69 ఏళ్ల వయసులో సాహసం.. ఓటీటీకి రియల్‌ స్టోరీ! | Bollywood Actor Anupam Kher Latest Film Streaming On This OTT | Sakshi
Sakshi News home page

Anupam Kher: ఓటీటీకి వచ్చేస్తోన్న విజయ్ 69.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Mon, Oct 14 2024 3:43 PM | Last Updated on Mon, Oct 14 2024 3:50 PM

Bollywood Actor Anupam Kher Latest Film Streaming On This OTT

ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం విజయ్ 69. ఓ క్రీడాకారుని నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై మనీశ్ శర్మ నిర్మించారు. ఈ చిత్రానికి అక్షయ్ రాయ్ దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. వచ్చేనెల 8 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ అధికారికంగా ప్రకటించింది. 69 ఏళ్ల వ్యక్తి ట్రయాత్లాన్ కోసం శిక్షణ పొందడం, జీవితంలోని సవాళ్లను ఎలా అధిగమించాడనేదే కథ.

విజయ్ 69 కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువని అనుపమ్ ఖేర్ అన్నారు. ఇది అభిరుచి, పట్టుదల, అచంచలమైన మానవ స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. మన కలలను సాకారం చేసుకోవడానికి వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదనే నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుందని వెల్లడించారు. విజయ్ 69 అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement