injured
-
పిచ్చికుక్కల స్వైరవిహారం.. 26 మంది చిన్నారులకు గాయాలు
మహబూబ్‌నగర్ క్రైం/గూడూరు: వేర్వేరు జిల్లాల్లో పిచ్చికుక్కల దాడిలో 26 మంది చిన్నారులు గాయపడ్డారు. మహబూబ్‌నగర్ పట్టణంలో గురువారం రాత్రి 7 – 8.30 గంటల ప్రాంతంలో గోల్ మజీద్, పాత పాలమూరు ఏరియాలో ఒక పిచ్చికుక్క చిన్నారులను వెంటాడి కరుస్తూ గాయపరిచింది. గాయపడిన 24 మంది చిన్నారులకు జనరల్ ఆస్పత్రిలో టీటీ ఏఆర్వీ టీకాలు ఇచ్చారు.ఇందులో ఐదుగురు చిన్నారులకు గాయాలు ఎక్కువ కావడంతో.. వారిని ఆస్పత్రిలో చేర్పించుకుని పరిశీలనలో ఉంచినట్లు ఆర్ఎంవో డాక్టర్ జరీనా తెలిపారు. చిన్నారులను గురువారం రాత్రి జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పరామర్శించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యాధికారులను ఆదేశించారు. కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో.. : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురానికి చెందిన మహేశ్ కూతురు స్మైలీ, కారం సుమన్ కుమారుడు అచ్చితానంద.. గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా, పిచ్చికుక్క వీరిద్దరిపై దాడికి పాల్పడింది. కుటుంబసభ్యులు చిన్నారులను కుక్క బారి నుంచి కాపాడారు. గాయపడిన చిన్నారులను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
TG: మళ్లీ పులి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
సాక్షి,కొమరంభీంజిల్లా: జిల్లాలో పులి మళ్లీ పంజా విసిరింది. తాజాగా మరొకరిపై పులి దాడి చేసింది. సిర్పూర్ (టీ) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్‌పై శనివారం(నవంబర్30) పులి దాడి చేసి గాయపరిచింది. సురేష్ పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది.పులి గాట్లతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్‌ను చికిత్స కోసం సిర్పూర్(టీ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో పులి దాడిలో శుక్రవారమే ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పులి కోసం కాగజ్‌నగర్ కారిడార్‌లో ఫారెస్ట్ అధికారులు ఆపరేషన్ మ్యాన్ఈటర్ నిర్వహస్తున్నారు.మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం వేట కొనసాగుతోంది.ఇదీ చదవండి: పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్‌నగర్‌లో హై అలర్ట్ -
దాడి చేయబోతే 'దాడి' చేశార్సార్!
-
బీజింగ్: స్కూలులో కత్తితో ఉన్మాది దాడి.. 8 మంది మృతి
బీజింగ్: చైనాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక స్కూలులోకి చొరబడిన ఉన్మాది కత్తితో దాడికి తెగబడిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ఇదే ఘటనలో 17 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను నేరాన్ని అంగీకరించాడు.ఈ ఘటన తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఓ ఉన్మాది ఒకేషనల్ స్కూల్లోకి ప్రవేశించి, అక్కడున్నవారిని విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 17మంది గాయపడ్డారు. యిక్సింగ్ నగరంలోని వుక్సీ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఈ దాడి జరిగింది.రాష్ట్ర వార్తా సంస్థ ‘జిన్హువా’ తెలిపిన వివరాల ప్రకారం ఈ దారుణానికి పాల్పడిన 21 ఏళ్ల నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇంటర్న్‌షిప్ జీతంపై అసంతృప్తితో ఉన్నాడని, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్కూల్లోకి ప్రవేశించి, కత్తితో దాడికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత -
షూటింగ్ సెట్లో ప్రమాదం.. స్టార్ నటుడికి గాయాలు!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న హంటర్ వెబ్ సిరీస్ సెట్స్‌లో గాయపడినట్లు సమాచారం. ఓ ఫైట్ సీక్వెన్స్ చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ సన్నివేశంలో ఒక చెక్క లాగ్ అనుకోకుండా ఆయన పక్కటెముకలకు తగిలిందని తెలిపారు. ఈ సంఘటనతో ముంబయిలో జరుగుతున్న షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే సునీల్ శెట్టికి వైద్యచికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని సునీల్ శెట్టి సైతం ట్విటర్ ద్వారా పంచుకున్నారు. నాకు చిన్న గాయం మాత్రమే తగిలిందని.. ప్రస్తుతం బాగానే ఉన్నానని పోస్ట్ చేశారు. దయచేసి ఎవరూ కూడా ఆందోళనకు గురికావద్దని అభిమానులను కోరారు. మీ అందరి ప్రేమ, అభిమానాలకు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు.కాగా.. హంటర్ వెబ్ సిరీస్‌ను ముంబయిలోని అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆయన పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఈషా డియోల్, బర్ఖా బిష్త్, కరణ్వీర్ శర్మ, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ తర్వాత వెల్కమ్ టు ది జంగిల్ అనే చిత్రంలో నటించనున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, దిశా పటానీ, సంజయ్ దత్లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.Minor injury, nothing serious! I'm absolutely fine and ready for the next shot. Grateful for all the love & care 🙏❤️ #OnSet— Suniel Shetty (@SunielVShetty) November 7, 2024 -
యువతిపై ప్రేమోన్మాది దాడి.. కత్తితో చేయి కోసి పరార్
సాక్షి,మెదక్‌జిల్లా: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద దారుణం జరిగింది. సోమవారం(నవంబర్ 4) ఉదయం దివ్యవాణి అనే యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. కత్తితో చేయి కోసి పరారయ్యాడు. ఓపెన్ డిగ్రీ పరీక్షలకు కాలేజీకి వస్తుండగా ఘటన జరిగింది.యువతిపై దాడి చేసింది బెంగుళూరుకు చెందిన చేతన్ అనే యువకుడిగా గుర్తించారు. ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడు.యువతిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య -
ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కొండపై నుంచి జారిపడటంతో
బెంగళూరు: కర్ణాటకలోని ఓ ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా.. చిక్కమగళూరులోని దేవీరమ్మ కొండపై ఉన్న ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తోపులాట జరిగింది. వేలాది సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా రావడంతో, కొండలపై జారి పడి పలువురికి గాయాలయ్యాయి. మల్లెనహళ్లిలోని దేవీరమ్మ కొండపై ఉన్న గుడి వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.అయితే గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలే ఇందుకు కారణమని అధికారులు పేర్కొన్నారు. సందర్శకుల భద్రత కోసం జిల్లా యంత్రాంగం, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ.. భారీ వర్షాల కారణంగా కొండలు తడిగా మారాయని వెల్లడించారు. ఆలయం నుంచి తిరిగి వస్తుండగా పడిపోవడంతో దాదాపు 12మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారని, వారందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.కాగా దీపావళి సందర్భంగా ఏడాదిలో కేవలం ఒక్కరోజు మాత్రమే భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తారు. ఇది దేవిరమ్మ అనే కొండపై మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. బాబాబుడంగిరిలోని మాణిక్యధార, అరిసినగుప్పె మీదుగా భక్తులు ఆలయానికి చేరుకుంటారు. నరక చతుర్దశికి ముందు దేవీరమ్మ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. -
దీపావళి వేడుకల్లో గాయాలు.. సరోజినీదేవి ఆసుపత్రికి బాధితులు క్యూ..
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేడుకల్లో పలు చోట్ల అపశృతులు చోటుచేసుకున్నాయి. బాణసంచా కాలుస్తూ పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులంతా సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. ఇప్పటివరకు 40 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. కాగా, గాయాలపాలైన వారికి చికిత్స కోసం సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. వంద బెడ్లు వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. 9 మందికి తీవ్ర గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ఈసారి ప్రజల్లో అవగాహన పెరిగిందని.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేసులు తగ్గుతాయని ఆశిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. టపాసుల దుకాణాలతో మార్కెట్లు, కిటకిటలాడాయి. చిన్నాపెద్దా పెద్ద బాణసంచా పేలుస్తూ ఆనందంగా గడిపారు. కాగా, దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు.అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. -
స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో 12 మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. స్థానిక అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను మీడియాకు అందించారు.మెక్సికో నగరానికి తూర్పున 140 కిలోమీటర్ల దూరంలోని అక్లోజ్టోక్లో ఈ పేలుడు సంభవించినట్లు త్లాక్స్‌కాలా స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కార్మికుల నుండి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం కరిగిన ఉక్కు.. నీటి పరిధిలోకి రావడంతో పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి. బాధిత కుటుంబాలను త్లాక్స్కలా గవర్నర్ లోరెనా క్యూల్లార్ పరామర్శించారు. ఈ ఉదంతం దర్యాప్తు పూర్తయ్యేంతవరకూ ప్లాంట్‌ను మూసివేయనున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: కలలో ఏనుగు కనిపిస్తే..? ఏమవుతుంది? -
రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
చండీగఢ్:హర్యానాలోని రోహ్తక్లో కదులుతున్న రైలులో బాణసంచాకు మంటలంటుకున్నాయి.ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జింద్ నుంచి ఢిల్లీ వెళుతున్న రైలులో తొలుత మంటలు లేచాయని, తర్వాత రైలు మొత్తం పొగచూరిందని జీఆర్పీ పోలీసులు తెలిపారు.రైలులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా తొలుత మంటలు లేచాయని, ఈ మంటలు రైలులో ఉన్న ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న బాణసంచాకు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
రైల్వే స్టేషన్లో దీపావళి రద్దీ.. తొక్కిసలాటలో తొమ్మిదిమందికి గాయాలు
ముంబై: ముంబైలోని బాంద్రా టెర్మినల్ రైల్వే స్టేషన్లో ఈరోజు (ఆదివారం) ఉదయం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది గాయపడ్డారు. రైలు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒక్కసారిగా పోటీ పడటంతో ఈ తొక్కిసలాట జరిగింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం తొక్కిసలాట అనంతరం అప్రమత్తమైన రైల్వే అధికారులు గాయపడినవారిని ముంబైలోని భాభా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది. బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడిన తొమ్మదిమందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాంద్రా టెర్మినస్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై ఉదయం 5.56 గంటలకు ఈ ఘటన జరిగింది. STORY | 9 persons injured in stampede at Mumbai's Bandra railway stationREAD: https://t.co/sdZpmGELdkVIDEO:(Source: Third Party) pic.twitter.com/LIBuwJkniS— Press Trust of India (@PTI_News) October 27, 2024బాంద్రా-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కడానికి ప్రయాణికులు పోటీ పడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని షబ్బీర్ అబ్దుల్ రెహ్మాన్ (40), పరమేశ్వర్ సుఖ్‌దర్ గుప్తా (28), రవీంద్ర హరిహర్ చుమా (30), రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), సంజయ్ తిలక్రం కంగాయ్ (27), దివ్యాంశు యోగేంద్ర యాదవ్ (27), మహ్మద్ షరీఫ్ షేక్ (25), ఇంద్రజిత్ సాహ్ని (19), నూర్ మహ్మద్ షేక్ (18)గా పోలీసులు గుర్తించారు. Meanwhile in India #Mumbai : A #stampede on platform number 1 at #Bandra Terminus has left nine people injured. The injured passengers have been taken to the hospital, according to BMC.#MumbaiLocal #MumbaiCrowd #BandraStation #BandraStampede #Diwali #MumbaiLocalT pic.twitter.com/4HoRG2auoA— know the Unknown (@imurpartha) October 27, 2024ఇది కూడా చదవండి: కేజీఎఫ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది -
జమ్ముకశ్మీర్: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి
గుల్మార్గ్: జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని బోటాపాత్ర్ వద్ద ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.కాగా, గుల్మార్గ్లో సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడికి కొన్ని గంటల ముందు పుల్వామాలో ఉగ్రవాద దాడిలో వలస కార్మికుడు గాయపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన కార్మికుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. -
రక్తమోడిన దేవరగట్టు
హొళగుంద: మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో ఈ ఏడాది కూడా రక్తం చిమ్మింది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో విజయదశమి సందర్భంగా శనివారం అర్ధరాత్రి తర్వాత మొదలైన బన్ని ఉత్సవంలో సంప్రదాయ ఆచారమే గెలిచింది. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం విజయోత్సవంలో భాగంగా ఉత్కంఠ భరితంగా జరిగిన జైత్రయాత్ర (కర్రల సమరం)లో 95 మందికి గాయాలు కాగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.తలలు పగిలి, దివిటీలు తగిలి, కిందపడి చేతులు విరిగి.. ఇతర గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్న వారికి స్థానిక హెల్త్ క్యాంప్‌లో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆదోని, ఆలూరు, గుంతకల్లు, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన వారికి హెల్త్ క్యాంప్‌లో చికిత్స అందించారు. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర ఆదివారం ఉదయం వరకు సాగింది. ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట భక్తులు డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి దివిటీలతో అర్ధరాత్రి 12.20 గంటలకు కొండపై ఉన్న స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం.. ఒంటి గంట వరకు నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు మాత మాళమ్మ, మల్లేశ్వరునికి అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలతో పాటు పల్లకిని ఊరేగింపుగా కొండ దిగువకు వచ్చి మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టింపచేశారు. ఆ సమయంలో వారితో పాటు నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల చేతుల్లో ఉన్న రింగు కర్రలు తగిలి చాలామంది గాయపడ్డారు.తలలు పగిలాయి. మొగలాయి ఆడుతున్న కొందరు కాగడాలతో దారి చేసుకుంటూ ముందుకు సాగారు. కొందరు అగ్గి కాగడాలను భక్తులపై విసిరి భయాందోళనకు గురి చేశారు. అనంతరం అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ముళ్లబండ, పదాలగట్టు, రక్షనడి, శమీ వృక్షం, బసవన్న గుడి మీదుగా ఉత్కంఠంగా ముందుకు సాగింది. స్వామి విగ్రహాలు సింహాసన కట్టకు చేర్చి జైత్రయాత్రను విజయవంతం చేసి భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరధ్వాజ, పత్తికొండ ఆర్డీఓ భరత్‌నాయక్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించారు. సోమవారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరగనుంది. ఉత్సవానికి వస్తూ ముగ్గురు దుర్మరణం ఆలూరు రూరల్: బన్ని ఉత్సవాలను తిలకించేందుకు బైక్‌పై వస్తుండగా బైక్ అదుపు తప్పడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా మోకా తాలూకా తగ్గిన బూదేహళ్లి గ్రామానికి చెందిన హరీ‹Ùరెడ్డి (26), మల్లికార్జున (26), రవి (22) శనివారం బైక్‌పై దేవరగట్టుకు బయలుదేరారు. ఆలూరు మండలం కరిడిగుడ్డం సమీపంలో రాత్రి 10 గంటలకు బైక్ అదుపుతప్పి ముగ్గురూ కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. హరీ‹Ùరెడ్డి, మల్లికార్జున అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రవి (22)ని మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. -
ఎయిర్‌పోర్టు వెలుపల పేలుడు.. ఇద్దరు మృతి
కరాచీ: పాకిస్తాన్లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ భారీ పేలుడులో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలింది.విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పాక్ హోం మంత్రి జియా ఉల్ హసన్ స్థానిక టీవీ ఛానల్ జియోకు తెలిపారు. చైనా పౌరులపై దాడి జరిగిందని, వారిలో ఒకరు గాయపడ్డారని అన్నారు. బీజింగ్ చేపట్టిన రహదారి నిర్మాణంలో చైనా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ రహదారి దక్షిణ-మధ్య ఆసియాను చైనా రాజధాని బీజింగ్‌తో కలుపుతుంది.డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఈస్ట్ అజ్ఫర్ మహేసర్ మీడియాతో మాట్లాడుతూ తాము పేలుడుకు గల కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నామన్నారు. గాయపడిన వారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. హోం మంత్రి, ఇన్స్పెక్టర్ జనరల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎయిర్‌పోర్టు భవనాలు కంపించేంత పెద్ద పేలుడు సంభవించిందని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న అధికారి రాహత్ హుస్సేన్ తెలిపారు.ఇది కూడా చదవండి: అశ్వియ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్ -
‘ఆప్’ నేతపై కాల్పులు..బుల్లెట్ గాయం
చండీగఢ్:పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత మన్దీప్ సింగ్ బ్రార్ కాల్పుల్లో గాయపడ్డారు.ప్రతిపక్ష శిరోమణి అకాళీదళ్‌నేత మన్‌దీప్‌సింగ్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపనలున్నాయి. ఆదివారం(అక్టోబర్6) అకాలీదళ్ నాయకుడు వర్దేవ్ సింగ్ మాన్ ఓ స్కూల్‌కు సంబంధించిన ఫైల్ గురించి బీడీపీఓ కార్యాలయానికి వెళ్లారు.ఆ ఫైల్ చూపించేందుకు అధికారులు నిరాకరించడంతో సింగ్ అక్కడినుంచి వెనుదిరిగారు. వెళుతు వెళుతూ బయట ఉన్న ఆప్ నేత మన్దీప్ సింగ్ బ్రార్‌తో సింగ్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఆప్‌నేత మన్‌దీప్‌కు బుల్లెట్ గాయమైంది. వెంటనే ఆయనను జలాలాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అకాలీ పార్టీ నాయకులే కాల్పులకు ఆప్ నేతలు ఆరోపించారు. పంచాయితీ ఎన్నికల సమయంలో అకాళీదళ్ పార్టీ దాడులకు పాల్పడుతోందన్నారు. ఈ నెల 15న పంజాబ్‌లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.ఇదీ చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం -
ముఖం నిండా గాయాలు.. అయినా షూట్ చేద్దామన్నా: బాలీవుడ్ నటి
బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ మహిమా చౌదరి. ప్రస్తుతం ఆమె సిగ్నేచర్ అనే చిత్రంలో కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ దిల్ క్యా కరే మూవీ షూటింగ్లో ఎదురైన సంఘటనను పంచుకుంది. అది తన వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో వివరించింది. షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. తన ముఖానికి ఎంత గాయాలు ఉన్నాయో తనకు తెలియదని చెప్పింది. అయినప్పటికీ షూట్ కొనసాగించాలని చెప్పానని.. కానీ దర్శకుడు ప్రకాష్ ఝా విశ్రాంతి తీసుకోమని చెప్పారని వివరించింది.మహిమా చౌదరి మాట్లాడుతూ.. 'షూటింగ్ సమయంలో నాకు నా ప్రమాదం జరిగింది. నా ముఖంపై ఇన్ని గాయాలు ఉన్నాయని నేను గ్రహించలేదు. తర్వాత బాత్రూమ్కి వెళ్లి అద్దంలో చూసుకున్నా. ఏమీ జరగకపోతే షూట్ చేద్దాం అని ప్రకాష్ జీకి చెప్పాను. కానీ ఆయన వద్దన్నారు. గాయం తర్వాత నా ముఖం నుంచి డాక్టర్లు 67 గాజు ముక్కలు బయటకు తీశారు. ఆ సమయంలో ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని అజయ్ దేవగన్, ప్రకాష్ జాను కోరా. నా కెరీర్ కాపాడుకునేందుకు బయట పెట్టొద్దని వారిని అభ్యర్థించాను. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ విషయం బయటపెట్టానని చెప్పుకొచ్చింది' బాలీవుడ్ భామ. అంతేకాకుండా తన కంటికి సర్జరీ తర్వాత చాలా ఒత్తిడికి గురైనట్లు మహిమా చౌదరి వెల్లడించింది. శస్త్రచికిత్సల తర్వాత ఇప్పటికీ నా కన్ను ఒకటి చిన్నదిగా కనిపిస్తుందని వివరించింది. -
కత్తితో దాడి.. ముగ్గురు మృతి
షాంఘై: చైనాలోని ప్రముఖ నగరం షాంఘైలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక సూపర్ మార్కెట్లో ఒక వ్యక్తి కత్తితో ముగ్గురిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆ ముగ్గురు హతమయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ వివరాలను షాంఘై పోలీసులు మీడియాకు తెలిపారు.చైనా 75వ జాతీయ దినోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో షాంఘై నగరంలో ఈ దాడి చోటుచేసుకుంది. వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం 37 ఏళ్ల లిన్ అనే వ్యక్తి ఈ దాడులకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడని పట్టుకున్నారు. కాగా సూపర్మార్కెట్లో కత్తి పట్టుకుని తిరుగుతున్న లిన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి.దాడికి పాల్పడిన లిన్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్లుగా చైనాలో బహిరంగ ప్రదేశాల్లో కత్తితో దాడులు జరుగుతున్న ఘటనలు అధికమయ్యాయి. గత మే నెలలో చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో కత్తి దాడికి గురైన ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.ఇది కూడా చదవండి: హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి -
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
బుండి: రాజస్థాన్‌లోని బుండిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎకో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో హిడోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ నేషనల్ హైవేలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైవేపై ఉన్న కెమెరాలు, టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన గురించి బుండి ఏఎస్పీ ఉమా శర్మ మాట్లాడుతూ సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. కాగా రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఓ కారు రెండు బైక్‌లను ఢీకొంది. ఈ ఘటనలో కూడా ఆరుగురు మృతి చెందారు.ఇది కూడా చదవండి: రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి -
పేలిన ఆయిల్ ట్యాంకర్.. 25 మందికిపైగా మృతి
పోర్ట్ అవ్ ప్రిన్స్:హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న ఇంధన ట్యాంకర్ పేలిపోయింది.తీర నగరం మిరాగానేలో శనివారం(సెప్టెంబర్14) ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మందికిపైగా దుర్మరణం పాలవ్వగా 50 మందికిపైగా గాయపడ్డారు. రోడ్డుపై వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ టైరు తొలుత పంక్చర్ అయింది. దీంతో ఆయిల్ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో పేలుడు జరిగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్లో తరలించారు.ప్రమాద స్థలాన్ని ప్రధాని గ్యారీ కొనల్ పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘ఇది చాలా భయంకర ప్రమాదం. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయి’అని తెలిపారు. హైతీలో కొన్ని ప్రాంతాలు మిలిటెంట్ గ్యాంగుల ఆధీనంలో ఉండటంతో అత్యవసర వస్తువుల రవాణాకు రోడ్డు మార్గం కంటే నౌకలను ఎక్కువగా వాడుతుండడం గమనార్హం. ఇదీ చదవండి.. చమురు ట్యాంకర్‌కు మంటలు -
Bhediya Attack: మళ్లీ రెచ్చిపోయిన తోడేళ్లు.. ముగ్గురికి గాయాలు
కౌశాంబి: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో నరమాంస భక్షక తోడేలు ముగ్గురిపై దాడి చేసింది. వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించాక వైద్యులు బాధితులను ఇంటికి పంపించారు. తోడేళ్ల దాడి అనంతరం ఆ ప్రాంతంలోని ఇటుక బట్టీ సమీపంలో మూడు వన్యప్రాణులకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో గ్రామస్తులలో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామస్తులు రాత్రిపూట కర్రలు,రాడ్లతో తమ పశువులను, కుటుంబాలను కాపాడుకుంటున్నారు. గ్రామస్తుల అందించిన సమాచారంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన కరారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెవారి, ఖోజ్వాపూర్ గ్రామాలలో చోటుచేసుకుంది.బుధవారం సాయంత్రం తమ కుటుంబ సభ్యులు పశువుల మేతను కోసేందుకు పొలాలకు వెళ్లారని నెవారి గ్రామానికి చెందిన రాజ్కరణ్పాల్ తెలిపారు. ఆసమయంలో తన రెండున్నరేళ్ల మేనల్లుడు ప్రియాంష్ అక్కడ ఆడుకుంటుండగా, ఒక నక్క పొదల్లోంచి బయటికి వచ్చి, ఆ పిల్లాడి మెడను నోట కరుచుకుని పారిపోయే ప్రయత్నం చేసింది. ఆ చిన్నారి ఏడుపు విన్న మహిళలు గట్టిగా కేకలు పెట్టారు. దీంతో తాను, కొంతమంది గొర్రెల కాపరులు పరిగెత్తి ఆ తోడేలు దగ్గరికి వెళ్లగా, అది తమను చూసి పారిపోయిందన్నారు. ఆ తోడేలు అక్కడి నుంచి పరిగెట్టి మేకలు మేపుతున్న రాందాస్ సరోజ అనే మహిళపై దాడి చేసింది. గ్రామస్తులు దానిని తరిమికొట్టడంతో ఆ తోడేలు ఖోజ్వాపూర్ గ్రామం వైపు పరుగు తీసి, అక్కడ సోనుపాల్ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిందని రాజ్కరణ్పాల్ తెలిపారు.నెవారి గ్రామానికి చెందిన ధ్యాన్ సింగ్ గత రెండు రోజులుగా తోడేళ్ల గుంపు తమ గ్రామానికి వస్తున్నదని తెలిపారు. ఏ సమయంలోనైనా తోడేళ్ల గుంపు గ్రామంలోకి వచ్చి పిల్లలు, మేకలు, గేదెలపై దాడి చేస్తుందనే భయం తమను వెంటాడుతున్నదన్నారు. రాత్రివేళ పిల్లలను ఇంటి లోపల పడుకోబెట్టి, తాము తోడేళ్ల నుంచి వారిని రక్షించడానికి రాత్రంతా కాపలాగా ఉంటున్నామన్నారు. అటవీశాఖ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో తామే తమ కుటుంబాన్ని, పశువులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. -
Mumbai: మద్యం మత్తులో బస్సు స్టీరింగ్ గిరగిరా తిప్పడంతో..
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో విచిత్ర పరిస్థితుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులోని ఒక ప్రయాణికుడు ఏదో విషయమై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఆ ప్రయాణికుడు బస్సు స్టీరింగ్‌ను ఇష్టమొచ్చినట్లు గిరగిరా తిప్పాడు. దీంతో బస్సు అదుపు తప్పి, పలు వాహనాలను, పాదచారులను ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన లాల్బాగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన తొమ్మిది మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడి చర్యల కారణంగా, బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సు సియోన్‌లోని రాణి లక్ష్మీబాయి చౌక్ వైపు వెళుతోంది. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. -
Russia: పట్టాలు తప్పిన రైలు.. 100 మందికి గాయాలు
రష్యాలోని దక్షిణ వోల్గోగ్రాడ్ ప్రాంతంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 800 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.ట్రక్కును ఢీకొట్టిన అనంతరం రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. రష్యా టుడే తెలిపిన వివరాల ప్రకారం 20 బోగీలతో కూడిన ఈ రైలు రష్యాలోని టాటర్స్థాన్ రిపబ్లిక్‌లోని కజాన్ నుంచి సోచి సమీపంలోని రిసార్ట్ నగరం అడ్లెర్‌కు వెళుతోంది. రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పినట్లు వోల్గోగ్రాడ్ రీజియన్ గవర్నర్ ఆండ్రీ బోచారోవ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ప్రమాదం నుంచి ట్రక్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే అతని తలకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది జూన్‌లో రష్యాలోని కోమిలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్యాసింజర్ రైలు ఈశాన్య కోమిలోని వోర్కుటా నుండి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రాంతాల మధ్య దూరం ఐదు వేల కిలోమీటర్లు ఉంటుంది. WATCH | Russia Train-Truck Accident Injures 140, Derails Multiple Carriages#Russia #accident #Train https://t.co/Fs6k6KYVfe— Oneindia News (@Oneindia) July 29, 2024 -
Madhya Pradesh: కావడియాత్రలో విషాదం.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావడియాత్రికులతో కూడిన ట్రాక్టర్‌ను ఒక ట్రక్కు బలంగా డీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు కావడి యాత్రికులు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మొరెనా జిల్లాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు కావడియాత్రికులు ఖాదియాహర్ గ్రామం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఘాట్‌కు ట్రాక్టర్లో తరలివెళ్తున్నారు.డియోరీ గ్రామ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వీరి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కావడియాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన 12 మందికి పైగా క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Uttar Pradesh: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో ఢిల్లీ హైవేపై ఈరోజు (సోమవారం) ఉదయం రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా ముగ్గురు మృతిచెందారు. వందమందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.మిలాక్‌లోని భైరవ బాబా ఆలయం సమీపంలో సాహిబాబాద్ డిపో బస్సు, వోల్వో బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. తెల్లవారుజామున 4.15 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జిల్లా మేజిస్ట్రేట్ జోగేంద్ర సింగ్, పోలీసు సూపరింటెండెంట్ విద్యాసాగర్ మిశ్రా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ తెలిపిన వివరాల ప్రకారం మృతులలో రోడ్డువేస్ బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు.గాయపడిన వారి సంఖ్య 49కి చేరిందని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. తొమ్మదిమంది పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. సాహిబాబాద్ డిపోకు చెందిన జనరత్ బస్సు లక్నో నుంచి ఢిల్లీ వెళ్తోంది. ప్రైవేట్ వోల్వో బస్సు హరిద్వార్ నుంచి శ్రీబస్తీకి వెళ్తోంది. ప్రైవేట్ బస్సు రాంగ్ సైడ్‌లో వచ్చిన కారణంగానే ప్రమాదం చోటుచేసుకున్నదని ప్రాథమికంగా తెలుస్తోంది. -
జమ్ముకశ్మీర్‌లో నాల్గవరోజూ ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని దోడాలో వరుసగా నాల్గవరోజు కూడా ఎన్కౌంటర్ జరిగింది. నేడు (గురువారం) తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించారు.కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. గంటకు పైగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక కెప్టెన్‌తో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటన అనంతరం ఆర్మీ సిబ్బంది.. గ్రామంతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. జూన్ 12 నుంచి దోడాలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. చటర్గాలా పాస్ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, మరుసటి రోజు గండోలో కాల్పులు జరిగాయి. దానిలో ఒక పోలీసు గాయపడ్డాడు.జూన్ 26న, జిల్లాలోని గండో ప్రాంతంలో రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, జూలై 9న ఘరీ కుంకుమ అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూలోని ఆరు జిల్లాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది, ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 27 మంది మృతి చెందారు.