జీవాకి జోడీగా.. | Manjima Mohan To Pair Up With Jeeva | Sakshi
Sakshi News home page

జీవాకి జోడీగా..

Published Tue, Dec 4 2018 12:28 AM | Last Updated on Tue, Dec 4 2018 10:40 AM

Manjima Mohan To Pair Up With Jeeva - Sakshi

‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో జీవా. ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు మలయాళ బ్యూటీ మంజిమా మోహన్‌. ఈ ఇద్దరూ ఇప్పుడు ఓ తమిళ సినిమా కోసం జోడీ కడుతున్నారు. ఈ చిత్రాన్ని జీవా సోదరుడు, హీరో జితన్‌ రమేశ్‌ నిర్మిస్తుండటం విశేషం. సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మాప్పిళై సింగం’ సినిమా ఫేమ్‌ రాజశేఖర్‌ దర్శకత్వం వహించనున్నారు.

శింబు హీరోగా నటించిన ‘అచ్చమ్‌ ఎన్బదు మడమయడా’ సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మంజిమా మోహన్‌ ఆ తర్వాత మరో రెండు తమిళ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు జీవాకి జోడీగా నటించేందుకు ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ‘‘జీవా, అరుళ్‌ని«థి కలిసి నటించనున్న మల్టీస్టారర్‌ చిత్రంలో జీవాకి జోడీగా మంజిమ నటిస్తారు. స్నేహం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 13న షూటింగ్‌ ప్రారంభించనున్నాం’’ అని జితన్‌ రమేశ్‌ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, కెమెరా: అభినందన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement