భావోద్వేగంగా 'ది కశ్మీర్​ ఫైల్స్'​ ట్రైలర్​.. కంగనా ప్రశంసలు | The Kashmir Files Movie Trailer Out And Released In March | Sakshi
Sakshi News home page

The Kashmir Files Movie: భావోద్వేగంగా 'ది కశ్మీర్​ ఫైల్స్'​ ట్రైలర్​.. కంగనా ప్రశంసలు

Published Mon, Feb 21 2022 5:01 PM | Last Updated on Mon, Feb 21 2022 5:04 PM

The Kashmir Files Movie Trailer Out And Released In March - Sakshi

The Kashmir Files Movie Trailer Out And Released In March: అనుపమ్​ ఖేర్, మిథున్​ చక్రవర్తి, దర్శన్​ కుమార్, పల్లవి జోషి కీలకపాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'ది కశ్మీర్​ ఫైల్స్​'. 90వ దశకంలో కశ్మీర్​ పండిట్​లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. 'ది తాష్కెంట్​ ఫైల్స్'​ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్​ వివేక్​ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్​ సోమవారం (ఫిబ్రవరి 21) విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, భావోద్వేగంగా ఉంది మూవీ ట్రైలర్​. 

1990 సంవత్సరంలో కశ్మీర్​లోని ఒక సామాజిక వర్గంపై జరిగిన హత్యలను డైరెక్టర్​ వివేక్​ భావోద్వేగంగా చూపించనున్నట్లు తెలుస్తోంది.​ ఈ చిత్రం ట్రైలర్​పై బాలీవుడ్​ డేరింగ్​ హీరోయిన్​ కంగనా రనౌత్​ ప్రశంసలు కురిపించింది. సినిమాను చాలా బాగా తీశారని ట్రైలర్​ చూస్తే అర్థమవుతోందని, ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. 'ది కశ్మీర్ ఫైల్స్'​ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement