Anupam Kher
-
ప్రభాస్ చిత్రంలో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు.. డైరెక్టర్ ఎవరంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ది రాజాసాబ్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది కల్కి 2898తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ మారుతి డైరెక్షన్లో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు.ది రాజాసాబ్‌లో ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో పని చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బాహుబలి ప్రభాస్‌తో నా 544వ చిత్రం చేయడం ఆనందంగా ఉందని అనుపమ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, డైరెక్టర్‌తో హను రాఘవపూడితో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా.. అనుపమ్ ఖేర్ బాలీవుడ్లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో మరింత ఫేమస్ అయ్యారు. ANNOUNCEMENT: Delighted to announce my 544th untitled film with the #Bahubali of #IndianCinema, the one and only #Prabhas ! The film is directed by the very talented @hanurpudi ! And produced by wonderful team of producers of @MythriOfficial ! My very dear friend and brilliant… pic.twitter.com/sBIXCS98t6— Anupam Kher (@AnupamPKher) February 13, 2025 -
స్నేహితుడు పోయిన దుఃఖంలో నటుడు.. 'ఆ వెధవ ఆత్మకు శాంతి దొరక్కూడదు'
ప్రముఖ నిర్మాత ప్రతీశ్ నంది (73) బుధవారం కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాలు నిర్మించిన ఈయన ఒకప్పుడు ప్రముఖ జర్నలిస్టు కూడా! ప్రతీశ్ మరణం పట్ల ఆయన స్నేహితుడు, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.స్నేహితుడి మరణం బాధాకరంనా ప్రియమైన మిత్రుడు ప్రితీశ్ (Pritish Nandy) మరణవార్త నన్నెంతగానో కలిచివేసింది. అద్భుతమైన కవి, రచయిత, నిర్మాత.. అలాగే ధైర్యవంతుడైన జర్నలిస్ట్ కూడా! ముంబైలో అడుగుపెట్టిన కొత్తలో నాకెంతో సపోర్ట్‌గా నిలబడ్డాడు. మేము ఎన్నో విషయాలను పంచుకునేవాళ్లం. దేనికీ జంకకుండా ఎంతో ధైర్యంగా ఉండేవాడు. తన దగ్గరి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. మిస్ అవుతున్నా..ఒకప్పుడు తను, నేను వేరు కాదు అన్నట్లుగా ఉండేవాళ్లం. కానీ రానురానూ కలుసుకోవడమే తగ్గిపోయింది. మనం కలిసున్న రోజుల్ని మిస్ అవుతున్నా.. నిన్ను కూడా ఎంతో మిస్ అవుతున్నా ఫ్రెండ్.. ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ గుండె ముక్కలైన ఎమోజీతో ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు. అనుపమ్ ఖేర్ (Anupam Kher).. ప్రతీశ్ను అంతలా పొగడం నటి నీనా గుప్తాకు ఏమాత్రం నచ్చినట్లు లేదు. (చదవండి: నేను చేసిన పెద్ద తప్పు అదే!: కంగనా రనౌత్)బుద్ధి తక్కువ వెధవనా విషయంలో అతడేం చేశాడో తెలుసా? తను చేసిన పనికి ఆగ్రహం పట్టలేక అందరిముందే అతడిని బుద్ధి తక్కువ వెధవ అని తిట్టాను. నా బిడ్డ బర్త్ సర్టిఫికెట్ దొంగిలించి దాన్ని మీడియాలో పబ్లిష్ చేశాడు. ఇందుకు సంబంధించిన సాక్ష్యం ఇప్పటికీ నా దగ్గరుంది. అందుకే అతడి ఆత్మకు శాంతి దొరకాలని నేను కోరుకోను అని కామెంట్ చేసింది. అయితే తర్వాత ఆ కామెంట్‌ను నీనా (Neena Gupta) డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.ఆమె అనుమతి లేకుండా దొంగిలించి మరీ..ఇకపోతే ప్రితీశ్ నంది జర్నలిస్టుగా ఉన్న సమయంలో నీనా గుప్తా కూతురు మసాబా బర్త్ సర్టిఫికెట్ దొంగిలించి సమాచారం లీక్ చేశాడు. దీని ఆధారంగా నీనా- క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ సంతానమే మసాబా అని జనాలకు తెలిసిపోయింది. పెళ్లితో సంబంధం లేకుండా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నప్పుడే మసాబాకు పేరెంట్స్ అయ్యారని విస్తృతమైన చర్చ జరిగింది.ప్రితీశ్ నంది విషయానికి వస్తే..కుచ్ కట్టి కుచ్ మీఠి, బాలీవుడ్ కాలింగ్, ముంబై మ్యాట్నీ, చమేలి, జస్ట్ మ్యారీడ్, ధీమె ధీమె, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, అగ్లీ ఔర్ పాగ్లీ, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలను ప్రితీశ్ నిర్మించారు. జర్నలిస్టుగానూ పలు సంస్థల్లో పని చేశారు. 1977లో పద్మశ్రీ, 2008లో కర్మవీర్ పురస్కార్, 2012లో ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ అవార్డులు అందుకున్నారు. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) చదవండి: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ని వదలని సినిమా కష్టాలు! -
40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే పాన్ ఇండియా స్టార్
సామాన్యుడు నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైనా సరే డబ్బుంటే ఇల్లు లేదా నగలు కొనుక్కోవాలని చూస్తాడు. ఎందుకంటే భవిష్యత్తు కోసం భరోసా అని చెబుతాడు. కానీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాత్రం అసలు సొంతిల్లు ఎందుకు కొనుక్కోవాలి అని వింత లాజిక్ చెబుతున్నాడు. కావాలంటే అద్దె ఇంట్లోనే ఉంటానని ఖరాఖండీగా చెబుతున్నాడు.ఖేర్ ఏమన్నాడంటే?'సొంతంగా ఇల్లు కొనకూడదని ఫిక్సయ్యా. అందుకే ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. అయినా ఎవరి కోసం ఇల్లు కొనాలి? ఆ ఇంటికి ఖర్చు పెట్టే డబ్బుని ప్రతినెలా బ్యాంకులో దాచుకుని, కొంత డబ్బుతో ప్రతినెలా అద్దెకడితే సరిపోతుందిగా! భవిష్యత్తులో ఆస్తుల పంపకంలో పిల్లల మధ్య గొడవలు రావొచ్చు. అందుకే ఆస్తులు కొనే డబ్బుని దాచిపెట్టి, దానినే సమంగా పంచితే సరిపోతుంది. అప్పుడు ఏం ఇబ్బంది ఉండదు'(ఇదీ చదవండి: కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)'మంచి సినిమాలు చేస్తున్న టైంలో తనకోసం ఓ ఇల్లు కొనివ్వమని అమ్మ కోరింది. దీంతో ఓ హౌస్ కొనిచ్చాను. నాన్న ఉన్నప్పుడు మేం అక్కడే ఉండేవాళ్లం. ఆ చనిపోయిన తర్వాత సిమ్లాలో ఉన్నది తక్కువే. అందుకే ఆమె అక్కడ ఇల్లు కావాలని కోరింది. సింగిల్ బెడ్రూమ్ చాలాని చెప్పింది గానీ 8 బెడ్రూమ్స్ ఉన్న ఇంటిని బహుమతిగా ఇచ్చాను. నా భార్యకు ఇలా ఎందుకు ఇచ్చానో చాలారోజుల తర్వాత అర్థమైంది' అని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చాడు.హిందీ సినిమాల్లో సహాయ పాత్రలు, లీడ్ రోల్స్.. ఇలా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అనుపమ్ ఖేర్.. తెలుగు నుంచి వచ్చిన కార్తికేయ 2, టైగర్ నాగేశ్వరరావు లాంటి పాన్ ఇండియా మూవీస్‌లోనూ కనిపించారు. అయితే అనుపమ్ చెప్పిన లాజిక్ ఆయన లాంటి స్టార్ యాక్టర్స్‌కి వర్కౌట్ కావొచ్చేమో గానీ సామాన్యులకు అవుతుందా అనేది పెద్ద ప్రశ్న.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?) -
ఓటీటీలో మరో క్రేజీ మూవీ.. ఇది 69 ఏళ్ల వృద్ధుడి కథ
థియేటర్లలో అంటే కమర్షియల్ అంశాలు ఉండాలి, లేదంటే ప్రేక్షకులు చూడరు అంటుంటారు. ఓటీటీలకు అలాంటి ఇబ్బందులేం ఉండవు. ఏం చెప్పాలి అనిపిస్తే అది చెప్పేయొచ్చు. బౌండరీలు ఉండవు. దీంతో అప్పుడప్పుడు కొన్ని మంచి కథలు వస్తుంటాయి. తాజాగా రిలీజైన 'విజయ్ 69' అనే హిందీ మూవీ ట్రైలర్ చూస్తుంటే అదే అనిపించింది. ఇంతకీ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే?(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ)బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ లీడ్ రోల్ చేసిన సినిమా 'విజయ్ 69'. పేరుకి తగ్గట్లే 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్ పూర్తి చేసి రికార్డ్ సాధించాలనేది ఇతడి కల. ఇందులో భాగంగా 1.5 కిలోమీటర్ల స్విమ్మింగ్, 40 కి.మీ సైక్లింగ్, 10 కి.మీ రన్నింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ విజయ్‌ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్, ఇలా ప్రతి ఒక్కరూ డిసప్పాయింట్ చేసేవాళ్లే. కానీ కలలకు వయసుతో సంబంధం లేదు. చెప్పాలంటే వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదని చివరకు నిరూపిస్తాడు. ఇదే కాన్సెప్ట్.నవంబరు 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే వర్కౌట్ అయ్యేలా ఉంది. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా బాగానే దట్టించినట్లు ఉన్నారు. ప్రస్తుతానికి హిందీ మాత్రమే అని చెప్పారు కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేటప్పుడు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఎమోషనల్ డ్రామా మూవీస్ అంటే ఇష్టముంటే మాత్రం దీన్ని మిస్ కావొద్దు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
సంతానం లేనందుకు బాధగా అనిపిస్తుంది: అనుపమ్ ఖేర్
చాలామంది పనిలో పడి వ్యక్తిగత జీవితాన్నే మర్చిపోతుంటారు. అలా ఏళ్లకు ఏళ్లే గడిచిపోతాయి. కానీ వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు ఎన్నో కోల్పోయామని బాధపడుతుంటారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పరిస్థితి కూడా ఇంతే! ప్రస్తుతం ఈయన వయసు 69 ఏళ్లు.. ఇన్నేళ్లుగా కెరీర్లోనే మునిగిపోయిన ఆయన తనకంటూ కన్నకొడుకు ఉంటే బాగుండని అంటున్నాడు.ఇద్దరికీ రెండో పెళ్లికాగా అనుపమ్.. 1979లో నటి మధుమాలతిని పెళ్లి చేసుకోగాకొన్నేళ్లకే విడిపోయారు. 1985లో కిరణ్ ఖేర్‌ను పెళ్లాడాడు. కిరణ్‌కు కూడా ఇది రెండో పెళ్లి! గతంలో ఆమె బిజినెస్మెన్ గౌతమ్‌ను పెళ్లాడగా వీరికి సికిందర్ అనే కుమారుడు జన్మించాడు. తర్వాత భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో అతడికి విడాకులిచ్చేసి 1985లో అనుపమ్‌ను పెళ్లాడింది. అయితే వీరికి సంతానం లేదు.ఆ అనురాగం వేరే..తాజాగా అనుపమ్ మాట్లాడుతూ.. అంతకుముందు పట్టించుకునేవాడిని కాదు కానీ కొన్నిసార్లు బాధేస్తుంటుంది. నాకూ ఓ కొడుకో, కూతురో ఉంటే బాగుండేదని ఏడెనిమిదేళ్లలో ఎన్నోసార్లు అనుకున్నాను. అలా అని సికిందర్‌తో సంతోషంగా లేనని కాదు. కానీ ఓ కొడుకు పుట్టుంటే.. వాడు కళ్ల ముందు పెరుగుతూ ఉంటే ఆ సంతోషం, అనురాగమే వేరేలా ఉండేది. మాకు సంతానం ఉండుంటే ఎంత బాగుండో అని అనుకుంటూ ఉంటాను.(చదవండి: నాన్న ఏడుస్తుంటే ఫోటోలు తీశారు, దారుణం: కిచ్చా సుదీప్ కూతురు)50 ఏళ్లు దాటినప్పటి నుంచి..నేను పనిలో మునిగిపోయి కొన్నేండ్లపాటు దీని గురించే ఆలోచించలేదు. ఎప్పుడైతే 50-55 ఏళ్ల వయసు వచ్చిందో అప్పటినుంచే ఏదో వెలితిగా అనిపిస్తోంది. ద అనుపమ్ ఖేర్ ఫౌండేషన్‌లో పిల్లలతో కలిసి పని చేస్తుంటాను. అలాగే నా స్నేహితుల పిల్లలను చూసినప్పుడు కూడా నాకు పిల్లలు లేరు అని ఫీలవుతాను అని చెప్పుకొచ్చాడు.బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
69 ఏళ్ల వయసులో సాహసం.. ఓటీటీకి రియల్ స్టోరీ!
ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం విజయ్ 69. ఓ క్రీడాకారుని నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మనీశ్ శర్మ నిర్మించారు. ఈ చిత్రానికి అక్షయ్ రాయ్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. వచ్చేనెల 8 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ అధికారికంగా ప్రకటించింది. 69 ఏళ్ల వ్యక్తి ట్రయాత్లాన్ కోసం శిక్షణ పొందడం, జీవితంలోని సవాళ్లను ఎలా అధిగమించాడనేదే కథ.విజయ్ 69 కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువని అనుపమ్ ఖేర్ అన్నారు. ఇది అభిరుచి, పట్టుదల, అచంచలమైన మానవ స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. మన కలలను సాకారం చేసుకోవడానికి వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదనే నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుందని వెల్లడించారు. విజయ్ 69 అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
2.1 గోల్డ్ కొట్టేశారు!
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్‌ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్‌కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్‌కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్‌తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్‌రంగ్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
అనుపమ్ ఖేర్ బొమ్మ కరెన్సీతో బురిడీ
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్‌ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్‌కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్‌కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్‌తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్‌రంగ్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
20 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టనున్న అనుపమ్ ఖేర్
ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఓం జై జగదీష్’ (2002). ఆ సినిమా తర్వాత ఆయన డైరెక్షన్ విభాగంలో అడుగుపెట్టలేదు. అయితే, సుమారు ఇరవయ్యేళ్ల తర్వాత అనుపమ్ ఖేర్ దర్శకుడిగా మళ్లీ మెగాఫోన్ పట్టి, హిందీలో ‘తన్వి: ది గ్రేట్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.కాగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’తో పాటు పలు హాలీవుడ్ చిత్రాలు, సిరీస్‌లలో నటించిన ఇయాన్ గ్లెన్ ‘తన్వి’ సినిమాలో ఓ కీలక ΄పాత్రలో నటిస్తున్నారు. ‘తన్వి’ సెట్స్‌లో ఇయాన్ ΄పాల్గొన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయంపై అనుపమ్ ఖేర్ ఓ క్లారిటీ ఇచ్చారు. ‘‘హిస్టారికల్ డ్రామా ‘మిసెస్ విల్సన్’ సిరీస్‌లో నేను, ఇయాన్ కలిసి నటించాం. ఇప్పుడు నా దర్శకత్వంలోని ‘తన్వి’ సినిమాలో ఇయాన్ నటిస్తున్నారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమాలో నటిస్తున్న ఇయాన్కు స్వాగతం’’ అని తెలి అనుపమ్ ఖేర్ తెలిపారు. ఇండియన్ సినిమాలో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని ఇయాన్ అన్నారు. ఇక్కడి సినిమాలో నటించే అవకాశం దక్కడం చాలా గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
ఆఫీస్‌లో చోరీ.. వీడియో రిలీజ్ చేసిన నటుడు
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీస్‌లో దొంగలు పడ్డారు. ఓ సినిమా నకలుతోపాటు విలువైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారు. రూ.4 లక్షల నగదు సైతం దొంగిలించారు. ఈ ఘటనపై అనుపమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఓ వీడియో షేర్ చేశాడు. 'నిన్న రాత్రి ముంబైలోని వీర దేశాయ్ రోడ్లో ఉన్న నా ఆఫీసులో చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించి విలువైన పత్రాలను దొంగతనం చేశారు. సీసీటీవీలో..వాటిని నాశనం చేయరని ఆశిస్తున్నాను. అలాగే మా కంపెనీ నిర్మించిన ఓ సినిమా నెగెటివ్స్ కూడా మాయం చేశారు. ఆ ఇద్దరు దొంగలు లగేజీతో ఆటోలో వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేముందు నా ఆఫీసులో పనిచేసేవారు తీసిన వీడియో ఇది' అని చెప్పుకొచ్చాడు.సినిమా..కాగా ది కశ్మీర్ ఫైల్స్‌తో సెన్సేషన్‌గా మారిన అనుపమ్ ఖేర్.. ఇటీవల ఐబీ71, ద వ్యాక్సిన్ వార్, కుచ్ ఖట్టా హో జాయే, కాగజ్ 2 వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మెట్రో.. ఇన్ డినో, తన్వి ద గ్రేట్ అనే మూవీస్‌లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) చదవండి: దర్శన్ కేసు.. హత్య తర్వాత అతను ఏం చేశాడంటే? -
బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా
-
ఎన్టీఆర్‌పై బాలీవుడ్ సీనియర్ హీరో ఆసక్తికర పోస్ట్
ఎన్టీఆర్ ఇప్పుడు ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. దేవర షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చి, ‘వార్ 2’సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ అంతా ముంబైలోనే జరుగుతుండడంతో.. ఖాలీ సమయంలో తన స్నేహితులను కలుస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో అనుపమ్ ఖేర్ కలిశాడు తారక్. ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోని అనుపమ్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘నా ఫేవరేట్ పర్సన్. యాక్టర్ ఎన్టీఆర్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అతని వర్క్ నాకు చాలా ఇష్టం. అతను జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘వార్ 2’లో అనుపమ్ నటిస్తున్నారా?’, ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో అనుపమ్ కీలక పాత్ర పోషిస్తున్నారా ఏంటి? అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. It was such a pleasure to meet one of my favourite persons and actor @tarak9999 last night. Have loved his work. May he keep rising from strength to strength! Jai Ho! 😍🕉👏 #Actors pic.twitter.com/XSetC87b4Y— Anupam Kher (@AnupamPKher) May 1, 2024 -
అప్పట్నుంచి కీరవాణి ఫ్యాన్‌ని!
‘‘మా తరానికి చెందిన అద్భుతమైన సంగీతదర్శకుల్లో ఒకరైన కీరవాణితో సినిమా చేసే అవకాశం రావడం నాకు గర్వకారణం. నా కల నిజమైంది’’ అని బాలీవుడ్ ప్రముఖ నటుడు–దర్శకుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇరవై రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టారు. గతంలో ‘ఓం జై జగదీష్’ (2002) చిత్రానికి దర్శకత్వం వహించారు అనుపమ్ ఖేర్. తాజాగా ‘తన్వీ ది గ్రేట్’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతదర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించి, ఆయన ట్రాక్ కంపోజ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ‘‘ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేత కీరవాణి మా సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం ఓ ఆశీర్వాదం. ఏడాదిగా ఈ సినిమాకి కలిసి పని చేస్తున్నాం. కీరవాణి స్వరపరచిన ‘తుమ్ మిలే దిల్ ఖిలే..’ (నాగార్జున, మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ నటించిన ‘క్రిమినల్’ సినిమాలోని ΄ాట) విన్నప్పట్నుంచి ఆయనకు అభిమాని అయిపోయాను. ఇప్పుడు నా సినిమా ఒప్పుకున్నందుకు ఆయనకు «థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు అనుపమ్ ఖేర్. -
నవల రాసిన ప్రముఖ డైరెక్టర్.. ఆవిష్కరించిన దిగ్గజ నటుడు
సాధారణంగా రచయితలు దర్శకులుగా మారిన తర్వాత తిరిగి వెనక్కి చూసేది చాలా తక్కువ. కానీ ఓ డైరెక్టర్ మాత్రం ఇప్పుడు తిరిగి రైటర్ అయిపోయారు. ఏకంగా ఓ నవల కూడా రాసేశారు. దీన్ని పలువురు సెలబ్రిటీల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో ఆసక్తికకరంగా మారిపోయింది. (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) బాలీవుడ్లో 'కాల్', 'లక్', 'ఫిక్సర్' సినిమాలు తీసిన దర్శకుడు సొహమ్ షా.. ప్రస్తుతం సినిమాలే చేయట్లేదు. అయితే ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ 'బ్లడ్ మూన్' అనే నవలతో సరికొత్త ప్రయాణం మొదలుపెట్టారు. కరోనా కాలంలో చూసిన కొన్ని పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని, పారానార్మల్ థ్రిల్లర్ కథతో ఈ నవలని రాసినట్లు చెప్పుకొచ్చారు. తాజాగా ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఈ నవలని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఆవిష్కరించారు. ఇదే ఈవెంట్లో అనుపమ్ ఖేర్‌తో పాటు జాకీ ష్రాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇక వీళ్లిద్దరూ కూడా సొహమ్ షాతో తనుకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలానే ఈ బుక్ లాంచ్ చేయడం తను గౌరవంగా భావిస్తున్నట్లు అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: కుమారీ ఆంటీ ఒకప్పుడు ఆ సింగర్ ఇంట్లో పని చేసింది!) -
ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ రెడీ.. అదిరిపోయే టైటిల్ ఫిక్స్
'ముచ్చటగా మూడోసారి కూడా భారత దేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం' అనే అంచనాల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. 'విశ్వనేత' పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి యువ ప్రతిభాశాలి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. 'వందే మీడియా ప్రయివేట్ లిమిటెడ్' పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలో సెట్స్‌కు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆర్టికల్ 370 రద్దు, డిమోనిటైజేషన్, జీ.ఎస్.టీ, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సంచలనాలతో కోట్లాది భారతీయుల గుండెల్లో కొలువుదీరి.. "యూనిఫామ్ సివిల్ కోడ్" అమలు దిశగా అడుగులు వేస్తున్న నరేంద్రుడి బయోపిక్‌లో చాయ్ వాలా స్థాయి నుంచి "విశ్వనేత" గా ఎదిగిన ఆయన మహాప్రస్థానానికి దృశ్యరూపం ఇవ్వనున్నామని సినిమా యూనిట్ చెబుతోంది!! -
సరదా.. దసరా..
బాలీవుడ్లో దసరా సందడి జోరు బాగా కనిపిస్తోంది. ప్రతి ఏడాదీ కొందరు స్టార్స్ ప్రముఖ ఏరియాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించే చోటుకి వెళ్లి, పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా కాజోల్, రాణీ ముఖర్జీ తప్పకుండా వెళుతుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఇద్దరూ అమ్మవారిని దర్శించుకున్నారు. కాజోల్ తన తనయుడు యుగ్‌తో కలిసి వెళ్లారు. ఇంకా హేమా మాలిని, ఆమె కుమార్తె ఈషా డియోల్ తన తల్లి దులారీ ఖేర్‌తో కలిసి అనుపమ్ ఖేర్ తదితరులు దుర్గా మాత ఆశీస్సులు అందుకున్నారు. -
రవితేజకు సారీ చెప్పిన అనుపమ్ ఖేర్.. ఎందుకంటే?
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రవితేజ ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించారు. ఇటీవలే ముంబయిలో ఈవెంట్‌కు రవితేజ హాజరయ్యారు. అయితే ఈవెంట్లో అనుపమ్ ఖేర్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: బిగ్‌బాస్ 7: మళ్లీ గ్రాండ్ లాంచ్.. హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు.. కానీ..) ఈవెంట్‌కు హాజరైన అనుపమ్.. గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకసారి చిన్న వయసులో రవితేజ తన స్టూడియోకి వచ్చి నాతో ఫోటో దిగాలని అడిగాడు. కానీ నేను కుదరదని చెప్పా.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన సినిమాలోనే నటిస్తున్నా.. ఆ రోజు అలా అన్నందుకు రవితేజకు నవ్వుతూ సారీ అన్నారు. దీంతో వెంటనే రవితేజ.. సార్ అంటూ దండం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గా యత్రి భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: 'సీరియల్ కిల్లర్ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా లియో ట్రైలర్!) 1988 :- #AnupamKher rejected to click a photo with #RaviTeja 😢💔 2023 :- #AnupamKher is doing a key role in Mass Maharaja @RaviTeja_offl most anticipated Project #TigerNageswaraRao 🥵🔥 True definition of Success 💥💯 pic.twitter.com/z3GY4rPEc7 — Neeraj Kumar (@73forever_) October 4, 2023 -
The Vaccine War: 'ది వ్యాక్సిన్ వార్' మూవీ రివ్యూ
టైటిల్: ది వ్యాక్సిన్ వార్ నటీనటులు: నానా పటేకర్,అనుపమ్ ఖేర్,పల్లవి జోషి,రైమా సేన్,గిరిజా ఓక్,సప్తమి గౌడ తదితరులు నిర్మాణ సంస్థ: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలు: పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: వివేక్ అగ్నిహోత్రి సంగీతం: రోహిత్ శర్మ, వనరాజ్ భాటియా సినిమాటోగ్రఫీ: ఉదయసింగ్ మోహితే ఎడిటర్: శంఖ రాజాధ్యక్ష విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశ మొత్తం తన గురించి చర్చించుకునేలా చేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్లో పలు సినిమాలు చేసినా ఆయనకు గుర్తింపు వచ్చింది మాత్రం ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతోనే. సున్నితమైన సమస్య చుట్టూ ఈ కథని చెప్పడం వలన కొంతమంది మనోభావాలు దెబ్బతింటే, హిందుత్వ సంఘాల, పలు సమూహాలకి బాగా కనెక్ట్ అయ్యింది. అంతేకాకుండా ఆ సినిమాపై భారీ విమర్శలు కూడా వచ్చాయి. ఇలా ఆ సినిమా తర్వాత ఆయన నుంచి తాజాగా విడుదలైన చిత్రం 'ది వ్యాక్సిన్ వార్' కరోనావైరస్ వ్యాప్తి భూ గ్రహం మీద ఉన్న ప్రతి వ్యక్తి జీవితాలను ప్రభావితం చేసింది. ఆ సమయంలో విధించిన లాక్డౌన్ వల్ల వివిధ వర్గాల ప్రజల దుస్థితి ఎలా ఉంది.. వ్యాక్సిన్ తయారు చేసేందుకు చాలామంది శాస్త్రవేత్తలు ఎందుకు వెనకడుగు వేశారు..? అలాంటి సమయంలో తామున్నామని మహిళా శాస్త్రవేత్తలు ముందు అడుగు వేయడానికి గల కారణాలు ఏంటి..? వ్యాక్సిన్ తయారు చేయడం ఇండియా వల్ల కాదని ఎందరో చెబుతున్నా.. కేవలం ఏడు నెలల సమయంలో స్వంత వ్యాక్సిన్‌ను భారత్ ఎలా తయారు చేయగలిగింది..? వ్యాక్సిన్ తయారు చేస్తున్న సమయంలో శాస్త్రవేత్తల దుస్థితి ఎలా ఉంది..? ఇవన్నీ తెలియాలంటే వివేక్ రంజన్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్'లోకి వెళ్లాల్సిందే. 'ది వ్యాక్సిన్ వార్' కథేంటంటే.. ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాజీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ బలరామ్ భార్గవ్ రాసిన 'గోయింగ్ వైరల్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని అగ్నిహోత్రి తెరకెక్కించారు. వాక్సిన్ వార్, వాస్తవ ప్రపంచంలో జరిగిన ఘటనలతో సినిమా ప్రారంభం అవుతుంది. ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ భార్గవ (నానా పటేకర్) తన శాస్త్రవేత్తల బృందంతో న్యుమోనియా లాంటి వ్యాక్సిన్లను తయారు చేసే పనిలో ఉంటారు. అందుకు కావాల్సిన ఆయన ఒక టీమ్‌ను సమీకరించుకుంటారు. అదే సమయంలో నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ (NIV) హెడ్‌గా డాక్టర్ అబ్రహం (పల్లవి జోషి పోషించారు) వీరందరి నేతృత్వంలో భారత్ కోసం పలు వ్యాక్సిన్ల తయారిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆ సమయంలో భారతదేశంతో పాటు.. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కోవిడ్-19 మహమ్మారి బారిన పడుతాయి. ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. ఈ కథనాలను ప్రజలకు చేరవేసేందుకు మీడియా కూడా ప్రాణలకు తెగించే పని చేస్తుంటుంది. నెగటివ్ జర్నలిస్టు పాత్రలో (రైమా సేన్) అనేక నిజ జీవితాలను వెలికితీస్తూనే కొన్ని తప్పుడు వార్తలను కూడా ప్రచురిస్తూ ఉంటుంది. ఆమె నేతృత్వంలోని మీడియాకు చెందిన ఒక విభాగం హానికరమైన తప్పుడు వార్తల ప్రచారం చేస్తూ.. శాస్త్రవేత్తలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఆమెతో పోరాడుతూ.. వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి శాస్త్రవేత్తల బృందం ఎలాంటి అడ్డంకులను దాటింది. అనేది కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారిలో భాగం అయ్యేందుకు చాలామంది పురుష శాస్త్రవేత్తలు వెనకడుగు వేస్తారు. అలాంటి సమయంలో మహిళా శాస్త్రవేత్తలు ముందుకు వస్తారు. ఇందులో డాక్టర్ భార్గవ పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారి సమయంలో ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంది..? ఆ సమయంలో ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత వచ్చింది..? ది వ్యాక్సిన్ వార్ సినిమా మన వ్యాక్సిన్ సిస్టం.. మన మెడికల్ సిస్టం నిజస్వరూపాన్ని చూపెట్టిందా..? విపత్కర పరిస్థితుల్లో భారత్ ఎలా పోరాడింది. శాస్త్రవేత్తలను అణగదొక్కడమే తమ లక్ష్యంగా పనిచేసింది ఎవరు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మనం చేయలేము.. అనుకునే స్థాయి నుంచి మనం చేయగలం అనే స్థాయికి చేరుకుని.. చేసి చూపించారు మన శాస్త్రవేత్తలు. ఒక్కముక్కలో చెప్పాలంటే ది వ్యాక్సిన్ వార్ సారాంశం ఇదే. సినిమా కథ విషయానికి వస్తే అద్బుతంగా ఉంది. మానవ మెదడుకి మెమోరీ తక్కువగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా టైంలో జరిగిన వాటిని మరిచిపోగలం. కానీ ఈ చిత్రం మాత్రం ఇండియా శాస్త్రవేత్తల మీద నమ్మకాన్ని పెంచుతుంది. వారి పట్ల గౌరవాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాను చూశాక మన శాస్త్రవేత్తలను చూసి గర్వపడేలా ఉంటుంది. సినిమాలో గమనించదగ్గ అంశం ఏమిటంటే, వివేక్ అగ్నిహోత్రి తన మునుపటి చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'పై ఎన్నో విమర్శలను అందుకున్నాడు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగకపోవచ్చు. కోవిడ్ -19 కేసులకు మైనారిటీలు ఎలా కారణం అయ్యారు.. దానిని వ్యాప్తి చేయడంలో వారు చేసిన తప్పు ఏంటి అనే కథనాన్ని స్పష్టంగా చూపించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో కుంభమేళా వేడుకలు, పలు ర్యాలీలతో పాటు డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తిని తెరపై చూపిస్తుంది. సినిమాలో రాజకీయ విషయానికి వస్తే అతను దానిని కొంతమేరకు బ్యాలెన్స్ చేశాడని చెప్పవచ్చు. ఇది ప్రభుత్వాన్ని సానుకూలంగా చూపుతుందనడంలో సందేహం లేదు. బలరామ్ భార్గవ్ (నానా పటేకర్ పోషించిన పాత్ర) తాను సైన్స్ అనుకూలుడని ప్రధానిని ప్రశంసించడం కనిపించింది. రెండవ వేవ్ సమయంలో వైరస్ వ్యాప్తికి రాజకీయ ర్యాలీలు కారణమని కూడా చిత్రంలో కనిపిస్తుంది. అటు ప్రభుత్వంపై సానుకూలతను చూపుతూనే.. కొంతమేరకు ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందో కూడా చిత్రంలో ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నిడివిగా అనిపిస్తుంది. ఇది సాధారణ ప్రేక్షకులకు విసుగు తెప్పించవచ్చు. అయితే సెకండాఫ్ వేగం పుంజుకుని చివరి వరకు మెయింటెన్ చేస్తుంది. ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాలో చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ల్యాబ్‌లలోనే వారి జీవితాన్ని ఎలా గడిపారని చూపించారు. ఆ సీన్స్ మెప్పిస్తాయి. ఒక సాధారణ వ్యక్తికి వ్యాక్సిన్ గురించి పూర్తిగా తెలియదు. కానీ, ఈ సినిమా చూశాక దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. వ్యాక్సిన్ తయారు చేయడం కేవలం వాళ్ల ఉద్యోగం మాత్రమే కాదు. అది సైంటిస్ట్‌లు చేసిన నిస్వార్థమైన సేవ. వాళ్ల సమయాన్ని దేశం కోసం ఉపయోగించారు. ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. విదేశీ వ్యాక్సిన్లను భారత్‌లో ఎక్కువగా ప్రచారం చేయడం.. వారి వ్యాపార సామ్రాజ్యం కోసం జరుగుతున్న లాబీయింగ్ సీన్లు ప్రతి భారతీయుడిని ఆలోచింపచేస్తాయి. అందులో మీడియా పాత్ర ఏమేరకు ఉందనేది ప్రధాన చర్చకు దారితీస్తుంది. అంతేకాకుండా ‘భారత్‌కు వ్యాక్సిన్ తయారు చేయడం చేతకాదు’ అని మీడియా మొత్తం నమ్మిందా? అనేలా చిత్రీకరించిన సీన్లు కొంతమేరకు అభ్యంతరకంగా ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. సినిమాలో నానా పటేకర్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. తన ప్రతిభకు తాను మాత్రమే అనేలా మరోసారి ఆయన నిరూపించుకున్నాడు. అతను ఏ పాత్రనైనా పోషించగలడని శాస్త్రవేత్తగా 100 మార్కులతో మెప్పిస్తాడు. ఒక శాస్త్రవేత్త బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది.. కీలక సమయాల్లో వారి యెక్క భావోద్వేగాలు ఏ విధంగా ఉంటాయో నానా పటేకర్ చూపించాడు. డాక్టర్ అబ్రహం పాత్రలో పల్లవి జోషి నటించింది. ఆమె ఒక మలయాళీ పాత్రను పోషిస్తుంది. సినిమాలో ఆమె ఉచ్చారణ బాగున్నా.. నానా పటేకర్‌తో వచ్చే సీన్లు అంతగా హైలెట్‌గా కనిపించవు. కానీ NVIలోని శాస్త్రవేత్తల మధ్య ఒత్తిడితో పాటు అనేక భావోద్వేగాలు కనిపిస్తాయి. అక్కడ ఆమె ప్రదర్శనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. సినిమా ఎడిటింగ్ మరింత పటిష్టంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఏది ఏమైనప్పటికీ, ఒక ప్రధాన లోపం ఏమిటంటే, మీడియాను ఏకపక్షంగా చిత్రీకరించడం అంతగా మెప్పించదు. మీడియా వల్లే నాడు కోవిడ్ సమయంలో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా తెలుసుకునే వారు. మీడియా కూడా ఫ్రంట్ వారియర్స్‌గా కరోనా విపత్తు సమయంలో పనిచేసింది. ఈ విషయాన్ని గుర్తించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అతను ఈ చలన చిత్రాన్ని ఒక రకమైన 'మీడియా యుద్ధం'గా పేర్కొన్నట్లు ఉంది. వాస్తవానికి, వ్యాక్సిన్‌పై నెగిటివ్ ఇమేజ్‌ని సృష్టించి, నకిలీ వార్తల ద్వారా దాని గురించి తప్పుడు కథనాన్ని అల్లడంపై నరకయాతన పడుతున్న జర్నలిస్ట్‌గా నటించిన రైమా సేన్, ఈ చిత్రంలో బలహీనమైన లింక్‌గా కనిపిస్తుంది. ఆమెను సరైన రీతిలో దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు. శాస్త్రవేత్తలు, ప్రజల్లో కలిగే ఎమోషనల్ సీన్లు మాత్రం బాగా పండుతాయి. రాజకీయ సంఘర్షణలు తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. భారతీయ శాస్త్రవేత్తలు విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశారు. వారి కోసం ఈ సినిమాను ఖచ్చితంగా చూడవచ్చు. వారు తమ జీవితాల గురించి పట్టించుకోకుండా గొప్ప మంచికి ఎలా ప్రాముఖ్యతనిచ్చారనే దాని గురించి మీరు ఆలోచించేలా చేస్తుంది. ఇది వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ థియేటర్ నుంచి మిమ్మల్ని ఇంటికి నడిపిస్తుంది. - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్ -
టైగర్ నాగేశ్వరరావుని పట్టుకునేందకు ఎంట్రీ ఇచ్చిన అనుపమ్ ఖేర్
ఐబీ ఆఫీసర్ (ఇంటెలిజెన్స్ బ్యూరో) రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా చార్జ్ తీసుకున్నారు అనుపమ్ ఖేర్. టైగర్ నాగేశ్వరరావుని పట్టుకునే మిషన్ విషయంలో రాఘవేంద్ర ఎలాంటి ప్లాన్స్ వేశారు? అనేది ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో చూడాల్సిందే. రవితేజ టైటిల్ రోల్లో వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ చేస్తున్న కీలక పాత్ర అయిన ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘టైగర్ నాగేశ్వరరావు’టీజర్‌ను ఈ నెల 17న విడుదల చేయనున్నాం. అలాగే ఈ మూవీని అక్టోబర్ 20న రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
The India House: స్వాతంత్య్రానికి పూర్వం..
‘ది ఇండియా హౌస్’ లోకి నిఖిల్ ఎంట్రీ ఇస్తున్నారు. నిఖిల్ హీరోగా అనుపమ్ ఖేర్ ఓ లీడ్ రోల్లో నటించనున్న తాజా చిత్రం ‘ది ఇండియా హౌస్’. ‘జై మాతా ది’ అనేది ఉపశీర్షిక. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రామ్‌చరణ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా ‘ది ఇండియా హౌస్’ సినిమా ప్రకటన వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు రామ్‌చరణ్, అభిషేక్ అగర్వాల్. ఈ సినిమాలో శివ పాత్రలో నిఖిల్, సయామీ కృష్ణ వర్మగా అనుపమ్ ఖేర్ కనిపిస్తారు. ‘‘లండన్ లో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. On the occasion of the 140th birth anniversary of our great freedom fighter Veer Savarkar Garu we are proud to announce our pan India film - THE INDIA HOUSEheadlined by Nikhil Siddhartha, Anupam Kher ji & director Ram Vamsi Krishna! Jai Hind!@actor_Nikhil @AnupamPKher… pic.twitter.com/YYOTOjmgkV— Ram Charan (@AlwaysRamCharan) May 28, 2023 -
నా సినిమాల్లో దేశభక్తి అలా కుదురుతోంది!
‘‘ఇండియన్ ఇంటెలిజెన్సీ బ్యూరో ప్రతినిధులు పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఓ స్పై ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ మిషన్ సక్సెస్ఫుల్ కావడం వల్ల వేలాదిమంది భారతీయుల ప్రాణాలు రక్షించబడ్డాయి. ఈ మిషన్ తాలూకు విషయాలను తెలుసుకోవాలంటే ‘ఐబీ 71’ సినిమా చూడాలి. ఓ చారిత్రాత్మక ఘటనతో తీసిన ఈ చిత్రంలో దేశభక్తి తాలూకు మూమెంట్ప్ ఉంటాయి’’ అన్నారు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి. విద్యుత్ జమాల్ హీరోగా నటించి, నిర్మించిన హిందీ థ్రిల్లర్ ‘ఐబీ 71’. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సంకల్ప్మాట్లాడుతూ– ‘‘ఘాజీ’ ఇన్సిడెంట్‌కు ముందు కశ్మీర్లో జరిగిన ఓ ఘటన ఆధారంగా తీసిన చిత్రమే ‘ఐబీ 71’. ‘ఘాజీ’, ‘రాజీ’, ఇప్పుడు ఈ ‘ఐబీ 71’.. ఇవన్నీ ఇండియా–పాకిస్తాన్ (1971) యుద్ధానికి ముందు జరిగిన ఘటనల నేపథ్యంలో వచ్చిన సినిమాలు. ఈ ఘటల తాలుకూ విషయాలు అప్పట్లో న్యూస్‌పేపర్స్‌లో ప్రచురితమయ్యాయి. ఆ సమాచారం ఆధారంగా, కొత్తమంది వ్యక్తుల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’, ఇప్పుడు ‘ఐబీ 71’ కథల్లో భాగంగానే దేశభక్తి అంశం మిళితమై ఉంది. అంతేకానీ ప్రత్యేకంగా దేశభక్తి నేపథ్యాల్లో చేయాలని నేనీ సినిమాలు చేయలేదు. అలా కుదురుతోంది.. అంతే. బహుశా అంతర్లీనంగా నాలో ఉన్న దేశభక్తి ఓ కారణమేమో! హిందీలో నాకు ‘ఐబీ 71’ తొలి సినిమా. తెలుగులో నా తొలి సినిమా ‘ఘాజీ’ అండర్‌వాటర్ బ్యాక్‌డ్రాప్, రెండో సినిమా ‘అంతరిక్షం’ స్పేస్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయి. ‘ఐబీ 71’ బ్యాక్‌డ్రాప్ ఆకాశం. అలాగే భూమి, నిప్పుల బ్యాక్‌డ్రాప్‌లో కూడా సినిమాలు చేయాలని ఉంది’’ అని అన్నారు. -
సీక్రెట్ మిషన్
తెలుగులో ‘ఘాజీ’, ‘అంతరిక్షం 9000కేఎమ్‌పీహెచ్’ వంటి చిత్రాలను తీసిన సంకల్ప్ రెడ్డి హిందీలో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఐబీ 71’. విద్యుత్ జమాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ ఓ లీడ్ రోల్ చేశారు. స్పైజానర్లో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, చిత్రాన్ని మే 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘1971లో ఇండియా–పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ వార్‌లో భారతదేశం గెలవడానికి దేశ ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిన ఓ సీక్రెట్ మిషన్ ఏ విధంగా దోహదపడింది? అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం’’ అని యూనిట్ పేర్కొంది. -
స్నేహితుడి మరణం.. బోరున ఏడ్చేసిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్లో దర్శకనటుడు సతీష్ కౌశిక్(67) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన మిత్రుడు, మరో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. సతీశ్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో సతీశ్ పార్థివదేహం వద్ద అనుపమ్ ఖేర్ బోరున విలపించారు. స్నేహితుని మరణాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. సతీశ్ మృతిపట్ల అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ..' మేమిద్దరం మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లం. సొంతంగా పేరు తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాం. ముంబై నగరం మాకు అవకాశం ఇచ్చింది. దాన్ని సాధించాం. కానీ ఇది జీర్ణించుకోవటం చాలా కష్టం. అతను చాలా చమత్కారి. ప్రతి విషయాన్ని తేలికగా అర్థం చేసుకునేవాడు. ఎలా జీవించాలనేది ప్రజలు అతని నుంచి నేర్చుకుంటారు. మమ్మల్ని అకాలంగా విడిచి వెళ్లాడనే పశ్చాత్తాపం నాకు ఎప్పటికీ ఉంటుంది.' అంటూ ఎమోషనలయ్యారు. అదేవిధంగా సతీశ్ కౌశిక్‌తో తనకు 45 నుంచి అనుబంధమని అనుపమ్ ఖేర్ తెలిపారు. కాగా.. 13 ఏప్రిల్ 1956లో హర్యానాలో పుట్టి, పెరిగిన సతీష్ కౌశిక్.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఇక్కడి నుంచే అనుపమ్ ఖేర్‌తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. 1983లో వచ్చిన జానే భీ దో యారోన్ చిత్రానికి ఆయన సంభాషణలు అందించారు.. కమెడియన్‌గా, స్క్రీన్ రైటర్‌గా, దర్శకనిర్మాతగానూ ఆయన బాలీవుడ్లో రాణించారు. Anupam Kher Looses A True Friend 💔#AnupamKher #RipLegend #ShatishKaushik #ripshatishkaushik pic.twitter.com/wzbnQ0dR3Z — Yogeshnegi45 (@Yogeshnegi451) March 9, 2023 -
కొందరి జీవితాలు అంతే.. ప్రకాశ్ రాజ్‌కు అనుపమ్ ఖేర్ గట్టి కౌంటర్..!
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై వివాదం ఇంకా ముగిసిపోలేదు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై దుమారం మరింత రాజుకుంటోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌కు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చారు. ది కశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అన్న వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేరళలో జరిగిన ఓ ఈవెంట్లో ది కాశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అంటూ ప్రకాశ్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ జ్యూరీనే వారి సినిమాపై ఉమ్మివేసిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. తన జీవితమంతా ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాతానని ఆయన చెప్పారు. కొంతమంది అబద్ధాలతో తమ జీవితాన్ని వెల్లదీస్తున్నారని ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అనుపమ్ ఖేర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ' కొందరు మనుషులు తమ స్థాయిని తగ్గట్లు మాట్లాడతారు. కొంతమంది మాత్రం తమ జీవితమంతా అబద్ధం చెబుతారు. మరికొందరు నిజాలే మాట్లాడతారు. నా జీవితమంతా నిజం మాట్లాడిన వారిలో నేనూ ఒకడిని. అబద్ధాలు చెబుతూ జీవించాలనుకోవడం అది వారి కోరిక.' అంటూ ప్రకాశ్ రాజ్‌కు గట్టిగా కౌంటరిచ్చారు. కాగా.. గతేడాది విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ 1990లలో కశ్మీరీ హిందువుల వలసలను ఈ చిత్రంలో చూపించారు.వివేక్ అగ్నిహౌత్రి దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించారు. ఈ చిత్రంలో అనుపమ్ ప్రధాన పాత్రలో పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. -
వార్‌లో సప్తమి
‘ది కశ్మీరీ ఫైల్స్’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కోవిడ్ 19 పరిస్థితులు, దేశంలోని వ్యాక్సిన్ డ్రిల్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కన్నడ హిట్ ‘కాంతార’ ఫేమ్ హీరోయిన్ సప్తమి గౌడ జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో సప్తమి పాల్గొంటున్నారు. ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్స్ పతాకంపై ‘వ్యాక్సిన్ వార్’ సినిమాను నిర్మిస్తుండటంతో పాటు ఇందులో నటిస్తున్నారు పల్లవీ జోషి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, మరాఠీ, అస్సామీ భాషలతో సహా ఈ సినిమాను మరికొన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. -
అంతా ఓకే.. అతని ఆటను మళ్లీ చూస్తాం: బాలీవుడ్ నటులు
టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. క్రీడాకారులు, సినీ ప్రముఖులు సైతం రిషబ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పెద్దెఎత్తున ట్వీట్స్ చేశారు. ప్రధాని మోదీతో పలువురు రాజకీయ ప్రముఖులు ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా స్వస్థలం ఉత్తరాఖండ్‌కు ఢిల్లీ నుంచి వస్తుండగా.. రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద ఈ ప్రమాదం జరిగింది. (ఇది చదవండి: Rishabh Pant: క్రికెటర్ రిషభ్ పంత్‌కు ఘోర ప్రమాదం.. తీవ్ర గాయాలు) తాజాగా రిషబ్ పంత్‌ను బాలీవుడ్ నటులు పరామర్శించారు. డెహ్రడూన్‌లో ఆస్పత్రికి వెళ్లిన అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ క్రికెటర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ రిషబ్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అనిల్ కపూర్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం పంత్ బాగానే ఉన్నాడు. అభిమానులుగా మేము అతనిని కలిశాం. రిషబ్ త్వరగా కోలుకోవాలని మనందరం ప్రార్థిద్దాం. అతని ఆటను మళ్లీ గ్రౌండ్లో చూస్తాం.' అని అన్నారు. అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. 'పంత్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు వచ్చాం. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. పంత్, అతని తల్లి, బంధువులను కలిసి మాట్లాడాం. అందరికీ ధైర్యంగా ఉండాలని చెప్పాం. మేము వారందరినీ నవ్వించాం.' అని అన్నారు. -
కశ్మీర్ ఫైల్స్‌పై... మాటలు.. మంటలు
ముంబై: విడుదలైనప్పుడే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇఫీ ఉదంతం పుణ్యమా అని మరోసారి దేశవ్యాప్తంగా మంటలు రేపుతోంది. అదో చెత్త సినిమా అంటూ సోమవారం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ముగింపు వేడుకల్లో ఇజ్రాయెల్‌కు చెందిన జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలపై ఇంటా బయటా విమర్శలు రేగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇది పెద్ద చర్చకు తెర తీసింది. నదవ్ వ్యాఖ్యలను భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ తీవ్రంగా ఖండించారు. ‘‘అతిథిని దైవంగా భావించే దేశానికి వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి. ఇఫీ జడ్జీల ప్యానల్‌కు సారథ్య స్థానంలో కూచోబెట్టిన ఆతిథ్య దేశాన్ని నదవ్ తన వ్యాఖ్యలతో దారుణంగా అవమానించారు’’ అంటూ మంగళవారం బహిరంగ లేఖలో దుయ్యబట్టారు. ‘‘హిట్లర్ సారథ్యంలోని నాజీల చేతుల్లో లక్షలాది మంది యూదులు హోలోకాస్ట్ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో నిస్సహాయంగా ఊచకోతకు గురయ్యారు. అదృష్టం కొద్దీ ఆ మారణహోమం నుంచి తప్పించుకున్న వారి వారసున్ని నేను. నీ వ్యాఖ్యలనే గీటురాయిగా తీసుకునే పక్షంలో హోలోకాస్ట్ దారుణాలపై హాలీవుడ్ దర్శక దిగ్గజం స్పీల్బర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్ కూడా చెత్త సినిమాయేనా అని భారతీయులు ప్రశ్నిస్తుంటే నా మనసెంతో గాయపడుతోంది. కశ్మీర్ ఫైల్స్‌పై నీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వాటిని నువ్వు ఏ విధంగానూ సమర్థించుకోలేవు’’ అంటూ తూర్పారబట్టారు. నదవ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కశ్మీరీ పండిట్ల మండిపాటు బీజేపీతో పాటు కశ్మీర్ ఫైల్స్ సినిమా రచయిత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అందులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కూడా నదవ్ విమర్శలను తీవ్రంగా ఖండించారు. ‘‘భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ఉగ్రవాదుల వాదనకు మద్దతిచ్చేందుకు వాడుకున్న తీరు ఆశ్చర్యకరం. కశ్మీర్ ఫైల్స్ ప్రచారం కోసం తీసిందని, అందులో ఒక్క సీన్ గానీ, డైలాగ్ గానీ అవాస్తవమని నిరూపించినా ఇకపై సినిమాలే తీయను. నదవ్తో పాటు ప్రపంచ మేధావులకు, అర్బన్ నక్సల్స్‌కు ఇది నా సవాలు’’ అని అగ్నిహోత్రి అన్నారు. నవద్ను తక్షణం భారత్ నుంచి పంపించేయాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ కాన్సులర్ జనరల్ కొబ్బీ షొషానీ కూడా నదవ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. -
సీనియర్ నటితో మెగాస్టార్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో వైరల్
ఫిల్మ్ ఇండస్ట్రీలో 80వ దశకంలోని నటీనటులు ఇటీవలే ముంబైలో కలిసిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీల్లోని సీనియర్ స్టార్స్ అందరూ ఒకేచోట కనిపించి సందడి చేశారు. అలనాటి రోజులను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఈ రీయూనియన్ వేడుకలో మెగాస్టార్ తన డ్యాన్స్‌తో ఊపేశారు. ఓ సీనియర్ నటితో కలిసి స్టెప్పులేశారు. ఆ వీడియోను ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరవుతోంది. (చదవండి: ముంబైలో సీనియర్ స్టార్స్ సందడి.. ఫోటోలు వైరల్) మెగాస్టార్‌తో పాటు సీనియర్ నటి సుహాసిని కూడా కాలు కదిపారు. మరో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ సైతం స్టెప్పులేశారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఆతిథ్యమిచ్చారు. ఈ వేడుకలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నరేశ్, భానుచందర్, నదియా, రమ్యకృష్ణ, విద్యాబాలన్, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, భానుచందర్, అనుపమ్ ఖేర్, శరత్ కుమార్, అర్జున్, అనిల్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. 2020లో జరిగిన రీయూనియన్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) -
నన్ను చితక్కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు: అనుపమ్
కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ ఖేర్ 'మంజిలే ఔర్ బీ హై' షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో పలువురు సెలబ్రిటీలను ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటాడు. తాజాగా ఈ షోకి అనుపమ్ తల్లి దులరి ఖేర్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన పిల్లలు తప్పు చేస్తే ఎలా శిక్షించేదో చెప్పుకొచ్చింది. ఓసారి అనుపమ్ స్కూలుకు వెళ్లేటప్పుడు అతడికి కొంత పాకెట్‌మనీ ఇచ్చిందిట దులరి. కానీ అతడి బ్యాగులో తానిచ్చిన చిల్లరతో పాటు మరో మూడు పైసలు, రెండు పైసలు ఎక్స్ట్రా కనిపించాయట. చిన్నపిల్లాడు పోనీలే అని అతడి తండ్రి ఊరుకుంటే ఆమె మాత్రం ఎందుకు వదిలేయాలి, డబ్బు దొంగిలించినందుకు దండించాల్సిందేనని చెప్పిందట. అలా తనను బట్టలు ఊడగొట్టి మరి ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టారని గుర్తు చేసుకున్నాడు అనుపమ్. కానీ ఒకరకంగా తన తల్లి మంచి పనే చేసిందని చెప్పుకొచ్చాడు. అనుపమ్‌తో పాటు అతడి తమ్ముడు రాజు ఖేర్‌ను కూడా బాగా కొట్టేదాన్నంది దులరి. ఓ చెట్టు కట్టెతో కొడితే శరీరమంతా దద్దులు వచ్చేవని తెలిపింది. ఓసారి ఆ కట్టెతో బాగా కొట్టడంతో అనుపమ్ అనారోగ్యానికి గురయ్యాడని, ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్ ఆ చెట్టు విషపూరితమైనదని, ఆ కట్టెతో దండించొద్దని, కావాలంటే చేత్తో కొట్టమని సూచించినట్లు పేర్కొంది. ఇకపోతే అనుపమ్ ఖేర్ నటించిన ఊంచాయ్ మూవీ నవంబర్ 11న విడుదల కానుంది. చదవండి: ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్! పెళ్లి కాకుండా తల్లయినా ఓకే: జయా బచ్చన్ -
సత్యరాజ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నయన్ ‘కనెక్ట్’, ఫస్ట్‌లుక్ అవుట్
లేడీ సూపర్ స్టార్ నయనతార చిత్రాలకు అందరూ కనెక్ట్ అవుతారు. అలాంటిది ఇప్పుడు ఆమె కనెక్ట్‌గా మారింది. ఒక పక్క స్టార్ హీరోలతో నటిస్తున్న ఈమె, మరో పక్క హీరోయిన్ ఓరియంటెడ్ కథల్లో నటిస్తూ విజయాలను అందుకుంటోంది. ఇలాంటి కథా చిత్రం విడుదలయ్యేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య ఈమె నటించిన ఓ2 చిత్రం ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా నయనతార కథానాయకిగా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి కనెక్ట్ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. కాగా కనెక్ట్ చిత్రంలో నయనతారకు జంటగా నటుడు వినయ్ నటించగా సత్యరాజ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనిని అశ్విన్ శరవణన్ తన గత చిత్రాల తరహాలోనే తెరకెక్కించినట్లు తెలిసింది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్ర ప్రత్యేక పోస్టర్‌ను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరపుకుంటున్న ఈ మూవీ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది. అయితే నయనతార గత చిత్రాల మాదిరిగా ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా? లేక థియేటర్లలో విడుదలవుతుందా ? అన్నది తెలియాల్సి ఉంది. కనెక్ట్ చిత్ర విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఓ మై గాడ్.. ఇంట్లో అసలు ఖాళీ లేదుగా
-
పీవీ సింధు ఇంటికి బాలీవుడ్ దిగ్గజం
బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇంటికి వెళ్లాడు. ఇటీవలే ఒక కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన అనుపమ్ సింధు ఇంటికి వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా సింధూ సాధించిన ట్రోఫీలు చూసి షాక్ తిన్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ అనుపమ్ ఖేర్ స్వయంగా షేర్ చేసుకున్నాడు. "వన్ అండ్ ఓన్లీ ఛాంపియన్. ఈ గోడ చూడండి. నా ఇంట్లో నా దగ్గర ఉన్న అవార్డులు చూసి నా గోడపై చాలా ఎక్కువ ఉన్నాయని అనుకునే వాడిని. కానీ ఇక్కడ చూడండి. అద్భుతం. ఇక్కడ అసలు స్థలమే లేదు" అని అనుపమ్ అన్నాడు. అనంతరం ఆమె తండ్రితోనూ అనుపమ్ మాట్లాడాడు. సింధు గెలుస్తున్న ట్రోఫీలు పెట్టడానికి స్థలం సరిపోవడం లేదని, అందుకే ఇంకో అంతస్తు కట్టాలని అనుకుంటున్నట్లు సింధు తండ్రి చెప్పడం విశేషం. ఆమె ఇంటికి వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్న అనుపమ్.. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ తాను ఎలాంటి అనుభూతి చెందాడో వివరించాడు. "ఇది అద్భుతం. ఈ మధ్యే నేను ఛాంపియన్ పీవీ సింధు ఇంటికి వెళ్లాను. ఆమె తాను సాధించిన ట్రోఫీలను చూపించింది. 8 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచీ అందులో ఉన్నాయి. ఆమె అవార్డులు, ట్రోఫీలు, ఆమె వినయం చూసి బౌల్డయ్యాను. ఆమె మన ఇండియా కూతురు. ఆమె మనను మోటివేట్ చేసే హీరో. జై హో.. జై హింద్" అని పేర్కొన్నాడు. అటు సింధు కూడా అనుపమ్ ఖేర్‌తో దిగిన ఫొటోను షేర్ చేసింది. అతన్ని కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పింది. AMAZING: I had the privilege of visiting CHAMP @Pvsindhu1’s home.She very humbly gave me a tour of her achievements, awards and trophies! Right from the age of 8!😳ये है हमारे भारत की बेटी।ये है हमारे देश की शान।ये है हमारी प्रेरणात्मक HERO! जय हो! जय हिंद! 👏🌈🇮🇳🇮🇳 #YouthIcon pic.twitter.com/gk1ooybScE — Anupam Kher (@AnupamPKher) September 29, 2022 చదవండి: ఇమిటేట్ చేయబోయి.. ఆస్పత్రి బెడ్ మీద పేషెంట్‌గా -
బాలీవుడ్లో ఆ బడా సెలబ్రిటీలు నాకు ఆఫర్స్ ఇవ్వట్లేదు: అనుపమ్
కశ్మీర్ ఫైల్స్ సినిమాతో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పేరు మార్మోగిపోయింది. 500కు పైగా సినిమాల్లో నటించిన ఈయన ఈమధ్య హిందీ చిత్రాల్లో పెద్దగా కనిపించడం లేదు. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాలతో హిట్స్ అందుకున్న ఆయన బాలీవుడ్ మూవీస్‌లో కనిపించకుండా పోవడానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'మెయిన్ స్ట్రీమ్ సినిమాలో నేను లేకుండా పోయాను. కరణ్ జోహార్, సాజిద్ నదియావాలా, ఆదిత్య చోప్రా సినిమాలు ఒక్కటి కూడా చేయడం లేదు. కారణం.. వాళ్లు నాకు ఒక్క ఆఫర్ కూడా ఇవ్వట్లేదు. ఒకప్పుడు వీళ్లందరికీ నేను డార్లింగ్.. వీళ్లు తీసిన సినిమాల్లో నేనూ ఉన్నాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పోనీలే.. నన్ను వారి మూవీస్‌లోకి తీసుకోనందుకు నేను వాళ్లను తప్పుపట్టడం లేదు. కానీ వాళ్లు నాకు ఛాన్స్ ఇవ్వకపోవడం వల్లే నేను వేరే దారి వెతుక్కున్నాను.. అలా తమిళ సినిమా కనెక్ట్ చేశాను. తెలుగులో టైగర్ నాగేశ్వరరావు చేశాను. హిందీలో సూరజ్ బర్జాత్యా ఊంచై చేశాను. కానీ నా స్నేహితులు నన్ను పక్కన పెట్టేసినందుకు బాధేసింది. ఒక ద్వారం మూసుకున్నా మరోవైపు ఎన్నో ద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్పుకొచ్చాడు. చదవండి: బ్రహ్మాస్త్ర గ్రాండ్ ఈవెంట్: ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ అనసూయ వివాదం.. నన్నెందుకు తిడుతున్నారు? -
ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా?
పూలదండల చాటున ఉన్న ఈ వధూవరులెవరో గుర్తుపట్టారా? ఈ నటుడు ఈ మధ్య వరుస విజయాలు అందుకోవడంతో ఇండియా అంతటా అతడి పేరు మార్మోగిపోతోంది. అతడు మరెవరో కాదు అనుపమ్ ఖేర్. ఈరోజు ఆయన పెళ్లిరోజు! బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఫుల్ జోష్ మీదున్నాడు. తాను నటించిన రెండు సినిమాలు కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 ఘన విజయం సాధించడంతో సంతోషంలో మునిగి తేలుతున్నాడు. శుక్రవారం(ఆగస్టు 26) అనుపమ్- కిరణ్ ఖేర్‌ల పెళ్లిరోజు. ఈ సందర్భంగా అతడు సోషల్ మీడియాలో తన పెళ్లి ఫొటో షేర్ చేశాడు. 'హ్యాపీ యానివర్సరీ కిరణ్. ఇటీవల నేను సిమ్లా వెళ్లినప్పుడు మా నాన్నగారి ట్రంకు పెట్టెలో నుంచి 37 ఏళ్ల క్రితం దిగిన ఈ ఫొటోను బయటకు తీశాను. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు. ఇక ఈ ఫొటోలో బంగారు రంగు చీరను ధరించిన కిరణ్ ఒంటి నిండా నగలతో ధగధగా మెరిసిపోతుంది. అనుపమ్ సింపుల్‌గా ఓ ధోతీ ధరించాడు. వీరిద్దరి మెడలోనూ పూలమాలలు ఉన్నాయి. కాగా అనుపమ్, కిరణ్‌లు 1985లో పెళ్లి చేసుకున్నారు. ఇది కిరణ్ ఖేర్‌కు రెండో వివాహం. ఇదిలా ఉంటే అనుపమ్ ప్రస్తుతం కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీలో నటిస్తున్నాడు. రాజకీయ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే అతడు ఐబీ 71, ఊంచై సినిమాలు చేస్తున్నాడు. Happy anniversary dearest #Kirron. Dug out this pic of our wedding 37years ago from the Treasure Trunk of my father during my recent visit to Shimla!😍! May God give you all the happiness, long and healthy life. सालगिरह मुबारक! 😍🌺😍 #MarriageAnniversary @KirronKherBJP #37Years pic.twitter.com/EEiSDcZrfB — Anupam Kher (@AnupamPKher) August 26, 2022 చదవండి: కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్, మూడేళ్లుగా దాచిపెట్టాడు! బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు -
బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు
ఈ మధ్యకాలంలో హిందీ సినిమాలకు ఆదరణ తగ్గిపోతుంది. అక్కడ వరుసగా సినిమాలు పరాజయం కావడం, దక్షిణాది చిత్రాలు అక్కడ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. బాలీవుడ్ చిత్రాలు ఫ్లాప్ అవ్వడంపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటీవల ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన ఆయన ఈ సందర్భంగా బాలీవుడ్‌పై సంచలన కామెంట్స్ చేశారు. దక్షిణాది పరిశ్రమ మంచి కథల చూట్టూ తిరుగుతుంటే బాలీవుడ్ మాత్రం హీరోలను అమ్ముకునే ఆలోచనలో ఉందన్నారు. చదవండి: ఆ ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన ట్వీట్ అందుకే హిందీ చిత్రాలకు ఆదరణ తగ్గిపోతుందన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీ కథలపై దృష్టి పెడుతుంది బాలీవుడ్ పరిశ్రమ మాత్రం హీరోలపై దృష్టి పెడుతుంది. అందుకే సౌత్ సినిమాలు దూసుకెళ్తుంటే బాలీవుడ్ డీలా పడిపోతుంది’ అన్నారు. ‘‘మనం వినియోగదారుల కోసం వస్తువులను తయారు చేస్తున్నాం అనుకుందాం. ఎప్పుడైతే వినియోగదారులను చిన్నచూపు చూడటం ప్రారంభిస్తామో అప్పటి నుంచే సమస్య మొదలవుతుంది. ‘మేం ఒక గొప్ప సినిమా చేయడం వల్ల మీరు లాభం పొందుతున్నారని, మీరు ఒక గొప్ప సినిమా చూస్తారు’ అనుకోవడం తప్పు. ఎందుకంటే గొప్పతనం అనేది సమిష్టి కృషితో సాధ్యం అవుతుంది. చదవండి: ఆ డైరెక్టర్‌కి అలా హగ్ ఇచ్చా.. అందరు వింతగా చూశారు: కియారా ఈ విషయాన్ని తెలుగులో పనిచేయడం వల్ల నేను నేర్చుకున్నా. ఈ మధ్యే తెలుగులో కార్తీకేయ 2లో నటించా. తమిళంలో కూడా ఒక సినిమా చేశాను. ఇప్పుడు మలయాళ చిత్రంలో కూడా నటించబోతున్నాను. అయితే దక్షిణాదిలో నేను ఏ రెండింటి మధ్య తేడా చూడటం లేదు. అక్కడి వాళ్లు కథను నమ్ముకుంటారు తప్పా హాలీవుడ్‌ను ఇష్టపడరు. కానీ ఇక్కడ(బాలీవుడ్) మేం స్టార్లను అమ్ముతున్నాం’’ అని అన్నారు. కాగా అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ‘కార్తికేయ 2’లో ఆయన అతిధి పాత్రలో కనిపించారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ తెలుగు చిత్రం.. హిందీతో పాటు పలు భాషల్లో భారీ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. -
టైగర్ నాగేశ్వరరావు బయోపిక్: రవితేజ సినిమాలో అనుపమ్
ప్రముఖ హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రంలో కీలక పాత్ర అంగీకరించారు. రవితేజ టైటిల్ రోల్లో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ది కశ్మీరీ ఫైల్స్’లో అనుపమ్ చేసిన పుష్కర్ నాథ్ పండిట్ పాత్ర సినిమాకి హైలైట్‌గా నిలిచింది. మళ్లీ అభిషేక్ నిర్మాణంలో మరో సినిమా చేయనుండటం పట్ల అనుపమ్ ఆనందం వ్యక్తం చేశారు. స్టువర్ట్పురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా 1970 నేపథ్యంలో రూపొందుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే కాదు.. నిఖిల్ ‘కార్తికేయ 2’లోనూ అనుపమ్ కీలక పాత్ర చేస్తున్నారు. -
కార్తికేయ 2: ముఖ్య పాత్రల పోస్టర్స్ రిలీజ్
యంగ్ హీరో నిఖిల్; చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం కార్తికేయ 2. ఈ మధ్యే విడుదలైన మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్‌తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. దీనిపై ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ భక్తుల సమితి) వైస్ ప్రెసిడెంట్ రామ్‌రధన్ దాస్ కార్తికేయ 2పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో కార్తికేయగా నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తుంటే.. ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కనిపిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్ పాత్రలో వైవా హర్ష నటిస్తున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. The World of #karthikeya2 is opening up… Teaser Coming soon ☺️ India's epic mystical adventure🌟🔥releasing on July 22nd @actor_Nikhil @anupamahere @AnupamPKher @harshachemudu @AdityaMenon22 @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @kaalabhairava7 pic.twitter.com/wHgMj4l72B— Nikhil Siddhartha (@actor_Nikhil) June 10, 2022 చదవండి: సీక్రెట్‌గా సింగర్ పెళ్లి, ఆపేందుకు ప్రయత్నించిన మాజీ భర్త మాడవీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన కొత్త పెళ్లికూతురు -
సినిమా ఛాన్స్.. అప్పుడు ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాను: నటి
ప్రముఖ నటి మహిమ చౌదరి క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుందని నటుడు అనుపమ్ ఖేర్ వెల్లడించాడు. '‘నా 525వ చిత్రం ‘ద సిగ్నేచ’ర్లో ఓ కీ రోల్ కోసం నెల రోజుల క్రితం అమెరికా నుంచి మహిమకు కాల్ చేశాను. అప్పుడే తను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించడంలో నేను కూడా భాగం కావాలని ఆమె కోరుకుంది’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో మహిమ.. క్యాన్సర్ వ్యాధితో తాను చేసిన పోరాటం గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయింది. ‘మీ 525 సినిమాలో నటించాలని మీరు కాల్ చేసినప్పుడు నేను హాస్పిటల్ బెడ్‌పై ఉన్నాను. నా చుట్టూ డాక్టర్లు, నర్సులు ఉన్నారు. నా జుట్టు పూర్తి పోయింది. మీరు ఇప్పుడు కాల్ చేశారేంటి అనుకున్నాను. ఇంకా వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించాలని ఇంకా నాకు ఎన్నో కాల్స్ వచ్చాయి. నేను నటిస్తానని చెప్పలేను. ఎందుకంటే నా హెయిర్ మొత్తం లాస్ అయ్యింది’ అని చెప్పుకొచ్చింది. ‘సాధారణ చెకప్ కోసం వెళ్లగా క్యాన్సర్ బయటపడింది. నాకు ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు కూడా కనిపించలేదు. కానీ క్లారిటీ కోసం చెకప్‌కు వెళ్లాను. టెస్ట్ చేసిన డాక్టర్లు ఇది క్యాన్సర్ కణతి అయ్యుండొచ్చు అన్నారు. మీరు దీన్ని తీసేయాలనుకుంటున్నారా? అని అడిగారు. వద్దు వద్దు నేను జస్ట్ చెకప్ కోసం వచ్చాను అన్నాను. చివరకు బయాప్సీ చేసి కణతి తీసి టెస్ట్ చేయగా క్యాన్సర్‌గా తేలింది. ఆ తర్వాత కీమోలు ఇస్తున్న సమయంలో చాలా నీరసించి పోయాను. ఎనర్జీ లాస్ అయ్యాను. నా హెయిర్ పోయింది. కానీ ధైర్యంతో ఈ వ్యాధిని ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’ అని వివరించింది. కాగా క్యాన్సర్‌పై ఎంతో మంది మహిళలకు అవగాహన కల్పించేందుకు మహిమ తనని కూడా భాగం చేశారని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) -
ఇట్స్ అఫీషియల్: కశ్మీర్ ఫైల్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయింది. తాజాగా కశ్మీర్ ఫైల్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రయూనిట్. జీ 5లో మే 13 నుంచి ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కశ్మీర్ ఫైల్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపిం. మొత్తానికి ఈ సినిమాను మరోసారి చూసే ఛాన్స్ దొరికిందంటూ సంబరపడిపోతున్నారు సినీప్రియులు. Bringing the story of the Kashmiri Pandits straight to you. If you missed it, this is your chance to watch the truth unfold.#TheKashmirFiles premiering 13th May on #ZEE5#TheKashmirFilesOnZEE5 pic.twitter.com/uAFFEp3O0u — ZEE5 (@ZEE5India) April 25, 2022 చదవండి: పోలీసులు ఘోరంగా అవమానించారు, కాలర్ పట్టుకుని.. Shahid Kapoor: నాకెప్పటికీ ఆ స్కూల్ డేస్ అంటే ఆసహ్యం -
The Kashmir Files: అందుకే పబ్లిసిటీ చేయలేదు.. నిర్మాత అభిషేక్ అగర్వాల్
‘సినిమా అనేది కమర్షియల్. కానీ ఐదు లక్షల మంది కశ్మీర్ పండిట్ల బాధలు, సమస్యలను 32 ఏళ్ల తర్వాత ‘ది కశ్మీర్ ఫైల్స్’మూవీతో బయటకు తెచ్చాం. ఈ చిత్రం యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి సంఘటనలు జరిగాయా! అంటూ ఇవి చూస్తుంటే మాకే సిగ్గేస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంత మంచి సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు పాదాభివందనాలు చేస్తున్నాను’అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ.. పెను సంచలనంగా మారింది. విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్ లో తన సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. ఆ విశేషాలు. ► ముందుగా ఈ సినిమాను ఆదరిస్తున్న యావత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ► సినిమా విడుదలకు ఐదురోజుల ముందు ఒక మహిళ ఢిల్లీ నుంచి 20 వేల రూపాయలతో టికెట్ పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ మరీ హైదరాబాద్‌కు వచ్చింది. వచ్చీ రాగానే తెగ ఏడ్చేసింది. నాకు ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. 32 ఏళ్ళ నుంచి మా పండిట్ ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. నా కుటుంబం ఆ టైంలో ఎంతో సఫర్ అయింది అంటూ ఆమె జ్ఞాపకాలు తెలియజేసింది. అదే రోజు రాత్రి కశ్మీర్ పండిట్ ల తో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. రెండు వేల మంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు. ►ఈ సినిమా చేసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి రీసెర్ఛ్ చేశాం.. మూడు నెలలపాటు అమెరికా, కెనడ, దక్షిణాఫ్రికా మొదలైన ప్రదేశాలు తిరిగి అక్కడున్నవారి నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ► ఇది ప్రజల సినిమా. ఇతర సినిమాలు అదే టైంలో విడుదలైనా వారి ఇష్టం మేరకు ఆయా సినిమాలు చూస్తారు. మాది చిన్న సినిమా. అందుకే పెద్దగా పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు. చిన్న సినిమా కాబట్టి ఎవరూ సపోర్ట్ చేయరని తెలుసు. కానీ సినిమా విడుదలయ్యాక అన్ని చోట్లనుంచి, ముఖ్యంగా తెలుగు చలన చిత్రరంగంలో ఎంతోమంది అభినందలు కురిపించారు. కశ్మీర్ పండితులకు ఈ సినిమా అంకితం చేస్తున్నాం. ► ప్రధాని నరేంద్రమోదీని కలవడం అనేది యాదృశ్చికంగా జరిగింది. ఒకరోజు ఆయన ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళి కలిశాం. ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. ► ఈ సినిమా తర్వాత పర్యావసనాలు ఏమైనా వుంటే ఛాలెంజ్ గా తీసుకున్నాం. సినిమా తీసేటప్పుడు కొంత ఫేస్ చేశాను. విడుదలకుముందు కొంత ఫేస్ చేశాను. ఇలాంటి సమస్యలు వస్తాయనే ముందుగాను ప్రిపేర్ అయ్యాను. ► నిజాయితీగా ఈ సినిమాను తెరకెక్కించాం. అందుకే ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు. నేను ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రజలే సపోర్ట్ చేయరు. ► త్వరలో దేశంలో అన్ని భాషల్లో డబ్ చేసే ఆలోచన వుంది. తెలుగులోకూడా డబ్ చేయబోతున్నాం. ► మా సినిమాకు అస్సాం, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటకతోసహా మొత్తం 9 రాష్ట్రాలలో టాక్స్ మినహాయింపు వచ్చింది. ►ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కశ్మీర్ పండిట్ గా నటించారు. ఆయన పాత్రలో లీనమై పోయారు. ఆయనేకాదు చాలమంది నటీనటులు ఫీల్ అయి చేశారు. రాత్రి పూటా ఆ పాత్రలో మమేకం అయి నిద్ర సరిగ్గా పట్టేదికాదు. ► షూటింగ్ జరుగుతుండగా అనుపమ్ ఖేర్ ను అక్కడి హిందువులు డిన్నర్‌కు ఆహ్వానించేవారు. 90 ఏళ్ళ వృద్ధురాలు కూడా తను ఇంటిదగ్గర వండి భోజనం తీసుకువచ్చేది. ఇలా ఎంతోమంది హిందువులును కలిసి వారితో షేర్ చేసుకున్న సంగతులు నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చాయి. ►ఈ సినిమాను అందరూ పర్సనల్ గా తీసుకుని నటించారు. దర్శకుడు పూర్తి క్లారిటీతో సినిమా తీశాడు. ►కొత్త సినిమాలు: రవితేజ తో నా డ్రీమ్ ప్రాజెక్ట్.. టైగర్ నాగేశ్వర రావు చేస్తున్నా. ఆ తర్వాత అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతున్నాం. అదేవిధంగా దర్శకుడు వివేక్‌తో ఢిల్లీ ఫైల్స్ అనే సినిమా ఆలోచనలో వుంది. -
రాధేశ్యామ్‌కు పోటీ ఇవ్వనున్న చిత్రం ఇదేనా !
Radhe Shyam Vs The Kashmir Files Box Office Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్'. రోమన్ కాలం నాటి రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలో ప్రేమించిన అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో.. ఆమెను దక్కించుకోవడం కోసం చేసే సాహసమే రాధేశ్యామ్ కథ. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. 'రాధేశ్యామ్' ఇండియాలో మొదటి వారంలో సుమారు రూ. 94.50 కోట్లు కొల్లగొట్టింది. అందులో ఒక్క తెలుగు రాష్టాల (తెలంగాణ/ఏపీ) నుంచి రూ. 78.64 కోట్లు సాధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్ల గ్రాస్ వసూలు చేసింది 'రాధేశ్యామ్'. చదవండి: అప్పుడే ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. కాకపోతే ప్రభాస్ పాపులారిటీ, సినిమా ప్రమోషన్స్‌తో విడుదలైన తొలిరోజు రూ. 46 కోట్లు కొల్లగొట్టింది 'రాధేశ్యామ్'. తర్వాత మిక్స్డ్ పబ్లిక్ టాక్‌తో రోజురోజూకీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గుతున్నాయి. శనివారం (మార్చి 12) రూ. 24. 50 కోట్లు వసూలు చేయగా ఆదివారం (మార్చి 13) రూ. 24 కోట్లు రాబట్టింది. ఈ కలెక్షన్లలో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 37.85 కోట్లతో విడుదలైన రోజు ప్రారంభం కాగా శనివారం రూ. 21.48 కోట్లు, ఆదివారం 19.31 కోట్లు వసూళ్లు సాధించింది. నిజానికి పెద్ద హీరోలంటే విడుదలైన రోజు కంటే తర్వాత రోజుల్లో కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ రాధేశ్యామ్ మాత్రం మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. #RadheShyam AP/TS Box Office Biz stays STRONG despite mixed response. Day 1 - ₹ 37.85 cr Day 2 - ₹ 21.48 cr Day 3 - ₹ 19.31 cr Total - ₹ 78.64 cr#Prabhas — Manobala Vijayabalan (@ManobalaV) March 14, 2022 చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ? ఇక అనేక వివాదాలు, బెదిరింపులు ఎదుర్కొని విడుదలైన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ చిత్రానికి సామాజిక అంశాలను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించే డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి పాపులర్ యాక్టర్స్ నటించిన ఈ చిత్రం 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణకాండకు అద్దం పడుతుంది. అదే మార్చి 11న విడుదలైన ఈ మూవీ సాధారణ కలెక్షన్లతో ప్రారంభమైంది. తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసలు కురుపించడంతో మంచి మౌత్ టాక్ సంపాదించుకుంది. దీంతో రోజు రోజుకీ ఈ సినిమా వసూళ్లు పెరిగిపోతున్నాయి. శుక్రవారం విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' మొదటి రోజు రూ. 3.55 కోట్లు రాబట్టగా, శనివారం రూ. 8.50 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత ఆదివారం ఒకేసారి భారీగా రూ. 15.10 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా మొదటి వారంలో ఈ మూవీ వసూళ్లు రూ. 27.15 కోట్లకు చేరుకున్నాయి. #TheKashmirFiles shows PHENOMENAL GROWTH… Grows 325.35% on Day 3 [vis-à-vis Day 1], NEW RECORD… Metros + mass belt, multiplexes + single screens, the *opening weekend biz* is TERRIFIC across the board... Fri 3.55 cr, Sat 8.50 cr, Sun 15.10 cr. Total: ₹ 27.15 cr. #India biz. pic.twitter.com/FsKN36sDCp — taran adarsh (@taran_adarsh) March 14, 2022 కలెక్షన్లతో పోల్చుకుంటే 'రాధేశ్యామ్'కు చాలా వెనకంజలో 'ది కశ్మీర్ ఫైల్స్' ఉంది. కానీ రెండు సినిమాలపై ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం 'రాధేశ్యామ్'ను 'ది కశ్మీర్ ఫైల్స్' కొద్దివరకైనా చేరుకునే అవకాశాలు లేకపోలేదని మూవీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా రెండు సినిమా కథలను మాత్రం పోల్చి చూడలేం. ఒకటి రొమాంటిక్ లవ్‌స్టోరీ అయితే మరొకటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అయితే ప్రభాస్ స్టార్డమ్, వరల్డ్‌వైడ్‌గా డార్లింగ్ ఉన్న పాపులారిటీని 'ది కశ్మీర్ ఫైల్స్' రీచ్ అవుతుందా ?.. లేదా బీట్ చేస్తుందా ? చూడాలి. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో -
ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ?
PM Narendra Modi Appreciates The Kashmir Files Movie Special Story: బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషిలు కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమాకు ప్రముఖ బీటౌన్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకూ 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే సినిమాతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించడంలో వివేక్ అగ్నిహోత్రి అస్సలు వెనుకాడరు. అలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిందే 'ది కశ్మీర్ ఫైల్స్'. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు హరియానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా తమవంతు సాయంగా పన్ను రాయితీని ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మరీ ఇంతలా ఆకట్టుకుంటున్నా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలో ఏముంది ? ఈ మూవీ కథేంటీ ? అనే సందేహం రాకుండా ఉండదు. ఆ సందేహం వచ్చిన ప్రేక్షకుల కోసమే 'సాక్షి' స్పెషల్ స్టోరీ. కశ్మీర్ పండిట్లపై సాముహిక హత్యాకాండ.. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా కథ 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండకు అద్దం పడుతుంది. కశ్మీర్ లోయలోని ఓ వర్గంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణ కాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలను వివస్త్రలుగా చేసి, సాముహిక మానభంగానికి ఒడిగట్టారు. ఆ లోయలో ఉండాలంటే మతం మారాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అడ్డుకున్న వారిని అడ్డుతొలగించుకుంటారు. వారి ఆస్తులను దోచుకున్నారు. ఎదురు తిరిగినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. తుపాకులు, కత్తులతో దారుణంగా దాడి చేశారు. పాకిస్తాన్ జిహాదీ మూకతో చేతులు కలిపి ఆకృత్యాలకు పాల్పడటం వారిని కలచివేసింది. ఈ దారుణమైన ఉదంతానికి పర్యవసానంగా సుమారు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్లు స్వదేశంలోనే శరణార్థులుగా మారారు. దీంతో వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. ఢిల్లీ పురవీధుల ఫుట్పాత్స్పై ఏళ్ల తరబడి జీవితాన్ని గడిపారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. బాధ్యతాయుత పౌరుడిగా తీశాను.. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేందుకు, సినిమా రూపంలో తెరకెక్కిచ్చేందుకు ఎంతో గుండె ధైర్యం ఉండాలి. వాస్తవ గాథలను చిత్రీకరిస్తున్నామని చెప్పి అనేకమంది దర్శకనిర్మాతలు వసూళ్ల కోసం కక్కుర్తితో రాజీ పడి రూపొందిస్తుంటారు. కానీ ఎలాంటి రాజీ లేకుండా తెరకెక్కించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ‘‘కశ్మీర్లో 1990వ దశకంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను ‘కశ్మీర్ ఫైల్స్’లో చూపించాం. కశ్మీర్లో జరిగిన అసలు సిసలైన వాస్తవాలు బయటకు రాలేదు. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను.. నాలుగేళ్లపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను. మా చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి.’’ అని హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. ‘‘గడిచిన 30 ఏళ్లల్లో ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి కథను ఎవరూ తీయలేదు’’ అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. సినిమా చూసి కంటతడి పెట్టిన మహిళ.. అయితే మన దేశంలోని కశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఈ అత్యంత భయానకమైన ఘటనను వెండితెరపై ఆవిష్కరించడం అంత సులువుకాదు. దర్శకనిర్మాతలకు ఈ సినిమా రూపొందించడం నల్లేరుపై నడకల జరగలేదు. 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ఈ చిత్రాన్ని ఆపేయమని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఈ మూవీని అడ్డుకోవడానికి కోర్టులో వ్యాజ్యాలు సైతం వేశారు. ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి 'ది కశ్మీర్ ఫైల్స్'ను ఉన్నది ఉన్నట్లుగా నటీనటుల సహకారంతో వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ప్రతీ సన్నివేశం, నటీనటుల భావోద్వేగపు యాక్టింగ్ ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెటర్ సురేష్ రైనా తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక మహిళ వివేక్ పాదాలు తాకడం, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ బిగ్గరగా ఏడవడం మనం చూడొచ్చు. అనంతరం డైరెక్టర్ వివేక్, నటుడు దర్శన్ కుమార్ ఆ మహిళను ఓదార్చారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి డైరెక్టర్, దర్శన్ కుమార్ సైతం కంటతడి పెట్టుకున్నారు. ప్రేక్షకుల నీరాజానలు అందుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదలు కాగా మన దేశంలో 561 థియేటర్లలో, ఓవర్సీస్లో 113 స్క్రీన్స్‌లలో ప్రదర్శించబడుతోంది. Presenting #TheKashmirFiles It’s your film now. If the film touches your heart, I’d request you to raise your voice for the #RightToJustice and heal the victims of Kashmir Genocide.@vivekagnihotri @AnupamPKher @AdityaRajKaul pic.twitter.com/Gnwg0wlPKU — Suresh Raina🇮🇳 (@ImRaina) March 11, 2022 -
నిజ సంఘటనల ఆధారంగా ‘కశ్మీర్ ఫైల్స్’
‘‘కశ్మీర్లో 1990వ దశకంలో హిందూ పండితులను టార్గెట్ చేసి టెర్రరిస్టులు ఊచకోత కోశారు. అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను ‘కశ్మీర్ ఫైల్స్’లో చూపించాం. మా చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి’’ అని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ నటించిన చిత్రం ‘కశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి నిర్మించిన ఈ హిందీ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..‘‘కశ్మీర్లో జరిగిన అసలు సిసలైన వాస్తవాలు బయటకు రాలేదు. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను.. నాలుగేళ్లపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను’’ అన్నారు. ‘‘గడచిన 30 ఏళ్లల్లో ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి కథను ఎవరూ తీయలేదు’’ అన్నారు అభిషేక్ అగర్వాల్. ‘‘మాపై నమ్మకంతో సినిమా విడుదలకు సహకరిస్తున్న తేజ్ నారాయణ్, అభిషేక్‌లకు థ్యాంక్స్’’ అన్నారు పల్లవి జోషి. నటుడు దర్శన్ కుమార్, బీజేపీ నాయకుడు రామచంద్రరావు, పరిపూర్ణానంద స్వామి తదితరులు మాట్లాడారు. -
భావోద్వేగంగా 'ది కశ్మీర్ ఫైల్స్' ట్రైలర్.. కంగనా ప్రశంసలు
The Kashmir Files Movie Trailer Out And Released In March: అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలకపాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. 'ది తాష్కెంట్ ఫైల్స్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ సోమవారం (ఫిబ్రవరి 21) విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, భావోద్వేగంగా ఉంది మూవీ ట్రైలర్. 1990 సంవత్సరంలో కశ్మీర్‌లోని ఒక సామాజిక వర్గంపై జరిగిన హత్యలను డైరెక్టర్ వివేక్ భావోద్వేగంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌పై బాలీవుడ్ డేరింగ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. సినిమాను చాలా బాగా తీశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోందని, ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఛీ నువ్వు ఏం బాగాలేవు.... ఎండు చేపలా ఉన్నావు’
ముంబై: మనకు మనం బాగానే ఉన్నట్లు కనిపిస్తాం. కానీ మన అమ్మలకు మనం ఎప్పుడూ చిన్నపిల్లలే అన్నట్లుగా మనల్ని ఎప్పడూ చూసిన సన్నగా ఉన్నారంటూ తిడుతుంటారు. మనకేమో మనం బాగానే ఉన్నాం అనిపిస్తుంది. కానీ ఇక్కడ బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ని సన్నగా ఉన్నావు, నువ్వేం బాగోలేదు అంటూ వాళ్లమ్మ దులారీ ఖేర్ తిడుతుంటుంది. (చదవండి: వీటి స్నేహం బంధం చాలా గొప్పది) పైగా నువ్వు ఎండు చేపలా ఉన్నావు అంటూ పోల్చి మరీ తిడుతుంది. ఆఖరికి అనుపమ్ తాను తింటున్న పరాటాను చూపించనప్పడూ కూడా అతని తల్లి ఆగకుండా రకరకాల హావాభావాలు పెట్టి మరీ తిడుతూనే ఉంటుంది. ఈ మేరకు అనుపమ్ మాట్లాడుతూ.."ఒక నెల తర్వాత అమ్మ నన్ను చూడటంతో ఇలా తిడుతుందని చెబుతున్నారు. తిడితే తిట్టింది గారీ నాకు రెండు మంచి షర్ట్లు తీసుకు వచ్చింది. పైగా మా అమ్మకు నేను చేసిన పరాట కూడా ఆమెకు బాగా నచ్చింది. ఆమె ఉన్నప్పుడూ నిస్తేజంగా ఉండటం అస్సలు కుదరదు. ఆమె లాగానే అందరూ సందడిగా ఉండాల్సిందే. " అన్నారు. (చదవండి: బంపరాఫర్.. ఆ షాపులో ఒక డ్రెస్ ఖరీదు రూ.1 మాత్రమే..!) -
Apple: ఏంది యాపిల్ ఇది.. భారత్ అంటే లెక్కేలేదా?
Anupam Kher On Apple: యాపిల్ ఉత్పత్తుల పట్ల భారతీయులకు యమ క్రేజు ఉంటుంది. పైగా ఆ ప్రొడక్టుల కొనుగోళ్లలో భారత్ అతిపెద్ద మార్కెట్ అని తెలిసిన విషయమే కదా. అందుకే తాజాగా జరిగిన అతిపెద్ద ఈవెంట్‌ను భారత్ నుంచే ఎక్కువ మంది లైవ్‌లో వీక్షించారు. అయితే యాపిల్ మాత్రం భారత్ విషయంలో లెక్కలేని తనం ప్రదర్శిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. నటుడు అనుపమ్ ఖేర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్ ఫిఫ్త్ ఎవెన్యూలోని యాపిల్ స్టోర్‌ను మొన్న మంగళవారం ఆయన సందర్శించారట. అక్కడ ఒలింపిక్స్ కలెక్షన్ పేరుతో కొన్ని వాచీలను డిస్ప్లే ఉంచారు. ఆ వాచీలపై దాదాపు అన్ని జెండాలు ఆయనకు కనిపించాయి. అయితే భారత్ జెండా కనిపించకపోయే సరికి ఆయన చిన్నబుచ్చుకున్నారు. ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. స్మార్ట్ వాచీ కలెక్షన్ బాగుంది. కెనెడా, ఆసీస్, ఫ్రాన్స్.. జమైకా లాంటి చిన్న దేశాల జెండాలతో కలెక్షన్స్ ఉంచారు. కానీ, అందులో భారత్ జెండా మాత్రం లేదు. ఈ విషయంలో నిరాశ చెందాను.. కారణం ఏమై ఉంటుంది? యాపిల్ ఉత్పత్తులను ఉపయోగించేవాళ్లు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారు కదా! మరి మా జెండా కనిపించలేదా? అని అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ఇదిలా ఉంటే యాపిల్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి! Dear @Apple! Visited your store on 5th ave in NY! Impressive! There were watches of International Olympic collection representing flags of various countries! Was disappointed not to see INDIA’s watch there? I wonder why? We are one of the largest consumers of #Apple products!😳🇮🇳 pic.twitter.com/IVvB8TmkGU — Anupam Kher (@AnupamPKher) September 14, 2021 చదవండి: ఐఫోన్ 13 లాంఛ్.. ఊహించని ట్విస్ట్ -
ముగ్గురు మిత్రుల కథ
బాలీవుడ్ సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే ౖహె∙కౌన్’, ‘ప్రేమ రతన్ ధన్ పాయో’ వంటి చిత్రాలను తెరకెక్కించిన సూరజ్ బర్జాత్యా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు ‘ఊంచాయీ’ అనే టైటిల్ అనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. ముగ్గురి వ్యక్తుల జీవితాల్లోని స్నేహం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం. ‘‘మే డే’ (అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్న చిత్రం) షూటింగ్లో అమితాబ్ బచ్చన్‌ను కలిశాను. సూరజ్ డైరెక్షన్‌లోని సినిమా గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఓ రోజు అనుపమ్ ఖేర్ ఫోన్ చేసి.. ‘ఇంకా ఏంటి ఆలస్యం.. టీమ్‌లోకి వచ్చెయ్’ అన్నారు. అంతే.. నేను కూడా ఈ సినిమా చేయడానికి సిద్ధమైపోయాను’’ అని పేర్కొన్నారు బొమన్ ఇరానీ. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో ప్రారంభించాలనుకుంటున్నారు. -
ప్రముఖ సీనియర్ నటికి బ్లడ్ క్యాన్సర్..
ముంబై : బీజేపీ చండీగఢ్ ఎంపీ, సీనియర్ నటి కిరణ్ ఖేర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ రకమైన బ్లడ్ క్యాన్సర్‌కు గురైన కిరణ్ ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని చండీఘడ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సూద్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ. .కిరణ్ ఖేర్ గత సంవత్సరం నవంబర్ 11న చండీగఢ్‌లోని తన ఇంట్లో పడిపోవడం వల్ల ఎడమ చేయి విరిగిందని, దీంతో చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఆర్)లో వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. ఇందులో ఆమెకు మల్టిపుల్ మైలోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. అనంతరం ఈ వ్యాధి ఆమె ఎడమ చేతి నుంచి కుడి భుజానికి వ్యాపించిందని, వైద్యం కోసం డిసెంబర్ 4న ముంబైలోని ఆసుపత్రిలో చేరిందని పేర్కొన్నారు. నాలుగు నెలల చికిత్స పొందుతున్న కిరణ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆమెను ఇకపై ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరనవసరం లేదన్నారు. కేవలం సాధారణ చికిత్స కోసం ఆసుపత్రిని సందర్శించాల్సి ఉంటుందని అరుణ్ సూద్ తెలిపారు. కాగా కిరణ్ బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ భార్య అన్న విషయం తెలిసిందే. అనుపమ్ కూడా తన ఆరోగ్యంపై స్పందిచారు. కిరణ్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు స్వస్తి పలుకుతూ ఆమెకు రక్త క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్టు పెట్టారు. ‘కిరణ్ మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్నారని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆమె ఎంతో అదృష్టవంతురాలు. అందుకే ఆమెను మీరు ఇంతలా ప్రేమిస్తున్నారు. మీ హృదయంలో ఆమె కోలుకోవాలని ప్రార్థించండి. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు- అనుపమ్, సికందర్’.. అని ట్వీట్ చేశారు. కాగా కిరణ్ ఖేర్ 2014లో బీజేపీ పార్టీ తరపున చండీగఢ్ ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2019లోనూ గెలిచి తన స్థానాన్ని నిలుపుకున్నారు. చదవండి: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడుకున్న రోజులూ ఉన్నాయి: నటుడు ‘పెళ్లైన ఆ స్టార్ హీరోతో నయనతార సహజీవనం’ 🙏 pic.twitter.com/3C0dcWwch4 — Anupam Kher (@AnupamPKher) April 1, 2021 -
బాహుబలి లండన్ లో చూసాను : అనుపమ్ ఖేర్
-
‘ది పవర్ ఆఫ్ పాజిటివిటీ’ ముఖ్య అతిథిగా అనుపమ్‌ఖేర్
-
రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడుకున్న రోజులూ ఉన్నాయి: నటుడు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఫిక్కీ ఫ్లో ఆర్గనైజేషన్ ‘ది పవర్ ఆఫ్ పాజిటివిటీ’ పేరుతో హోటల్ ఐటీసీ కాకతీయలో 2020–21 వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఇండియన్ లెజండరీ యాక్టర్, మోటివేషనల్ స్పీకర్, రచయిత, అనుపమ్‌ఖేర్ ముఖ్య అతిథిగా పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. కేరాఫ్ రైల్వే ప్లాట్‌ఫామ్.. నగరంలో మంచి అనుభవాలు ఉన్నాయి. గతంలో తెలుగు సినిమా ‘త్రిమూర్తులు’లో నటించడానికి ఇక్కడికి వచ్చాను. నేను నటిస్తున్న మరో తెలుగు సినిమా కార్తికేయ– 2 త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. 27 ఏళ్ల వయసులో సినిమాల కోసం వచ్చిన నేను మొదట్లో ముంబైలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడుకున్న రోజులూ ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు మహేష్‌భట్ సినిమాలో అవకాశం వచ్చేంత వరకు ఎన్నో కష్టాలు పడ్డాను. ఇండియన్ సినిమా.. లార్జర్ దెన్ లైఫ్.. నాకు తెలిసినంత వరకు భారతీయులు సినిమాని లార్జర్ దెన్ లైఫ్‌గా భావిస్తారు. అందుకే ఇండియాకి సినిమా అనేది లార్జర్ దెన్ లైఫ్‌గా మారింది. ఇక్కడి ఆర్టిస్టులు అన్ని కోణాల్లో నటించినట్టు విదేశీ నటులు నటించలేరు. మన దగ్గరా గొప్ప సినిమాలు వస్తున్నాయి. నేను లండన్‌లో బాహుబ లి సినిమాను చూశాను. ఇది ఒక తెలుగు సినిమాగా చూడను. భారతీయ సినిమాగానే చూస్తా ను. నా జీవితంలో బోర్, మూడ్ అనే పదాలకు దూరంగా ఉన్నాను. ఎప్పుడూ జీవితాన్ని ఆస్వాదిస్తూ, విభిన్న రకాల మనుçషులని కలవడాన్ని ఇష్టపడతాను. ఇప్పటి వరకు మూడు పుస్తకాలు రాశాను. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ‘యువర్ బెస్ట్ డే ఈస్ టుడే’ అనే బుక్‌ని రాశాను. ఈ సమయంలో అంతా విషాదం నిండి ఉంది. రిషి కపూర్, ఇర్పాన్ఖాన్ లాంటి వ్యక్తులనే కాకుండా చుట్టూ ఎంతో మందిని కోల్పోయాం. ఆ సమయంలో పాజిటివిటీని, ఆశావాదాన్ని నింపడానికి నా ఆలోచనలతో దీనిని రాశాను’ అన్నారు. కార్యక్రమంలో ఫిక్కీ ఫ్లో చైర్పర్సన్ ఉషారాణి మన్నె, పింకీ రెడ్డి, అపూర్వ జైన్, రేఖారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సల్మాన్‌ఖాన్ కాదండీ.. ఇంతకీ ఎవరండీ?
తిండి కలిగినంత మాత్రాన ‘కండ’ కలదు... అనే విషయంలో గ్యారెంటీ ఏమీలేదు. తిండికి తగినట్లు తగిన వ్యాయామాలు చేయాలి. అప్పుడే కండ. లేనిచో ‘బొజ్జ కలదోయ్’ అనుకోవాల్సి వస్తుంది. ఫిన్నెస్పై శ్రద్ధ పెట్టడం అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి మస్తు మంచిది అనే విషయం తెలిసినా చాలామంది ‘ఆ..ఈ వయసులో ఏంచేస్తాం లెండి’ అని తప్పించుకుంటుంటారు. కొందరేమో ‘బిజీ’ అంటూ సాకులు వెదుక్కుంటారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌ను చూడండి. అతని వయసు 65 సంవత్సరాలు. ‘ఈ వయసులో ఏమిటీ’ అని ఎప్పుడూ అనుకోలేదు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. రకరకాల కసరత్తులతో చూడముచ్చటగా తీర్చిదిద్దుకున్న తన బాడీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఖేర్. ‘ఎన్నడూ ఒప్పుకోవద్దు ఓటమి’ అని కామెంట్ కూడా పెట్టారు. అంతే కదా మరి! చదవండి: పవన్ కల్యాణ్ అడిగితే.. ఆయనకు 4వ భార్యగా ఉంటా.. -
నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా: హీరో
ఫిబ్రవరి 3 తన తల్లి మోనా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ఒక మనసును తాకే వీడియోను విడుదల చేశాడు. ‘అమ్మ పుట్టినరోజు నేడు. తను ఉంటే ఎంత హడావిడి ఉండేదో. నేను నా అభిమానులకు చెప్పేది ఒక్కటే. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము. కనుక మన కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి’ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. నిజానికి అర్జున్ కపూర్ బాల్యం అంత సుఖంగా సాగలేదు. అతడు ప్రఖ్యాత నిర్మాత బోనీ కపూర్ కుమారుడు. ఇద్దరు పిల్లలు పుట్టాక బోనీ కపూర్ నటి శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం బోనీ కపూర్ కుటుంబంలో సహజంగానే తుఫాన్ రేపింది. బోనీ కపూర్ భార్య మోనా కపూర్ బోనీ కపూర్ నుంచి దూరంగా వచ్చేసింది. బోనీ కపూర్ మీద కొంచెం కూడా ఆధారపడకుండా జీవించ దలుచుకుంది. కొడుకు అర్జున్ కపూర్, కుమార్తె అన్షులా కపూర్ ఆ కారణం వల్ల తల్లితో విపరీతంగా అటాచ్మెంట్ పెంచుకున్నారు. అర్జున్ కపూర్‌కు తండ్రి రెండో పెళ్లి సమయానికి 12 ఏళ్లు. 1996లో బోనీకపూర్‌కు శ్రీదేవితో పెళ్లి జరిగాక ఆ వంటరితనం వల్ల మోనా కపూర్ చాలా బాధలే పడింది. 2012లో మరణించింది. ఆమె మరణించిన 6 సంవత్సరాలకు శ్రీదేవి మరణించింది. తండ్రి ప్రేమకు దూరమైన అర్జున్ కపూర్ తల్లిని కూడా దూరం చేసుకుని ఆ బాధ తనలో ఎప్పటికీ చెరిగిపోదని చెప్పాడు. ‘అమ్మా... నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అన్నాడు ఆ వీడియోలో. (చదవండి: అవి ఉంటేనే మజా!: జాన్వీ కపూర్) అమ్మను ఆటపట్టించే కొడుకు నటుడు అనుపమ్ ఖేర్‌కు తల్లి దులారి అంటే ఎంతో ప్రేమ. ఆమెకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. నటుడుగా ఎంత పేరున్నా తల్లి ముందు కొడుకులా ఆమెతో కబుర్లలో మునిగిపోతాడు. అంతే కాదు... ఆమెతో టైమ్‌పాస్ సంభాషణలు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఇటీవల అతను విడుదల చేసిన వీడియో జనానికి నచ్చింది. అందులో అతడు తన తల్లిని ‘అమ్మా... నీకు ఇంగ్లిష్ వచ్చా’ అని అడిగితే ఆమె ‘రాదు... నాకు ఇంగ్లిష్ రాదు... నేను చిన్నప్పుడు నీలాంటి అబ్బాయిలతో ఆడుకోవడానికి వెళ్లిపోయేదాన్ని స్కూల్ ఎగ్గొట్టి. ఒకణ్ణి కొడితే వేలు విరిగిపోయింది... చూడు ఇప్పటికీ ఉంది ఆ వంకర’ అని ఆమె ఆ వీడియోలో చూపించింది. అప్పుడు అక్కడే ఉన్న తన తమ్ముడు రాజు ఖేర్ గురించి అనుపమ్ ఖేర్ తల్లికి ఫిర్యాదు చేస్తూ ‘చూడమ్మా.. వాడు రాత్రి ఎనిమిదిన్నరకు టీ తాగుతున్నాడు’ అనంటే ఆమె ‘ఆకలిగా ఉందేమోరా.. నిజమే.. ఈ టైమ్‌లో టీ తాగితే అడ్జస్ట్ కాదు’ అంది. ‘అడ్జస్ట్ కాదమ్మా... డైజెస్ట్’ అని అనుపమ్ ఖేర్ ఆటపట్టించాడు. ‘పెద్ద చెప్పొచ్చావులేరా గాడిదా’ అందామె. కొడుకు ఎంత పెద్దవాడైనా ఆ కొడుకును తిట్టగలిగే శక్తి ఒక్క అమ్మకే కదా ఉంది. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) -
భయం ఎందుకు?
వివేక్ రంజన్ అగ్నిహోత్రీ దర్శకత్వంలో తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ తీస్తున్న హిందీ చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్’. ‘‘కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించి ఇంతవరకూ ఎవ్వరూ సినిమా తీయలేదు. ఆ కథ అందరికీ తెలియజేయాలనుకున్నా’’ అని సినిమాకి శ్రీకారం చుట్టినప్పుడే వివేక్ పేర్కొన్నారు. కశ్మీర్లో ఈ చిత్రం షూటింగ్ జరిపారు. కాగా, ఈ చిత్రాన్ని తీసినవాళ్లను, చూసే ప్రేక్షకులను వదిలేదు లేదంటూ కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ బెదిరించినట్లుగా తాజాగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘‘ఇంకా ఈ సినిమా ఎడిటింగ్ కూడా మొదలుపెట్టలేదు. వాళ్లెందుకు భయపడుతున్నారు? నిజానికా? నిజాన్ని నిర్భయంగా చెప్పాలనుకుంటున్న మమ్మల్ని ఆశీర్వదించండి’’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు అభిషేక్ అగర్వాల్. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఓటమి అనేది సంఘటన మాత్రమే
‘‘36 ఏళ్ల క్రితం సిమ్లా నుండి ఎన్నో ఆశలతో ముంౖబైలో అడుగుపెట్టాను. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ తీసుకుని, ప్రపంచ సాహిత్యాన్ని చదువుకుని ఎంతో ఆత్మవిశ్వాసంతో సినిమా ప్రపంచంలోకి వచ్చాను. నా మొదటి సినిమా ‘సారాన్ష్’ (1984)లో నటించినప్పుడు నా వయసు 29. ఆ చిత్రంలో నేను చేసిన తండ్రి పాత్ర వయసు 65’’ అని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రముఖ హిందీ నటుడు అనుపమ్ ఖేర్. ఆయన వయసు ప్రస్తుతం 65. కెరీర్ ప్రారంభించినప్పటి విశేషాలను అనుపమ్ ఖేర్ చెబుతూ – ‘‘36 ఏళ్ల క్రితం బాలీవుడ్‌కు ఎన్నో కలలను మోసుకొని వచ్చాను. నా మొదటి సినిమా చేసినప్పుడు చాలామంది నాతో ‘అంత పెద్ద వయసున్న పాత్ర చేయటం వల్ల నీ జీవితం సర్వనాశనం కావడం ఖాయం’ అన్నారు. వాళ్లు అన్నట్లుగానే ఆ సినిమా అంతగా ఆడలేదు. వాళ్లు అన్న మాటలను పట్టించుకుని నేను నిరాశపడి ఉంటే ఈ రోజు అనుపమ్ ఖేర్ ఉండేవాడు కాదు. నా చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడూ ఓ మాట చెప్పేవారు. అదేంటంటే.. ఓటమి అనేది జీవితంలో ఓ సంఘటన మాత్రమే. జీవితమే ఓటమి కాదు అని. ఆ మాటను నేనెప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. ‘సారాన్ష్’ తర్వాత రెండున్నరేళ్లకు తొలి విజయం వచ్చింది. కష్టాలు వచ్చినా నవ్వుతూ దిగమింగేవాడిని కానీ నిరాశకు లోనయ్యేవాడిని కాదు. రాజ్‌కపూర్ సాబ్, అమితాబ్‌గారు, రాబర్ట్ డి నిరో లాంటి నటులతో పని చే సినందుకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఓ 515 చిత్రాలు చేసిన తర్వాత కొత్తగా నిరూపించుకోవటానికి ఏముంటుంది? కానీ కెమెరా ముందుకు వెళ్లిన ప్రతిసారీ ‘మనం న్యూకమర్’ అనుకుని పనిచేస్తాను. అది వృత్తిపరంగా నాకెంతో తృప్తినిస్తుంది’’ అన్నారు. -
నటుడి కుటుంబంలో నలుగురికి కరోనా
-
నటుడి కుటుంబంలో నలుగురికి కరోనా
ముంబై: కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలట్లేదు... నెమ్మదిగా బాలీవుడ్లో పాగా వేసిన ఈ వైరస్ ప్రముఖుల ఇంట్లోకి చొరబడుతోంది. ఇప్పటికే బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయం చిత్ర పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. వారు త్వరగా కోలుకోవాలని ఆంక్షిస్తూ అనేకమంది సెలబ్రిటీలు, అభిమానులు చేస్తున్న పోస్టులతో సోషల్ మీడియా తడిసి ముద్దవుతోంది. ఈ క్రమంలో మరో బాలీవుడ్ నటుడి ఇంట కరోనా కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అనుపమ్ ఖేర్ కుటుంబంలో ఒకేసారి నాలుగు కేసులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిస్తూ ఆదివారం ట్విటర్లో వీడియో రిలీజ్ చేశారు. (అమితాబ్, అభిషేక్‌లకు కరోనా) "అమ్మ దులారి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా కోవిడ్ ఉన్నట్లు తేలింది. అయితే ఆమెలో కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఆమెను ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్పించాం. ఆమెతో పాటు తమ్ముడు(రాజు ఖేర్), మరదలు, మేనకోడలు కూడా కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బీఎంసీ అధికారులు, వైద్యులు మాకు ఎంతగానో సహకరించారు. నేను కూడా పరీక్ష చేయించుకోగా నెగెటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేము హోమ్ క్వారంటైన్లో ఉన్నాం. సోదరుడి ఇంటిని శానిటైజ్ చేస్తున్నారు" అని అనుపమ్ పేర్కొన్నారు. (నటి కుటుంబం మొత్తానికి సోకిన కరోనా) -
‘మైఖేల్ జాక్సన్ బాడీగార్డులు నన్ను తోసేశారు’
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ప్రత్యేక ఫోటోని షేర్ చేశారు. 1996లో మైఖేల్ జాక్సన్ భారతదేశం వచ్చినప్పుడు తీసిన ఫోటో ఇది. పాప్ మహారాజు మైఖేల్ జాక్సన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన అనుపమ్ ఖేర్.. ఆనాడు జరిగిన ఓ సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. మైఖేల్ జాక్సన్‌ను చూడటం కోసం తాను బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లానని.. ఆ సమయంలో జాక్సన్ బాడీగార్డులు తనను తోసేశారని తెలిపారు. (‘మన పెళ్లి నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది’) అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. ‘1996లో మైఖేల్ జాక్సన్ ఇండియా వచ్చారు. హోటల్ ఒబెరాయ్‌లో బస చేశారు. ఆయనను కలవడానికి భారత ప్రభుత్వం కొందరిని మాత్రమే ఎంపిక చేసింది. అదృష్టవశాత్తు వారిలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు సాయంత్రం ఒబెరాయ్ హోటల్లో జాక్సన్‌ను కలిసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ పాప్ మహారాజు కోసం ఓ ప్రత్యేక వేదికని ఏర్పాటు చేశారు. దాని మీద మైఖేల్ జాక్సన్ నిల్చుని ఉన్నాడు. చుట్టూ బాడీగార్డులున్నారు. నాతో పాటు ఎంపిక చేసిన మరికొందరు జాక్సన్‌ను కలవడానికి లైన్లో నిల్చుని ఉన్నాం. మరి కొద్ది క్షణాల్లో నేను జాక్సన్‌ని కలుస్తాను. కానీ సంతోషం తట్టుకోలేక బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లాను. ఆయనను హత్తుకునే ప్రయత్నం చేశాను’ అన్నారు. (వైరల్: నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!..) అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. ‘కానీ పక్కనే ఉన్న జాక్సన్ బాడీ గార్డులు నన్ను తోసేసే ప్రయత్నం చేశారు. ఇంతలో భరత్ భాయి షా అక్కడకు పరిగెత్తుకు వచ్చి నన్ను జాక్సన్‌కు పరిచయం చేశాడు. ‘ఇతడు అనుపమ్ ఖేర్. భారతీయ ప్రముఖ నటులలో ఒకరు’ అన్నాడు. అప్పుడు వెంటనే జాక్సన్ మర్యాదపూర్వకంగా వంగి.. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ సమయంలో తీసిన ఫోటో ఇది’ అని చెప్పుకొచ్చారు అనుపమ్ ఖేర్. (ఆ విషయం మైకేల్ జాక్సన్ ముందే చెప్పారు) View this post on Instagram Story of this picture!! When Michael Jackson visited India in 1996 a group of selected people were invited to meet him exclusively at Oberoi hotel gardens. I was also the lucky one. Thanks to Bharat Bhai Shah. There was a small stage set up in the garden with a barricade for the special guests. MJ walked down from his suite and stood on the improvised stage with his bodyguards. There was silence and sense of awe among the selected guests. I was looking at this magician who had enthralled and hypnotised the entire universe with his electrifying performances. He was just few feet away from me. I wanted to capture this moment. So I broke the barricade jumped on the stage and almost hugged MJ. The bodyguards rushed towards me and before they could pick me up bodily Bharat Bhai Shah in panic introduced me to Michael Jackson as the biggest actor in India. He immediately and politely bent down and shook a jubilant me’s hands. And my history was captured in this picture. Sometimes you have to make an effort to create Kucch Bhi Ho Sakta Hai moments. Jai Ho!! 😍😍😎🤓 Pic courtesy my friend @timmins.andre. #MichaelJackson #Overwhelming A post shared by Anupam Kher (@anupampkher) on Jun 29, 2020 at 6:24pm PDT -
ఇంతకన్నా ఏం కావాలి?
న్యూఢిల్లీ: విలక్షణ నటుడు నసీరుద్దీన్ షాపై సుష్మా స్వరాజ్ భర్త, మిజోరం మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నసీరుద్దీన్‌కు దేశం ఎంతో పేరుప్రతిష్టలు ఇచ్చినా దేశం పట్ల ఆయనకు కృతజ్ఞత లేదని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా మాట్లాడిన సీనియర్ నటుడు, బీజేపీ నేత అనుమప్ ఖేర్‌ను నసీరుద్దీన్ విమర్శించిన నేపథ్యంలో స్వరాజ్ కౌశల్ ట్విటర్లో స్పందించారు. ‘మిస్టర్ నసీరుద్దీన్ షా మీరు కృతజ్ఞత లేని వ్యక్తి. ఈ దేశం మీకు పేరు, ప్రతిష్టలతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఇప్పటికీ అజ్ఞానంలోనే ఉన్నారు. మీ మతం కాని మహిళను మీరు పెళ్లి చేసుకున్నా ఎవరూ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. మీ సోదరుడు భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ అయ్యారు. సమాన అవకాశాలకు ఇంతకన్నా ఏం కావాలి. అయినప్పటీకి మీకు సంతృప్తి లేదు. పక్షపాతం, వివక్షపూరితంగా మాట్లాడుతున్నారు. మనస్సాక్షి ఉంటే ఆత్మ పరిశీలన చేసుకోండి. స్వదేశంలో నిరాశ్రయులుగా మారి పడ్డ కష్టాల గురించి అనుపమ్ మాట్లాడారు. దేశం ఎన్ని ఇచ్చినా మీరు మాత్రం దేశానికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదు. హుందా కలిగిన వ్యక్తిగా అనుపమ్ స్పందించారు. మీ మాటలను బట్టి చూస్తే మీరు అల్పంగా కనిపిస్తున్నారు. నిరాశ నుంచి మీ కోపం వ్యక్తమవుతున్నట్టు కనబడుతోంద’ని స్వరాజ్ కౌశల్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. కాగా, ఏబీవీపీ దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్థులను పరామర్శించిన హీరోయిన్ దీపికా పదుకొనేను ప్రశంసించిన నసీరుద్దీన్ బుధవారం అనుపమ్ ఖేర్‌పై విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ సర్కారుకు బాకా ఊదుతున్నారని, ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. (చదవండి: ఆమె ధైర్యాన్ని ప్రశంసించిన నటుడు) -
వైరల్: నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!..
కష్టం వచ్చినపుడు బాధపడుతూ కూర్చోవటం కంటే దానికి పరిష్కారం అన్వేషించటమే తెలివైన పని! అది ఎంత చిన్న కష్టమైనా. ఆ కష్టాన్ని ఎలా గట్టెక్కుతామన్న దాని మీదే మన తెలివి ఆధారపడి ఉంటుంది. మనం చేసే పనికి సృజనాత్మకత తోడైతే? అది కచ్చితంగా వైరల్ న్యూస్ అవుతుంది. ఈ కోణంలోనుంచి ఆలోచిస్తే భారతీయుల కంటే తెలివైన వాళ్లు, సృజనాత్మకంగా ఆలోచించేవాళ్లు లేరని చెప్పొచ్చు. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పోస్ట్ అయిన గంటలోపే దాదాపు 26వేల లైకులతో పాటు వందల కామెంట్లు సొంతం చేసుకున్నాయి. ‘‘అత్యవసరాలను అధిగమించటానికి ఆవిష్కరణలు చేయటంలో భారతీయులే అత్యంత సృజనాత్మకమైన వాళ్లు. ఈ ఫొటోలు ఇందుకు నిదర్శనం’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఫొటోలోని వ్యక్తుల చేష్టలు మనకు నవ్వు తెప్పించినా సమస్యను పరిష్కరించటానికి వారు చూపిన ప్రతిభను తప్పక గుర్తించి తీరాలి. లావాటి మనిషి కిందపడిపోకుండా పొట్టకు అడ్డంగా చెక్కపలక పెట్టుకుని నిద్రపోవటం, ఓ తల్లి తన బిడ్డను కిచెన్ కప్బోర్డు డ్రాయర్లో ఉంచి వంట చేసుకోవటం లాంటివి నెటిజన్లను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!.. మన భవిష్యత్తు చూస్కోండి.. భారతీయులు ఎంతైనా తెలివైన వాళ్లు.’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి లైఫ్ హ్యాకింగులు కొత్త కాకపోయినా వెలుగులోకి వచ్చిన ప్రతిసారి నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. -
‘మన పెళ్లి నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది’
‘ప్రియమైన కిరణ్!!! 34వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు!! జీవితంలోని అత్యధిక సమయం ఇద్దరం కలిసి గడిపాము. అప్పుడే 34 ఏళ్లు గడిచాయా. నాకైతే నిన్ననే మన పెళ్లి అయినట్లు అనిపిస్తోంది. నీతో కలిసి జీవించిన, జీవిస్తున్న ప్రతీ క్షణాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తా’ అంటూ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన భార్య, బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్‌కు విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా అనుమప్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తమ పెళ్లినాటి ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఖేర్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చండీగఢ్‌లో థియేటర్స్ కోర్సు చదువుతున్న సమయంలో ప్రేమలో పడిన అనుమప్- కిరణ్ 1985లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే అంతకుముందే గౌతం బెర్రీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న కిరణ్‌కు సిఖిందర్ అనే కుమారుడు ఉన్నాడు. సిఖిందర్ ప్రస్తుతం అనుమప్-కిరణ్ ఖేర్లతోనే జీవిస్తున్నాడు. ఇక థియేటర్స్‌లో అనుభవం గడించిన అనంతరం బాలీవుడ్లో అడుగుపెట్టిన కిరణ్ ఖేర్ 1996లో ‘సర్దారీ బేగమ్’ అనే సినిమాతో తొలి విజయాన్ని ఆస్వాదించారు. ఆ తర్వాత బరీవాలీ, దేవ్‌దాస్, వీర్‌జరా, హమ్‌తుమ్, దోస్తానా చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించి గుర్తింపు పొందారు. సంప్రదాయ పంజాబీ కుటుంబానికి చెందిన కిరణ్ ఖేర్ రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీలో చేరారు. గత రెండు పర్యాయాలుగా పంజాబ్ రాజధాని చండీగఢ్ ఎంపీ(లోక్‌సభ)గా ఆమె ఎన్నికయ్యారు. కాగా 1984లోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అనుమప్ ఇటీవల ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రేక్షకులను పలకరించాడు. View this post on Instagram Dearest Kirron!!! Happy 34th wedding anniversary!! Bahut lamba waqt zindagi ka saath mei tay kiya hai humne. 34 saal guzar gaye lekin lagta hai Jaise kal ki he baat hai. I have loved the lived quality of our lives together. सालगिरह मुबारक।😍 @kirronkhermp #Pushkar #Dulari #Raju A post shared by Anupam Kher (@anupampkher) on Aug 25, 2019 at 7:58pm PDT -
‘కశ్మీర్ సమస్యకు పరిష్కారం షురూ’
శ్రీనగర్: ఏళ్ల నాటి కశ్మీర్ సమస్యను పరిష్కారించేందుకు ఎట్టకేలకు చర్యలు ప్రారంభం అయ్యాయని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో అభిప్రాయపడ్డారు. కాగా గడిచిన వారం రోజులుగా కశ్మీర్లో భారత భద్రతాదళాలు మోహరిస్తోన్న విషయం తెలిసిందే. కశ్మీర్ సమస్యకు శాస్వత పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగుటు వేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనుపమ్ ఖేర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కశ్మీర్ సమస్యకు పరిష్కారం ప్రారంభమైంది’ అంటూ పోస్ట్ చేశారు. కాగా భారీ ఎత్తున బలగాల తరలింపుతో కశ్మీర్‌ను కేంద్రం పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆదివారం అర్థరాత్రి అనంతరం 144 సెక్షన్ అమలుతో పరిస్థితులు పూర్తిగా వేడెక్కాయి. ఇంటర్ నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు.. పలు జిల్లాల్లో పూర్తి ఆంక్షాలను అమలుచేశారు. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధం చేయడంతో పాటు స్థానిక నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో కశ్మీర్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆసక్తికరంగా మారింది. Kashmir Solution has begun.🇮🇳 — Anupam Kher (@AnupamPKher) August 4, 2019 -
తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన తల్లి దులరీ ఖేర్‌తో చేసిన చాట్ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. మా అమ్మ దులరీ ఖేర్ చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ తల్లీకొడుకుల సరదా సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ సంభాషణలో.. దులరీ ఖేర్ తన ఫోన్ ఎందుకు ఎత్తలేదని అనుపమ్ ఖేర్‌ను ప్రశ్నిస్తుంది. దానికి అనుపమ్ బదులిస్తూ.. ‘నువ్వు కాల్ చేసే సమయానికి విమానంలో ఉన్నాను. అందుకే ఎత్తలేదు. అయినప్పటికీ అల్లంత దూరంలో ఉన్నా కూడా నేను నిన్ను పిలుస్తున్నా.. అయినా కూడా తిడతావేంటమ్మా..’ అంటూనే ‘నా దగ్గర ఉన్న పుస్తకం పేరుని ఇంగ్లీష్‌లో చెప్పు చూద్దాం’ అని తల్లిని అడుగుతాడు. ‘ఏమో నాకు తెలీదు’ అని దులరీ సమాధానం చెపుతుంది. ‘పర్వాలేదు చెప్పమ్మా.. ప్రయత్నించు’ అని అనుపమ్ తల్లిని విసిగిస్తాడు. ‘అదంతా కాదు గంజు పటేల్.. ముందు నాకు కాల్ చెయ్’ అని అతన్ని తిడుతుంది దులరీ. ఒక్కసారిగా అవాక్కయిన అనుపమ్ ‘నన్ను గంజు పటేల్ అని పిలుస్తావా..’ అంటూ అలక పూనుతాడు. ఈ దెబ్బకు అనుపమ్ తిక్క కుదిరింది అనుకుంటూ దులరీ హాయిగా నవ్వుకుంటుంది. ఈ వీడియోపై ఆర్టికల్ 15 నటుడు ఆయుష్మాన్ ఖురాన స్పందిస్తూ.. ‘మీ ప్రేమ ఎంత ముద్దుగా ఉందో..’ అంటూ వారి అనురాగాన్ని చూసి అబ్బురపడ్డారు. తల్లీ కొడుకుల బంధం చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. అనుపమ్ ఖేర్ తల్లి దులరీ గతంలోనూ సోషల్ మీడియాలో ప్రధాని మోదీ గురించి మాట్లాడి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు మళ్లీ ప్రధానిగా మోదీనే గెలుస్తారని ఆమె జోస్యం చెప్పగా ఆమె అభిమానానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారని అనుపమ్ గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. She is BACK!! She has not Changed!! 😬🙄. Video called Mom in Shimla from NY. She scolded me without provocation. She called me ‘गंजु पटेल’ (Bald Dude). Efforts to make her say the title of my #Autobiography #LessonsLifeTaughtMeUnKnowingly# were a disaster.🤦🏻♂️🤦🏻♂️🤣😂 #DulariRocks pic.twitter.com/7xsktTdZRV — Anupam Kher (@AnupamPKher) July 17, 2019 -
ట్రాప్‌లో పడకు గంభీర్; సిగ్గుండాలి!
ముంబై : మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడం కోసం కొంత మంది పన్నిన ఉచ్చులో పడవద్దని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు సూచించాడు. ఎంపీగా మీరు చేసే పనులు మాత్రమే మాట్లాడేలా నడుచుకుంటే బాగుంటుందంటూ సలహా ఇచ్చాడు. జై శ్రీరాం అనాలంటూ ఓ ముస్లిం యువకుడిపై గురుగ్రామ్‌లో అల్లరిమూకలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా తూర్పు ఢిల్లీ ఎంపీ గంభీర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోదీ సబ్కా సాత్ , సబ్కా వికాస్, సబ్ కా విశ్వాస్‌తో తనకు లౌకికవాదంపై ఆలోచనలు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. ఇకపై కులం, మతం పేరిట జరిగే దాడులన్నింటిపై గళమెత్తుతానని ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గంభీర్ తీరుపై అనుపమ్ ఖేర్ స్పందించాడు. ‘ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు గౌతం గంభీర్. ఓ భారతీయుడిగా మీ విజయం పట్ల నేనెంతో సంతోషంగా ఉన్నాను. మీరు అడగకున్నా సరే ఓ చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నా..ఓ వర్గంలో పాపులర్ అయ్యేందుకు కొంతమంది పన్నిన కుట్రలో చిక్కుకోకండి. మీరు ప్రకటనలు చేయాల్సిన పనిలేదు. మీరు చేసే పనులే మాట్లాడతాయి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో.. అమానుష ఘటనపై వెంటనే స్పందించిన గంభీర్‌ను ట్రాప్‌లో పడేయాలని మీరే చూస్తున్నారు. ఆయనకు ఇంకా బీజేపీ నీళ్లు ఒంటబట్టలేదు. అయినా ఇటువంటి ఘటనపై ధైర్యంగా స్పందించిన గంభీర్‌ను మెచ్చుకోవాల్సింది పోయి.. ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తారా. సిగ్గు పడాలి’ అంటూ నెటిజన్లు అనుపమ్ ఖేర్‌పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. కాగా అనుపమ్ భార్య కిరణ్ ఖేర్ కూడా బీజేపీ ఎంపీ అన్న సంగతి తెలిసిందే. చండీగఢ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ఆమె.. ఘన విజయం సాధించారు. Dear @GautamGambhir !! Congratulations on your win. As a passionate Indian it made me very happy. Not that you have asked for my advise but still- Don’t get into a trap of getting popular with a section of media. It is your work that will speak. Not necessarily your statements.🙏 — Anupam Kher (@AnupamPKher) May 28, 2019 -
‘అక్షయ్ దేశభక్తిని శంకించాల్సిన పని లేదు’
గత కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పౌరసత్వం గురించి చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అక్షయ్ ఓటు వేయకపోవడంతో ఈ వివాదం తెరమీదకు వచ్చింది. దీనిపై స్పందించిన అక్షయ్.. తన పౌరసత్వం గురించి ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. దేశం పట్ల తనకు ఉన్న ప్రేమను ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. తాజాగా ఈ వివాదంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజ్జూ అక్షయ్‌కు మద్దతుగా నిలిచారు. అక్షయ్ దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదన్నారు కిరెన్. ఈ మేరకు ‘అక్షయ్.. మీ దేశ భక్తిని ఎవరూ శంకించలేరు. సాయుధ దళాల సిబ్బంది చనిపోయినప్పుడు మీరు స్పందించిన తీరు.. వారిని ఆదుకోవడం కోసం ‘భారత్‌కేవీర్’ కార్యక్రమం ద్వారా మీరు విరాళాలు సేకరించిన విధానం దేశభక్తి కలిగిన ఓ భారతీయుడికి అసలైన ఉదాహరణగా నిలుస్తుందం’టూ కిరెన్ రిజ్జూ ట్వీట్ చేశారు. దాంతో అక్షయ్ ట్విటర్ ద్వారా కిరెన్ రిజ్జూకు ధన్యవాదాలు తెలిపారు. ‘మీకు ధన్యవాదాలు తెలపడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి కిరెన్ రిజ్జూ సర్. నా పట్ల మీరు చూపిన అభిమానానికి ధన్యవాదాలు. భారత ఆర్మీ పట్ల, ‘భారత్‌కేవీర్’ కార్యక్రమం పట్ల నా బాధ్యత ఎప్పటికి స్థిరంగా నిలిచి ఉంటుందం’టూ అక్షయ్ రీట్వీట్ చేశారు. Thank you so much @KirenRijiju Sir, and I apologise for the delayed response. I am grateful for your kind words. Please be assured, my commitment to #BharatKeVeer and to the Indian armed forces would remain steady, no matter what 🙏🏻 https://t.co/W1298prsEQ — Akshay Kumar (@akshaykumar) May 7, 2019 బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా పౌరసత్వం విషయంలో అక్షయ్‌కు మద్దతుగా నిలిచారు. తన పౌరసత్వం వివాదం గుర్చి స్పందిస్తూ అక్షయ్ తన దగ్గర కెనడా పాస్‌పోర్ట్ ఉందన్నారు. కానీ గత ఏడేళ్లగా ఒక్కసారి కూడా కెనడా వెళ్లలేదని తెలిపారు. ఇండియా ప్రగతి పథంలో ముందుకు వెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు అక్షయ్. -
అమెరికాలో అతను డాక్టర్ కపూర్
అనుపమ్ ఖేర్‌ను మన దేశంలో అందరూ గుర్తించడంలో గౌరవించడంలో వింత లేదు.కాని అమెరికాలో అతను ఇప్పుడు సామాన్యుల గౌరవాన్ని పొందుతున్నాడు. ఇటీవల అతడు అమెరికాలోని ఒక ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ క్లియరెన్స్ దగ్గర నిలబడ్డాడు. ఏదో ఈవెంట్‌కు హాజరవ్వాల్సి ఉండగా అతని దగ్గర అనుమతించిన లగేజీకి మించిన బరువుతో కొన్ని సూట్స్ ఉన్నాయి. వాటి బరువుకు తగ్గ చార్జ్ చెల్లించాల్సి వస్తుందేమోనని అనుపమ్‌ఖేర్ సందేహించాడు. కాని కౌంటర్లో ఉన్న ఒక ఆఫ్రికన్–అమెరికన్ అతణ్ణి చూసి చిన్న చిర్నవ్వుతో ‘మిస్టర్ కపూర్.. నాకు మీ యాక్టింగ్ అంటే ఇష్టం. పర్లేదు. మీరు వెళ్లొచ్చు’ అంది. అనుపమ్ ఖేర్ అమెరికాలో ‘మిస్టర్ కపూర్’గా మారడానికి అక్కడ గత సంవత్సరం ప్రసారమైన టెలివిజన్ షో ‘న్యూ ఆమ్స్టర్డామ్’ కారణం. అమెరికాలో పాఠకాదరణ పొందిన ‘ట్వల్వ్ పేషెంట్స్: లైఫ్ అండ్ డెత్ ఎట్ బెల్వ్యూ హాస్పిటల్’ అనే పుస్తకం ఆధారంగా ఈ టెలివిజన్ షో గత సంవత్సరం 16 ఎపిసోడ్లుగా ప్రసారం అయ్యింది. ఇది ఒక సీజన్‌కు మాత్రమే పరిమితమైన షో అనుకున్నారు. కాని ఇది ప్రసారం కావడమే పెద్ద హిట్ అయ్యింది. ఇండియన్ డాక్టర్‌గా నటించిన అనుపమ్‌ఖేర్‌ను అమెరికన్లు బాగా ఇష్టపడ్డారు. దాంతో ఇప్పుడు రెండో సీజన్ కోసం ఈ షో షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. అనుపమ్ ఖేర్ అక్కడే ఉదయం ఆరు గంటల కాల్షీట్ నుంచి పని చేస్తున్నారు. ‘నేను హిందీ నటుణ్ణి. నా బుర్ర హిందీలోనే ఆలోచిస్తుంది. ఇంగ్లిష్‌లో డైలాగులు చెప్పాలంటే ఎక్కువసార్లు వాటిని మననం చేసుకోవాల్సి వస్తోంది’ అన్నారు అనుపమ్ ఖేర్. దాదాపు అమెరికన్లు తెర మీద తెర వెనుక పని చేస్తున్న ఆ సెట్లో అనుపమ్‌తో హిందీలో మాట్లాడేది అతడి మేనేజర్ మాత్రమే. మిగిలినవారితో ఇంగ్లిష్‌లోనే సంభాషణలు సాగుతున్నారు. ‘ఇక్కడ బాగా పేరొచ్చింది. న్యూయార్క్‌లో నడుస్తుంటే దారిన పోతున్నవాళ్లు విష్ చేస్తున్నారు. అందుకే ఉత్సాహంగా షూటింగ్ కోసమని వచ్చాను. కాని నా ముంబై స్టుడియోల్లోని సందడి, అరుపులు, కేకలు మాత్రం మిస్సవుతున్నాను’ అన్నాడాయన. భారతదేశంలో ఇప్పుడు ఎలక్షన్ల హడావిడి నడుస్తోందని మనందరికీ తెలుసు. అనుపమ్ ఖేర్ బిజెపి మద్దతుదారు అని కూడా తెలుసు. అయితే ప్రత్యక్షంగా ఆయన ప్రచారంలో కనిపించే అవకాశాలు ఈ షూటింగ్ వల్ల ఉండవని అర్థమవుతోంది. అదీగాక తాను నేరుగా రాజకీయాల్లోకి రాదలచుకోలేదని ఆయన ఇదివరకే ప్రకటించాడు. ఆయన భార్య కిరణ్ ఖేర్ మాత్రం చండీగఢ్ నుంచి బిజెపి ఎం.పిగా ఐదేళ్లు పూర్తిచేసి మరోసారి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ‘హోటల్ ముంబై’కి చిక్కులు 2008లో ముంబై తాజ్ హోటల్ మీద జరిగిన ముష్కర దాడి అందరికీ తెలుసు. ఆ ఉదంతం పై రామ్‌గోపాల్ వర్మ ‘ది అటాక్స్ ఆఫ్ 24/11’ అనే సినిమా తీశాడు. అయితే ఆ ఉదంతం జరిగినప్పుడు తాజ్ హోటల్లోని సిబ్బంది అందులో బస చేసిన వారి ప్రాణాలను ఎలా కాపాడారో వివరిస్తూ ఇంగ్లిష్‌లో ‘హోటల్ ముంబై’ సినిమా సిద్ధమైంది. ఇందులో అనుపమ్ ఖేర్ తాజ్ హోటల్ చీఫ్ చెఫ్‌గా నటించారు. సినిమాలో అది కీలకపాత్ర. కాని ఆ పాత్రను అందరూ చూసే వీలు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సినిమా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో విడుదల కాగా తాజా న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఉగ్రవాదాన్ని చూపి భావోద్వేగాలను ప్రభావితం చేసే ఇటువంటి సినిమా అక్కర్లేదని భావించి అక్కడి ప్రభుత్వం దాని ప్రదర్శనను రద్దు చేసింది. మరోవైపు భారత్‌లో విడుదలకు నిర్మాతలకు, దుబాయ్‌లో ఉన్న ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థకు పేచీ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ సినిమా ప్రదర్శనను విరమించుకుంది. కనుక అనుపమ్ ఖేర్ ఎంతో బాగా నటించానని అనుకుంటున్న ఆ సినిమా ఇప్పుడిప్పుడే మనం చూసే అవకాశానికి వీలు కల్పించకుండా ఉంది. -
‘కంగనా ఓ రాక్‌స్టార్’
ప్రస్తుతం బాలీవుడ్లో మణికర్ణిక వివాదంతో పాటు.. తన సహ నటులపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నెపోటిజమ్ గురించి మాట్లాడినందునే ఇండస్ట్రీ అంతా తనకు వ్యతిరేకంగా ఉందని కంగనా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కంగనా నటనను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ట్విటర్ వేదికగా అనుపమ్ ఖేర్ నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనిథింగ్’ సెషన్లో ఒక నెటిజన్ ‘బాలీవుడ్లో కంగనా మణికర్ణిక సినిమాకు ఎవరు మద్దతు తెలపడం లేదు.. మీరు ఆమెకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేయండం’టూ అనుపమ్‌ను కోరాడు. #KanganaRanaut is a ROCKSTAR. She is brilliant. I applaud her courage and performances. She is also the real example of #WomenEmpowerment.:) https://t.co/WeFgWsdiSW — Anupam Kher (@AnupamPKher) February 9, 2019 దాంతో అనుపమ్ ‘కంగనా ఓ రాక్ స్టార్. తనకు చాలా ప్రతిభ ఉంది. నేను తన ధైర్యాన్ని, నటనను ప్రశంసిస్తున్నాను. మహిళా సాధికారితకు తను నిలువెత్తు నిదర్శనం’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అనుపమ్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఇదిలా ఉండగా బంధుప్రీతి గురించి మాట్లాడినందునే బాలీవుడ్ మొత్తం గ్యాంగ్‌లా మారి తనను వ్యతిరేకిస్తున్నారంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అలియా భట్, ఆమిర్ ఖాన్ చిత్రాలు ‘దంగల్’, ‘రాజీ’ మూవీ ప్రమోషన్లకు తాను హాజరయ్యానని.. కానీ నేడు ధీర వనిత లక్ష్మీబాయి కథతో ముందుకు వస్తే తనకు ఎవరూ సహకరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలపై ఆలియా స్పందించడం.. క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధపడటం వంటి సంఘటనలు తెలిసిందే. -
‘సంతోషం.. ఎవరూ తిట్టలేదు’
ఎవరూ విమర్శించలేదు.. అదే సంతోషం అంటున్నారు నటుడు మనోజ్ బాజ్‌పేయ్. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను ప్రభుత్వం మనోజ్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవార్డును ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో కానీ.. బయట కానీ ఎలాంటి ట్రోలింగ్ జరగలేదు. దాంతో చాలా సంతోషంగా ఫీలయ్యాను’ అన్నారు. అంతేకాక ‘గతంలో ప్రభుత్వం అవార్డులు ప్రకటించినప్పుడు ఏ అర్హత ఉందని ఇచ్చారు అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేవారు. సదరు నటుడు నటించిన సినిమాల గురించి ప్రస్తావిస్తూ దారుణంగా విమర్శించేవారు. ఈసారి నాకు అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. అందుకు సంతోషంగా ఉంది. నాతో పాటు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా చాలా సంతోషంగా ఉన్నార’ని తెలిపారు. పద్మ అవార్డు వచ్చిందని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడగ్గా.. ‘ఆ రోజు రాత్రి పడుకునే ముందు అనుపమ్ ఖేర్ నాకు ఫోన్ చేసి అవార్డు వచ్చిందని చెప్పారు. ఇది విన్న వెంటనే నేను ఫ్రీజ్ అయిపోయాను. ఎలా స్పందించాలో నాకు తెలియలేదు. నాకు ఈ గౌరవం దక్కుతుందని అనుకోలేదు’ అని వెల్లడించారు మనోజ్. ప్రస్తుతం మనోజ్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా తెరకెక్కుతున్న ‘సోన్ చిడియా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. -
బాలీవుడ్ వివాదాస్పద చిత్రం తెలుగులో కూడా..!
ఇటీవల బాలీవుడ్లో అత్యంత వివాదాస్పదంగా మారిన చిత్రం ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిషేదించాలన్న వాదన కూడా వినిపిస్తోంది. బాలీవుడ్లో ట్రైలర్‌ను నిషేదించాలంటూ వేసిన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్ట్ కొట్టివేసింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అంతేకాదు తెలుగు వర్షన్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. హిందీ వర్షన్‌తో పాటు తెలుగు వర్షన్‌ను కూడా జవనరి 18న రిలీజ్ చేయనున్నారు. గతంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన ది యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకాన్ని అదే పేరుతో సినిమాగా తెరకెక్కించారు. మన్మోహన్ పాత్రలో బాలీవుడ్ అగ్రనటుడు అనుపమ్ ఖేర్ నటించగా, మరో కీలక పాత్రో అక్షయ్ ఖన్నా నటించారు. అయితే ఈ సినిమా నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచిగాని. మన్మోహస్ సింగ్ నుంచి గాని ఎలాంటి అనుమతి తీసుకోకపోవటం వివాదాస్పదమైంది. ఇటీవల సెన్సార్ విషయంలోనూ ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. -
‘మోదీ మీ పాత్రలో సల్మాన్ ఐతే బాగుండేది’
ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్‌తోనే ఈ సినిమా వివాదాలను రేపుతోంది. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఒబేరాయ్ మోదీ పాత్రలో నటిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ పట్ల ఇప్పటికే పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. వివేక్ ఒబేరాయ్ మోదీ పాత్రను దారుణంగా ఖూనీ చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడు వీరి వరుసలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా చేరారు. ది యాక్సిడెంటల్ ప్రైమ్ పినిస్టర్ సినిమాను, మోదీ బయోపిక్‌ను కంపేర్ చేస్తూ అబ్దుల్లా కామెంట్ చేశారు. ‘మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ బాగానే సూట్ అయ్యారు.. కానీ మోదీ మీ పాత్ర కోసం వివేక్ అంతగా సెట్ అవ్వలేదు. వివేక్ బదులు మీరు సల్మాన్ ఖాన్ తీసుకుంటే మజా వచ్చేది’ అంటూ ట్వీట్ చేశారు. Life is unfair Dr Manmohan Singh got someone of the calibre of Anupam Kher. Poor Modi ji has to settle for Vivek Oberoi. Salman Khan hota toh kya maza aata. — Omar Abdullah (@OmarAbdullah) January 8, 2019 -
‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’కు ఊరట
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఢిల్లీకి చెందిన పూజా మహాజన్ అనే ఫ్యాషన్ డిజైనర్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ట్రైలర్‌ను నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం సెక్షన్ 416ను ఉల్లంఘించిందని పూజ పిటిషన్లో పేర్కొంది. సెక్షన్ 416 ప్రకారం ఒక వ్యక్తి జీవితాధారంగా సినిమా తీస్తున్నప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలని పిటిషన్లో తెలిపింది. ఢిల్లీ హై కోర్టు సోమవారం ఈ పిటిషన్‌ని విచారించింది. ఈ సందర్భంగా పూజ తరఫు న్యాయవాది మైత్రి మాట్లాడుతూ.. ‘నిర్మాతలు.. మన్మోహన్ సింగ్ నుంచి కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కాబట్టి ట్రైలర్‌ను, సినిమాను నిషేధించండి’ అన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి విభు భాక్రు పిటిషనర్ పూజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు, ఫ్యాషన్ డిజైనర్‌కు ఎలాంటి సంబంధంలేదని తేల్చారు. అసలు పిటిషన్ వేయడానికి సినిమాతో ఆమెకున్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. ట్రైలర్‌ను నిషేధించడానికి వీల్లేందంటూ తీర్పునిచ్చారు. యూపీఏ - 1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. -
పీవీ తర్వాత మన్మోహనే గొప్ప ప్రధాని : శివసేన
ముంబై : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా ట్రైలర్‌తోనే వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాను విడుదల కానివ్వమంటూ కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన నాయకులు మన్మోహన్ సింగ్‌ని పొగడ్తలతో ఆకాశనికెత్తుతున్నారు. పీవీ తర్వాత మన దేశానికి సేవ చేసిన ప్రధానుల్లో మన్మోహనే గొప్పవాడంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌతులా మాట్లాడతూ.. ‘పదేళ్లు దేశానికి సేవ చేసిన వ్యక్తిని గౌరవించడం మన బాధ్యత. మన్మోహన్ యాక్సిడెంటల్ ప్రధాని కారు. పీవీ నరసింహ రావు తర్వాత దేశానికి సేవ చేసిన ప్రధానుల్లో మన్మోహన్ చాలా గొప్పవారు. ఆయన తన విధులను చాలా విజయవంతంగా నిర్వర్తించారు’ అంటూ ప్రశంసలు కురిపించారు. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా పట్ల ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కోపంగా ఉన్నారు. ఈ సినిమాలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తప్పుగా చూపించారని ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులైతే ఏకంగా తమకు స్పెషల్ షో వేసి.. ముందుగా ప్రదర్శించకుంటే మధ్యప్రదేశ్‌లో మూవీ విడుదల కానివ్వబోమని హెచ్చరించారు. ఇక యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. -
మన్మోహన్ సినిమాపై దుమారం
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ రాజకీయంగా దుమారం రేపుతోంది. బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను బీజేపీ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టి ‘ ఒక కుటుంబం పదేళ్ల పాటు దేశాన్ని తన గుప్పిట్లో ఎలా ఉంచుకుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించడంతో వివాదం రాజు కుంది. 2004–08 మధ్య మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ పాత్రలో నటించారు. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. మన్మోహన్ రాజప్రతినిధా?: బీజేపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నుంచి మన్మోహన్ ఒత్తిడి ఎదుర్కొంటున్న దృశ్యాలను ప్రచార చిత్రంలో చూపడం కాంగ్రెస్‌కు ఆగ్రహం తెప్పించింది. ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై విమర్శలు, వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు విస్తృతంగా వ్యాపించాయి. ‘ఒక కుటుంబం ఏకంగా పదేళ్ల పాటు దేశాన్ని ఎలా గుప్పిట్లో పెట్టుకుందో చెప్పే సినిమా ఇది. వారసుడు సిద్ధమయ్యే వరకు ఆ కుటుంబం డా.సింగ్‌ను రాజ ప్రతినిధిగా పీఎం కుర్చీపై కూర్చోపెట్టిందా? యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్ చూడండి’ అని బీజేపీ తన అధికార ట్విట్టర్లో పేర్కొంది. కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ‘ ఇప్పటి మొద్దు ప్రధాని(మోదీ)పై వాళ్లు(కాంగ్రెస్) సినిమా తీసేదాకా వేచి ఉండలేకపోతున్నా. యాక్సిడెంటల్ ప్రధాని కన్నా ఇన్సెసిటివ్ ప్రధాని ప్రమాదకరం’ అని ట్వీట్ చేశారు. ‘బీజేపీని చూస్తే జాలేస్తోంది. నాలుగన్నరేళ్లుగా మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సమున్నతుడైన మన్మోహన్ సింగ్‌పై సినిమాను స్పాన్సర్ చేశారు. మీరు ఆ మేధావికి సరితూగలేరు. కనీసం ఆయన విలువల్ని పాటించడానికైనా ప్రయత్నించండి‘ అని రాహుల్ సోదరి ప్రియాంక ట్వీట్ చేశారు. సృజన ప్రయత్నాన్నే చూడండి: ఖేర్ ఈ సినిమాను సృజనాత్మక కోణంలో చేసిన ప్రయత్నంగా చూడాలి తప్ప, ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లుగా భావించొద్దని అనుపమ్ ఖేర్ అన్నారు. ఈ చిత్రం తన కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శనగా నిలిచిపోతుందని తెలిపారు. మన్మోహన్ పాత్ర పోషణ తనకు పెద్ద సవాలుగా మారిందని, దీనికోసం ఆరు నెలలు శ్రమించానని అన్నారు. మన్మోహన్ హావభావాలు, ముఖ్యంగా ఆయన గొంతు అనుకరించడానికి చాలా కష్టపడ్డానని, అందుకోసం ఆయనకు సంబంధించిన వీడియోల్ని గంటల కొద్దీ చూశానని తెలిపారు. -
అమ్మే గుర్తుపట్టలేదు.. ఆస్కార్ బరిలో ఉంటా!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా ‘ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ . ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) విడుదలైన పొలిటికల్ డ్రామా ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తుందని మేకర్స్ సంబరపడుతుంటే... తమ పార్టీ అధ్యక్షుడి కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ మూవీని విడుదల కానివ్వమని కొంతమంది కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో విమర్శలు- ప్రతి విమర్శలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ఈ విషయంపై స్పందించిన అనుపమ్ ఖేర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.... ‘ మన దేశంలో నటన కంటే కూడా నిరసనలకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా కన్పిస్తోంది. నేను దాదాపు 500 సినిమాలు చేశాను. కానీ మన్మోహన్ జీ క్యారెక్టర్ చేయడం నిజంగా ఓ సవాలుగా అన్పించింది. అయినప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. కానీ ఇలాంటి నిరసనలు, బెదిరింపులు నన్ను నిరాశకు గురిచేస్తున్నాయి. అయితే అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా భారత్ తరపున ఆస్కార్ బరిలో నిలుస్తుందని చెప్పగలను. అంతేకాదు మన్మోహన్‌గా జీవించాను. మా అమ్మ కూడా నన్ను గుర్తుపట్టలేనంతగా పాత్రలో ఒదిగిపోయాను. కాబట్టి నేను కచ్చితంగా ఆస్కార్‌కు నామినేట్ అవ్వాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. ఇక యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. -
‘పదవి కన్నా.. దేశ శ్రేయస్సే నాకు ముఖ్యం’
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితచరిత్ర ఆధారంగా బాలీవుడ్లో ‘ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్ర పోషిస్తుండగా.... సోనియా గాంధీగా జర్మన్ యాక్టర్ సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. మన్మోహన్‌ను ప్రధానిగా ఎంపిక చేసిన నాటి నుంచి రెండు పర్యాయాల పాటు ఆయన పదవిలో కొనసాగేందుకు దోహదం చేసిన అంశాలు, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఎదుర్కొన్న మానసిక సంఘర్షణకు సంబంధించిన సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పదవి కంటే కూడా దేశ శ్రేయస్సే ముఖ్యమంటూ అనుపమ్ చెప్పే డైలాగ్స్ మన్మోహన్ సింగ్ మనస్తత్వానికి అద్దం పట్టేలా ఉన్నాయి. అంతేకాకుండా మన్మోహన్‌ను మహాభారతంలోని భీష్మునిగా అభివర్ణించిన డైరెక్టర్.... కశ్మీర్ వివాదం, అణు ఒప్పందం ప్రక్రియలో భాగంగా పార్టీతో ఆయన విభేదించడం వంటి సున్నితమైన అంశాలను కూడా స్పృశించారు. కాగా యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయనున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల సన్నాహకాలు మొదలవుతున్న వేళ ఈ చిత్రం విడుదల కానుండటం రాజకీయ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెంచుతోంది. -
ఎఫ్టీఐఐ అధ్యక్షుడిగా బీపీ సింగ్
పాపులర్ టెలివిజన్ సిరీస్ ‘సీఐడీ’ దర్శక, నిర్మాత బీపీ సింగ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఈ ఉన్నారు. గత ఏడాది అక్టోబరులో అనుపమ్ ఖేర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాది పాటు సేవలు అందించిన తర్వాత 2018 అక్టోబరు 31న అనుపమ్ ఖేర్ ఈ పదవి నుంచి బయటకొచ్చారు. ఈ సందర్భంగా సింగ్‌కు ఎఫ్టీఐఐ పుణె డైరెక్టర్ భూపేంద్ర కైన్‌థోలా స్వాగతం పలికారు. ‘ఇన్స్టిట్యూట్లో జరిగే అన్ని విషయాలపై సింగ్‌కు అవగాహన ఉంది. మే 2017లో ఎఫ్టీఐఐ తరఫున దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఎడ్యుకేషన్ ‘స్కిల్ ఇండియా ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్’ ఆలోచన సింగ్‌దే. దీని ద్వారా దేశంలోని దాదాపు 24 నగరాల్లో 120 షార్ట్ కోర్సులను నిర్వహించాం’ అని ఆయన అన్నారు. బీపీ సింగ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న ‘సీఐడీ’కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ సిరీస్ 21 ఏళ్లుగా బ్రేక్ లేకుండా సోనీ టీవీలో టెలికాస్ట్ అవుతోంది. 2004లో సింగ్ పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. ‘సీఐడీ’లోని 111 నిమిషాల షాట్‌ను సింగిల్ టేక్‌లో రికార్డు చేసిన ఘనత కూడా సింగ్‌కే దక్కింది. -
ఎఫ్టీటీఐ చీఫ్‌గా తప్పుకున్న అనుపమ్ ఖేర్
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్టీటీఐ) ఛైర్మన్ పదవికి జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ బుధవారం రాజీనామా చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఎఫ్టీఐఐ ఛైర్మన్‌గా ఉండటం తనకు అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తానని తనకున్న అంతర్జాతీయ అసైన్మెంట్ల కారణంగా సంస్థకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానన్నారు. తనకు ఈ పదవిని చేపట్టేందుకు ఇప్పటివరకూ సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. సమాచార, ప్రసార మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోర్ను ఉద్దేశిస్తూ రాజీనామా లేఖను సైతం ట్విటర్లో ఆయన పోస్ట్ చేశారు.గత ఏడాది అక్టోబర్ 11న గజేంద్ర చౌహాన్ స్ధానంలో అనుపమ్ ఖేర్ ఎఫ్టీఐఐ ఛైర్మన్‌గా నియమతులైన సంగతి తెలిసిందే. -
చరిత్ర తప్పుగా అంచనావేయదు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ను చరిత్ర తప్పుగా అంచనావేయదని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. మన్మోహన్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన ట్విట్టర్లో పలు విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో మన్మోహన్ పాత్రను అనుపమ్ ఖేరే పోషించారు. తొలుత మన్మోహన్‌ను తానూ తప్పుగా అంచనావేశానని, కానీ ఏడాదిపాటు ఆయన రీలు లైఫ్‌లో జీవించాక తన దృక్పథం పూర్తిగా మారిందన్నారు. మన్మోహన్ ఈ చిత్రాన్ని తిలకించిన తరువాత ఆయనతో కలసి టీ తాగేందుకు ఎదురుచూస్తూ ఉంటానని చెప్పారు. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రీకరణ ముగిసింది. ఆయన్ని చరిత్ర తప్పుగా అంచనావేయదు’ అని ఖేర్ అన్నారు. యూపీఏ–1లో మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తీశారు. సోనియా పాత్రను జర్మనీ నటి సుజానె బెర్నర్ట్ పోషించారు. ఈ సినిమాకు విజయ్ రత్నాకర్ గుట్టె దర్శకుడు. -
‘మన్మోహన్ జీ చరిత్ర మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోదు’
టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. వీటిలో రాయకీయ నాయకుల జీవితాల ఆధారంగా వస్తోన్న చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగులో బాలకృష్ణ ‘ఎన్టీఆర్’, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ ఇంకా సెట్స్ మీద ఉండగా.. మన్మోహన్ బయోపిక్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. సోనియా గాంధీగా సజ్జన్ బెర్నర్ట్ కనిపించనున్నారు. సంజయ్ బారు రచించిన పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. ఈ మేరకు సెట్లో తీసిన ఓ వీడియోను అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. It is a WRAP for one of my most cherished films #TheAccidentalPrimeMinister. Thank you d cast and d crew for the most enriching times. Thank you #DrManmohanSinghJi for your journey. It has been a great learning experience. One thing is sure “History will not Misjudge you.” 🙏 pic.twitter.com/xnJM9XC78j — Anupam Kher (@AnupamPKher) October 26, 2018 ‘‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ షూటింగ్ పూర్తయింది. మొత్తం చిత్ర బృందానికి ధన్యవాదాలు. ఈ ప్రయాణం నాకు ఎన్నో నేర్పింది. ఈ సినిమా చేయడానికి ముందు మన్మోహన్ జీ గురించి నాలో కొన్ని అభిప్రాయాలండేవి. మిమ్మల్ని అపార్థం చేసుకున్నా. కానీ ఈ రోజు షూటింగ్ పూర్తయిన తర్వాత, దాదాపు ఏడాది పాటు ఈ పాత్రలో జీవించిన తర్వాత నిజాయతీగా చెబుతున్నా.. చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ తప్పుగా అర్థం చేసుకోదు. మీరు మా సినిమా చూసిన తర్వాత మీతో కలిసి కప్పు టీ తాగాలని ఉంది’ అని అనుపమ్ పేర్కొన్నారు. On the last day shoot of #TheAccidentalPrimeMinister someone shoots a off camera moment between @suzannebernert playing #MrsSoniaGandhi & I having tea & biscuits. Shares it on social media. It is already on tv now. Best option is to share it myself. So here it is. Enjoy.😊🤓👇 pic.twitter.com/HVs0YR0yxQ — Anupam Kher (@AnupamPKher) October 26, 2018 ఈ సందర్భంగా సెట్లో నటి సజ్జన్ బెర్నర్ట్తో మాట్లాడుతున్న వీడియోను అనుపమ్ షేర్ చేశారు. దీన్ని వీక్షించిన నెటిజన్స్ మీరిద్దరూ అచ్చం మన్మోహన్సింగ్, సోనియాగాంధీ లాగానే ఉన్నారని కామెంట్లు పెట్టారు. -
నేనే ముందు ఇంటికెళ్తా
ప్రస్తుతం కేన్సర్ చికిత్స పొందుతూ సోనాలీ బింద్రే లండన్‌లో ఉన్నారు. అప్పుడుడప్పుడు ఆమె ఫ్రెండ్స్ ఆమెను చూడటానికి వెళ్తూనే ఉన్నారు. రీసెంట్గా సోనాలీకి అనుపమ్ ఖేర్ వీకెండ్స్‌లో కంపెనీ ఇస్తున్నారట. అమెరికన్ టీవీ సిరీస్‌లో యాక్ట్ చేస్తున్నారు అనుపమ్. ఆ షూటింగ్ నిమిత్తం అక్కడున్నారాయన. ఈ విషయాన్ని తెలియజేస్తూ – ‘‘ఈ షో వల్ల ఇక్కడ నాకో స్నేహితుడు దొరికాడు. మనలో ఎవ్వరు ఫస్ట్ ఇంటికి వెళ్లిపోతామో అని మాట్లాడుకుంటూ ఉంటాం. అతని కంటే నేనే ముందు వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను. అనుపమ్ షోకి ఎక్కువ సీజన్స్ ఉండి తను ఇక్కడే ఉండిపోవాలి’’ అని పేర్కొన్నారు సోనాలి.