![Actress Pallavi Joshi was seriously injured in Shooting Vaccine War Movie - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2023/01/16/WhatsApp%20Image%202023-01-16%20at%2019.37.47.jpeg.webp?itok=AklsCEEo)
ది కశ్మీర్ ఫైల్స్ నటి, జాతీయ అవార్డ్ గ్రహీత పల్లవి జోషికి తీవ్ర గాయాలయ్యాయి. కార్ ఛేజింగ్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న 'వ్యాక్సిన్ వార్' సినిమా షూటింగ్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.