Mysore
-
మైసూర్లో రామ్‌చరణ్,జాన్వీకపూర్ ప్రయాణం
హీరో రామ్‌చరణ్ ఓ వైపు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్సీ 16’(వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు ఈ నెలలో మైసూర్ వెళ్లనున్నారాయన. తొలి చిత్రం ‘ఉప్పెన’ తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ద్వితీయ చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేసే అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ‘ఆర్సీ 16’ ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన శివ రాజ్‌కుమార్ పవర్ఫుల్ రోల్ పోషించనున్నారు. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈ నెల 22 నుంచి కర్నాటక రాష్ట్రంలోని మైసూర్లో మొదలవుతుందని సమాచారం. రామ్ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారట బుచ్చిబాబు. అక్కడ నాన్‌స్టాప్‌గా 15 రోజుల పాటు షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
విద్రోహచర్య కారణంగానే భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం !
న్యూఢిల్లీ: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో అక్టోబర్ 11న జరిగిన మైసూర్–దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం వెనుక విద్రోహుల కుట్ర దాగి ఉందని ముగ్గురుసభ్యుల రైల్వే సాంకేతిక బృందం అనుమానాలు వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన చోట పట్టాలకు ఎలాంటి బోల్ట్‌లు లేకపోవడం, పట్టాలను ఎవరో బలవంతంగా అపసవ్య దిశలోకి సుత్తితో కొట్టిన గుర్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 15 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడిన విషయం తెల్సిందే. సవ్యదిశలో నేరుగా వెళ్లాల్సిన రైలు లూప్లైన్లోకి హఠాత్తుగా వచ్చి ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొనడంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. దీంతో రైల్వే సిగ్నల్, టెలికం, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ బృందం ఆదివారం కవరపేట స్టేషన్‌లోని ఘటనాస్థలిలో దర్యాప్తు మొదలెట్టింది. ‘‘రైల్వేపట్టాల ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలోని భాగాలను విడదీశారు. వీటి గురించి బాగా అవగాహన ఉన్న ఆగంతకులే ఈ పని చేశారు. ఇటీవల కవరపేట స్టేషన్ సమీపంలో ఇలాంటి దుశ్చర్యకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక్కడ మాత్రం సఫలమయ్యారు. ఘటన జరగడానికి నాలుగు నిమిషాల ముందే ఇదే పట్టాల మీదుగా ఒక రైలు వెళ్లింది. అది వెళ్లి మైసూర్–దర్భంగా రైలువచ్చేలోపే బోల్ట్‌లు, విడిభాగాలు విడతీశారు’’ అని అధికారులు వెల్లడించారు. -
తమిళనాడులో గూడ్స్ రైలును ఢీ కొన్న మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్... రెండు బోగీల్లో మంటలు... పట్టాలు తప్పిన 13 కోచ్‌లు.. ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు
-
దసరాలో తప్పక చూడాల్సిన ప్యాలెస్ ఇది..!
మైసూర్ అంటేనే దసరా ఉత్సవాలు. దసరా అంటేనే మైసూర్లో జరిగే ఉత్సవాలు. ఇదీ ఒక్కమాటలో చెప్పాలంటే మైసూర్ టూర్. వడయార్ రాజకుటుంబీకులు మైసూర్ ప్యాలెస్‌లో సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా పబ్లిక్‌ను ప్యాలెస్‌లోకి అనుమతిస్తారు. ప్యాలెస్ లోపల వడయార్ కుటుంబీకులు ఉపయోగించిన వస్తువులు, నాటి హస్తకళాఖండాలుంటాయి. దర్బార్ హాల్లో బంగారు సింహాసనాన్ని చూడవచ్చు. ఆ రోజుల్లో అందంగా అలంకరించిన ఏనుగులు ఈ వేడుకలో ప్రత్యేకాకర్షణ. పది రోజుల పాటు ప్యాలెస్ ఆవరణలో సంగీత, నాట్య ప్రదర్శనలు జరుగుతుంటాయి. మైసూర్ ప్యాలెస్‌ని చూసిన తర్వాత కరంజి లేక్‌లో బోట్ షికారు చేసి, వన్యప్రాణుల మధ్య విహరించాలి. జయచామరేంద్ర ఆర్ట్ గ్యాలరీ, ఫిలోమినా చర్చ్ కోసం కూడా కొంత టైమ్ కేటాయించుకోవాలి. ఇక మైసూరు వంటలను రుచి చూడడంతోపాటు మైసూర్ సిల్క్ చీరలను కొనడంతో ట్రిప్ పరిపూర్ణమవుతుంది. పిల్లలతో వెళ్లిన వాళ్లు తప్పకుండా రైల్ మ్యూజియాన్ని కవర్ చేయాలి.ఉదయాన్నే చూడాలి..!మైసూర్ ప్యాలెస్‌లోకి పదిగంటలకు పర్యాటకులను అనుమతిస్తారు. ఆ సమయానికి పది నమిషాల ముందే చేరినట్లయితే జనం తక్కువగా ఉంటారు. పదిన్నర తర్వాత ప్రతి అరగంటకు జనసమ్మర్దం గణనీయంగా పెరుగుతుంది. తొమ్మిదింటికే చేరగలిగితే సూర్యకిరణాలకు మెరిసే ప్యాలెస్ సౌందర్యాన్ని కూడా వీక్షించవచ్చు. ప్యాలెస్ లోపల ఫొటోలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. కెమెరాకు టికెట్ తీసుకున్నప్పటికీ కొన్నిచోట్ల మాత్రమే అనుమతిస్తారు పర్యాటకుల వస్త్రధారణ ప్యాలెస్ నియమాలకు లోబడి ఉండాలి. దుస్తులు భుజాలను కవర్ చేస్తూ, మోకాళ్ల కింద వరకు ఉండాలి ∙ ప్యాలెస్ లోపల కొన్ని చోట్లకు పాదరక్షలను అనుమతించరు. ఈ కాలం నేల చల్లగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు సాక్స్ వేయడం మంచిది పెద్దవాళ్లు ప్యాలెస్ మొత్తం నడుస్తూ చూడడం కష్టమే. సిద్ధంగా ఉంచిన వీల్ చైర్లను వాడుకోవచ్చు. గైడ్ చెప్పే ఆసక్తికరమైన, హాస్యపూరితమైన కథనాలను ఎంజాయ్ చేయవచ్చు ఆడియో గైడ్ సౌకర్యం ఉంది. దానికి చార్జ్ ఎక్కువనిపించినప్పటికీ తప్పకుండా ఆడియోలో ప్యాలెస్ గురించిన వివరాలను వింటూ తిలకించాలి రాత్రి లైట్ షో కూడా చూడాలి. ఆ షోకు కూడా ముందుగా వెళ్తే షో బాగా వీక్షించే అవకాశం ఉంటుంది. (చదవండి: శరదృతువులో అక్కడ పడవులతో పండుగ సందడి..ఏకంగా..!) -
మైసూర్ ప్యాలెస్‌లో మొదలైన దసరా ఉత్సవాలు..(ఫొటోలు)
-
విచారణ చేపట్టండి
బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయన్న ఉదంతంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు రంగం సిద్ధమైంది. సిద్ధరామయ్యను విచారించాలని లోకాయక్త పోలీసులకు బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలిచి్చంది. దీంతో సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణను లోకాయుక్త పోలీసులు మొదలుపెట్టనున్నారు. సిద్ధూ భార్యకు ప్రభుత్వ వెంచర్లలో 14 ప్లాట్లను అక్రమంగా కేటాయించారన్న ఫిర్యాదుల మేరకు సిద్ధూపై విచారణకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధూ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయడం, ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు జడ్జి సంతోశ్ గజానన్ భట్ ఆదేశాలిచ్చారు. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచి్చన ఫిర్యాదు మేరకు మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు/ఎంపీల సంబంధిత కేసులను విచారించే ఈ కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలిచి్చంది. మూడు నెలల్లోగా అంటే డిసెంబర్ 24వ తేదీకల్లా సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను సమరి్పంచాలని జడ్జి సూచించారు. ముఖ్యమంత్రిపై ఉన్న ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పెషల్ కోర్టుకు ఆగస్ట్ 19న తాము ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తాజాగా ఉపసంహరించుకోవడంతో స్పెషల్ కోర్టు బుధవారం ఆదేశాలు ఇవ్వడానికి వీలు కల్గింది. ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామి, స్వామికి ఈ భూమిని అమ్మిన దేవరాజులను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. విచారణను ఎదుర్కోవడానికి సిద్ధం దర్యాప్తు మొదలుపెట్టాలని లోకాయుక్తకు ఆదేశాలు రావడంపై సిద్ధరామయ్య స్పందించారు. ‘‘ ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని గతంలోనే చెప్పా. ఎలాంటి దర్యాప్తునకు నేను భయపడను. చట్టప్రకారం పోరాటానికి నేను సిద్ధం. కోర్టు ఉత్తర్వుల కాపీలో ఏముందో చదివాక మళ్లీ మాట్లాడతా’’ అని సిద్ధరామయ్య అన్నారు. -
విచారణకు భయపడను: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు:మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌లో విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. విచారణకు భయపడటం లేదన్నారు.ఈ విషయమై సిద్ధరామయ్య బుధవారం(సెప్టెంబర్25) సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ముడా స్కామ్‌పై బెంగళూరు ప్రత్యేక కోర్టు బుధవారం విచారణకు ఆదేశించింది. కర్ణాటక లోకాయుక్త ఆధ్వర్యంలో దర్యాప్తునకు అనుమతించింది.మూడు నెలల్లో ముడా స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని మైసూర్ పోలీసులను ఆదేశించింది.ఈ కేసులో సిద్ధరామయ్యకు మంగళవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముడా స్కామ్‌లో తనను విచారించేందుకుగాను గవర్నర్ అనుమతి మంజూరు చేయడంపై సీఎం హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. -
నేడు కర్ణాటకలో కాంగ్రెస్ నిరసనలు
బెంగళూరు: మైసూరులో భూకేటాయింపుల వివాదంలో కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ అనుమతించడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ ఆందోళన చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తారని రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారం ప్రకటించారు. ‘‘ ఏం లేకున్నా గవర్నర్ దీన్నొక కేసులా మార్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్ నిరసన బాటలో పయనిస్తుంది. తాలూకా, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు కార్యకర్తలు పాదయాత్రగా వెళ్లి గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ మెమొరాండం అందజేస్తారు’’ అని నిరసన కార్యక్రమ వివరాలను డీకే వివరించారు. 22న సీఎల్పీ భేటీగవర్నర్ నిర్ణయాన్ని ఐకమత్యంతో తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని చాటేందుకు 22వ తేదీన సీఎల్పీ భేటీని నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పారు. ‘‘ ముడా భూకేటాయింపుల అంశంపై ఈ భేటీలో చర్చిస్తారు. చట్టబద్ధంగా ఈ కేసును ఎలా ఎదుర్కోబోతున్నామో ఆయన వివరిస్తారు’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వాదించనున్న సింఘ్వీ, సిబల్ !మైసూరు భూకేటాయింపుల కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టులో సీఎం సిద్ధరామయ్య తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ వాదించే అవకాశముంది. ఈ మేరకు వీరిద్దరూ నేడు బెంగళూరుకు వస్తున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. -
నాలుక అబద్ధం చెప్పదు..
నీర్ దోసె అంటే నూనె వేయకుండా పెనం మీద నీటిని చల్లి వేసే దోసె. మైసూర్ మసాలా దోసె, రసం ఇడ్లీ, టొమాటో ఉప్మా, ఆనియన్ ఊతప్పం... ఇవన్నీ మనకు తెలిసినవే, ఖోట్టో... ఇది ఇడ్లీ పిండిని పనస ఆకులతో అల్లిన బుట్టలో వేసి ఆవిరి మీద ఉడికించే వంటకం. ఈ దక్షిణాది రుచుల పేరు చెబితే ముంబయి వాసుల నోట్లో నీళ్లూరతాయి. క్రికెట్ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్లు ఈ రుచుల కోసం ముంబయి నగరం, మాతుంగలో ఉన్న మైసూర్ కేఫ్‌ను విజిట్ చేసేవాళ్లు.స్వాతంత్య్రానికి ముందు 1936 నుంచి ముంబయిలో స్టవ్ వెలిగించిన ఈ కేఫ్‌కి గవాస్కర్, సచిన్‌ల కంటే ముందు ఏ ప్రముఖులు క్యూ కట్టారో తెలియదు. కొత్త పెళ్లికొడుకు అనంత్ అంబానీ ఆదివారాలు ఇక్కడే గడిచేవని ఇటీవల తెలిసింది. తన పెళ్లి వేడుకలో ఈ కేఫ్ స్టాల్ కూడా పెట్టించారు. వధువు రాధికా మర్చంట్‌కు ఈ కేఫ్ నిర్వహకురాలు శాంతెరీ నాయక్‌ను చూపిస్తూ ‘మీట్ మైసూర్ కేఫ్ ఓనర్’ అని పరిచయం చేశాడు. వధువు ఆ పెద్దావిడపాదాలను తాకి నమస్కరించింది. ఈ వీడియోతో శాంతెరీ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది.టూర్లో ‘టేస్ట్’ చూస్తాను..ముంబయి నగరం, మాతుంగ ఏరియాలో కింగ్స్ సర్కిల్ రైల్వేస్టేషన్ దగ్గర ఉంది మైసూర్ కేఫ్. శాంతెరీ నాయక్ మామగారు నాగేశ్ రామ నాయక్ ఈ కేఫ్‌ను స్థాపించాడు. కర్నాటక నుంచి ముంబయిలో అడుగు పెట్టి ఆహారమే తన కుటుంబానికి అన్నం పెడుతుందని నమ్మారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు శాంతెరీ నాయక్. ఇప్పుడామె కుమారుడు నరేశ్ నాయక్ సహాయంతో కేఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్’ అనే ప్రజల ప్రశంసలే ఆమె అందుకున్న పురస్కారాలు. వివిధ ప్రదేశాలను పర్యటించడం ఆమె హాబీ. పర్యటనలో భాగంగా ఆయా ప్రదేశాల్లో ఏయే ఆహారాలు అందుబాటులో ఉంటున్నాయి, పర్యాటకులు ఏ రుచులను ఎక్కువ గా ఇష్టపడుతున్నారో గమనిస్తూ, వాటిని రుచి చూస్తానని చె΄్తారామె.కస్టమర్ అభిప్రాయమే తుదితీర్పు..‘‘వంటలను ఇష్టపడడమే నా సక్సెస్ ఫార్ములా. అమ్మకు సహాయం చేసే క్రమంలోనే రుచిగా వండడంలో మెళకువలు తెలిశాయి. అమ్మ వండిన పదార్థాలను ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించే బాధ్యత కూడా నాదే. వాళ్లకు ఏది నచ్చిందో అర్థమయ్యేది. అదే ఫార్ములాను కేఫ్ నిర్వహణలోనూ అనుసరించాను. మన ఉద్యోగులను నమ్మాలి, అంతకంటే ఎక్కువగా కస్టమర్లను నమ్మాలి. రుచి, అభిరుచుల విషయంలో కస్టమర్ల నోటి నుంచి వచ్చిన మాటే వేదవాక్కు. పదార్థాల రుచిని ఆస్వాదించిన నాలుక ఫీడ్ బ్యాక్ విషయంలో అబద్ధం చెప్పదు’’ అంటారు శాంతెరీ నాయక్. డెబ్బైఏళ్ల వయసులో కూడా చురుగ్గా, కేఫ్ నిర్వహణ పట్ల శ్రద్ధగా ఉన్నారామె. వార్థక్యం దేహానికి మాత్రమే, మనసుకు కాదు, పనిచేసే మనస్తత్వానికి కాదని నిరూపిస్తున్నారు శాంతెరీ నాయక్. -
చెన్నై–మైసూర్ మధ్య హైస్పీడ్ రైలు
సాక్షి, అమరావతి : దక్షిణ భారతదేశంలో చెన్నై–మైసూర్ మధ్య తొలి హైస్పీడ్ రైలును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మీదుగా ప్రత్యేక కారిడార్‌ను నిరి్మంచాలని జాతీయ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 463 కి.మీ. మేర ఈ కారిడార్‌ను నిర్మిస్తారు. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనూ 83 కి.మీ.మేర నిరి్మంచనున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు డిజైన్‌ను రైల్వేశాఖ సూత్రప్రాయంగా ఆమోదించి భూసేకరణ ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. అనంతరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఖరారు చేయనుంది. మూడు రాష్ట్రాల మీదుగా.. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా నిర్మిస్తారు. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూర్ వరకు నిరి్మస్తారు. మొత్తం 463 కి.మీ. పొడవైన ఈ కారిడార్ ఆంధ్రప్రదేశ్‌లో 83 కి.మీ. మేర ఉంటుంది. తమిళనాడులో 122 కి.మీ, కర్ణాటకలో 258 కి.మీ. మేర నిరి్మస్తారు. రెండు దశలుగా చేపట్టే ఈ ప్రాజెక్టును మొదటి దశ కింద చెన్నై నుంచి బెంగళూరు వరకు 306 కి.మీ., రెండో దశ కింద బెంగళూరు నుంచి మైసూర్ వరకు 157 కి.మీ. మేర నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇక అత్యంత ఆధునికంగా నిర్మించే ఈ హైస్పీడ్ కారిడార్‌లో భాగంగా ఏలివేటెడ్ కారిడార్, ఎట్ గ్రేడ్, టెన్నెల్, గ్రీన్‌ఫీల్డ్ సెగ్మెంట్లుగా నిర్మించాలని డిజైన్‌ను ఖరారుచేశారు. ఈ కారిడార్‌లో భాగంగా 30 కి.మీ.మేర సొరంగాలు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. చెన్నైలో 2.8 కి.మీ, చిత్తూరులో 11.8 కి.మీ., బెంగళూరు రూరల్‌లో 2 కి.మీ., బెంగళూరులో 11 కి.మీ. మేర వీటిని నిర్మిస్తారు. మొత్తం 11 స్టేషన్లు.. ఏపీలో చిత్తూరులో హాల్ట్.. ఇక ఈ హైస్పీడ్ రైలుకు చెన్నై–మైసూర్ మధ్య 11 చోట్ల హాల్ట్‌లు కల్పిస్తారు. ఏపీలో ఒక్క చిత్తూరులోనే ఉంటుంది. దీంతోపాటు చెన్నై, పూనమల్లి, కోలార్, కొడహళ్లి, వైట్‌ఫీల్డ్, బైయపనహళ్లి, ఎల్రక్టానిక్స్ సిటీ, కెంగేరీ, మాండ్య, మైసూర్‌లలో ఎలివేటెడ్ రైల్వేస్టేషన్లను నిరి్మస్తారు. భూసేకరణ ప్రక్రియపై కసరత్తు.. హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 303 గ్రామాలు, పట్టణాల మీదుగా నిరి్మంచాల్సి ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. అందుకోసం తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, ఏపీలోని చిత్తూరు, కర్ణాటకలోని కోలార్, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, రామనగర, మాండ్య, మైసూర్ జిల్లాల్లో 2,905 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందులో 2,660 ఎకరాలు ప్రైవేటు భూములే. ప్రస్తుతం రైల్వేశాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను రూపొందించే ప్రక్రియను వేగవంతం చేసింది. మరోవైపు.. భూసేకరణ ప్రక్రియపై ప్రాథమిక కసరత్తు చేపట్టింది. అనంతరం డీపీఆర్‌ను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించిన అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. 2025–26 ఆరి్థక సంవత్సరంలో హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నది రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గరిష్ట వేగం గంటకు 350 కి.మీ..ఇక ఈ హైస్పీడ్ రైల్ గంటకు గరిష్టంగా 350 కి.మీ. వేగంతో దూసుకపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని నిర్వహణ వేగం గంటకు 320 కి.మీ.గా నిర్ణయించారు. సగటు వేగం గంటకు 250 కి.మీ. ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. మొత్తం 730 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. -
మైసూరు మహారాజు వడయార్ ఘన విజయం
లోక్‌సభ ఎన్నికల్లో మైసూరు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ఘన విజయం సాధిచించారు. మైసూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన వడయార్ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై 1,39,262 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.ఈ ఎన్నికల్లో యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ మొత్తం 7,95,503 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎం.లక్ష్మణకు 6,56,241 ఓట్లు వచ్చాయి. మైసూరు రాజ్యాన్ని వడయార్ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది. స్వాతంత్ర్యం అనంతరం మైసూరు రాజు జయచామ రాజేంద్ర వడయార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 1974లో శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ రాజు అయ్యారు.1984-1999 లో కాంగ్రెస్ తరఫున మైసూరు ఎంపీగా గెలుపొందిన ఆయన 2013లో కన్నుమూశారు.శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ మరణం తర్వాత మైసూరు 27వ రాజుగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ పట్టాభిషిక్తుడయ్యారు. మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లిటరేచర్, ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2016లో దుంగార్పుర్ యువరాణి త్రిషికను వివాహం చేసుకున్నారు. -
Thayamma: వెట్టి నుంచి విముక్తి వరకు
మైసూరు చుట్టుపక్కల చెరుకు తోటల్లో వెట్టి పాలేర్లను పెట్టుకోవాలని చూస్తారు కొంతమంది. అప్పులిచ్చి వాళ్లను పాలేర్లుగా మారుస్తారు. తాయమ్మ కూడా ఒక వెట్టి పాలేరు. కానీ, ఆమె వెట్టి నుంచి బయట పడింది. సొంత ఉపాధి పొందింది. అంతే కాదు అప్పులపాలై వెట్టికి వెళ్లే దిగువ వర్గాల స్త్రీల విముక్తికి పోరాడుతోంది. మైసూరుకు చెందిన తాయమ్మ ఒక యోధురాలు. ధీర.‘అదంతా ఎలా తట్టుకున్నానో. ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది’ అంటుంది తాయమ్మ. 33 ఏళ్ల ఈ ముగ్గురు పిల్లల తల్లి చేసిన నేరం ఏదైనా ఉంటే వెనుకబడిన వర్గాల్లో పుట్టడం. పేదరికంలో ఉండటం. ‘మా పేటల్లో సరైన ఇళ్లు ఉండవు. పరిశుభ్రత ఉండదు. మా కాలంలో మమ్మల్ని చదివించకుండా పొలాల్లో పని చేసే కూలీలను చేశారు. నేనూ నా భర్త మూర్తి ఇద్దరం పాలేరు పనులు చేస్తూనే పెళ్లి చేసుకున్నాం. ముగ్గురు పిల్లల్ని కన్నాం. వారి భవిష్యత్తు కోసం ఆరాట పడటమే మేము చేసిన నేరం’ అంటుంది తాయమ్మ.మైసూరు జిల్లాలోని లోపలి ్రపాంతమైన హన్సూర్ అనే ఊరిలో చెరకు పండిస్తారు. రోజువారీ కూలీల కంటే వెట్టి కూలీలుగా కొందరిని పెట్టుకోవడానికి యజమానులు ప్రయత్నిస్తారు. దిగువ వర్గాల వారి ఆర్థికస్థితిని అవకాశంగా తీసుకుని వారి చేత వెట్టి చేయించుకుంటారు. ‘నా భర్త మూర్తి మాకున్న కొద్ది స్థలంలో ఒక చిన్న ఇల్లేదైనా వేసుకుందామని అనుకున్నాడు. మా ముగ్గురు పిల్లల్ని శుభ్రమైన వాతావరణంలో పెంచాలని అనుకున్నాము. అందుకు 60 వేలు అప్పు తీసుకున్నాం. ఆ కొద్ది అప్పు వడ్డీతో కలిసి మా జీవితాలను తల్లకిందులు చేసింది. అప్పు తీర్చలేకపోవడం వల్ల నేను, నా భర్త వెట్టికి వెళ్లాల్సి వచ్చింది. 2015 నుంచి 2017 వరకు మూడేళ్ల పాటు నేను, నా భర్త చెరుకు తోటల్లో వెట్టి చాకిరీ చేశాం. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు మాకు పని ఉండనే ఉండేది. నేను నా చిన్న కొడుకును వీపున కట్టుకుని, ఇద్దరు పిల్లల్ని చెరో చేత్తో పట్టుకుని, కూడు నెత్తిన పెట్టుకుని పనికి వెళ్లేదాన్ని. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోయినా ఒకరు పొలంలో ఉండి ఒకరు ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అంత ఘోరమైన వెట్టి అది. నా పిల్లలు బాగా చదువుకుంటేనే ఇలాంటి వెట్టి నుంచి బయటపడగలరనుకున్నాను. మూడేళ్లు కష్టపడి పని చేసినా మాకు విముక్తి రాకపోయేసరికి ఎవరో అధికారులకు చెప్పి మాకు విముక్తి కలిగించారు.’ అని చెప్పింది తాయమ్మ.స్వేచ్ఛ పొందిన తాయమ్మ, ఆమె భర్త వాళ్లకు ఉన్న ఒక కొబ్బరి చెట్టు కాయలతో చిన్న షాప్ పెట్టుకున్నారు. కర్నాటకలో వెట్టి పాలేర్ల విముక్తి కోసం పని చేసే ‘ఉదయోన్ముఖ ట్రస్ట్’ తాయమ్మకు లోన్ ఇప్పించింది– కుట్టు మిషన్ల కోసం. తాయమ్మకు కుట్టు పనిలో ఉన్న ్రపావీణ్యం ఇప్పుడు ఆమెనే కాదు, ఆమెలా వెట్టి నుంచి విముక్తి పొందిన మరికొందరు మహిళలకు కూడా ఉపాధి కలిగిస్తోంది.‘ఇంటిని ముందుకు నడపడంలో స్త్రీ కీలకం. ఆమె ఓడిపోకూడదు. కుటుంబం కోసం పోరాడాలి. అడ్డంకులను అధిగమించాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఈ హక్కు అందరు పిల్లలకు దొరకాలి. వలస వచ్చే కూలీలు, దిగువ కులాల పేదలు వెట్టిలో చిక్కుకుంటున్నారు. వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. వారి పిల్లలకు సరైన చదువు అందేలా ప్రభుత్వాలు పని చేయాలి’ అంటోంది తాయమ్మ. -
ఎన్నికల వేళ.. వంద కోట్ల ఇల్లీగల్ లిక్కర్ పట్టివేత?
మైసూర్: ఎన్నికలు మొదలయ్యాయంటే.. బెట్టింగులు, కోట్లాది రూపాయల డబ్బుల ఖర్చు, తాయిలాలు, ఆకర్షణలు, ప్రలోభాలు, ఒత్తిళ్లు, బేరసారాలు, అలకలు, కులుకులు.. అన్నీ మామూలే. ఇందులో భాగంగానే ఓటర్లను ఆకర్షించడానికి పార్టీ నాయకులు తమవంతు ప్రయత్నాలు భారీగానే చేస్తారు. ఇప్పటికే దేశం మొత్తం ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. భారీ నగదు, లేదా లిక్కర్ తరలించడం చట్టరీత్యా నేరం. పలు ప్రాంతాల్లో లెక్కకు మించిన డబ్బు పోలీసులు పట్టుకుని సీజ్ చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో భారీ లెవల్లో ఇల్లీగల్ లిక్కర్ పట్టుబడినట్లు తెలుస్తోంది. చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మైసూర్ జిల్లా నంజనగూడు తాలూకాలోని తాండ్యా ఇండస్ట్రియల్ ఏరియాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్‌ను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బృందం ఆకస్మికంగా సందర్శించింది. ఈ ఆపరేషన్‌లో మైసూర్ డివిజన్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.98.52 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతున్న తరుణంలో ఈ భారీ అక్రమ మద్యం నిల్వలు ఘటన పెద్ద సంచలంగా మారింది. ఇప్పటికే సుమారు 14 వేలకు పైగా బాక్సులు కేరళకు చేరుకున్నాయని, 7,000 బాక్సులు మాత్రమే సోదాల్లో కనుగొన్నారని తెలుస్తోంది. అక్రమ రవాణా & హోర్డింగ్ వంటి వాటికి పాలపడిన కారణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. పలువురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. Based on a tip-off, excise department officials made a high-stakes raid on United Breweries Limited in Nanjangud taluk of #Mysuru, unearthing an astonishing stash of illegal liquor valued at a jaw-dropping Rs. 98.52 crore. This shocking discovery, coinciding with the fervor of… pic.twitter.com/Q1QjgA4Hbb — Karthik K K (@Karthiknayaka) April 4, 2024 -
బరిలోకి మైసూరు మహారాజు.. సిట్టింగ్ ఎంపీకి బీజేపీ షాక్
బెంగళూరు: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు 72 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. తొలి జాబితాలో దేవ్యాప్తంగా 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా.. నేటి జాబితాలో పలువురు ప్రముఖులకు స్థానం కలిపించింది. ఇక ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండు లిస్ట్‌లు కలిపి ఇప్పటి వరకు మొత్తం 267 స్థానాలకు అభ్యర్థులను కాషాయ పార్టీ ప్రకటించింది. ఇక తాజా లిస్ట్‌లో కర్ణాటకలోని మైసూర్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాకు బీజేపీ షాక్ ఇచ్చింది. మైసూరు రాజ వంశీయుడు యదువీర్ కృష్ణదత్త చామరాజను బరిలోకి దింపింది. గతేడాది పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యం వివాదంలో మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా కేంద్రబిందువుగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. డిసెంబర్లో శీతాకాల సమావేశాలు జరుగుతుండగా లోక్‌సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు సభలోకి దూకిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు వాళ్లు. అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ కేసులో నిందితులిద్దరూ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా ద్వారానే విజిటర్స్ పాస్‌లు పొందినట్లు అధికారులు గుర్తించారు. చదవండి: బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులు వీళ్లే పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని, ప్రతాప్ సింహాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలోనే బీజేపీ ప్రతాప్ సింహాకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం. ఇక లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తనకు టికెట్ ఇవ్వకుంటే తన మద్దతుదారులు, అభిమానులు ఎలాంటి నిరసనలు చేపట్టరాదని ఈ రోజు ఉదయమే మైసూర్ ఎంపీ కోరారు. తన రాజకీయ ప్రయాణానికి ప్రధాని మోదీనే కారణమని.. ఆయనకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. మోదీ కోసం అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతేగాక బీజేపీ రెండో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వెంటనే మైసూర్ రాజ వంశాన్ని సింహా అభినందించారు. మహారాజా యదువీర్‌కి అభినందనలు తెలిపారు. -
12 ఏళ్లుగా భార్యను గదిలో బంధించిన భర్త.. ఎందుకంటే!
బెంగళూరు: కట్టుకున్న భార్యపట్ల అమానవీయంగా ప్రవర్తించాడో భర్త. అర్థం లేని అనుమానాలతో ఆమెను గృహ నిర్బంధంలో బంధించాడు. కనీసం వాష్‌రూమ్ సదుపాయం లేని ఓ గదిలో ఉంచి తాళం వేశాడు. తన పిల్లలను కూడా కలవనివ్వలేదు. ఒకటి కాదు రెండు దాదాపు గత 12 ఏళ్లుగా భార్యను ఇలాగే వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు శాడిస్టు భర్త. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ దారుణం చుట్టు పక్కల వాళ్లకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మహిళకు బయటకు తీసుకువచ్చి జరిగిన విషయం గురించి తెలుసుకొని నివ్వెర పోయారు. భర్త ఏ పనిమీద బయటకు వెళ్లినా తనను ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్తాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడనివ్వకుండా, పదే పదే కొట్టేవాడని చెప్పింది. గత 12 ఏళ్లుగా మానసిక క్షోభకు గురి చేశాడని, ఇంట్లోనే బంధించి ఇంటిని జైలుగా మార్చాడని పేర్కొంది. చాలా కాలంగాచి ఈ బాధతో కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తనను బంధించిన గదిలోనే ఒక చిన్న పెట్టెలో కాలకృత్యాలు తీర్చుకొనే దానినని బాధితురాలు వాపోయింది. విషయం తెలిసిన పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని ఈ విషయమై కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్తపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు నిరాకరించింది. ఇకపై అతడికి విడాకులు ఇచ్చి పుట్టింట్లో ఉంటానని తెలిపింది. కాగా అతడికి బాధితురాలు మూడో భార్య మొదట రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ అతడి వేధింపులకు తాళలేక వారిద్దరూ వదిలేసి వెళ్లిపోయారు. వీరికి ఇద్దరు పిల్లల -
చలో మైసూర్
హీరో రామ్‌చరణ్ కొన్ని రోజులు మైసూర్‌కు మకాం మార్చనున్నారట. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ‘గేమ్‌చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగేలా చిత్రయూనిట్ ప్లాన్ చేసిందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ నెల చివర్లో జరగనున్న ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేలా శంకర్ ప్లాన్ చేశారట. అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ‘గేమ్‌చేంజర్’ వచ్చే ఏడాది విడుదల కానుంది. -
మైసూర్లో నా సామిరంగ
హీరో నాగార్జున కొన్ని రోజులు మైసూర్‌కు మకాం మార్చారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘నా సామిరంగ’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మైసూర్లో ప్రారంభమైందని సమాచారం. నాగార్జున, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఆషికా రంగనాథన్ , మిర్నా మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. -
మహిష దసరా వివాదం ఏమిటి? బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
కర్నాటకలోని మైసూరులో అక్టోబరు 13 నుంచి మహిష దసరా ఉత్సవాలు జరగనున్నాయి. అయితే ఇవి రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మహిష దసరా వేడుకలను వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దసరా నేపథ్యంలో సాంస్కృతిక నగరమైన మైసూర్ అందంగా ముస్తాబైంది. ప్యాలెస్ భవనంలో నూతన బల్బులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేస్తున్నారు. కాగా మహిష దసరా వేడుకలను వ్యతిరేకిస్తూ స్నేహమహి కృష్ణ అనే వ్యక్తి మైసూర్ 8వ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం మహిష దసరా ఆచారణ కమిటీ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 11వ తేదీకి వాయిదా పడింది. 2015 నుంచి దళిత అనుకూల సంస్థలు, అభ్యుదయవాదులు మైసూర్లో మహిష దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిష దసరా వేడుకల నిర్వహణకు అవకాశం కలగలేదు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక మహిష దసరా వేడుకల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. మహిష దసరా వేడుకలపై ఎంపీ ప్రతాపసింహ తదితరులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మహిష దసరా వేడుకలు జరగనివ్వబోమని ఆయన అన్నారు. కాగా ఈసారి 50 ఏళ్ల మహిష దసరా వేడుకలు జరుపుకుంటున్నట్లు మహిష దసరా వేడుకల కమిటీ పోస్టర్‌ను విడుదల చేసింది. మహిష దసరా సెలబ్రేషన్ కమిటీ, మైసూర్ యూనివర్సిటీ పరిశోధకుల సంఘం అక్టోబర్ 13న మహిష దసరా వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించాయి. చాముండి కొండను మహిష కొండగా పేర్కొంటూ ఆహ్వాన పత్రికను కూడా విడుదల చేశారు. ఈ నేపధ్యంలో మహిష దసరా వివాదాస్పదమయ్యింది. మహిష దసరా వేడుకలను వ్యతిరేకించాలని బీజేపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మహిషుని పేరుతో ఉత్సవాలు నిర్వహించడమంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అయితే మహిష దసరా కమిటీ దీనిపై స్పందిస్తూ ‘మహిషను రాక్షసునిగా తప్పుగా అభివర్ణించారన్నారు. మైసూరు రాజు మహిష పరిపాలనను నాటి ప్రజలు ఎంతో ఇష్టపడేవారన్నారు. అందుకే మహిష దసరా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
రివర్స్ గేర్‌లో 2 కి.మీ.లు
మైసూరు: అటవీ ప్రాంతంలో ప్రసవం కోసం గర్భిణిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా అడవి ఏనుగు అడ్డువచ్చి దాడికి యతి్నంచింది. అంబులెన్స్ డ్రైవర్ చాకచక్యంతో సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెనక్కు తీసుకెళ్లి గర్భిణిని కాపాడాడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోటెలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. జీఎం హళ్ళి గ్రామానికి చెందిన లంబాడి మహిళ సుచిత్ర నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అంబులెన్స్ వచ్చి హెచ్డికోటె ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో ఒక అడవి ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిలబడింది. సుమారు 15 నిమిషాల పాటు గజరాజు కదలకుండా అలాగే ఉంది. డ్రైవర్ శరత్ అంబులెన్స్‌ను ముందుకు పోనివ్వగా ఏనుగు అంబులెన్స్ మీదకు దూసుకొచ్చింది. దీంతో డ్రైవర్ రివర్స్ గేర్ వేసి సుమారు 2 కిలోమీటర్ల దూరం వెనక్కు ప్రయాణించాడు. ఏనుగు కొంతదూరం వెంబడించి నిలిచిపోయింది. అంబులెన్స్‌లో ఉన్న ఆశా కార్యకర్త సావిత్రిబాయి గర్భిణికి కాన్పు చేసింది. తరువాత మరో మార్గంలో తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు. -
ప్రాణం పోతున్నా ఎవరూ పట్టించుకోరే?
కర్ణాటక: మైసూరులో రైలు ఎక్కిన ప్రయాణికునికి ఫిట్స్ (మూర్ఛ) వచ్చి కింద పడి గిలగిలాకొట్టుకున్నాడు. కానీ చికిత్స మాత్రం దొరకలేదు. చివరకు అభాగ్యుడు రైల్లోనే మరణించాడు. ఈ ఘటనలో రైల్వే అధికారుల నిర్లక్ష్యముందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైసూరు రైల్వేస్టేషన్లో నిర్లక్ష్యం ఫిట్స్‌తో గంట పాటు వృద్ధుని ప్రయాణం చికిత్స అందక కన్నుమూత వివరాలు.. మైసూరు రమాబాయి నగరకు చెందిన పి.స్వామి (83) అనే వృద్ధుడు బెంగళూరుకు వెళ్లేందుకు మైసూరు రైల్వేస్టేషన్లో ప్యాసింజర్ రైలు ఎక్కాడు. రైలు మైసూరు స్టేషన్లో కదలడానికి ముందే అతడు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. వెంటనే సహ ప్రయాణికులు ఈ సమాచారాన్ని రైల్వే పోలీసులకు తెలిపారు. రైల్వేస్టేషన్లో ఉన్న నర్సు వచ్చి పరీక్షించి ఏమీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత రైలు బయలుదేరి ముందుకు కదిలింది. మార్గమధ్యలో శ్రీరంగపట్టణ, పాండవపుర రైల్వేస్టేషన్లో అస్వస్థతకు గురైన స్వామిని చికిత్స కోసం పంపించకుండా రైల్వే పోలీసులు తాత్సారం చేశారు. దీంతో పాండవపుర రైల్వే స్టేషన్లో ప్రయాణికులు గొడవ చేశారు. అనంతరం చిక్కబ్యాడరహళ్లి రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకున్న తర్వాత రైల్వే సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో తోటి ప్రయాణికులు ఇక తమ గొడవను పెద్దగా చేశారు. ముందు వచ్చే యలియూరు రైల్వే స్టేషన్‌కు అంబులెన్స్ వస్తుందని, అప్పుడు స్వామిని తరలిస్తామని రైల్వే సిబ్బంది తెలిపారు. అయితే రైలు యలియూరు స్టేషన్‌కు వచ్చినప్పటికీ అక్కడ ఎలాంటి అంబులెన్స్ కనిపించలేదు. ఇదంతా జరిగి అప్పటికే గంట సమయం వృథా అయింది. దీంతో స్వామి రైలులోనే ఎంతో ఇబ్బంది పడుతూ మృతి చెందాడు. మండ్యలోనూ అదే తంతు మధ్యాహ్నం 3.40 గంటలకు మండ్య రైల్వే స్టేషన్‌కు రైలు వచ్చినప్పుడు పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. పోలీసులపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రైల్వే పోలీసుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో చికిత్స లభించక స్వామి మరణించాడని ప్రయాణికులు ఆరోపించారు. తోటి ప్రయాణికుల సహాయంతో స్వామి మృతదేహాన్ని ఇతర ప్రయాణికులు రైలు నుంచి కిందకి దించి ప్లాట్‌ఫారమ్‌పై ఉంచారు. సుమారు 45 నిమిషాల పాటు మృతదేహం ప్లాట్‌ఫారమ్‌పైనే ఉంది. తరువాత మృతదేహాన్ని జిల్లాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి చొక్కాలోని ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అతడు మైసూరు రమాబాయినగర నివాసి అని గుర్తించారు. స్వామి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టమ్ నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. చికిత్స చేసి ఉంటే బతికేవాడు నేను పాండవపుర పోలీసు స్టేషన్లో రైలు ఎక్కాను.. ఒక ప్రయాణికుడు కుప్పకూలిపోయి ఇబ్బంది పడుతున్నాడు. స్టేషన్ పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. పోలీసుల హామీ మేరకు యలియూరు రైల్వే స్టేషన్లో ఎదురు చూసినా అంబులెన్స్ రాలేదు. మైసూరులోనే అంబులెన్స్ ఏర్పాటు చేసి చికిత్స అందించి ఉంటే బతికేవాడేమో.. అయితే పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఒక ప్రాణం పోయింది. –పుష్పలతా, రైలు ప్రయాణికురాలు, బెంగళూరు -
ఘోర ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు ఇన్నోవా కారును ఢీకొట్టిన ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మైసూరు జిల్లాలోని కొల్లేగల - టీ నర్సిపుర ప్రధాన రహదారిపై కురుబురు గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు బళ్లారికి చెందిన వారని, మలే మాదేశ్వరుని దర్శించుకుని మైసూరు నగరానికి వస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో మృతదేహాలు ఇరుక్కుపోయి తీవ్రంగా చితికిపోయినట్లు కనిపించాయి. చదవండి: పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ ఖాళీ.. టీఎంసీలో చేరిన ఏకైక ఎమ్మెల్యే -
గేమ్ ఛేంజర్: మైసూర్ వెళ్లనున్న రామ్‌చరణ్
‘గేమ్ చేంజర్’ మూమెంట్స్ కోసం మైసూర్ వెళ్లనున్నారు రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్, ఎస్జే సూర్య, జయరాం, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. ఇటీవల ఈ సినిమా భారీ క్లైమాక్స్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరిగింది. కాగా ‘గేమ్ చేంజర్’ నెక్ట్స్ షెడ్యూల్ మైసూర్లో జరగనున్నట్లు తెలిసింది. జూన్ మొదటివారంలో రామ్‌చరణ్, శంకర్ అండ్ కో ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల కోసం మైసూర్ ప్రయాణం కానున్నారని సమాచారం. దాదాపు పది రోజుల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందట. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. జపాన్‌లో మేజిక్ జరిగింది: రామ్‌చరణ్ భార్య ఉపాసన గర్భవతి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం తనకు ఏడో నెల అని శ్రీనగర్‌లో జరిగిన ‘జీ 20’ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌చరణ్ అన్నారు. ఇదే వేదికపై జపాన్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అది ఇప్పుడు ఇంకా స్పెషల్ అని, ఎందుకంటే జపాన్‌లోనే ఈ మేజిక్ (భార్య ప్రెగ్నెన్సీ గురించి) జరిగిందనీ రామ్‌చరణ్ పేర్కొన్నారు. -
కర్నాటక: ఎన్నికల సిత్రం.. మామిడిచెట్టులో కరెన్సీ కట్టల బ్యాగు
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అటు, ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశాయి. ఇదిలా ఉండగా.. ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయపార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సమకూర్చాయన్న సమచారం మేరకు ఐటీ శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా కాంగ్రెస్ నేత ఇంట్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, మైసూర్‌లోని సుబ్రమణ్య రాయ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో మామిడి చెట్టుపై బాక్సులు ఉండటం గమనించారు. వాటిని తీసి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేశారు. వాటి విలువ కోటి రూపాయలు ఉన్నట్టు తెలిపారు. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేసినట్టు స్పష్టం చేశారు. రాయ్ పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు కావడం విశేషం. ఇప్పటిదాకా రూ.300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును ఈసీ సీజ్ చేసింది. ఇందులో ఒక్క బెంగళూరులోనే రూ.82 కోట్లను స్వాధీనం చేసుకుంది. అంతకుముందు ఏప్రిల్ 13న బెంగళూరు సిటీ మార్కెట్ ఏరియాలో రూ.కోటిని పోలీసులు జప్తు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో డబ్బు తీసుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులు.. ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్నాటకలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది. దీంతో, సరైన పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించరాదు. ఇక, కర్నాటకలో ఈనెల 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఇది కూడా చదవండి: యువకుడిని చితకబాదిన మంత్రి, సిబ్బంది.. వీడియో వైరల్ -
భారీ అగ్ని ప్రమాదం..మూడు కిలోమీటర్ల వరకు..
ఓ బాణా సంచా దుకాణంలో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా రెండు కిలోమీటర్లు మేర దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన మైసూరులోని హుబ్లీ ఇండస్ట్రీయల్ పార్క్‌లోని ఓ ప్రైవేటు గోడౌన్లో బుధవారం చోటు చేసుకుంది. ఆ గోడౌన్లో క్రాకరీ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. అందులో కోట్లాది రూపాయలు విలువ చేసే క్రాకర్లను నిల్వ ఉంచారు. ఈ క్రమంలో అనూహ్యంగా గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో బాణాసంచాలన్ని ఒక్కసారిగా పేలడంతో మంటలు మరింత చెలరేగాయి. దీని ధాటికి చుట్టుపక్కల ఉన్న దాదాపు 50కి పైగా భవనాలు త్రీవంగా దెబ్బతిన్నాయి. ఐతే ఈ గోడౌన్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది చనిపోయారనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ మంటలను అదుపు చేసేందుకు దాదాపు 14 అగ్నిమాపక యంత్రాలు వచ్చి రెస్క్యూ చర్యలు చేపట్టాయి. భవనంలో పలువురు పౌరులు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి మూడు కిలోమీటర్లు దూరం వరకు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రమదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: ఆ హీట్ స్ట్రోక్ హీట్ మాములుగా లేదు! దెబ్బకు బహిరంగా కార్యక్రమాలు..) -
కర్ణాటకలో ఆసక్తికరంగా పాత మైసూరు పోరు