
పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా అడవి నీతి ఏం మారిందని ఎన్ని యుగాలయినా? ఏదో తెలియని గాయం సలిపినప్పుడు, రేగే ఆవేశం ఈ పాట. సమాజ జీవచ్ఛవాన్ని– శవాన్ని కాల్చేయాలి అగ్గిలో. కానీ కడగమంటున్నాడు కవి, మళ్లీ పునీతం అయ్యేట్టుగా. గాయం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన ఇది. సంగీతం శ్రీ. పాడినవారు బాలసుబ్రహ్మణ్యం. 1993లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. పాటలో రేవతితోపాటు సీతారామశాస్త్రి కూడా కనిపిస్తారు.
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి మీ జ్ఞానబోధ దేనికి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణ మార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ
Comments
Please login to add a commentAdd a comment