
‘‘సినిమా అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాదు.. సమాజంలో మార్పు తీసుకువచ్చేలా కూడా ఉండాలి’’ అని పేర్కొన్నారు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. ప్రస్తుత సమాజంలో సినిమా మాద్యమానికి ఉన్న ఆవశ్యకతను గురించి అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ– ‘‘సినిమా అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మీడియమ్‌గా మిగిలిపోకూడదు. సమాజంలో మార్పు తీసుకొచ్చే మాద్యమంలా కూడా ఉండాలి. యంగ్ ఫిల్మ్ మేకర్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేకర్స్ అందరూ లిమిటెడ్ బడ్జెట్‌తో మంచి సినిమాలు రూపొందిస్తున్నారు. వాళ్ల ముఖ్య ఉద్దేశం కేవలం మంచి సినిమా తీయడమే. సమాజాన్ని ఏదో విధంగా ఇన్‌ఫ్లూయన్స్ చేసే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి దర్శకుల్ని కచ్చితంగా ఎంకరేజ్ చేయాలి’’ అని పేర్కొన్నారాయన. అనుపమ్ ఖేర్ ప్రస్తుతం మన్మోహన్ సింగ్ బయోపిక్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ మూవీలో యాక్ట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment