Arjun Sarja
-
పూర్వీకుల ఆత్మల్ని కలుసుకున్నారా..? 'అగత్యా' హారర్ ట్రైలర్
ఫాంటసీ హారర్ చిత్రం ‘అగత్యా’(Aghathiyaa) నుంచి అదిరిపోయే ట్రైలర్ విడుదలైంది. జీవా(jeeva), అర్జున్ సర్జా(arjun sarja) హీరోలుగా, రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన పాన్ ఇండియా మూవీని ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహించారు. డా.ఇషారి కె.గణేశ్, అనీశ్ అర్జున్దేవ్ నిర్మాతలు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదల కానుంది.‘అగత్యా’ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్‌ను చాలా ఆసక్తిగా కట్ చేశారు. సుమారు 120 సంవత్సరాల కిందట బతికిన ఆత్మలని మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారంటూ మొదలైన ట్రైలర్ చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. వందల ఏళ్ల కిందటి కథతో ప్రస్తుత జనరేషన్లోని ఓ యువ జంటకు మధ్య సంబంధం ఏమిటనేది దర్శకుడు చూపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం మన సంస్కృతి, అనుబంధాలను దర్శకుడు బలంగా చెప్పారు. అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాపై మంచి అంచనాలు పెట్టుకునేలా ట్రైలర్ ఉంది. -
అజిత్ 'పట్టుదల' HD మూవీ స్టిల్స్
-
డేట్ చేంజ్
జీవా(jeeva), అర్జున్ సర్జా(arjun sarja) హీరోలుగా, రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘అగత్యా’(agatya). ప్రముఖ పాటల రచయిత పా. విజయ్ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నేడు విడుదల కావాల్సింది.అయితే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 28కి విడుదలని వాయిదా వేసినట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘అగత్యా’. మన సంస్కృతి, అనుబంధాలను దర్శకుడు బలంగా చెప్పారు. అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. వీఎఫ్ఎక్స్ కోసం మరికొంత టైమ్ కేటాయించాలని భావించి, విడుదల వాయిదా వేశాం’’ అని యూనిట్ పేర్కొంది. -
'జీవా, అర్జున్' థ్రిల్లర్ సినిమా.. అదిరిపోయే సాంగ్ రిలీజ్
కోలీవుడ్ నటుడు జీవా, అర్జున్ సర్జా నటిస్తున్న తాజా చిత్రం అగత్యా నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రానుంది. జీవా నటించిన గత చిత్రం బ్లాక్ కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అగత్యా అనే సినిమాతో తమిళం, తెలుగు, హిందీ ప్రేక్షకులను ఆయన పలకరించనున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి 'నేలమ్మ తల్లి' అంటూ సాగే పాట విడుదలైంది. అయితే, ఈ సాంగ్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ను హైలెట్ చేస్తూ ఉంది.వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ కథా చిత్రం అని నిర్మాత ఐసరి గణేష్ ఇప్పటికే పేర్కొన్నారు. ఇందులో మన సంస్కృతి, మానవ అనుబంధాలు ఉంటాయని చెప్పారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వ్యాఖ్యలు.. యూట్యూబర్స్‌పై కేసు నమోదు)మార్వెల్ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని సష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాలన్నదే తమ భావన అన్నారు. ఆ విధంగా వెర్సెస్ డెవిల్స్ అనే ఇతివత్తంతో రూపొందించిన చిత్రం ఇదన్నారు. అవేంజర్స్ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఊహాత్మక కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అనీష్ అర్జున్ దేవ్‌కు చెందిన వామ్ ఇండియా సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. -
Action King Arjun: అర్జున్ సర్జాకు గౌరవ డాక్టరేట్ తో సత్కారం
-
కూతురి డ్రీమ్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా అర్జున్..
-
కూతురి డ్రీమ్ కోసం అర్జున్ కీలక నిర్ణయం
ఫామ్‌కు, ఫేమ్‌కు నిలయం సినిమా. అందుకే ఈ రంగుల ప్రపంచంలో రాణించాలని చాలా మంది ఆశ పడుతుంటారు. ఇందులో లోతు తెలిసేది దిగిన తరువాతనే. కొందరు సక్సెస్ అవుతారు. మరికొందరు అందుకోసం మొక్కవోని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి వారిలో నటి ఐశ్వర్య అర్జున్ ఒకరని చెప్పవచ్చు. ఈమె యాక్షన్ కింగ్ అర్జున్ వారసురాలు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన పెద్ద కూతురు అయిన ఐశ్వర్య అర్జున్‌కు కథానాయకిగా రాణించాలన్న ఆశ చాలానే ఉంది. అలా గత 10 ఏళ్ల క్రితమే నటుడు విశాల్‌కు జంటగా 'పట్టత్తుయానై' చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అందువల్ల మరో అవకాశం రాలేదు. దీంతో నటుడు అర్జున్ తన కూతురి డ్రీమ్‌ను నిజం చేయడానికి తనే మెగాఫోన్ పట్టి 'సొల్లిడవా' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆయన ప్రయత్నం సఫలం కాలేదు. ఆ తరువాత తెలుగులో కూతురిని కథానాయకిగా పరిచయం చేయాలని ప్రయత్నించారు. అందులో టాలీవుడ్ నటుడు 'విశ్వక్ సేన్'ను హీరోగా ఎంపిక చేశారు. అయితే ఆయనతో విబేధాల కారణంగా ఆ చిత్రం సెట్ పైకి వెళ్లలేదు. కాగా ఇటీవల ఐశ్వర్య అర్జున్ నటుడు ఉమాపతి తంబిరామయ్యను ప్రేమించడంతో ఆయనతోనే ఇటీవల పెళ్లి చేశారు. అయినప్పటికీ తన కూతుర్ని హీరోయిన్గా సక్సెస్ చేయడానికి తాజాగా మరోసారి ప్రయత్నం చేస్తున్నారు అర్జున్. ఈయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ ఐశ్వర్య అర్జున్ను హీరోయిన్గా 'సీత పయనం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు ఉపేంద్ర బంధువు నిరంజన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రం అయినా నటి ఐశ్వర్య అర్జున్‌కు మంచి రీ ఎంట్రీ అవుతుందేమో చూడాలి. -
'ఇద్దరు' సినిమా రివ్యూ
ఒకప్పుడు తెలుగులో నటించిన అర్జున్, జేడీ చక్రవర్తి చాలా ఏళ్ల క్రితం 'ఇద్దరు' అనే సినిమాలో హీరోలుగా నటించారు. ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అర్జున్ ఓ మల్టీ మిలియనీర్. ఈయన కంపెనీలో జేడీ చక్రవర్తి ఉద్యోగిగా చేరతాడు. రాత్రి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలనేది ఇతడి ఆశ. ఈ క్రమంలో తన బాస్ అర్జున్‌పై ఒక అమ్మాయితో హనీట్రాప్ చేయాలని చూస్తాడు. ఇది గ్రహించిన అర్జున్.. దానికి పై ఎత్తు వేస్తాడు. ఆ తర్వాత ఏమేం జరిగిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా)ఎలా ఉందంటే?ఇద్దరు తెలివైన వ్యక్తుల.. ఒకరిపై మరొకరు ఎత్తుకు పై ఎత్తుల వేస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమా 'ఇద్దరు'. వేల కోట్లకు అధిపతి అయిన అర్జున్‌ని హానీ ట్రాప్ చేసి కోటీశ్వరుడు కావాలనుకునే ఉద్యోగిగా జేడీ చక్రవర్తి కనిపించాడు. అతని ఎత్తులను పసికట్టి అతని ఎత్తులకు పై ఎత్తులు వేయడం.. ఇలా సినిమా మొత్తం ట్విస్టులో బాగానే తీశారు. దర్శకుడు పర్లేదనిపించాడు. అక్కడక్కడ బోర్ కొట్టించినా.. కమర్షియల్ అంశాలు బాగానే దట్టించారు.ఎవరెలా చేశారు?అర్జున్, జేడీ తమ పాత్రలకు న్యాయం చేసారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా ఓకే ఓకే. మిగిలిన విభాగాల వాళ్లు తమ తమ పని సక్రమంగా నిర్వర్తించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ 'సత్యం సుందరం' మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) -
చిరంజీవిని గుర్తు చేసుకున్న భార్య.. ఎమోషనల్ పోస్ట్!
కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు చిరంజీవి సర్జా. నాలుగేళ్ల క్రితం ఆయన ఆకస్మిక మరణంతో శాండల్‌వుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో ఆయన భార్య ఐదు నెలల గర్భవతి కావడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా కన్నడ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు.అయితే ఇవాళ చిరంజీవి సర్జా జయంతి కావడంతో ఆయన భార్య మేఘన భర్తను గుర్తు చేసుకుంది. నా జీవితంలో నువ్వే మార్గదర్శకమని భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు తమ హీరోను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు. కాగా.. ఇటీవల ఆయన సోదరుడు ధృవ సర్జా నటించిన మార్టిన్ చిత్రం థియేటర్లలో విడుదలైంది. విడుదల సమయంలో అన్నకు ప్రత్యేకంగా నివాళి అర్పించాడు.కాగా.. 2009లో సినిమారంగంలోకి ప్రవేశించిన స్టార్ హీరో చిరంజీవి సర్జా దాదాపు 22 చిత్రాల్లో నటించారు. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా నటించిన చివరి చిత్రం 'రాజమార్తాండ'. అయితే ఊహించని విధంగా ఈ కన్నడ స్టార్ జూన్ 7, 2020న 39 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయే ముందు కూడా సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆయన మరణం తర్వాత తమ్ముడు ధృవ సర్జా అన్న పాత్రకు డబ్బింగ్ చెప్పారు. View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
అర్జున్ డైరెక్షన్లో కొత్త చిత్రం.. హీరోగా ఎవరంటే?
టాలీవుడ్ హీరో అర్జున్ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ డైరెక్షన్ చేయనున్నారు. సీతా పయనం పేరుతో మూడు భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ సుధీంద్ర హీరోగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ చివరిసారిగా ప్రేమ బరహా అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు.కాగా.. యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్జున్ సర్జా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో నటించారు. కన్నడకు చెందిన అర్జున్ భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నారు. గతంలో దర్శకత్వం వహించిన సేవాగన్ (1992), జై హింద్ (1994),తాయిన్ మణికోడి (1998) లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. హీరోగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు అర్జున్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. View this post on Instagram A post shared by 𝙉𝙄𝙍𝙍𝘼𝙉𝙅𝘼𝙉 (@niranjansudhindra) -
హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో రెండో కూతురు
యాక్షన్ కింగ్ అనగానే గుర్తుకు వచ్చే ఒకే ఒక నటుడు అర్జున్. కన్నడ రాష్ట్రానికి చెందిన ఈయన బహుభాషా నటుడు, దర్శకుడు, నిర్మాత అన్నది తెలిసిందే. ఇప్పటికీ నటిస్తున్న అర్జున్ త్వరలో మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈయన కుటుంబం సినిమాకు కేరాఫ్ అనే చెప్పవచ్చు. అర్జున్ సతీమణి పేరు నివేదిత. ఈమె కూడా వివాహానికి ముందు కథానాయకిగా నటించారు. అంతేకాదు ఈమె తండ్రి కూడా నటుడే. అర్జున్‌తో వివాహం జరిగిన తర్వాత నివేదిత నటనకు స్వస్తి చెప్పారు. అర్జున్, నివేదిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు అన్న విషయం తెలిసిందే. వీరిలో పెద్ద కూతురు ఐశ్వర్య కూడా నటిగా రంగప్రవేశం చేశారు. ఈమె తమిళంలో విశాల్‌కు జంటగా పట్టత్తు తానై అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత నటుడు అర్జునే మెగా ఫోన్ పట్టి కూతురు హీరోయిన్గా చేసిన చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. కాగా ఇటీవలే నటి ఐశ్వర్య నటుడు ఉమాపతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కూతురు, అల్లుడు హీరో హీరోయిన్గా అర్జున్ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అర్జున్ రెండవ కూతురు అంజనా కూడా కథానాయకిగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా? అంటే అలాంటి అవకాశం లేకపోలేదు అని సమాధానం సినీ వర్గాల నుంచి వస్తోంది. ఇందుకు బలం చేకూర్చేలా అంజన తను ప్రత్యేకంగా తీయించుకున్న గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. -
అర్జున్ మేనల్లుడి యాక్షన్ చిత్రం.. ట్రైలర్ చూశారా?
ప్రముఖ కన్నడ హీరో, అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం మార్టిన్. ఈ సినిమాను పవర్ఫుల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి అర్జున్ సర్జా కథను అందించారు. తాజాగా మార్టిన్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే స్పై యాక్షన్ థ్రిల్లర్‌గానే ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో రూపొందించిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో విజువల్స్, యాక్షన్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీతో సహా ప్రపంచవ్యాప్తంగా 13 భాషల్లో విడుదల చేయనున్నారు. -
కన్నడ సినీ నిర్మాతను మోసం చేసిన విశాఖ వాసి
కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా, వైభవి శాండిల్య జంటగా మార్టిన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సీనియర్ హీరో అర్జున్ కథ అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వాసవి ఎంటర్ప్రైజెస్ ద్వారా ఉదయ్ కె మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే, రూ. 3 కోట్ల వరకు విశాఖ వాసి సత్యారెడ్డి తమను మోసం చేశాడంటూ మార్టిన్ చిత్ర నిర్మాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో నిందితుడు సత్యారెడ్డిని విశాఖపట్నంలో కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మార్టిన్ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్‌ను సత్యారెడ్డి ఏజన్సీకి సదరు నిర్మాత అప్పగించారు. అయితే, డబ్బు తీసుకుని ఆ సినిమాకు చేయాల్సిన పనిని చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని నిర్మాత ఉదయ్ కె మెహతా ఇలా చెప్పారు.. 'మార్టిన్ సినిమాకు ప్రత్యేక గ్రాఫిక్స్, సిజి, విఎఫ్ఎక్స్ వర్క్ అవసరం కాబట్టి మేము గత జూన్-జూలైలో సత్యారెడ్డి నేతృత్వంలోని గ్రాఫిక్ డిజైన్ ఏజెన్సీని సంప్రదించాము. మేము వారికి అడ్వాన్స్‌గా రూ. 3 కోట్ల రూపాయలు చెల్లించాము. అయితే, సినిమాకు సంబంధించిన పని విషయంలో సత్య ఆలస్యం చేస్తూ గత డిసెంబర్ నుంచి కనిపించకుండా పోయాడు. ఈ జూన్‌లో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. దీంతో ఆయన్ను అరెస్టు చేశారు.' అని మార్టిన్ చిత్ర నిర్మాత చెప్పారు. సినిమా విడుదల ఆలస్యానికి ప్రధాన కారణమని ఆయన తెలిపారు. ఆయన నిర్లక్ష్యం వల్ల తాము 15 వేర్వేరు సంస్థలకు గ్రాఫిక్స్ పనిని అప్పగించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ పోలీస్ స్టేషనులో సత్యారెడ్డిపై ఉదయ్ కె మెహతా చీటింగ్ కేసు పెట్టారు. తాజాగా ఆయన బెంగళూరు నుంచి విశాఖ వెళ్లాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. -
ఈ చలాకీ చిన్నారి.. పెళ్లి కూతురైంది.. బంగారు బొమ్మలా! (ఫోటోలు)
-
నటుడితో కూతురి పెళ్లి.. అర్జున్ కట్నంగా ఏమిచ్చాడో తెలుసా?
కూతురి ప్రేమను అర్థం చేసుకుని నచ్చినవాడితో పెళ్లి జరిపించాడు యాక్షన్ కింగ్ అర్జున్. తన పెద్ద కూతురు ఐశ్వర్య.. లెజెండరీ నటుడు తంబిరామయ్య కుమారుడు ఉమాపతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని తండ్రితో చెప్పింది. ఆమె ప్రేమను అర్థం చేసుకున్న అర్జున్.. తంబిరామయ్యతో మాట్లాడాడు. ఆయన కూడా పచ్చజెండా ఊపడంతో ఈ మధ్యే ఘనంగా పెళ్లి జరిపించారు. అనంతరం చెన్నైలో ఎంతో వేడుకగా రిసెప్షన్ సెలబ్రేట్ చేశారు.కోట్లాది కట్నంతన గారాల కూతుర్ని అత్తారింటికి సాగనంపిన అర్జున్.. అల్లుడికి భారీగానే కట్నం ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. వందలాది కోట్లు కట్నం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. అలాగే కోట్లు విలువ చేసే విలాసవంతమైన బంగ్లాను కానుకగా ఇచ్చాడట! అర్జున్‌కు మగ పిల్లలు లేరు. ఉన్న ఇద్దరూ కూతుర్లే! అందుకే తను సంపాదించిన ఆస్తులను భారీ మొత్తంలో కట్నంగా ఇచ్చేందుకు అస్సలు వెనకడుగు వేయలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.యాక్టరే కాదు సింగర్ కూడా!అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. విరున్ను అనే ద్విభాషా(మలయాళ, తమిళ) చిత్రం చేస్తున్నాడు. అలాగే తీయవర్ కులైగళ్ నాదుంగ, విడాముయుర్చి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు, రచయిత, దర్శకనిర్మాత కూడా! అలాగే చిట్టుకురువి (పరశురామ్), కట్టున అవలా కట్టువేండ (జైసూర్య) వంటి పలు సాంగ్స్ సైతం పాడాడు. సర్వైవర్ తమిళ్ షోతో హోస్ట్‌గానూ మారాడు.చదవండి: సినిమాను మించిన స్టోరీ.. విడాకుల తర్వాత ఆరేళ్లకు..! -
కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో హీరోగా చేశాడు. ప్రస్తుతం మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నాడు. రీసెంట్గా ఇతడి కూతురు ఐశ్వర్య పెళ్లి జరిగింది. తమిళ నటుడు తంబిరామయ్య కొడుకు, నటుడు ఉమాపతి రామయ్యతో వివాహం జరిగింది. అయితే వీళ్లిద్దరూ ప్రేమించుకుని పెళ్లి పీటలు ఎక్కారు. సంగీత్, పెళ్లి, రిసెప్షన్ పూర్తయిన తర్వాత వీళ్లంతా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ మూవీ 'లవ్ మీ')'తంబిరామయ్యది మంచి సంప్రదాయ కుటుంబం. ఆ మధ్య ఓ టీవీ షోకి హోస్టింగ్ చేశారు. అందులో ఉమాపతి రామయ్య ఓ కంటెస్టెంట్‌గా పోటీ చేశాడు. అప్పుడే తన నాకు నచ్చేశాడు. ఓ రోజు నా కూతురు ఐశ్వర్య నాతో విడిగా మాట్లాడాలని అడిగింది. దీంతో అది ప్రేమ వ్యవహారం అని ఊహించా. ఉమాపతి రామయ్య పేరు చెప్పడంతో నేను షాకయ్యా. ఆ తర్వాత ఉమాపతి రామయ్య ఫ్యామిలీతో నేను కట్టించిన ఆంజనేయ స్వామి ఆలయంలో మాట్లాడుకున్నాం. అలా ఐశ్వర్య, ఉమాపతి పెళ్లి జరిగిపోయింది' అని అర్జున్ చెప్పుకొచ్చారు.పెళ్లయిన తర్వాత ఐశ్వర్య సినిమాల్లో నటిస్తారా అని అడుగుతున్నారనే ప్రశ్నకు బదులిచ్చిన అర్జున్.. తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్న ఆమెకు.. పెళ్లి తర్వాత నటించాలా వద్దా అనే విషయం కూడా తెలుసని అర్జున్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: దానికి నేను సరైన వ్యక్తి కాదు.. వాళ్లయితేనే: శ్రుతి హాసన్) -
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా రిసెప్షన్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్, లెజెండరీ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి జూన్ 10న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇరుకుటుంబాలు సహా దగ్గరి బంధుమిత్రులు సమక్షంలో ఈ వివాహం ఘనంగా జరిగింది. శుక్రవారం (జూన్ 14న) చెన్నై లీలా ప్యాలెస్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఐశ్వర్య దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనక రాజ్, సత్యరాజ్ ,కుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, తమిళనాడు బీజేపీి అధ్యక్షులు అన్నామలై, స్నేహ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.చదవండి: చివరిసారిగా అడుగుతున్నా.. ఒక్కసారి వచ్చిపో షారూఖ్.. -
అర్జున్ కూతురి పెళ్లి వీడియో నెట్టింట వైరల్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి కొద్దిరోజుల క్రితమే ఘనంగా జరిగింది. అయితే, తాజాగా తన ముద్దుల కూతురి పెళ్లి వేడుక వీడియోను అభిమానుల కోసం ఆయన షేర్ చేశాడు. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతితో జూన్ 10న వీరి ప్రేమ వివాహం జరిగింది. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ వేడుకలో చాలామంది ప్రముఖులు పాల్గొని కొత్త దంపతులను ఆశీర్వదించారు.అర్జున్ షేర్ చేసిన వీడియోలో ఐశ్వర్య- ఉమాపతిల పెళ్లి వేడుకను చూడొచ్చు. వీణా శ్రీవాణి అందించిన చక్కని సంగీతంతో వీడియో ప్రారంభమౌతుంది. పెళ్లి పీటలపై ఐశ్వర్యను చూసుకున్న అర్జున్ చాలా మురిసిపోతాడు. అందుకు సంబంధించిన సన్నివేశాలు వీడియోలో చాలానే ఉన్నాయి.మా ముద్దుల కూతురు ఐశ్వర్య తనకు నచ్చిన, మా ప్రియమైన ఉమాపతిని వివాహం చేసుకున్నప్పుడు మేము అనుభవించిన ఆనందం మాటల్లో చెప్పలేము. తన పెళ్లి ఎన్నో మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. వారిద్దరూ కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టడం చూస్తుంటే మా హృదయాలు గర్వంతో నిండిపోయాయి. 'జీవితకాలం పాటు మీ ప్రేమకు తోడు ఆనందం కూడా జతకూడాలని వేల కోట్ల ఆశీర్వాదాలు అందిస్తున్నాము. మీరు పంచుకునే ప్రేమలాగే మీ ప్రయాణం కూడా అందంగా ఉండాలి. ఎప్పటికీ మేము మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాము.' అని అర్జున్ ఎమోషనల్‌గా ఒక పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Arjun Sarja (@arjunsarjaa) -
కమెడియన్ కొడుకుతో అర్జున్ కూతురు పెళ్లి(ఫోటోలు)
-
హీరోను పెళ్లాడిన అర్జున్ కూతురు.. ఫోటోలు వైరల్!
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతిని ఆమె పెళ్లి చేసుకుంది. చెన్నైలో హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ వివాహా వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. తాజాగా వీరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.కాగా.. ఐశ్వర్య- ఉమాపతిల ఎంగేజ్మెంట్ వేడుక గతేడాది అక్టోబర్‌లో జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితోనే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య కెరీర్ అనుకుంత సక్సెస్‌ఫుల్‌గా సాగడం లేదు. కూతురి కోసం అర్జున్ డైరెక్టర్‌గా మారి సినిమా తీయగా అది కూడా ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది. మరోవైపు ఉమాపతి తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. కోలీవుడ్‌లో అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి సినిమాల్లో హీరోగా నటించాడు. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) -
అర్జున్ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
అర్జున్ సర్జా ఇంట పెళ్లి వేడుకలు.. హీరోయిన్ హల్దీ పిక్స్ వైరల్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనుంది. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య ఇంటికి కోడలిగా వెళ్లనుంది. తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతితో జూన్ 10న చెన్నైలోని హనుమాన్ ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేయనుంది. ఆప్యాయంగా ముద్దాడిన తండ్రిఇప్పటికే పెళ్లి పనులు జోరందుకోగా తాజాగా హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో అర్జున్ సర్జా తన కూతురిని ఆప్యాయంగా ముద్దాడాడు. కాగా ఇది లవ్ మ్యారేజ్.. ఐశ్వర్య- ఉమాపతి ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా గతేడాదే వారు పచ్చజెండా ఊపారు. అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిపారు.కెరీర్..సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య కెరీర్ అనుకుంత సక్సెస్‌ఫుల్‌గా సాగడం లేదు. కూతురి కోసం అర్జున్ డైరెక్టర్‌గా మారి సినిమా తీయగా అది కూడా ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది. మరోవైపు ఉమాపతి అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. చదవండి: యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా? -
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
టాలీవుడ్ నటుడు అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తమిళ నటుడు ఉమాపతి రామయ్యతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహా వేడుక జూన్ 10న చెన్నైలో జరగనుంది. నగరంలోని అంజనసుత శ్రీ యోగాంజనేయ మందిరం పోరుర్‌లో వేదికగా నిలవనుంది.గతేడాది నిశ్చితార్థంకాగా.. గతేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట జూన్‌లో పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. ఉమాపతి, ఐశ్వర్య ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాలు అంగీకరించడంతో గతేడాది నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. వరుడు ఎవరంటే?కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కుమారుడే ఉమాపతి. తమిళంలో మనియార్ కుటుంబం, తిరుమణం, తన్నే వండి సినిమాల్లో ఉమాపతి నటించారు. అర్జున్ సర్జా కూతురు కూడా తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. విశాల్ మూవీ పటతు యానై సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో అందాల నటిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యను ఉమాపతి పెళ్లి చేసుకోనున్నారు. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) -
రాముడి ప్రాణప్రతిష్ఠ రోజే పిల్లలకు పేర్లు పెట్టుకున్న స్టార్ హీరో.. ఎందుకంటే?
యాక్షన్ ప్రిన్స్, శాండల్‌వుడ్ నటుడు ధ్రువ సర్జా, ప్రేరణ దంపతులు తమ పిల్లలకు పేర్లు పెట్టారు. తెలుగు వారికి సుపరిచయం అయిన అర్జున్‌కు ధ్రువ సర్జా మేనళ్లుడు అవుతాడనే విషయం తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యుల సమావేశంలో పిల్లలకు నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్, అర్జున్ సర్జా పాల్గొన్నారు. ఆంజనేయుడికి గొప్ప భక్తుడైన ధ్రువ సర్జా.. తన పిల్లలకు ఏం పేరు పెట్టాలనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ క్యూరియాసిటీకి తెర పడింది. దీంతో పాటు తొలిసారిగా ఆయన కుమారుడి ఫోటో కూడా రివీల్ అయింది. అయోధ్యలో, రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున తన పిల్లలకు పేర్లు పెట్టారు. తన కూతురికి రుద్రాక్షి, కుమారుడికి హయగ్రీవ అని నామకరణం చేశారు. వాయుపుత్ర హనుమంతుడు మహిరావణుడిని సంహరించడానికి పంచముఖి ఆంజనేయస్వామిగా అవతరించాడు. పంచముఖి అంటే ఐదు ముఖాలు. ఇందులో హనుమంతుని ముఖంతో సహా నరసింహ, వరాహ, హయగ్రీవ, గరుడతో సహా ఐదు ముఖాలు ఉన్నాయి. అందులో నుంచి హయగ్రీవ అనే పేరును తన కుమారుడికి పెట్టుకున్నాడు ధ్రువ సర్జా.. ధృవ దంపతులకు 2022 ప్రారంభంలో కుమార్తె జన్మించగా.. 2023 సెప్టెంబర్‌లో ఆయనకు మగబిడ్డ పుట్టాడు. అయోధ్యలో రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున రోజున తన పిల్లలకు పేర్లు పెట్టాలని ఆయన ఇన్నిరోజులు వేచి చూశాడు. హనుమంతుడిని రాముడికి సేవకుడిగా పిలుస్తారు.. అలాంటి ఆంజనేయుడికి పరమ భక్తుడు ధ్రువ సర్జా.. అందుకే రామమందిరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం రోజున పిల్లలకు పేర్లు పెట్టారు. దీనిపై మాట్లాడిన ధృవ సర్జా.. అయోధ్యలో 12.20కి పూజలు జరిగాయి. మేము అదే సమయంలో మా పిల్లలకు పేర్లు పెట్టాము. సంజయ్ దత్ కూడా శివ భక్తుడు. తన కూతురికి రుద్రాక్షి అని పేరు పెట్టడంతో ఆయన సంతోషించాడు. రుద్రాక్ష అంటే ఆ శివుడికి చాలా ఇష్టమైనది అని తెలిసిందే.. త్వరలో కుటుంబ సమేతంగా అయోధ్యకు వెళతామని ఆయన చెప్పాడు. -
500 ఏళ్లుగా ఎవరూ చేయలేదు థాంక్స్ మోడీ..!
