందరిని ఒక ఇంటివారిని చేసింది. కొందరిని ఈ లోకానికి దూరం చేసింది. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటలు, హఠాన్మరణంతో షాక్‌కి గురి చేసిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. పెళ్లి సందడి 2021లో పెళ్లి సందడి కనిపించింది. హీరోలు కార్తికేయ, సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రణీత, సింగర్ సునీత వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ♦ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. నవంబరు 21న తన ప్రేయసి లోహితతో ఏడడుగులు వేశారు. వరంగల్ నిట్‌లో బీటెక్ చేస్తున్నప్పుడు తొలిసారి (2010) లోహితను కలిశారు కార్తికేయ. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ♦ ప్రముఖ దర్శక–నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఫిబ్రవరి 13న దీపిక మెడలో మూడు ముడులు వేశారు. అమెరికాలోని డల్లాలో రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు దీపిక. సుమంత్, దీపికలది పెద్దలు కుదిర్చిన వివాహం. ♦ ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత కూడా ఈ ఏడాది అత్తారింటిలోకి అడుగుపెట్టారు. మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. బెంగళూరులో నితిన్ రాజు వ్యవసాయ క్షేత్రంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ‘మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్’ అన్నారు ప్రణీత. ♦ ప్రముఖ గాయని సునీత ఈ ఏడాది ప్రారంభంలో రామ్ వీరపనేనితో ఏడడుగులు వేశారు. జనవరి 9న వీరి పెళ్లి శంషాబాద్ సమీపంలోని రామాలయంలో జరిగింది. ♦ హాస్య నటి విద్యాల్లేఖా రామన్ పెళ్లి సెప్టెంబర్ 9న సంజయ్‌తో జరిగింది. ఫిట్నెస్, న్యూట్రషనిస్ట్ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్నారు సంజయ్. వీరిది ప్రేమ వివాహం. కాగా, పెళ్లి జరిగిన విషయాన్ని కొన్ని రోజులకు ‘మా పెళ్లయింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు షేర్ చేశారు విద్యుల్లేఖా రామన్. ఇక సెలవు తెలుగు పరిశ్రమలో ఈ ఏడాది బోలెడు విషాదాలు నెలకొన్నాయి. కొందరు కరోనాతో, మరికొందరు అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి ‘ఇక సెలవు’ అంటూ షాకిచ్చారు. ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి నవంబర్ 30న ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్యదర్శకులు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ నవంబర్ 28న మృతి చెందారు. అదే విధంగా గాయకుడు జి. ఆనంద్ మే 7న, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్ మే 7న, రచయిత నంద్యాల రవి మే 14న, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ మే 10న, డైరెక్టర్ అక్కినేని వినయ్ కుమార్ మే 12న, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు వి. కాంచన్ బాబు వంటి వారిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ మే 12న, నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజు మే 21న, నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ మే 26న, యువ నిర్మాత మహేశ్ కోనేరు అక్టోబర్ 12న గుండెపోటుతో మృతి చెందారు. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ సెప్టెంబరు 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. అదే విధంగా డైరెక్టర్ గిరిధర్ (శుభ ముహూర్తం) ఆగస్టు 2న, నటుడు రాజాబాబు అక్టోబర్ 25న అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. -
సిరివెన్నెల చివరి పాటపై సాయి పల్లవి భావోద్వేగం
Sai Pallavi Emotional On Sirivennela Seetharama Sastry Last Song: ప్రముఖ సినీ గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 1986లో ‘సిరివెన్నెల’చిత్రంతో ప్రారంభమైన ఆయన పాటల ప్రయాణం.. ‘శ్యామ్ సింగరాయ్’తో ముగిసింది. హీరో నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇదే ఆయన రాసిన ఆఖరి పాట అని చిత్ర బృందం వెల్లడించింది. ‘సిరివెన్నెల’ అంటూ సాగడం ఈ పాట ప్రత్యేకత. నేడు ఈ పాటను విడుదల చేశారు శ్యామ్ సింగరాయ్ మూవీ యూనిట్. ఈ నేపథ్యంలో సిరివెన్నెల రాసిన ఈ చివరి పాటపై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది సాయి పల్లవి. చదవండి: పుష్ప ట్రైలర్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్ Sirivennela Seetharama Sastry Garu, Every word that you’ve ever written carries your soul and You’ll forever live in our hearts♥️#Sirivennela Lyrical Song from #ShyamSinghaRoy https://t.co/0RAM2tShHH@NameisNani @MickeyJMeyer @anuragkulkarni_ @Rahul_Sankrityn @NiharikaEnt — Sai Pallavi (@Sai_Pallavi92) December 7, 2021 ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తోంది. ఎప్పటికీ మీరు మా హృదయాల్లో జీవించే ఉంటారు సార్’ అంటూ సాయి పల్లవి ఎమోషనల్ అయ్యింది. ఈ పాట సినిమాకి హైలైట్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా థియేయటర్లోకి రానుంది. ‘నెల రాజునీ .. ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల’ అంటూ సాగే ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. తేనెలో తీయదనం సహజంగా ఉన్నట్టే, సిరివెన్నెల సాహిత్యంలో హాయిదనం ఉంటుందని ఈ పాట మరోసారి నిరూపించింది. చదవండి: విడాకులపై సమంత కామెంట్స్, వైరల్ అవుతోన్న చై-సామ్ ఓల్డ్ ఫోన్ కాల్ -
గుండెలను హత్తుకుంటున్న ‘సిరివెన్నెల’చివరి పాట
ప్రఖ్యాత గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30న కన్నుమూసిన సంగతి తెలిసిందే. 1986లో ‘సిరివెన్నెల’చిత్రంతో ప్రారంభమైన ఆయన పాటల ప్రయాణం.. ‘శ్యామ్ సింగరాయ్’తో ముగిసింది. నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇదే ఆయన రాసిన ఆఖరి పాటని చిత్ర బృందం వెల్లడించింది. ‘సిరివెన్నెల’ అంటూ సాగడం ఈ పాట ప్రత్యేకత. ‘నెలరాజుని… ఇల రాణిని కలిపింది కదా… సిరివెన్నెల’అంటూ సాగే ఈ పాట సిరివెన్నెలను మరోసారి స్మరించుకునేలా చేసింది. ఈ అద్భుత మెలోడీకి మిక్కీ జె. మేయర్ స్వరాలు అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది. -
అమెరికాలో సిరివెన్నెలకి తెలుగు వారి నివాళి
డాలస్ (టెక్సాస్): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఆట, నాటా, నాట్స్, టీటీఏ మరియు టాంటెక్స్ ఆధ్వర్యంలో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఘన నివాళి అర్పించాయి. డాలస్ లో జరిగిన కార్యక్రమంలో అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు సాహితి మిత్రులు సిరి వెన్నెలకి పుష్పాంజలి ఘటించారు. సిరివెన్నెల సంతాపసభలో మనమంతా కలుసుకోవడం బాధాకరమని తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన అన్నారు. సినీ, సాహిత్య రంగానికి సిరివెన్నెల చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నాటా ఉత్తరాధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటిలు మాట్లాడుతూ సిరివెన్నెల మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఒక మంచి రచయిత, సాహితీవేత్తని తెలుగు జాతి కోల్పోయిందన్నారు. తానా పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ చెంబోలు సీతారామశాస్త్రి తనకు వ్యక్తిగతంగా చాలా ఆత్మీయులని తెలిపారు. అన్ని సమయాల్లో బావగారూ అంటూ ఆత్మీయంగా పలకరించేవారని గతాన్ని నెమరు వేసుకున్నారు. తానా సంస్థతో సిరివెన్నెలకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సిరివెన్నెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలస్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే ఉండేవారని సిరివెన్నెలకు సమీప బంధువు యాజి జయంతి చెప్పారు. తమ ఇంట్లో బస చేసినప్పుడే మురారి సినిమా పాటలు రాశారని చెబుతూ ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెలకు నివాళి అర్పించిన వారిలో శారద, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ, విజయ్ కాకర్ల, చినసత్యం వీర్నపు, చంద్రహాస్ మద్దుకూరి, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, డాక్టర్ రమణ జువ్వాడి, యుగంధరాచార్యులు, కళ్యాణి, రఘు తాడిమేటి, రమాకాంత్ మిద్దెల, కోట ప్రభాకర్, శ్రీ బసాబత్తిన, ములుకుట్ల వెంకట్, సుందర్ తురుమెళ్ళ, విజయ్ రెడ్డి, రమణ పుట్లూరు, డాక్టర్ కృష్ణమోహన్ పుట్టపర్తి, లోకేష్ నాయుడు, నాగరాజు నలజుల, పరమేష్ దేవినేని, శ్రీకాంత్ పోలవరపు, శాంత, డాక్టర్ విశ్వనాధం, పులిగండ్ల గీత, వేణు దమ్మన, ఎన్ఎంఎస్ రెడ్డి, బసివి ఆయులూరి తదితరులు ఉన్నారు. వీరంతా సిరివెన్నెలతో తమకున్న అనుభంధం, పరిచయం, అనుభూతులను పంచుకున్నారు. చివరగా సిరవెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
సిరివెన్నెల తన మరణాన్ని ముందుగానే ఊహించారు: డైరెక్టర్
Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి.. తెలుగు పాటకు అందాన్నే కాక గౌరవాన్ని కూడా తీసుకువచ్చారు. తెలుగు సినీ పాటకు విశ్వ ఖ్యాతిని తెచ్చిన సిరివెన్నెల అస్తమయాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మనమధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు మాత్రం అందరి హృదయాల్లో సజీవంగా మిగిలిపోనున్నాయి. ఆయన రాసిన పలు పాటలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. అందులో శ్యామ్ సింగరాయ్ సినిమాలో రాసిన రెండు పాటలు కూడా ఉన్నాయి. అయితే ఆ పాటలు రాస్తున్న క్రమంలోనే తన మరణాన్ని ఊహించినట్లున్నారు సిరివెన్నెల. ఇదే నా చివరి పాట అని రాహుల్‌తో అన్నారట! తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ ప్రేక్షకులతో పంచుకున్నాడు. 'నవంబర్ 3వ తేదీన రాత్రి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఫోన్ చేసి తన ఆరోగ్యం సహకరించక ఈ పాటను పూర్తి చేయలేకపోతున్నాను.. ఇంకెవరితోనైనా రాయిద్దాం అన్నారు. పర్లేదు సర్ అన్నాను. ఆ తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు ఫోన్ చేసి నన్ను నిద్ర లేపారు. ఆరోజు దీపావళి. ఆయన ఫోన్ చేసి పల్లవి అయిపోయింది చెప్తాను రాస్కో అన్నారు. నేను వెంటనే పక్కనున్న మహాభారతం పుస్తకంలో పల్లవి రాశాను. అందులో మొదటి వాక్యంలో సిరివెన్నెల తన పేరు రాశారు. ఎందుకుసార్ ఈ పాటకు సంతకమిచ్చారని అడిగితే.. బహుశా ఇదే నా ఆఖరి పాట అవచ్చు అని గట్టిగా నవ్వారు... ఈ పాట రికార్డింగ్ మొదలు పెట్టిన రోజునే ఆయన అంత్యక్రియలు జరిగాయి. పాట చాలా బాగా వచ్చింది, అందుకే ఈ సాంగ్‌కు ఆయన పేరే పెట్టాం' అని చెప్పుకొచ్చాడు. హీరో నాని మాట్లాడుతూ.. శ్యామ్ సింగరాయ్ సినిమాను సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. -
సిరివెన్నెల అంత్యక్రియల్లో కనిపించని మంచు ఫ్యామిలీ, ఎందుకో తెలుసా?
Mohan Babu Explains Why He Not Attend Sirivennela Sitarama Sastry Cremation: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అక్షర శిల్పికి టాలీవుడ్ కన్నీటీ వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలకు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కదలివచ్చి ఆయనకు తుది వీడ్కోలు చెప్పారు. స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, మహేష్‌బాబు, నాగార్జున, ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్, రాజశేఖర్, తివిక్రమ్, రాజమౌళి, కీరవాణి, అల్లు అర్జున్, రానా, నాని, సుధీర్‌బాబు, నాగబాబు, శర్వానంద్, వరుణ్‌సందేశ్, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, ఆర్పీ పట్నాయక్, శివబాలాజీ, నరేశ్, జగపతిబాబుతో సహా నటీనటులు, క్యారెక్టర్ అర్టిస్టులతో పాటు సినీ ప్రముఖులు ఆయన అంత్యక్రియలకు హజరై నివాళులు అర్పించారు. అయితే ఈ కార్యక్రమంలో మంచు ఫ్యామిలీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. చదవండి: Anasuya Bhardwaj-Pushpa Movie: నోట్లో బ్లేడ్‌తో అనసూయ.. భయపెట్టిస్తోన్న లుక్ సినీ పరిశ్రమకు చెందిన వారికి ఎలాంటి సమస్యలు వచ్చిన, ప్రముఖులు మరణించిన ముందుగా అక్కడ ఉండేది మంచు కుటుంబమే. ఏ కార్యక్రమైన విలక్షణ నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంబం తప్పకుండా హజరవుతారు. అలాంటిది తెలుగు పాటకు కోట కట్టిన సిరివెన్నెల వంటి వ్యక్తి మరణిస్తే మోహన్ బాబు, ఆయన కుటుంబం అక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఏమైంది, మంచు ఫ్యామిలీ ఎందుకు రాలేదంటూ పలువురు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ మూవీ ఈవెంట్లో పాల్గోన్న మోహన్‌బాబు దీనిపై వివరణ ఇచ్చాడు. చదవండి: నైటీపైనే బయటకొచ్చిన హీరోయిన్, ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్న నెటిజన్లు ‘సిరివెన్నెల మరణంతో ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది.. ఇటీవల మా ఇంట్లో నా సొంత తమ్ముడు మృతి చెందిన సంగతి తెలిసిందే. సిరివెన్నెల గారు చనిపోయిన రోజే నా తమ్ముడి పెద్దకర్మ జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు బయటికి వెళ్లకూడదు. అందుకే సిరివెన్నెల భౌతికకాయం చూడడానికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పా. ఆ కారణంగానే ఆయన చివరికి చూపుకు కూడా నోచుకోలేకపోయాను. ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. సినిమా పరిశ్రమలో ఇలా వరుసగా విషాధ సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది’ అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. -
సిరివెన్నెల అంత్యక్రియలు ఫోటోలు
-
సిరివెన్నెలకు ఆ పాటలంటే అసలు నచ్చదట, అవేంటో తెలుసా?
తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన లేకపోయినప్పటికీ ఆయన పాట పదిలంగా ఉంటుంది. అంతలా సిరివెన్నెల తెలుగు సాహిత్యంపై, చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Rajamouli Emotional Post: ‘ఆర్ఆర్ఆర్’లో ఆయనతో ఓ షాట్ ప్లాన్ చేశా, కానీ.. ఆయన కలం నుంచి జాలివారిన పాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం’ అంటూ మొదలైన తన ప్రయాణంలో ఎన్నో ఆణిముత్యాలను అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడిదిచ్చే వాడినేమి అడిగేదీ.. అంటూ భక్తిభావం కలిగించాడు. అర్ధశతాబ్దపు అజ్ఞాన్ని స్వతంత్రం అందామా అంటూ.. అగ్నిజ్వాలలను రగలించే పాటలను రాశారు. తెల్లారింది లెగండొయ్ అంటూ స్ఫూర్తిని నింపారు. సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా అంటూ ప్రేమగీతాలను రాశారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని కేవలం ఒక్క జోనర్‌కు అని పరిమితం కాకుండా సరసం, శృంగారం, వేదన, ఆలోచన.. ఇలా కవిత్వంలో ఎన్ని విభాగాలు ఉంటే అన్నింటిలోనూ పాటలను రాసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల సినీ కెరీర్లో 3వేలకు పైగా పాటలు రాసిన సిరివెన్నెలకు కొన్ని రకాల పాటలు రాయడం అస్సలు నచ్చదట. ఎంత డబ్బు ఇచ్చిన సరే అలాంటి పాటలు రాసేవాడు కాదట. ఈ విషయాన్ని సిరివెన్నెల స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్ పాటలను రాయడం తనకు ఇబ్బందిగా ఉంటుందని సిరివెన్నెల ఓ సందర్భంలో తెలిపారు. చదవండి: ఏపీ వరదలు: బాధితుల కోసం చిరంజీవి, మహేశ్, తారక్‌ల భారీ విరాళాలు ‘సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలపై నన్ను పాటలు రాయమని చెప్పొద్దని డైరెక్టర్లు, నిర్మాతలకు చెప్పేవాడిని. నా అనుభూతుల్ని మాత్రమే పాటలుగా రాస్తాను. కఠినమైన పాట రాసేంత భాష నాకు రాదు. నాకు అష్టైశ్వర్యాలు కంటే వ్యక్తిత్వమే ముఖ్యం. ఇది నా పాట అని ప్రతి ప్రేక్షకుడు అనుకునేలా నా పాటలు ఉండాలనుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనైన నా పాటల్లో స్త్రీని కించపరచను. సినిమాలో ఆ పాత్ర ఎలాంటిది అయినా సరే అవమానిస్తూ రాయడం నాకు ఇష్టం ఉండదు. నా పాటల్లో శృంగార రచనలు చేస్తాను.. కానీ అవి కుటుంబ సభ్యులతో కలిసి వినగలిగేలా ఉంటాయి. అంతేతప్ప అంగాంగ వర్ణనలు మాత్రం చేయను. ఇక కుర్రకారును రెచ్చగొట్టే పాటలు అస్పలు రాయను’ అంటూ ఆయన చెప్పకొచ్చారు. -
సిరివెన్నెల చివరి కోరిక ఏంటో తెలుసా?
తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం చిత్రపరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కలం నుంచి జాలివారిన పాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. జగమంత అభిమానుల కుటుంబాన్ని వదిలి ఏకాకి జీవితం నాది అంటూ నిష్క్రమించిన ఈ మహనీయుడికి ఓ కోరిక ఉండేదట! తన కొడుకు రాజాను ఒక మంచి నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో చూడాలని సిరివెన్నెల ఎంతగానో ఆశపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దాదాపు 14 ఏళ్ల క్రితం దర్శకుడు తేజ తెరకెక్కించిన 'కేక' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు రాజా. తర్వాత 'ఎవడు' సినిమాలో విలన్‌గా, అనంతరం 'ఫిదా'లో వరుణ్‌తేజ్ అన్నయ్యగా నటించాడు. కొన్ని మంచి పాత్రలే దక్కినా కూడా రాజాకు రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. దీంతో తన కొడుకు కెరీర్ విషయంలో సిరివెన్నెల మదనపడ్డారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. రాజా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటే సిరివెన్నెల ఆత్మకి శాంతి చేకూరుతుందని, అది జరగాలని ఆయన అభిమానులు మనసారా కోరుకుంటున్నారు. -
సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నమూసిన సంగతి తెలిసిందే. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ.. నవంబర్ 24న సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ.. మంగళవారం సాయంత్రం సిరివెన్నెల మృతి చెందారు. ఈ క్రమంలో సిరివెన్నెల కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. సిరివెన్నెల వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. (చదవండి: సిరివెన్నెల గారు అలా నా జీవితాన్ని దిశా నిర్ధేశం చేశారు: రాజమౌళి) ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడారు అధికారులు. ఆస్పత్రి ఖర్చుల భారం సిరివెన్నెల కుటుంబంపై పడకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సీఎం ఆదేశాల మేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అలానే సిరివెన్నెల కుటుంబానికి స్థలం కేటాయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. (చదవండి: అందరూ పోతారు కానీ.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు) ఇటువంటి సమయంలో సీఎం జగన్ తమకు అండగా నిలిబడినందుకు గాను సిరివెన్నెల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. సిరివెన్నెల అంత్యక్రియలకు హాజరైన మంత్రి పేర్ని నాని ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం -
సిరివెన్నెల గారు అలా నా జీవితాన్ని దిశా నిర్ధేశం చేశారు: రాజమౌళి
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ మృతిపై దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ షేర్ చేస్తూ సిరివెన్నెలకు సంతాపం తెలిపారు. తన ట్విటర్లో పోస్ట్ షేర్ చేస్తూ సిరివెన్నెలతో తన జర్నీని పంచుకున్నారు. ‘‘1996లో మేము ‘అర్దాంగి’ అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చి, వెన్నుతట్టి ముందుకు నడిపించినవి ‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. ఎప్పుడూ వదులు కోవద్దురా ఓరిమి’ అన్న సీతారామశాస్త్రి గారి పదాలు. భయం వేసినప్పుడల్లా గుర్తు తెచ్చుకుని పాడుకుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. అప్పటికీ నాకు శాస్త్రి గారితో పరిచయం చాలా తక్కువ. మద్రాసులో డిసెంబర్ 31వ తారీకు రాత్రి పది గంటలకు ఆయన ఇంటికి వెళ్లాను. ‘ఏం కావాలి నందీ’ అని అడిగాడు. ఒక కొత్త నోట్‌బుక్ ఆయన చేతుల్లో పెట్టి మీ చేతుల్తో ఆ పాట రాసివ్వమని అడిగాను. రాసి ఆయన సంతకం చేసి ఇచ్చారు. జనవరి 1న మా నాన్నగారికి గిఫ్ట్‌గా ఇచ్చాను. నాన్న గారి కళ్లల్లో ఆనందం. మాటల్లో కొత్తగా ఎగదన్నుకొచ్చిన విశ్వాసం ఎప్పటికీ మర్చిపోలేను. ‘సింహాద్రి’ చిత్రంలో ‘అమ్మాయినా.. నాన్నయినా.. లేకుంటే ఎవరైనా’ పాట, ‘మర్యాద రామన్న’లో ‘పరుగులు తియ్’ పాట, ఆయనకి చాలా ఇష్టం. అమ్మ నాన్న లేకపోతే ఎంత సుఖమో అని కానీ, పారిపోవడం చాలా గొప్ప అని కానీ ఎలా రాస్తాము నంది అని తిట్టి, మళ్లీ ఆయనే ‘ఐ లైక్ దిస్ ఛాలెంజ్’ అంటూ మొదలు పెట్టారు. కలిసినప్పుడల్లా ప్రతీ లైన్ నెమరేసుకుంటూ అర్థాన్ని మళ్లీ విపులీకరించి చెప్తూ ఆయన స్టైల్లో గది దద్దరిల్లేలా నవ్వుతూ, పక్కనే ఉంటే వీపుని గట్టిగా చరుస్తూ ఆనందించేవారు. చివరగా ఆయన ‘ఆర్ఆర్ఆర్’లో దోస్త్ మ్యూజిక్ వీడియోకి లిరిక్ పేపర్లో ఆయన సంతకం చేసే షాట్ తీద్దామని చాలా ప్రయత్నించాం. కానీ అప్పటికే ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. ఇది ఆయనతో నాకున్న గొప్ప జ్ఞాపకం. నా జీవన గమనానికి దిశా నిర్ధేశం చేసిన సీతారామశాస్తి కలానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ’’ అంటూ రాజమౌళి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. pic.twitter.com/CmBx0ZvXj6 — rajamouli ss (@ssrajamouli) November 30, 2021 -
స్వర్గంలో మనిద్దరం ఓ పెగ్గేద్దాం : ఆర్జీవీ
Ram Gopal Varma Condolence On Sirivennela Sitaramasastry: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గర్వపడే రచయితల్లో ఒకరిగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మూడు వేలకుపైగా పాటలు రాసిన ఆయనకు పలువురు దర్శకులు, హీరోలు, సంగీత దర్శకులతో అమితమైన అనుబంధం ఉంది. అలాంటి వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. రామ్ గోపాల్ వర్మకు సిరివెన్నెలపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. వర్మ తొలిచిత్రం శివలో అన్ని పాటలు సీతారామ శాస్త్రితోనే రాయించారు. శివ సినిమాలోని 'బోటని పాఠముంది.. మ్యాటనీ ఆట వుంది' అనే పాట అప్పట్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తర్వాత తాను తెరకెక్కించిన ప్రతి సినిమాలోను సిరివెన్నెలతో పాటలు రాయించుకోవడం మాత్రం మానలేదు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామ్ గోపాల్ వర్మ. 'శివ చిత్రం చేస్తున్నప్పుడు కవిత్వం బుకీష్ వర్డ్స్ లేకుండా కాలేజ్ విద్యార్థులు మాట్లాడుకునేలా పదాలతో సాంగ్ రాయమని అడిగితే రెండు మూడు సెకన్లలో 'బోటని పాఠముంది' అని మొదలుపెట్టారని వర్మ గుర్తు చేసుకున్నారు. ఒక్కసారి మెమోరీస్‌కి వెళ్తే ఎన్నో పాటలు ఉన్నాయన్నారు. ఆయన మరణించడం నిజంగా షాకింగ్‌గా ఉందన్నారు. 'అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోతారు. కానీ ముందు తరాలకు ఒక మార్గదర్శకునిగా రచయితలకు ఒక గురువుగా ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు.' అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. 'మీరు ఎక్స్ట్రార్డినరీ సాంగ్స్ రాసారు కాబట్టి కచ్చితంగా స్వర్గానికి వెళ్లుంటారు. అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలకు నా హలో చెప్పండి. కానీ నేను ఎక్కవ పాపాలు చేసి నరకానికి వెళ్తాను. పొరపాటున స్వర్గానికి వస్తే మాత్రం మీరెలాగో నాతో వోడ్కా తాగరు. కాబట్టి అమృతం ఓ పెగ్గేద్దాం అని ఆడియో క్లిప్ ట్వీట్ చేశాడు ఆర్జీవీ. Sitarama Shastry Garu pic.twitter.com/QfC7Gjakvc — Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2021 pic.twitter.com/wI8YvnZnbJ — Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2021 pic.twitter.com/mAre93cFl9 — Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2021 pic.twitter.com/M0Z0HUu4a2 — Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2021 -
మనసుకు బాధగా ఉంది మిత్రమా: ఇళయరాజా భావోద్వేగం
Ilayaraja Condolence To Sirivennela Sitarama Sastry: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్మరణం దేశవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులను, చలన చిత్ర పరిశ్రమలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. పండితుల నుంచి సామాన్యుల వరకు సిరివెన్నెల సాహిత్యం ప్రభావితం చేయగా.. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సిరివెన్నెల మృతిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చదవండి: సిరివెన్నెలను వరించిన 11 నంది అవార్డులు.. ఆ పాటలు ఇవే.. కాగా ఇళయరాజా, సిరివెన్నెలు దశాబ్దాల పాటు పనిచేశారు. ఇళయరాజా స్వరాలకు సిరివెన్నెల సాహిత్యం తోడై అద్భుతం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో ఇళయరాజా మిత్రుడు సిరి వెన్నెలకు పదాలతో నీరాజనం తెలిపారు. ‘మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయని చెప్పారు. ఆయన పాటల పదముద్రలు తన హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయని తెలిపారు. సినిమా పాటల్లో సైతం కవితాత్మని, కళాత్మకతని అందించి తనదైన ముద్రతో అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలను అందించారని చెప్పారు. శ్రీ వేటూరి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు... చదవండి: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు.. పాటతో అంతర్యుద్ధం చేస్తాడు.. పాటలో అంతర్మథనం చెందుతాడు.. పాటని ప్రేమిస్తాడు.. పాటతో రమిస్తాడు.. పాటని శాసిస్తాడు.. పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు.... ‘మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి. నాతో శివ తాండవం చేయించాయి.. ‘వేటూరి’ నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే... ‘సీతారాముడు’ నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు.. ధన్యోస్మి మిత్రమా..! ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది.. పాటకోసమే బ్రతికావు,బ్రతికినంత కాలం పాటలే రాశావు....ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ ఇళయరాజా సిరివెన్నెలకు అంతిమ వీడ్కోలు తెలిపారు. కాగా మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 2:26 గంటలకు ముగిశాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు. -
‘సిరివెన్నెల‘ సీతారామశాస్త్రికి ప్రముఖుల నివాళి (ఫోటోలు)
-
ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి (ఫోటోలు)
-
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ వాయిదా.. ఎందుకో తెలుసా ?
RRR Movie Trailer Postponed And Here Is The Reasons: ధర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కాంబినేషనల్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీసారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా థియేటరికల్ ట్రైలర్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ఇవాళ (డిసెంబర్ 1) ప్రకటించారు. అయితే డిసెంబర్ 3న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించినా ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతోపాటు పలు అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం తెలిపింది. త్వరలో ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్న ఈ సినిమాను సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ టాలీవుడ్లోకి అరంగ్రేటం చేయనుంది. ఇందులో ఆమెకు రామ్ చరణ్ జోడిగా నటించనున్నారు. ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ అలరించనుంది. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది చదవండి: ఐటెం సాంగ్ అడిగిన నెటిజన్‌కు 'ఆర్ఆర్ఆర్' టీం రిప్లై.. -
సిరివెన్నెలను వరించిన 11 నంది అవార్డులు.. ఆ పాటలు ఇవే..
Top 11 Sirivennela Sitaramasastry Nandi Award Winning Songs List: సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.. అందులోని భావానికి వావ్ అనాల్సిందే. ఆయన రచన, సాహిత్యం అలాంటిది. అంతే కాదు అక్షరానికి ఎంత శక్తి ఉంటుందని తెలియజేసేవారిలో అతి ముఖ్యులు సీతారామశాస్త్రి. సరసం, శృంగారం, వేదన, ఆలోచన.. ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు సిరివెన్నెల. ‘విధాత తలపున ప్రభవించినదీ’ అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. ‘సరస స్వర సుర ఝరీ గమనమౌ’ అంటూ మొదలైన ప్రయాణంలో ఎన్నో అవార్డులు. ఒకటి కాదు, రెండు కాదు, భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ కూడా ఆయన సాహిత్యానికి కానుకగా వరించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డు అందుకున్నారు. ఆయన సాహిత్యం అందించిన పాటలు, నంది అవార్డులు గెలుచుకున్న విశేషాలు ఇవే. 1. చెంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట ‘విధాత తలపున’. ‘సిరివెన్నెల’ చిత్రంలోని ఈ పాటకు ఉత్తమ గీత రచయితగా తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. కే. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ స్వరాలు అందించారు. 2. రెండోసారి కూడా కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'శ్రుతిలయలు' సినిమాలోని 'తెలవారదేమో స్వామి' పాటకు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు. ఈ పాటకు కూడా కె.వి. మహదేవన్ స్వరాలు సమకూర్చారు. 3. మూడోసారి హైట్రిక్గా కే. విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమాలోని పాటకే నంది అవార్డు సీతారామ శాస్త్రిని వరించింది. ఇళయరాజా స్వరాలు అందించిన ‘స్వర్ణకమలం’లో ‘అందెల రవమిది పదములదా!’ అంటూ సాగే పాట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 4. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతిబాబు కీలక పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గాయం’. ఇందులో ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని’ అంటూ సాగే పాటను సిరివెన్నెల రాశారు. శ్రీ కొమ్మినేని స్వరాలు సమకూర్చిన ఈ పాటకు నంది అవార్డు దక్కింది. 5. ఐదో నంది అవార్డు 'శుభలగ్నం' సినిమాలోని ‘చిలుక ఏ తోడు లేక’ అనే పాట రచిచించనందుకు దక్కింది. 6. శ్రీకారం చిత్రంలోని ‘మనసు కాస్త కలత పడితే' అంటూ సాగే గేయానికి ఆరో నంది అవార్డు లభించింది. 7. ఏడో నంది అవార్డు ‘సింధూరం’ చిత్రంలోని ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే’ పాటకు వరించింది. 8. సుమంత్ హీరోగా అరంగ్రేటం చేసిన ‘ప్రేమకథ’ సినిమాలోని 'దేవుడు కరుణిస్తాడని' అనే పాటకు ఎనిమిదో నంది అవార్డు వచ్చింది. 9. తొమ్మిదో నంది అవార్డు ‘చక్రం’లోని 'జగమంత కుటుంబం నాది' అనే పాటకు దక్కింది. 10. పదో నంది అవార్డు ‘గమ్యం’ (ఎంత వరకూ ఎందుకొరకు) 11. పదకొండో నంది అవార్డు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (మరీ అంతగా) వీటితో పాటు సిరివెన్నెలకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, గమ్యం, మహాత్మ, కంచె చిత్రాలకు పాటలు రాసినందుకుగాను సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి. గోవాలోని పనాజీలో 2017లో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతులమీదుగా 'సంస్కృతి' కేటగిరీ కింద 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్' అవార్డును అందుకున్నారు సిరివెన్నెల. ఇది చదవండి: సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు -
ఇక సెలవు.. మహాప్రస్థానంలో ముగిసిన 'సిరివెన్నెల' అంత్యక్రియలు
Sirivennela Sitaramasastry: అక్షరయోధుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి.హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఆశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రారంభమైన సిరివెన్నెల అంతియాత్ర మహాప్రస్థానం వరకు కొనసాగింది. అంతిమయాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. సిరివెన్నెలను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సిరివెన్నెల ఇక మనమధ్య లేరని తెలిసి కన్నీటి పర్యంతం అయ్యారు. కాగా తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ నవంబర్ 24న సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారు. తొలి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నసిరివెన్నెల పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో1955 మే 20న జన్మించిన ఆయన సిరివెన్నెల సినిమాతో పాటల ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలా ఇప్పటివరకు మూడువేలకు పైగా పాటలు రాశారు. గేయరచయితగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 2020 వరకు 3000 పాటలకు పైగా సాహిత్యం అందించారు. పదకొండు నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించారు. ఈ రంగంలో ఆయన కేసిన కృషికి గాను 2019లో పద్మశ్రీ పురస్కారం లభించింది. -
కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం
కళావెన్నెల విశ్వాన్ని గెలవాలంటే కళాతపస్వి కావాలి. కళను గెలవాలంటే సాహితీవెన్నెల కావాలి. సరస్వతీ పుత్రులు పద్మాలలో కూర్చుంటేనే కదా.. ఆ పద్మాలు కిరీటాలు అవుతాయి. పాటలు పామరులకు అందాయి. కథలు ప్రేక్షకులకు అందాయి. పద్మాలు ‘కళావెన్నెల’కు అందాయి. సీతారామశాస్త్రి అనే ఈ మాణిక్యాన్ని ఏ క్షణాన గుర్తించారు? విశ్వనాథ్: ఒకసారి శాస్త్రి (సిరివెన్నెల) రావడం రావడమే చిన్న స్క్రిప్ట్‌తో వచ్చాడు. అందులో పాటలు కూడా రాశాడు. ఆ పాటల్లో మంచి భావుకత ఉందనిపించింది. అది అలా మనసులో గుర్తుండిపోయింది. సంవత్సరం తర్వాత నాకో కొత్త లిరిసిస్ట్ కావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చేబోలు సీతారామశాస్త్రి అనే వ్యక్తి గుర్తొచ్చాడు. ‘సిరివెన్నెల’ సినిమాకి పిలిపించి రాయించాం. సింగిల్ కార్డ్. ఆ రోజుల్లో అన్ని పాటలూ కొత్త రచయితతో రాయించడం అంటే పెద్ద సాహసమే. ఎందుకంటే ఒక్కో పాట ఒక్కో రచయిత రాస్తున్న సమయం అది. జానపదం అయితే కొసరాజు. మనసు పాట అయితే ఆత్రేయ, క్లబ్ పాట అయితే ఆరుద్ర. మూడు నాలుగు పేర్లు టైటిల్ కార్డ్‌లో పడటం సాధారణం. పౌరాణికాలు అయినప్పుడు సముద్రాలగారు వాళ్లు మాత్రమే సింగిల్ కార్డ్ రాసేవారు. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారికి కూడా ఇంకో పేరు జతపడేది. మరేం ధైర్యమో? అన్ని రకాలు వండగలడో కూడా తెలియదు. మనోధైర్యంతో రాయించాను. సిరివెన్నెల: కన్విక్షన్ ఉన్నవాళ్లకు బాగా ఫీడ్ ఇస్తే.. ఎవ్వరికైనా కొత్తగా రాస్తారు. ‘నాకు అర్థం అయినా కాకపోయినా మీరు విజృంభించి రాయండి. మీకిది జైలు కాదు’ అని నాన్న (విశ్వనాథ్‌ని సిరివెన్నెల అలానే పిలిచేవారు)గారు అన్నారు. విశ్వనాథ్: కేవీ మహదేవన్ (సంగీత దర్శకుడు) ముందు పాట రాయించుకుని, ఆ తర్వాత ట్యూన్ కట్టేవారు. ‘సిరివెన్నెల’ సినిమాకి ఆ విధంగానే శాస్త్రిని నానా హింసలు పెట్టి రాయించుకున్నాను. వీళ్లు (ఆకెళ్ల సాయినాథ్, సిరివెన్నెల) నాతో పాటే నందీ హిల్స్‌లో ఉండేవాళ్లు. ఇద్దరూ పగలంతా తిరిగేవారు. ఇంకేం చేసేవారో నాకు తెలియదు కానీ సాయంత్రానికి తిరిగొచ్చేవాళ్లు (నవ్వుతూ). నా షూటింగ్ పూర్తి చేసుకొని ఖాకీ డ్రెస్ తీసేసి కొంచెం రిలాక్స్ అయ్యాక కలిసేవాళ్లం. ఆ రోజు అలా కొండ చివరకు వెళ్లాం. అప్పుడు శాస్త్రి ఓ రెండు వాక్యాలు గమ్మత్తుగా ఉన్నాయి అన్నాడు. ఎవరైనా అలా అంటే వాటిని వినేదాకా నేను తట్టుకోలేను. నాకదో వీక్నెస్. ఏమొచ్చిందయ్యా అన్నాను. ‘ఆది భిక్షువుని ఏమి కోరేది. బూడిదిచ్చేవాడిని ఏమడిగేది’ అన్నాడు శాస్త్రి. అయ్య బాబోయ్.. అనిపించింది. మీ మధ్య వాదించుకోవడాలు ఉండేవా? విశ్వనాథ్: 75 ఏళ్లు కాపురం చేశాం. మా ఆవిడను అడగండి. ఆవిడ ఏం సమాధానం చెబుతుందో. శాస్త్రి, నా మధ్య సఖ్యత కూడా అంతే. నారాయణరెడ్డిగారు ఓ సందర్భంలో మేమిద్దరం ‘జంట కవులం’ అన్నారు. ‘సిరివెన్నెల’ మీ ఇంటి పేరుగా మారిపోవడం గురించి? సిరివెన్నెల: ఆ సినిమా వల్ల నాకీ పేరు రాలేదు. ఆ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని వేశారు. మన శాస్త్రంలో ఆరు రకాల తండ్రులు ఉంటారు అంటుంటాం. విద్య నేర్పినవాడు, నామకరణం చేసినవాడు, జన్మనిచ్చినవాడు.. ఇలా. మా నాన్నగారు జన్మనిస్తే, నాకు సినీ నామకరణం చేసి, కవి జన్మని ఇచ్చిన తండ్రి విశ్వనాథ్‌గారు. ఆ పేరు పెట్టేప్పుడు మీ అమ్మానాన్న చక్కగా సీతారామశాస్త్రి అని పెట్టారుగా.. మళ్లీ పేర్లెందుకు? స్క్రీన్ కోసమే కావాల్సి వస్తే ‘సిరివెన్నెల’ అని సినిమా పేరే ఉందిగా. దాన్ని ముందు జత చేసుకో అన్నారాయన. సిరివెన్నెలలానే నీ కెరీర్ కూడా ఉంటుంది అన్నారు. వశిష్ట మహర్షి రాముడికి పేరు పెట్టినట్టుగా నాకు పేరు పెట్టారు. విశ్వనాథ్‌గారిని ‘నాన్నగారు’ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? సిరివెన్నెల: నాకు ముందు నుంచి పిలవాలని ఉండేది. కానీ బెరుకుగా కూడా ఉండేది. ఐదారేళ్ల క్రితం నుంచి పిలుస్తున్నాను. విశ్వనాథ్: శాస్త్రి నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలిచింది లేదు. సిరివెన్నెల: మా అబ్బాయిని కూడా సాయి (అసలు పేరు యోగేశ్వర శర్మ. సిరివెన్నెల తండ్రి పేరు) అంటాను. నాన్న పేరుతో పిలవలేను. ఈయన్ను కూడా అంతే. వేటూరిగారు, ఆరుద్రగారు.. ఇలాంటి గొప్ప రచయితలతో పాటలు రాయించుకున్నారు. ఆ తర్వాత సిరివెన్నెలగారితో రాయించుకున్నారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌గా..? విశ్వనాథ్: అవసరం లేదు. ఆయన పైకి ఎదుగుతున్న స్టేజ్‌లో నేను కిందున్నాను. పదేళ్లుగా ఏ సినిమా చేయడం లేదు నేను. ఒకవేళ చేస్తే రాయను అనడు. కాబట్టి ఇప్పుడప్పుడే వేరే రచయిత కోసం వెతుక్కోనవసరం లేదు. సిరివెన్నెల: నేనే ఆయనతో ఓసారి అన్నాను. మీ సినిమాల్లో నేను రాయకుండా వీలే లేదు. ఇప్పుడు నాన్నగారు సినిమా తీసి, ఏ కారణం చేతనైనా ఆయన సినిమాల్లో పాట రాయకపోతే నేను ఇండస్ట్రీలో ఉండనన్నది నా పంతం. మీ శిష్యుడు రాత్రిపూట పాటలు రాయడం గురించి? సిరివెన్నెల: మేం నాన్నగారిని వదిలి వెళ్లేటప్పుడు రాత్రి పది అయ్యేది. కానీ మరుసటి రోజు కొత్త కథ ఉండేది. అంటే ఆ రాత్రంతా ఏం చేస్తున్నట్టు? పొద్దునే ఇది తీస్తారు అని వెళ్తాం. కానీ అక్కడ వేరేది ఉంటుంది. నాకూ అదే అలవాటైంది అనుకుంటా. రాత్రంతా ఒక వెర్షన్ రాసి మరో వెర్షన్ రాసి... ఇలా రాత్రిళ్లు రాస్తుంటాను. విశ్వనాథ్: శాస్త్రి రాత్రిపూట రాస్తాడంటే ఆ నిశ్శబ్దమే తనకు సహాయం చేస్తుంది. నాక్కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకు కొత్త కొత్త భావాలు వస్తుంటాయి. వాటినే ఉదయం షూటింగ్ ప్రారంభించాక ఇలా చేయండి అని చెబుతుంటాను. ఇది చదవండి: సిరివెన్నెలకు గూగుల్ నివాళి.. 'ట్రెండింగ్ సెర్చ్' ట్వీట్ -
తనకు ఆ సమస్య ఉందని తెలిసి బాధపడ్డ సిరివెన్నెల
Sirivennela Seetharama Sastry: రోజుకి 19 గంటల పాటు ఏకాంతంగా... ఏకధాటిగా 30 ఏళ్లు పాటతోనే జీవించిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ‘అంతర్యామి అలసితి సొలసితి...’ అంటూ అక్షరాల నుంచి సెలవు తీసుకున్నారు. సిరివెన్నెలలు పంచడానికి వెన్నెల చెంత చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామంలో 1955 మే 20న డా. చేంబోలు వెంకట యోగి, సుబ్బలక్ష్మీ దంపతులకు సీతారామశాస్త్రి జన్మించారు. వెంకట యోగి, సుబ్బలక్ష్మీ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు కాగా సీతారామశాస్త్రి తొలి సంతానం. పదో తరగతి వరకూ అనకాపల్లిలో చదువుకున్న సీతారామశాస్త్రి కాకినాడలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐటీఐ కాలేజీ లెక్చరర్‌గా వెంకట యోగికి కాకినాడకు బదిలీ కావడంతో సీతారామశాస్త్రి ఇంటర్మీడియెట్ చదువు అక్కడే సాగింది. కాగా వెంకట యోగికి హోమియోపతి వైద్యంలో ప్రవేశం ఉండటంతో సీతారామశాస్త్రిని మెడిసిన్ చదివించాలనుకున్నారు. అలా విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో 1973లో ఎమ్బీబీఎస్లో చేరారు. అయితే ఎమ్బీబీఎస్లో చేరే ముందే కుటుంబ పోషణ విషయంలో ఇబ్బందిపడుతున్న తండ్రికి సాయం చేయాలని టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లై చేశారు. కానీ ఎమ్బీబీఎస్లో చేరారు. అప్పటివరకు సీతారామశాస్త్రికి మొదటి బెంచ్‌లో కూర్చొనే అలవాటు ఉంది. కానీ ఎమ్బీబీఎస్లో చివరి బెంచ్ దొరికింది. పైగా లెక్చరర్స్ చెప్పే పాటలు అర్థం అయ్యేవి కావు. ఎందుకంటే అప్పుడు ఇంగ్లిష్‌లో సీతారామశాస్త్రికి అంతగా ప్రావీణ్యత లేదు. చివరి బెంచ్‌లో కూర్చున్న ఆయనకు బ్లాక్‌బోర్డ్ సరిగ్గా కనిపించకపోవడంతో, తనకు కంటి సమస్య ఉందని గ్రహించి, బాధపడ్డారు. ఇంగ్లిష్ సమస్య, ఐ సైట్... ఈ రెంటితో పాటు ఉమ్మడి కుటుంబ పోషణ విషయంలో తండ్రి ఇబ్బంది.... ఈ మూడు అంశాలు సీతారామశాస్త్రికి చదువుపై ఏకాగ్రత నిలవనివ్వకుండా చేశాయి. అదే సమయంలో టెలిఫోన్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరమని కబురు రావడంతో ఎమ్బీబీఎస్కి ఫుల్స్టాప్ పెట్టి, 300 రూపాయలకు టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్‌గా చేరారు. అయితే తండ్రికి మాత్రం తాను ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తానని మాటిచ్చారు. అన్నట్లుగానే ఆ తర్వాత బీఏ చేశారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో 40 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారమంతా సీతారామశాస్త్రిపై పడిపోయింది. తండ్రి హోమియోపతి వైద్యాన్ని సీతారామశాస్త్రి తమ్ముడు చూసుకున్నారు. ఆ తర్వాత సీతారామశాస్త్రి తమ్ముడికి ఉద్యోగం దొరికింది. సోదరీమణుల వివాహాలను ఈ ఇద్దరు అన్నదమ్ములు జరిపించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే కాకినాడలో సాంస్కృతిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న సీతారామశాస్త్రికి ‘కళా సాహితి సమితి’తో పరిచయం కలిగింది. ఈ ప్రయాణంలో భాగంగానే సీవీ కృష్ణారావు, ఇస్మాయిల్, సోమసుందర్, ఆకెళ్ల సూర్య వెంకటనారాయణ వంటి ప్రముఖ సాహితీవేత్తలతో సీతారామశాస్త్రికి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పుడే ‘భరణి’ అనే కలం పేరుతో సీతారామశాస్త్రి రాసిన రచనలు ఆంధ్రప్రభ, విజయ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఇదే టైమ్‌లో ఆకెళ్ల సూర్య వెంకటనారాయణ సినిమాల్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. 1980లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమా విజయోత్సవాల్లో భాగంగా కాకినాడలో ఓ వేడుక ఏర్పాటు చేశారు. కె. విశ్వనాథ్‌కి ఓ స్వాగతగీతాన్ని రాయాల్సిందిగా సీతారామశాస్త్రిని కోరారు ఆకెళ్ల. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఓ సందర్భంలో కె. విశ్వనాథ్ పాల్గొన్న ఓ వేడుకలో సీతారామశాస్త్రి రాసిన ‘గంగావతరణం’ పాటను కె. విశ్వనాథ్ స్వాగత గీతంగా ఆలపిం చారు. విశ్వనాథ్‌కి ఈ పాట నచ్చింది. ఈ పాట ఎవరు రాశారో తెలుసుకోవాలని ప్రయత్నించగా ఆయనకు భరణి (సీతారామశాస్త్రి కలం పేరు) అని తెలిసింది. భరణి అనేది సీతారామశాస్త్రి కలం పేరు అని తెలుసుకున్న కె. విశ్వనాథ్ ఆయన్ను కలవాలనుకున్నారు. అంతేకాదు.. సీతారామశాస్త్రి రాసిన ‘గంగావతరణం’ పాటను తన సినిమా (బాలకృష్ణ హీరోగా నటించిన ‘జననీ జన్మభూమి)లో వినియోగించాలనుకుంటున్నట్లుగా కబురు పంపారు. ‘‘ఓ సందర్భంలో ‘గంగావతరణం’ పాటను మీ కోసమే రాశాను. ఇప్పుడు అది మీ చెంతకు చేరడం, మీ సినిమాలో వినియోగించుకోవాలనుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సీతారామశాస్త్రి. అయితే ఈ సినిమా పాటల రచయిత విభాగంలో క్రెడిట్ కావాలని విశ్వనాథ్‌ని కోరారు సీతారామశాస్త్రి. విశ్వనాథ్ ఓకే అన్నారు. తాను గురువుగా భావించే వేటూరి సుందర రామమూర్తి పేరు కింద తన పేరు ‘చేంబోలు సీతారామశాస్త్రి (భరణి)’ అనే టైటిల్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసుకుని ఆనందపడిపోయారు. ఇంటి పేరుగా మారిన ‘సిరివెన్నెల’ ‘సిరివెన్నెల’ (1986)తో సీతారామశాస్త్రి సినిమా కెరీర్ పూర్తిగా మొదలైంది. చిత్రదర్శకుడు కె. విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ కథ చెప్పి ఓ పాట రాయాల్సిందిగా కోరారు. ‘విధాత తలపున..’ అని రాశారు సీతారామశాస్త్రి. విశ్వనాథ్‌కి చాలా బాగా నచ్చింది. అంతే.. ఈ చిత్రంలోని మొత్తం పాటలూ నువ్వే రాస్తున్నావని సీతారామశాస్త్రితో అన్నారు. అది మాత్రమే కాదు.. ఈ సినిమా పేరుతోనే విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని టైటిల్ కార్డ్ వేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ పాటల వెన్నెలలు పంచారు ‘సిరివెన్నెల’. ఆ సినిమాలోని ‘విధాత తలపున’ పాటకు సిరివెన్నెల అల్మరాలో ‘నంది’ కూడా చేరింది. ఆ తర్వాత విశ్వనాథ్–సిరివెన్నెల కాంబినేషన్లో పలు సూపర్ హిట్ పాటలు వచ్చాయి. అందుకు శ్రుతిలయలు, స్వయం కృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు, స్వాతికిరణం, శుభసంకల్పం లాంటి చిత్రాల్లోని పాటలు ఓ ఉదాహరణ. మూడు దశాబ్దాల్లో ... ఒక్క విశ్వనాథ్ అనే కాదు.. సిరివెన్నెల ప్రతి దర్శకుడికీ హిట్ పాటలు ఇచ్చారు. ‘శివ’ సినిమాలో రామ్‌గోపాల్ వర్మకు ‘బోటనీ పాఠముంది..’ అని రాశారు. అదే వర్మకు ‘క్షణక్షణం’లో ‘కో అంటే కోటి, జాము రాతిరి జాబిలమ్మా’, ‘గాయం’లో ‘అలుపన్నది ఉందా, నిగ్గ దీసి అడుగు’, నంది అవార్డు సాధించిన ‘స్వరాజ్యమవలేని’ పాటలు రాశారు. మరోవైపు కృష్ణవంశీకి ‘గులాబి’ కోసం ‘ఈవేళలో నీవు ఏం చేస్తు ఉంటావు..’, ‘ఏ రోజైతే∙చూశానో నిన్నూ..’ రాశారు. ‘సిరివెన్నెల’ రాసిన ‘జగమంత కుటుంబం నాది..’ పాట విని, ఆ పాట కోసమే సినిమా తీయాలని కృష్ణవంశీ తీసిన చిత్రం ‘చక్రం’. శివనాగేశ్వ రావు ‘మనీ’లో ‘చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ, భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ..’ అని రాశారు. ఒకటా.. రెండా వేల పాటలు రాశారు. మూడు దశాబ్దాల కెరీర్లో త్రివిక్రమ్, గుణశేఖర్, క్రిష్, రాజమౌళి ఇలా ఎందరో దర్శకులకు పాటలు రాశారు. విడుదలకు సిద్ధమవుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో ‘దోస్తీ..’ పాట, ‘శ్యామ్ సింగరాయ్’లో రెండు పాటలు రాశారు. సిరివెన్నెల నుంచి ఇంకా ఎన్నో పాటలు వచ్చి ఉండేవి. ‘జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది’ అంటూ ఒంటరిగా వెళ్లిపోయారు ‘సిరివెన్నెల’. -
ఓకే గూగుల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్.. గూగుల్ నివాళి
Google India Tribute To Sirivennela Sitaramasastry: జగమంత కుటుంబాన్ని వదిలి సినీ అభిమానుల్ని ఒంటరి చేసి లోకాన్ని విడిచిపెట్టారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. 'సిరివెన్నెల' సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకుని, సాహిత్యంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. మెలోడీలు, జాగృతం, జానపదం , శృంగారం, విప్లవాత్మక గీతాలను అందించారు. ఆయన పాట రాస్తే చాలనుకునే గొప్ప రచయత సిరివెన్నెల. సిరివెన్నెల సీతరామ శాస్త్రి కలం సాహిత్యం నుంచి జాలువారే ప్రతీ పాట ఓ అద్భుతమే. అలాంటి సాహితీ దిగ్గజాన్ని కోల్పోవడం సాహిత్యాభిమానులు, ప్రేక్షకులు, సినీ పెద్దలు, రాజకీయనాయకులు ఒకరేంటీ యావత్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఆ దిగ్గజ కవితో గడిపిన క్షణాలను నెమరువేసుకుంటూ ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. ఇది చదవండి: సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం కవి మహాశయుడికి నివాళి ఘటించింది. 'సిరివెన్నెలతో మొదలైన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం' అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. 'ఓకే గూగల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్' అంటూ ప్రస్తుతం ట్రెండింగ్ సెర్చ్‌ను తన ట్వీట్లో రాసుకొచ్చింది. Ok Google, play Sirivennela songs 😞💔 "సిరివెన్నెల" తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం 🙌 — Google India (@GoogleIndia) November 30, 2021 ఇది చదవండి: టాలీవుడ్లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత -
సిరివెన్నెలకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్/సాక్షి, అమరావతి: అక్షర యోధుడు సిరివెన్నెల సీతారామశాస్త్రికి కుటుంబసభ్యులు, అభిమానులు, ప్రముఖులు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం వైకుంఠ మహాప్రస్థానంలో బుధవారం మధ్యాహ్నం ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. సీతారామశాస్త్రి పెద్ద కుమారుడు సాయివెంకటయోగేశ్వరశర్మ తండ్రి చితికి నిప్పంటించారు. మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సిరివెన్నెల పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఫిలిం చాంబర్‌కు తీసుకొచ్చారు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. అనంతరం రాయదుర్గం వైకుంఠ మహాప్రస్థానానికి సిరివెన్నెల అంతిమయాత్ర మొదలైంది. అభిమానులు సిరివెన్నెల పాటల్ని తలచుకుంటూ ఆ వాహనం వెంట సాగారు. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో వేద పండితులు అంత్యక్రియల ప్రక్రియను పూర్తిచేయించారు. సిరివెన్నెలకు నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు పేర్ని నాని, తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ఆయన్ని కోల్పోవడం యావత్ తెలుగు ప్రజలకు బాధాకరమని పేర్కొన్నారు. సిరివెన్నెలతో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుని నేపథ్యగాయకుడు మనో, మరికొందరు సినీ ప్రముఖులు కన్నీరు పెట్టుకున్నారు. అంత్యక్రియలకు నిర్మాత సురేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటులు బ్రహ్మనందం, రఘుబాబు, ప్రజాగాయకులు గద్దర్, విమలక్క తదితరులు పాల్గొన్నారు. . సీఎం జగన్‌కు సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతలు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించడమేగాక ఆస్పత్రి ఖర్చులను భరిస్తుండటంపై ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘మంగళవారం ఉదయమే మాకు ఏపీ సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని, ఆస్పత్రి ఖర్చులు భరిస్తామన్న విషయాన్ని తెలపాలని సీఎం జగన్ ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తు సిరివెన్నెల మంగళవారం కన్నుమూశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ తమ సంతాపాన్ని ప్రకటించారు. అంత్యక్రియలకు ఏపీ సమాచారశాఖ మంత్రి హాజరయ్యారు. ఆస్పత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేం కట్టిన అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. మా కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం..’ అని సిరివెన్నెల పెద్ద కుమారుడు సాయియోగేశ్వరశర్మ, ఇతర కుటుంబసభ్యులు పేర్కొన్నారు. సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలవండి – అధికారులకు సీఎం జగన్ ఆదేశం ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం సీఎం కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా జగన్ ఈ ఆదేశాలిచ్చారు. దీనిపై స్పందించిన అధికారులు.. సిరివెన్నెల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆస్పత్రి ఖర్చుల భారం ఆ కుటుంబంపై పడకుండా చూడాలన్న సీఎం జగన్ సూచనల మేరకు.. ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించి, మొత్తం ఖర్చులను సీఎం సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈ గాలీ.. ఈ నేలా.. ఈ ఊరు
వేటూరి తరువాత తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణ వార్త జిల్లాను విషాదంలోకి నెట్టేసింది. జిల్లాలో పాటల, సాహితీ ప్రియులు ఆయన పాటలతో ఉన్న బంధాన్ని.. పదాలు రగిలించిన స్ఫూర్తిని తల్చుకుని కన్నీటిపర్యంతమయ్యారు. జగమంత అభిమానుల కుటుంబాన్ని వదిలి ‘ఏకాకి జీవితం నాది’ అంటూ నిష్క్రమించిన ఆ మహనీయునికి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం/కాకినాడ: సీతారామశాస్త్రితో జిల్లాకు విడదీయరాని బంధం ఉంది. ఆయన తండ్రి వెంకట యోగి కాకినాడ ఐడియల్ కళాశాలలో హిందీ అధ్యాపకుడిగా పని చేశారు. 1970–72 ప్రాంతంలో అదే కళాశాలలో సీతారామశాస్త్రి ఇంటర్మీడియెట్ చదివారు. తండ్రి నుంచి సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఆయన సాహిత్య ప్రస్థానం కాకినాడలోనే ప్రారంభమైంది. కాకినాడ గాంధీనగర్‌లోని రెడ్‌క్రాస్ బిల్డింగ్ వద్ద ఆయన కుటుంబం నివాసం ఉండేది. 1976 నుంచి 1984 వరకూ కాకినాడలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో క్లరికర్ క్యాడర్లో పని చేశారు. అక్కడి సాహితీవేత్తలు అద్దేపల్లి రామ్మోహనరావు తదితరులతో అప్పటికే పరిచయాలుండేవి. సాహితీవేత్త సీహెచ్ కృష్ణారావు నిర్వహించే ‘నెలనెలా వెన్నెల’ సాహిత్య సభలకు హాజరయ్యేవారు. కవితలు రాసి వినిపించేవారు. పద్మశ్రీ అవార్డు పొందిన సిరివెన్నెలను 2019 ఆగస్టు 3న కాకినాడ సూర్య కళామందిర్లో స్థానిక కవులు సత్కరించారు. ‘సిరివెన్నెల’గా మారిందిక్కడే.. సుప్రసిద్ధ దర్శకుడు కె.విశ్వనాథ్ సినిమాల షూటింగ్‌లు దాదాపు ఈ జిల్లాలోనే జరిగేవి. కాకినాడకు చెందిన రచయిత ఆకెళ్ల ద్వారా విశ్వనాథ్‌కు సీతారామశాస్త్రి తొలిసారి పరిచయమయ్యారు. ఆయన ప్రతిభను గుర్తించిన విశ్వనాథ్ జనని జన్మభూమి (1984) సినిమాలో తొలి అవకాశమిచ్చారు. రామచంద్రపురంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సిరివెన్నెల ఒక పాట పాడి వినిపించడంతో విశ్వనాథ్ ఆకర్షితులయ్యారు. ఆ పాటను వెంటనే జనని జన్మభూమి సినిమాలో తీసుకున్నారు. ఆయన సాహితీ స్థాయిని అర్థం చేసుకున్న విశ్వనాథ్ తన తదుపరి చిత్రమైన సిరివెన్నెలలో అవకాశమిచ్చారు. అందులోని పాటలన్నీ సీతారామశాస్త్రే రాశారు. ఆ పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో సీతారామశాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. రామచంద్రపురానికి చెందిన ఉజూరు వీర్రాజు, చింతా రామకృష్ణారెడ్డి, ఎం.భాస్కరరెడ్డిలు సంయుక్తంగా సిరివెన్నెల సినిమా నిర్మాణ సారథ్యం వహించారు. ఈ సినిమాలో పాట ఆయనకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. సిరివెన్నెల సినిమా ఆయన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ►స్వాతి కిరణం చిత్రంలో స్వీయరచన శివానీ.. భవానీ పాట చిత్రీకరణ సందర్భంగా రామచంద్రపురంలోని రాజుగారి కోటలో సీతారామశాస్త్రి రెండు రోజుల పాటు సీతారామశాస్త్రి ఉన్నారు. కాజులూరు మండలం పల్లిపాలెంలోని ఆంధ్రీ కుటీరాన్ని పలుమార్లు సందర్శించారు. ►సీతానగరం మండలం రాపాక పంచాయతీ పరిధిలోని శ్రీరామనగరం సద్గురు చిట్టిబాబాజీ సంస్థానాన్ని సిరివెన్నెల ఏటా సందర్శించేవారు. ఆ పాట ఎప్పటికీ జనం నోళ్లలో.. సంప్రదాయ కావ్య భాషను చలన చిత్రాల్లో పాటగా మలచి, సామాన్యుడు సైతం సులువుగా పాడుకునే శైలిని ప్రవేశపెట్టారు సీతారామశాస్త్రి. ఆయన పాటలతో సినిమా సాహిత్యం సుసంపన్నమైంది. సీతారామశాస్త్రి మృతి చెందినప్పటికీ ఆయన పాట ఎప్పటికీ జనం నోళ్లలో నిలిచే ఉంటుంది. ఆయన కాకినాడలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా ఉన్నప్పుడు, వివిధ సాహిత్య సభల్లో ఆయనతో నా అనుబంధం స్నేహపాత్రమైనది. – దాట్ల దేవదానంరాజు, కవి, యానాం అలా పరిచయం చేశారు డిగ్రీ చదువుతున్న రోజుల నుంచే సీతారామశాస్త్రి పరిచయం. ఆకెళ్ల గారితో పాటు సీతారామశాస్త్రిని తరచూ కలుసుకునేవాడిని. ఆయనకు నా కవిత్వం అంటే ఎంతో అభిమానం. ఒకసారి నేను ఆయన ఆఫీసుకు వెళ్లాను. అక్కడే ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఉన్నారు. ‘ఈయన నా అభిమాన కవి’ అంటూ నన్ను ఆయనకు పరిచయం చేయడమే కాకుండా.. పత్రికల్లో అచ్చయ్యే నా కవితలను ఎత్తి రాసుకున్న డైరీ చూపించినపుడు నేనే ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచీ అనేక సందర్భాల్లో కలుస్తూనే ఉన్నాం. – డాక్టర్ శిఖామణి, సంపాదకుడు, కవిసంధ్య, యానాం సీతానగరం మండలం శ్రీరామనగరంలోని చిట్టిబాబాజీ ఆశ్రమంలో సిరివెన్నెల పూజలు (ఫైల్) మాది 40 ఏళ్ల స్నేహబంధం సీతారామశాస్త్రితో నాది 40 ఏళ్ల స్నేహబంధం. మాది సాహిత్య సంబంధమే కాదు.. ఆత్మీయ అనుబంధం కూడా. మా కుటుంబంలో ఓ వ్యక్తిలా ఉంటారు. సిరివెన్నెల మరణం తీరని లోటు. ఆయనపై ఓ పుస్తకం రాస్తున్నాను. ఓ అధ్యాయం పూర్తి చేశాను. ఇటీవల కలుసుకోవాలనుకున్నా అనారోగ్యం వల్ల వాయిదా పడింది. అమలాపురంతో ఆయనది విడదీయరాని అనుబంధం. ‘సిరివెన్నెల సినీ గీతాలు’ శీర్షికతో పూర్తి చేసి ఆవిష్కరిస్తాను. – డాక్టర్ పైడిపాల, పాటల పరిశోధన రచయిత రాజమహేంద్రవరంతో అనుబంధం రాజమహేంద్రవరంలో నిర్వహించిన సాహిత్య సభలకు సిరివెన్నెల తరచూ వచ్చేవారు. నగరానికి చెందిన చాగంటి శరత్‌బాబుతో ఎక్కువ సాంగత్యం ఉండేది. సామర్లకోటలోని రామ్షా వద్ద వీరిద్దరూ సహాయకులుగా ఉండేవారు. రామ్షా ఆయుర్వేద వైద్యుడే కాకుండా జ్యోతిష శాస్త్ర ప్రవీణుడు కూడా. దీంతో వీరిద్దరూ ఆయుర్వేదంతో పాటు జ్యోతిష శాస్త్రంపై కూడా పట్టు సంపాదించారు. ఏ ఉద్యోగం దొరకకపోతే జ్యోతిషం చెప్పుకొని బతకవచ్చంటూ సిరివెన్నెల సరదాగా అనేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. చాగంటి శరత్‌బాబుతో ఉన్న బంధంతో ఆయన కుమార్తెను తన కోడలిగా చేసుకున్నారు. శరత్‌బాబు గత సెప్టెంబర్ 26న మరణించారు. అక్టోబర్ 5న రాజమహేంద్రవరం దానవాయిపేటలో జరిగిన సంస్మరణ సభలో సిరివెన్నెల పాల్గొన్నారు. అదే నగర చివరి సందర్శన అవుతుందని అభిమానులు అనుకోలేదు. సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నగరానికి చెందిన సినీ నటుడు, గాయకుడు జిత్‌మోహన్‌మిత్రా కన్నీరు పెట్టుకున్నారు. సిరివెన్నెల చిత్రం షూటింగ్లో సీతారామశాస్త్రి తదితరులు ఆయనతో పరిచయం మరువలేనిది ‘సిరివెన్నెల’ సినిమాకు నిర్మాణ బాధ్యతలు వహించడం నా జీవిత అదృష్టం. ఇందులో సీతారామశాస్త్రి రాసిన పాటలు అమోఘం. పాటకు కొత్త సొబగులద్దారు. ఆయన రాసిన పాటలు ఆ సినిమాకు ప్రాణం పోశాయి. నంది అవార్డు రావటం ఎంతో ఆనందాన్ని అందించింది. మా చిత్రం నుంచే ఆయన ‘సిరివెన్నెల’గా మారిపోయారు. – ఉజూరు వీర్రాజు, సిరివెన్నెల నిర్మాత, రామచంద్రపురం -
అభిమానిని వియ్యంకుడిని చేసుకున్న ‘సిరివెన్నెల’
Nanduri Ramakrishna Remembers His Relation With Sirivennela Seetharama Sastry: విశాఖకు చెందిన సాహితీవేత్త నండూరి రామకృష్ణతో సిరివెన్నెలకు మంచి స్నేహం ఉంది. ఆ స్నేహబంధాన్ని కుటుంబ బంధంగా మార్చుకున్నారు. తన కుమార్తె లలితా దేవిని నండూరి రామకృష్ణ తనయుడు వెంకట సాయిప్రసాద్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. 2001 మే 8న విశాఖలో ఈ వివాహం జరిగింది. ప్రస్తుతం అల్లుడు, కూతురు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. విశాఖ వెళ్లిన ప్రతిసారీ వియ్యంకుడు రామకృష్ణతో పాటు విశాఖలోని పలువురి స్నేహితులతో కాలక్షేపం చేసేవారు ‘సిరివెన్నెల’. అభిమాని నుంచి వియ్యంకుడిగా..‘సిరివెన్నెల’తో తన అనుబంధం గురించి నండూరి రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘నాకు 1977 నుంచి సీతారామశాస్త్రితో సాన్నిహిత్యం ఉంది. ఆయన రచనలపై అభిమానంతో 1977లో ఆయన్ని తొలిసారి చెన్నైలో కలిశాను. ఆయన్ని కలిసేందుకు చెన్నై వచ్చానని చెప్పడంతో చాలా ఆనందపడ్డారు. 1995లో ‘గాయం’ సినిమా రివ్యూ సమయంలో ఆయన ఏయూలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో సిరివెన్నెలతో పాటు వెన్నెలకంటి, వేటూరి, భువనచంద్ర, జొన్నవిత్తులతో కలిసి వేదిక పంచుకునే అవకాశాన్ని నాకు కల్పించారు. చదవండి: దాని ముందు తలవంచా.. స్మోకింగ్‌పై గతంలో సిరివెన్నెల కీలక వ్యాఖ్యలు నాకు సాహిత్యంలో ప్రవేశం ఉండటంతో ఆ తరువాత అనేక సాహిత్య సమావేశాల్లో ఆయనతో స్నేహపూర్వకంగా మెలిగే అవకాశం దక్కింది. 2001కి ముందు జరిగిన నా కుమారుడు నండూరి సాయిప్రసాద్ ఒడుగు ఫంక్షన్‌కు సీతారామశాస్త్రి కూడా హాజరయ్యారు. అప్పుడే తన కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అలా మా కుమారుడుకి ఆయన కూతురు లలితా దేవితో వివాహం జరిగింది. దీంతో ఆయన అభిమాని అయిన నేను వియ్యంకుడయ్యాను. సీతారామశాస్త్రి విలువలు కలిగిన సాహిత్యాన్ని సమాజానికి అందించారు. అశ్లీలతకు ఆయన సాహిత్యంలో ఏనాడూ చోటు లేదు. ఇలాంటి మనిషిని కోల్పోవడం మా కుటుంబానికే కాదు సమాజానికీ తీరని లోటు’’ అన్నారు. చదవండి: ఓకే గూగుల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్.. గూగుల్ నివాళి -
Sirivennela Sitarama Sastry: 16 ఏళ్ల వయసులో పెళ్లి.. తను నా బెటర్ త్రీ ఫోర్త్!
Sirivennela Sitarama Sastry Heart Touching Words About Wife Old Interview: మామూలుగా జీవిత భాగస్వామిని ‘బెటరాఫ్’ అంటుంటాం. సిరివెన్నెల తన సతీమణికి అంతకన్నా ఎక్కువే ఇచ్చారు. ‘పద్మ నాకు బెటర్ హాఫ్ కాదు, బెటర్ త్రీ ఫోర్త్’ అని ‘సాక్షి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిరివెన్నెల అన్నారు. ‘‘ఆమె నా పాట... నా భార్య, నా పాట ఎప్పుడూ బోర్ కొట్టవు. ‘నువ్వు సీతారామశాస్త్రి మాత్రమే.. నీ జీవితానికి నిజమైన సిరివెన్నెల పద్మ’’ అని ప్రముఖ గాయని జానకిగారు నాకు చెప్పిన మాట అక్షరాలా నిజం. నన్ను, నాకుటుంబాన్ని పద్మ చూసుకుంటూ, అందరి బాధ్యతలు నిర్వర్తిస్తూ చాలా ఆనందాలను కోల్పోయింది. నా జగమంత కుటుంబాన్ని తానే మోసి నన్నెప్పుడూ ఏకాంతంగా ఉంచి, ప్రొఫెషన్‌కి అంకితం అయ్యేలా చేసింది. అలాంటి పద్మ నాకు బెటర్ హాఫ్ కాదు... బెటర్ త్రీ ఫోర్త్’’ అని ఆ ఇంటర్వ్యూలో సిరివెన్నెల అన్నారు. ఆమే ఆయన పాటకు తొలి శ్రోత పదహారేళ్ల వయసులో ‘సిరివెన్నెల’ చిటికెన వేలు పట్టుకుని ఏడడుగులు వేశారు పద్మావతి. సిరివెన్నెలతో తన జీవితం గురించి ఆ ఇంటర్వ్యూలో పద్మావతి మాట్లాడుతూ – ‘‘మాదీ, సీతారామశాస్త్రిగారిదీ అనకాపల్లే. నాకు సినిమాలన్నా, పాటలన్నా చాలా ఇష్టం. లంచ్ బ్రేక్‌లో ఇంటికి వచ్చినప్పుడు రేడియోలో వచ్చే పాటలు విన్నాకే స్కూలుకెళ్లేదాన్ని. పాటలంటే అంత ఇష్టం ఉన్న నేను సినిమా పాటలు రాసే వ్యక్తితో జీవితం పంచుకుంటానని అనుకోలేదు. పెళ్లి చూపుల్లో సీతారామశాస్త్రిగారు నన్ను చూశారు కానీ నేను బిడియంతో తలెత్తి చూడలేదు. పెళ్లి పీటల మీదే ఆయన్ను చూశాను. మా మామగారు లేకపోవడంతో ఇంటి పెద్ద కొడుకుగా అన్ని బాధ్యతలూ శాస్త్రిగారివే. పెళ్లి తర్వాత ఆయన భాగస్వామిగా అన్ని బాధ్యతలు నాకూ వచ్చాయి. ఇంటి బాధ్యతల్లో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకునేవారు కాదు. మా అత్తగారి (సుబ్బలక్ష్మి) సలహాలు తీసుకుని అన్నీ నేనే చూసుకున్నాను. మావారు ఎప్పుడూ ఏదో ఒకటి చదువుకుంటూ, రాసుకుంటూ ఉండేవారు. ‘సిరివెన్నెల’ సినిమాకు సీతారామశాస్త్రిగారిని గేయ రచయితగా కె. విశ్వనాథ్‌గారు నిర్ణయించినప్పుడు మేం పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ‘సిరివెన్నెల’ చిత్రం విడుదల వరకూ అనకాపల్లిలో ఉండేవాళ్లం. ఆ సినిమా హిట్ తర్వాత శాస్త్రిగారికి ఎక్కువ అవకాశాలు రావడంతో మద్రాసుకు (చెన్నై) షిఫ్ట్ అయ్యాం. మా అత్తగారి సహకారంతో ఇల్లు, పిల్లల చదువులన్నీ నేనే చూసుకున్నాను. పదేళ్ల తర్వాత హైదరాబాద్‌కి వచ్చాం. ఆయన రాసిన ప్రతి పాటను ముందు వినేది నేనే. ఆయన రాసిన ప్రతి చిన్న కాగితం జాగ్రత్తగా దాస్తాను. ఆయన రాసిన పాటలతో మా ఇంట్లో నేను ఒక లైబ్రరీ ఏర్పాటు చేశాను’’ అన్నారు. చదవండి: Sirivennela Seetharama Sastry: సిరివెన్నెలకు ఆ జిల్లా అంటే అమితమైన ప్రేమ.. -
Sirivennela: మహాప్రస్థానంలో ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు
Live Updates: Sirivennela Sitaramasastry: మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 2:26 గంటలకు ముగిసాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు: ఎన్టీఆర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిసార్లు మన మాటల్ని ఎలా వ్యక్తపరచాలో తెలియదు, ఆయన ఎన్నో పాటలు రాశారు. రాబోయే తరానికి ఈ పాటలు ఆదర్శవంతంగా ఉంటాయి. రాబోయే తరానికి ఆయన పాటలు బంగారు బాటలు. తెలుగుజాతి బతికున్నంత కాలం.. ఆయన సాహిత్యం బతికే ఉంటుంది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.ఆయన మరణం చాలా బాధ కలిగించిందని, గొప్ప సాహిత్య సినీ గేయ రచయిత కనుమరుగు అయ్యారని పవన్ కల్యాణ్ అన్నారు. ఇలా కలుస్తాననుకోలేదు: దేవీశ్రీ ప్రసాద్ చాలారోజుల నుంచి కలవాలి అని అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా కలుస్తాననుకోలేదు. మా నాన్నగారి తర్వాత నన్ను కొట్టేవారు, తిట్టేవారు ఆయన ఒక్కరే. అందరి గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. నేను ఏమైనా పాట రాస్తే అది వివరించి చెప్పేవారు.కరోనా మా మధ్య దూరం పెంచింది. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు శ్రీకాంత్ నివాళులర్పించారు. ►రాజశేఖర్ సినిమాలకి ఆయన ఎన్నో పాటలు రాశారు. నేను ఆయనను చాలా మిస్ అవుతున్నాను అని జీవిత రాజశేఖర్ భావోద్వేగానికి లోనయ్యారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని రాజశేఖర్ అన్నారు. సామాన్యులకి కూడా అర్థం అవుతాయి: తలసాని సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు.సిరివెన్నెల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు..అందరికీ బాధాకరం అని తలసాని అన్నారు. 'మూడు వేలకు పైగా పాటలు రాసిన గొప్ప వ్యక్తి. సిరివెన్నెల పాటలు అంటే పండుగ లాంటి పాటలు. పద్మశ్రీ, 11 నంది అవార్డులు రావడం ఎంతో గొప్ప వరం. సామన్యులకి కూడా అర్థం అయ్యేలా ఆయన పాటలు ఉంటాయి. ఈరోజు తెలుగు వారంతా బాధలో ఉన్నారు. సిరివెన్నెల కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఉన్న రైటర్స్‌కి సిరివెన్నెల స్పూర్తి. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం 'అని తలసాని అన్నారు. మంచి వ్యక్తిత్వం..ఆ పాట గుర్తొస్తుంది: నాగార్జున సిరివెన్నెలతో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. తెలుసా మనసా అనే పాట నాకు గుర్తు వస్తుంది. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలే కాదు ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా ఇదే మాటలు వినిపిస్తూ ఉంటారు అది ఊహించడమే కష్టం: మహేశ్ బాబు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు లేకుండా తెలుగు పాటలు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించడానికే కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా అని మహేశ్ అన్నారు. అందుకే విష్ణు రాలేదు: నరేశ్ 'తెలుగు సినీ పరిశ్రమకి బాలు, సిరివెన్నెల లాంటి వారు రెండు రధ చక్రాలను కోల్పోయాం. పెద్ద దిగ్గజాన్ని కోల్పోయాం. సమురు లేని దీపం కుండలా సినీ పరిశ్రమ మిగిలిపోయింది. బాబాయ్ కర్మకి విష్ణు వెళ్లారు. అందుకే రాలేదు' అని నరేశ్ అన్నారు. ప్రతిరోజూ ఆయన పాటలు వింటాం: సింగర్ కౌసల్య సిరివెన్నెలను కోల్పోవడం చాలా బాధాకరం.సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు రాశారు.ఆయన పాటలు తెలియని ప్రజానీకం లేరు. ఆయనతో నేను చాలా పాటలు పాడాను. సిరివెన్నెల గారు రాసిన పాటలు ప్రతిరోజూ వింటూ ఉంటాం. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు జగపతిబాబు, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ నివాళులు అర్పించారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికిసింగర్ గీతామాధురి, నటుడు శివబాలాజీ నివాళులు అర్పించారు. ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని నివాళర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీర్ణించుకోలేకపోతున్నాను: సింగర్ సునీత 'సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదటిసారి నిద్ర పోవడం చూస్తున్నాను. వరుస కథలు, ఆలోచనలతో బిజీగా ఉంటారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్న చిన్న పదాలతో ఎన్నో అర్థాలు చెప్పడం ఆయన సొంతం. మహానుభావుడు చరిత్ర సృష్టించి నిద్రలోకి జారుకున్నారు. సిరివెన్నెల చీకటి మిగిల్చి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను' అని సునీత పేర్కొన్నారు. శకం ముగిసింది: అల్లు అరవింద్ 'సరస్వతి పుత్రడు సిరివెన్నెల. మెన్నటి వరకు కూడా ఆయన ఎన్నో పాటలు రాశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి కూడా పాటలు రాశారు. వేటూరి తర్వాత శకం ముగిస్తే...సిరివెన్నెల తర్వాత మరో శకం ముగిసింది. బన్నీ అంటే ఆయనకి విపరీతమైన ఇష్టం. ఎందుకో తెలియదు కానీ బన్నీతో గంటల తరబడి గడిపేవారు' అంటూ అల్లు అరవింద్ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అల్లు అర్జున్ నివాళులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని సందర్శించిన అల్లు అర్జున్ ఆయనకు నివాళులు అర్పించారు కంటతడి పెట్టుకున్న బాలకృష్ణ 'ఒక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తెలుగు భాషకి, సాహిత్యానికి ఒక భూషణుడు సిరివెన్నెల. తాను పుట్టిన నేలకి వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన., సిరివెన్నెల లేరంటే చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో ఉన్నట్లు ఉంది. సాకు సాహిత్యం అంటే ఇష్టం. మేం ఇద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. పుట్టినవారు గిట్టక తప్పదు.. కానీ 66 ఏళ్ళకి వెళ్ళారు' అంటూ బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నారు. మంచి స్నేహితుడిని కోల్పోయా : మణిశర్మ 'జగమంత కుటుంబాన్ని వదిలేసి సిరివెన్నెల వెళ్లిపోయారు. మంచి సాహిత్యవేత్తతో పాటు మంచి వ్యక్తిని కోల్పోయాం. మంచి స్నేహితుడిని కోల్పోయాను' అని సంగీత దర్శకుడు మణిశర్మ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక వటవృక్షం కూలిపోయింది: తనికెళ్ల భరణి 'సిరివెన్నెల భౌతికకాయాన్ని చూసి నటుడు తనికెళ్ల భరణి కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నోరోజులు కలిసి పనిచేశాం. ఒక వటవృక్షం కూలిపోయింది. ఇక అంతా శూన్యమే. దీన్ని భర్తీ చేయలేము. ప్రతిరోజూ నవ్వుతూ ఉండేవారు. ఆయన ప్రతీ పాట ప్రకాశిస్తుంది. సిరివెన్నెల లేని లోటు తీర్చలేం' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి రామజోగయ్య శాస్త్రి నివాళులర్పించారు. గుండె తరుక్కుపోతుంది: పరుచూరి 'పాటే శ్వాసగా జీవించిన వ్యక్తి సిరివెన్నెల. అన్నగారూ అంటూ ఆత్మీయంగా పలకరించేవారు. ఆయన లేడు అంటే గుండె తరుక్కుపోతుంది. ఆ మహానుభావుడు లేడంటే బాధగా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. వేటూరి తర్వాత స్థానం సిరివెన్నెలదే. సిరివెన్నెల ప్రతి పాట ఆణిముత్యం: సాయికుమార్ సిరివెన్నెల పార్థివదేహానికి సినీ నటుడు సాయికుమార్ నివాళులర్పించారు. 'ప్రతి అడుగులో నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. ఆయన రాసే ప్రతి పాట ఆణిముత్యం. తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన వ్యక్తి సిరివెన్నెల. ఎవడు సినిమాలో సిరివెన్నెల కుమారుడు నటించాడు. నేను విలన్ పాత్ర పోషించాను' అంటూ సాయికుమార్.. సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పోలీసుల మీద పాట రాశారు: సజ్జనార్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. 'ఒక మంచి గేయ రచయితని కోల్పోయాం. రెండేళ్ల నుంచి సిరివెన్నెలతో నాకు పరిచయం. పోలీసుల మీద మంచి పాటలు రాశారు. పోలీసుల తరపున, టీఎస్ఆర్టీసీ తరపున ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం' అని సజ్జనార్ అన్నారు. సిరివెన్నెల లేరంటే సాహిత్యం చచ్చిపోయినట్లే: సి. కల్యాణ్ 'ఆరోజుల్లో సినిమా సాహిత్యం వేరు..ఇప్పుడు వేరు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లేరంటే సాహిత్యం చచ్చిపోయినట్లే. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు' అని నిర్మాత సి. కల్యాణ్ పేర్కొన్నారు. నారప్ప వరకు కలిసి పనిచేశాను: హీరో వెంకటేశ్ 'సిరివెన్నెల మరణవార్త ఎంతో బాధాకరం. ఎంతో మంచి వ్యక్తి. సర్ణకమలం నుంచి మొన్న వచ్చిన నారప్ప సిరివెన్నెలతో కలిసి పనిచేశాను. ఎంతో సన్నిహితంగా ఉండేవారు. సాహిత్యరంగంలో మనం ఓ లెజెండ్‌ను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని వెంకటేశ్ అన్నారు. ఇంటి పెద్దను కోల్పోయినట్లు అనిపిస్తుంది: డైరెక్టర్ మారుతి 'ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. గత ఐదారేళ్ల నుంచి ఆయన ఇంట్లో కుటుంబసభ్యుడిలా ఉంటున్నా. మా ఇంటి పెద్దను కోల్పోయినట్లు అనిపిస్తుంది. సిరివెన్నెల ఇంకా మనతోనే ఉన్నారు అనిపిస్తుంది. ఆయన పాటలు ప్రతిరోజూ వింటాం' అని మారుతి తెలిపారు. ఈ లోటు తీరేది కాదు: ఎస్వీ కృష్ణారెడ్డి 'సిరివెన్నెల లాంటి గొప్ప వ్యక్తి మనకు దొరకటం మన అదృష్టం. ఎన్నో సినిమాలకు ఆయన పాటలు రాశారు. ఆయన లోటు తీరేది కాదు' అని ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి
Sirivennela Sitaramasastri: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. బుధవారం మధ్యాహ్నం 2:26 గంటల సమయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగగా..ఈ యాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. కాగా నవంబర్ 3న సిరివెన్నెల లంగ్ క్యాన్సర్‌తో మృతి చెందిన సంగతి తెలిసందే. అంతనం అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతిక కాయాన్ని కడసారి చూపు కోసం ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. ఈ రోజపు మధ్యాహ్నం 1 గంటలకు సిరివెన్నెల అంతిమయాత్ర ప్రారంభం కాగా. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Sirivennela Seetharama Sastry: నా ఉచ్ఛ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం
Sirivennela Seetharama Sastry Passed Away: నా మొదటి సినిమా ఏ ‘కుక్క’ అని అయి ఉంటే నా గతేంకాను అని నవ్వాడాయన ఒకసారి. కాని ‘విధాత తలంపు’ అలా ఎందుకు ఉంటుంది. విధాత ఆయనకు ‘సిరివెన్నెల’ రాసి పెట్టాడు. విధాత ఆయనకు తెలుగువారికి కాసిన్ని మంచి పాటలు ఇచ్చి రావోయ్ అని భువికి పంపాడు. విధాత ఆయనను నీ మార్గాన నడుచు శిష్యకవులను సిద్ధం చేయమని ఆదేశించాడు. ఇపుడు? ఇక చాలు నేను వినాల్సిన నీ పాటలు ఉన్నాయి... తెలిమంచు వేళల్లో మబ్బులపై మార్నింగ్ వాక్ చేస్తూ ఆ స్వర సంచారం పదసంవాదం చేద్దాం పద అని వెనక్కి పిలిపించుకున్నాడు. ‘కొండతల్లి నేలకిచ్చు పాలేమో నురుగుల పరుగుల జలపాతం వాగు మొత్తం తాగేదాకా తగ్గదేమో ఆశగా ఎగిరే పిట్టదాహం’... కవి ఊహ అది. సిరి ఉన్న కవి ఊహ. ‘గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా’.. ఓహో.. ఏమి ఇమేజరీ. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఇంత సరళమా పల్లవి? ‘పుట్టడానికీ పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ’ ఈ చేదు వాస్తవం పలకనివాడు కవి ఎలా అవుతాడు? ‘ఏదీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం’ ఈ హితం చెప్పే కవి లేని సమాజం అదేల? సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ కవిగా చిరాయువును పొందారు. ఆయన రాజకీయ భావాల పట్ల అభ్యంతరాలు ఉన్నవారు సైతం ఆయన పాటను ఆనందించారు. ఆస్వాదించారు. సిరివెన్నెల పండిత కవి. తెరపై పండు వెన్నెల కాయించిన కవి. ఆయనకు నివాళి. ‘బటర్‌ఫ్లై’ ఎఫెక్ట్ అంటే? ఇక్కడ జరిగే ఘటన ఎక్కడి ప్రతిఫలనానికో అని. భలేవాడివే. అది విధాత తలంపు కదా. 1980.. ‘శంకరాభరణం’ రిలీజైంది. ఊరూవాడా సంబరాలు. సన్మానాలు. కాకినాడకు యూనిట్ వస్తోందట. సన్మానం చేయాలట. ఆ ఊళ్లో అప్పటికి ఒక బుల్లి కవి ఉన్నాడు. ప్రతి సాహిత్య సభలో ప్రారంభ గీతాన్ని పాడుతూ ఉంటాడు. ‘అతణ్ణి అడుగుదాం... విశ్వనాథ్‌ని కీర్తిస్తూ ఒక పాట కట్టమందాం’ అనుకున్నారు మిత్రులు. ‘నేను విశ్వనాథ్ మీద కట్టను. వ్యక్తి మీద పాట ఏమిటి? శంకరాభరణం సినిమా మీద కడతాను. తెలుగువారి కళాదృష్టి దాహార్తిని తీర్చడానికి గంగలా ఆ సినిమా అవతరించింది. కనక గంగావతరణం పేరుతో గేయం రాస్తాను’ అన్నాడా కవి. రాశాడు. సన్మానం జరిగే రోజు వచ్చింది. యూనిట్‌ని చూడటానికి జనం విరగబడితే పోలీసులు ఈ బుల్లి కవిని లోపలికి పంపలేదు. కవికి అహం ఉంటుంది. ‘నా పాట వినే అదృష్టం విశ్వనాథ్‌కు లేదు’ అనుకుంటూ అక్కణ్ణుంచి వచ్చేశాడు. అంతేనా? ‘నా పేరు ఎప్పటికైనా అతనికి తెలుస్తుంది’ అనుకున్నాడు. నిజంగానే తెలిసింది కొన్నాళ్లకు. సిహెచ్.సీతారామశాస్త్రి. చెంబోలు సీతారామశాస్త్రి. ‘కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమథాలోక హిమదీపం’... అని రాశాడు వేటూరి ‘సాగర సంగమం’లో. ‘శంకరా నాద శరీరాపరా’ అని కూడా రాశాడాయన ‘శంకరాభరణం’లో. కె.విశ్వనాథ్‌కు నిజంగా తన సినిమాలో ‘గంగావతరణం’ పెట్టాల్సి వస్తే వేటూరి సంతోషంగా రాసేవాడు. విశ్వనాథ్ సినిమాలకు వేటూరిది సింగిల్ కార్డ్. కాని ‘జననీ జన్మభూమి’లో ఆ సింగిల్ కార్డ్‌కు తోడు సిహెచ్ సీతారామ శాస్త్రి అనే పేరు తోడయ్యింది. ఆ సినిమాలో ‘గంగావతరణం’ అనే చిన్న డాన్స్ బ్యాలేకు సీతారామశాస్త్రి గతంలో రాసిన ‘గంగావతరణం’లోని కొన్ని పంక్తులను వాడారు. అలనాడు కాకినాడలో సీతారామశాస్త్రి రాసిన గేయం ఆ నోట ఈ నోట విశ్వనాథ్ దాకా వెళ్లి అది విని ఆయన ముచ్చటపడి సినిమాలో వాడాల్సి వచ్చింది. తెలుగు తెర మీద సీతారామశాస్త్రికి అది తొలి పాట లెక్క ప్రకారం. అంతటితో ఆ పాట ఆగిపోయేదేమో. కాని కొనసాగాల్సి వచ్చింది. ఎందుకంటే అలా కొత్త కవి చొరబాటుకు వేటూరి అలిగాడు. ‘ఇక విశ్వనాథ్‌కు పాటలు రాయను’ అన్నాడు. విశ్వనాథ్‌కు అప్పటికి సీతారామశాస్త్రి చేత రాయించాలని లేదు. సీతారామశాస్త్రి ఎవరో కూడా ఎప్పుడూ చూళ్లేదు. దాంతో ఆయన ‘స్వాతిముత్యం’ సినిమాకు సినారెను, ఆత్రేయను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘సిరివెన్నెల’ తీయాలి. ఇటు చూస్తే తనకు అలవాటైన వేటూరి అలిగి ఉన్నాడు. అటు చూస్తే సీనియర్లు తనకు ఎక్కువ టైమ్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు. ఏం చేయాలి? బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే అదే. ఎవరో అలిగారు. సీతారామశాస్త్రికి ‘సిరివెన్నెల’ వచ్చింది. ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం’.. 1985 అక్టోబర్ 4న అఫీషియల్‌గా సీతారామశాస్త్రి తొలి పాట రికార్డ్ అయ్యింది. పాడటానికి వచ్చిన బాలూ ఆ వొత్తుజుట్టు, దళసరి కళ్లద్దాలు, పలుచటి శరీరం ఉన్న కవిని చూసి ‘మీరు కవిగా అమిత శక్తిమంతులు. రాబోయే దశాబ్దాలు మీవే’ అన్నాడు. అలాగే జరిగింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు దశాబ్దాల పాటు సీతారామశాస్త్రి పాట సాగిపోయింది. మొదటి సినిమాలోనే ప్రశంసల వెన్నెల కురిసింది. ఇంటి పేరు సిరివెన్నెల అయ్యింది. మద్రాసులో ఈ క్షణం కోడంబాకంలో కబురు పుడితే మరునిమిషం అది తడ దాకా పాకుతుంది. ఎవరో కొత్త కవి అట. సీతారామశాస్త్రి అట. విశ్వనాథ్‌కు రాస్తున్నాడట. నిజమే. మరి మసాలా పాట రాస్తాడా? వెళ్లిన వాళ్లకు ఆ కవి చెప్పిన జవాబు.. పెట్టిన షరతులు మూడు. 1. స్త్రీలను కించ పరచను 2. సమాజానికి చెడు సందేశాలు ఇవ్వను. 3. యువతకు కిర్రెక్కించే పాట రాయను. విన్న నిర్మాతలు సడేలే అనుకుని ముఖం తిప్పుకుని పోవడం మొదలెట్టారు. కాని సుకవి సుగంధం, సత్కవి మకరందం ఎవరు వదలు కుంటారు. ‘శృతిలయలు’ విడుదలైంది. అంతవరకూ ఎప్పుడూ వినని అన్నమయ్య కీర్తన అందులో ఉంది. ‘తెలవారదేమో స్వామి నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకూ’... ఈ కీర్తనను వెతికి పట్టాడంటే విశ్వనాథ్ ఎంత గొప్పవాడవ్వాలి. ఆ తర్వాత ‘నంది’ అవార్డులకు ఆ పాట వస్తే జడ్జిగా ఉన్న సి.ఎస్.రావు ‘ఏమయ్యా... ఇప్పుడు అన్నమయ్యకు నంది అవార్డు అవసరమా’ అనంటే ‘అది సీతారామశాస్త్రి రాసిన పాటండీ’ అని చెప్పారు. అన్నమయ్య రాసేడా అనిపించేలా సీతారామశాస్త్రి రాసిన పాట. ‘నంది’ ఆయన ఇంటికి నడుచుకుంటూ వచ్చింది. రాంగోపాల్ వర్మ గొప్ప టెక్నీషియన్. కనుక గొప్పవాళ్లే తన సినిమాకు పని చేయాలనుకున్నాడు. సీతారామశాస్త్రితో కాలేజీ పాటా? బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా? మిగిలిన సినిమా అంతా కుర్రకారు ఎంత ఉద్వేగంగా చూశారో ఈ పాటకు అంత ఉత్సాహంగా టక్కులు ఊడబెరికి గంతులేశారు. అయినా సరే.. ‘కమర్షియల్ సాంగ్’ అనేది ఒకటి ఉంటుంది. శాస్త్రిగారు ఆ ఒక్క తరహా కూడా రాసేస్తే? రాయలేడా ఆయనా? ‘బొబ్బిలి రాజా’ వచ్చింది. ‘బలపం పట్టి భామ బళ్లో.. అఆఇఈ నేర్చుకుంటా’... పాటా సినిమా సూపర్‌డూపర్ హిట్. ఇప్పుడు... సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘సమగ్ర సినీ కవి’ అయ్యాడు. హంసలా బతకాలని నిశ్చయించుకోవాలే గాని బతకొచ్చు. కాకిలా కశ్మలంలో వాలాలనుకుంటే వాలొచ్చు. చాయిస్ మనదే. నిర్ణయం తీసుకుంటే అలా బతికే వీలు ప్రకృతి కల్పిస్తుంది. ‘శుభ్రమైన పాట’ రాయాలని సీతారామశాస్త్రి అనుకున్నాడు. దారిన వెళుతుంటే అదిగో ఆ మంచి పాట రాసింది అతనే అనుకోవాలి... ఏదైనా సభకు పిలవాలి... ఎదుటపడితే నమస్కారం పొందేలా ఉండాలి... ‘శాస్త్రిగారు’లా ఉండాలి... ‘గాడు’... పేరు చివర పొరపాట్న కూడా పడకూడదు. ఆయన తన తుదిశ్వాస వరకూ ‘శాస్త్రిగారు’గానే ఉన్నాడు. పల్లవి మర్యాద. చరణం గౌరవం. కాంటెక్స్›్టలో పెట్టి చూపితే తప్ప సిరివెన్నెల గొప్పతనం అర్థం కాదు. గండు చీమ, బెల్లం, ఒడి, తడి, గొళ్లెం, తాళం వంటి పదాలు పాటలుగా చెలామణి అవుతున్న రోజుల్లో ‘చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి’ రాయడం కోసం కలాన్ని రిజర్వ్ చేసి పెట్టుకోవడం సిసలైన వ్యక్తిత్వం. అసలైన సంస్కారం. సరే. ఈ కవి పండితుడు కదా. ఈతనికి గ్రామీణుడి పదం తెలుసా... జానపదుని పాదం తెలుసా? ‘స్వయం కృషి’ విడుదలైంది. ‘సిగ్గూ పూబంతి యిసిరే సీతామాలచ్చి’ రాశాడు. ‘రాముడి సిత్తంలో కాముడు సింతలు రేపంగా’ అని జానపద శృంగారం ఒలికించాడు. ‘ఆపద్బాంధవుడు’లో? ‘ఔరా అమ్మకచెల్ల... ఆలకించి నమ్మడమెల్లా... అంత వింత గాధల్లో ఆనందలాల’ రాశాడు. ‘శుభసంకల్పం’లో ‘నీలాల కన్నుల్లో సంద్రవే నింగి నీలవంతా సంద్రవే’ అని బెస్తపడవలో మీన మెరుపు వంటి పదాలను అల్లాడు. సిరివెన్నెలకు రాని విద్య లేదు. పాట వచ్చి దాని మీద కేవలం డబ్బు సంపాదించేవాడు సగటు కవి అవుతాడు. దాని ద్వారా సమాజాన్ని జాగృతం చేయాలని తపించేవాడు ఉదాత్త కవి అవుతాడు. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అని రాశాడు సిరివెన్నెల. సమాజంలో పాలకుల్లో ఎంత పెడధోరణి ఉన్నా ఎన్ని అకృత్యాలు సాగుతున్నా ‘మనకెందుకులే’ అని సాగిపోయే జనం ఈ పాటను విని భుజాలు తడుముకున్నారు. తమ నిస్సహాయతకు సిగ్గుపడ్డారు. ‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు అటు ఇటు ఎటో వైపు’ అని ‘అంకురం’లో రాశాడు. ఒక్కళ్లే నడవడానికి భయమా? ‘మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి’ అని చెప్పాడు. ఎంత ధైర్యం ఇలాంటి కవి పక్కన ఉంటే. ‘నువ్వు తినే ప్రతి మెతుకు ఈ సంఘం పండించింది’ అన్నాడు ‘రుద్రవీణ’లో. ‘రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా... తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే’ అని ఈసడిస్తాడు. ‘నిత్యం కొట్టుకుచచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా.. దాన్నే స్వరాజ్యమందామా’... అని ఆయన ఈ దేశపు వర్తమానాన్ని ఎద్దేవా చేస్తాడు. ఒక్క పాట వేయి మోటివేషనల్ స్పీచ్‌లకు సమానం. నిరాశలో కూరుకుపోయి, నిర్లిప్తతలో కుదేలైన వారికి లే.. లేచి నిలబడు అని ఉపదేశం ఇచ్చినవాడు సిరివెన్నెల. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అన్నాడు. సిరివెన్నెలకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 40 ఏళ్ల వయసు కలిగిన తండ్రి చనిపోయాడు. ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు చెల్లెళ్లు. జీవచ్ఛవంలా మారిన తల్లి. వారి కోసం బతికాడు సిరివెన్నెల. అందుకే– ‘నొప్పిలేని నిముషమేది జననమైన మరణమైన జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిముషమైన నీది కాదు బతుకు అంటే నిత్యఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది అంతకంటే సైన్యముండునా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’... అని రాశాడు. ‘మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు’ అని ‘శ్రీకారం’ కోసం ఆయనే రాశాడు. ‘భయం లేదు భయం లేదు నిదర ముసుగు తీయండి... తెల్లారింది లెగండోయ్’ అని కోడికూతను వినిపించాడు. ‘ఒరే ఆంజనేయులు... తెగ ఆయాస పడిపోకు చాలు మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు కరెంటు రెంటు ఎట్సెట్రా మన కష్టాలు కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్లు నైటంతా దోమల్తో ఫైటింగే మనకు గ్లోబల్ వార్ భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడుకు గోలీమార్’... అని ‘అమృతం’ టైటిల్ సాంగ్. రోజూ వింటే బి.పి ట్యాబ్లెట్ అవసరం రానే రాదు. ‘నా మొదటి సినిమా ఏ ‘కుక్క’ అని అయి ఉంటే నా గతేంకాను’ అని నవ్వాడాయన ఒకసారి. కాని ‘విధాత తలంపు’ అలా ఎందుకు ఉంటుంది. విధాత ఆయనకు ‘సిరివెన్నెల’ రాసిపెట్టాడు. విధాత ఆయనకు తెలుగువారికి కాసిన్ని మంచి పాటలు ఇచ్చి రావోయ్ అని భువికి పంపాడు. విధాత ఆయనను నీ మార్గాన నడుచు శిష్యకవులను సిద్ధం చేయమని ఆదేశించి పంపాడు. ఇపుడు? ఇక చాలు నేను వినాల్సిన నీ పాటలు ఉన్నాయి... తెలిమంచు వేళల్లో మబ్బులపై మార్నింగ్ వాక్ చేస్తూ ఆ స్వర సంచారం పదసంవాదం చేద్దాం పద అని వెనక్కి పిలిపించుకున్నాడు. ఉపదేశం ఇచ్చే కవి ఊరికే ఉంటాడా? ‘దేవుడా.. ఈ లోకాన్ని మార్చు’ అని పాట వినిపించడూ? అందాక ఆ కవిని గౌరవించడానికి ఆయన మంచిపాటలు పాడుకుందాం. ఈ జగత్తు మనదిగా అనుకోవాలి. జనులందరి బాగు కోరుకోవాలి. మనల్ని బాధించే మోహాల దాహాల ఒంటరి నిర్మోహత్వాన్ని సాధన చేయాలి. సిరివెన్నెల పాట చిరాయువుగా ఉండాలి. జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదె... సన్యాసం శూన్యం నాదె... ప్రముఖుల నివాళి బహుముఖ ప్రజ్ఞ, సాహితీ సుసంపన్నత సిరివెన్నెల రచనల్లో ప్రకాశిస్తుంది. తెలుగు భాష ప్రాచుర్యానికి శాస్త్రి ఎంతో కృషి చేశారు. ఆయన కుటుంబసభ్యులకు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి తెలుగు పాటకు అందాన్నే గాక, గౌరవాన్ని కూడా తీసుకువచ్చారు. తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేనూ ఒకణ్ని. 2017లో గోవాలో వారికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును అందజేసిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి, వైద్యులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితి గురించి విచారిస్తూ వచ్చాను. వారి ఆరోగ్యం కుదుటపడుతోందని, త్వరలోనే కోలుకుంటారని భావించాను. సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – ఎం.వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి సీతారామశాస్త్రి ఇక లేరని తెలిసి ఎంతో విచారించాను. తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రి ప్రవేశం పాటకు ఊపిరులూదింది. నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు సీతారామశాస్త్రి. సాహితీ విరించి సీతారామశాస్త్రికి నా శ్రద్ధాంజలి. వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు నా సానుభూతి. – ఎన్.వి.రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాల ద్వారా తెలుగు వారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులుగా ఉంటారు. ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలాంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల పండిత, పామరుల హృదయాలను గెలిచారు. ఆయన సాహిత్య ప్రస్థానం సామాజిక, సంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మరణం తెలుగు చలన చిత్ర రంగానికి, సాహిత్య అభిమానులకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు స్వర్గస్తులు కావడం నాకు, తెలుగు సినిమా రంగానికి, జాతీయ భావజాలంతో కూడిన కవులు, కళాకారులకు ఎంతో లోటు. దేశభక్తిపై ఆయన రాసిన పాటలను సీడీ రూపంలో 15రోజుల క్రితం నన్ను కలిసి ఇచ్చారాయన. కోలుకుంటున్న సమయంలో స్వర్గస్తులు కావడం చాలా దురదృష్టకరం. నా భావజాలం జాతీయ భావజాలం అని స్పష్టంగా చెప్పేవారు ఆయన. – కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బాలసుబ్రహ్మణ్యం మృతి చెందినప్పుడు కుడి భుజం పోయిందనుకున్నాను. సిరివెన్నెల మృతితో ఎడమ భుజం కూడా పోయింది. ఎంతో సన్నిహితంగా మాట్లాడుకునేవాళ్లం.. ఒక్కసారిగా దూరమయ్యాడంటే నమ్మశక్యం కావడం లేదు. తన ఆత్మకు శాంతి చేకూరాలి.. తన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. – కె.విశ్వనాథ్, దర్శకుడు సిరివెన్నెలగారు ఆస్పత్రిలో చేరిన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు ఫోనులో నాతో ఎంతో హుషారుగా మాట్లాడారు. నవంబరు నెలాఖరుకల్లా వచ్చేస్తానని వెళ్లిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారని ఊహించలేదు. వేటూరిగారి తర్వాత అంత గొప్ప రచయిత సిరివెన్నెల. ఆయన సాహిత్యంలో శ్రీశ్రీగారి పదును కనబడుతుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, సిరివెన్నెలగారు.. ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప కవి మళ్లీ మనకు తారసపడటం కష్టమే. – చిరంజీవి, నటుడు సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెలగారు. – బాలకృష్ణ, నటుడు సీతారామశాస్త్రి నాకు అత్యంత సన్నిహితుడు, సరస్వతీ పుత్రుడు. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. – మంచు మోహన్‌బాబు, నటుడు అందమైన పాటలు, పదాలను మాకు మిగిల్చి, మీరు వెళ్లిపోయారు. వాటి రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారు. – నాగార్జున, నటుడు బలమైన భావాన్ని.. మానవత్వాన్ని.. ఆశావాదాన్ని చిన్న చిన్న మాటల్లో పొదిగి జన సామాన్యం గుండెల్లో నిక్షిప్తం చేసేలా గీత రచన చేసిన అక్షర తపస్వి సీతారామశాస్త్రిగారు. ఆ మహనీయుడు ఇకలేరు అనే వాస్తవం జీర్ణించుకోలేనిది. – పవన్ కల్యాణ్, నటుడు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి మరణవార్త విని దిగ్భ్రాంతి చెందాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. – మహేశ్‌బాబు, నటుడు అలుపెరుగక రాసిన ఆయన కలం ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంతకాలం అందరికీ చిరస్మరణీయంగా ఉంటాయి. – ఎన్టీఆర్, నటుడు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి మరణవార్త విని షాకయ్యాను. తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకు ఆయన అందించిన సేవలు అసామాన్యమైనవి. – రామ్‌చరణ్, నటుడు గత శనివారం సిరివెన్నెలగారితో ఫోనులో మాట్లాడాను. ‘మీలాగ నేను కూడా ఓ పాట పరిపుష్టిగా రాయాలి’ అని ఆయనతో అంటే, ‘నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు.. నువ్వు రాయగలవు’ అన్నారు. మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఇంత గొప్పగా రాయాలని ఓ బెంచ్ మార్క్ సృష్టించారాయన. ఇంట్లో తండ్రిని చూసి పిల్లలు నేర్చుకున్నట్లు ఆయన్ని చూసి నేను నేర్చుకున్నాను. నాలో ఆత్మ విశ్వాసాన్ని బలంగా నింపిన గురువు ఆయన. – రామజోగయ్య శాస్త్రి, సినీ గేయ రచయిత 1996లో ‘అర్ధాంగి’ సినిమాతో మేం సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్నుతట్టి ముందుకు నడిపించినవి ‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి’, ‘ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి’ అన్న సీతారామశాస్త్రిగారి పదాలు. భయం వేసినప్పుడల్లా గుర్తుతెచ్చుకుని పాడుకుంటే ధైర్యం వచ్చేది. నా జీవన గమనానికి దిశా నిర్దేశం చేసిన సీతారామశాస్త్రిగారికి శ్రద్ధాంజలి. – రాజమౌళి, దర్శకుడు ‘సాహసం నా రథం. సాహసం జీవితం’.. పాట నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఆయన కచ్చితంగా స్వర్గానికే వెళ్లి ఉంటారు. – రామ్‌గోపాల్ వర్మ, దర్శకుడు సీతారామశాస్త్రిగారు తెలుగు సినిమాకు గొప్పవరం. బాలూగారు మనకు దూరమైనా ఆయన్ను గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటున్నాం. ‘సిరివెన్నెల’గారు కూడా మన గుండెల్లో నిలిచే ఉంటారు. – వీవీ వినాయక్, దర్శకుడు గుండె నిండు గర్భిణిలా ఉంది. ప్రసవించలేని దుఃఖం పుట్టుకొస్తోంది. తల్లి కాగితానికి దూరమై అక్షరాల పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నాయ్. మీరు బతికే ఉన్నారు. పాట తన ప్రాణం పోగొట్టుకుంది. – సుకుమార్, డైరెక్టర్ ∙ఇంకా అశ్వనీదత్, బీవీఎస్‌యన్ ప్రసాద్, ఎమ్మెస్ రాజు, ‘స్రవంతి’ రవికిశోర్, ‘దిల్’ రాజు, వైవీఎస్ చౌదరి, మారుతి తదితర ప్రముఖులు నివాళులు అర్పించారు. చదవండి: దాని ముందు తలవంచా.. స్మోకింగ్‌పై గతంలో సిరివెన్నెల కీలక వ్యాఖ్యలు -
Sirivennela Sitarama Sastry Demise: పాట విశ్రమించింది..
పదహారు కళల పౌర్ణమి వంటి పాట కటిక నలుపు అమావాస్యకు ఒరిగిపోయింది. పద నాడులకు ప్రాణ స్పందననొసగిన పల్లవి అసంపూర్ణ చరణాలను మిగిల్చి వెళ్లిపోయింది. చలువ వెన్నెలలో మునిగి అలల మువ్వలను కూర్చి ఒక కలం గగనపు విరితోటలోని గోగుపూలు తెస్తానని వీధి మలుపు తిరిగిపోయింది. కవిని చిరాయువుగా జీవించమని ఆనతినివ్వని ఆది భిక్షువును ఏమి అడగాలో తెలియక ఒక గీతం అటుగా అంతర్థానమయ్యింది. తెలుగువారి కంట కుంభవృష్టి మిగిల్చి ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అనే పేరు తెలిమంచులా కరిగిపోయింది. తెలుగువారి ఆఖరు పండిత సినీ కవి సువర్ణ చరిత్ర తుది పుట మడిచింది. ‘అమ్మలాల.. పైడి కొమ్మలాల.. వీడు ఏమయాడె.. జాడ లేదియాల’... అయ్యో... కట్ట వలసిన పాట వరుస హార్మోనియం మెట్ల మీద పడి భోరున విలపిస్తూ ఉంది. -
‘సిరివెన్నెల’ గారు సాహిత్య పరిశోధకుడు: దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి
ప్రతి పాటని ఒక తపస్సులా, తన సొంత బిడ్డలా భావిస్తూ పండితులను, పామరులను ఏకకాలంలో ఆకట్టుకుని కట్టిపడేసే ఒక సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు అయిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి’గారు అకాల మరణం చెందటం తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న దురదృష్టం. ఆయనతో, ఆయన బిడ్డలతో (పాటలతో), ఆయన కుటుంబ సభ్యులతో ఆత్మీయ పరిచయం నాకు కలగటం నేను చేసుకున్న అదృష్టం. నా దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి సినిమాల్లో అన్ని పాటలను ఆయనతో రాయించుకోగలిగిన అనుభవాన్ని పొందటం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా పాటల రూపంలో తెలుగు సాహిత్య ప్రియుల మధ్య ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. -
దాని ముందు తలవంచా.. స్మోకింగ్‌పై గతంలో సిరివెన్నెల కీలక వ్యాఖ్యలు
ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని కిమ్స్ వైద్యులు వెల్లడించారు.ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తొలగించారని.. అయినప్పటికి మరోసారి క్యాన్సర్ బారిన పడడంతో ఆపరేషన్ చేసి మరో ఊపిరితిత్తిలో సగభాగం తీసేసినట్లులు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారని , మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు’అని వెల్లడించారు. అయితే సిరివెన్నెలకు సిగరేట్ అలవాటు ఉండడం వల్లే క్యాన్సర్ బారిన పడినట్లు తెలుస్తోంది. సిరివెన్నెల గతంలో ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మోకింగ్ అలవాటుపై కీలక విషయాలు చెప్పారు. చిన్నప్పటి నుంచే స్మోకింగ్ అలవాటు ఉన్నట్లు వెల్లడించారు. సరదాగా మొదలుపెట్టిన స్మోకింగ్.. వ్యసనంగా మారిందని చెప్పారు. నాకు అసలే అహంకారం ఎక్కువ.. అయినా సిగరెట్ ముందు ప్రతిసారి తలవంచుతున్నానని చెప్పారు. తన పిల్లలకు కూడా అదే విషయాన్ని చెపినట్లు తెలిపారు. పబ్లిక్ తిరిగే ప్రాంతంలో కానీ, చిన్న పిల్లల ముందు కాని సిగరేట్ కాల్చొద్దని తనకు తానే ఓ రూల్‌ని పెట్టుకున్నట్లు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్యర్‌తో మరణించిన నేపథ్యంలో గతంలో స్మోకింగ్‌పై సిరివెన్నెల చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. -
సిరివెన్నెలను తలచుకుని కంట తడి పెట్టుకున్న చిరంజీవి
Megastar Chiranjeevi Emotional Words About Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగస్టార్ చిరంజీవి కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లి.. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ముృతికి సంతాపం తెలిపారు. ఈ రోజు సాహిత్యానికి చీకటి రోజన్నారు చిరంజీవి. (చదవండి: ఇప్పుడు నా కుడి భుజం పోయింది: కే. విశ్వనాథ్) అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సిరివెన్నెలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని.. ఆయన వస్తాడు అనుకున్నాం.. కాని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటూ చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు. చదవండి: ఆయన మరణం సినీ పరిశ్రమకే తీరని లోటు: మెగాస్టార్ భావోద్వేగం -
సిరివెన్నెల పాడిన చివరి పాట.. వీడియో వైరల్
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సిరివెన్నెల మృతిపూ సినీ సాహిత్య అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సిరివెన్నెలకు దురదృష్టం.. తెలుగు వారికి అదృష్టం..త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్ అయితే సిరివెన్నెల చివరిసారిగా పాడిన ఓ స్ఫూర్తి గీతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అనే పాటను ఆయన స్వయంగా ఆలపించారు. సుమన్ హీరోగా నటించిన ‘పట్టుదల’ అనే సినిమాలోని ఈ గీతానికి ‘సిరివెన్నెల’ సాహిత్యం అదించారు. ఆద్యంతం ఈ పాట మనిషి పట్టుదల వీడకూడదు.. సంకల్పం ఉంటే సాధ్యం కానిదేదీ లేదనే స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది. -
సిరివెన్నెల మృతికి కారణాలు ఇవే
Sirivennela Seetharama sastry Death Reasons: ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) మృతిపై కిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి ఎండీ భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆరేళ్ల క్రితం సిరివెన్నెలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తియాల్సి వచ్చింది. మళ్లీ గతవారం కిందట మరో వైపు ఉన్న ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకడంతో ఆపరేషన్ చేసి సగం తొలగించాం. ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారు. ఐదు రోజుల నుంచి ఎక్మా మిషన్ మీద ఉన్నారు. ఆ తర్వాత క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీలు దెబ్బతినడం, ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకి చివరకు మంగళవారం సాయంత్రం 4: 07 గంటలకు తుది శ్వాస విడిచారు’అని వెల్లడించారు. -
ఇప్పుడు నా ఎడమ భుజం పోయింది: కే. విశ్వనాథ్
Director K Viswanath Emotional About Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపింది. సిరివెన్నెల మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక సీతారామా శాస్త్రిని సిరివెన్నెలగా మార్చిన వ్యక్తి దర్శకుడు కే. విశ్వనాథ్. వారిద్దరి మధ్య ఎంతో గాఢ అనుబంధం ఉండేది. సిరివెన్నెలను తమ్ముడిగా భావిస్తారు విశ్వనాథ్. అలాంటిది సీతారామాశాస్త్రి మరణ వార్త విని తల్లడిల్లిపోయారు విశ్వనాథ్. సిరివెన్నెల మృతి తనకు తీరని లోటన్నారు. (చదవండి: టాలీవుడ్లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల మృతి నాకు తీరని లోటు. బాల సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నా కుడి భుజం పోయినట్లు అనిపించింది. సిరివెన్నెల మృతితో నా ఎడమ భుజం కోల్పోయిన భావన కలుగుతుంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు.. మాట్లాడలేకుండా ఉన్నాను. సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’’ అంటూ విశ్వనాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చదవండి: సిరివెన్నెలకు దురదృష్టం.. తెలుగు వారికి అదృష్టం..త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్ -
సిరివెన్నెలకు దురదృష్టం.. తెలుగు వారికి అదృష్టం..త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్
Emotional Speech by Trivikram About Sirivennela Seetharama Sastry Old Video Viral: తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరనే వార్తను సాహిత్య ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మరణం పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సీతారామశాస్త్రి పాటలను తలచుకొని భావోద్వేగానికి లోనవుతున్నారు. తాజాగా సీతారామశాస్త్రి గురించి గతంలో తివ్రిక్రమ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ప్రముఖ చానల్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో సిరివెన్నెలపై భావోద్వేగ ప్రసంగం ఇచ్చాడు త్రివిక్రమ్. ‘సీతారామశాస్త్రిగారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న పదాలు సరిపోవు. ఎందుకంటే ‘సిరివెన్నెల’సినిమాలో రాసిన ‘ప్రాగ్దిశ వేణియపైన, దినకరమయూఖ తంత్రులపైన’ ఆ పాట విన్న వెంటనే తెలుగు డిక్షనరీ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలిసింది. దాన్ని ‘శబ్ద రత్నాకరం’ అంటారని తెలుసుకున్నా. అది కొనుక్కొని తెచ్చుకుని, ప్రాగ్దిశ అంటే ఏంటి? మయూఖం అంటే ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకున్నా. ఒక పాటను అర్థమయ్యేలానే రాయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి అని కోరిక పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రి. ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచంమీద వేటాడటానికి బయలుదేరతాడు. రండి నాకు సమాధానం చెప్పండి అంటాడు.మన ఇంట్లోకి వచ్చి మనల్ని పశ్నిస్తాడు. ఓటమిని ఎప్పుకోవద్దు అంటాడు. సింధూరం సినిమాలో ‘అర్థ శతాబ్దం అజ్ఞానాన్నే స్వతంతం అందామా’ అనే ఒక్క మాటతో నేను లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నా.. ఎక్కడి వెళ్తున్నానో తెలియదు. ఒక మనిషిని ఇంతలా కదిలించే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది. సిరివెన్నెల తెలుగు సినీ కవి కావటం ఆయన దురదృష్టం.. తెలుగు వారి అదృష్టం’అంటూ త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. -
అవార్డుల్లో రికార్డులు ‘సిరివెన్నెల’ సొంతం!
-
Sirivennela Seetharama Sastry అస్తమయం: మాదిక ఏకాకి జీవితం,కన్నీటి నివాళులు
సాక్షి, హైదరాబాద్: సినీ గేయ రచయిత సిరివెన్నెల ఇక లేరన్న వార్తలో యావత్ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు, ఆ పాటల్లోని సాహిత్య విలువలను గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, గాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి సిరివెన్నెల మరణం తీరని లోటంటూ సంతాపం వెలిబుచ్చారు. Heartbroken After my Father,he was d only 1 who wud scold,Correct or appreciate me rightfully Wil miss U Dearest Uncle Lov U & ThankU 4 all d Magical Lyrics dat decorated my Tunes & 4 Encouraging my Lyrics U r Irreplaceable — DEVI SRI PRASAD (@ThisIsDSP) November 30, 2021 'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు — Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021 ప్రముఖ నటుడుప్రకాశ్ రాజ్, మాదిక ఏకాకి జీవితం అంటూ సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకులు దేవ కట్టా, అనిల్ రావిపూడి ‘‘మా గుండెల్లో నిద్రపోయావా?... విశ్వాత్మలో కలిసిపోయావా? ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు. అలాగే నా తండ్రి తరువాత నన్నునడిపించిన ఏకైక వ్యక్తి మీరు .. మిస్ యూ అంకుల్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా సినీ ప్రపంచానికి ‘సిరివెన్నెల’ను పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ సిరివెన్నెల లేని లోటు తీరనిదని పేర్కొన్నారు. (Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే) ‘పదం ఆయన ఆస్తి... జ్ఞానంతో ఆయనకు దోస్తీ ఆయనో పదభవన నిర్మాణ మేస్త్రి సీతారామ శాస్త్రి..సీతారాముడికి సెలవు’ అంటూ మోహన కృష్ణ అనే అభిమాని సిరివెన్నెలకు నివాళులర్పించారు. (Sirivennela Seetharama Sastry చుక్కల్లారా.. ఎక్కడ ‘మా సిరివెన్నెల’) "మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు" - మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?...విశ్వాత్మలో కలిసిపోయావా? — dev katta (@devakatta) November 30, 2021 జగమంత కుటుంబం మీది మీరు లేక ఏకాకి జీవితం మాది... Unbearable loss thank you for the poetic perceptions which added meaning in to our lives .. YOU WERE THE BEST GURUJI తెలుగు సాహిత్య శిఖరం... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... అజ్ఞానపు చీకటి ని తన అక్షర కిరణాల తో వెన్నెల గా మార్చిన సిరివెన్నెల గారికి..... కన్నీటి వీడ్కోలు ...... ,, — Anil Ravipudi (@AnilRavipudi) November 30, 2021 — Prakash Raj (@prakashraaj) November 30, 2021 The Lyrical Legend. It's deeply saddening to hear the demise of Sirivennela Seetharama Sastry Garu. There will never be one like him. There will never shine another star like the way he did. May his soul rest in peace — v e n u u d u g u l a (@venuudugulafilm) November 30, 2021 His words, his songs and his magic will live forever. ఆయన సాహిత్యం లోని సిరివెన్నెల మన మనసుల మీద ఎప్పటికీ అలానే వుంటుంది. వీడుకోలు గురువు గారూ.. — Nani (@NameisNani) November 30, 2021 Thank you #SirivennelaSeetharamaSastry Garu for your unparalleled contribution to our industry. You shall forever be remembered and missed. Honoured to have known you and worked with you. Rest in peace sir. — RAm POthineni (@ramsayz) November 30, 2021 -
సిరివెన్నెలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఇకలేరన్న వార్త టాలీవుడ్లో విషాదం నింపింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో1955 మే 20న జన్మించారు . ఆయన తల్లిదండ్రులు డాక్టర్ సి.వి.యోగి, తల్లి సుబ్బలక్ష్మి. కాకినాడలో ఇంటర్మీడియెట్ వరకూ చదువుకున్నా ఆయన , ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులో బిఏ పూర్తి చేశారు. ఆయన కొంతకాలంపాటు టెలిఫోన్స్ శాఖలో పని చేశారు. ప్రఖ్యాత దర్శకుడు విశ్వనాధ్ అవకాశం కల్పించడంతో సిరివెన్నెల సినిమాలో పాటలన్నీ రాశారు. సిరివెన్నెల చిత్రం సూపర్ హిట్ కావడంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రసిద్ధి గాంచారు. సిరివెన్నెల సినిమాలోని అన్ని పాటలను ఆయనే రాశారు. ప్రతి పాట సూపర్ హిట్టయింది. సిరివెన్నెల సినిమాలోని... విధాత తలపున ప్రభవించినది, చందమామ రావే, ఆది భిక్షువు వాడినేది కోరేదీ, ఈ గాలీ ఈ నేలా...ఇలా ప్రతిపాట అద్భుత సాహితీ గుబాళింపులతో సాహితీ ప్రియుల మనసు దోచాయి. స్వయంకృషి, రుద్రవీణ, స్వర్ణకమలం, శృతిలయలు, శివ, క్షణక్షణం, గాయం , గులాబీ, మనీ, శుభలగ్నం, నిన్నే పెళ్లాడతా, సింధూరం, దేవీపుత్రుడు, చంద్రలేఖ, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, శుభసంకల్పం, పట్టుదల..ఇలా అనేక సినిమాల్లో ఆయన రాసిన ప్రతిపాటా ఆణిముత్యమే. పండితులను పామరులను ఆకట్టుకున్న అద్భుత కవితామృత గుళికలే. కె. విశ్వనాధ్, వంశీ, క్రాంతికుమార్, బాలచందర్, జంధ్యాల, రాఘవేంద్రరావు, రామ్ గోపాల్‌వర్మ, సింగీతం శ్రీనివాసరావు, శివనాగేశ్వరరావు, కోదండరామిరెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణవంశీ, మణిరత్నం, వి.ఎన్ . ఆదిత్య, రాజమౌళి, పూరీ జగన్నాధ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీనువైట్ల, ఇంద్రగంటి......ఇలా...ఎంతో మంది దిగ్గజ దర్శకులనుంచి, కొత్త దర్శకులదాకా....అందరూ ఆయన పాటల పరిమళాల్ని ప్రజలకు పంచారు. 2019లో పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఇక ఉత్తమ గేయ రచయితగా ఆయన పొందిన పురస్కారాలకు లెక్క లేదు. మొదట్లో భరణి అనే కలం పేరుతో కథలు, కవిత్వ రచనలు చేసిన సీతారామశాస్త్రి... ...సిరివెన్నెల సినిమా హిట్టుతో ఆ సినిమా పేరే ఇంటిపేరుగా మార్చుకున్నారు. -
సిరివెన్నెల మృతిపై రాజకీయ ప్రముఖుల సంతాపం
AP CM YS Jagan Mourns On Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ‘‘అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021 సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 2/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021 చదవండి: సిరివెన్నెలను ఎక్కువగా శ్రమ పెట్టిన పాట ఏంటి..? సిరివెన్నెల పండిత, పామరుల హృదయాలను గెలిచారు: సీఎం కేసీఆర్ ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ చంబోలు (సిరివెన్నెల) సీతారామ శాస్త్రి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం కేసీఆర్ తెలిపారు. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాహిత్య లోకానికి తీరని లోటు: విశ్వభూషన్ హరిచందన్ ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. సిరివెన్నెల కలం నుంచి ఆణిముత్యాల వంటి గీతాలు జాలువారాయన్నారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో ఆయన అక్షర నీరాజనాన్ని ఎవ్వరూ మరువలేరన్నారు. తెలుగు చరిత్రలో ఆయన పాటలు, మాటలు సజీవంగా నిలిచి పోతాయని గవర్నర్ ప్రస్తుతించారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్న గవర్నర్, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు: అవంతి ‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు. తెలుగు సినిమా సాహిత్యానికి సొబగులు అద్దిన దిగ్గజ సినీ గేయరచయిత ‘సిరివెన్నెల’.. సీతారామశాస్త్రి మృతి సాహితీ ప్రియులు, సినీ ప్రేమికులకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం’ అన్నారు మంత్రి అవంతి. సిరివెన్నెల జాతీయ భావజాలం కలిగిన కవి: కిషన్‌రెడ్డి ‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితులు. జాతీయ భావజాలం కలిగిన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. 1985 నుంచి ఆయన నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. 15 రోజుల కిందటే ఆయన నాకు జాతీయ గీతాల సీడీ ఇచ్చారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది’’ అన్నారు కేంద్ర పర్యటక మంత్రి కిషన్ రెడ్డి. -
టాలీవుడ్లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత
సాక్షి; హైదరాబాద్: టాలీవుడ్లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతుంది. అప్పటివరకు తమతో ఉన్న తోటి నటులు, కళకారులు వివిధ కారణాలతో కన్ను మూయడం సినీ ప్రపంచాన్ని కలచివేస్తోంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ ఇవాళ(నవంబర్ 30) తుదిశ్వాస విడిచారు. నవంబర్ 28న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులు పాడవడంతో కన్నుమూశారు. అలాగే ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు నవంబర్ 27న గుండెపోటుతో తిరిగిరాని అనంతలోకాలకు తిరిగి వెళ్లిపోయారు. ఈ ఒక్క నాలుగు రోజుల్లోనే ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు మరణించడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత -
గీత రచయిత ‘సిరివెన్నెల’ జ్ఞాపకాలు( ఫోటోలు)
-
సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు
Sirivennela Sitaramasastry Popular Hit Songs: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల ఆయన న్యూమోనియాతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రీ. ఆయన 'సిరివెన్నెల' సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 1986లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న ఈ సినిమాకు కళాతపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 'సిరివెన్నెల' చిత్రంలోని 'విధాత తలపున ప్రభవించినది' అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో 'సిరివెన్నెల సీతారామశాస్త్రీ'గా స్థానం సంపాదించి పెట్టంది. ఆయన కలం నుంచి జాలువారిన సాహిత్యం ఎంతో మంది మదిని మీటుతుంది. మూడు నాలుగు నిమిషాలుండే పాటలో సినిమా తాలుకు భావాన్ని నింపడం అదికూడా అర్ధమయ్యే పదాలతో రాయడం అంటే అది అందరికీ సాధ్యం కాదు.. అలా పాటలు రాయడంలో దిగ్గజాలు అయిన మహానుభావులలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని దర్శక దిగ్గజం కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు పరిచయం చేశారు సిరివెన్నెల. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. అలాగే రుద్రవీణ సినిమాలో 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ' అనే పాట, 'లలిత ప్రియ కమలం విరిసినదీ' అనే పాటలను అద్భుతంగా రాసారు. 'లలిత ప్రియ కమలం' పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. అలాగే కృష్ణ వంశీ తెరకెక్కించిన సింధూరం సినిమాలో ఆయన రాసిన 'అర్ధ శతాబ్దపు' పాట సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అగ్నిజ్వాలలను రగిలించే పాటలే కాదు చిగురుటాకు లాంటి అందమైన ప్రేమ గీతాలను కూడా సీతారామ శాస్త్రీ అందించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అని పాటను రాయడంమే కాదు అందులో పాడి నటించి మెప్పించారు. ఈ పాటకు సిరివెన్నెలను ప్రభుత్వం నంది పురస్కారంతో సత్కరించింది. ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటల్లో ఆణిముత్యాలు ఎన్నో. ఇటీవల ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన 'దోస్తీ' పాటతో కూడా అలరించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ. ఎన్నో వేల అద్భుత గేయాలు అందించి సంగీత ప్రపంచంలో జో కొట్టిన ఆయనకు నివాళిగా ఆ ఆణిముత్యాలు మీకోసం. 1. విధాత తలపున ప్రభవించినది (సిరివెన్నెల) 2. పారాహుషార్ (స్వయంకృషి) 3. నమ్మకు నమ్మకు ఈ రేయిని (రుద్రవీణ) 4. తరలిరాద తనే వసంతం (రుద్రవీణ) 5. ఘల్లు ఘల్లు (స్వర్ణకమలం) 6. బోటనీ పాఠముంది (శివ) 7. కొత్త కొత్తగా ఉన్నది (కూలీ నెం 1) 8. చిలుకా క్షేమమా (రౌడీ అల్లుడు) 9. జాము రాతిరి జాబిలమ్మ (క్షణక్షణం) 10. వారేవా ఏమీ ఫేసు (మనీ) 11. నిగ్గ దీసి అడుగు (గాయం) 12. అమ్మ బ్రహ్మ దేవుడో (గోవిందా గోవిందా) 13. చిలకా ఏ తోడు లేక (శుభలగ్నం) 14. తెలుసా మనసా (క్రిమినల్) 15. హైలెస్సో హైలెస్స (శుభసంకల్పం) 16. అపురూపమైనదమ్మ ఆడజన్మ (పవిత్రబంధం) 17. అర్ధ శతాబ్దపు (సింధూరం) 18. జగమంత కుటుంబం నాది (చక్రం) 19. సామజ వరగమన (అల వైకుంఠపురములో) 20. దోస్తీ (ఆర్ఆర్ఆర్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే
సాక్షి, హైదరాబాద్: సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరన్న వార్త టాలీవుడ్ పెద్దలను, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది. సుదీర్ఘ కరియర్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను అందించి సిరివెన్నెలను తలుచుకుని అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలుగు పరిశ్రమకు ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ వెతికి పట్టుకున్న ఆణిముత్యం సీతారామ శాస్త్రి. సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయన ప్రతీ పాటను ఎంతో అద్భుతంగా మలిచారు. అప్పటికీ, ఇప్పటికీ ఆ పాటలు అజరామరమే. ‘విధాత తలపున ప్రభవించినది’ అంటూ మొదలు పెట్టిన ఆయన ప్రస్థానంలో మూడు వేలకు పైగా పాటలు. ముఖ్యంగా గాయం మూవీలో నిగ్గు దీసి అడుగు అంటూ సిగ్గులేని జనాన్ని కడిగేసిన పదునైన కలం ఆయనది. అందరిలో ఉన్నా... ఒంటరిగా బతుకుతున్న ఓ యువకుడి కథ కోసం ‘జగమంతా కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది’ అంటూ తాత్వికతను ప్రదర్శించారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు అంకురం : ఎవరో ఒకరు ఎపుడో అపుడు శ్రుతిలయలు - తెలవారదేమో స్వామీ మహర్షి - సాహసం నా పథం రుద్రవీణ - తరలిరాదా తనే వసంతం, నమ్మకు నమ్మకు ఈ రేయినీ కూలీ నెం:1 - కొత్త కొత్తగా ఉన్నదీ రౌడీ అల్లుడు - చిలుకా క్షేమమా క్రిమినల్ - తెలుసా మనసా పెళ్లి - జాబిలమ్మ నీకు అంత కోపమా మురారి మూవీలో అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి పాటతోపాటు, ‘చంద్రుడిలో ఉండే కుందేలు కిందకొచ్చిందా...కిందకొచ్చి నీలా మారిందా’ అనే భావుకత. ‘జామురాతిరి..జాబిలమ్మా...’ అంటూ జోల పాడి హాయిగా నిద్రపుచ్చే అందమైన సాహిత్యం ఆయన సొంతం. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ అలవైకుంఠపురంలో ‘సామజవరగమన పాటలు పెద్ద సంచలనం. ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చుక్కల్లారా.. చూపుల్లారా.. ఎక్కడ ‘మా సిరివెన్నెల’?
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ జగత్తంతా సిరివెన్నెల పరచిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మనకిక లేరు. తొలి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న కారణజన్ముడు ఆయన. న్యూమోనియాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల తిరిగి రాని లోకానికి తరలి పోయారు. దీంతో త్వరగా కోలుకుని ఆయన ఇంటికి తిరిగి చేరుకుంటారన్న కోట్లాదిమంది ఆశలు అడియాశలయ్యాయి. (Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే) "మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు" - మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?...విశ్వాత్మలో కలిసిపోయావా? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 — dev katta (@devakatta) November 30, 2021 విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో 1955 మే 20న డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు చెంబోలు సీతారామ శాస్త్రి. గేయరచయితగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 2020 వరకు 3000 పాటలకు పైగా సాహిత్యం అందించారు. పదకొండు నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించారు. ఈ రంగంలో ఆయన కేసిన కృషికి గాను 2019లో పద్మశ్రీ పురస్కారం లభించింది. జననీ జన్మభూమి సినిమాకు గేయ రచయితగా అరంగేట్రం చేసినప్పటికీ, కే.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల మూవీలో పాటలకుగాను సిరివెన్నెలగా తన పేరును స్థిరపర్చుకున్నారు. ‘ఆది భిక్షువు’ పాటకు ఉత్తమ గీత రచయితగా శాస్త్రి తన మొదటి నంది అవార్డును అందుకున్నారు. ఆ తరువాత ఆయన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ‘బూడిదిచ్చే వాడి నేటి అడిగేది అన్నా, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అన్నా అది ఆయనకే చెల్లు. స్వయం కృషి, స్వర్ణ కమలం, సంసారం, ఒక చదరంగం, శ్రుతిలయలు, పెళ్లి చేసి చూడు వంటి చిత్రాలలో అనేక పాటలకు మాటలు రాశారు. 1986, 1987, 1988లో వరుసగా మూడు సంవత్సరాలలో నంది అవార్డులను గెలుచుకున్న ఘనత ఆయన సొంతం. స్వరకల్పన, అన్న తమ్ముడు, ఇంద్రుడు చంద్రుడు, అల్లుడుగారు, అంతం ,రుద్రవీణ, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలకు తన పాటతో ప్రాణం పోశారు. ఆ తర్వాతికాలంలో క్షణ క్షణం, స్వాతి కిరణం, మురారి, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, ఎలా చెప్పను, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శుభలగ్నం, చక్రం, కృష్ణం వందే జగద్గురుం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే. ప్రేమ అయినా, విరహమైనా, దేశభక్తిఅయినా, విప్లవ గీతమైనా ఆయన పాట చెరగని ముద్ర. ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే. ప్రతీ పదమూ హృదయాన్ని తాకేదే. అలనాటి దిగ్గజ రైటర్స్ వేటూరి, ఆత్రేయతో పాటు టాలీవుడ్లో గొప్ప గేయ రచయితగా తన పేరును సార్థకం చేసుకున్నారు. అంతేకాదు చంద్రబోస్, అనంత్ శ్రీరామ్, రామ జోగయ్య శాస్త్రి వంటి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన నటుడు, గాయకుడు కూడా. కళ్లు సినిమాలో ‘తెల్లారింది లెగండోయ్.. కొక్కొరోకో..’ అంటూ సినీ అభిమానులను నిద్ర లేపిన ఆయన గళం మూగబోయింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’సీతారామశాస్త్రి (66) కన్నుమూశారు. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ నవంబర్ 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఆరేళ్ల క్రితం కేన్సర్‌ను గుర్తించారు. అప్పట్లోనే రెండు ఊపిరితిత్తుల్లో ఒకదాన్ని తొలగించారు. తర్వాత బైపాస్ సర్జరీ చేశారు. ఇటీవల రెండో ఊపిరితిత్తికీ కేన్సర్ సోకడంతో 50శాతం తొలగించాల్సి వచ్చింది. ఆక్సినేషన్ సరిగా లేకపోవడంతో ఆయన్ను గత 5 రోజుల నుంచి కిమ్స్‌లో ఎక్మోపై ఉంచా రు. అప్పటికే ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో పాటు ఇదే సమయంలో కిడ్నీ పనితీరు కూడా దెబ్బతింది. కేన్సర్ కారణంగా రెండు ఊపిరితిత్తులు పాడైపోవడం, బైపాస్ సర్జరీ కావడంతో కోలుకోలేకపోయారు. ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని కిమ్స్ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. పద్మశ్రీ.. 11 నంది అవార్డులు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామంలో 1955 మే 20న డా. చేంబోలు వెంకట యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు సీతారామశాస్త్రి జన్మించారు. పదో తరగతి వరకు అనకాపల్లిలో చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్ పూర్తి చేసి ఆంధ్ర మెడికల్ కళాశాలలో మెడిసిన్ (బీడీఎస్)లో చేరారు. తండ్రి చనిపోవడంతో మెడిసిన్‌ను మధ్యలోనే ఆపేశారు. 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘జననీ జన్మభూమి’సినిమాతో కెరీర్ ప్రారంభించారు. కె. విశ్వనాథ్ ‘సిరివెన్నెల’చిత్రానికి సీతారామశాస్త్రి అన్ని పాటలూ రాశారు. ఆ సినిమా పేరే ఇంటి పేరుగా మారిపోయింది. సీతారామశాస్త్రి ఇప్పటివరకు సుమారు 800 సినిమాలకు దాదాపు 3,000 పాటలు రాశారు. పద్మశ్రీతో పాటు 11 నంది అవార్డులు అందుకున్నారు. ‘సిరివెన్నెల’కు భార్య పద్మావతి, కుమారులు సాయి వెంకట యోగేశ్వర శర్మ, రాజా భవానీ శంకర శర్మ, కుమార్తె లలితాదేవి ఉన్నారు. సిరివెన్నెల మరణవార్త విని సినీతారలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి వచ్చారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఉంచనున్నారు. తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, సిరివెన్నెల మృతి పట్ల గవర్నర్ సౌందరరాజన్ తమిళిసై సంతాపం వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సిరివెన్నెలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏమవుతాడో తెలుసా?
Sirivennela Sitaramasastri And Director Trivikram Srinivas Relation: సిరివెన్నెల సీతారామశాస్త్రికి -డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు చాలా దగ్గరి రిలేషన్ ఉంది. స్వయంవరం సినిమాతో రైటర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రివిక్రమ్.. నువ్వేకావాలి సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు. అప్పటివరకు మూసధోరణిలో వెళ్తున్న సినిమాలకు తన రైటింగ్ స్కిల్స్‌తో కొత్త దారిని పరిచయం చేశాడు. తేలికైన పదాలతోనే పవర్ఫుల్ పంచుడైలాగులు రాయడం ఆయన స్పెషాలిటీ. త్రివిక్రమ్ సినిమాల గురించి తెలిసినంతగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కెరీర్ పరంగా త్రివిక్రమ్ అప్పటికే రైటర్‌గానే కాకుండా డైరెక్టర్‌గానూ మాంచి ఫామ్‌లో ఉన్నాడు. త్రివిక్రమ్ ప్రతిభతో పాటు అతని వ్యక్తిత్వం నచ్చిన సిరివెన్నెల స్వయంగా తమ ఇంట్లో పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారట. అయితే అక్కడికి వెళ్లిన త్రివిక్రమ్ ఆ అమ్మాయిని కాకుండా వాళ్ల చెల్లిని ఇష్టపడ్డాడట. ఇదే విషయాన్ని చెప్పగా, మొదట కాస్త సంశయించినా, తర్వాత అర్థం చేసుకొని వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. అలా త్రివిక్రమ్-సౌజన్యల వివాహం జరిగింది. సిరివెన్నెల సీతారామశాస్త్రికి స్వయానా సోదరుడి కూతురే సౌజన్య. అలా వీరి పెళ్లి సినిమా స్టోరీని తలపించే విధంగా ఉంటుంది. -
ఇంకా ఐసీయూలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి.. వైద్యులు ఏమన్నారంటే..
Sirivennela Seetharama Sastry Health Bulletin Released: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తాజాగా సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. సినీ గేయ రచయిత సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న సిరివెన్నెల ఆరోగ్యాన్ని నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం అని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా అనారోగ్యం కారణంగా ఈనెల 24న సిరివెన్నెలను ఆయన కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. -
‘సిరివెన్నెల’కు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గేయ రచయిత ‘సిరివెన్నెల’సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ‘సిరివెన్నెల’న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఐసీయూలో ఉంచి ఊపిరితిత్తులకు సంబంధించి తగిన వైద్యం అందజేస్తున్నామని చెప్పాయి. అలాగే గడిచిన 24 గంటల్లో ‘సిరివెన్నెల’ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వెల్లడించాయి. -
సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత
Sirivennela Sitarama Sastry: టాలీవుడ్ ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు లోనైన ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనను కిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘సిరివెన్నెల’ బరువు మోయటం అంత సులువు కాదు: త్రివిక్రమ్
కరోనా వేళ సినీ వేడుకలు లేవు. అది కూడా ఒకే వేదిక మీద రెండు వేడుకలు జరిగితే ఆ ఆనందం అంబరమే. ఆ ఆనందానికి వేదిక అయింది ‘సాక్షి’ మీడియా గ్రూప్. ప్రతిభను గుర్తించింది... తారలను అవార్డులతో సత్కరించింది. 2019, 2020 సంవత్సరాలకు గాను స‘కళ’ జనుల ‘సాక్షి’గా ‘ఎక్స్‌లెన్స్ అవార్డు’ల వేడుక కనువిందుగా జరిగింది. ఎంతో అంగరంగా వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో పాటు పలువురు హీరో, హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు పొందిన నటులు తమ ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. థ్యాంక్యూ భారతీగారు.. థ్యాంక్స్ సాగరికాగారు.. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత అల్లు అరవింద్‌గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం అద్భుతమైన అనుభూతి. ఈ అవార్డు మీది, మారుతిగార్లదే. నా కెరీర్ బిగినింగ్ నుంచి నాపై మీరు ఎంతో నమ్మకం పెట్టారు. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో నాకోసం మంచి క్యారెక్టర్ రాసిన మారుతి సార్‌కి థ్యాంక్స్. ప్రేక్షకుల ఆదరణ వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే ‘వెంకీ మామ’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ బాబీ, నిర్మాత సురేశ్‌బాబులకు థ్యాంక్స్. ‘సాక్షి’ వారు నాకు ఈ అవార్డు ఇవ్వడం గౌరవంగా ఉంది. ‘సాక్షి’ చానల్ నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్యూ సో మచ్. – రాశీ ఖన్నా, మోస్ట్ పాపులర్ యాక్ట్రస్ (వెంకీ మామ, ప్రతిరోజూ పండగే) ‘జెర్సీ’ మూవీ నా ఒక్కడికే కాదు, మా ఎంటైర్ టీమ్‌కి కూడా చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాకు ఏ అవార్డు వచ్చినా అది మా మొత్తం టీమ్‌కి చెందుతుంది. మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. – గౌతమ్ తిన్ననూరి, క్రిటికల్లీ అక్లైమ్డ్ డైరెక్టర్ (జెర్సీ) యాభై వేలకు పైగా పాటలు పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. ఈ బరువు (బాలు తరఫున అవార్డు అందుకున్నారు) నేను మాత్రమే మోయలేను. మీరు కూడా వచ్చి సాయం పట్టండి.. తమన్ నువ్వు కూడా రా.. థ్యాంక్యూ. – మణిశర్మ (మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ (ఇస్మార్ట్ శంకర్)గా కూడా మణిశర్మ అవార్డు అందుకున్నారు). ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు అందుకుంటుంటే సాయిమాధవ్ చేతులు వణుకుతున్నాయి.. ఇస్తుంటే నాకు కూడా వణుకుతున్నాయి. ఎందుకంటే శాస్త్రిగారి బరువు మోయటం అంత సులువు కాదు. కొన్ని వేల పాటల్ని మనందరి జీవితాల్లోకి వదిలేసిన మహా వృక్షం అది. – త్రివిక్రమ్ ‘సిరివెన్నెల’గారి గొప్పదనం గురించి చెప్పాలంటే ప్రపంచంలోని భాషలన్నీ వాడేసినా ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. ఆయన అవార్డును ఆయన బదులుగా నేను తీసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. – సాయిమాధవ్ బుర్రా ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2020కి ఉత్తమ గీచ రచయితగా ఒక పాట కాకుండా మూడు పాటలకు (అల వైకుంఠపురములో, జాను, డిస్కోరాజా) ఎంపిక చేశారు. ‘డిస్కోరాజా’ చిత్రంలో నా పాటకి మా అన్నయ్య బాలూగారు పాడిన చివరి పాటల్లో ఒకటి కావడం కొంత విషాదాన్ని కలిగిస్తుంది.. కొంత ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. ఈ అవార్డు తీసుకోవడానికి ఆ రోజు నేను వేదికపైకి రాలేకపోయాను. నా తరఫున అవార్డు అందుకున్న బుర్రా సాయిమాధవ్ అత్యద్భుతమైన ప్రతిభ కలిగిన రచయిత, నా ఆత్మీయ సోదరుడు. పాటల గురించి, మూవీ గురించి సంక్షిప్తంగా నాలుగు మంచి మాటలు చెప్పిన ప్రఖ్యాత దర్శకులు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి థ్యాంక్స్. – పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్–‘సామజ వరగమన’ (అల వైకుంఠపురములో)..., ‘లైఫ్ ఆఫ్ రామ్...’ (జాను) ‘నువ్వు నాతో ఏమన్నావో...’ (డిస్కో రాజా). -
గురు వెన్నెల
-
సాక్షితో సిరివెన్నెల చివరి ఇంటర్వ్యూ: ‘ఆ సమయంలో క్రిష్ మీద అలిగాను’
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సిరివెన్నల సీతారామశాస్త్రి, క్రిష్‌లను సాక్షి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.. ఆ వివరాలు.. క్రిష్: ‘వీడు పెద్ద దర్శకుడు కాబోతున్నాడు’ అని నా మొదటి సినిమా రిలీజ్ కాకముందే సిరివెన్నెలగారు చెప్పినప్పుడు అందరూ అతిశయోక్తి అనుకున్నారు. నేను ఎవరో తెలియనప్పుడు, నేను ‘గమ్యం’ కథ రాసుకుని వెళ్లినప్పుడు ఆయన విని, కొన్ని సలహాలు ఇచ్చారు.. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆయనతో పని చేసిన ప్రతిరోజూ ఓ అందమైన జ్ఞాపకం. సిరివెన్నెల: ఒక్క ముక్కలో చెప్పాలంటే అది అతని (క్రిష్) సంస్కారం. రెండో ముక్కలో చెప్పాలంటే మన సంప్రదాయంలో గురు శిష్యుల బంధం గురించి శాంతి మంత్రం ఉంది. గురుశిష్యుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. నా సిద్ధాంతం ప్రకారం శిష్యుణ్ణి గురువు తయారు చేయడు.. గురువును శిష్యుడు తయారు చేస్తాడు. వయసును బట్టి పుత్ర వాత్సల్యం ఉంటుంది.. బాధ్యతను బట్టి గురుపీఠం ఉంటుంది. తల్లీతండ్రి, ఉపాధ్యాయులతో ఉండే అనుబంధం రుణబంధం. దాన్ని గుర్తుంచుకోవడం శిష్యుడి సంస్కారం. అలాంటి ప్రతి శిష్యుడు గురువు అవుతాడు. సిరివెన్నెల: క్రిష్ నా వద్దకు వచ్చి ‘గమ్యం’ కథ చెప్పినప్పుడు ‘ఈ సినిమాకి పాటలు రాసేంత అవకాశం.. వ్యవదానం నాకు కనిపించడం లేదబ్బాయ్’ అన్నాను. ‘ప్రవచనాలకు సినిమా అనేది వేదిక కాదు.. నా అభిప్రాయాన్ని నువ్వు అంగీకరిస్తే నేను ఓ విషయం చెబుతాను అన్నాను. తను చెప్పమనగానే.. ఇంత లోతైనటువంటి ప్రవచనాన్ని ప్రేక్షకులు తీసుకోలేరు.. ఒక వినోదంతో కలిగిన సందేశం ఉంటే బాగుంటుంది.. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటున్నావు.. మిత్ర సమేతం కూడా ఉంటే బాగుంటుంది. లాజిక్కులు అడక్కు.. నువ్వు చేస్తే చెయ్.. లేకుంటే లేదు’ అన్నాను. ‘మీరు ఒక్కరు కన్విన్స్ అయితే చాలు.. అందుకు నేను ఏం చేయాలో చెప్పండి’ అన్నారు క్రిష్. నా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పుమన్నాను.. నేను పూర్తిగా కన్విన్స్ అవడానికి చాలా సమయం పడుతుంది.. అప్పటి వరకూ నువ్వు సినిమా వాయిదా వేయాలన్నాను. వేరే ఎవరైనా అయితే ఒప్పుకునేవారు కాదు. కానీ తను ఎనిమిది నెలలు నా కోసం సినిమా వాయిదా వేశాడు. క్రిష్: ‘కృష్ణం వందే జగద్గురమ్’ సినిమాలో గురువుగారు ఓ 14 నిమిషాల పాట రాశారు. ఇప్పుడైతే ఒప్పుకునేవాడినేమో! అప్పుడు నాకు దర్శకుడిగా తెలుగులో మూడో సినిమాయే. ఏదో అపనమ్మకం. నేను సినిమాగా చూస్తూ ఎడిటింగ్ గురించి ఆలోచిస్తున్నాను. గురువుగారేమో పాటగా చూస్తున్నారు. ఓ రెండు మూడు చరణాలు నేను వాడలేదు. అప్పుడు నేను గురువుగారి మాట వినలేదు. అందుకు ఆయన అలిగారు. సిరివెన్నెల: సినిమా అనేది మహాద్భుతమైన వేదిక అని తెలుసుకుని, దానిని వాడుకుంటున్నవారు చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి తక్కువవారిలో క్రిష్ ఒకరు. ఇప్పటివరకు దర్శకులు కె. విశ్వనాథ్‌గారికి, క్రిష్‌కు, మరికొంతమందికి (పేర్లు చెప్పకూడదు) రెండో వెర్షన్ ఇవ్వలేదు... ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అంటే వారి ఒప్పుదల, నా శ్రమ ఎక్కడైతే ఏకీభవిస్తాయో అక్కడ ఓకే అన్నమాట. క్రిష్: ‘సిరివెన్నెల’గారు నాకు మొదట గురువుగారే. ఆ తర్వాత తండ్రి అయ్యారు. సిరివెన్నెల: సినిమా నన్ను ఎంటర్టైన్ చేయాలి.. అదే సమయంలో నన్ను నిద్రపుచ్చకుండా కూడా చూడాలి. అలాంటి సినిమాలను తీసే పని క్రిష్ చేస్తాడు. క్రిష్ కథల్లో కొందరు కమర్షియాలిటీ లేదంటుంటారు. ఎక్కువమంది ఒప్పుకుంటే అది కమర్షియాలిటీ అవుతుంది. రామాయణ, మహాభారతాలను మించిన కమర్షియాలిటీ కథలు ఇంకేమీ ఉండవు. క్రిష్: ‘కంచె’ అప్పుడు చాలామంది అభ్యంతరం తెలుపుతూ మాట్లాడారు. రెండో ప్రపంచయుద్ధం కాలం నాటి కథను ఎవరు చూస్తారు? అసలు హిట్లర్‌కు మనకూ సంబంధం ఏంటీ? అన్నది వారి అభిప్రాయం. కానీ మన తెలుగు సైనికులు గ్రామాల నుంచి వేల సంఖ్యలో యుద్ధాలకు వెళ్లిన కథలను ఎవరూ చెప్పలేదు. ‘వేదం’ సినిమాలో రాముల కథ కావొచ్చు.. సరోజ కథ కావొచ్చు. నాదైన శైలి కథలను ప్రేక్షకులకు చూపిస్తూ సంతృప్తి చెందుతాను. సిరివెన్నెల: మనిషి అనే మూడు అక్షరాల పదాన్ని పట్టుకుని నిరంతరం పాకులాడటం అనేది మా ఇద్దరికీ ఉన్న కామన్ పాయింట్. ఒక మనిషిని 360 కోణాల్లో ఏ విధంగానైనా చూడొచ్చు. అలా క్రిష్ ఏ కథ చెప్పినా మనిషి గురించే చెప్పాడు. ఆ విధంగా క్రిష్ వివిధ విధాలుగా ఒకటే సినిమా తీశాడు. నేనూ ఒకటే పాట రాశాను. కాకపోతే వివిధ రకాలుగా... మనిషి గురించి. ఒక సినిమా చూస్తూ వందమంది చప్పట్లు కొడతారు. ఒక్క మనిషి చప్పట్లు కొట్టకుండా ఉంటాడు. చప్పట్లు కొట్టడం కూడా మరిచిపోయేంతలా సినిమాలో లీనం అయితే అది సార్థకి. అలాంటివాడు ఒక్కడైనా చాలు.. అయితే ఆశయంతో.. కాదు పొగరుబోతుతనంతో పని చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా నాకు ఇష్టమే. ‘గమ్యం’ సినిమా ట్రెండ్ సెట్టర్. కానీ ‘కంచె’ ఓ అద్భుతం... మాస్టర్‌పీస్. మా ఇద్దరికీ ప్రపంచమే గురువు. క్రిష్: జీవితంలో మనం పరిపక్వత చెందుతూ ఉంటాం. అలాంటి జీవితంలో ఇలాంటి ఓ గురువు చేయి పట్టుకుని ఉంటే... జీవితం నేర్పించబోయే క్లిష్టతరమైన పాఠాలకు సంసిద్ధులుగా ఉంటాం. -
సిరివెన్నెలను ఎక్కువగా శ్రమ పెట్టిన పాట ఏంటి..?
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ట్విటర్లో చేరి ఏడాది పూర్తయిన సందర్భంగా 2021, జూన్‌లో నెటిజనులతో ముచ్చటించారు. ఆ వివరాలు.. ‘సిరివెన్నెలను అడగండి’ అంటూ దాదాపు గంటసేపు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు–సమాధానాలు ఈ విధంగా.. ► అప్పట్లో ఉన్న పాటలు, సినిమాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ప్రతీ కాలంలోనూ పాటలు, సినిమాలు అన్నీ అన్ని రకాలుగానూ ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. భిన్నంగా ఉన్నదాన్ని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలను ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవి చూద్దాం. ► త్రివిక్రమ్‌గారు మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అని సంబోధించడానికి కారణం? మనకు ఇష్టమైన విషయాన్ని, మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పని చేస్తాను. కాబట్టి దానిని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు. ► ‘లైఫ్ ఆఫ్ రామ్..’ పాట ఒక అద్భుతం. ఆ పాటలోని మీకు నచ్చిన ఒక లైన్ గురించి... ‘ఇలాగే కడదాకా ఒక ప్రశ్నై ఉండాలనుకుంటున్నా ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్ని అడుగుతు ఉన్నా’. అది నా ఆలోచనా ప్రపంచానికి కేంద్రబిందువు. ► మీరు రాసిన పాటల్లో మిమ్మల్ని అత్యధికంగా శ్రమ పెట్టిన పాట? పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటు లేదు ► దైవాన్ని నిర్వచించాలంటే? తనను తాను నిర్వచించుకోగలగాలి. ► మీకు బాగా నచ్చిన పుస్తకం? ‘భగవద్గీత’, ఖలీల్ జిబ్రాన్ రాసిన ‘ద ప్రాఫెట్’. ► వేటూరి సుందరరామ్మూర్తిగారికి మీరు రాసిన పాటల్లో ఏ పాట ఇష్టం? చాలా ఉన్నాయని వాళ్ళూ వీళ్ళూ అన్నారు. ‘నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే’ అన్న పాటను ఆయన అత్యంత ఆత్మీయంగా విశ్లేషించి మెచ్చుకున్నారని బాలు అన్నయ్య నాకు చెప్పారు. ► మీరు మెలకువగా ఉన్న సమయంలో ఎక్కువగా ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే ఎక్కువగా ఐపాడ్‌తో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాను. ► ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకమా? మనని జీవితం అనే ప్రశ్న వెంటాడి వేధించకపోతే, ఊరికే తెలివితేటలతో మాటాడాల్సి వస్తే, ఆ వాచాలతలో బూటకమే! ► తెలుగులో ట్వీట్ చేసినవారికే బదులు ఇస్తున్నారు? తెలుగులోనే నన్ను నేను స్పష్టంగా వ్యక్తపరుచుకోగలను అన్న కారణం వల్ల. అలానే టింగ్లీషు నాకు సరిగా రాదు. ► ఏకాగ్రతకు మీ నిర్వచనం? నేను తప్ప ఇంకేం కనిపించకపోవడం, నేను తప్ప ఇంకేం అనిపించకపోవడం. ► ఒక రచయితకి ఉండాల్సిన మొదటి లక్షణం? తానేం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తనకి స్పష్టంగా తెలియడం. ► మళ్ళీ తెలుగు సాహిత్యపు స్వర్ణయుగాన్ని చూసేదెప్పుడు? రాను రాను పద ప్రయోగాలు తగ్గిపోతూ వచ్చి ఇంగ్లీష్ లేదా యాస పాటలు వచ్చేశాయి. మీ ప్రయోగాలను, అద్భుత కావ్యాలను ఎప్పుడు చూడగలం? సాహిత్యానికి ముందు తెలుగు అనో, మరోటనో చేర్చకూడదు. భాషతో సంబంధం లేనిది భావం. భావాలనేవి అన్ని విధాలుగానూ ఉంటాయి. ధాన్యం పొట్టుతో పాటే ఉంటుంది. దూగర దులిపి, గింజను ఏరుకోవడం ఎప్పుడూ జరగాల్సిన పనే. ఎప్పుడూ మనకు కావాల్సింది ఉంటుంది. మనం చేయాల్సింది ఏరుకోవడమే. ► దేవులపల్లిగారి సాహిత్యంలో మీకు బాగా నచ్చిన కవిత? ‘మ్రోయించకోయి మురళీ, మ్రోయించకోయి కృష్ణా... తియ్య తేనియ బరువు మోయలేదీ బరువు’ – వివరణ అనేది దాహం తీర్చుకునేవారి పాత్రతను బట్టి, పాత్రను బట్టి ఉంటుంది. ► ‘సామజ వర గమనా’ అన్న సమాసం వింటే త్యాగరాజస్వామి గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు అందమైన యువతి ఊరువులు, వాటిని మోహించే యువకుడు మదిలో మెదులుతున్నారు. తప్పంతా సామాజికుడిదేనంటారా? దృశ్యంలో లేదు. చూసే కన్ను వెనకాల ఉన్న సంస్కారంలో ఉంది. ► మీరు హేతువాది అయినప్పటికీ దేవుడు ఉన్నాడని మీరు ఎలా నమ్ముతారు? నేనున్నాను గనుక. ► రచయితలు – సాంఘికీకరణపై మీ అభిప్రాయం? ‘సరిగా చూస్తున్నదా నీ మది.. గదిలో నువ్వే కదా ఉన్నది..’ చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది no man is island.. ► లిరిక్స్ రాయడానికి మీకు ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందా? నా బుర్రలో అలజడి. ► ‘యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం?’ అన్నారు. నిజమా? తప్పే! మృగాలను అవమానించకూడదు. ► పాటలో నిరాశానిస్పృహలను వ్యక్తపరిచే సందర్భంలో కూడా, ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌ను దాటి ఓ ఆశావాద కోణం కూడా ఇనుమడింపజేస్తూ వచ్చారు. ఆ తూకం పాటించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? ‘కాలం గాయాన్ని మాన్పుతుంది’ అన్న సత్యాన్ని గుర్తిస్తే ఏడుపైనా, నవ్వైనా, మరేదైనా మనం చెయ్యాలనుకున్నంత సేపు చెయ్యలేం. ఇది ముందే తెలుసుకుంటే, భావాల ఉద్ధృతిని మోతాదు మించనివ్వం. ‘‘నిన్న రాత్రి పీడకలను నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా? ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా?’’ ► తెలుగు భాష మీద పట్టు లేని కొంతమంది గాయకులు మీ కలం నుండి జారిన అద్భుతమైన పాటలను ఖూనీ చేసినట్టు గానీ, సంగీత దర్శకులు ఆ విషయాన్ని విస్మరించినట్టు గానీ మీకెప్పుడైనా అనిపించిందా ? బియ్యంలో రాళ్ళు ఏరుకుని వండుకుంటాం. అన్నంలో తగిలిన రాళ్ళను పక్కన పెట్టి తింటాం. ‘చూపులను అలా తొక్కుకు వెళ్ళకు...’ అని మీకూ తెలుసు... ఎవరినో ఎందుకు నిందించడం! ► మీరు ‘గాయం’లో పాడిన ‘నిగ్గదీసి అడుగు’ పాట నాకు చాలా ఇష్టం. ఇలాంటి పాటలను మళ్ళీ రాయాలని మీకు ఎందుకు అనిపించలేదు? అలాంటి భావాలున్న మిగిలిన పాటలను మీరెందుకు పరిశీలించరు? జిరాక్స్ కాపీని ఎందుకు అడుగుతున్నారు. ► ‘సిరివెన్నెలగారు’ పాటల రచయిత కాకపోయి ఉంటే? జరగాల్సిందే జరిగింది. జరగాల్సిందే జరుగుతుంది. -
అందుకే ‘లక్ష్మీ’ అని పిలుస్తా : రాజా
తండ్రి ‘సిరివెన్నెల’ స్టార్ రైటర్. తనయుడు రాజా మంచి నటుడు. ఇటీవలే వెంకటలక్ష్మీ హిమబిందుతో ఏడడుగులు నడిచారు రాజా. దీపావళి సందర్భంగా సతీసమేతంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు. ► పెళ్లికాకముందు తనను అందరూ బిందు అని పిలిచేవారట. నాకు ఆ విషయం తెలియక లక్ష్మీ అని పిలుస్తుంటే ఎవర్నో పిలుస్తున్నట్లు వెళ్లిపోయేది. అప్పుడు నేను ‘నీ పేరు లక్ష్మీ హిమబిందు కదా, అందుకే లక్ష్మీ’ అని పిలుస్తాను అన్నాను. మా ఇంట్లో అందరూ లక్ష్మీ అనే పిలవటంతో ఇప్పుడు అలవాటు అయ్యింది. ► లక్ష్మీలో నాకు బాగా నచ్చింది ఆమె కలుపుగోలుతనం అని రాజా అంటే , ‘ఏ చిన్న పని చేసినా క్రిస్టల్ క్లియర్‌గా చేస్తారు. అలాగే ఆయన క్రమశిక్షణ చాలా నచ్చుతుంది’ అని లక్ష్మీ అన్నారు. ► మా అమ్మగారికి కోడల్ని తెద్దామనుకుంటే, అత్తగారికి కూతురయ్యింది. మమ్మల్ని ఎవరు చూసినా కొత్తగా పెళ్లయినవాళ్లలా లేరు అంటున్నారు. అలాగే మా బావ త్రివిక్రమ్‌గారు ‘ఎన్నో ఏళ్లుగా ఒకరికొకరు తెలిసినవాళ్లులా ఉన్నారు మీ ఇద్దరూ’ అన్నారు. మా ఫ్యామిలీ అందరికీ లక్ష్మి నచ్చేసింది. అది అన్నిటికన్నా ఆనందం. త్రివిక్రమ్‌గారు తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్సైక్లోపీడియా. అందుకే నేను ఏదైనా విషయంలో డైలమాలో ఉంటే బావ సలహా తీసుకుంటాను. ప్రస్తుతం ఉన్న టాప్‌టెన్ డైరెక్టర్స్‌తో పని చేయటంతో పాటు కొత్తగా ఏదైనా చేసి నటునిగా నిరూపించుకోవాలనుకుంటున్నా. ► డబ్బు కోసం నేను నటునిగా ప్రయాణం మొదలుపెట్టలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా బాగానే సంపాదించేవాణ్ని. కానీ, అక్కడ తృప్తిగా అనిపించకపోవటంతో జాబ్ క్విట్ చేశాను. ► నాన్న ఏ సినిమాకైనా పాట రాస్తున్నప్పుడు ఒక వెర్షన్ రాసి దర్శకునికి వినిపిస్తే, చాలా బావుంది పాట ఇచ్చేయండి అంటారు. అప్పుడు నాన్నగారు ‘మీకు నచ్చింది కానీ నాకు కావాల్సింది ఇంకా ఏదో మిస్సయింది. అది రాగానే ఇస్తాను’ అంటారు. నేను వ్యక్తిగతంగా నాన్న దగ్గర నుండి కమిట్మెంట్, వృత్తిపట్ల ప్యాషన్ నేర్చుకుంటే అమ్మదగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను. ► నాకు యాక్టింగ్ తర్వాత ఫిట్నెస్ ఎంతో ఇష్టం. నాకిష్టమైన పనే చేస్తాను కాబట్టి ఎప్పుడూ సెలక్టివ్ గా ఉంటాను. నేను ఫిట్నెస్ ఫ్రీక్ కాబట్టి ఇలా ఉండాలి, అలా తినాలి అని చెప్తాను. వాటివల్ల ఇంట్లో డిబేట్లు, గొడవలు అన్నీ జరుగుతాయి. ► మా నాన్న లక్ష్మీని వంకాయకూర చేయటం వచ్చా అని అడిగితే వచ్చు అని చెప్పింది. వండటం కాదు, మా అమ్మ వండినట్లు వండాలి అని తనను ఆట పట్టిస్తుంటాను -
కల్యాణం... కమనీయం
సుప్రసిద్ధ గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రెండో కుమారుడు, నటుడు రాజా (రాజా భవానీ శంకర శర్మ) వివాహం వెంకట లక్ష్మీ హిమబిందుతో ఘనంగా జరిగింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు దర్శకులు కృష్ణవంశీ, త్రివిక్రమ్, క్రిష్, వంశీ పైడపల్లి, నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, గుణ్ణం గంగరాజు, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, పద్మావతి, రాజా -
ఘనంగా సిరివెన్నెల కుమారుడి వివాహం
-
ఘనంగా సిరివెన్నెల కుమారుడి వివాహం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా (రాజా భవాని శంకర శర్మ) వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని హోటల్ దస్పల్లలో ఆదివారం ఉదయం వధువు వెంకటలక్ష్మి హిమబిందు మెడలో రాజా మూడు ముళ్లు వేశారు. ఈ వివాహ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా నటుడు రాజా కేరెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఎవడు, ఫిదా, రణరంగం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్, అంతరిక్షం, మిస్టర్ మజ్ను, ’ చిత్రాలతో అతడికి మంచి పేరు తెచ్చాయి.ఇక ఫిదా సినిమాలో వరుణ్ తేజ్‌కు అన్నయ్యగా మంచి నటన కనబరిచాడు. అలాగే మస్తీ, భానుమతి వర్సెస్ రామకృష్ణ వెబ్ సిరీస్‌లో రాజా నటించారు. తల్లిదండ్రులతో రాజా చెంబోలు -
ఎన్నోసార్లు బాలూగారి నుంచి తిట్లు కూడా తిన్నా..
బ్రహ్మరథం! పట్టడానికి వచ్చేది ఎప్పుడూ. పట్టుకుపోవడానికి వచ్చింది! పాటని. ఏమయ్యా దేవుడూ.. ఇటు చూడు. పూమాల తెచ్చావ్!! పాడింది చాలనా? పాడించుకున్నది చాలనా? వినాలని ఉంటే వినిపోవాలి గానీ.. వినడానికి తీసుకుపోవటం ఏంటి? నీ చేతుల్లో ఉందనేగా! కోనేట్లో రాలి పడితే అది నీ పాటే. వాకిట్లోకి వాలి ఉంటే అది మా పాట. తెలియకుండా ఉందా నీకు? ‘కోరినవారు.. దేవుడు’ అని రేడియో వాళ్లకు రాసినా వినిపించేవారే.. ఆ మాత్రం ఐడియా రాకపోయిందా! పాట కోసం రథమే వేసుకొచ్చావ్! కోయిల నాది కాబట్టి రాగాలూ నావేనని లాగేసుకుంటే.. నిన్నెలా కొలవాలి స్వామీ? మా అన్నయ్య వెళ్లిపోయాడు. మాటల్ని తీసుకుని వెళ్లిపోయాడు. భారతజాతి సంస్కృతిలో విడదీయలేని ఒక ముఖ్యమైన భాగం బాలూగారు. ముఖ్యంగా దక్షిణాదిలో బాలూగారంటే ఊపిరి. ఆయనలేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది అంటూ చాలా మంది మామూలు మాటలు మాట్లాడుతుంటారు. నాకు వేరే దుఃఖం, వేరే ఉక్రోశం ఉన్నాయి. ఇది కాలధర్మం కాదు. అకాల సూర్యాస్తమయం. చాలా మంది గాయకులు వస్తారు.. పోతారు. నిజానికి కొందరు వస్తారు.. కానీ వెళ్లరు. వాళ్లు వెళ్లారనుకుంటున్న రోజున కాలం కొత్తగా పుడుతుంది. ఈరోజు (శుక్రవారం) ఒంటిగంటకి తెలుగు వారి ఇళ్లల్లో కాలం బాలూగారి పేరుతో మళ్లీ పుట్టింది. సినిమా పాటను పూజించాల్సినటువంటి భావన సమాజానికి లేదు. అలాంటి సినిమా పాటకి అద్భుతమైన స్థాయి తీసుకొచ్చిన గాయకుల్లో బాలూగారు ఒకరు. తెలుగు సినిమా పాటకి ప్రాతినిధ్యం బాలూగారు. పాట పట్ల ఆయన చేసిన పూజ గురించి, శ్రద్ధ గురించి అందరూ ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రతి ఇంటిలోనూ బాలూగారు ఒక ముఖ్యమైన సభ్యుడు. ఆయన గొంతు విననటువంటి రోజు తెలుగువారు ఎరుగుదురా? సినిమా పాటలకు గొంతు అరువు ఇచ్చినటువంటి కళాకారుడు మాత్రమే కాదు.. 20 ఏళ్లుగా ఒక విస్మరించలేనటువంటి, మృతి లేని ఒక కటుంబ సభ్యుడు. సినిమా మాటల్లో సాహిత్యానికి సముచిత స్థానం ఇవ్వడానికి సంకోచించే పరిస్థితులు చాలా కాలం ఉండేవి. నాకు తెలిసి భారతదేశంలో పాటలోని మాట పట్ల ప్రత్యేకించి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒక్క బాలూగారు తప్ప. ఇవాళ ఆయనలాంటి పెద్ద దిక్కు లేదు. ఆయన లోటు తీర్చలేనిది అంటారు. ఏంటి ఆ లోటు? 40వేల మంది బాలూగార్లను ఆయన నిర్మించి వెళ్లారు. గాలి ఉన్నంత కాలం, కాలం ఉన్నంత కాలం, తెలుగు సినిమా, భారతదేశంలో సినిమా ఉన్నంత కాలం బాలూగారు ఉంటారు. 74ఏళ్లకే ఆయన వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. సినిమా పాటలు రాసే ఒక వ్యక్తిగా నాకు పునర్జన్మ ఇచ్చిన కె. విశ్వనాథ్‌గారిని నాన్నగారు అని పిలుస్తాను. విశ్వనాథ్‌గారిని నేను కలిసిన తొలి రోజు.. ఆయన బాలూగారిని పిలిచారు. నేను ‘గంగావతారం’ అనే పాట పాడి వినిపించినప్పుడు బాలూగారు కుర్చీలోంచి లేచి ‘మీరు ఎన్నో వందల పాటలు రాయాలి, అవి నేను పాడాలని అనుకుంటున్నాను’ అన్నారు. అది సాక్షాత్తూ సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ఆశీస్సులాగా అనిపించింది. ఎన్నోసార్లు బాలూగారి నుంచి తిట్లు కూడా తిన్నా. ఈ పాట ఇలా ఉండాలని ఇప్పుడు నాకు చెప్పేవారెవరు? నా పాట పాడేవారెవరు? ఆయన మూగబోవడం ఏంటి? కాలానుగుణంగా అందరూ వెళ్లాల్సిందే. అయితే బాలూగారు వెళ్లే సమయం ఇది కాదు? ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనే విషయం పక్కనపెడితే.. ఎన్నో ఇళ్లల్లో పాటల దీపాలను వెలిగించారాయన. ఆయన గంధర్వలోకంలో పాటలు నేర్పడానికి వెళ్లి మనకి దుఃఖం మిగిల్చారు. ఈరోజు నుంచి కాలం బాలూగారి పేరుతో వెళుతుంది. – సిరివెన్నెల సీతారామశాస్త్రి, రచయిత భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు. బాలు నా సోదరుడే కాదు, నా ఆరో ప్రాణం. ఇలాంటి దుర్వార్తను ఇంత తొందరగా వింటాననుకోలేదు. మాట్లాడటానికి మాటలు రావడంలేదు. వాడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులందరూ ఈ భాదను ఓర్చుకోవాలని కోరుకుంటున్నాను. – కె. విశ్వనాథ్, దర్శకుడు బాలూ.. నువ్వు త్వరగా తిరిగి రా అని చెప్పాను. నిన్ను చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పాను. కానీ నువ్వు వినలేదు. వినకుండా వెళ్లిపోయావు. ఎక్కడికి వెళ్లిపోయావు? గంధర్వుల కోసం పాటలు పాడటానికి వెళ్లావా? ప్రపంచం శూన్యం అయిపోయింది. ప్రస్తుతం నాకేమీ అర్థం కావడం లేదు. మాట్లాడానికి మాటలు రావడంలేదు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎలాంటి బాధకైనా ఓ హద్దు ఉంటుంది. కానీ ఈ బాధకు హద్దు లేదు. – ఇళయరాజా, సంగీత దర్శకుడు ఈరోజు దుర్దినం. ఎస్పీ బాలూగారు చివరి నిమిషం వరకూ ప్రాణం కోసం పోరాడారు. ఆయన దూరం కావడం చాలా బాధాకరం. భారతదేశంలో ఎస్పీబీ పాటకు, ఆయన స్వరానికి అభిమానులు లేకుండా ఉండరు. వ్యక్తిగా కూడా ఆయన్ను అందరూ అభిమానిస్తారు. కారణం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ సమానంగా గౌరవించారు.. ప్రేమను పంచారు. భారత చిత్రసీమ మహమ్మద్ రఫీ, కిశోర్ కుమార్, ఘంటసాల, టీఎమ్ సౌందరరాజన్ వంటి పెద్ద గాయకులను అందించింది. అయితే వాళ్లు కొన్ని భాషలకే పరిమితమైతే బాలూగారు పలు భాషల్లో పాడారు. గంభీరమైన, మృదువైన ఆయన గొంతు మరో నూరేళ్లయినా మన చెవుల్లో వినపడుతూనే ఉంటుంది. అయితే ఆ గొంతుకి సొంతదారుడు మన మధ్య ఇక ఉండరనేది బాధాకరం. – రజనీకాంత్, నటుడు బాలు మనతో లేకపోయినా ఆయన పాడిన అద్భుతమైన పాటలతో మనతో కలిసే ఉంటారు. బాలు గాయకునిగా ఎదుగుతున్న తరుణంలో నేను హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలోని అన్ని పాటలను బాలూతో పాడించాను. ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. సింగర్‌గా బాలూని బిజీ చేసింది. వ్యక్తిగతంగా కూడా మేం ఎంతో ఆత్మీయులం. అలాంటి బాలు హఠాత్తుగా దూరం కావటం ఎంతో బాధగా ఉంది. – కృష్ణ, నటుడు బాలూగారితో దశాబ్దాల అనుబంధం గుర్తుకు వస్తుంటే కన్నీరు ఆగడంలేదు. గొప్ప స్నేహితుడిని కోల్పోయాను. ఈ భూమి మీద పాట ఉన్నంతవరకు బాలు బతికే ఉంటారు. చలనచిత్ర పరిశ్రమలో ఆయనలాంటి గాయకుడు మరొకరు పుట్టరు. – కృష్ణంరాజు, నటుడు నేను, బాలు కలిసి కొన్నాళ్లు శ్రీకాళహస్తిలో చదువుకున్నాం. శ్రీకాళహస్తిలో మొదలైన మా స్నేహం సినీ పరిశ్రమకు వచ్చాక చైన్నైలోనూ కొనసాగింది. అన్ని దేవుళ్ల పాటలను పాడి ఆ దేవుళ్లందరినీ మెప్పించిన గాన గంధర్వుడు. మా శ్రీ విద్యానికేతన్‌లో ఏ కార్యక్రమం జరిగినా బాలు రావాల్సిందే. గత మార్చి 19 నా పుట్టినరోజున శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవానికి ఆయన హాజరు కావాల్సింది. కరోనా వల్ల ఆ కార్యక్రమం కేన్సిల్ కావడంతో రాలేకపోయారు. ఈ మధ్య కూడా ఫోన్లో ఇద్దరం మాట్లాడుకున్నాం. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలనిపిస్తోంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే కాలంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం దగ్గర వంద రూపాయలు తీసుకున్నాను. మేం కలుసుకున్నప్పుడల్లా ‘వడ్డీతో కలిపి ఇప్పుడది ఎంతవుతుందో తెలుసా! వడ్డీతో సహా నా డబ్బులు నాకు ఇచ్చేయ్’ అని ఆటపట్టించేవారు. నా సినిమాల్లో ఆణిముత్యాల్లాంటి పాటలను పాడారాయన. నా చెవుల్లో ఆయన పాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. నా హృదయంలో ఎప్పుడూ ఉంటారాయన. – మోహన్‌బాబు, నటుడు–నిర్మాత బాలూగారి విషయంలో ఏ మాట వినకూడదు అనుకున్నానో ఆ వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆయన్ను కోల్పోవటం దురదృష్టకరం. సంగీత ప్రపంచానికి ఇది దుర్దినం. ఘంటసాల గారి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసింది బాలూనే. మళ్లీ ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే బాలూనే పుట్టాలి. నేను అన్నయ్యా అని పిలుచుకునే నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను. నా కెరీర్ విజయంలో ఆయనకి సింహభాగం ఇవ్వాలి. ‘నువ్వు మంచి నటుడివి.. కమర్షియల్ చట్రంలో ఇరుక్కుని నీలోని నటుడిని దూరం చేయకు’ అని సలహాలిచ్చేవారు. ఆ సలహాల మేరకే నేను ‘ఆపద్భాంధవుడు’, ‘రుద్రవీణ’, ‘స్వయంకృషి’ చిత్రాల్లో నటించాను. ‘నా పాటలకి సరైన ఎక్స్ప్రెషన్ ఇచ్చే కొద్దిమంది నటుల్లో చిరంజీవి ఒకరు’ అనేవారు. తాను పాడిన పాటల ద్వారా ఎప్పటికీ మన గుండెల్లో ఉంటారు. – చిరంజీవి, నటుడు అతికొద్ది ప్రతిభావంతులకు మాత్రమే వాళ్ల ప్రతిభకు తగ్గ పురస్కారాలు, అభినందనలు, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అందులో అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం ఒకరు. ఆయన పాడిన పాటల్లో కొన్నింటిలో కనిపించే అదృష్టం నాకు లభించింది. కొన్ని భాషల్లో నాలుగు తరాల నటులకు ఆయన పాడారు. రాబోయే తరాలన్నీ ఆయన కీర్తిని కొనియాడతాయి. – కమల్ హాసన్, నటుడు పాటలు పాడటంలో బాలూగారికి ఆపారమైన ప్రతిభ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఆ విషయం పక్కనపెడితే ఆయన నేను దర్శకత్వం వహించిన ‘మిథునం’ సినిమాకి హీరో. ఆయన కోసం నేను వంట మనిషిని పెడితే ‘ఎందుకు.. వద్దు భరణి, నాకు బేరియాట్రిక్ సర్జరీ జరిగింది. తినలేను’ అన్నారు. 30 రోజులపాటు 24 గంటలు నాతోనే గడిపారు. నేను వేసే జోకులను తెగ ఎంజాయ్ చేసేవారు. ఆయన నాతో ఒక మాట అన్నారు. ‘ఎప్పుడైనా నీ జీవితచరిత్ర రాస్తే.. భరణి ‘మిథునానికి ముందు మిథునానికి తర్వాత’ అనేవాడు. బాలు స్థానం చలనచిత్ర రంగానికి సంబంధించినంత వరకు ఖాళీ.– తనికెళ్ల భరణి, నటుడు–దర్శకుడు స్వర ప్రపంచాన్ని శోకసంధ్రంగా చేసి 28వ నక్షత్రంగా నింగిలో వెలిగిపోతున్న శాశ్వత స్వరమంత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. – స్వర వీణాపాణి, సంగీత దర్శకుడు ఈ ఏడాది అనేక విషాద ఘటనలు జరుగుతున్నాయి. బాలూగారి వార్త వినగానే నాకు ఎంతో బాధ కలిగింది. ఆయన ఓ వెర్సటైల్ ఆర్టిస్ట్. లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌తో ఆయన చేసిన హిందీ పాటలు అద్భుతం. లతా మంగేష్కర్తో ఆయన పాడిన పాటలు అద్భుతం. నేను ఇళయరాజా సంగీతంలో పాడినప్పుడు నా తమిళ ఉచ్ఛారణ విషయంలో ఎంతో సహాయం చేసేవారు. ఆయన మరణం సంగీత ప్రపంచంలో ఓ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. – ఆశా భోంస్లే, గాయని. ప్రతిభాశాలి. మధురభాషి, యస్పీ బాలుగారి మరణవార్త విని ఎంతో దుఃఖం కలిగింది. బాలూగారితో కలసి ఎన్నో పాటలు పాడాను. షోస్ చేశాం. ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. – లతా మంగేష్కర్, గాయని గాన గంధర్వుడిగా గానానికి అర్థం చెప్పిన మహాగాయకుడు ఎస్పీ బాలూగారు. ఈరోజు మనందరినీ వదిలి అల్విదా చెప్పిన బాలూగారు మనతో లేరు అనేది బాధాకరం. చిన్నప్పుడు ఆయన స్ఫూర్తితో పరిశ్రమకి వచ్చిన నేను ఆయన్ను చూస్తూ పెరిగాను. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న బాలూగారు భౌతికంగా మనతో లేకపోయినా ఆయన పాటలెప్పుడూ మనతోనే ఉంటాయి. – జయప్రద, నటి–రాజకీయ నాయకురాలు -
'ఫిదా' నటుడి నిశ్చితార్థం
లాక్డౌన్ సమయాన్ని టాలీవుడ్ సెలబ్రిటీలు బీభత్సంగా వాడుకుంటున్నారు. ముందుగా నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకుని తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నిఖిల్, జబర్దస్త్ కమెడియన్, నటుడు మహేష్, హీరో నితిన్ పెళ్లిళ్లు జరిగాయి. ఈ నెలలో రానా తన ప్రేయసి మిహికా బజాజ్‌ను వివాహమడగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిశ్చితార్థం జరుపుకున్నారు. తాజాగా ఇప్పుడు మరో నటుడి ఇంట పెళ్లి సందడి ప్రారంభమైంది. ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్ర్రి తనయుడు, నటుడు రాజా చెంబోలు తన నిశ్చితార్థం జరిగినట్లు శనివారం సోషల్ మీడియాలో వెల్లడించారు. (వైభవంగా నిహారిక నిశ్చితార్థం) "ఫిదా" సినిమాలో వరుణ్ తేజ్‌కు అన్నయ్యకు నటించిన రాజా తన ఎంగేజ్మెంట్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఫొటోలను షేర్ చేస్తూ "ఇది 2020లోనే బెస్ట్ పార్ట్. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు" అని రాసుకొచ్చారు. కాబోయే భార్య పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా రాజా..'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'హ్యాపీ వెడ్డింగ్', 'అంతరిక్షం', 'మిస్టర్ మజ్ను', 'రణరంగం' వంటి పలు చిత్రాల్లో నటించారు. 'మస్తీ' అనే వెబ్‌సిరీస్‌లోనూ కనిపించారు. (స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే) View this post on Instagram The best part of 2020💍 Excited for my new journey! Thank you for all your love and support😊#engaged #rajachembolu A post shared by Raja Chembolu (@raja.chembolu) on Aug 15, 2020 at 8:48am PDT -
‘సామజవరగమన’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలోని ‘సామజవరగమన’ పాటను ఏ ముహూర్తాన తమన్ కంపోజిషన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించాడో తెలియదు గాని దశాబ్దపు మేటి పాటగా నిలిచింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆల్ టైమ్ రికార్డులతో సెన్సేషన్ సృష్టించింది ఈ పాట. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట సంగీత శ్రోతలను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ హిట్ సాంగ్ అన్ని వేడుకల్లో, కచేరీల్లో మారుమోగుతోంది. అంతేకాకుండా ‘సామజవరగమన’ తో పాటు దాదాపు అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ కావడం ‘అల.. వైకుంఠపురములో’ గ్రాండ్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. తాజాగా ఈ పాటకు సంబంధించిన మరో గుడ్ న్యూస్‌ను చిత్ర బృందం ప్రకటించింది. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవరగమన’ ఫుల్ వీడియో సాంగ్‌ను రేపు(ఆదివారం) సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఈ లిరికల్ సాంగ్‌ను వింటూ ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ రేపు విడుదలయ్యే వీడియో సాంగ్ దృశ్య రూపంలోనూ వారిని కనువిందు చేయనుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ(చినబాబు)లు సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటిని తిరగరాసింది. పూర్తి పాట మీకోసం పల్లవి: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా చరణం: మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పింఛమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నగ వశమా అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా చదవండి: సామజవరగమన పాట అలా పుట్టింది.. సామజవరగమన.. ఇది నీకు తగునా! ‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ -
సామజవరగమన పాట అలా పుట్టింది..
సిరివెన్నెల సీతారామశాస్త్రి: అలవైకుంఠపురములో చిత్రం కోసం ఈ పాటను గంట లోపుగానే పూర్తి చేసి ఇచ్చాను. ఏ పాటనైనా, ఏ అంశాన్నయినా సుకుమారంగా మాత్రమే రాయాలని మొదటి నుంచి నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. మూలాల్లోకి చూడగలగటం, ప్రతి చిన్న విషయాన్ని కొత్తగా ఆలోచించే లక్షణం మా నాన్నగారి పెంపకంలో వచ్చింది. ఎటువంటి పరిస్థితిలోనూ స్త్రీలోని బాహ్య సౌందర్యాన్ని కాకుండా దైవత్వం మాత్రమే చూడాలన్నదే నా లక్ష్యం. ఈ మధ్యకాలంలో నేను ఏ పాట రాసినా అలాగే భావన చేస్తున్నాను. ఈ పాటలోని సాహిత్యాన్ని కొంచెం లోతుగా చూస్తే, ఒక పాపాయిని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ‘మంజుల హాసం, మలెల్లమాసం, విరిసిన పింఛం, విరుల ప్రపంచం’ అన్ని పదాలూ సౌకుమార్యంతో నిండినవే. ముగ్ధత్వం నిండిన అమ్మాయిని, పువ్వుల పాపను చూస్తే ఎలాంటి భావన రావాలో, ఒక యవ్వనంలో ఉన్న యువతిని చూసినప్పుడు కూడా అదే భావన రావాలి. సౌందర్యాన్ని చూసే విధానంలో ఆబ ఉండకూడదు. అలా చూస్తే స్త్రీత్వాన్ని అవమానించినట్లు అవుతుంది. ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అన్నప్పుడు, పట్టీలు పెట్టుకున్న నా మనవరాలి వెనుక నేను పరుగెడుతున్నట్లు నాకు భావన కలుగుతుంది. అంతర్లీనంగా ఆ అర్థం కూడా వస్తుంది. యవ్వనంలో ఉండే అమ్మాయిలో ఉండే అమాయకత్వం ముగ్ధత్వం, పెద్దపెద్ద కళ్లతో లోకాన్ని చూస్తున్నప్పుడు వికృతమైన ఆలోచనలు రాకూడదని నా తలపు. ‘‘నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు/నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు’’ అంటే నా వల్లే నీలో జరుగుతున్న అజ అంటే చేష్టలు ఇవి. అవి నా వల్ల వస్తున్నాయి. నడుచుకుంటూ వెడుతున్నప్పుడు తొక్కేసినట్టుగా అనిపిస్తుంది. నీ కళ్ల ఎరుపు నీకు సంబంధించినది కాదు, ‘నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు/నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు’. ఆడవారు నుదుటి మీద పడిన ముంగురులను చాలా సుకుమారంగా, చేతితో వెనక్కు తీసుకుంటారు. అలా పైకి తీయటం, కళ్లు నులుముకోవటం, కులుకుతూ నడవటం.. ఇవన్నీ నా మీద ప్రభావం చూపిస్తాయి అంటాడు హీరో. స్త్రీ భావన పట్ల అంతర్లీనంగా ఉన్న ముగ్ధత్వం ఇందులో చూపాను. స్త్రీ గురించి వర్ణించేటప్పుడు, టీజింగ్‌గా కాకుండా, ప్లీజింగ్‌గా రాయాలి అనుకున్నాను. శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్లు పట్టుకున్నాడంటే, అందులో ఉన్న సుకుమార శృంగారాన్ని చూడాలే కాని, అందులోని కోపాన్ని చూడకూడదు. అలాంటిదే ఈ పాట కూడా. డ్యూయెట్ రాసేటప్పుడు స్త్రీ గురించి వర్ణించాల్సి వచ్చినప్పుడు ఆ లిమిటేషన్ పెట్టుకుంటాను.. కాముకత ఉట్టిపడేట్టు అస్సలు రాయను. తనకు సుపీరియర్‌గా పనిచేస్తున్న ఒక అమ్మాయిని చూసినప్పుడు మొదటిసారి భయం వేస్తుంది. ‘ఏంటలా చూస్తున్నారు అని బాస్ అడగగానే, మీ కాళ్లు బావున్నాయండీ అంటాడు. బాస్‌ని అయినా, భగవంతుడిని అయినా ముందుగా కాళ్లనే చూస్తాం. ఇలా కాళ్లను చూస్తున్న సిట్యుయేషన్లో నేనేం చెప్పగలనా అని ఆలోచించాను. అలా పుట్టింది ఈ పాట. నాకు పెద్దగా పుస్తక పాండిత్యం లేదు. నేను రాసే పాటలకు ఎవరూ ప్రేరణ కాకపోవటమే ప్రేరణ. ఎవరి రచనలనైనా చదివితే వాళ్ల ఆలోచనతోనే ఆలోచిస్తాం. ప్రబంధ కావ్యాలు చదివేసి ఉంటే, వసంతమాసం అనగానే అందరి కవుల ఆలోచనలు వచ్చేస్తాయి. నేను అందరూ చూసే సంవిధానం నుంచి విలక్షణంగా చూడటం అలవాటు చేసుకున్నాను. నా నిర్వచనాలలోనే ఉంది నా జీవితం. మనకు జన్మనిచ్చింది స్త్రీ. మనం మాట్లాడటానికి కారణభూతమైనది స్త్రీ. ఆవిడ పట్ల ఎంతో గౌరవం ఉండాలి. అంతర్లీనంగా ఉన్న దివ్య అంటే దైవ సంబంధమైన సౌందర్యాన్ని మాత్రమే చూడాలి. రాముడిలా బతకగలిగితే పురుషుడు కూడా సౌందర్యంగా ఉంటాడు. గుణాలు సౌందర్యంగా ఉండాలి. చిన్నపిల్లలు కాళ్లు ఆడిస్తున్నప్పుడు చూస్తే అక్కడే సౌందర్యం ఉంటుంది. చూపు ఎలా ఉండాలన్నదే నా పాటలకు ముఖ్యంగా పెట్టుకున్న లక్ష్యం. నేను చూసే దృక్కోణంలో పరిస్థితులను తీసుకునే సంవిధానం వేరే ఉంటుంది. అందం, సౌందర్యం అనేవి దైవత్వంలో ఒక లక్షణం. మనం చూసే దృష్టి మారితేనే చెడు ఆలోచనలు వస్తాయి. స్త్రీని పవిత్రంగా చూడాలి. సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ఆ కాలంలో ఏ దృష్టి కోణంలో ఎలా చూసేవారు. ఈ కాలంలో ఎలా చూస్తున్నారో పరిశీలించుకోవాలి. శరీరంలో తేడా లేదు. చూసే విధానంలోనే తేడా ఉంది. ‘‘స్త్రీలు ఇంకొకరి కంటి ఆకలికి ఆరాధనగా కనపడాలి, ఆహారంగా కనపడకూడదు. వారిలోని మానసిక సౌందర్యాన్ని చూడాలి’’ అనేదే నా భావన. అందుకే ఏ పాటనైనా లా రాయాలి అన్నది నాకు నేను నిర్దేశించుకున్నాను. పూర్తి పాట మీకోసం పల్లవి: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా చరణం: మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పింఛమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నగ వశమా అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా -
‘అప్పుడు మేం చాలా ఇబ్బందులు పడ్డాం’
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం అభినందనీయమని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. జిల్లాలోని అనపర్తి జీబీఆర్ కళాశాలలో గురువారం జరిగిన ఒ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము చదువుకునే సమయంలో ఉచిత ఆంగ్ల మాధ్యమాం లేక ఇబ్బందులు పడ్డామని, సీఎం జగన్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ అన్ని చోట్ల ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, మూడు రాజధానులే ముద్దని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారని అన్నారు. చిన్న చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధాని అవ్వాలని ఆనాడే పెద్దలు చెప్పారని పేర్కొన్నారు. అమ్మ తెలుగు భాష, నాన్న ఇంగ్లీష్ భాష అని అమ్మానాన్న కలయికే భాష అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ, మెట్రో ఎండీ ఎంవిఎస్ రెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే సూర్యానారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్యారిస్‌లో సామజవరగమన
‘అల.. వైకుంఠపురమలో..’ చిత్రంలోని ‘సామజవరగమన....’ పాట శ్రోతలను, సంగీతప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. తమన్ స్వరకర్త. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ ప్యారిస్‌లోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. ఈ పాట చిత్రీకరణ కోసం వారం రోజులు చిత్రబృందం ప్యారిస్‌లో ఉంటుంది. ఈ పాటతో చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మినహా షూటింగ్ పూర్తయినట్లేనట. ఈ నెలాఖరుకల్లా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారట. అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ‘అల.. వైకుంఠపురమలో..’ జనవరి 12న విడుదల కానుంది. -
పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా
పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా అడవి నీతి ఏం మారిందని ఎన్ని యుగాలయినా? ఏదో తెలియని గాయం సలిపినప్పుడు, రేగే ఆవేశం ఈ పాట. సమాజ జీవచ్ఛవాన్ని– శవాన్ని కాల్చేయాలి అగ్గిలో. కానీ కడగమంటున్నాడు కవి, మళ్లీ పునీతం అయ్యేట్టుగా. గాయం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన ఇది. సంగీతం శ్రీ. పాడినవారు బాలసుబ్రహ్మణ్యం. 1993లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. పాటలో రేవతితోపాటు సీతారామశాస్త్రి కూడా కనిపిస్తారు. నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి గొర్రెదాటు మందకి మీ జ్ఞానబోధ దేనికి యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం రామబాణ మార్పిందా రావణ కాష్ఠం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా వేట అదే వేటు అదే నాటి కథే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ -
మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీ బిజీ
‘నా పేరు సూర్య’ ఇచ్చిన షాక్‌తో దాదాపు ఏడాది పాటు ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పని స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలను ప్రకటించారు. ఏకంగా మూడు సినిమాలకు ఓకే చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మొదటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో.. కలిసి సినిమా చేయనున్న బన్నీ.. తరువాత సుకుమార్, వేణు శ్రీరామ్‌తో కలిసి పనిచేయనున్నాడు. త్రివిక్రమ్‌తో చేయబోయే మూవీ షూటింగ్ ఈ నెల 24నుంచి ప్రారంభం కానుంది. ఈలోపే మ్యూజిక్ సిట్టింగ్‌కు స్టార్ట్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్, సిరివెన్నెలతో కలిసి ఉన్న ఫోటోను థమన్ షేర్ చేశారు. ఈ చిత్రంలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటించనున్నారు. -
సిరివెన్నెలకు పద్మశ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: అక్షరాన్ని అందలమెక్కించిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. తన పాటతో, తూటాలాంటి మాటతో తెలుగు సినీ రచనా రంగానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చిన సిరివెన్నెలకు 2019 ఏడాదికిగానూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం రెండో విడత కార్యక్రమం శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో çజరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన సిరివెన్నెలను ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్ శనివారం సాయంత్రం ఘనంగా సన్మానించింది. రాష్ట్రపతికి తిమ్మక్క ఆశీస్సులు అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ‘వృక్షమాతె’గా కర్ణాటకలో అందరూ పిలుచుకునే 107 ఏళ్ల సాలుమరద తిమ్మక్క రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అనంతరం రామ్‌నాథ్ కోవింద్ నుదుటిపై చేయుంచి ఆశ్వీదించారు. అలా చేయడం ప్రొటోకాల్‌కు వ్యతిరేకం అయినప్పటికీ రాష్ట్రపతి కూడా తల్లివంటి ఆమె నుంచి ఆశీస్సులను వినమ్రంగా స్వీకరించారు. దీంతో ప్రధాని మోదీ మొదలుకొని దర్బార్ హాల్లో ఉన్న సభికులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అర్హుడిగా భావిస్తున్నా: రాష్ట్రపతి కోవింద్ అనంతరం ఈ ఘటనపై రాష్ట్రపతి ట్విట్టర్లో స్పందించారు. ‘పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తములైన, అర్హులైన వారిని గౌరవించడం రాష్ట్రపతికి దక్కే అరుదైన అవకాశం. కానీ, కర్ణాటకకు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి, పద్మ అవార్డు గ్రహీతల్లో అత్యంత వయోవృద్ధురాలైన సాలుమరద తిమ్మక్క ఈ రోజు నన్ను ఆశీర్వదించడం నన్ను కదిలించివేసింది. ఆమె ఆశీర్వాదానికి నేను అర్హుడిని. సాధారణ భారతీయులకు ముఖ్యంగా ధైర్యం, పట్టుదల, నిరంతరం శ్రమించే గుణాలున్న భారతీయ మహిళలకు తిమ్మక్క ప్రతినిధి. అవార్డు గ్రహీతల స్ఫూర్తితో దేశం మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంది’ అని కోవింద్ ట్వీట్‌చేశారు. దృఢసంకల్పానికి ప్రతీక కర్ణాటకలోని హుళికల్ గ్రామానికి చెందిన సాలుమరద తిమ్మక్క ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతీక. సంతానం కలగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తిమ్మక్క ఒక దశలో ఆత్మహత్యకు యత్నించారు. కానీ, భర్త బిక్కల చిక్కయ్య ఆమెకు ధైర్యం నూరిపోసి తోడుగా నిలిచారు. ఆపై ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మొక్కలను నాటి వాటినే బిడ్డలుగా భావించి సాకాలనుకున్నారు. రోజంతా పొలం పనులు చేసి, సాయంత్రం మొక్కలు నాటేవారు. అలా వారు మొదటి ఏడాది తమ గ్రామ పరిసరాల్లో 10 మొక్కలు నాటారు. ఏడాదికేడాది సంఖ్య పెంచారు. నాటిన మొక్కలను నాలుగైదు కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకువచ్చి మరీ బతికించారు. అలా వారు 65 ఏళ్లలో ఆ ప్రాంతంలో 400 మర్రి చెట్లు సహా 8000 చెట్లను పెంచారు. చిక్కయ్య 1991లో కన్నుమూశారు. -
నా అంత ధనవంతుడు ఎవరైనా ఉంటారా?
‘‘కళలన్నింటిలో తలమానికమైన కళ సాహిత్యం. సాహిత్యం అనేది అనేక రూపాల్లో ఉంటుంది. వాటిలో మొదటిది నాటకం. కవులు ఎంత బాగా రాసినా దాన్ని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపేది నాటకం. ఆ నాటకానికి సాంకేతిక రూపమే సినిమా’’ అన్నారు ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘తెలుగు సినీ రచయితల సంఘం’ బుధవారం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి సత్కార సభ ఏర్పాటు చేసింది. సిరివెన్నెల, ఆయన సతీమణి పద్మావతిని సన్మానించారు. ఈ సమావేశానికి ‘తెలుగు సినీ రచయితల సంఘం’ అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‘సిరివెన్నెల’ మాట్లాడుతూ– ‘‘పద్మశ్రీ’ అవార్డు విలువ, ప్రాముఖ్యత ఎంత అనే విషయాన్ని పక్కనపెడితే ఇంత మంది అభిమానం, ప్రేమ, ఐశ్వర్యం పొందడం చాలా సంతోషంగా ఉంది. నా శ్రీమతి పద్మతో అంటుంటాను.. ‘నా అంత ధనవంతుడు ఎవరైనా ఉంటారా?’ అని. నేను సినిమా రంగాన్ని దేవాలయంలా భావిస్తాను. నా పాటల ద్వారా సంస్కారవంతమైన భావాలని చెబుతున్నా. గతంలో ఎంతోమంది ‘పద్మశ్రీ’ అవార్డులు తీసుకున్నారు. వారు ఎంత సంతోషపడ్డారో తెలియదు కానీ, ఈ అవార్డు మాత్రం నాకు ప్రత్యేకమైనది. రామాయణాన్ని 5 మాటల్లో చెప్పమంటే ఎలా చెబుతాం? అయితే పాట ద్వారా చెప్పే అవకాశం సినిమా ద్వారానే వస్తుంది. అది నాకు వచ్చింది. 30ఏళ్లుగా సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి పాటలు రాసే అవకాశం ఆ పరమేశ్వరుడు నాకే ఇచ్చాడేమో అనిపిస్తోంది. సినిమా అన్నది జీవితానికి అతీతంగా ఉంటుందనుకోను. సమాజం పట్ల బాధ్యత పెంచేది సినిమా. మొదటిసారి నాకు ‘నంది’ అవార్డు వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చాయి. మీరందరూ అన్నట్టు ‘భారతరత్న’ అవార్డు నాకు వస్తుందా? రాదా? అన్నది కాదు. భారతీయులంతా మంచి మనసుతో జీవించి, మేమంతా భారతీయులం అని ఇతర దేశాలవారికి సగర్వంగా చాటిచెప్పినప్పుడే మనందరికీ ‘భారతరత్న’ అవార్డు వచ్చినట్లు. ఇంతమంది అభిమానులు, ఆశీస్సులు, ఆత్మీయతను అందించిన ‘పద్మశ్రీ’ అవార్డుకి ధన్యవాదాలు. ప్రతి పురుషుడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. కానీ, నా శ్రీమతి పద్మ మాత్రం ముందుండి నన్ను నడిపిస్తున్నారు’’ అన్నారు. రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘సిరివెన్నెల’గారు రాసిన పాటలన్నీ అద్భుతం. అయితే నాకు ప్రత్యేకించి ‘మహాత్మ’ సినిమాలోని ‘ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ...’ పాట అంటే చాలా ఇష్టం. మేం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శ్రీశ్రీగారి పక్కన కూర్చున్నప్పుడు ఎంత గర్వంగా ఫీలయ్యామో ‘సిరివెన్నెల’తో కలిసి ఉన్నప్పుడూ అలాగే ఫీలయ్యాం’’ అన్నారు. రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ– ‘‘‘సిరివెన్నెల’ అన్నయ్యకి ‘పద్మశ్రీ’ అవార్డు ఆలస్యంగా వచ్చిందంటున్నారు.. నిజానికి రచయితకి ‘పద్మశ్రీ’ తెచ్చిన మొదటి వ్యక్తి ఆయనే. పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో పాటు ‘భారతరత్న’ అవార్డు కూడా రావాలని కోరుకుందాం’’ అన్నారు. ‘‘తొలిసారి ఓ సినిమా రచయితకి ‘పద్మశ్రీ’ అవార్డు రావడం సినిమా పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. రచయితలందరికీ ‘సిరివెన్నెల’ గర్వకారణం’’ అన్నారు రచయిత వడ్డేపల్లి కృష్ణ. ‘‘ఇండస్ట్రీకి వచ్చేముందు గురువుగారివద్ద (సిరివెన్నెల) శిష్యరికం చేయడం గొప్ప వరంగా భావిస్తాను’’ అన్నారు రచయిత రామజోగయ్య శాస్త్రి. ‘‘సిరి వెన్నెలగారిని ‘గ్రంథసాంగుడు’ అంటారు. అంటే గ్రంథంలో చెప్పలేని విషయాన్ని కూడా సాంగ్‌లో చెబుతారు’’ అన్నారు రచయిత భాస్కరభట్ల. ‘‘ఎవరికైనా ‘పద్మశ్రీ’ అవార్డు వస్తే డబ్బులిచ్చి కొనుక్కుని ఉంటారులే అని కామెంట్లు చేసేవారు. కానీ, గురువుగారికి ఈ అవార్డుని ప్రకటించాక అర్హతగల వ్యక్తికి ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు’’ అని రచయిత సాయిమాధవ్ బుర్రా అన్నారు. ఈ సత్కార సభలో విజయేంద్రప్రసాద్, గుణ్ణం గంగరాజు, బల్లెం వేణుమాధవ్, బలభద్రపాత్రుని రమణి, గొట్టిముక్కల రాంప్రసాద్, కేఎల్ నారాయణ, వైవీఎస్ చౌదరి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భీమనేని శ్రీనివాసరావు, ఆర్పీ పట్నాయక్, ఆచంట గోపీనాథ్, కాసర్ల శ్యామ్‌తో పాటు పలువురు రచయితలు పాల్గొన్నారు. -
కోకిలమ్మకు నల్లరంగు నలమిన వాడినేది కోరేది
కళాకారుడితోపాటు ఒక అన్వేషి కూడా అయినవాడు మాత్రమే ఈ ప్రశ్నల్ని సంధించగలడు. తన ఇంటిపేరుగా మారిపోయిన సిరివెన్నెల చిత్రం కోసం సీతారామశాస్త్రి రాసిన ఈ పాట– సృష్టిలోని వైరుధ్యాలను ఒక దగ్గర చేర్చడం వల్ల కవిత్వమైంది. దీనికి సంగీతం కె.వి.మహదేవన్. పాడింది బాలసుబ్రహ్మణ్యం. 1986లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు కె.విశ్వనాథ్. సుహాసిని, సర్వదమన్ బెనర్జీ నటీనటులు. ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగు నలమినవాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది బండరాళ్లను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మథుని మసి జేసినాడు వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు వాడినేది కోరేది ముక్కంటి, ముక్కోపి తిక్కశంకరుడు