sruthi hariharan
-
MeToo Case: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్
కర్ణాటక: నటి శుత్రి హరిహరన్ మీటూ కేసు కొత్త మలుపు తిరిగింది. బీ రిపోర్ట్ ప్రశ్నిస్తూ శ్రుతికి కోర్టు నోటీసు జారీ చేసింది. బెంగళూరు 8వ ఎసిఎంఎం కోర్టు శ్రుతికి నోటీసు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు సమర్పించాలని పోలీసులకు సూచించింది. 2018లో బహుభాష నటుడు అర్జున్‌పై నటి శుత్రి హరిహరన్ మీటూ ఆరోపణలు చేసింది. కేసుకు సంబంధించి అర్జున్‌పై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు కోర్టుకు బీ రిపోర్టు సమర్పించారు. దీంతో కోర్టు శ్రుతికి, పోలీసులకు నోటీసులు ఇచ్చారు. -
లైంగిక వేధింపుల కేసు.. ప్రముఖ నటికి షాకిచ్చిన హైకోర్టు
ప్రముఖ కన్నడ నటి శృతి హరిహరన్‌కు కోర్టులో చుక్కెదురైంది. లైంగిక వేధింపుల కేసులో ఆమెకు వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులిచ్చింది. సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ సంబర్గిపై విచారణ నిలిపేయాలంటూ కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. గతంలో నటుడు అర్జున్ సర్జాతో పాటు నిర్మాత ప్రశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శృతి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసులో తనపేరు తొలగించాలని ప్రశాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రశాంత్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో స్టే విధించింది. ప్రశాంత్ వేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 1, 2023న చేపట్టనున్నట్లు వెల్లడించింది. అసలేం జరిగిందంటే.. మరో నటుడు అర్జున్ సర్జా, నిర్మాత ప్రశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శృతి హరిహరన్పై పోలీసులను ఆశ్రయించింది. విస్మయ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. అక్టోబర్ 2018లో అర్జున్, శృతి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రముఖ నటుడు అంబరీష్ మధ్యవర్తిత్వంలో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాన్ని కూడా నిర్వహించింది. కానీ ఈ కేసులో రాజీ కుదర్చలేకపోయారు. ఈ కేసు కోసం న్యూయార్క్ నుంచి శృతికి నిధులు సమకూరాయని గతంలో నిర్మాత ప్రశాంత్ ఆరోపించారు. -
మీటు అన్నాక సినిమాలు రాలేదు
యశవంతపుర: తనపై జరిగిన లైంగిక వేధింపులపై మీ టూ ద్వారా బహిరంగం చేసినందుకు గర్వంగా ఉందని నటి శ్రుతి హరిహరన్ చెప్పారు. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక చర్చాగోష్టిలో ఆమె మాట్లాడారు. మీ టు అనడంలో సిగ్గుపడవలసిన పని లేదు. న్యాయపరంగా నా పోరాటం కొనసాగుతోంది. మీ టూ గురించి మాట్లాడినప్పటి నుంచి నాకు సినిమా అవకాశాలు తగ్గాయి. అప్పటి నుంచిఒక్క సినిమా అవకాశం రాలేదు. దీనిపై చింతించబోను. ఏడాది నుంచి భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నా. ఈ సారి జాతీయ చలనచిత్ర అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇలాగైనా మళ్లీ నటించే చాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. మీటూ వంటి విషయాలకు ఎలాంటి సాక్ష్యాలుండవు. కేసును దైర్యంగా ఎదుర్కోవాలి. నాకు జరిగిన అనుభవం మీకు కూడా జరక్కుండా ఉండాలంటే చూస్తూ కూర్చోకండి అని చెప్పారు. -
గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి
చెన్నై,పెరంబూరూ: తాను నిండు గర్భిణినన్న విషయాన్ని ఫొటోలతో సహా వెల్లడించింది నటి శ్రుతీ హరిహరన్. కన్నడ చిత్ర సీమలో ప్రముఖ నటిగా రాణించిన ఈ అమ్మడు తమిళంలోనూ నిలా, రారా రాజశేఖర, నెరింగివా ముత్తమిడాదే, నిపుణన్ వంటి చిత్రాల్లో నటించింది. అంత కంటే ఎక్కువగా నటుడు అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని, ఆరోపించి వార్తల్లోకెక్కింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంతో పెద్ద కలకలమే రేపింది. అయితే ఆమె వివాహిత అనే విషయం చాలా మందికి తెలియదు. అర్జున్ లైంగిక వేధింపుల కేసులో పోలీసులకు చేసిన ఫిర్యాదులో తనకు పెళ్లైందన్న విషయాన్ని బయటపెట్టింది. ఆ విషయం పక్కన పెడితే నటుడు, రచయితను గత ఏడాది రహస్యంగా పెళ్లి చేసుకుంది. అంతకు ముందు నాలుగేళ్లుగా వారిద్దరూ పేమలో ఉన్నారు. అయితే తన కెరీర్ దృష్ట్యా శ్రుతీ హరిహరన్ తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచింది. అలాంటిది ఇప్పుడామె నిండు గర్భిణి. తాను గర్భంతో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్ట్రాగాంలో పోస్ట్ చేసి ఆ విషయాన్ని బహిర్గతం చేసింది. వాటికి ‘నా జీవితం ఇప్పుడు నీ (కడుపులో బిడ్డ) గుండె చప్పుళ్లతో నెలకొంది. ఇదే నా జీవిత కొత్త పయనం. ప్రపంచమనే సర్కస్‌లోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను. అందుకోసం ఎక్కువ కాలం ఎదురు చూడలేను’ అంటూ ట్యాగ్‌లైన్ యాడ్ చేసింది. అవికాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
నటుడు అర్జున్ సర్జాకు హైకోర్టులో ఊరట
కర్ణాటక, యశవంతపుర : మీటూ అరోపణలు ఎదుర్కోంటున్న నటుడు అర్జున్ సర్జాకు హైకోర్టులో స్వల్ప ఊరట కలిగింది. శ్రుతిహరిహరన్ ఫిర్యాదుతో దాఖాలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని అర్జున్ సర్జా దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టి డిసెంబర్ 11కు వాయిదా వేసింది. అప్పుటి వరకు అర్జున్‌సర్జాపై ఏలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులకు సూచించింది. -
యాక్షన్కింగ్ను వదలా..!
సినిమా: నటుడు అర్జున్ను వదిలేదు లేదు అంటోంది నటి శ్రుతీహరిహరన్. దక్షిణాదిలో యాక్షన్‌కింగ్‌గా పేరుతెచ్చుకున్న నటుడు అర్జున్. అలాంటి నటుడు ఇప్పుడు మీటూలో చిక్కుకున్నాడు. నిపుణన్ చిత్రంలో నటిస్తున్న సమయంలో అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆ చిత్ర కథానాయకి శ్రుతీహరిహరన్ చేసిన ఆరోపణలు కలకలానికి దారి తీయడంతో పాటు నటుడు అర్జున్ ఇమేజ్ను డామేజ్ చేశాయి. అయితే శ్రుతీహరిహరన్ ఆరోపణల్లో నిజం లేదంటూ అర్జున్ పేర్కొనడంతో పాటు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నటి శ్రుతీహరిహరన్ కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి కన్నడ సినీ ప్రముఖులు కొందరు రాయబారం నడిపినా ఫలితం లేకపోయ్యిందనే ప్రచారం జరుగుతోంది. అర్జున్‌తో రాజీకి నటి శ్రుతీహరిహరన్ ససేమీరా అంటోందని సమాచారం. దీంతో శ్రుతి ఆరోపణలతో పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంతో నటుడు అర్జున్ బెంగళూర్ కోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. అయినా అర్జున్ను వదిలేది లేదంటోంది నటి శ్రుతీహరిహరన్. ఈమె ఈ విషయమై బెంగుళూర్లోని మహిళా కమిషన్‌ను ఆశ్రయించి అర్జున్‌పై ఫిర్యాదు చేసి ఆయనపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. దీనిపై శ్రుతీహరిహరన్ ఒక భేటీలో పేర్కొంటూ తాను అర్జున్‌పై చేసిన ఆరోపణలకన్నింటికీ ఆధారాలున్నాయని అంది. ఆయనపై ఫిర్యాదు చేసినందుకుగానూ తనపై అర్జున్ కేసు వేశారని చెప్పింది. దాన్ని తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని, అదే విధంగా తాను చేసిన ఆరోపణలకు కోర్టులో ఆధారాలను సమర్పిస్తానని అంది. అదేవిధంగా అర్జున్ మద్దతుదారులు తనను బెదిరిస్తున్నారని, ఆ విధంగా అర్జున్ దొరికిపోయాడని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆయన్ని వదిలేదని శ్రుతీహరిహరన్ అంటోంది. -
నేను చక్కెర, మీరు చీమలు
కర్ణాటక, యశవంతపుర: ‘నాకు భయం లేదు. నా ప్రాణానికి హాని ఉందని తెలిసినా లెక్కచేయటం లేదు’ అని ప్రముఖ నటుడు అర్జున్ సర్జాపై మీటూ లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనం సృష్టించిన నటీ శ్రుతి హరిహరన్ అన్నారు. మీ టూ అని ఆరోపించి, మళ్లీ క్షమాపణ చెప్పిన నటి సంజన మాదిరిగా తనలో పిరికితనం లేదన్నారు. నటుడు అర్జున్‌సర్జాపై మీటూ లైంగిక ఆరోపణలపై శ్రుతి హరిహరన్ బుధవారం బెంగళూరులో మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. అర్జున్‌పై తను చేసిన ఆరోపణల గురించి వివరించారు. మీ టూపై సుమోటోగా కేసు దాఖలు చేసి రెండుసార్లు నోటీసులు జారీచేసినా స్పందిండం లేదని కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి ఇదివరకే అసహనం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో శ్రుతి న్యాయవాది అనంత్నాయ్తో కలిసి హాజరై తన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. నాగలక్ష్మీబాయిశ్రుతిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసి సంతకం తీసుకున్నారు. విస్మయ సినిమా షూటింగ్లో తనకు అర్జున్ నుంచి చేదు అనుభవాలు ఎదురైనట్లు శ్రుతి ఏకరువుపెట్టారు. వరుస సెలవుల కారణంగా గత వారంలో విచారణకు రాలేకపోయిన్నట్లు చెప్పారు. సోషల్ మీడియాకు ఎక్కడం సరికాదు ఆమెకు ఎదురైన లైంగిక వేధింపులకు సంబంధించి మహిళ కమీషన్కుగాని, లేదా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలేగాని ఇలా సోషల్ మీడియాకు ఎక్కడం సరికాదని నాగలక్ష్మీబాయి శ్రుతికి సూచించారు. ఈ కేసు ఇప్పటికే కోర్టులో ఉన్నందున ఎవరి తరఫున మాట్లాడబోనని నాగలక్ష్మీబాయి తెలిపారు. శ్రుతి తెలిపిన వివరాలను మాత్రమే తీసుకొంటామన్నారు. సంజన క్షమాపణలపై శ్రుతి అసంతృప్తి ‘నాకు భయం లేదు. నా ప్రాణానికి హాని ఉందని తెలిసినా లెక్కచేయటం లేదు’ అని నటీ శ్రుతి హరిహరన్ అన్నారు. సంజన క్షమాపణలను చెప్పడం చూస్తే తనకు అసంతృప్తిగా ఉందన్నారు. సినిమా రంగంలో ఉన్న మహిళలు ఏదో ఒక విధంగా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు అమె ఆరోపించారు. మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి తనతో చర్చించిన తీరు సంతోషకరంగా ఉందన్నారు. మహిళ కమిషన్ ద్వారా మహిళలకు న్యాయం దొరుకుతుందనే భావన తనలో ఉందన్నారు. తన వద్దనున్న సాక్ష్యాలను ఆమెకు వివరించినట్లు తెలిపారు. తను అనవసరంగా ఆరోపణలు చేయలేదని ఆమెకు తెలిపానన్నారు. ఎఫ్ఐఆర్ రద్దు పిటిషన్ వాయిదా బెంగళూరు సైబర్ క్రైం పోలీసుస్టేషన్లో నటి శ్రుతి హరిహరన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్ వచ్చే వారానికి వాయిదా పడింది. నటుడు అర్జున్ సర్జాపై అవహేళనగా మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై అర్జున్ మేనేజర్ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సునీల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి శ్రుతిపై పోలీసులు ఎఫ్ఐఆర్ను దాఖలు చేశారు. అయితే తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని శ్రుతి హైకోర్టుకెళ్లారు. నేను చక్కెర, మీరు చీమలు ఈ సందర్భంగా అక్కడ గుమిగూడిన విలేకరులపై శ్రుతి వ్యంగ్యోక్తులు విసిరారు. ‘నేను చక్కె రలా ఉన్నాను, మీరు చీమల మాదిరిగా నా వెంట పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. విచారణ ముగిసిన తరువాత నేను మీడియాను గౌరవిస్తా. మీ గురించి నేనేమీ అనలేదు’ అని నవ్వుకుంటూ కారు ఎక్కారు. మరోసారి మీడియా ముందే శ్రుతిహరిహరన్ అర్జున్‌సర్జాపై మీ టూ లైంగిక ఆరోపణలు గుప్పించడం గమనార్హం. -
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వార్నింగ్ ఇచ్చారా?
కర్ణాటక, యశవంతపుర: ‘కోర్టులో నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. నేనేమిటో నా అభిమాన కుటుంబానికి బాగా తెలుసు. శ్రుతి ఆరోపణలన్నీ అవాస్తవం’ అని ప్రముఖ నటుడు అర్జున్సర్జా అన్నారు. మీటూ వ్యవహారంలో అర్జున్ సర్జా పోలీస్‌స్టేషన్ మెట్లెక్కారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి శ్రుతి హరిహరన్ ఆయనపై ఆరోపణలు సంధిస్తూ బెంగళూరు కబ్బన్‌పార్క్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం తెలిసిందే. పోలీసులు సమన్లు పంపడంతో సోమవారం ఆయన కబ్బన్‌పార్క్ పోలీసుల ముందు విచారణకు హాజరై తన వాదనను వినిపించారు. ఆమె ఆరోపణలను పూర్తిగా నిరాకరిస్తున్నట్లు విచారణలో పోలీసులకు వివరించారు. శ్రుతి ఇచ్చిన ఫిర్యాదులో యుబీ సీటితో పాటు ఇతర ప్రాంతాలలోపంచనామా చేసిన విషయాలపైన కూడా అర్జున్ను సీఐ అయ్యణ్ణరెడ్డి విచారించారు. విచారణ సాగిందిలా ♦ నటి శ్రుతి ఇచ్చిన ఫిర్యాదు, మేకప్ మ్యాన్ కిరణ్, సహ నిర్మాత మోనిక ఇదిరకే ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా సీఐ అయ్యణ్ణరెడ్డి సుమారు 50 ప్రశ్నలు... ఒక్కొక్కటే అడిగి సమాధానాన్ని సేకరించారు. లైంగిక వేధింపులపై ఇప్పటికే నా అభిప్రాయాన్ని స్పష్టం చేశాను, నాపై కావాలనే కేసు పెట్టారామె, నేనెప్పుడు కూడ శ్రుతి హరిహరన్‌తో అసభ్యంగా ప్రవర్తించలేదు అని అర్జున్ చెప్పారు. ♦ ప్రెసిడెన్సి కాలేజీ అవరణలో జరిగిన షూటిం గ్లో శ్రుతితో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చెప్పారు. ఒంటిపై గిల్లి, కౌగిలించుకున్నట్లు మీ మీద అరోపణలున్నాయని పోలీసులు ప్రశ్నించగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించలేదు, కౌగిలించుకోలేదు, తాకలేదు అని అర్జున్ బదులిచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వార్నింగ్ ఇచ్చారా? ♦ బెంగళూరు దేవనహళ్లి ఆస్పత్రిలో షూటింగ్ జరుగుతుండగా అసభ్యంగా ప్రవర్తించారు, రెస్టారెంట్‌కు రా, కొంతసేపు గడుపుదాం అంటూ పిలిచిన్నట్లు ఆమె అరోపించారు. దీనికి మీ సమాధానం ఏమిటని పోలీసులు ప్రశ్నించగా తను ఆమెతో చెడుగా ప్రవర్తించలేదు, రెస్టారెంట్‌కు రమ్మని ఎప్పుడూ పిలవలేదన్నారు. ♦ దేవనహళ్లి పట్టణలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శ్రుతిహరిహరన్తో కలిసింది నిజంకాదా? రెస్టారెంట్‌కు రమ్మని పిలిచింది నిజంకాదా? ఆమెను బెదిరించిన మాట నిజంకాదా? నాతో రాకుంటే సినిమా కెరీర్‌కు ఇబ్బందులు ఉంటాయని హెచ్చరించిన మాట నిజంకాదా అని సీఐ అయ్యణ్ణ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ♦ అర్జున్ బదులిస్తూ వీటన్నింటినీ నిరాకరిస్తున్నట్లు చెప్పారు. దేవనహళ్లి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఇద్దరు ఎదురుపడిన మాట నూరు శాతం అవాస్తమన్నారు. ♦ బెంగళూరులోని యుబీ సిటీలో ఇద్దరూ ఒంటరిగా కూర్చున్న సమయంలో ఆమెను కౌగిలించుకుని రూంకు రమ్మన్నారు అని ప్రశ్నించగా, ఆమెపై లైంగిక వేధింపుగాని, అసభ్యంగా ప్రవర్తించిది కానీ లేదన్నారు. మొత్తంగా అన్ని ఆరోపణలను అర్జున్ తోసిపుచ్చారు. అకారణంగా ఆరోపణలు చేస్తున్నారని స్పష్టంచేశారు. ♦ విచారణకు అర్జున్ తనయుడు ధ్రువ సర్జా, మేనల్లుడు చిరంజీవి సర్జాతో కలిసి పీఎస్‌కు వచ్చారు. వీరి రాక గురించి తెలుసుకున్న అభిమానులు భారీసంఖ్యలో చేరుకున్నారు. దీనితో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. -
నాపై కేసు కొట్టేయండి
సాక్షి బెంగళూరు: కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాల్సిందిగా హైకోర్టులో దక్షిణాది బహుభాషా నటుడు అర్జున్ సర్జా పిటిషన్ దాఖలు చేశారు. నటుడు అర్జున్ తరఫు న్యాయవాది శ్యామ్ సుందర్ ఈ పిటిషన్‌ను వేశారు. నటి శ్రుతి హరిహరణ్ తనపై కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని పిటిషన్లో తెలిపారు. శ్రుతి చేసిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేశారు. కేవలం ప్రచారం కోసం తనపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అర్జున్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అర్జున్ 37 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారని, 150కి పైగా సినిమాల్లో నటించారని ఆయన తరఫున న్యాయవాది తెలిపారు. అర్జున్ హనుమాన్ భక్తుడని, చెన్నైలో 32 అడుగుల పొడవు, 17 అడుగుల వెడల్పు ఉన్న ఆంజనేయ విగ్రహాన్ని నిర్మించారని తెలిపారు. శ్రుతి చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఆమె ఆరోపణల వల్ల అర్జున్ కుటుంబం మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నారు. నవంబర్ 2కు వాయిదా.. నటుడు అర్జున్‌పై నమోదైన కేసు విచారణతో పాటు అర్జున్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో దాఖలు చేసిన కేసు విచారణ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది. నగరంలోని మేయోహాల్ 22వ సీసీహెచ్ హాల్లో వాద, ప్రతివాదనలు వినిపించారు. ఈ విచారణలో అర్జున్ తరపు న్యాయవాది శ్యామ్ సుందర్ తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని న్యాయమూర్తిని విన్నవించారు. ఆయన విజ్ఞప్తిని మన్నించిన జడ్జి విచారణను నవంబర్ 2కు వాయిదా వేశారు. అంతకుముందు ఈ కేసు విచారణలో భాగంగా శ్రుతి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మీటూ కేసులో పోలీసులు చాలా నెమ్మదిగా విచారణ చేపడుతున్నారని ఆమె తరఫు న్యాయవాది అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. తనిఖీని నిదానంగా చేస్తూ నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సాకు‡్ష్యలను ఇప్పటివరకు పోలీసులు విచారించనే లేదని తెలిపారు. పోలీసులు ఉద్ధేశపూర్వకంగానే దర్యాప్తును ఆలస్యంగా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రుతికి రక్షణ కల్పించండి.. శ్రుతి హరిహరణ్ మీటూ కేసుకు సంబంధించి అర్జున్ లేదా ఆయన అభిమానుల నుంచి ఆమెకు ప్రాణహాని ఉందని మహిళా కమిషన్ తెలిపింది. శ్రుతికి ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని మహిళా కమిషన్ నాగలక్ష్మి బాయి కోరారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ టి.సునీల్ కుమార్‌కు నాగలక్ష్మి బాయి లేఖ రాశారు. -
అర్జున్ను అరెస్టు చేయాలి
సాక్షి, బెంగళూరు: మీ టూ వివాదం మరింతగా ముదురుతోంది. మీ టూ ఆరోపణలకు ప్రతిగా నటి శ్రుతి హరిహరన్పై ప్రముఖ నటుడు అర్జున్ సర్జా వేసి పరువు నష్టం దావా కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. విస్మయ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి శ్రుతి వారంరోజుల క్రితం ఆరోపించి సంచలనం రేకెత్తించడం తెలిసిందే. అర్జున్‌పై ఆమె శనివారం కబ్బన్‌పార్క్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రుతి తరఫు న్యాయవాది అనంతనాయక్ కబ్బన్‌పార్కు పోలీసు స్టేషన్‌కు వెళ్లి శ్రుతి ఫిర్యాదు ఆధారంగా అర్జున్ను అరెస్టు చేయాలని విన్నవించారు. అర్జున్ బయటే ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అర్జున్ను అరెస్టు చేయకపోతే విచారణ పారదర్శకంగా జరిగే అవకాశం ఉండబోదన్నారు. అర్జున్, అభిమానులపై శ్రుతి మరో కేసు అర్జున్ సర్జాపై శ్రుతి మరో కేసు దాఖలు చేశారు. సోమవారం ఉదయం ఆమె మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి అర్జున్, ఆయన అభిమానులపై ఫిర్యాదు చేశారు. అర్జున్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోర్టులోనూ అరెస్టుకు వినతి గతంలో శ్రుతి నిరాధార ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించిందని అర్జున్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో కేసు దాఖలు చేశారు. ఆ కేసు విచారణ సోమవారం నగరంలోని 22వ సీసీహెచ్ కోర్టు హాల్లో జరిగింది. శ్రుతి తరఫు న్యాయవాది జైనా కొఠారి వాదిస్తూ అర్జున్ను అరెస్టు చేయాలని న్యాయ మూర్తికి విజ్ఞప్తి చేశారు. కేసు విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. -
మీటూ కేసులో అర్జున్ అరెస్ట్ అవుతారా?
యాక్షన్‌కింగ్ అర్జున్ అరెస్ట్ అవుతారా? ఇప్పుడు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్న విషయం ఇదే. మీటూ సినీ వర్గాల్లో భయం పుట్టిస్తోంది. దీని ఎఫెక్ట్ ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. మీటూ కారణంగా కేంద్రమంత్రే పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో గాయనీ చిన్మయి ప్రముఖ గీతర చయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి మీటూతో బీటలు వేసిన విషయం తెలిసిందే. ఆమెకు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. చిన్మయి ఆరోపణలు కొట్టిపారేసిన వైరముత్తు ఆమెపై కోర్టుకెళ్లతానని బెదిరించినా, అలాంటి ప్రయత్నానికి సాహసించలేదు. ఇక మరో మలయాళీ నటి శ్రుతీహరిహరన్ సీనియర్ నటుడు అర్జున్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను గుప్పించింది. ఆమె ధైర్యాన్ని పలువురు శభాష్ అంటూ అభినందించారు. నటుడు ప్రకాశ్‌రాజ్ అయితే నటుడు అర్జున్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కూడా. ఇక నటుడు అర్జున్ కూడా నటి శ్రుతీహరిహరన్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అన్నట్టుగానే బెంగళూర్ సిటీ సివిల్ కోర్టులో శ్రుతిహరిహరన్పై రూ.5 కోట్లు నష్టపరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక నటి శ్రుతీహరిహరన్ కూడా అర్జున్ను ఢీకొనడానికి సిద్ధమైంది. బెంగళూర్‌లోని కబ్బన్‌పార్క్ పోలీసులకు అర్జున్‌పై ఫిర్యాదు చేసింది. అందులో నటుడు అర్జున్ 2015లో ఒక చిత్రంలో నటిస్తుండగా లైంగిక వేధింపులకు గురి చేశాడని పేర్కొంది. శ్రుతీహరిహరన్ ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు నటుడు అర్జున్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. -
అర్జున్ సన్నిహితుడిపై శ్రుతి ఫిర్యాదు.. కోర్టుకు మీటూ!
సాక్షి బెంగళూరు: నటి శ్రుతి హరిహరన్ ఫిర్యాదు చేసిన 15 గంటల తర్వాత పోలీసులు అర్జున్ సర్జా సన్నిహితుడు ప్రశాంత్ సంబర్గిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. గత రాత్రి ప్రశాంత్‌పై నగరంలోని హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్లో శ్రుతి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల నుంచి విమర్శలు రావడంతో ప్రశాంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రశాంత్‌పై ఐపీసీ సెక్షన్ 506 (బెదిరింపు), 509 (మహిళను అవమానించేలా మాట్లాడడం) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు అర్జున్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో దాఖలు చేసిన కేసులపై పోలీసులు స్పందిస్తున్నారు. ఈ కేసులో శ్రుతికి పోలీసులు నోటీసులుజారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఫిర్యాదు ఏంటి? శుక్రవారం ఫిల్మ్ చాంబర్లో జరిగిన సమావేశానికి హాజరైన సమయంలో అక్కడ తన వివాదా నికి సంబంధించి కొంతమంది వ్యక్తులు తనను దుర్భాషలు ఆడినట్లు, అర్జున్ సర్జా సన్నిహితు డు ప్రశాంత్ కొంతమంది గుండాలతో గుమిగూ డి తనను దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో శ్రుతి పేర్కొన్నారు. అంతేకాకుండా చంపేస్తామంటూ తనను బెదిరిస్తున్నారని తెలిపారు. అర్జున్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఈ సమయంలో తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు ప్రతిలో శ్రుతి పేర్కొన్నారు. కోర్టులో విచారణ... నటి శ్రుతి హరిహరణ్ విరుద్ధంగా అర్జున్ వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ మేయోహాల్ కోర్టు ముందుకు వచ్చింది. శుక్రవారం ఈ కేసు కు సంబంధించి న్యాయమూర్తి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రుతి తరఫున అడ్వొకేట్ కొఠారియా తమ వాదన వినిపించేందుకు గడువు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. ఆయన విజ్ఞప్తిని మన్నించిన న్యాయమూర్తి ఈ కేసు విచారణను 29కు వాయిదా వేశారు. తనకు బెదిరింపులు : తాను మీటూ గురించి మాట్లాడిన తర్వాత బెదిరింపులు ఫోన్ కాల్స్ వచ్చాయని కన్నడ నటి హర్షికా పూణచా తెలిపారు. బెదిరింపులకు తాను భయపడనని తెలిపారు. మీటూ వివాదంలో తాను ఎవరిపక్షం కాదని, అలాగని ఎవరికి వ్యతిరేకం కూడా కాదని తెలిపారు. మీటూ వివాదంపై మాట్లాడుతుంటే చాలా మంది పబ్లిసిటీ అని మాట్లాడుతున్నారని, ఇది సరికాదని తెలిపారు. కొంతమంది పబ్లిసిటీ కోసం కూడా వివాదాలు సృష్టిస్తారని తెలిపారు. -
మెట్టు దిగని శ్రుతి, అర్జున్
శృతి హరిహరన్– అర్జున్ మీటూ గొడవకు శుభం కార్డు పడలేదు. కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండ లిలో సీనియర్ నటుడు అంబరీష్.. ఈ ఇద్దరికీ చేసిన హితోపదేశం ఫలించలేదు. తాడోపేడో తేల్చుకోవడానికే ఇద్దరూ సిద్ధం కావడంతో మునుముందు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. సాక్షి బెంగళూరు: మీ టూ వివాదంలో నటి శ్రుతి హరిహరణ్, నటుడు అర్జున్ సర్జా మధ్య జరిగిన రాజీ సమావేశం పూర్తిగా విఫలమైందని రెబెల్ స్టార్ అంబరీశ్ తెలిపారు. ఇద్దరు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా లేరని, ఇద్దరూ పంతంతో ఉన్నారని తెలిపారు. కన్నడ సినీ రంగంలో పెద్ద మనిషిగా ఇద్దరి మధ్యం రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించానని, కానీ కుదరలేదని ఆయన తెలిపారు. బుధవారం చలనచిత్ర వాణిజ్యమండలి కార్యాలయంలో అంబి ఆధ్వర్యంలో జరిగిన రాజీచర్చలకు శ్రుతి, అర్జున్‌లు హాజరయ్యారు. భేటీ అనంతరం అంబి మాట్లాడుతూ ‘సీనియర్ నటుడిగా నా అనుభవంతో నాలుగు మాటలు చెప్పి సర్దిచెప్పాలని చూశా. ఇద్దరికి ఒక్కో అవకాశం ఇచ్చాను. వారు రాజీకి ఒప్పుకోలేదు. వినడం వినకపోవడం వారి చేతుల్లో ఉంది. మీటూ, సీ టూ అవేంటో నాకైతే తెలియదు. శ్రుతి, అర్జున్లిద్దరూ ఎలాంటి సాక్ష్యాధారాలు సమర్పించలేదు. ఈ వివాదం వల్ల చిత్రరంగానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ కేసులో నేను ఎవరి వైపు మొగ్గు చూపడం లేదు. నా సినీ జీవితంలో ఇంతటి వివాదం ఎప్పుడూ చూడలేదు’ అని అంబి పేర్కొన్నారు. కోర్టులోనే తేల్చుకుంటా: అర్జున్ అర్జున్ మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలపై తాను నిశ్శబ్ధంగా ఉండడం వల్ల అభిమానులు, తన కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా బాధ పడుతున్నారని తెలిపారు. ఈ ఆరోపణలపై కచ్చితంగా కోర్టుకు వెళతానని, అక్కడే ఈ వివాదంపై తేల్చుకుంటానని తెలిపారు. కేసు కోర్టులో ఉండడంతో దీనిపై ఎక్కువగా మాట్లాడలేననితెలిపారు. తాను రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. మీటూ అనేది మహిళలు, యువతిలకు మంచి వేదికని, కానీ దాన్ని దుర్వినియోగం చేయవద్దని అన్నారు. తనపై ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో కూడా తెలియడం లేదన్నారు. నేనేందుకు క్షమాపణ చెప్పాలి: శ్రుతి ఒక మహిళ ధైర్యంగా బయటకొచ్చి మాట్లాడుతుంటే సమాజం ఎందుకు కించపరుస్తుందో అర్థం కావడం లేదని నటి శ్రుతి హరిహరణ్ చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటప్పుడు తానెందుకు క్షమాపణ చెప్పాలన్నారు. అర్జున్‌పై తాను ఎలాంటి కేసు వేయలేదని, ఆయనే తనపై రెండు కేసులు నమోదు చేశారని తెలిపారు. అర్జున్ ఫిర్యాదు చేయడం తనకు సంతోషంగా ఉందని, మున్ముందు ఈ కేసుల్లో తాను న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. ఈ వివాదంలో రాజీ పడేది లేదన్నారు. -
మీటూ...పై మాట మార్చిన నటుడు ప్రకాశ్ రాజ్
కర్ణాటక, యశవంతపుర : అర్జున్‌పై మీటూ ఆరోపణలు చేసిన శ్రుతి హరిహరన్ చేసిన వ్యాఖ్యలపై బహుభాష నటుడు ప్రకాశ్ రాజ్ మాటమార్చారు. తాను ఆయన నిందితుడంటూ ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదని ట్విట్టర్లో స్పందించగా మంత్రి జయమాల కూడా స్పందించారు. శ్రుతి ఆరోపించినట్లు అర్జున్ అలాంటి వ్యక్తి కాదన్నారు. మాటమార్చిన ప్రకాశ్ రాజ్ నటుడు అర్జన్‌పై నటి శ్రుతి హరిహరన్ చేసిన మీటూ ఆరోపణలపై మొదట శ్రుతిహరిహరన్ తరపున నిలబడిన నటుడు ప్రకాశ్ రాజ్ మాట మార్చారు. అందులో అర్జున్ నిందితుడంటూ ఆరోపణలు చేయలేదని స్పష్టం చేశారు. ఆయన ట్విట్టర్ ద్వారా తనకు అర్జున్ మంచి స్నేహితుడని, సినీ రంగంలో తన సహ నటుడని, అతడిని చాలా దగ్గర నుంచి చూశానని, అయితే శ్రుతి ఆరోపణలు నేపథ్యంలో ఇద్దరి ఒక వేదికపై పిలిచి సమస్య పరిష్కరించాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. మీటూ దుర్వినియోగం కాకూడదు : నటి, మంత్రి జయమాలా మీటూ వేదికను దుర్వినియోగం చేసుకోకూడదని కన్నడ సంస్కతిశాఖ మంత్రిఇ జయమాలా అన్నారు. ఇదీ మహిళలకు ఇది ఒక బలమైన వేదిక అని అన్నారు. గురువారం ఆమె లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బైందూరు తాలూకా నాగూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆధార రహిత మాటలను పత్రికల ముందు నిలబడి చెప్పటం సరికాదన్నారు. నటుడు అర్జున్ మంచి నటుడని అమె సమర్థించుకున్నారు. -
అర్జున్ పై నటీమణుల ప్రకటనలు
శాండల్‌వుడ్‌లో మీ టూ ప్రకంపనలు సృష్టిస్తోంది. హీరో అర్జున్ సర్జాను తనను వేధిం చారని హీరోయిన్ శ్రుతి హరిహరన్ ఆరోపించడం, అర్జున్ ఖండించడం జరిగిపోయింది. మేఘనా గాంవ్కర్, అవంతిక షెట్టి శ్రుతికి సోమవారం మద్దతు ప్రకటించగా, ఈ తరుణంలో అర్జున్‌కు అండగా ఖుష్బు, హర్షిక, తార గళమెత్తారు. అర్జున్ జెంటిల్మెన్ అన్నారు. కర్ణాటక, యశవంతపుర: మీటూ ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రముఖ నటుడు అర్జున్‌కు పలువురు నటీనటులు అండగా నిలిచారు. అర్జున్‌పై నటి శ్రుతి హరిహరన్ చేసిన మీటూ ఆరోపణలను ఖండిస్తూ ప్రముఖ నటి ఖుష్బూ ఒక వీడియోను విడుదల చేశారు. ‘శ్రుతి ఆరోపించిన విధమైన వ్యక్తి అర్జున్ కాదు. ప్రతి ఒక్కరికీ ఆయన మంచి గౌరవ మర్యాదలు ఇస్తారు. అయన అలా చేయలేదనటానికి నేరు గ్యారంటీ ఇస్తాను. 34 ఏళ్ల నుండి సినిమా రంగంలో నాకు పరిచయం. నేను నటించిన మొదటి సినిమాకు ఆయన హీరో. ఎప్పుడూ కూడా అసభ్యంగా ప్రవర్తించలేదదు. శ్రుతి హరిహరన్ ఆరోపణలు విని ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను. ఒక కుటుంబానికి తండ్రైన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయటం మంచి పద్ధతి కాదు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆరోపణలు చేసే ముందు యోచించాలి. ఇప్పుడు అర్జున్‌కు నేను మద్దతు ఇవ్వకుంటే 34 ఏళ్ల స్నేహానికి అవమానం కలుగుతుంది’ అని ఆమె చెప్పారు. అలాంటి వ్యక్తులా మీ టూ అనేది: హర్షిక అర్జున్‌కు అందాల నటీమణి హర్షికా పూణచ్ఛ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రుతి హరిహరన్పై పరోక్షంగా ఆరోపణల వర్షం కురిపించారు. ‘నేడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులే నాడు ప్రముఖు వ్యక్తుల జతలో అర్థనగ్న ప్రదర్శనలు చేశారు’ అని హర్షిక సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్డడం సంచలనం కలిగిస్తోంది. ‘మీటూ ఆరోపణలను గమనిస్తున్నాను. అయితే ఒక మహిళగా నేను చిత్రరంగాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నా. ఒక మహిళను గౌరవించటం ధర్మం. అయితే పబ్లిసిటీ కోసం ఒక కుటుంబాన్ని విడదీసి వారి భార్య, పిల్లలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. దశాబ్దాలుగా చిత్ర రంగంలో ఉంటున్న వ్యక్తుల పేరును ఒక అసత్యం ద్వారా చెడగొట్టవద్దు. అ వ్యక్తి (అర్జున్) ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో గమనించాలి. పేరు రావడానికి ఏం చేసినా సరిపోతుంది. పేరు వచ్చిన తరువాత తను ఏం మాట్లాడినా సరిపోతుందని భావించటం పద్ధతి కాదు’ అని శ్రుతిపై మండిపడ్డారు. పేరున్న నిర్మాత తనకు ఒక వీడియో చూపించారని, మీటూ అంటున్న నటి ఆ వ్యక్తి భుజం మీద నిద్రిస్తున్న వీడియోను చూశానని, అలాంటి మీ టూ అంటుంటే సిగ్గేస్తోందని చెప్పారు. అర్జున్ సర్జా మంచోడు : నటి తార మండ్య: మీటూ ఉద్యమానికి తాము వ్యతిరేకం కాదని బీజేపీ నాయకురాలు, నటి తారా అనురాధ తెలిపారు. ప్రచారంలో ఆమె మాట్లాడారు. బహుభాషా నటుడు అర్జున్ సర్జాపై హీరోయిన్ శృతి హరిహరన్ చేసిన ఆరోపణల వ్యవహారంలో అర్జున్ సర్జాకే మద్దతు తెలుపుతున్నామన్నారు. అర్జున్‌తో తాము గతంలో పలు చిత్రాల్లో కలసి నటించామని ఎప్పుడూ తమతో అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు. అయితే నటి శృతి ఆరోపణలు అవాస్తమనేది తమ ఉద్దేశం కాదన్నారు. అర్జున్‌పై ఎందుకు ఆరోపణలు చేశారో తమకు అంతుచిక్కడం లేదన్నారు. -
డబ్బు ఇచ్చి అమ్మాయిలను..
పెరంబూరు: నటుడు అర్జున్ అభిమానుల నుంచి తనకు హత్యాబెదిరింపులు వస్తున్నాయని నటి శ్రుతీహరిహరన్ ఆరోపించింది. దేశంలో మీటూ కలకలం రోజురోజుకు పెరిగిపోతోందనే చెప్పాలి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఇది రచ్చ రచ్చగా మారింది. మీటూ ఆరోపణలు చాలా కాలం నుంచే ఉన్నా, గాయని చిన్మయి గీతరచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేయడంతో ఇది ఒక ఉప్పెనలా చెలరేగింది. నటుడు అర్జున్ను కూడా ఈ మీటూ సెగలు తాకాయి. మలయాళ నటి శ్రుతీహరిహరన్ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. షూటింగ్ పూర్తి కాగానే క్యారవాన్‌కు రమ్మని సినీ కార్మికుడితో చెప్పేవారని, పలు మార్లు రాత్రి విందుకు ఆహ్వానించి వేధించారని ఆరోపించింది. శ్రుతీ హరిహరన్ ఆరోపణలను అర్జున్ కొట్టి పారేస్తూ, ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాగా ఆయన అభిమానులు తనపై హత్యాబెదిరింపులు చేస్తున్నారని ఆమె ఆదివారం మళ్లీ ఆరోపణలు చేసింది. ఈమె కేరళాలో జరిగిన హక్కులు సమధర్మ సినీ శాఖ అనే సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ నటుడు అర్జున్‌పై లైంగిక ఆరోపణలు చేసినప్పటి నుంచి ఆయన అభిమానులు తనపై హత్యాబెదిరింపులు చేస్తున్నారంది. అపరిచితుల ఫోన్‌కాల్స్ నిరాటంకంగా వస్తున్నాయని చెప్పింది. ఈ సందర్భంగా ఏడాది దాటిన తరువాత ఈ ఆరోపణలు చేయడంలో ఆంతర్యం ఏమిటని విలేకరి అడిగిన ప్రశ్నకు తాను అప్పుడే తన ఆవేదనను, వ్యతిరేకతను ఆ చిత్ర దర్శకుడి వద్ద వ్యక్తం చేశానన్నారు. అదే విధంగా ఆ చిత్ర రిహార్సల్స్‌కు వెళ్లడం మానేశానని, అంతకంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తాను ఉన్నానని బదులిచ్చింది. ఇప్పుడు మీటూ ద్వారా పలువురు తాము ఎదుర్కొన్న వేధింపులను బహిరంగంగా చెప్పడానికి ముందుకు రావడంతో తాను తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. సహాయ నటి ఆరోపణలు.. నటుడు అర్జున్‌పై మరో సహాయ నటి కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఒక చిత్ర షూటింగ్లో వేరే యువతిని తన గదికి తీసుకురమ్మని తనతో అర్జున్ చెప్పారని, అదే విధంగా ఆర్టిస్ట్ సప్లయర్‌కు డబ్బు ఇచ్చి అమ్మాయిలను తెప్పించుకునేవారని ఆ సహాయ నటి ఆరోపణలు చేస్తూ ఒక టీవీకిచ్చిన భేటీలో పేర్కొంది. -
సెల్ఫీ తీసుకోవాల్సింది
నటుడు అర్జున్‌పై కన్నడ నటి శ్రుతీ హరిహరన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శ్రుతికి మద్దతు ఇస్తున్నట్లు ట్వీట్టర్ ద్వారా తెలిపారు మరో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్. ‘‘2016 నవంబర్‌లో ఓ టాక్ షో టైమ్‌లో శ్రుతీ నాకు ఈ సంఘటన చెప్పింది. కాకపోతే అప్పుడు పేరు చెప్పలేదు. ఏం జరిగిందో ఇప్పుడు బయటకు చెప్పింది’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని షేర్ చేశారు శ్రద్ధా. ‘‘ఓసారి బెంగళూరు నుంచి కొచ్చిన్‌కి బస్‌లో వెళుతున్నాను. ఓ వ్యక్తి చేయి నన్ను అసభ్యంగా తాకడంతో నిద్ర నుంచి మేల్కొన్నాను. అందుకు నా దగ్గర ఏటువంటి ఆధారం లేదు. ఆ చేదు అనుభవం మాత్రం మిగిలింది. ఈ సంఘటన జరిగినప్పుడు అతనితో పాటు, ఆ చేయితో కూడా ఓ సెల్ఫీ తీసుకొని ఉంటే అది సాక్ష్యంగా ఉండేదేమో?’’ అని పేర్కొన్నారామె. మరోవైపు శ్రుతీ హరిహరన్‌కు నటుడు ప్రకాష్‌రాజ్ మద్దతు తెలిపారు. ‘‘నా వృత్తిపరమైన కారణాల వల్ల నా పేరును చెప్పదలచుకోలేదు. శ్రుతీ పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. అర్జున్‌తో ఓ సందర్భంలో ఇబ్బంది పడ్డాను. ముందు అతడిని ‘జెంటిల్మెన్’ అని పిలవడం ఆపండి’’అంటూ మరో మహిళ అర్జున్ను ఆరోపించినట్లుగా, ట్వీటర్లో పోస్ట్ చేశారు శ్రుతీ హరిహరన్. ఇదిలా ఉంటే అర్జున్ పరిపూర్ణమైన ‘జెంటిల్మెన్’ అంటూ ఆయనతో ‘కాంట్రాక్ట్’ సినిమాలో కలిసి యాక్ట్ చేసిన హీరోయిన్ సోనీ చరిష్టా పేర్కొన్నారు. -
అర్జున్ నన్ను వేధించారు
‘మీటూ’ ఉద్యమం సౌత్‌లోనూ ప్రకంపనలు సృష్టించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ‘మీటూ’ ఉద్యమానికి చాలా మంది సౌత్ కథానాయికలు మద్దతు తెలిపారు. ఇటీవల కన్నడ నటి సంగీతా బాత్ తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. తాజాగా కన్నడ నటి శ్రుతీ హరిహరన్ కన్నడ, తమిళ ద్విభాషా చిత్రం ‘నిబుణన్’ సెట్స్‌లో (కన్నడలో ‘విస్మయ’) నటుడు అర్జున్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. ‘‘నా లైఫ్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి చాలా చేదు అనుభవాలనే ఎదుర్కొన్నాను. ఎన్నో ఆశలతో నా సినిమా కెరీర్‌ను స్టార్ట్ చేశాను. నా కలలను నిజం చేసుకోవడానికి ఇండస్ట్రీ నాకు సహాయం చేసింది. కానీ ఇప్పుడు ఇలా చెప్పడానికి బాధగా ఉంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సంకేతాలు నాకు కనిపించాయి. కొన్ని భయంకరమైన సంఘటల నుంచి తెలివిగా తప్పించుకోగలిగా. అయితే చిన్నప్పటి నుంచి అర్జున్ సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయన కారణంగా చేదు అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. 2016లో అర్జున్‌తో వర్క్ చేసే చాన్స్ రాగానే ఎగై్జట్ అయ్యాను. కానీ ‘విస్మయ’ సినిమా సెట్లో ఓ రొమాంటిక్ సీన్ రిహార్సల్స్‌లో భాగంగా ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఒక పాట సన్నివేశంలో అర్జున్ నన్ను గట్టిగా హత్తుకుని, అభ్యంతరకరంగా నన్ను తడిమారు. ‘మీటూ’ ఉద్యమం ఇప్పుడు కాస్త పవర్‌ఫుల్‌గా తయారవుతోంది. అందుకే ఇప్పుడు పబ్లిక్‌గా చెబుతున్నాను’’ అంటూ సోషల్ మీడియా ద్వారా విషయాన్ని బయటపెట్టారు శ్రుతీ హరిహరన్. కాల్స్, మేసేజ్‌లు చేయవద్దు ‘‘సినిమాలో ఏ సంఘటన గురించి అయితే ఇంత వివాదం జరగుతుందో ఆ సీన్‌ను నేను స్క్రిప్టింగ్ టైమ్‌లో చాలా రొమాంటిక్‌గా రాశాను. అది చదువుతున్నప్పుడే ‘నాకు టీనేజ్‌లో ఉన్న కూతురు ఉంది. ఇటువంటి సీన్స్‌లో నటించలేను’ అని అర్జున్ సార్ చెప్పారు. ఆయన కోరికే మేరకే ఆ సీన్లో రొమాంటిక్ ఫ్లేవర్‌ను తగ్గించాను. ఇప్పుడు అర్జున్‌పై శ్రుతీ హరిహరన్ చేసిన ఆరోపణలు విని షాక్ అయ్యాను. ఈ సంఘటన రెండు సంవత్సరాల క్రితం జరిగింది. మినిట్ టు మినిట్ నాకు గుర్తులేదు. ఈ సినిమా షూట్ టైమ్‌లో సెట్లో మేం చాలా బాగా ఎంజాయ్ చేశాం. అర్జున్, శ్రుతీ ఇద్దరూ నాకు మంచి స్నేహితులే’’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ‘‘కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు మహిళలకు అన్ని చోట్లా సేఫ్ అండ్ సెక్యూర్డ్ సిచ్యువేషన్స్‌ను కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని ‘మీటూ’ గురించి ఆయన చెప్పారు. ఇక ఈ వివాదం గురించి ఎవరూ నాకు ఫోన్ కానీ మేసేజ్ కానీ చేయవద్దు. ఎందుకంటే.. నేను చెప్పాల్సినదంతా ఈ పోస్ట్‌లోనే చెప్పాను’’ అని పేర్కొన్నారు అరుణ్. చట్టపరమైన చర్యలు? ఈ సంగతి ఇలా ఉంచితే... శ్రుతీ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు అర్జున్. ‘‘మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. 150 సినిమాల్లో నటించా. దాదాపు 60 మంది హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. వారందరితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అప్పట్లో ఆ సీన్ కాస్త రొమాంటిక్‌గా ఉందని నేను డైరెక్టర్‌తో కూడా చెప్పాను. ఇప్పుడు శ్రుతీ ఎందుకు ఇలా నాపై ఆరోపణలు చేస్తుందో అర్థం కావడం లేదు’’ అని అర్జున్ పేర్కొన్నారని వార్తలు వస్తున్నాయి. శ్రుతీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అర్జున్ ఆలోచిస్తున్నారని కోలీవుడ్ టాక్. -
ఆ నిర్మాత లైంగికంగా వేధించాడు
తమిళసినిమా: సినీ రంగంలో లైంగిక వేధింపుల గురించి పలువురు నటీమణులు గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వరుసలో ఒక తమిళ చిత్ర నిర్మాత తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని నటి శ్రుతీహరిహరన్ చెప్పింది. కన్నడలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈ అమ్మడు నెరింగివా ముత్తమిడాదే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తరువాత నిపుణన్, రారా రాజశేఖర్, సోలో చిత్రాల్లో నటించింది. ఆమె దీని గురించి చెబుతూ తాను 18 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించానని చెప్పింది. మొదట్లో పాటలకు డాన్స్ చేసే దానినని తెలిపింది. అప్పట్లోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని, ఆ విషయాన్ని ఒక నృత్య దర్శకుడికి చెప్పి, తననా వేధింపుల నుంచి తప్పించే మార్గం చెప్పమని కోరగా, అలాంటివి ఎదుర్కొనలేకపోతే సినీ రంగం నుంచి వెళ్లిపో అని ఆయన అన్నారని చెప్పింది. అప్పుడే తనకు సినిమా గురించి అర్థమైందని అంది. తాను నటించిన ఒక కన్నడ చిత్రం మంచి విజయాన్ని సాధించిందని, ఆ చిత్ర రీమేక్ హక్కుల్ని ఒక తమిళ నిర్మాత పొందారని తెలిపింది. అతను తమిళంలోనూ తననే నటించమని అడిగాడన్నారు. తాను సంతోషంగా అంగీకరించానని చెప్పింది. అయితే ఆ తరువాత అతను తనను పడక గదికి రమ్మని వేధించాడని తెలిపింది. తాను ఎప్పుడూ తన చెప్పును చేతిలోనే ఉంచుకుంటానని బదులిచ్చానని చెప్పింది. ఆ తరువాత ఆ నిర్మాత తన గురించి తప్పుడు ప్రచారం చేసి అవకాశాలు రాకుండా చేశాడని తెలిపింది. చిత్రరంగంలో హీరోయిన్లకు విలువ లేదని, ఆడవారితో వ్యాపారం చేయాలనుకోవడం వేదన కలిగిస్తోందని నటి శ్రుతీహరిహరన్ పేర్కొంది. -
నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: నటి
సాక్షి, బెంగళూరు: సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొత్తలో తాను కూడా నిర్మాతల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొవలసి వచ్చిందని కన్నడ హీరోయిన్ శ్రుతి హరిహరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు వార్త ఛానెల్ నిర్వహించిన సెక్సిజం ఇన్ ఫిలిం ఇండస్ట్రీ అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతి ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటి సినిమా చేస్తున్న సమయంలో తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని, ఓ కన్నడ దర్శక నిర్మాత ఒకరు తమిళంలో అవకాశం ఇస్తామని, సహకరించాలని సూచించాడని చెప్పారు. అయితే తాను అంతే ఘాటుగా సమాధానం ఇచ్చానని చెప్పారు. అందుకే కన్నడ, తమిళ సినీ ఇండస్ట్రీల నుంచి తనకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయన్నారు. ఇప్పుడెందుకు బహిర్గతం చేశారు : పదేళ్ల క్రితం ఎదురైన అనుభవాలను హీరోయిన్ శ్రుతి హరిహరన్ ఇపుడెందుకు బహిర్గతం చేసారో ఆమెకే తెలియాలని కన్నడ వాణిజ్య మండలి డైరెక్టర్ సా.రా.గోవిందు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై అప్పుడే నిర్మాత మండలి దృష్టికి తెచ్చి ఉంటే చర్యలు తీసుకునే ఉండేవారని అన్నారు. కన్నడ సినీ పరిశ్రమలో కూడా మహిళలపై లైంగిక వేధింపులు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. -
రహస్య వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు: నటి
శివాజీనగర(కర్ణాటక) : తాను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదని, తనకు రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరంలేదని శాండల్‌వుడ్ నటి శ్రుతి హరిహరన్ స్పష్టం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం తాను సినిమాలలో బిజీగా ఉన్నానని, అదే సమయంలో ఎన్నో బాధ్యతలు కూడా ఉన్నాయన్నారు. ఇటీవల శ్రుతి హరహరన్ కేరళకు చెందిన డ్యాన్స్ మాస్టర్‌ను కొన్ని నెలల క్రితం వివాహం చేసుకున్నట్లు ఫేస్బుక్లో వచ్చిన విషయంపై ఆమె వివరణ ఇచ్చారు. అందరికి ఆహ్వానాలు పంపి తాను వివాహం చేసుకుంటానని, రహస్య వివాహం చేసుకోనని చెప్పారు.