Jeeva
-
సజీవ సమాధికి స్వామీజీ యత్నం
మద్దూరు: ఓ స్వామీజీ ఐదురోజులు సమాధికి ప్రయత్నించగా.. విషయం తెలుసుకున్న పోలీసులు నిలువరించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనివట్లలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రెనివట్ల గ్రామానికి చెందిన సత్యానందస్వామి అలియాస్ హనుమంతు కొద్దిరోజులుగా వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడిగా చెలామణి అవుతున్నాడు. ఈయన భార్య ఏడాది క్రితం పొలంలో ఎద్దు పొడవడంతో మృతిచెందింది. దీంతో ఆమెకు పొలంలోనే సమాధి కట్టించి పూజిస్తున్నాడు.అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కొంతమందిని శిష్యులుగా చేసుకున్నాడు. శుక్రవారం అమావాస్య రోజున ‘తాను ఐదు రోజులు సమాధిలోకి వెళతానని.. బయట అఖండభజనలు చేయాలని’ భక్తులకు చెప్పి సమాధిలోకి వెళ్లాడు. ఆదివారం ఉదయం విషయం పోలీసులకు తెలియడంతో డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో అక్కడకు చేరుకొని సమాధిలో ఉన్న స్వామీజీని బయటకు రప్పించారు. అనంతరం డాక్టర్ స్వామీజీకి వైద్య పరీక్షలు చేయగా, ఆర్యోగం నిలకడగా ఉంది. కొన్నేళ్ల క్రితం స్వగృహంలోనే ఒక అమావాస్య రోజు హనుమంతు మౌనదీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే కర్ణాటక చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు వస్తుండటంతో సొంత పొలంలోనే జీవ సమాధి కోసం ఒక ఆలయం నిర్మించినట్టు గ్రామస్తులు చెప్పారు. -
మహానేత వైఎస్ఆర్, వైఎస్ జగన్‌లపై రూపొందిన బయోపిక్
-
'యాత్ర 2'లో ఆ భావోద్వేగాలే చూపించాను: డైరెక్టర్ మహి
‘‘యాత్ర 2’లోని పాత్రలు ఎవర్నీ కించపరిచేలా ఉండవు. ఏ పార్టీనీ విలన్‌గా చూపించలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిగారి మరణం తర్వాత ఇచ్చిన మాట కోసం (ఓదార్పు యాత్ర) కొడుకుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు చేసిన భావోద్వేగ ప్రయాణాన్ని మాత్రమే చూపించాను’’ అన్నారు దర్శకుడు మహి వి. రాఘవ్. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో మహి వి. రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వైఎస్ఆర్ పాత్రను మమ్ముట్టి చేయగా, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా, వైఎస్ భారతీ రెడ్డి పాత్రలో కేతకీ నారాయణ్ నటించారు. త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యూలాయిడ్‌తో కలసి శివ మేక నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మహి వి. రాఘవ్ మాట్లాడుతూ– ‘‘మమ్ముట్టిగారు, జీవా, కేతకి, శివ మేక, నేను, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, కెమెరామేన్ మది.. ఇలా యూనిట్ అందరి వల్లే ‘యాత్ర 2’ బాగా వచ్చింది. జీవా అద్భుతమైన నటుడు. జగన్ అన్న పాత్రకి న్యాయం చేయగలడనే నమ్మకంతో ఎంచుకున్నాను. తెలుగు రాకపోయినా డైలాగ్స్ నేర్చుకుని అంకితభావంతో చేశాడు. ‘యాత్ర 2’ కథ, ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాను ఎలా తీశాం, ఏ భావోద్వేగాలతో నడిపించామన్నది ఎవరికీ తెలియదు. టీజర్, ట్రైలర్లో చూసిన ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్, ప్రజలకు తెలియని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయి. ఈ మూవీలో వైఎస్ఆర్గారి మరణానికి సంబంధించిన కారణాలు చూపించలేదు. జగన్‌గారు ఢిల్లీ పెద్దలను ఎదిరించడం, సీఎం అయిపోవడం అనేది నా కథ కాదు. ఒక పాత్రని హీరో చేయడం కోసం ఇంకో పాత్రను తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు. మనమంటే గిట్టనివారు మనపై రాళ్లు వేస్తుంటారు.. బురద జల్లుతుంటారు.. అలాంటి వారిని పట్టించుకోకపోవడమే మంచిది’’ అన్నారు. జీవా మాట్లాడుతూ– ‘‘మహీగారు నాకు కథ చెప్పి, వైఎస్ జగన్‌గారి పాత్ర అన్నప్పుడు షాక్ అయ్యాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నాకు అవగాహన లేదు. కానీ జగన్‌గారి పాత్ర చేయడం బాధ్యతగా అనిపించింది. జగన్‌గారు ఎలా మాట్లాడతారు? ఎలా నడుస్తారు? అని వీడియోలు చూసి తెలుసుకున్నాను. మహీగారు ఈ పాత్రకు నన్ను ఓకే చేయడానికే చాలా టైమ్ తీసుకున్నారు. తొలి సన్నివేశం ఆయన ఓకే చెప్పడంతో నాకు పెద్ద ఉపశమనం అనిపించింది. నేను ఇప్పటివరకూ వైఎస్ జగన్‌గారిని కలవలేదు.. కలిసే చాన్స్ వస్తే వదులుకోను. ‘యాత్ర 2’ విడుదల తర్వాత జగన్‌గారు మమ్మల్ని పిలిచి, అభినందిస్తారనే నమ్మకం ఉంది. ‘యాత్ర 2’ చేస్తున్నప్పుడు ప్రతిపక్షాల నుంచి నాకెలాంటి బెదిరింపు కాల్స్ రాలేదు. అయితే ‘యాత్ర’ చేస్తున్నప్పుడు మీకేమైనా అలాంటి కాల్స్ వచ్చాయా? అని