'ఫస్ట్ లవ్' టీజర్‌ బాగుంది: శ్రీవిష్ణు | First love Teaser Launched By Sri Vishnu | Sakshi

'ఫస్ట్ లవ్' టీజర్‌ బాగుంది: శ్రీవిష్ణు

Jul 24 2024 1:24 PM | Updated on Jul 24 2024 1:24 PM

First love Teaser Launched By Sri Vishnu

దీపు జాను, వైశాలిరాజ్  లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బం 'ఫస్ట్ లవ్'. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బం టీజర్ ని సక్సెస్ ఫుల్ హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా  శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ సాంగ్ చూశాను. చాలా తక్కువ టైంలో చాలా బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చెప్పారు. చాలా బాగా షూట్ చేశారు. కెమరా వర్క్ చాలా బావుంది. సిద్ శ్రీరామ్ గారి వాయిస్ అద్భుతంగా వుంది. వినగానే ఒక నోస్టాల్జియ ఫీలింగ్ వచ్చింది. భూమి ఆకాష్ గా దీపు , వైశాలి చాలా పర్ఫెక్ట్ గా కనిపించారు. డైరెక్టర్ గారు చాలా మంచి కాన్సెప్ట్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు.  తప్పకుండా ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది’ అన్నారు. 

సాంగ్‌ టీజర్‌ విషయానికొస్తే..'ఫస్ట్ లవ్వా.. అతను నీతో చెప్పిన ఫస్ట్ మాట ఏంటి?' అనే డైలాగ్ తో మొదలైన సాంగ్ టీజర్ మెస్మరైజ్ చేసింది. కంపోజర్ సంజీవ్.టి ఈ సాంగ్ ని అందరూ మళ్ళీ మళ్ళీ పాడుకునే చార్ట్ బస్టర్ నెంబర్ గా ట్యూన్ చేశారు.  'మనస్సే చేజారే నీ వల్లే  పతంగై పోయిందే నీ వెంటే ఇదంతా కల కాదా'' అంటూ కిట్టు విస్సాప్రగడ రాసిన బ్యూటీఫుల్ లిరిక్స్ ని సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరాం పాడిన తీరు హార్ట్ వార్మింగ్ గా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement