Rashmika Mandanna Movie Mission Majnu Direct Release On OTT Netflix In January, Deets Inside - Sakshi
Sakshi News home page

Mission Majnu In OTT: నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న 'మిషన్ మజ్ను' చిత్రం.. ఎక్కడో తెలుసా?

Published Tue, Dec 13 2022 6:34 PM | Last Updated on Tue, Dec 13 2022 7:24 PM

Rashmika Mandanna Movie Mission Majnu Released On Netflix In January 20 - Sakshi

దక్షిణాదిలో ఓ రేంజ్‌లో స్టార్‌డమ్ ‍సంపాదించుకున్ననటి రష్మిక మందన్నా. ఈ భామ బాలీవుడ్‌లో‌ మిషన్‌ మజ్ను అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సిద్ధార్థ్‌ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. షంతను బాగ్చీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు వెల్లడించారు. 1970ల నాటి కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రా ఏజెంట్‌గా సిద్ధార్థ్ మల్హోత్రా కనిపించనున్నారు. ఈ సినిమాను రోనీ స్క్రూవాలా, అమర్‌ బుటాలా, గరిమ మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడుతూ వచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement