Manjima Mohan
-
ఒక్కటే తెలుగు సినిమా.. హీరోతో ప్రేమ పెళ్లి.. ఈమెని గుర్తుపట్టారా?
ఒక్కటే తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసింది. అది కూడా నాగచైతన్యతో. కానీ ఏం లాభం. బాగుందన్నారు కానీ ఎందుకో ఆ మూవీ సరిగా ఆడలేదు. దీంతో టాలీవుడ్లో లీడ్ రోల్లో మరో సినిమా చేయలేదు. అదే టైంలో తమిళ, మలయాళంలో మాత్రం నటించేసింది. రెండేళ్ల క్రితం తమిళ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు మంజిమ మోహన్. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? 'ఏ మాయ చేశావె' లాంటి హిట్ తర్వాత నాగచైతన్య-గౌతమ్ మేనన్.. 'సాహసం శ్వాసగా సాగిపో' అనే మూవీ చేశారు. రోడ్ జర్నీ స్టోరీతో తీసిన ఈ లవ్ స్టోరీతోనే మంజిమ తెలుగు ప్రేక్షకులకు పరిచయం. కానీ అంతకు ముందే చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో ఫేమస్.(ఇదీ చదవండి: తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?)మలయాళ సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్ కూతురైన మంజిమ.. 1997-2001 మధ్య పలు మలయాళ చిత్రాల్లో బాలనటిగా చేసింది. పెద్దయిన తర్వాత పిల్లల షోకు హోస్ట్‌గా చేసి బోలెడంత క్రేజ్ సొంతం చేసుకుంది. అలా హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది.తెలుగులో హీరోయిన్ గా చేసిన మూవీ 'సాహసం శ్వాసగా సాగిపో'. ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు', 'మహానాయకుడు' సినిమాల్లో భువనేశ్వరి పాత్ర పోషించింది. 'బూ' అనే హారర్ మూవీ కూడా చేసింది. కాకపోతే వీటిలో అతిథి పాత్రలే. వ్యక్తిగత విషయానికొస్తే తమిళ హీరో గౌతమ్ కార్తిక్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న మంజిమ.. 2022లో అతడిని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి సినిమాలకు దూరమైపోయింది.(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?) -
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)
-
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అంటూ అసభ్యంగా రాశారు: హీరోయిన్ ఆవేదన
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి మంజిమా మోహన్. తమిళ సినిమాల్లో తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నారు. సాహసమే శ్వాసగా సాగిపో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ ముద్దుగుమ్మ. అయితే ప్రముఖ నటుడు గౌతమ్ కార్తీక్‌ను 2022లో ఆమె వివాహం చేసుకుంది. కానీ అప్పట్లో వీరి పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్ వచ్చాయి. గౌతమ్ తండ్రి వీరి పెళ్లితో సంతోషంగా లేరని.. పెళ్లికి ముందే మంజిమ గర్భవతి అని కొందరు అసభ్యకరమైన వార్తలు రాసుకొచ్చారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మంజిమ వాటిపై స్పందించింది. అవన్నీ ఒట్టి రూమర్స్ అని కొట్టిపారేసింది. అంతే కాకుండా తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.మంజిమ మోహన్ మాట్లాడుతూ.. 'నా పెళ్లి గురించి సోషల్ మీడియాలో అవాస్తవాలే వచ్చాయి. పెళ్లి కాకముందే నేను గర్భవతినని రాశారు. దీంతో మా మామయ్య అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ఇలాంటి రూమర్స్ మా కుటుంబ సభ్యులను బాధపెట్టాయన్నది నిజం. పెళ్లికి ముందు కూడా ఇలా అసభ్యంగా కామెంట్స్ చేశారు. కానీ అవేవీ నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. కానీ పెళ్లయిన తర్వాత నాలో భయం మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యలు చదివి ఎందుకు బాధగా ఉన్నావని గౌతమ్ అడిగేవాడు. నాపై వస్తున్న కామెంట్స్ చూసి గౌతమ్‌కి నేను సరైన జోడీ కాదనే ఫీలింగ్ కలిగేది. కానీ గౌతమ్ నాకు సపోర్ట్‌గా నిలిచారు. ఏదైనా బాధలో ఉంటే చెప్పాలని నన్ను అడిగేవాడు.' అని తెలిపింది.కాగా.. మలయాళంలో సూపర్ హిట్ అయిన కలియూంజల్ సినిమా ద్వారా మంజిమా మోహన్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మధురనోంబరకాట్టులో తన నటనకు గాను ఆమె కేరళ రాష్ట్ర ఉత్తమ బాలనటిగా అవార్డును గెలుచుకుంది. ఆమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ విపిన్ మోహన్ కుమార్తెగా ఇండస్ట్రీలో ప్రవేశించింది. ముత్తయ్య డైరెక్ట్ చేసిన దేవరట్టం సినిమాలో గౌతమ్, మంజిమ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్న్నారు. చివరిగా 2023లో బూ చిత్రంలో నటించిన మంజిమ ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు. -
ప్రగ్యా జైశ్వాల్ స్టన్నింగ్ లుక్స్.. ఓనం స్టెల్లో మంజీమా మోహన్!
►ప్రగ్యా జైశ్వాల్ స్టన్నింగ్ లుక్స్! ►ఓనం సెలబ్రేషన్స్‌లో మంజీమా మోహన్! ►బాత్ టబ్‌లో చిల్ అవుతోన్న రష్మీ గౌతమ్! ►డాగ్‌తో ఆడుకుంటోన్న అనసూయ! ►స్టెలిష్ డ్రెస్‌లో యాంకర్ మంజూష పోజులు! View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) -
ట్రోలింగ్ ను ఫన్నీగా తీసుకుంటా..!
బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన మలయాళ బ్యూటీ మంజిమామోహన్. ఆ తరువాత కథానాయకిగా మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తమిళంలో శింబు సరసన నటించిన అచ్చం యంబదు మడమయడా చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ తరువాత దేవరాట్టం తదితర చిత్రాల్లో నటించారు. దేవరాట్టం చిత్రంలో నటించే సమయంలో ఆ చిత్ర హీరో గౌతమ్ కార్తీక్‌తో ప్రేమలో పడింది. గత ఏడాది గౌతమ్ కార్తీక్, మంజిమామోహన్‌ల వివాహం పెద్దల అనుమతితో జరిగింది. కాగా ప్రస్తుతం మంజిమామోహన్ అక్టోబర్ 31 లేడీస్ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఈమె తరచూ సామాజక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటిస్తుంటారు. మంజిమామోహన్‌కి ఇన్‌స్ట్రాగామ్‌లో 19 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా మంజిమామోహన్ తన ఇన్‌స్ట్రాగామ్ ద్వారా అభిమానులతో తన భావాలను పంచుకున్నారు. ఆ సమయంలో ఓ అభిమాని మీపై వస్తున్న ట్రోలింగ్ లపై ఎలా స్పందిస్తారు? అన్న ప్రశ్నకు బదులిస్తూ అలాంటి వాటిని తను సీరియస్‌గా తీసుకోనన్నారు. కొన్ని ట్రోలింగ్స్ నిజంగానే హస్యాస్పదంగా ఉంటాయ ని, అలాంటి వాటిని చూసి నవ్వుకుంటానని, తరువాత తన పని తాను చేసుకుపోతానని చెప్పారు. -
పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్‌పై ట్రోల్స్
కోలీవుడ్ లవ్‌బర్డ్స్ మంజిమా మోహన్- హీరో గౌతమ్ కార్తిక్ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో మంజిమా మోహన్ లుక్‌పై ట్రోల్స్ కూడా అదే స్థాయిలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ హీరోయిన్న ఇలా ట్రోల్ చేయడం ఇదేం మొదటికాదు కాదు.. గతంలోనూ పలుమార్లు మంజిమను బాడీ షేమింగ్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే పెళ్లిలోనూ తన బరువుపై కామెంట్స్ చేశారని మంజిమా మోహన్ పేర్కొంది.పెళ్లి తర్వాత తొలిసారి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. శరీరాకృతి గురించి ఎప్పటినుంచో ట్రోల్స్ ఎదుర్కుంటున్నా. మా పెళ్లి ఫోటోల్లోనూ నా లుక్‌పై చాలామంది మిమర్శలు చేశారు. దీనికి తోడు నా పెళ్లికి వచ్చిన వాళ్లలో కూడా కొంతమంది నేను లావుగా ఉన్నానంటూ కామెంట్స్ చేవారు. మొదట్లో ఇలాంటివి విన్నప్పుడు బాధపడేదాన్ని కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. నా బాడీ గురించి నాకెలాంటి బాధాలేదు. ప్రస్తుతం నేను ఫిట్‌గా,సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు బరువు తగ్గాలనిపిస్తే అప్పుడు తగ్గుతాను. ఇక నా కెరీర్ విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gautham Karthik (@gauthamramkarthik) -
ఒక్కటైన ప్రేమజంట.. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన అభినందనలు
కోలీవుడ్ ప్రేమ జంట మంజిమా మోహన్- గౌతమ్ కార్తిక్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇవాళ వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యుల అనుమతితోనే పెళ్లి చేసుకుంది ఈ జంట. చెన్నైలోని ఓ హోటల్లో వైభవంగా జరిగిన పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు, సన్నిహితుల హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు యువ జంటను ఆశీర్వదించారు. వెడ్డింగ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఫోటోను వధువు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొత్త జంటకు అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. (చదవండి: హీరోతో డేటింగ్, పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్స్ డిలీట్ చేసిన మంజిమా మోహన్) దేవరట్టం అనే తమిళ సినిమాతో మంజిమా మోహన్ - గౌతమ్ కార్తీక్ కలిసి పనిచేశారు. అదే సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తనే మొదట మంజిమాకు ప్రపోజ్ చేశానని ఇటీవలే గౌతమ్ వెల్లడించారు. దాదాపు మూడేళ్లుగా ప్రేమగా మునిగితేలిన ఈ జంట ఇవాళ ఒక్కటైంది. ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో మంజిమ, ‘కడలి’తో గౌతమ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) -
పెళ్లి పీటలు ఎక్కనున్న నటి.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్
కోలీవుడ్‌లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ బ్యూటీ మంజిమా మోహన్. నటుడు శింబుకు జంటగా 'అచ్చం యంబదు మడమయడా' చిత్రంలో కథానాయికగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్ వంటి యువ హీరోలతో జత కట్టింది. అలా గౌతమ్ కార్తీక్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇటీవలే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. (చదవండి: హీరోతో డేటింగ్, పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్స్ డిలీట్ చేసిన మంజిమా మోహన్) ఈ నెల 28వ తేదీ ఒక్కటవుతున్న ఈ జంట ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఫోటోలు వైరలవుతున్నాయి. వీరి వివాహానికి చెన్నైలోని ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్ వేదికగా కానుందని సమాచారం. తాజాగా మంజిమా మోహన్ తన ఇన్‌స్టాలో గౌతమ్ కార్తీక్‌తో ఉన్న ప్రీ వెెడ్డింగ్ ఫోటోలను పంచుకుంది. తాజా ఫోటోషూట్‌లో కొత్త జంట ఫోటోలకు పోజులిచ్చింది. మంజిమా మోహన్ ఆకుపచ్చ జాతి దుస్తులలో అద్భుతంగా కనిపించగా.... గౌతమ్ కార్తీక్ పైజామాతో సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు. దీంతో ఆమె అభిమానులు కాబోయే జంటకు ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నారు. తమ పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని మంజిమా మోహన్ వెల్లడించారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలిపారు. -
హీరోయిన్‌తో ప్రేమ.. బయటపెట్టిన స్టార్ హీరో కొడుకు
కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. తాము రిలేషన్లో ఉన్నామంటూ ఇటీవలె ఈ జంట అధికారికంగా ప్రకటించింది కూడా. మరో నాలుగు రోజుల్లో(నవంబర్ 28)న వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తమ ప్రేమకథను రివీల్ చేశారు ఈ క్యూట్ కపుల్. చెన్నై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ.. తాను ప్రపోజ్ చేస్తే మంజిమా వెంటనే ఒప్పుకోలేదని కానీ ఆ తర్వాత అంగీకరించిందని తెలిపాడు. 'మా ప్రేమకథ అంత గొప్పదేం కాదు. జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు మనం మంచి మనిషిగా ఎదుగుతాం అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. అలా నా జీవితానికి సరైన వ్యక్తి మంజిమా. తను అందగత్తె మాత్రమే కాదు అద్భుతమైన వ్యక్తి. నేనెప్పుడైనా నిరాశకు గురైనా తను నా వెంటే ఉండేది. ఇక దేవరట్టం సినిమా షూటింగ్ సమయంలోనే మేం స్నేహితులుగా మారాం. ఆ తర్వాత ఏడాదికి తనతో రిలేషన్ కొనసాగించాలనిపించింది. వెంటనే ఆమెకు ప్రపోజ్ చేశా. కానీ మంజిమా రెండు రోజులు సమయం తీసుకున్న తర్వాత నా ప్రేమకు అంగీకారం చెప్పింది. అలా కుటుంబసభ్యుల అంగీకారంతో నవంబర్ 28న చెన్నైలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ పేర్కొన్నారు. కాగా అలనాటి హీరో నవరస నయగన్ కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్. ప్రస్తుతం గౌతమ్ కోలీవుడ్‌లో హీరోగా బిజీగా ఉన్నాడు. మంజిమా మోహన్ విషయానికి వస్తే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది. -
హీరోతో డేటింగ్, పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్స్ డిలీట్ చేసిన మంజిమా మోహన్
కోలీవుడ్‌లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ బ్యూటీ మంజిమా మోహన్. నటుడు శింబుకు జంటగా అచ్చం యంబదు మడమయడా చిత్రంలో కథానాయికగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్ వంటి యువ హీరోలతో జత కట్టింది. అలా గౌతమ్ కార్తీక్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఈ జంట చాలా కాలంగానే ప్రేమించుకుంటున్నా ఆ విషయాన్ని బయట పెట్టలేదు. ఇటీవల వీరి ప్రేమ వ్యవహారం మీడియాకు పొక్కడంతో అవును తాము ప్రేమలో ఉన్నామని అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ సంచలన జంటకు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. ఈ నెల 28వ తేదీ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. చదవండి: హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మంజిమా మోహన్! అందుకోసం చెన్నైలోని ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్ ముస్తాబవుతోందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో నటి మంజిమా మోహన్ తన ఇన్‌స్ట్ర్రాగామ్ లోని ఫొటోలన్నీ డిలీట్ చేశారు. అందుకు కారణాన్ని కూడా వెల్లడించారు. గత జ్ఞాపకాలను తొలగించేస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నానని, కాబట్టి తన పాత జ్ఞాపకాలను చూసుకుని బాధపడకూడదనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు తీసివేసినట్లు చెప్పారు. అంతేకాకుండా కొత్త జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను పదిల పరచుకోవడానికి చోటు అవసరం కావడంతో తన ఇన్స్టాగ్రామ్ ఖాళీ చేసినట్లు మంజిమా మోహన్ పేర్కొన్నారు. కాగా గౌతమ్ కార్తీక్‌తో ఉన్న ఫొటోలను మాత్రమే తన ఇన్‌స్టాలో ఉంచారు. View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో-హీరోయిన్! ముహుర్తం కూడా ఫిక్స్?
‘కడల్’(తెలుగులో కడలి) మూవీ ఫేం గౌతమ్ కార్తీక్, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ హీరోయిన్ మంజిమా మోహన్ కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. తాము రిలేషన్లో ఉన్నామంటూ ఇటీవల ఈ జంట అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు పెళ్లెప్పుడు అంటూ వారి పోస్ట్స్‌పై నెటిజన్లు, ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన శ్రీలీల? షాకవుతున్న నిర్మాతలు! ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. ఈ జంట పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 28న చెన్నైలో పెళ్లి చేసుకొబోతున్నట్టు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి అనంతరం భారీగా విందును ఇవ్వనున్నట్టు సమాచారం. పస్నేహితులు, సన్నిహితుల కోసం ఊటీ, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు జరుగుతున్నట్లు సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ‘దేవరట్టం’ సినిమాలో గౌతమ్, మంజిమా హీరోహీరోయిన్లుగా నటించారు. చదవండి: నా గ్లామర్ ఫొటోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు గతంలో తమిళ మీడియాలో కథనాలువ చ్చాయి. అయితే ఈ వార్తలపై ఈ జంట ఎప్పుడ స్పందించలేదు. ఈ నేపథ్యంలో గత అక్టోబర్ 31న కార్తీక్‌తో ప్రేమలో మంజిమా వెల్లడించగా.. నవంబర్ 5న తామిద్దరి ఫొటోలను షేర్ చేసి ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేశాడు గౌతమ్ కార్తీక్. కాగా గౌతమ్ కార్తీక్ సీనియర్ నటుడు కార్తీక్ తనయడు అనే విషయం తెలిసిందే. ❤️♾️🧿 pic.twitter.com/RlAlpLO2oS — Gautham Karthik (@Gautham_Karthik) October 31, 2022 -
Gautham Karthik-Manjima Mohan: అవును మేము ప్రేమలో ఉన్నాం!
చిత్ర పరిశ్రమకు చెందిన హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. అలా తాజాగా కోలీవుడ్, మాలీవుడ్‌కు చెందిన మరో జంట ప్రేమలో పడ్డారు. ఆ జంటలో హీరో గౌతమ్ కార్తీక్. సీనియర్ నటుడు కార్తీక్ వారసుడు ఈయన. మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన గౌతమ్ కార్తీక్ ఆ తరువాత వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఇకపోతే నటి మంజిమా మోహన్ గురించి చెప్పాలంటే మలయాళం చిత్రం ప్రేమమ్ ద్వారా పరిచయం అయిన ముగ్గురు హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. అచ్చం యన్బదు మడమయడ చిత్రం ద్వారా దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ అమ్మడిని కోలీవుడ్‌కు దిగుమతి చేశారు. ఆ చిత్రం హిట్‌తో ఇక్కడ అవకాశాలను అందుకుంటున్నారు. అలా గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ కలిసి దేవరాట్టం చిత్రంలో నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ గురించి ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. అయితే ఆ వార్తలపై నటుడు గౌతమ్ కార్తీక్ గానీ, నటి మంజిమా మోహన్ స్పందించలేదు. అలాంటిది ఇన్నాళ్లకు నటుడు కార్తీక్ తమ ప్రేమ గురించి బ్లో అప్ అయ్యారు. అవును మేము ప్రేమించుకున్నాం అని ఇన్ స్ట్రాగామ్ లో మంజిమామోహన్ కలిసున్న ఫొటోను పోస్ట్ చేశారు. అయితే పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అన్నది వెల్లడించలేదు. -
హీరోతో ప్రేమ విషయం బయటపెట్టేసిన హీరోయిన్, ఫొటోలు వైరల్
కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ మధ్య కుచ్కుచ్ హోతాహై అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య ఈ వార్తలపై స్పందించిన మంజిమా.. అతడి ప్రేమను అంగీకరించలేదని తెలిపింది. ఒకవేళ నిజంగా లవ్‌లో పడితే కచ్చితంగా అందరికీ చెప్తానంది. అయితే ఇన్నాళ్లకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిందీ ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియా వేదికగా కార్తీక్‌తో లవ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. 'మూడేళ్ల క్రితం నా జీవితంలో అడుగు పెట్టావు. లైఫ్‌ను ఎలా చూడాలో నేర్పించావు. దిక్కుతోచని పరిస్థితులెదురైన ప్రతిసారి అందులో నుంచి నన్ను బయటకు తీసుకువచ్చావు. నాలా నేను ఉండాలని నేర్పించావు. నా మీద ఎంతో ప్రేమ కురిపించావు, అందుకే నీతో లవ్‌లో పడిపోయాను. నువ్వు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే' అని రాసుకొచ్చింది. అటు గౌతమ్ కూడా తమ స్నేహం గాఢమైన ప్రేమగా మారినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. కాగా అలనాటి హీరో నవరస నయగన్ కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్. ప్రస్తుతం గౌతమ్ కోలీవుడ్‌లో హీరోగా బిజీగా ఉన్నాడు. మంజిమా మోహన్ విషయానికి వస్తే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది. ఆ మధ్య ఎఫ్ఐఆర్ సినిమాతోనూ ఆకట్టుకుంది. గౌతమ్, మంజిమ ఇద్దరూ దేవరత్తమ్ సినిమాలో కలిసి నటించారు. View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) View this post on Instagram A post shared by Gautham Karthik (@gauthamramkarthik) చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే! కాంతారలో ఏముందని ఎగబడుతున్నారు -
హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్, కార్లిటీ ఇచ్చిన యంగ్ హీరో
కోలీవుడ్‌లో నవరస నాయకుడు ఎవరంటే టక్కున వచ్చే సమాధానం కార్తీక్. ఈయన వారసుడే గౌతమ్ కార్తీక్. తనూ హీరోగా మంచి పేరు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. అదే సమయంలో ఇటీవల ఈయన ప్రేమ వ్యవహారంపై వదంతులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. నటి మంజిమా మోహన్‌తో ప్రేమ అంటూ త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం జోరందుకుంది. గౌతమ్ కార్తీక్ నటి మంజిమా మోహన్ దేవరాట్టం చిత్రంలో జంటగా నటించారు. వీరిద్దరూ చట్టపటాలు వేసుకుని షికారు చేస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే ఈ విషయంపై ఇటు గౌతం కార్తీక్ గాని, అటు మంజిమా మోహన్ గాని స్పందించడంలేదు. చదవండి: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక ఇలాంటి పరిస్థితుల్లో నటుడు గౌతమ్ కార్తీక్ ఒక భేటీలో తన వివాహం గురించి స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాదిలోనే తాను వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. అయితే తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి గానీ, నటి మంజమా మోహన్ ప్రస్తావని గాని ఈయన ఎక్కడ తీసుకురాలేదు. తాను నటుడుగా సాధించాలని ఈ రంగంలోకి వచ్చానని, అయితే కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని అన్నారు. ఇకపై కథల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి చిత్రాలను చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే తాను పెళ్లి చేసుకోబోయే వధువు ఎవరు అన్నది చెప్పకపోవడంతో ఆ వధువు ఎవరు చెప్పు నవరస నాయకుడి వారసుడా.. అంటూ నెట్టింట్లో అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: తొలి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన ఆలియా.. -
ఆ హీరో ప్రేమను నేను యాక్సెప్ట్ చేయలేదు: హీరోయిన్
తమిళ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ లవ్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో ఈ వార్తలకు చెక్ పెట్టింది హీరోయిన్. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ ప్రేమను అంగీకరించలేదని వెల్లడించింది. తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను దాచే అవసరం తనకు లేదని పేర్కొంది. నిజంగా ప్రేమలో ఉంటే తప్పకుండా దాన్ని అందరికీ తెలియజేస్తానంది. అంతేతప్ప ప్రేమ, పెళ్లిలాంటి పెద్దపెద్ద విషయాలను సీక్రెట్‌గా ఉంచనని చెప్పుకొచ్చింది. చదవండి: 'నా మాజీ భర్తకు స్పాలో పనిచేసే మహిళతో అక్రమ సంబంధం' మొదట్లో.. గౌతమ్‌తో పెళ్లి అంటూ వచ్చి వార్తలు చూసి షాకయ్యానన్న మంజిమ దీనిపై తన పేరెంట్స్ ఎలా స్పందిస్తారోనని భయపడ్డానని, కానీ వారు దీన్ని తేలికగా తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నానని చెప్పింది. కాగా అలనాటి హీరో నవరస నయగన్ కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్. ప్రస్తుతం అతడు తమిళంలో హీరోగా బిజీగా ఉన్నాడు. మంజిమ మోహన్ విషయానికి వస్తే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల ఎఫ్ఐఆర్ సినిమాతోనూ ఆకట్టుకుంది. గౌతమ్, మంజిమ దేవరత్తమ్ సినిమాలో కలిసి నటించారు. చదవండి: Allu Arjun: టీమ్ మెంబర్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన బన్నీ -
హీరోయిన్‌తో నటుడి పెళ్లి? వాలెంటైన్స్‌డే రోజు ప్రకటన?
తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడా? అంటే కోలీవుడ్ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఈ యంగ్ యాక్టర్ కుర్ర హీరోయిన్ మంజిమా మోహన్‌తో లవ్‌లో ఉన్నాడట. వీళ్లిద్దరూ తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో దేవరత్తమ్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అప్పటినుంచి వాళ్లిద్దరూ చెన్నైలో కలిసే ఉంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాలంటైన్స్ డే రోజు వారి ప్రేమను అఫీషియల్‌గా వెల్లడించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ఇదిలా ఉంటే అలనాటి హీరో నవరస నయగన్ కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్. ప్రస్తుతం అతడు యుత సతం, పాటు తల సినిమాలు చేస్తున్నాడు. మంజిమ మోహన్.. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఆమె నటించిన ఎఫ్ఐఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో విష్ణు విశాల్, రైజా విల్సన్, రెబా మోనికా తదితరులు నటించారు. -
హీరోయిన్ను ఆ విషయం గురించి డైరెక్ట్‌గా అడిగేసిన నెటిజన్
కరోనా ప్రభావం సినీ ఇండస్ర్గీపై గట్టిగానే పడింది. సినిమా షూటింగులు కూడా ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభిస్తున్నారు. సో కొంచెం ఖాళీ సమయం దొరకగానే అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది నటీనటులు యూజర్లతో చిట్‌చాట్ సెషన్లు నిర్వహిస్తున్నారు. వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తున్నారు. తాజాగా ఓ మలయాళ బ్యూటీ మంజిమ మోహన్ అభిమానులతో ఆస్క్ మీ ఏనీథింగ్ సెషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్..మీరు మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి అని డైరెక్ట్‌గా అడిగేశాడు. దీనిపై స్పందించిన మంజిమ..అందరూ లవ్‌లో పడుతుంటే..నేను మాత్రం తిండిపై దృష్టి పెడుతున్నాను అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. అంటే పరోక్షంగా తన రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని చెప్పుకొచ్చింది. అయితే మంజిమ షేర్ చేసిన ఫన్నీ మీమ్ నెటిజన్లను మరింత ఆకట్టుకుంది. మీ లైఫ్‌లో చాలా ముఖ్యమైనవి ఏంటి అని మరో నెటిజన్ ప్రశ్నించగా..'ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఫ్యామిలీ, కంపాషన్'అంటూ బదులిచ్చింది. ఇక మొదటి సినిమాతోనే మళయాలంలో హిట్ కొట్టిన మంజిమ ఆ తర్వాత వరుస అవకాశాలతో గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో నాగచైతన్యతో కలిసి 'సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చదవండి : మోనాల్‌ని అఖిల్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా? ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్.. టీమ్ ఫన్నీ రిప్లై -
గుర్తుండిపోయే జ్ఞాపకం
‘‘ప్రతి సినిమా చిత్రీకరణ కోసం చేసే ప్రయాణం ఓ జ్ఞాపకం అవుతుంది. ‘తుగ్లక్ దర్బార్’ చిత్రానికి చేసిన ప్రయాణం నాకెప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం’’ అంటున్నారు రాశీ ఖన్నా. తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా ఢిల్లీ ప్రసాద్ దీనదయాల్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ‘తుగ్లక్ దర్బార్’. రాశీ ఖన్నా, మంజిమా మోహన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ గురువారం పూర్తయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు రాశీ ఖన్నా. ‘‘మరో అద్భుతమైన ప్రయాణం పూర్తయింది. విజయ్ సేతుపతిలాంటి ప్రతిభ ఉన్న నటుడితో యాక్ట్ చేయడం మంచి అనుభవం. ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా మీ అందరికీ త్వరగా చూపించేయాలని ఉంది’’ అని పేర్కొన్నారు రాశీ. అలానే చిత్రీకరణ చివరి రోజు టీమ్‌తో దిగిన కొన్ని సెల్ఫీలను షేర్ చేశారు కూడా. -
సునయన నుంచి అక్షర హాసన్ వరకూ..
సవ్యంగా సాగుతున్న జీవితాల్లో ఊహించిన మలుపులా దూసుకొచ్చింది కరోనా వైరస్. ఎంతో మంది జీవితాలను ఈ మహమ్మారి అతాలకుతలం చేసింది. కరోనా ధాటికి అనేక పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిలో సినీ పరిశ్రమ ఒకటి. కొన్ని కొత్త సినిమాలు ఆరంభంలోనే ఆగిపోతే మరి కొన్ని షూటింగ్ మధ్యలో నిలిచిపోయాయి. ఇక అనేక సినిమాలు విడుదలకు నోచుకోక వాయిదా పడ్డాయి. పని లేకపోవడంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో కొత్త ఫిట్నెస్, వంటలు, కొత్త వ్యాపకాలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తమ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. (సోనూసూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?) ఈక్రమంలో కొన్ని ఛాలెంజ్‌లను స్వీకరిస్తున్నారు. అలా వచ్చిందే ‘బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజ్’. ఎప్పుడూ కలర్ ఫుల్ ఫోటోలే కాకుండా నలుపు, తెలుపు రంగులో ఉండే ఫోటోలను womensupportingwomen అనే హ్యష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఈ ఛాలెంజ్. దీని ద్వారా మహిళలు తమలోని ఆత్మ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ, మహిళా సాధికారికతను పెంపొందించే ఉద్ధేశ్యంతో ఈ ఛాలెంజ్ నడుస్తోంది. ఈ సవాల్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన కోలీవుడ్ తారలపై ఓ లుక్కేద్దాం. (పెళ్లికి రెడీ అవుతోన్న 'పహిల్వాన్' విలన్) 1... సునయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఎంచుకున్న పాత్రల్లో తన అద్భుతమైన నటన నైపుణ్యాలను నిరూపించుకుంది. తన స్నేహితురాలు, నటి మంజిమా మోహన్ ఇచ్చిన సవాలును అంగీకరించిన సునాయన బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని పంచుకుంది. సునైనా సాదా చీరతో, తక్కువ అభరణాల అలంకరణ ఆమెకు సరిగ్గా సరిపోయింది. 2. మంజిమా మోహన్ తమిళ నటుడు శింబు సరసన రొమాంటిక్ థ్రిల్లర్ 'అచ్చం యెన్భాధు మదమైయాడ' చిత్రంలో నటించిన మంజిమా మోహన్ తన నటనకతో ప్రేక్షకులలో మంచి ఆదరణ సంపాదించుకుంది.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలతోపాటు పరిశ్రమలో మంచి స్నేహితులను కూడా సంపాదించింది. నటి వరలక్ష్మి చేసిన సవాలును అంగీకరించిన మంజిమా బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో ఫోటోను షేర్ చేసింది. 3. వరలక్ష్మీ సినీ పరిశ్రమలో ధైర్యవంతులైన నటీమణులలో వరలక్ష్మి ఒకరు. ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టదినట్లు మాట్లడటంలో ఆమె ఎన్నడూ వెనకాడదు. మహిళలపై లైంగిక వేధింపుల కోసం పోరాడటానికి వరలక్ష్మి ఒక ప్రచారాన్ని కూడా నడుపుతుంది. తాజాగా ఈ సవాలను స్వీకరించిన వరలక్ష్మీ బ్లాక్ అండ్ వైట్‌లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేగాక లాక్ డౌన్ సమయంలో ఆమె బరువు తగ్గినట్లు తెలుస్తోంది. 4. నివేధిత సతీష్ 'మాగలీర్ మాట్టం', 'సిల్లు కరుపట్టి' వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాలలో నివేదిత సతీష్ తన పాత్రలతో అబ్బురపరిచింది. బోల్డ్ పాత్రలు స్వీకరించే నటీమణులలో నివేదిత ఒకరు. ఆమెకున్న పెద్ద కళ్ళు తనకు ప్లాస్ పాయింట్‌గా చెప్పుకుంటారు. ఆమెకు బాగా సరిపోయే చీరతో బ్లాక్ అండ్ వైట్ ఫోటోను అభిమానులతో పంచుకుంది. 5. సుజా వరుణీ సుజా వరుణీ 2018లో శివ కుమార్‌ను వివాహం చేసుకున్నారు, ఈ జంటకు గత ఏడాది (2019) ఆగస్టులో పండంటి మగబిడ్డ జన్మించాడు. సుజా వరుణీ అనేక పాపులర్ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించింది, అయితే టెలివిజన్ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు ఈ నటికి మరింత ఖ్యాతి వచ్చింది. మహిళల ఛాలెంజ్‌కు మద్దతు ఇచ్చే మహిళల్లో సుజా వరుణీ ఒకరు. ఈ ఛాలెంజ్‌ను అంగీకరించిన, ఆమెతన గతంలో దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పంచుకున్నారు. 6.. అక్షర హాసన్ విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్. అయితే వారసత్వ నటిగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం నవీన్ దర్శకత్వం వహించే 'అగ్ని సిరగుగల్' చిత్రంలో అక్షర ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం తమిళ సినిమా పరిశ్రమలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇక ఈ సవాలును స్వీకరించిన అక్షర బ్లాక్ అండ్ వైట్‌లో ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. -
హీరోయిన్ మంజిమా మోహన్ గ్లామర్ ఫోటోలు
-
మిస్ అవుతున్నాను.. కానీ!
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్స్‌కు దూరంగా ఉండటమే మంచిదని భావిస్తున్నాను’’ అంటున్నారు మంజిమా మోహన్. ఈ విషయంపై మంజిమా మాట్లాడుతూ – ‘‘షూటింగ్స్‌ను బాగా మిస్ అవుతున్నాను. షూటింగ్స్‌లో పాల్గొనాలని ఉన్నా కరోనా పరిస్థితులు కలవరపెడుతున్నాయి. సెట్లో యాభై నుంచి అరవైమంది సభ్యుల మధ్య అనుక్షణం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ చేయడం అనేది క్లిష్టతరం. షూటింగ్ జరగడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. కరోనా ప్రభావం అదుపులోకి వస్తే ఆగస్టులో షూటింగ్స్ మొదలవుతాయనుకుంటున్నాను’’ అన్నారు. లాక్డౌన్లో ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నకు మంజిమా బదులిస్తూ –‘‘లాక్‌డౌన్‌కి ముందు ఓ తమిళ సినిమా షూటింగ్లో నా కాలికి గాయమైంది. దాంతో షూటింగ్‌కు దూరమయ్యాను. ఇప్పుడు ఆన్ లైన్లో మార్కెటింగ్, ఇంటీరియర్ డిజైన్ క్లాసులను ఫాలో అవుతున్నాను. అలాగే ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు మేం మొదలుపెట్టిన ‘వన్ ఇన్ ఏ మిలియన్’ ప్లాట్‌ఫామ్‌తో బిజీ అయ్యాను’’ అన్నారు. -
నా బలం తెలిసింది
కొంతకాలం కెమెరాకు దూరంగా ఉన్నారు హీరోయిన్ మంజిమా మోహన్. ఇటీవల ఓ ప్రమాదంలో ఆమె కాలికి గాయం కావడమే ఇందుకు కారణం. మంజిమా కోలుకుని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ కోలుకునే క్రమంలో ఆమె అనుభవాలను ఓ పోస్ట్ ద్వారా షేర్ చేశారు. ఆ పోస్ట్ సారాంశం ఇలా... ‘‘నేను గాయపడి ఇంట్లో ఉన్న ఖాళీ సమయంలో నాలో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. అవి నన్ను ఆందోళనకు గురి చేశాయి. మళ్లీ మామూలుగా నడవగలనా? నాకు ఎంతో ఇష్టమైన నటనకు దూరం అవుతానా? నేను ప్రేమించే డ్యాన్స్‌ను వదులుకోవాల్సి వస్తుందా? అనే ఆలోచనలు నన్ను కంగారు పెట్టాయి. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ధైర్యం చెప్పినప్పటికీ కొన్ని సందర్భాల్లో నాపై నాకు నమ్మకం ఉండేది కాదు. భయం వేసింది. అప్పుడు నాకు చికిత్స చేస్తున్న డాక్టర్ ‘నీపై నీకు నమ్మకం ఉంటేనే ఏదైనా సాధించగలవు. నువ్వు ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడగలవు’ అని చెప్పి మళ్లీ నాలో కొత్త ఉత్తేజాన్ని నింపారు. మెల్లిగా నా పనులు నేను చేసుకోవడం మొదలుపెట్టాను. మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నాను. ఈ అనుభవం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నా బలం ఏంటో నాకు తెలిసేలా చేసింది. ఇప్పుడు నా ఆలోచనల్లో భయం, ఆందోళన, అనుమానాలకు చోటు లేదు. గతంలో ఎందరో నటీనటులు నాలానే గాయపడి తిరిగి కోలుకున్నారు. వారి ధైర్యాన్ని ఎంతో గౌరవిస్తున్నాను’’ అని పేర్కొన్నారు మంజిమా మోహన్. నాగచైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు మంజిమా. -
నాలోని నన్ను వెతుక్కుంటా!
దాదాపు మూడేళ్ల క్రితం ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యారు మంజిమా మోహన్. ఆ తర్వాత ‘యన్టీఆర్: కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల్లో కనిపించారీ మలయాళీ బ్యూటీ. తెలుగులో కెరీర్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ తమిళంలో ఫుల్ జోష్‌గా సినిమాలు చేస్తున్నారామె. అయితే మంజిమా కాలికి గాయం కావడంతో ఆ జోష్‌కు బ్రేక్ పడింది. ‘‘రెండు వారాల క్రితం నా జీవితంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కారణంగా రాబోయే నెల రోజులు నేను బెడ్‌కే పరిమితమవ్వాల్సి వస్తోంది. నాకు ఇష్టమైన నటనకు కొంత సమయం దూరంగా ఉండాల్సి రావడం బాధగా ఉంది. కానీ నాలోని నన్ను వెతుక్కోవడానికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నా. ఇంతకుముందు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఏంటి? అని ఎవరైనా నన్ను అడిగినప్పుడు ‘ఏమీ లేవు’ అని చెప్పేదాన్ని. ఇకపై ఆ ప్రశ్నకు సమాధానం మార్చి, ఈ పరిస్థితుల గురించి చెబుతాను’’ అని పేర్కొన్నారు మంజిమ. -
చాలెంజింగ్ దర్బార్
‘తుగ్లక్ దర్బార్’లోకి తన పేరు రిజిస్టర్ చేయించుకున్నారు మలయాళ బ్యూటీ మంజిమా మోహన్. విజయ్ సేతుపతి హీరోగా ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ తెరకెక్కించనున్న సినిమా ‘తుగ్లక్ దర్బార్’. ఇందులో అదితీరావ్ హైదరీ ఒక కథానాయికగా నటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మంజిమా మోహన్ మరో హీరోయిన్గా నటించనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఇందులో విజయ్ సేతుపతి రాజకీయ నాయకుడిగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్‌లో ఆరంభం కానుంది. ‘‘విజయ్ సేతుపతి వంటి మంచి నటుడితో నటించడానికి నేను ఆసక్తిగాఎదురుచూస్తున్నాను. రొటీన్ హీరోయిన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది. ఈ సినిమాలో నా పాత్రనాకు చాలెంజింగ్‌గా ఉంటుందనిచెప్పగలను’’ అన్నారు మంజిమా మోహన్. -
లాయర్ మంజిమా
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్‌ను తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారు కథానాయిక మంజిమా మోహన్. కోర్టులో లాయర్‌గా వాదించనున్నారు. ‘ఎఫ్.ఐ.ఆర్’ (ఫైజల్ ఇబ్రహీమ్ రైజ్) అనే సినిమాలో ఆమె లాయర్‌గా కనిపించనున్నారు. మను ఆనంద్ దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా ఈ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అనుకోని పరిస్థితుల కారణంగా పోలీసుల చేతిలో చిక్కిన ఓ ముస్లిం యువకుడి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. జూనియర్ అడ్వకేట్‌గా మంజిమా నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. తెలుగులో నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో మంజిమా మోహన్ కథానాయికగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
దేవరాట్టం కాపాడుతుంది
దేవరాట్టం చిత్రం తనను కాపాడుతుందనే నమ్మకాన్ని ఆ చిత్ర కథానాయకుడు గౌతమ్ కార్తీక్ వ్యక్తం చేశారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన భారీ చిత్రం దేవరాట్టం. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ముత్తయ్య తెరకెక్కించిన ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ జంటగా నటించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం ఉదయం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ దర్శకుడు ముత్తయ్యతో తాను నిర్మించిన రెండవ చిత్రం దేవరాట్టం అని చెప్పారు. ఆయన చిత్రాన్ని ఒకే షెడ్యూల్లో పూర్తి చేశారన్నారు. ఇంత భారీ యాక్షన్ చిత్రాన్ని ఏకధాటిగా పని చేసి పూర్తి చేయడం సాధారణ విషయం కాదన్నారు. చిత్ర నిర్మాణాన్ని కూడా అంతా ఆయనే చూసుకున్నారన్నారు. ఇది మదురై నేపధ్యంలో సాగే కథ, ఈ కథకు గౌతమ్‌కార్తీక్, మంజిమా మోహన్‌లు సరిపోతారా? అన్న భయం తనకు కలిగిందన్నారు. ఈ చిత్రం అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రం అని చెప్పారు. చిత్ర కథానాయకుడు గౌతమ్‌కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రం తనను కాపాడుతుందని అన్నారు. తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం రావడానికి ముఖ్య కారణం నిర్మాత జ్ఞానవేల్‌రాజా అని తెలిపారు. దర్శకుడు ముత్తయ్య తనకు మదురై ప్రజల భాషను వారి ప్రవర్తనను, జీవన విధానాన్ని నేర్పించారని చెప్పారు. నటి మంజిమా మోహన్ చాలా సపోర్టు చేశారని చెప్పారు. అనంతరం దర్శకుడు ముత్తయ్య మాట్లాడుతూ ఇది జాతి గురించి చర్చించే కథా చిత్రం అనే అపోహ పడుతున్నారనీ, నిజానికి దేవరాట్టం అనేది ఒక కళ అని తెలిపారు. -
మీటూ ఆరోపణలపై నమ్మకం లేదు : హీరోయిన్
అచ్చం ఎంబదు మడమయడా చిత్రంతో కోలీవుడ్, టాలీవుడ్ (తెలుగులో సాహసమే శ్వాసగా)లో ఒకే సారి పరిచయమైంది మంజిమా . ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించినా మంజిమామోహన్ కెరీర్ మాత్రం వేగం పుంజుకోలేదనే చెప్పాలి. హిందీ చిత్రం క్వీన్ మలయాళ రీమేక్‌లో కంగనారావత్ పాత్రలో నటించింది. జామ్జామ్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జామ్ జామ్ పాటు మరో మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది. ఇక తమిళంలో ప్రస్తుతం ఈ బ్యూటీ గౌతమ్‌కార్తీక్‌తో జత కట్టిన దేవాట్టం చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తాజాగా జీవా, అరుళ్‌నిధి కలిసి నటిస్తున్న చిత్రంలో నాయకిగా నటించబోతోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న మీటూ గురించి ప్రస్తావన తీసుకురాగా, మీటూ కారణంగా చిత్ర పరిశ్రమలో ఏదో మార్పు వచ్చిందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మంజిమామోహన్ బదులిస్తూ దాని గురించి తనకు తెలియదంది. అలాంటి అనుభవం తనకు ఎదురు కాలేదని పేర్కొంది. మీటూ వ్యవహారంలో కొందరి అనుభవాలు నమ్మదగ్గవిగానూ, మరి కొందరి ఆరోపణలు నమ్మశక్యంగానివిగానూ ఉన్నాయని చెప్పింది. చెప్పాలంటే మీటూ ఆరోపణలపై నమ్మకం లేదని పేర్కొంది. తాను షూటింగ్‌కు వచ్చానా, పేకప్ అయ్యిందా, ఇంటికి వెళ్లానా అన్నట్టుగా తన దిన చర్య ఉంటుందని మంజిమామోహన్ అంది. అయినా ఎదిగే దశలో ఉన్న ఈ అమ్మడు ఇంత కంటే ఏం చెబుతుంది. -
జీవాకి జోడీగా..
‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో జీవా. ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు మలయాళ బ్యూటీ మంజిమా మోహన్. ఈ ఇద్దరూ ఇప్పుడు ఓ తమిళ సినిమా కోసం జోడీ కడుతున్నారు. ఈ చిత్రాన్ని జీవా సోదరుడు, హీరో జితన్ రమేశ్ నిర్మిస్తుండటం విశేషం. సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మాప్పిళై సింగం’ సినిమా ఫేమ్ రాజశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. శింబు హీరోగా నటించిన ‘అచ్చమ్ ఎన్బదు మడమయడా’ సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మంజిమా మోహన్ ఆ తర్వాత మరో రెండు తమిళ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు జీవాకి జోడీగా నటించేందుకు ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘‘జీవా, అరుళ్ని«థి కలిసి నటించనున్న మల్టీస్టారర్ చిత్రంలో జీవాకి జోడీగా మంజిమ నటిస్తారు. స్నేహం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 13న షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అని జితన్ రమేశ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అభినందన్. -
జీవాతో జత కుదిరింది!
జీవాతో నటి మంజిమామోహన్‌కు జత కుదిరింది. ‘అచ్చం ఎంబదు మడమయడా’ చిత్రంలో శింబుతో కలిసి కోలీవుడ్‌కు పరిచయమైన మాలీవుడ్ బ్యూటీ మంజిమామోహన్. ఈ తరువాత రెండు మూడు చిత్రాల్లో నటించినా ఈ అమ్మడి కెరీర్ ఇక్కడ వేగం పుంజుకోలేదనే చెప్పాలి. అయితే మాతృభాషతో పాటు తెలుగు వంటి ఇతర భాషల్లోనూ నటిస్తున్న మంజిమామోహన్ తాజాగా ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. యువ నటులు జీవా, అరుళ్‌నిధి కలిసి నటించనున్న చిత్రంలో ఈ బ్యూటీ నటించనుంది. దీనికి రాజశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. దీన్ని సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై నటుడు జిత్తన్ రమేశ్ నిర్మించనున్నారు. ఈ క్రేజీ చిత్రం గురించి ఆయన తెలుపుతూ మాప్పిళై సింగం చిత్ర ఫేమ్ రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇది స్నేహం ఇతివృత్తంగా తెర పై ఆవిష్కరించనున్న కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇంతకు ముందు తమ సంస్థలో విజయ్ హీరోగా స్నేహం నేపథ్యంలో ఫ్రెండ్స్ చిత్రాన్ని నిర్మించామని, ఇది ఆ తరహాలో సాగే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇందులో జీవాకు జంటగా నటి మంజిమామోహన్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. అరుళ్‌నిధి సరసన నటించే నటి ఎంపిక జరుగుతోందని అన్నారు. చిత్రాన్ని డిసెంబర్ 13న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందులో మీరు కూడా నటిస్తున్నారా అన్న ప్రశ్నకు తాను ప్రొడక్షన్‌నే చూసుకుంటున్నానని చెప్పారు. ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని, అభినందన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. కాగా ప్రస్తుతం జీవా గొరిల్లా, జిప్సీ చిత్రాలను పూర్తి చేసి కీ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా అరుళ్‌నిధి పుహళేంది ఉనుమ్ నాన్ చిత్రంతో పాటు భారత్ నీలకంఠన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేస్తున్నారు. ఇక నటి మంజిమామోహన్ దేవరాట్టం చిత్రంలో నటిస్తోంది. -
ఆత్మవిశ్వాసం పెరిగింది!
నటీనటులకు ఎప్పుడూ పొగడ్తలే కాదు. అప్పుడప్పుడూ విమర్శలు కూడా ఎదరవుతాయి. విమర్శలను ఎదుర్కొన్నప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నను కన్నడ నటి మంజిమా మోహన్...‘‘నా యాక్టింగ్‌పై విమర్శలు వచ్చినప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. కానీ, అలానే కూర్చిండిపోను. విమర్శలను విశ్లేషించుకుంటాను. నా తప్పులు ఏవైనా ఉంటే సరిచేసుకుంటాను. ‘ఓరు వడక్కన్ సెల్ఫీ’ టైమ్‌లో బాగా విమర్శలు రావడంతో బాగా ఫీలయ్యాను. ఆ టైమ్‌లో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు అండగా నిలవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’’ అని చెప్పుకొచ్చారు మంజిమా మోహన్. -
ప్రేమ పెళ్లే చేసుకుంటా..!
సాక్షి, చెన్నై: నాకు పెళ్లెప్పుడవుతుంది అని కూనిరాగాలు తీస్తోంది నటి మంజిమామోహన్. ఆ కథేంటో చూద్దామా! ‘అచ్చంయంబ్బదు మడమయడా’ చిత్రంతో తమిళంలోనూ, అదే చిత్రంతో తెలుగులోనూ ఏకకాలంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన లక్కీబ్యూటీ మంజిమామోహన్. ప్రస్తుతం హిందీ చిత్రం క్వీన్ మలయాళ రీమేక్‌లోనూ, తమిళంలో గౌతమ్కార్తీక్కు జంటగా దేవాట్టం చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్న ఈ వర్ధమాన నటి సాక్షితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్ర: నటి కాకపోతే ఏమై ఉండేవారు? జ: నేను 10వ తరగతి చదువుతున్న సమయంలోనే ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశపడ్డాను. పది పూర్తి అయిన తరువాత వేసవి సెలవుల్లో రెండు నెలలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు నేర్చుకునే ప్రయత్నం చేశాను. అయితే అప్పుడే ఈ రంగంలో నేను పనికి రానని అర్థం అయిపోయింది. దీంతో ఆ ఆశకు నీళ్లొదిలేశాను. ప్ర: స్టెల్లా మేరీ కళాశాల విద్యార్థిని అయిన మీకు అప్పటి చెన్నైకి, ఇప్పటి చెన్నైకి ఏమైనా వ్యత్యాసం అనిపిస్తుందా? జ: కచ్చితంగా. కాలేజీ జీవితం అంటేనే వేరు కదా! అప్పుడు నేను బస్, ఆటోల్లో ప్రయాణం చేసేదాన్ని. ఇప్పుడు అలా కుదరదు. ఒక చోట 10మంది ఉంటే అందులో కనీసం ముగ్గురైనా నన్ను గుర్తు పడతారు. అందువల్ల ఇప్పుడు అంత స్వేచ్ఛగా తిరగడం కుదరదు. అయితే అలాంటి సందర్భం వస్తే చెన్నైలోని ఎంటీసీ బస్సులో పయనించాలన్న కోరిక ఉంది. ప్ర: షూటింగ్ లేని సమయాల్లో మీకు కాలక్షేపం? జ: బాగా నిద్ర పోతాను. కుదిరితే రోజంతా నిద్రలోనే గడిపేస్తా. ఏదైనా సినిమా చూస్తాను. పాటలు వింటాను. ఇటీవల యోగా చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉండడానికి యోగా చాలా ఉపయోగ పడుతోంది. నాకు వంటింటి పరిచయం కూడా ఉంది. ఆప్లేట్ వేయడం, చికెన్ వండడం వంటివి తెలుసు. మీరు నవ్వనంటే ఒక విషయం చెబుతా. వంట పాత్రలు కడగడం అంటే నాకు చాలా ఇష్టం. ప్ర: చెన్నైలో మీకు నచ్చిన ప్రాంతం? జ: సత్యం సినిమా థియేటర్. అదేమిటో తెలియదుగానీ ఆ థియేటర్లో సినిమా చూస్తే ఆ సుఖమే వేరు. అక్కడ పాప్‌కార్న్, కోల్డ్ కాఫీ బాగుంటాయి. సినిమా టికెట్ బుక్ చేసినప్పుడే పాప్‌కార్న్‌తో కలిపే బుక్ చేసుకుంటాను. ఆ తరువాత శాంథోమ్ చర్చ్‌కు తరచూ వెళుతుంటాను. నా మనసుకు దగ్గరైన ప్రాంతం అది. ప్ర: ఈ తరం హీరోయిన్లు గాయనీగానూ అవతారమెత్తుతున్నారు.మీకు అలాంటి కోరిక? జ: నాకు అలాంటి ఆశ లేదు. ఆ అర్హతా ఉందనుకోను. ఇప్పుడు అంతా ఆటోట్యూనేగా మీరు ఈజీగా పాడవచ్చుగా అని కొందరు అడిగారు. అయితే తెలియని విషయాన్ని నేనెప్పుడూ చేయను. ప్ర: మీరు తరచూ కూని రాగాలు తీసే పాట? జ: ఇటీవల నయనతార నటించిన చిత్రంలోని నాకు ఎప్పుడో పెళ్లి వయసు వచ్చిందే (ఎనక్కు ఎప్పో కల్యాణ వయసు వందుటుచ్చుడీ) పాటను తరచూ హమ్ చేస్తుంటాను. ప్ర: సరే మీ పెళ్లెప్పుడూ? జ: ఆహాహా.. ఇప్పట్లో కచ్చితంగా ఉండదు. మరో ఏడెనిమిదేళ్ల తరువాతే. అదీ ప్రేమ పెళ్లే చేసుకుంటా. -
నా ఓటు ఆమెకే!
ఫిక్షనల్ క్యారెక్టర్స్ నుంచి బయోపిక్స్‌లో యాక్ట్ చేయాలనే ఉత్సాహం నటీనటుల్లో బాగా పెరిగిపోయింది. అందరికీ ఆ అవకాశం దొరక్కపోయినా ఫలానా వాళ్ల బయోపిక్‌లో యాక్ట్ చేయాలనుంది అని బయటకు చెప్తున్నారు కొందరు. ఇప్పటికే కొందరు కథానాయికలు తమిళనాడు మాజీ సీయం, నటి జయలలిత బయోపిక్‌లో యాక్ట్ చేయాలనుందని చెప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఫేమ్ మంజిమా మోహన్ కూడా జాయిన్ అయ్యారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘మీరు ఎవరి బయోపిక్‌లో నటించాలనుకుంటున్నారు? అని నాకు ఆప్షన్ ఇస్తే.. నా ఓటు జయలలితగారి జీవితానికి. ఆమె చాలా డేరింగ్ అండ్ బోల్డ్ లేడీ. జయలలితగారి ఆ క్వాలిటీస్‌కి నేను పెద్ద అభిమానిని. అందుకే ఆవిడ బయోపిక్‌లో యాక్ట్ చేయాలనుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మంజిమ హిందీ ‘క్వీన్’ మలయాళ రీమేక్ ‘జామ్ జామ్’లో యాక్ట్ చేస్తున్నారు. -
తగ్గమంటే తగ్గాల్సిందే!
లావుగా ఉంటే బాగుంటుందా? సన్నగా కనిపించాలా? ఈ కన్ఫ్యూజన్ చాలామంది అమ్మాయిలకు ఉంటుంది. ఎందుకంటే లావుగా ఉంటే సన్నబడమంటారు. సన్నగా ఉంటే మరీ ఇంత బక్కపలచగానా? అంటారు. మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ ఇలాంటి విషయంలోనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడున్న కథానాయికల్లా స్లిమ్‌గా కాకుండా మంజిమా కొంచెం బొద్దుగానే ఉంటారు. ‘నేను అనుకున్న క్యారెక్టర్‌కి నువ్విలా ఉంటేనే బాగుటుంది’ అని ఓ డైరెక్టర్ అంటే, వేరే డైరెక్టర్లు ‘ఫిట్‌గా ఉండాలి. కొంచెం బరువు తగ్గాలి’ అన్నారట. ఈ విషయం గురించి మంజిమా మోహన్ మాట్లాడుతూ – ‘‘నా దృష్టిలో ఫిజిక్ అనేది క్యారెక్టర్ని బట్టి ఉండాలి. అలాగే, డైరెక్టర్స్ ఎలా కోరుకుంటున్నారో అలా ఉండాలి. ఇప్పటివరకూ నేను నాలా ఉంటే చాలనే దర్శకులతో సినిమాలు చేసినందుకు ఆనందంగా ఉంది. అయితే కొందరు మాత్రం ‘నువ్వు తగ్గితే ఇంకా బాగుంటావ్. కెరీర్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది’ అన్నారు. నేను మాత్రం నేనిప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నా ఓకే అనుకుంటున్నాను. అయితే తగ్గాలని సలహా ఇచ్చినప్పుడు ‘కుదరదు’ అని మొండిగా వాదించడం కరెక్ట్ కాదు. అందరూ నా బరువు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తగ్గాల్సిందే. అందులో తప్పేం లేదు. అందుకే చాలెంజ్‌గా తీసుకుని, తగ్గడం మొదలుపెట్టాను. మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు బాగానే ఉంది’’ అన్నారు. అన్నట్లు.. మంజిమా మోహన్ ఎవరో గుర్తుండే ఉంటుంది. నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నటించారు. ఇప్పుడు హిందీ ‘క్వీన్’ మలయాళ రీమేక్ ‘జామ్ జామ్’లో కథానాయికగా నటిస్తున్నారు. -
నటుడు రిషీతో ప్రేమాయణం గురించి?
తమిళసినిమా: అంగాంగ ప్రదర్శనకు పేరు గ్లామర్ కాదు అంటోంది యువ నటి మంజిమామోహన్. అచ్చం యన్బదు మడమైఇల్లడా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయిన మలయాళ భామ ఈమె. ఆ తరువాత విజయ్‌సేతుపతికి జంటగా కాదలుమ్ కడందు పోగుమ్, ధనుష్ సరసన పవర్ పాండి వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించినా ఎందుకనో అంత బిజీ నాయకి కాలేకపోయింది. ప్రస్తుతం గౌతమ్‌కార్తీక్‌తో దేవాట్టం చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా నటి మంజిమామోహన్‌తో చిట్‌చాట్.. ప్ర: నటుడు గౌతమ్‌కార్తీక్ నటించిన అడల్ట్ కామెడీ చిత్రం ఇరుట్టు అరైయిల్ మురట్టు చిత్రం గురించి మీ అభిప్రాయం? జ: నాకేం చెప్పాలో తెలియడం లేదు. గౌతమ్ కార్తీక్ ఇటీవల నటించిన రెండు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. అయితే ఆ రెండు చిత్రాలను నేను చూడలేదు. అయితే చాలా విషయాలు విన్నాను. ప్రేక్షకులకు ఆ చిత్రాలు నచ్చాయి. ఇలాంటి మార్పును ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు. అయితే అలాంటి చిత్రాలు మాత్రమే కాకుండా వైవిధ్యభరిత కథాచిత్రాలన్నింటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాబట్టి నా సొంత అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నాను. ప్ర: మంజిమామోహన్ రొమాన్స్ రహస్యం గురించి? జ: నాకు రొమాన్స్ రహస్యం అంటూ ఏమీ లేదు. నిజం చెప్పాలంటే అందుకు టైమే లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాలపైనే. మంచి చిత్రాల్లో నటించాలి. మీరన్నట్టే అలాంటిదేమైనా ఉంటే మొదట అమ్మానాన్నలకు చెబుతాను. ఆ తరువాత మీకే తెలుస్తుంది. ఇతనే నీకు భర్త అని నా మనసు చెప్పాలి. ఇప్పటి వరకూ ఎవరినీ అలా నా మనసు చెప్పలేదు. అలా చెప్పినప్పుడు చూద్దాం. ఇంకో విషయం చెబితే మీరే ఆశ్చర్యపోతారు. నాకింత వరకూ ఎవరూ ఐలవ్యూ చెప్పలేదు. నా స్నేహితుల ద్వారానే రాయబారం పంపారు. అలాగే ఎవరైనా చెప్పినా వెంటనే ఓకే చెప్పే మనస్తత్వం నాది కాదు. తొలి చూపులోనే పుట్టే ప్రేమపై నాకు నమ్మకం లేదు. ప్ర: అందాలారబోత లేకుండా కథానాయికలు నిలదొక్కుకోవడం సాధ్యమా? జ: నా దృష్టిలో గ్లామర్‌కు అంగాంగ ప్రదర్శనకు వ్యత్యాసం ఉంది. ఒళ్లు చూపించి నటించడం నా వల్ల కాదు. నా శరీర సౌష్టవానికి అది నప్పదు కూడా. చీర ధరించి కూడా శృంగారాన్ని ఒలకబోయవచ్చు. పాత్రకు అవసరం అయితే దాన్ని నేను చేయగలను. కథ చెప్పినప్పుడే ఈ విషయం గురించి దర్శక నిర్మాతలతో స్పష్టంగా చర్చిస్తాను. ప్ర: నటుడు రిషీతో ప్రేమాయణం అంటూజరుగుతున్న ప్రచారం గురించి? జ: రిషీ నాకు క్లోజ్ ఫ్రేండ్ అని మాట వరసకు చెప్పను. తను నిజంగానే నాకు మంచి స్నేహితుడు.. నేను ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నానంటే కనీసం అలాంటి ఫొటో అయినా బయట పడాలి.అలాంటిదేమీ లేకుండా కొందరు కథలల్లుతున్నారు.కాబట్టి అలాంటి వదంతుల గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. -
వన్ మోర్ మూవీ
మలయాళ ముద్దుగుమ్మ మంజిమా మోహన్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముత్తయ్య దర్శకత్వంలో గౌతమ్ కార్తీక్ హీరోగా రూపొందనున్న తమిళ చిత్రం ‘దేవరదమ్’లో మంజిమా కథానాయికగా నటించనున్నారు. ‘‘ఈ సినిమా టీమ్‌లో జాయిన్ అయినందుకు హ్యాపీ. ఇక షూటింగ్ స్టార్ట్ కావడం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు మంజిమా. గతేడాది రెండు తమిళ సినిమాల్లో నటించిన ఈమె ఈ ఏడాది నటించనున్న ఫస్ట్ తమిళ చిత్రం ఇదే. సో.. మంజిమా కెరీర్లో వన్మోర్ తమిళ మూవీ క్రెడిట్ అయ్యిందన్నమాట. ప్రస్తుతం హిందీ హిట్ ‘క్వీన్’ మలయాళ రీమేక్ ‘జామ్ జామ్’ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
గౌతమ్‌తో జోడీ కుదిరింది
తమిళసినిమా: తొలుత కాస్త తడబడ్డా రంగూన్, ఇవన్ తందిరన్ చిత్రాలతో సక్సెస్ రూట్లో పడ్డ యువ నటుడు గౌతమ్‌కార్తీక్. ఇటీవల హరహర మహాదేవకి, ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు లాంటి అడల్ట్ చిత్రాల్లో నటించి విమర్శలను ఎదుర్కొన్నా, ఆ చిత్రాల వసూళ్లు మాత్రం దుమ్మురేపాయి. ప్రస్తుతం గౌతమ్‌కార్తీక్ తన తండ్రి కార్తీక్‌తో కలిసి నటించిన మిస్టర్ చంద్రమౌళి చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా దేవరాట్టం అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. కొంబన్, మరుదు వంటి చిత్రాల ఫేమ్ ముత్తయ్య తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఈ దేవరాట్టం. చిత్ర హీరో, సాంకేతిక వర్గం వివరాలను వెల్లడించిన చిత్ర వార్గలు హీరోయిన్ ఎవరన్న ఇప్పుడే వెల్లడించారు. ఆమె ఎవరో కాదు నటి మంజిమామోహన్. మాలీవుడ్‌లో బాలతారగా పరిచయమై పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ మాతృభాషలోనే హీరోయిన్‌గానూ పరిచయమై ఆ తరువాత కోలీవుడ్‌కు సంచలన నటుడు శింబు సరసన అచ్చం ఎన్బ్దు మడమయడా చిత్రంతో దిగుమతైంది. ఆ తరువాత క్షత్రియన్, ఇప్పడై వెల్లుమ్ చిత్రాల్లో నటించింది. అయితే తొలి చిత్రం ఓకే అనిపించుకున్నా, ఆ తరువాత నటించిన చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వలేదు. దీంతో నటి మంజిమామోహన్‌కు కోలీవుడ్‌లో చిన్న బ్రేక్ వచ్చింది. తాజాగా గౌతమ్ కార్తీక్‌తో జత కట్టే అవకాశం వరించింది. గ్రామీణ కథా చిత్రాల దర్శకుడి ఇమేజ్ను తె చ్చుకున్న దర్శకుడు ముత్తయ్య ఈ దేవరాట్టం చిత్రాన్ని అదే కోవలో తెరకెక్కించనున్నారని సమాచారం. ఇందులో మంజిమామోహన్‌ను గ్రామీణ యువతిగా చూడబోతున్నామన్నమాట. చూద్దాం ఈ చిత్రం అయినా ఈ అమ్మడికి మంచి బ్రేక్ ఇస్తుందేమో! -
పెప్పర్ స్ప్రే సరిపోదు.. అంతకు మించి!
ఆ మధ్య అనుష్క ఓ పబ్లిక్ ఫంక్షన్లో పాల్గొంటే ఎవరో ఆకతాయి తాకాడు. అంతకుముందు శ్రియ తిరుమల వెళ్లినప్పుడు ఇలాంటి సంఘటనే. మొన్న సనూష ట్రైన్లో వెళ్లినప్పుడు ఓ చేదు అనుభవం. మిల్క్ బ్యూటీ తమన్నా ఓ వేడుకలో పాల్గొంటే ఓ ఆకతాయి చెప్పు విసిరాడు. కథానాయికలకు ఈ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలామందిలో ఈ ప్రశ్న ఉంది. కథానాయికలనే కాదు.. మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. దీని గురించి కథానాయిక మంజిమా మోహన్ మొహమాటం లేకుండా మాట్లాడారు. ‘‘అసలు ట్రైన్లో ఒక మహిళతో ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవరిస్తుంటే మిగతా ప్యాసింజర్లందరూ ఎందుకు కామ్‌గా ఉన్నారో, ఆ సమయంలో వాళ్లు ఏం ఆలోచించారో అర్థం కావడం లేదు’’ అని సనూషకు ఎదురైన అనుభవం గురించి అన్నారు. ఇంకా మంజిమా మోహన్ మాట్లాడుతూ – ‘‘ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు సెఫ్టీ కోసం పెప్పర్ స్ప్రేను బ్యాగ్‌లో క్యారీ చేయమని నా బ్రదర్ సలహా ఇచ్చేవాడు. ‘నీకేమైనా పిచ్చా. పాతకాలపు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు సొసైటీలో మహిళలకు ఎంతో సెఫ్టీ ఉంది’ అని నేను తనతో అనేదాన్ని. కానీ ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నా మాటలు నిజం కాదని అర్థమవుతోంది. ఇప్పుడు జరుగుతున్న అరాచకాల నుంచి బయటపడటానికి పెప్పర్ స్ప్రే మాత్రమే కాదు.. అంతకుమించిన వస్తువులను ఏవో మహిళలు తమ వెంట ఉంచుకోవాలేమో అనిపిస్తోంది. ఈ పరిస్థితులో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. మహిళలను ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్‌గా చూడడం మానుకోవాలి. వారి అభిప్రాయాలకు, ఆత్మగౌరవానికి విలువ ఇవ్వాలి’’ అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ‘క్వీన్’ మూవీ మలయాళ రీమేక్ ‘జామ్ జామ్’లో నటిస్తున్న మంజిమ.. మూడేళ్ల క్రితం నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. -
నలుగురు రాణులు.. నలభై రోజులు... ఒకటే కహానీ!
కథొక్కటే... కథానాయికలు మాత్రం వేర్వేరు! కంట్రీ ఒక్కటే... కెమెరాలు కదిలే ప్రదేశాలు మాత్రం వేర్వేరు! నిర్మాత ఒక్కరే... దర్శకులు మాత్రం వేర్వేరు! కానీ, అందరూ స్నేహితులే! చిత్రీకరణ పూరై్తన తర్వాత కలిసే చోటు ఒక్కటే! సిన్మా కథ కాదిది... అంతకు మించిన కహానీ! ‘ఒక్క కథ... ఇద్దరు దర్శకులు... నలుగురు రాణులు!’ కథేంటో మీరూ లుక్కేయండి! హిందీ హిట్ ‘క్వీన్’లో కంగనా రనౌత్ కుమ్మేశారు. ఇప్పుడీ సిన్మాను దక్షిణాది భాషల్లో మెడియంటే ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ మలయాళ దర్శకుడు కె.పి. కుమారన్ తనయుడు, నిర్మాత మనుకుమారన్ రీమేక్ చేస్తున్నారు. సారీ... రీమేక్ కాదు, రీమేక్స్! తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో! ఇందులో తెలుగు–మలయాళ వెర్షన్స్‌కు ‘షో, మిస్సమ్మ’ సిన్మాల ఫేమ్ నీలకంఠ, తమిళ–కన్నడ వెర్షన్స్‌కు నటుడు రమేశ్ అరవింద్ దర్శకులు. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ నాయికలుగా నటిస్తున్నారు. అంటే... కంగనా రనౌత్ పాత్రను ఈ నలుగురూ చేస్తున్నారు. తెలుగులో ‘క్వీన్’గా నటిస్తున్న తమన్నా తమిళ ప్రేక్షకులకు, తమిళ ‘క్వీన్’గా నటిస్తున్న కాజల్ తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఫేమ్ మంజిమాయే మలయాళ ‘క్వీన్’. తమిళ సినిమాలు కొన్నిటిలో ఆమె నటించారు. కన్నడ ‘క్వీన్’ పరుల్ యాదవ్ ‘కిల్లింగ్ వీరప్పన్’తో తెలుగు–తమిళ ప్రేక్షకులకు తెలుసు. మలయాళ సినిమాలూ చేశారామె. అందువల్ల, ఎవరెలా చేస్తారోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది! ఈ ఆసక్తిని పెంచుతూ... ప్యారిస్‌లో మన నలుగురు ‘క్వీన్స్’ ఈ రోజు కంగనా రనౌత్ షూస్‌లో అడుగులేశారు. నాలుగు సినిమాల షూటింగులు నేడు ప్యారిస్‌లో మొదలయ్యాయి. దాదాపు 40 రోజుల పాటు అక్కడే జరుగుతాయి. అయితే... లొకేషన్లు వేర్వేరులెండి! కానీ, షూటింగ్ తర్వాత అందరూ ఉండేది ఓ హోటల్లోనే. ‘ఓ ఒరలో రెండు కత్తులు ఇమడవు’ అని ఓ సామెత. ఇక్కడ రెండు కాదు... నాలుగు! అదేనండి.. కత్తిలాంటి కథానాయికలు నలుగురున్నారు. ఒకే సినిమాలో నటించకపోయినా ఒకే చోట, ఒకే లొకేషన్లో ఉంటారు కాబట్టి, నలుగురికీ గొడవలు వస్తాయేమో? అనే డౌట్ చాలామందికి ఉంది. నో... అటువంటి చాన్సే లేదంటున్నారు తమన్నా. యాక్చువల్లీ... చిత్రీకరణ ప్రారంభానికి ముందే తమన్నా, కాజల్, మంజిమ, పరుల్ కలసి ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. అందులో సినిమా గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ‘‘నలుగురు హీరోయిన్లు సేమ్ స్టోరీలో, సేమ్ క్యారెక్టర్లో, సేమ్ కంట్రీలో, సేమ్ టైమ్‌లో నటించడం అరుదైన విషయం కదా! నాకీ సంగతి చెప్పగానే... ఎగ్జయిటయ్యాను. ప్యారిస్‌లో మేం నలుగురమూ ఏమేం చేయాలనే అంశాలను వాట్సాప్ గ్రూప్‌లో డిస్కస్ చేసుకున్నాం’’ అని తమన్నా పేర్కొన్నారు. ఇక, కాజల్ అయితే... ‘‘తమన్నా, నేను ఆల్మోస్ట్ సేమ్ టైమ్‌లో కెరీర్ స్టార్ట్ చేశాం. నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో తమన్నా ఒకరు. అయితే సేమ్ లొకేషన్లో షూట్ చేయడం ఫస్ట్ టైమ్. సరదాగా ఉంటుంది’’ అన్నారు. పరుల్ యాదవ్, మంజిమా మోహన్... ఇద్దరూ తమన్నా, కాజల్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి, సరదా సంగతులు చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్నామన్నారు. ఇదండీ... క్వీన్స్ కహానీ!! క్వీన్ కథ... వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది రాణీ మెహ్రా (కంగనా రనౌత్). విజయ్ (రాజ్‌కుమార్ రావ్) తో ఆమె పెళ్లి కుదురుతుంది. హనీమూన్‌కి టికెట్స్ కూడా బుక్ చేస్తారు. అయితే రేపు వివాహం అనగా.. ‘‘నేను ఫారిన్లో పెరిగాను. నా కల్చర్ వేరు. నువ్వు నాకు సరి కాదు’’ అంటాడు విజయ్. పెళ్లాగిపోతుంది. రాణీ కట్టుకున్న కలల మేడ కూలిపోతుంది. చివరికి వేరొకరి కారణంగా తను బాధపడకూడదని నిర్ణయించుకుంటుంది. హనీమూన్ కోసం బుక్ చేసిన టిక్కెట్లతో ఒంటరిగా ప్యారిస్ వెళుతుంది. కొత్త దేశం.. కొత్త మనుషులు కావడంతో కంగారు పడుతుంది. కష్టాల్లో ఉన్న రాణీని వరలక్ష్మీ (లీసా హెడన్) ఆదుకుంటుంది. మెల్లగా రాణీ ఫారిన్ కల్చర్‌కి అలవాటు పడుతుంది. అక్కడ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటుంది. ఆమె జీవితంలోకి వచ్చిన కొత్త స్నేహితులు ఆమె ఎదుగుదలకు మరింత సహాయం చేస్తారు. రాణీ తనలో ఉన్న టాలెంట్‌కి మెరుగులు దిద్దుకుంటుంది. ఓ సందర్భంలో రాణీ ఫొటోను విజయ్ చూస్తాడు. ఆమెపై ఇష్టం పెంచుకుంటాడు. ప్యాకప్ అనుకున్న మన రిలేషన్‌షిప్‌ను ప్యాచప్ చేసి, కంటిన్యూ చేద్దాం అంటాడు. ఆ తర్వాత కథేంటి? అనేది వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘క్వీన్’ చూసినవారికి తెలిసే ఉంటుంది. -
నాలుగు భాషల్లో నలుగురు రాణులు..!
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా క్వీన్ ను సౌత్ లో రీమేక్ చేయటం పై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. హిందీలో కంగనా రనౌత్ నటించిన పాత్రలో సౌత్ లో ఎవరి నటిస్తారన్న చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ముందుగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించాలని భావించినా.. అది సాధ్యపడలేదు. దీంతో ఒక్కో భాషల్లో ఒక్కో హీరోయిన్ క్వీన్ పాత్రలో అలరించనుంది. ఇప్పటికే కన్నడ క్వీన్ షూటింగ్ పూర్తి కావచ్చింది. బటర్ ఫ్లై పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాలో పరుల్ యాదవ్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ వర్షన్ కు దర్శకత్వం వహిస్తున్న రమేష్ అరవింద్ తమిళంలోనే ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. పారిస్ పారిస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ క్వీన్ గా నటించనుంది. ఇటీవలే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా తెలుగు, మలయాళ భాషల విషయంలో కూడా క్లారిటీ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు వర్షన్ లో క్వీన్ గా తమన్నా నటించనుందట. ఈ సినిమాను జాతీయ అవార్డు దర్శకుడు నీలకంఠ డైరెక్ట్ చేయనున్నాడు. జామ్ జామ్ పేరుతో తెరకెక్కుతున్న మలయాళ వర్షన్ లో సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఫేం మంజిమా మోహన్ క్వీన్ పాత్రలో నటించనుంది. అయితే మలయాళ చిత్రానికి దర్శకుడెవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. -
నా కథకి ఆమే బెస్ట్!
తమిళసినిమా: నటి ఐశ్వర్యరాజేశ్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయని చెప్పవచ్చు. ఈమెది హీరోయిన్ పాత్రలు చేసే వయసే. అయినా అలాంటి పాత్రలే చేస్తానని పట్టు పట్టకుండా నటనకు అవకాశం ఉంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధం అనడంతో వైవిధ్యభరిత పాత్రలు ఆమె వైపు చూస్తున్నాయి. అందుకు కాక్కాముట్టై చిత్రంలో పోషించిన ఇద్దరు పిల్లలకు తల్లి పాత్ర ఒక ఉదాహరణ మాత్రమే. తాజాగా శశికుమార్‌కు జంటగా కొడివీరన్ చిత్రంలో నటిస్తున్న ఐశ్వర్యరాజేశ్‌కు మరో అవకాశం తలుపు తట్టనుంది. ఆరోహణం చిత్రం ద్వారా దర్శకురాలిగా అవతారమెత్తిన నటి లక్ష్మీరామకృష్ణన్ తొలి చిత్రంతోనే మంచి మార్కులను కొట్టేశారు. ఆ తరువాత అమ్మణి చిత్రాలను తెరకెక్కించిన ఈ మహిళాదర్శకురాలు తాజా చిత్రానికి రెడీ అయ్యారు. ఇటీవల అనూహ్య విజయాన్ని సాధించిన హిందీ మీడియం అనే హిందీ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని కథను తయారు చేసుకున్నారట. నిజానికి ఆ చిత్ర రీమేక్ హక్కులనే పొందాలని భావించినా అదీ బెంగాలీ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన చిత్రం అని తెలియడంతో తన నిర్ణయాన్ని మార్చుకుని తనూ హిందీ మీడియం చిత్ర స్ఫూర్తితో ఒక కథను రాసుకున్నారట. కాగా ఇందులో అశోక్ సెల్వన్ కథానాయకుడిగా నటించనున్నారు. ఇక కథానాయకి విషయానికి వస్తే నటి మంజిమామోహన్, నందిత శ్వేత, ఐశ్వర్యరాజేశ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అయితే ఈ ముగ్గురిలో ఐశ్వర్యరాజేశ్‌నే తన కథలో నాయకి పాత్రకు బాగా నప్పుతారని దర్శకురాలు లకీ‡్ష్యరామకృష్ణన్ నమ్ముతున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ఐశ్వర్యరాజేశ్ మన తెలుగమ్మాయే అన్నది గమనార్హం. -
మ్యూజిక్ డైరెక్టర్ తమ్ముడితో హీరోయిన్ లవ్!
అక్కినేని నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో..’ సినిమాతో తెరంగేట్రం చేసిన నటి మంజిమా మోహన్ ప్రస్తుతం ప్రేమలో పడ్డట్లు కోలీవుడ్ టాక్. వివాదాస్పదుడిగా పేరుపొందిన ప్రముఖ సంగీత దర్శకుడి తమ్ముడితో ఈ యంగ్ హీరోయిన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు సమాచారం. అతని పేరు రిషికేష్.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ కజిన్. మంజిమ, రుషికేష్‌లు చెన్నైలోని కాఫీ షాపుల్లో తరచూ కలుసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అఫైర్ల విషయంలో అన్న అనిరుద్లా కాకుండా సిన్సియర్‌గా ఉండాలని రుషికేష్ భావిస్తున్నట్లు తెలిసింది. ‘సాహసం శ్వాసగా..’(తమిళంలో ‘అచ్చంయన్భదు మడమయడా’) తర్వాత విక్రమ్ ప్రభుతో ‘క్షత్రియన్’ సినిమాలో నటించింది మంజిమ. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న‘వెల్లుమ్’లో ఉధయనిధి స్టాలిన్‌కు జోడీగా కనిపించనుంది. -
అలా చేసేకన్నా సినిమాలు మానేస్తా!
హీరోయిన్ అన్నాక గ్లామరస్‌గా కనిపించాలని ప్రేక్షకులు కోరుకుంటారు. వాళ్ల కోసమే తాము గ్లామరస్‌గా కనిపిస్తుంటామని కొంతమంది కథానాయికలు అంటుంటారు. లిప్ లాక్, బికినీ సీన్స్ చేసినప్పుడు కథ డిమాండ్ చేసిందంటుంటారు. ముద్దుగుమ్మలు ఏం చెప్పినా వినడానికి బాగుంటుంది. అయితే, మంజిమా మోహన్ ఇలాంటివన్నీ చెప్పనే చెప్పరు.ఎందుకంటే, ఈ బ్యూటీ లిప్ లాక్ సీన్స్ చేయరట. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నాగచైతన్యతో జోడీ కట్టిన ఈ భామ ఆ తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ నటించలేదు. కాగా, ‘మంజిమా లిప్ లాక్ సీన్లకు, స్కిన్ షో చేయడానికి రెడీ’ అనే వార్త షికారులో ఉంది. దీని గురించి మంజిమా ఘాటుగా స్పందించారు. ‘‘ప్రేక్షకుల అభిరుచుల్లో గతానికి ఇప్పటికీ తేడా వచ్చింది. గ్లామర్– అశ్లీలానికి తేడా వాళ్లకు తెలుసు. అందాల ప్రదర్శనకే ఇష్టపడని నేను లిప్ లాక్ సీన్లు చేస్తానని ఎలా చెబుతాను? అలాంటివి చేస్తేనే అవకాశాలు వస్తాయంటే సినిమాలు మానేసి ఇంట్లో కూర్చోవడానికి సిద్ధమే’’ అన్నారామె. -
మమ్మల్ని అలా చూడాలనుకోరు.. అమ్మడు!
మమ్మల్ని అలా చూడాలనుకుంటున్నారనడం చాలా తప్పు అంటోంది నటి మంజిమామోహన్. అచ్చంయన్బదు మడమయడా చిత్రం ద్వారా సంచలన నటుడు శింబుకు హీరోయిన్గా కోలీవుడ్‌కు దిగుమతి అయిన కేరళా కుట్టి మంజిమామోహన్. మాతృభాషలో ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రంతో హీరోయిన్గా రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు ఇప్పుడు తమిళంలో బిజీ నాయకిగా మారింది. ఈ భామను దర్శకుడు గౌతమ్‌మీనన్ ఏక్ ధమ్న తమిళం, తెలుగు భాషల్లో నాయకిని చేసేశారు. ప్రస్తుతం విక్రమ్‌ప్రభుకు జంటగా నటిస్తున్న క్షత్రియన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండగా, తాజాగా ఉదయనిధిస్టాలిన్‌తో ఇప్పడై వెల్లుమ్ చిత్రంలో నటిస్తోంది. ఈ అమ్మడికి ఫేస్బుక్లో అభిమానుల ఫాలోయింగ్ అధికంగానే ఉందట.అయితే అందరూ ఒకలా ఉండరు కదా ఒక తుంటరి హీరోయిన్లను నగ్నంగా చూడడానికే ప్రేక్షకులు ఆసక్తి చూపుతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట.అంతే అతని మాటలకు మంజిమామోహన్‌కు కోపం కట్టలు తెంచుకొచ్చిందట.అంతే అదే ఫేస్బుక్లో అతన్ని చెడామడా తిట్టేసిందట. దీంతో ఆ వ్యక్తి తన ఫేస్బుక్ అకౌంట్‌నే క్లోజ్ చేసేశాడట. దీని గురించి నటి మంజిమామోహన్ తెలుపుతూ ప్రేక్షకుడు హీరోయిన్లను నగ్నంగా చూడడానికి థియేటర్లకు వస్తారనడం చాలా తప్పు అని, అదే విధంగా అరకొర దుస్తుల్లో చూడాలని ప్రేక్షకులు కోరుకోరని అంది. మంచి కథా చిత్రాలను చూడడానికే వారు ఆసక్తి చూపుతారని పేర్కొంది. ఈ అమ్మడి అభిప్రాయాన్ని చాలా మంది అభిమానులు లైక్ చేస్తూ అవును మంచి కథా చిత్రాలను చూడాలనే తాము ఆశిస్తున్నామని, కథానాయికల్ని కురచ దుస్తుల్లో చూడాలనుకోవడం లేదని అంటున్నారట. మొత్తం మీద నటి మంజిమామోహన్ ఇలా కూడా ప్రచారం పొందేస్తోంది. -
విక్రమ్‌తో రొమాన్స్‌కు రెడీ
సియాన్ విక్రమ్‌తో రొమాన్స్ చేయడానికి మాలీవుడ్ బ్యూటీ మంజిమామోహన్ రెడీ అవుతున్నారన్నది తాజా వార్త. ఈ అమ్మడికి కోలీవుడ్‌లో అవకాశాలు వరస కడుతున్నాయి. మలయాళంలో ఒకటి రెండు చిత్రాలు చేసిన కథానాయికలకు కోలీవుడ్‌లో మంచి గిరాకీ ఏర్పడడం అన్నది చాలా కాలం నుంచే జరుగుతోంది. అసిన్, నయనతార లాంటి వారంతా ఈ కోవకు చెందిన వారే. తాజాగా మంజిమామోహన్ చేరారు.శింబుకు జంటగా అచ్చంఎన్భదు మడమైయడా చిత్రంతో తమిళ చిత్రరంగ ప్రవేశం చేసిన మంజిమామోహన్‌ను ఆదిలోనే చాలా మంది భయపెట్టారు. అయినా ధైర్యం చేసి ఆయనతో నటించడానికి సిద్ధమయ్యారు. ఆ చిత్రం కూడా పలు ఆటంకాల మధ్య చిత్రీకరణను పూర్తి చేసుకోవడంతో మంజిమామోహన్ గురించి రకరకాల ప్రచారం జరిగింది. అచ్చంఎన్భదు మడమైయడా చిత్రం షూటింగ్లో ఉండగానే విక్రమ్‌ప్రభుకు జంటగా ముడిచూడమన్నన్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో టక్కున ఆ చిత్రాన్ని అంగీకరించారు. శింబు చిత్రం షూటింగ్ జాప్యం కావడంతో మంజిమామీనన్‌కు ముడిచూడ మన్నన్ చిత్రమే మొదట విడుదలవుతుందనుకున్నారు. అయితే గౌతమ్‌మీనన్, శింబుల మధ్య మనస్పర్థలు తొలగడంతో అచ్చంఎన్భదు మడమైయడా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ముందుగా తెరపైకి వచ్చి మంచి ప్రజాదరణ పొందింది. తొలి చిత్రమే శుభారంభాన్నివ్వడంతో మంజిమామోహన్ లక్కీ నాయకి అయిపోయారు. అంతే కాదు శింబు చాలా స్వీట్ పర్సన్ అంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం ముడిచూడ మన్నన్ చిత్రంతో పాటు గౌరవ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్‌తో ఒక చిత్రం చేస్తున్నారు. తాజాగా సియాన్ విక్రమ్‌తో నటించే లక్కీఛాన్స్ మంజిమామోహన్‌ను వరించింది. ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత విక్రమ్ వాలు చిత్రం ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు కీర్తీసురేశ్, సాయిపల్లవి, మంజిమామోహన్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే కీర్తీసురేశ్ ఇప్పటికే చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. నటి సాయిపల్లవి అడిగిన పారితోషికం దర్శక నిర్మాతలకు ముచ్చెమటలు పట్టించిందట. చివరిగా విక్రమ్‌తో నటించే అవకాశం నటి మంజిమామోహన్‌ను వరించింది. దీంతో నటి కీర్తీసురేశ్‌కు మంజిమామోహన్ పోటీగా తయారవుతున్నారనే టాక్ కోలీవుడ్‌లో హాట్‌హాట్‌గా సాగుతోంది. -
వీఐపీ 2లో ముగ్గురు భామలు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఈ ఏడాది రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ స్టార్ హీరో తొడరితో నిరాశపరిచినా., కోడి సినిమాతో సూపర్ హిట్ కొట్టి సత్తా చాటాడు. ఇప్పుడు అదే జోరు మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే గౌతమ్ మీనన్, వెట్రీమారన్ లాంటి దర్శకులతో సినిమాలు ప్రారంభించిన ధనుష్, తన మరదలు సౌందర్య దర్శకత్వంలోనూ మరో సినిమాను స్టార్ చేస్తున్నాడు. ధనుష్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచిన వీఐపీ సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వీఐపీ సినిమా తొలి భాగంలో నటించిన అమలా పాల్‌తో పాటు కాజల్ అగర్వాల్, మంజిమా మోహన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
విజయ్‌కు గాలం వేస్తున్న యువనటి
విజయాలు ఎన్ని అందుకున్నా స్టార్డమ్ రావాలంటే స్టార్ హీరోలతో రొమాన్స్ చేయాల్సిందే. అదే తారక మంత్రం అని భావించిన వర్ధమాన నాయకి మంజిమామోహన్ ఆ ప్రయత్నాల్లో పడ్డట్టు కోడంబాక్కం వర్గాల మాట. మాలీవుడ్‌లో బాల తారగా పరిచయం అయిన, ఆ తరువాత కథానాయకిగా ఎదిగిన నటి మంజిమామోహన్. దర్శకుడు గౌతమ్ మీనన్ ద్వారా అచ్చయం ఎన్బదు మడమైయడా చిత్రంతో ఒకే సారి తమిళం, తెలుగు భాషలలో(తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో) పరిచయమైంది. ఈ చిత్రం రెండు భాషల్లోనూ ప్రేక్షకాదరణ పొందడంతో మంజిమామోహన్‌కు మంచి గుర్తింపే లభించింది. కాగా ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌ప్రభుకు జంటగా ముడిచూడ మన్నన్ చిత్రంలో నటిస్తోంది. తదుపరి గౌరవ్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇలా కోలీవుడ్‌లో పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో నటి కీర్తీసురేశ్‌కు పోటీగా మారాలన్న కోరుకుంటున్నట్లు సమాచారం. అంతే కాదు అందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. అందులో భాగంగా ప్రముఖ కథానాయకులతో నటించే అవకాశాల వేట మొదలెట్టినట్లు తెలిసింది. ఇటీవల ఒక భేటీలో తనకు నటుడు ఇళయదళపతి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనీ, తానాయన వీరాభిమానినని చెప్పి ఆయన దృష్టి తనపై పడే ప్రయత్నం చేసింది. అదే విధంగా ఆయనతో చిత్రం చేస్తున్న అట్లీ తదితర దర్శకులను కలిసి అవకాశాలు అడుగుతున్నారు. మరి ఈ మాలీవుడ్ భామ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. -
'సాహసం శ్వాసగా సాగిపో' మూవీ రివ్యూ
టైటిల్ : సాహసం శ్వాసగా సాగిపో జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్ తారాగణం : నాగచైతన్య, మంజిమా మోహన్, బాబాసెహగల్, సతీష్ కృష్ణన్ సంగీతం : ఏ ఆర్ రెహమాన్ దర్శకత్వం : గౌతమ్ మీనన్ నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సాహసం శ్వాసగా సాగిపో. ఈ ప్రేమమ్ కన్నా ముందే రిలీజ్ కావాల్సి ఉన్నా తమిళ వర్షన్ షూటింగ్ ఆలస్యం కావటంతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే గతంలో గౌతమ్ మీనన్, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన ఏంమాయ చేసావే ఘనవిజయం సాధించటంతో సాహసం శ్వాసగా సాగిపో సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా.. కథ : రజనీకాంత్ మురళీధర్ (నాగచైతన్య).. ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైన ఉద్యోగం రాకపోవటంతో ఎంబిఏ చేస్తూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటాడు. అదే సమయంలో తన చెల్లెలి కాలేజ్ ఫంక్షన్లో లీలా సత్యమూర్తి(మంజిమా మోహన్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. తరువాత అదే అమ్మాయి కోర్సు చేయటం కోసం తన చెల్లితో కలిసి తన ఇంట్లోనే ఉండటంతో మరింత ఆనందపడిపోతాడు. కొద్ది రోజుల్లోనే లీలాతో రజనీకాంత్‌కు మంచి పరిచయం ఏర్పడుతుంది. అదే సమయంలో తాను కన్యాకుమారిలో సూర్యోదయం చూడటానికి బైక్ మీద వెళుతున్న విషయం లీలాతో చెప్తాడు రజనీకాంత్. లీలా కూడా రజనీకాంత్‌తో కలిసి కన్యాకుమారి బయలుదేరుతుంది. ఈ జర్నీలో ఇద్దరూ మరింత దగ్గరవుతారు. కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చే సమయంలో అనుకోకుండా వాళ్ల బైక్‌కు యాక్సిడెంట్ అవుతుంది. ఇక తను బతకనేమో అన్న భయంతో లీలాతో తాను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాడు రజనీకాంత్. తరువాత కళ్లు తెరిచే చూసేసరికి ఆస్పిటల్లో ఉంటాడు లీల తనతో ఉండదు. మూడు రోజుల తరువాత హస్పిటల్‌కు ఫోన్ చేసిన లీలా, తమ కుటుంబం ప్రమాదంలో ఉందని, బైక్ యాక్సిడెంట్ కూడా తనను చంపాడానికి కావాలని చేయించిందే అని చెపుతుంది. దీంతో తన ప్రేమించిన అమ్మాయికి తోడుగా నిలబడాలన్న ఆలోచనతో లీలా కోసం బయలుదేరుతాడు రజనీకాంత్. అప్పటికే లీలా తల్లిదండ్రుల మీద హత్యా ప్రయత్నం జరగటంలో వాళ్లు హాస్పిటల్లో ఉంటారు. నాగచైతన్య అక్కడ చేరుకున్న తరువాత మరోసారి లీలా, ఆమె కుటుంబం మీద ఎటాక్ జరుగుతుంది. మొదటి అప్పుడు చైతూ కాపాడిన తరువాత జరిగిన ఎటాక్‌లో లీలా కుటుంబంతో పాటు రజనీకాంత్ ఫ్రెండ్ మహేష్ కూడా చనిపోతాడు. దీంతో ఇదంతా అసలు ఎందుకు జరుగుతుంది..? వాళ్లు లీలాను ఎందుకు చంపాలనుకుంటున్నారు..? దీనికి పోలీసులు కూడా ఎందుకు సహకరిస్తున్నారు..? లాంటి విషయాలన్ని తెలుసుకోవాలనుకుంటాడు రజనీకాంత్. అందుకోసం ఏం చేశాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : ప్రేమమ్ సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్న నాగచైతన్య, మరోసారి యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో తనకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన లవర్ బాయ్ లుక్ లోనూ అలరించాడు. తనకు బాగా అలవాటైన రొమాంటిక్ క్యారెక్టర్లో మరోసారి సూపర్బ్ అనిపించిన చైతూ, ఈ సారి యాక్షన్ హీరోగా కూడా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో మంజిమా మోహన్ మెప్పించింది. డీసెంట్ లుక్‌లో కనిపిస్తూనే సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆకట్టుకుంది. నాగచైతన్య ఫ్రెండ్ మహేష్‌గా నటించిన సతీష్ కృష్ణన్, మంచి నటనతో పాటు డ్యాన్సర్ గానూ ప్రూవ్ చేసుకున్నాడు. విలన్‌గా బాబా సెహగల్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. సాంకేతిక నిపుణులు : గతంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లు, యాక్షన్ థ్రిల్లర్లు తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సారి రెండు ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. ముందు నుంచి చెపుతున్నట్టుగా ఫస్ట్ హాఫ్ అంతా హర్ట్ టచింగ్ లవ్ స్టోరీతో నడిపించిన గౌతమ్, సెకండ్ హాఫ్‌ను తన మార్క్ థ్రిల్లర్‌గా మలిచాడు. అయితే స్లో నేరేషన్, వెంట వెంటనే వచ్చే పాటలు ఫస్ట్ హాప్లో కాస్త బోర్ కొట్టిస్తాయి. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని సెంకడ్ హాఫ్ కట్టిపడేస్తుంది. బలమైన ప్రతినాయక పాత్ర లేకపోయినా మంచి యాక్షన్ సీన్స్‌తో ఆ లోటును కవర్ చేశాడు దర్శకుడు. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సినిమా రిలీజ్‌కు ముందు చకోరి, వెళ్లిపోమాకే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాలు స్థాయికి తగట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగచైతన్య ప్రీ క్లైమాక్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ స్ట్రాంగ్ విలన్ లేకపోవటం ఓవరాల్‌గా సాహసం శ్వాసగా సాగిపో.. టిపికల్ గౌతమ్ మీనన్ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రం బాగానే కనెక్ట్ అవుతుంది. - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
ముగ్గురు ముద్దుగుమ్మలతో ధనుష్
ఈ తరం హీరోయిన్లు ఒక్కరుంటేనే ఆ చిత్రంలో గ్లామర్‌కు కొరత ఉండదు. అలాంటిది ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు ఒకే చిత్రంలో పోటీపడితే, అదీ యువ స్టార్ నటుడు ధనుష్‌తో ఆ ముగ్గురూ రొమాన్స్ చేస్తే ఆ చిత్రానికి ఏర్పడే క్రేజే వేరుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఆసక్తికరమైన చిత్రమే బుధవారం చాలా నిరాడంబరంగా షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకుంది. ఇంతకీ ఈ చిత్రంలో నటించే హీరోహీరోయిన్లు ఎవరన్నది చెప్పలేదు కదూ చిన్న క్లూ ఇస్తే మీకే అర్థమైపోతుంది. అదేమిటంటే ఈ చిత్రానికి కెప్టెన్సీ బాధ్యతల్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ వారసురాలు సౌందర్య నిర్వహిస్తున్నారు. అర్థమైపోయింది కదూ’ ఎస్ ఈ క్రేజీ చిత్రం హీరో ధనుష్. ఇక ఆయనకు జంటగా నటిస్తున్న బ్యూటీస్ బాలీవుడ్ భామ సోనంకపూర్, కాజల్‌అగర్వాల్, మంజిమామోహన్. కాగా వీరిలో సోనంకపూర్ రాంజనా అనే హిందీ చిత్రంలోనూ, కాజల్‌అగర్వాల్ మారి చిత్రంలోనూ ధనుష్ సరసన నటించారు. ఇక నటి మంజిమా మోహన్ తొలిసారిగా ఆయనతో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిలవుక్కు ఎన్మేల్ ఎన్నడీ కోపం అనే టైటిల్‌ను నిర్ణయించారు. మరో విశేషం ఏమిటంటే దీనికి కథ, కథనం, మాటలను ధనుష్ సమకూర్చారు. మరో విశేషం రజనీకాంత్ కథానాయకుడిగా కబాలి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని తన వి.క్రియేషన్ పతాకంపై నిర్మించడం. రొమాంటిక్ లవ్ ఎంటర్టెయినర్గా తెరకకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. -
విశాల్‌కు జంటగా మంజిమామోహన్
చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ఘన విజయాలను సాధించిన ఎందిరన్, బాహుబలి చిత్రాలకు సీక్వెల్స్ నిర్మాణంలో ఉన్న విషయం గుర్తు చేయాల్సిన అవసరం లేదు.అదే కోవలో సండైకోళి పార్టు-2 తెరకెక్కడానికి రంగం సిద్ధమవుతోంది. విశాల్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రం సండైకోళి. మీరాజాస్మిన్ నాయకిగా నటించిన ఆ చిత్రంలో రాజ్‌కిరణ్ విశాల్‌కు తండ్రిగా ముఖ్యపాత్రను పోషించారు. లింగసామి దర్శకత్వం వహించిన సండైకోళి చిత్రం 2005లో విడుదలై పెద్దవిజయాన్నే సొంతం చేసుకుంది. సుమారు 11 ఏళ్ల తరువాత ఆ చిత్రానికి సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి సండైకోళి-2 చిత్రం రెండేళ్ల క్రితమే ప్రారంభం కావలసింది. అప్పట్లో దర్శకుడు లింగసామి ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొనడం, నటుడు విశాల్‌తో భేదాభిప్రాయాలు వంటి కారణాలతో చిత్రం వాయిదా పడింది. అసలు జరుగుతుందా? ఆగిపోతుందా? అన్న మీమాంస పరిస్థితుల్లో ఇటీవల లింగుసామి, విశాల్‌ల మధ్య పొరపొచ్చాలు తొలగిపోవడంతో సండైకోళి-2 చిత్రం పట్టాలెక్కనుంది. సండైకోళి చిత్రంలో నాయకిగా నటించిన మీరాజాస్మిన్ పార్టు-2లోనూ నటించనున్నారు.అయితే ఇందులో విశాల్‌ను కాకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకుని సంసారం చేసే స్త్రీగా నటించనున్నట్లు సమాచారం. ఇక రాజ్‌కిరణ్ విశాల్ తండ్రిగానే నటించనున్నారట. ఇకపోతే ఇందులో కథానాయకి కోసం చాలా మందిని అనుకున్నా చివరికి మలయాళ లక్కీగర్ల్ మాం. మంజిమామోహన్ ఆ అవకాశాన్ని దక్కించుకున్నట్లు తాజా సమాచారం. ఈ బ్యూటీ ఇప్పటికే శింబు సరసన అచ్చయంబదు మడమయడా చిత్రంలో నటించారు. ప్రస్తుతం ముడి సూడామన్నన్ చిత్రంలో నటిస్తున్న మంజిమామీనన్ త్వరలో విష్ణువిశాల్‌తో ఒక చిత్రంలో నటించనున్నారు.ఇక నాగచైతన్యకు జంటగాా సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంలో నటిస్తూ అటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా సండైకోళి-2లో విశాల్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. దర్శకుడు లింగుసామి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో అల్లుఅర్జున్‌తో తమిళం, తెలుగు భాషల్లో ఒక చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీని తరువాతనే సండైకోళి-2 పై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. అదే విధంగా విశాల్ ప్రస్తుతం కత్తిసండై, తుప్పరివాలన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటిని పూర్తి చేసిన తరువాతనే సండైకోళి-2లో నటించే అవకాశం ఉంది. -
విష్ణువిశాల్‌కు జతగా మంజిమామోహన్
నటుడు విష్ణువిశాల్ మంచి జోష్‌లో ఉన్నారు. కారణం తెలిసిందే. తాను నిర్మాతగా మారి కథానాయకుడిగా నటించిన వేలైన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ యువ హీరో తాజా చిత్రానికి సిద్ధమయ్యారు.తనకు హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో చాలా కాలం తరువాత నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. సుశీంద్రన్ ఉదయనిధి స్టాలిన్, విష్ణువిశాల్‌తో మల్టీస్టారర్ చిత్రం చేయాలని మొదట భావించారు. అయితే ఆ చిత్ర నిర్మాణం అనివార్యకార్యాల వల్ల వాయిదా పడింది.దీంతో ఇప్పుడు విష్ణువిశాల్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మలయాళీ భామ మంజిమామోహన్‌ను నాయకిగా ఎంపిక చేశారు. ముఖ్య పాత్రలో నటుడు పార్తిబన్ నటించనున్నారు. ఇందులో ఈయన విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. పార్తిబన్ ఇంతకు ముందు నానుమ్ రౌడీదాన్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారన్నది గమనార్హం. ఈ చిత్ర షూటింగ్ ఆగస్ట్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారు. చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది -
విజయ్‌సేతుపతికి జతగా మంజిమా మోహన్
కేరళ కుట్టీలు కోలీవుడ్‌కు దిగుమతి అన్నది అప్రహతంగా కొనసాగుతూనే ఉంది. ఇటీవల సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం ప్రేమమ్ విజయం చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడింది. ముఖ్యంగా ఆ చిత్రంలోని నటించిన ముగ్గురు కథానాయికలకు తమిళ చిత్ర పరిశ్రమ రెడ్‌కార్పెట్‌తో ఆహ్వానించింది. ఇక అలా దక్షిణాదిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న మరో మలయాళీ బ్యూటీ మంజిమామోహన్. ఇప్పటికే శింబుకు జంట గా అచ్చంయంబ్బదు మడమయడా చిత్రంలో నటిస్తున్న ఈ భామ తెలుగులోనూ పాగా వేయనున్నారు. అక్కడ సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా తమిళంలో వరుస విజయాలతో జోరు మీదున్న విజయ్‌సేతుపతి దృష్టిలో పడ్డారు. ఈయన కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో మంజిమామోహన్‌ను హీరోయిన్గా ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేసే మంచి అవకాశాన్ని మంజిమామోహన్ వదులు కుంటుందని ఎవరూ అనుకోరు. అనేగన్ చిత్రం తరువాత కేవీ.ఆనంద్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ఇది. అనేగన్ చిత్రాన్ని నిర్మించిన ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థనే ఈ చిత్రాన్ని రూపొందించనుంది. ప్రస్తుతం రెక్క చిత్రంలో నటిస్తున్న విజయ్‌సేతుపతి తదుపరి ఈ చిత్రానికి కాల్షీట్స్ ఇచ్చారని తెలిసింది. దీనికి హిప్ హాప్ తమిళా సంగీతాన్ని అందించనున్నారు. ఇక కేవీ.ఆనంద్ ఆస్థాన రచయితల ద్వయం శుభ కథ, కథనం, మాటలను అందిస్తున్నారు. -
లీల మాయలో..!
ఫ్రెండ్స్‌తో సరదాగా హాయిగా తిరిగే ఆ కుర్రాణ్ణి ప్రేమలో పడేసిందో చిన్నది. ఆమె పేరు లీల. పేరుకు తగ్గట్టే తన అందంతో అతణ్ణి మాయ చేసింది. అసలే చెల్లి వాళ్ల ఫ్రెండ్. ప్రేమగా ఆమెతో మాటలు కలిపాడు. మరి అతని ప్రేమ ఎన్ని మలుపులు తిరిగిందనే కథాంశంతో లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ‘ఏ మాయచేశావే’ తర్వాత నాగచైతన్య హీరోగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. రచయిత కోన వెంకట్ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంజిమా మోహన్ కథానాయిక. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను టర్కీలో చిత్రీకరించారు. ఈ నెల 16 నుంచి 20 వరకూ జరిగే షూటింగ్‌తో ఈ సినిమా పూర్తవుతుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ- ‘‘ఎ.ఆర్. రెహ్మాన్ వినసొంపైన పాటలు అందించారు. ఇటీవల యూ-ట్యూబ్‌లో విడుదల చేసిన ‘ఎల్లిపోమాకే...ఎదనే వదిలి పోమాకే’ పాట ఇప్పటికే హిట్ అయింది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డెక్మాక్ ఆర్థర్, ఆర్ట్: రాజీవన్.