-
ప్రధానికి టాలీవుడ్ స్టార్ హీరో రిక్వెస్ట్.. అదేంటో తెలుసా?
ప్రస్తుతం అందరి దృష్టి అంతా అయోధ్య రామమందిరం వైపే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తమిళనాడులోని చెన్నైలో పర్యటిస్తున్నారు. ఖేలో ఇండియా గేమ్స్‌ను ప్రారంభోత్సవానికి పీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానిని ప్రముఖ సినీ నటుడు, అర్జున్ సర్జా కలిశారు. తన కుమార్తెతో కలిసి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా చెన్నైలో తాను స్వయంగా నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అర్జున్ సర్జా విజ్ఞప్తిపై పీఎం సానుకూలంగా స్పందిచారు. త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చినట్లు అర్జున్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. https://t.co/w9Kk48BQVJ — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) January 20, 2024 -
గ్రాండ్‌గా ఆ హీరోహీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా
కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్నదే నిజమైంది. ఆ హీరోహీరోయిన్ ఒకటయ్యారు. పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) ఎవరా జోడీ? కర్ణాటకకు చెందిన అర్జున్ సర్జా.. సొంత భాషలో కంటే తెలుగు, తమిళంలోనే బాగా పాపులర్ అయ్యాడు. జెంటిల్‌మేన్, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రీసెంట్గా 'లియో'లో హరోల్డ్ దాస్ అనే పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఇతడి కూతురు ఐశ్వర్య అర్జున్.. హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఈమె నిశ్చితార్థమే ఇప్పుడు జరిగింది. తమిళంలో కామెడీ తరహా పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కొడుకు ఉమాపతి.. హీరోగా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు ఇతడితోనే అర్జున్ కూతురు ఐశ్వర్య ఎంగేజ్మెంట్ జరిగింది. చెన్నైలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. డిసెంబరులోనే పెళ్లి కూడా ఉండొచ్చని అంటున్నారు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ 'మ్యాడ్' సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) View this post on Instagram A post shared by Dhruvasarja_fans_adda🔵 (@dhruvasarja_fans_adda) -
యాక్షన్ థ్రిల్లర్ మూవీతో వస్తోన్న 'అర్జున్'.. క్రేజీ అప్డేట్ ఇదే!
టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, నటి ఐశ్వర్య రాజేష్ మొదటిసారి జంటగా నటించిన చిత్రం తీయవన్ కులైగళ్ నడుంగా. బిగ్‌బాస్ అభిరామి, రామ్‌కుమార్ జీకే రెడ్డి, లోగు, వేల రామమూర్తి, తంగదురై, బ్రేకింగ్ స్టార్ రాహుల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జీఎస్ఆర్ పతాకంపై జి.అరుణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా దినేష్ లక్ష్మణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన సంబురాలు చేసుకున్నారు చిత్రబృందం. (ఇది చదవండి: ఉపాసన తాతగారికి రూ.కోటి చెక్ అందించిన ‘జైలర్’ నిర్మాత) ఇప్పటికే రిలీజైన తీయవన్ కులైగళ్ నడుంగా మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకులు, సినీ వర్గాల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పారు. చిత్ర టీజర్, మోషన్ పోస్టర్, సింగిల్ సాంగ్ ఆడియో విడుదల కార్యక్రమాలు త్వరలోనే నిర్వహిస్తామన్నారు.. దీనికి శరవణన్ అభిమన్సు ఛాయా గ్రహణం, భరత్ అసీవగన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, నటి ఐశ్వర్య రాజేష్ కాంబోలో తొలిసారిగా వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. (ఇది చదవండి: కారులో రచ్చ చేసిన హీరోయిన్.. నెక్స్ట్ టార్గెట్ విజయ్?) It's a wrap for Aishwarya Rajesh’s upcoming crime thriller #TheeyavarKulaigalNadunga! Teaser coming soon! pic.twitter.com/0VvHN8HEis — Christopher Kanagaraj (@Chrissuccess) September 4, 2023 -
అర్జున్ బర్త్ డే.. అదిరిపోయిన గ్లింప్స్!
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ తాజాగా నటిస్తోన్న చిత్రం లియో. ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. త్రిష, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, మిస్కిన్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో లియో మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. (ఇది చదవండి: విజయ్ 'లియో' కోసం మరోసారి కశ్మీర్‌కి!) అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ఆయన హరోల్డ్ దాస్ అనే క్యారెక్టర్లో అర్జున్ కనిపించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ లోకేశ్ తన ట్విటర్లో షేర్ చేశారు. హ్యా బర్త్ డే అర్జున్ సార్ అంటూ.. థ్యాంక్యూ ఫర్ ఎక్స్ట్రార్డినరీ ఏఫర్ట్ అంటూ విషెస్ తెలిపారు. అయితే గ్లింప్స్ చూస్తే అర్జున్ ఫుల్ యాక్షన్ రోల్లో కనిపిస్తున్నారు. ప్రతి నాయకుడిగా ఓ రేంజ్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్ర దసరా సందర్భంగా అక్టోబర్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్ ఆయనకే ఇచ్చేశారుగా!) And now meet #HaroldDas 🔥🔥 Thank you @akarjunofficial sir for the extraordinary efforts you’ve put in for this film! Wishing our #ActionKing a very happy birthday! 🤜🤛 #Leo🔥🧊#GlimpseOfHaroldDas#HBDActionKingArjun pic.twitter.com/DQnhxXbRkh — Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 15, 2023 -
కూతురి కోసం యాక్షన్ కింగ్ మరో ప్రయత్నం, ఈసారైనా వర్కవుట్ అయ్యేనా?
యాక్షన్ కింగ్‌గా గుర్తింపు పొందిన నటుడు అర్జున్. ఈయనలో మంచి దర్శకుడూ ఉన్నాడనే విషయం తెలిసిందే. చాలా ఏళ్ల పాటు హీరోగా నటించిన ఈయన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. అందులో పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ సినీ రంగ ప్రవేశం చేసి తమిళంలో విశాల్ సరసన మదయానై చిత్రంలో కథానాయకిగా నటించారు. అయితే ఆ చిత్రం ఆమె కెరీర్‌కు ఏమాత్రం సాయం చేయలేదు. దీంతో అర్జున్ తన కూతురు ఐశ్వర్య కథానాయికగా సొల్లితరవా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తమిళం, కన్నడం భాషల్లో నిర్మించారు. ఆ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు. చాలా గ్యాప్ తర్వాత అర్జున్ ఆయన కూతుర్ని కథానాయికగా నిలబెట్టడానికి మరో ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఆయన పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు. తన సొంత బ్యానర్.. శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను కూడా ఆయనే చేపట్టారు. ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటిస్తున్న ఇందులో ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. నటుడు సత్యరాజ్, ప్రకాశ్ రాజ్, జయరాం తదితరులతో పాటు అర్జున్ కూడా ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. కేజీఎఫ్ చిత్రం ఫేమ్ హిన్దేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్ -
ప్రతి ఒక్కరూ మెచ్చే 'ఇద్దరు': హీరోయిన్ సోనీ
యాక్షన్ కింగ్ అర్జున్, రాధికా కుమారస్వామి (కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య), సోని చరిష్టా హీరోహీరోయిన్లుగా నటించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఇద్దరు'. ఎఫ్.ఎస్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహించారు. ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ నటుడు జె.డి.చక్రవర్తి, అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్, స్వర్గీయ కె.విశ్వనాథ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా హీరోయిన్లలో ఒకరైన సోని చరిష్టా మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు సమీర్ కి నా కృతజ్ఞతలు. యాక్షన్ కింగ్ అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. 'ఇద్దరు' అనే ఈ చిత్రం నా కెరీర్ లో ఓ మైలురాయి. చిత్ర సమర్పకులు డి.ఎస్.రెడ్డి, నిర్మాత ఫర్హీన్ ఫాతిమాకు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్' అని అన్నారు. (ఇదీ చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) -
అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే
యాక్షన్ కింగ్ అర్జున్ పెద్ద కూతురు నటి ఐశ్వర్య పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ వార్త నిజమేనని వరుడి తండ్రి ప్రకటన చేశారు. దీంతో త్వరలో అర్జున్ ఇంట శుభకార్యం జరగనుంది. కొలీవుడ్లో ప్రముఖ కమెడియన్, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యువ నటుడు ఉమాపతితో వివాహం జరగనుంది. పెళ్లిపై తంబి రామయ్య ఏమన్నారంటే.. సోషల్‌మీడియాలో వస్తున్న వార్త నిజమే.. ఐశ్వర్య, ఉమాపతిల పెళ్లి త్వరలో జరగనుందని తంబి రామయ్య ప్రకటించారు. ఐశ్వర్యను ప్రేమిస్తున్నానని, ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని మొదట తమ అబ్బాయి చెప్పాడంతో... ఇరు కుటుంబాల పెద్దలు కలిసి పెళ్లి గురించి మాట్లాడుకున్నాం అన్నారు. నవంబర్ 8న ఉమాపతి పుట్టినరోజన పెళ్లి తేదీని ప్రకటిస్తామన్నారు. వచ్చే ఏడాదిలో వీరిద్దరి పెళ్లి జరుపుతామని తంబి రామయ్య తెలిపారు. ఉమాపతి- ఐశ్వర్య పరిచయం ఎక్కడంటే.. ఇద్దరు సినిమా రంగంలో ఉన్నా.. కలిసి నటించింది లేదు. మరి వీరిద్దరి మధ్య ఎక్కడ ప్రేమ చిగురించిందని పలువురు సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. ఆర్జున్ హోస్ట్‌గా ZEE తమిళ్లో ఓ రియాలిటీ షో ‘సర్వైవర్’ చేశారు. అక్కడ షూటింగ్లో ఉమాపతి స్టార్ కంటెస్టెంట్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఈ జంట ఒకరినొకరు కలుసుకున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచి మొదలైన వారి స్నేహం కాస్త ప్రేమకు దారి తీసింది. (ఇదీ చదవండి: హీరోలందరికి ఎఫైర్లున్నాయి.. నా భర్తను మాత్రమే ఎందుకంటారు?) ఆ తర్వాత అర్జున్ నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయం ప్రారంభోత్సవంలో తంబి రామయ్య కుటుంబం పాల్గొన్నారు. ఆ సమయంలోనే వారిద్దరి లవ్‌స్టోరీ ఇరు కుటుంబాలకు తెలిసిందట. ఆపై కుటుంబ పెద్దలు కూడా ఆశీస్సులు అందించారని తెలుస్తోంది. ఏదేమైనా వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరగనుంది. అర్జున్, తంబి రామయ్య ఇద్దరూ కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరున్నవారే కావడంతో వారి కుటుంబంలో జరిగే పెళ్లికి భారీగానే స్టార్స్ హాజరవుతారు. (ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!) -
ప్రముఖ కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురు పెళ్లి
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనూ అర్జున్‌కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్యను ఇది వరకే తమిళ్, కన్నడలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. కానీ టాలీవుడ్లో మాత్రం తన ఎంట్రీ ప్రకటనతోనే సినిమా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఐశ్వర్యకు సంబంధించి ఓ వార్త కోలీవుడ్‌లో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి) అదేమిటంటే..ఐశ్వర్య అర్జున్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ అనే వార్త వైరల్ అవుతుంది. అబ్బాయి కూడా కోలీవుడ్‌లో ప్రముఖ హాస్య నటుడు అయినటువంటి తంబి రామయ్య కుమారుడు ఉమాపతి అని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా వారిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని కూడా తెలుపుతున్నారు. దీంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో వీరి పెళ్లి ఘనంగా జరగబోతోందని సమాచారం. కానీ ఈ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వారి కుటుంబాల నుంచి రాలేదు. కానీ జరిగేది ఇదేనని బలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి: డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!) కోలీవుడ్‌లో 'అదగపాతుతు మగజనంగలే' అనే సినిమాతో 2017లో ఉమాపతి రామయ్య ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆయన పలు టీవి షోలతో పాటు నాలుగు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం 'దేవ్‌దాస్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఐశ్వర్య విషయానికొస్తే తెలుగులో హీరోయిన్గా లాంచ్ చేయాలని అర్జున్ చాలా కసరత్తు చేశాడు. అందుకు కోసం హీరోగా విష్వక్సేన్ పేరును కూడా ప్రకటించాడు. అయితే, ఈ మూవీ నుంచి విష్వక్ తప్పుకోవడంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కానీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని త్వరలో మరో హీరో పేరును ప్రకటిస్తామని ఆయన గతంలో తెలిపాడు. Umapathy Ramaiah (Thambi Ramaiah Son) & Aishwarya Arjun (Arjun’s Daughter) to tie the knot soon! pic.twitter.com/r0dRY3i6js — Christopher Kanagaraj (@Chrissuccess) June 25, 2023 -
ఆంజనేయ స్వామి భక్తులం మాకు ఆయన ఒక సూపర్ మ్యాన్
-
అర్జున్‌తో వివాదం.. డబ్బులు చెల్లించారా?: విశ్వక్ సేన్ స్పందన
యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. మార్చి 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిన చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన హీరో విశ్వక్ సేన్‌కు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాతో వివాదంపై ప్రశ్న ఎదురైంది. అర్జున్‌తో కాంట్రవర్సీ తర్వాత మీరు ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారనే వార్తలు వినిపించాయి. చదవండి: ఆ హీరోయిన్ని బ్లాక్ చేసిన బన్నీ! స్క్రిన్ షాట్స్‌తో నటి ఆరోపణలు.. ఇది నిజమేనా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. దీనికి సమాధానం ఇచ్చేందుకు విశ్వక్ ఆసక్తి చూపలేదు. దీనిపై విశ్వక్ స్పందిస్తూ.. ‘అది గతం. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ వ్యవహారానికి ఈ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. ఎంతోమందిపై ఉన్న గౌరవంతో నేను దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు’ అని బదులిచ్చాడు. కాగా విశ్వక్ సేన్ హీరోగా తన కూతురు ఐశ్వర్య హీరోయిన్ అర్జున్ ఓ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. చదవండి: తారక్ వండర్ కిడ్: ఎన్టీఆర్‌పై శుభలేఖ సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ చిత్రంతో తన కూతురిని టాలీవుడ్ పరిచయం చేయాలనుకున్నాడు అర్జున్. షూటింగ్ కూడా మొదలు పెట్టిన అర్జున్ విశ్వక్ సేన్ తీరుతో ఇబ్బంది పడ్డంటు తెలిసింది. విశ్వక్ సరిగ్గా సెట్స్‌కు రావడం లేదని.. ఏదో ఒక కారణం చెప్పి షూటింగ్ రద్దు చేస్తున్నాడని.. వర్క్ పట్ల అతడి ప్రవర్తన బాగోలేదంటూ గతంలో అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపించారు. ఆ తర్వాత కథ విషయంలో తనకి కాస్త ఇబ్బంది ఉందని, అది చెప్పినా అర్జున్ వినడం లేదని విశ్వక్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. -
మార్టిన్ వస్తున్నాడు
‘‘దేశవ్యాప్తంగా కన్నడ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉంది. సుదీప్, యశ్గార్లు నా సీనియర్ యాక్టర్స్. వారు ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలు చేశారు. వారితో నేను పోటీపడటం లేదు. ఓ యాక్టర్‌గా ఇంకా మెరుగయ్యేందుకు నాతోనే నేనుపోటీ పడుతుంటాను’’ అని అన్నారు హీరో ధృవ సర్జా. ‘అద్దూరి’ (2012) చిత్రం తర్వాత హీరో ధృవ సర్జా, దర్శకుడు ఏపీ అర్జున్ కాంబోలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘మార్టిన్’. ఈ చిత్రంలో వైభవి శాండల్య, అన్వేషి జైన్ హీరోయిన్స్‌గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కథ అందించిన ఈ సినిమాను ఉదయ్ కె. మెహతా నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘మార్టిన్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ధృవ సర్జా మాట్లాడుతూ– ‘‘మార్టిన్’ చిత్రం దేశభక్తి నేపథ్యంలో ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను. ఇంటర్నేషనల్ ఫైటర్స్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాల కోసం బాగా బరువు పెరిగాను’’ అన్నారు. ‘‘రాజమౌళి, ప్రశాంత్ నీల్, మణిరత్నం వంటి దర్శకులు భాషా పరమైన హద్దులను చెరిపేశారు. ఇప్పుడు అంతా ఇండియన్ సినిమాయే’’ అన్నారు అర్జున్. ‘‘ధృవతో నేను గతంలో ప్రేమకథ చేశాను. ఇప్పుడు యాక్షన్ మూవీగా ‘మార్టిన్’ చేశాను’’ అన్నారు అర్జున్ ఏపీ. -
లైంగిక వేధింపుల కేసు.. ప్రముఖ నటికి షాకిచ్చిన హైకోర్టు
ప్రముఖ కన్నడ నటి శృతి హరిహరన్‌కు కోర్టులో చుక్కెదురైంది. లైంగిక వేధింపుల కేసులో ఆమెకు వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులిచ్చింది. సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ సంబర్గిపై విచారణ నిలిపేయాలంటూ కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. గతంలో నటుడు అర్జున్ సర్జాతో పాటు నిర్మాత ప్రశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శృతి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసులో తనపేరు తొలగించాలని ప్రశాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రశాంత్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో స్టే విధించింది. ప్రశాంత్ వేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 1, 2023న చేపట్టనున్నట్లు వెల్లడించింది. అసలేం జరిగిందంటే.. మరో నటుడు అర్జున్ సర్జా, నిర్మాత ప్రశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శృతి హరిహరన్పై పోలీసులను ఆశ్రయించింది. విస్మయ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. అక్టోబర్ 2018లో అర్జున్, శృతి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రముఖ నటుడు అంబరీష్ మధ్యవర్తిత్వంలో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాన్ని కూడా నిర్వహించింది. కానీ ఈ కేసులో రాజీ కుదర్చలేకపోయారు. ఈ కేసు కోసం న్యూయార్క్ నుంచి శృతికి నిధులు సమకూరాయని గతంలో నిర్మాత ప్రశాంత్ ఆరోపించారు. -
ఆ విషయంలో విశ్వక్ సేన్‌దే తప్పు: డైరెక్టర్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా- యంగ్ హీరో విశ్వక్ సేన్ల వివాదం చర్చనీయాంశంగా మారింది. తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విశ్వక్ హీరో! ఇప్పటికే అర్జున్ డైరెక్షన్లో రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తైంది. కానీ ఇంతలోనే సడన్‌గా సినిమా చిత్రీకరణను నిలిపేశారు. విశ్వక్ సేన్ షూటింగ్ హాజరు కాకుండా ఇబ్బంది పెడుతున్నాడని అర్జున్.. తన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకే షూటింగ్ ఆపమన్నానంటూ విశ్వక్ బాహాటంగా విమర్శలు గుప్పించుకున్నారు. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శకుడు జీ నాగేశ్వర రెడ్డి స్పందించాడు. 'కథ చెప్పకుండా సినిమా షూటింగ్ జరగదు. అయితే పక్కనుండే వాళ్లు కథ బాగోలేదు, కెరీర్లో ఇలాంటి సినిమా సెలక్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పినప్పుడు కచ్చితంగా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కానీ విశ్వక్ సేన్ సొంత టాలెంట్‌తో పైకి వచ్చినవాడు. అతడంత ఆలోచనారహితంగా పని చేశాడనుకోను. కథ వినుంటాడు, నచ్చే ఉంటుంది. మరోపక్క అర్జున సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్. కథ చెప్పేశా కదా అని అర్జున్ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయుంటాడు. ఈ జనరేషన్ హీరోలెలా ఉన్నారంటే ఏం జరుగుతుందో మొత్తం మాకు తెలియాలంటున్నారు. అవసరమైతే కథ ట్రీట్మెంట్లో కూడా కూర్చుంటున్నారు. మొత్తం 70 సీన్లు చెప్పాక షూటింగ్ మొదలుపెట్టుకుందామని విశ్వక్ ముందే అడిగి ఉంటే సరిపోయేది. అలా కాకుండా షూటింగ్ ఆపమని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో హీరోదే తప్పు. ఇకపోతే ఈ విషయంలో అర్జున్ మీడియా ముందుకు రావడం, దానికి విశ్వక్ వివరణ ఇచ్చుకోవడం రెండు సరైనవే. ఒక్కోసారి మన చుట్టూ ఉండే మనుషుల వల్లే సమస్యలు వస్తాయి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇద్దరూ డైరెక్ట్‌గా మాట్లాడుకుంటే ఆ ప్రాబ్లమ్స్ ఉండవు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: అర్జున్ సర్జా- విశ్వక్ సేన్ వివాదం.. తెరపైకి యంగ్ హీరో -
అర్జున్ సర్జా-విశ్వక్ సేన్ వివాదం.. తెరపైకి మరో యంగ్ హీరో!
గత కొద్ది రోజులుగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా-యంగ్ హీరో విశ్వక్ సేన్ల వివాదం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. అర్జున్ డైరెక్షన్లో రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో సడెన్‌గా ఈ మూవీ షూటింగ్‌ని నిలిపివేశారు. విశ్వక్ సేన్ షూటింగ్‌కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్ సర్జా రీసెంట్గా ఆరోపణలు చేయగా.. తన అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, అందువల్లే షూటింగ్ ఆపమని అడిగానంటూ వివరణ ఇచ్చాడు విశ్వక్. ప్రస్తుతం ఈ వివాదంపై సినీ పెద్దలు చర్చించుకుంటున్నారు. చదవండి: బిగ్‌బాస్ 6: 9 వారాలకు గీతూ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ కోసం అర్జున్ మరో యంగ్ హీరోను తీసుకునే ఆలోచన ఉన్నారట. ఇది తెలుగులో తన కూతురు ఫస్టు సినిమా కావడంతో అర్జున్‌కి ఈ సినిమాని సెంటిమెంట్‌గా చూస్తున్నారట. అందువల్లే ఆయన ఈ సినిమాను ఆపేసే ఆలోచనలో లేరని తెలుస్తోంది. పైగా తాను పని ఇస్తానని చెప్పి తీసుకొచ్చిన ఏ టెక్నీషియన్ కూడా పని లేదని చెప్పి వెనక్కి పంపించడం తనకి అలవాటు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో సాధ్యమైనంత త్వరగా మరో హీరోతో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. అయితే ఈ కథకి శర్వానంద్ కరెక్టుగా సరిపోతాడని భావించిన ఆయన, ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ మొదటి నుంచి కూడా చాలా కూల్‌గా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. చాలా కాలం తరువాత ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో హిట్ అందుకున్నాడు శర్వానంద్. చదవండి: పరిస్థితి మరింత దిగజారింది: రష్మిక ఎమోషనల్ పోస్ట్ -
విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా-యంగ్ హీరో విశ్వక్ సేన్ల వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. విశ్వక్ సేన్ షూటింగ్‌కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్ సర్జా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అర్జున్ ఆరోపణలపై విశ్వక్ స్పందిస్తూ.. తన అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, ఈ సినిమా షూటింగ్ సమయంలో తన ప్రవర్తన బాలేదని ఒక్క లైట్ బాయ్ చెప్పిన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చదవండి: కోలుకుంటున్న ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘సినిమా మొదలు పెట్టేముందు హీరోలు మనకు ఇష్టం ఉందా? లేదా? ఆ నిర్మాత ఇష్టమా? హీరోకు ఇష్టమా అన్నది లేదా పారితోషికం లాంటి వివిధ విషయాలను ముందే మాట్లాడుకోవాలి. సినిమా మొదలయ్యాక కాదు. సినిమా షూటింగ్ మొదలయ్యాక ఇలాంటి మాట్లాడుకోవడం ఎంతవరకు న్యాయం, ధర్మమో చూస్తే.. ఎన్టీ రామారావుగారు ఎవరి దర్శకత్వంలో చేసినా, ఆయన దర్శకుడు చెప్పినట్టుగా చేసేవారు. దర్శకుడికి సంబంధించిన విషయాల్లో ఆయన జోక్యం చేసుకునేవారు కాదు. ఇదే నిబద్ధతను నేను బాలకృష్ణగారిలో కూడా చూశాను. ఇచ్చిన కాల్షీట్ ప్రకారం బాలకృష్ణ సెట్లో ఉండేవారు. కానీ ఈ గొడవలో అర్జున్ గారు షూటింగు మొదలుపెట్టేశారు. విశ్వక్ సేన్ కొంతవరకూ చేశారు. ‘నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకున్నాక మొదలెడదాం’ అని అన్నట్టుగా విశ్వక్ చెబుతున్నాడు’’ అన్నారు. ‘ఇక అర్జున్ విషయానికి వస్తే ఆయనకు దర్శకుడిగా కూడా మంచి అనుభవం ఉంది. చాలా సూపర్ హిట్లు ఇచ్చారు. ఆయన అవుట్ డేటెడ్ అనుకుంటే విశ్వక్ ముందుగానే మానుకోవలసింది. సినిమా ఒప్పుకున్నాక మాటలు బాగోలేదు .. పాటలు బాగోలేదు అంటే ఎలా? నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కూడా. కొత్త నిర్మాతలు .. కొత్త దర్శకులు .. వివిధ రకాల కథలతో వస్తున్నారు. చదవండి: ‘బింబిసార’ బ్లాక్‌బస్టర్.. మరో వైవిధ్యమైన కథతో వస్తున్న కల్యాణ్ రామ్ కానీ హీరోలు చెప్పినట్టు చేయడం వలన ఆ సినిమాలన్నీ ఒకేరకంగా ఉంటున్నాయనేది నా ఉద్దేశం’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ‘కొత్తగా వచ్చిన హీరోలంతా దర్శకుడి పనిలో జోక్యం చేసుకుంటున్నారు. ఫంక్షన్స్‌లో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తున్నారు. అర్జున్ గారు అన్నట్టుగా చాలామంది నిర్మాతలు ఇలాంటి హీరోల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. యంగ్ హీరోలంతా ఈ పద్ధతిని మార్చుకోవలసిన అవసరం ఉంది. విశ్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ.. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమే’’ అంటూ తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్క విశ్వక్ సేన్ మాత్రమే కాదు ప్రస్తుతం యంగ్ హీరోల వల్ల చాలామంది దర్శక-నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైన తమ ధోరణి మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
విశ్వక్ సేన్‌పై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు అర్జున్ సర్జా ఫిర్యాదు?
యంగ్ హీరో విశ్వక్సేన్-యాక్షన్ కింగ్ అర్జున్‌ల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. విశ్వక్ సేన్ షూటింగ్‌కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్ సర్జా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన కూతురిని టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. అర్జున్ డైరెక్షన్లో రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయ్యింది. చదవండి: సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత ఇలాంటి సమయంలో విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై అర్జున్ సీరియస్ అయ్యాడు. షూటింగ్‌కి సమయానికి రాకుండా ఇబ్బందులు పెట్టాడని, విశ్వక్ కమిట్మెంట్ లేని యాక్టర్ అంటూ అర్జున్ ఫైర్ అయ్యాడు. అయితే అర్జున్ ఆరోపణలపై విశ్వక్ సేన్ సైతం స్పందించాడు. రాజయోగం టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న విశ్వక్ షూటింగ్ సమయంలో తన ప్రవర్తన బాలేదని ఒక్క లైట్ బాయ్ చెప్పిన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: చిక్కుల్లో షారుక్ చిత్రం, డైరెక్టర్‌పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు అంతేకాదు ఇందులో తన తప్పు ఉంటే క్షమించండి అర్జున్ సర్ అంటూ చివరిలో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్‌పై ‘మా’ అసోసియేషన్‌లో తాజాగా అర్జున్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వక్ సేన్ ప్రవర్తన సరిగా లేదని, షూటింగ్ సమయంలో ఇబ్బంది పెట్టాడని, తనను, తన యూనిట్ణి అవమానించాడంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణుకి ఫిర్యాదు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. కానీ, దీనిపై మంచు విష్ణు ఎలా స్పందిస్తాడు, విశ్వక్ సేన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోనున్నాడనేది ఆసక్తిని సంతరించుకుంది. -
ఆ దెబ్బకు హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్
సీనియర్ యాక్టర్ అర్జున్ ఆరోపణలపై టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ స్పందించారు. రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో హిమాలయాలకు వెళ్దాం అనుకున్నానని సంచలన కామెంట్స్ చేశారు. నేను ప్రతి సినిమాను నాది అనుకొని చేశానని తెలిపారు. నా అంత కమిటెడ్ ఎవరు ఉండరని.. నేను పక్కా ప్రొఫెషనల్ నటుడినని అన్నారు. నా వల్ల ఎవరు నిర్మాతలు డబ్బులు పోగొట్టు కోలేదని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో జరిగిన రాజయోగం మూవీ టీజర్ లాంచ్ ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ సినిమా వివాదంపై నోరు విప్పారు. (చదవండి: విశ్వక్ సేన్- అర్జున్ వివాదం..యంగ్ హీరోపై చర్యలు తప్పవా?) విశ్వక్ సేన్ మాట్లాడుతూ...' మా మధ్య సరైన అవగాహన లేదు. నేను ఆ సినిమా కి నా వంతు ఎఫర్ట్స్ పెట్టి చేద్దామనుకున్నా. నేను సినిమా చెయ్యనని చెప్పలేదు. నేను ఆలస్యంగా రియలైజ్ అయ్యా. వాళ్ల మేనేజర్ రెండు రోజుల తరువాత మాకు కాల్ చేసి రెమ్యూనరేషన్ వెనక్కి పంపించమని చెప్పారు.సెట్ మీద డిస్కర్షన్ వద్దు అని రెండు రోజులు మాట్లాడుకొని వెళ్దాము అని చెప్పా. సెట్లో కంఫర్ట్ లేకుండా చేయలేను. నా పరిస్థితి గురించి మీకు చెప్పా. తప్పా రైటా అనేది మీరే చెప్పండి. నేను సినిమా బాగా రావడానికి మాట్లాడుకుందాం అని మెసేజ్ పెట్టా. అర్జున్ సార్ మంచి సినిమా చెయ్యాలి. వాస్తవాలు తెలీకుండా మాట్లాడుతుంటే బాధగా ఉంది. నేను ఏమి చేసిన ఆ సినిమా మంచిగా రావడం కోసమే చేశా.' అని అన్నారు. అర్జున్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఆయన కూతురు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. -
విశ్వక్ సేన్- అర్జున్ వివాదం..యంగ్ హీరోపై చర్యలు తప్పవా?
యంగ్ హీరో విశ్వక్సేన్- యాక్షన్ కింగ్ అర్జున్‌ల మధ్య వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన కూతుర్ని టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. అర్జున్ డైరెక్షన్లో రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇలాంటి సమయంలో విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై అర్జున్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. షూటింగ్‌కి సమయానికి రాకుండా ఇబ్బందులు పెట్టాడని, విశ్వక్ కమిట్మెంట్ లేని యాక్టర్ అంటూ అర్జున్ దుయ్యబట్టారు. 'షూటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు రాలేను అని మెసేజ్ పెడతాడు. అయినా సరే అతనికి నచ్చినట్లే క్యాన్సిల్ చేశాం. కానీ ప్రతిసారి షూటింగ్ వస్తానని చెప్పి డుమ్మా కొడతాడు. అతని వళ్ల సీనియర్ హీరోల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో టీమ్ వర్క్ ప్రధానం. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయిలో ఉంది. ఇప్పటివరకు తాను ఏ యాక్టర్, టెక్నీషియన్‌కు చేయలేనన్ని కాల్స్ విశ్వక్‌కి చేశాను. రెమ్యూనరేషన్ కింద అడ్వాన్స్ కూడా ఇచ్చాను, అయినప్పటికీ విశ్వక్ ఇలా షూటింగ్ ఎగ్గొట్టడం సమంజసం కాదు. ఈ విషయంపై ప్రొడ్యూసర్ గిల్ట్‌కు ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో 100కోట్లు వచ్చినా విశ్వక్‌తో సినిమా చేసేది లేదు' అంటూ అర్జున్ తెగేసి చెప్పారు. ఈ క్రమంలో గతంలో ఇలా అగ్రిమెంట్ కమిట్మెంట్ అయ్యాక అనుకోని పరిస్థిత్లులో దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తే ప్రొడ్యూసర్ గిల్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో బిగ్‌బాస్ ఫేమ్ అలీరెజా, నిర్మాతలకు విభేదాలు వస్తే.. ప్రొడ్యూసర్ గిల్డ్ అతన్ని రెండేళ్లు బ్యాన్ చేసింది. ‘బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలో ఓ సినిమా విషయంలో చిన్న మిస్టేక్ చేశా. నిర్మాతలు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశారు. దీంతో నన్ను రెండేళ్ల పాటు బ్యాన్ చేశారు’ అని అలీ రెజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సమయానికి షూటింగ్‌కి రావట్లేదంటూ ప్రకాశ్ రాజ్‌ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కొన్నాళ్ల పాటు బ్యాన్ చేసింది. తర్వాత ప్రకాశ్ రాజ్ వచ్చి వివరణ ఇవ్వడంతో నిషేధం ఎత్తేశారు. వీరితో పాటు పలువురు నటీనటులు ఇచ్చిన కమిట్మెంట్ను బ్రేక్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్లపై ప్రొడ్యూసర్ గిల్ట్ చర్యలు తీసుకుంది. మరి విశ్వక్సేన్ను కూడా కొన్నాళ్లపాటు బ్యాన్ చేస్తారా? అతడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అర్జున్ మాత్రం గొడవ పెట్టుకోవడానికి మీడియా ముందుకు రాలేదని, మరో నిర్మాతకు ఇలాంటి సమస్యలు రావొద్దనే ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేయబోతున్నానని తెలిపాడు. -
అర్జున్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వక్సేన్ సిబ్బంది.. ఏమన్నారంటే..!
సీనియర్ నటుడు అర్జున్, యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం మరింత ముదిరింది. దీనిపై తాజాగా అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించిన విశ్వక్సేన్పై ఫైర్ అయ్యారు. అతను అన్‌ప్రొఫెషనల్ నటుడు అంటూ ఆయన మండిపడ్డారు. అతనికి ఎలాంటి నిబద్ధత లేదంటూ అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలా మరొకరికి జరగకుండా ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు అర్జున్ తెలిపారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ సిబ్బంది స్పందించారు. (చదవండి: చాలా సార్లు కాల్ చేశా.. పట్టించుకోలేదు: విశ్వక్సేన్పై అర్జున్ ఫైర్) కథ విషయంలో కొన్ని మార్పులపై విశ్వక్ సేన్ కొన్ని సూచనలు చేసిన మాట వాస్తవమేనని ఆయన సిబ్బంది తెలిపారు. కథలో ఆసక్తికరంగా ఉండే చిన్న చిన్న మార్పులకు అర్జున్ ఒప్పుకోవడం లేదని అన్నారు. అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలని.. విశ్వక్ సేన్ మాటకు సెట్లో గౌరవం ఇవ్వలేదని సిబ్బంది తెలిపారు. అందుకే మనసుకు నచ్చని పని చేయలేక సినిమా నుంచి తప్పుకున్నారని వివరించారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఒప్పంద పత్రాలు నిర్మాతల మండలికి పంపినట్లు విశ్వక్ సేన్ సిబ్బంది తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై విశ్వక్ సేన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
చాలా సార్లు కాల్ చేశా.. పట్టించుకోలేదు: విశ్వక్సేన్పై అర్జున్ ఫైర్
యంగ్ హీరో విశ్వక్సేన్పై సీనియర్ హీరో అర్జున్ ఫైర్ అయ్యాడు. అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. అందులో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విశ్వక్ సేన్‌పై ఫైర్ అయ్యాడు. ‘నేను చెప్పిన కథ విశ్వక్సేన్కి బాగా నచ్చిందని చెప్పాడు. రెమ్యునరేషన్ విషయంలోనూ అతను చెప్పిన విధంగానే అగ్రిమెంట్ జరిగింది.కానీ కొన్ని వెబ్‌సైట్స్‌లో మా సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అవి ఎందుకు వచ్చాయో తెలియదు. నా లైఫ్‌లో విశ్వక్ సేన్‌కి చేసినన్ని కాల్స్ ఎవరికి చేయలేదు. ప్రతిసారి షూటింగ్ వస్తానని చెప్పి డుమ్మా కొడతాడు. కేరళలో షూట్ మొదలు పెట్టినప్పుడు అతని మేనేజర్ వచ్చి టైమ్ కావాలి అన్నాడు. నేను కూడా ఆర్టిస్ట్‌నే కదా.. అర్థం చేసుకొని ఓకే చెప్పి ఆ షేడ్యూల్ని కాన్సిల్ చేసుకున్నాం. దాని వల్ల జగపతి బాబు లాంటి పెద్ద నటుల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. అయినా పర్లేదు అనుకున్నాను. ఆ తర్వాత విశ్వక్‌కి నేను చాలా సార్లు కాల్ చేశాను.. అతను పట్టించుకోలేదు. ఇటీవల నా దగ్గర వచ్చి మళ్లీ కథ చెప్పమన్నాడు. చెప్పాను సూపర్ అని అన్నాడు. దీంతొ ఈ నెల 3న షూట్ పెట్టుకున్నాం. రాత్రి 2 గంటల వరకు నాతో టచ్‌లో ఉన్నాడు. ఈ రోజు షూట్ అనగా.. ఉదయం ‘నేను రావడం లేదు.. నాకు టైమ్ కావాలి’అని మెసేజ్ చేశాడు. కథ నచ్చింది ప్రొడక్షన్ నచ్చింది అని చెప్పిన విశ్వాక్ సేన్ కి ఇంకా ఏమి నచ్చలేదు? సీనియర్ హిరోలు ఎంతో కమిట్ మెంట్‌తో ఉంటారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఎంతో డెడికేటెడ్ గా ఉంటారు.. వాళ్లకు ఏమి తక్కువ? మన వర్క్ కి మనం సిన్సియర్ గా ఉండాలి అని చెపుతున్నాను. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయి లో ఉంది. సినిమా ఇండస్ట్రీలో టీమ్ వర్క్ ప్రధానం. ఇలాంటి వాతావరణంలో విశ్వక్‌తో నేను సినిమా చేయలేను. ఈ విషయం అందరికీ తెలియాలి అని ప్రెస్ మీట్ పెట్టాను. ఇక్కడ ఒక పద్దతి ఉంటుంది .. అందరూ ఆ పద్ధతిని పాటించాలి. కుదరదు అంటే ఇంట్లో కూర్చోవాలి. అనూప్ మ్యూజిక్ , బుర్ర సాయిమాదవ్ డైలాగ్స్ , చంద్రబోస్ పాటల విషయంలో విశ్వక్ నాతో విభేదించారు. విశ్వక్ ప్రవర్తన వల్ల నేను ప్రస్తుతం సినిమా ఆపేశాను. వందకోట్లు వచ్చినా నేను విశ్వక్ తో సినిమా చేయను. త్వరలోనే కొత్త హీరో, టైటిల్ తో సినిమాను ప్రకటిస్తాను. విశ్వక్ ప్రవర్తనను ప్రొడ్యూసర్ గిల్డ్ దృష్టికి తీసుకెళ్తాను’అని అన్నారు. -
విశ్వక్సేన్ చెప్పిన కాల్షీట్స్కు ఓకే చేశాను: హీరో అర్జున్
-
మరో వివాదంలో ఇరుక్కున్న విశ్వక్ సేన్.. ఫిల్మ్ చాంబర్లో కంప్లైంట్?
యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతున్నాడు. రీసెంట్గా ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో విశ్వక్సేన్ ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అర్జున్ కూతురు ఐశ్వర్యా అర్జున్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కూడా పూర్తిచేశారు. ఇలాంటి సమయంలో విశ్వక్సేన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అగ్రిమెంట్‌ను బ్రేక్ చేసి ఎలాంటి కారణాలు చెప్పకుండా విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఫిల్మీదునియాలో టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ విషయంపై సీరియస్ అయిన అర్జున్ సర్జా విశ్వక్ సేన్ మీద ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి ఈ ఇష్యూ ఎంత దూరం వెళుతుందన్నది చూడాల్సి ఉంది. -
నటుడు అర్జున్ ఇంట తీవ్ర విషాదం
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ(85) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. తల్లి మరణంతో హీరో అర్జున్ ఇంట ఒక్కసారిగా విషాద చాయలు నెలకొన్నాయి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న ఆమె శనివారం(జూలై 23న) బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె పార్థివ దేహం ఆస్పత్రిలోనే ఉన్నట్లు సమాచారం. కాగా లక్ష్మి దేవమ్మ మృతి పట్ల కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ అర్జున్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కాగా లక్ష్మి దేవమ్మ మైసూర్లో స్కూల్ టీచర్‌గా పనిచేశారు. చదవండి: నేనింకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం వారే: హీరోయిన్ సూర్య సినిమాకు జాతీయ అవార్డుల పంట -
ఒకే ఫ్రేంలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు.. ఫొటో వైరల్
ఈ ఏడాది జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సినీ ఇండస్ట్రీనే కాదు..తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీసింది. జనరల్ ఎలక్షన్స్ తలపించే విధంగా మా ఎన్నికలు వాడివేడిగా జరిగాయి. ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపాయి. ‘మేమంతా ఒకే కుటుంబం. మాది సినిమా కుటుంబం. అందరం కలిసే ఉంటాం’ అంటూనే ప్రత్యక్ష ఆరోపణలకు తెరదీశారు. ఇక అధ్యక్ష పదవికి పోటీ పడ్డ ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుల మధ్య జరిగిన మాటల యుద్దం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి ఈ ఎన్నికలో మంచు విష్ణు గెలిచి మా అధ్యక్ష పీటాన్ని కైవసం చేసుకున్నాడు. చదవండి: ఘనంగా ప్రారంభమైన విశ్వక్ సేన్-అర్జున్ మూవీ, క్లాప్ కొట్టిన పవన్ దీంతో ప్రకాశ్ రాజ్‌తో సహా అతడి ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు మా అసోసియేషన్‌కు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఎదురు పడిని దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరు ఒకే ఫ్రేంలో కనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా యాక్షన్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్, ఆయన కూతురు ఐశ్వర్య సర్జా హీరోహీరోయిన్లుగా రాబోతున్న మూవీ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యాక్రమానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హజరై హీరోహీరోయిన్ల తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. చదవండి: హమ్మయ్యా.. షూటింగ్ పూర్తయింది: పూజా హెగ్డే అయితే పవన్ కల్యాణ్‌తో పాటు ఈ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు కూడా హజరైనట్లు తెలుస్తుంది. ఈ మూవీ లాంచింగ్ వేడుకలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఎదురుపడి మాట్లాడుకుంటున్న ఫొటో బయటకు వచ్చింది. వారి మధ్యలో హీరో విశ్వక్ సేన్ కూడా కనిపించాడు. అయితే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు సీరియస్‌గా ఎదో మాట్లాడుకోవడం చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె గురించే వీరిద్దరు చర్చించుకుంటున్నారా? అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఘనంగా ప్రారంభమైన విశ్వక్ సేన్-అర్జున్ మూవీ, క్లాప్ కొట్టిన పవన్
యాక్షన్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్, ఆయన కూతురు ఐశ్వర్య సర్జా హీరోహీరోయిన్లు ఓ సినిమా రాబోతున్ను సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ నెం. 15న రాబోయే ఈ సినిమా నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గురువారం(జూన్ 23) రామానాయడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి నటుడు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హజరై హీరోహీరోయిన్ల తొలి సీన్‌కు క్లాప్ కొట్టాడు. చదవండి: తన మూవీ డైరెక్టర్‌కు క్షమాపణలు చెప్పిన రామ్, ఏం జరిగిందంటే! ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ చిత్రానికి అర్జున్ కథా రచయిత, దర్శకత్వంతో పాటు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. అర్జున్‌కి మంచి స్నేహితుడైన జగపతిబాబు ఇందులో కీలకపాత్ర పోషించనున్నాడు.ఈ చిత్రానికి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తారు. -
యాక్షన్ హీరో డైరెక్షన్లో విశ్వక్ సేన్ మూవీ.. ఆసక్తికర విషయాలు
Vishwak Sen Movie With Aishwarya Arjun In Arjun Sarja Direction: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 6న విడుదలై సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఈ సినిమా హిట్‌తో మంచి జోష్ మీదు ఉన్నాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం విశ్వక్ సేన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో కొత్త ప్రాజెక్టులో విశ్వక్ సేన్ జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మూవీకి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది ఐశ్వర్య. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై అర్జున్ నిర్మిస్తున్నఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది. రోడ్ ట్రిప్ కథాంశంగా సాగే ఈ మూవీలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. చదవండి: 👇 సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ -
బాలయ్య చిత్రంలో అర్జున్ విలన్ ?
-
Arjun Sarja: కన్నడ స్టార్ అర్జున్ సర్జాకు కరోనా
Actor Arjun Sarja Tests Positive For COVID-19: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. సినీ ఇండస్ట్రీని సైతం కరోనా వదలడం లేదు. ఇప్పటికే కరీనా కపూర్, అమృతా అరోరా సహా పలువురు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు సైతం కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఐసోలేషన్‌లో ఉన్నాను. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాను. నేను బాగానే ఉన్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్క్ తప్పనిసరిగా ధరించండి' అంటూ అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. చదవండి: పార్టీలతో హల్చల్.. బీటౌన్‌లో కరో(రీ)నా టెన్షన్ -
లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో అర్జున్‌కు క్లీన్ చిట్
Hero Arjun Sarja Gets Clean Chit In Me Too Case After Three Years: లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో అర్జున్ సర్జాకు క్లీన్ చిట్ లభించింది. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో సాక్ష్యులు ఎవరూ లేకపోవడంతో అర్జున్‌పై అభియోగాలు వీగిపోయినట్లు బెంగళూరు పోలీసులు మెజిస్ట్రేట్‌కు నివేదిక సమర్పించారు. కాగా మూడేళ్ల క్రితం అర్జున్‌పై శృతి హరిహరన్ అనే హీరోయిన్ మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగులో రిహార్సల్ సాకుతో అర్జున్ తనను కౌగిలించుకున్నాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శృతి తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు దాదాపు మూడేళ్ల విచారణ అనంతరం తాజాగా అర్జున్‌కు క్లీన్చిట్ ఇచ్చారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లభించనందున అతనిపై ఉన్న అభియోగాలు ఎత్తివేస్తున్నట్లు తమ నివేదికలో రూపొందించారు. -
సెప్టెంబర్‌లో హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ ‘ఫ్రెండ్షిప్’
ఇండియన్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎ.ఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. చదవండి: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్‌కు అంత సమయమా..! ఈ సందర్భంగా... శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎఎన్ బాలాజీ మాట్లాడుతూ ‘సెకండ్ వేవ్ తర్వాత తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మా ‘ఒరేయ్ బామ్మర్ది’ చిత్రం. ఇటీవల థియేటర్లో విడులైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందరూ సూపర్ హిట్ సినిమా అంటున్నారు. ఇప్పుడు ‘ఫ్రెండ్ షిప్’ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దాదాపు 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో వైవిధ్యంగా రూపొందిన ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అని చెప్పారు. చదవండి: అభిషేక్‌కు గాయాలు.. హాస్పిటల్‌కు రాని ఐశ్వర్యరాయ్? కాగా మలయాళంలో అందరూ కొత్త నటీనటులతో చేసి సూపర్ హిట్ అయిన ‘క్వీన్’ సిరీస్‌కు రీమేక్ రైట్స్ తీసుకుని ‘ఫ్రెండ్షిప్’ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో హర్భజన్, అర్జున్ పోటాపోటీగా నటించారు. ఈ మూవీలో మొత్తం ఐదు ఫైట్స్, నాలుగు పాటలు ఉన్నాయట. రాజకీయాలకు, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఆసక్తికరంగా, కమర్షియల్ అంశాలతో ఎంగేజింగ్‌గా దర్శకుడు జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య ఫ్రెండ్షిప్ను తెరకెక్కించారు. ఈ మూవీ ఐదు భాషల్లో(తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం) విడుదలవుతుంది. సెన్సార్‌కు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తామని చిత్ర బృందం ఈ సందర్భంగా వెల్లడించింది. -
15 ఏళ్లకు గుడి నిర్మాణం పూర్తి చేసిన అర్జున్
సాక్షి, చెన్నై: యాక్షన్ హీరో అర్జున్ సర్జా తమిళనాడులోని చెన్నైలో హనుమంతుడి ఆలయాన్ని నిర్మించాడు. 15 ఏళ్ల క్రితం తలపెట్టిన గుడి నిర్మాణం ఇప్పుడు పూర్తయిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడు. "నేను 15 ఏళ్లుగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి గుడి నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా జూలై 1, 2 తారీఖుల్లో కుంభాభిషేకం జరుపుతున్నాం" "నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరినీ పిలిచి ఈ వేడుకను చాలా గ్రాండ్‌గా చేద్దామనుకున్నా. కానీ కరోనా పరిస్థితుల వల్ల ఎవరికీ ఆహ్వానం పంపలేకపోతున్నా. అయినప్పటికీ ఈ వేడుకను ఎవరూ మిస్ కావద్దన్న ఉద్దేశ్యంతో దీన్ని లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాం" అని చెప్పుకొచ్చాడు. కాగా అర్జున్ ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్లా నటిస్తున్నట్లు సమాచారం. చదవండి: Sarkaru Vaari Paata: మహేశ్‌ని ఢీ కొట్టబోతున్న యాక్షన్ కింగ్! -
Sarkaru Vaari Paata: మహేశ్‌ని ఢీ కొట్టబోతున్న యాక్షన్ కింగ్!
మహేశ్‌బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రముఖ కోలీవుడ్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటించబోతున్నారని ఆ వార్త సారాంశం. దర్శకుడు పరశురామ్ ఇప్పటికే అర్జున్ కు కథ వినిపించారని, ఈ సినిమాలో నటించేందుకు ఆయన అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. జూలైలో ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన ఓ భారీ సెట్లో మహేశ్ బాబు-అర్జున్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ స్టోరీ సాగుతోందని.. మహేశ్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. తమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
మీటు అన్నాక సినిమాలు రాలేదు
యశవంతపుర: తనపై జరిగిన లైంగిక వేధింపులపై మీ టూ ద్వారా బహిరంగం చేసినందుకు గర్వంగా ఉందని నటి శ్రుతి హరిహరన్ చెప్పారు. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక చర్చాగోష్టిలో ఆమె మాట్లాడారు. మీ టు అనడంలో సిగ్గుపడవలసిన పని లేదు. న్యాయపరంగా నా పోరాటం కొనసాగుతోంది. మీ టూ గురించి మాట్లాడినప్పటి నుంచి నాకు సినిమా అవకాశాలు తగ్గాయి. అప్పటి నుంచిఒక్క సినిమా అవకాశం రాలేదు. దీనిపై చింతించబోను. ఏడాది నుంచి భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నా. ఈ సారి జాతీయ చలనచిత్ర అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇలాగైనా మళ్లీ నటించే చాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. మీటూ వంటి విషయాలకు ఎలాంటి సాక్ష్యాలుండవు. కేసును దైర్యంగా ఎదుర్కోవాలి. నాకు జరిగిన అనుభవం మీకు కూడా జరక్కుండా ఉండాలంటే చూస్తూ కూర్చోకండి అని చెప్పారు. -
నటుడు అర్జున్ సర్జాకు హైకోర్టులో ఊరట
కర్ణాటక, యశవంతపుర : మీటూ అరోపణలు ఎదుర్కోంటున్న నటుడు అర్జున్ సర్జాకు హైకోర్టులో స్వల్ప ఊరట కలిగింది. శ్రుతిహరిహరన్ ఫిర్యాదుతో దాఖాలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని అర్జున్ సర్జా దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టి డిసెంబర్ 11కు వాయిదా వేసింది. అప్పుటి వరకు అర్జున్‌సర్జాపై ఏలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులకు సూచించింది. -
యాక్షన్కింగ్ను వదలా..!
సినిమా: నటుడు అర్జున్ను వదిలేదు లేదు అంటోంది నటి శ్రుతీహరిహరన్. దక్షిణాదిలో యాక్షన్‌కింగ్‌గా పేరుతెచ్చుకున్న నటుడు అర్జున్. అలాంటి నటుడు ఇప్పుడు మీటూలో చిక్కుకున్నాడు. నిపుణన్ చిత్రంలో నటిస్తున్న సమయంలో అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆ చిత్ర కథానాయకి శ్రుతీహరిహరన్ చేసిన ఆరోపణలు కలకలానికి దారి తీయడంతో పాటు నటుడు అర్జున్ ఇమేజ్ను డామేజ్ చేశాయి. అయితే శ్రుతీహరిహరన్ ఆరోపణల్లో నిజం లేదంటూ అర్జున్ పేర్కొనడంతో పాటు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నటి శ్రుతీహరిహరన్ కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి కన్నడ సినీ ప్రముఖులు కొందరు రాయబారం నడిపినా ఫలితం లేకపోయ్యిందనే ప్రచారం జరుగుతోంది. అర్జున్‌తో రాజీకి నటి శ్రుతీహరిహరన్ ససేమీరా అంటోందని సమాచారం. దీంతో శ్రుతి ఆరోపణలతో పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంతో నటుడు అర్జున్ బెంగళూర్ కోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. అయినా అర్జున్ను వదిలేది లేదంటోంది నటి శ్రుతీహరిహరన్. ఈమె ఈ విషయమై బెంగుళూర్లోని మహిళా కమిషన్‌ను ఆశ్రయించి అర్జున్‌పై ఫిర్యాదు చేసి ఆయనపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. దీనిపై శ్రుతీహరిహరన్ ఒక భేటీలో పేర్కొంటూ తాను అర్జున్‌పై చేసిన ఆరోపణలకన్నింటికీ ఆధారాలున్నాయని అంది. ఆయనపై ఫిర్యాదు చేసినందుకుగానూ తనపై అర్జున్ కేసు వేశారని చెప్పింది. దాన్ని తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని, అదే విధంగా తాను చేసిన ఆరోపణలకు కోర్టులో ఆధారాలను సమర్పిస్తానని అంది. అదేవిధంగా అర్జున్ మద్దతుదారులు తనను బెదిరిస్తున్నారని, ఆ విధంగా అర్జున్ దొరికిపోయాడని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆయన్ని వదిలేదని శ్రుతీహరిహరన్ అంటోంది. -
నేను చక్కెర, మీరు చీమలు
కర్ణాటక, యశవంతపుర: ‘నాకు భయం లేదు. నా ప్రాణానికి హాని ఉందని తెలిసినా లెక్కచేయటం లేదు’ అని ప్రముఖ నటుడు అర్జున్ సర్జాపై మీటూ లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనం సృష్టించిన నటీ శ్రుతి హరిహరన్ అన్నారు. మీ టూ అని ఆరోపించి, మళ్లీ క్షమాపణ చెప్పిన నటి సంజన మాదిరిగా తనలో పిరికితనం లేదన్నారు. నటుడు అర్జున్‌సర్జాపై మీటూ లైంగిక ఆరోపణలపై శ్రుతి హరిహరన్ బుధవారం బెంగళూరులో మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. అర్జున్‌పై తను చేసిన ఆరోపణల గురించి వివరించారు. మీ టూపై సుమోటోగా కేసు దాఖలు చేసి రెండుసార్లు నోటీసులు జారీచేసినా స్పందిండం లేదని కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి ఇదివరకే అసహనం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో శ్రుతి న్యాయవాది అనంత్నాయ్తో కలిసి హాజరై తన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. నాగలక్ష్మీబాయిశ్రుతిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసి సంతకం తీసుకున్నారు. విస్మయ సినిమా షూటింగ్లో తనకు అర్జున్ నుంచి చేదు అనుభవాలు ఎదురైనట్లు శ్రుతి ఏకరువుపెట్టారు. వరుస సెలవుల కారణంగా గత వారంలో విచారణకు రాలేకపోయిన్నట్లు చెప్పారు. సోషల్ మీడియాకు ఎక్కడం సరికాదు ఆమెకు ఎదురైన లైంగిక వేధింపులకు సంబంధించి మహిళ కమీషన్కుగాని, లేదా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలేగాని ఇలా సోషల్ మీడియాకు ఎక్కడం సరికాదని నాగలక్ష్మీబాయి శ్రుతికి సూచించారు. ఈ కేసు ఇప్పటికే కోర్టులో ఉన్నందున ఎవరి తరఫున మాట్లాడబోనని నాగలక్ష్మీబాయి తెలిపారు. శ్రుతి తెలిపిన వివరాలను మాత్రమే తీసుకొంటామన్నారు. సంజన క్షమాపణలపై శ్రుతి అసంతృప్తి ‘నాకు భయం లేదు. నా ప్రాణానికి హాని ఉందని తెలిసినా లెక్కచేయటం లేదు’ అని నటీ శ్రుతి హరిహరన్ అన్నారు. సంజన క్షమాపణలను చెప్పడం చూస్తే తనకు అసంతృప్తిగా ఉందన్నారు. సినిమా రంగంలో ఉన్న మహిళలు ఏదో ఒక విధంగా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు అమె ఆరోపించారు. మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి తనతో చర్చించిన తీరు సంతోషకరంగా ఉందన్నారు. మహిళ కమిషన్ ద్వారా మహిళలకు న్యాయం దొరుకుతుందనే భావన తనలో ఉందన్నారు. తన వద్దనున్న సాక్ష్యాలను ఆమెకు వివరించినట్లు తెలిపారు. తను అనవసరంగా ఆరోపణలు చేయలేదని ఆమెకు తెలిపానన్నారు. ఎఫ్ఐఆర్ రద్దు పిటిషన్ వాయిదా బెంగళూరు సైబర్ క్రైం పోలీసుస్టేషన్లో నటి శ్రుతి హరిహరన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్ వచ్చే వారానికి వాయిదా పడింది. నటుడు అర్జున్ సర్జాపై అవహేళనగా మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై అర్జున్ మేనేజర్ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సునీల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి శ్రుతిపై పోలీసులు ఎఫ్ఐఆర్ను దాఖలు చేశారు. అయితే తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని శ్రుతి హైకోర్టుకెళ్లారు. నేను చక్కెర, మీరు చీమలు ఈ సందర్భంగా అక్కడ గుమిగూడిన విలేకరులపై శ్రుతి వ్యంగ్యోక్తులు విసిరారు. ‘నేను చక్కె రలా ఉన్నాను, మీరు చీమల మాదిరిగా నా వెంట పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. విచారణ ముగిసిన తరువాత నేను మీడియాను గౌరవిస్తా. మీ గురించి నేనేమీ అనలేదు’ అని నవ్వుకుంటూ కారు ఎక్కారు. మరోసారి మీడియా ముందే శ్రుతిహరిహరన్ అర్జున్‌సర్జాపై మీ టూ లైంగిక ఆరోపణలు గుప్పించడం గమనార్హం. -
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వార్నింగ్ ఇచ్చారా?
కర్ణాటక, యశవంతపుర: ‘కోర్టులో నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. నేనేమిటో నా అభిమాన కుటుంబానికి బాగా తెలుసు. శ్రుతి ఆరోపణలన్నీ అవాస్తవం’ అని ప్రముఖ నటుడు అర్జున్సర్జా అన్నారు. మీటూ వ్యవహారంలో అర్జున్ సర్జా పోలీస్‌స్టేషన్ మెట్లెక్కారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి శ్రుతి హరిహరన్ ఆయనపై ఆరోపణలు సంధిస్తూ బెంగళూరు కబ్బన్‌పార్క్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం తెలిసిందే. పోలీసులు సమన్లు పంపడంతో సోమవారం ఆయన కబ్బన్‌పార్క్ పోలీసుల ముందు విచారణకు హాజరై తన వాదనను వినిపించారు. ఆమె ఆరోపణలను పూర్తిగా నిరాకరిస్తున్నట్లు విచారణలో పోలీసులకు వివరించారు. శ్రుతి ఇచ్చిన ఫిర్యాదులో యుబీ సీటితో పాటు ఇతర ప్రాంతాలలోపంచనామా చేసిన విషయాలపైన కూడా అర్జున్ను సీఐ అయ్యణ్ణరెడ్డి విచారించారు. విచారణ సాగిందిలా ♦ నటి శ్రుతి ఇచ్చిన ఫిర్యాదు, మేకప్ మ్యాన్ కిరణ్, సహ నిర్మాత మోనిక ఇదిరకే ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా సీఐ అయ్యణ్ణరెడ్డి సుమారు 50 ప్రశ్నలు... ఒక్కొక్కటే అడిగి సమాధానాన్ని సేకరించారు. లైంగిక వేధింపులపై ఇప్పటికే నా అభిప్రాయాన్ని స్పష్టం చేశాను, నాపై కావాలనే కేసు పెట్టారామె, నేనెప్పుడు కూడ శ్రుతి హరిహరన్‌తో అసభ్యంగా ప్రవర్తించలేదు అని అర్జున్ చెప్పారు. ♦ ప్రెసిడెన్సి కాలేజీ అవరణలో జరిగిన షూటిం గ్లో శ్రుతితో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చెప్పారు. ఒంటిపై గిల్లి, కౌగిలించుకున్నట్లు మీ మీద అరోపణలున్నాయని పోలీసులు ప్రశ్నించగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించలేదు, కౌగిలించుకోలేదు, తాకలేదు అని అర్జున్ బదులిచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వార్నింగ్ ఇచ్చారా? ♦ బెంగళూరు దేవనహళ్లి ఆస్పత్రిలో షూటింగ్ జరుగుతుండగా అసభ్యంగా ప్రవర్తించారు, రెస్టారెంట్‌కు రా, కొంతసేపు గడుపుదాం అంటూ పిలిచిన్నట్లు ఆమె అరోపించారు. దీనికి మీ సమాధానం ఏమిటని పోలీసులు ప్రశ్నించగా తను ఆమెతో చెడుగా ప్రవర్తించలేదు, రెస్టారెంట్‌కు రమ్మని ఎప్పుడూ పిలవలేదన్నారు. ♦ దేవనహళ్లి పట్టణలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శ్రుతిహరిహరన్తో కలిసింది నిజంకాదా? రెస్టారెంట్‌కు రమ్మని పిలిచింది నిజంకాదా? ఆమెను బెదిరించిన మాట నిజంకాదా? నాతో రాకుంటే సినిమా కెరీర్‌కు ఇబ్బందులు ఉంటాయని హెచ్చరించిన మాట నిజంకాదా అని సీఐ అయ్యణ్ణ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ♦ అర్జున్ బదులిస్తూ వీటన్నింటినీ నిరాకరిస్తున్నట్లు చెప్పారు. దేవనహళ్లి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఇద్దరు ఎదురుపడిన మాట నూరు శాతం అవాస్తమన్నారు. ♦ బెంగళూరులోని యుబీ సిటీలో ఇద్దరూ ఒంటరిగా కూర్చున్న సమయంలో ఆమెను కౌగిలించుకుని రూంకు రమ్మన్నారు అని ప్రశ్నించగా, ఆమెపై లైంగిక వేధింపుగాని, అసభ్యంగా ప్రవర్తించిది కానీ లేదన్నారు. మొత్తంగా అన్ని ఆరోపణలను అర్జున్ తోసిపుచ్చారు. అకారణంగా ఆరోపణలు చేస్తున్నారని స్పష్టంచేశారు. ♦ విచారణకు అర్జున్ తనయుడు ధ్రువ సర్జా, మేనల్లుడు చిరంజీవి సర్జాతో కలిసి పీఎస్‌కు వచ్చారు. వీరి రాక గురించి తెలుసుకున్న అభిమానులు భారీసంఖ్యలో చేరుకున్నారు. దీనితో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. -
కష్టాల్లో హీరోలు
వెండి తెరపై సాహసోపేతంగా పోరాటాలు చేసి అభిమానులను మైమరిపించే ఇద్దరు సినీ హీరోలు నిజజీవితంలో కేసుల సుడిలో చిక్కుకున్నారు. మీ టూ కేసులో అర్జున్ సర్జా, కూతురు ఫిర్యాదు చేయడంతో దునియా విజయ్‌లకు తాఖీదులందాయి. పోలీసుపై దాడి కేసులో దునియాపై కోర్టులో చార్జిషీటు కూడా దాఖలైంది. సోమవారం కబ్బన్‌పార్క్ పీఎస్‌కు జెంటిల్మెన్ వస్తారా?, లేదా? అన్నది సస్పెన్స్. సాక్షి బెంగళూరు/ యశవంతపుర : చిత్రసీమలో సంచలనం సృష్టించిన మీ టూ లైంగిక వేధింపుల వ్యవహారంలో ప్రముఖ నటుడు అర్జున్ సర్జాపై నటి శ్రుతి హరిహరన్ దాఖలు చేసిన కేసు విచారణను కబ్బన్ పార్కు పోలీసులు ముమ్మరం చేశారు. అర్జున్ సర్జాకు ఆదివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాలని అందులో సూచించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్‌పై కేంద్రీకృతమైంది. అర్జున్ సోమవారం విచారణకు హాజరవుతారా?, లేదా అన్నది తెలియాల్సి ఉంది. రెండేళ్ల కిందట విస్మయ చిత్రం షూటింగ్ సమయంలో అర్జున్ తనపై లైంగికంగా వేధించారని శ్రుతి రెండువారల కిందట ఆరోపించడం తెలిసిందే. ప్రముఖ నటుడు అంబరీష్ సహా సినీపెద్దలు రాజీ ప్రయత్నం చేసినా ఇద్దరూ మెట్టుదిగలేదు. శ్రుతి కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్లో అర్జున్‌పై ఫిర్యాదు చేయడం కేసు నమోదు చేశారు. శ్రుతి పేర్కొన్న సాక్షులను కూడా విచారించారు. దునియా విజయ్‌కు మహిళా కమిషన్ నోటీస్ పానిపూరి కిట్టిపై దాడి, మొదటి భార్య, కూతురిపై దౌర్జన్యం తదితర కేసులతో సతమతమవుతున్న హీరో దునియా విజయ్‌కు మహిళ కమిషన్ నోటీసులను జారీ చేసింది. ఇటీవల మొదటి భార్య నాగరత్న, కూతురు మోనికాలతో విజయ్ గొడవ జరగడం తెలిసిందే. తనకు తండ్రి నుండి రక్షణ లేదని ఆరోపిస్తూ కూతురు మోనికా మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ నెల 12 లేదా 13న తమ ముందు హాజర్ కావాలని మహిళా కమిషన్ నోటీస్‌లో ఆదేశించింది. దునియా–మోనికా ఇద్దరిని ఒకచోట చేర్చి న్యాయ పంచాయితీ చేసే అవకాశం ఉంది. చార్జిషీటు దాఖలు దర్శకుడు సుందరగౌడను పోలీసులు అరెస్ట్ చేయటానికి వెళ్లగా దునియా విజయ్ పోలీసులకు ఆటంకం కలిగించిన కేసులో చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులు కోర్టులో చార్జిషీట్‌ను సమర్పించారు. తనను అడ్డుకుని దాడి చేశాడని హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌పై 65 పేజీల అభియోగపత్రాన్ని సమర్పించారు. -
నాపై కేసు కొట్టేయండి
సాక్షి బెంగళూరు: కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాల్సిందిగా హైకోర్టులో దక్షిణాది బహుభాషా నటుడు అర్జున్ సర్జా పిటిషన్ దాఖలు చేశారు. నటుడు అర్జున్ తరఫు న్యాయవాది శ్యామ్ సుందర్ ఈ పిటిషన్‌ను వేశారు. నటి శ్రుతి హరిహరణ్ తనపై కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని పిటిషన్లో తెలిపారు. శ్రుతి చేసిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేశారు. కేవలం ప్రచారం కోసం తనపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అర్జున్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అర్జున్ 37 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారని, 150కి పైగా సినిమాల్లో నటించారని ఆయన తరఫున న్యాయవాది తెలిపారు. అర్జున్ హనుమాన్ భక్తుడని, చెన్నైలో 32 అడుగుల పొడవు, 17 అడుగుల వెడల్పు ఉన్న ఆంజనేయ విగ్రహాన్ని నిర్మించారని తెలిపారు. శ్రుతి చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఆమె ఆరోపణల వల్ల అర్జున్ కుటుంబం మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నారు. నవంబర్ 2కు వాయిదా.. నటుడు అర్జున్‌పై నమోదైన కేసు విచారణతో పాటు అర్జున్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో దాఖలు చేసిన కేసు విచారణ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది. నగరంలోని మేయోహాల్ 22వ సీసీహెచ్ హాల్లో వాద, ప్రతివాదనలు వినిపించారు. ఈ విచారణలో అర్జున్ తరపు న్యాయవాది శ్యామ్ సుందర్ తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని న్యాయమూర్తిని విన్నవించారు. ఆయన విజ్ఞప్తిని మన్నించిన జడ్జి విచారణను నవంబర్ 2కు వాయిదా వేశారు. అంతకుముందు ఈ కేసు విచారణలో భాగంగా శ్రుతి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మీటూ కేసులో పోలీసులు చాలా నెమ్మదిగా విచారణ చేపడుతున్నారని ఆమె తరఫు న్యాయవాది అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. తనిఖీని నిదానంగా చేస్తూ నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సాకు‡్ష్యలను ఇప్పటివరకు పోలీసులు విచారించనే లేదని తెలిపారు. పోలీసులు ఉద్ధేశపూర్వకంగానే దర్యాప్తును ఆలస్యంగా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రుతికి రక్షణ కల్పించండి.. శ్రుతి హరిహరణ్ మీటూ కేసుకు సంబంధించి అర్జున్ లేదా ఆయన అభిమానుల నుంచి ఆమెకు ప్రాణహాని ఉందని మహిళా కమిషన్ తెలిపింది. శ్రుతికి ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని మహిళా కమిషన్ నాగలక్ష్మి బాయి కోరారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ టి.సునీల్ కుమార్‌కు నాగలక్ష్మి బాయి లేఖ రాశారు. -
అర్జున్ను అరెస్టు చేయాలి
సాక్షి, బెంగళూరు: మీ టూ వివాదం మరింతగా ముదురుతోంది. మీ టూ ఆరోపణలకు ప్రతిగా నటి శ్రుతి హరిహరన్పై ప్రముఖ నటుడు అర్జున్ సర్జా వేసి పరువు నష్టం దావా కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. విస్మయ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి శ్రుతి వారంరోజుల క్రితం ఆరోపించి సంచలనం రేకెత్తించడం తెలిసిందే. అర్జున్‌పై ఆమె శనివారం కబ్బన్‌పార్క్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రుతి తరఫు న్యాయవాది అనంతనాయక్ కబ్బన్‌పార్కు పోలీసు స్టేషన్‌కు వెళ్లి శ్రుతి ఫిర్యాదు ఆధారంగా అర్జున్ను అరెస్టు చేయాలని విన్నవించారు. అర్జున్ బయటే ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అర్జున్ను అరెస్టు చేయకపోతే విచారణ పారదర్శకంగా జరిగే అవకాశం ఉండబోదన్నారు. అర్జున్, అభిమానులపై శ్రుతి మరో కేసు అర్జున్ సర్జాపై శ్రుతి మరో కేసు దాఖలు చేశారు. సోమవారం ఉదయం ఆమె మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి అర్జున్, ఆయన అభిమానులపై ఫిర్యాదు చేశారు. అర్జున్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోర్టులోనూ అరెస్టుకు వినతి గతంలో శ్రుతి నిరాధార ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించిందని అర్జున్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో కేసు దాఖలు చేశారు. ఆ కేసు విచారణ సోమవారం నగరంలోని 22వ సీసీహెచ్ కోర్టు హాల్లో జరిగింది. శ్రుతి తరఫు న్యాయవాది జైనా కొఠారి వాదిస్తూ అర్జున్ను అరెస్టు చేయాలని న్యాయ మూర్తికి విజ్ఞప్తి చేశారు. కేసు విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. -
అర్జున్ సన్నిహితుడిపై శ్రుతి ఫిర్యాదు.. కోర్టుకు మీటూ!
సాక్షి బెంగళూరు: నటి శ్రుతి హరిహరన్ ఫిర్యాదు చేసిన 15 గంటల తర్వాత పోలీసులు అర్జున్ సర్జా సన్నిహితుడు ప్రశాంత్ సంబర్గిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. గత రాత్రి ప్రశాంత్‌పై నగరంలోని హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్లో శ్రుతి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల నుంచి విమర్శలు రావడంతో ప్రశాంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రశాంత్‌పై ఐపీసీ సెక్షన్ 506 (బెదిరింపు), 509 (మహిళను అవమానించేలా మాట్లాడడం) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు అర్జున్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో దాఖలు చేసిన కేసులపై పోలీసులు స్పందిస్తున్నారు. ఈ కేసులో శ్రుతికి పోలీసులు నోటీసులుజారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఫిర్యాదు ఏంటి? శుక్రవారం ఫిల్మ్ చాంబర్లో జరిగిన సమావేశానికి హాజరైన సమయంలో అక్కడ తన వివాదా నికి సంబంధించి కొంతమంది వ్యక్తులు తనను దుర్భాషలు ఆడినట్లు, అర్జున్ సర్జా సన్నిహితు డు ప్రశాంత్ కొంతమంది గుండాలతో గుమిగూ డి తనను దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో శ్రుతి పేర్కొన్నారు. అంతేకాకుండా చంపేస్తామంటూ తనను బెదిరిస్తున్నారని తెలిపారు. అర్జున్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఈ సమయంలో తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు ప్రతిలో శ్రుతి పేర్కొన్నారు. కోర్టులో విచారణ... నటి శ్రుతి హరిహరణ్ విరుద్ధంగా అర్జున్ వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ మేయోహాల్ కోర్టు ముందుకు వచ్చింది. శుక్రవారం ఈ కేసు కు సంబంధించి న్యాయమూర్తి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రుతి తరఫున అడ్వొకేట్ కొఠారియా తమ వాదన వినిపించేందుకు గడువు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. ఆయన విజ్ఞప్తిని మన్నించిన న్యాయమూర్తి ఈ కేసు విచారణను 29కు వాయిదా వేశారు. తనకు బెదిరింపులు : తాను మీటూ గురించి మాట్లాడిన తర్వాత బెదిరింపులు ఫోన్ కాల్స్ వచ్చాయని కన్నడ నటి హర్షికా పూణచా తెలిపారు. బెదిరింపులకు తాను భయపడనని తెలిపారు. మీటూ వివాదంలో తాను ఎవరిపక్షం కాదని, అలాగని ఎవరికి వ్యతిరేకం కూడా కాదని తెలిపారు. మీటూ వివాదంపై మాట్లాడుతుంటే చాలా మంది పబ్లిసిటీ అని మాట్లాడుతున్నారని, ఇది సరికాదని తెలిపారు. కొంతమంది పబ్లిసిటీ కోసం కూడా వివాదాలు సృష్టిస్తారని తెలిపారు. -
మెట్టు దిగని శ్రుతి, అర్జున్
శృతి హరిహరన్– అర్జున్ మీటూ గొడవకు శుభం కార్డు పడలేదు. కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండ లిలో సీనియర్ నటుడు అంబరీష్.. ఈ ఇద్దరికీ చేసిన హితోపదేశం ఫలించలేదు. తాడోపేడో తేల్చుకోవడానికే ఇద్దరూ సిద్ధం కావడంతో మునుముందు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. సాక్షి బెంగళూరు: మీ టూ వివాదంలో నటి శ్రుతి హరిహరణ్, నటుడు అర్జున్ సర్జా మధ్య జరిగిన రాజీ సమావేశం పూర్తిగా విఫలమైందని రెబెల్ స్టార్ అంబరీశ్ తెలిపారు. ఇద్దరు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా లేరని, ఇద్దరూ పంతంతో ఉన్నారని తెలిపారు. కన్నడ సినీ రంగంలో పెద్ద మనిషిగా ఇద్దరి మధ్యం రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించానని, కానీ కుదరలేదని ఆయన తెలిపారు. బుధవారం చలనచిత్ర వాణిజ్యమండలి కార్యాలయంలో అంబి ఆధ్వర్యంలో జరిగిన రాజీచర్చలకు శ్రుతి, అర్జున్‌లు హాజరయ్యారు. భేటీ అనంతరం అంబి మాట్లాడుతూ ‘సీనియర్ నటుడిగా నా అనుభవంతో నాలుగు మాటలు చెప్పి సర్దిచెప్పాలని చూశా. ఇద్దరికి ఒక్కో అవకాశం ఇచ్చాను. వారు రాజీకి ఒప్పుకోలేదు. వినడం వినకపోవడం వారి చేతుల్లో ఉంది. మీటూ, సీ టూ అవేంటో నాకైతే తెలియదు. శ్రుతి, అర్జున్లిద్దరూ ఎలాంటి సాక్ష్యాధారాలు సమర్పించలేదు. ఈ వివాదం వల్ల చిత్రరంగానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ కేసులో నేను ఎవరి వైపు మొగ్గు చూపడం లేదు. నా సినీ జీవితంలో ఇంతటి వివాదం ఎప్పుడూ చూడలేదు’ అని అంబి పేర్కొన్నారు. కోర్టులోనే తేల్చుకుంటా: అర్జున్ అర్జున్ మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలపై తాను నిశ్శబ్ధంగా ఉండడం వల్ల అభిమానులు, తన కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా బాధ పడుతున్నారని తెలిపారు. ఈ ఆరోపణలపై కచ్చితంగా కోర్టుకు వెళతానని, అక్కడే ఈ వివాదంపై తేల్చుకుంటానని తెలిపారు. కేసు కోర్టులో ఉండడంతో దీనిపై ఎక్కువగా మాట్లాడలేననితెలిపారు. తాను రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. మీటూ అనేది మహిళలు, యువతిలకు మంచి వేదికని, కానీ దాన్ని దుర్వినియోగం చేయవద్దని అన్నారు. తనపై ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో కూడా తెలియడం లేదన్నారు. నేనేందుకు క్షమాపణ చెప్పాలి: శ్రుతి ఒక మహిళ ధైర్యంగా బయటకొచ్చి మాట్లాడుతుంటే సమాజం ఎందుకు కించపరుస్తుందో అర్థం కావడం లేదని నటి శ్రుతి హరిహరణ్ చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటప్పుడు తానెందుకు క్షమాపణ చెప్పాలన్నారు. అర్జున్‌పై తాను ఎలాంటి కేసు వేయలేదని, ఆయనే తనపై రెండు కేసులు నమోదు చేశారని తెలిపారు. అర్జున్ ఫిర్యాదు చేయడం తనకు సంతోషంగా ఉందని, మున్ముందు ఈ కేసుల్లో తాను న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. ఈ వివాదంలో రాజీ పడేది లేదన్నారు. -
నా కూతుర్ని నేనెందుకు అడ్డుకోవాలి?
సౌత్‌తోపాటు నార్త్ మొత్తం అన్ని భాషల్లో నటిస్తూ.. ఇండస్ట్రీలో 38 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు నటుడు అర్జున్ సార్జా. ఆయన తనయ ఐశ్వర్య అర్జున్ ఐదేళ్ల క్రితమే సినిమాల్లోకి అడుగుపెట్టినా.. అదృష్టం అంతగా కలిసి రాలేదు. దీంతో ఆమె తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే హాట్ టాపిక్ ‘కాస్టింగ్ కౌచ్’ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ స్పందించారు. ‘ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవమే. ప్రతీ ఫీల్డ్‌లోనూ అది ఉంది. ఇండస్ట్రీపై చాలా మందికి చెడు అభిప్రాయం ఉండొచ్చు. కానీ, మంచి చెడుల ఎంపిక మన చేతుల్లోనే ఉంటుంది. మంచి మార్గాన్ని ఎంచుకున్నప్పుడూ ఎవరూ అడ్డుకోరు. చెడు రూట్లో వెళ్తే అది వాళ్ల దురదృష్టం. ఏదో జరుగుతుందని నా కూతురిని సినిమాల్లోకి రానీయకుండా నేను అడ్డుకోవాలా? అలాగైతే మిగతా వాళ్ల సంగతి ఏంటి? వాళ్లూ వాళ్ల కూతుళ్లను రానిస్తున్నారు కదా. స్టార్లు కూడా అందుకు మినహాయింపు కాదు. నేను ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా ఉన్నా. అలాంటప్పుడు అన్నీ తెలిసి నేనెందుకు భయపడాలి. నా కూతురిని నేనెందుకు అడ్డుకోవాలి’ అని యాక్షన్ కింగ్ కుండబద్ధలు కొట్టేశారు. -
‘అభిమన్యుడు’ మూవీ రివ్యూ
టైటిల్ : అభిమన్యుడు జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : విశాల్, అర్జున్, సమంత, ఢిల్లీ గణేష్ తదితరులు సంగీతం : యువన్ శంకర్ రాజా నిర్మాత : విశాల్ దర్శకత్వం : పీఎస్ మిత్రన్ కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విశాల్, టాలీవుడ్లో మార్కెట్ సాధించేందుకు చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. గతంలో అతను నటించిన కొన్ని చిత్రాలు ఇక్కడా విజయాలు సాధించి విశాల్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అదే ఊపులో మరో డిఫరెంట్ ఎంటర్టైనర్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్. కోలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ఇరుంబు తిరై సినిమాను తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదం చేసి రిలీజ్ చేశారు. మరి అభిమన్యుడుగా విశాల్ ఆకట్టుకున్నాడా..? కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిందా..? చూద్దాం కథ : కరుణ(విశాల్) ఆర్మీ మేజర్. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఆవేశపరుడైన ఆఫీసర్. కుటుంబ సమస్యల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కరుణ ఫేక్ డాక్యుమెంట్స్‌తో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ తీసుకున్న లోన్ డబ్బులు నిమిషాల్లోనే బ్యాంక్ ఎకౌంట్ నుంచి మాయం అవుతాయి. దీంతో హీరో ఏం చేయాలలో తెలియని పరిస్థితుల్లో నిస్సహాయుడిగా మిగిలిపోతాడు. హీరో అకౌంట్ నుంచి డబ్బు ఎలా మాయం అయ్యింది..? ఈ నేరాల వెనకు ఉన్న వైట్ కాలర్ పెద్ద మనిషి ఎవరు..? ఈ సైబర్ క్రైమ్‌ను హీరో ఎలా చేధించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : విశాల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత మెచ్యూర్డ్‌గా కనిపించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో విశాల్ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. మిలటరీ ఆఫీసర్‌గా విశాల్ లుక్ సూపర్బ్ అనిపించేలా ఉంది. సినిమాలో మరో కీలక పాత్ర ప్రతినాయకుడు అర్జున్. వైట్ డెవిల్ పాత్రకు అర్జున్ వంద శాతం న్యాయం చేశాడు. అర్జున్ను తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేని స్థాయిలో ఉంది ఆయన నటన. ముఖ్యంగా విశాల్, అర్జున్‌ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరి నటన సూపర్బ్. హీరోయిన్ సమంత రెగ్యులర్ కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రే. పాటలు, కామెడీ సీన్స్ తప్ప ఆ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవటానికేం లేదు. విశ్లేషణ : దర్శకుడు మిత్రన్ నేటి డిజిటల్ లైఫ్‌కు తగ్గ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశాల్ బాడీ లాంగ్వేజ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అభిమన్యుడు సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కు సంబంధించి సన్నివేశాలను తెరకెక్కించేందుకు మిత్రన్ చేసిన పరిశోధన తెర మీద కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారం ఎలా చోరికి గురవుతుందన్న అంశాలను చాలా బాగా చూపించాడు. అయితే హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు తొలి భాగంలో చాలా సేపు రొటీన్ సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. అసలు కథ మొదలైన తరువాత సినిమా వేగం అందుకుంటుంది. అయితే పూర్తిగా టెక్నాలజీకి సంబంధించిన కథ కావటంతో సామాన్య ప్రేక్షకులు ఏ మేరకు అర్థం చేసుకోగలరో చూడాలి. యువన్ శంకర్ రాజా థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఇంటెన్స్ మ్యూజిక్ తో మెప్పించాడు. సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫి. జార్జ్ సీ విలియమ్స్ తన కెమెరా వర్క్‌తో సినిమా మూడ్‌ను క్యారీ చేశారు. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తొలి భాగంలో అనవసర సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : అర్జున్ నటన నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : తొలి భాగంలో కొన్ని బోరింగ్ సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్