వార్‌లో సప్తమి | Sapthami Gowda is all set for Hindi debut in Vivek Agnihotri The Vaccine War | Sakshi
Sakshi News home page

వార్‌లో సప్తమి

Published Sun, Jan 15 2023 5:47 AM | Last Updated on Sun, Jan 15 2023 5:47 AM

Sapthami Gowda is all set for Hindi debut in Vivek Agnihotri The Vaccine War - Sakshi

‘ది కశ్మీరీ ఫైల్స్‌’ వంటి సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ తర్వాత దర్శకుడు వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’. కోవిడ్‌ 19 పరిస్థితులు, దేశంలోని వ్యాక్సిన్‌ డ్రిల్స్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కన్నడ హిట్‌ ‘కాంతార’ ఫేమ్‌ హీరోయిన్‌ సప్తమి గౌడ జాయిన్‌ అయ్యారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణలో సప్తమి పాల్గొంటున్నారు. ఐయామ్‌ బుద్ధ ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘వ్యాక్సిన్‌ వార్‌’ సినిమాను నిర్మిస్తుండటంతో పాటు ఇందులో నటిస్తున్నారు పల్లవీ జోషి. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, మరాఠీ, అస్సామీ భాషలతో సహా ఈ సినిమాను మరికొన్ని భాషల్లో విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement