
కళాకారుడితోపాటు ఒక అన్వేషి కూడా అయినవాడు మాత్రమే ఈ ప్రశ్నల్ని సంధించగలడు. తన ఇంటిపేరుగా మారిపోయిన సిరివెన్నెల చిత్రం కోసం సీతారామశాస్త్రి రాసిన ఈ పాట– సృష్టిలోని వైరుధ్యాలను ఒక దగ్గర చేర్చడం వల్ల కవిత్వమైంది. దీనికి సంగీతం కె.వి.మహదేవన్. పాడింది బాలసుబ్రహ్మణ్యం. 1986లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు కె.విశ్వనాథ్. సుహాసిని, సర్వదమన్ బెనర్జీ నటీనటులు.
ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తీపిరాగాల ఆ కోకిలమ్మకు
నల్లరంగు నలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
తేనెలొలికే పూలబాలలకు
మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్లను చిరాయువుగ
జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు
మన్మథుని మసి జేసినాడు వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు
దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి, ముక్కోపి తిక్కశంకరుడు
Comments
Please login to add a commentAdd a comment