Vivek Agnihotri
-
ఇలా మధ్యలో ఉండేవారి వల్ల కెరీర్ నాశనం: దర్శకుడు
ఎంతోమంది కెరీర్‌ను మధ్యలో ఉన్నవాళ్లే నాశనం చేస్తున్నారంటున్నాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కొందరు మేనేజర్ల వల్ల ఆ హీరోల కెరీర్ ప్రమాదంలో పడుతుందని చెప్తున్నాడు. ఇంతకీ ఇదంతా ఎప్పుడు వచ్చిందంటే.. కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా... ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇదీ పరిస్థితి.. ఒక్క నటుడు, 200మంది కాస్టింగ్ డైరెక్టర్లు, 15,680 మేనేజర్లు అని (దండంరా నాయనా అన్నట్లుగా ఓ ఎమోజీ జత చేసి) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు.మేనేజర్ చేసిన పనికి..దీనికి వివేక్ స్పందిస్తూ.. అవును, ఓ మేనేజర్ దురుసు ప్రవర్తన వల్ల గతవారం ఓ ప్రముఖ నటుడిని సినిమాలో నుంచి తీసేయాల్సి వచ్చింది. ఆ మేనేజర్ ఓ పెద్ద స్టార్ కిడ్ టాలెంట్ ఏజెన్సీలో పని చేస్తాడు. అందుకని అంత ఓవర్‌గా ప్రవర్తించాల్సిన అవసరం లేదుకదా!దీని గురించి వర్క్షాప్వీళ్ల వల్ల ఎంతోమంది కెరీర్ నాశనమవుతున్నాయి. దీని గురించి వర్క్‌షాప్ నిర్వహించాల్సిందంటూ ముకేశ్ చాబ్రాను కోరాడు. అయితే నటుడు, మేనేజర్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి.. ద ఢిల్లీ ఫైల్స్ అనే సినిమా చేస్తున్నాడు. I had to fire a lead actor last week because his manager was so arrogant and behaved as if he had the prerogative to be like this just because he is an employee of a ‘Huge Celeb’s’ Star Kid Talent Agency’. These middlemen have destroyed more careers than made it. Do a workshop… https://t.co/r3RtDtyBBu— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 27, 2024 చదవండి: దేవర సినిమా రివ్యూ -
ఓటీటీకి వివేక్ అగ్నిహోత్రి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అదే జోరుతో వివేక్ ది వ్యాక్సిన్ వార్ చిత్రాన్ని రూపొందించారు. ఈ ఏడాది సెప్టెంబరు 28 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొవిడ్ టైంలో వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు ఎలా అభివృద్ధి చేశారనేది ఈ చిత్రంలో చూపించారు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 24న తేదీ నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ హిందీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. దక్షిణాది భాషల్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మేకర్స్ వెల్లడించలేదు. కాగా.. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. -
రాజమౌళికి షాక్.. మహాభారతం ఏం చేస్తాడో మహానుభావుడు
-
రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా
'మహాభారతం' సినిమా తీయాలనేది నా కల. ఇది స్టార్ డైరెక్టర్ రాజమౌళి చాలాఏళ్ల క్రితమే చెప్పిన మాట. ఇప్పటి జనరేషన్ దర్శకుల్లో పీరియాడికల్ చిత్రాలంటే రాజమౌళికి మాత్రమే సాధ్యం అనేంతలా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే జక్కన షాక్ ఇస్తూ ఓ డైరెక్టర్ 'మహాభారతం' సినిమాని ప్రకటించాడు. ఇప్పుడదే మూవీ లవర్స్‌ని కంగారు పెడుతోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో పోలిక.. రూ.3 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు!) హిందీలో ఏవేవో సినిమాలు తీసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. కనీసం గుర్తింపు సంపాదించలేకపోయాడు. 'ది తాష్కెంట్ ఫైల్స్'తో కాస్త ఫేమ్ వచ్చింది. ఇక 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనుకోకుండా వచ్చిన ఈ ఫేమ్‌ని క్యాష్ చేసుకోవాలని 'ద వ్యాక్సిన్ వార్' మూవ తీశారు. సెప్టెంబరు 28న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. కనీసం వసూళ్లు తెచ్చుకోలేక ఘోరమైన డిజాస్టర్ అయింది. ఇప్పుడు 'మహాభారతం' సినిమాని మూడు భాగాలుగా తీస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి ప్రకటించాడు. 'పర్వ' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు కృష్ణుడు, అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి 'ద కశ్మీర్ ఫైల్స్' తప్ప చెప్పుకోదగ్గ రేంజులో ఒక్కటంటే ఒక్క సినిమా తీయలేకపోయిన వివేక్ అగ్నిహోత్రి.. 'మహాభారతం' చిత్రాన్ని ఏం చేస్తాడోనని ఆడియెన్స్ కంగారుపడుతున్నారు. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) BIG ANNOUNCEMENT: Is Mahabharat HISTORY or MYTHOLOGY? We, at @i_ambuddha are grateful to the almighty to be presenting Padma Bhushan Dr. SL Bhyrappa’s ‘modern classic’: PARVA - AN EPIC TALE OF DHARMA. There is a reason why PARVA is called ‘Masterpiece of masterpieces’. 1/2 pic.twitter.com/BiRyClhT5c — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 21, 2023 -
ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే
టాలీవుడ్లో ఈ వారం పెద్ద సినిమాల హవా కొనసాగింది. రామ్ పోతినినే స్కందతో పాటు లారెన్స్ ‘చంద్రముఖి -2’, శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు’చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. వీటితో పాటు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ది వాక్సిన్ వార్’ కూడా ఈ నెల 28నే విడుదలయ్యాయి. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ రివ్యూల్లో చదవండి. స్కంద: నో లాజిక్.. ఓన్లీ యాక్షన్ రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘స్కంద’. బోయపాటి సినిమాలు అంటేనే హై వోల్టేజ్ యాక్షన్ కథ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కంద కూడా అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథేంటి? ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్? ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చంద్రముఖి-2: భయపెట్టని హార్రర్ రజనీకాంత్, పీ.వాసు కాంబోలో వచ్చిన చంద్రముఖి(2005) అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తమిళ్లోనే కాదు తెలుగులో ఆ చిత్రం భారీ వసూళ్లని రాబట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. పైగా చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటించడంతో ‘చంద్రముఖి-2’పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఏర్పడాయి. మరి ఆ అంచనాలు ఈ చిత్రం ఏ మేరకు అందుకుంది? చంద్రముఖిగా కంగనా భయపెట్టిందా లేదా? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పెదకాపు-1..తడబడిన సామ్యానుడి సంతకం ఫ్యామిలీ సినిమాకు కేరాఫ్ శ్రీకాంత్ అడ్డాల. ఒక నారప్ప మినహా ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కుటుంబ, ప్రేమ కథలే. అలాంటి దర్శకుడు రాజకీయ నేపథ్యంతో ‘పెదకాపు’ అనే సినిమాను తెరకెకించాడు. అది కూడా కొత్త హీరోహీరోయిన్లతో. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘పెద కాపు -1’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సామాన్యుడి సంతకం అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘ది వ్యాక్సిన్ వార్’ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి నేషనల్ వైడ్‌గా కాంట్రవర్సీ అయ్యాడు. అంతకు ముందు పలు చిత్రాలను తెరక్కించినా.. ది కాశ్మీర్ ఫైల్స్’తోనే అతనికి గుర్తింపు వచ్చింది. తాజాగా వివేక్ అగ్నిహోత్రి తెరక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజల దుస్థితి ఎలా ఉంది? వ్యాక్సిన్ కనుగోనేందుకు భారత శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సమస్యలేంటి? అనే నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ సాగుతుంది ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
The Vaccine War: 'ది వ్యాక్సిన్ వార్' మూవీ రివ్యూ
టైటిల్: ది వ్యాక్సిన్ వార్ నటీనటులు: నానా పటేకర్,అనుపమ్ ఖేర్,పల్లవి జోషి,రైమా సేన్,గిరిజా ఓక్,సప్తమి గౌడ తదితరులు నిర్మాణ సంస్థ: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలు: పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: వివేక్ అగ్నిహోత్రి సంగీతం: రోహిత్ శర్మ, వనరాజ్ భాటియా సినిమాటోగ్రఫీ: ఉదయసింగ్ మోహితే ఎడిటర్: శంఖ రాజాధ్యక్ష విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశ మొత్తం తన గురించి చర్చించుకునేలా చేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్లో పలు సినిమాలు చేసినా ఆయనకు గుర్తింపు వచ్చింది మాత్రం ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతోనే. సున్నితమైన సమస్య చుట్టూ ఈ కథని చెప్పడం వలన కొంతమంది మనోభావాలు దెబ్బతింటే, హిందుత్వ సంఘాల, పలు సమూహాలకి బాగా కనెక్ట్ అయ్యింది. అంతేకాకుండా ఆ సినిమాపై భారీ విమర్శలు కూడా వచ్చాయి. ఇలా ఆ సినిమా తర్వాత ఆయన నుంచి తాజాగా విడుదలైన చిత్రం 'ది వ్యాక్సిన్ వార్' కరోనావైరస్ వ్యాప్తి భూ గ్రహం మీద ఉన్న ప్రతి వ్యక్తి జీవితాలను ప్రభావితం చేసింది. ఆ సమయంలో విధించిన లాక్డౌన్ వల్ల వివిధ వర్గాల ప్రజల దుస్థితి ఎలా ఉంది.. వ్యాక్సిన్ తయారు చేసేందుకు చాలామంది శాస్త్రవేత్తలు ఎందుకు వెనకడుగు వేశారు..? అలాంటి సమయంలో తామున్నామని మహిళా శాస్త్రవేత్తలు ముందు అడుగు వేయడానికి గల కారణాలు ఏంటి..? వ్యాక్సిన్ తయారు చేయడం ఇండియా వల్ల కాదని ఎందరో చెబుతున్నా.. కేవలం ఏడు నెలల సమయంలో స్వంత వ్యాక్సిన్‌ను భారత్ ఎలా తయారు చేయగలిగింది..? వ్యాక్సిన్ తయారు చేస్తున్న సమయంలో శాస్త్రవేత్తల దుస్థితి ఎలా ఉంది..? ఇవన్నీ తెలియాలంటే వివేక్ రంజన్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్'లోకి వెళ్లాల్సిందే. 'ది వ్యాక్సిన్ వార్' కథేంటంటే.. ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాజీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ బలరామ్ భార్గవ్ రాసిన 'గోయింగ్ వైరల్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని అగ్నిహోత్రి తెరకెక్కించారు. వాక్సిన్ వార్, వాస్తవ ప్రపంచంలో జరిగిన ఘటనలతో సినిమా ప్రారంభం అవుతుంది. ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ భార్గవ (నానా పటేకర్) తన శాస్త్రవేత్తల బృందంతో న్యుమోనియా లాంటి వ్యాక్సిన్లను తయారు చేసే పనిలో ఉంటారు. అందుకు కావాల్సిన ఆయన ఒక టీమ్‌ను సమీకరించుకుంటారు. అదే సమయంలో నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ (NIV) హెడ్‌గా డాక్టర్ అబ్రహం (పల్లవి జోషి పోషించారు) వీరందరి నేతృత్వంలో భారత్ కోసం పలు వ్యాక్సిన్ల తయారిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆ సమయంలో భారతదేశంతో పాటు.. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కోవిడ్-19 మహమ్మారి బారిన పడుతాయి. ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. ఈ కథనాలను ప్రజలకు చేరవేసేందుకు మీడియా కూడా ప్రాణలకు తెగించే పని చేస్తుంటుంది. నెగటివ్ జర్నలిస్టు పాత్రలో (రైమా సేన్) అనేక నిజ జీవితాలను వెలికితీస్తూనే కొన్ని తప్పుడు వార్తలను కూడా ప్రచురిస్తూ ఉంటుంది. ఆమె నేతృత్వంలోని మీడియాకు చెందిన ఒక విభాగం హానికరమైన తప్పుడు వార్తల ప్రచారం చేస్తూ.. శాస్త్రవేత్తలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఆమెతో పోరాడుతూ.. వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి శాస్త్రవేత్తల బృందం ఎలాంటి అడ్డంకులను దాటింది. అనేది కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారిలో భాగం అయ్యేందుకు చాలామంది పురుష శాస్త్రవేత్తలు వెనకడుగు వేస్తారు. అలాంటి సమయంలో మహిళా శాస్త్రవేత్తలు ముందుకు వస్తారు. ఇందులో డాక్టర్ భార్గవ పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారి సమయంలో ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంది..? ఆ సమయంలో ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత వచ్చింది..? ది వ్యాక్సిన్ వార్ సినిమా మన వ్యాక్సిన్ సిస్టం.. మన మెడికల్ సిస్టం నిజస్వరూపాన్ని చూపెట్టిందా..? విపత్కర పరిస్థితుల్లో భారత్ ఎలా పోరాడింది. శాస్త్రవేత్తలను అణగదొక్కడమే తమ లక్ష్యంగా పనిచేసింది ఎవరు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మనం చేయలేము.. అనుకునే స్థాయి నుంచి మనం చేయగలం అనే స్థాయికి చేరుకుని.. చేసి చూపించారు మన శాస్త్రవేత్తలు. ఒక్కముక్కలో చెప్పాలంటే ది వ్యాక్సిన్ వార్ సారాంశం ఇదే. సినిమా కథ విషయానికి వస్తే అద్బుతంగా ఉంది. మానవ మెదడుకి మెమోరీ తక్కువగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా టైంలో జరిగిన వాటిని మరిచిపోగలం. కానీ ఈ చిత్రం మాత్రం ఇండియా శాస్త్రవేత్తల మీద నమ్మకాన్ని పెంచుతుంది. వారి పట్ల గౌరవాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాను చూశాక మన శాస్త్రవేత్తలను చూసి గర్వపడేలా ఉంటుంది. సినిమాలో గమనించదగ్గ అంశం ఏమిటంటే, వివేక్ అగ్నిహోత్రి తన మునుపటి చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'పై ఎన్నో విమర్శలను అందుకున్నాడు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగకపోవచ్చు. కోవిడ్ -19 కేసులకు మైనారిటీలు ఎలా కారణం అయ్యారు.. దానిని వ్యాప్తి చేయడంలో వారు చేసిన తప్పు ఏంటి అనే కథనాన్ని స్పష్టంగా చూపించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో కుంభమేళా వేడుకలు, పలు ర్యాలీలతో పాటు డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తిని తెరపై చూపిస్తుంది. సినిమాలో రాజకీయ విషయానికి వస్తే అతను దానిని కొంతమేరకు బ్యాలెన్స్ చేశాడని చెప్పవచ్చు. ఇది ప్రభుత్వాన్ని సానుకూలంగా చూపుతుందనడంలో సందేహం లేదు. బలరామ్ భార్గవ్ (నానా పటేకర్ పోషించిన పాత్ర) తాను సైన్స్ అనుకూలుడని ప్రధానిని ప్రశంసించడం కనిపించింది. రెండవ వేవ్ సమయంలో వైరస్ వ్యాప్తికి రాజకీయ ర్యాలీలు కారణమని కూడా చిత్రంలో కనిపిస్తుంది. అటు ప్రభుత్వంపై సానుకూలతను చూపుతూనే.. కొంతమేరకు ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందో కూడా చిత్రంలో ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నిడివిగా అనిపిస్తుంది. ఇది సాధారణ ప్రేక్షకులకు విసుగు తెప్పించవచ్చు. అయితే సెకండాఫ్ వేగం పుంజుకుని చివరి వరకు మెయింటెన్ చేస్తుంది. ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాలో చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ల్యాబ్‌లలోనే వారి జీవితాన్ని ఎలా గడిపారని చూపించారు. ఆ సీన్స్ మెప్పిస్తాయి. ఒక సాధారణ వ్యక్తికి వ్యాక్సిన్ గురించి పూర్తిగా తెలియదు. కానీ, ఈ సినిమా చూశాక దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. వ్యాక్సిన్ తయారు చేయడం కేవలం వాళ్ల ఉద్యోగం మాత్రమే కాదు. అది సైంటిస్ట్‌లు చేసిన నిస్వార్థమైన సేవ. వాళ్ల సమయాన్ని దేశం కోసం ఉపయోగించారు. ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. విదేశీ వ్యాక్సిన్లను భారత్‌లో ఎక్కువగా ప్రచారం చేయడం.. వారి వ్యాపార సామ్రాజ్యం కోసం జరుగుతున్న లాబీయింగ్ సీన్లు ప్రతి భారతీయుడిని ఆలోచింపచేస్తాయి. అందులో మీడియా పాత్ర ఏమేరకు ఉందనేది ప్రధాన చర్చకు దారితీస్తుంది. అంతేకాకుండా ‘భారత్‌కు వ్యాక్సిన్ తయారు చేయడం చేతకాదు’ అని మీడియా మొత్తం నమ్మిందా? అనేలా చిత్రీకరించిన సీన్లు కొంతమేరకు అభ్యంతరకంగా ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. సినిమాలో నానా పటేకర్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. తన ప్రతిభకు తాను మాత్రమే అనేలా మరోసారి ఆయన నిరూపించుకున్నాడు. అతను ఏ పాత్రనైనా పోషించగలడని శాస్త్రవేత్తగా 100 మార్కులతో మెప్పిస్తాడు. ఒక శాస్త్రవేత్త బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది.. కీలక సమయాల్లో వారి యెక్క భావోద్వేగాలు ఏ విధంగా ఉంటాయో నానా పటేకర్ చూపించాడు. డాక్టర్ అబ్రహం పాత్రలో పల్లవి జోషి నటించింది. ఆమె ఒక మలయాళీ పాత్రను పోషిస్తుంది. సినిమాలో ఆమె ఉచ్చారణ బాగున్నా.. నానా పటేకర్‌తో వచ్చే సీన్లు అంతగా హైలెట్‌గా కనిపించవు. కానీ NVIలోని శాస్త్రవేత్తల మధ్య ఒత్తిడితో పాటు అనేక భావోద్వేగాలు కనిపిస్తాయి. అక్కడ ఆమె ప్రదర్శనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. సినిమా ఎడిటింగ్ మరింత పటిష్టంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఏది ఏమైనప్పటికీ, ఒక ప్రధాన లోపం ఏమిటంటే, మీడియాను ఏకపక్షంగా చిత్రీకరించడం అంతగా మెప్పించదు. మీడియా వల్లే నాడు కోవిడ్ సమయంలో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా తెలుసుకునే వారు. మీడియా కూడా ఫ్రంట్ వారియర్స్‌గా కరోనా విపత్తు సమయంలో పనిచేసింది. ఈ విషయాన్ని గుర్తించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అతను ఈ చలన చిత్రాన్ని ఒక రకమైన 'మీడియా యుద్ధం'గా పేర్కొన్నట్లు ఉంది. వాస్తవానికి, వ్యాక్సిన్‌పై నెగిటివ్ ఇమేజ్‌ని సృష్టించి, నకిలీ వార్తల ద్వారా దాని గురించి తప్పుడు కథనాన్ని అల్లడంపై నరకయాతన పడుతున్న జర్నలిస్ట్‌గా నటించిన రైమా సేన్, ఈ చిత్రంలో బలహీనమైన లింక్‌గా కనిపిస్తుంది. ఆమెను సరైన రీతిలో దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు. శాస్త్రవేత్తలు, ప్రజల్లో కలిగే ఎమోషనల్ సీన్లు మాత్రం బాగా పండుతాయి. రాజకీయ సంఘర్షణలు తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. భారతీయ శాస్త్రవేత్తలు విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశారు. వారి కోసం ఈ సినిమాను ఖచ్చితంగా చూడవచ్చు. వారు తమ జీవితాల గురించి పట్టించుకోకుండా గొప్ప మంచికి ఎలా ప్రాముఖ్యతనిచ్చారనే దాని గురించి మీరు ఆలోచించేలా చేస్తుంది. ఇది వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ థియేటర్ నుంచి మిమ్మల్ని ఇంటికి నడిపిస్తుంది. - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్ -
ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: స్టార్ డైరెక్టర్
డార్లింగ్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇప్పుడు ఉన్నదంతా ఒకటే టెన్షన్. 'సలార్' ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇలాంటి టైంలో డార్లింగ్ అభిమానులపై ఓ స్టార్ డైరెక్టర్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. తనని వాళ్లు బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలేం జరిగింది? ఎవరా దర్శకుడు? ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తీసిన సినిమా 'సలార్'. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ శుక్రవారం.. అంటే సెప్టెంబరు 28న థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ లేట్ కావడం వల్ల వాయిదా పడింది. అదే రోజున 'ద వ్యాక్సిన్ వార్' అనే హిందీ సినిమా రిలీజ్ అవుతోంది. కనీసం ఇది వస్తున్నట్లు ఎవరికీ తెలియట్లేదు. పట్టించుకోవట్లేదు కూడా. దీంతో ఈ చిత్ర డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ఏం చేయాలో అర్థం కావడం లేదనుకుంటా! పిచ్చి కామెంట్స్‌తో హైప్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. (ఇదీ చదవండి: నిత్యామేనన్‌ని వేధించిన ఆ హీరో.. అసలు నిజమేంటి?) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనని ప్రభాస్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని, తన కూతురిపైనా అసభ్యకర రీతిలో ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. గతంలో ఇదే దర్శకుడు.. ప్రభాస్‌కి అస్సలు యాక్టింగే రాదని, సలార్ టీజర్ చెత్తలా ఉందని పిచ్చి కూతలు కూశాడు. 'సలార్' పోటీగా తమ సినిమా రిలీజ్ చేస్తున్నామని, భయపడేది లేదని అన్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కి మండింది. ఆ ఊపులోనే డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిపై ట్రోల్ చేసినట్లు ఉన్నారు. దాన్ని ఇన్ని రోజులు బయటపెట్టకుండా.. తన సినిమాకు హైప్ లేకపోయేసరికి ఇప్పుడు చెబుతున్నాడు. తన మూవీ రిలీజ్‌కి మరో రెండు రోజుల ఉందనగా చెప్పడం విడ్డూరంగా అనిపించింది. 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు.. 'ద వ్యాక్సిన్ వార్'తో ఏం చేస్తాడనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుందిలే! అలానే ఇదంతా చూస్తుంటే ప్రభాస్ ఇమేజ్ చెడగొట్టేందుకు ఈ దర్శకుడు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడా అనే డౌట్ కూడా వస్తోంది. (ఇదీ చదవండి: సాయితేజ్-స్వాతి.. ఆ విషయం ఇప్పుడు బయటపెట్టారు!) -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్
‘ది కశ్మీరీ ఫైల్స్’ వంటి హిట్ మూవీ తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. నానా పటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, సప్తమి గౌడ, పరితోష్ సాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ నటించారు. పల్లవి జోషి నిర్మించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. మంగళవారం హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘భారతదేశపు మొట్టమొదటి బయో–సైన్స్ చిత్రమిది. కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నదే ఈ చిత్ర కథ’’ అని యూనిట్ పేర్కొంది. కాగా ‘వ్యాక్సిన్ వార్’ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తమిళ, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో విడుదల కానుంది. -
జాతీయ అవార్డ్స్ కోసం లాబీయింగ్.. స్పందించిన నిర్మాత
69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ కూడా తెలుగు చిత్రసీమకు చెందినవారే కావడం విశేషం. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా గుర్తించి అందుకు గాను జాతీయ అవార్డును ప్రకటించారు. అంతేకాకుండా ఇందులో తన నటనతో మెప్పించిన పల్లవి జోషికి ఉత్తమ సహాయనటి విభాగంలో అవార్డు దక్కింది. ఈ అంశంపై తాజాగ నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పందించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకు రెండు జాతీయ అవార్డ్స్ రావడం చాలా సంతోషంగా ఉందని అభిషేక్ తెలిపారు. ఈ సినిమా ప్రారంభం నుంచి తమకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. సినిమాను చూసిన కొందరు యాంటీ ముస్లిం అంటూ కామెంట్లు చేశారు.. ఈ విధంగా ఎలా కామెంట్ చేశారో ఇప్పటికీ అర్థం కాలేదని ఆయన అన్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా యాంటీ టెర్రరిస్ట్ కథాంశంతో తెరకెక్కిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా డైరెక్టర్ వివేక్ అమెరికాలో ఉన్నారని, ఈ అవార్డుతో ఆయన మరింత సంతోషంగా ఉన్నారని తెలిపారు. (ఇదీ చదవండి: అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్) ప్రస్తుతం తెలుగు సినిమా అనేది రాష్ట్రాన్ని దాటి ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని చెప్పారు. కొందరు రాజకీయాల్లో వస్తున్నానంటూ తన గురించి ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని తను ఎప్పటికీ రాజకీయాలకు దూరం అని చెప్పాడు. అంతేకాకుండా అవార్డ్స్ కోసం లాబీయంగ్ చేశారంటూ కొందరు చెబుతున్నారని ఈ అవార్డ్స్ కోసం ఎలాంటి లాబీయింగ్ చెయ్యలేదని అసలు అలాంటి విషయాలు తనకు తెలీయదని అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. '69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు అవార్డులు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్ ఫైల్స్ ఇది ప్రజల సినిమా. ప్రజలు ఎంతో గొప్పగా ఆదరించారు. ఈరోజున దేశ ప్రజలే ఈ అవార్డు గెలుచుకున్నారు. దేశ ప్రజలకు, కశ్మీర్ పండిట్లందరికీ ఈ పురస్కారాల్ని అంకితమిస్తున్నాం. అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ పొందడం చాలా అనందంగా ఉంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆరు జాతీయ అవార్డులు రావడం, ఉప్పెన, కొండపొలం పాటకి చంద్రబోస్‌కు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే కార్తికేయ 2 తర్వాత ప్రస్తుతం నిర్మిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. పాన్ ఇండియా ఆడియన్స్ అలరించే కంటెంట్ టైగర్ నాగేశ్వరరావులో ఉంది. అక్టోబర్ 20న విడుదల చేస్తున్నాం. దానికి కూడా జాతీయ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం కావాలి.'' అని అన్నారు. వాస్తవిక అంశాల చుట్టూ ది కాశ్మీర్ ఫైల్స్ ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం 2022లో విడుదలై భారీ కలెక్షన్స్‌తో పాటు పలు వివాదాలను కూడా క్రియేట్ చేసింది. దీనిని వివేక్ అగ్నిహోత్రి రచించి, అతనే దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ హిందువుల వలసలను వర్ణిస్తుంది. వాస్తవిక అంశాలనే కథాంశంగా దీనిని నిర్మించారు. కశ్మీర్ ఫైల్స్ కోసం మొత్తం షూటింగ్ జరిగిపింది నెలరోజులే. కానీ కథ కోసం రెండేళ్లపాటు దర్శకుడు పరిశోధన చేశాడు. ఈ సినిమా కోసం కశ్మీర్ రాష్ట్రం దాటి వెళ్లిపోయిన ఏడువందల మంది కశ్మీరీ పండిట్లను ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి నటించారు. అగ్నిహోత్రి రూపొందించిన ఫైల్స్ త్రయంలో ఇది రెండవ చిత్రం, దీనికి ముందు ది తాష్కెంట్ ఫైల్స్, తరువాత ది ఢిల్లీ ఫైల్స్ ఉన్నాయి. -
షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!
ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొవిడ్ నాటి పరిస్థితుల నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో అతను చేసే పాలిటిక్స్ తనకు నచ్చవని విమర్శలు చేశారు. కానీ నేను కూడా షారుక్ అభిమానినే అని ప్రస్తావించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన స్టార్ హీరోపై విమర్శలు చేయడంపై బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. షారూక్ రాజకీయాలు చేయడం వల్ల బాలీవుడ్ ప్రతిష్ఠ మసకబారిందన్నారు. (ఇది చదవండి: రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్) వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..' నేను కూడా షారుక్‌కు అభిమానినే. ఆయనకు చరిష్మా ఉంది. కానీ అతను చేసే రాజకీయాలే నాకు నచ్చవు. ఇలాంటి వారి వల్ల బాలీవుడ్‌కు చెడ్డ పేరు వస్తుంది. అయితే వీళ్లు స్టార్డమ్ లేకుండా దేన్నీ అంగీకరించరు. ప్రేక్షకులకు ఏమీ తెలియదని భావిస్తారు. నేను కేవలం ప్రజలకు నచ్చే సినిమాలు తీస్తా. కానీ వాళ్లు బాక్సాఫీస్ కలెక్షన్ల కోసమే సినిమాలు తీస్తారు. ఏదైనా మూవీ హిట్ అయితే.. అది షారుక్ సక్సెస్ అంటారు. కానీ నా చిత్రాలు హిట్ అయితే ప్రేక్షకుల విజయంగా భావిస్తా. మాది భిన్న వైఖరి అయినప్పటికీ.. షారుక్‌తో సినిమా తీయడానికి కూడా నేను సిద్ధం.' అని అన్నారు. మరో వైపు డైరెక్టర్ కరణ్ జోహార్‌పై విమర్శలు చేశారు. ముఖ్యంగా స్టార్ డమ్‌ను అతిగా కీర్తించడం వెనుక కరణ్ జోహార్ ఉన్నాడని వివేక్ ఆరోపించారు. అతను మధ్యతరగతి నుంచి వచ్చిన ప్రతిభావంతుల ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని విమర్శలు చేశారు. కరణ్ కేవలం స్టార్ సిస్టమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే మరోవైపు షారుక్ ఖాన్‌పై కామెంట్స్ చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. ఈ కామెంట్స్‌కు వ్యతిరేకంగా చాలామంది కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మిస్టర్ కంగనా అంటూ విమర్శలు చేస్తున్నారు. అగ్నిహోత్రి ఓ మానసిక రోగి అంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: మరో హిట్‌కు సిద్ధమైన ఆదాశర్మ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!) -
సలార్‌తో సై అంటున్న వివేక్ అగ్నిహోత్రి.. బాక్సాఫీస్ బరిలో నిలుస్తాడా?
ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో హిందువులపై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక అదే ఉత్సాహంతో వివేక్ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'ది వ్యాక్సిన్ వార్'. కొవిడ్ టైంలో పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నానా పటేకర్, పల్లవీ జోషి, రైమాసేన్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. క్లిష్ట సమయంలో అత్యంత వేగంగా టీకాలను అభివృద్ధి చేసిన మన శాస్త్రవేత్తల గొప్పదనం ఈ సినిమాలో చూపించనున్నారు. (ఇది చదవండి: అర్జున్ బర్త్ డే.. అదిరిపోయిన గ్లింప్స్! ) అయితే ఈ చిత్రం విడుదల తేదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అదే రోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ కూడా రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్‌తో పోటీపడి బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే తాజాగా వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. డియర్ ఫ్రెండ్స్.. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తోన్న ది వ్యాక్సిన్ వార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. మీరంతా మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ది వ్యాక్సిన్ వార్ టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే అదే రోజు ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రం సలార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ చర్చ మొదలైంది. ఎందుకంటే గతంలోనూ ది కశ్మీర్ ఫైల్స్ మూవీ.. ప్రభాస్ చిత్రం రాధేశ్యామ్ ఓకే రోజు రిలీజైన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉప్సీల బిడ్డను చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో!) DATE ANNOUNCEMENT: Dear friends, your film #TheVaccineWar #ATrueStory will release worldwide on the auspicious day of 28th September 2023. Please bless us. pic.twitter.com/qThKxTjPiw — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 15, 2023 -
ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య.. వివేక్ అగ్నిహోత్రి సంచలన ట్వీట్
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ మరణం బాలీవుడ్లో ప్రకంపనలు రేపింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆయన బుధవారం (ఆగస్టు 2న) తెల్లవారుజామున ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కౌన్ బనేగా కరోడ్‌పతి షో, స్లమ్‌డాగ్ మిలియనీర్. మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి సినిమాలకు పని చేసిన ఆయన అర్ధాంతరంగా తనువు చాలించడంపై ది కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన ట్వీట్ చేశాడు. విజయం వరించిందంటే విలువలు పతనం 'బాలీవుడ్లో ఒంటరి చావులు.. హిందీ చిత్ర పరిశ్రమలో నువ్వు ఎంత పెద్ద విజయం సాధించినా చివరికి ఒంటరిగా జీవితం ముగించక తప్పదు. అంతా నీ చుట్టూ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఏదీ నీతో రాదు. నీకు నువ్వు మాత్రమే మిగిలిపోతావు. ఇక్కడ ఒక్కసారి సక్సెస్ అయ్యారంటే పేరు, డబ్బు, ఫ్యాన్స్, సైకోఫాంట్స్, కవర్లు, రిబ్బన్లు, అమ్మాయిలు, ఎఫైర్లు.. ఇలా అన్నీ చాలా త్వరగా సమకూరిపోతాయి. అప్పుడు నీతి, నిజాయితీ అనే విలువలను లెక్క చేయాల్సిన పని లేదు. హత్య, టెర్రరిజం, అత్యాచారం, డ్రంక్ అండ్ డ్రైవింగ్.. ఇలా ఎందులో దొరికినా ఈజీగా తప్పించుకోవచ్చు. నడుమంత్రపు సిరి పోవడంతో అసలైన కష్టాలు మధ్యతరగతి నుంచి వచ్చిన నీకు అకస్మాత్తుగా వచ్చిన డబ్బుతో ఏం చేయాలో పాలుపోదు. వాళ్లూవీళ్లు చెప్పిందే వింటావు. భారీగా పెట్టుబడులు పెడతావు. కానీ ఈ పాడు లోకంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. నెమ్మదిగా కొత్త జెనరేషన్ వస్తుంది. నీ హవా తగ్గిపోతుంది. కానీ డబ్బు, ఫేమ్ కోసం నీ పాకులాట మాత్రం అలాగే ఉంటుంది. ఆ స్టేజీలో నువ్వు ఎంత చేసినా నీ అస్థిత్వాన్ని క్రమంగా కోల్పోతూ ఉంటావు. చివరకు చీకటి గుహలో ఒంటరివాడివైపోతావు. ఆ చీకటి ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని ఎవరితోనైనా చెప్పాలనుకుంటావు. కానీ నీ బాధ వినేంత తీరిక ఎవరికీ ఉండదు. నీకు నువ్వు మాత్రమే మిగిలిపోతావు. సీలింగ్ ఫ్యానే గతి కుటుంబాన్ని, స్నేహితులను, నైతిక విలువలను, దయ, జాలి వంటి గుణాలను, కృతజ్ఞతలను అన్నింటినీ పట్టించుకోవడం మానేసిన నీకు అవేవీ చివరికి దక్కవు. సంపద, పేరు ప్రఖ్యాతలు ఆవిరి కావడంతో నీకంటూ ఉన్న గుర్తింపు కూడా పోతుంది. కేవలం నీకు నువ్వు మాత్రమే మిగిలిపోతావు. మేకప్ లేకుండా, ఫ్యాన్స్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేని నీకు చివరకు సీలింగ్ ఫ్యానే దిక్కవుతుంది. నీ ఒంటరితనానికి, దుర్భర జీవితానికి ముగింపు పలికేందుకు సాయం చేస్తుంది. కొందరిని అక్కడ ఉరేస్తే, మరికొందరు స్వయంగా ఉరేసుకుని ప్రాణాలు వదులుతుంటారు. ఇక్కడ జరిగేది ఇదే!' అని వివేక్ అగ్నిహోత్రి రాసుకొచ్చాడు. LONELY DEATHS OF BOLLYWOOD: It’s a world were however successful you become, in the end, you are only a loser. In the end, everything is around you but nothing with you. For you. by you. Everything comes fast… fame, glory, money, fans, sycophants… covers, ribbons, women,… — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 2, 2023 చదవండి: పబ్జీ లవర్ ప్రేమ గాథ.. ఇప్పుడేకంగా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్న పాక్ మహిళ -
ప్రభాస్ పై అభ్యంతకరంగా బాలీవుడ్ డైరెక్టర్ మాటలు దాడి
-
రోజూ రాత్రి తాగొచ్చి తెల్లారి నటిస్తే నమ్ముతారా?: వివేక్ అగ్నిహోత్రి
పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ వచ్చినప్పటినుంచి ప్రభాస్ ఆ రేంజ్లో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేకపోతున్నాడు. బాహుబలి తర్వాత అతడు చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. భారీ బడ్జెట్‌తో వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. అయితే రాధేశ్యామ్ రిలీజైన రోజు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా విడుదలైంది. రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవగా చిన్న సినిమా కశ్మీర్ ఫైల్స్ మాత్రం పాజిటివ్ టాక్‌తో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పటి నుంచి బాలీవుడ్‌ను, బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న ప్రభాస్పైనా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాడు. తాజాగా మరోసారి డార్లింగ్ హీరో మీద, అతడు చేసిన ఆదిపురుష్ చిత్రంపైనా విరుచుకుపడ్డాడు. 'ప్రజల నమ్మకాలకు సంబంధించిన కథలను ఎంచుకున్నప్పుడు మీక్కూడా దానిపై విశ్వాసం ఉండాలి లేదంటే ఆ సబ్జెక్ట్‌లో ఎంతోకొంత ప్రావీణ్యం ఉండాలి. దురదృష్టవశాత్తూ భారత్‌లో ఎవరూ దాన్ని పట్టించుకోవట్లేదు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పెద్ద పెద్ద స్టార్లతో కలిసి సినిమా చేయాలనుకుంటే అది అంత ఈజీగా పూర్తవదు. ఒకవేళ పూర్తి చేసినా అది సంపూర్ణంగా ఉండదు. ఈ పురాణాలు వేల సంవత్సరాలుగా అందరి మనసుల్లో ముద్రపడి ఉన్నాయంటే దానికున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. (ఆదిపురుష్‌లో ప్రభాస్ రోల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ..) కొందరు స్క్రీన్‌పై వచ్చి నేనే దేవుడిని అని చెప్తే నిజంగానే అతడు భగవంతుడయిపోతాడా? రోజూ రాత్రి ఇంటికి తాగి వచ్చి తెల్లారి నేను దేవుడిని, నన్ను నమ్మండి అని చెప్తే ఎవరూ నమ్మరు. జనాలేమీ పిచ్చోళ్లు కారుగా' అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం ఫిల్మీదునియాలో వైరల్‌గా మారాయి. చదవండి: పెళ్లయిన 8 ఏళ్లకు బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. కానీ కడుపులోనే ఛాన్స్ ఇవ్వమంటే అవమానించాడు: డైరెక్టర్ -
స్టార్ డైరెక్టర్ కొత్త వెబ్ సిరీస్.. ఈసారి ఇంకెన్ని వివాదాలో?
The Kashmir Files Web Series: బాలీవుడ్‌కి గతేడాది అస్సలు కలిసి రాలేదు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి. అయితే 2022లోనే ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అందుకున్న చిత్రం 'ద కశ్మీర్ ఫైల్స్'. ఈ మూవీకి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దానితో పాటే లెక్కకు మించి వివాదాలకు ఈ చిత్రం కారణమైంది. ఇప్పుడు మరోసారి కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యేందుకు ఆ దర్శకుడు రెడీ అయిపోయాడు. (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్) అప్పుడు సినిమా ఇప్పుడు సిరీస్ దాదాపు రెండేళ్లపాటు రీసెర్చ్ చేసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. కశ్మీర్ నుంచి వెళ్లిపోయిన 700 మంది కశ్మీరి పండితులని ఇంటర్వ్యూ చేశాడు. వాళ్లు చెప్పిన కొన్ని పాయింట్స్ ఆధారంగా, 1990ల్లో జమ్ము-కశ్మీర్ లో ఉగ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయిన పండితుల కథతో 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమా తీశాడు. ఆ మూవీలో చెప్పలేకపోయిన మిగిలిన అంశాలతో ఇప్పుడు ఏకంగా వెబ్ సిరీస్ తీసేశారు. 'ద కశ్మీర్ ఫైల్స్: అన్ రిపోర్టెడ్' పేరుతో రాబోతున్న ఈ సిరీస్ త్వరలో జీ5లో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడి ట్వీట్ 'కశ్మీరీ పండితుల మారణ హోమం జరిగిందనే వాస్తవాన్ని అంగీకరించలేని వాళ్లు, భారత్‌కు శత్రువులు 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు నేను కశ్మీర్ హిందువుల మారణ హోమానికి సంబంధించిన చేదు నిజాన్ని వెబ్ సిరీస్‌గా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఎమోషన్స్‌తో తీసిన ఈ సిరీస్ చూడటానికి రెడీగా ఉండండి. కనిపిస్తున్న వాస్తవాన్ని అంగీకరించలేని వాళ్లే దీన్ని విమర్శిస్తారు' అని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశాడు. ఓ టీజర్‌ని కూడా పోస్ట్ చేశాడు. PRESENTING: A lot of Genocide Deniers, terror supporters & enemies of Bharat questioned The Kashmir Files. Now bringing to you the VULGAR truth of Kashmir Genocide of Hindus which only a devil can question. Coming soon #KashmirUNREPORTED. Be ready to cry. Only on @ZEE5India… pic.twitter.com/DgGlnzSKwA — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 19, 2023 (ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!) -
ప్రభాస్ కి యాక్టింగే రాదు..డైరెక్టర్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
-
నటనే రాదు స్టార్ హీరో.. ప్రభాస్‌పై డైరెక్టర్ పరోక్ష ట్వీట్
బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ తీస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనివే. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో ఓ భారీ హిట్ మాత్రం పడలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఆదిపురుష్’ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ప్రభాస్‌తో పాటు అతని ఆభిమానుల ఆశలన్నీ ‘సలార్’పైనే ఉన్నాయి. కేజీయఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ టీజర్లో క్యారెక్టర్ని ‘ది మోస్ట్ వయొలెన్స్ మ్యాన్’గా పరిచయం చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. అభిమానులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు సైతం టీజర్‌ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మాత్రం టీజర్‌తో పాటు ప్రభాస్‌ని విమర్శించాడు. అయితే ఈ విమర్శలు పరోక్షంగా చేయడం గమనార్హం. ప్రభాస్ పేరు ఎత్తకుండా కొందరికి యాక్టింకే రాని వాళ్లని పాన్ ఇండియా స్టార్ అంటున్నారని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. (చదవండి: స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!) ‘ఎవరు పుట్టుకతోనే హింసాత్మకంగా మారారు. మీ పిల్లల మనసులను శాంతివైపు నడిపించండి. ప్రస్తుత కాలంలో హింసను గ్లామరైజ్ చేయడం ఫ్యాషన్ ఐపోయింది. సినిమాల్లో మితిమీరిన హింసని చూపించడం, అలాంటి సినిమాలను ప్రమోట్ చేయడం, అసలు నటులే కాని వాళ్ళను బిగ్గెస్ట్ స్టార్స్ అని చెప్పుకోవడం పెద్ద టాలెంట్ అనుకుంటున్నారు. ఆలాంటి వారికి ఫ్యాన్స్ అని చెప్పుకునే వారికి కూడా అసలు ఏమీ తెలియదని అర్థం చేసుకోవాలి’ అని పరోక్షంగా ప్రభాస్‌ని విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. వివేక్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. Now glamourising extreme violence in cinema is also considered talent. Promoting nonsense cinema is considered a bigger talent. Promoting a non-actor as biggest star is considered biggest talent. And assuming audience is super-dumb is mother of all talent. https://t.co/hTJnLjJGYb — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 6, 2023 -
కేవలం దాని కోసమే పెళ్లి చేసుకుంటున్నారు: వివేక్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కించిన 'ది కశ్మీర్ ఫైల్స్' సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కశ్మీర్లో హిందూ పండితులపై జరిగిన దాడులను కథాంశంగా సినిమాను రూపొందించారు. అయితే ప్రస్తుతం ఆయన 'ది వ్యాక్సిన్ వార్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే) తాజాగా వివేక్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రోజుల్లో వెడ్డింగ్స్ జరగడంపై ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. కేవలం పెళ్లి ఫొటోలు తీసుకోవడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారని వివేక్ అగ్నిహోత్రి వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. మే 13న దిల్లీలో జరిగిన పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం జరగడంతో ఆయన ట్వీట్‌పై చర్చ నడుస్తోంది. (ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్) వివేక్ తన ట్వీట్లో రాస్తూ.. ' ఈ రోజుల్లో కేవలం ఫోటోలు, వీడియోల కోసమే పెళ్లి చేసుకుంటున్నాపరు. 'డెస్టినేషన్ వెడ్డింగ్' ట్యాగ్‌ని పొందడానికి పెళ్లి చేసుకుంటున్నారని నాతో ఓ వెడ్డింగ్ ప్లానర్ చెప్పారు. నేను ఓ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఉన్నా. ఆ వివాహానికి ఫోటోగ్రాఫర్ ఆలస్యంగా వస్తున్నాడని ఎవరో చెప్పారు. దీంతో వధువు స్పృహ తప్పి పడిపోయింది.' అంటూ పోస్ట్ చేశారు. వివేక్ చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. “People are getting married just to get wedding photos, videos and to get ‘destination wedding’ tag for show off”. - a wedding planner told me. It’s true I was in a destination wedding and someone said that the wedding photographer is going to be late and the bride fainted. — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 13, 2023 -
కాశ్మీర్ ఫైల్స్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సీఎం మమతకు లీగల్ నోటీసులు
ముంబై: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అదే కోవలోకి ఇటీవలే విడులైన ది కేరళ స్టోరీ కూడా చేరింది. ఈ నేపథ్యంలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బ్యాన్ చేశాయి. ఇక, పశ్చిమ బెంగాల్లో కూడా ఈ సినిమాను బ్యాన్ చేసింది తృణముల్ కాంగ్రెస్ సర్కార్. ఈ క్రమంలో సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ రెండు సినిమాలపై మమత స్పందిస్తూ.. "ది కాశ్మీర్ ఫైల్స్" అంటే ఏమిటి? అది ఒక వర్గాన్ని కించపరచడమే. "ది కేరళ స్టోరీ" అంటే ఏమిటి?.. ఇది వక్రీకరించిన కథ అంటూ సీరియస్ అయ్యారు. అందుకే కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చేసినట్టు తెలిపారు. What is "The Kashmir Files"? it is to humiliate one section. What is "The Kerala Story"?... It is a distorted story: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/yRFwhlumum — ANI (@ANI) May 8, 2023 కాగా, మమత బెనర్జీ వ్యాఖ్యలపై బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సీరియస్ అయ్యారు. దీంతో, మమతకు లీగల్ నోటీస్ పంపించారు. తన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే తాను ఆమెకు లీగల్ నోటీస్ పంపించానని అగ్నిహోత్రి తెలిపారు. తాను తీసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతోపాటు తన రాబోయే మరో సినిమా కూడా పశ్చిమబెంగాల్లో హింసాకాండను ఆధారంగా తీసుకుని తీస్తున్నవేనని సీఎం మమత ఆరోపిస్తున్నారని, కానీ ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అంతా తప్పుడు ప్రచారమని అగ్నిహోత్రి విమర్శించారు. తన సినిమాలకు బీజేపీ నిధులు సమకూరుస్తున్నదని కూడా మమత ఆరోపించారని, అది కూడా తప్పుడు ఆరోపణేనని అన్నారు. BREAKING: I have, alongwith @AbhishekOfficl & Pallavi Joshi, sent a LEGAL NOTICE to the Chief Minister, Bengal @MamataOfficial for her false & highly defamatory statements made with malafide intention to defame us & our films #TheKashmirFiles & upcoming 2024 film #TheDelhiFiles. pic.twitter.com/G2SjX67UOB — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 9, 2023 ఇది కూడా చదవండి: The Kerala Story: యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కీలక నిర్ణయం -
నామినేషన్లు ఫుల్.. అవార్డు నిల్
-
ఆ వివాహాలు నేరం కాదు.. అవసరం: వివేక్ అగ్నిహోత్రి ట్వీట్
ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు. ఇది వారి హక్కు అంటూ తన మద్దతు ప్రకటించారు. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇలాంటివి సాధారణమైన విషయమని అన్నారు. ఈ సందర్భంగా స్వలింగ వివాహంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వివేక్ తన ట్వీట్లో రాస్తూ.. 'స్వలింగ వివాహం అనేది 'అర్బన్ ఎలిటిస్ట్' అన్న భావన కరెక్ట్ కాదు. ఇది మానవ అవసరం. చిన్న పట్టణాలు, గ్రామాలలో ఎప్పుడూ ప్రయాణించని కొంతమంది వ్యక్తులే దీన్ని ప్రశ్నిస్తున్నారు. మొదట స్వలింగ వివాహం అనేది ఒక కాన్సెప్ట్ కాదు. అది ఒక అవసరం మాత్రమే. అలాగే ఇది ఒక హక్కు కూడా. భారతదేశం వంటి ప్రగతిశీల దేశంలో స్వలింగ వివాహం సాధారణమైన విషయమే. ఎలాంటి నేరం కాదు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. స్వలింగ వివాహం అనేది పట్టణ ఉన్నత వర్గాల భావన అని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఇది దేశంలోని సామాజిక తత్వానికి దూరంగా ఉందని తెలిపింది. స్వలింగ వివాహాన్ని ప్రోత్సహించడం కొత్త సమస్యలు సృష్టిస్తుందని కేంద్రం పేర్కొంది. దీన్ని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించి ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: షూటింగ్లో ప్రమాదం.. ది కశ్మీర్ ఫైల్స్ నటికి తీవ్రగాయాలు) NO. Same sex marriage is not an ‘urban elitist’ concept. It’s a human need. Maybe some sarkari elites drafted it who have never travelled in small towns & villages. Or Mumbai locals. First, same sex marriage is not a concept. It’s a need. It’s a right. And in a progressive,… https://t.co/M4S3o5InXI — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 18, 2023 -
అనుష్క కెరీర్ అంతం చేయాలనుకున్నా, తెర వెనుక కుట్ర చేశా: నిర్మాత
ఇన్సైడర్స్, అవుట్‌సైడర్స్ అంశంపై బాలీవుడ్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆల్రెడీ సినీపరిశ్రమలో ఉన్న తారల వారసులకు ఇచ్చిన విలువ, హోదా.. బయట నుంచి వచ్చిన నటీనటులకు ఉండదనేది బలమైన వాదన. అంతేకాదు, దర్శకనిర్మాతలు కూడా సెలబ్రిటీల వారసులకే సినిమా అవకాశాలిస్తారు, కానీ ఎంత టాలెంట్ ఉన్నా సరే బయటవాళ్లను పట్టించుకున్న పాపాన పోరనే అపవాదు చిత్రపరిశ్రమలో ఉండనే ఉంది. ఇప్పుడిప్పుడే ఈ ధోరణి మారుతోంది. అయితే బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ గతంలో అనుష్క శర్మ కెరీర్‌ను అంతం చేయాలనుకున్నాడట. ఆమెకు ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. కేవలం తన టాలెంట్‌తోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వచ్చింది. అలాంటి ఆమెను తక్కువ అంచనా వేసిన కరణ్ తనకు సినిమా అవకాశమే ఇవ్వకూడదని భావించాడట. ఈ విషయం స్వయంగా అతడే చెప్పాడు. 'రబ్నే బనాదీ జోడీ సినిమా కోసం అనుష్కను తీసుకుందామని ఆదిత్య చోప్రా ఆమె ఫోటో చూపించాడు. అది చూసిన నేను.. నీకేమైనా పిచ్చిపట్టిందా? ఆమె వద్దే వద్దు. తనకు ఈ సినిమా ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. వేరే హీరోయిన్‌కు ఈ సినిమా ఇద్దామని ఉండేది. తెర వెనుక ఆమెను తప్పించే ప్రయత్నాలు చేశాను. సినిమా రిలీజయ్యాక అయిష్టంగానే చూశాను. కానీ బ్యాండ్ బాజా బారత్ మూవీ చూశాక తన నటనకు ఇంప్రెస్ అయ్యా. ఇంత మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేయాలనుకున్నానన్న గిల్టీతో క్షమాపణలు చెప్పాను. సినిమా చాలా బాగా చేశావని అనుష్కను మెచ్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. 2016లో 18వ ఎమ్‌ఏఎమ్‌ఐ ముంబై ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో కరణ్ పై వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ వీడియోను దర్శకరచయిత అపూర్వ అస్రానీ ట్విటర్లో షేర్ చేశాడు. 'కరణ్ జోహార్ అనుష్క శర్మ కెరీర్‌ను అంతమొందించాలని అనుకున్నట్లు కరణ్ జోహార్ గతంలో అంగీకరించాడు. నాకు తెలిసి ఇన్సైడర్, అవుట్‌సైడర్ అన్నది ఇప్పటికీ చర్చించాల్సిన అంశమే' అని ట్వీట్ చేశాడు. దీనిపై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ.. 'మంచి కెరీర్ ఇవ్వడం లేదా అంతం చేయడమే కొందరి హాబీ. ప్రతిభావంతులైన బయటివారిపై కొందరు డర్టీ పాలిటిక్స్ చేయడం వల్లే బాలీవుడ్ ఇలా తయారైంది' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. కాగా అనుష్క శర్మ 'రబ్నే బనా దీ జోడీ' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఆమె తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. Someone’s only hobby is to make or break careers. If Bollywood is in gutter, it’s because of some people’s dirty ‘backroom’ politics against talented outsiders. https://t.co/GNPRjiW5ry — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 6, 2023 -
రాహుల్ గాంధీపై డైరెక్టర్ సంచలన ట్వీట్.. అదే రుజువైందంటూ!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్లో రాహుల్‌పై అనర్హత వేటుపై వ్యంగ్యంగా స్పందించారు. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందో చూద్దాం. రాహుల్ గాంధీపై దాఖలైన పిటిషన్‌పై సూరత్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని కోలార్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రెండేళ్ల జైలు శిక్షపడింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మోదీ ఇంటి పేరు ఉన్న వారందరూ దొంగలు అని రాహుల్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. తాజాగా వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది. ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేస్తూ.. 'రాజకీయాల్లో అర్హత లేని నేత రాహుల్ గాంధీ. అయితే ప్రస్తుతం అది అధికారికంగా రుజువైంది.' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అంతే కాకుండా గతంలో ఇందిరాగాంధీపై కూడా అనర్హత వేటు పడిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఆమె నిజాయితీ గల నేత కాబట్టి తిరిగి అగ్రనేతగా నిలదొక్కుకున్నారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం కనిపించడం లేదన్నారు. అయితే ఇందిరా గాంధీ కనక కశ్మీర్‌ను కాపాడి ఉంటే.. తాను కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసేవాడిని కాదు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. Rahul Gandhi was always unqualified. It’s just that now it’s been made official. — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 27, 2023 When Indira Gandhi was disqualified at that time also Congressis had thrown tantrums. but she was a genuine leader so she bounced back. In the absence of any leader with mass base, what will congress do, is to be seen. — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 27, 2023 -
కశ్మీరీ ఫైల్స్ సినిమా.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలుపై దుమారం
-
ప్రకాశ్ రాజ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్
విలక్షణ నటడు ప్రకాశ్ రాజ్ ది కశ్మీర్ ఫైల్స్ మూవీ, ఆ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నహోత్రిపై చేసిన సంచలన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇటీవ కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ ది కశ్మీర్ ఫైల్స్ మూవీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘కశ్మీర్ ఫైల్స్ ఓ చెత్త సినిమా అని, ఆ సినిమాపై ఇంటర్నేషనల జ్యూరీ ఉమ్మివేసిందంటూ వివాదాస్పదంగా స్పందించాడు. దీంతో ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. దీంతో తాజాగా ఆయన కామెంట్స్ కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ స్పందించాడు. చదవండి: బాలుని చూడటానికి వెళ్లలేదు.. నన్ను రావద్దన్నారు: పి సుశీల ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్‌ను అంధకార్ రాజ్ అంటూ ప్రస్తావించాడు ఆయన. ఈ మేరకు వివేక్ అగ్ని హోత్రి ప్రకాశ్ రాజ్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఆయన ట్వీట్ చేస్తూ.. “జనాలు ఆదరించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ అర్బన్ నక్సల్స్‌కు నిద్రలేకుండా చేసింది. అలాంటిది వీక్షకులను మొరిగే కుక్కలు.. అని పిలుస్తూ సినిమా రిలీజైన ఏడాది తర్వాత కూడా ఇబ్బంది పెడుతున్నారు. మిస్టర్ ‘అంధకార్ రాజ’.. భాస్కర్ ఎప్పటికీ మీదే అయినప్పుడు నేనెలా పొందుతాను” అంటూ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. చదవండి: హీరో అవుదామని ఆశగా మద్రాస్ వెళితే హేళనగా మాట్లాడారు..మానసిక క్షోభకు గురయ్యా: మెగాస్టార్ ప్రస్తుతం వివేక్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఈవెంట్లో ప్రకాశ్ రాజ్ మాట్టాడుతూ.. పఠాన్ మూవీ ప్రశంసిస్తూ.. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. ది కశ్మీర్ ఫైల్స్ అనేది ఓ చెత్త సినిమా. దాన్ని సినిమా ఎవరు నిర్మించారో తెలిసిందే. అంతర్జాతీయ జ్యూరీనే వారిపై ఉమ్మివేసింది. అయినా కూడా సిగ్గులేకుండా దర్శకుడు ఆస్కార్ ఎందుకు రాదు? అని అడిగారు. ఆ సినిమాకు కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. A small, people’s film #TheKashmirFiles has given sleepless nights to #UrbanNaxals so much that one of their Pidi is troubled even after one year, calling its viewer’s barking dogs. And Mr. Andhkaar Raj, how can I get Bhaskar, she/he is all yours. Forever. pic.twitter.com/BbUMadCN8F — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 9, 2023 -
షూటింగ్లో ప్రమాదం.. ది కశ్మీర్ ఫైల్స్ నటికి తీవ్రగాయాలు
ది కశ్మీర్ ఫైల్స్ నటి, జాతీయ అవార్డ్ గ్రహీత పల్లవి జోషికి తీవ్ర గాయాలయ్యాయి. కార్ ఛేజింగ్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న 'వ్యాక్సిన్ వార్' సినిమా షూటింగ్లో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. -
వార్‌లో సప్తమి
‘ది కశ్మీరీ ఫైల్స్’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కోవిడ్ 19 పరిస్థితులు, దేశంలోని వ్యాక్సిన్ డ్రిల్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కన్నడ హిట్ ‘కాంతార’ ఫేమ్ హీరోయిన్ సప్తమి గౌడ జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో సప్తమి పాల్గొంటున్నారు. ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్స్ పతాకంపై ‘వ్యాక్సిన్ వార్’ సినిమాను నిర్మిస్తుండటంతో పాటు ఇందులో నటిస్తున్నారు పల్లవీ జోషి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, మరాఠీ, అస్సామీ భాషలతో సహా ఈ సినిమాను మరికొన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. -
ది కశ్మీర్ ఫైల్స్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డ్.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్
ఎలాంటి అంచనాలు లేకుండా సంచలన విజయం సాధించిన హిందీ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు వసూళ్లతో రికార్డు సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నీహోత్రి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఇండియన్ టెలివిజన్ అకాడమీ-2022 అవార్డుకు ఎంపికైంది. ఈ చిత్రం గోల్డెన్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా గుర్తింపు పొందింది. తాజాగా ఈ అవార్డును చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ అవార్డు ఉగ్రవాద బాధితులందరికీ అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. This award for #TheKashmirFiles being honoured as the Golden Film of Indian cinema is dedicated to all the victims of religious terrorism. @TheITA_Official #KashmirHinduGenocide pic.twitter.com/Uc6RpREPbm — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) December 12, 2022 -
కశ్మీర్ ఫైల్స్‌పై... మాటలు.. మంటలు
ముంబై: విడుదలైనప్పుడే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇఫీ ఉదంతం పుణ్యమా అని మరోసారి దేశవ్యాప్తంగా మంటలు రేపుతోంది. అదో చెత్త సినిమా అంటూ సోమవారం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ముగింపు వేడుకల్లో ఇజ్రాయెల్‌కు చెందిన జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలపై ఇంటా బయటా విమర్శలు రేగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇది పెద్ద చర్చకు తెర తీసింది. నదవ్ వ్యాఖ్యలను భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ తీవ్రంగా ఖండించారు. ‘‘అతిథిని దైవంగా భావించే దేశానికి వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి. ఇఫీ జడ్జీల ప్యానల్‌కు సారథ్య స్థానంలో కూచోబెట్టిన ఆతిథ్య దేశాన్ని నదవ్ తన వ్యాఖ్యలతో దారుణంగా అవమానించారు’’ అంటూ మంగళవారం బహిరంగ లేఖలో దుయ్యబట్టారు. ‘‘హిట్లర్ సారథ్యంలోని నాజీల చేతుల్లో లక్షలాది మంది యూదులు హోలోకాస్ట్ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో నిస్సహాయంగా ఊచకోతకు గురయ్యారు. అదృష్టం కొద్దీ ఆ మారణహోమం నుంచి తప్పించుకున్న వారి వారసున్ని నేను. నీ వ్యాఖ్యలనే గీటురాయిగా తీసుకునే పక్షంలో హోలోకాస్ట్ దారుణాలపై హాలీవుడ్ దర్శక దిగ్గజం స్పీల్బర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్ కూడా చెత్త సినిమాయేనా అని భారతీయులు ప్రశ్నిస్తుంటే నా మనసెంతో గాయపడుతోంది. కశ్మీర్ ఫైల్స్‌పై నీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వాటిని నువ్వు ఏ విధంగానూ సమర్థించుకోలేవు’’ అంటూ తూర్పారబట్టారు. నదవ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కశ్మీరీ పండిట్ల మండిపాటు బీజేపీతో పాటు కశ్మీర్ ఫైల్స్ సినిమా రచయిత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అందులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కూడా నదవ్ విమర్శలను తీవ్రంగా ఖండించారు. ‘‘భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ఉగ్రవాదుల వాదనకు మద్దతిచ్చేందుకు వాడుకున్న తీరు ఆశ్చర్యకరం. కశ్మీర్ ఫైల్స్ ప్రచారం కోసం తీసిందని, అందులో ఒక్క సీన్ గానీ, డైలాగ్ గానీ అవాస్తవమని నిరూపించినా ఇకపై సినిమాలే తీయను. నదవ్తో పాటు ప్రపంచ మేధావులకు, అర్బన్ నక్సల్స్‌కు ఇది నా సవాలు’’ అని అగ్నిహోత్రి అన్నారు. నవద్ను తక్షణం భారత్ నుంచి పంపించేయాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ కాన్సులర్ జనరల్ కొబ్బీ షొషానీ కూడా నదవ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. -
‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్
గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రదర్శించడపై జ్యూరీ అధినేత ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. అతడి కామెంట్స్‌పై పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రెటీల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కశ్మీరీ పండిట్ల బాధల పట్ల ఆయనకు ఎలాంటి విచారం లేదంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. దీనిపై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘గుడ్ మార్నింగ్.. నిజాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి వ్యక్తుల చేత అబద్ధాలు చెప్పిస్తుంది’ అంటూ తనదైన శైలిలో నడవ్ లాపిడ్ చురక అట్టించారు. చదవండి: హీరోల క్యారవాన్ కల్చర్‌పై దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్ అంతేకాదు తన ట్వీట్‌కి క్రియేటివ్ కాన్షియస్నెస్(#CreativeConsciousness) అనే హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. కాగా నడవ్ లాపిడ్ వ్యాఖ్యలపై ఇప్పటికే నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘యూదులపై దారుణమైన మారణహోమం వంటి బాధలను అనుభవించిన వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నాడు యూదులపై నరమేధం నిజమైతే.. కశ్మీరీ పండిట్ల ఊచకోత కూడా నిజమే. దేవుడు ఆయనకు తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. GM. Truth is the most dangerous thing. It can make people lie. #CreativeConsciousness — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 29, 2022 ‘कश्मीर फ़ाइल्स’ का सच कुछ लोगो के गले में एक काँटे की तरह अटक गया है।वो ना उसे निगल पा रहे है ना उगल! इस सच को झूठा साबित करने के लिए उनकी आत्मा,जो मर चुकी है, बुरी तरह से छटपटा रही है।पर हमारी ये फ़िल्म अब एक आंदोलन है फ़िल्म नहीं।तुच्छ #Toolkit गैंग वाले लाख कोशिश करते रहें।🙏 pic.twitter.com/ysKwCraejt — Anupam Kher (@AnupamPKher) November 29, 2022 -
గుండెపోటుతో సీరియల్ నటుడు మృతి.. వివేక్ అగ్నిహోత్రి సంచలన ట్వీట్
బాలీవుడ్ బుల్లితెర నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ మరణంపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి విచారం వ్యక్తం చేశారు. ఎలాంటి వైద్యుల సూచనలు పాటించకపోవడమే దీనికి కారణమని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. శారీరక ధృడత్వం సాధించాలనే పిచ్చి వల్లే ఇలా జరుగుతోందన్నారు. దీనికంతటికి మరో కారణం ఇన్స్టాగ్రామ్ పిచ్చి అంటూ సూర్యవంశీ మృతిపై వివేక్ మాట్లాడారు. వివేక్ ట్వీట్ చేస్తూ, “ఇది చాలా విషాదకరం. ఎటువంటి వైద్య సలహా లేకుండా బాడీని పెంచుకోవాలనే పిచ్చి హడావిడి చాలా ప్రమాదకరం. హైపర్-జిమ్మింగ్ అనేది మంచిది కాదు. దీనికి ఇన్స్టాగ్రామ్ పిచ్చి కూడా ఒక కారణం. కచ్చితంగా దీన్ని నియంత్రించాలి. దీనిపై సమాజం పునరాలోచించుకోవాలి. ఓహ్ సిద్ధాంత్ ఓం శాంతి.' అంటూ రాసుకొచ్చారు. గతంలో హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ జిమ్‌లో పని చేస్తున్నప్పుడే గుండెపోటు రావడంతో దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అతను సెప్టెంబర్ 21న మరణించారు. తాజాగా ఇప్పుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ 46 ఏళ్ల వయసులోనే జిమ్‌లో కసరత్తులు చేస్తూ కన్నుమూశారు. This so tragic & sad. The mad rush to build aggressive body, without any medical advise is so dangerous. Hyper-Gymming is a relatively new phenomenon which got mad impetus due to Instagram. It needs to be regulated for sure. Society needs to rethink. Oh, Siddhanth… ॐ शांति। pic.twitter.com/bK0kDA8gIG — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 11, 2022 -
‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ మరో సంచలన మూవీ, టైటిల్, ఫస్ట్‌లుక్ అవుట్
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన హిందీ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్లు వసూళు చేసి రికార్డు సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నీహోత్రి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీతో ఒక్కసారిగా సంచలనంగా మారిన ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్ మరో యథార్థ సంఘటనతో ‘ది కశ్మీర్ ఫైల్స్’ టీం రెడీ అయింది. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దీనికి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ట్విటర్ వేదికగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు ‘ది వ్యాక్సిన్ వార్’ అని టైటిల్‌ను ఖారారు చేసి ఈ సినిమా దాదాపు 11 భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించాడు. దీంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ANNOUNCEMENT: Presenting ‘THE VACCINE WAR’ - an incredible true story of a war that you didn’t know India fought. And won with its science, courage & great Indian values. It will release on Independence Day, 2023. In 11 languages. Please bless us.#TheVaccineWar pic.twitter.com/T4MGQwKBMg — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 10, 2022 -
సుకుమార్‌ని కలిసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్, ఎందుకో?
ముగ్గురు ప్రముఖ దర్శక నిర్మాతల కలయికలో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయిలో ఖ్యాతి గడించిన తెలుగు దర్శకుడు సుకుమార్, సంచలనమైన చిత్రాలను రూపొందించడంలో పేరు తెచ్చుకొని ‘కాశ్మీర్ ఫైల్స్’తో దేశవ్యాప్తంగా పాపులరైన బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, ‘కాశ్మీర్ ఫైల్స్ కార్తికేయ 2’ వంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్… ఈ ముగ్గురు కలసి పని చేయబోతున్నారు. ఇటీవల ఈ ముగ్గురూ సమావేశమై ప్రాజెక్ట్ గురించి చర్చించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలను వారు వెల్లడించలేదు. అయితే అత్యద్భుతమైన ఈ ముగ్గురు సహకారంతో రాబోతున్న చిత్రం ఎక్సయింటింగ్ ప్రాజెక్ట్ కానుంది. అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి కలిసి భారీ బ్లాక్ బస్టర్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అందించారు. వీరిద్దరూ కలిసి మరో రెండు ప్రాజెక్ట్స్‌లో పని చేస్తున్నారు. ఈలోగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. ‘సినిమాతో ఇండియాని ఏకం చేయడం. వివరాలు త్వరలో. ఊహించండి!?’ అంటూ నిర్మాత అగర్వాల్ తమ సమావేశానికి సంబంధించిన ఫోటోను ట్వీట్ చేశారు. మరి ఈ ఇద్దరు డైరెక్టర్స్‌లో ఎవరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారో చూడాలి. Excited and privileged to collaborate with two genius directors of our country ❤️ Blockbuster directors #Sukumar Garu and @vivekagnihotri ji are set to deliver something unprecedented 🔥 Indian Cinema will never be the same again ❤️🔥 Stay Tuned pic.twitter.com/QuMkZvHhDF — Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) November 4, 2022 చదవండి: Sharwanand: 15వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్లైట్ నుంచి దూకాను.. కోలుకోడానికి రెండున్నర ఏళ్లు పట్టింది సుకుమార్‌ని కలిసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్, ఎందుకో? -
లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న 'ది కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కమర్షియల్గానూ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధించిందీ సినిమా. ఒక్క సినిమాతో డైరెక్టర్ ఇమేజ్ కూడా ఓ రేంజ్లో పెరిగిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీ కామెంట్స్‌తోనూ వార్తల్లో నిలుస్తున్న వివేక్ అగ్నిహోత్రి తాజాగా ముంబైలో ఖరీధైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. 3258 చదరపు అడుగుల విస్తీర్ణంలో అంధేరిలోని వెర్సీవాలోని 30వ ఫ్లోర్‌లోని అపార్ట్‌మెంట్‌ను సుమారు 17.92 కోట్లకు ఆయన కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఇక మరో విశేషం ఏమిటంటే.. అగ్నిహోత్రి కొనుగోలు చేసిన ఈ అపార్ట్మెంట్కి పై అంతస్తులోనే బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ కూడా ఓ ఇంటని కొనుగోలు చేశారు. కొన్నిరోజుల క్రితమే ఆయన దీన్ని కొన్నట్లు సమాచారం. -
‘సీతారామం’ మూవీపై ‘ది కశ్మీర్ ఫైల్స్ ’డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కావ్యం ‘సీతారామం’. ఇటీవలె ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈచిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.75 కోట్ల కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ ప్రేమ కావ్యం అమెరికాలో సైతం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల ఈ మూవీ హిందీ వెర్షన్లో కూడా విడుదలైంది. చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ ఇక ఈ సినిమా చూసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సీతారామంపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు హీరోహీరోయిన్లు దుల్కర్, మృణాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ‘నిన్న రాత్రే హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' సినిమా చూశాను. ఇక దుల్కర్ సల్మాన్ నటన నన్ను బాగా ఆకట్టుకుంది. అతడి నటన చాలా సహాజంగా ఉంది. రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఇక యువ నటి మృణాలి ఠాకూర్ గురించి ఏం చెప్పిన తక్కువే. తొలిసారి తన నటన చూశాను. చాలా ఫ్రెష్‌గా సహాజంగా ఉంది. తను పెద్ద స్టార్ అవుతుంది. సీతారామం టీంకు నా శుభాకాంక్షలు’ అంటూ ఆయన కొనియాడాడు. I watched @hanurpudi’s #SitaRamam last night. So refreshing to see @dulQuer… so impressive, his power comes from his genuineness. And what to say about young @mrunal0801 this is the first time I saw her performance… so fresh and original… she will be a big star. Wow. Congrats! — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 19, 2022 చదవండి: బిగ్‌బాస్ హౌజ్‌లో నాకు అన్యాయం జరిగింది: అభినయ శ్రీ -
సిసోడియా ‘రాజ్‌పుత్’ వ్యాఖ్యలపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ ఫైర్!
న్యూఢిల్లీ: బీజేపీలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తామని తనకు సందేశాలు వచ్చాయని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన వాడనని.. ఎవరి ముందు తలవంచనని తెలిపారు. మనీష్ సిసోడియా ‘రాజ్‌పుత్’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. రాజ్‌పుత్‌లు మినహా ఇతర కులాల వారు ఎదుటివారి ముందు తలవంచుతారని మనీష్ సిసోడియా ఉద్దేశమా? ఇది ఎలాంటి కులవాదం? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘దీనర్థం ఆయన రాజ్‌పుత్ కాకపోతే లొంగిపోయేవారా? ఢిల్లీలోని బ్రాహ్మణులు, యాదవులు, గుజ్జార్లు, జాట్స్, సిక్కులు వంటి వారి సంగతేంటి? వారంతా ఇతరులకు లొంగిపోయే స్వభావం కలిగి ఉన్నారా? ముస్లింలు, క్రిస్టియన్లు, దళితుల సంగతేంటి?’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. మనీష్ సిసోడియా చేసిన ప్రకటనను తన ట్వీట్‌కు జోడించారు డైరెక్టర్. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై ఇటీవల మనీష్ సిసోడియా నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీకి ప్రధాన ప్రత్యర్థి కేజ్రీవాల్ కానున్నారనే కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే బీజేపీలో చేరితే కేసులు ఎత్తివేస్తామంటూ బీజేపీ నుంచి తనకు సందేశాలు వచ్చాయని బాంబు పేల్చారు సిసోడియా. ఆ సందేశాలకు ప్రతిస్పందనగా మాట్లాడుతూ తాను రాజ్‌పుత్‌నని, మహారాణా ప్రతాప్ వంశస్థుడినని, అవసరమైతే తల నరుక్కుంటా కానీ, ఎవరి ముందు తల వంచనంటూ వ్యాఖ్యానించారు. यह कैसा जातिवादी तर्क है? यानी अगर जनाब @msisodia जो राजपूत नहीं होते तो झुक जाते, कट जाते। यानी दिल्ली में जो ब्राह्मण,, यादव, गुज्जर, जाट, सिख इत्यादि रहते हैं वो सब झुकने वाले लोग हैं? मुस्लिम, ईसाई, दलित… क्या यह सब झुकने वाली क़ौम हैं? https://t.co/sahqNzcRM2 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 22, 2022 ఇదీ చదవండి: Manish Sisodia: ‘ఆప్‌ని వదిలేసి బీజేపీలో చేరమని మెసేజ్ పంపారు’ -
కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన
‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా’ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ విషయంలో ఆమిర్ ఖాన్‌కు మద్ధతు తెలిపేందుకు ముందుకు వస్తున్న హీరోలకు సైతం బాయ్‌కాట్ సెగ తాకుతోంది. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్లు ఆమిర్‌కు సపోర్ట్ చేయడంతో వారి సినిమాలను కూడా బహిష్కరించాలంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే లాల్ సింగ్ చడ్డాకు వసూళ్లు పడిపోవడంపై ఇటీవల ఓ ఇంటర్య్వూలో కరీనా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘లాల్ సింగ్ చడ్డా’ మంచి సినిమా అని, ఇలాంటి చిత్రాన్ని ఎందుకు బహిష్కరిస్తున్నారో అర్థం కావడం లేదంది. చదవండి: ఇప్పటికీ నాతో వారు నటించేందుకు సంకోచిస్తున్నారు: నటి ఆవేదన అంతేకాదు మూడేళ్ల పాటు 250 మంది ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని వాపోయింది కరీనా. అయితే ఆమె వ్యాఖ్యలపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. బాలీవుడ్ డాన్లుగా నటులు వ్యవహరించి, హిందూ ఫోబియాతో చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయినప్పుడు మీరెక్కడికెళ్లారు అని ప్రశ్నించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చిన్న సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను బాలీవుడ్ డాన్లుగా పిలవబడే నటులు అడ్డుకున్నప్పుడు, ఆ చిత్రాలకు థియేటర్లకు ఇవ్వకుండా ఆపేసినప్పుడు మీరెందుకు స్పందించలేదు. Why nobody from Bollywood raises voice when the Kings of Bollywood boycott, ban & destroy careers of so many outsider actors, directors, writers? The day common Indians get to know the ARROGANCE, FASCISM & HINDUPHOBIA of the Dons of Bollywood, they’ll drown them in hot coffee. — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 13, 2022 దానివల్ల ఎందరో ప్రతిభ కలిగిన నటులు, దర్శకులు, రచయితల జీవితాలు నాశమయ్యాయి కదా! ఆ సినిమాలకు పని చేసింది కూడా 250 మంది పేద ప్రజలే’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. అలాగే మరొ ట్వీట్లో ‘బాలీవుడ్ డాన్ల ఆహంకారం, హిందూ ఫోబియా గురించి భారతీయులకు తెలిసినప్పుడు వారిని వేడి కాఫీ ముంచేస్తారు’ అంటూ ఘాటూ వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా అమీర్ ఖాన్, కరీనా కపూర్లు హీరోహీరోయిన్లుగా నటించిన ‘లాల్‌సింగ్ చడ్డా’ ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ హీరో నాగా చైతన్య కీ రోల్ పోషించాడు. భారీ అంచనాల మధ్య విడుదలై ఈ చిత్రం అశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. చదవండి: సల్మాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ మాజీ ప్రేయసి When Good Content Small films are sabotaged, boycotted by the Dons of Bollywood, when their shows are taken away by Multiplexes, when critics gang up against small films… nobody thinks of 250 poor people who worked hard on that film. #Bollywood — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 13, 2022 -
మరి మహిళల నగ్న చిత్రాల సంగతేంటి?: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ ఎంతటి దుమారం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో రణ్వీర్ సింగ్ ఫొటోషూట్ హాట్‌టాపిక్ మారింది. ఈ విషయంలో కొందరు రణ్‌వీర్‌కు మద్దుతు ఇస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళల మనోభవాలు దెబ్బతీశాడంటూ రణ్‌వీర్‌పై ముంబైలో పోలీసు కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై ‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. చదవండి: ప్రభాస్‌పై దిశ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇలాంటి హీరోని ఇంతవరకు చూడలేదు ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రణ్వీర్ సింగ్‌పై వస్తున్న విమర్శలు, ఎఫ్ఐఆర్ను ఖండించాడు. ఇందులో తప్పేముందంటూ రణ్‌వీర్‌కు మద్దతుగా నిలిచాడు. ‘రణ్వీర్ ఫొటోషూట్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ చెల్లదు. అది ఓ స్టుపిడ్ కేసు. ఎలాంటి కారణం లేకుండా నమోదైన కేసు అది. మహిళల మనోభవాలు దెబ్బతిన్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ నాకో విషయం అర్థం కావడటం లేదు. ఇప్పటికే ఎన్నో మహిళల నగ్న చిత్రాలు వచ్చాయి. వాటి వల్ల పురుషుల మనోభవాలు దెబ్బతినవా? దాని సంగతేంటి? ఇదో ముర్ఖపు వాదన. చదవండి: ఇక యాక్టింగ్‌కి బ్రేక్.. అందుకే అంటున్న స్టార్ హీరోయిన్ ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయను. మన సంస్కృతిలోనే మానవ శరీరానికి గౌరవం ఉంది. మానవ శరీరం భగవంతుడి అద్భుత సృష్టి అని నేను నమ్ముతున్నాను. అందుకే దీనికి నేను మద్దతు ఇవ్వను’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే రణ్‌వీర్‌కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాలు పలువురు సినీ ప్రముఖులు మద్దుతుగా నిలుస్తున్నారు. కాగా ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటో షూట్ ఇచ్చాడు. . ఈ ఫోటోని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయింది. ఇక దీనికి తన ఫ్యాన్ నుంచి ‘హాట్’ అంటూ కామెంట్స్ రాగా మరికొందరు ఈ పిచ్చి చేష్టలేంటని విమర్శిస్తున్నారు. -
బాలీవుడ్‌ను టార్గెట్ చేసిన ప్రకాశ్ రాజ్, సటైరికల్ కామెంట్స్‌తో ట్వీట్
ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్ రాజ్.. దేశంలోని ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్స్ వేస్తున్నాడు. కొంతకాలంగా మోడీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ పోస్టులు పెడుతున్నాడు. అయితే.. గతంలో ప్రభుత్వంపై స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు ప్రస్తుతం మౌనం వహించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇందులో కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, శిల్పాశెట్టి, జూహీ చావ్లా, అనుపమ్ ఖేర్ ట్వీట్స్‌కు సంబంధి స్క్రీన్ షాట్స్ ఉండటంలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇందులో ‘సంతోషం పెట్రోల్ ధరలా తరహాలో పెరగాలి.. బాధలు ఇండియన్ రూపీలాగా తగ్గాలి. హృదయం కరప్షన్ తరహాలో జాయ్‌తో నిండిపోవాలి’ అంటూ వివేక్ అగ్నిహోత్రి గతంలో చేసిన ఈ ట్వీట్ అప్పుట్లో తీవ్ర రచ్చకు దారి తీసింది. ఇక శిల్పా శెట్టి డాలర్ రేటు పెరుగుతూ ఉండడం పై సెటైర్ వేసింది. అలా అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్‌లతో పాటు నటి జూహి చావ్లా సైతం రూపాయి విలువను లో దుస్తులతో పోల్చడం వివాదాస్పదంగా మారింది. అయితే ఈ ట్వీట్స్ 2012,13 చేసినవి కావడం గమనార్హం. ఈ ట్వీట్స్‌కు సంబందించిన స్క్రీన్ షాట్స్‌కు ప్రకాశ్ రాజ్ ‘ఒకప్పుడు దేశంలో’ అంటూ జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసి పోస్ట్ చేశాడు. ఏదేమైన ప్రకాశ్ రాజ్ తాజా ట్వీట్ మాత్రం బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో హాట్‌టాపిక్ నిలిచింది. Once upon a time…in my country.. #justasking pic.twitter.com/KOgkQwQwAy — Prakash Raj (@prakashraaj) July 20, 2022 -
బాద్షా ఉన్నంతకాలం బాలీవుడ్ గతి ఇంతే: డైరెక్టర్‌పై ట్రోలింగ్
హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు, కానీ కొందరు పెద్ద హీరోలు మాత్రం ఇండస్ట్రీలో స్థిరంగా ఉండిపోతారు. ప్రతి చిత్రపరిశ్రమలో ఇది సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఏళ్ల తరబడి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే బడా హీరోలను అభిమానులు పవర్ స్టార్, కింగ్, బాద్షా అంటూ రకరకాలుగా పిలుచుకుంటారు. ఉదాహరణకు షారుక్ ఖాన్ వెండితెరపై అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ బాలీవుడ్ కింగ్‌గా వెలుగొందుతున్నాడు. దీనిపై ఓ వెబ్సైట్ కథనం రాయగా దానిపై స్పందించాడు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. 'బాలీవుడ్లో కింగ్‌లు, బాద్షాలు, సుల్తాన్లు ఉన్నంతకాలం అది మునిగిపోతూనే ఉంటుంది. ప్రజల కథలతో దీన్ని ప్రజల చలనచిత్రసీమగా మార్చండి. అప్పుడే బాలీవుడ్ ప్రపంచ సినీ ఇండస్ట్రీని ఏలుతుంది. ఇదే సత్యం' అని ట్వీట్ చేశాడు. దీనిపై అనేకమంది నెటిజన్లు మండిపడుతున్నారు. 'షారుక్, సల్మాన్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఎన్నో ఏళ్ల ఫలితంగా బాద్షా, సుల్తాన్, కింగ్లయ్యారు. వారిని జనాలు ప్రేమిస్తున్నారు. మధ్యలో మీకెందుకు అంత అక్కసు?', 'సల్మాన్, షారుక్లంటే మీకు ఈర్ష్య, అసూయ అని ఇట్టే అర్థమవుతుంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిమంది మాత్రం నిజం చెప్పారు, ఇప్పటికీ వాళ్లనే ఇండస్ట్రీ కింగ్‌లని పిలవడమేంటో అర్థం కాదంటూ అతడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఐఎమ్‌డీబీ రిలీజ్ చేసిన 2022- టాప్ 10 ఇండియన్ చిత్రాల్లో కశ్మీర్ ఫైల్స్‌కు స్థానం లభించిన విషయం తెలిసిందే! As long as Bollywood has Kings, Badshahs, Sultans, it will keep sinking. Make it people’s industry with people’s stories, it will lead the global film industry. #FACT https://t.co/msqfrb7gS3 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 14, 2022 చదవండి: ఆలోచింపజేసేలా నటుడి చివరి పోస్ట్.. నెట్టింట వైరల్ వారియర్ మొదటి రోజు ఎంత రాబట్టిందంటే? -
వాళ్లు ఉన్నంత కాలం సినీ పరిశ్రమ మునిగిపోతుంది: డైరెక్టర్
Vivek Agnihotri Comments On Shahrukh And Salman Khan: చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ప్రస్తుతం 'ది ఢిల్లీ ఫైల్స్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న అగ్నిహోత్రి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కింగ్స్, బాద్షాలు, సుల్తాన్లు ఉన్నంత కాలం బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుంది. ప్రజల గాథలతో సినిమాలు తీస్తూ ప్రజల పరిశ్రమగా మార్చాలి. అది మాత్రమే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమగా అభివృద్ధి చెందుతుంది' అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు వివేక్ అగ్నిహోత్రి. అయితే ఈ ట్వీట్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ను పరోక్షంగా విమర్శించినట్లు తెలుస్తోంది. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్‌పై ఆగ్రహం As long as Bollywood has Kings, Badshahs, Sultans, it will keep sinking. Make it people’s industry with people’s stories, it will lead the global film industry. #FACT https://t.co/msqfrb7gS3 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 14, 2022 కాగా కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో సుమారు రెండేళ్లు సినీ ఇండస్ట్రీ నష్టాలు ఎదుర్కొంది. దీంతో ఓటీటీలు పుంజుకున్నాయి. ఈ క్రమంలేనే ప్రేక్షకుల అభిరుచి మారింది. ఈ మార్పుతో హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలను తిరస్కరించారు. అదే సమయంలో ఊరమాస్ స్టైల్లో వచ్చిన దక్షిణాది చిత్రాలను మాత్రం విపరీతంగా ఆదరించారు. ఇంకా చెప్పాలంటే హిందీ చిత్రాలకంటే దక్షిణాది డబ్బింగ్ మూవీస్ ఎక్కవ కలెక్షన్లు రాబట్టాయి. ఈ పరిణామంతో బాలీవుడ్ స్టార్స్‌పై విమర్శలు రాజుకున్నాయి. ఈ క్రమంలోనే వివేక్ అగ్నిహోత్రి ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ -
ఇట్స్ అఫీషియల్: కశ్మీర్ ఫైల్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయింది. తాజాగా కశ్మీర్ ఫైల్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రయూనిట్. జీ 5లో మే 13 నుంచి ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కశ్మీర్ ఫైల్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపిం. మొత్తానికి ఈ సినిమాను మరోసారి చూసే ఛాన్స్ దొరికిందంటూ సంబరపడిపోతున్నారు సినీప్రియులు. Bringing the story of the Kashmiri Pandits straight to you. If you missed it, this is your chance to watch the truth unfold.#TheKashmirFiles premiering 13th May on #ZEE5#TheKashmirFilesOnZEE5 pic.twitter.com/uAFFEp3O0u — ZEE5 (@ZEE5India) April 25, 2022 చదవండి: పోలీసులు ఘోరంగా అవమానించారు, కాలర్ పట్టుకుని.. Shahid Kapoor: నాకెప్పటికీ ఆ స్కూల్ డేస్ అంటే ఆసహ్యం -
'ది కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ వివేక్ తర్వాతి చిత్రం ఇదే..
The Kashmir Files Director Vivek Agnihotri Announces The Delhi Files: 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో రూపొందిందిన సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. మార్చి 11న విడుదలై ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు పలు ప్రభుత్వాలు వినోదపు పన్నును సైతం మినహాయింపుని ఇచ్చాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కేవలం మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్సకత్వం వహించిన విషయం తెలిసిందే. I thank all the people who owned #TheKashmirFiles. For last 4 yrs we worked very hard with utmost honesty & sincerity. I may have spammed your TL but it’s important to make people aware of the GENOCIDE & injustice done to Kashmiri Hindus. It’s time for me to work on a new film. pic.twitter.com/ruSdnzRRmP — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 15, 2022 చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో సామాజిక అంశాలను తన సినిమాలతో వేలెత్తి చూపే బాలీవుడ్ దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఆయన ఇదివరకు 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టారు. ఇక ఇటీవల వచ్చిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంతో మరో విజయం సాధించారు. దీంతో ఆయన నెక్ట్స్ మూవీ ఏంటి ? అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తికి తెరదింపుతూ తన కొత్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ అగ్రిహోత్రి. ఆయన 'ది ఢిల్లీ ఫైల్స్' అనే చిత్రం తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సినిమా చిత్రీకరణకు ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
రెండు సినిమాలు అనౌన్స్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్
ఈ ఏడాది మార్చిలో రిలీజైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్, పల్లవి జోషి ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం వివేక్ అగ్నహోత్రి దర్శకత్వంలోనే రెండు సినిమాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం (మార్చి 11) అభిషేక్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాలను ప్రకటించారు. ‘నిజాయితీతో కూడిన రెండు కొత్త కథలతో సినిమాలు నిర్మించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాలను తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మిస్తారు. ‘‘ఈ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. -
కశ్మీరీ పండిట్ల గాథ...
భూతల స్వర్గమైన కశ్మీర్ లోయలో 32 ఏళ్ల క్రితం జరిగిన ఆ దారుణాలు లక్షలాది మంది గుండెల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. నిత్య భయోత్పాతానికి, సామూహిక హత్యాకాండకు జడిసి కట్టుబట్టలతో లోయను వీడి వచ్చిన నాటినుంచీ వాళ్లు న్యాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. సొంత నేలకు దూరంగా, ఏ సదుపాయాలూ లేని శరణార్థి శిబిరాల్లో ఎవరికీ పట్టని అనాథల్లా నిస్సహాయంగా బతుకీడుస్తున్నారు. వాళ్లే... కశ్మీరీ పండిట్లు. ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు మారుతున్నా తమ గోడు పట్టించుకుంటున్న వారే లేరన్న వారి ఆక్రందన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. కశ్మీర్ ఫైల్స్ సినిమా సృష్టించిన వివాదంతో పండిట్ల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది... కశ్మీరీ పండిట్ల ఊచకోతకు, తదనంతర సామూహిక వలసలకు మూగ సాక్షిగా 1990 సంవత్సరం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఆ అల్లర్ల అనంతరం 1990 జనవరి–మార్చి మధ్య లక్షన్నర మంది కశ్మీరీ పండిట్లలో కనీసం లక్ష మందికి పైగా లోయను వీడినట్టు పలు నివేదికలు తేల్చాయి. మహా అయితే 3,000 కుటుంబాలు అక్కడ మిగిలాయని అంచనా. అవి కూడా 2010 నాటికి 800కు తగ్గాయి. కశ్మీర్ ప్రభుత్వ పునరావాస కమిషన్ (శరణార్థుల) అధికారిక వెబ్సైట్ ప్రకారమే 60 వేల కుటుంబాలు లోయను వీడాయి. వీరిలో చాలామంది 30 ఏళ్లుగా జమ్మూ, పరిసరాల్లోని శరణార్థి శిబిరాల్లో దయనీయ పరిస్థితుల్లో తలదాచుకుంటున్నారు. మరో 23 వేల కుటుంబాలు దేశ నలుమూలల్లోనూ విదేశాల్లోనూ స్థిరపడ్డాయి. లోయలో ఇంతటి కల్లోలానికి కారణమైన హిందూ, ముస్లిం ఘర్షణలు 1980ల నుంచే పెరుగుతూ వచ్చాయి. నిజానికి లోయలో 1950ల నుంచి చూసినా హిందూ పండిట్ల సంఖ్య 4 నుంచి 5 శాతం మించి లేదని గణాంకాలు చెప్తున్నాయి. 94 శాతం దాకా ముస్లిం జనాభాయే. అయినా లోయను సంపూర్ణంగా ఇస్లామీకరించే ప్రయత్నాలు 1980ల్లో ఊపందుకున్నాయి. ఫలితంగా స్థానిక ముస్లింలలో హిందువులపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. వారి నివాసాలపై దాడులతో మొదలై హిందూ నేతలను హతమార్చడం దాకా వెళ్లింది. వేర్పాటువాదమే సిద్ధాంతంగా జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వంటివి పుట్టుకు రావడంతో పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడింది. 1990 జనవరి హింసాకాండకు ఇదంతా ఓ భయానక నేపథ్యంగా అమరింది. ఆ మూడు నెలలూ... 1990 జనవరి తొలి రోజులు కశ్మీరీ పండిట్ల గుండెల్లో ఆరని మంటలు రగిల్చాయి. అప్పటికే తారస్థాయికి చేరిన మత అసహనం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. హిందువులు మతం మారడమో, లోయను వీడటమో, మరణించడమో తేల్చుకోవాలంటూ తీవ్రవాద మూకలు పండిట్ల ఇండ్లపై పడి మారణహోమం సృష్టించారు. కనిపించిన వారినల్లా కాల్చి చంపుతూ నరమేధానికి దిగారు. ఆ క్రమంలో అంతులేని దారుణ అత్యాచారాలకు, చెప్పుకోలేని ఘోరాలకు పాల్పడ్డారు. దాంతో పండిట్ల కుటుంబాలు కట్టుబట్టలతో లోయ ను వీడాయి. ఈ హింసాకాండలో మరణించిన హిందువులు 100 లోపేనని అధికారిక గణాంకాలు చెప్తున్నా వాస్తవ సంఖ్య వేలల్లో ఉంటుందంటారు. పట్టించుకున్న వాళ్లే లేరు... జమ్మూ, పరిసరాల్లోని శిబిరాల్లో తలదాచుకున్న పండిట్లు, కొద్ది నెలల్లో లోయకు తిరిగి వెళ్తామన్న ఆశలు క్రమంగా ఆవిరవడంతో దశాబ్దాలుగా అక్కడే బతుకీడుస్తున్నారు. ప్రభుత్వపరంగా వీరికి పెద్దగా సాయం కూడా అందడం లేదు. 2004లో యూపీఏ ప్రభుత్వం పండిట్ల కోసం టౌన్‌షిప్‌ల్లోని చిన్న ఫ్లాట్లను కొందరు కొనుక్కోగా ఆ స్తోమతలేని చాలామంది ఇప్పటికీ దయనీయంగానే గడుపుతున్నారు. ఆర్థిక కష్టాలతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు కూడా. అయినా నాటి గాయాలు వీరిలో ఎంత తాజాగా ఉన్నాయంటే... ఇప్పటికీ చాలామంది తమ అవస్థలపై పెదవి విప్పేందుకు కూడా ఇష్టపడటం లేదు! 2008లో ప్రధాని పునరావాస ప్యాకేజీ కింద పండిట్లకు కొన్ని ఉద్యోగాలివ్వడంతో సరిపెట్టారు. వారికి ఉద్యోగాలతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.7.5 లక్షల దాకా ఆర్థిక సాయం ఇస్తామని 2021లో కేంద్రం ప్రతిపాదించినా ముందడుగు పడలేదు. దాంతో మోదీ ప్రభుత్వం కూడా తమకోసం చేసిందేమీ లేదంటూ పండిట్లు వాపోతున్నారు. కశ్మీరీ పండిట్ల డిమాండ్లు ► కనీసం రూ.25 వేల పై చిలుకు నెలవారీ పరిహారం ► కేంద్రపాలిత ప్రాంత హోదాతో కూడిన ప్రత్యేక హోమ్‌లాండ్ ► మైనారిటీ హోదా, తదనుగుణమైన హక్కులు, ప్రయోజనాలు ► నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు తేల్చాలి. అన్నివిధాలా న్యాయం చేయాలి ► తమ నివాసాలు, భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించి వెనక్కి ఇప్పించాలి ఒక విజయం, వంద వివాదాలు కశ్మీరీ పండిట్ల ఊచకోత, వలసలపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ.15 కోట్లతో రూపొందిన ఈ సినిమా 20 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల పై చిలుకు కలెక్షన్లు రాబట్టి రికార్డుల మోత మోగించింది. మార్చి 11న కేవలం 600 థియేటర్లలో పెద్దగా హడావుడి లేకుండా విడుదలైనా, చూస్తుండగానే టాక్ ఆఫ్ ద కంట్రీగా మారిపోయింది. ప్రధాని మోదీ మొదలుకుని అమిత్ షా తదితర కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రముఖులంతా సినిమాను ప్రశంసలతో ముంచెత్తడమే గాక అందరూ తప్పక చూడాలంటూ పిలుపునిచ్చారు. ఇందుకు విపరీతమైన మౌత్ పబ్లిసిటీ తోడై చూస్తుండగానే 4,000కు పైగా థియేటర్లకు విస్తరించింది. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ఉచితంగా షోలు వేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపులిచ్చాయి. యూఏఈ, సింగపూర్ వంటి దేశాల్లో కూడా నిషేధం తొలగి త్వరలో విడుదలవుతుండటంతో కలెక్షన్లు ఇంకా కొనసాగేలా ఉన్నాయి. అయితే సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పైగా దీన్ని బీజేపీ ప్రమోట్ చేస్తోందన్న అభిప్రాయంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. సినిమాకు అనుకూలంగా, వ్యతిరేకంగా విమర్శలు, ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి. సినిమా అవాస్తవాలమయమని ఆప్ వంటి పార్టీలు అంటున్నాయి. మరో వర్గం మాత్రం సినిమాలో నిజాలు చూపించారని, పండిట్ల గుండెకోత ఇప్పటికైనా వెలుగులోకి వచ్చిందని అంటోంది. బెదిరింపుల నేపథ్యంలో అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రత కల్పించాల్సి వచ్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
కశ్మీర్ ఫైల్స్ నా సినిమాను దెబ్బకొట్టింది: అక్షయ్ కుమార్
చిన్న సినిమాగా వచ్చి పెను సంచలన విజయం సాధించింది ది కశ్మీర్ ఫైల్స్. మార్చి 11న రిలీజైన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమాపై ఎందరో ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కశ్మీర్ ఫైల్స్ సినిమాను అభినందించాడు. భోపాల్‌లోని ఓ కార్యక్రమంలో అక్షయ్ మాట్లాడుతూ.. 'వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విచిత్రమేంటంటే దీని ఎఫెక్ట్ నా సినిమాపై కూడా పడింది. నేను నటించిన బచ్చన్ పాండే కలెక్షన్లను కశ్మీర్ ఫైల్స్ దెబ్బకొట్టింది' అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా వివేక్ అగ్నిహోత్రి దాన్ని ట్విటర్లో షేర్ చేశాడు. తన సినిమాపై ప్రశంసలు కురిపించిన అక్షయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా కశ్మీర్ ఫైల్స్‌లో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్, చిన్మయి, భాషా సుంబ్లి తదితరులు నటించారు. ఈ సినిమాకు ఉత్తరప్రదేశ్, గోవా, త్రిపుర, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించారు. త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ డబ్ చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. కశ్మీర్ ఫైల్స్ నా సినిమాను దెబ్బకొట్టింది. Thanks @akshaykumar for your appreciation for #TheKashmirFiles. 🙏🙏🙏 pic.twitter.com/9fMnisdDzR — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 25, 2022 చదవండి: మీటూపై అనుచిత వ్యాఖ్యలు, సారీ చెప్పిన నటుడు -
కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు!
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై మండిపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో భోపాలీలంటే స్వలింగ సంపర్కులంటూ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కామెంట్లు చేయడంపై దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే డిగ్గీ రాజా సీరియస్ అయ్యారు. వివేక్ అగ్నిహోత్రి గారు.. ఇది మీ వ్యక్తిగత అనుభవం కావచ్చు. అంతేగానీ భోపాల్ ప్రజలది కాదు. నేను 77 ఏళ్ల నుంచి భోపాల్, అక్కడి ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నా. కానీ నాకు ఏనాడూ అలాంటి అనుభవం ఎదురు కాలేదు. ఎక్కడున్నా.. మీ పక్కన ఉండేవాళ్ల ప్రభావమే దానికి కారణమై ఉంటుందని గుర్తించండి అంటూ ట్వీట్‌తో దిగ్విజయ్ సింగ్, వివేక్ అగ్నిహోత్రికి చురకలు అంటించారు. ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ‘‘నేను భోపాల్‌లో పెరిగినా, అనుబంధం ఉన్నా.. భోపాలీ అని పిలుచుకోవడానికి ఇష్టపడను. ఎందుకంటే.. ఆ పదానికి ఒక నిర్దిష్ట అర్థం జనాల మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. భోపాలీలు స్వలింగ సంపర్కులుగా భావించబడుతున్నారని, అందుకు బోఫాల్ నవాబీ నగరం కావడం, వాళ్ల కోరికలే కారణం అయి ఉండొచ్చు’ అని వివేక్ అగ్నిహోత్రి వెకిలి వ్యాఖ్యలు చేశాడు. इस दोयम दर्जे की मान्यता के लिए मेरी ओर से..#I_M_Sorry_Bhopal भोपाली होना होमोसेक्सुअल होना कैसे हो सकता है..? लखनऊ,हैदराबाद,मैसूर भी तो नवाबी शहर हैं..तो क्या वहां भी..! छि: अगर हम भी कहते फिरें कि तनु श्री दत्त आपको लेकर ऐसा बोलती है तो क्या आप मान लेंगे.!@vivekagnihotri pic.twitter.com/teh5fmixZ0 — Govind ਗੋਵਿੰਦ گووند गोविंद गुर्जर (@govindtimes) March 25, 2022 ఇదిలా ఉండగా.. ఈ కామెంట్లపై మీడియా వివేక్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. శుక్రవారం ఉదయం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ అగ్నిహోత్రిని మీడియా ప్రతినిధులు ‘హెమోసెక్సువల్స్’ కామెంట్లపై వివరణ అడగ్గా మౌనంగా వెళ్లిపోయారు. ఆయన వెంట ఉన్న బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వరిగ్యాను మీడియా అడ్డుకుని ‘నేను ఇండోర్వాసిని. అదేదో ఆయన్నే(వివేక్ అగ్నిహోత్రి) అడగొచ్చుగా’ అంటూ తప్పించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా ఈ వ్యవహారం ఆధారంగా బీజేపీపై సెటైర్లు సంధించారు. అగ్నిహోత్రి వ్యాఖ్యలపై నేనేం మాట్లాడను. కానీ, రాఘవ్ జీ భాయ్, ఆరెస్సెస్ ప్రచారక్ ప్రదీప్ జోషి వ్యవహారాలు(స్వలింగ సంపర్కులనే విషయం) వెలుగులోకి వచ్చాకే ఆయన(వివేక్ అగ్నిహోత్రి) స్పందించాడా? వాటి ఆధారంగానే భోపాల్ మొత్తాన్ని హోమోసెక్సువల్స్ అంటున్నాడా? ఇంతకీ అగ్నిహోత్రిపై వాళ్లు తీసుకోబోయే చర్యలేంటి? అంటూ మధ్యప్రదేశ్ హోంమంత్రిని ట్యాగ్ చేస్తూ మరీ ఓ సెటైరిక్ ట్వీట్ చేశాడు కేకే మిశ్రా. राघवजी भाई या संघ प्रचारक प्रदीप जोशी आदि के सामने आए प्रकरणों के बाद विवेक अग्निहोत्री ने कुछ कहा हो तो मैं खामोश हूं! पर समूचे भोपाल को समलैंगिकों का शहर बताना उचित है? @drnarottammisra जी,क्या अन्य फ़िल्म निर्माताओं के अनुरूप कार्यवाही होगी या हम सभी??कथित हिंदूवादी भी चुप? pic.twitter.com/6rFJXV2PEC — KK Mishra (@KKMishraINC) March 25, 2022 అంతేకాదు వివేక్‌పై చర్యలు తీసుకోలేని రాజకీయ నంపుసకత్వం అంటూ తీవ్ర వ్యాఖ్యలతో మరో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా.. వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలపై భోపాల్‌కు చెందిన జర్నలిస్టులు, ఉద్యమకారులు సోషల్ మీడియాలో అసంతృప్త నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. -
యోగి ప్రమాణ స్వీకారానికి ‘కశ్మీర్ ఫైల్స్’ టీం
అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడమే కాదు.. ఉత్తర ప్రదేశ్‌కు రెండో దఫా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు యోగి ఆదిత్యానాథ్. మార్చి 25 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లక్నోలోని వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ చీఫ్ గెస్ట్‌గా హాజరు కాబోతున్నారు. మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, మరికొందరు బీజేపీ కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టేజ్‌పై ప్రధాని మోదీ, నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, యోగి ఫొటోలతో భారీ బ్యానర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు సైతం యోగి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, బోనీ కపూర్లకు ఆహ్వానం అందాయి. అంతేకాదు.. తాజాగా భారీ హిట్ సాధించిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర యూనిట్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపింది యూపీ బీజేపీ యూనిట్. నటుడు అనుపమ్ ఖేర్‌తోపాటు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం 200 కోట్ల రూపాయల క్లబ్‌లోకి అడుగుపెట్టింది కూడా. #TheKashmirFiles crosses ₹ 200 cr mark 🔥🔥🔥... Also crosses *lifetime biz* of #Sooryavanshi... Becomes HIGHEST GROSSING *HINDI* FILM [pandemic era]... [Week 2] Fri 19.15 cr, Sat 24.80 cr, Sun 26.20 cr, Mon 12.40 cr, Tue 10.25 cr, Wed 10.03 cr. Total: ₹ 200.13 cr. #India biz. pic.twitter.com/snBVBMcIpm — taran adarsh (@taran_adarsh) March 24, 2022 స్టేడియంలో అదనంగా 20వేల కుర్చీలను వేయించారు. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో బీజేపీ అభిమానగణం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీలో దాదాపు 37 ఏళ్ల తర్వాత.. ఐదేళ్ల అధికారం పూర్తి చేసుకుని తిరిగి సీఎం పదవిని చేపడుతున్న ఘనత యోగి ఆదిత్యానాథ్‌కు దక్కింది. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో 255 సీట్లు గెల్చుకుని, 41.29 శాతం ఓటింగ్ షేర్ దక్కించుకుంది బీజేపీ. -
కశ్మీర్ ఫైల్స్.. అదే నిజమైతే ఉరి తీయండి
ది కశ్మీర్ ఫైల్స్ The Kashmir Files సినిమా దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారితీసింది. పనిలో పనిగా వివాదాలను, విమర్శలను సైతం మూటగట్టుకుంటోంది ఈ చిత్రం. ఈ తరుణంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా(84) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990 నాటి పరిస్థితులకు తాను కారణం అని నిరూపిస్తే.. ఉరి తీయండంటూ వ్యాఖ్యానించాడాయన. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్లో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఒక ఉద్దేశపూర్వక కుట్రగా వర్ణించిన ఆయన.. కొందరు తమ రాజకీయాల కోసం కోసం చిత్రాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. అలాగే కశ్మీర్ పండిట్ల వలసలకు ఫరూఖ్ అబ్దుల్లానే కారణం అంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారాయన. అదే నిజమని రుజువైతే ఉరికైనా తాను సిద్ధమని అన్నారు. ‘‘నిజాయితీ ఉన్న న్యాయమూర్తి లేదంటే కమిటీని నియమిస్తే.. నిజం ఏంటో వెలుగు చూస్తుంది. కశ్మీర్ పండిట్ల వలసలకు, ఆనాటి ఘర్షణకు కారణం ఎవరో బయటపడుతుంది. దేశంలో ఎక్కడైనా ఉరి కంబం ఎక్కడానికి ఫరూఖ్ అబ్దుల్లా(తనని తాను ఉద్దేశించుకుంటూ..) సిద్ధంగా ఉంటాడు. విచారణకు నేను సిద్ధం. కానీ, సంబంధం లేని వాళ్లపై నిందలు వేయడం నాకు చేత కాదు’’ అంటూ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారాయన. ‘‘ఆనాటి పరిస్థితులకు కారణం నేను కాదనే అనుకుంటున్నా. నిజం తెలుసుకోవాలనుకునేవాళ్లు.. ఆనాటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్నుగానీ, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అరిఫ్ మహమ్మద్(ప్రస్తుత కేరళ గవర్నర్)నుగానీ సంప్రదించ్చొచ్చు. అలాగే విచారణ కోసం నియమించే కమిటీ ఏదైతే ఉందో అది కేవలం కశ్మీర్ పండిట్ల కోసమే కాకుండా సిక్కులకు, ముస్లింలకు ఏం జరిగిందో కూడా విచారణ చేపడితే మంచిద’’ని వ్యాఖ్యానించారాయన. సినిమాను కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న వాళ్లు.. ఆనాటి పరిస్థితులకు కారణం ఎవరనేది కూడా గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆమోదించిన చట్టం.. కాశ్మీరీ పండిట్ల వలసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినట్లు రుజువు చేస్తోందని ఓ జాతీయ మీడియా తాజాగా సంచలన కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు. చదవండి: కశ్మీర్ ఫైల్స్.. ది పొలిటికల్ హీట్! -
'ది కశ్మీర్ ఫైల్స్'.. కక్కుర్తి పడి ఆ లింక్స్ ఓపెన్ చేయకండి
Download The Kashmir Files: For Free Police Warn Against Free Links: ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ మీకు వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఫ్రీగా సినిమా చూడొచ్చని కక్కుర్తి పడి లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులన్నీ ఖాళీ అయినట్లే. ఎందుకంటే సైబర్ నేరగాళ్ల దృష్టి ఇప్పుడు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై పడింది. ఈ సినిమాను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఫ్రీలింకులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఢిల్లీ, నోయిడాల్లో హ్యాకర్లు ఇదే పనిగా సైబర్ క్రైమ్‌కు పాల్పుడుతున్నారని పోలీసులు తెలిపారు. ది కశ్మీర్ ఫైల్స్‌ను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసినట్లు చెప్పారు. ఒకవేళ మీకు ఇలాంటి లింకులు వస్తే 1920 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీసులు సూచించారు. కాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే వంద కోట్లు సాధించి సత్తా చాటుతోంది. ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
కనీసం చనిపోయినవారికైనా గౌరవం ఇవ్వండి: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే వంద కోట్లు సాధించిన ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాకు సెన్సార్ ఆమోదం తెలపలేదంటూ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)లో ఒక సభ్యుడు కాబట్టే సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా యధాతథంగా రిలీజ్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. తాజాగా దీనిపై వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. 'దయచేసి ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేయడాన్ని ఆపేయండి. కాస్త విరామం తీసుకోండి. కనీసం చనిపోయిన వారికైనా గౌరవమివ్వండి' అని ట్వీట్ చేశాడు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మార్చి 11న విడుదలైంది. 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు. బాలీవుడ్ నటీనటులు అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. Please stop spreading fake news, like always. Take a little break. At least to respect the dead. https://t.co/hZflsTUbOk pic.twitter.com/yvOKhGieDX — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 20, 2022 చదవండి: ఆల్‌టైం బ్లాక్‌బస్టర్: వంద కోట్ల క్లబ్బులో 'కశ్మీర్ ఫైల్స్' -
The Kashmir Files: అందుకే పబ్లిసిటీ చేయలేదు.. నిర్మాత అభిషేక్ అగర్వాల్
‘సినిమా అనేది కమర్షియల్. కానీ ఐదు లక్షల మంది కశ్మీర్ పండిట్ల బాధలు, సమస్యలను 32 ఏళ్ల తర్వాత ‘ది కశ్మీర్ ఫైల్స్’మూవీతో బయటకు తెచ్చాం. ఈ చిత్రం యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి సంఘటనలు జరిగాయా! అంటూ ఇవి చూస్తుంటే మాకే సిగ్గేస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంత మంచి సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు పాదాభివందనాలు చేస్తున్నాను’అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ.. పెను సంచలనంగా మారింది. విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్ లో తన సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. ఆ విశేషాలు. ► ముందుగా ఈ సినిమాను ఆదరిస్తున్న యావత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ► సినిమా విడుదలకు ఐదురోజుల ముందు ఒక మహిళ ఢిల్లీ నుంచి 20 వేల రూపాయలతో టికెట్ పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ మరీ హైదరాబాద్‌కు వచ్చింది. వచ్చీ రాగానే తెగ ఏడ్చేసింది. నాకు ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. 32 ఏళ్ళ నుంచి మా పండిట్ ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. నా కుటుంబం ఆ టైంలో ఎంతో సఫర్ అయింది అంటూ ఆమె జ్ఞాపకాలు తెలియజేసింది. అదే రోజు రాత్రి కశ్మీర్ పండిట్ ల తో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. రెండు వేల మంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు. ►ఈ సినిమా చేసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి రీసెర్ఛ్ చేశాం.. మూడు నెలలపాటు అమెరికా, కెనడ, దక్షిణాఫ్రికా మొదలైన ప్రదేశాలు తిరిగి అక్కడున్నవారి నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ► ఇది ప్రజల సినిమా. ఇతర సినిమాలు అదే టైంలో విడుదలైనా వారి ఇష్టం మేరకు ఆయా సినిమాలు చూస్తారు. మాది చిన్న సినిమా. అందుకే పెద్దగా పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు. చిన్న సినిమా కాబట్టి ఎవరూ సపోర్ట్ చేయరని తెలుసు. కానీ సినిమా విడుదలయ్యాక అన్ని చోట్లనుంచి, ముఖ్యంగా తెలుగు చలన చిత్రరంగంలో ఎంతోమంది అభినందలు కురిపించారు. కశ్మీర్ పండితులకు ఈ సినిమా అంకితం చేస్తున్నాం. ► ప్రధాని నరేంద్రమోదీని కలవడం అనేది యాదృశ్చికంగా జరిగింది. ఒకరోజు ఆయన ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళి కలిశాం. ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. ► ఈ సినిమా తర్వాత పర్యావసనాలు ఏమైనా వుంటే ఛాలెంజ్ గా తీసుకున్నాం. సినిమా తీసేటప్పుడు కొంత ఫేస్ చేశాను. విడుదలకుముందు కొంత ఫేస్ చేశాను. ఇలాంటి సమస్యలు వస్తాయనే ముందుగాను ప్రిపేర్ అయ్యాను. ► నిజాయితీగా ఈ సినిమాను తెరకెక్కించాం. అందుకే ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు. నేను ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రజలే సపోర్ట్ చేయరు. ► త్వరలో దేశంలో అన్ని భాషల్లో డబ్ చేసే ఆలోచన వుంది. తెలుగులోకూడా డబ్ చేయబోతున్నాం. ► మా సినిమాకు అస్సాం, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటకతోసహా మొత్తం 9 రాష్ట్రాలలో టాక్స్ మినహాయింపు వచ్చింది. ►ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కశ్మీర్ పండిట్ గా నటించారు. ఆయన పాత్రలో లీనమై పోయారు. ఆయనేకాదు చాలమంది నటీనటులు ఫీల్ అయి చేశారు. రాత్రి పూటా ఆ పాత్రలో మమేకం అయి నిద్ర సరిగ్గా పట్టేదికాదు. ► షూటింగ్ జరుగుతుండగా అనుపమ్ ఖేర్ ను అక్కడి హిందువులు డిన్నర్‌కు ఆహ్వానించేవారు. 90 ఏళ్ళ వృద్ధురాలు కూడా తను ఇంటిదగ్గర వండి భోజనం తీసుకువచ్చేది. ఇలా ఎంతోమంది హిందువులును కలిసి వారితో షేర్ చేసుకున్న సంగతులు నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చాయి. ►ఈ సినిమాను అందరూ పర్సనల్ గా తీసుకుని నటించారు. దర్శకుడు పూర్తి క్లారిటీతో సినిమా తీశాడు. ►కొత్త సినిమాలు: రవితేజ తో నా డ్రీమ్ ప్రాజెక్ట్.. టైగర్ నాగేశ్వర రావు చేస్తున్నా. ఆ తర్వాత అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతున్నాం. అదేవిధంగా దర్శకుడు వివేక్‌తో ఢిల్లీ ఫైల్స్ అనే సినిమా ఆలోచనలో వుంది. -
ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్‌కు 'వై' కేటగిరీ భద్రత
కశ్మీరీ పండిట్లపై జరిగిన ఊచకోత ఆధారంగా తెరకెక్కిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా మార్చి 11న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది. కేవలం మౌత్‌టాక్‌తోనే జనాలను థియేటర్లకు రప్పిస్తూ ఇప్పటివరకు మొత్తంగా రూ.97 కోట్లు రాబట్టింది. ఈరోజు వచ్చే కలెక్షన్లతో కశ్మీర్ ఫైల్స్ వందకోట్లు రాబట్టిన సినిమాల జాబితాలో చేరిపోవడం ఖాయం. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే అతడికి ఏదైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉండటంతో కేంద్రం వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రతను కేటాయించింది. ఆయన ఎక్కడకు వెళ్లినా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. కాగా ఈ సినిమాకు పలు రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించిన విషయం తెలిసిందే! చదవండి: The Kashmir Files: ఓటీటీలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
'ది కశ్మీర్ ఫైల్స్' ప్రభంజనం, ఎన్ని కోట్లు సాధించిందంటే?
ది కశ్మీర్ ఫైల్స్.. చిన్న సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా బాక్సాఫీస్‌పై వసూళ్లతో విరుచుకుపడుతోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటివరకు అక్షరాలా రూ.60 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని ట్రేడ్ గురు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ సునామీగా, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. సినిమా రిలీజైన తొలి(మార్చి 11) రోజు మూడున్నర కోట్లు వచ్చాయి. రెండో రోజు రూ.8.50 కోట్లు, మూడో రోజు రూ.15.10 కోట్లు, నాలుగో రోజు రూ.15.05 కోట్లు వచ్చాయి. ఇక ఐదో రోజు(మంగళవారం నాడు) ఏకంగా రూ.18 కోట్లు రాబట్టింది. మొత్తంగా రూ.60.20 కోట్ల కలెక్షన్లు వచ్చాయి' అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కలెక్షన్ల స్పీడ్ చూస్తుంటే త్వరలోనే వందకోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించడగా దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. #TheKashmirFiles is a TSUNAMI at the #BO… FANTASTIC TRENDING, as footfalls, occupancy, numbers continue to soar… Day 5 higher than *all* previous days… BLOCKBUSTER... Fri 3.55 cr, Sat 8.50 cr, Sun 15.10 cr, Mon 15.05 cr, Tue 18 cr. Total: ₹ 60.20 cr. #India biz. pic.twitter.com/uaDH3ooVsO — taran adarsh (@taran_adarsh) March 16, 2022 చదవండి: ఓటీటీలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
సినిమా కోసం ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్‌డే లీవ్
Assam Govt Employees To Get Half-Day Leave To Watch The Movie: ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ఇటీవల తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. సీనీ, రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా ఈ సినిమాని ప్రశంసించారు. ఇటీవల జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న మోదీ.. ఈ సినిమా చూడాలంటూ ఎంపీలకు, బీజేపీ నాయకులకు సూచించాడు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటకతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ‘ది కశ్మీర్ ఫైల్స్’పై వినోదపు పన్నును తొలగించింది. ఇదిలా ఉంటే తాజాగా..ఈ సినిమా చూడడం కోసం అస్సాం ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు ప్రకటించి ఆశ్చరపరిచింది. ఈ సినిమా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్‌డే లీవ్ ప్రకటించింది. సినిమా చూసిన తదుపరి రోజు పై అధికారికి సినిమా టికెట్ చూపించి, లీవ్ అప్లై చేస్తే హాప్డే లీవ్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఒక సినిమా కోసం ప్రభుత్వమే స్వయంగా సెలవును ప్రకటించడం విశేషం. 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వికేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. -
ఐదేళ్లుగా సినీ ఇండస్ట్రీ ఐసీయూ బెడ్‌పై ఉంది.. ఈ సినిమాతోనే ఆక్సిజన్ దొరికింది
Swara Bhasker Brutally Trolled For Allegedly Dig At Vivek Agnihotri: బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. సినిమాలో విభిన్నమైన పాత్రలు చేసే స్వరా వాస్తవ జీవితంలో కూడా విభిన్నంగా ఉంటుంది. సినిమాలపై స్పందన నుంచి సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తుంది స్వరా భాస్కర్. అయితే ఆమె ఎక్కువగా నెటిజన్ల మనోభావాలు దెబ్బతినే పోస్టులు, ట్వీట్లు పెట్టి ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది. తాజాగా మరొసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంది స్వరా భాస్కర్. 'మీ కష్టంతో వచ్చిన విజయాన్ని చూసి మిమ్మల్ని ఎవరైనా అభినందించాలని అనుకుంటే.. గత ఐదేళ్లుగా తలలో చెత్త పెట్టుకుని గడపరనుకుంటా.' అని ట్వీట్ చేసింది ఈ కాంట్రవర్సీ బ్యూటీ. అయితే ఈ ట్వీట్ 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రిని ఉద్దేశించి చేసిందని నెటిజన్స్ స్వరాపై మండిపడుతున్నారు. ట్వీట్లతో దుమ్మెత్తిపోస్తున్నారు. వరుసగా ట్రోలింగ్ చేస్తున్నారు. 'మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని అనుకుంటా స్వరా. ప్రజలు అడుగుతున్నారు.. తాము ఆదరిస్తున్న సినిమాను ఎందుకు ప్రముఖ బాలీవుడ్ తారలు మెచ్చుకునేలా ఒక్క పదం కూడా మాట్లాడట్లేదని. అంటే కేవలం ప్రముఖమైన వారు మాత్రమే. మీరు చిల్ అవ్వండి.' అని నెటిజన్ కామెంట్ చేశాడు. మరో యూజర్ 'స్వరా చాలా తెలివైనది. ఒకరి కష్టంపై పేరు సంపాందించుకోవడం ఎలానో తనకు చాలా బాగా తెలుసు. కానీ జనం పిచ్చోళ్లు కాదు. నిన్ను నమ్మడానికి. ఇది నీ కెరీర్‌కు సహాయపడదు.' అని రాసుకొచ్చాడు. If you want someone to congratulate you for the ‘success’ of your efforts.. maybe don’t spend the last five years shitting on their heads.. 💁🏾♀️ #justsaying — Swara Bhasker (@ReallySwara) March 13, 2022 మరొకరైతే 'అతను అభినందించడానికి అర్హుడు స్వరా. ఐదేళ్ల నుంచి బాలీవుడ్ దాదాపు ఐసీయూ బెడ్‌పై ఉంది. ఈరోజు బాలీవుడ్‌కు అతనే ఆక్సిజన్ అందించాడు. ప్రజలు మర్చిపోయిన మిమ్మల్ని అతనే గుర్తు చేశాడు.' అని రాశారు. కాగా మార్చి 11న విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ తారలు కంగనా రనౌత్, అక్షయ్ కుమార్, యామీ గౌతమ్, హన్సల్ మెహతా, ఆదిత్య ధర్ తదితరులు ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెచ్చిన ఈ చిత్రానికి హర్యాణా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వినోదపు పన్ను రాయితీని కల్పించాయి. He deserve to be Congratulated @ReallySwara Since 5 years Bollywood has almost in ICU Bed, Today he gave Oxygen for Bollywood.. You were deleted from people brain, he reminded.. If you not support him by thinking he's not Terrorists gang, then read comments@vivekagnihotri https://t.co/EOSyiB3jc3 — RaMesh Chauhan #BJP_Only (@RameshChauhanM) March 14, 2022 People are talking about big Bollywood stars .. U can chill..Nobody is expecting anything from you.. #TheKashmiriFiles https://t.co/WtX3whFLjn — Upadhya Dr 🇮🇳 (@LonelyStranger_) March 14, 2022 -
‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ఆర్జీవీ రివ్యూ, ఏమన్నాడంటే..
నిజ సంఘటన ఆధారం బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్రి హోత్రి ఇటీవల తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్స్‌కు మంచి స్పందన వస్తోంది. మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదలైన ఈమూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు కలేక్షన్ల వర్షం కూడా కురిపిస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు అంటే ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఈ మూవీ మరింత పాపులరిటీ తెచ్చుకుంది. ప్రధాని మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ పెద్దలు, పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా ట్వీట్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. చదవండి: యాంకర్ రష్మీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు, ఆమె కాల్ రికార్డు ఇంకా ఉంది ఈ సినిమా చూసిన ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాతో పేలుడు పదార్థాలు కంటే ఎక్కువగా ఫైర్ అయ్యారు. ఈ సినిమాతో బాలీవుడ్‌ని తొక్కేసి కొత్తగా వివేక్ వుడ్‌ని స్థాపించినట్టే. కొత్త సినిమా దర్శక నిర్మాతలకి స్ఫూర్తిగా నిలిచాడు వివేక్. ది కశ్మీర్ ఫైల్స్ కమర్షియల్ సక్సెస్‌ని పక్కన పెడితే అంతకంటే కూడా భారీ విజయం సాధించింది’ అంటూ ఆర్జీవీ ప్రశంసలు కురించిపించాడు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమాపై ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా హిందువులపై, 1980-90 దశకంలో కాశ్మీర్ పండిట్లపై జరిగిన మారణకాండని ఆధారంగా తీసుకొని ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాని తెరకెక్కించారు. జీ స్టూడియోస్, తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. చదవండి: ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ అసహనం Apart from the EXPLOSIVE material he so DARINGLY exposed , #VivekRanjanAgnihotri TRAMPLED BOLLYWOOD by CREATING his own VIVEKWOOD which will inspire a new BREED of revolutionary film makers and that’s the ULTIMATE victory more than #KashmirFiles humongous commercial success — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2022 -
రాధేశ్యామ్‌కు పోటీ ఇవ్వనున్న చిత్రం ఇదేనా !
Radhe Shyam Vs The Kashmir Files Box Office Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్'. రోమన్ కాలం నాటి రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలో ప్రేమించిన అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో.. ఆమెను దక్కించుకోవడం కోసం చేసే సాహసమే రాధేశ్యామ్ కథ. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. 'రాధేశ్యామ్' ఇండియాలో మొదటి వారంలో సుమారు రూ. 94.50 కోట్లు కొల్లగొట్టింది. అందులో ఒక్క తెలుగు రాష్టాల (తెలంగాణ/ఏపీ) నుంచి రూ. 78.64 కోట్లు సాధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్ల గ్రాస్ వసూలు చేసింది 'రాధేశ్యామ్'. చదవండి: అప్పుడే ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. కాకపోతే ప్రభాస్ పాపులారిటీ, సినిమా ప్రమోషన్స్‌తో విడుదలైన తొలిరోజు రూ. 46 కోట్లు కొల్లగొట్టింది 'రాధేశ్యామ్'. తర్వాత మిక్స్డ్ పబ్లిక్ టాక్‌తో రోజురోజూకీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గుతున్నాయి. శనివారం (మార్చి 12) రూ. 24. 50 కోట్లు వసూలు చేయగా ఆదివారం (మార్చి 13) రూ. 24 కోట్లు రాబట్టింది. ఈ కలెక్షన్లలో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 37.85 కోట్లతో విడుదలైన రోజు ప్రారంభం కాగా శనివారం రూ. 21.48 కోట్లు, ఆదివారం 19.31 కోట్లు వసూళ్లు సాధించింది. నిజానికి పెద్ద హీరోలంటే విడుదలైన రోజు కంటే తర్వాత రోజుల్లో కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ రాధేశ్యామ్ మాత్రం మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. #RadheShyam AP/TS Box Office Biz stays STRONG despite mixed response. Day 1 - ₹ 37.85 cr Day 2 - ₹ 21.48 cr Day 3 - ₹ 19.31 cr Total - ₹ 78.64 cr#Prabhas — Manobala Vijayabalan (@ManobalaV) March 14, 2022 చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ? ఇక అనేక వివాదాలు, బెదిరింపులు ఎదుర్కొని విడుదలైన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ చిత్రానికి సామాజిక అంశాలను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించే డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి పాపులర్ యాక్టర్స్ నటించిన ఈ చిత్రం 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణకాండకు అద్దం పడుతుంది. అదే మార్చి 11న విడుదలైన ఈ మూవీ సాధారణ కలెక్షన్లతో ప్రారంభమైంది. తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసలు కురుపించడంతో మంచి మౌత్ టాక్ సంపాదించుకుంది. దీంతో రోజు రోజుకీ ఈ సినిమా వసూళ్లు పెరిగిపోతున్నాయి. శుక్రవారం విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' మొదటి రోజు రూ. 3.55 కోట్లు రాబట్టగా, శనివారం రూ. 8.50 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత ఆదివారం ఒకేసారి భారీగా రూ. 15.10 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా మొదటి వారంలో ఈ మూవీ వసూళ్లు రూ. 27.15 కోట్లకు చేరుకున్నాయి. #TheKashmirFiles shows PHENOMENAL GROWTH… Grows 325.35% on Day 3 [vis-à-vis Day 1], NEW RECORD… Metros + mass belt, multiplexes + single screens, the *opening weekend biz* is TERRIFIC across the board... Fri 3.55 cr, Sat 8.50 cr, Sun 15.10 cr. Total: ₹ 27.15 cr. #India biz. pic.twitter.com/FsKN36sDCp — taran adarsh (@taran_adarsh) March 14, 2022 కలెక్షన్లతో పోల్చుకుంటే 'రాధేశ్యామ్'కు చాలా వెనకంజలో 'ది కశ్మీర్ ఫైల్స్' ఉంది. కానీ రెండు సినిమాలపై ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం 'రాధేశ్యామ్'ను 'ది కశ్మీర్ ఫైల్స్' కొద్దివరకైనా చేరుకునే అవకాశాలు లేకపోలేదని మూవీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా రెండు సినిమా కథలను మాత్రం పోల్చి చూడలేం. ఒకటి రొమాంటిక్ లవ్‌స్టోరీ అయితే మరొకటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అయితే ప్రభాస్ స్టార్డమ్, వరల్డ్‌వైడ్‌గా డార్లింగ్ ఉన్న పాపులారిటీని 'ది కశ్మీర్ ఫైల్స్' రీచ్ అవుతుందా ?.. లేదా బీట్ చేస్తుందా ? చూడాలి. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో -
ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ?
PM Narendra Modi Appreciates The Kashmir Files Movie Special Story: బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషిలు కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమాకు ప్రముఖ బీటౌన్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకూ 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే సినిమాతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించడంలో వివేక్ అగ్నిహోత్రి అస్సలు వెనుకాడరు. అలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిందే 'ది కశ్మీర్ ఫైల్స్'. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు హరియానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా తమవంతు సాయంగా పన్ను రాయితీని ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మరీ ఇంతలా ఆకట్టుకుంటున్నా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలో ఏముంది ? ఈ మూవీ కథేంటీ ? అనే సందేహం రాకుండా ఉండదు. ఆ సందేహం వచ్చిన ప్రేక్షకుల కోసమే 'సాక్షి' స్పెషల్ స్టోరీ. కశ్మీర్ పండిట్లపై సాముహిక హత్యాకాండ.. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా కథ 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండకు అద్దం పడుతుంది. కశ్మీర్ లోయలోని ఓ వర్గంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణ కాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలను వివస్త్రలుగా చేసి, సాముహిక మానభంగానికి ఒడిగట్టారు. ఆ లోయలో ఉండాలంటే మతం మారాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అడ్డుకున్న వారిని అడ్డుతొలగించుకుంటారు. వారి ఆస్తులను దోచుకున్నారు. ఎదురు తిరిగినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. తుపాకులు, కత్తులతో దారుణంగా దాడి చేశారు. పాకిస్తాన్ జిహాదీ మూకతో చేతులు కలిపి ఆకృత్యాలకు పాల్పడటం వారిని కలచివేసింది. ఈ దారుణమైన ఉదంతానికి పర్యవసానంగా సుమారు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్లు స్వదేశంలోనే శరణార్థులుగా మారారు. దీంతో వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. ఢిల్లీ పురవీధుల ఫుట్పాత్స్పై ఏళ్ల తరబడి జీవితాన్ని గడిపారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. బాధ్యతాయుత పౌరుడిగా తీశాను.. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేందుకు, సినిమా రూపంలో తెరకెక్కిచ్చేందుకు ఎంతో గుండె ధైర్యం ఉండాలి. వాస్తవ గాథలను చిత్రీకరిస్తున్నామని చెప్పి అనేకమంది దర్శకనిర్మాతలు వసూళ్ల కోసం కక్కుర్తితో రాజీ పడి రూపొందిస్తుంటారు. కానీ ఎలాంటి రాజీ లేకుండా తెరకెక్కించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ‘‘కశ్మీర్లో 1990వ దశకంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను ‘కశ్మీర్ ఫైల్స్’లో చూపించాం. కశ్మీర్లో జరిగిన అసలు సిసలైన వాస్తవాలు బయటకు రాలేదు. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను.. నాలుగేళ్లపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను. మా చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి.’’ అని హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. ‘‘గడిచిన 30 ఏళ్లల్లో ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి కథను ఎవరూ తీయలేదు’’ అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. సినిమా చూసి కంటతడి పెట్టిన మహిళ.. అయితే మన దేశంలోని కశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఈ అత్యంత భయానకమైన ఘటనను వెండితెరపై ఆవిష్కరించడం అంత సులువుకాదు. దర్శకనిర్మాతలకు ఈ సినిమా రూపొందించడం నల్లేరుపై నడకల జరగలేదు. 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ఈ చిత్రాన్ని ఆపేయమని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఈ మూవీని అడ్డుకోవడానికి కోర్టులో వ్యాజ్యాలు సైతం వేశారు. ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి 'ది కశ్మీర్ ఫైల్స్'ను ఉన్నది ఉన్నట్లుగా నటీనటుల సహకారంతో వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ప్రతీ సన్నివేశం, నటీనటుల భావోద్వేగపు యాక్టింగ్ ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెటర్ సురేష్ రైనా తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక మహిళ వివేక్ పాదాలు తాకడం, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ బిగ్గరగా ఏడవడం మనం చూడొచ్చు. అనంతరం డైరెక్టర్ వివేక్, నటుడు దర్శన్ కుమార్ ఆ మహిళను ఓదార్చారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి డైరెక్టర్, దర్శన్ కుమార్ సైతం కంటతడి పెట్టుకున్నారు. ప్రేక్షకుల నీరాజానలు అందుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదలు కాగా మన దేశంలో 561 థియేటర్లలో, ఓవర్సీస్లో 113 స్క్రీన్స్‌లలో ప్రదర్శించబడుతోంది. Presenting #TheKashmirFiles It’s your film now. If the film touches your heart, I’d request you to raise your voice for the #RightToJustice and heal the victims of Kashmir Genocide.@vivekagnihotri @AnupamPKher @AdityaRajKaul pic.twitter.com/Gnwg0wlPKU — Suresh Raina🇮🇳 (@ImRaina) March 11, 2022 -
ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన సినిమా ఇదే..
Prime Minister Narendra Modi Appriciates The Kashmir Files Movie Team: సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించే దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఇదివరకు ఆయన తెరకెక్కించిన 'ది తాష్కెంట్ ఫైల్స్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమాలో బాలీవుడ్ పాపులర్ నటులైన అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలకపాత్రల్లో నటించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టగా.. విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఇటీవలే హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపును కూడా ప్రకటించాయి. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ అయితే తాజాగా 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రబృందం శనివారం (మార్చి 12) ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆ సినిమాను, మూవీ యూనిట్‌ను అభినందించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఆయ ప్రశంసించడం, దాని గొప్పతనం గురించి చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. మేము ఆ చిత్రాన్ని నిర్మించడంలో ఎప్పుడూ గర్వపడలేదు. ధన్యవాదాలు మోదీజీ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ప్రేక్షకులతో పంచుకున్నారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. I am so glad for you @AbhishekOfficl you have shown the courage to produce the most challenging truth of Bharat. #TheKashmirFiles screenings in USA proved the changing mood of the world in the leadership of @narendramodi https://t.co/uraoaYR9L9 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 12, 2022 -
డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
A Women Cried After Watching The Kashmir Files Movie: సామాజిక అంశాలను తన సినిమాలతో వేలెత్తి చూపే బాలీవుడ్ దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో రూపొందింది ఈ సినిమా. ఈ సినిమా మార్చి 11న విడుదలై ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చింది హర్యానా ప్రభుత్వం. హర్యానా ప్రభుత్వపు అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 'ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాకు హర్యానా ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తుంది' అని ట్వీట్ చేసింది. हरियाणा सरकार ने फिल्म #TheKashmirFiles को राज्य में टैक्स फ्री कर दिया है। #Haryana #DIPRHaryana pic.twitter.com/Zg8XWC8OoV — DPR Haryana (@DiprHaryana) March 11, 2022 बहुत आभार माननीय @mlkhattar जी। corona काल की आर्थिक समस्याओं के बाद सामान्य परिवारों को यह फ़िल्म देखने में आपका यह निर्णय काफ़ी मदद करेगा। साथ ही सिनेमा हॉल का व्यवसाय भी मज़बूती पकड़ेगा। 🙏🙏🙏 https://t.co/VNZNqcai9U — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 11, 2022 ఈ విషయంపై మూవీ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి స్పందించారు. తన సినిమాకు పన్ను మినహాయింపు చేసినందుకు హర్యానా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెటర్ సురేష్ రైనా తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక మహిళ వివేక్ పాదాలు తాకడం, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ బిగ్గరగా ఏడవడం మనం చూడొచ్చు. అనంతరం డైరెక్టర్ వివేక్, నటుడు దర్శన్ కుమార్ ఆ మహిళను ఓదార్చారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి డైరెక్టర్, దర్శన్ కుమార్ సైతం కంటతడి పెట్టుకున్నారు. Presenting #TheKashmirFiles It’s your film now. If the film touches your heart, I’d request you to raise your voice for the #RightToJustice and heal the victims of Kashmir Genocide.@vivekagnihotri @AnupamPKher @AdityaRajKaul pic.twitter.com/Gnwg0wlPKU — Suresh Raina🇮🇳 (@ImRaina) March 11, 2022 -
నిజ సంఘటనల ఆధారంగా ‘కశ్మీర్ ఫైల్స్’
‘‘కశ్మీర్లో 1990వ దశకంలో హిందూ పండితులను టార్గెట్ చేసి టెర్రరిస్టులు ఊచకోత కోశారు. అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను ‘కశ్మీర్ ఫైల్స్’లో చూపించాం. మా చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి’’ అని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ నటించిన చిత్రం ‘కశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి నిర్మించిన ఈ హిందీ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..‘‘కశ్మీర్లో జరిగిన అసలు సిసలైన వాస్తవాలు బయటకు రాలేదు. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను.. నాలుగేళ్లపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను’’ అన్నారు. ‘‘గడచిన 30 ఏళ్లల్లో ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి కథను ఎవరూ తీయలేదు’’ అన్నారు అభిషేక్ అగర్వాల్. ‘‘మాపై నమ్మకంతో సినిమా విడుదలకు సహకరిస్తున్న తేజ్ నారాయణ్, అభిషేక్‌లకు థ్యాంక్స్’’ అన్నారు పల్లవి జోషి. నటుడు దర్శన్ కుమార్, బీజేపీ నాయకుడు రామచంద్రరావు, పరిపూర్ణానంద స్వామి తదితరులు మాట్లాడారు. -
భావోద్వేగంగా 'ది కశ్మీర్ ఫైల్స్' ట్రైలర్.. కంగనా ప్రశంసలు
The Kashmir Files Movie Trailer Out And Released In March: అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలకపాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. 'ది తాష్కెంట్ ఫైల్స్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ సోమవారం (ఫిబ్రవరి 21) విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, భావోద్వేగంగా ఉంది మూవీ ట్రైలర్. 1990 సంవత్సరంలో కశ్మీర్‌లోని ఒక సామాజిక వర్గంపై జరిగిన హత్యలను డైరెక్టర్ వివేక్ భావోద్వేగంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌పై బాలీవుడ్ డేరింగ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. సినిమాను చాలా బాగా తీశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోందని, ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
షూటింగ్లో కుప్పకూలిన నటుడు
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో బాలీవుడ్ విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తి నటిస్తోన్న చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. అయితే తాజాగా షూటింగ్లో నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పి కారణంగా ఆరోగ్యం క్షీణించి షూటింగ్లో కుప్పకూలిపోయాడు. దీంతో సడెన్‌గా చిత్రీకరణను నిలిపి వేశారు. ఈ మేరకు డైరెక్టర్ వివేక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మిథున్ పాత్రపై పెద్ద యాక్షన్ సన్నివేశం కోసం షూట్ చేస్తున్నాం. ఈ క్రమంలో మిథున్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా కళ్లు తిరిగి పడిపోయాడు. సాధారణంగా ఏ వ్యక్తి కూడా ఆ పరిస్థితుల్లో కనీసం నిల్చోలేరు. కానీ మిథున్ కొద్దిసేపు తీసుకొని విశ్రాంతి మళ్లీ వచ్చి షూట్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా షూట్ చేస్తారని నేను అస్సలు ఉహించలేను. కానీ మిధున్ చేశాడు. అందుకే అతను సూపర్ స్టార్ అయ్యాడు. చదవండి: మిథున్ చక్రవర్తి కొడుకుపై అత్యాచారం కేసు తన నాలుగు దశబ్దాల కెరీర్లో ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదని ఇటీవల మిథున్ నాకు చెప్పాడు. మీ షూటింగ్ నా వల్ల ఆగిపోలేదు కదా అని నన్ను అడిగే వాడు. నాకు నిజంగా ఆశ్యర్యం వేస్తోంది. ఎందుకంటే ఇంతటి అంకితభావంతో పనిచేసేవాళ్లను ఈ తరం నటుల్లో ఎవర్ని చూడలేదు. మిథున్చాలా కష్టజీవి. ప్రతిరోజు షూట్‌కు వచ్చినప్పుడు అందరిని ఆప్యాయంగా పలకరిస్తాడు. తన పని తాను వేగంగా చేస్తాడు. మిథున్ చక్రవర్తి లాంటి నటుడు ఉండటం ఏ మూవీ యూనిట్‌కైనా ఆస్తి వంటింది.’ అని వివేక్ పేర్కొన్నారు. కశ్మీరీ హిందువుల దుస్థితి గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ‘కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఒక చిన్న మెట్టులాగా ఉపయోగపడుతుందని వివేక్ అభిప్రాయపడ్డారు. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ 2021 లో విడుదల కానుంది. -
దేశంలో ఏం జరుగుతుందో యువత తెలుసుకోవాలి
‘‘కశ్మీరీ హిందువుల మారణహోమం, హత్య లు, వాళ్లపై సాగిన క్రూరత్వం గురించి ఎవ్వరూ సినిమా తీయలేదు. ఆ కథ అందరికీ తెలియ జేయాలనుకున్నా’’ అన్నారు బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ‘ద కశ్మీర్ ఫైల్స్’ పేరుతో ఆయన ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఉన్న లక్ష్మీ దేవి ఆలయాన్ని సందర్శించారు వివేక్. ఆ తర్వాత ఈ సినిమాకు మద్దతు తెలుపుతున్నవారితో సమావేశమయ్యారు. ‘‘దేశంలో ఏం జరుగుతుందో యువత తెలుసుకోవాలి. బయటకు వెల్లడికాని కశ్మీరీ పండిట్ల కథ వాళ్లు తెలుసుకోవాలి. ఈ విషయంపై బాగా పరిశోధన చేశా. అందుకే స్క్రిప్ట్ పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది. ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. సినిమా పూర్తయ్యాక ఈ సబ్జెక్ట్‌పై పుస్తకం రాయాలనుకుంటున్నాను’’ అన్నారు వివేక్ అగ్నిహోత్రి. నిర్మాతలు అనిల్ సుంకర, టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకు మద్దతు తెలిపారు. -
ఆర్టికల్ 370 కథ
కాశ్మీర్ వ్యాలీ చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో రూపొందనున్న చిత్రం ‘కాశ్మీర్ ఫైల్స్’. ‘ది తాష్కెంట్ ఫైల్స్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించనున్నారు. అభిషేక్ మాట్లాడుతూ– ‘‘ఆర్టికల్ 370 చుట్టూ అల్లిన కథతో ఈ చారిత్రాత్మక సినిమా ఉంటుంది. ఆర్టికల్ 370 ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు రద్దు చేశారు? అనే కారణాలను మా చిత్రంలో చూపించబోతున్నాం. ఈ చరిత్రలో భాగమైన ఎంతోమంది లెజెండ్స్ పాత్రల్లో ప్రముఖ నటులు నటిస్తారు. ఆ వివ రాలు త్వరలోనే తెలియజేస్తాం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14, 2020న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
నోటీసులు అందాయి
‘హార్న్ ఓకే ప్లీజ్’ (2008) సినిమా సెట్లో నటుడు నానా పటేకర్, ‘చాక్లెట్’ సినిమా సెట్లో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించారని నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపారు. ‘‘తన పట్ల వివేక్ అగ్నిహోత్రి అమర్యాదగా ప్రవర్తించారన్న తనుశ్రీ మాటల్లో వాస్తవం లేదు. పబ్లిసిటీ లేదా వ్యక్తిగత లబ్ధి కోసమే ఆమె ఇలా చేస్తున్నారు’’ అన్నది ఆ నోటీసుల సారాంశమట. ‘‘నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి నాకు గురువారం నోటీసులు వచ్చాయి. వేధింపులు, అవమానం, అన్యాయాలకు నోరు విప్పితే ఇక్కడ ఇలాంటి బహుమతులు వచ్చాయి. నానా, వివేక్ బృందాలు నాపై బురద చల్లడానికి అసత్యాలు మాట్లాడుతున్నారు’’ అని తను శ్రీ ఆవేదన వ్యక్తం చేశారని బాలీవుడ్లో తాజాగా కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. ‘‘ఎప్పుడో పదేళ్ల క్రితం నాటి సంఘటనను ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. నానా పటేకర్ చాలా మంచి వ్యక్తి’’ అని ముంబై మంత్రి ఒకరు ఫోన్లో తనుశ్రీతో సంభాషించారని వార్తలు వస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ ఫ్రీదా పింటో కూడా తనుశ్రీకి మద్దతు తెలిపారు. -
నానా పటేకర్ నుంచి నోటీసులు అందాయ్..
ముంబై : పదేళ్ల కిందట సినిమా సెట్స్‌లో తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసినందుకు తనుశ్రీ దత్తాకు నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి బుధవారం లీగల్ నోటీసులు అందాయి. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ అనే సినిమా సెట్లో ఓ డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా నానా పటేకర్ తనతో అసభ్యంగా వ్యవహరించారని, దీనిపై తాను గొంతెత్తగా తనపై మహారాష్ట్ర నవ్‌నిర్మాణ సేన కార్యకర్తలను ఉసిగొల్పారని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరో సందర్భంలో దర్శకుడు వివేక్ తన దుస్తులు తొలగించాలని కోరారని ఆమె ఆరోపించారు. తనకు నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి లీగల్ నోటీసులు అందాయని దేశంలో వేధింపులు, అణిచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తనుశ్రీ దత్తా ఆవేదన వ్యక్తం చేశారు. వారి (నానా పటేకర్, వివేక్) మద్దతుదారులు తనపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారని అన్నారు. తన ఇంట్లోకి చొచ్చుకువచ్చేందుకు ఇద్దరు ఆగంతకులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారన్నారు. ఎంఎన్ఎస్ పార్టీ తనకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్ధానాలకు లాగడం ద్వారా వ్యయప్రయాసలకు లోనుచేస్తున్నారని, తప్పుడు సాక్ష్యాలతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కోర్టు కేసులు ఎలాంటి ముగింపు లేకుండా దశాబ్ధాల పాటు సాగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తాను తనుశ్రీ దత్తాను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని నానా పటేకర్ తనపై ఆరోపణలను తోసిపుచ్చారు. సెట్‌పై 50 మంది వ్యక్తులున్నారని, ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. పరువు నష్టం దావా సహా ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నానా పటేకర్ న్యాయవాది రాజేంద్ర శిరోడ్కర్ చెప్పారు. -
మరో బాంబు పేల్చిన తనుశ్రీ
ముంబై: ఆషిక్ బనాయా అప్నేతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తనుశ్రీ దత్తా పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి మరోసారి గళం విప్పారు. 2009లో వచ్చిన ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ బుధవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై కూడ ఆమె అలాంటి ఆరోపణలే చేశారు. ‘చాకోలెట్’ సినిమా షూటింగ్ సమయంలో వివేక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ( చదవండి :నానా పటేకర్ నన్ను వేధించాడు : తనుశ్రీ దత్తా ) ‘చాకోలెట్’ సినిమా షూటింగ్ సమయంలో హీరో ఇర్ఫాన్ఖాన్పై క్లోజప్ షాట్ తీయాల్సి ఉండగా.. అనవసరంగా నన్ను డైరెక్టర్ వివేక్ టార్గెట్ చేశాడని అన్నారు. సీన్లో నా అవసరం లేకున్నా.. ఇర్ఫాన్ ఎదురుగా డ్యాన్స్ చేయాలని అసభ్య పదజాలంతో చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు. డైరెక్టర్ మాటలతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. అసభ్యంగా మాట్లాడిన వివేక్‌పై ఇర్ఫాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని వెల్లడించారు. ‘నాకు యాక్టింగ్ వచ్చు.. ఆమెను ఇబ్బంది పెట్టొద్దు’అని ఇర్ఫాన్ తనకు మద్దతుగా నిలిచాడని తనుశ్రీ గుర్తుచేసుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో నటుడు సునీల్ శెట్టి కూడా సెట్లో ఉన్నాడని ఆమె తెలిపారు. తనుశ్రీ తెలుగులో వీరభద్ర సినిమాలో బాలయ్య సరసన నటించారు. ( ‘అది చెప్పినందుకే.. సినిమా అవకాశాలు రాలేదు’ ) -
నిట్‌కు బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రాక..?
కాజీపేట అర్బన్ : బాలీ వుడ్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి ఆగస్టు 2వ తేదీన కాజీపేటలోని నిట్‌కు రానున్నట్లు సమాచారం. నిట్‌లో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండు వారాల ఇండక్షన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రేరణ కల్పించేందుకు వివేక్ అగ్నిహోత్రి హాజరుకానున్నట్లు తెలిసింది. జిద్, హేట్‌స్టోరీ, చాక్లెట్ వంటి పలు చిత్రాలతో ఆయన సత్తా చాటారు. -
మగవాళ్లను కూడా పడక గదికి రమ్మంటున్నారు
సాక్షి, ముంబై : దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి(హేట్‌స్టోరీ ఫేమ్) వ్యాఖ్యలు బాలీవుడ్లో కలకలం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో మహిళలపై మాత్రమే కాదని.. మగవాళ్లపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. తన బంధువుల అబ్బాయి ఒకరు అమెరికా నుంచి బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు వచ్చాడని.. అతన్ని ఓ స్టార్ హీరో, దర్శకనిర్మాతకు పరిచయం చేశానని... అయితే వారు అతన్ని లైంగికంగా వేధించారని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై ఓ మీడియా ఛానెల్ ఆయన్ని సంప్రదించగా ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బాలీవుడ్లో హర్వే వెయిస్టెన్‌లను వెతికి తీస్తే అగ్ర హీరోలు, డైరెక్టర్లు బయటపడతారు. నా బందువు అలాంటి వాళ్ల చేతిలో నలిగిపోయిన బాధితులే. వారికి వ్యతిరేకంగా పోరాడే ధైర్యం ఎవరికీ లేదు. అందుకు బోలెడంత మంది కంగనా రనౌత్‌లు ధైర్యంగా ముందుకు రావాల్సి ఉంటుంది’ అని వివేక్ పేర్కొన్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో రాజకీయాలు మూడు రకాలుగా సాగుతున్నాయని.. లైంగికంగా, డబ్బు, అధికారం ఇలాంటి మూడింటితో అవకాశాల కోసం వచ్చేవారిని వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. ‘అవకాశాల కోసం పడకగదికి రమ్మంటున్నారు. లేదా డబ్బులు ఇమ్మని అడుగుతున్నారు. ఇవేం కుదరకపోతే ఊడిగం చేయించుకుంటున్నారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కొందరు వారికి లొంగిపోతున్నారు’ అని వివేక్ వ్యాఖ్యానించారు. మీటూ ఉద్యమం కేవలం మహిళలకు మాత్రమే సొంతం కాకూడదని.. మగవాళ్లు కూడా ఇండస్ట్రీలో జరిగే ఆరాచకాలను బయటపెట్టినప్పుడే దానికి న్యాయం జరుగుతుందని వివేక్ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. -
సినిమా వివాదం.. యువతులపై లైంగిక వేధింపులు!
కోల్ కతా: సినిమా షూటింగ్ వివాదానికి తెరతీసింది. ఆపై యువతులపై లైంగిక వేధింపుల వరకు ఘటన వెళ్లింది. పశ్చిమబెంగాల్ లోని జాదవపూర్ యూనివర్సిటీకి చెందిన ఏబీవీపీ, లెఫ్ట్ వింగ్ మద్ధతుదారుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఏబీవీపీ సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ మూవీ 'బుద్ధా ఇన్ ఏ ట్రాఫిక్ జామ్' వివాదాస్పదమైంది. జాదవపూర్ వర్సిటీలో శుక్రవారం రాత్రి ఈ డైరెక్టర్ కు నల్లజెండాలతో నిరసన తెలిపడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోవాలని వామపక్ష వర్గానికి చెందినవారు నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఏబీవీపీ మూవీ యూనిట్ కు మద్ధతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తనపై కూడా దాడి జరిగిందని, తనపై కొందరు చెయ్యి చేసుకున్నారని డైరెక్టర్ అగ్నిహోత్రి ఆరోపించారు. ఇరువర్గాల మద్ధతుదారుల గొడవ మహిళలపై అసభ్యప్రవర్తను దారితీసింది. ప్రత్యర్థివర్గానికి చెందిన యువతులపై దురుసుగా ప్రవర్తించారని పోలీసులు చెబుతున్నారు. బీజేపీకి సపోర్ట్ చేసే అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో నటించడం కూడా వివాదానికి ఓ కారణమని పోలీసులు భావిస్తున్నారు. జేఎన్‌యూ వివాదంలో ఖేర్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ఆందోళనకు దిగారని వామపక్షాలపై ఏబీవీపీ సంఘాలు ఆరోపించాయి. అయితే దర్శకుడు, ఆ చిత్ర యూనిట్ పై తమకు ఎలాంటి కోపంలేదని.. అయితే మూవీ కథాంశంపైనే తమకు అభ్యంతరాలున్నాయని వామపక్ష సంఘాలు పేర్కొన్నాయి. నలుగురు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులు జరిగినట్లు వర్సిటీలో ప్రచారం జరుగుతోందని, తన వద్దకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని వైస్ చాన్సలర్ సురంజన్ దాస్ తెలిపారు.