mahendra
-
మహీంద్రా XUV 700 పై భారీ డిస్కౌంట్
-
నకిలీ అధికారి అవతారమెత్తిన టీడీపీ నేత పుట్టా అనుచరుడు
సాక్షి ప్రతినిధి, కడప: సీఐడీ అధికారులమంటూ హడావుడి చేసిన నకిలీ అధికారుల బండారం బట్టబయలయిన ఘటనలో వైఎస్సార్ జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడితో సహా 8మందిని cc అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన న్యాయవాది మహేంద్రకుమార్ (38) టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడు. పుట్టా సుధాకర్‌యాదవ్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన రంజిత్‌కుమార్ (47)తో పరిచయం ఏర్పడింది. అతను గతంలో తాను పనిచేసిన హైదరాబాద్ కేంద్రంగా అమెరికా ఐటీ నియామకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజా (ఏజేఏ) సంస్థ వ్యవహారాల గురించి మహేంద్రకుమార్‌కు తెలిపారు. ఆ సంస్థ లొసుగుల కారణంగా డైరెక్టర్ సుగుణాకరను బెదిరిస్తే రూ.కోట్లు కొల్లగొట్టవచ్చని చెప్పాడు. ఈ క్రమంలో కర్నూల్ రేంజ్ కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సుజన్‌ను సంప్రదించారు. ఎస్ఐ సుజన్ కడప అశోక్‌నగర్‌లో ఉంటున్న ఐటీ నిపుణుడు మహ్మద్ అబ్దుల్ ఖదీర్‌ను పరిచయం చేశారు. టెక్నికల్ ఇష్యూస్ బాగా తెలిసిన మరికొంతమంది సభ్యులతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ మేరకు అజా సంస్థలోకి ప్రవేశించారు. సీఐడీ అధికారులుగా గుర్తింపు కార్డులు చూపించి తనిఖీలు నిర్వహించి నానా హడావుడి చేశారు. రూ.10కోట్లు డిమాండ్ అమెరికాలోని క్లయింట్ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆ దేశ అధికారులు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలకు వచ్చినట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ను భయపెట్టారు. ఈ వ్యవహారం నుంచి బయటపడాలంటే రూ.10కోట్లు ముట్టచెప్పాలని డిమాండ్ చేశారు. బేరసారాల తర్వాత రూ.2.3కోట్లు అప్పగించేలా అంగీకారం కుదిరింది. కంపెనీ ఖాతాల్లో రూ.71.80 లక్షలున్నాయని బాధితుడు చెప్పారు. నేరుగా తీసుకుంటే దొరికిపోతామని భావించి ఆ సంస్థ ఉద్యోగులు రవి, చేతన్, హరి ఖాతాల్లోకి రూ.26 లక్షలు బదలాయించారు. ఈ మొత్తం వ్యవహారం జనవరి 26న చోటు చేసుకుంది. 27వ తేదీ ఉదయం ఆ ముగ్గురు ఉద్యోగుల్ని మాదాపూర్‌లోని బాల్కనీ హోటల్‌కు తీసుకెళ్లి బంధించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు వివరాలు తీసుకుని రూ.12.5లక్షలు తమ ఖాతాల్లోకి మార్చుకున్నారు. మిగతా సొమ్ముకోసం డైరెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. ఉద్యోగుల్ని వదిలేసి పారిపోయారు. విషయం గ్రహించిన సంస్థ డైరెక్టర్ సుగుణాకర పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో సహకరించిన వారితో పాటు, ప్రత్యక్షంగా పాల్గొన్న 10మందిపై కేసు నమోదైంది. మైదుకూరు టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడు మహేంద్రకుమార్, సుబ్బకృష్ణతో పాటు 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుజన్, రాజా అనే నిందితుడు పరారీలో ఉన్నారు. -
క్లీన్ కామెడీతో పార్టీ
‘‘రెండు గంటల పాటు ప్రేక్షకులు నవ్వుకునే క్లీన్ కామెడీతో ‘సౌండ్ పార్టీ’ని రూపొందించాం’’ అన్నారు రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర. వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర మాట్లాడుతూ– ‘‘అమెరికాలో వ్యాపారం చేస్తున్న మేం సినిమాలపై ఫ్యాషన్‌తో తెలుగులో ‘సౌండ్ పార్టీ’ తీశాం. అమాయకులైన తండ్రీ కొడుకులిద్దరూ ధనవంతులు అయిపోవడానికి ఏం చేశారనేది ఈ చిత్రకథ. మన ప్రేక్షకులైనా, అమెరికా ఆడియన్స్ అయినా కామెడీ జానర్ చిత్రాలనే ఎక్కువగా ఇష్టపడతారు. మా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 100, యూఎస్‌లో 150కి పైగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
మహేంద్ర మృతిపై సీఐడీ విచారణ
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఫ్లెక్సీ వివాదంలో మనస్తాపంతో బొంత మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై సీఐడీ ద్వారా సమగ్ర విచారణ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ప్రకటించారు. మహేంద్ర మృతి అనంతరం జరిగిన పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయన్నారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తనపైన, ప్రభుత్వంపైన దురుద్దేశంతో బురదజల్లుతున్నారని అన్నారు. మంత్రి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘పెనకనమెట్టలో 13వ తేదీన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉండగా జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి భర్త పోసిబాబు ఫోన్లో మాట్లాడారు. ఆయన సోదరుడి కుమారుడు మహేంద్రను పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. వెంటనే స్టేషన్‌కి ఫోన్ చేయించి మహేంద్రను ఇంటికి పంపమని సూచించాను. తర్వాత మహేంద్రను ఇంటికి పంపారు. మహేంద్ర పురుగుమందు తాగినట్లు తర్వాత రోజు తెలిసింది. మహేంద్ర చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో నేనే మాట్లాడాను. తర్వాత విజయవాడ తీసుకెళ్లినట్లు ఎవరూ చెప్పలేదు. 15వ తేదీ ఉదయం ఏలూరు రేంజ్ డీఐజీ ఫోన్ చేసి మహేంద్ర మృతి విషయం చెప్పారు. మహేంద్ర కుటుంబం ఏమీ చెప్పకపోయినా నేనే చొరవ తీసుకుని చేయగలిగిన సాయమంతా చేశాను. మహేంద్ర మృతదేహం వచ్చే సమయానికి నాయకులతో కలిసి అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా కొందరు యువకులు మోటారు సైకిళ్లపై వచ్చి నా కాన్వాయ్‌పై రాళ్లు, సీసాలు, కర్రలతో దాడులు చేశారు’ అని చెప్పారు. తానేదో పోలీసుల్ని ఆర్డర్ చేసి మహేంద్రను ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు చేస్తున్నారని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హోంమంత్రి చెప్పారు. మహేంద్ర మృతిలో నిజాలు నిగ్గుతేలాలంటే సీఐడీ విచారణ చేయించాలని తాను సీఎం వైఎస్ జగన్‌ను కోరానని, వెంటనే చేయిస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. -
V-Trans India Limited: మూడేళ్లలో రూ. 3,000 కోట్ల టర్నోవరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాజిస్టిక్స్ సొల్యూషన్స్ సంస్థ వీ–ట్రాన్స్ ఇండియా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,000 కోట్ల టర్నోవరు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణాది మార్కెట్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. ఈ క్రమంలో 600 పైచిలుకు ఉద్యోగాలు కల్పించనుంది. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ మహేంద్ర షా ఈ వివరాలు వెల్లడించారు. కేంద్రం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో లాజిస్టిక్స్ రంగానికి, తద్వారా తమ సంస్థ వృద్ధికి ఊతం లభించగలదని ఆయన వివరించారు. దేశీయంగా తయారీకి ప్రాధాన్యం పెరుగుతుండటంతో డిమాండ్‌కి అనుగుణంగా గిడ్డంగులు, కొత్త శాఖలను ఏర్పాటు చేయడంపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు షా చెప్పారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు సంస్థ ఈడీ రాజేష్ షా చెప్పారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న తమ సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,000 పైగా శాఖలు, 50 పైచిలుకు ట్రాన్స్షిప్మెంట్ సెంటర్లు, 2,500 పైగా ట్రక్కులు ఉన్నట్లు ఆయన వివరించారు. -
మొదటి భార్య చనిపోయింది, ఇక నీతోనే ఉంటా..
సాక్షి, నంద్యాల(దొర్నిపాడు): డబ్బు కోసం ఓ ప్రబుద్ధుడు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుని డబ్బు కోసం పీడించి పిప్పి చేశాడు. రెండో భార్య గమనించి ఆరా తీయగా అతగాడి బండారం బయటపడింది. ఎస్ఐ తిరుపాలు తెలిపిన వివరాలు .. చాకరాజువేముల గ్రామానికి చెందిన మహేంద్రబాబు బుర్రారెడ్డిపల్లె గ్రామానికి చెందిన నాగలక్ష్మిదేవిని నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా డబ్బు కోసం పీడించేవాడు. అతని ప్రవర్తనలో మార్పు గమనించిన భార్య.. ఆరా తీయగా అతనికి ఇంతకుముందే మార్కాపురం గ్రామానికి చెందిన మరో మహిళ లలితతో వివాహమైనట్లు తెలిసింది. ఇదే విషయమై నిలదీయగా మొదటి భార్య చనిపోయిందని, ఇక నీతోనే ఉంటానని నమ్మబలికాడు. ఏదో సాకులు చెబుతూ డబ్బు కోసం శారీరంగా, మానసికంగా వేధించేవాడు. ఆత్మహత్య చేసుకుంటే బీమా సొమ్ము వస్తుందని చావుకు ప్రేరేపించేవాడు. ఇదంతా తన తల్లి లక్ష్మిదేవికి తెలిసే చేస్తుండటంతో భరించలేక రెండో భార్య పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా మహేంద్రబాబు ఇటీవల కృష్ణా జిల్లా చల్లాపల్లి మండలం నక్కలగడ్డ గ్రామానికి చెందిన భవానీని నమ్మించి మూడో పెళ్లి చేసుకున్నట్లు బయటపడింది. మూడో భార్య తల్లి వద్ద లోన్ యాప్ ద్వారా రూ.5లక్షలు తీసుకొని మోసం చేశాడు. దీంతో గురువారం మహేంద్రబాబు, అతని తల్లి లక్ష్మిదేవిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..) -
మనసు కుదిరింది.. పెళ్లి జరిగింది
‘పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితే పెళ్లి జరుగుతుంది’ అని సామెత. అంటే పిచ్చి కుదరదు... పెళ్లి జరగదు అని అర్థం. కాని ఆ సామెతను తప్పు చేశారు ఇద్దరు ప్రేమికులు. మానసిక అస్వస్థతతో చెన్నై పిచ్చాసుపత్రిలో విడివిడిగా చేరిన ఈ ఇరువురుకి అక్కడ పరిచయమైంది. వ్యాధి నయం కావడంతో పెళ్లి నిర్ణయానికి వచ్చారు. 200 ఏళ్ల చరిత్రగల ఆ ఆస్పత్రిలో ఈ ఘటన మొదటిసారి. మానసిక అస్వస్థత కూడా జ్వరం, కామెర్లులా నయం కాదగ్గదే. గమనించి వైద్యం చేయిస్తే పూర్వ జీవితం గడపొచ్చు. చెన్నైలో జరిగిన ఈ పెళ్లి ఆశలు వదులుకునే మానసిక అస్వస్థులకు గొప్ప శుభవార్త. శుభమస్తు వార్త. మానసిక అస్వస్థత వస్తే ఈ సమాజంలో ఎన్నో అపోహలు, భయాలు, ఆందోళనలు, హేళనలు ఆపై బహిష్కరణలు. ‘పిచ్చివారు’ అని ముద్ర వేసి వారికి వైద్యం చేయించాలనే ఆలోచన కూడా చేయరు. అదే జ్వరం వస్తే జ్వరం అని చూపిస్తారు. కాని మనసు చలిస్తే ఏదో దెయ్యం పట్టిందని వదిలేస్తారు. మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వాలు, సేవా సంస్థలు ఎంతో ప్రచారం చేస్తున్నా వైద్యం అందాల్సిన వారు, వైద్యం చేయించాల్సిన వారు కూడా అవగాహన లోపంతో వున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే ‘నాకేమైనా పిచ్చా’ అని ఎదురు తిరుగుతారు పేషెంట్లు. ‘పిచ్చి’ ముద్ర వేస్తారని. ‘పిచ్చికి మందు లేదు’ అని వదిలేస్తారు బంధువులు. ఇద్దరూ ఓర్పు వహిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి అనడానికి ఇదిగో ఇదే ఉదాహరణ. చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్’ (ఐ.ఎం.హెచ్.) బ్రిటిష్ కాలం నాటిది. దేశంలోనే రెండవ అతి పెద్ద మానసిక చికిత్సాలయం. అందులో కొంత కాలం కిందట వైద్యం కోసం చేరారు మహేంద్ర (42), దీప (38). కుటుంబాలు వారిని చేర్పించి చేతులు దులుపుకున్నాయి. కాని వారు బాగయ్యారు. కొత్త జీవితం గడపాలనుకున్నారు. కాని బయటకు వెళితే ‘నయమై వచ్చినా’ అమ్మో పిచ్చోళ్లు అనే వివక్షతో చూస్తారు జనం. ఆ భయంతో మళ్లీ హాస్పిటల్‌కు వచ్చేశారు. దాంతో హాస్పిటల్ వారే వారికి లోపల ఉద్యోగాలు కల్పించారు. మహేంద్ర డేకేర్ సెంటర్లో పని చేస్తుంటే దీప కేంటిన్లో పని చేస్తోంది. మెల్లగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సంగతి అడ్మినిస్ట్రేషన్‌కు తెలియగానే హడలిపోయారు. ఎందుకంటే ఇలాంటిది ఇంతకు మునుపు ఎరగరు. ఇదేమైనా ఇష్యూ అవుతుందా అనుకున్నారు. కాని హాస్పిటల్ డైరెక్టర్ అయిన డాక్టర్ పూర్ణ దగ్గరకు వచ్చిన దీప ‘నేను అతనితో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానమ్మా’ అని చెప్పే సరికి ఆమెకు ఆ స్త్రీ హృదయం అర్థమైంది. అంతే. హాస్పిటల్లో పని చేసే అందరూ తలా ఒక చేయి వేసి వారి పెళ్లికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు. తాళిబొట్టు ఆ ఏరియా ఎం.ఎల్.ఏ. ఏర్పాటు చేశాడు. అంతేనా హెల్త్ మినిస్టర్ శేఖర్ బాబు, ఎం.పి. దయానిధి మారన్ ఏ బందోబస్తు లేకుండా సగటు బంధువుల్లా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటే జీవితం ముగిసినట్టు కాదు. స్వల్ప కాలం ఇబ్బంది పడ్డా నయమయ్యి కొత్త జీవితం గడపవచ్చు. అందుకు ఉచిత వైద్యం దొరుకుతుంది. కనుక ఆరోగ్యాన్ని గమనించి సమస్య వస్తే జయించండి. కొత్త జీవితాన్ని కళకళలాడించండి. ఎవరికి తెలుసు... ఇప్పుడు కష్టం వచ్చినా భవిష్యత్తు ఎన్ని సంతోషాలను దాచిపెట్టి ఉందో! -
బజారున పడ్డ ప్రేమ పెళ్లి.. తాళి తెంచి, కూతురిని..
సాక్షి, మైసూరు: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తమను కాదని ప్రియునితో వెళ్లిపోవడంతో తట్టుకోలేని తండ్రి రోడ్డుపైనే ఆమెపై దాడి చేశాడు. కుమార్తె మెడలో ఉన్న తాళిబొట్టును తెంచివేసి జుట్టు పట్టుకొని తండ్రి ఈడ్చుకెళ్తుండగా జనం అడ్డుకున్నారు. వివరాలు... నంజనగూడు తాలూకాలోని హరతళె గ్రామానికి చెందిన చైత్ర, హల్ళెర గ్రామానికి చెందిన మహేంద్ర సుమారు ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకున్నారు. చదవండి: (లైంగిన దాడికి గురైన బాలికకు శిశువు జననం) యువతి తల్లిదండ్రులు దీనిని అంగీకరించలేదు. దాంతో ప్రేమజంట ఈ నెల 8వ తేదీన ఒక గుడిలో మూడుముళ్లు వేసుకుని, ఆ పెళ్ళిని రిజిస్టర్ చేసుకోవాలని సోమవారం సాయంత్రం 4 గంటలప్పుడు నంజనగూడుకు రాగా, చైత్ర తండ్రి బవసరాజు నాయక్ అడ్డుకున్నాడు. కుమార్తె మెడలోని తాళిని తెంచి, ఆమె జుట్టు పట్టుకుని లాక్కెళ్లసాగాడు. చైత్ర కాపాడండి అని అరవడంతో స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే తండ్రి నుంచి విడిపించుకుని భర్తను చేరుకుంది. స్థానికుల సహాయంతో ఆమె నంజనగూడు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి తండ్రిపై ఫిర్యాదు చేసింది. తండ్రి నుంచి తమకు భద్రత కల్పించాలని కోరింది. ఈ తతంగమంతా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. -
'గ్రీన్ పవర్ 'పేరుతో ఓలా, మహేంద్ర కంపెనీల్లో మొత్తం మహిళా బృందాలే
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రముఖ దిగ్గజ కంపెనీలు అయిన ఓలా, మహేంద్ర ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో ముందుంజలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు కంపెనీలు ఒక ఉమ్మడి అంశంపైనే దృష్టి కేంద్రీకరించాయి. ఇంతకీ ఆ ఉమ్మడి అంశం ఏమిటంటే ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో మొత్తం మహిళా కార్మకులే నిర్వహిస్తారని ఓలా సీఈవో భవేశ్ అగర్వాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: కోవిడ్ పేరు చెప్పి రుణం తీసుకున్నాడు...కటకటాల పాలయ్యాడు) ఈ మేరకు 2022 కల్లా దాదాపు 10 మిలయన్ల స్కూటర్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తరుణంలో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో 'గర్ల్ పవర్' వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వినియోగదారులతో పంచుకున్నారు. అలానే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర నేపాల్‌లోని మహేంద్ర కంపెనీ కూడా మొత్తం మహిళా శక్తి బృందంతోనే ట్రియో ఎలక్ట్రిక్ ఆటోను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆనంద్ మహేంద్ర మొత్తం మహిళా బృందాన్ని అభినందిస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. అయితే ఓలా సీఈవో భవిశ్ ఈ ఫ్యూచర్ ఫ్యాక్టరీ పూర్తిగా మహిళ సామర్థ్యంతో పనిచేయడమే కాక దాదపు 10 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించి ప్రపంచవ్యాప్తంగా మహిళలతో కూడిన ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా ఉంటుందని ముందుగానే ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు భవిశ్ అగర్వాల్ ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్న మహిళల వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రెండు దిగ్గజ కంపెనీలు 'గ్రీన్ పవర్' పేరుతో మహిళా శక్తి పైనే దృష్టి కేంద్రీకరించారంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు) Sneak peak of the scooters in production. The women at our Futurefactory are ramping up production fast! #JoinTheRevolution @OlaElectric pic.twitter.com/Z0eanudV8X — Bhavish Aggarwal (@bhash) October 27, 2021 -
మరణాలు @ 33 వేలు
వాషింగ్టన్/లండన్: అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్–19 మరణాలు 33 వేల మార్కును దాటేసింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారితో 33,490 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఇందులో బుధవారం ఒక్క రోజే 6,185 మంది చనిపోగా, గురువారం మరో 2,763 మంది మృతి చెందారు. ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటి వరకు 16,251 మంది చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశం మొత్తమ్మీద కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారానికి 6,54,343కు చేరుకుంది. అయితే, కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గినందున అమెరికన్లంతా తిరిగి పనుల్లోకి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ నెలలోనే తిరిగి మార్కెట్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడిన అనంతరం కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఎప్పుడు ప్రారంభించాలో అధ్యక్షుడే నిర్ణయిస్తాడంటూ రాష్ట్రాల గవర్నర్లతో విభేదించిన ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఈ విషయంలో అధ్యక్షుడి కంటే గవర్నర్లకే అధికారాలు ఎక్కువగా ఉన్నాయని అంగీకరించారు. మే 1వ తేదీ నుంచి అమెరికాలో మార్కెట్లు తిరిగి తెరవాలని తొలుత భావించారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో కేసులు, మృతుల సంఖ్య భారీగా తగ్గడం వల్ల, అంతకంటే ముందే ఆయా రాష్ట్రాలు పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనాపై పోరా టాన్ని కొనసాగిస్తామని చెబుతున్న ట్రంప్ కొన్ని రాష్ట్రాల్లో వాణిజ్య కార్యకలాపాలు మొదలైతే అమెరికా ఆర్థిక రంగా న్ని నిలబెట్టవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ మరణాల సంఖ్యను కొన్ని దేశాలు దాచి పెట్టడం వల్లే అమెరికా జాబితాలో ముందుందని వ్యాఖ్యానించారు. యూరప్‌లో కరోనా ఉగ్రరూపం యూరప్‌లో కరోనా కేసులు 10 లక్షల 50 వేలు దాటిపోయాయి. మృతుల సంఖ్య 90 వేలు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 65 శాతానికి పైగా యూరప్‌లో సంభవించాయి. ఈ పరిణామంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్నాళ్లూ వైరస్ వణికించిన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉంటే మరికొన్ని కొత్త దేశాలకు వైరస్ పాకిందని డబ్ల్యూహెచ్‌వో యూరప్ రీజనల్ డైరెక్టర్ హన్స్ క్లుగె అన్నారు. బ్రిటన్, టర్కీ, ఉక్రెయిన్, బెలారస్, రష్యాలలో వైరస్ తీవ్రరూపం దాలుస్తోందన్నారు. యూరప్‌కి ముప్పు ఇంకా తొలగిపోలేదని అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. తోట చుట్టూ వంద సార్లు రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ తరఫున పోరాడిన సైనిక వీరుడు కెప్టెన్ టామ్ మూరె ఇప్పుడు 99 ఏళ్ల వయసులో కరోనాని ఎదుర్కోవడానికి తన పోరాటపటిమను ప్రదర్శించారు. తన ఇంట్లో గార్డెన్ చుట్టూ వందసార్లు తిరిగారు. దీంతో 1.2 కోట్ల పౌండ్లు యూకే హెల్త్‌కేర్ చారిటీకి సంపాదించారు. వాకర్ సాయంతో ఆయన తనకు ఇచ్చిన టాస్క్‌ని పూర్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో తనకు వచ్చిన మెడల్స్ అన్నీ డ్రెస్‌కి తగిలించుకొని ఆయన తోట చుట్టూ తిరగడం ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. విరాళాలు వెల్లువెత్తాయి. మహీంద్రా పీపీఈల తయారీ భారత ఆటోమొబైల్స్ పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా అమెరికాలోని డెట్రాయిట్ యూనిట్లో వ్యక్తిగత రక్షణ పరికరాలు (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్–పీపీఈ) తయారీకి సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో ఆరోగ్య సిబ్బందికి అవసరమైన సర్జికల్ మాస్కులు, గౌన్లతో పాటుగా వెంటిలేటర్లను కూడా భారీ సంఖ్యలో తయారు చేయనుంది. ‘ప్రస్తుతం కోవిడ్‌పై పోరాటానికి అవసరమైనవి తయారు చేయడమే అందరి లక్ష్యం కావాలి. మా దగ్గర నిరంతరం పని చేసే సిబ్బంది ఉన్నారు’అని ఆ సంస్థ ఉత్తర అమెరికా సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. టీకాతోనే సాధారణ పరిస్థితులు కోవిడ్ నివారణకు టీకా అభివృద్ధి చేస్తేనే ప్రపంచంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశముందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్ స్పష్టం చేశారు. ‘టీకా ఒక్కటే ప్రపంచంలో సాధారణ పరిస్థితులున్న భావనను తీసుకురాగలదు. దీంతో కోటానుకోట్ల డాలర్ల మొత్తం ఆదా అవడమే కాకుండా విలువైన ప్రాణాలు మిగుల్చుకోవచ్చు’’అని ఆయన ఆఫ్రికాదేశాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు లక్షల కోట్ల డాలర్ల విరాళాలు సేకరించాలని తాను మార్చి 25న పిలుపునివ్వగా ఇప్పటివరకూ ఇందులో 20 శాతం మొత్తం అందిందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులను తట్టుకునేందుకు ఆఫ్రికన్ దేశాలు, ప్రభుత్వాలు చేస్తున్న కృషిని కొనియాడారు. -
కారు.. పల్లె‘టూరు’
అమ్మకాలు పడిపోయి... ఆపసోపాలు పడుతున్న వాహన కంపెనీలకు వరుణుడు కరుణచూపాడు. ఈ ఏడాది వానలు కాస్త లేటయినా... దండిగానే కురవడంతో ఇప్పుడు ఆటోమొబైల్ దిగ్గజాలు ‘వర్షా’తిరేకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పల్లెకు పోదాం.. మందగమనాన్ని తట్టుకుందాం.. అమ్మకాలు పెంచుకుందాం అని పాట పాడుతున్నాయి. గ్రామీణులను ఆకర్షించడానికి గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. తక్కువ వడ్డీరేట్లకు వాహన రుణాలిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నాయి. సర్వీసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. వాహన కంపెనీల పల్లెబాటపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్‌పై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్ తగ్గి అమ్మకాలు కుదేలవడంతో వాహన కంపెనీలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాహన విక్రయాలు గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయాయి. దీంతో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా, టయోటా తదితర వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక మొత్తం అమ్మకాల్లో గ్రామీణ అమ్మకాలు దాదాపు సగంగా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ 3,000కు పైగా తాలుకాల్లో సేల్స్, సర్వీసింగ్ అవుట్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. అమ్మకాలు పెంచుకోవడానికి టీచర్లు, గ్రామాల్లో కుల వృత్తులు చేసే వ్యక్తులపై దృష్టి పెట్టింది. సమృద్ధిగా వర్షాలు.... గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులను ఆకర్షించడానికి వాహన కంపెనీలు గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆకర్షణీయమైన ఎక్సే్ఛంజ్ డీల్స్‌ను, తక్కువ వడ్డీరేట్ల ఫైనాన్స్ స్కీమ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో వర్షాలు పుష్కలంగా కురియడంతో పంటలు సమృద్ధిగా పండి ఆర్థిక వ్యవస్థ త్వరితంగా రికవరీ కాగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్ బాట పడుతున్నాయి. ఖరీఫ్‌లో పంటలు బాగా పండుతాయనే అంచనాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి బడ్జెట్ ప్రోత్సాహాన్నివ్వడం తదితర అంశాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలకు డిమాండ్ పెరగగలదని కంపెనీలు భావిస్తున్నాయి. భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదే... కాగా మందగమనం కారణంగా వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్ బాట పట్టాయనడం పూర్తిగా సరైనది కాదని కొందరు నిపుణలంటున్నారు. పెద్ద నగరాల్లో కాకుండా ఇతర మార్కెట్లలో భవిష్యత్తులో అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలు కూడా దీనికి కారణమని వారంటున్నారు. భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదేనని రెనో ఇండియా ఎండీ మామిళ్లపల్లి వెంకట్రామ్ అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలే ముందుగా మందగమన పరిస్థితులను అధిగమిస్తాయని, ఆ తర్వాత పట్టణాలు పుంజుకుంటాయన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు రియల్టీ కుదేలైందని, ముందుగా గ్రామీణ ప్రాంతాల్లోనే రియల్టీకి డిమాండ్ పెరిగిందని, ఆ తర్వాత పట్టణాల్లో రియల్టీ రంగం పుంజుకుందని ఆయన ఉదహరించారు. ఎంక్వైరీలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంత వినియోగదారుల నుంచి ఎంౖMð్వరీలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఈడీ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ కార్లకు సంబంధించి అధికంగా వివరాలు అడుగుతున్నారని, ఎంక్వైరీలు పెరగడం మార్కెట్ పునరుజ్జీవనం పొందుతుందనడానికి ఆరంభ సంకేతమని పేర్కొన్నారు. మొత్తం మారుతీ అమ్మకాల్లో గ్రామీణ ప్రాంత అమ్మకాలు 38 శాతంగా ఉంటాయి. మందగమనం కారణంగా మారుతీ సుజుకీ కంపెనీ పట్టణ అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్–జూలై కాలంలో భారీగా తగ్గగా, గ్రామీణ ప్రాంత అమ్మకాలు 16 శాతం తగ్గాయి. గ్రామీణ మార్కెటే మెరుగు మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల వ్యాపారంతో పోల్చితే గ్రామీణ వ్యాపారం ఒకింత మెరుగ్గా ఉందని హ్యుందాయ్ సేల్స్ హెడ్ వికాస్ జైన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఈ కంపెనీ గ్రామీణ ప్రాంత అమ్మకాలు 5 శాతం మేర మాత్రమే తగ్గాయి. త్వరలోనే ఈ మార్కెట్లు పుంజుకుంటాయని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు సానుకూల వృద్ధిని సాధించగలవని ఈ కంపెనీ భావిస్తోంది. -
ప్లాన్ ఏంటి?
మహేంద్ర, మమత కులకర్ణిలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతనదర్శకుడు బి.ఎల్.ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘ప్లానింగ్’. అలీషా ప్రత్యేక పాత్రలో నటించారు. సాయి గణేష్ మూవీస్ పతాకంపై టి.వి. రంగసాయి నిర్మించిన ఈ సినిమాకి ఉదయ్ కిరణ్ సంగీతం అందించారు. ఈ చిత్రం పాటలను నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘విజువల్స్, పాటలు బాగున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేకుండా ప్రస్తుతం మంచి సినిమాలు తీస్తున్నారు. మహేంద్ర చక్కగా నటించారు. రంగసాయి కళాతృష్ణతో సినిమాలు తీస్తున్నారు. ఆయన మరిన్ని చిత్రాలు చేయాలి’’ అన్నారు. ‘‘దర్శక–నిర్మాతలు ఎంతో చక్కని ప్లానింగ్‌తో చేసిన సినిమా ఇది’’ అన్నారు కొరియోగ్రాఫర్, హీరో మహేంద్ర. ‘‘ఐటమ్ సాంగ్‌తో కెరీర్ ప్రారంభించిన నేను కథానాయిక అయ్యాను. దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు చేశాను’’ అన్నారు మమత కులకర్ణి. ‘‘మాకు వెన్నుదన్నుగా నిలిచిన కళ్యాణ్‌గారు, స్నేహితులందరికీ ధన్యవాదాలు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా చెక్ చేసుకుని స్క్రిప్టును ఫైనలైజ్ చేసి, సినిమా తీశాం’’ అన్నారు రంగసాయి. ఈ వేడుకలో నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్, దర్శకుడు భాను కిరణ్, సంగీత దర్శకుడు ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బి. ధనుంజయ్, బి. దేవి, నిర్వహణ: బి.భూలక్ష్మి. -
ప్లానేంటి?
మహేంద్ర, కులకర్ణి మమతలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు బి.యల్ ప్రసాద్ రూపొందించిన లవ్, సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్లానింగ్’. టి.వి. రంగసాయి నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేయగా, ఫస్ట్‌లుక్‌ని నిర్మాత మోహన్‌గౌడ్, కోటేశ్వరరావు, ఉర్కుందప్ప, ధనలక్ష్మీ రిలీజ్ చేశారు. అలీషా రంగసాయి టి.వి. ఉర్కుందప్ప, అస్మిత, ఆదిత్య, చైతన్య, సంతోష్, సుప్రీమ్ సాయి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్ కిరణ్, నిర్వహణ: బి.భూలక్ష్మీ, సహ నిర్మాతలు: బి. ధనుంజయ, బి.దేవి, కెమెరా: ఏడుకొండలు. -
ప్రేమానురాగాల సమ్మేళనం
మహేంద్ర, కులకర్ణి మమతా జంటగా రూపొందుతున్న చిత్రం ‘ప్లానింగ్’. బి.ఎల్. ప్రసాద్ దర్శకత్వంలో ఆర్.ఎస్. తిరివీధి నిర్మిస్తున్నారు. కన్నడ నటి అలీషా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కర్ణాటక పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘చక్కని కుటుంబ కథా చిత్రమిది. ప్రేమానురాగాల సమ్మేళనానికి సందేశాన్ని జోడించి తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో 5 పాటలు, 3 ఫైట్లు ఉన్నాయి’’ అన్నారు దర్శకుడు ప్రసాద్. ‘‘రాజీ పడకుండా నిర్మిస్తున్నా. దర్శకుడు విజువల్ వండర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలీషా పాత్ర, ఆమె పై ఉండే సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉంటాయి. ఉదయ్ కిరణ్ మంచి సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు నిర్మాత. రంగసాయి, ఉరుకుందప్ప, సంతోష్, అతిథి, చైతన్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడు: ఏడు కొండలు. -
ఎలుకలొస్తున్నాయ్! జాగ్రత్త!
నేను మర్చిపోలేనంతగా మనస్సులో నిలిచిపోయిన పుస్తకం ‘ఎలుకలొస్తున్నాయ్! జాగ్రత్త’. రచయిత ఎన్.ఆర్.నంది. కథావస్తువును ఎన్నుకోవటంలో గానీ, శైలిలో గానీ, ఇది ఎంతో ఉన్నత ప్రమాణాలతో ఉండటం చేత పాఠకులకు ఈ నవల ఆసక్తిని కలిగిస్తుంది. తెలుగు సాహితీ జగత్తులో ఇదో కొత్త ప్రయోగం అని చెప్పవచ్చు. కథ విషయానికి వస్తే... ఒక లైబ్రరీలో కాపురం ఉండే ఎలుకల జంట ఈ నవల్లోని ముఖ్య పాత్రలు. మగ ఎలుక పేరు మూషిక రాజు (హీరో). ఇది మనుషుల్లాగా మాట్లాడగలదు. లైబ్రరీలోని ఎన్నో పుస్తకాల రుచి (తిని) చూసి ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తుంది. అదే క్రమంలో తన భార్య మూషిక రాణికి లోకం పోకడ వివరిస్తుంది. మానవ సమాజంలోని కుళ్లును, అవినీతిని చూపిస్తుంది. దీని ప్రభావంతో మూషిక రాణి కూడా పుస్తకాల రుచి చూసి, రచనలు చేయటం, మనుషుల్లా మాట్లాడటం అనే దశకు ఎదుగుతుంది. ఈ నేపథ్యంలో లైబ్రేరియన్, మూషిక రాణి రచనకు వచ్చినటువంటి పారితోషికాన్ని కొట్టేయడం, తిరిగి మూషిక రాణి తను ఆ డబ్బును కొట్టేయడం వల్ల పోలీసులు మూషిక రాణిపై దొంగతనం నేరం మోపడం, మూషిక రాణి మాట్లాడుతుంటే ప్రజలు భయపడటం, ప్రభుత్వం మాట్లాడే ఎలుకను, మూషిక రాణిని, మానవ సమాజ ఉద్ధరణ నిమిత్తం ప్రయోగం కోసం ఎన్నుకోవడం, మూషిక రాజు దీనికి ప్రతిఘటించడం, ఒక లాయరు ఈ ఎలుకల తరుపున న్యాయం కోసం కోర్టులో వాదించడం, మూషిక రాజు, ప్రభుత్వ లాయర్లతో ఎన్నో విషయాలపై మేధావుల స్థాయిలో వాదించడం ఈ నవలకే హైలైట్. చివరకు నవల ముగింపు కూడా ఆలోచింపజేస్తుంది. ఈ నవల్లోని ఎలుకలు, అణగదొక్కబడుతున్న వర్గాలకు ప్రతీక! మానవులు తమ స్వార్థం కొరకు ఏ విషయాన్నైనా తమకు అనుకూలంగా ఎలా మలుచుకుంటారో రచయిత కళ్లకు కట్టినట్టు వివరించారు. ఈ నవల చదివిన తరువాత, మన స్వార్థానికి బలయ్యే ప్రతి ఒక్క జీవిపైన సానుభూతి కలుగక మానదు. మామిడి మహేంద్ర -
బీజేపీ గూటికి వాఘేలా కొడుకు
గాంధీనగర్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింహ్ వాఘేలా కొడుకు మహేంద్ర వాఘేలా శనివారం అధికార బీజేపీలో చేరారు. 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లు ఎమ్మెల్యే అయిన మహేంద్ర గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడారు. సీనియర్ ఓబీసీ నేత కువర్జీ బవాలియా ఈనెల మూడో తేదీన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరగా సీఎం విజయ్ రూపానీ ఆయనకు అదే రోజు కేబినెట్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో మహేంద్ర బీజేపీలో చేరడం గమనార్హం. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించిన శంకర్‌సింహ్ కొత్త పార్టీని స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేదు. మహేంద్ర ఏ పార్టీలోనూ చేరబోనని అప్పట్లో ప్రకటించారు. అతని నిర్ణయంపై శంకర్ సింహ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అత్యాశకు పోతే...
‘‘ప్రతి మనిషి జీవితంలో ఎవరికో ఒకరికి ఋణపడుతుంటాడు. ఆ ఋణం తీర్చేవాడు మనిషవుతాడు. అత్యాశ అనేది మనిషి జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలుపుతుంది. ఒక్కోసారి అథః పాతాళానికి తొక్కుతుంది. అత్యాశ వల్ల కలిగే అనర్థాలను ‘రుణం’ చిత్రంలో వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం’’ అన్నారు దర్శకుడు ఎస్. గుండ్రెడ్డి. గోపీకృష్ణ, మహేంద్ర, శిల్ప, తేజు, ప్రియాంక ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో భీమినేని సురేశ్, జి. రామకృష్ణారావు నిర్మిస్తున్న సినిమా ‘రుణం’. పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మానవ సంబంధాలు, మనస్తత్వాల నేపథ్యంలో సినిమా ఉంటుంది’’ అన్నారు. చిత్ర సమర్పకులు గాలిరెడ్డి, గోపీకృష్ణ, మహేంద్ర, ప్రియాంక, విలన్ పాత్రధారి ప్రదీప్ ప్రత్తికొండ, సంగీత దర్శకుడు ఎస్.వి. మల్లిక్ తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.వెంకట్. -
తమిళంలోకి రారా కృష్ణయ్య!
తమిళసినిమా: నటుడు సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన తెలుగు చిత్రం రారా కృష్ణయ్య ఇప్పుడు తమిళంలోకి రానుంది. తమిళంలో మానగరం చిత్రంతో హిట్ జంటగా గుర్తింపు పొందిన సందీప్‌కిషన్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమిళంలో మహేంద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. జగపతిబాబు, తణికెళ్ల భరణి, కావేరి, రవిబాబు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి మహేశ్‌బాబు దర్శకుడు. సాయిరామ్ ఛాయాగ్రహణం, అనురాజామణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని తమిళంలోకి హైమావతి జాంబమూర్తి సమర్పణలో వీవీఎస్.క్రియేషన్స్ పతాకంపై ఎన్.రాయ్రామ్ అనువదిస్తున్నారు. ఎస్.రాజేశ్, రాజశ్రీ, మణికంఠన్, ఎస్.రాయ్రామ్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు తెలుపుతూ ఒక దుష్ట కుటుంబంలో పుట్టిన యువకుడు చిన్నతనం నుంచి మంచి వాడిగా పెరుగుతాడన్నారు.అతన్ని తమ బాటలోకి తీసుకురావడానికి ఆ కుటుంబం ప్రయత్నించగా, వారిని మంచి మార్గంలో పయనింపజేయడానికి ఆ యువకుడు ప్రయత్నిస్తాడన్నారు. వారిలో ఎవరి ప్రయత్నం ఫలించింది? అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం మహేంద్ర అని తెలిపారు.ప్రేమ, యాక్షన్ సన్నివేశాలు అంటూ చిత్రం పక్కా కమర్షియల్ అంశాలతో జనరంజకంగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రేమ, యాక్షన్లతో పక్కా కమర్షియల్..
నటుడు సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన తెలుగు చిత్రం రారా కృష్ణయ్య ఇప్పుడు తమిళంలో రానుంది. మానగరం చిత్రంతో హిట్ జంటగా గుర్తింపు పొందిన సందీప్‌కిషన్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమిళంలో మహేంద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. జగపతిబాబు, తణికెళ్ల భరణి, కావేరి, రవిబాబు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి మహేశ్‌బాబు దర్శకుడు. సాయిరామ్ ఛాయాగ్రహణం, అనురాజామణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని తమిళంలోకి హైమావతి జాంబమూర్తి సమర్పణలో వీవీఎస్.క్రియేషన్స్ పతాకంపై ఎన్.రాయ్రామ్ అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.రాజేశ్, రాజశ్రీ, మణికంఠన్, ఎస్.రాయ్రామ్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ఒక దుష్ట కుటుంబంలో పుట్టిన యువకుడు చిన్నతనం నుంచి మంచివాడిగా పెరుగుతాడని అన్నారు. తమ బాటలోకి తీసుకురావడానికి ఆ కుటుంబం ప్రయత్నిస్తోంది. వారిని మంచి మార్గంలో పయనింపజేయడానికి ఆ యువకుడు ప్రయత్నాం చేస్తాడని తెలిపారు. వారిలో ఎవరి ప్రయత్నం ఫలించింది ? అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం మహేంద్ర అని తెలిపారు. ప్రేమ, యాక్షన్ సన్నివేశాలతో పక్కా కమర్షియల్ అంశాలతో జనరంజకంగా సినిమా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
బాలుడి అదృశ్యం
పెద్దకడబూరు: కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో మహేంద్ర (15) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. మంగళవారం ఉదయం గొర్రెలు కాయటానికి వెళ్లిన మహేంద్ర సాయంత్రమైనా ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గ్రామానికి సమీపాన ఉన్న చెరువు కట్టమీద బాలుడికి సంబంధించిన చెప్పులు, సైకిల్, అన్నం బాక్సు ఉన్నాయి. ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఉంటాడేమోనని అనుమానిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి బాలుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. -
యథార్థ కథ!
