మధురమైన తొలి ప్రేమ
మధురమైన తొలి ప్రేమ
Published Tue, Sep 24 2013 2:23 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
తొలి ప్రేమ ఎంత తియ్యగా ఉంటుందో అనుభవించిన వారికి తెలుస్తుంది. ఆ తొలి ప్రేయ తియ్యదనాన్ని ప్రధానాంశంగా చేసుకుని అంబటి గోపి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫస్ట్ లవ్’. మహేంద్ర, అమితారావ్ జంటగా రచయిత సన్‌రైజ్ మూవీ ఆర్ట్స్ పతాకంపై చరణ్, అక్షర సమర్పణలో మంగిలిపల్లి సత్యనారాయణ, మంగిలిపల్లి నాగరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ అనే అందమైన అనుభూతిని ఆస్వాదిస్తేనే దాని విలువ తెలుస్తుంది. ఎక్కడ ఏ రంగంలోనైనా, ఏ పోటీలోనైనా గెలిచేవాడు సైతం ప్రేమలో పరాజయం పాలుకావచ్చు. ప్రేమలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా ఉంటుంది’’ అని చెప్పారు.
నిర్మాతలు మాట్లాడుతూ -‘‘దేవి, పెదరాయుడు, పెళ్లి చేసుకుందాం, అడవిలో అన్న, సింహరాశి, సింహాద్రి తదితర చిత్రాల్లో బాలనటునిగా చేసిన మహేంద్రను హీరోగా ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాం. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ఇటీవల విడుదలైన పాటలు విశేషాదరణ పొందుతున్నాయి. జీవన్ థామస్ మంచి సంగీతం అందించారు’’ అని తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, ప్రభాస్, శ్రీను, వేణు, కొండవలస తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటి, ఎడిటింగ్: నందమూరి హరి.
Advertisement
Advertisement