మైసూరు: కారును ఇష్టానుసారంగా నడుపుతుండటంతో జాగ్రత్తగా నడపాలని చెప్పిన ముగ్గురు యువకులను అదే వాహనంతో ఢీకొట్టిన ఘటన మైసూరు నగరంలోని టీకే లేఔట్‌లో చోటుచేసుకుంది. కారు ఢీకొనడంతో ప్రజ్వల్, రాహుల్, ఆనంద్ అనేవారు ఆస్పత్రి పాలయ్యారు.
వివరాలు... మంగళవారం ఉదయం వాసు, అతని తండ్రి దర్శన్ ఫార్చునర్ కారులో రోడ్డుపై అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడంతో అక్కడే ఉన్న ప్రజ్వల్, రాహుల్, ఆనంద్ వారిని మందలించారు. దీంతో ఆగ్రహానికి గురైన వాసు, అతని తండ్రి కారుతో వెనక్కి వచ్చి ప్రజ్వల్, రాహుల్, ఆనంద్‌లను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ప్రజ్వల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సరస్వతీ పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: ఏడు నెలల క్రితమే పెళ్లి.. వివాహేతర సంబంధం కారణంగా..)
Comments
Please login to add a commentAdd a comment