భద్రాచలంలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘ప్రేమిక’. మహేంద్ర, పవన్, శౌర్య, లిషిత , మోనిక ముఖ్య తారలుగా శంకర్, వెంకట కృష్ణ, లక్ష్మయ్య నిర్మించిన ఈ చిత్రానికి మహేంద్ర దర్శకుడు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాం. అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అని నిర్మాతలు అన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి, ఛాయాగ్రహణం: రాహుల్ మాచినేని, ప్రోజెక్ట్ ఎగ్జిక్యూటివ్: టి.ఎస్.ఎన్. మూర్తి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రశాంత్ బి.ఎల్, లైన్ ప్రొడ్యూసర్: శౌర్య. -
తొలిప్రేమ ఎంత మధురం
తొలి ప్రేమ ఎంతో మధురమైనది. ఆ ప్రేమ సఫలం అయినా, విఫలం అయినా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ తొలి ప్రేమ మాధుర్యాన్ని ప్రధానాంశంగా చేసుకుని, సన్‌రైజ్ మూవీ ఆర్ట్స్ పతాకంపై చరణ్, బేబి అక్షర సమర్పణలో మంగిలిపల్లి సత్యనారాయణ, మంగిలిపల్లి నాగరాజు నిర్మించిన చిత్రం ‘ఫస్ట్ లవ్’. అంబటి గోపి దర్శకుడు. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన మహేంద్ర ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. అమితారావ్ కథానాయిక. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే నెల ప్రథమార్ధంలో విడుదల చేయాలనుకుంటున్నాం. ఈ సినిమా కవితాత్మకంగా, కళాత్మకంగా, వినోదాత్మకంగా ఉంటుంది. నేటి తరం దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? అనే విషయాన్ని చర్చిస్తున్నాం. అన్ని వర్గాలవారు చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జీవన్ థామస్, కెమెరా: రాఘవ నూలేటి. -
ప్రేమ ఎవరినైనా ఓడిస్తుంది
ఓటమిని ఎరుగని వాడిని సైతం ఓడించే శక్తి ప్రేమకు ఉందని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఫస్ట్ లవ్’. మహేంద్ర, అమితారావ్ జంటగా నటించారు. రచయిత అంబటి గోపి ఈ చిత్రానికి దర్శకుడు. మంగిలిపల్లి సత్యనారాయణ, మంగిలిపల్లి నాగరాజు నిర్మాతలు. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు చెబుతూ -‘‘ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి. ఆస్వాదిస్తే తప్ప దాని విలువ తెలీదు. ఈ సినిమా చూసే ప్రేక్షకుడు అలాంటి అనుభూతికే లోనవుతాడు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘దేవి, పెదరాయుడు, అడవిలో అన్న, పెళ్లి చేసుకుందాం, సింహరాశి, సింహాద్రి తదితర చిత్రాల్లో బాలనటునిగా నటించిన మహేంద్రను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాం. అంబటి గోపి అద్భుతంగా చిత్రాన్ని మలిచాడు. ఇటీవల విడుదలైన పాటలకు కూడా మంచి స్పందన లభిస్తోంది. తొలికాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, ప్రభాస్ శ్రీను, వేణు, కొండవలస తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటి, సంగీతం: జీవన్ థామస్, కూర్పు: నందమూరి హరి, సమర్పణ: చరణ్, అక్షర. -
ఇంటర్నెట్ ప్రేమపెళ్లి
కలికిరి, న్యూస్‌లైన్: అమ్మాయి అనంతపురం జేఎన్టీయూ కళాశాల విద్యార్థిని, అబ్బాయి బెంగళూరు ఆర్మీలో ఉద్యోగి. ఇంటర్నెట్ సాయంతో ఇరువురూ ప్రేమించుకున్నారు. ఫేస్బుక్లో మనసులు కలిశాయి. పెద్దల ప్రమేయం లేకుండా ప్రేమ వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించడంతో కథ సుఖాంతమైంది. వివరాలిలా ఉన్నాయి. కలికిరి మండలం మేడికుర్తి పంచాయతీ పసలవాండ్లపల్లెకు చెందిన ఎం.సహదేవయ్య కుమారుడు మహేంద్ర బెంగళూరులో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అనంతపురం జిల్లా ధర్మవరం కేశవనగర్‌కు చెందిన సత్యనారాయణ కుమార్తె ఎస్.రాజరాజేశ్వరి జేఎన్టీయూ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇరువురూ ఇంటర్నెట్ ద్వారా రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఫేస్బుక్లో ఇద్దరి మనసులూ కలవ డంతో రెండు రోజుల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆదివారం మదనపల్లె డీఎస్పీని కలిశారు. ఆయన సూచనల మేరకు కలికిరి పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ. సోమశేఖర్‌రెడ్డి సోమవారం ఇరు కుటుంబాల పెద్దలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. తామిద్దరం మేజర్లమని, ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రేమికులిద్దరూ తెలిపారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో కొత్త జంట పసలవాండ్లపల్లెకు వెళ్లింది. మంగళవారం ధర్మవరం బయలుదేరింది. -
మధురమైన తొలి ప్రేమ
తొలి ప్రేమ ఎంత తియ్యగా ఉంటుందో అనుభవించిన వారికి తెలుస్తుంది. ఆ తొలి ప్రేయ తియ్యదనాన్ని ప్రధానాంశంగా చేసుకుని అంబటి గోపి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫస్ట్ లవ్’. మహేంద్ర, అమితారావ్ జంటగా రచయిత సన్‌రైజ్ మూవీ ఆర్ట్స్ పతాకంపై చరణ్, అక్షర సమర్పణలో మంగిలిపల్లి సత్యనారాయణ, మంగిలిపల్లి నాగరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ అనే అందమైన అనుభూతిని ఆస్వాదిస్తేనే దాని విలువ తెలుస్తుంది. ఎక్కడ ఏ రంగంలోనైనా, ఏ పోటీలోనైనా గెలిచేవాడు సైతం ప్రేమలో పరాజయం పాలుకావచ్చు. ప్రేమలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘దేవి, పెదరాయుడు, పెళ్లి చేసుకుందాం, అడవిలో అన్న, సింహరాశి, సింహాద్రి తదితర చిత్రాల్లో బాలనటునిగా చేసిన మహేంద్రను హీరోగా ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాం. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ఇటీవల విడుదలైన పాటలు విశేషాదరణ పొందుతున్నాయి. జీవన్ థామస్ మంచి సంగీతం అందించారు’’ అని తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, ప్రభాస్, శ్రీను, వేణు, కొండవలస తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటి, ఎడిటింగ్: నందమూరి హరి.