అర్జున్‌పై పోరాటాన్ని తీవ్రం చేసిన శ్రుతి
సాక్షి, బెంగళూరు: మీ టూ వివాదం మరింతగా ముదురుతోంది. మీ టూ ఆరోపణలకు ప్రతిగా నటి శ్రుతి హరిహరన్‌పై ప్రముఖ నటుడు అర్జున్ సర్జా వేసి పరువు నష్టం దావా కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. విస్మయ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి శ్రుతి వారంరోజుల క్రితం ఆరోపించి సంచలనం రేకెత్తించడం తెలిసిందే. అర్జున్‌పై ఆమె శనివారం కబ్బన్‌పార్క్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రుతి తరఫు న్యాయవాది అనంతనాయక్ కబ్బన్‌పార్కు పోలీసు స్టేషన్‌కు వెళ్లి శ్రుతి ఫిర్యాదు ఆధారంగా అర్జున్‌ను అరెస్టు చేయాలని విన్నవించారు. అర్జున్ బయటే ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అర్జున్‌ను అరెస్టు చేయకపోతే విచారణ పారదర్శకంగా జరిగే అవకాశం ఉండబోదన్నారు.
అర్జున్, అభిమానులపై శ్రుతి మరో కేసు
అర్జున్ సర్జాపై శ్రుతి మరో కేసు దాఖలు చేశారు. సోమవారం ఉదయం ఆమె మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి అర్జున్, ఆయన అభిమానులపై ఫిర్యాదు చేశారు. అర్జున్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.
కోర్టులోనూ అరెస్టుకు వినతి
గతంలో శ్రుతి నిరాధార ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించిందని అర్జున్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో కేసు దాఖలు చేశారు. ఆ కేసు విచారణ సోమవారం నగరంలోని 22వ సీసీహెచ్ కోర్టు హాల్‌లో జరిగింది. శ్రుతి తరఫు న్యాయవాది జైనా కొఠారి వాదిస్తూ అర్జున్‌ను అరెస్టు చేయాలని న్యాయ మూర్తికి విజ్ఞప్తి చేశారు. కేసు విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment