కోలీవుడ్ నటుడు జీవా, అర్జున్ సర్జా నటిస్తున్న తాజా చిత్రం అగత్యా నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రానుంది. జీవా నటించిన గత చిత్రం బ్లాక్ కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అగత్యా అనే సినిమాతో తమిళం, తెలుగు, హిందీ ప్రేక్షకులను ఆయన పలకరించనున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి 'నేలమ్మ తల్లి' అంటూ సాగే పాట విడుదలైంది. అయితే, ఈ సాంగ్‌లో యాక్షన్ కింగ్ అర్జున్‌ను హైలెట్ చేస్తూ ఉంది.
వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ కథా చిత్రం అని నిర్మాత ఐసరి గణేష్ ఇప్పటికే పేర్కొన్నారు. ఇందులో మన సంస్కృతి, మానవ అనుబంధాలు ఉంటాయని చెప్పారు.
(ఇదీ చదవండి: విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వ్యాఖ్యలు.. యూట్యూబర్స్‌పై కేసు నమోదు)
మార్వెల్ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని సష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాలన్నదే తమ భావన అన్నారు. ఆ విధంగా వెర్సెస్ డెవిల్స్ అనే ఇతివత్తంతో రూపొందించిన చిత్రం ఇదన్నారు. అవేంజర్స్ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఊహాత్మక కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అనీష్ అర్జున్ దేవ్‌కు చెందిన వామ్ ఇండియా సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment