చెన్నై,పెరంబూరూ: తాను నిండు గర్భిణినన్న విషయాన్ని ఫొటోలతో సహా వెల్లడించింది నటి శ్రుతీ హరిహరన్. కన్నడ చిత్ర సీమలో ప్రముఖ నటిగా రాణించిన ఈ అమ్మడు తమిళంలోనూ నిలా, రారా రాజశేఖర, నెరింగివా ముత్తమిడాదే, నిపుణన్ వంటి చిత్రాల్లో నటించింది. అంత కంటే ఎక్కువగా నటుడు అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని, ఆరోపించి వార్తల్లోకెక్కింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంతో పెద్ద కలకలమే రేపింది. అయితే ఆమె వివాహిత అనే విషయం చాలా మందికి తెలియదు. అర్జున్ లైంగిక వేధింపుల కేసులో పోలీసులకు చేసిన ఫిర్యాదులో తనకు పెళ్లైందన్న విషయాన్ని బయటపెట్టింది. ఆ విషయం పక్కన పెడితే నటుడు, రచయితను గత ఏడాది రహస్యంగా పెళ్లి చేసుకుంది.
అంతకు ముందు నాలుగేళ్లుగా వారిద్దరూ పేమలో ఉన్నారు. అయితే తన కెరీర్ దృష్ట్యా శ్రుతీ హరిహరన్ తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచింది. అలాంటిది ఇప్పుడామె నిండు గర్భిణి. తాను గర్భంతో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్ట్రాగాంలో పోస్ట్ చేసి ఆ విషయాన్ని బహిర్గతం చేసింది. వాటికి ‘నా జీవితం ఇప్పుడు నీ (కడుపులో బిడ్డ) గుండె చప్పుళ్లతో నెలకొంది. ఇదే నా జీవిత కొత్త పయనం. ప్రపంచమనే సర్కస్‌లోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను. అందుకోసం ఎక్కువ కాలం ఎదురు చూడలేను’ అంటూ ట్యాగ్‌లైన్ యాడ్ చేసింది. అవికాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment