Sid Sriram
-
'ఫస్ట్ లవ్' టీజర్ బాగుంది: శ్రీవిష్ణు
దీపు జాను, వైశాలిరాజ్ లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బం 'ఫస్ట్ లవ్'. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బం టీజర్ ని సక్సెస్ ఫుల్ హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ సాంగ్ చూశాను. చాలా తక్కువ టైంలో చాలా బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చెప్పారు. చాలా బాగా షూట్ చేశారు. కెమరా వర్క్ చాలా బావుంది. సిద్ శ్రీరామ్ గారి వాయిస్ అద్భుతంగా వుంది. వినగానే ఒక నోస్టాల్జియ ఫీలింగ్ వచ్చింది. భూమి ఆకాష్ గా దీపు , వైశాలి చాలా పర్ఫెక్ట్ గా కనిపించారు. డైరెక్టర్ గారు చాలా మంచి కాన్సెప్ట్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. తప్పకుండా ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది’ అన్నారు. సాంగ్ టీజర్ విషయానికొస్తే..'ఫస్ట్ లవ్వా.. అతను నీతో చెప్పిన ఫస్ట్ మాట ఏంటి?' అనే డైలాగ్ తో మొదలైన సాంగ్ టీజర్ మెస్మరైజ్ చేసింది. కంపోజర్ సంజీవ్.టి ఈ సాంగ్ ని అందరూ మళ్ళీ మళ్ళీ పాడుకునే చార్ట్ బస్టర్ నెంబర్ గా ట్యూన్ చేశారు. 'మనస్సే చేజారే నీ వల్లే పతంగై పోయిందే నీ వెంటే ఇదంతా కల కాదా'' అంటూ కిట్టు విస్సాప్రగడ రాసిన బ్యూటీఫుల్ లిరిక్స్ ని సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరాం పాడిన తీరు హార్ట్ వార్మింగ్ గా ఉంది. -
యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న సిద్ శ్రీరామ్ పాట
సింగర్ సిద్ శ్రీరామ్ గొంతుకు టాలీవుడ్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నుంచి ఒక పాట వస్తే చాలు.. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ వచ్చేస్తాయి. తాజాగా ‘మెకానిక్’ సినిమాలో ఆయన ఆలపించిన ‘నచ్చేసావే పిల్లా’ కూడా మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. మణి సాయి తేజ, రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’.ట్రబుల్ షూటర్ ట్యాగ్ లైన్. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం నుంచి ఇటీవల సిద్ శ్రీరామ్ పాడిన పాట "నచ్చేసావే పిల్లా నచ్చేసావే" పాటను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి యూట్యూబ్‌లో 70 లక్షలకు పైగా వ్యూస్ రావడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నిర్మాత నాగ మునెయ్య(మున్నా) మాట్లాడుతూ "వినోద్ యాజమాన్య అందించిన సంగీతం మా చిత్రానికి హైలైట్. ఇటీవలే సిద్ శ్రీరామ్ పాడిన పాట "నచ్చేసావే పిల్లా నచ్చేసావే" ఇంటర్నెట్ లో ట్రేండింగ్ అయింది. యూట్యూబ్ లో 70 లక్షల వ్యూస్ మరియు ఇంస్టాగ్రామ్ లో 10 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇంతకు ముందు విడుదల అయిన 'టూలేట్ బోర్డు ఉంది నీ ఇంటికి' అనే పాటని 16 లక్షల మంది యూట్యూబ్ లో వీక్షించారు. మా "మెకానిక్" చిత్రం విడుదల కాకముందే మంచి మ్యూజికల్ హిట్ అయినందుకు సంతోషంగా ఉంది. మా చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో సెన్సార్ సెన్సార్ పూర్తి చేసుకుని విడుదల తేదీని ప్రకటిస్తాం" అని తెలిపారు. -
బేఏరియాలో అలరించిన సిద్ శ్రీరామ్ మ్యూజిక్ కాన్సర్ట్
-
యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ‘నిజమే నే చెబుతున్నా’ సాంగ్
టాలీవుడ్లో సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, సింగర్ సిద్ శ్రీరామ్లది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ , ‘ప్రియతమా ప్రియతమా’ , 'మనసు దారి తప్పేనే' పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టి రికార్డులు సృష్టించాయి. తాజాగా వీరి కాంబోలో వచ్చిన నాలుగో పాట ‘నిజమే నే చెబుతున్నా’ కూడా యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. సందీప్ కిషన్ నటిస్తున్న 'ఊరు పేరు బైరవకోన'సినిమాలోని పాట అది. ఇప్పటికే ఈ సాంగ్‌కి 30 మిలియన్స్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టా రీల్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా శేఖర్ చంద్ర మాట్లాడుతూ..‘నిజమే చెబుతున్నా’ సాంగ్ ఇంత సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సాంగ్ ని ఓన్ చేసుకుంటూ రీల్స్ చేస్తున్న అందరికీ థాంక్స్. రిలీజయ్యక చాలా మెస్సేజెస్ వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు వి ఐ ఆనంద్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయనతో నాకు ఇది రెండో సినిమా. మా కాంబోలో ఇంకా మరిన్ని మంచి పాటలు వస్తాయి. అలాగే హీరో సందీప్ కిషన్ కి , నిర్మాతలకు థాంక్స్. సిద్ శ్రీరామ్ పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మా కాంబోలో మరిన్ని సాంగ్స్ రానున్నాయి.ఈ పాటకు శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా శ్రీమణి కి కూడా థాంక్స్ చెప్తున్నా. ఈ సాంగ్ మూవీ రిలీజయ్యాక ఇంకా ఎక్కువ రీచ్ అవుతుందని నమ్ముతున్నాను.’ అన్నారు. -
'మైఖేల్' మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన రొమాంటిక్ సాంగ్ విన్నారా?
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్లాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. తాజాగా ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. దివ్యా కౌశిక్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా, విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. రణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎస్పీ శ్రీ వేంకటేశ్వర సినిమాస్ సంస్థల అధినేతలు భరత్ చౌదరి, పుష్కర్ రాయ్ మోహన్రావ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రంజిత్ జయకొడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కాగా తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలు’ సాంగ్‌ను విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ మెలోడీ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న మేకర్స్ త్వరలోనే విడుదల తేదీని వెల్లడించనున్నారు. -
సిద్ శ్రీరామ్ పాడిన వెన్నెల వెన్నెల సాంగ్ విన్నారా?
యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టాప్ గేర్. కె శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి వెన్నెల వెన్నెల పాటను రిలీజ్ చేశారు. సరస్వతీ పుత్రుడు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అందించగా ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ సినిమాను శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా రియా సుమన్ హీరోయిన్గా నటిస్తోంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. చదవండి: రేవంత్‌కు బిగ్‌బాస్ షాక్ చివరి కెప్టెన్‌గా ఇనయ, నేరుగా సెమీ ఫైనల్స్‌లోకి -
ఆది సాయికుమార్ 'టాప్ గేర్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలు యాక్షన్ సినిమాల ద్వారా మంచి విజయాలను అందుకోగా ఇప్పుడు ఈ సినిమా తో మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని పాట విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన 'వెన్నెల వెన్నెల' పాటను ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. 1st single #VennelaVennela Will be out on 25th ! @rameemusic @sidsriram @IRiyaSuman #TOPGEAR pic.twitter.com/5hDXnXQ8zb — AadiSaikumar (@AadiSaikumar) November 21, 2022 -
ఒక్క హిట్‌తో మళ్లీ కమ్ బ్యాక్ కావొచ్చు: నిఖిల్
