
మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు వీఎన్ ఆదిత్య తాజా ప్రాజెక్టు 'స్వప్నాల నావ'. శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డల్లాస్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గోపీకృష్ణ కొటారు ఈ సాంగ్‌ను రూపొందించారు. అంతే కాకుండా గోపికృష్ణ కుమార్తె శ్రీజ ఈ పాటను ఆలపించడంతో పాటు నటించారు.
ఈ'స్వప్నాల నావ' థీమ్ దివంగత స్టార్ లిరిసిస్ట్ అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందించారు . ఈ పాటకు ప్రముఖ సినీ నిర్మాత శ్రీమతి మీనాక్షి అనిపిండి సమర్పకులుగా వ్యవహరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని. యశ్వంత్ ఈ పాటకి సాహిత్యం అందించారు.
'సిరివెన్నెల సీతారామశాస్త్రి' అంటే దర్శకులు వి.ఎన్.ఆదిత్యకు ఎంతో అభిమానం. ఆయన సూపర్ హిట్ సినిమా 'మనసంతా నువ్వే' లో కూడా సిరివెన్నెలతో గుర్తుండిపోయే ఓ పాత్రని చేయించారు. ఇప్పుడు 'స్వప్నాల నావ' తో సిరివెన్నెల గొప్పతనాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. అందుకే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో 1 మిలియన్ వీక్షణలు వచ్చాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment