
సాక్షి, మైసూరు: వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్న మహిళను మైసూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ మహిళ చెరలో ఉన్న మరో ఇద్దరు యువతులను రక్షించారు. విజయనగర నాల్గో ఫేజ్‌లోని ఒక ఇంటిపై సోదాలు జరిపి మహిళను అరెస్టు చేసి రూ. 31,500 నగదు, ఒక మొబైల్ ఫోన్, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజయనగర పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
చదవండి: (ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..)