![Sundeep Kishan Michael First Lyrical Song Is Out Now - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/30/sundeep.jpg.webp?itok=Kgg33Gq-)
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్లాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. తాజాగా ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. దివ్యా కౌశిక్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా, విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. రణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్‌ఎస్‌పీ శ్రీ వేంకటేశ్వర సినిమాస్ సంస్థల అధినేతలు భరత్ చౌదరి, పుష్కర్ రాయ్ మోహన్‌రావ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
రంజిత్ జయకొడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కాగా తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలు’ సాంగ్‌ను విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ మెలోడీ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న మేకర్స్ త్వరలోనే విడుదల తేదీని వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment