
మంజిమా మోహన్
ఫిక్షనల్ క్యారెక్టర్స్ నుంచి బయోపిక్స్‌లో యాక్ట్ చేయాలనే ఉత్సాహం నటీనటుల్లో బాగా పెరిగిపోయింది. అందరికీ ఆ అవకాశం దొరక్కపోయినా ఫలానా వాళ్ల బయోపిక్‌లో యాక్ట్ చేయాలనుంది అని బయటకు చెప్తున్నారు కొందరు. ఇప్పటికే కొందరు కథానాయికలు తమిళనాడు మాజీ సీయం, నటి జయలలిత బయోపిక్‌లో యాక్ట్ చేయాలనుందని చెప్పారు.
ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఫేమ్ మంజిమా మోహన్ కూడా జాయిన్ అయ్యారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘మీరు ఎవరి బయోపిక్‌లో నటించాలనుకుంటున్నారు? అని నాకు ఆప్షన్ ఇస్తే.. నా ఓటు జయలలితగారి జీవితానికి. ఆమె చాలా డేరింగ్ అండ్ బోల్డ్ లేడీ. జయలలితగారి ఆ క్వాలిటీస్‌కి నేను పెద్ద అభిమానిని. అందుకే ఆవిడ బయోపిక్‌లో యాక్ట్ చేయాలనుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మంజిమ హిందీ ‘క్వీన్’ మలయాళ రీమేక్ ‘జామ్ జామ్’లో యాక్ట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment