Oke Oka Jeevitham: Sid Sriram Amma Lyrical Song Out Now, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Oke Oka Jeevitham: అఖిల్ చేతుల మీదుగా అమ్మ పాట రిలీజ్‌

Published Thu, Jan 27 2022 8:50 AM | Last Updated on Thu, Jan 27 2022 10:57 AM

Oke Oka Jeevitham: Amma Lyrical Song Out Now - Sakshi

Akhil Akkineni releases Amma song From Sharwanand Movie: ‘అమ్మా.. వినమ్మా’ అంటూ ‘ఒకే ఒక జీవితం’ చిత్రం నుంచి ఓ ఎమోషనల్‌ సాంగ్‌ విడుదలైంది. శర్వానంద్, రీతూ వర్మ జంటగా, అమల కీలక పాత్ర పోషించిన చిత్రం ఇది. అమల, శర్వానంద్‌ తల్లీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం కోసం దివంగత ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన అమ్మ పాటను అఖిల్‌ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు.

‘‘అనునిత్యం వెంటాడే తీపి జ్ఞాపకాలతో ఈ పాట అమ్మకి అంకితం’’ అని పేర్కొన్నారు శర్వానంద్‌. ‘‘అమ్మా.. వినమ్మా’ అంటూ ఈ పాట ఆరంభమవుతుంది. జేక్స్‌ బిజోయ్‌ స్వరపరచిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ పాడారు. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ డ్రామాగా ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రానికి శ్రీ కార్తీక్‌ దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement