Kashmir Files Ott Release Date And Platform Details In Telugu - Sakshi
Sakshi News home page

The Kashmir Files: ఓటీటీలో కశ్మీర్‌ ఫైల్స్‌, ఎప్పుడు, ఎక్కడంటే?

Published Tue, Apr 26 2022 7:55 AM | Last Updated on Tue, Apr 26 2022 10:37 AM

Vivek Agnihotri The Kashmir Files Premiering 13th May on ZEE 5 - Sakshi

థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ఓటీటీని షేక్‌ చేసేందుకు రెడీ అయింది. తాజాగా కశ్మీర్‌ ఫైల్స్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది చిత్రయూనిట్‌. జీ 5లో మే...

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ది కశ్మీర్‌ ఫైల్స్‌. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీని షేక్‌ చేసేందుకు రెడీ అయింది.

తాజాగా కశ్మీర్‌ ఫైల్స్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది చిత్రయూనిట్‌. జీ 5లో మే 13 నుంచి ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కశ్మీర్‌ ఫైల్స్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలిపిం. మొత్తానికి ఈ సినిమాను మరోసారి చూసే ఛాన్స్‌ దొరికిందంటూ సంబరపడిపోతున్నారు సినీప్రియులు.

చదవండి: పోలీసులు ఘోరంగా అవమానించారు, కాలర్‌ పట్టుకుని..

Shahid Kapoor: నాకెప్పటికీ ఆ స్కూల్‌ డేస్‌ అంటే ఆసహ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement