ప్రేమ ఎవరినైనా ఓడిస్తుంది | Love will defeat anybody, say producers | Sakshi
Sakshi News home page

ప్రేమ ఎవరినైనా ఓడిస్తుంది

Published Wed, Oct 9 2013 12:37 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM

ప్రేమ ఎవరినైనా ఓడిస్తుంది

ప్రేమ ఎవరినైనా ఓడిస్తుంది

ఓటమిని ఎరుగని వాడిని సైతం ఓడించే శక్తి ప్రేమకు ఉందని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఫస్ట్ లవ్’. మహేంద్ర, అమితారావ్ జంటగా నటించారు. రచయిత అంబటి గోపి ఈ చిత్రానికి దర్శకుడు. మంగిలిపల్లి సత్యనారాయణ, మంగిలిపల్లి నాగరాజు నిర్మాతలు. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు చెబుతూ -‘‘ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి. ఆస్వాదిస్తే తప్ప దాని విలువ తెలీదు. ఈ సినిమా చూసే ప్రేక్షకుడు అలాంటి అనుభూతికే లోనవుతాడు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది’’ అని చెప్పారు. 
 
‘‘దేవి, పెదరాయుడు, అడవిలో అన్న, పెళ్లి చేసుకుందాం, సింహరాశి, సింహాద్రి తదితర చిత్రాల్లో బాలనటునిగా నటించిన మహేంద్రను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాం. అంబటి గోపి అద్భుతంగా చిత్రాన్ని మలిచాడు. ఇటీవల విడుదలైన పాటలకు కూడా మంచి స్పందన లభిస్తోంది.  తొలికాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, ప్రభాస్ శ్రీను, వేణు, కొండవలస తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటి, సంగీతం: జీవన్ థామస్, కూర్పు: నందమూరి హరి, సమర్పణ: చరణ్, అక్షర.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement