భారతీయ కళాకారులు రూపొందించిన అపురూపమైన ‘‘గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’’ 100 ఏనుగుల కళాశిల్పాలు న్యూయార్క్ చేరుకున్నాయి. ప్రతి ఏనుగును తమిళనాడులోని నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ నుండి 200 మంది దేశీయ కళాకారులతో కూడిన ది కోఎక్సిస్టెన్స్ కలెక్టివ్ రూపొందించింది. ఈ అద్భుతమైన కళాఖండాల త తయారీకి ఐదేళ్ళు పట్టింది. ఇవి అమెరికా అంతా పర్యటించి సహజీవనం సందేశాన్ని వ్యాప్తి చేయనున్నాయి. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.
Look ! Indian Elephants have finally arrived in New York. Titled as the 'Great Elephant Migration' a travelling herd of 100 stunning life size elephant sculptures have reached NYC. These elephant sculptures have been made by local tribal artisans from Gudalur in Nilgiris, Tamil… pic.twitter.com/AVolGQLDtJ
— Supriya Sahu IAS (@supriyasahuias) September 6, 2024
తమిళనాడులోని నీలగిరిలోని గూడలూర్‌కు చెందిన స్థానిక గిరిజన కళాకారులచే లాంటానా జాతికి చెందిన కలుపు మొక్కల చెక్క నుంచి ఈ కళాకృతులను రూపొందించారు. ‘‘మానవ-వన్యప్రాణుల సహజీవన ప్రాజెక్టుల’’ కోసం మిలియన్ల డాలర్లను సేకరించాలనే లక్ష్యంతోపాటు, ‘‘భూమి, నదులు, ఆకాశం మరియు మహాసముద్రాల మీదుగా అద్భుతమైన ప్రయాణాలు చేసే వలస జంతువులను రక్షించడం’’
ఈ శిల్పాలను ఎవరు రూపొందించారు?
బెట్టకురుంబ, పనియా, కట్టునాయకన్ , సోలిగ కమ్యూనిటీలకు చెందిన కళాకారులు కలిసి ప్రతి జీవం-వంటి, శరీర నిర్మాణపరంగా ఎలాంటి తేడా లేకుండా క్లిష్టమైన ఏనుగు శిల్పాలను రూపొందించారు. అక్టోబర్ 20 వరకు న్యూయార్క్ నగరంలో తర్వాత ఆర్ట్ బాసెల్ మయామికి వెళతాయి. లాస్ ఏంజిల్స్‌లో, బ్లాక్‌ఫీట్ నేషన్ మధ్య మోంటానాలోని బ్రౌనింగ్‌లోని బఫెలో ,పరిరక్షణ బృందం హ్యూస్టన్ , గ్లేసియర్ నేషనల్ పార్క్, ఈ శిల్పాలు 13 నెలల పాటు అమెరికా వివిధ ప్రాంతాలలో కొలువుదీరతాయి.
Comments
Please login to add a commentAdd a comment