Aakashame Nuvvani Song Out From Diamond Raja: ‘‘చిత్ర పరిశ్రమలో హిట్లు, ఫ్లాపులు అనేవి సాధారణమే. ఒక్క హిట్టుతో మళ్లీ కమ్ బ్యాక్ కావొచ్చు. ‘డైమండ్ రాజా’ చిత్రంతో వరుణ్ సందేశ్ కూడా ఇండస్ట్రీని రాక్ చేయాలి. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అని యంగ్ హీరో నిఖిల్ పేర్కొన్నారు. వరుణ్ సందేశ్, డాలీషా జంటగా శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డైమండ్ రాజా’. శ్రీ ఓబుళేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్ రెడ్డి, బి.క్రాంతి ప్రభాత్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘డైమండ్ రాజా’. అచ్చు రాజమణి స్వరాలు అందించిన ఈ చిత్రం నుంచి ‘ఆకాశమే నువ్వని..’ అంటూ సాగే పాటని నిఖిల్ విడుదల చేశారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో అరెరే, నిజంగా, ఏమంటావే..’ వంటి పాటల తర్వాత ఈ చిత్రంలోని ‘ఆకాశమే నువ్వని..’ పాట కూడా అంతే హిట్ అవుతుందని నమ్ముతున్నాను. వినోదాత్మకంగా ఉండే ‘డైమండ్ రాజా’ ని ఫ్యామిలీ అంతా కలసి చూడొచ్చు’’ అని తెలిపారు. ‘‘మా సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ‘‘ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది’’ అని హీరోయిన్ డాలీషా ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పి. రాజశేఖర్ రెడ్డి, టి. రమేష్, కెమెరా: వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, పవన్ రెడ్డి కోటిరెడ్డి. -
‘లెహరాయి’ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట రిలీజ్
రంజిత్, సౌమ్యా మీనన్ జంటగా రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లెహరాయి’. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్‌పై మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘మెరుపై మెరిసావే.. వరమై కలిసావే.. గుండె గిల్లి వెల్లావే..’ అంటూ సాగే రెండో పాటను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మ్యూజిక్ డైరెక్టర్ జీకే (ఘంటాడి కృష్ణ)గారి పాటలను అప్పట్లో యూత్ అంతా పాడుకునేవారు. చాలా రోజుల తర్వాత ఆయన ‘లెహరాయి’ ద్వారా మళ్లీ రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మెరుపై మెరిసావే..’ కి జీకేగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడటం మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాను. సినిమాని త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు మద్దిరెడ్డి శ్రీనివాస్. ‘‘మంచి ఫీల్ ఉన్న కథా చిత్రమిది’’ అన్నారు రామకృష్ణ పరమహంస. -
హ్యాపీ బర్త్‌డే సిద్ శ్రీరామ్
-
ఆయన గొంతులో ఏదో మ్యాజిక్...మరేదో మాయ!
సిద్ శ్రీరామ్.. ఈ పేరు వింటే చాలు సినీ సంగీతాభిమానులు అద్భుతమైన సంగీత లోకం లోకి వెళ్లిపోతారు. అద్భుతమైన గొంతు, అంతకు మించిన శాస్త్రీయ పరిజ్ఞానం సిద్ శ్రీరామ్‌ను ఈ డికేడ్ సింగర్‌గా మార్చివేసింది. పొద్దున్నే సిద్ శ్రీరామ్ పాట వింటే చాలు.. ఆ పరిమళం, మోహం ఆ రోజంతా వెంటాడుతుంది. ఎన్ని సార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది..దటీజ్ వెర్సటైల్ సింగర్ సిద్ శ్రీరామ్ మ్యాజిక్. సిద్ శ్రీరామ్ మెలోడియస్గా, రొమాంటిక్‌గా ఒక పాట పాడితే చాలు ఆ సినిమా హిట్ గ్యారంటీ అన్న రేంజ్లో సిద్ హవా నడుస్తోంది. శ్రీరామ్ తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి శ్రీరాం వ్యాపారవేత్త. తల్లి లత సంగీతం టీచర్. ఇంట్లోనే సంగీత నేపథ్యం ఉండటంతో సహజంగానే సిద్ కు సంగీతం ఆసక్తి ఏర్పడింది. తొలి గురువు అమ్మ ద్వారా కర్ణాటక సంగీతంలో మరింత రాణించాడు. తల్లిదండ్రులతో కలసి కాలిఫోర్నియాకు వెళ్లిన సిద్ బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో చేరాడు. మ్యూజిక్ ప్రొడక్షన్, ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. కర్ణాటక కచేరీలను కూడా నిర్వహించేవాడు. సిద్ చెల్లెలు పల్లవి శ్రీరాం భరతనాట్య కళాకారిణి కావడం విశేషం 2013లో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ స్వరపరచిన కదల్ కోసం పాడిన అడియే పాటతో వెలుగులోకి వచ్చాడు సిద్ శ్రీరామ్. ఆ తరువాత 2015లో ఐ మూవీలోని "ఎన్నోడు నీ ఇరుంతాల్ " సాంగ్‌తో మరింత పాపులర్ అయ్యాడు. ఈ పాటకు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో హుషారు మూవీలోని ఉండిపోరాదే , నిన్ను కోరి సినిమాలో అడిగా అడిగా, డియర్ కామ్రేడ్ కడలల్లె వేచె కనులే, ఇంకా పడి పడి లేచే మనుసు, శశి మూవీలోని ఒకే ఒక లోకం నువ్వే, ఇంకా రోబో 2.0, ఏబీసీడీ, మైల్స్ ఆఫ్ లవ్ లాంటి పలు మూవీస్‌లో రొమాంటిక్ ట్రాక్‌లతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ముఖ్యంగా గీత గోవిందం సినిమాలో "ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె" అంటూ టాలీవుడ్లో సంచలనం క్రియేట్ చేశాడు. గోపీ సుందర్ స్వరపర్చిన ఈ పాట ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది. ఇక వరుస ఆఫర్లతో సినీ సంగీతాభిమానులను తన గాత్రంతో మెస్మరైజ్ చేశాడు. టాక్సీవాలా, ఇష్క్ తదితర మూవీల్లో పాటలతో అలరించాడు. సిద్ శ్రీరామ్ పాటలన్నీ రిపీట్ మోడ్‌లో వినాల్సిందే. అయితే ఇప్పటి వరకూ శ్రీరామ్ పాడినవన్నీ మెలోడీయస్ గీతాలే. భారతీయ సంగీతంతో పాటు పాప్ మ్యూజిక్ లోనూ ప్రవేశం ఉన్న సిధ్ శ్రీరామ్ ఫస్ట్ టైమ్ ఓ ఫోక్ సాంగ్ పాడాడు. అలాంటి వారందరినీ ఆశ్చర్యపరుస్తూ ‘నల్లమల’ చిత్రంలో ‘‘ఏమున్నావే పిల్లా ఏమున్నావే’’ అంటూ సాగే అందమైన జానపద గీతాన్ని అంతే అందంగా ఆలపించి ఆశ్చర్యపరిచాడు. ఇక స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురంలోని సామజ వర గమనా ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. లేటెస్ట్ హిట్ సర్కారు వారి పాట మూవీలోని కళావతి సాంగ్ కూడా మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ సినీ నేపథ్య సంగీతంలో తనదైన మార్క్ తో దూసుకుపోతున్నాడు సిద్ శ్రీరామ్ . -
బుల్ బుల్ తరంగ్ సాంగ్ వచ్చేసింది.. సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్
మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఇందులో రజీషా, దివ్యాంశ హీరోయిన్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న విడుదలవుతోంది. ఈ చిత్రం నుంచి తొలి పాటను శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. 'బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్ లోకం మోగేను.. లవబ్ డబ్ మాని నీ పేరై మోగేను..' అంటూ సాగే ఈ పాటకి సిద్ శ్రీరామ్ తన త్వరంతో ప్రాణం పోశాడు. రజీషాపై రవితేజకు ఉన్న ప్రేమనంతా తన లిరిక్స్‌తో తెలియజేశాడు రాకేందు మౌళి. సామ్ సీఎస్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ లవ్లీ రొమాంటిక్ మెలోడీలో రవితేజ, రజీషాల కెమెస్ట్రీ చూడముచ్చటగా ఉంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషించాడు. నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్ ముఖ్యపాత్రల్లో నటించారు. -
లీక్ ఎఫెక్ట్.. 'సర్కారు వారి పాట' ఒరిజినల్ సాంగ్ అవుట్
మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ కళావతి పాట విడుదల చేయాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే ఆన్లైన్లో లీకైన సంగతి తెలిసిందే. దీంతో ఈ పాటను షెడ్యూల్‌కి ఒకరోజు ముందే మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. 'వందో, ఒక వెయ్యో, ఒకలక్షో మెరుపులు దూకినాయా.. ఏందే ఈ మాయ, కమా కమాన్ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటాయి. మ్యూజిక్ సెన్సెషన్ తమన్ స్వరాలు అందించిన ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. మే 12వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. #Kalaavathi is here!! Definitely one of my favourites! 👌https://t.co/t7fWq2UyUa@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @sidsriram @GMBents @MythriOfficial @14ReelsPlus — Mahesh Babu (@urstrulyMahesh) February 13, 2022 -
సిద్ శ్రీరామ్ పాడిన అమ్మ సాంగ్ తమిళ వర్షన్ విన్నారా?
కణం చిత్రంలో అమ్మపాట కీలకంగా ఉంటుందని దర్శకుడు శ్రీకార్తీక్ పేర్కొన్నారు. ఈయన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతలు ఎస్ఆర్ ప్రకాష్, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న చిత్రం ఇది. సీనియర్ నటి అమల చాలాకాలం తరువాత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, రీతువర్మ.. హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, జెకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాల తరువాత శర్వానంద్ తమిళ ప్రేక్షకులకు ముందుకు రానున్న చిత్రం ఇది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో ఒకే ఒక జీవితం అనే టైటిల్ నిర్ణయించినట్లు చెప్పారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయన్నారు. ప్రతి చిత్రంలోనూ కథను ప్రతిబింబించే ఒక పాట ఉంటుందన్నారు. అలా ఈ చిత్రంలో అమ్మ పాట కథకు ఆత్మగా ఉంటుందని చెప్పారు. తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాటల్లో ఇది ఒకటి అన్నారు. దీని అర్థం మారకుండా తమిళంలో ఉమాదేవి రాయగా జేక్స్ బిజాయ్ సంగీత దర్శకత్వంలో సిద్ శ్రీరామ్ పాడారని తెలిపారు. ఈ పాట విన్న వారికి తమ తల్లి జ్ఞాపకాలు కళ్లముందు నిలుస్తాయన్నారు. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే అందరినీ ఆకట్టుకుందని చెప్పారు. -
సిద్ శ్రీరామ్ పాడిన అమ్మా వినమ్మా.. సాంగ్ విన్నారా?
Akhil Akkineni releases Amma song From Sharwanand Movie: ‘అమ్మా.. వినమ్మా’ అంటూ ‘ఒకే ఒక జీవితం’ చిత్రం నుంచి ఓ ఎమోషనల్ సాంగ్ విడుదలైంది. శర్వానంద్, రీతూ వర్మ జంటగా, అమల కీలక పాత్ర పోషించిన చిత్రం ఇది. అమల, శర్వానంద్ తల్లీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం కోసం దివంగత ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన అమ్మ పాటను అఖిల్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘అనునిత్యం వెంటాడే తీపి జ్ఞాపకాలతో ఈ పాట అమ్మకి అంకితం’’ అని పేర్కొన్నారు శర్వానంద్. ‘‘అమ్మా.. వినమ్మా’ అంటూ ఈ పాట ఆరంభమవుతుంది. జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ డ్రామాగా ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో విడుదల కానుంది. -
సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎన్ని లక్షలు తీసుకుంటాడంటే?
సింగర్ సిద్ శ్రీరామ్.. అతడి గాత్రంలోనే ఏదో మ్యాజిక్ ఉంది. అతడు పాడిన ఎన్నో పాటలు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశాయి. 'టాక్సీవాలా'లో 'మాటే వినదుగా..', 'అల వైకుంఠపురములో' చిత్రంలో 'సామజవరగమన..', '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'లో 'నీలి నీలి ఆకాశం..', 'వకీల్ సాబ్'లో మగువా మగువా..', 'రంగ్ దే'లో 'నా కనులు ఎపుడు..', లేటెస్ట్గా 'పుష్ప'లో పాడిన 'శ్రీవల్లి' పాటలు ఎంతగానో పాపులర్ అయ్యాయి.. అంతేగాక ఆ సినిమాలన్నీ సక్సెస్ కావడం అతడికి ఎంతగానో కలిసొచ్చింది. తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేస్తున్న సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకు అందుకుంటాడట! నిజానికి సింగర్స్‌కు ఈ రేంజ్లో రెమ్యునరేషన్ ఉండే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే తను పాడితే ఆ సాంగ్ ఏ రేంజ్లో సెన్సేషన్ అవుతుందో అర్థమైన నిర్మాతలు ఎంత డబ్బు ఇచ్చైనా సరే సిద్ శ్రీరామ్‌తోనే పాడించడానికి మొగ్గు చూపుతున్నారు. -
'శ్రీవల్లీ' స్టెప్.. ఏడుపు మానేసిన చిన్నారి, వీడియో వైరల్
Viral Video: Man Uses Pushpa Srivalli Song Step To Calm Down Crying Baby: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది సహా నార్త్‌లోనూ అల్లు అర్జున్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలోని పాటలు, డైలాగులు సోషల్ మీడియాను ఓ రేంజ్లో ఊపేస్తున్నాయి. ఇక పుష్ప చిత్రంలోని 'శ్రీవల్లీ' సాంగ్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్టయ్యింది. ముఖ్యంగా అల్లు అర్జున్ చేసిన సిగ్నేచర్ స్టెప్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తాజాగా షాదాబ్ అలీ ఖాన్ అనే ఓ నెటిజన్ సైతం శ్రీవల్లీ సాంగ్ హుక్ స్టెప్పులేస్తూ ఏడుస్తున్న పాపాయిని జో కొట్టాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. పాపను హ్యాపీ చేయడానికి శ్రీవల్లి స్టెప్ పర్ఫెక్ట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక ఒరిజినల్ శ్రీవల్లీ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటికే ఈ సాంగ్ 80మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. తెలుగులో సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడగా, హిందీ వెర్షన్లో జావేద్ అలీ పాడారు. View this post on Instagram A post shared by Sʜᴀᴅᴀʙ Aʟɪ Kʜᴀɴ 🖤 (@beingshadabkhan.27) -
స్టార్ డైరెక్టర్ ఆఫర్.. హీరోగా సిద్ శ్రీరామ్ ఎంట్రీ!
Is Singer Sid Sriram Will Become A hero In The Movie: సింగర్ సిద్ శ్రీరామ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో యూత్‌లో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సింగర్ ఆయన. సిద్ శ్రీరామ్ పాట లేనిదే ఈ మధ్య సినిమాలు లేవనడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకున్నా ఆయన పాట మాత్రం సూపర్ హిట్ అవుతోంది. కొన్నిసార్లు అయితే సిద్ శ్రీరామ్ పాడిన పాటలతోనే సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. యూత్‌లోనూ సిద్ శ్రీరామ్‌కు మాంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా సిద్ శ్రీరామ్ గురించి ఇప్పుడో వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో సిద్ శ్రీరామ్ వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా మారనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో హీరోగా చేయడానికి సిద్ శ్రీరామ్ కూడా అంగీకరించినట్లు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. -
సిద్ శ్రీరామ్ పాడిన వేవేల తారలే.. సాంగ్ విన్నారా?
Vevela Taarale Song From Taxi Movie: ఈ మధ్య మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు సింగర్ సిద్ శ్రీరామ్. ఆయన పాటలో ఉండే కమ్మదనం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా అతడు 'టాక్సీ' సినిమాలో పాడిన యూత్‌ఫుల్ మెలోడీ సాంగ్ 'వేవేల తారలే..' శుక్రవారం రిలీజైంది. ''వేవేలా తారలే నా చుట్టూ చేరి మురిసేనా.. మేఘాల పైన తేలుతున్నా'' అంటూ మొదలైన ఈ బ్యూటిఫుల్ మెలోడీ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఎప్పటిలాగే సిద్ శ్రీరామ్ తన గొంతుతో మరోసారి మ్యాజిక్ చేశారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ సమకూర్చారు. హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్‌పై హరిత సజ్జ నిర్మిస్తున్న 'టాక్సీ' సినిమాకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా దర్శకత్వం వహిస్తున్నారు. బిక్కి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
హైదరాబాదీలు అత్యధికంగా వింటున్న పాట ఇదే!
హైదరాబాదీలు ముఖ్యంగా యువత అత్యధికంగా వింటున్న గాయకుల్లో సిద్ శ్రీరామ్ అగ్రగామిగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ మ్యూజిక్ యాప్ స్పోటిఫై తాజా అధ్యయనంలో తేల్చింది. హైదరాబాద్ వాసుల సంగీతాసక్తులపై తమ డేటా విశ్లేషణ ఫలితాలను సంస్థ తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం హైదరాబాదీలు అత్యధికంగా వినే గాత్రాల్లో తొలి స్థానం సిద్ శ్రీరామ్‌కు దక్కగా, ఆ తర్వాత స్థానాల్లో బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్, అనిరుథ్ రవిచందర్, శ్రేయా ఘోషల్ తదితరులతో పాటు కె.ఎస్.చిత్ర, అనురాగ్ కులకర్ణి, ప్రీతమ్, దేవిశ్రీ ప్రసాద్, ఎఆర్‌రెహ్మాన్ తదితర టాలీవుడ్ సంగీత ప్రముఖులూ ఉన్నారు. దివంగత మధుర గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మాణ్యం కూడా ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్నారు. చిట్టి నీ నవ్వంటే...కి టాప్ ప్లేస్.. అదే విధంగా హైదరాబాదీలు అత్యధికంగా విన్న/వింటున్న పాటల్లో చిట్టి నీ నవ్వంటే (జాతిరత్నాలు)ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో జలజల పాతం నువ్వు (ఉప్పెన), ఒకేఒక లోకం నువ్వే(శశి), లాహె లాహె(ఆచార్య) తరగతి గది (కలర్ ఫొటో), హే ఇది నేనేనా (సోలో బతుకే సో బెటర్), మగువా మగువా (వకీల్ సాబ్), హోయ్‌నా హోయ్‌నా (నానిస్ గ్యాంగ్ లీడర్), కాటుక కనులె (ఆకాశం నీ హద్దురా), భలేగుంది బాలా (శ్రీకారం) పాటలున్నాయి. -
ఇష్క్: సిద్ శ్రీరామ్ మెలోడీ సాంగ్ వచ్చేసింది
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్’. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఆనందమా.. ఆనందమదికే’అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కి శ్రీమణి లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. -
Sid Sriram: సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటలు విన్నారా?
Happy Birthday Sid Sriram: పొగడ్త అందరికీ చేత కాదు. అందరి గొంతు అందుకు నప్పదు. స్త్రీలను పొగిడే ఒక గొంతు కొన్నాళ్లుగా తెలుగులో తళతళలాడుతోంది. కొంత అరవం కొంత తెలుగు కలగలిసిన ఆ శబ్దానికి హీరోయిన్లే కాదు ప్రేక్షకులూ ఫిదా అవుతున్నారు. మే 19 సిద్ శ్రీరామ్ జన్మదినం. 32లోకి ఎంటర్ అవుతున్నాడు.ఆ గొంతు పొగిడిన స్త్రీ సౌందర్యపు పాటలు ఇవి. ‘ముల్లో పువ్వో పోయే దారిదైనా నిన్నే నమ్మి వచ్చానే అడవి గుర్రమంటి ఒక గుర్రెపిల్లలాగా నీ వెంటే వస్తున్నానే యాడికే... యాడికే తీసుకెళ్తావే నీతో పాటే’.... మణిరత్నం ‘కడలి’ సినిమా కోసం సిద్ శ్రీరామ్ మొదటిసారి ప్రియురాలిని కీర్తిస్తూ ఈ పాట ఏ ముహూర్తాన పాడాడోగాని తెలుగులో అమ్మాయిలను బుట్టలో వేసుకోవడానికి సినిమాల్లో సిద్ గొంతును హీరోలు అరువు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. సిద్ గొంతుతో ‘నీ బాగున్నావు... ముచ్చటగా ఉన్నావు.. నువ్వు నవ్వితే బుగ్గన సొట్ట పడుతుంది’ వంటి మామూలు మాటలు మాట్లాడినా ఆ హీరోయిన్ తప్పక లవ్‌ను యాక్సెప్ట్ చేసే మెస్మరిజమ్ అతని గొంతులో ఉంది. అది సినిమాకు ప్లస్ అవుతోంది. శంకర్ కూడా ఇది కనిపెట్టి ‘ఐ’ కోసం సిద్ చేత పాడించాడు. ‘నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా’ పాట బయట హిట్. చూడటానికి కాదు. వినడానికి. ‘హృదయం వేగం వీడదే వెతికే చెలిమే నీడై నన్ను చేరితే’... అని ‘సాహసం శ్వాసగా సాగిపో’లో సిద్ శ్రీరామ్ ‘వెళ్లిపోమాకే’ పాటలో అంటాడు. ఆ లైన్స్‌తో హీరోయిన్ హీరో నాగచైతన్య ప్రేమలో పడుతుంది. ప్రేమను చెప్పడానికి కాదు ఆ ప్రేమలో దూరం వస్తే దాని లోతును చెప్పడానికి కూడా సిద్ శ్రీరామ్ గొంతు బాగా నప్పుతుంది. ‘అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలి ఏదనీ’ అని ‘నిన్ను కోరి’లో సిద్ పాడిన పాట అలాంటి స్థితిలో ఉన్న ప్రేమికులను తాకుతుంది. ఇక ‘గీత గోవిందం’లోని ‘ఇంకెం ఇంకెం ఇంకేం కావాలే’ పాటతో సిద్ తెలుగువారి ఇంటింటి గాయకుడు అయ్యాడు. ‘నీ ఎదుట నిలబడు చనువే వీసా... అందుకుని గగనపు కొనలే చూసా’ అని అమాయకంగా పాడుతుంటే రష్మికా మందన్నా ఏంటి మందికా రష్మన్నా కూడా ఫిదా కాక తప్పదు కదా. అదే వరుసలో ‘టాక్సీ వాలా’లో ‘మాటే వినదుగా వినదుగా’ కూడా విజయ్ దేవరకొండకు దక్కింది. కళ్లను శ్లాఘించి హిట్ కొట్టినవాళ్లున్నారు. కాని సిద్ శ్రీరామ్ ‘అల వైకుంఠపురములో’ కాళ్లను శ్లాఘించి సూపర్‌హిట్ కొట్టాడు. ‘నీ కాళ్లను పట్టుకు వదలవన్నవి చూడే నా కళ్లు’... ఒక ఊపు ఊపింది. ‘ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా’ అని సిద్ ఈ పాటలో అంటాడు. వినక ఊరుకోగలదా పూజా హేగ్డే. ఇక చిన్న సినిమాలకు ఒక్క పాటతో ప్రాణం పోయొచ్చు అని ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాటతో సిద్ చూపిస్తాడు. ‘నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే... నువ్వు వదిలేటి శ్వాసకే గాలులు బతికాయి చూడవే’... సిద్ మాత్రమే ఆ పదానికి ప్రాణవాయువు ఇవ్వగలడు. కాని స్త్రీ గొప్పతనాన్ని నిజంగా వర్ణించడానికి కూడా సిద్ శ్రీరామ్ గొంతు అవసరమవుతుంది. ‘వకీల్‌సాబ్’లో ‘మగువా మగువా’ పాటను సిద్ పాడాడు. ‘ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా... నీవు లేని జగతిలో దీపమే వెలుగునా’ అని ఆమె గొప్పను సిద్ నిర్ధారిస్తూ పాడతాడు. మగవ మెచ్చే పాటలు మరెన్నో సిద్ పాడాలి. మనం వినాలి. స్త్రీలు ముచ్చటపడుతూనే ఉండాలి. హ్యాపీ బర్త్‌డే హృదయగాయకా.(నేడు సిద్ శ్రీరామ్ జన్మదినం) – సాక్షి ఫ్యామిలీ -
మరో రికార్డు సొంతం చేసుకున్న సిద్ శ్రీరామ్
ప్రస్తుతం టాలీవుడ్లో సింగర్ సిద్ శ్రీరామ్ హవా కొనసాగుతోంది. ఆయన పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అవుతుండటంతో సిద్ శ్రీరామ్‌తో ఒక్క పాటైనా పాడించాలని సంగీత దర్శకులూ కోరుకుంటున్నారు. యూత్‌లోనూ ఈ యంగ్ సింగర్‌కు మంచి క్రేజ్ ఉంది. దీంతో సిద్ శ్రీరామ్ పాట లేనిదే ఈ మధ్య సినిమాలు రిలీజ్ కావట్లేదనడంలో అతిశయోక్తి లేదు. సినిమా ఫలితాల సంగతి ఎలా ఉన్నా సిద్ శ్రీరామ్‌తో పాడించిన పాటలు మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. కొన్నిసార్లు అయితే సిద్ శ్రీరామ్ పాడిన పాటలతోనే సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. అదే కోవలోకి వస్తుంది.. శశి చిత్రంలోని ఒకే ఒక లోకం నువ్వు పాట. ఆది సాయికుమార్, సురభి నటించిన ఈ చిత్రం బాక్స్‌ఫీస్ వద్ద బోల్తా కొట్టినా ఈ పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది. సిద్ శ్రీరామ్ పాడిన 'ఒకే ఒక లోకం నువ్వు' పాట సినిమా విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ను సంపాదించుకొని మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, అరుణ్ చివులూరు సంగీతం అందించారు. చదవండి : సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?