
కొత్తజంట చైత్ర– మహేంద్ర
సాక్షి, మైసూరు: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తమను కాదని ప్రియునితో వెళ్లిపోవడంతో తట్టుకోలేని తండ్రి రోడ్డుపైనే ఆమెపై దాడి చేశాడు. కుమార్తె మెడలో ఉన్న తాళిబొట్టును తెంచివేసి జుట్టు పట్టుకొని తండ్రి ఈడ్చుకెళ్తుండగా జనం అడ్డుకున్నారు. వివరాలు... నంజనగూడు తాలూకాలోని హరతళె గ్రామానికి చెందిన చైత్ర, హల్ళెర గ్రామానికి చెందిన మహేంద్ర సుమారు ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకున్నారు.
చదవండి: (లైంగిన దాడికి గురైన బాలికకు శిశువు జననం)
యువతి తల్లిదండ్రులు దీనిని అంగీకరించలేదు. దాంతో ప్రేమజంట ఈ నెల 8వ తేదీన ఒక గుడిలో మూడుముళ్లు వేసుకుని, ఆ పెళ్ళిని రిజిస్టర్ చేసుకోవాలని సోమవారం సాయంత్రం 4 గంటలప్పుడు నంజనగూడుకు రాగా, చైత్ర తండ్రి బవసరాజు నాయక్ అడ్డుకున్నాడు. కుమార్తె మెడలోని తాళిని తెంచి, ఆమె జుట్టు పట్టుకుని లాక్కెళ్లసాగాడు. చైత్ర కాపాడండి అని అరవడంతో స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే తండ్రి నుంచి విడిపించుకుని భర్తను చేరుకుంది. స్థానికుల సహాయంతో ఆమె నంజనగూడు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి తండ్రిపై ఫిర్యాదు చేసింది. తండ్రి నుంచి తమకు భద్రత కల్పించాలని కోరింది. ఈ తతంగమంతా చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
Comments
Please login to add a commentAdd a comment