elephants
-
మన్యంలో.. గజ ఘీంకారం..!
పాలకొండ రూరల్/భామిని: మన్యం జిల్లాలో గజరాజుల ఘీంకారాలు నిత్యకృత్యమయ్యాయి. వీటి సంచారంతో ప్రజలు తమ ప్రాణాలు, పంటలు, ఆస్తులు కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. అడవుల రూపు కోల్పోతుండడంతో ఏనుగుల మనుగడ కష్టమై జనావాసాల వైపు దూసుకు వస్తున్నాయి. ఆహారం కోసం పంట పొలాల వైపు వచ్చేస్తున్నాయి. దీంతో సాగు పొలాలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ఫలితం దక్కడం లేదు. మరోవైపు ఆస్తులు, ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఎన్నికల ముందు ఏనుగుల తరలింపుపై కూటమి నేతలు స్పష్టమైన హామీలిచ్చి...నేడు వాటిని మరవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి పరీవాహక ప్రాంతాల వెంబడి గజరాజులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వీటిని కట్టడి చేసే క్రమంలో అధికారిక యత్నాలు ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. దీంతో బాధిత గ్రామాల ప్రజలు తమకు పరిహారం వద్దు.. శాశ్వత పరిష్కారం కావాలని అటు ప్రజాప్రతినిధులను, ఇటు అధికారులను కోరుతున్నారు. గ్రామాల్లో కునుకు కరువు జిల్లాలో సువిశాలంగా విస్తరించి ఉన్న ఏజెన్సీ, నాగావళి, వంశధార, జంఝావతి నదీతీర పరివాహక ప్రాంతాల వెంబడి గజరాజుల గుంపులు తిష్ట వేసాయి. పాలకొండ నియోజకవర్గంలో భామిని, సీతంపేట పరిసరాల్లో నాలుగు ఏనుగులు సంచరిస్తూ పంటలు ధ్వంసం చేస్తున్నాయి. పార్వతీపురం రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో కురుపాం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో నిత్యం సంచరిస్తున్న ఏడు ఏనుగుల గుంపు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైతులు సేద్యం చేస్తున్న అరటి, బొప్పాయి, మొక్కజొన్న, చెరకు, వరి, పామాయిల్, కర్బూజ, మామిడి, జీడి పంటలతో పాటు ఇతర ఆహార, వాణిజ్య పంటలను నాశనం చేస్తున్నాయి. జిల్లా పరిధిలో సుమారు 3,500 ఎకరాల మేర పంటలు ఏనుగుల సంచారంతో తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రూ.కోట్లలో నష్టం సంభవిస్తున్నా... ఇందుకు సంబంధించిన పరిహారం నేటికీ అందించలేదు.కుంకీ ఏనుగులు ఎక్కడ? ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏనుగుల సమస్యను అధిగమించేందుకు తాము కట్టిబడి ఉన్నామని కూటమి నాయకులు బహిరంగ సభల్లో వెల్లడించారు. ప్రస్తుత డిప్యుటీ సీఎం పవన్‌కల్యాణ్ నాడు కుంకీ ఏనుగులు తీసుకువస్తామన్నారు. వాటి సహాయంతో ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపులు తరలింపునకు చర్యలు చేపడతామన్నారు. నేటికీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. పార్వతీపురం మండలం డోకిశిల పంచాయతీ జంతి కొండ వద్ద ఎలిఫ్యాంట్ జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినా అది కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రభుత్వ పెద్దల హామీలపై బాధితుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మరణ మృదంగం గజరాజుల సంచారంతో గడిచిన కొద్ది సంవత్సరాల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. 12 పశువులు మృతి చెందినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీటితో పాటు వ్యవసాయ బోర్లు, పంపు షెడ్లు, పరికరాలను, డ్రిప్ పైపులను నాశనం చేసాయి.ఏనుగులు మళ్లీ వచ్చేశాయ్...జియ్యమ్మవలస: మండలంలోని జోగిరాజుపేట, బట్లబద్ర, కన్నపుదొరవలస, వెంకటరాజపురం పరిసర ప్రాంతాలలోకి గురువారం సాయంత్రం ఏనుగులు మళ్లీ వచ్చాయి. రాత్రి పూట పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ సిబ్బంది సూచించారు. ప్రస్తుతం జోగిరాజు పేట వద్ద ఉన్నాయని, రాత్రి సమయానికి బిత్రపాడు, బాసంగి తదితర పంట పొలాలలోకి వచ్చే అవకాశముందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.పరిహారం వద్దు.. శాశ్వత పరిష్కారం కావాలి... ఇటీవల పాలకొండ నియోజకవర్గం భామిని మండలం ఘ నసర వద్ద ఏనుగుల కారణంగా రైతులు నష్టపోయిన పంటలను అంచనా వేసేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారుల వద్ద బాధిత రైతులు తీవ్రంగా స్పందించారు. తరచూ న ష్టాల అంచనాలు నమోదు చేయడం తప్ప చేసేదీ ఏమీ లే దంటూ నినాదాలు చేసారు. తమకు పరిహారం వద్దని, శాశ్వ త పరిష్కారం చూపాలని అధికారులను, ఎమ్మెల్యే జయకృష్ణను చుట్టుముట్టారు. బైఠాయించి నిరసన తెలిపారు.రెండెకరాల్లో జొన్న పంట నాశనం నా సొంత భూమితో పాటు మరో ఎకరా భూమిని కౌలుకు తీసుకుని రెండెకరాల్లో మొక్కజొన్న సేద్యం చేపట్టాను. అప్పులు చేసి మదుపులు పెట్టాను. కుటుంబమంతా కష్టపడ్డాం. కీలక దశలో ఏనుగుల గుంపు దాడి చేయటంతో పూర్తిగా పంట నష్టపోయాను. నష్టపోయిన పంటను చూసేందుకు పొలంకు వెళ్లాలన్నా భయం వేస్తుంది. ఏ క్షణం ఏనుగులు దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటున్నాం. నష్ట పరిహారాలు ఎందుకు? ఈ ప్రాంతం నుంచి వాటిని తరలిస్తే మేలు. – వలరౌతు లక్ష్మీనారాయణ, రైతు, ఘనసర, భామిని మండలం నిరంతరం నిఘా ఏనుగుల కదిలికలపై మా సిబ్బంది నిరంతరం దృష్టి సారిస్తున్నారు. అవి సంచరించే పరిసరాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఏనుగుల పునరావాస కేంద్రం ఏర్పాటుకు గుచ్చిమి వద్ద ఏర్పాట్లు చేపట్టనున్నాం. ఇందుకు సంబంధించి శాఖాపరమైన అనుమతులు వచ్చాయి. రూ.5 కోట్లతో సోలార్ కంచె, ట్రెంచులు, వెదురు వనాలు, నీటి సంపులు, ఇతర వసతులు ఏనుగుల కోసం సిద్ధం చేయాలని నిర్ణయించాం. తొలి దశలో రూ.కోటి నిధులుతో పనులు చేపడతాం. పంట నష్టాలకు సంబంధించి దాదాపు మూడు వేల మంది రైతులకు రూ.45లక్షలు వరకు జమ చేశాం. రెండు మూడు రోజుల్లో సదరు రైతుల ఖాతాకు ఈ మొత్తాలు పూర్తిగా జమ కాబడతాయి. కుంకీ ఏనుగులను తీసుకువచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి. – జీపీఏ ప్రసూన, అటివీ శాఖాధికారిణి -
అంబానీ జూకు ఏనుగుల తరలింపుపై విమర్శలా?!
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజరాత్..? మూడు వేలకు పైగా కిలోమీటర్ల దూరం. అంత దూరం నుంచి.. అదీ ట్రక్కులలో ఏనుగులను తరలించడం ఏంటి?. స్పెషల్ ట్రక్కులలో అంబానీ కుటుంబానికి చెందిన జూకు ఏనుగులను తరలించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మూగజీవుల కోసం పోరాడే ఉద్యమకారులైతే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూసి.. ‘‘పాపం ఏనుగులు.. డబ్బుంటే ఏమైనా చేయొచ్చా?’’ అని తిట్టుకునేవారు లేకపోలేదు. అయితే..అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) నుంచి మాత్రమే కాదు.. అసోం(Assam) నుంచి కూడా జామ్ నగర్‌లోని అనంత్ అంబానీకి చెందిన వంతార జూనకు ఏనుగులను తరలించారట. ఈ తరలింపునకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు లేవని.. పైగా వన్యప్రాణులను అలా బంధించడమూ నేరమేనని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిజనిర్ధారణలు చేసుకోకుండా పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి తరలింపునకు అసలు అనుమతులు ఉన్నాయా?. వన్యప్రాణులను ఇలా జంతు ప్రదర్శన శాలలో ఉంచొచ్చా?. దారిలో వాటికి ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?... ఎవరిది బాధ్యత? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంలో వాస్తవమెంత?. అయితే ఇవేం అడవుల నుంచి బలవంతంగా తరలిస్తున్న ఏనుగులు కాదని అధికారులు వివరణ ఇస్తున్నారు. జంతు సంరక్షణ చర్యల్లో భాగంగానే వాటిని తరలిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఏనుగులను బంధించి.. వాటితో సొమ్ము చేసుకుంటున్న ముఠాల నుంచి వాటికి విముక్తి కలిగిస్తున్నారు. రిలయన్స్ వంతార జూ ‘చైన్ ఫ్రీ’ ఉద్యమం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం భాగంగా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే తాజా వీడియోలపై విమర్శల నేపథ్యంలో.. ఇటు వంతారా నిర్వాహకులు కూడా స్పందించారు.ఆరోగ్యకరమైన వాతావరణంలో అవి జీవిస్తాయని మాది గ్యారెంటీ. వాటికి గౌరవప్రదమైన జీవితం అందించడమే మా ఉద్దేశం’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇందుకు అవసరమైన ప్రక్రియ అంతా అధికారికంగానే నిర్వహించినట్లు స్పష్టత ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారమే నడుచుకున్నట్లు, అలాగే.. గుజరాత్ , అరుణాచల్ ప్రదేశ్ అటవీ శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, ఏనుగుల తరలింపు కోసం రవాణా శాఖల నుంచీ ప్రత్యేక అనుమతులు పొందినట్లు పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. అవి అటవీ ఏనుగులు కాదని, ప్రైవేట్ ఓనర్ల నుంచి వాటిని వంతారా కొనుగోలు చేసినట్లు తెలిపింది. త్రిపుర హైకోర్టు వేసిన హైపవర్ కమిటీతో పాటు సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని స్పష్టం చేసింది. వాటిని తరలించిన ఆంబులెన్స్‌లు కూడా ప్రత్యేకమైన సదుపాయాలతోనే తరలించినట్లు పేర్కొంది.అసోం ప్రభుత్వం మాత్రం.. తమ భూభాగం నుంచి ఏనుగుల తరలింపేదీ జరగలేదని స్పష్టం చేసింది. అసోం నుంచి గుజరాత్ ప్రైవేట్ జూకు జంతువుల తరలింపు పేరిట అసత్య ప్రచారాలు, కథనాలు ఇస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ వివరణలలేవీ వైల్డ్‌లైఫ్(Wild Life) యాక్టవిస్టులను సంతృప్తి పర్చడం లేదు. పైగా వాతావరణ మార్పు వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, యానిమల్ ఆంబులెన్స్ పేరిట తరలిస్తున్న వాహనాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారం ఇటు సోషల్ మీడియాలో, అటు రాజకీయంగా విమర్శలకు దారి తీసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల కోసం పని చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.వంతార.. రిలయన్స్ సౌజన్యంతో నడిచే అతిపెద్ద జంతు సంరక్షణశాల. దేశంలోనే అతిపెద్దది. ముకేష్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ చిన్నప్పటి నుంచి యానిమల్ లవర్ అట. అలా.. మూగ జీవుల సంరక్షణ ప్రధాన ఉద్దేశంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ దేశంలో ఎక్కడా లేనన్ని సేవలతో ఈ జూను నడిపిస్తున్నాయి. వేటగాళ్ల చేతిలో బందీ అయిన, గాయపడిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, కాపాడాటం, వాటికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టింది ఫౌండేషన్. ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లోని రిలయన్స్ గ్రీన్ బెల్ట్‌లో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఏమేం ఉన్నాయంటే..వంతార జూ(Vantara Zoo)లోనే లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్, పరిశోధనా కేంద్రం నిర్మించారు. జంతువుల ట్రీట్మెంట్ కోసం అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.. లేటెస్ట్ టెక్నాలజీతో ICU, MRI, CT స్కాన్, X-రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డెంటల్ స్కాలార్, లిథోట్రిప్సీ, డయాలసిస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్జరీలకు లైవ్ వీడియో కాన్ఫరెన్సులు ఉన్నాయి. బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఈ కేంద్రంలో 2 వేలకు పైగా ప్రాణులు, 43 జాతుల వాటిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతరించే జాతులకు సంబంధించిన 7 రకాల వన్యప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి.. అలాగే విదేశాల్లో అంతరించే దశలో ఉన్న ప్రాణులనూ రక్షిస్తున్నారిక్కడ. రెస్క్యూలో భాగంగా ఇప్పటికే 2వందలకు పైగా ఏనుగులను సేవ్ చేసి.. వంతారలోని ఏనుగుల రక్షణ కేంద్రంలో వదిలేశారు. జూను చూసేందుకు 3వేల-4వేల మంది పనిచేస్తున్నారు. భారత్ తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతుశాస్త్ర నిపుణులు.. వైద్య నిపుణులు కొందరు వంతార మిషన్ లో భాగమైయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా వంతార జూకు సహకరిస్తున్నాయి. -
వంతారాకు కొత్త అతిథులు
ఇస్కాన్ మాయాపూర్‌కు చెందిన రెండు ఏనుగులు బిష్ణుప్రియ, లక్ష్మీప్రియల సంరక్షణ బాధ్యతలను జంతు పునరావాస కేంద్రం వంతారా తీసుకోనుంది. గత ఏప్రిల్‌లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసిన విషాద సంఘటన తరువాత ఈ మేరకు ఇస్కాన్, వంతారా మధ్య ఒప్పందం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆధ్వర్యంలోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా జంతు సంరక్షణ కేంద్రం ప్రసిద్ధి చెందింది.అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ఈ రెండు ఏనుగులకు శాశ్వత నివాసం కల్పించనుంది. ఈ ఏనుగుల బదిలీకి సంబంధించి త్రిపుర హైకోర్టు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నుంచి పూర్తి ఆమోదం లభించింది. ఆపదలో ఉన్న అడవి జంతువులను రక్షించడం, ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించడానికి అనువైన ప్రాంతాలను అన్వేషించడం ఈ కమిటీ బాధ్యత.బిష్ణుప్రియ, లక్ష్మీప్రియ ఏనుగుల కోసం సహజ ఆవాసాన్ని ప్రతిబింబించేలా వంతారాలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇస్కాన్ మాయాపూర్ 2007 నుంచి లక్ష్మీప్రియను, 2010 నుంచి బిష్ణుప్రియను ఆలయ ఆచారాలకు, వివిధ పండుగ సందర్భాలకు ఉపయోగిస్తోంది. కొన్ని కారణాల వల్ల గత ఏప్రిల్‌లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా, వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్‌తో సహా జంతు సంరక్షణ సంస్థలు ఇస్కాన్ ఏనుగులను సంరక్షణ కేంద్రానికి తరలించాలని తెలిపాయి.ఇదీ చదవండి: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అంబానీ హాజరువంతారాఅనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
వనాలు వదిలి జనాల పైకి..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వన్య మృగాలు వనాలు వదిలి జనాలపైకి పడుతున్నాయి. ఆవులు, మేకలను పులి తినేసి భయపెడుతుండగా, ఏనుగులు, ఎలుగుబంట్లు ఏకంగా మనషుల్నే చంపేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు, వజ్రపుకొత్తూరు, మందస, వీరఘట్టం, సీతంపేట, పాతపట్నం, పలాస తదితర ప్రాంతాల్లో ఈ రకమైన ఘటనలు ఇప్పటికే జరిగాయి. దీంతో వన్య మృగాలు సంచరిస్తున్న వార్తలు వస్తే చాలు ఈ ప్రాంతాలు వణికిపోతున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం..శ్రీకాకుళం జిల్లాలో కొంతకాలంగా పులులు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులు జనారణ్యంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఎలుగుబంట్లు దాడులు చేస్తుండగా, కొత్తూరు, పాలకొండ, భామిని తదితర ప్రాంతాల్లో ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇవి చాలదన్నట్టు మధ్యలో పులులు కూడా సంచరిస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో ఇదే రకంగా పులి సంచరించగా సరిగ్గా ఏడాదికి మళ్లీ పులి జిల్లాలోకి ప్రవేశించింది. తగ్గుతున్న అటవీ విస్తీర్ణం, పెరుగుతున్న ఆక్రమణల వల్లే జంతువులు ఇలా ఊళ్లమీదకు వస్తున్నట్లు తెలుస్తోంది. పులి సంచారమిలా.. » ఒడిశా నుంచి మందస రిజర్వు ఫారెస్టు మీదుగా సాబకోట, బుడంబో తదితర గిరిజన ప్రాంతాలను దాటుకుంటూ వజ్రపుకొత్తూరు తీర ప్రాంతం మీదుగా సంత»ొమ్మాళి వైపునకు చేరుకుంది. ఈ మండలంలోని హనుమంతునాయుడుపేట పంచాయతీ కేశనాయుడుపేటలో పులి తిరిగిందన్న ప్రచారం జరిగింది. ఇదే సమయంలో భద్రాచలం శాంతమూర్తికి చెందిన ఆవు మృతి చెందింది. పులి కారణంగా చనిపోయిందా? మరే జంతువు కారణంగా చనిపోయిందో స్పష్టత లేదు. » కోటబోమ్మాళి మండలం పొడుగుపాడు సమీపంలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. సారవకోట మండలం జమ చక్రం, సోమయ్యపేట, అన్నుపురం, వాబచుట్టు, బోరుభద్ర పరిసర ప్రాంతాల్లో సంచరించిన పులి పాతపట్నం మండలంలోకి ప్రవేశించింది. బోరుభద్ర, దాసుపురం, గురండి, తీమర, తామర, పెద్దసీదిలో సంచరించింది. తీమరలోని బెండి రామారావు మామిడితోటలో బైరి లక్ష్మణరావుకు చెందిన ఆవుదూడను చంపేసింది. » ఇదే సమయంలో ఉద్దానంలో గుర్తు తెలియని జంతువు కూడా తిరుగుతోంది. దాని దాడి ఎక్కువగా ఉంది. వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లోని ఒంకులూరు, మెట్టూరు, కొండపల్లి, అనకాపల్లి, బహడపల్లి, కొండలోగాం గ్రామాల్లో ఈ జంతువు సంచరించింది. పలాస మండలంలో నీలావతిలో రెండు ఆవు దూడలను చంపేసింది. ఇదే కారణమా..? ‘పులులు చాలా అరుదుగా అడవులను వదిల జనావాసాల వైపు వస్తుంటాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో మగ, ఆడ పులులు జతకట్టే సమయం కావడంతో తమ జోడు కోసం అవి సాధారణం కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అలాంటి సందర్భాల్లో అడవిని దాటి సరిహద్దు ప్రాంతాల్లోని పంటపొలాలు, గ్రామాల్లోకి వస్తుంటాయి. ఈ సమయంలో దాడులు అధికంగా జరిగే అవకాశం ఉంది. వేసవి ఎండలతో అటవీ ప్రాంతంలో తాగునీటి వనరులు తగ్గినప్పుడు కూడా అవి జనావాసాల వైపు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. రైతులు పశువులను మేత కోసం అడవుల్లోకి తీసుకెళ్లడంతో వాటిని వేటాడేందుకు యత్నిస్తాయి. అటవీ సరిహద్దు ప్రాంతంలోని పంట పొలాల్లో పశువులు, మేకలు, గొర్రెలను మందలుగా ఉంచడంతో వాటిని కూడా వేటాడే అవకాశాలు ఉంటాయి.’ అని నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్త సుమా » అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు వన్య మృగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. » సాయంత్రం 5గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదు. పులులు గ్రామాల్లోకి, పొలాల్లోకి వస్తే శివారు ప్రాంత ప్రజలు వెంటనే అప్రమత్తమై శబ్దం చేస్తూ చాకచక్యంగా తిరిగి అడవిలోకి పంపించాలి. » పులి అరుపులు, పాద ముద్రలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. » పంటల కాపలాకు రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లకుండా బృందంగా వెళ్లాలి. » పొలాల్లో మంచెలు ఏర్పాటు చేసుకుని గుంపులుగా ఉండాలి. » పశువుల కాపరులు పగలంతా మేత కోసం సంచరించి రాత్రి అటవీ ప్రాంతంలో మందను ఉంచి బస చేస్తుంటారు. » పులులు వాటిని వేటాడేందుకు వస్తుంటాయి. » రాత్రి సమయంలో అటవీ ప్రాంతంలో ఉండటం సురక్షితం కాదని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. ఇబ్బందికరంగానే ఉంది... మా మండలంలో పులి తిరుగుతుందని పేపర్లు, వాట్సాప్‌లలో చూస్తుంటే భయమేస్తుంది. మేము నిత్యం కొండలు, పంట పొలాలలో మేకలు, గొర్రెలతో మందలు వేసుకుని పడుకుంటున్నాం. మా ఊరికి దగ్గర్లో ఉన్న జమచక్రం, సోమయ్యపేట గ్రామాలలో పులి అడుగులు గుర్తించడంతో ఆయా గ్రామాల నుంచి మందలు తీసుకొచ్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాం. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో మరింత ఇబ్బంది పడుతున్నాం. – పల్ల ముఖలింగం, వడ్డినవలస, సారవకోట మండలం.భయం.. భయం.. పులి మా గ్రామ పంట పొలాల్లో తిరగడంతో మాకు భయంగా ఉంది. పశువులు మేతకు తీసుకు వెళ్లడానికి, ఉదయం పొలాలకు వెళ్లాలన్నా భయంగా ఉంది. ఇప్పటికే ఆవుదూడను తీనేసింది. పులి ఉందని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. – మద్ది నారాయణరెడ్డి, పెద్దసీది గ్రామం,పాతపట్నం మండలంఆందోళనకరమే.. పులి సంచరిస్తున్న వార్తలతో ఆందోళనగా ఉంది. మా గ్రామం వైపు పులి వచ్చిందని మాకు తెలియదు, మంగళవారం ఉదయం ఆవుదూడపై దాడి చేయడంతో మాకు పులి వచ్చిందని తెలిసింది. దీంతో పంట పొలాలవైపు వెళ్లాలంటే భయంగా ఉంది. – బండి ఆనంద్,తీమర గ్రామం, పాతపట్నం మండలం -
ఎలిఫెంటా కేవ్స్ ఏనుగు కోసం వెతకొద్దు!
ఎలిఫెంటా కేవ్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ముంబయి టూర్లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. సముద్రం మధ్యలో ఓ దీవి. అందులో ఓ కొండ. ఆ కొండలో తొలిచిన గుహలివి. అయితే ఈ కొండ మీద కానీ, గుహల్లోనూ ఎంత వెదికినా ఏనుగు మాత్రం కనిపించదు. బ్రిటిష్ వారు ముచ్చటపడి తమ దేశం తీసుకెళ్లాలనుకున్నారట. పెకలించే ప్రయత్నంలో డ్యామేజ్ అవడంతో ఏనుగును వదిలేసి కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనంతో సరిపెట్టుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనవాళ్లు డ్యామేజ్ అయిన ఏనుగు విగ్రహానికి మరమత్తులు చేసి నగరంలోని శివాజీ మ్యూజియంలో ఉంచారు. ఏనుగు లేదని ఈ గుహలను చూడడం మానుకోకూడదు. ఈ గుహలు మన వారసత్వానికి ప్రతీకలు. ఈ గుహలను చేరడానికి అరేబియా సముద్రంలో సాగే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.నీరెండలో కడలి విహారంఎలిఫెంటా కేవ్స్‌కి ముంబయిలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఫెర్రీలో వెళ్లాలి. ఫెర్రీలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే తీసుకెళ్తాయి. ఈ సీజన్లో మిట్ట మధ్యాహ్నం కూడా సూర్యుడు గోరువెచ్చగానే ఉంటాడు. ఫెర్రీ బోట్‌పై అంతస్థులో ప్రయాణిస్తూ ముంబయి తీరంలో అరేబియా తీరాన్ని వీక్షించడం ఆహ్లాదకరం మాత్రమే కాదు ఓ ఎడ్యుకేషన్ కూడా. హార్బర్‌కు వచ్చిన షిప్పులు పోర్టులో బెర్త్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తూ లంగరు వేసుకుని ఉంటాయి. వాటిలో క్రూ డెక్ మీదకు వచ్చి సముద్రాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. బకెట్‌కి తాడు కట్టి బావిలో నీటిని తోడినట్లు సముద్రపు నీటిని తోడుకుని షిప్ లోపలికి వెళ్తుంటారు. ఇంటర్నేషనల్ కార్గోలను అంత దగ్గరగా చూడడం కుదరని పని. ఎలిఫెంటా కేవ్స్ టూర్లో ఇది బోనస్. షిప్పులు తీరానికి రెండు కిలోమీటర్ల వరకు ఆగి ఉంటాయి. వాటిని చూస్తూ ప్రయాణించడం వల్ల కేవ్స్‌కు పదికిలోమీటర్లు ప్రయాణించిన విషయం అర్థం కాదు. కడలి గర్భం నుంచి తీరాన్ని చూడవచ్చుకొండ దగ్గర ఫెర్రీ దిగిన తర్వాత దాదాపు కిలోమీటరు దూరం నడవాలి. గుహలను చేరడానికి టాయ్‌ట్రైన్ ఉంది. కానీ ఎప్పుడో ఒక ట్రిప్పు తిరుగుతుంది. ట్రైన్ కోసం ఎదురు చూడాలా నడవాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. సముద్రం లోపల పది కిలోమీటర్ల దూరం నుంచి తీరాన్ని చూడడం బాగుంటుంది. సముద్రపు అలలు, మరోవైపు కొండలను చూస్తూ సాగే ఆ నడక కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఇంతటి వైవిధ్యతను ఆస్వాదిస్తూ గుహల్లోకి అడుగుపెట్టిన తర్వాత అది మరో ప్రపంచం. శిల్పాలు మాట్లాడతాయి!ఈ గుహలు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటివి. శిల్పాల్లో బౌద్ధం, శైవం ప్రభావం కనిపిస్తుంది. ఒక్కో శిల్పం ఒక్కో కావ్యంతో సమానం. మనం చూస్తున్న శిల్పంలో దాగిన కావ్యకథ గైడ్ వివరించే వరకు అర్థం కాదు. విధ్వంసకారులు ఏ శిల్పాన్నీ వదల్లేదు. ప్రతి శిల్పానికి ఎక్కడో ఓ చోట గాయం తప్పనిసరి. హీనయాన బౌద్ధులు ఈ కొండలను తొలిచి ఆవాసాలుగా మలుచుకున్నారు. బౌద్ధ శిల్పాలను చెక్కారు. శివపురాణం ఆధారంగా చెక్కిన ఘట్టాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. బౌద్ధం సన్నగిల్లిన తర్వాత ఈ ప్రదేశం హిందువుల ఆధీనంలోకి వచ్చింది. శైవం పతాకస్థాయికి చేరిన కాలంలో కాలచూరులు, రాష్ట్రకూటులు ఈ శిల్పాలను చెక్కించారు. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో సమాజం స్త్రీ పురుష సమానత్వం గురించి ఆలోచించింది. సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి శైవాన్ని మాధ్యమం చేసుకుంది. అలా రూపొందిన శిల్పమే అర్ధనారీశ్వరుడి శిల్పం. పిఎస్: ఎలిఫెంటా కేవ్స్ సందర్శనకు సోమవారం సెలవు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: ఆర్ట్‌తో మూగ జీవుల సంక్షేమంపై అవగాహన..!) -
‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం.... భూమాతకు తీరని శోకం!
భూమండలంపై అత్యంత భారీకాయంతో సంచరించే శాకాహార బాహుబలిగా ఏనుగు మనందరికీ చిరపరిచితం. ఆఫ్రికా ఖండంలోని పీఠభూముల్లో సర్వసాధారణంగా కనిపించే ‘సవన్నా’, ‘అటవీ’జాతి ఏనుగులు అత్యంత వేగంగా అంతర్థానమవుతున్నాయి. అటవీప్రాంతాల్లో విచ్చలవిడిగా పెరిగిన మానవ కార్యకలాపాలు, విస్తరిస్తున్న వ్యవసాయం, విజృంభిస్తున్న అక్రమ వేటతో ఏనుగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం గత యాభై సంవత్సరాల్లో.. సర్వేచేసిన ప్రాంతాల్లో సవన్నా జాతి ఏనుగుల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. ‘ఫారెస్ట్’జాతి ఏనుగుల సంఖ్య ఏకంగా 90 శాతం క్షీణించడం ఏనుగుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్య పెరగడం ఒకింత ఉపశమనం కల్పిస్తోంది.అత్యంత తెలివి అత్యంత తెలివితేటలతోపాటు మానవునిలా సామూహికంగా జీవించే నైపుణ్యమున్న వన్యప్రాణిగా ఏనుగు పేరొందింది. 1964 నుంచి 2016 సంవత్సరం దాకా ఆఫ్రికా ఖండంలోని 37 దేశాల్లోని 475 భిన్న ప్రదేశాల్లో ఏనుగుల జాడపై విస్తృతస్థాయి గణన, పరిశోధన చేశారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇంతటి విస్తృత సర్వే చేపట్టడం ఇదే తొలిసారి. సంబంధిత నివేదిక సోమవారం వెల్లడైంది. దీనిలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. సవన్నా, ఫారెస్ట్ జాతి ఏనుగుల సంఖ్య సగటున ఏకంగా 77 శాతం తగ్గిపోయింది. విడిగా చూస్తే సవన్నా జాతి 70 శాతం, ఫారెస్ట్ జాతి సంఖ్య 90 శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు గుంపులగుంపులుగా కనిపించిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అవి ఒక్కటికూడా లేవని సర్వేలో తేలింది. అయితే కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల పరిరక్షణ చర్యలతో వాటి సంఖ్య పెరిగిందని నివేదిక పేర్కొంది. ‘‘తగ్గిపోయిన సంఖ్యను ఎలాగూ పెంచలేము. ఉన్న ఏనుగుల సంఖ్యా వేగంగా క్షీణిస్తోంది. మాలి, చాద్, నైజీరియా వంటి దేశాల్లో మరీ దారుణంగా పడిపోయింది’’ అని కొలరాడో స్టేట్ వర్సిటీలో వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ విభాగ ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ చెప్పారు.కొన్ని చోట్ల మెరుగైన పరిస్థితులు ఆఫ్రికా ఖండం దక్షిణ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎంతో శ్రమకోర్చి ఏనుగుల సంతతిని కాపాడుతున్నారు. ప్రభుత్వాల చొరవ, స్థానికుల అండతో ఏనుగుల సంఖ్య అక్కడ పెరిగింది. బొట్సావా, జింబాబ్వే, నమీబియాలో ఇప్పటికే వాటి సంఖ్య భారీగానే ఉంది. ‘‘కొన్ని చోట్ల మనం విజయం సాధించాం. ఈ విషయంలో మనకు మనం శెభాష్ చెప్పకోవాల్సిందే. అయితే ఇంకా ఏఏ ప్రాంతాల్లో విజయావకాశాలు ఉన్నాయో కనిపెట్టి కార్యసాధకులం కావాల్సిన తరుణమొచ్చింది’’అని ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ అన్నారు.ఏనుగు దంతాలపై మోజుతో.. చాలా పొడవుండే ఆఫ్రికన్ ఏనుగుల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉంది. వీటి కోసమే వేటగాళ్లు ఏనుగులను చంపేస్తున్నారు. వేటగాళ్లను అడ్డుకోగలిగితే ఈ వన్యప్రాణులను కాపాడవచ్చని జంతుప్రేమికులు చెబుతున్నారు. అడవుల్లో పెరుగుతున్న వ్యవసాయం కారణంగా ఏనుగులు తమ ఆవాసాలను, ఆహార వనరులను కోల్పోతున్నాయి. చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!‘‘అడవుల విస్తరణకు ఏనుగులు మూలాధారం. ఎన్నో రకాల చెట్ల కాయలు, పండ్లను తింటూ వాటి గింజలను జీర్ణంచేయకుండా వేర్వేరు చోట్ల విసర్జించి కొత్త మొక్కల అంకురార్పణకు ఆజ్యం పోస్తాయి. నిత్యం వనవృద్ధి కార్యం చేసే ఏనుగుల సంఖ్య తగ్గడం భూమాతకు తీరని శోకం’’ అని సౌత్ ఆఫ్రికాలోని నెల్సన్ మండేలా యూనివర్సిటీలోని ఆఫ్రికన్ కన్జర్వేషన్ ఎకాలజీ అధ్యయనకారుడు, నివేదిక సహరచయిత డేవ్ బల్ఫోర్ ఆందోళన వ్యక్తంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ మొక్కలే ఏనుగుల మృతికి కారణం
భోపాల్: ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ అభయారణ్యంలో 10 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాయి. దీనినిపై విచారణ జరిపిన అటవీశాఖ అధికారులు వీటి మృతికి ‘న్యూరోటాక్సిన్ సైక్లోపియాజోనిక్ ఆమ్లం’ కారణమని తెలిపారు. ఏనుగులకు విషం ఇవ్వడం కారణంగానే అవి మరణించాయని వస్తున్న వార్తలను ఒక అటవీశాఖ అధికారి ఖండించారు. వాటి మృతికి విషపూరితమైన మొక్కలు కారణమని స్పష్టం చేశారు.అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్ లైఫ్) ఎల్. కృష్ణమూర్తి మాట్లాడుతూ ఏనుగులు పెద్ద మొత్తంలో ‘కోడో’ మొక్కలను తినడం వలన వాటి శరీరంలోకి విషం వ్యాపించిందని అన్నారు. అక్టోబర్ 29 బాంధవ్‌గఢ్ పులుల అభయారణ్యంలో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. ఆ తరువాత వాటి మరణాల సంఖ్య 10కి చేరింది.ఇంత పెద్ద సంఖ్యలో ఏనుగులు చనిపోయిన దరిమిలా ప్రభుత్వం దీనిపై దర్యాప్తునకు ఒక కమిటీని నియమించింది. ఈ దర్యాప్తులో కోడో మొక్కలే ఆ ఏనుగుల మృతికి కారణమై ఉండవచ్చని తేలింది. కాగా ఏనుగుల మృతి గురించి తెలిసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెంటనే స్పందించారు. ఏనుగుల మరణాలను నివారించడం, మానవులపై వాటి దాడులను ఆపడం అనే లక్ష్యంతో దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.ఇది కూడా చదవండి: ప్లీజ్... ఇంకో బిడ్డను కనవచ్చు కదా! -
3 ఆఫ్రికన్ ఏనుగులకు స్వాగతం పలికిన వంతారా..!
-
పార్వతీపురంలో గజరాజుల బీభత్సం
-
అయ్యో గజరాజా.. 48 గంటల్లో ఎనిమిది అనుమానాస్పద మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లో 48 గంటల్లో ఎనిమిది ఏనుగులు మృతి కలకలం రేపుతోంది. ఇప్పటికే మంగళవారం ఏడుగురు మృతి చెందగా, నిన్న (బుధవారం)మరో ఏననుగు మృతదేహం లభించినట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన ఏనుగుల్లో ఏడు ఏనుగులు.. ఒక్కొక్కటి మూడు ఏళ్ల వయస్సు గలవి ఉన్నాయి. ఎనిమిదో ఏనుగ ఐదేళ్ల మగ ఏనుగుగా అధికారులు గుర్తించారు. మొత్తం 13 మంది ఏనుగుల్లో తొమ్మిదో ఏనుగు పరిస్థితి విషమంగా ఉందని వన్యప్రాణి అధికారులు పేర్కొన్నారు. వైద్యసేవలు పొందిన పదో కోలుకున్నట్లు తెలిపారు. ఇక.. మిగిలిన మూడు ఏనుగుల నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏనుగుల మృతిపై.. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం స్వతంత్ర విచారణను చేపట్టింది. విచారణ నివేదికను 10 రోజుల్లో సమర్పించనుంది. ఏనుగుల మృతికి ప్రాథమిక కారణం విషంగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు కళేబరాలు ఉన్న ప్రాంతంలోని ఐదుగురి వ్యక్తులను వన్యప్రాణి అధికారులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు ప్రాంతం ఐదు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని తెలిపారు. కుక్కల స్క్వాడ్‌తో సహా 100 మంది అటవీ అధికారులు ఏనుగులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. కోడో మిల్లెట్ గింజలను ఏనుగులు తిన్నాయా అనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కోడో మిల్లెట్ గింజలు ఫంగస్‌తో కలుషితమైతే సైక్లోపియాజోనిక్ యాసిడ్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది.అందుకే.. మృతిచెందిన ఏనుగుల మలం నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. -
దూసుకొస్తున్న రైలు.. ఎదురుగా 60 ఏనుగులు.. తరువాత?
గౌహతి: అస్సాంలో తృటిలో రైలు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ అప్రమత్తతతో దాదాపు 60 ఏనుగులు ప్రమాదం బారి నుంచి బయపడ్డాయి. అర్దరాత్రి ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటుతోంది.. ఇంతలో ఒక రైలు అతివేగంతో అదే పట్టాల మీదుగా వస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)భద్రతా వ్యవస్థ లోకో పైలట్‌కు సిగ్నల్ రూపంలో ఈ విషయాన్ని తెలిపింది. వెంటనే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం అక్టోబర్ 16న కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్న లోకో పైలట్ జెడీ దాస్, అతని సహాయకుడు ఉమేష్ కుమార్ రాత్రి 8.30 గంటలకు హవాయిపూర్- లాంసాఖాంగ్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ను దాటుతున్న ఏనుగుల గుంపును చూశారు. ఆ రైలు గౌహతి నుంచి లుమ్డింగ్కు వెళ్తోంది. వారు ఏనుగులను చూడగానే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేసి, ఏనుగుల గుంపునకు కొద్ది దూరంలో రైలును ఆపారు. దీంతో 60 ఏనుగులు ప్రమాదం బారి నుంచి బయటపడ్డాయి.ఈస్ట్ సెంట్రల్ రైల్వే తన పరిధిలోని అన్ని కారిడార్లలో ఏఐ వ్యవస్థను క్రమంగా నెలకొల్పుతోంది. రైల్వే ట్రాక్‌లోకి ప్రవేశించిన ఏనుగుల ప్రాణాలను కాపాడడంలో ఈ వ్యవస్థ విజయవతంగా పనిచేస్తోంది. తూర్పు మధ్య రైల్వే 2023లో 414 ఏనుగులను, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 16 వరకు 383 ఏనుగులను రక్షించింది.ఇది కూడా చదవండి: Subrahmanyan Chandrasekhar: చుక్కల్లో చంద్రుడు -
నేపాల్ నుంచి ఏనుగుల గుంపు.. బీహర్ గ్రామాల్లో ఆందోళన
పశ్చిమ చంపారణ్: బీహార్‌లోని వాల్మీకి పులుల అభయారణ్యానికి సమప గ్రామాల్లో మళ్లీ అడవి ఏనుగుల సంచారం మొదలైంది. తాజాగా బిసాహా గ్రామ సమీపంలో ఆరు అడవి ఏనుగుల గుంపు కనిపించింది. దీంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నేపాల్‌లోని చిత్వాన్ నుంచి వస్తున్న అడవి ఏనుగులు పొలాల్లోకి చొరబడి వరి, చెరకు పంటలను ధ్వంసం చేస్తున్నాయి.ఏనుగుల గుంపును చూసిన గ్రామస్తులు వాటిని తరిమికొట్టేందుకు టార్చ్‌లు వెలిగించి సందడి చేసి, వాటిని తరిమికొట్టారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుగులు సుమారు 10 ఎకరాల్లోని పంటలను ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన చెరకు, వరి పంటలు కళ్ల ముందే పూర్తిగా నాశనం కావడంతో రైతులు ఏనుగుల ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకినగర్ రేంజర్ రాజ్‌కుమార్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన పంటలపై సర్వే చేస్తున్నామని, నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇచ్చే ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. నేపాల్‌లోని చిత్వాన్ నుంచి ఏనుగులు ఇటువైపు తరలివస్తున్న మాట వాస్తవమేనని నేచర్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ అభిషేక్ పేర్కొన్నారు. ఏనుగుల గుంపు గ్రామాల్లోకి చొరబడకుండా తగిన చర్యలు చేపడుతున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: World Students Day: అబ్ధుల్ కలాం స్ఫూర్తిగా.. -
జనాలను ఉరుకులు పెట్టించిన మైసూర్ గజరాజులు
బెంగళూరు: మైసూర్ ప్యాలెస్ వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దసరా వేడుకల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు పోట్లాడుకుని.. బీభత్సం సృష్టించాయి అక్కడ.రెండు ఏనుగులు ధనంజయ, కంజన్‌లు ఒకదానితో ఒకటి కొట్లాటకు దిగాయి. ఈ క్రమంలో ఒక ఏనుగు మరొకదాన్ని తరమడంతో.. జయమార్తాండ గేట్ గుండా బయట ఉన్న ఎగ్జిబిషన్ రోడ్‌కు వచ్చేశాయి.వెనకాల ఏనుగుపై మావటివాడు ఉన్నప్పటికీ.. ఏనుగు నియంత్రణ కాలేకపోయింది. దీంతో రోడ్లపై ఉన్న జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయితే కాసేపటికే మావటిలు, అధికారులు ఏనుగులు నియంత్రించి వెనక్కి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.మైసూర్ దసరా ఉత్సవాల్లో భాగంగా.. రాజమార్గంలో ఆనవాయితీగా జరిగే ఉరేగింపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. లక్షల మంది హాజరయ్యే ఈ ఉరేగింపునకు అలంకరణతో కూడిన గజరాజులే ప్రత్యేక ఆకర్షణ. అయితే గత రెండు దశాబ్దాల్లో.. ఉరేగింపులోగానీ, శిక్షణలోగానీ ఏనుగులు పోట్లాడుకునే ఘటనలు జరగలేదని అధికారులు అంటున్నారు. AnxietyGrips as 2DasaraElephants fight,run out of Palacepremises;Elephants pacified,BroughtBack toPalace;Noharm/damage@DeccanHerald pic.twitter.com/TZ8O4bmhoT— Shilpa P. (@shilpapdcmysuru) September 21, 2024 -
‘‘గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’’, నూయార్క్‌కు చేరుకున్న గజరాజులు
భారతీయ కళాకారులు రూపొందించిన అపురూపమైన ‘‘గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’’ 100 ఏనుగుల కళాశిల్పాలు న్యూయార్క్ చేరుకున్నాయి. ప్రతి ఏనుగును తమిళనాడులోని నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ నుండి 200 మంది దేశీయ కళాకారులతో కూడిన ది కోఎక్సిస్టెన్స్ కలెక్టివ్ రూపొందించింది. ఈ అద్భుతమైన కళాఖండాల త తయారీకి ఐదేళ్ళు పట్టింది. ఇవి అమెరికా అంతా పర్యటించి సహజీవనం సందేశాన్ని వ్యాప్తి చేయనున్నాయి. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.Look ! Indian Elephants have finally arrived in New York. Titled as the 'Great Elephant Migration' a travelling herd of 100 stunning life size elephant sculptures have reached NYC. These elephant sculptures have been made by local tribal artisans from Gudalur in Nilgiris, Tamil… pic.twitter.com/AVolGQLDtJ— Supriya Sahu IAS (@supriyasahuias) September 6, 2024తమిళనాడులోని నీలగిరిలోని గూడలూర్‌కు చెందిన స్థానిక గిరిజన కళాకారులచే లాంటానా జాతికి చెందిన కలుపు మొక్కల చెక్క నుంచి ఈ కళాకృతులను రూపొందించారు. ‘‘మానవ-వన్యప్రాణుల సహజీవన ప్రాజెక్టుల’’ కోసం మిలియన్ల డాలర్లను సేకరించాలనే లక్ష్యంతోపాటు, ‘‘భూమి, నదులు, ఆకాశం మరియు మహాసముద్రాల మీదుగా అద్భుతమైన ప్రయాణాలు చేసే వలస జంతువులను రక్షించడం’’ఈ శిల్పాలను ఎవరు రూపొందించారు?బెట్టకురుంబ, పనియా, కట్టునాయకన్ , సోలిగ కమ్యూనిటీలకు చెందిన కళాకారులు కలిసి ప్రతి జీవం-వంటి, శరీర నిర్మాణపరంగా ఎలాంటి తేడా లేకుండా క్లిష్టమైన ఏనుగు శిల్పాలను రూపొందించారు. అక్టోబర్ 20 వరకు న్యూయార్క్ నగరంలో తర్వాత ఆర్ట్ బాసెల్ మయామికి వెళతాయి. లాస్ ఏంజిల్స్‌లో, బ్లాక్ఫీట్ నేషన్ మధ్య మోంటానాలోని బ్రౌనింగ్లోని బఫెలో ,పరిరక్షణ బృందం హ్యూస్టన్ , గ్లేసియర్ నేషనల్ పార్క్, ఈ శిల్పాలు 13 నెలల పాటు అమెరికా వివిధ ప్రాంతాలలో కొలువుదీరతాయి. -
గజేంద్ర విలాపం
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో వివిధ కారణాల రీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో 528 ఏనుగులు అసహజ రీతిలో మృత్యువాత పడ్డాయంటూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించిన నేపథ్యంలో జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా విద్యుదాఘాతం కారణంగా గత ఐదేళ్లలో (2019–20 నుంచి 2023–24 వరకు) అత్యధికంగా 392 ఏనుగులు మృత్యువాతపడగా.. ఆ తరువాత రైళ్ల ప్రమాదాల బారిన పడి 73 ఏనుగులు మృతి చెందాయి. వేటాడం ద్వారా 50, విషప్రయోగం చేసి 13 ఏనుగులను హతమార్చారు.విద్యుత్ కంచెలతోనే పెను ముప్పు..అటవీ ప్రాంతం సమీపంలోని పంట పొలాల్లోకి ఏనుగులు రాకుండా రైతులు విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తుండడంతో అత్యధికంగా ఏనుగులు మృతి చెందుతున్నాయి. విద్యుత్ ఘాతాల నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెలను తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. అండర్ గ్రౌండ్ లేదా, పోల్స్ పైన మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్రం తెలిపింది.ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కేంద్ర ప్రయోజిత పథకం ద్వారా ఏనుగులు, పరిరక్షణ, వాటి ఆవాసాల్లో చర్యలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రైలు పైలట్లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్‌ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగు ఉనికి గురించి పైలట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్‌ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్‌పాస్, ఓవర్‌పాస్‌ను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వన్యప్రా ణుల పరిశీలకులు రైల్వే ట్రాక్‌లపై రెగ్యులర్ పెట్రోలింగ్ చేయడం తదితర చర్యలను తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.ఏనుగు దంతాల కోసం.. ఏనుగు దంతాల కోసం అత్యధికంగా ఒడిశా, మేఘాలయ, తమిళనాడులో వేటాడి హతమారుస్తున్నారని, అలాగే అసోం, ఛత్తీస్‌గఢ్‌లో విషప్రయోగం చేస్తున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రాష్ట్రల్లో ఏనుగుల దంతాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. వేటగాళ్లు, విషప్రయోగాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. విద్యుదాఘాతంతో అత్యధికంగా ఒడిశాలో 71, అసోంలో 55, కర్ణాటకలో 52 మృతి చెందాయి. రైళ్లు ఢీ కొట్టిన ఘటనల్లో అత్యధికంగా అసోంలో 24, ఒడిశాలో 16 మృతి చెందాయి. వేటాడటం ద్వారా ఒడిశాలో అత్యధికంగా 17, మేఘాలయలో 14 ఏనులను చంపేశారు. అసోంలో విషప్రయోగం ద్వారా 10 ఏనుగులను హతమార్చారు. -
ఏనుగుల దాడిలో ఇద్దరి మృతి
రాంచీ: జార్ఖండ్‌లో రెండు వేరువేరు ఏనుగుల దాడి ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. ఈస్ట్‌సింగ్‌భుమ్ జిల్లాలోనే ఈ రెండు ఘటనలు జరిగాయి. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న చౌతియా గ్రామంలో ఏనుగు ఒక వ్యక్తిని తొక్కి చంపేసింది. ఇదే జిల్లాలోని డిఘీ గ్రామంలో జరిగిన మరో ఘటనలో ఏనుగు ఓ ఇంటిపై దాడి చేసింది. ఈ దాడిలో ఇంటి గోడ కూలి లోపల నిద్రిస్తున్న వృద్ధురాలు మరణించింది. జిల్లాలోని అటవీ ప్రాంతంలో వరుసగా ఏనుగుల దాడులు జరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళకు దిగారు. ఏనుగుల దాడిలో మృతిచెందిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
కౌండిన్య.. గజరాజ్యం
ఎటుచూసినా ఆకాశాన్నంటే పచ్చదనం.. జలజలపారే సెలయేళ్లు.. అడుగడుగునా నీటిగుంటలు.. జీవాలకు సమృద్ధిగా ఆహారం.. ఇది కౌండిన్య. 353 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన దట్టమైన అడవి. అపారమైన జంతుసంపదకు ఆవాస కేంద్రం. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దు సమీపంలోని కుప్పం మల్లప్పకొండ దగ్గర నుంచి పలమనేరులో కర్ణాటక సరిహద్దుల వరకు ఉన్న ఈ కౌండిన్య అటవీ ప్రాంతం గజరాజుల సామ్రాజ్యం.సాక్షి, చిత్తూరు: కౌండిన్య అటవీప్రాంతం వివిధ రకాల జంతుసంపదకు నిలయం. ఈ అడవిలో చిరుతపులి, తోడేలు, నక్క, అడవి రేసుకుక్క, దేవాంగపిల్లి, నక్షత్ర తాబేలు, అడవిపిల్లి, ఎలుగుబంటి, హైనా, జింక, దుప్పి, తోడేలు, ఎద్దు, కుందేళ్లు ఎక్కువగా ఉన్నాయి. పక్షి జాతుల్లో కోకిల, రామచిలుక, నెమలి, పావురాలు, పిచ్చుకలు, కొంగలు ఉన్నాయి. సర్పాల్లో కొండచిలువ, కట్లపాము, నల్లత్రాచు, రక్తపింజరిలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అటవీశాఖ లెక్కల ప్రకారం ఏనుగుల సంఖ్య ఎక్కువ. దట్టమైన ఈ అడవిలో ఏనుగుల సంతతి ఏటేటా వృద్ధిచెందుతోంది. గుంపులుగుంపులుగా అడవిలో సంచరించే ఇవి అడపాదడపా గ్రామాల్లోను స్వైరవిహారం చేస్తున్నాయి. మూడురోజులు ఏనుగుల గణనఏటా మాదిరే ఈ సంవత్సరం మే నెలలో కూడా దక్షిణ భారతదేశంలో ఏనుగులను లెక్కించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒకేసారి మూడురోజులు ఈ గణన నిర్వహించారు. మన రాష్ట్రంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో ఏనుగుల్ని లెక్కించారు. జిల్లా అటవీప్రాంతంలోని 66 బీట్లలో ఏనుగుల్ని అటవీ సిబ్బంది లెక్కపెట్టారు. తొలిరోజు 15 కిలోమీటర్ల పరిధిలో జిగ్‌జాగ్ విధానంలో లెక్కించారు.రెండోరోజు కూడా అదే పద్ధతి కొనసాగించారు. చివరిరోజున నీటికుంటలు, చెరువుల వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిఘా వేసి ఏనుగుల్ని లెక్కపెట్టారు. అడుగుజాడలు, మలమూత్ర విసర్జన, చెట్లను తోసివేయడం, సమూహం, పరిణామం ఆధారంగా వాటిసంఖ్యను లెక్కించారు. కనిపించిన ఏనుగుల ఫొటోలు తీసి, లింగనిర్ధారణ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 వరకు ఏనుగులు ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు.అందులో కౌండిన్య అటవీప్రాంతంలోనే 100 నుంచి 110 వరకు ఉంటాయని అంచనా. జిల్లాలో చిత్తూరు ఈస్ట్, వెస్ట్, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో సర్వే జరుగుతోంది. గత సంవత్సరం కంటే 10 నుంచి 20 వరకు ఏనుగులు పెరిగి ఉంటాయని భావిస్తున్నారు. కౌండిన్యలో 15 వరకు పిల్ల ఏనుగులు ఉన్నట్లు గుర్తించారు. పిల్ల ఏనుగులు ఉన్నాయంటే వాటి సంతతి బాగా పెరుగుతోందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు ఈ లెక్కల వివరాలను కేంద్ర అటవీశాఖకు నివేదిస్తారు. కేంద్ర అటవీశాఖ ఏనుగుల సంఖ్యను ప్రకటిస్తుంది.ఏనుగుల సంచారం ఎక్కువ ఏటా ఏనుగుల సంఖ్యపై సర్వే చేస్తున్నాం. ఈ ఏడాది టెక్నికల్‌గా సర్వే నిర్వహించాం. ఫ్లగ్ మార్క్స్ ఆధారంగా బ్లాగ్ సర్వే చేశాం. వివరాలను సిబ్బంది ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేశారు. తుది నివేదికను కేంద్ర అటవీశాఖకు అందజేశాం. కుప్పం, పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. – చైతన్యకుమార్‌రెడ్డి, డీఎఫ్‌వో -
ప్రాణాలు తీస్తున్న గజరాజులు
సాక్షి, అమరావతి: దేశంలో గత ఐదేళ్లుగా ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఏనుగులు దాడి కారణంగా ఏకంగా 2,657 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఐదేళ్లలో అంటే 2018–19 నుంచి 2022–23 వరకు దేశంలో అత్యధికంగా ఒడిశా రాష్ట్రంలో ఏనుగు దాడి కారణంగా 542 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత జార్ఖండ్‌లో 474 మంది మృత్యువాత పడ్డారు. మానవులు– ఏనుగుల సంఘర్షణ ఫలితంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయని, ఈ సంఘర్షణను తగ్గించే ప్రయత్నంలో భాగంగా దేశంలోని ఏనుగులు, వాటి అవాసాల పరిరక్షణ కోసం కేంద్ర ప్రాయోజిత పథకం ప్రాజెక్టు ఎలిఫెంట్ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక, సాంకేతిక సాయం అందిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.24 గంటల్లో పరిహారంమానవులు–ఏనుగుల మధ్య సంఘర్షణ నివారణకు ఇప్పటివరకు 14 రాష్ట్రాల్లో 33 ఎలిఫెంట్ రిజర్వ్‌లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏనుగుల కదలికల పర్యవేక్షణకు స్థానిక సంఘాలతో జంతు ట్రాకర్లను ఏర్పాటు చేయడంతో పాటు మానవులకు నష్టాన్ని నివారించడానికి స్థానిక ప్రజలకు హెచ్చరికలను జారీ చేస్తున్నట్లు పేర్కొంది. ఏనుగులపై ప్రతీకార హత్యల నివారణకు గాను ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి 24 గంటల్లో పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాల పాలైతే రెండు లక్షలు, చిన్న గాయాల చికిత్సలకు 25 వేలు చెల్లిస్తున్నట్లు వివరించింది. మానవ–వన్యప్రాణుల సంఘర్షణల హాట్ స్పాట్లను గుర్తించడంతో పాటు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా çసూచించినట్లు వెల్లడించింది. అడవి జంతువులకు రుచించని పంటలు వేయాల్సిందిగా సూచనలిచి్చంది. çపొలాల్లో ఏనుగులు, వణ్యప్రాణులు ప్రవేశించకుండా ముళ్ల కంచె, బయో ఫెన్సింగ్, భౌతిక అడ్డంకులను ఏర్పాటు చేయాలని సూచించింది. -
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
కొచ్చి:కేరళలో ఏనుగుల ఆగ్రహానికి వీడియో జర్నలిస్టు బలయ్యాడు. పాలక్కాడ్‌లో ఏనుగుల గుంపు దృశ్యాలు చిత్రీకరిస్తుండగా ఓ ఏనుగు ముఖేష్(34) అనే వీడియో జర్నలిస్టుపై దాడి చేసింది. ఈ దాడిలో ముఖేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ ముఖేష్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.దారితప్పిన ఏనుగుల గుంపు మలంబుజా, కంజికోడ్‌ల మధ్య నది దాటుతుండగా వీడియో తీస్తున్నపుడు ముఖేష్‌పై దాడి జరిగింది. టీవీ ఛానల్ రిపోర్టర్, డ్రైవర్ మాత్రం వాహనంలో అక్కడి నుంచి తప్పించుకున్నారు.కాగా, ముఖేష్ తన వేతనంలో కొంత సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేసే మనస్తత్వమున్న వ్యక్తి అని స్నేహితులు చెప్పారు. ముఖేష్ మృతి పట్ల సీఎం పినరయి విజయన్, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ తదితరులు సంతాపం తెలిపారు. -
గజరాజుల మృత్యుఘోష
సాక్షి, అమరావతి: దేశంలో గజరాజుల మరణాలు ఇటీవల పెరిగాయి. విద్యుదాఘాతం, రైళ్లు ఢీకొనడం వంటి కారణాలతో పెద్దఎత్తున ఏనుగులు మరణిస్తున్నాయి. వీటికితోడు వేటాడటం, విష ప్రయోగం వంటి కారణాల వల్ల ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 522 ఏనుగులు మృత్యువాత పడ్డాయని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఇటీవల వెల్లడించింది. విద్యుదాఘాతాల కారణంగా ఐదేళ్లలో (2018–19 నుంచి 2022–23 వరకు) అత్యధికంగా 379 ఏనుగులు మృతి చెందినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తరువాత రైలు ప్రమాదాల బారినపడి ఐదేళ్లలో 75 ఏనుగులు మరణించాయి. వేటాడటం ద్వారా 47 గజరాజులను చంపేశారు. దంతాల కోసం విష ప్రయోగం చేసి 21 ఏనుగులను హతమార్చినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. విద్యుత్ కంచెలతోనే తీవ్ర సమస్య విద్యుదాఘాతంతో అత్యధికంగా ఒడిశాలో ఐదేళ్లలో 80 ఏనుగులు, తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో ఒక్కొక్కచోట 53 చొప్పున ఏనుగులు మృతి చెందాయి. రైళ్లు ఢీకొట్టిన ఘటనల్లో అత్యధికంగా అసోంలో 24 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఒడిశాలో 18 ఏనుగులను రైలు ప్రమాదాలు పొట్టనపెట్టుకున్నాయి. వేటాడటం ద్వారా ఒడిశాలో అత్యధికంగా 15 ఏనుగులను హతమార్చారు. మేఘాలయలో 15 ఏనుగులను చంపేశారు. అసోంలో విషప్రయోగంతో ఏకంగా 17 ఏనుగులను హతమార్చారు. అలాంటి వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అటవీ ప్రాంత సమీప పొలాల్లో పంటల్ని కాపాడుకునేందుకు విద్యుత్ కంచెల్ని ఏర్పాటు చేస్తుండటంతో విద్యుదాఘాతానికి గురై ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. రైల్వేతో సమన్వయ కమిటీ రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రైళ్లు నడిపే పైలట్లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్‌ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగుల ఉనికి గురించి పైలట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్‌ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్ పాస్, ఓవర్ పాస్‌లను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వన్యప్రాణుల పరిశీలకులు రైల్వే ట్రాక్‌లపై రెగ్యులర్ పెట్రోలింగ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్రం చేసిన సూచనలివి! ♦ విద్యుదాఘాతాల నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెల్ని తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ♦ భూమిపై విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది. అండర్ గ్రౌండ్ లేదా పోల్స్‌పై మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ♦‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఏనుగుల పరిరక్షణ, వాటి ఆవాసాల్లో చర్యలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తోంది. ♦ ఏనుగుల కదలికలను పర్యవేక్షించడానికి స్థానిక సంఘాలతో ట్రాకర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు మానవుల వల్ల నష్టాన్ని నివారించడానికి స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ♦ మానవ–వన్యప్రాణుల సంఘర్షణల హాట్ స్పాట్లను గుర్తించడంతోపాటు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించింది. ♦ అడవి జంతువులకు రుచించని పంటల్ని వేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది. -
ట్రాక్ దాటుతుండగా..ఆ ఏనుగులను..
కోల్‌కతా: మొత్తం మూడు ఏనుగులు కలిసి ట్రాక్ దాటుతున్నాయి. ఇంతలో ఓ గూడ్స్ ట్రైన్ అదే ట్రాక్ పై నుంచి దూసుకొచ్చింది. వేగంగా గజరాజులను ఢీ కొట్టడంతో అవి కిందపడి మృతి చెందాయి. ఈ హృదయ విదారక ఘటన పశ్చిమబెంగాల్లోని అలీపుర్ద్వార్ జిల్లా రాజభక్తావ అటవీ ప్రాంతంలో జరిగింది. అలీపూర్‌ద్వార్ నుంచి సిలిగురి వెళుతున్న ఖాళీ గూడ్స్ రైలు సోమవారం ఉదయం 7.20 గంటలకు ఏనుగులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో చనిపోయిన మూడు ఏనుగుల్లో రెండు చిన్న ఏనుగులేనని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. సంఘటన జరిగిన రాజభక్తావ-కాల్చిని సెక్షన్లో రైలు ఢీకొట్టడాన్ని నిరోధించే ఇన్స్ట్రక్షన్ డిటెక్షన్ సిస్టమ్(ఐడీఎస్) ఇంకా అందుబాటులోకి రాలేదని నార్త్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు తెలిపారు. ఇక్కడ ఐడీఎస్ వ్యవస్థ ఇంకా టెండర్ల దశలోనే ఉందని, ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఏనుగులను రైళ్లు ఢీకొన్న సంఘటనలు జరగలేదని అధికారులు చెప్పారు. ఇదీచదవండి..ఉచిత ఆధార్ అప్డేట్కు ఇదే చివరి తేది! -
తిరుగులేని అర్జున
కర్ణాటక: మైసూరు దసరా గజరాజులకు బరువు పరీక్షలను బుధవారం చేపట్టారు. దేవరాజ మొహల్లా సాయిరామ్ తూనికల కేంద్రానికి మొత్తం 14 ఏనుగులు నడుచుకుంటూ వచ్చాయి. ఒక్కో ఏనుగును బరువు తూచారు. తూకంలో మాజీ కెప్టెన్ అర్జున అత్యధిక బరువు ఉన్న ఏనుగుగా నిలిచింది. వయసు కారణంతో దసరాలో బంగారు అంబారీని మోసే బాధ్యత అర్జునకు బదులుగా కెప్టెన్ అభిమన్యుకు అప్పగించారు. అభిమన్యు రెండవ స్థానంలో నిలిచింది. ఏనుగులు ప్యాలెస్ నుంచి ఎంతో క్రమశిక్షణతో వరుసగా వస్తుంటే నగరవాసులు, పర్యాటకులు ఉత్సాహంగా వీక్షించారు. ఇందులో మొదటి విడతగా 9 ఏనుగులు సుమారు 3 వారాల కిందటే మైసూరుకు వచ్చాయి. వాటి బరువు అప్పటితో పోలిస్తే కొంచెం పెరిగింది. -
‘ప్లాస్టిక్ అడవి’లో ఏనుగులు
ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం మధ్య ఏనుగుల గుంపు కనిపిస్తోందా? అంతటి కలుషిత, ప్రమాదకర పదార్థాల మధ్య ఆ ఏనుగులు ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. అభివృద్ధితోపాటు వస్తున్న కాలుష్య ప్రమాదానికి ఇదో సంకేతమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లి అడవుల సమీపంలో డంపింగ్ చేస్తుండటం కేవలం పర్యావరణానికి మాత్రమేకాదు వన్య ప్రాణులకు ఎంతో చేటు చేస్తున్న దారుణ పరిస్థితిని ఇది కళ్లకు కడుతోంది. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లో లలిత్ ఏకనాయకే అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. నేచర్ ఇన్ఫోకస్ సంస్థ ఇచ్చే ఫొటోగ్రఫీ అవార్డుల్లో ‘కన్సర్వేషన్ ఫోకస్’ విభాగంలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
మన్యం జిల్లాలో గజరాజుల గుంపు బీభత్సం
-
పులుల పోరాటం.. ఏనుగుల ఘర్షణ
సాక్షి, అమరావతి: పర్యావరణ ప్రతికూలతల కారణంగా మానవులు, అటవీ జంతువుల మధ్య పెరుగుతున్న ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా అడవులు నరికివేస్తుండటంతో జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ క్రమంలో తమ స్థావరాలను కోల్పోతున్న జంతువులు మానవ పరిసరాల్లోకి చొరబడి దాడులకు తెగబడుతున్నాయి. దేశంలో ఏటా పులులు, ఏనుగుల దాడుల్లో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాగా, వణ్యప్రాణుల అక్రమ రవాణాలోనూ ఈ రెండు జంతువులే అత్యధికంగా వేటగాళ్ల బారిపడటం గమనార్హం. స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్–డౌన్ టు ఎర్త్ 2023 నివేదిక ప్రకారం.. 2020–21తో పోలిస్తే 2021–22లో మనుషులపై ఏనుగుల దాడులు 16 శాతం, పులుల దాడులు 2019తో పోలిస్తే 2022 నాటికి 83 శాతం పెరగడం దారి తప్పిన పరిస్థితికి అద్దం పడుతోంది. ఐదు హాట్ స్పాట్లలో.. ప్రస్తుతం భారత్‌లో 3,167 పులులు ఉన్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా గడచిన 22 ఏళ్లలో పులులను అక్రమంగా వేటాడిన కేసుల్లో 34 శాతం భారతదేశం నుంచే ఉండటం గమనార్హం. నాలుగేళ్లలో (2018–21) ఇటువంటి ఘటనలు 21% పెరిగాయి. ప్రపంచంలో మొత్తం పులులను వేటాడి వాటి శరీర అవయవాల అక్రమ రవాణా తదితర కేసుల్లో 53% చైనా, ఇండోనేíÙయా, భారత్‌లోనే ఉంటున్నాయి. ప్రపంచ దేశాల్లో 1000 కంటే ఎక్కువ ప్రదేశాల్లో పులులను వేటాడే ఘటనలు నమోదయ్యాయి. భారత్‌లో 85 శాతం అక్రమ వ్యాపార వేటలు ఉత్తరప్రదేశ్‌లోని దుద్వార్ నేషనల్ పార్కు, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ నేషనల్ పార్కు, మధ్యప్రదేశ్‌లోని కన్హా టైగర్ రిజర్వు, కర్ణాటకలోని నాగర్హోల్ టైగర్ రిజర్వు, మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వు వంటి కేవలం ఐదు హాట్స్పాట్లుగా మారడం కలవరపెడుతోంది. ఇక్కడే అత్యధికంగా దాడులు అత్యధికంగా జార్ఖండ్, ఒడిశా, అస్సాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఏనుగుల దాడుల్లో ఎక్కువ మంది మృతి చెందుతున్నారు. మహారాష్ట్రలో ఎక్కువ మంది పులుల దాడుల్లో చనిపోతున్నారు. మహారాష్ట్రలో 2019లో 26 మంది, 2020లో 25, 2021లో 32, 2022లో రికార్డు స్థాయిలో 84 మంది పులుల దాడుల్లో మృతి చెందారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఎక్కువ మంది మృతులు ఉంటున్నారు. నాలుగేళ్లలో తెలంగాణలో ఇద్దరు, తమిళనాడులో నలుగుర్ని పులులు పొట్టన పెట్టుకున్నాయి. వేటగాళ్ల ఉచ్చులో పడి.. ఆహార అన్వేషణ, ఆవాసాలు దెబ్బతినడంతో దారి తప్పడం, అడవుల్లో జన సంచారం పెరగడం వంటి కారణాలతో ఏనుగులు, పులులు మనుషులపై దాడి చేస్తుంటే.. వన్యప్రాణుల్ని చంపి వ్యాపారం చేసే వ్యక్తులతో వీటి ప్రాణాలకు పెనుముప్పు వాటిల్లుతోంది. ఏనుగు దంతాలు, పులి చర్మం, గోళ్లకు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండటంతో స్మగ్లర్లు ఏనుగులు, పులుల్ని వేటాడుతున్నారు. దేశంలో పులుల మరణాలు 2021తో పోలిస్తే 2022లో 21 శాతం పెరిగాయి. ఇందులో 80 శాతం మరణాలకు గల కారణాలు ఇప్పటికీ అటవీ శాఖ అధికారులకు అంతు చిక్కలేదు. ఇదిలా ఉంటే 2018–19 నుంచి 2021–22 మధ్య 389 ఏనుగులు మృతి చెందాయి. వీటిల్లో 71 శాతం మరణాలు విద్యుదాఘాతంతో సంభవించడం గమనార్హం. ప్రధానంగా ఏనుగు కారిడార్లు ఎక్కువ ఆక్రమణలకు గురవుతున్నాయి. -
హృదయవిదారకం: కరెంట్ షాక్‌తో గున్న ఏనుగు.. కాపాడదామని మరో మూడు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తాగునీటి కోసం పొలాల్లోకి వచ్చిన నాలుగు ఏనుగులు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం పక్కుడుభద్ర గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఒక గున్న ఏనుగు, ఐదు పెద్ద ఏనుగుల గుంపు గత ఫిబ్రవరిలో ఒడిశా సరిహద్దులోని అడవుల్లోంచి భామిని మండలంలోకి వచ్చింది. మూడు నెలలుగా ఇక్కడి అడవుల్లో ఉంటూ ఆహారం, తాగునీటి కోసం సమీప పొలాల్లోకి వస్తుండేవి. ఎవరికీ హాని చేయకపోవడంతో వాటిని చూసేందుకు పార్వతీపురం మన్యం జిల్లావాసులే కాకుండా ఒడిశా నుంచి కూడా వస్తుండేవారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి పక్కుడుభద్ర గ్రామ సమీపంలోని పొలాల్లోకి వచ్చాయి. బొమ్మిక మిన్నారావుకు చెందిన బోరుబావి వద్దకు వెళ్లేందుకు యత్నించాయి. ఆ పక్కనే ఉన్న త్రీఫేజ్ విద్యుత్ లైన్, ట్రాన్స్ఫార్మర్ను గున్న ఏనుగు తన తొండంతో లాగింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై విలవిలలాడుతున్న గున్న ఏనుగును రక్షించేందుకు మరో మూడు పెద్ద ఏనుగులు ప్రయత్నించాయి. దీంతో నాలుగూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. వాటిని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు వేలాది సంఖ్యలో పోటెత్తారు. నాలుగు ఏనుగుల కళేబరాలకు విశాఖ జూ వైద్యాధికారి శ్రీనివాసరావు బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఘటన స్థలంలోనే వాటిని ఖననం చేసేందుకు రైతు మిన్నారావు అంగీకరించడంతో జేసీబీలతో పెద్ద గోతులు తీయించి కళేబరాలను ప్రొటోకాల్ ప్రకారం ఖననం చేశారు. విశాఖ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకంఠనాథరెడ్డి, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డీఎఫ్‌వోలు పాల్గొన్నారు. -
ఏనుగుల లెక్క తేలుద్దాం.. ఈ నెల 17వ తేదీ నుంచి...
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో ఏనుగుల లెక్క తేల్చేందుకు ఆయా రాష్ట్రాల అటవీ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 3 రోజులపాటు ఏనుగుల గణన చేపట్టనున్నారు. మన రాష్ట్రంలోని కౌండిన్య ఏనుగుల అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం అటవీ ప్రాంతాల్లో లెక్కింపు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. తమిళనాడు సరిహద్దుల నుంచి ఈ ప్రాంతంలోకి ఏనుగులు వస్తుండటంతో వాటి కోసం చాలాకాలం క్రితం కౌండిన్య అభయారణ్యాన్ని నెలకొల్పారు. శేషాచలం అడవులు, ఎస్వీ నేషనల్ పార్క్‌లోనూ ఏనుగులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో సుమారు 175 ఏనుగులు ఉన్నట్టు అంచనా వేశారు. తాజా లెక్కింపు పూర్తయితే వాటి సంఖ్య పెరిగిందా.. తగ్గిందా అనేది తేలుతుంది. ఒకేసారి ఎందుకంటే..! ఏనుగులు నీటి లభ్యతను బట్టి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అవి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి ప్రవేశించి అటూఇటూ తిరుగుతూ ఉంటాయి. దీంతో రాష్ట్రాల వారీగా లెక్కింపు చేపట్టినప్పుడు రెండుచోట్లా వాటిని లెక్కించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటవీ సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లో ఒకేసారి లెక్కింపు జరపాలని నిర్ణయించారు. అందులో భాగంగానే దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, ఏపీ, తమిళనాడు, గోవా, మహారాష్ట్రలోని కొంత ప్రాంతంలో ఒకేసారి ఈ నెల 17, 18, 19 తేదీల్లో లెక్కింపు జరపనున్నారు. లెక్క.. పక్కా..! ఇందుకోసం కర్ణాటక అటవీ శాఖ రూపొందించిన మోడల్‌ను అనుసరిస్తున్నారు. అక్కడ ఏనుగుల సంఖ్య వేలల్లో ఉండటంతో చాలా జాగ్రత్తగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధానంలో మన రాష్ట్రంలో లెక్కింపు నిర్వహించడానికి అటవీ శాఖ సిద్ధమైంది. మొదటి రోజు 17వ తేదీన అటవీ ప్రాంతంలోని బ్లాకుల పరిధిలో బీట్ల వారీగా 5 చదరపు కిలోమీటర్ల పరిధిలో 15 కిలోమీటర్లు తిరిగి లెక్కింపు జరపనున్నారు. ఇందుకోసం బీట్ల వారీగా ఇద్దరు, ముగ్గురితో బృందాలు ఏర్పాటు చేశారు. రెండవ రోజు నిర్దేశించిన రెండు కిలోమీటర్ల ప్రాంతంలో తిరిగి ఏనుగుల గుంపులను బట్టి లెక్కింపు జరుపుతారు. మూడవరోజు చెరువులు, మైదానాల్లో నేరుగా ఏనుగుల గుంపుల వద్దకెళ్లి వాటి ఫొటోలు తీసి లెక్కిస్తారు. గుంపులో పెద్దవైన ఆడ, మగ ఏనుగులు.. ఆ తర్వాత పెద్దవైన మగ, ఆడ ఏనుగులు.. పిల్లలు, దంతాలు లేని ఏనుగులు (మఖనా), గుంపు నుంచి వేరుపడిన ఒంటరి ఏనుగులుగా వాటిని వర్గీకరించి లెక్కింపు చేపట్టనున్నారు. ప్రణాళికాబద్ధంగా లెక్కింపు దక్షిణాది రాష్ట్రాలతో కలిసి ఒకేసారి ఏనుగుల లెక్కింపును ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నాం. ఇందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేశాం. మూడు విధాలుగా లెక్కింపు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. – శాంతిప్రియ పాండే, ఏపీ సీసీఎఫ్ (వైల్డ్ లైఫ్), ఏపీ అటవీ శాఖ -
అవునూ.. మన అడవుల్లో ఏనుగెందుకు లేదు?
మీరు ఓ విషయాన్ని గమనించారా? మన రాష్ట్రంలో జూలో తప్ప అడవుల్లో ఏనుగులు లేవు. చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ ఉన్నాయి. దక్షిణాదిలో అయితే.. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మందలు మందలుగా కనిపిస్తే.. ఇటు ఏపీలోనూ పదుల సంఖ్యలో అటవీ ప్రాంతాల్లో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. మరి తెలంగాణలో ఎందుకు లేవు? ఇటీవలే ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీకి ఆస్కార్ పురస్కారం దక్కిన నేపథ్యంలో ఏనుగుల మీదకు అందరి దృష్టి మళ్లింది. ఈ నేపథ్యంలో అసలు గజరాజు తెలంగాణలో ఎందుకు లేడు? పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు రాడు? అన్న విషయంపై ఓ లుక్కేద్దామా.. – సాక్షి, హైదరాబాద్ ఎందుకు లేవు.. ఎందుకు రావు.. ♦తెలంగాణలో ఏనుగులు కనిపించకపోవడానికి ప్రధానంగా భౌగోళిక, వాతావరణ పరిస్థితులే కారణం. తెలంగాణ, చుట్టుపక్కల ప్రాంతాలు భౌగోళికంగా దక్కన్ పీఠభూమిపై ఉండటంతోపాటు అడవుల మధ్య ‘డ్రై ఏరియా’ కారణంగా చారిత్రకంగానే ఇక్కడ ఏనుగులు లేవు. తెలంగాణకు ఆనుకుని ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని జిల్లాలన్నీ (పూర్వపు హైదరాబాద్ స్టేట్‌లోని) పొడి వాతావరణం, వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాలే. రాయచూర్, గుల్బర్గా, అకోలా, బీదర్, నాందేడ్ తదితర చోట్లా ఏనుగులు లేకపోవడంతో తెలంగాణలో ఏనుగుల ప్రవేశానికి అవకాశాలు లేకుండా పోయాయి. ♦ఏనుగులు స్థిర నివాసం ఏర్పరుచుకోవాలంటే దట్టమైన అడవులు, పచ్చదనం అవసరం. కనీసం 1,000–1,500 మిల్లీమీటర్ల వర్షపాతముండే ప్రాంతాలు కావాలి. తేమ వాతావరణం ఉండాలి. కనీసం 7, 8 నెలల పాటైనా అడవుల్లోని చెట్లు ఆకులు కలిగి ఉండాలి. గడ్డి ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి. ఒక్కో ఏనుగుకు సగటున రోజుకు 150 నుంచి 200 కేజీల మేత అవసరం. ఒక గుంపులో ఐదు ఏనుగులుంటే రోజూ టన్ను మేత కావాలి. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి దట్టమైన అడవులు లేకపోవడం వల్ల.. పెద్ద పులులు, ఇతర జంతువులు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి, స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నా ఏనుగులు మాత్రం రావడం లేదు. ♦ అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగులున్న చిత్తూరు, విజయనగరం జిల్లాల నుంచి తెలంగాణలోకి రావడానికి ఎలాంటి అడవుల కనెక్షన్ లేదు. మధ్యలో మైదాన ప్రాంతాలను దాటి ఏనుగులు ఇటు వచ్చేందుకు అవకాశాల్లేవు. ఏపీ సరిహద్దుల్లో ఖమ్మంకు ఆనుకుని పశ్చి మగోదావరి, మహబూబ్‌నగర్‌కు ఆనుకుని కర్నూలు, నల్లగొండ వైపు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఏనుగులు లేవు. దీనితో తెలంగాణలోకి వచ్చే పరిస్థితి లేదు. ♦ గతంలో ఉమ్మడి ఏపీలోకి రెండు మార్గాల్లో ఏనుగులు వచ్చాయి. ఒకటి.. చిత్తూరు జిల్లాకు ఆనుకుని ఉన్న కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అడవుల నుంచి వచ్చాయి. ఆ రెండు రాష్ట్రాలు కూడా ఏనుగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే. ఆయా చోట్ల ఏనుగుల సంతతి పెరగడంతో పొరుగునే ఉన్న ఏపీలోకి ప్రవేశించాయి. స్థిరనివాసం ఏర్పరుచుకునే వాతావరణం, పరిస్థితులు ఉండడంతో ఇక్కడే ఉండిపోయాయి. ♦ ఇక రెండోది.. ఒడిశాకు పలుమార్లు భారీ వరదలు రావడంతో సరిహద్దుల్లోని విజయనగరం జిల్లాకు కొన్ని ఏనుగులు వలస వచ్చాయి. తిరిగి వెళ్లకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండిపోయాయి. అదేవిధంగా జార్ఖండ్ నుంచి కూడా ఏనుగులు వలస వచ్చాయి. చారిత్రకంగా, భౌగోళికంగా, ఇతర ప్రధాన కారణాలతో తెలంగాణలో ఏనుగులు లేవు. ఏపీలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఏనుగులు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగును నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకువచ్చేలా ఒక కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో పెద్దపులులు అసలు లేకపోవడం, ఇటు తెలంగాణలో ఏనుగులు లేకపోవడంతో.. రెండు ప్రాంతాల్లో పరస్పరం పులులు, ఏనుగులను మార్పిడి చేస్తే బావుంటుందని అంచనా వేశారు. ఈ విధంగా చేయడం ద్వారా మొత్తం ఉమ్మడి ఏపీవ్యాప్తంగా పుష్కలంగా వన్యప్రాణులతో పాటు జీవవైవిధ్యంతో కూడిన మంచి వాతావరణం ఏర్పడుతుందని ఆశించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. – ఎ.శంకరన్, ఓఎస్డీ, తెలంగాణ అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ విభాగం -
గజ గజా.. పులి పంజా
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా పులుల దాడుల్లో 163 మంది మృతి చెందారు. 2021లో 57 మంది మరణించగా 2022లో 105 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర అటవీ శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 116 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఏనుగుల దాడుల్లో మూడేళ్లలో 1,581 మంది చనిపోయారు. అత్యధికంగా ఒడిశాలో 322 మంది, జార్ఖండ్‌లో 291 మంది, పశ్చిమ బెంగాల్లో 240 మంది గజరాజుల క్రోధాగ్నికి బలయ్యారు. 2018 గణాంకాల ప్రకారం దేశంలో పులులు సంఖ్య 2,967 కాగా 2017 అంచనాల ప్రకారం ఏనుగుల సంఖ్య 29,964 అని కేంద్ర అటవీ శాఖ తెలిపింది. ఏనుగుల సంచారాన్ని పర్యవేక్షించడంతోపాటు నీటి వనరుల సంరక్షణ, చెట్లు నాటడం, స్థానిక ప్రజలను హెచ్చరించడం లాంటి చర్యలను అటవీశాఖ చేపడుతోంది. ఏనుగుల ఆవాసాలను ‘ఎలిఫెంట్ రిజర్వ్’ ప్రాంతంగా ప్రకటించి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏనుగుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. -
ఏనుగుకి రూ. 5 కోట్ల ఆస్తి.. కట్ చేస్తే కుటుంబం చేతిలోనే..
ఏనుగుకి మనిషికి మధ్యన ఏర్పడిన బాంధవ్యం గురించి చక్కగా వివరించే ది ఎలిఫెంట్ విస్పరస్ డాక్యుమెంటరీ ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే . అచ్చం అలాంటి కథే ఉత్తరాఖండ్‌కి చెందిన రెండు ఏనుగులకు ఓ మనిషికి మధ్య జరిగింది. ఆ ప్రేమ ఎంత వరకు వెళ్లిందంటే తాను లేకపోతే ఏనుగులు ఎలా అని తన కుటుంబ సభ్యులు మాదిరిగా ఆస్తి రాసిచ్చేంత వరకు దారితీసింది. కానీ ఆ హద్దులు లేని ప్రేమే అతని హత్యకు కారణమైంది కూడా. అసలేం జరిగిందంటే..బిహార్‌లోని జన్‌పూర్‌కి చెందిన అక్తర్ ఇమామ్ తాను పెంచుకుకంటున్న రాణి, మోతీ అనే ఏనుగులకు తన కుటుంబ సభ్యలు మాదిరిగానే వాటికి కూడా ఆస్థిలో వాటా ఇచ్చాడు. ఎందుకంటే తాను చనిపోతే వాటి ఆలనాపాలనా ఎవరు చూసుకుంటారనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడు. తన ఆస్తిలో సగం తన భార్య, పిల్లలకు పంచి మిగతా రూ. 5 కోట్ల ఆస్తిని తన ఏనుగుల పేర రాశాడు. ఏనుగుల యజమానులు చనిపోతే వాటి సంరక్షణ ఎవరూ పట్టించుకోని పలు ఘటనలు చూశానని అందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. ఇలా ఏనుగుల కోసం తన ఆస్తిని కేటాయించిన తొలి వ్యక్తి ఇమామ్ అని వన్య ప్రాణుల సంరక్షణాధికారి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇమామ్ ఆధ్వర్యంలోని ఏషియన్ ఎలిఫెంట్ రిహాబిలేషన్ అండ్ వైల్డ్ లైఫ్ యానిమల్ ట్రస్ట్‌ని ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ సంరక్షిస్తున్నారు. ఇమామ్ ఈ ట్రస్ట్‌ని తన ఏనుగుల కోసమే ఏర్పాటు చేసినట్లు ఖాన్ తెలిపారు. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారి పలు ఛానెల్స్‌లో అక్తర్ ఇమామ్ పేరు మారు మ్రోగినట్లు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఇమామ్ లేడు. ఆయన ఇలా ఏనుగులకు ఆస్తి ఇవ్వడం అతని కుటుంబానికి నచ్చలేదు. ఈ విషయమై ఇమామ్‌కి తన కుటుంబ సభ్యుల మధ్య పలు మార్లు గొడవలు జరిగాయి కూడా. అదీగాక తన కుటుంబం నుంచి ప్రమాదం పొంచి ఉందని 2020లో కోవిడ్ సమయంలో మొదటి లాక్‌డౌన్‌ని ఎత్తివేయగానే బిహార్‌న నుంచి హుటాహుటినా తన రెండు ఏనుగులను తీసుకుని ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌కు వచ్చేశాడు. అక్కడే ఏనుగులకు సంరక్షణకు సంబంధించిన ట్రస్ట్‌ని ఏర్పాటు చేసి ఈ ఏనుగులను ప్రేమగా చూసుకుంటుండేవాడు. ఐతే ఇమామ్ ఊహించినట్లుగానే జరిగేంది. 2021లో ఇమామ్ తన కుటుంబం చేతిలోనే అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. దీంతో ఆ ట్రస్ట్‌ని, ఇమామ్ పెంచుకుంటున్న ఏనుగులను వన్యప్రాణుల సంరక్షణాధికారి ఇమ్రాన్ ఖాన్ చూసుకుంటున్నారు. అయితే ఇటీవలే ఇమామ్ పెంచుకున్న ఏనుగుల్లో మోతీ అనే ఏనుగు చనిపోయింది. దీంతో రాణి అనే ఏనుగు ఒక్కత్తే ఆ రూ. 5 కోట్ల ఆస్తికి వారసురాలు. కానీ ఆస్తి మాత్రం బిహార్‌లోని పాట్నాలో ఉంది. నిధుల కొరతతో సతమతమవుతున్న అక్తర్ ఫౌండేషన్‌కి ఆ ఆస్తి చెందితేనే ఇమామ్ కోరిక కూడా నెరవేరుతుందని సంరక్షణాధికారి ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు. (చదవండి: భార్యకు అస్వస్థత, కొడుకు విదేశాల్లో ఉన్నాడు!ఐనా సిసోడియాకు నో బెయిల్) -
మావటీల జీవితాల్లో వెలుగు తెచ్చారు
‘నాకు అడివింటే చాలా భయం’ అంటుంది బెల్లి. ఆస్కార్ వచ్చిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ లో మావటి బొమ్మన్ భార్య ఆమె. భర్తతో కలిసి రఘు అనే పిల్ల ఏనుగును ఆమె సాకుతుంది. దాంతోపాటు ‘అమ్ము’ అనే ఇంకో పిల్ల ఏనుగు బాగోగులను బెల్లి చూస్తుంది. బొమ్మన్ ప్రభుత్వ ఉద్యోగి. బెల్లి కాదు. అయినా సరే భర్త డ్యూటీలో ఆమె భాగం పంచుకుంది. భర్తతో పాటే పసి ఏనుగులను చూసుకుంది. ‘నా భర్తను పులి చంపింది. అప్పటి నుంచి అడివంటే భయం. బొమ్మన్‌ను చేసుకున్నాక కొంచెం భయం పోయింది. పిల్ల ఏనుగుల బాగోగుల్లో పడ్డాక, వాటి వెంట తిరుగుతుంటే అడివంటే భయం పోయింది’ అంటుంది బెల్లి. నీలగిరి (ఊటీ) అడవుల్లో ఉండే ఎలిఫెంట్ క్యాంపుల్లో ఏనుగుల సంరక్షణ మావటీలు చూస్తారు. వీళ్లంతా దాదాపు ఆ ప్రాంత గిరిజనులే. ఏనుగులను చూసుకోవడం మగవారి పనే. అయితే బొమ్మన్ చూసేది పిల్ల ఏనుగులను కనుక వాటి అమాయకత్వానికి ముగ్ధురాలై అమ్ము కూడా వాటితో అనుబంధం పెంచుకుంటుంది. ఆమెకు రఘు, అమ్ము ఎంత మాలిమి అంటే డాక్యుమెంటరీలో అమ్మును పిలిచి ‘ఏయ్... నా ఒడిలో కాదు. పక్కన పడుకో. లేకుంటే దెబ్బలు పడతాయి’ అనంటే ఆ ఏనుగు ఆమె పక్కన మెల్లగా ఒత్తిగిలి పడుకోవడం ముచ్చట గొలుపుతుంది. అమ్ముకు బెల్లి రెండు జడలు వేసి నవ్వుకుంటూ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంటరీ ముగుస్తుంది. అయితే బొమ్మన్ వల్ల, అమ్ము వల్ల, ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన కార్తికి వల్ల దేశంలో ఇప్పుడు ఏనుగుల సంరక్షణ గురించి చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు సి.ఎం స్టాలిన్ వెంటనే స్పందించి బొమ్మన్, బెల్లిలను పిలిచి చెరొక లక్ష డబ్బు ఇచ్చి సన్మానం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న 91 మంది మావటీలకు కూడా మనిషికో లక్ష ఇవ్వనున్నారు. వీరి నివాసాల కోసం 9 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఏనుగుల క్యాంపుల కోసం 13 కోట్లు మంజూరయ్యాయి. ప్రేమ, ఆదరణల వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది. బొమ్మన్, బెల్లిలతో అది మరోసారి రుజువయ్యింది. -
శ్రీకాకుళం, మన్యం జిల్లాలో ఏనుగులు హల్ చల్
-
పాపం గజరాజులు! విద్యుత్ షాక్‌లు, రైలు ప్రమాదాలు, విష ప్రయోగాలు..
