Bio pic
-
కమల్ ఔర్ మీనా
దివంగత ప్రముఖ హీరోయిన్ మీనాకుమారి జీవితం ఆధారంగా ‘కమల్ ఔర్ మీనా’ సినిమా తెరకెక్కనుంది. బుధవారం ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ‘కమల్ ఔర్ మీనా’ సినిమా మీనా కుమారి పూర్తిస్థాయి బయోపిక్ కాదని బాలీవుడ్ సమాచారం. దివంగత ప్రముఖ దర్శకుడు కమల్ అమ్రోహీ (మీనాకుమారి భర్త)తో మీనా పరిచయం, కమల్–మీనల ప్రేమ, పెళ్లి సంగతులు, వారి కాంబినేషన్ లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘΄ాకీజా’ (1972) విశేషాలతో ఈ చిత్రం ఉంటుందట. ‘మహారాజ్’ సినిమా ఫేమ్ సిద్ధార్థ్ పి.మల్హోత్రా ఈ సినిమాకు దర్శకుడు. బిలాల్ అమ్రోహీ (కమల్ అమ్రోహీæ మనవడు), రోహన్ దీప్ సింగ్, సారేగమ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ్ర΄ారంభమై, 2026లో రిలీజ్ కానుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. -
అలుపెరుగని కలం యోధుడా...
ప్రముఖ ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జీవితం ఆధారంగా రూ΄÷ందిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాళోజీ పాత్రలో మూల విరాట్ నటించారు. విజయలక్ష్మి జైనీ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. యస్‌యస్ ఆత్రేయ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అలుపెరుగని అవిశ్రాంత కలం యోధుడా...’ పాటను నిర్మాత డి. సురేష్ బాబు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ పాట చాలా బాగుంది. ఇలాంటి వీరుల కథతో సినిమా తీసిన విజయలక్ష్మి, ప్రభాకర్లకు అభినందనలు’’ అన్నారు. ‘‘ప్రజా ఉద్యమ నాయకుడైన కాళోజీగారి బయోపిక్ తీసినందుకు సెన్సార్ సభ్యులు అభినందించారు. ఇకపైనా ఇలాంటి గొప్ప వ్యక్తుల సినిమాలు తీసేందుకు ప్రేక్షకుల ్ర΄ోత్సాహం కావాలి’’ అన్నారు ప్రభాకర్ జైనీ. ‘‘ఇలాంటి మంచి సినిమాలో పాటలు రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు బిక్కి కృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: రవి కుమార్ నీర్ల, నేపథ్య సంగీతం: మల్లిక్ యంవీకే. -
గుండెల్ని పిండేస్తున్న ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ ట్రైలర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్లల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ముత్తయ్య మురళీధరన్ చిన్నప్పట్నుంచి క్రికెటర్‌గా ఎదిగిన జర్నీని, ముఖ్యంగా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూపించారు. తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస రావడం..అక్కడ పౌరసత్వానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొవడం.. అవన్నీ దాటుకొని క్రికెటర్‌గా ఎదిగితే.. అక్కడ కూడా అవమానాలు.. జావి వివక్షతకు గురికావడం..చేయి స్టైయిట్‌గా ఊపడం లేదంటూ అంతర్జాతీయ క్రికెట్లో అడ్డంకులు ఎదురు కావడం..ఇవన్నీ ట్రైలర్లో చూపించారు. ఆద్యంతం ఎమోషనల్ జర్నీగా `800`ట్రైలర్‌ని చూడండి -
డిసెంబరులో ఘంటసాల ది గ్రేట్
ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. గాయకుడు కృష్ణ చైతన్య టైటిల్ రోల్ చేయగా, ఘంటసాల భార్య సావిత్రి ఘంత్రను మృదుల చేశారు. ‘ఘంటసాల ఘంటశాల’ సంకలనకర్త సీహెచ్ రామారావు దర్శకత్వంలో గాయకుడు జీవీ భాస్కర్ నిర్మాణ సారథ్యంలో ఫణి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సీహెచ్ రామారావు మాట్లాడుతూ– ‘‘ఘంటసాలగారి గురించి తెలియని చాలా విషయాలను ఈ సినిమాలో చూపించనున్నాం. ఘంటసాలగా కృష్ణచైతన్య సరి΄ోయారని గతంలో ఎస్పీ బాలుగారు అన్నారు. అదే మా తొలి సక్సెస్‌గా భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఘంటసాలగారి ఘంత్ర చేయడం నా అదృష్టం’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘2018లోనే ఈ సినిమా టీజర్‌ను ఎస్పీ బాలుగారితో రిలీజ్ చేయించాం. అయితే ఘంటసాలగారి కుటుంబంతో కొన్ని లీగల్ సమస్యలొచ్చాయి. ఇప్పుడు వాళ్లే ఈ సినిమాకు స΄ోర్ట్ ఇస్తున్నారు’’ అన్నారు జీవీ భాస్కర్. చిత్ర సమర్పకులు లక్ష్మీ ప్రసాద్ ఘంల్గొన్నారు. -
స్పిన్ మాంత్రికుడి బయోపిక్.. ఆసక్తిగా ఫస్ట్ లుక్!
క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు సాధించిన ప్రముఖ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘800’. సోమవారం (ఏప్రిల్ 17) ముత్తయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఎంఎస్ శ్రీపతి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’లో చేసిన సలీమ్ మాలిక్ పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మధుర్ మిట్టల్ ఈ బయోపిక్‌లో ముత్తయ్య పాత్రను పోషిస్తున్నారు. ముత్తయ్య భార్య మదిమలర్ పాత్రను మహిమా నంబియార్ చేస్తున్నారు. శ్రీపతి మాట్లాడుతూ – ‘‘కెరీర్లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఏకైక ఆఫ్ స్పిన్నర్ బౌలర్‌గా మురళీధరన్ అరుదైన రికార్డు సాధించారు. అందుకే ఈ చిత్రానికి ‘800’నే టైటిల్‌గా పెట్టాం. మురళికి తమిళనాడులో మూలాలు ఉన్నాయి. అతని తాతలు భారతీయులు. బ్రిటిష్ వారు అక్కడి టీ తోటలలో పని చేయడానికి వారిని శ్రీలంకకు తీసుకెళ్లారు. ఇలా ముత్తయ్య మురళీధరన్‌లోని పలు కోణాలను చూపించే చిత్రం ఇది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. వివేక్ రంగాచారి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
రామ్ జఠ్మలానీ బయోపిక్ తీస్తున్నాం: హీరోయిన్
ప్రముఖ న్యాయవాది దివంగత రామ్ జెఠ్మలానీ ఆత్మకథను తెరకెక్కించనున్నట్టు బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ వెల్లడించారు. గత మూడేళ్లుగా వార్తల్లో ఉన్న ఈ బయోపిక్ విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఆమె స్పష్టం చేశారు. సంపూర్థ కుటుంబానికి అవసరమైన పోషకాహార ఉత్పత్తులపై కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఆధ్వర్యంలో నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గత కొన్నేళ్లు అనుకుంటున్న రామ్ జెఠ్మలానీ బయోపిక్ స్క్రిప్ట్ పూర్త కావచ్చిందని, త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుందని నాయక పాత్రను తన భర్త నటుడు కునాల్ పోషించనున్నట్లు తెలిపారు. దాదాపు 70 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో ఉండి, అనేక మంది అతిరథ మహారథుల వంటి రాజకీయ నేతలు, క్రిమినల్స్‌కు వకల్తాగా, వ్యతిరేకంగా పని చేసిన జెఠ్మలానీ కథ అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. -
"నా జీవితంపై సినిమా తీయాలని అనుకుంటున్నాను"
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మనుసులో మాటను బయటపెట్టాడు. తన జీవితంపై బయోపిక్ తీయాలని అనుకుంటున్నట్లు భజ్జీ తెలిపాడు. భారత్ తరుపున ఆడే రోజుల్లో తను ఎలా ఉన్నానో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు. అందుకే బయోపిక్ తీయాలని అనుకుంటున్నట్లు భజ్జీ వెల్లడించాడు. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మహ్మద్ అజారుద్దీన్‌లపై బయోపిక్‌లు అభిమానులను మురిపించాయి. 1983 ప్రపంచ కప్ విజయం ఆధారంగా రూపొందించబడిన '83' సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. "నేను నా జీవితంపై ఒక సినిమా లేదా వెబ్ సిరీస్‌ని రూపొందించాలనుకుంటున్నాను. తద్వారా ఈ కథలో నేను ఎలాంటి వ్యక్తిని,భారత తరపున ఎలా రాణించానో అనే విషయాలను కూడా ప్రజలు తెలుసుకుంటారు" అని జీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. కాగా గత ఏడాది డిసెంబర్లో హర్భజన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. భారత తరుపున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు భజ్జీ ఆడాడు. అదే విధంగా ఐపీఎల్లో 163 మ్యాచ్‌లు అతడు ఆడాడు. చదవండి: SA Vs IND: "బౌన్స్ పిచ్‌లపై ఆడటానికి సిద్దంగా ఉన్నా" -
రియల్ తలైవికి.. రీల్ తలైవి నివాళి
చెన్నై: రియల్ తలైవికి రీల్ తలైవి నివాళుల ర్పించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందుతున్న తలైవిలో టైటిల్ రోల్‌ను పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా శనివారం చెన్నైకు చేరుకున్న నటి కంగనా రనౌత్ స్థానిక మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. అనంతరం ఎంజీఆర్, కరుణానిధి సమాధులను దర్శించుకున్నారు. -
స్టార్ క్రికెటర్ బయోపిక్‌లో అనుష్క..?
ముంబై: భారత చలన చిత్ర రంగంలో ఇటీవలి కాలంలో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రముఖ క్రీడాకారుల జీవిత చరిత్రలపై వరుసపెట్టి సినిమాలు తెరకెక్కుతున్నాయి. కొంతకాలం క్రితం టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ’ తెరకెక్కగా, తాజాగా టీమిండియా మహిళా జట్టు పేసర్ ఝులన్ గోస్వామి బయోపిక్ అభిమానుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఝులన్ గోస్వామి పాత్రలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ నటించనున్నట్లు బీటౌన్ వర్గాల సమాచారం. కాగా, గతేడాది జనవరిలో అనుష్కశర్మ టీమిండియా జెర్సీలో కనిపించినప్పటి నుంచి ఝులన్ గోస్వామి బయోపిక్ అంశంపై వార్తలు గుప్పుమంటున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఝులన్‌తో కలిసి అనుష్క కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హంగామా అనే మ్యాగజీన్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అంశాన్ని ప్రచురించింది. ఈ ఏడాది చివరినాటికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 38 ఏళ్ల ఝులన్ గోస్వామి.. 2002లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఆమె భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో 330కి పైగా వికెట్లు పడగొట్టింది. మహిళల క్రికెట్లో ఆమె దాదాపు రెండు దశాబ్దాలుగా రాణిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల జట్టులో గోస్వామి సభ్యురాలిగా ఉంది. త్వరలోనే భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు దేశాల మధ్య జరిగిన ఏకైక టెస్టు డ్రా కాగా, మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో భారత్ చేజార్చుకుంది. ఈ నెల 9 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. -
శ్రీమతి ఎంజీఆర్
మధుబాల మంచి నటి. ‘రోజా’, ‘జెంటిల్‌మేన్’ వంటి సినిమాలు చాలు.. ఆమె ఎంత మంచి నటో చెప్పడానికి. కథానాయికగా మంచి పాత్రలు చేసిన మధు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అలాంటి పాత్రలే చేస్తున్నారు. వచ్చే నెల 23న విడుదల కానున్న ‘తలైవి’లో ఆమె ఓ నిజజీవిత పాత్ర చేశారు. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కంగనా టైటిల్ రోల్ చేశారు. ఇందులో ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ పాత్రను మధుబాల చేశారు. శుక్రవారం (మార్చి 26) మధుబాల బర్త్‌డే సందర్భంగా ఆమె లుక్ విడుదలైంది. ఆస్పత్రిలో ఎంజీఆర్ పక్కన కూర్చుని, ఆయన్ను చూస్తున్న జానకీ రామచంద్రన్ లుక్‌కి మంచి స్పందన లభించింది. -
రాణి వేలు నాచ్చియార్
నయనతార యువరాణిగా మారనున్నారు. అది కూడా బ్రిటిష్‌వారిపై పోరాడిన మొట్టమొదటి మహారాణిగా మారడానికి సిద్ధమవుతున్నారు. రాణి పేరు ‘వేలు నాచ్చియార్’. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన రాణి తను. 1780 నుంచి 1790 వరకూ శివగంగై సంస్థానాన్ని పాలించారు వేలు నాచ్చియార్. ఆమె జీవితం ఆధారంగా దర్శకుడు సుశీ గణేశన్ ఓ చిత్రం తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో రాణి పాత్రకు నయనతారను అనుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో నటించడానికి నయన కూడా పచ్చజెండా ఊపారట. ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ, మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు నయనతార. కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించే నయనతార ‘శ్రీరామరాజ్యం’లో సీతగా మెప్పించారు. ‘సైరా’లో స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సతీమణి సిద్ధమ్మ పాత్రకు చక్కగా సరిపోయారు. అందుకే ‘వేలు నాచ్చియార్’కి నయనతార యాప్ట్ అని సుశీ గణేశన్ అనుకుని ఉంటారు. వేలు నాచ్చియార్కి యుద్ధ విద్యల్లో మంచి నైపుణ్యం ఉంది. గుర్రపు స్వారీ, విలు విద్య, కర్ర సాము వంటివన్నీ తెలుసు. ఆమె పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి నయనతార ఈ విద్యలన్నీ నేర్చుకుంటారని ఊహించవచ్చు. -
‘తలైవి’ వర్ధంతి : కంగనా స్టన్నింగ్ స్టిల్స్
సాక్షి, ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి జయలలిత బయోపిక్కు సంబంధించిన స్టన్నింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'తలైవి' మూవీ సంబంధించి కొన్నివర్కింగ్ స్టిల్స్ ను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ముఖ్యంగా నేడు (శనివారం, డిసెంబరు 5) జయలలిత వర్ధంతి సందర్భంగా విప్లవ నాయకికి కంగనా నివాళులర్పించారు. మరో వారం రోజుల్లో సినిమా పూర్తికానుందని పేర్కొన్న కంగనా ఈ సందర్శంగా సూపర్ హ్యూమన్‌లా సినిమాను తెరకెక్కిస్తున్న విజయ్‌తోపాటు, తలైవి చిత్ర యూనిట్‌కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్ 'తలైవి-ది రివల్యూషనరీ లీడర్' లో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఆరు నెలలపాటు వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలను శరవేంగా పూర్తి చేసుకుంటోంది. హితేష్ ఠక్కర్, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ హిందీ, తమిళం తెలుగు భాషలలో విడుదల కానుంది. On the death anniversary of Jaya Amma, sharing some working stills from our film Thalaivi- the revolutionary leader. All thanks to my team, especially the leader of our team Vijay sir who is working like a super human to complete the film, just one more week to go 🙏 pic.twitter.com/wlUeo8Mx3W — Kangana Ranaut (@KanganaTeam) December 5, 2020 -
జానకి.. శశికళ
ఏ సినిమాకైనా సరైన ఆర్టిస్టులను ఎంపిక చేయడం ముఖ్యం. బయోపిక్ అయితే అది మరింత ముఖ్యం. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌లోనూ ఆర్టిస్ట్‌ల ఎంపికలో రాజీ పడటం లేదు చిత్రబృందం. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తలైవి’ (నాయకురాలు అని అర్థం). కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. దివంగత నటుడు యంజీ రామచంద్రన్ (యంజీఆర్)గా అరవింద స్వామి, నటుడు శోభన్‌బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిష్షూ సేన్ గుప్తా నటిస్తున్నారు. తాజాగా జయ జీవితంలో కీలకమైన ఆప్తురాలు శశికళ పాత్రలో పూర్ణ నటిస్తున్నారు. యంజీఆర్ భార్య జానకి పాత్రలో ‘రోజా’ ఫేమ్ మధుబాల నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ – ‘‘శశికళ పాత్రకి ప్రియమణిని అనుకున్నాం. కానీ డేట్స్ సమస్య వచ్చింది. పూర్ణ అయితే ఈ పాత్రకు బావుంటారని తీసుకున్నాం. మధుబాలగారిని జయలలిత తల్లి సంధ్య పాత్రలో తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆమెను కలిశాక యంజీఆర్ భార్య జానకి పాత్రకు కరెక్ట్‌గా సరిపోతారని తీసుకున్నాం. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ చేస్తున్నాం. మార్చి మొదటివారం వరకూ ఈ షెడ్యూల్ సాగుతుంది’’ అన్నారు. శైలేష్ ఆర్, విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది. -
ఎందరికో స్ఫూర్తి
నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు. సోమవారం (ఫిబ్రవరి 24) జయలలిత 72వ జయంతి. ఈ సందర్భంగా ఈ సినిమాలోని కంగన కొత్త లుక్‌ను విడుదల చేశారు. ‘‘జయ లలితగారు ఎందరికో స్ఫూర్తి. వెండితెరపై ఆమె పాత్రను ఎంతో అంకితభావంతో పోషిస్తూ, ఆ పాత్రకు జీవాన్నిస్తున్నారు కంగనా. ఈ ప్రాజెక్ట్‌లో ఆమె భాగం కావడం ఈ సినిమా క్వాలీటిని ఎన్నో రెట్లు పెంచింది’’ అన్నారు విజయ్. ‘‘ఎన్నో అడ్డంకులతో పోరాడి, వాటిని అధిగమించి, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఓ స్త్రీ గాథ ఈ చిత్రం’’ అన్నారు విష్ణువర్ధన్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. -
నాది చాలా బోరింగ్ లైఫ్!
ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. మరి మీ బయోపిక్ తీస్తే ఎలా ఉంటుంది? మీ పాత్రలో ఎవరు నటిస్తే బావుంటుంది? అని ఓ ఇంటర్వూ్యలో మహేశ్‌బాబుని అడిగితే ఈ విధంగా స్పందించారు. ‘‘నాది చాలా సింపుల్, బోరింగ్ లైఫ్. నా బయోపిక్ వర్కౌట్ అవుతందని నేను అనుకోను’’ అని సమాధానమి చ్చారు. ఒకవేళ రోడ్ ట్రిప్‌కి వెళ్తే మీతో పాటు ఇండస్ట్రీలో ఎవర్ని తీసుకెళ్తారు? అనే ప్రశ్నకు ‘‘చరణ్ (రామ్‌చరణ్), తారక్ (ఎన్టీఆర్).. అలాగే బ్యాలెన్స్ చేయడానికి చిరంజీవిగారిని తీసుకెళ్తాను’’ అన్నారు మహేశ్‌బాబు. ఇక సినిమాల విషయానికి వస్తే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ చేయనున్న సినిమా షూటింగ్ వేసవి తర్వాత ప్రారంభం కానుందట. -
తాప్సీకి పోటీగా.. కోహ్లి భార్య మైదానంలోకి!
సినిమా రంగంలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందుకు అనుగుణంగానే తాజాగా బాలీవుడ్ బ్యూటీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఓ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌లో ప్రధానపాత్ర పోషించేందుకు అనుష్క అంగీకరించారు. 2002లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన టీమిండియా లెజెండ్ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి తన 18 ఏళ్ల కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. ఝలన్ గోస్వామి 2010లో అర్జున అవార్డ్‌తో పాటు పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకుంది. 2002లో తొలి వన్డే మ్యాచ్ ఆడిన గోస్వామి ఇటీవల టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించింది. అటు భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ కూడా రూపొందుతోంది. ఈ మూవీలో నటి తాప్సీ మిథాలీరాజ్ పాత్రను పోషిస్తోంది. శభాష్ మిథు పేరుతో సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇటు అనుష్క శర్మ కూడా ఝలన్ గోస్వామి బయోపిక్‌లో నటించనుండడంతో రెండు బయోపిక్ లు త్వరలో ప్రేక్షకులను అలరించనున్నాయి. క్రీడాకారుల జీవిత చరిత్రలతో రూపొందే బయోపిక్‌లకు మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: 2020 కోసం వెయింటింగ్: అనుష్క శర్మ -
ఎం.ఆర్. రాధా బయోపిక్
ఎం.ఆర్ రాధ... తమిళంలో పాపులర్ నటుడు, రాజకీయ నాయకుడు. నాటక రంగం నుంచి సినిమాకు వచ్చి హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా తమిళ ప్రేక్షకులను అలరించారు. ఆయన సంతానమే రాధిక, రాధా రవి, నిరోషా. తన తండ్రికి నివాళిగా ఓ బయోపిక్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నారట రాధిక. తన నిర్మాణ సంస్థ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాకు రాధా రవి మనవడు ఐకీ రాధా దర్శకత్వం వహిస్తారట. -
మోదీ బయోపిక్‌లో నటిస్తా
‘రేసుగుర్రం’ సినిమాతో సౌత్‌కి పరిచయమయ్యారు భోజ్‌పురి స్టార్ రవికిషన్. తన నటనతో మెల్లిగా దక్షిణాది ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ప్రస్తుతం నాలుగు భోజ్‌పురి, ఒక హిందీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీవితంతో సినిమా చేయాలని ఉందని ఇటీవల రవికిషన్ పేర్కొన్నారు. ‘‘మన నాయకుల సత్తాను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే భోజ్‌పురి భాషలో నరేంద్ర మోది బయోపిక్‌లో నటించాలనుకుంటున్నాను. అంతేకాదు బిహార్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన స్వాతంత్య్ర సమర యోధుల జీవిత చరిత్రల్లో కూడా నటించాలని ఉంది. స్వామి వివేకానంద బయోపిక్‌పై కూడా ఆసక్తిగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు రవికిషన్. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘పీఎమ్ నరేంద్ర మోదీ’ టైటిల్‌తో హిందీలో మోదీ బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించారు. -
తగ్గుతూ.. పెరుగుతూ...
యాక్టర్లు పాత్రకు తగ్గట్టు బరువు తగ్గుతూ, పెరుగుతూ ఉండాల్సి ఉంటుంది. కానీ ఒకేసారి బరువు తగ్గుతూ, పెరుగుతూ జిమ్‌లో శ్రమిస్తున్నారు జాన్వీ. ప్రస్తుతం జాన్వీ ‘కార్గిల్ గాళ్, రూహీఅఫ్జా’ సినిమాలను ఏకకాలంలో చేస్తున్నారు. ‘కార్గిల్ గాళ్’ ఏమో గుంజన్ సక్సేనా బయోపిక్. ఈ పాత్రలో కొంచెం బొద్దుగా కనిపించనున్నారు జాన్వీ. ‘రూహీ అఫ్జా’ అనేది హారర్ కామెడీ చిత్రం. ఈ సినిమాలో నాజూకుగా కనిపించాలి. ‘కార్గిల్ గాళ్’ సినిమా షూటింగ్ మొదట ప్రారంభించారు. ఆ పాత్ర కోసం జాన్వీ సుమారు 6 కిలోల బరువు పెరిగారు. ఆ తర్వాత ‘రుహీ అఫ్జా’ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. ఇందులోని పాత్ర కోసం 10 కిలోల బరువు తగ్గారామె. ఇప్పుడు ‘కార్గిల్ గాళ్’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. దాంతో మళ్లీ బరువు పెరగనున్నారని తెలిసింది. ‘‘కొత్త షెడ్యూల్‌కి ఆరు వారాల సమయం ఉంది. ఈ గ్యాప్‌లో వారానికి ఆరుసార్లు జిమ్ చేస్తూ, రోజుకి 3 గంటలు జిమ్‌లోనే గడుపుతున్నారు. రోజుకి ఇంట్లో తయారు చేసిన లడ్డూలు మూడు నాలుగు లాగించేస్తున్నారు’’ అన్నారు జాన్వీ ట్రైనర్ నమ్రత. -
స్పేస్ జర్నీ ముగిసింది
‘రాకెట్రీ’లో మాధవన్ అంతరిక్ష ప్రయాణం సెర్బియాలో ముగిసింది. మాధవన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఈ చిత్రానికి దర్శకుడు కూడా మాధవనే కావడం విశేషం. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. నారాయణన్ పాత్రలో మాధవన్ నటించారు. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మాధవన్, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం ఇది. ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాళ్’ (తెలుగులో ‘అమృత’) సినిమాలో మాధవన్, సిమ్రాన్ నటించారు. ‘‘రాకెట్రీ సినిమా ముగిసింది. నా జీవితంలోనే అత్యద్భుతంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. నా హృదయం ఎన్నో భావోద్వేగాలతో నిండిపోయింది’’ అన్నారు మాధవన్. ఇందులో హాలీవుడ్ యాక్టర్లు రాన్ డోనాచీ (గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్), ఫిలిస్ లోగాన్ కీలక పాత్రలు చేశారు. -
‘కపిల్ భార్యతో గడపాలని ఉంది’
సాక్షి, న్యూఢిల్లీ: లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితాధారంగా హిందీలో ఓ బయోపిక్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కపిల్ భార్య రోమీ భాటియా పాత్రలో దీపిక పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోమీ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు తనతో కొంత కాలం గడపాలనుందని దీపిక అనుకుంటున్నారు. కపిల్ భార్యగా ఆమె వ్యవహార తీరును దగ్గర నుంచి పరిశీలించేందుకు తనను త్వరలోనే కలుస్తానని దీపిన తెలిపారు. ఇదివరకే ఓ సారి రోమీతో కలిసిన దీపిక తనతో పలు విషాయాలను కూడా పంచుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇదే విషయంపై చిత్రంలో హీరోగా నటిస్తున్న రణ్వీర్ ఇదివరకే కపిల్‌ను కలిసిన విషయం తెలిసిందే. పదిరోజులు కపిల్‌తో గడిపిన సింగ్.. 1983లో జరిగిన ఘటనల గురించి దగ్గరుండి తెలుసుకున్నారు. కాగా కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘83’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పెళ్లయ్యాక ‘దీప్‌వీర్’ జంట రీల్ లైఫ్ భార్యాభర్తలుగా నటించే తొలి చిత్రం ఇదే. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచిన నేపథ్యంలో సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో కపిల్ భార్య రోమి స్టేడియంలోనే ఉన్నారు. అయితే వరల్డ్ కప్ వెస్టిండీస్ సొంతం అవుతుందేమోనన్న అనుమానంతో రోమీ బాధతో స్టేడియం నుంచి వెళ్లిపోయారట. ఆ తర్వాత ప్రపంచకప్ టీమిండియా సొంతం అవబోతోందని తెలిసి వెంటనే మళ్లీ స్టేడియం వద్దకు వచ్చారట. తన భర్త సారథ్యంలో టీమిండియా కప్ గెలిచిన సందర్భంగా ఆమె సంతోషంతో కన్నీరుపెట్టుకున్నారట. ఇలాంటి భావోద్వేగాలను, హావభావాలను దీపిక బాగా పండించగలరని భావించిన చిత్రబృందం రోమీ పాత్రకు ఆమెను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ప్రేమ ప్రయాణం
చండీఘడ్ వీధుల్లో హ్యాపీగా చక్కర్లు కొడుతున్నారు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. కానీ ఒంటరిగా కాదులెండి. కార్గిల్‌వార్ (1999) సమయంలో ఇండియన్ ఆర్మీ కెప్టెన్‌గా ఉన్న విక్రమ్ బాత్రా బయోపిక్ ‘షేర్షా’గా బాలీవుడ్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చంఢీఘర్‌లో జరుగుతోంది. సిద్ధార్థ్, కియారాలపై బైక్ రైడ్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కొన్ని ఫైట్ సీన్లను కూడా ప్లాన్ చేశారు. ఇంకో పదిరోజుల పాటు ఈ సినిమా షెడ్యూల్ చండీఘడ్లోనే జరుగుతుందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాకి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
మోదీ బయోపిక్ విడుదలకు తేదీ ఖరారు
-
కెప్టెన్ షేర్షా
దేశ సరిహద్దులో శత్రువుల అంతు చూస్తానంటున్నారు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. ఇందుకోసం గన్ ఫైరింగ్‌లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కనున్న నెక్ట్స్ చిత్రానికి ‘షేర్షా’ అనే టైటిల్ ఖరారైంది. పరమ వీరచక్ర బిరుదు గ్రహీత, కార్గిల్ వార్‌లో చురుగ్గా పాల్గొన్న ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ విక్రమ్ బత్రా పాత్రలో నటించనున్నారు సిద్ధార్థ్. విక్రమ్‌ను పాకిస్తాన్ ఆర్మీ ‘షేర్షా’ అని పిలిచేవారట. అందుకే ఈ బయోపిక్కు ఆ టైటిల్ పెట్టారని ఊహించవచ్చు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి విష్ణువర్థన్ దర్శకత్వం వహిస్తారు. కియారా అద్వానీ ఇందులో కథానాయికగా నటిస్తారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘రియల్ లైఫ్ హీరో విక్రమ్ బత్రా పాత్రలో నటించబోతున్నందుకు ఎగై్జటింగ్‌గా ఉన్నాను. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది’’ అన్నారు సిద్ధార్థ్. కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వా మెహతా, షబ్బీర్ బాక్స్‌వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
38 దేశాల్లో ‘పీఎం నరేంద్ర మోదీ’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’ని అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తోసహా 38 దేశాల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ఆనంద్ పండిట్ చెప్పారు. ఒమంగ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. భారత్‌లో 1,700, ఓవర్సీస్లో 600 స్క్రీన్లలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని ఆనంద్ చెప్పారు. ‘ఈ సినిమా వినోదం సైతం ఉంది. ప్రధానిని పొగుడుతూ, విపక్ష పార్టీలకు కౌంటర్‌గా సినిమా తీయలేదు. క్రియాశీలక రాజకీయాల్లోకి మోదీ ప్రయాణాన్నే ప్రధానంగా చూపించాం’ అని చెప్పారు. సినిమా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో సినిమా విడుదల కానుంది. -
బాలీవుడ్ ‘నమో’ స్మరణ!
సినీ రంగంలో రాజకీయ నాయకుల జీవిత చిత్రాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇదే పరంపరలో ప్రధాని మోదీ బయోపిక్‌లు నిర్మితమయ్యాయి. ఎన్నికల వేళ మోదీ పట్ల బాలీవుడ్ ఇలా తన విధేయత చాటుతూ అనధికార ప్రచారం చేస్తోందని వినిపిస్తోంది. ఈ ఏడాది తొలినాళ్లలో మోదీతో బాలీవుడ్ ప్రముఖులు సమావేశమై జాతి నిర్మాణంలో సినిమాల పాత్రపై చర్చలు జరిపిన తరువాత బాలీవుడ్–మోదీ బంధం మరింత బలపడిందని భావిస్తున్నారు. ఆ మరసటి రోజే ‘ఉడీ: సర్జికల్ స్ట్రైక్స్’ అనే చిత్రం విడుదలైంది. ఇందులో రంజిత్ కపూర్ మోదీ పాత్రలో కనిపించారు. అదే రోజున మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఆత్మకథతో వచ్చిన ‘యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా కాంగ్రెస్‌కు, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికల క్రతువు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రధాని క్యాంపెయిన్‌కు మద్దతుగా నిలుస్తాయని భావిస్తున్న కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు.. పీఎం నరేంద్ర మోదీ వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ సినిమాలో సోలో హీరోగా నటించి 5 ఏళ్లు పూర్తయింది. అప్పటి నుంచి దక్షిణాది పరిశ్రమపై దృష్టిపెట్టి సహాయ లేదా విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రంతో మళ్లీ బాలీవుడ్లో కథానాయకుడిగా తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి బీజేపీ ఎంపీ అయిన ఆయన తండ్రే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి మోదీకి అభిమాని అయిన ఒబెరాయ్ 2014 ఎన్నికల సందర్భంగా ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలున్నాయి. మోదీ– ఏ జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ ‘నియంతలకు మతాలు లేవు. కనీసం మృతులనైనా హిందూ, ముస్లింలని వేరుచేయకండి’..మంటల్లో రైలు బోగి దగ్ధమవుతున్న(2002 నాటి గోద్రా అల్లర్లు ప్రస్తావిస్తూ) సమయంలో మోదీ పాత్రధారి ఆశిష్ శర్మ ట్రైలర్లో అన్న మాటలివి. ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో ఈరోస్ నౌలో ప్రసారం అయ్యే అవకాశాలున్నాయి. బాల్యంలో టీ విక్రేతగా పనిచేయడం, ఇందిరా గాంధీని వ్యతిరేకించడం, పాకిస్తాన్‌తో కయ్యానికి కాలు దువ్వడం లాంటి మోదీ గుణాలన్నింటిని చూపాలంటే ఈ సిరీస్‌ను కనీసం పది భాగాల పాటు కొనసాగించాలని నిర్మాతలు భావిస్తున్నారు. మోదీ కాకా కా గావ్ మోదీ మానసపుత్రికలైన స్వచ్ఛ్ భారత్ అభియాన్, డిజిటల్ ఇండియా, సర్జికల్ దాడులు, పెద్దనోట్ల రద్దు లాంటి వాటిని ఈ చిత్రంలో ప్రధానంగా ప్రస్తావించారు. 2017, డిసెంబర్ 8న గుజరాత్ ఎన్నికలకు ఒకరోజు ముందు విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేయడంతో అదే ఏడాది డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. – సాక్షి నేషనల్ డెస్క్ నమో సౌనె గామో గుజరాతీలో తీసిన ఈ చిత్రం 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదలైంది. గుజరాత్, ముంబైలలో ఒకరోజు ఆడిన తరువాత ఎన్నికల సంఘం చిత్ర ప్రదర్శనను నిలిపేసింది. నరేంద్ర మోదీకి సంబంధించి ఈ చిత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదని నిర్మాతలు వాదించినా సినిమా పేరు, హీరో పాత్ర తదితరాలు అసలు విషయమేంటో స్పష్టం చేశాయి. ఈ మార్చిలో సినిమాను తిరిగి విడుదల చేయాలనుకున్నా సాధ్యం కాలేదు. – సాక్షి నేషనల్ డెస్క్ – సాక్షి నేషనల్ డెస్క్ -
ఎప్పటికీ ఉండి పోతుంది!
ఒకరిలా ఇంకొకరు కనిపించడం అసాధ్యం. మేకప్‌తో కొంతవరకూ మేనేజ్ చేయొచ్చు. కానీ పూర్తిగా చేయగలిగితే మాత్రం అద్భుతం అనే అనాలి. ఇప్పుడు దీపికా పదుకోన్‌ని అందరూ అలానే అంటున్నారు. ఎందుకంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయారామె. ఆ మార్పుని చూడగానే ‘ఈవిడ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ కదా’ అని అనుకోకుండా ఉండరు. అంతలా దీపిక తన లుక్‌ని మార్చుకున్నారు. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా దీపిక చేస్తున్న చిత్రం ‘ఛపాక్’. ఈ చిత్రంలో దీపిక లుక్‌ని సోమవారం విడుదల చేశారు. ఇప్పటివరకూ దీపిక చేసిన సినిమాలు ఓ ఎత్తు ఈ సినిమా మరో ఎత్తు. ఇందులో డీ–గ్లామరైజ్డ్ రోల్లో కనిపిస్తారు. లక్ష్మీ జీవితానికి దీపిక ఎంతగా ఇన్స్పైర్ అయ్యారంటే.. కేవలం ఆమె పాత్రను పోషించడమే కాదు.. ఈ చిత్రానికి ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. జీవితంలో వచ్చిన పెద్ద కుదుపు నుంచి ధైర్యంగా తేరుకున్న లక్ష్మీ పాత్రలో ఒదిగిపోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు దీపిక. ఆమెలా మారడానికి గంటలు గంటలు మేకప్‌కి కేటాయించాల్సిందే. దీపికను ఎక్కువ కష్టపెట్టే పాత్ర. అయినా ఆనందంగా చేస్తున్నారు. ‘‘ఈ పాత్ర నాతో ఎప్పటికీ ఉండిపోతుంది. ఈ రోజు నుంచి షూటింగ్ మొదలుపెట్టాం’’ అన్నారు దీపిక. ‘రాజీ’ మూవీ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో దీపిక పాత్ర పేరు మాల్తీ. వచ్చే ఏడాది జనవరి 10న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
నా కథ చూపిస్తా
ముక్కుసూటితనానికి మారు పేరు కంగనా.. వివాదాలకు చిరునామా కంగనా.. బాలీవుడ్లో కంగనా రనౌత్ గురించి ఇలానే చెప్పుకుంటారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే కంగనా కొన్ని వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ముఖ్యంగా నెపోటిజమ్ (బంధుప్రీతి) పై ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో పెద్ద దుమారం రేపాయి. ఇక హీరో హృతిక్ రోషన్‌తో రచ్చ, ‘సిమ్రన్’ చిత్రంలో రచయితగా క్రెడిట్ తీసుకోవడం, తాజాగా ‘మణికర్ణిక’ చిత్రం డైరెక్షన్ క్రెడిట్ ఇష్యూ... ఇలా కంగనా జీవితంలో చాలా ఆసక్తికర అంశాలు ఉన్నాయి. వీటన్నింటి కంటే ముందు ప్రతిభతో కంగనా బాలీవుడ్లో ఎదిగిన తీరు ప్రశంసనీయం. యువకథానాయికలకు స్ఫూర్తి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే... ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు కంగనానే దర్శకత్వం వహించనుడటం విశేషం. ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ కథ అందిస్తారు. ‘‘నా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇండస్ట్రీలో ఏ పరిచయాలు లేకపోయినా ప్రతిభతో కష్టపడి పైకి ఎదిగి జీవితంలో విజయం సాధించిన ఓ అమ్మాయి కథ ఇది. ఇదేదో నా ప్రచారం కోసమో, నా గురించి గొప్పలు చెప్పుకోవడానికో తీస్తున్న సినిమా కాదు. నా నిజజీవితంలో ఉన్న కీలక పాత్రలు ఈ సినిమాలో ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు కంగనా. ప్రస్తుతం ‘పంగా’ సినిమాతో బిజీగా ఉన్నారామె. అలాగే ఆమె నటించిన ‘మెంటల్ హై క్యా’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ రెండు చిత్రాల పనులు పూర్తయ్యాక కంగనా బయోపిక్ మొదలవుతుందని టాక్. -
రాజమాత టు రాష్ట్రమాత
పాత్ర ఎంత క్లిష్టంగా ఉన్నా కూడా తాను అలవోకగా చేయగలనని నిరూపిస్తూ వస్తూనే ఉన్నారు రమ్యకృష్ణ. ‘నరసింహ’లోని నీలాంబరి, ‘బాహుబలి’లో శివగామి వంటి పాత్రలు అందుకు ఉదాహరణలు. ఇప్పుడు అలాంటిదే మరో చాలెంజింగ్ పాత్రకు రెడీ అయ్యారట రమ్యకృష్ణ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత పాత్రను పోషించనున్నారట. ఆల్రెడీ జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో మూడు సినిమాలు రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది మరో సినిమానా అంటే కాదు.. ఇది వెబ్ సిరీస్ అట. ‘ఘర్షణ, ఏ మాయ చేసావె’ ఫేమ్ గౌతమ్ మీనన్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయనున్నారట. 30 ఎపిసోడ్లుగా సాగే ఈ వెబ్ సిరీస్‌లో జయలలిత జీవితానికి సంబంధించిన అన్ని ఘట్టాలను కవర్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేశ్ (బాబీ) నిర్మించనున్నారు అనే వార్తలు వినిపించాయి. కానీ ఈ నిర్మాణంలో ఆయన భాగం కారని వెంకటేశ్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. -
వార్కి రెడీ
యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారట జాన్వీ కపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మహిళా పైలెట్ గున్‌జన్ సక్సేనా కార్గిల్ యుద్ధంలో ప్రతిభ చాటారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుందని బాలీవుడ్ సమాచారం. టైటిల్ రోల్లో జాన్వీ కపూర్ నటించనున్నారట. సక్సేనా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలను తెలుసుకునే పనిలో పడ్డారట జాన్వీ. తొలిచిత్రం ‘ధడక్’లో గ్లామర్‌గా నటించిన ఆమె ఈ చాలెంజింగ్ పాత్రలో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పిస్తారనే విషయం బాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్ర చేయనున్నారని వినికిడి. జాన్వీని వెండితెరకు పరిచయం చేసిన కరణ్ జోహార్ ఈ సినిమాని కూడా నిర్మించనున్నారట. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ సినిమా కంటే ముందు కరణ్ జోహార్ దర్శకత్వం వహించనున్న ‘తక్త్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జాన్వీ. -
సరైన గౌరవం దక్కాలి!
అజయ్ దేవగన్ రీల్ ఫుట్‌బాల్ మ్యాచ్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. హైదరాబాద్‌కి చెందిన ఫుట్‌బాల్ కోచ్ కమ్ ప్లేయర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఇటీవలే ‘బదాయి హో’ చిత్రంతో మంచి సక్సెస్ సాధించిన అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తారు. ‘‘అజయ్ గ్రేట్ లిజనర్. ఎమోషనల్ సీన్లో అజయ్ దేవగన్ అద్భుతంగా నటిస్తారు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెడతాం. మన దేశంలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ ఫుట్‌బాల్‌కి లేదు. కానీ మన దేశంలో ఫుట్‌బాల్ క్రీడకు సయ్యద్గారు చాలా కృషి చేశారు. అయినప్పటికీ ఆయన పేరుపై ఒక్క స్టేడియం కూడా లేదు. ఈ సినిమా తర్వాత అయినా ఆయనకు సరైన గౌరవం దక్కుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు అమిత్. -
జీవితాంతం గుర్తుండిపోతుంది
నటరాజన్ (కరాటే రాజు), సూర్య, పి.ఆర్. విఠల్‌బాబు ముఖ్య తారలుగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉద్యమసింహం’. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం ఆధారంగా కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. కరాటే రాజు, నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ సిడీని, నటుడు రవివర్మ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘కమల్‌హాసన్‌గారు నాకు కరాటే రాజా అనే పేరు పెట్టారు. నా అసలు పేరు కన్నా కరాటే రాజాగానే ఇండస్ట్రీలో తెలుసు. కేసీఆర్‌గారి పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర. చాలెంజింగ్ రోల్. సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు కరాటే రాజా. ‘‘ఉద్యమ ఊపు ప్రచార చిత్రాల్లో కనిపిస్తోంది. ఖైలాష్ కేర్, వందేమాతరం శ్రీనివాస్ వంటి వారు ఈ సినిమాలోని పాటలు పాడారు. నేనూ చిన్న పాత్ర చేశాను’’ అన్నారు రవివర్మ. ‘‘బయోపిక్‌లు, ఉద్యమాల మీద సినిమాలు తీయడం కష్టం. ఈ సినిమా టీమ్ అందరిలో ఓ కసి కనిపిస్తోంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘‘కేసీఆర్‌గారి కథను మూడు గంటల్లో చెప్పడం కష్టం. అందుకే ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలు, ఉద్యమంలోని ముఖ్య అంశాలను తీసుకుని కథ తయారు చేశాను. ఈ నెలాఖరున చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత. ‘‘తెలుగు ప్రజలందరూ కేసీఆర్‌గారి గురించి తెలుసుకోవాలి’’ అన్నారు కృష్ణంరాజు. -
టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది
‘‘ఉద్యమ సింహం’ టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. కేసీఆర్‌గారంటే నాకు ఇష్టం. నిర్మాతలంతా కమర్షియల్ సినిమాలు చేస్తున్న ఈ రోజుల్లో నాగేశ్వరరావుగారు కేసీఆర్‌పై సినిమా చేయడం గొప్ప విషయం. రాజకీయాలకు అతీతంగా ఉండే సినిమా ఇది. కొన్ని సీన్స్ చూశా.. చాలా బాగా తీసారు’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. నటరాజన్ (గిల్లిరాజా), సూర్య, పి.ఆర్. విఠల్‌బాబు ప్రధాన పాత్రల్లో అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌పై కల్వకుంట్ల నాగేశ్వరరావు కథ అందించి, నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘జూన్‌లో ప్రారంభించిన ‘ఉద్యమ సింహం’ సినిమా షూటింగ్ సోమవారంతో పూర్తయింది. మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఈ నెల 16న ఆడియో, అతి త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘కేసీఆర్ గురించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను మా సినిమాలో చూపించబోతున్నాం. కేసీఆర్ పాత్ర ఎవరు పోషించారు? మిగతా నటీనటులు ఎవరు? అన్నది ఆడియో విడుదల రోజున చెబుతాం’’ అని అల్లూరి కృష్ణంరాజు అన్నారు. సంగీత దర్శకుడు దిలీప్ బండారి, మాటల రచయిత కృష్ణ రాపోలు, ఛాయాగ్రాహకుడు ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. ∙నాగేశ్వరరావు, రాజ్ కందుకూరి -
ఈసారి వినిపిస్తా!
‘సవ్యసాచి’తో తొలిసారి స్ట్రయిట్ తెలుగు చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించారు మాధవన్. ఈ చిత్రంలో మాధవన్ పోషించిన నెగటివ్ పాత్రకు మంచి అభినందనలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మాధవన్ ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ అనే చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనంత్ మహదేవ్‌తో కలసి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు మాధవన్. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు మాధవన్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్నారు. ‘‘సవ్య సాచి’ సినిమాలో పాత్రకు డబ్బింగ్ చెప్పాలనుకున్నా అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా సినిమాలను ఫాలో అయ్యేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారని తెలుసుకున్నాను. అందుకే ‘రాకెట్రీ’ సినిమాలో నా గొంతునే వినిపిస్తాను’’ అని మాధవన్ పేర్కొన్నారు. -
ది ఐరన్ లేడి
మాజీ నటి, రాజకీయ నాయకురాలు, తమిళ ప్రజల ‘పురిట్చి తలైవి’ (విప్లవ నాయకురాలు) జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో నాలుగు బయోపిక్స్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కించబోయే ‘ఐరన్ లేడీ’ ఒకటి. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను నిత్యా మీనన్ పోషించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ– ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలను దర్శకురాలు ప్రియదర్శని పంచుకున్నారు. ‘‘జయలలితగారి పాత్ర పోషించడానికి చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించాం. ఫైనల్‌గా నిత్యా మీనన్ అయితే బావుంటుందని భావించాం. నిత్యా కూడా క్యారెక్టర్‌కు బాగా సూట్ అవుతున్నారు. జయలలితగారి ఆప్త మిత్రురాలు శశికళ పాత్రకు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ని అనుకుంటున్నాం. మిగతా నటీనటుల పేర్లను చిత్రం ప్రారంభోత్సవం రోజు చెబుతాం’’ అన్నారు. సినిమా కథ గురించి చెబుతూ – ‘‘జయలలితగారి జీవితం మొత్తం మా సినిమాలో చూపించదలిచాం. ఆమె పుట్టినప్పటి నుంచి చివరి వరకూ (1948 నుంచి 2016 వరకూ) చిత్రకథ ఉంటుంది. సినిమాలకు, రాజకీయాలకు సమానమైన ప్రాముఖ్యతని ఇచ్చాం. ఏ ఘట్టాన్నీ పక్కన పెట్టుకోదలచుకోలేదు. జయలలితగారి అంత్యక్రియల సన్నివేశాలను కూడా చూపించనున్నాం. కానీ ఆసుపత్రిలో ఉన్న భాగాన్ని మాత్రం చూపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆ విషయం మీద కోర్ట్‌లో కేసు నడుస్తోంది. ఇన్వెస్టిగేషన్ జరిగే సమయంలో ఏది కరెక్టో సరిగ్గా చెప్పలేం. అందుకే దాన్ని చూపించదలచుకోలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత జన్మదినం రోజున ఈ చిత్రం ప్రారంభిస్తాం’’ అని ప్రియదర్శిని చెప్పుకొచ్చారు. దర్శకుడు భారతీరాజా, ఏయల్ విజయ్, లింగుస్వామి కూడా జయలలిత బయోపిక్స్ అనౌన్స్ చేశారు. -
నాకు నేనే అతిథి...
... అంటున్నారు నటి షకీల. శృంగార తారగా ఎందరో యువ హృదయాలను కొల్లగొట్టారు షకీల. శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన షకీల జీవితాన్ని మలయాళ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ వెండితెరపై ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని సమాచారం. తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను దాచిపెట్టకుండా చిత్రబృందానికి తెలిపానని షకీల గతంలో చెప్పారు. ఆమె పాత్రలో బాలీవుడ్ నటి రిచా చద్దా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందట. తన జీవిత కథతో తెరకెక్కుతోన్న సినిమాలో షకీల అతిథి పాత్రలో మెరవనుండటం విశేషం. అతిథి పాత్రలో నటించమని ఇంద్రజిత్ లంకేష్ కోరడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట ఆమె. -
వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్లో ఆంతర్యమేమిటో?
హైదరాబాద్: వీవీఎస్ లక్ష్మణ్.. క్రికెట్ ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తన క్రికెట్ కెరీర్లో ‘వెరీ వెరీ స్పెషల్’గా గుర్తింపు పొందిన వీవీఎస్ తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తిని రేపుతోంది. త్వరలోనే వెరీ వెరీ స్పెషల్ స్టోరీ రాబోతుందంటూ లక్ష్మన్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే వెరీ వెరీ స్పెషల్‌గా రాబోతున్నది ఏంటాని క్రికెట్ ప్రేమికుల్లో చర్చ సాగుతోంది. అతని జీవిత కథ ఆధారంగా ఒక పుస్తకాన్ని వీవీఎస్ లక్ష్మణ్ తీసుకు రాబోతున్నాడా? లేక ఈ పేరుతో ఏమైనా సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడా? అనేది ఆసక్తికరం. ఈ వెరీ వెరీ స్పెషల్ స్టోరీ అంటూ లక్ష్మణ్ చేసిన ట్వీట్లో ఉన్న ఆంతర్యమేమిటో అతనే చెప్పాలి. రక్త మూలకణ దాతగా వీవీఎస్ లక్ష్మణ్ బ్లడ్ స్టెమ్‌సెల్ డోనర్ (రక్త మూలకణ దాత)గా పేరును నమోదు చేయించుకున్నాడు. స్వచ్ఛంద సంస్థ దాత్రి నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ ప్రతి ఒక్కరు బ్లడ్ స్టెమ్‌సెల్ దానం చేయవచ్చని, మరొకరి జీవితం పొడిగింపునకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నాడు. లాభాపేక్ష లేకుండా రక్తదానం చేసి మరొకరి ప్రాణం కాపాడాలని పిలుపునిచ్చాడు.మంచి పనికి ప్రతి ఒక్కరూ కదిలిరావాలని, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని లక్ష్మణ్ కోరాడు. A very very special announcement - coming soon ! pic.twitter.com/ReuOdfI08l — VVS Laxman (@VVSLaxman281) 30 October 2018 -
యుద్ధం ముగిసింది
కంగనా రనౌత్ టైటిల్ రోల్లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ‘మణికర్ణిక’. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నందమూరి తారకరామారావు జీవితకథతో తెరకెక్కుతోన్న ‘యన్.టి.ఆర్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు క్రిష్. కొన్ని ప్యాచ్ వర్క్స్ కోసం కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముగిసిందని సమాచారం. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ నర్మద ఘాట్‌లో ఈ చిత్రంలోని ఆఖరి పాట షూటింగ్ జరిగింది. కంగనా యుద్ధ విన్యాసాలు ఈ చిత్రంలో హైలెట్ అట. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న ‘మణికర్ణిక’ సినిమాని విడుదల చేసేందుకు చిత్రవర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. -
గుండెను తడిమేలా ఘంటసాల ది గ్రేట్
‘‘ఘంటసాల అంటే పాట. పాట అంటే ఘంటసాల అని మనందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలియజేసేదే ఈ చిత్రం’’ అని ‘ఘంటసాల ది గ్రేట్’ చిత్రబృందం పేర్కొంది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. ఘంటసాల పాత్రను గాయకుడు కృష్ణచైతన్య పోషించారు. సీహెచ్ రామారావు దర్శకత్వంలో ఆయన సతీమణి లక్ష్మీ నీరజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పోస్టర్స్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు. డిసెంబర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించి తుమ్మల రామసత్యనారాయణ మాట్లాడుతూ – ‘‘రామారావు చేసిన ఈ సాహసాన్ని అభినందించాలి. పాత్రల గురించి బాగా స్టడీ చేసి సినిమా తీశారు’’ అన్నారు. ‘‘బయోపిక్‌లు తీయడం చాలా కష్టం. గట్స్ ఉండాలి. ఇందులో హీరోగా ఓ పాత్ర చేశాను. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా రామారావు వర్క్ చేశారు’’ అన్నారు సాయి వెంకట్. ‘‘గొప్ప విజయాలను నమోదు చేయడమే కాకుండా గుండె తడి చేసి, గుండెను తడిమేసే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి’’ అన్నారు సుదర్శన్. ‘‘నేను చాలా చిన్నవాణ్ని. మొదట ఈ సినిమా చేయకూడదనుకున్నా. ఇప్పుడు అలా ఎందుకు అన్నానా అనిపిస్తోంది. ఘంటసాలగారి పాటలు విన్నాం. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసు. ఈ సినిమాలో ఆయన వ్యక్తిత్వం తెలియజేస్తున్నాం’’ అన్నారు కృష్ణ చైతన్య. ‘‘ఘంటసాలగారి మీద ఆరాధనతో ఈ సినిమా తీశాను. మా కష్టాన్ని అభినందిస్తారనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: సాలూరి వాసూరావు, కెమెరా: వేణు వాదనల. -
యంజీఆర్ మళ్లీ వస్తున్నారు
యంజీఆర్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. మళ్లీ తెరపై తమ అభిమాన నటుణ్ణి చూసుకొనే అవకాశం ఉంది. నటుడిగా సూపర్‌స్టార్ అయి, ఆ తర్వాత రాజకీయాల్లో ముఖ్యమంత్రి హోదాను అందుకొని తమిళనాట చిరస్థాయి ఖ్యాతిని గడించారు యంజీఆర్. ఆరెంజ్ కంట్రీ అనే ఓ మలేషియన్ కంపెనీ యంజీర్‌ను తిరిగి తెర మీదకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. యన్ ఫేస్ టెక్నాలజీ ద్వారా యంజీర్‌ను తిరిగి స్క్రీన్ మీద చూపించనున్నారు. ‘నరసింహా, చంద్రముఖి’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన పి.వాసుని డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. 22 మిలియన్ డాలర్స్ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్‌ను ప్రాంతీయ భాషల్లోని నటులతో షూట్ చేయనున్నాం అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. -
సిరీస్‌గా సిల్క్ జీవితం
1980ల్లో హాట్ గాళ్‌గా సౌత్ ఇండస్ట్రీలను ఊపు ఊపేసిన స్టార్ సిల్క్ స్మిత. ఈ పాపులర్ స్టార్ జీవితం ఆధారంగా ఆల్రెడీ ‘డర్టీ పిక్చర్’ సినిమా తెరకెక్కింది. ఆ సినిమాతో విద్యా బాలన్ సూపర్ స్టార్ అయ్యారు. ఇప్పుడు సిల్క్ జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ రూపొందించే ప్లాన్స్ జరుగుతున్నాయి. ‘కబాలీ’ ఫేమ్ పా.రంజిత్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తారట. ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థతో కలసి రంజిత్ ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేయనున్నారు. సిల్క్ జీవితంలో బాల్యాన్ని ఎవరూ సరిగ్గా చూపించలేదు. ఈ సిరీస్‌లో సిల్క్ బాల్యం నుంచి కథ చెప్పదలిచారట. సిల్క్‌కి ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. అందుకే వెబ్ సిరీస్ ద్వారా అన్ని భాషల వారికి ఈ కథను చూపించదలిచారట. ఇప్పటి వరకూ ఎవ్వరూ చూడని విధంగా రియలిస్టిక్‌గా చూపించాలనే ఆలోచనలో దర్శకుడు రంజిత్ ఉన్నారని సమాచారం. -
నేనంత పిచ్చోడిని కాను
రియలిస్టిక్ సంఘటనలతో రూపొందే చిత్రాల్లో ఎక్కువగా కనిపించే హీరో అక్షయ్ కుమార్. ‘ఎయిర్‌లిఫ్ట్, టాయిలెట్ : ఏక్ ప్రేమ కథ’లే అందుకు ఉదాహరణ. అలాగే బయోపిక్స్‌లో కూడా తరుచూ కనిపిస్తారీ కిలాడీ కుమార్. మీ లైఫ్ స్టోరీ ఆధారంగా బయోపిక్ తీసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అని అక్షయ్‌ని అడిగితే– ‘‘నా లైఫ్ స్టోరీ ఆధారంగా బయోపిక్ ఎప్పటికీ తీయను. అలా తీస్తే నేను పిచ్చోడినైపోతాను. దానికి బదులు చరిత్రలో మిగిలిపోయిన సూపర్ హీరోల మీదే సినిమాలు తీస్తాను. మనం చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. నా జీవితం ఆధారంగా పుస్తకం కూడా రాసే ఉద్దేశం లేదు’’ అని పేర్కొన్నారు. 1948లో ఒలింపిక్స్‌లో భారతదేశం సాధించిన తొలి బంగారు పతకం ఆధారంగా అక్షయ్ లీడ్ రోల్లో రూపొందిన ‘గోల్డ్’ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. -
బంగారు దర్శకుని కథ
దక్షిణాది చలన చిత్రసీమ గర్వించదగ్గ దర్శకులు కె.విశ్వనాథ్ జీవితం వెండితెరపైకి రానుంది. రచయిత, డైరెక్టర్ జనార్ధన మహర్షి దర్శకత్వంలో ‘విశ్వదర్శనం’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అన్నది ట్యాగ్‌లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. కె. విశ్వనాథ్ దంపతులు, నటుడు తనికెళ్ల భరణి, చిత్రనిర్మాత టి.జి. విశ్వప్రసాద్, చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల సినిమా స్క్రిప్ట్‌ని జనార్ధన మహర్షికి అందజేశారు. ‘‘విశ్వనాథ్‌గారి చరిత్ర పలువురికి ఆదర్శం. ఇలాంటి మహనీయుడి చరిత్రను చూపించాలనే ఆకాంక్షతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం. ఆయన పుట్టుక నుంచి ఇప్పటి వరకూ ఆయన జీవితం ఎలా సాగింది? అనే నేపథ్యంలో కథ సాగుతుంది. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సంగీతం: స్వరవీణాపాణి. -
నా లైఫ్‌లో జరిగినదంతా చెప్పాను: షకీలా
‘నిజాలు దాచి బయోపిక్ తీసి ఉపయోగమేంటి?’ అంటున్నారు నటి షకీలా. ఆమె జీవితం ఆధారంగా దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఓ బయోపిక్ రూపొందిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్‌ను బాలీవుడ్ నటి రీచా చద్దా పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్ కోసం షకీలాను కలుసుకున్నారు రీచా. ఈ బయోపిక్ గురించి షకీల మాట్లాడుతూ – ‘‘రీచాకు, నాకు మధ్యలో ఒక కామన్ పాయింట్ కనిపించింది. ఫిజికల్ సిమిలారిటీ గురించి కాదు, మా ఇద్దరి ఆలోచనా విధానం గురించి అంటున్నాను. రీచా కూడా నాలానే ధైర్యవంతురాలు, ఫ్రీగా ఆలోచించే మనిషి. స్క్రిప్ట్స్‌లో ఉన్న లేయర్స్‌ని కూడా అర్థం చేసుకోగల నటి. ఈ సినిమాకు సంబంధించి నేను ఎటువంటి నిబంధనలు పెట్టడం లేదు. నా లైఫ్‌లో జరిగినదంతా చెప్పాను. నిజాలు దాచాలనుకున్నప్పుడు బయోపిక్ తీసి ఉపయోగమేముంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా ఆగస్ట్‌లో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. -
సెల్యూట్‌కి గ్రీన్ సిగ్నల్
వివాహం చేసుకున్న తర్వాత కథానాయిక కరీనా కపూర్ ఒక కీలక పాత్రలో నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న ఓ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఆ చిత్రం గురించి అధికారిక వార్త ఏమీ రాలేదు. ఇప్పుడు షారుక్ ఖాన్ హీరోగా నటించబోయే ‘సెల్యూట్’ సినిమాలో కథానాయిక పాత్ర పోషించడానికి కరీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ జీవితం ఆధారంగా ‘సెల్యూట్’ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా అక్టోబర్‌లో స్టార్ట్ కానుందని టాక్. షారుక్‌తో కరీనా నటించిన చివరి చిత్రం ‘రా. వన్’. 2011లో ఈ చిత్రం విడుదలైంది. -
వెండితెరకు యామిని జీవితం
ప్రముఖ నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి జీవితం వెండితెరకు రానుంది. ‘దివ్యమణి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్, డైరెక్టర్ లక్ష్మీ దీపక్, కెమెరామెన్ సత్తిబాబు గార్లవద్ద పని నేర్చుకున్నా. ఫొటోగ్రఫీ, మ్యూజిక్, వీఎఫ్ఎక్స్లపై మంచి పట్టు ఉంది. చాలా యాడ్స్ చేశా. నా తొలి చిత్రం ‘దివ్యమణి’. రెండవ చిత్రంగా పద్మశ్రీ యామిని కృష్ణమూర్తిగారి బయోపిక్ తెరకెక్కించనున్నా. నేటి తరానికి ఆమె ఎంతో స్ఫూర్తి. కూచిపూడి, భరతనాట్యంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారామె. చిన్న వయసులోనే పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. అలాంటి యామినిగారి జీవిత కథను అందరికీ తెలియజేయాలనే ఆలోచనతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. ఈ బయోపిక్కు యామినిగారే కొరియోగ్రఫీ అందించనుండటం విశేషం. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించనున్నాం. త్వరలోనే ఈ బయోపిక్ పూర్తి వివరాలు తెలియచేస్తా’’ అన్నారు. -
లుక్ మ్యాచ్ అవుతుందా?
లేటెస్ట్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ చిత్రం కంప్లీట్ అవ్వకముందే తన నెక్ట్స్ సినిమాపై దృష్టి పెట్టారు ఆమిర్ ఖాన్. ఆధ్యాత్మిక గురువు ఓషో రజనీశ్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో రజనీశ్ పాత్రలో ఆమిర్ ఖాన్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చినప్పటికీ, ఓషోలా తన లుక్ మ్యాచ్ అవుతుందా? లేదా? అనే విషయంపై ఆమిర్ సందిగ్ధంలో పడ్డారట. దీనికి సంబంధించి తన లుక్స్‌పై లుక్ టెస్ట్ చేయనున్నారని సమాచారం. ఇందులో ఆయన నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారట. తన గెటెప్కు సంబంధించి ప్రొస్థెటిక్ మేకప్ ఆర్టిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. లుక్స్ పరంగా సంతృప్తి చెందాకే సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నారట ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఇందులో ఆలియా భట్ కీలక పాత్రలో కనిపిస్తారట. -
నాడు.. నేడు ‘మన దేశం’తోనే!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావుపై రూపొందుతోన్న బయోపిక్ ‘యన్.టి.ఆర్’. వారాహి చలన చిత్రం అండ్ విబ్రీ మీడియా సమర్పణలో ఎన్టీఆర్ తనయుడు, నటుడు బాలకృష్ణ టైటిల్ రోల్లో నటిస్తూ, నిర్మిస్తున్నారు. జాగర్లమూడి రాధకృష్ణ (క్రిష్) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గురువారం మొదలైంది. 1949లో జూలై 5నే ఎన్టీఆర్ ‘మన దేశం’ సినిమాను స్టార్ట్ చేశారు. ‘‘నాడు, నేడు ‘మన దేశం’తోనే చరిత్రకు శ్రీకారం.. తెలుగువారందరి ఆశీస్సులు కోరుతూ’’ అంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అలాగే ‘అభిమానమును మించిన ధనము, ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్లే! నా శుభాకాంక్షలు. సోదరుడు రామారావు.. 27.8.75’’ అంటూ 1975లో ఎన్టీఆర్ స్వయంగా రాసిన ఓ లేఖను బాలకృష్ణ లుక్‌తో పాటుగా చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రాహకుడిగా చేస్తున్నారు. -
స్పేస్‌లోకి..
షారుక్ ఖాన్ బ్యాగ్ సర్దుకొని ఓ రెండు నెలలు పాటు స్పేస్‌లో ఉండబోతున్నారట. అక్కడ తనకు అప్పగించిన ప్రాజెక్ట్‌ను నిర్వర్తించడంలో బిజీ అయిపోతారట. మ్యాటరేంటంటే.. ఈ స్పేస్ సెట్టింగంతా రాకేశ్ శర్మ బయోపిక్ ‘సెల్యూట్’ కోసం. పైలెట్ రాకేశ్ శర్మ పాత్రలో షారుక్ ఖాన్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు మహేశ్ మతాయి డైరెక్ట్ చేయనున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. రెండు నెలలపాటు గ్యాప్ లేకుండా ప్రత్యేకంగా రూపొందించిన స్పేస్ సెట్లో షూటింగ్ జరపనున్నారు. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్లో షారుక్ ప్రెస్టీజియస్ మూవీ ‘జీరో’ను ప్రమోట్ చేయ నున్నారు. ‘సెల్యూట్’ 2019లో విడుదల కానుంది. ‘జీరో’ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది. -
నా ఓటు ఆమెకే!
ఫిక్షనల్ క్యారెక్టర్స్ నుంచి బయోపిక్స్‌లో యాక్ట్ చేయాలనే ఉత్సాహం నటీనటుల్లో బాగా పెరిగిపోయింది. అందరికీ ఆ అవకాశం దొరక్కపోయినా ఫలానా వాళ్ల బయోపిక్‌లో యాక్ట్ చేయాలనుంది అని బయటకు చెప్తున్నారు కొందరు. ఇప్పటికే కొందరు కథానాయికలు తమిళనాడు మాజీ సీయం, నటి జయలలిత బయోపిక్‌లో యాక్ట్ చేయాలనుందని చెప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఫేమ్ మంజిమా మోహన్ కూడా జాయిన్ అయ్యారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘మీరు ఎవరి బయోపిక్‌లో నటించాలనుకుంటున్నారు? అని నాకు ఆప్షన్ ఇస్తే.. నా ఓటు జయలలితగారి జీవితానికి. ఆమె చాలా డేరింగ్ అండ్ బోల్డ్ లేడీ. జయలలితగారి ఆ క్వాలిటీస్‌కి నేను పెద్ద అభిమానిని. అందుకే ఆవిడ బయోపిక్‌లో యాక్ట్ చేయాలనుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మంజిమ హిందీ ‘క్వీన్’ మలయాళ రీమేక్ ‘జామ్ జామ్’లో యాక్ట్ చేస్తున్నారు. -
సినిమా అంటే ఎంటర్టైన్మెంటే కాదు
‘‘సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు.. సమాజంలో మార్పు తీసుకువచ్చేలా కూడా ఉండాలి’’ అని పేర్కొన్నారు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. ప్రస్తుత సమాజంలో సినిమా మాద్యమానికి ఉన్న ఆవశ్యకతను గురించి అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ– ‘‘సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మీడియమ్‌గా మిగిలిపోకూడదు. సమాజంలో మార్పు తీసుకొచ్చే మాద్యమంలా కూడా ఉండాలి. యంగ్ ఫిల్మ్ మేకర్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేకర్స్ అందరూ లిమిటెడ్ బడ్జెట్‌తో మంచి సినిమాలు రూపొందిస్తున్నారు. వాళ్ల ముఖ్య ఉద్దేశం కేవలం మంచి సినిమా తీయడమే. సమాజాన్ని ఏదో విధంగా ఇన్ఫ్లూయన్స్ చేసే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి దర్శకుల్ని కచ్చితంగా ఎంకరేజ్ చేయాలి’’ అని పేర్కొన్నారాయన. అనుపమ్ ఖేర్ ప్రస్తుతం మన్మోహన్ సింగ్ బయోపిక్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. -
వెండితెరపై రాధే మా లీలలు
ఉత్తరాది దక్షిణాది అన్న తేడా లేకుండా ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. చారిత్రక ఘట్టాలతో పాటు వివాదాస్పద వ్యక్తుల జీవితాలను కూడా తెర మీద ఆవిష్కరించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వివాదాస్పద మాతాజీ జీవిత కథ వెండితెర మీదకు రానుందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నో వివాదాలతో వార్తల్లో నిలిచిన రాధే మా జీవిత కథ ఆధారంగా బాలీవుడ్లో ఓ సినిమా రూపొందనుందట. ఈ సినిమాలో రాధే మాగా పాయల్ ఘోష్ నటించనుంది. జై మాతా దీపేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్ లీడ్ యాక్టర్‌గా నటిస్తోంది. పటేల్ కి పంజాబీ షాదీ సినిమాలో పాయల్ పర్ఫామెన్స్ నచ్చటంతో దర్శకుడు సౌరభ్ వర్మ.. జై మాతాదీలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారట. అయితే ఈ సినిమా రాధే మా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ఇంత వరకు ప్రకటించలేదు. -
అప్పడాలమ్మా.. అప్పడాలు!
కావాలనుకుంటే కాళ్ల ముందుకొచ్చి ఆగుతాయి కార్లు. అనుకుంటే అకాశయానం ఈజీ. ఫిక్స్ అయితే చార్టెడ్ ఫ్లైట్‌లో సింగిల్‌గా ఫ్లై అవ్వగలడు. కానీ.. గల్లీ గల్లీ తిరిగి అప్పడాలు అమ్ముతున్నారు హృతిక్ రోషన్. డబ్బులు కోసం ఎండను కూడా లెక్క చేయకుండా చెప్పులరిగేలా సైకిల్ సవారీ చేస్తున్నారు బస్‌స్టాండ్‌లో. అతనికెందుకంత కష్టం? అంటే కాదు ఇష్టం. యాక్టింగ్ అంటే ప్యాషన్. బిహారీ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా హిందీలో దర్శకుడు వికాశ్ బాల్ రూపొందిస్తున్న చిత్రం ‘సూపర్ 30’. ఆనంద్‌కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. నిజజీవితంలో ఆనంద్‌కుమార్ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అప్పడాలు అమ్మారు. ఆ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా. హృతిక్ అప్పడాలు అమ్మింది సినిమా కోసమని. ఆరడగుల అందగాడు హృతిక్ రోషన్ ఫొటోలో చూస్తున్నట్లుగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడం ఇదే తొలిసారి. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన హృతిక్ రియల్ లైఫ్‌లో కూడా ఇలా కనిపించలేదు. సో.. ఈ గెటప్‌లో ఆకట్టుకోవడంతో పాటు నటనతో మెస్మరైజ్ చేస్తారని ఊహించవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయాలనుకుంటున్నారు. -
అమ్మగా నటించాలని కోరుకుంటున్నా!
తమిళసినిమా: నా జీవిత లక్ష్యం అమ్మగా నటించాలన్నదే అంటోంది నటి శ్రద్ధా శ్రీనాథ్. కన్నడ చిత్రం యూటర్న్ ఈ అమ్మడి సినీ జీవితమే పెద్ద టర్నింగ్ తీసుకుందన్నది తెలిసిందే. ఇక కోలీవుడ్‌లో విక్రమ్ వేదా సక్సెస్ఫుల్ పయనాన్ని అమర్చింది. మొత్తం మీద ఇప్పుడు తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న శ్రద్ధాశ్రీనాథ్ తన గురించి చెప్పిన కొన్ని విషయాలను ఆమె మాటల్లోనే చూద్దాం. నా తండ్రి సైనికాధికారి, అమ్మ ఉపాధ్యాయురాలు. నేను లా విద్యార్థిని.ఇది క్లుప్తంగా నా వ్యక్తిగత జీవితం. చదువుకునే రోజుల్లోనే సినిమాల్లో నటించాలన్న ఆశ కలిగింది. ఇది గ్లామర్ ప్రపంచం అని తెలుసు. అయినా నా ఆశను అమ్మనాన్నలకు చెప్పగా మొదట ససేమిరా అన్నారు. ఇంకా చెప్పాలంటే భయపడ్డారు. ఆ తరువాత ఎలాగోలా వారిని ఒప్పించి, నా కోరికను నెరవేర్చుకున్నాను. నేను మణిరత్నం చిత్రాలు చూస్తూ పెరిగాను. ఆయన దర్శకత్వంలో నటించాలని ఎవరైనా కోరుకుంటారు. అలాంటి అవకాశం నాకు అంత త్వరగా వస్తుందని ఊహించలేదు. కాట్రువెలియిడై చిత్రంలో నటించడానికి పిలుపురాగా గెస్ట్ పాత్ర అయినా కాదనకుండా నటించాను. ఆయన దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. విక్రమ్‌వేదా చిత్రంలో మంచి పాత్ర అమరింది. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. పొగరు తలకెక్కదు. సొంత కట్టుబాట్లు, ఆత్మాభిమానం అందరికీ ఉండాలి. తమిళ సినీ అభిమానులు నన్ను తమిళ అమ్మాయిగానే చూస్తున్నారు. తమిళ చిత్రపరిశ్రమ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఇక్కడి సాంకేతిక నిపుణులు అన్ని భాషల్లోనూ సాధిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతకాలం అభిమానిస్తారో అంత వరకూ నటిస్తూనే ఉంటాను. ఇక నా లక్ష్య పాత్ర అన్నది జయలలిత పాత్రలో నటించడమే. ఒక సాధారణ నటి నుంచి ముఖ్యమంత్రి వరకూ ఎదిగిన అమ్మ జయలలిత జీవిత చరిత్రను ఎవరైనా చిత్రంగా తెరకెక్కిస్తే అందులో అమ్మ జయలలితగా నటించాలని కోరుకుంటున్నాను. జయలలిత జీవితం, సాధన నన్ను భ్రమింపజేస్తాయి. -
బాల్థాకరేగా నవాజుద్దీన్ సిద్ధిఖీ
సాక్షి, న్యూఢిల్లీ: బాల్‌థాకరే బయోపిక్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ టైటిల్ రోల్ పోషించనున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఈనెల 21న విడుదల చేయనున్నారు. ఫస్ట్‌లుక్ లాంఛ్ సందర్భంగా మూవీకి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగుచూడనున్నాయి. అత్యంత ఆర్భాటంగా జరగనున్న ఫస్ట్‌లుక్ లాంఛ్‌కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్యఅతిధిగా హాజరవనున్నారు. ఈ బయోపిక్కు రాజ్యసభ ఎంపీ, శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్ర్కిప్ట్ సమకూర్చుతున్నారు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టుపై సంజయ్ రౌత్ పనిచేస్తున్నారు. బాల్ థాకరేతో తనకున్న సుదీర్ఘ అనుబంధంతో ఆయనకు సంబంధించిన విషయాలన్నీ తనకు తెలుసని, వీటిని ప్రజారంజకంగా తెరకెక్కిస్తానని రౌత్ చెప్పారు. బాల్ థాకరే కుటుంబ సభ్యులు సహా ఏ ఒక్కరి జోక్యం లేకుండా మూవీని వాస్తవాల ఆధారంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. -
లక్ష్మీస్ ఎన్టీఆర్
ఇటీవల ప్రముఖ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తానని ప్రకటించారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై ఆయన జీవన సహచరి లక్ష్మీపార్వతి చేసిన తాజా రచన ‘తెలుగుతేజం’ పుస్తకం చదివితే ఎన్టీఆర్ నిజంగానే లక్ష్మీస్ ఎన్టీఆరే అనిపించకమానదు. 1980ల ప్రథమార్థం నుంచి ఎన్టీఆర్ రాజకీయ జీవిత విశేషాలతోపాటు 1994–96 మధ్య రెండేళ్లపాటు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ప్రతి పరిణామాన్ని తన ప్రత్యక్ష అనుభవంతో రచయిత్రి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 80ల మొదట్లో ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరి’... 90ల మధ్యలో ‘నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపడ్డ’ ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని, ఆయన మలి జీవితాన్ని తడిమిన తాజా పుస్తకం ‘తెలుగుతేజం’. ఇది ఎన్టీఆర్ రాజకీయ జీవిత చరిత్రే కాదు, సొంత అల్లుడి చేతిలో భంగపడి, మధ్యయుగ రాజకీయాలకు ఏమాత్రం తీసిపోని అంతఃపుర కుట్రలకు బలైన ఒక కుటుంబ పెద్ద దయనీయ చరమాంకానికి సంబంధించిన చరిత్ర అని చెబితేనే న్యాయంగా ఉంటుంది. ఎన్టీఆర్ తన చరమ జీవితంలో ఎంచుకున్న ఒక చాయిస్ వెనకాల ఏం జరిగిందో, తదనంతర పరిణామాలు తన మరణానికి కూడా ఎలా కారణమయ్యాయో తెలుసుకోవడానికి మంచి వనరుగా నిలుస్తుంది ‘తెలుగుతేజం’ పుస్తకం. 70 ఏళ్ల వయస్సులో ఆహారం, తదితర అవసరాలతోపాటు రాజ కీయ జీవితంలో రోజూ ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లకు కాస్త పరిష్కారంగా లక్ష్మీపార్వతిని తన జీవితంలోకి ఆహ్వానించారు రామారావు. పేద కుటుంబం నుంచి వచ్చిన, జీవితంలో అన్ని దెబ్బలూ తిన్న మహిళకు ఆశ్రయం ఇవ్వడంకాదు... తన జీవితంలో సరిసమాన స్థాయిని ఇచ్చి నిలిపాడాయన. ఇది తాను అప్పుడే పాటించిన కొత్త విలువ కానేకాదు. తన చివరి కుమార్తె మొదటి వివాహం భగ్నమైతే, ఆమె జీవితం మోడు కాకూడదని మరో వివాహం చేసి మరీ సాంప్రదాయాలకు భిన్న మార్గం పట్టారు ఎన్టీఆర్. స్త్రీలపై సాగుతున్న భూస్వామ్య భావజాలాన్ని, అంతస్తుల తారతమ్యాన్ని లక్ష్మీపార్వతి రూపంలో ఎన్టీఆర్ బద్దలు కొట్టడమే ఒక అపురూపమైన సంగతి. ఒక పాలకుడు తన వర్గ అభిజాత్యాన్ని కూడా పక్కనపెట్టి ఒక సామాన్య స్త్రీని తన జీవితంలోకి ఆహ్వానించడం ఒక సాంస్కృతిక పరివర్తనతో సమానం. ఇది కందుకూరి వీరేశలింగం నుంచి తెలుగు సమాజంలో వీస్తూ వచ్చిన కొత్త భావాలకు సూచిక. కానీ ఎన్టీఆర్‌ని ‘దైవసమానుడి’గా భావించి సేవ చేసిన లక్ష్మిపై ఆయన కుటుంబ రూపంలోని ఫ్యూడల్ అహంభావం జమిలిగా దాడి చేయడం బాధాకరం. అందుకే ఎన్టీఆర్‌తో తన అనుబంధానికి చెందిన అపురూప క్షణాలను పూసగుచ్చినట్లు రచయిత్రి తెలుగుతేజం పుస్తకంలో పొందుపర్చారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంతోపాటు వ్యక్తిగత జీవితంలో చివరి రెండేళ్లలో జరిగిన విపత్కర పరిణామాలను గుదిగుచ్చిన ఈ పుస్తకం ఎన్టీఆర్ అభిమానులకు, ప్రజలకు కూడా పఠనీయ గ్రంథమే. ప్రతులకు : ‘తెలుగు తేజం’ పేజీలు: 430, వెల: రూ. 350, ప్రచురణ: ఉన్నం బ్రదర్స్ పబ్లికేషన్స్, మొబైల్ : 98497 06140. విశాలాంధ్ర, నవచేతన, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్‌లు. – కె. రాజశేఖరరాజు -
తెరపై పుల్లెల గోపీచంద్ ప్రయాణం
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా బయో పిక్ తెరకెక్కనుంది. రియో ఒలింపిక్స్‌లో పివి సింధు వెండి పతకం గెలవడంతో ఆమె గురువైన గోపీచంద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఎంతోమంది క్రీడాకారుల కెరీర్‌ను తీర్చిదిద్దిన కోచ్ గోపీచంద్ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇప్పుడు తెరపై ఆవిష్కరించనున్నారు. గోపీచంద్ పాత్రను సుధీర్ బాబు పోషించనున్నారు. ఈ మేరకు సుధీర్ బాబు మాట్లాడుతూ.. 'గోపీచంద్ నిజమైన హీరో. అతని కథ ప్రపంచానికి తప్పకుండా తెలియాలి. అతన్ని నేను దగ్గర నుంచి చూశాను. గోపీతో కలిసి డబుల్స్ కూడా ఆడాను. ఆయన పాత్రకు సరిపోతానని భావిస్తున్నాను' అని చెప్పారు. గోపీచంద్‌కు ఈ విషయం తెలిపినప్పుడు ఆయన అయిష్టంగా ఉన్నారని, అయితే తప్పకుండా అందరికీ తెలియజేయాల్సిన ప్రయాణం అని అందరూ చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నారని సుధీర్ బాబు తెలిపారు.18 నెలల క్రితమే కథపై కసరత్తు మొదలుపెట్టగా.. ఈ నవంబరులో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. షూటింగ్ మొత్తం హైదరాబాద్, లక్నో, బెంగుళూరు, బర్మింగ్ హామ్లలో జరగనుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 'బయో పిక్' ట్రెండ్ నడుస్తుంది. ప్రముఖుల జీవితాలను, లక్ష్య సాధనలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.