మమ్ముట్టిగారిని అడిగాను. ‘మనం యాక్టర్స్.. ఇది క్రియేటివ్ స్పేస్.. దీన్ని కేవలం సినిమాలానే చూడు’ అని ఆయన చెప్పారు. ఈ మూవీలోని ‘చూడు నాన్నా’ పాట తీస్తున్నప్పుడు చాలా ఎమోషన్‌కు లోనయ్యాను. పులివెందులలో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడి ప్రజల ప్రేమ, అభిమానం మరచిపోలేను. నా కెరీర్లో ‘యాత్ర 2’ తప్పకుండా ఓ మైలురాయిగా నిలుస్తుందని కచ్చితంగా చెప్పగలను’’ అన్నారు. కేతకీ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘నేను మరాఠీ, హిందీ సినిమాలు చేశాను. తెలుగులో ‘యాత్ర 2’ నా మొదటి చిత్రం. తొలిసారి ఓ రియల్ పాత్ర చేశాను. పాత్రకు తగ్గ భావోద్వేగాలు పండించాను. పులివెందులలో షూటింగ్ చేసినప్పుడు అక్కడి మహిళలు నన్ను హత్తుకుని ఆ΄్యాయతతో మాట్లాడారు. అప్పుడు ఆ పాత్రలోని ఇంటెన్సిటీ నాకు అర్థమైంది’’ అన్నారు. -
నేను విన్నాను...
‘‘నా బిడ్డకు పుట్టుకతోనే చెవుడు ఉందన్నా.. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు.. అన్నా.. మాకంత స్తోమత లేదు (ఓ పాత్రధారి). మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్‌కి ఒక మనిషి మీద నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం.. ఐ డోంట్ థింక్.. ఇట్స్ రైట్ సార్ (మరో పాత్రధారి)... నువ్వు చెప్పింది కరెక్ట్నే అయ్యా.. నాకు అర్థమైంది. కానీ మనం చేయలేమనే మాట ఈ పాపకు అర్థమయ్యేలా చెప్పు (మమ్ముట్టి) అనే సీన్‌తో మొదలైంది ‘యాత్ర 2’ సినిమా టీజర్. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు, పేదల కోసం వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర 2’. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన ‘యాత్ర’కు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ వస్తోంది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు. మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ (శుభలేక సుధాకర్) ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఈ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను, నేను విన్నాను... నేనున్నాను (జీవా) అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
Yatra 2 Movie Trailer: ‘యాత్ర 2’ ట్రైలర్ వచ్చేసింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. (చదవండి: యాత్ర 2' ట్రైలర్.. అంచనాలు పెంచేస్తున్న ఈ డైలాగ్స్) వైఎస్సార్, ఆయన తనయుడి జీవితంలో జరిగిన యథార్థంగా జరిగిన సంఘటనలే ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాత్ర-2 టీజర్, సాంగ్స్ సినీ ప్రేక్షకులతో పాటు వైఎస్సార్ అభిమానుల గుండెలను తాకాయి. తాజాగా యాత్రా 2 నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘పుట్టుకతోనే చెవుడు ఉంది అన్న.. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషిన్ పెడితే వినబడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పారు. అన్నా.. మాకు అంత స్థోమత లేదు’ అని ఓ సామాన్యురాలు తన కూతురికి గురించి సీఎం వైఎస్సార్(మమ్ముట్టి)కి చెప్పే సీన్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. వైఎస్సార్ మరణం.. జగన్ ఓదార్పు యాత్రకు అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ చేసే కుట్రలు.. పార్టీ పెట్టిన తర్వాత జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన మద్దతు..ఇవన్నీ ట్రైలర్లో హృదయాలను హత్తుకునేలా చూపించారు. ఇక చివర్లో ఓ అంధుడు ‘నువ్వు మా వైఎస్సార్ కొడుకువు అన్నా..మాకు నాయకుడిగా నిలబడు అన్నా’అని అనగా..నేను విన్నాను..నేను ఉన్నాను’ అని జగన్(జీవా) చెప్పే డైలాగ్‌తో ఎమోషనల్‌గా ట్రైలర్ ముగిసింది. దేశంలో ఇప్పటి వరకు ఎందరో ప్రముఖలు జీవితాలపై బయోపిక్‌లుగా పలు చిత్రాలు వచ్చాయి.. వాటంన్నింటికీ దక్కని క్రేజ్ యాత్ర సీక్వెల్ చిత్రాలకు దక్కింది. ఇంతలా యాత్ర-2కు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్‌ను అంతే స్థాయిలో పొయెటిక్‌గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్ మహి కే సాధ్యమైంది. ఆందుకే ఆయన నిజ జీవితాన్ని మరొకసారి వెండితెరపై చూసేందుకు కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
యాత్ర-2 నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్
యాత్ర -2 నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకింది. ఆ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'చూడు నాన్న' వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర-2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి వీడియో సాంగ్ రిలీజ్ అయింది. 'చూడు నాన్న' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఎమోషన్స్‌తో కూడిన సంగీతాన్ని అందించారు. ఈ పాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవా తనదైన నటనతో మెప్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈపాట ఉండటంతో అందరినీ మెప్పిస్తుంది. తండ్రి మరణంతో మొదటిసారి ప్రజల్లో అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకే వేలాదిగా జనాలు వచ్చారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను పాటలో చూపించారు డైరెక్టర్ మహి వి రాఘవ్. -
మార్కెటింగ్ స్కామ్ నేపథ్యంలో ‘గ్యాంగ్ స్టర్’
గ్రానైట్ స్లాబులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ వ్యాపార రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత వేలు మురుగన్. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్ స్టర్’. రామ్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి నెలలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వేలు మురుగన్ మాట్లాడుతూ మార్కెటింగ్ స్కామ్ అనే నూతన పాయింట్ పై సినిమా అంతా నడుస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి పాయింట్ పై సినిమా రాలేదని చెప్పాలి. ఇందులో హీరోలు ఎవరు? విలన్స్ ఎవరు? అనేది క్లైమాక్స్ వరకు తెలియదు. ప్రతి పాత్ర ఎంతో ఇంట్రస్టింగ్ గా క్యూరియాసిటీ కలిగించే విధంగా ఉంటుంది. దర్శకుడు రామ్ ప్రభ సినిమాను ఎంతో ఇంట్రస్టింగ్ గా తెరకెక్కించారు. ప్రజిన్ పద్మనాభన్ , జీవా మరియు విజయ్ విశ్వ ముఖ్య పాత్రలో నటించారు. అలాగే సాయిధన్య, మోహన సిద్ధి, షాలిని హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నాం. ముగ్గురు కూడా అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటారు. ఆర్టిస్టులందరూ తమ పాత్రలకు తగ్గట్టుగా పోటీపడుతూ నటించారు. కచ్చితంగా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ గ్యాంగ్ స్టర్ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది అనడంలో సందేహం లేదు’ అన్నారు. -
Yatra 2 Teaser: రిలీజైన 'యాత్ర 2' టీజర్
'యాత్ర 2' సినిమా టీజర్ వచ్చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. అయితే ఏయే సంఘటనల ఆధారంగా తీశారనేది మొన్నటివరకు కాస్త సందేహం ఉండేది. తాజాగా వచ్చిన టీజర్‌తో సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అలానే అంచనాలు కూడా పెరిగిపోయాయి. టీజర్లో ఏముంది? వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్నహార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అలానే తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఆ అడ్డంకులని జగన్ ఎలా అధిగమించారు? తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారనేదే 'యాత్ర 2' సినిమా. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) గూస్బంప్స్ సీన్స్ ఈ టీజర్లో ఓ చోట.. 'ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించినా.. జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్' అని సోనియాగాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్.. 'చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న' అనే మరో సీన్.. 'నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకుమించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా 'యాత్ర 2' సినిమా తీశారు డైరెక్టర్ మహి వి రాఘవ. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. ఈ ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. (ఇదీ చదవండి: OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!) -
టీజర్ రెడీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘యాత్ర 2’ ఉంటుంది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. మహీ వి. రాఘవ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 5న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించి, ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘‘ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి’’ అంటూ ‘యాత్ర 2’ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్‌ను షేర్ చేసింది యూనిట్. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్‌తో కలిసి శివ మేక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
యాత్ర 2 టీజర్ వచ్చేస్తోంది!
‘యాత్ర’మూవీకి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. (చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న చిన్నారుల బాధ.. భారీ సాయం చేసిన హీరో) ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే హీరో జీవా లుక్‌తో పాటు వైఎస్ భారతీ పాత్ర పోషిస్తున్న మరాఠీ నటి కేతకి నారాయణన్ లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. జనవరి 5న యాత్ర 2 టీజర్ రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ.. మమ్ముట్టి, జీవాలకు సంబంధించిన కొత్త పోస్టర్ని విడుదల చేసింది. View this post on Instagram A post shared by Mahi V Raghav (@mahivraghav) -
Yatra 2: పవర్ఫుల్ డైలాగ్‌తో సీఎం జగన్ లుక్ రిలీజ్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ యాత్ర. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర 2. ఇందులో వైఎస్సార్ తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని చూపించబోతున్నారు. గురువారం (డిసెంబర్ 21) వైఎస్ జగన్ బర్త్‌డేను పురస్కరించుకుని యాత్ర 2 నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. 'నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని' అని పవర్ఫుల్ డైలాగ్‌ను పోస్టర్లో జత చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా వైఎస్ జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు. 'యాత్ర' ఫేమ్ మహి వి రాఘవ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదల చేయనున్నారు. They thought it was his end, and he knew it was just the beginning! Wishing @ysjagan garu a very Happy birthday. Cant wait to tell your story to the world through our lens.#Yatra2 in cinemas from Feb 8, 2024.#HBDYSJagan #LegacyLivesOn #Yatra2OnFeb8th pic.twitter.com/oo51ZKUEVR — Mahi Vraghav (@MahiVraghav) December 21, 2023 Rule 1. A character is defined by what he does and not what he speaks Rule 2. A true test of a character is revealed in a crisis Both these rules apply not only in screen writing but even in real life. @ysjagan is born out of a crisis and lives by his actions, not words.… pic.twitter.com/UOhDouAH5c — Mahi Vraghav (@MahiVraghav) December 21, 2023 చదవండి: PVR మల్టీప్లెక్స్‌లను బాయ్‌కాట్ చేసిన సలార్.. కారణం 'డంకీ' సినిమానే -
Yatra 2 Movie: పవర్ఫుల్ డైలాగ్‌తో వైఎస్ భారతి లుక్ రిలీజ్
యాత్ర’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సూపర్‌హిట్ మూవీ ‘యాత్ర’కి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మహి. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మరాఠీ నటి కేతకి నారాయణన్ నటిస్తోంది. నేడు(డిసెంబర్ 9) వైఎస్ భారతి పుట్టినరోజు. ఈ సందర్భంగా యాత్ర 2 మూవీలో ఆమె క్యారెక్టర్ లుక్ పోస్టర్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌పై ‘నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్లకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడటం కూడా నేర్పించలేదు.’ అని భారతి పాత్ర చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌ని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. యాత్ర’ చిత్రాన్ని ఫిబ్రవరి 8, 2019లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. A resilient force behind the rise of a leader! Presenting @KetakiNarayan as #YSBharathi from #Yatra2. In cinemas from 8th Feb, 2024.#HBDYSBharathiGaru #Yatra2OnFeb8th #LegacyLivesOn @ShivaMeka @MahiVraghav @vcelluloidsoffl @3alproduction pic.twitter.com/KdhUuB47wA — Mahi Vraghav (@MahiVraghav) December 9, 2023 -
యాత్రలో జర్మనీ నటి సుజానే
‘యాత్ర’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్రని జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహి వి. రాఘవ్ మాట్లాడుతూ–‘‘యాత్ర’కి కొనసాగింపుగా ‘యాత్ర 2’ రూపొందుతోంది. వైఎస్ జగన్‌గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనలను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ‘యాత్ర 2’ని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్ నారాయణన్. -
ఒక్కటి గుర్తు పెట్టుకోండి!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. 2019 ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘యాత్ర 2’ మూవీని తెరకెక్కిస్తున్నారు మహి వి.రాఘవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ‘యాత్ర’లో వైఎస్ఆర్ పాత్ర పోషించిన మమ్ముట్టి ‘యాత్ర 2’ లోనూ అదే పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలోని వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘నేనెవరో ఇంకా ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి... నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అనే అనే డైలాగ్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఉన్నాయి. మహి వి.రాఘవ్ మాట్లాడుతూ–‘‘వైఎస్ జగన్‌గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ రూపొందుతోంది. ఈ సినిమాని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్ నారాయణన్. -
Yatra 2 Update: ఒక్కటి గుర్తు పెట్టుకోండి!
‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అంటూ ‘యాత్ర 2’ సినిమా పోస్టర్ని విడుదల చేసింది చిత్రయూనిట్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ (2019) సినిమా మంచి విజయం అందుకుంది. ‘యాత్ర’ కి సీక్వెల్‌గా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్‌తో ‘యాత్ర 2’ ఉంటుందని మహీ వి.రాఘవ్ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ అప్డేట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే వారం ముందే అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది చిత్రయూనిట్. మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో వి.సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మించనున్న ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ని విడుదల చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. ఇందులో జగన్ పాత్రలో ‘రంగం’ మూవీ ఫేమ్ జీవా నటించనున్నారు. ఆగస్టు 3 నుంచి ‘యాత్ర 2’ షూటింగ్ మొదలవుతుంది. -
వైఎస్ జగన్ పాత్రలో జీవా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌తో ‘యాత్ర’ (2019) సినిమాని తెరకెక్కించిన దర్శకుడు మహీ వి. రాఘవ్ ప్రస్తుతం ‘యాత్ర 2’కి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో జీవాను జగన్ మోహన్ రెడ్డి పాత్రకు సంప్రదించారు మహీ. ఈ చిత్రంలో నటించడానికి జీవా సుముఖత వ్యక్తపరిచారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. జగన్ పాదయాత్ర నుంచి ప్రారంభమై సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ సినిమా ముగుస్తుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 3న మొదలవుతుంది. 2024 ఫిబ్రవరిలో ‘యాత్ర 2’ సినిమా విడుదల కానుంది. కాగా మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. -
లక్నో కోర్టు ఆవరణలో గ్యాంగ్‌స్టర్ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సివిల్ కోర్టు ఆవరణలో పట్టపగలే దారుణం జరిగింది. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ దుస్తుల్లో వచ్చిన షూటర్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో ఒక పోలీసు, ఓ మైనర్ బాలిక గాయపడ్డారని, నిందితుడిని అక్కడికక్కడే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ క్రిమినల్ కేసులో జీవాను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని లక్నో పోలీస్ కమిషనర్ ఎస్బీ శిరాద్కర్ తెలిపారు. కాల్పులు అనంతరం కోర్టు ఆవరణలో పోలీసులను భారీగా మోహరించారు. గాయపడిన కానిస్టేబుల్, బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి అనుచరుడైన జీవా (48) ముజఫర్‌నగర్ జిల్లా వాసి. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బ్రహ్మ్ దత్తా ద్వివేది హత్య కేసులో నిందితుడు. మరో 24 కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. 1997 ఫిబ్రవరిలో ఫరూఖాబాద్ జిల్లాలో ద్వివేది హత్యకు గురయ్యాడు. ద్వివేదితోపాటు అతని గన్‌మెన్ హత్య కేసులో ట్రయల్‌కోర్టు జీవాను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. కోర్టు ఆవరణలోనే కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. శాంతిభద్రతల పరిరక్షణలో, భద్రతా ఏర్పాట్లో్ల విఫలమయ్యాయని ఆరోపించారు. -
సీక్వెల్‌కు సిద్ధమవుతున్న జీవా
నటుడు జీవా తాను ఇంతకుముందు నటించిన సూపర్‌హిట్ చిత్ర సీక్వెల్‌కు సిద్ధమవుతున్నారు అనేది తాజా సమాచారం. ఈయన 2009లో కథానాయకుడిగా నటించిన చిత్రం శివ మనసుల శక్తి. రాజేష్ ఎం దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ప్రేమ, వినోదం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం యువతకు విపరీతంగా నచ్చేసింది. కాగా ఇటీవల నటుడు జీవాకు సరైన హిట్ పడలేదనే చెప్పాలి. దీంతో మళ్లీ శివ మనుషుల శక్తి చిత్రానికి సీక్వెల్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. జీవా ప్రస్తుతం గీత రచయిత పా.రంజిత్ దర్శకత్వంలో చారిత్రక కథా చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా దర్శకుడు రాజేష్ ప్రస్తుతం జయం రవి కథానాయకుడుగా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రాజేష్ నటుడు జీవా కథానాయకుడుగా శివ మనసుల శక్తి చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా దీనికి నటుడు జీవా నిర్మాతగా వ్యవహరించనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బీ.చౌదరి ఈయన తండ్రి అన్నది తెలిసిందే. తాజాగా నటుడు జీవా కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు సమాచారం. -
కనిపించని ‘జీవా’
సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ మంచినీటి సీసాల వినియోగంతో సాలీనా రూ.కోట్లలో అవుతున్న వ్యయాన్ని నియంత్రించడంతోపాటు అదనపు ఆదాయాన్ని పొందే ఉద్దేశంతో ఎంతో ఘనంగా ప్రారంభించిన ఆర్టీసీ సొంత నీటి బ్రాండ్ ఎక్కడా కానరావడం లేదు. జీవా బ్రాండ్‌ను ఆర్టీసీ నెలన్నర క్రితం ఎంతో అట్టహాసంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంజీబీఎస్‌లో కార్పొరేట్ పద్ధతిలో ఆ బ్రాండ్‌ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు ఆరు నెలలు శ్రమించి రెండు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈ నీటిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ కృషి చేసింది. కానీ ఇప్పటివరకు ఇటు బస్టాండ్లలో కాని, ఆర్టీసీ బస్సుల్లో కానీ ఎక్కడా అది కనిపించటం లేదు. ఇప్పటికీ ప్రైవేటు బ్రాండెడ్ నీటినే వినియోగిస్తున్నారు. భారీగా వ్యయం చేయటంతోపాటు ప్రసార మాధ్యమాల ద్వారా ముమ్మరంగా ప్రచారం జరిగి ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొన్న తర్వాత ఆ బ్రాండ్ కనిపించకపోవటం విశేషం. ♦ కేవలం బస్టాండ్లలోని దుకాణాల్లోనే కాకుండా క్రమంగా, మార్కెట్లోని ఇతర దుకాణాల్లో కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని నిర్ణయించారు. కానీ మార్కెట్లోని దుకాణాల్లో కాదు కదా కనీసం ఆర్టీసీ బస్సుల్లో కూడా అవి కనిపించడం లేదు. ఇక ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో అధికారులకు కూడా అవి అందుబాటులో లేకుండా పోయాయి. బస్సులు, ఆర్టీసీ కార్యాలయాల్లో ప్రైవేట్ బ్రాండ్ నీళ్లే.. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా 500 మి.లీ. వాటర్ బాటిళ్లను అందిస్తారు. ఆర్టీసీ సొంతంగా జీవా పేరుతో నీటిని మార్కెట్లోకి తీసుకురావటంతో, ఇక బస్సుల్లో అవే నీళ్లు పంపిణీ జరుగుతాయని ప్రచారం చేసింది. కానీ తాజాగా బస్సుల్లో పంపిణీకి ఓ బడా బ్రాండెడ్ నీటి సీసాలు పెద్ద ఎత్తున డిపోలకు చేరాయి. ఇంతకాలం స్థానికంగా తయారయ్యే ఓ బ్రాండ్ సీసాలు పంపిణీ జరుగుతుండగా, తాజాగా ఓ అంతర్జాతీయ కంపెనీకి చెందిన బ్రాండ్ సీసాలు డిపోలకు చేరాయి. ప్రైవేటు బ్రాండెడ్ కంపెనీ నుంచి నీటి సీసాల కొనుగోలుకు సాలీనా రూ.5 కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు సమాచారం. డిమాండ్ ఉన్నా కానరావడం లేదు.. ♦ ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్‌ఐవీఏ) అన్న హిబ్రూ భాష నుంచి పుట్టిన పేరును ఖరారు చేసిన ఆర్టీసీ ఆ నీటి సీసాల డిజైన్‌లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇప్పటి వరకు ఏ కంపెనీ వినియోగించని రీతిలో డైమర్ కటింగ్స్ డిజైన్ ఉన్న సీసా ఆకృతిని ఎంపిక చేసింది. చూడగానే ఆకట్టుకునేలా ఉన్నందున, ఆర్టీసీ బ్రాండ్ తోడు కావటంతో సాధారణ ప్రజలు కూడా దాని మన్నికపై నమ్మకంతో కొనే అవకాశం ఏర్పడుతుందని దీంతో ఈ నీటి విక్రయాల ద్వారా సాలీనా రూ.20 కోట్ల ఆదాయం పొందే వీలుందని ఆర్టీసీ అంచనా వేసింది. ప్రస్తుతం వేసని ప్రారంభం కావటంతో వాటర్ బాటిళ్ల విక్రయం ఊపందుకుంది. ఆర్టీసీ ప్రయాణికులు బస్టాండ్లలో నీటి సీసాలు కొని బస్కెక్కుతున్నారు. ఇలా మంచి డిమాండ్ ఉన్న సమయంలో కూడా ఆర్టీసీ నీళ్లు కనిపించడం లేదు. తయారీ కంపెనీల నిర్వాకంతోనే.. ఎంతో గొప్పగా జీవా బ్రాండ్‌ను ప్రారంభించినప్పటికీ, ఆ నీటిని, సీసాలను రూపొందించేందుకు ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల నిర్వాకం వల్లనే సమస్యలు తలెత్తాయని సమాచారం. సీసాల ఆకృతి గొప్పగా ఉన్నప్పటికీ, వాటి నాణ్యత అత్యంత తీసికట్టుగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ బ్రాండ్‌పై చెడ్డపేరు వస్తుందనే వాటి మార్కెటింగ్‌ను ఆపేసినట్టు తెలిసింది. నాణ్యమైన సీసాలు, నీళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. -
కొత్త సినిమా ప్రకటించిన హీరో జీవా
తమిళసినిమా: మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్న సంస్థగా పేరుపొందిన సంస్థ పొటాన్షియల్ స్టూడియోస్. మాయ, మానగరం, మాన్స్టర్, టాణాక్కారన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన సంస్థ ఇది. తాజాగా నటుడు జీవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నిర్మాణంలో ఉంది. ఇందులో జీవాకు సంబంధించిన పార్ట్ పూర్తి అయింది. త్వరలోనే తుది షెడ్యూల్ నిర్వహించనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలిపారు. కాగా ఇదే సంస్థలో జీవా హీరోగా మరో చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి తాన్య రవిచంద్రన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు సెల్వరాఘవన్ శిష్యుడు మణికంఠన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి గోకుల్ ఫినాయ్ చాయాగ్రహణం, నివాస్ కే.ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర పూజ కార్యక్రమాలను బుధవారం ఉదయం చెన్నైలో నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించి చెన్నై పరిసర పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు దర్శకుడు తెలిపారు. చదవండి: అందుకే నా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచాను: శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ఆత్మహత్య -
తొలి సినిమా డైరెక్టర్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
Senior Heroine Malavika Re Entry With Director Sundar C Movie: ప్రముఖ డైరెక్టర్, దివగంత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన 'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మాళవిక. శ్రీకాంత్, నవీన్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. 1999లో సుందర్. సి డైరెక్షన్లో అజిత్ హీరోగా 'ఉన్నై తేడి' మూవీతో కోలీవుడ్‌కు పరిచయమైంది మాళవిక. తర్వాత 2007లో సురేష్ మేనన్ అనే వ్యక్తిని వివాహమాడి వైవాహిక జీవితానికే పరిమితమైంది. ఇప్పుడు తాజాగా ఆమె మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. చదవండి: 'పేరెంట్స్ కోప్పడ్డారు..ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా' కోలీవుడ్‌కు ఏ డైరెక్టర్‌తో పరిచయమైందో ఆయన దర్శకత్వంలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది మాళవిక. ఈ సినిమాలో ఆమె 'మంగమ్మ' అనే పాత్రలో అలరించనుంది. ఇందులో మాళవికకు జోడిగా దర్శకుడు మనోబాలా కనిపించనున్నారు. హీరోలుగా జై, జీవా, శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్, రైజా విల్సన్, ఐశ్వర్య దత్తా హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్లో పాల్గొన్న మాళవిక ఫొటోలను సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. pic.twitter.com/VoZNpvLkRx — Manobala (@manobalam) April 2, 2022 చదవండి: ఆమె బయోపిక్‌లో నటించాలనుంది: మాళవిక మోహనన్ -
Rangam: జీవా ప్లేస్‌లో శింబు, ఫొటోలు వైరల్
సూర్య, తమన్నా జంటగా నటించిన చిత్రం 'అయాన్'. తెలుగులో వీడొక్కడే పేరుతో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దర్శకుడు కేవీ ఆనంద్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే ఆ వెంటనే 'కో' సినిమాను ప్రకటించాడు ఆనంద్. ఇది తెలుగులో 'రంగం' పేరుతో విడుదై సెన్సేషనల్ హిట్ సాధించింది. అయితే ఇక్కడో ఆసక్తికర విషయమేంటంటే ఇందులో మొదట హీరోగా అనుకుంది జీవాను కాదు శింబును! శింబుతో 'కో' సినిమా తీస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారంగా ప్రకటించింది. అంతే కాదు, ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ మొదలవుతుంది అనుకుంటున్న సమయంలో శింబు-కార్తీక నాయర్లపై ఫొటోషూట్ కూడా నిర్వహించారు. ఇక సినిమా పట్టాలెక్కే సమయానికి మాత్రం శింబు ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. దీంతో దర్శకుడు శింబు ప్లేస్‌లో యంగ్ హీరో జీవాను తీసుకోవాల్సి వచ్చింది. అయితే అనుకున్నదానికంటే ఎక్కువగా అఖండ విజయం సాధించిన ఈ సినిమా రిలీజై దాదాపు పదేళ్లు దాటిపోయింది. ఈ సమయంలో తాజాగా శింబు-కార్తీక ఫొటోషూట్‌కు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. 'కో' సినిమా చేసేందుకు శింబు రెడీ అన్నాడు. కాకపోతే హీరోయిన్గా కార్తీకకు బదులు తమన్నా కావాలని అడిగాడట. కానీ ఆ సమయంలో వరుస సక్సెస్‌లు అందుకుంటూ పెద్దమొత్తంలో పారితోషికం అందుకుంటున్న మిల్కీ బ్యూటీని ఈ ప్రాజెక్టుకు ఒప్పించడం అంత తేలిక కాదని అభిప్రాయపడ్డారు దర్శకనిర్మాతలు. తమన్నా కోరినంత రెమ్యుననరేషన్ ఇచ్చేంత భారీ బడ్జెట్ తమ వద్ద లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో దర్శకుడు, హీరో మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడటంతో శింబు ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. చేసేదేం లేక దర్శకుడు కూడా మరో మంచి నటుడు కోసం వెతుకుతుండగా జీవా కంటపడ్డాడు. అలా అతడికి కో మూవీలో చాన్స్ రాగా అది జీవా కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా రెండు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు, మూడు విజయ్, రెండు సీమా, నాలుగు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడం విశేషం. చదవండి: Anushka Shetty: వైరలవుతున్న స్వీటీ ఫొటో సీఎం స్టాలిన్‌ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం -
క్రిస్మస్కి 83
కరోనా కారణంగా సినిమా విడుదల తేదీలన్నీ అయోమయ పరిస్థితుల్లో పడిపోయాయి. సినిమా థియేటర్స్ ప్రారంభానికి అనుమతి ఇవ్వడంతో కొత్త తేదీలను, పండగ సీజన్లను టార్గెట్ చేసి తమ చిత్రాల విడుదల తేదీలను లాక్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ‘83’ విడుదల తేదీని ఖరారు చేశారు. 1983 క్రికెట్ ప్రపంచకప్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ చేశారు. ఇతర ముఖ్య పాత్రల్లో దీపికా పదుకోన్, జీవా నటించారు. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
వెలుగులోకి ‘83’ నాటి ఆసక్తికర సంఘటన
న్యూఢిల్లీ: దర్శకుడు కబీర్ ఖాన్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం 83. ఇది 1983లో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సాధించిన నిజమైన కథ చుట్టూ తిరుగుతుంది. ఇక చిత్రంలో కపిల్‌దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అప్పటి భారత జట్టు ఎలాంటి మలుపుల మధ్య ప్రపంచ కప్ సాధించిందో.. ఆ సమయంలో చోటు చేసుకున్న అనుకోని సంఘటనలు వంటి ఆసక్తికర అంశాలను, వాస్తవాలను ఈ సినిమా ద్వారా దర్శకుడు తెరపై చూపించనున్నారు. ఈ క్రమంలో తాజాగా 1983 క్రికెట్ జట్టు గురించి ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. జూన్ 20, 1983.. ఆరోజు జరిగిన గ్రూప్ మ్యాచ్‌లను దాటి టీమిండియా ముందుకు వెళ్తుందని జట్టు సభ్యులేవరికీ ఆశలు లేవు. గ్రూప్ దశలోనే భారత్ ఇంటి దారి పడుతుందేమోనని టోర్నీ మధ్యలోనే జట్టు తిరిగి వెళ్లేందుకు టిక్కెట్లను బుక్ చేసుకుంది. ఇంకా చెప్పాలంటే జట్టులోని కొందరు ఆటగాళ్లు ఆ మధ్యే వివాహం చేసుకున్నారు. గ్రూప్ మ్యాచ్‌లు ముగిసిన వెంటనే వారి భార్యలతో సెలవులు ప్లాన్ చేసుకుని.. జూన్ 20 రాత్రి న్యూయార్క్ చుట్టేయడానికి టిక్కెట్లను కూడా బుక్ చేసుకున్నారు. మరో ఆసక్తికర విషయం ఏటంటే అప్పటికే జూన్ 22 నుంచి సెమీ ఫైనల్స్ షెడ్యూల్ కూడా ఖరారవడం గమనార్హం. (కపిల్‌దేవ్‌కు నిజమైన అభినందన దక్కలేదు) ఇక ఈ టోర్నమెంట్లో భారత్ అంచనాలకు మించి ప్రదర్శన ఇస్తుందని.. సెమీ ఫైనల్స్ చేరుకుంటారని ఎవరూ ఊహించలేదు. కనీసం జట్టు సభ్యులు కూడా. ఇక ఆ రోజు అందరి ఊహలను తలకిందులు చేస్తూ టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరచడమే కాకుండా మొత్తం టోర్నమెంట్‌ను గెలుచుకుని క్రికెట్ చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని భారత క్రికెట్ చరిత్రలో చీరస్మరనీయమైన రోజును సంపాదించింది. అయితే 1983కి ముందేప్పుడూ కూడా క్రికెట్ ప్రపంచ కప్ విజయాల పట్టికలో భారతదేశ పటం లేదు. ఇక భారత్ సెమీ ఫైనల్స్ చేరి కప్ సాధింస్తుందని ఎవరూ ఊహించలేదు. కాగా కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరచి విజయం వైపు పరుగులు తీస్తుంటే స్టేడియంలో నెలకొన్న ఉత్కంఠ.. కప్ గెలవడంతో జట్టు సభ్యుల్లో మొదలైన భావోద్యేగం, అభిమానుల ఆనంద కేకలను దర్శకుడు తెరపై చూపించబోతున్నాడు. ఇక రిలయన్స్ ఎంటర్టైనమెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్లో దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనె కపిల్ భార్య పాత్ర నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. -
ధోనికి జీవా మేకప్
న్యూఢిల్లీ: ధనాధన్ ఆటతో క్రికెట్‌కు దూరమైన ధోని అభిమానులకు ఓ పాత వీడియో కొంత ఊరటనిస్తోంది. అతని గారాల తనయ జీవాతో తను తీర్చుకునే అచ్చట, ముచ్చట సామాజిక మాధ్య మాల్లో ధోని పంచుకుంటాడు. అయితే ధోనికి జీవా మేకప్ వేసే ఈ వీడియో మాత్రం అతను షేర్ చేయ లేదు. అతని మేకప్ ఆర్టిస్ట్ సప్న భవ్నానీ ఈ పాత వీడియోను పోస్ట్ చేసింది. జీవా తన చిట్టిపొట్టి చేతులతో తండ్రికి మెరుగులు దిద్దింది. ‘అందరికీ ముద్దొచ్చే మేకప్ ఇది. దీంతో నా ఉద్యోగానికి (మేకప్ ఆర్టిస్ట్) త్వరలోనే ఎసరొచ్చేలా ఉంది! మహి... మిస్ యూ దోస్త్’ అని ట్వీట్ చేసింది. ఇదిలావుండగా మాయదారి మహమ్మారి ప్రాణాల్ని తోడేస్తోంది. అలాగే ఎందరో ఆశల్ని చిదిమేస్తోంది. ఇప్పుడు ధోని అభిమానుల పట్ల అదే పని చేసింది. గత ప్రపంచకప్ సెమీస్ తర్వాత మాజీ కెప్టెన్ మహి మళ్లీ బరిలోకి దిగలేదు. కనీసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అయినా ఆడలేకపోతాడా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. కానీ కరోనా వైరస్ లీగ్‌ను జరగనివ్వడం లేదు.