First Love
-
‘‘ఫస్ట్ లవ్’ పాటలోనే కథ చూపించారు – ఎస్ఎస్ తమన్
‘‘ఫస్ట్ లవ్’ టైటిల్ సాంగ్ మ్యూజిక్ వీడియో చాలా అందంగా ఉంది. ఈ పాటలోనే ఒక అద్భుతమైన కథ చూపించారు. మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది’’ అని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు. దీపు జాను హీరోగా బాలరాజు ఎం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫస్ట్ లవ్’. వైశాలీ రాజ్ హీరోయిన్గా నటించి, నిర్మించారు. సంజీవ్ .టి సంగీతం అందించిన ఈ మూవీ టైటిల్ సాంగ్ (‘ఫస్ట్ లవ్’) లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లవ్’ పాటలు వినగానే ‘వైశాలి, ఖుషి’ సినిమాలు గుర్తుకు వచ్చాయి. మధు పొన్నాస్ అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘చాలా కష్టపడి ప్రేమతో ‘ఫస్ట్ లవ్..’ పాట చేశాం’’ అన్నారు. ‘‘అందరూ సెలబ్రేట్ చేసుకునే స్పెషల్ ఆల్బమ్ ఇది’’ అన్నారు బాలరాజు ఎం. -
ఫస్ట్ లవ్ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)
-
'ఫస్ట్ లవ్' టీజర్ బాగుంది: శ్రీవిష్ణు
దీపు జాను, వైశాలిరాజ్ లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బం 'ఫస్ట్ లవ్'. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బం టీజర్ ని సక్సెస్ ఫుల్ హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ సాంగ్ చూశాను. చాలా తక్కువ టైంలో చాలా బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చెప్పారు. చాలా బాగా షూట్ చేశారు. కెమరా వర్క్ చాలా బావుంది. సిద్ శ్రీరామ్ గారి వాయిస్ అద్భుతంగా వుంది. వినగానే ఒక నోస్టాల్జియ ఫీలింగ్ వచ్చింది. భూమి ఆకాష్ గా దీపు , వైశాలి చాలా పర్ఫెక్ట్ గా కనిపించారు. డైరెక్టర్ గారు చాలా మంచి కాన్సెప్ట్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. తప్పకుండా ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది’ అన్నారు. సాంగ్ టీజర్ విషయానికొస్తే..'ఫస్ట్ లవ్వా.. అతను నీతో చెప్పిన ఫస్ట్ మాట ఏంటి?' అనే డైలాగ్ తో మొదలైన సాంగ్ టీజర్ మెస్మరైజ్ చేసింది. కంపోజర్ సంజీవ్.టి ఈ సాంగ్ ని అందరూ మళ్ళీ మళ్ళీ పాడుకునే చార్ట్ బస్టర్ నెంబర్ గా ట్యూన్ చేశారు. 'మనస్సే చేజారే నీ వల్లే పతంగై పోయిందే నీ వెంటే ఇదంతా కల కాదా'' అంటూ కిట్టు విస్సాప్రగడ రాసిన బ్యూటీఫుల్ లిరిక్స్ ని సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరాం పాడిన తీరు హార్ట్ వార్మింగ్ గా ఉంది. -
నాకు చాలా మంది మీద క్రష్ ఉంది: ఛార్మీ కౌర్
-
మూడో తరగతిలోనే ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
మీడియాతో అయినా, అభిమానులతో అయినా సరదాగా మాట్లాడే అది కొద్ది మంది హీరోలలో నాని ఒకరు. ఏ విషయాన్ని అయినా అభిమానులతో షేర్ చేసుకుంటాడు. మీడియాతో కూడా అంతే. పర్సనల్ విషయాలను అడిగినా.. చెప్పను..కుదరదు అని అనడు. చాలా జన్యూన్‌గా జవాబిస్తాడు. తాజాగా ఆయన తొలి ప్రేమ అనుభవాన్ని రేడియో జాకీలతో షేర్ చేసుకున్నాడు. మృనాల్ ఠాకూర్, నాని జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి (సీవీఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రంలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయనున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాని ఇటీవల రేడియో జాకీలతో కలిసి చిట్‌చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన ప్రేమలో ఎప్పుడు పడ్డాడో.. ప్రస్తుతం తన క్రష్ ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ‘నేను మూడో తరగతిలోనే ప్రేమలో పడ్డాను. అప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో సోనీ అనే అమ్మాయి మంచి గౌను వేసుకొని వచ్చింది. నేను ఏమో ఆకులు చుట్టుకుని నిలబడ్డాను. ఆమెను చూడగానే నాకు వెళ్లి పకలరించాలని అనిపించింది. కానీ ఆకులు చుట్టుకున్నాననే సిగ్గుతో ఆమె దగ్గరకు వెళ్లలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే.. వెళ్లి పలకరిస్తాను’అని సరదగా చెప్పాడు. ప్రస్తుతం తన క్రష్ కియారా ఖన్నా(హాయ్ నాన్న చైల్డ్ ఆర్టిస్ట్) అని చెపన్పాడు. ‘ఒక్కరోజు కియారా ఖన్న చక్కగా రెడీ అయి సెట్‌కి వచ్చింది. చూడగానే ముచ్చటగా అనిపించింది. ప్రస్తుతం తనే నా క్రష్’అని నాని చెప్పుకొచ్చాడు. -
తన ఫస్ట్ లవ్ స్టోరిని బయటపెట్టిన మెగాస్టార్ చిరంజీవి..
Chiranjeevi Says He Fell In Love At 7th Standard: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. సూపర్ హిట్టయిన హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకులను పలకరించనుంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఇటీవల విడుదల కాగా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మూవీ విడుదల తేది దగ్గరపడనుండటంతో సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి, అమీర్ ఖాన్, నాగ చైతన్యలను టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. త్వరలో టెలీకాస్ట్ కానున్న ఈ ఇంటర్వ్యూ ప్రొమోను విడుదల చేశారు. ఈ ప్రొమోలో ఎన్నో ఆసక్తికర విషయాలను, నవ్వులను పంచుకున్నారు. 'లాల్ సింగ్ చద్దాలో అమీర్ ఖాన్ ఒక చిన్న పిల్లాడిలా, కాలేజ్ స్టూడంట్లా, ఆర్మీ ఆఫీసర్లా కనిపిస్తారు. ఈ టాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది' అని నాగార్జున ప్రశ్నించారు. దానికి వీఎఫ్ఎక్స్ వాళ్లు అంతా చేశారని అమీర్ ఖాన్ చెప్పగా.. 'ఈ మాటలు ఎడిట్ చేయండి' అని చిరంజీవి చెప్పడం సరదాగా ఉంది. చదవండి: ప్రియుడితో బర్త్‌డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్ ఈ క్రమంలోనే 'ఈ సినిమాలో పదేళ్ల వయసులోనే హీరో ప్రేమలో పడతాడు' అని నాగార్జున అన్న వెంటనే.. 'మీరు తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు?' అని చిరుని అమీర్ ఖాన్ అడుగుతారు. అప్పుడు చిరంజీవి 'ఏడో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. ఒక అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మా మొగల్తూరులో చాలా ఆశ్చర్యంగా ఉండేది. అలాంటిది ఆ అమ్మాయి పట్టుకుంటే నేను సైకిల్ తొక్కేవాడిని. అప్పుడు సైకిల్ తొక్కడంపై కాన్సంట్రేషన్ పక్కన పెట్టి ఆమెను చూసేవాన్ని. అప్పుడు ఆమె ముందు చూడు అంటూ నా ముఖాన్ని ముందుకు తిప్పేది' అని తెలిపారు. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ అలాగే చిరంజీవితో సినిమా చేయాలని ఉందని అమీర్ ఖాన్ తెలిపారు. మెగాస్టార్‌తో డైరెక్షన్, లేదా ప్రొడక్షన్లో సినిమా చేస్తానని అమీర్ అన్నారు. అప్పుడు చిరంజీవి 'టేక్ వన్ ఓకే కాదు కదా..' అని అనండతో అమీర్ నవ్వేశారు. తర్వాత 'ప్రొడక్షన్ ఓకే. డైరెక్షన్ మాత్రం ఒప్పుకోవద్దు' అని నాగార్జున సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ చిత్రాల్లో ఏదైనా రీమేక్ చేయాలంటే ఏ సినిమా తీస్తారు అని చిరంజీవిని అడిగిన ప్రశ్నకు 'ఏ మూవీ తీయను' అని సమాధానమిచ్చారు. ఇలా ఆద్యంతం నవ్వులతో, ఆసక్తిగా ఈ ప్రొమో సాగింది. మరీ మరిన్ని ఆసక్తికర విషయాలేంటో తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్వ్యూ టెలీకాస్ట్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే. -
ఆమె నా హృదయం ముక్కలు చేసింది: నాగ చైతన్య
నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా 'థ్యాంక్యూ'. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈనెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై మరింత హైప్ నెలకొంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశీఖన్నా, నాగచైతన్య సందడి చేశారు. ఈ సందర్భంగా తన ఫస్ట్ లవ్ గురించి నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. 'నా ఫస్ట్‌లవ్ తొమ్మిదో తరగతిలో జరిగింది. ముగ్గురం కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసేవాళ్లం. అయితే ఆ అమ్మాయి తమ హృదయాలను ముక్కలు చేసింది' అంటూ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ముగ్గురం మంచి స్నేహితులుగా మారిపోయామంటూ తెలిపాడు. ప్రస్తుతం చై చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
జీవితాంతం సింగిల్‌గానే ఉంటా!: హమీదా బ్రేకప్ లవ్ స్టోరీ
కోరుకున్న ప్రతీది మన సొంతం కాదు, అది వస్తువు అయినా, ప్రేమ అయినా! హమీదా విషయంలో ఇదే జరిగింది. కాకపోతే ఆ ప్రేమ పొందినట్లే పొంది అంతలోనే చేజారిపోయింది. ఆ ప్రేమ ముచ్చట్లను మరోసారి గుర్తు చేసుకుంటూ కంతడి పెట్టుకుంది హమీదా. బిగ్‌బాస్ అన్‌సీన్ వీడియోలో హమీదా తన తొలి ప్రేమ కథను వెల్లడించింది. "మాది మూడేళ్ల ప్రేమనో, పదేళ్ల ప్రేమనో తెలియడం లేదు. మా మధ్య ఎప్పుడూ బ్రేకప్ అవ్వలేదు, కానీ కలిసి ఉండలేకపోతున్నాం. నా ఫ్యామిలీ కోసం వాడిని వదులుకున్నా. వాడి పేరు తల్చుకున్నా కూడా ఏడుపొస్తుంది. వాడిని జాన్ అని పిలిచేదాన్ని, ఇప్పటికీ తను నాకు జానే. నేను వాడికి న్యాయం చేశానా? అన్యాయం చేశానా? నాకు తెలియదు." "కానీ వాడే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్. మేము కలిసి తిరిగిన జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నా. ఐదేళ్ల తర్వాత కలిసినప్పుడు వాడికి చెప్పాను.. స్టిల్ ఐ లవ్యూ అని! దానికతడు లేట్ అయిపోయిందన్నాడు. అప్పుడు నేను ఏమన్నానంటే.. నువ్వు ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకపోతే ఇలానే సోలోగా, ఫ్యామిలీతో ఉండిపోతాను అని చెప్పాను. వాడిని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు ఫోన్ చేసినా కూడా లవ్ యూ అని చెప్తూనే ఉంటాను. వాడు కూడా లవ్ యూ టూ అంటాడు, కానీ తనకు నా మీద నమ్మకం లేదు. మళ్లీ నేను ఫ్యామిలీ దగ్గరకు వెళ్లిపోయి ఎక్కడ వదిలేస్తానో అనుకుంటున్నాడు. ఈ ప్రేమ విషయం నా పేరెంట్స్‌కు కూడా ఇంతవరకు చెప్పలేదు. కానీ వాళ్ల కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. తనతో ఉన్న జ్ఞాపకాలను డిలీట్ చేశాను" అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది హమీదా. -
తన ఫస్ట్‌లవ్‌ను పరిచయం చేసిన వర్మ
తరచూ వివాదాలు, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సారి కొత్తగా వైరల్ అవుతున్నాడు. తాజాగా తన ఫస్ట్ లవర్‌ను పరిచయం చేస్తూ ఆమె ఫొటో షేర్ చేశాడు. అయితే కమిట్మెంట్ లేని బంధాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆర్జీవీ ఇలా తన తొలిప్రేమను పరిచయం చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అతిలోకసుందరి, దివంగత నటి శ్రీదేవి తన క్రష్ అని చెప్పుకొచ్చిన వర్మ కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆమె పేరు పోలవరపు సత్య అని, ఆమె మెడిసిన్ చేసినట్లు తెలిపాడు. (చదవండి: మహానటి సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్ హీరో తెలుసా!) కాగా విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఆర్జీవీ బిటెక్ చదివిన విషయం తెలిసిందే. అదే క్యాంపస్‌లో సిద్దార్థ మెడికల్ కాలేజీలో సత్య మెడిసిన్ చేసిందని చెప్పాడు. అవి రెండు క్యాంపస్‌లు ఒకేచోట ఉండటంతో రోజు సత్యను చూసేవాడినని, అలా తనతో ప్రేమలో పడిపోయినట్లు చెప్పాడు. కానీ ఆమె డబ్బు ఉన్న మరో వ్యక్తితో ప్రేమలో ఉన్న కారణంగా తనని పట్టించుకునేది కాదనే భావనలో ఉండేవాడినన్నాడు. అలా ‘రంగీలా’ మూవీ స్టోరీ పుట్టిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం సత్య అమెరికాలో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తున్నట్లు వర్మ చెప్పాడు. అంతేగాక బీజ్ తీరాన స్విమ్‌సూట్‌లో ఉన్న ఆమె ఫొటోలను తన వరుస ట్వీట్లలో షేర్ చేశాడు. చదవండి: ఆ వీడియోలోని వ్యక్తి నేను కాదు.. జో బైడెన్ మీద ఒట్టు!: వర్మ My land mark film SATYA and Sridevi’s name in KSHANA KSHANAM were named after @PolavarapuSatya ..Incidentally these pics are her today’s present photos she sent me from Miami Beach pic.twitter.com/yIvAS8jb9u — Ram Gopal Varma (@RGVzoomin) August 25, 2021 -
వర్చ్యువల్‌లో... ‘నో ఫీల్’ అంటున్న లవర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఒక్కరి జీవన శైలిపైనా, చేసే పనులపైనా కరోనా మహమ్మారి చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ ప్రభావం ఎన్నింటికో అతీతమైన ప్రేమ ప్రపంచాన్నీ వదలలేదు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎవరి ఇంట్లో వారు బందీలుగా గడిపిన దాదాపు ఏడాదిన్నర కాలం.. పరస్పర ప్రేమ, సాన్నిహిత్యాలను ను పునః సమీక్షించుకునే అవకాశాన్ని మాత్రం అందించింది. ఈ నేపథ్యంలో ‘లవ్ సర్వే 2021’ను ఐప్సోస్ భాగస్వామ్యంతో ఐటీసీ ఎంగేజ్ నిర్వహించిన తొలి ప్రేమ అధ్యయనం.. పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. 63% మంది స్పందన దారులు దీర్ఘకాలపు బంధాలను విశ్వసిస్తున్నారు. భౌతికదూరం..ప్రేమకు అవరోధం ఈ ప్రశ్నకు సమాధానంగా నాన్ మెట్రో నగరాలలోని 36% మంది, భౌతికంగా దూరంగా ఉండాల్సి రావడమనేది ప్రేమానుబంధాలకి అవరోధం కానే కాదని అభిప్రాయపడ్డారు. ఈ రోజుల్లో ప్రేమను సజీవంగా ఉంచడానికి ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే దీనిపై నాన్ మెట్రో నగరాల ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా కేవలం 24% మంది మెట్రో సిటిజనులు మాత్రమే దీనిని అంగీకరిస్తున్నారు. లవ్‌కి లాక్... దాదాపుగా 80% సింగిల్/క్యాజువల్ డేట్స్, తమ లవ్ జర్నీ ఆరంభించడం/ ఓ బంధాన్ని అల్లుకోవడం ఈ సమయంలో కష్టంగానే భావించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 75% మంది లాక్డౌన్ల కారణంగా కొత్త లవ్ అఫైర్‌ను స్టార్ట్ చేయడం మాత్రమే కాదు, తాజాగా అల్లుకున్న అనుబంధాలను బలోపేతం చేయడం కూడా కష్టంగానే మారిందన్నారు. అయితే అదే సమయంలో మరో కోణంలో నుంచి చూస్తే తమ సంబంధాల లోతుపాతుల్ని అర్థం చేసుకోవడానికి కూడా ఇది సహాయపడిందని అంగీకరించారు. వర్చ్యవల్...రియల్? వాస్తవ ప్రేమతో పోల్చినప్పుడు వర్చ్యువల్ ప్రేమాయణం పూర్తి భిన్నమైనదని 98% మంది భావించారు. వర్చ్యువల్ ప్రేమాయణంలో ప్రామాణికత ఉండదని, కొన్ని సార్లు ప్రమాదకరమైనదిగా కూడా అత్యధికులు భావిస్తున్నారు. అయితే వాస్తవ జీవితంలో ఎవరైతే కాస్త సిగ్గరిగా అంతర్ముఖులుగా ఉంటారో అలాంటి వారికి వర్చ్యువల్ ప్రేమాయణం సహాయపడవచ్చని 50% మంది భావించారు. అలాగే 50% మంది వర్చ్యువల్ ప్రేమ సరసమైనది/క్యాజువల్‌గా ఉంటుందని.. అయితే తీవ్రంగా మాత్రం ఉండదని చెబుతున్నారు. అదే విధంగా ఈ తరహా ప్రేమానుబంధం కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరంగా మారవచ్చని 46% మంది అభిప్రాయపడ్డారు. కలివిడిగా...విడివిడిగా... మహమ్మారి కాలంలో ప్రేమికుల లవ్‌జర్నీ స్లోగా మారింది. కోవిడ్ నేపధ్యంలో ‘కలిసి ఉండటం’ అనే పద ప్రయోగం 23% తగ్గగా, ‘కెమిస్ట్రీ’ అనే పద ప్రయోగం ఇప్పటి వాతావరణంలో 14%కి పడిపోయింది. అయితే ప్రేమికుల మధ్య నెగిటివ్ వర్డ్స్‌గా పేర్కొనే ‘ కష్టం’, ‘ఆందోళన’, ‘అసహనం’ వంటి పద ప్రయోగాలు వరుసగా 25%, 15%, 20% పెరిగాయి. ఈ ఎంగేజ్ లవ్ సర్వే 2021ను 18-35 సంవత్సరాల వయసు కలిగిన, మెట్రో, మెట్రోయేతర నగరాలలో ఉన్న యువతీయువకులతో నిర్వహించారు. -
ఆ ప్రేమని మరచిపోలేం
తొలి ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మాట చాలామంది అంటారు. తాజాగా కియారా అద్వానీ కూడా అలానే అంటున్నారు. స్కూల్ డేస్‌లో కియారా ప్రేమలో పడ్డారట. అయితే ఈ వయసులో చదువు మీద దృష్టి పెట్టాలి.. ప్రేమా గీమా అని తిరగడానికి వీల్లేదని తల్లితండ్రులు చెప్పడంతో ఆ ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టారట. ‘‘ఫస్ట్ లవ్‌ని అంత సులువుగా మరచిపోలేం. ఎప్పుడు తలుచుకున్నా మధురంగానే ఉంటుంది. చిన్నప్పుడు ఒకరి మీద ఏర్పడ్డ ప్రేమ అలానే ఉండిపోతుంది’’ అన్నారు కియారా. ఇదిలా ఉంటే.. హృతిక్ రోషన్ హీరోగా రూపొందనున్న ‘క్రిష్’ సిరీస్ ‘క్రిష్ 4’లో కథానాయికగా నటించే అవకాశం కియారాకి దక్కిందని సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు నాయికలు ఉంటారట. ఒక నాయికగా కృతీ సనన్ని ఎంపిక చేయగా, లాక్ డౌన్ కారణంగా తారుమారైన షూటింగ్ తేదీల వల్ల ఆమె తప్పకున్నారట. ఆ స్థానంలో కియారాని ఎంపిక చేశారని బాలీవుడ్ టాక్. ‘క్రిష్’ 2, 3వ భాగాలలో హీరోయిన్గా నటించిన ప్రియాంకా చోప్రా కూడా ‘క్రిష్ 4’లో ఓ కథానాయికగా నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
తొలి ప్రేమ, ఆ ముద్దును మర్చిపోలేము..
న్యూఢిల్లీ : మొదటిసారి ప్రేమలో పడటమన్నది ఓ ప్రత్యేమైన భావన. చాలా మంది తమ తొలి ప్రేమ మర్చిపోలేనిదని అంటుంటారు. 30 ఏళ్ల క్రితందైనా నిన్న,మొన్న జరిగిందానిలా గుర్తు చేసుకుంటుంటారు. ఓ అవకాశం వస్తే దాని గురించి మాట్లాడటానికి ఏ మాత్రం వెనుకాడరు. అయితే మొదటిసారి ప్రేమించిన వ్యక్తులను మర్చిపోలేమా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. ఓ ప్రముఖ మీడియా మొదటిప్రేమ గురించి కొంతమంది వ్యక్తులను ప్రశ్నించగా వారు ఏ మాత్రం ఆలోచించకుండా గతంలో ప్రేమించిన వారి గురించి గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం పెళ్లై పిల్లలు ఉన్నప్పటికి తొలిసారి ప్రేమించిన వ్యక్తి గురించి మాట్లాడటానికి జంకటం లేదు. ఇది ఆడ,మగ తేడాలు లేకుండా ఇద్దరి విషయంలో ఒకే రకమైన స్పందన కలిగివుంది. సదరు మీడియా ఢిల్లీకి చెందిన ఓ మహిళను ప్రశ్నించినపుడు ఆమె తన మొదటి ప్రేమను గుర్తుచేసుకుని ఆనందపడిపోయింది. తన ప్రేమను తెలుపటానికి ధైర్యం సరిపోకపోవటం వల్లే అది విఫలమైందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు 30 ఏళ్లు గడుస్తున్నా అతడు గుర్తున్నాడని చెప్పింది. ఏళ్లు గడుస్తున్నా ఆ ప్రేమ అలా గుర్తుండిపోవటానికి సైంటిఫిక్ కారణం లేకపోలేదు. కొత్తగా మనం నేర్చుకున్న విషయాలు ప్రేమ కావచ్చు, సైకిల్ తొక్కటం కావచ్చు అది ఏదైనా మన జ్ఞాపకాల్లోంచి చెరిగిపోవటం చాలా కష్టం. మన మెదడులో ఉన్న హిప్పోకాంపస్ అనే భాగం కారణంగా కొత్త అనుభవాలు, జ్ఞాపకాలు చివరి వరకు గుర్తుండిపోతాయి. మొదటిసారి ప్రేమలో పడటం, ముద్దు పెట్టుకోవటం వంటి భావోద్వేగ పూరిత జ్ఞాపకాలు మెదడులోని పలు భాగాల్లో నిక్షిప్తమై ఉంటాయని జర్నల్ న్యూరాన్ అనే సర్వేలో కూడా వెల్లడైంది. మన ఎమోషన్ మొదటి ప్రేమ తాలూకూ జ్ఞాపకాలను నిన్న, మొన్న జరిగినట్లుగా తాజాగా ఉంచుతుంది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
పదిహేడేళ్లకే ప్రేమలో పడ్డా
‘‘సాధారణంగా కొందరికి వారి తొలి ప్రేమ ఎక్కువ శాతం స్కూల్ టీచర్‌తోనే ఉంటుంది. వాళ్లంటే తెలియని ఆకర్షణ ఏర్పడుతుంది. నాక్కూడా ఓ టీచర్‌పై అట్రాక్షన్ ఏర్పడింది. కానీ నేను తొలిసారి ప్రేమలో పడింది మాత్రం పదిహేడేళ్ల వయసులోనే’’ అన్నారు కంగనా రనౌత్. ఇటీవల జరిగిన ఓ సదస్సులో కంగనా తన తొలి ప్రేమకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ‘‘మేం అప్పుడు (17 ఏళ్ల వయసులో) చండీఘర్‌లో ఉండేవాళ్లం. మా ఫ్రెండ్ ఒక అబ్బాయితో డేట్‌కి వెళ్లింది. ఆ అబ్బాయి వాళ్ల ఫ్రెండ్‌తో నేను ఉండాల్సి వచ్చింది. అతను పంజాబీ అబ్బాయి. చాలా క్యూట్‌గా ఉండేవాడు (నవ్వుతూ). కానీ నా ప్రేమ గురించి అతనికి చెప్పినప్పుడు, నన్ను చూసి ‘నువ్వు చిన్న పిల్లవి’ అన్నాడు. నా గుండె పగిలినంత పని అయింది. ‘నాకొక్క చాన్స్ ఇవ్వు, ఎదుగుతాను’ అని మెసేజ్‌లు చేసేదాన్ని. మేం కొన్ని రోజులు డేటింగ్ చేసి, విడిపోయాం. నిజానికి నాకు ముద్దు పెట్టడం కూడా సరిగ్గా వచ్చేది కాదు. అతనికి ఎలా ముద్దు పెట్టాలని నా అరచేతిని ముద్దాడుతూ ముద్దుపెట్టడం ప్రాక్టీస్ చేసేదాన్ని. అతనితో నా తొలి ముద్దు కూడా అంత మ్యాజికల్‌గా ఏం జరగలేదు. ముద్దుపెట్టుకునే సమయానికి బిగుసుకుపోయాను’’ అని టీనేజ్ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. -
గర్భవతినయ్యా.. సమాజం కోసం తప్పు చేయను
అమ్మ గెస్టెడ్ ఆఫీసర్, నాన్న బిజినెస్ మెన్. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండటంతో చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారు. కాలం గడుస్తున్న కొద్ది అమ్మ నాన్నలు వారి పనుల్లో బిజీగా ఉంటడంతో వారితో కనీసం మాట్లాడటానికి కూడా సరిగ్గా సమయం దొరికేది కాదు. ఎదురుపడితే వారి నుంచి వచ్చే మొదటి మాట డబ్బులేమైనా కావాలారా? అంటూ అడిగి పని ఉందంటూ వెళ్లిపోయేవారు. అప్పుడే ఇంటర్మీడియట్ పూర్తయింది. మంచి మార్కులు రావడం, ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీటు రావడంతో మా స్నేహితులందరం ఆస్ట్రేలియాకు సరదాగా వెళ్లాం. ఆస్ట్రేలియా వెళుతుండగా మొదటిసారి విమానంలో చందర్‌ని చూశా. మా ట్రావెల్ ఏజెంట్ ద్వారానే అతను కూడా ఆస్ట్రేలియాకు రావడంతో తిరిగి ఇండియా వచ్చే వరకు అతను మాతోనే ట్రావెల్ అయ్యాడు. ఓ రోజు ఉదయాన్నే సిడ్నిలోని డార్లింగ్ హార్బర్ సమీపంలో ఓ రెస్టారెంట్లో టిఫిన్ చేయడానికి వెళ్లాను. తిరిగి వస్తుండగా అమ్మ దగ్గరి నుంచి ఫోన్ రావడంతో మాట్లాడుతూ.. చూసుకోకుండా నడవడంతో ఫౌంటేయిన్ నీళ్లలో పడిపోయే సమయంలో ఒక్కసారిగా చందర్ చేయిపట్టి లాగాడు. విమానంలోనే తొలిసారి చూపులోనే చందర్‌తో మాట్లాడాలన్న నామదిలోని కోరిక అనుకోకుండా ఇలా నెరవేరింది. ఫౌంటేయిన్ నుంచి పైకి వచ్చే నీటి బిందువుల తుంపరలు మాపై అక్షింతలుగా పడుతున్నట్టు అనిపించింది. జాగ్రత్తగా ఉండాలంటూ అతడు ఏదో చెబుతున్నా, అనంతమైన ఆనందంలో అతడికి బదులివ్వడానికి కూడా స్పందించలేకపోయా. కొద్ది సేపటి తర్వాత తేరుకుని మాట్లాడటం ప్రారంభించా. అతడిది కూడా హైదరాబాద్ అని, అది కూడా మా పక్క కాలనీనే అని తెలుసుకుని సంబరపడిపోయా. ఆ పరిచయం చాలా తక్కువ సమయంలోనే మమ్మల్ని ఎంతో దగ్గర చేసింది. అతడితో మాట్లాడుతున్నంత సేపు వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉండేది. ఆస్ట్రేలియా పర్యటన క్షణాల్లో ముగిసినట్టనిపించింది. హైదరాబాద్ వచ్చాక అతడిని చూడకుండా, మాట్లాడకుండా ఉండలేకపోయేదాన్ని. ఓ రోజు చందర్‌తో నా ఫీలింగ్స్‌ని షేర్ చేసుకున్నా. సరిగ్గా నేనేం చెప్పాలనుకుంటున్నానో దానికి కొనసాగింపుగా చందర్ నుంచి బదులు రావడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కాలేజీ ప్రారంభమవ్వడంతో హైదరాబాద్‌లో అతను, ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌కి నేను వెళ్లాల్సి వచ్చింది. చందర్, నేను చదువుతో కుస్తీ పడుతున్నా రోజూ ఫోన్లో మాట్లాడుకోకుండా ఉండేవాళ్లం కాదు. ఫోన్లో మాట్లాడినా అతడికి దూరంగా ఉన్నాననే బాధ నాలో తీవ్రస్థాయికి చేరుకుంది. సెమిస్టర్ పరీక్షలు పూర్తవ్వగానే రాకెట్ వేగంతో వచ్చి అతడిపై వాలిపోయాను. మా మధ్య ఏర్పడిన దూరాన్ని.. వీలైనంత తక్కువ చేయాలనుకున్నాను. మా ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో చందర్తోనే గడిపేదాన్ని. ఎందుకో స్నేహితులు, తల్లిదండ్రుల దగ్గర కూడా లభించనిస్పేస్ చందర్ దగ్గర దొరికేది. తిరిగి యూనివర్సిటీకి వెళ్లిపోయాక ఓ రోజు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ని సంప్రదించగా నేను గర్భవతినని తెలిసింది. ఈ విషయాన్ని వెంటనే చందర్కి చెప్పాను. మా ప్రేమకి ప్రతిరూపాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ఇద్దరం నిశ్చయించుకున్నాం. వివాహం విషయంలో ఇప్పుడేనా అంటూ చందర్ సంశయించినా, పుట్టబోయే చిన్నారి విషయంలో ఎలాంటి సందేహం లేకుండా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి? వాళ్లు నా నిర్ణయాన్ని స్వీకరిస్తారా ? లేదా ఒకవేళ వాళ్లు ఓకే చెప్పినా పెళ్లి కాకుండానే తల్లిని అవ్వడాన్ని సమాజం ఎలా చూస్తుంది. జీవితంలో చందర్ నేను ఖచ్చితంగా మంచి పొజీషన్లో సెటిల్ అవ్వుతామనే నమ్మకం ఉంది. ఇప్పటికీ నేను తప్పు చేశాను అనే ఇబ్బంది నాకు అనిపించడం లేదు. కానీ, ఈ సమాజం దృష్టిలో మంచిదాన్ని అని నిరూపించుకోవడానికి నా కడుపులో పెరుగుతున్న చిన్నారిని చిద్రం చేసే తప్పు మాత్రం చేయలేను. అందుకే దృఢంగా నిశ్చయించుకున్నా. ఏది ఏమైనా మా ప్రేమ నిజం. దానికి నిదర్శనమైన పసికందును మాత్రం ఈ సమాజం కోసం బలి ఇవ్వాలనుకోవడం లేదు. అయితే చుట్టుపక్కల వాళ్లు చూసే చూపును, వాళ్ల మేకుల్లాంటి మాటలనుంచి తట్టుకునే శక్తి రావాలని కోరుకుంటున్నాను. అటుపై ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి. -
ఆమె పేరు స్వాతి.. సాక్షికి చెప్పొద్దు ప్లీజ్!
చెన్నై: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతను తన తొలిప్రేమపై పెదవి విప్పాడు. తన బయోపిక్ ‘ధోని–ది అన్‌టోల్డ్ స్టోరీ’లో లేని ముచ్చటొకటి చెప్పాడు. మెజీషియన్ సరదాగా ధోని తొలి ప్రేమ గురించి వివరించమన్నప్పుడు ఈ కహానీ వెలుగులోకి వచ్చింది. మొదట ఆమె పేరులో ‘ఎ’ అక్షరముంటుందన్నాడు. తర్వాత అది పేరులోని మూడో అక్షరమన్నాడు. చివరకు ‘ఆమె పేరు స్వాతి. కానీ నా భార్య (సాక్షి)కు మాత్రం చెప్పకండి. ప్లీజ్..’ అని నవ్వుతూ చెప్పేశాడు. దీనిపై ఇంకాస్త వివరణ ఇస్తూ... 1999లో తను 12వ తరగతి చదువుతుండగా తొలిప్రేమ చిగురించిందని చెప్పాడు. ఆ ఏడాది తర్వాత తననెప్పుడూ చూడలేదన్నాడు. -
తలైవా ‘తొలిప్రేమ’ ముచ్చట.. వైరల్!
కౌలాలంపూర్: ఇటీవల రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ రజనీ చెప్పిన విషయం ఏంటంటారా.. తలైవా తొలిప్రేమ ముచ్చట్లు మరి. ఇంకేం.. అభిమానులు రజనీ చెప్పిన పాత జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ (ఎస్ఐఏఏ) వేడుకలు మలేషియాలో జరుగుతున్నాయి. నడిగర్ సంఘం భవనానికి సంబంధించి నిధుల సేకరణ కోసం ఈవెంట్ ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న సంబర్భంగా తలైవా రజనీకాంత్ తాను తొలిసారి ప్రేమలో పడ్డ విషయాన్ని వెల్లడించారు. ‘కర్ణాటకలో హైస్కూల్లో చదువుకునే రోజుల్లో ఓ విద్యార్థినిని ప్రేమించాను. తొలిప్రేమను అందరూ గెలవలేరు. నా పరిస్థితి అలాగే అయింది. ఫస్ట్ లవ్‌లో సక్సెస్ కాలేకపోయాను’ అంటూ నోరు విప్పారు. ఏకంగా సూపర్ స్టార్ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పారంటూ సోషల్ మీడియాలో రజనీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. లవ్‌లో ఫెయిలయ్యానని చెప్పిన తలైవా.. ఎంత అడిగినా ఆమె పేరు మాత్రం చెప్పలేదు. రాజకీయాలపై ఓ ప్రశ్నకు రజనీ బదులిస్తూ.. 1996లోనే రాజకీయల్లోకి రానందుకు తాను ఒక్క క్షణం కూడా బాధ పడలేదన్నారు. కేవలం అందుకు కాస్త సమయం పట్టిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు రజనీ, స్టార్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘2.ఓ’. అమీ జాక్సన్ రజనీతో జతకట్టగా, విలన్ పాత్రలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఈ సమ్మర్లో మూవీ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. -
కోహ్లి 'ఫస్ట్ లవ్' ఎవరో తెలుసా!
న్యూఢిల్లీ: మైదానంలో విశ్వరూపం చూపుతూ.. సయమొచ్చినప్పుడల్లా రికార్డులు బ్రేక్ చేస్తున్న విరాట్ కోహ్లి ఇప్పుడు భారత క్రికెట్ ప్రేమికులకు కొత్త ఆరాధ్య దైవమయ్యాడు. ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తున్న ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ మైదానంలో ప్రదర్శనతోనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. గాఢమైన ప్రేమలో మునిగిపోయి కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నకోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క బ్రేకప్ కథనాలు కంచికి చేరి వీరు మళ్లీ ఒకటయ్యారు. ఈ ప్రేమజంట మళ్లీ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. నూనుగు మీసాల యవ్వనప్రాయంలో తాను కరిష్మా కపూర్ అంటే పడి చచ్చేవాడినని, ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ లాంటి భావన ఆమెతోనే మొదలైందని చెప్పుకొచ్చాడు. విరాట్ కుర్ర వయస్సులో ఉన్నప్పుడు కరిష్మా కపూర్ హీరోయిన్గా బాలీవుడ్‌ను ఏలింది. అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇప్పుడు కరిష్మా సినిమాల నుంచి తప్పుకుంది. విరాట్ క్రికెట్ రంగంలో దూసుకుపోతూ తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో తన యుక్తప్రాయం గురించిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కోహ్లి ఈ విషయాలు తెలిపాడు. -
ప్రేమిస్తే.. ఒప్పిస్తాం!
‘కమల్ ఖిల్తే హై.. ఆంఖ్ భరాతీ హై జబ్ కభీ లబ్‌పే తేరా నామ్ వహ్వా ఆతా హై..’ (నీ వలపుల పేరు పెదవులపై నడయాడినంతనే కమలాలు వికసిస్తాయి. కళ్లు ఆనందంతో మెరుస్తాయి) భాగమతిని గురించి కవి మఖ్దూమ్ మొహియుద్దీన్ స్పందన ఇది. షాజహాన్ తన ప్రియురాలి కోసం ఒక్క తాజ్‌మహల్‌నే కట్టించాడు. కానీ కులీకుతుబ్‌షా ఒక మహానగరాన్నే నిర్మించాడు. బహుశా మానవ చరిత్రలోనే తొలి ప్రేమ నగరం మన హైదరాబాద్. సాక్షి, సిటీబ్యూరో: ప్రేమంటే త్యాగం.. ప్రేమంటే సాహసం... అందుకే ప్రేమించాలంటే గొప్ప శక్తి కావాలి అంటున్న నగర యువత... ప్రేమిస్తే.. తప్పకుండా పెద్దలను ఒప్పించే పెళ్లి పీటల వరకు వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా నగరంలోని 17 నుంచి 22 ఏళ్ల వయసున్న యూత్ తమ మనోగతాన్ని ఆవిష్కరించేందుకు నిర్వహించిన ‘క్విక్ సర్వే’లో వారంతా ప్రేమకు ఓటేసినా.. పెద్దల అంగీకారమే ముఖ్యమని చెప్పేశారు. ప్రేమ పెళ్లి చేసుకుంటామని అబ్బాయిలు అధిక సంఖ్యలో చెప్పగా... అమ్మాయిలకు వచ్చేసరికి ఎక్కువ మంది పెద్దలు కుదిర్చిన పెళ్లికే ఓటేశారు. ‘ప్రేమిస్తే ఎలా పెళ్లి చేసుకుంటార’న్న ప్రశ్నపై స్పందిస్తూ... ‘పెద్దలను ఒప్పిస్తా’మని మెజారిటీ అమ్మాయిలు చెప్పగా... అబ్బాయిలు దాదాపుగా వారితో ఏకీభవిస్తూ ‘పెద్దల దీవెనలు కావాల’ని అన్నారు. ‘ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా?’ అన్న ప్రశ్నకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా మనసు పారేసుకుంటున్నారని తేలింది. తొలి చూపులో పుట్టే ప్రేమపై వేసిన ప్రశ్నకు అబ్బాయిలు, అమ్మాయిలు ‘అది ఒట్టి ఆకర్షణే’నని తేల్చారు. తొలి చూపులో ప్రేమలో పడటమంటే కేవలం వ్యామోహమేనని చెప్పారు. ‘సాక్షి’ సర్వే ఫలితాలపై మానసిక విశ్లేషకులు డాక్టర్ సి.వీరేందర్ స్పందిస్తూ.. నేడు ప్రేమ కం టే కెరీర్ ముఖ్యమైన అంశం గా యూత్‌లో కనిపిస్తోందన్నారు. వృత్తిలో స్థిరపడ్డాకే ప్రేమ -పెళ్లి అంశాలు చర్చకు వస్తున్నాయని చెప్పారు. తొలి చూపులో ప్రేమ అనేదే ఉండదని... అది పూర్తి ఆకర్షణనేనని అనేక అంశాల్లో వెల్లడైందని పేర్కొన్నారు. -
ఒక ప్రేమలేఖ... ఓ గులాబీ పువ్వు!
అమ్మాయికైనా అబ్బాయికైనా తొలి ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే, ‘ఐ లవ్ యు’ అని మొదట ప్రపోజ్ చేసిన వ్యక్తిని జీవితాంతం మర్చిపోలేరు. నయనతారకు అలా జీవితాంతం గుర్తుండిపోయే అబ్బాయి ఒకడు ఉన్నాడు. ఈ బ్యూటీ కో-ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుకున్నారు. అందుకని అబ్బాయిలందరితో స్నేహంగా ఉండేవారు. ఆ విషయం నయనతార చెబుతూ - ‘‘అమ్మాయిలతో ఎలా స్నేహంగా ఉండేదాన్నో అబ్బాయిలతో కూడా అలానే ఉండేదాన్ని. ఒకే ఒక్క అబ్బాయి తప్ప మిగతావాళ్లందరూ నాతో అలానే ఉండేవాళ్లు. అప్పుడు నేను మూడో తరగతి చదువుతున్న రోజులు. నేను క్లాస్ గదిలోకి వచ్చేసరికే నా డెస్క్ కింద ఒక ప్రేమలేఖ, ఓ గులాబీ పువ్వు ఉండేవి. ఆ లేఖలో సంతకం ఉండేది కాదు. దాంతో ఎవరు రాశారో తెలియక తికమకపడేదాన్ని. చాలా భయం వేసేది. నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్‌కి ఈ విషయం చెప్పాను. రోజుల తరబడి లవ్ లెటర్, పువ్వు దర్శనిమవ్వడంతో మా అమ్మకు చెప్పాను. స్కూల్‌కి వచ్చి మా అమ్మ కంప్లైంట్ చేశాక ఆ అబ్బాయి ఎవరో తెలిసింది. అతను ఏడో తరగతి అబ్బాయి. ప్రిన్సిపాల్ మేడమ్ పిలిచి, బాగా చీవాట్లు పెట్టారు. అసలా వయసు అబ్బాయికి ప్రేమ అంటే ఏంటో ఏం తెలుస్తుంది? ఆ విషయం ఇప్పుడు తల్చుకున్నా నాకు వింతగా ఉంటుంది’’ అని తెలిపారు. -
తొలిప్రేమ కబుర్లు
ప్రేమ గురించి పరులతో చెప్పుకోకూడదు. అలాగే మన ప్రేమ గురించి పరులు చెప్పుకోకూడదు అనే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘ఫస్ట్ లవ్’. మహేంద్ర, అమితారావ్ జంటగా నటించారు. అంబటి గోపి దర్శకుడు. సత్యనారాయణ మంగలిపల్లి, నాగరాజు మంగలిపల్లి నిర్మాతలు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేమను రహస్యంగా ఎందుకు ఉంచాలి అనేది ఇందులో ప్రధానాంశం. చక్కని సందేశం ఉంటుంది. అన్ని వయసులవారికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అని చెప్పారు. ఇటీవల విడుదలైన పాటలకు స్పందన బావుందని నిర్మాతలు తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, కొండవలస, ప్రభాస్‌శ్రీను, అన్నపూర్ణ, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటివీర, సంగీతం: జీవన్ థామస్. -
తొలిప్రేమ ఎంత మధురం
తొలి ప్రేమ ఎంతో మధురమైనది. ఆ ప్రేమ సఫలం అయినా, విఫలం అయినా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ తొలి ప్రేమ మాధుర్యాన్ని ప్రధానాంశంగా చేసుకుని, సన్‌రైజ్ మూవీ ఆర్ట్స్ పతాకంపై చరణ్, బేబి అక్షర సమర్పణలో మంగిలిపల్లి సత్యనారాయణ, మంగిలిపల్లి నాగరాజు నిర్మించిన చిత్రం ‘ఫస్ట్ లవ్’. అంబటి గోపి దర్శకుడు. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన మహేంద్ర ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. అమితారావ్ కథానాయిక. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే నెల ప్రథమార్ధంలో విడుదల చేయాలనుకుంటున్నాం. ఈ సినిమా కవితాత్మకంగా, కళాత్మకంగా, వినోదాత్మకంగా ఉంటుంది. నేటి తరం దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? అనే విషయాన్ని చర్చిస్తున్నాం. అన్ని వర్గాలవారు చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జీవన్ థామస్, కెమెరా: రాఘవ నూలేటి. -
ప్రేమ ఎవరినైనా ఓడిస్తుంది
ఓటమిని ఎరుగని వాడిని సైతం ఓడించే శక్తి ప్రేమకు ఉందని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఫస్ట్ లవ్’. మహేంద్ర, అమితారావ్ జంటగా నటించారు. రచయిత అంబటి గోపి ఈ చిత్రానికి దర్శకుడు. మంగిలిపల్లి సత్యనారాయణ, మంగిలిపల్లి నాగరాజు నిర్మాతలు. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు చెబుతూ -‘‘ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి. ఆస్వాదిస్తే తప్ప దాని విలువ తెలీదు. ఈ సినిమా చూసే ప్రేక్షకుడు అలాంటి అనుభూతికే లోనవుతాడు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘దేవి, పెదరాయుడు, అడవిలో అన్న, పెళ్లి చేసుకుందాం, సింహరాశి, సింహాద్రి తదితర చిత్రాల్లో బాలనటునిగా నటించిన మహేంద్రను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాం. అంబటి గోపి అద్భుతంగా చిత్రాన్ని మలిచాడు. ఇటీవల విడుదలైన పాటలకు కూడా మంచి స్పందన లభిస్తోంది. తొలికాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, ప్రభాస్ శ్రీను, వేణు, కొండవలస తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటి, సంగీతం: జీవన్ థామస్, కూర్పు: నందమూరి హరి, సమర్పణ: చరణ్, అక్షర. -
బాలనటుడు మహేంద్ర హీరోగా 'ఫస్ట్ లవ్'తో పరిచయం
అంబటి గోపి దర్శకత్వంలో రూపొందిన ఫస్ట్ లవ్ చిత్రం సెప్టెంబర్ నెలాఖరున విడుదల కానుంది. -
ఫస్ట్ లవ్ పాటలు
‘‘ఫస్ట్ లవ్ అనే పదం అనిర్వచనీయమైనది. నిర్వచనం ఉంటే అది ఫస్ట్ లవ్ కానే కాదు. ఈ చిత్రదర్శకుడు అంబటి గోపి నాకు మంచి స్నేహితుడు. సాహిత్యం మీద తనకు పట్టుంది. అద్భుతమైన పుస్తకాలు రాసాడు. తను తీసిన ఈ సినిమా కవితాత్మకంగా, కళాత్మకంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఎన్. శంకర్. మహేంద్ర, అమితారావ్ జంటగా అంబటి గోపి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫస్ట్ లవ్’ మరియు బేబి అక్షర సమర్పణలో సన్‌షైన్ మూవీ ఆర్ట్స్ పతాకంపై సత్యనారాయణ మంగలిపల్లి, నాగరాజు మంగలిపల్లి నిర్మిస్తున్నారు. జీవన్ థామస్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో సీడీని ఎన్. శంకర్ ఆవిష్కరించి, సోనియాకి ఇచ్చారు. ఇంకా ఈ వేడుకలో టి.ప్రసన్నకుమార్, బసిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, మోహన్ వడ్లపట్ల, మధుర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈవీవీగారు దర్శకత్వం వహించిన ‘మావిడాకులు’ చిత్రం ద్వారా రచయితగా నా కెరీర్ ప్రారంభమైంది. ‘లిటిల్ సోల్జర్’ చిత్రానికి సోలోగా మాటలు రాశాను. దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ప్రేమలో కోత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రం ఇది’’ అన్నారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించామని, అవుట్‌పుట్ బాగా వచ్చిందని నిర్మాతల్లో ఒకరైన సత్యనారాయణ చెప్పారు. ఈ చిత్రంలో నటించడంపట్ల మహేంద్ర, అమితారావ్ ఆనందం వ్యక్తం చేశారు. మంచి పాటలివ్వడానికి స్కోప్ ఉన్న కథ అని జీవన్ థామస్ తెలిపారు.