సాక్షి, అమరావతి: దేశంలో గజరాజుల అసహజ మరణాలు ఇటీవలకాలంలో పెరిగిపోతున్నాయి. రైలు ప్రమాదాలు, విద్యుత్ షాక్, వేటాడటం, విషప్రయోగం వంటి కారణాలతో దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 494 ఏనుగులు మృత్యువాతపడినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విద్యుదాఘాతం కారణంగా 2017–18 నుంచి 2021–22 వరకు అత్యధికంగా 340 ఏనుగులు మృతిచెందినట్లు తెలిపింది. ఆ తర్వాత రైలు ప్రమాదాలబారిన పడి ఐదేళ్లలో 80 గజరాజులు మృతిచెందాయి. వేటాడి 41, విషప్రయోగం ద్వారా 25 ఏనుగులను చంపినట్లు వివరించింది. ఐదేళ్లలో అత్యధికంగా అసోంలో 121 ఏనుగులు వివిధ కారణాలతో మృత్యువాతపడ్డాయి. అతితక్కువగా ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది ఏనుగులు విద్యుత్‌షాక్‌తో మరణించాయి. ఏనుగుల దంతాల కోసం విషప్రయోగాలు చేస్తుండటం శోచనీయం. వివిధ ప్రాంతాల్లో గత ఐదేళ్లలో విషప్రయోగం ద్వారా 25 ఏనుగులను చంపేశారు. కేవలం అసోంలోనే విషప్రయోగం చేసి ఏకంగా 21 ఏనుగులను హతమార్చారు. విద్యుత్ షాక్ వల్లే ఎక్కువ.. ► ప్రధానంగా విద్యుదాఘాతం వల్లే ఎక్కువగా ఏనుగులు మరణిస్తున్నాయి. ► అటవీ ప్రాంతానికి సమీపంలోని పొలాల్లోకి ఏనుగులు రాకుండా రైతులు విద్యుత్ కంచెలను ఏర్పాటుచేస్తున్నారు. దీంతో ఆహారం, నీటి కోసం అడవి నుంచి బయటకు వస్తున్న ఏనుగులు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందుతున్నాయి. ఐదేళ్లలో విద్యుత్ షాక్‌కు గురై 340 ఏనుగులు మరణించాయి. ► విద్యుత్ షాక్ నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెలను తొలగించాలని అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, విద్యుత్ ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ► భూమిపైన విద్యుత్ లైన్లు లేకుండా చర్యలు తీసుకోవాలని, అండర్ గ్రౌండ్ లేదా, స్తంభాలపై మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు వెల్లడించింది. రైలు ప్రమాదాల కారణంగా... ► రైళ్లు ఢీకొని కూడా ఎక్కువగానే ఏనుగులు మృతి చెందుతున్నాయి. రైలు ప్రమాదాలబారిన పడి ఐదేళ్లలో 80 గజరాజులు మరణించాయి. ► రైలు ప్రమాదాల వల్ల ఏనుగుల మరణాల నివారణకు రైల్వే బోర్డు, పర్యావరణ–అటవీ మంత్రిత్వ శాఖతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ► రైలు పైలెట్లకు పట్టాల చుట్టూ ఎక్కువ దూరం స్పష్టంగా కనిపించేలా ట్రాక్ వెంబడి చెట్లను తొలగించాలని, ఏనుగుల ఉనికి గురించి పైలెట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటుచేయాలని, రైల్వే ట్రాక్‌ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించాలని, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్ పాస్, ఓవర్ పాస్‌లను నిర్మించాలని నిర్ణయించారు. ► ఏనుగుల ఉనికి ఉన్న ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌లపై అటవీ శాఖ ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వన్యప్రాణుల పరిశీలకులు నిరంతరం పెట్రోలింగ్ చేయడం వంటి చర్యలను తీసుకుంటున్నారు. ఏనుగుల సంరక్షణకు ఆర్థిక, సాంకేతిక సాయం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా ఏనుగుల పరిరక్షణ, వాటి ఆవాసాల్లో ఏర్పాట్లకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మనుషులు–ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడానికి ఇప్పటి వరకు 14 రాష్ట్రాల్లో 32 ఎలిఫెంట్ రిజర్వ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. జాతీయ రహదారులపై ఎకో బ్రిడ్జ్‌ల ఏర్పాటు ద్వారా వన్యప్రాణులు సురక్షితంగా రహదారులు దాటేలా కసరత్తు జరుగుతోందని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రపంచ బ్యాంకు సహాయం చేయనుందని పేర్కొంది. చదవండి: విదేశాలకు వలసల్లో మనమే టాప్.. దేశాన్ని వీడిన 1.80 కోట్ల మంది.. -
మనకు మరింత చేరువగా 'గజరాజు'
కె.జి. రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇకపై ఏనుగులనూ పెంపుడు జంతువులుగా పెంచుకునే వీలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అమ్యూజ్మెంట్ పార్కుల అభివృద్ధి పేరుతో ఏనుగులను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా తరలించుకోవచ్చు కూడా. మానవ అవసరాలకు సైతం ఏనుగులను ఉపయోగించుకోవచ్చు. కేంద్రం తీసుకొచ్చిన తాజా సవరణలు ఇందుకు వీలు కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్)–1972 చట్టంలో చేసిన సవరణలకు ఆమోదముద్ర పడింది. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) బిల్లు–2022కు రాజ్యసభ సైతం గత నెల 19న ఆమోదముద్ర వేయడంతో ఏనుగులను సొంత అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు మరింత అధికారికం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మతపరమైన, ఇతర అవసరాల కోసం ఏనుగులను తరలించేందుకు ప్రత్యేకంగా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తాజా సవరణలో పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో అమ్యూజ్మెంట్, జూ పార్కుల ఏర్పాటుకు ఇది దోహదం చేస్తుందని కొందరు చెబుతుండగా.. తాజా సవరణలపై పర్యావరణ వేత్తలు, జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిలయన్స్ సంస్థ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్న అమ్యూజ్మెంట్ పార్కుకు ఏనుగులను తరలించేందుకు ఈ తాజా సవరణలు తోడ్పడతాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అనధికారికంగానే..! దేశంలో మానవ అవసరాలకు ఏనుగులను ఉపయోగించుకోవడం ఎప్పటినుంచో ఉంది. సర్కస్‌లలో ఏనుగులతో ఫీట్లు చేయించడం, కొండ ప్రాంతాల్లో భారీ దుంగలను లాగేందుకు ఏనుగులను ఉపయోగించుకోవడం జరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ విధంగా సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్న ఏనుగుల సంఖ్య 2,675 వరకు ఉంది. ఇందులో కేవలం 1,251 ఏనుగులకు సంబంధించి మాత్రమే యాజమాన్య హక్కులను వాటిని వినియోగిసుస్తున్న వ్యక్తులు చూపుతున్నారు. ప్రధానంగా అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో రక్షణ అవసరాలతో పాటు బరువైన మొద్దులను లాగేందుకు ఏనుగులను ఉపయోగించడం ఆనవాయితీగా ఉంది. అయితే, 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సొంత అవసరాలకు ఏనుగులను వినియోగించడం నిషేధించబడింది. అయినప్పటికీ ఈ వ్యవహారం ఇంకా అనధికారికంగానే కొన్ని రాష్ట్రాల్లో సాగిపోతోంది. అలా చేయడం ఏనుగులను బానిసలుగా మార్చడమేనని, వాటిని గంటల తరబడి నిలబెట్టడం, తరలింపు సమయంలో రోజుల తరబడి ప్రయాణం వంటివి వాటిని క్షోభకు గురి చేస్తాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు. ఆ మినహాయింపుతో.. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) చట్టాన్ని 1972లో రూపొందించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని సవరణలు చేసింది. వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) బిల్లు–2021 పేరుతో కొన్ని సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2021లోనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టగా.. అది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చేరింది. తాజాగా రాజ్యసభలో కూడా ఆమోదం పొందటంతో త్వరలో వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) బిల్లు–2022 కాస్తా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్ట రూపంలో అమల్లోకి రానుంది. గతంలో ఉన్న చట్టంలో ఏనుగులను సంరక్షించేందుకు అనేక అంశాలు తోడ్పడేవని.. తాజాగా చట్టంలో సెక్షన్ 43(2) ప్రొవిజన్ చేర్చడంతో చిక్కు వచ్చిపడిందని చెబుతున్నారు. పాత చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి లేకుండా ఏ అడవి జంతువునైనా కలిగి ఉంటే అది వేటాడటం కిందకు వస్తుంది. కానీ.. విద్య, శాస్త్ర పరిశోధనల కోసం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతితో ఏనుగులను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. అది కూడా సెక్షన్ 12 నిబంధనలకు లోబడి మాత్రమేనని స్పష్టంగా పేర్కొన్నారు. ఇలా వినియోగించుకునే వెసులుబాటు కూడా ఆయా జంతువుల సంరక్షణ కేంద్రంగానే జరగాలని పేర్కొన్నారు. అయితే, తాజా సవరణల్లో ఏనుగుల సంరక్షణ కేంద్రంగా అనే అంశాన్ని మినహాయించారనే ఆరోపణలున్నాయి. సులభంగా తరలించేందుకేనా! దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఏనుగులను సులభంగా తరలించేందుకు ఈ కొత్త చట్టాన్ని తెస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో ప్రధానంగా అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో మానవ అవసరాలకు ఉపయోగించుకునే (కేప్టివ్) ఏనుగులున్నాయి. వీటిని గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రదేశాలకు తరలించేందుకే కేంద్రం కొత్త చట్టం కేంద్రం తెచ్చిందనేది ప్రధాన ఆరోపణ. గుజరాత్లో ఏర్పాటు చేయనున్న అమ్యూజ్మెంట్ పార్కులతో పాటు కేరళలలోని దేవస్థానాల్లో ఏనుగులను ఉపయోగించేందుకు తాజా సవరణల అసలు ఉద్దేశమనేది పర్యావరణ ప్రేమికుల ఆందోళన. తద్వారా సహజసిద్ధంగా ఏర్పడిన ఏనుగు కారిడార్లను చెరిపివేయడం సరికాదని పేర్కొంటున్నారు. చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తాజా మార్పుల వెనుక ఉన్న అసలు కారణం తెలిసే అవకాశం ఉందని చెప్పక తప్పదు. -
జంతువులు అడవికే పరిమితం!
సాక్షి, అమరావతి: ఏనుగులు, పులులు వంటి జంతువులు జనావాసాలు, పొలాల వద్దకు వచ్చి బీభత్సం సృష్టించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. జంతువులను అడవికే పరిమితం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మనుషులు, జంతువులకు మధ్య సంఘర్షణను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఒడిశా, తమిళనాడు అటవీ శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలని కూడా నిర్ణయించింది. ఈ విషయంపై ఇటీవల నిర్వహించిన అటవీ శాఖాధికారుల సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఎనిమిదేళ్లలో 38 మంది మృత్యువాత ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో ఏనుగులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇటీవల రెండు పులులు దారి తప్పి తూర్పుగోదావరి, అనకాపల్లి ప్రాంతాల్లోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణజింకలు రోడ్లపైకి, పొలాల్లోకి వస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎలుగుబంట్లు, అడవి పందులు తరచూ గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో జంతువులు, మనుషులకు మధ్య సంఘర్షణలో 2014 నుంచి ఇప్పటివరకు 38 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలపై 15,198 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో మృతి చెందిన, గాయపడిన కుటుంబాలు, పంట, ఇతర నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లకుపైగా పరిహారం చెల్లించింది. పటిష్ట భద్రత ఏర్పాట్లు.. అవగాహన కార్యక్రమాలు.. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ఏనుగులు ఎక్కువగా ఆవాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకు ఏనుగులు వచ్చే మార్గాల్లో కందకాలు తవ్వడం (ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్‌లు), ఆర్సీసీ పిల్లర్లతో స్ట్రీమ్ బారికేడ్లు, రోడ్లపైకి వచ్చే మార్గాల్లో గేట్లు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో 24గంటలు తిరుగుతూ వాటిని గ్రామాల్లోకి రాకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను, ఎలిఫెంట్ ట్రాకర్లను నియమించనున్నారు. అదేవిధంగా ఏనుగులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు మిరపకాయ పొగ వేయడం, ఆముదం స్ప్రే చేయడం, తేనెటీగల సౌండ్ చేయడం ద్వారా వాటిని తిరిగి అడవి వైపు మళ్లించే అంశాలపై స్థానికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏనుగులు బయటకు రాకుండా అడవుల్లోనే వాటి కోసం నీటి గుంటలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాంధ్రలో ఎలిఫెంట్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల అధికారులతో సమన్వయం పెంచుకుని ఏనుగుల కదలికలపై సమాచారాన్ని వేగంగా మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. పులులను ట్రాప్ చేసేలా... తమ ఆవాసాల్లోకి వేరే పులులు రావడంతో అక్కడక్కడా పులులు దారి తప్పి అడవి నుంచి బయటకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలా బయటకొచ్చిన పులులు ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చి ఆవులు, మేకలు వంటి జంతువులను చంపుతున్నాయి. ఇలాంటి ఘటనల నివారణ కోసం వాటిని ట్రాప్ చేసే కేజ్‌లు సమకూర్చుకోవడంతోపాటు కెమెరాల ట్రాప్లను పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణజింకలు రోడ్లపైకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. పొలాల్లోకి వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నాయి. అవి అడవి దాటి రాకుండా చర్యలు చేపడుతున్నారు. -
Viral Story: తప్పతాగి పడిపోయిన ఏనుగుల గుంపు.. అందులో నిజమెంత?
సాక్షి, భువనేశ్వర్: ఏనుగులు తప్పతాగి పడిపోవడంమేంటి? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని షిల్పాద గిరిజన గ్రామ ప్రజలు అదే చెప్తున్నారు. తాము నాటు సారా తయారీ కోసం పులియబెట్టిన ద్రావణాన్ని 24 ఏనుగుల గుంపు తాగేసి సోయి తప్పి పడిపోయాయని అంటున్నారు. స్థానిక గిరిజనులు చెప్తున్న వివరాల ప్రకారం.. షిల్పాదా జీడిమామిడి అడవిలోకి గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వెళ్లాం. అక్కడే తమకు మహువా (ఇప్ప పూలు) పువ్వులతో నాటు సారా తయారు చేసుకునే కుటీరం ఉంది. మొత్తం 24 ఏనుగుల గుంపు తమ కుటీరం వద్ద ఒక్కోటి ఒక్కోచోట పడుకుని ఉన్నాయి. అవి నిద్రకు ఉపక్రమించాయేమోనని తొలుత భావించాం. వాటిని నిద్ర లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ, సారా తయారీకని మహువా పువ్వులను నీటిలో పులియబెట్టిన ద్రావణాన్ని అక్కడ నిల్వ ఉంచాం. అది కనిపించలేదు. ఆ కుండలన్నీ పగలిపోయి ఉన్నాయి. కొన్ని ఖాళీగా కనిపించాయి. అప్పుడు తెలిసింది.. అవి ఆ ద్రావణాన్ని ఫూటుగా సేవించి మత్తుగా పడుకుని ఉన్నాయని! వెంటనే విషయాన్ని అటవీ అధికారులకు తెలిపామని నిరయా సేథి అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఏనుగుల్లో 9 మగ, 9 ఆడ, 6 గున్నవి ఉన్నాయని వెల్లడించారు. (చదవండి: ప్రెగ్నెంట్ అంటూ... ప్లాస్టిక్ బొమ్మతో షాకిచ్చిన మహిళ!) అటవీ అధికారులు ఏమన్నారంటే.. పాటనా అటవీ రేంజ్ అధికారులు షిల్పాద ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. ఏనుగులను నిద్ర లేపేందుకు భారీ డ్రమ్ములను వాయించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏనుగులు నిద్ర లేచి అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు పాటనా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఘసీరాం పాత్రా తెలిపారు. అయితే, గ్రామస్తులు చెప్తున్నట్టుగా ఏనుగులు సారా తయారీ ద్రావణాన్ని తాగడంపై క్లారిటీ లేదని.. అవి గాఢ నిద్రలో ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, మహువా పూల శాస్త్రీయ నామం మధుకా లోంగిఫోలియా. భారత్‌లోని పలు ప్రాంతాల గిరిజన ప్రజలు ఈ పూలతో సారా తయారు చేసుకుంటారు. (చదవండి: ఎవరీ వేటగాడు! 24 క్రూరమృగాలను వేటాడిన చరిత్ర) -
ఎవరీ వేటగాడు! 24 క్రూరమృగాలను వేటాడిన చరిత్ర
సాక్షి, హైదరాబాద్: బీహార్‌లో వాల్మీకి టైగర్ రిజర్వ్ (వీటీఆర్) ఫారెస్ట్‌లో మ్యానీటర్‌గా మారి, 10 మందిని పొట్టన పెట్టుకున్న రాయల్ బెంగాల్ టైగర్ శనివారం హతమైంది. ఈ ఆపరేషన్‌లో బీహార్‌కు చెందిన పోలీసు కమాండోలతో పాటు నగరంలోని రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన నవాబ్ షఫత్ అలీ ఖాన్ సైతం కీలక పాత్ర పోషించారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు అటవీ శాఖ సలహాదారుడిగా ఉన్న ఆయన ఇప్పటి వరకు 24 మ్యానీటర్లు, మదపుటేనుగుల్ని మట్టుపెట్టారు. కొన్ని మ్యానీటర్లకు సంబంధించిన ఆపరేషన్స్‌లో షఫత్ కుమారుడు అస్ఘర్ అలీ ఖాన్ సైతం కీలకంగా వ్యవహరించారు. నవాబ్ షఫత్ అలీ ఖాన్ చిన్నప్పటి నుంచి తుపాకులు, గుర్రాల మధ్య పెరిగారు. ఆయన తాత బహదూర్ బ్రిటిష్–ఇండియాకు ఫారెస్ట్ అడ్వయిజర్‌గా వ్యవహరించారు. బ్రిటీష్ హయాంలో ఏనుగులతో ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో బహదూర్ 50 ఏనుగులు, 10 మానీటర్లను మట్టుపెట్టారు. 1976లో 19 ఏళ్ల వయస్సున్న అలీ ఖాన్ తొలి ‘తూటా’ పేల్చారు. కర్ణాటకలోని మైసూర్ సమీపంలోని హెచ్డీ కోటలో 19 మందిని పొట్టనపెట్టుకున్న ఏనుగును హతమార్చారు. అలా మొదలైన ‘వేట’ ఇప్పటికీ కొనసాగుతోంది. షఫత్ అలీ ఖాన్ బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలకు అటవీ విభాగం అడ్వయిజర్‌గా పని వ్యవహరించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకు కొనసాగుతున్నారు. ఆయా రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులకు శిక్షణ ఇచ్చి వస్తుంటారు. మ్యాన్–మానిమల్ కన్ఫ్లిక్ట్, తుపాకీ వినియోగాల్లో తరీ్ఫదు ఇవ్వడంతో ఈయనకు ప్రత్యేకత ఉంది. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి, మ్యానీటర్లు–మదపుటేనుగుల్ని మట్టుపెట్టే అలీ ఖాన్ పలుమార్లు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఈ వేటగాడిలో జంతు ప్రేమికుడు దాగి ఉన్నాడు. అంతరించిపోతున్న పులుల సంతతిపై ‘ప్రాజెక్ట్ టు సేవ్ ది టైగర్’ పేరుతో అధ్యయనం చేస్తున్నారు. ‘ఆడపులి కేవలం 111 రోజులకే కాన్పు చేస్తుంది. ఒక కాన్పులో కనీసం 3 నుంచి 4 పిల్లలు పుడతాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా 1970ల్లో 20 వేలున్న పులుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. అందుకే దీనిపై అధ్యయనం చేస్తున్నా’ అన్నారాయన. పులులు అంతరించిపోకుండా కొన్ని పరిష్కారాలనూ చూపుతూ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు షఫత్ అలీ ఖాన్ చేసిన ‘వేట’ల సంఖ్య 24కు చేరింది. వీటిలో 17 మ్యానీటర్లే కావడం గమనార్హం. 1976 నుంచి ‘వేటాడుతున్న’ ఈయన గతంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న ఏడు ఏనుగు లు, ఐదు పులులు, 14 చిరుతల్ని హతమార్చారు. (చదవండి: కాశీ యాత్రకు ‘రైలు’ కష్టాలు!) -
కదలిక గుర్తించి..ఆపద గట్టెక్కించి!
రాత్రీపగలూ కంటిమీద కునుకులేకుండా గ్రామాలపైకి దూసుకొస్తున్న ఏనుగుల మందను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రైతులు, పంటలకు శాశ్వత రక్షణ కల్పించేదిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న బేస్ క్యాంప్‌లు, ట్రాకర్ల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. తద్వారా ఏనుగుల సంచారాన్ని గ్రామస్తులు, రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయవచ్చని భావిస్తోంది. ఈ మేరకు అటవీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో ఇటీవల ఏనుగుల సంచారం ఎక్కువైంది. రైతులు తీవ్ర నష్టాలు మూటగట్టుకుంటున్నారు. దీంతోపాటు పలువురు ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతున్నాయి. ఈ సమస్యపై గతంలో పలువురు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో వెంటనే బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏనుగుల కదలికలపై ప్రత్యేక దృష్టి ఇటీవల పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలాల్లో ఏనుగుల దాడులు పెచ్చుమీరాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి, తద్వారా వాటి కదలికలను ఎప్పటికప్పుడు గ్రామస్తులకు తెలియజేయడంతో పాటు, వాటిని గ్రామాల వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కుప్పం ప్రాంతంలో ఐదు, పలమనేరు పరిధిలో నాలుగు, చిత్తూరులో రెండు బేస్ క్యాంపులు ఉన్నాయి. వీటితోపాటు పెద్దపంజాణి, సోమల మండలాల్లో ఆవులపల్లి, పేటూరు ప్రాంతాల్లో కొత్త బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఇవి ఏర్పాటు చేస్తే ఒక్కో బేస్ క్యాంప్ సుమారు 40 నుంచి 50 చ.కి.మీ పరిధిలో ఏనుగుల కదలికలు గమనించేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొత్తం మూడు బేస్ క్యాంపులకు కలిపి సుమారు 15 మంది ట్రాకర్లు అందుబాటులోకి రానున్నారు. సత్వర చర్యలకు అవకాశం ట్రాకర్ల సహాయంతో ఏనుగుల కదలికలతో పాటు మిగిలిన అడవి జంతువుల గురించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందే అవకాశం ఉంది. గ్రామాల వైపు ఏనుగుల గుంపు వస్తే, ఆయా గ్రామాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేసేందుకు వీలుంటుంది. అదే విధంగా అటవీశాఖ అధికారులు కూడా టపాసులు, డప్పులు లాంటివి సిద్ధం చేసి ఆయా గ్రామాల వైపునకు ఏనుగుల గుంపు వెళ్లకుండా సత్వరచర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది. ప్రస్తుతం పుంగనూరు రేంజ్లో 20 నుంచి 25 ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇందులో 3 మదపుటేనుగులు ఉన్నాయి. అయినా గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేయలేదు. ఇక బేస్ క్యాంపుల ఏర్పాటుతో ఏనుగుల బెడద బాగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 80 నుంచి 90 ఏనుగులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఏనుగుల కట్టడికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలమనేరు ప్రాంతంలో 6 కి.మీ సోలార్ ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయి. మరో 15 కి.మీ. దూరం సోలార్ ఫెన్సింగ్ వేసేందుకు అనుమతులు మంజూరయ్యాయి. జనంలో నుంచి అరణ్యంలోకి.. జనారణ్యంలోకి వచ్చిన ఏనుగులను సురక్షితంగా తిరిగి అడవిలోకి పంపేందుకు సత్వర చర్యలు చేపట్టాం. తమిళనాడు, కర్ణాటక నుంచి ఏయే మార్గాల్లో ఏనుగులు వస్తున్నాయో గుర్తిస్తున్నాం. వాటి వల్ల ప్రజలకు, పంటలకు నష్టం వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపట్టాం. బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. 50 మందితో ఏనుగుల ట్రాకింగ్ చేస్తున్నాం. -
ఈ జేజమ్మ మళ్లీ పుడుతుందట!
ఇదేంటి ఈ ఏనుగులకు జూలు ఉంది.. భలే విచిత్రంగా ఉన్నాయే అనుకుంటున్నారా? కానీ ఇవి ఏనుగులు కాదు.. వాటి జేజమ్మలు.. అంటే ఏనుగుల పూర్వీకులన్నమాట. వీటిని వూలీ మామత్‌లు అంటారు. చూసేందుకు ఆఫ్రికా ఏనుగుల తరహాలో బలిష్టంగా కనిపిస్తూ ఒంటినిండా జూలుతో మంచు యుగంలో భూమిపై సంచరించిన జీవులివి. యూరప్, ఉత్తర అమెరికాతోపాటు ఆసియాలోని మంచు ప్రాంతాల్లో 3 లక్షల ఏళ్ల కిందట తిరిగిన ఈ జీవులు దాదాపు 10 వేల ఏళ్ల కిందటే అంతరించిపోయాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే.. ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రం జురాసిక్ పార్క్‌లో జన్యు శాస్త్రవేత్తలు ఎలాగైతే అంతరించిన డైనోసార్లను ప్రతిసృష్టి చేస్తారో అదే తరహాలో వూలీ మామత్లను తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ కొలోస్సల్ బయోసైన్సెస్ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏకంగా 15 లక్షల డాలర్లను కూడా సమీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆ కంపెనీ బయటకు వెల్లడించనప్పటికీ డీఎన్ఏ ఎడిటింగ్ పద్ధతి ద్వారా వూలీ మామత్లను సృష్టించాలనుకుంటోంది. దీన్నే మరోలా చెప్పాలంటే వూలీ మామత్లకు అత్యంత దగ్గరి పోలికలుగల, 99% డీఎన్ఏను పోలిన ఇప్పటి ఏనుగుల డీఎన్ఏను క్రమంగా వూలీ మామత్ల తరహాలోకి మార్చుకుంటూ వెళ్లాలని భావిస్తోంది. వచ్చే 10–15 ఏళ్లపాటు ఈ ప్రక్రియపైనే పనిచేయనున్నట్లు సంస్థ చెబుతోంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే అప్పుడు వూలీ మామత్ లేదా మామత్ను పోలిన అండాలను ల్యాబ్‌లలో తయారు చేసి వాటిని ఆసియా ఏనుగుల గర్భంలో ప్రవేశపెట్టాలనేది కొలోస్సల్ బయోసైన్సెస్ లక్ష్యం. ఎందుకీ ప్రయోగం? ఆర్కిటిక్ ప్రాంతంలో మట్టి, ఇసుక, మంచుతో ఘనీభవించిన నేల (పర్మాఫ్రాస్ట్) పొరల నుంచి భూతాపం వల్ల క్రమంగా మంచు కరిగిపోతోంది. భూమిపై అత్యధికంగా కార్బన్, మీథేన్‌లను పట్టి ఉంచిన పర్మాఫ్రాస్ట్ బలహీనపడితే అది భూ వాతావరణంలోకి భారీ స్థాయిలో కార్బన్ డై ఆౖð్సడ్, మీథేన్ వాయువులను విడుదల చేస్తుంది. ఈ పరిణామం మానవాళి ఉనికికే ప్రమాదం కానుంది. ఈ నేపథ్యంలో కొలోస్సల్ బయోసైన్సెస్తోపాటు మరికొన్ని బయోటెక్నాలజీ సంస్థలు వూలీ మామత్‌లు సహా అంతరించిపోయిన ఆర్కిటిక్ ప్రాంతాల జంతువులను భారీ స్థాయిలో ప్రతిసృష్టి చేసి వాటిని సహజ ఆవాస ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నాయి. ఈ జీవులు ఆర్కిటిక్‌లో సంచరిస్తే వాటి బరువు వల్ల మంచుపొరలు లోపలకు తిరిగి గట్టిపడటంతోపాటు ఆ పొరల మధ్య చిక్కుకుపోయిన ఉష్ణం వెళ్లిపోతుందని శాస్త్రవేత్తల అంచనా. ఫలితంగా పర్మాఫ్రాస్ట్‌లో చల్లదనం శాశ్వతంగా ఉండిపోతుందని.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
అయ్యబాబోయ్ ఏనుగులు.. పరుగో పరుగు!
యశవంతపుర: రహదారిపై ఏనుగుల మంద తిష్ట వేసి, వాహనాలను ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా సరిహద్దులో జరిగింది. హాసనూరు వద్ద తమిళనాడు దిండిగల్ హైవే–209లో ఆదివారం ఉదయం ఏనుగుల మంద చొరబడింది. ఇది మా అడ్డా, మీకేం పని అన్నట్లు రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అడ్డుపడి ఆపేశాయి. వాహనాలలోని ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఒక కారు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించగా ఏనుగులు కారుపై కాళ్లు పెట్టి మరీ అడ్డుకున్నాయి. వెనుక కార్లలో ఉన్నవారు ఏనుగుల రుబాబును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. ఈ మార్గంలో అప్పుడప్పుడు ఏనుగులు చొరబడి వాహనాలపై దాడులు చేస్తుంటాయి. తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం తిరుమల: తిరుమల మొదటిఘాట్ రోడ్డులో ఆదివారం ఏనుగుల గుంపు మరోమారు కలకలం సృష్టించాయి. మొదటిఘాట్ రోడ్డులోని ఎలిఫెంట్ ఆర్క్ సమీపంలో పది ఏనుగుల గుంపు రోడ్డుకు సమీపంలోని అటవీప్రాంతంలో చెట్లను విరుస్తూ శబ్దాలు చేశాయి. దీంతో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తోన్న వాహనచోదకులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న టీటీడీ అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి తరిమారు. ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారించడం ఇది రెండోసారి. (క్లిక్: రోడ్డు రోలర్‌తో తొక్కించి సైలెన్సర్ల ధ్వంసం) -
పాపం గజరాజులకి ఎంత కష్టం!
-
హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?
జంతువుల్లో ఏనుగును మేధావిగా భావిస్తారు. అవి చాలా వరకు సాధు జీవిలానే ఉంటాయి. కాకపోతే ఒక్కొసారి ఆ ఏనుగులు తమ జోలికి వస్తే మాత్రం అంత తేలికగా వదిలిపెట్టవు. పైగా అవి వాటికి ఏదైనా సమస్య వస్తే భలే చక్కగా ఒకదానికొకటి సహకరించుకుంటాయి. అంతేకాదు మనుషుల వలే కొన్ని పనులను భలే చాకచక్యంగా చేసేస్తాయి. అచ్చం అలానే ఇక్కడొక ఏనుగు నేను మీ లా దూకేయగలనంటూ అడ్డుగా ఉన్న ఇనుప కంచెను ఎలా దాటిందో ఈ వీడియోలో చూడండి. (చదవండి: అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ) పైగా ఆ ఏనుగు ఎంతో నైపుణ్యంగా ఆ ఇనుప కంచెను దాటడానికి ప్రయత్నించింది. అంతేకాదు ఆ ఏనుగు ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధించింది. ఈ మేరకు ఈ వీడియోని తమిళనాడు ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియా సాహు ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. దీంతో కొంతమంది నెటిజన్లు ఈ ఏనుగు తెలివితేటలను మెచ్చుకుంటూ జౌరా! అంటే మరికొంత మంది అలాంటి కంచెలను దాటడానికి ప్రయత్నించి మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు అందువల్ల దయచేసి వాటిని తొలగించండి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ) -
వైరల్: ఊహు! నేను వెళ్లను, ప్యాలెస్‌లోనే ఉంటా ప్లీజ్..
మైసూరు: మైసూరు మహానగర సౌందర్యం పండిత పామరులనే కాదు మూగజీవాలను కూడా ముగ్ధుల్ని చేస్తుందేమో. దసరా వేడుకలకు విచ్చేసిన గజరాజు అశ్వత్థామ అడవికి తిరిగి వెళ్లడానికి ససేమిరా అనడంతో అందరూ ఔరా అనుకున్నారు. దసరా కోసం వచ్చిన ఏనుగులను ఆదివారం ప్యాలెస్ నుంచి ఆయా అటవీ శిబిరాలకు తరలించారు. అశ్వత్థామ అనే ఏనుగు తాను లారీలోకి ఎక్కనని, మొండికేసింది. మావటీలు ఎంత యత్నించినా లారీలోకి ఎక్కలేదు. దీంతో వారు ప్రధాన గజరాజు అభిమన్యును ఆశ్రయించారు. అశ్వత్థామను అభిమన్యు ఒక్క తోపు తోయడంతో లారీకి ఎక్కడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. గజరాజులకు వీడ్కోలు దసరా ఉత్సవాలు ఘనంగా ముగియడంతో గజరాజులు తిరిగి అడవి బాట పట్టాయి. ఆదివారం ఉదయం ప్యాలెస్‌లో గజరాజులకు సంప్రదాయ పూజలు చేసి వీడ్కోలు పలికారు. అంతకు ముందు మావటీలు, కాపలాదారులు ఏనుగులకు స్నానాలు చేయించి ఆహారం అందించారు. అనంతరం కెపె్టన్ అభిమన్యు నేతృత్వంలోని ఏనుగులను ప్రత్యేక లారీలలో అటవీ శిబిరాలకు తరలించారు. -
గజ కోలాహలం
మైసూరు: కరోనా ఆంక్షల మధ్య ఈదఫా కూడా ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు 8 గజరాజులను గురువారం మైసూరుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఊరేగింపుగా ప్యాలెస్ ఆవరణలోకి ప్రవేశించాయి. ముఖ్య గజం అభిమన్యు, అలాగే విక్రమ, గోపాలస్వామి, ధనుంజయ, కావేరి, చైత్ర, లక్షి్మ, అశ్వత్థామ పేర్లుగల ఏనుగులు వచ్చాయి. అక్టోబరు 7న దసరా ఉత్సవాలు ఆరంభమవుతాయి. 15వ తేదీన ముఖ్య ఘట్టమైన జంబూ సవారీ ఊరేగింపు సాగుతుంది. -
కల్లికోట్ల గ్రామంలో ఏనుగులు బీభత్సం
-
చిత్తూర్ జిల్లా లో ఏనుగుల బీభత్సం
-
నెట్టింట వైరల్ అయిన చైనా ఏనుగుల సాహస యాత్ర
-
500 కిమీ నడవాలి.. అందుకే సేద తీరుతున్నాం
బీజింగ్: చైనాలో ఏనుగుల ఒక చోటనుంచి మరో చోటకు వలసపోతున్నాయి. యునాన్ ఫ్రావిన్స్ నైరుతి ప్రాంతంలో ఉన్న కొండల మధ్యలోని వైల్డ్‌లైఫ్ రిజర్వ్ నుంచి 15 ఏనుగులు గుంపుగా బయల్దేరాయి. అక్కడి నుంచి అదే ఫ్రావిన్సులో దాదాపు 500 కిమీ దూరంలో ఉన్న కున్మింగ్ అటవీ ప్రాంతానికి వెళుతున్నాయి. సుమారు 500 కిమీ పైగా ప్రయాణిస్తున్న ఈ ఏనుగుల గుంపు మార్గమధ్యలో అలసిపోయాయి.. విశ్రాంతి కోసం అన్ని గుంపుగా ఒకేచోట సేద తీరాయి. చైనా మీడియా ఈ ఏనుగుల గుంపును వీడియోలు తీస్తూ అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. ఏనుగుల గుంపు అడవిలోకి వెళ్లేంతవరకు జనాలు ఎక్కువగా బయట తిరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇంకో 200 కిమీ దూరం వెళితే ఆ ఏనుగుల గుంపు తమ గమ్య స్థానానికి చేరుకుంటాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: 4 భారీ టవర్లు... 10 సెకన్లలోనే నేలమట్టం! బాప్రే.. బంగారు నాణేనికి రూ.142 కోట్లు! -
సింహం మృతితో అలర్ట్: ఏనుగులకు కోవిడ్ టెస్ట్
చెన్నె: ఇన్నాళ్లు మనుషులకు మహమ్మారి కరోనా వైరస్ సోకుతుండగా తాజాగా జంతువులకు కూడా ఆ వైరస్ వ్యాపిస్తోంది. జంతువులకు మొట్టమొదటి కేసు తెలంగాణలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో వెలుగు చూడగా అనంతరం తమిళనాడులోని వండలూరు జూలో కూడా జంతువులకు కరోనా సోకింది. అయితే ఇక్కడ వైరస్‌తో ఓ సింహ మృతి చెందడం కలకలం రేపింది. ఆ సింహం ద్వారా 9 సింహాలకు వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా ఏనుగులకు కూడా వైరస్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని తెప్పకాడు ఏనుగుల శిబిరంలో మంగళవారం 28 ఏనుగులకు కరోనా పరీక్షలు చేశారు. వాటి నుంచి నమూనాలను (శాంపిల్స్) సేకరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇన్‌జత్‌నగర్‌లో ఉన్న భారత పశుసంవర్ధక పరిశోధనా సంస్థ (ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ సెంటర్)కు నమూనాలు పంపించాలని ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రామచంద్రన్ ఆదేశించారు. ఏనుగుల నుంచి ట్రంప్ వాష్ శాంపిల్, రెక్టల్ స్వాబ్‌ను సేకరించినట్లు వెటర్నరీ సర్జన్ రాజేశ్ కుమార్ తెలిపారు. అయితే ఏనుగులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని, వాటికి వైరస్ లక్షణాలు లేవని మరో అధికారి కేకే కౌశల్ వివరించారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా వాటి బాగోగులు చూసుకునే మావటిలు, సహాయ సిబ్బంది మొత్తం 52 మందికి కరోనా వ్యాక్సిన్ వేయించారు. ఏనుగులకు కరోనా సోకే అవకాశం చాలా తక్కువ అని, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా వాటికి కరోనా పరీక్షలు చేయించినట్లు అధికారులు తెలిపారు. కరోనాతో సింహం మృతి చెందడంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి స్టాలిన్ జూన్ 6వ తేదీన జూపార్క్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. -
గ్రామంలోకి 36 ఏనుగులు.. భయంతో జనం పరుగులు
పలమనేరు (చిత్తూరు జిల్లా): ఇన్నాళ్లూ తరచూ పంటలపై పడి ధ్వంసం చేస్తున్న కౌండిన్య అభయారణ్యంలోని ఏనుగులు ఇప్పుడు యథేచ్ఛగా రోడ్లపై నడుచుకుంటూ గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. పలమనేరు మండలంలోని జోడిరచ్చల గ్రామంలోకి బుధవారం ఏకంగా 36 ఏనుగులు చొరబడ్డాయి. గజరాజుల ఘీంకారాలకు భయంతో గ్రామస్తులు పరుగులు పెట్టారు. కొద్దిసేపు గ్రామంలో హల్చల్ చేసిన ఏనుగుల గుంపు ఆ తర్వాత గ్రామానికి ఆనుకుని ఉన్న పలమనేరు–మండిపేట కొట్టూరు తారురోడ్డు మీదుగా వెళ్లి ఆపై అడవిలోకి చేరింది. ఆ సమయంలో ఆ మార్గంలో ద్విచక్రవాహనాలపై వెళ్తున్నవారు ఏనుగుల గుంపును చూసిందే తడవుగా వెనక్కి మళ్లి పలాయనం చిత్తగించారు. సోలార్ ఫెన్సింగ్, ఎలిఫెంట్ ట్రెంచ్‌లు ఉన్నా.. కౌండిన్య ఎలిఫెంట్ శాంచ్యురీలో ఏనుగులు అడవిలోంచి బయటకు రాకుండా ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్, ఎలిఫెంట్ ట్రెంచ్ ఫలితాలనివ్వడం లేదు. షాక్ కొట్టని సోలార్ ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి, ట్రెంచ్‌లను మట్టితో పూడ్చి, బండలున్న చోట్ల అడవిని దాటుకుంటూ ఏనుగులు నిత్యం జనావాసాలవైపు గుంపులు గుంపులుగా వస్తున్నాయి. ఇప్పటిదాకా ఏనుగులు పంటలపై పడేవి. ఈ మధ్య కాలంలో ఇవి గ్రామాల్లోకి వస్తుండటంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. ఏనుగులకు ఒకసారి ఒక మార్గం అలవాటైతే అదే మార్గంలో మళ్లీ మళ్లీ వస్తాయని ఆ ప్రాంత వాసులు భయపడుతున్నారు. దీంతో రాత్రి పూట ఇళ్లలో నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ స్పందించి ఎలిఫెంట్ ట్రాకర్ల ద్వారా ఏనుగులను మోర్థన ఫారెస్ట్‌లోకి మళ్లించాలని వారు జోడిరచ్చల గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: ప్రేమించి.. లోబర్చుకుని.. జాబ్ వచ్చాక కాదన్నాడు ‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన -
Elephants: కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఏనుగులు
ఒడిశాలోని లకేరి అటవీ ప్రాంతం నుంచి సుమారు 14 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు గిరిజనులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. 2007లో సీతంపేట మన్యంలోకి వచ్చిన 11 ఏనుగులు అప్పటి నుంచి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాయి. వీటిలో ఏడు చనిపోగా మిగిలిన నాలుగు ఇక్కడే తిష్ట వేశాయి. వీటి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలను రైతులు కోల్పోతున్నారు. వీటి దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా వీటి నుంచి శాశ్వత పరిష్కారం లభించలేదు. వేసవిలో అటవీ ప్రాంతంలో నీరు లేక జనావాసాల్లోకి వచ్చేస్తుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సీతంపేట: ఏనుగుల నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని భామిని, సీతంపేట, కొత్తూరు, మెళియాపుట్టి, మందస, పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట మండలాల్లోనే గత 14 సంవత్సరాలుగా ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇటీవల కాలంలో భామిని, సీతంపేట మండలాల పరిధిలోని గ్రామాల్లోకి తరచూ వస్తూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తగ్గిన అటవీ విస్తీర్ణం 2007లో ఏనుగులు సీతంపేట మన్యంలోకి ప్రవేశించాయి. ఈ ప్రాంతంలో ఒకప్పుడు వేలాది ఎకరాల్లో అడవులు విస్తరించి వివిధ రకాల చెట్లకు నిలయమై ఉండేవి. ఇప్పుడు అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. అభివృద్ధి పేరిట అటవీ ప్రాంతంగుండా రహదారులు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. కొండపోడు వ్యవసాయం కోసం అడవులను కాల్చివేస్తున్నారు. దీంతో మూగజీవాలకు నిలువనీడలేక మైదాన ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. ఒడిశాలోని లకేరీ అటవీ ప్రాంతంలో ఎక్కువగా చెట్లను నరకడం, అడవుల్లో జనసంచారం పెరగడంతో అక్కడ ఉండే ఏనుగులు జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చేస్తున్నాయి. వెదురు, రావి, వెలగ, మర్రి, చింత, ఇతర పండ్ల జాతుల చెట్లు, దట్టమైన పచ్చిక బయళ్లు ఏనుగులకు ఆహారం. కానీ అడవుల్లో ఈ జాతులు మొక్కలు దాదాపుగా అంతరించిపోయి ఆహారం కరువైంది. దీంతో గిరిజనులు పండించే పంటలపై పడి నాశనం చేస్తున్నాయి. ఇప్పటివరకు పది వేల ఎకరాలకు పైగా పంటలను నాశనం చేశాయని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు వద్దకు నీటి కోసం వచ్చిన ఏనుగులు నీరే ప్రధానం.. ఏనుగులకు నీరు చాలా అవసరం. వాటి చర్మం మందంగా ఉంటుంది. వేడిని తట్టుకోవడానికి తరుచుగా నీరు తాగడం, మీద చల్లుకోవడం చేస్తుంటాయి. భరించలేని పరిస్థితుల్లో బురద మట్టిని సైతం దేహానికి పూసుకుంటాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వాటికి కావాల్సిన మేత కూడా పెరిగే అవకాశం ఉంది. దీన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు గతంలో ఏనుగు సంచరించే అటవీ ప్రాంతాన్ని గుర్తించి నీటి కుంటలు నిర్మించారు. అయితే అనంతరం వీటి నిర్వహణ గాలికి వదిలేయడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో వేసవి ఆరంభంలోనే జనావాసాలకు సమీపంలోకి వచ్చేస్తున్నాయి. సీతంపేట–భామిని సరిహద్దు ప్రాంతంలో చెరువు ఉండడంతో ప్రస్తుతం అక్కడకు వచ్చి ఏనుగులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి. శాశ్వత పరిష్కారాలు లేవా? ఏనుగులు, ఇతర వన్యప్రాణులు జనావాసాల వైపు రాకుండా శాశ్వత పరిష్కార మార్గాలపై అధికారులు దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు. వేసవిలోనూ వాటికి మేత, నీరు లభ్యమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏనుగుల నియంత్రణకు రెండేళ్ల క్రితం కందకాలు తవ్వడం వంటివి చేసినప్పటికీ గిరిజనుల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. కందకాల్లో గిరిజనులకు చెందిన ఆవులు, మేకలు వంటివి పడి చనిపోయిన సందర్భాలు ఉండడమే కారణం. ఏనుగులను ఇక్కడ నుంచి తిరిగి లకేరి అటవీ ప్రాంతానికి తరలించాలని జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఒడిశా కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడంతో సాధ్యం కావడం లేదు. జీపీఎస్‌తో ట్రాక్ చేస్తున్నాం ఏనుగులు ఎక్కడ సంచరిస్తున్నాయనేది జీపీఎస్‌తో ట్రాక్ చేస్తున్నాం. అవి ఎటువైపు పయనిస్తున్నాయనేది తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 14 మంది ట్రాకర్లు ఉన్నారు. ఏనుగులు గ్రామాలవైపు రాకుండా వారు చర్యలు చేపడతారు. ఏనుగుల కారణంగా పంటనష్టం వాటిల్లుతున్న మాట వాస్తవం. ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. హార్టీకల్చర్, వ్యవసాయశాఖలు ఏనుగులు తొక్కేసిన పంటల నష్ట పరిహారం అంచనా వేస్తున్నాయి. ఆ ప్రకారంగా పరిహారం కూడా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. – గుండాల సందీప్‌కృపాకర్, డీఎఫ్‌వో జీడి, మామిడి పంటలకు నష్టం కొన్ని రోజులుగా మా ప్రాంతంలోనే ఏనుగులు సంచరిస్తూ జీడి, మామిడి పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. ఏనుగులు ఏ మూల నుంచి దాడి చేస్తాయోననే భయంతో కొండపోడు పనులకు వెళ్లడం లేదు. – ఎన్.ఆదినారాయణ, చిన్నబగ్గ కాలనీ సమస్య పరిష్కరించాలి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనులు కష్టపడి సాగు చేస్తున్న పంటలను ఏనుగులు నాశనం చేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. వీటిని నియంత్రించడంలో అటవీశాఖ విఫలమైంది. ఇప్పటికైనా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఇక్కడ నుంచి ఒడిశా అటవీ ప్రాంతానికి తరిమివేయాలి. – పి.సాంబయ్య, గిరిజన సంఘం నాయకుడు -
ఏం జరిగింది? 18 ఏనుగుల అనుమానాస్పద మృతి
డిస్పూర్: అసోంలోని అటవీ ప్రాంతంలో ఘోరం జరిగిపోయింది. అడవిలో ఉన్న 18 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేయాలని అటవీ శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. కొండపైన.. కొండ దిగువన గజరాజుల కళేబరాలు పడి ఉన్నాయి. ఈ ఘటనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే విచారణకు ఆదేశించారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు అడవిలో పర్యటిస్తున్నారు. అసోం నాగావ్ జిల్లాలోని బాముని హిల్స్ వద్ద కాతియోటోలి పరిధిలోని కండోలి ప్రతిపాదిత రిజర్వ్డ్ ఫారెస్ట్ (పీఆర్ఎఫ్) లో గురువారం 18 అడవి ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఒక ప్రమాదంలో గజరాజులు మృతి చెంది ఉంటాయని అటవీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఏనుగుల మృతి వార్తతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్పందించిన పోలీసులు వెతికే పనిలో పడ్డారు. ఏనుగులు మరిణించాడని కారణమేంటి? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) అమిత్ సహే మాట్లాడుతూ.. "ఇది చాలా మారుమూల ప్రాంతం. వాటి కళేబరాలను రెండు గ్రూపులుగా పడి ఉన్నట్లు కనుగొనబడింది. 14 కొండపైన, మరో నాలుగు ఏనుగులను బయట కనుగొన్నాం’. ‘ఈ సంఘటనతో తాను తీవ్రంగా బాధపడుతున్నానని అసోం పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పరిమల్ సుక్లబైద్యా అన్నారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ ‘ఆ ప్రదేశాన్ని సందర్శించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆదేశించారు. చదవండి: దారుణం.. కూలీ ప్రాణం తీసిన పెంపుడు కుక్క -
వీడియో వైరల్: ఏనుగులు చేసిన పనికి ఫిదా కావాల్సిందే
చెన్నె: భారీ ఆకారం.. ఎన్ని టన్నులైనా ఎత్తగల శక్తిసామర్థ్యం ఉన్న గజరాజుకు కోపమొస్తే ఇక అంతే సంగతులు. అని అందరికీ తెలిసిన విషయమే. కానీ వాటికి మనసు ఉంటుంది.. మానవత్వం ఉంటుంది. భారీ గజరాజులకు సున్నిత మనస్తత్వం కలదని ఓ సంఘటన నిరూపించింది. ఏనుగులు చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. మానవత్వంతో ఏనుగులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడులోని ఓ గ్రామంలో శుక్రవారం అరటి తోటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అరటి తోటను ధ్వంసం చేశాయి. అరటి చెట్లను పారవేస్తూ.. అరటిగేలలను తింటూ తోటలో నానా హంగామా చేసి వెళ్లాయి. ఏనుగుల దాడిలో నష్టపోయామంటూ రైతులు లబోదిబోమన్నారు. ఈ సందర్భంగా పంట ను పరిశీలించేందుకు తోటలోకి వెళ్లి చూడగా ఒకచోట ఆశ్చర్యం కలిగేలా ఓ దృశ్యం కనిపించింది. తోటంతా నాశనం చేసిన ఏనుగులు ఒక్క అరటి చెట్టును మాత్రమే తొలగించకుండా వెళ్లిపోయాయి. ఎందుకంటే వాటిపైన పక్షిగూడు ఉంది. వాటిలో అప్పుడే పుట్టిన బుజ్జి పక్షులు ఉన్నాయి. వాటిపై ఏనుగులు మానవత్వం చూపాయి. పక్షులతో కూడిన గూడు ఉన్న చెట్టును నాశనం చేయకుండా ఏనుగులు మిగిల్చి వెళ్లాయి. వీటిని రైతులు ఆసక్తిగా గమనించారు. పంట నష్టం అంచనా వేయడానికి వచ్చిన అధికారులు చూసి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారి సుశాంత నంద ఆ దృశ్యాన్ని చూసి ఆనందించారు. తోటి జీవులను ఏనుగులు కాపాడాయి అని తెలిపారు. ‘ఒక్క పక్షులున్న ఒక్క చెట్టు తప్ప మొత్తం అరటి తోటను నాశనం చేశాయి. అందుకే అంటారు గజరాజులను సున్నిత మనస్తత్వం కలవి’ అని చెబుతూ సుశాంత నంద ట్వీట్ చేశారు. చెట్టుపై ఉన్న పక్షులతో కూడిన ఉన్న గూడు వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో చూసి వావ్.. సో క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏనుగులు నిజంగా ఎంత మంచివో అని పేర్కొంటున్నారు. చదవండి:కొత్త సీఎం స్టాలిన్: తొలి ఐదు సంతకాలు వీటిపైనే.. చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ This is the reason as to why elephants are called gentle giants. Destroyed all the banana trees , except the one having nests. Gods amazing Nature🙏 (Shared by @Gowrishankar005) pic.twitter.com/iK2MkOuvaM — Susanta Nanda IFS (@susantananda3) May 7, 2021 -
గ్రామాల వైపు.. గజరాజుల చూపు!
పలమనేరు: కౌండిన్య అభయారణ్యంలో ఆహారం, నీటి లభ్యత తక్కువగా ఉండటంతో చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫేంట్ శాంచ్యురీ నుంచి ఏనుగులు గ్రామాల వైపు వస్తున్నాయి. రైతులు వన్యప్రాణుల నుంచి పంటలకు రక్షణగా కరెంటు తీగలను అమర్చుతుండటంతో అవి విద్యుత్ షాక్‌కు గురై మరణిస్తున్నాయి. కౌండిన్యలోకి రెండు రాష్ట్రాల ఏనుగులు.. అడవిలోని దట్టమైన మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే అక్కడ తమిళనాడు అటవీ శాఖ సిబ్బంది రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరుపుతున్నారు. దీంతో తమిళనాడు ప్రాంతంలోని ఏనుగులు సైతం కౌండిన్య వైపునకు వచ్చి చేరుతున్నాయి. ఇక కర్ణాటక నుంచి ఏనుగులు గుడుపల్లి, కుప్పం మీదుగా ఇదే అడవిలోకి వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో మూడు గుంపులుగా 36 ఏనుగులు సంచరిస్తున్నాయి. తమిళనాడు మోర్థన అభయారణ్యం నుంచి 26 ఏనుగులు తరచూ వచ్చి వెళుతున్నాయి. ఇక 24 ఏనుగులు కర్ణాటక నుంచి కుప్పం ఫారెస్ట్‌లోకి 2 నెలల క్రితం రాగా అటవీ సిబ్బంది వాటిని తిరిగి కర్ణాటక అడవుల్లోకి మళ్లించారు. మేత కోసం అటవీ శాఖ ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్, ఎలిఫేంట్ ట్రెంచ్‌లను ధ్వంసం చేసి మరీ ఏనుగులు బయటకు వచ్చేస్తున్నాయి 16 గజరాజుల మృత్యువాత.. అడవిని దాటి మేత కోసం వచ్చిన 16 ఏనుగులు ఇప్పటిదాకా కరెంట్ షాక్‌లకు గురవడం, నీటికొలనుల్లో పడిపోవడం, మదపుటేనుగుల దాడి చేయడంతో మృతి చెందాయి. ఇక గుంపులను వీటి ఒంటరిగా సంచరించే మదపుటేనుగులను అడవిలోకి మళ్లించేందుకు రైతులు వాటిపైకి టైర్లను కాల్చి వేస్తున్నారు. ఒక్కో సందర్భంలో రాళ్లు విసరడం, బాణాసంచా పేల్చడంతో అవి మనషులపై కోపాన్ని పెంచుకుని దాడులు చేస్తున్నాయి. జీపీఎస్ సిస్టంతో గజరాజులకు చెక్.. కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ. మేరకు వ్యాపించి ఉంది. దీంతో ఏనుగుల జాడను గుర్తిం చేందుకు జీపీఎస్ చిప్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నట్లు అటవీ శాఖ గతంలో తెలిపింది. ఇందుకోసం కౌండిన్యలో నెట్వర్క్ పనిచేసేలా శక్తివంతమైన టవర్లను నిర్మించాల్సి ఉంటుంది. ఆపై ఎలిఫేంట్ ట్రాకింగ్ యాప్‌ను తయారు చేసి దీన్ని అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, ట్రాకర్ల స్మార్ట్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే ఏనుగులు ఏ ప్రాంతంలో ఉన్నాయనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏనుగుల గుంపును వెంటనే ఎలిఫెంట్ ట్రాకర్స్ వాటిని అడవిలోకి మళ్లించవచ్చు. అలాగే, కౌండిన్య అభయారణ్యం 3 రాష్ట్రాల పరిధిలో ఉండటంతో 3 రాష్ట్రాలు కలసి ఎలిఫేంట్ కారిడార్ ఏర్పాటు చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. -
జనం పరుగో పరుగు.. ఇండియన్ ఏనుగు అంతే!
మాస్కో : సర్కస్‌లో ఫీట్లు చేయాల్సిన ఓ ఇండియన్ ఏనుగు అసూయతో భీకర ఫైట్‌కు తెర తీసింది. సర్కస్ మధ్యలో తోటి ఏనుగుపై కలబడి కుమ్ములాడింది. దీంతో పడిపడి నవ్వటానికి వచ్చిన జనం.. భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన రష్యాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం రష్యాలోని కాజన్‌లో ‘ సర్కస్ మాయాజాలం.. ఏనుగుల ప్రదర్శన’ పేరిట ఓ సర్కస్ జరిగింది. దీన్ని చూడటానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. షో ప్రారంభమైన తర్వాత ఇండియాకు చెందిన రెండు ఆడ ఏనుగులు జెన్నీ, మగదలు ఫీట్లు చేయటానికి రింగులోకి వచ్చాయి. వాటి ట్రైనర్ సూచనలు చేస్తూ వాటితో ఫీట్లు చేయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ట్రైనర్ తనకంటే ఎక్కువగా మగదకు ప్రాధాన్యత ఇస్తున్నాడని భావించిన జెన్నీ మగదపై దాడికి దిగింది. దాన్ని కిందపడేసి కుమ్మటం మొదలుపెట్టింది. రింగ్ అవతలకు తోయటానకి ప్రయత్నించింది. దీంతో బెంబేలెత్తిపోయిన జనం భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సర్కస్ సిబ్బంది జెన్నీని అదిలించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ట్రైనర్ తన కంటే మగదకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడనే అసూయతోనే జెన్నీ దాడికి దిగిందని సర్కస్ నిర్వహకులు చెబుతున్నారు. ఈ సంఘటనలో ఏనుగులు కానీ, జనం కానీ గాయపడలేదని తెలిపారు. చదవండి : వైరల్‌గా మారిన ప్రపంచ కుబేరుల పాత ఫొటో -
మంచు ఏనుగులు ఎలా ఉండేవో తెలుసా?
జంతు పరిణామ క్రమాన్ని తెలుసుకోవడానికి పరిశోధకులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూనే ఉంటారు. ప్రతిసారి వారికి కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. లండన్‌కు చెందిన పరిశోధక బృందం ఇప్పుడు ఓ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. భారీ సైజులో ఊలుతో ఉండే మంచు ఏనుగులు (మమోత్) అంతరించిపోయే ముందు మనుషులతో కలసి నివసించాయని వారి పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు ఉన్న ఇంగ్లండ్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు 12,800 ఏళ్ల క్రితం వరకూ ఇవి సంచరించాయని గతంలో భావించారు. తొలి తరం మానవులు సుమారు 10,500 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో కూడా ఇవి ఇక్కడ ఉన్నాయని ఇప్పుడు నిర్ధారించారు. గతంలో పరిశోధనల్లో.. పశ్చిమ మధ్య ప్రాంతంలో మానవులు వాటిని చంపేశారని చెబుతూ వచ్చారు. అయితే దీనికి భిన్నంగా ఈశాన్య ప్రాంతంలో మమోత్‌లు మానవులతో కలసి చాలాకాలం జీవించాయని డార్ట్ మౌట్ కాలేజీ ప్రొఫెసర్లు చెప్పారు. వెర్మాంట్ ప్రాంతంలో 1848లో దొరికిన మంచు ఏనుగు పక్కటెముకను రేడియో కార్బన్ డేటింగ్, 3డి ప్రక్రియల ద్వారా పరిశీలించి వీరు ఈ విషయాన్ని వెల్లడించారు. పర్యావరణ మార్పులతోనే.. ఈశాన్య ప్రాంతంలో నివసించిన మంచు యుగానికి చెందిన జీవుల్లో మమోత్ ఆఖరిదని పరిశోధకులు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పరిశోధనల్లో మమోత్‌లు అంతరించిపోవడానికి మానవుల వేట కూడా కారణమని నమ్మారు. అయితే అవి కనుమరుగు కావడానికి ఈ ప్రాంతంలో మంచు కరిగిపోవడం కూడా కారణమని తాజా పరిశోధనల్లో తేలింది. మనిషి, మమోత్ కలసి జీవించాయనే విషయం తొలిసారి తెలిసిందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. 18, 19 వేల ఏళ్ల క్రితం నుంచి ఇంగ్లండ్ ప్రాంతంలో మంచు కరగడం ప్రారంభమైందని, కొన్ని వేల ఏళ్ల తర్వాత ప్రస్తుత ఇంగ్లండ్ దేశం ఏర్పడిందని పరిశోధనల్లో కనుగొన్నారు. అంతరించి పోయిన మమోత్ శిలాజాలు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి. అలాంటి వాటిని ఇంగ్లండ్‌లోని పలు మ్యూజియాల్లో భద్రపరిచారు. హుడ్ మ్యూజియంలో ఉన్న ఎముక శిలాజంపై ఆ బృందం పరిశోధనలు చేసింది. మమోత్‌ల గురించి మరిన్ని విషయాలు సుమారు 1,40,000 ఏళ్ల పాటు ఊలీ మమోత్‌లు యూరప్, నార్త్ అమెరికా ప్రాంతంలో నివసించాయి. మంచు యుగాంతంలో అంటే సుమారు 10 వేల ఏళ్ల క్రితం ఇవి అంతరించిపోయాయి. మంచు యుగానికి సంబంధించిన విషయాలు ఈ మమోత్ శిలాజాలతో మనకు తెలుస్తున్నాయి. మమోత్‌లలో మగవి 12 అడుగుల ఎత్తు ఉండేవి. ఆడవి వాటికన్నా కొంచెం చిన్నగా ఉండేవి. వాటి మెలితిరిగిన దంతాలు సుమారు 16 అడుగుల పొడవు ఉండేవి. గడ్డిని తుంచడానికి దంతాల చివర్న రెండు వేళ్లు వంటి అవయవాలు ఉండేవి. వాటికి ఉన్న ఊలు వెంట్రుకలు సుమారు 3 అడుగుల పొడవు ఉండేవి. మమోత్‌లకు చిన్న చెవులు, చిన్న తోక ఉండేది. ఇవి వీటి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోకుండా చూసేవి. ఇప్పటి ఏనుగులకు, అప్పటి మమోత్‌లకు చాలా సారూప్యం ఉందని, 99.4 శాతం జీన్స్ షేరింగ్ ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మాంసం, ఆయుధాల తయారీకి ఊలీ మమోత్‌లను మనుషులు చంపి ఉంటారని భావిస్తున్నారు. -
ఏనుగులకు క్యాన్సర్ రాదా?
మానవ విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్నా, ఆ విజ్ఞానానికి లొంగని మహమ్మారుల్లో క్యాన్సర్ ఒకటి. కేవలం మనిషికే కాకుండా పలు జీవజాతుల్లో క్యాన్సర్ కనిపిస్తుంది. అయితే అత్యంత ఆశ్చర్యకరంగా భూమ్మీద అతిపెద్ద క్షీరదం ఏనుగుల్లో మాత్రం ఈ వ్యాధి చాలా చాలా అరుదు. ఇందుకు కారణం తాజా అధ్యయనాల్లో బయటపడింది. సాధారణంగా జీవి సైజు పెరిగేకొద్దీ అందులో కణజాలం ఎక్కువగా ఉండి, క్యాన్సర్‌కు రిస్కు అధికం అవుతుంది. ఎన్ని ఎక్కువ కణాలుంటే అంత ఎక్కువగా క్యాన్సర్ రావడానికి అవకాశాలుంటాయి. ఆ లెక్కన చూస్తే ఏనుగులే అత్యధికంగా క్యాన్సర్ బారిన పడాలి. కానీ వీటిలో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ విషయంపై యూనివర్సిటీ ఎట్ బుఫాలో ప్రత్యేక అధ్యయనాలు జరిపింది. ఏనుగుల్లో ట్యూమర్(కణితి) అణిచివేత జన్యువులు (టీపీ53 అంటారు) అధికంగా ఉంటాయని, అందువల్ల ఇవన్నీ కలిసి క్యాన్సర్ రెసిస్టెన్స్‌గా పనిచేస్తాయని అధ్యయనం వెల్లడిస్తోంది. ప్రకృతి వరం ఈ జన్యువులు ఇతర జీవుల్లో కూడా ఉంటాయి, కానీ ఏనుగుల్లో వీటి రిప్లికేషన్ (ప్రతికృతి) అధికంగా జరుగుతుంటుంది, అందువల్ల ఈ జన్యువులు అధికసంఖ్యలో ఏనుగుల్లో కనిపిస్తాయి. ఇందుకు పరిణామక్రమంలో భాగంగా ఏనుగులు భారీ శరీరాకృతి కలిగి ఉండడమే కారణమని, ఈ భారీ శరీరాన్ని సమతుల్యం చేసేందుకే ప్రకృతి ఏనుగుల్లో ట్యూమర్ రిప్రెసింగ్ జీన్స్ అధిక సంఖ్యలో ఉంచిందని అధ్యయనం వివరిస్తోంది. దీర్ఘ జీవిత కాలం గడిపే జీవుల్లో ఉత్పరివర్తనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీటిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా అధికం. ఏనుగులు సాధారణంగా దీర్ఘకాలం జీవిస్తాయి. అలాగే వీటి శరీర పరిమాణం కూడా పెద్దది. ఈ రెండు కారణాలు క్యాన్సర్ వచ్చేందుకు కారణాలు కనుక ప్రకృతి ప్రత్యేక జీన్స్‌ను ఇవ్వడం ద్వారా ఏనుగులను క్యాన్సర్ బారినుంచి రక్షించింది. ఈ పరిశోధనను క్యాన్సర్ ట్రీట్మెంట్లో వినియోగించుకొని ఈ మహమ్మారిని అరికట్టేందుకు యత్నించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చదవండి: చిరంజీవి ఫోన్ చేశారు చదవండి: ప్రేమికుల రోజు: భార్యకు కిడ్నీ కానుక -
వాలెంటైన్స్ డే: ఏనుగులపై ఊరేగుతూ పెళ్లిళ్లు..
బ్యాంకాక్ : ప్రేమికుల రోజును ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జరుపుకుంటుంటారు. కొన్ని చోట్ల వేడుకలు జరుపుకునే తీరు చాలా వింతగా విచిత్రంగా అనిపిస్తుంది. థాయ్‌లాండ్‌లోని ఓ ప్రాంతంలో ప్రేమికుల రోజున ఏనుగులపై జరిగే సామూహిక పెళ్లిళ్ల వేడుక కూడా అలాంటిదే. వివరాలు.. బ్యాంకాక్‌లోని ‘నాన్ నూప్ ట్రోపికల్ గార్డెన్’లో ప్రతీ ఏటా వాలెంటైన్స్ సందర్భంగా ఏనుగులపై సామూహిక వివాహాలు చేయటం ఆనవాయితీ. ఈ ఆదివారం ప్రేమికుల రోజున కూడా నాంగ్ నూచ్ ట్రోపికల్ గార్డెన్లో సామూహిక వివాహాలు జరిగాయి. మామూలు సమయంలో 100 జంటల దాకా ఈ కార్యక్రమంలో పాల్గొనేవి. ( ఫీల్ మై లవ్.. ఆన్లైన్ లవ్ జాతకం ) కానీ, కరోనా వైరస్ కారణంగా 50 జంటలు మాత్రమే ఇందులో పాల్గొన్నాయి. 100 మంది వధూవరులు ఏనుగులపై ఊరేగుతూ పెళ్లి చేసుకున్నారు. గార్డెన్ అధికారులు వీరికి మ్యారెజ్ సర్టిఫికేట్లు అందజేశారు. పెళ్లి వేడుక సందర్భంగా ఏనుగుపై ఊరేగుతూ.. పటిఫట్ పాథనాన్ అనే పెళ్లి కుమారుడు మాట్లాడాడు. ‘‘ ఈ వేడుకలో పాల్గొని పెళ్లి చేసుకోవాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నాను. ఇది కచ్చితంగా అద్భుతంగా ఉండబోతోంది’’ అని పేర్కొన్నాడు. -
గజరాజుల పిక్నిక్: ఎక్కడికంటే?
సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని ఆలయాలు, మఠాలకు చెందిన గజరాజులన్నీ పిక్నిక్కు వెళ్లాయి. వీటి కోసం భవానీనది తీరంలో పునరావాస కేంద్రం ఏర్పాటైంది. 26 ఏనుగులు ఆ నదీ తీరంలో 48 రోజుల పాటు సేద తీరనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు గజరాజులు అంటే మక్కువ. ముఖ్య ఆలయాలకు వెళ్లినప్పుడు ఓ ఏనుగును విరాళంగా సమర్పించేవారు. వన్య ప్రాణులకూ మానసికోల్లాసం అవసరమని చెబుతుండేవారు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా గజరాజుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేయించి, అక్కడ అవి సేద తీరే దిశగా చర్యలు తీసుకునేవారు. పునరావాసం.. జయలలిత మరణం తర్వాత కూడా అన్నాడీఎంకే ప్రభుత్వం పునరావస శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఈసారి ఏనుగులకు కరోనా పరీక్షలు చేయించి మరీ పిక్నిక్కు తీసుకెళ్లారు. తేక్కంపట్టి భవానీ నది తీరంలో ఏనుగులు ఉల్లాసంగా గడిపే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం వేకువజామున 4.30 గంటలకు పునరావాస కేంద్రంలో ప్రత్యేక యాగాది పూజలు జరిగాయి. అనంతరం వినాయకుడి ఆలయంలో జరిగిన పూజలతో గజరాజులు శిబిరంలోకి ప్రవేశించాయి. వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు అటవీశాఖమంత్రి దిండుగల్ శ్రీనివాసన్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో శిబిరం ప్రారంభమైంది. నెలన్నర పాటు ఏనుగులు ఇక్కడ సేదతీరనున్నాయి. చదవండి: భారీ బెలూన్‌తో నింగికి శాటిలైట్లు -
ఆరేళ్లలో 471 ఏనుగులు మృతి
సాక్షి, బెంగళూరు: తమిళనాడులోని మదుమలైలో ఏనుగుకు నిప్పు పెట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా గజరాజులకు ప్రాణాపాయం పొంచి ఉందన్న చర్చ మొదలైంది. గజరాజులకు పుట్టినిల్లు వంటి కర్ణాటక వ్యాప్తంగా ఆరేళ్ల కాలంలో సుమారు 78 ఏనుగులు మానవుల అకృత్యాలకు బలి అయినట్లు తెలుస్తోంది. ఇందులో క్రిమిసంహార మందు పెట్టడం, కరెంటు షాక్‌లు, తుపాకులతో కాల్చడం వంటి ఘటనలు ఉన్నాయి. ఆరేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 471 ఏనుగులు మరణించగా, అందులో 393 సహజ మరణాలు, 78 అసహజ మరణాలుగా గుర్తించారు. పంటలపై ఏనుగులు దాడి చేస్తున్నాయని రైతులు వాటిని హతమార్చడానికి కూడా వెనుకాడడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో.. అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చిన ఏనుగులు, మంద నుంచి విడిపోయిన ఏనుగులు దారి తప్పి జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాల్లో ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. కొన్నిసార్లు రైలుపట్టాలపై రైళ్లు తగిలి చనిపోతున్నాయి. సహజ మరణాలకు ఏనుగుల మధ్య గొడవలు, సంగమ సమయంలో ఆడవాటిపై మగ ఏనుగుల దౌర్జన్యం, వృద్ధాప్యం వంటివి ప్రధాన కారణాలు. కర్ణాటకలో ఆరేళ్లలో ఏనుగుల మరణాలు 2014–15 మధ్య కాలంలో 77 ఏనుగులు సహజంగా మరణించగా.. మరో 18 మానవ తప్పిదాలకు బలి అయ్యాయి. 2015–16 కాలంలో 59 ఏనుగులు మరణించగా.. మరో 15 అసహజ మరణాలుగా నమోదు చేశారు. 2016–17 మధ్య కాలంలో 90 ఏనుగులు సహజంగా మరణించగా.. మరో 10 మానవ అకృత్యాలకు బలి అయ్యాయి. 2017–18 మధ్యలో 67 ఏనుగులు సాధారణంగా మరణించాయి. మరో 11 ఏనుగులు అసహజంగా చనిపోయాయి. 2018–19 మధ్య కాలంలో 59 ఏనుగులు సహజంగా.. 15 ఏనుగులు అసహజరంగా మరణించాయి. 2019–20 కాలంలో 41 ఏనుగులు మామూలుగా మరణించాయి. మరో 9 ఏనుగులు ఇతర కారణాలతో ప్రాణాలు వదిలాయి. విద్యుత్ కంచెలతో ముప్పు రైతులు పంటలను కాపాడుకోవాలని పొలాలు, తోటల్లో విద్యుత్ కంచెలు వేస్తున్నారు. అవి అవి తగిలి ఏనుగులు మరణిస్తున్నాయి. విద్యుత్ షాక్, తూటాల దెబ్బకు ప్రతి ఏటా సరాసరి 12 ఏనుగులు నేలకొరుగుతున్నాయి. కాల్పుల్లో చనిపోతేనే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇతర మరణాలను పట్టించుకోవడం లేదు. కాల్పుల కేసుల్లో కూడా దుండగులకు శిక్ష పడిన దాఖలాలు లేవు. -
బెడిసి కొట్టిన ఏనుగు దంతాల విక్రయం
భువనేశ్వర్/సంబల్పూర్: ఏనుగు దంతాల విక్రయం డీల్ బెడిసి కొట్టింది. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను ప్రత్యేక టాస్కు ఫోర్సు(ఎస్టీఎఫ్) అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి 2 ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం సంబల్పూర్ ఒంయిఠాపల్లి ఠాణా బొరెయిపా లి ప్రాంతంలో ఆకస్మికంగా దాడి చేయగా.. హృషీకేష్ కుంభార్, గోపాలకృష్ణ బుడొకొని వీటితో చిక్కారు. నిందితులను అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
పరిగెత్తండిరా!.. శబ్ధం చేయకండయ్యా!!
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో ఏనుగుల గుంపు కలకలం రేపింది. పదుల సంఖ్యలో ఏనుగులు పంట పొలాల్లోకి రావటంతో జనాలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఏనుగుల కారణంగా పలు చోట్ల అరటి తోటలు నాశనమయ్యాయి. గంగాధర నెల్లూరు మండలం కోట్రకోనలో అరటి, మామిడి పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులు తరుచుగా తమ పంటపొలాలపై దాడులు చేస్తుండటంతో బాధిత రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం ఏనుగుల గుంపునకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ( ఏనుగు వస్తే సైరన్ మోగుతుంది!) ఓ వీడియోలో.. తమిళ గ్రామంలోని ఓ అరటి తోటలో పదుల సంఖ్యలో ఏనుగులు వెళుతున్నాయి. దూరంగా ఉన్న జనం వాటిని చూస్తూ.. ‘‘పరిగెత్తండిరా!.. పరిగెత్తండి!!. శబ్ధం చేయకండయ్యా!.. గమ్మునుండండయ్యా.. ఏయ్ గమ్మునుండండి.. కుత్తు అరటి తోటలో ఏనుగులు పడ్డాయయ్యోయ్!!’’ అంటూ అరుస్తూ ఉన్నారు. 30 సెకన్ల ఈ వీడియోలో భారీ ఏనుగుల గుంపును మనం చూడొచ్చు. -
ఏనుగును ఈడ్చుకెళ్లిన రైలు ఇంజన్ సీజ్
గువహతి : పట్టాలు దాటుతున్న తల్లి ఏనుగును, పిల్ల ఏనుగును ఢీకొట్టడమే కాకుండా పిల్ల ఏనుగును దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లిందో గూడ్సు రైలు. ఆ రెండు ఏనుగులు మృత్యువాత పడిన ఈ ఘటనలో గూడ్సు రైలు ఇంజన్‌ను సీజ్ చేశారు అస్సాం అటవీ శాఖ అధికారులు. వివరాల్లోకి వెళితే.. గత సెప్టెంబర్ 27న అస్సాం లుండింగ్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతున్న 35 ఏళ్ల ఓ ఏనుగును దాని పిల్లను నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు చెందిన ఓ గూడ్సు రైలు ఢీకొంది. దీంతో తల్లి ఏనుగు పైకి ఎగిరి పక్కకు పడిపోయింది. పిల్ల ఏనుగు పట్టాలపై పడిపోగా.. రైలు దాన్ని ఒక కిలోమీటరు వరకు ఈడ్చుకెళ్లింది. ఆ రెండు ఏనుగుల మృత్యువాతపై అస్సాం అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ( పీల్చే గాలి విషం ) రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అతి వేగంగా వెళ్ల కూడదన్న నిబంధనలను సదరు రైలు అతిక్రమించిందని అటవీ అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా గత మంగళవారం నాడు గువహతి బామునిమైదాన్ రైల్వే యార్డ్‌లో సదరు రైలు ఇంజన్‌ను సీజ్ చేశారు. దాని ఇద్దరు లోకో పైలట్లను సస్పెండ్ చేశారు. దానిపై కేసు నమోదు చేసిన తర్వాత రైల్వే శాఖకు అప్పగించారు. దీనిపై స్పందించిన నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే ‘‘ రైలు ఇంజన్‌ను సీజ్ చేయటం ఇది మొదటి సారేమీ కాదు. విచారణలో భాగంగా ఇంజన్‌ను సీజ్ చేశారు. ప్రస్తుతం ఆ రైలు ఇంజన్ వాడకంలోనే ఉంద’’ని తెలిపారు. -
ఈ ఏడాది దాదాపు 300 ఏనుగులు మృతి
బోట్స్వానా : నీటిలోని సైనోబాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్స్ వల్ల ఈ ఏడాది దాదాపు 300 ఏనుగులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వరుసగా ఏనుగులు చనిపోతుండటంపై విచరణ చేపట్టిన దర్యాప్తు సంస్థ ఈ మేరకు షాకింగ్ విషయాలను వెల్లడించింది. సాధారణంగా సైనోబాక్టీరియా అనేది నీటిలో, మట్టిలోనూ ఉండే సూక్షజీవి. వీటి వల్ల ప్రమాదం లేకపోయినా వాతావరణ మార్పుల వల్ల విషతుల్యం అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అత్యధిక ఉష్ణోగ్రత వల్ల ఈ సూక్ష్మజీవులు విషంగా మారాయని, ఈ నీళ్లు తాగడంతో ఏనుగులు చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మే నెల ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటిదాకా 330 ఏనుగులు చనిపోయినట్లు జాతీయ వన్యప్రాణి, ఉద్యానవనాల డిప్యూటీ డైరెక్టర్ సిరిల్ టావోలో పేర్కొన్నారు. వీటిలో అత్యధికంగా జూలై మాసంలోనే 281 ఏనుగులు చనిపోయినట్లు తెలిపారు. (అరుదైన మగ కప్పల భీకర పోరు ) అయితే మిగతా వన్యప్రాణులకు సైతం ఈ పరిస్థితి ముప్పుగా మారుతుందనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఎందుకంటే ఈ టాక్సాన్స్ వల్ల ఇప్పటివరకు ఏనుగులు మాత్రమే చనిపోయాయి. మిగతా జంతువులన్నీ క్షేమంగానే ఉన్నాయి. కాబట్టి పరిస్థితుల్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఏనుగల జనాభా అధికంగా ఉండే ఆఫ్రికాలో మూడింట ఒకవంతు ఏనుగులు బోట్స్వానాలో ఉంది. ఇక దక్షిణాఫ్రికాలో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు ఎక్కువ. పొరుగున ఉన్న జింబాబ్వేలోని అతిపెద్ద గేమ్ పార్క్ సమీపంలో సుమారు 25 ఏనుగులు చనిపోయాయి. అయితే బొట్స్వానా ఘటనతో దీన్ని లింక్ చేయలేమని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి ఏనుగు మృతదేహాలను పరిశీంచాకే నీటిలోని టాక్సిన్ వల్ల చనిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కాకపోతే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగానే ఇవి మృత్యువాత పడి ఉండొచ్చేమో అని విక్టోరియా ఫాల్స్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌లోని పశువైద్యుడు క్రిస్ ఫాగ్గిన్ అన్నారు. (ట్రంప్ వైపు ఇండియన్ అమెరికన్లు మొగ్గు) -
తొక్కి పడేస్తున్నాయ్..!
ఎల్.ఎన్.పేట: మండలంలోని జంబాడ, ఇరుకురాయిగూడ, సూదిరాయిగూడ గిరిజన గ్రామాల సమీపంలో నాలుగు ఏనుగుల గుంపు నాలుగు రోజులుగా సంచరిస్తున్నాయి. పగలంతా సమీపంలోని కొండల్లో ఉంటూ సాయంత్రానికి దిగువ ప్రాంతానికి వచ్చి పంట పొలాలను తొక్కి నాశనం చేస్తున్నాయని బాధిత రైతులు పాలక చిన్నవాడు, ఉయ్యక వైకుంఠరావు, నిమ్మక నూకరాజు, పాలక మల్లేశ్వరావు, నిమ్మక లక్ష్మణరావు, కోలక రాములమ్మ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని వాపోయారు. జంబాడ సమీపంలోని ఎర్రచెరువు లోపల ఉన్న కొండలు, అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు తిష్ట వేస్తున్నాయని స్థానికులు చెపుతున్నారు. పైడి మంజులకు చెందిన మామిడి తోటలోకి వెళ్లిన ఏనుగుల గుంపు కొమ్మలు విరిచేయటంతో పాటు నీలగిరి మొక్కలను కాలితో తొక్కినాశనం చేశాయి. నాలుగైదేళ్లుగా ప్రతిసారీ వరిచేను నాట్లు వేసిన తరువాత, కోత సమయానికి ఏనుగులు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏనుగుల గుంపు గిరిజన గ్రామాల్లోకి వెళ్లకుండా ట్రాకర్లతో కాపలా ఏర్పాటు చేశామని అటవీశాఖ సరుబుజ్జిలి సెక్షన్ అధికారి సాయిరాం మహాపాత్రో చెప్పారు. పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగులను దారి మళ్లించి కొండల్లోకి వెళ్లేలా చేస్తున్నామన్నారు. గిరిజన రైతులను అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టం లేకుండా అటవీశాఖ ఉద్యోగులు, ట్రాకర్లు నిరంతరం ఏనుగులు కదలికలను గమనిస్తున్నారని తెలిపారు. -
ఆ ఏనుగులకు గంజాయి.. ఎందుకంటే?..
వార్సా : పోలాండ్, వార్సా జూలోని ఏనుగుల ఒత్తిడిని తగ్గించటానికి ఓ వినూత్న పద్ధతిని ఎంచుకోబోతున్నారు జూ అధికారులు. వాటికి వైద్యపరమైన గంజాయిని ఇవ్వనున్నారు. జూలోని మూడు ఆఫ్రికన్ ఏనుగులకు ద్రవ రూపంలోని అధిక సాంద్రత కలిగిన రిలాక్సింగ్ కెన్నిబినాయిడ్‌ను తొండాల ద్వారా అందించనున్నారు. ఆఫ్రికన్ ఏనుగులపై ఇలాంటి పరిశోధనలు చేయటం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఓ పశు వైద్యాధికారి మాట్లాడుతూ.. వైద్య పరమైన గంజాయి ఏనుగుల ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం చూపదని స్పష్టం చేశారు. ఇది ఏనుగుల ఒత్తిడిని తగ్గించటానికి ఓ సహజ సిద్ధమైన పద్దతిని వెతుక్కునే ప్రయత్నమని చెప్పారు. ( 80 ఏళ్లుగా జుట్టు కత్తిరించలేదు..!) కాగా, గత మార్చి నెలలో జూలోని ఆడ ఏనుగు ఎర్నా చనిపోవటంతో గుంపులోని ఫ్రెడ్జియా అనే మరో ఆడ ఏనుగు అప్పటినుంచి ఒత్తిడికి లోనవుతోంది. అంతేకాకుండా తోటి ఆడ ఏనుగులతో కూడా సఖ్యంగా ఉండటం లేదు. గుంపులోని పెద్ద చనిపోయినపుడు మిగిలిన ఏనుగులు ఆ బాధనుంచి బయటపడటానికి కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చని పరిశోధనల్లో తేలింది. మామూలుగా వైద్యపరమైన గంజాయిని కుక్కలు, గుర్రాలకు చికిత్స చేయటానికి ఉపయోగిస్తుంటారు. -
ఏనుగుల మావటి షబ్నా సులైమాన్
దేశమంతా గణనాథుడు కొలువై ఉండే రోజులివి. నిమజ్జనం వరకూ వినాయకుడి వేడుకలే. ఏనుగు ఆయన ప్రతిరూపం. వినాయకుణ్ణి సృష్టించిన పార్వతి శక్తి స్వరూపం. కాని– ఏనుగుల మావటీలు ఎప్పుడూ మగవారే. దేశంలో ఒకరిద్దరు మహిళా మావటీలు ఉన్నారు. కాని ముస్లిం మావటి మాత్రం షబ్నా సులైమానే. ఏనుగులతో ఆమె స్నేహం వినూత్నం. విశేషం. గౌహతికి చెందిన పార్బతి (65) భారతదేశంలో తొలి మహిళా మావటి. 14 ఏళ్ల వయసు నుంచే ఆమె ఏనుగులను అదుపు చేయడం నేర్చుకుంది. గౌహతిలో డిగ్రీ చదువుకుని, ఒక బ్యాంకు అధికారిని పెళ్లి చేసుకుని పిల్లల సంరక్షణ చూసుకునే తల్లిగా ఉంటున్నా ఆమె ఏనుగులతో తన అనుబంధాన్ని మానుకోలేదు. చాలా కాలం అడవుల్లోనే ఉండటానికి ఇష్టపడుతుంది. వెంట తన కుమార్తెలను కూడా తీసుకెళుతుంది. కీకారణ్యాల్లో ఏనుగును ఎక్కి షికారు చేస్తుంది. అందుకే ఆమెను ‘ఏనుగుల రాకుమారి’ అని ఆ ప్రాంతంలో పిలుస్తారు. కేరళ సంగతి వేరు. అక్కడ కూడా ఏనుగులే. కాని మావటీలు వందశాతం పురుషులే. చాలా అరుదుగా ఒకరిద్దరు మహిళా మావటీలు ఉన్నారు. అయితే షబ్నా సులైమాన్ మాత్రం అక్కడ విశేషంగా వార్తలు సృష్టించింది. దానికి కారణం దుబాయ్‌లో మంచి ఉద్యోగం చేస్తూ కూడా ఏనుగుల సారధిగా ఉండటానికి ఈ సంవత్సరం మొదలులో కేరళ వచ్చి దానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవడమే. పుస్తకం రాద్దామని బయలుదేరి 27 ఏళ్ల షబ్నా సులైమాన్ది కేరళలోని కొజికోడ్ సమీపాన కడలుండి. దుబాయ్‌లో వైద్య సిబ్బంది విధులతో ఉపాధి పొందుతున్న షబ్నాకు ఏనుగుల మీద ఒక పుస్తకం రాయాలనిపించింది. వెంటనే ఏనుగులకు సంబంధించిన పుస్తకాలు చదవడం మొదలెట్టింది. కాని అంధులకు స్పర్శ ద్వారా ఏనుగు పూర్తి స్వరూపం ఎలా అర్థం కాదో దూరంగా ఉండి పుస్తకాలను చదవడం ద్వారా కూడా ఏనుగుల గురించి ఏమీ అర్థం కాదని షబ్నాకు అనిపించింది. కేరళ వెళ్లి మావటీగా తర్ఫీదు పొందడమే దీనికి సరైన మార్గం అని నిశ్చయించుకుంది. అయితే మావటి కావడం అంత సులువా? కుటుంబం మద్దతు షబ్నా నిర్ణయం విని కుటుంబం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే షబ్నా వాళ్ల తాతకు ‘గ్రేట్ మలబార్ సర్కస్’ పేరుతో సర్కస్ కంపెనీ ఉండేది. ఇది కేరళలో తొలి సర్కస్. అయితే షబ్నా వాళ్ల చిన్నాన్నను సర్కస్‌లోని పులి పొరపాటున చంపేయడంతో మనసు విరిగిన తాత సర్కస్‌ను అమ్మేశాడు. కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయినా ఆ కుటుంబానికి మూగ జీవాల పట్ల ప్రేమ పోలేదు. మావటీగా ఏనుగుల సారథ్యాన్ని నేర్చుకుంటానని షబ్నా చెప్పినప్పుడు తండ్రి సులైమాన్ అంగీకరించారు. అయితే ముస్లిం కుటుంబం నుంచి ఒక మహిళ ఇలా మావటి పని నేర్చుకోవడాన్ని ఎలా చూడాలో ఒకరిద్దరు మత పెద్దలకు వెంటనే అర్థం కాలేదు. ‘మనమ్మాయికి ఇది అవసరమా’ అని అడిగారు. వారికి కుటుంబం సర్ది చెప్పింది. మావటీ పని నేర్చుకోవడానికి పచ్చజెండా ఊపింది. గురు హరిదాస్ దగ్గర... ప్రతి చదువుకీ ఒక ప్రత్యేకమైన స్కూల్ ఉన్నట్టే మావటీ విద్యకు కూడా కేరళలో ప్రత్యేకమైన ఆస్థానాలు ఉన్నాయి. పాలక్కాడ్‌లోని ఒట్టపాలెంటలో మానిశ్శేరి హరిదాస్ మావటీల గురువు. అతని సొంతానికి మూడు ఏనుగులు ఉన్నాయి. దేవాలయ ఉత్సవాలకు వాటిని అద్దెకు తిప్పుతుంటాడు. షబ్నా అతడిని కలిసి మావటీ విద్య నేర్పమని చెప్పింది. అలా ఒక మహిళ అందునా ముస్లిం మహిళ వచ్చి అతణ్ణి ఎప్పుడూ అడగలేదు.‘ఇది ఆడవాళ్లకు అంత సులువుగా అబ్బే విద్య కాదు. అయినా చూద్దాం’ అని అతడు నిరాకరించక తన ఏనుగుల్లోని రాజేంద్రన్ అనే ఏనుగును ఆమెకు అప్పజెప్పాడు. అంతే కాదు మూడు దశల్లో ఉండే మావటీ విద్యను బోధించడం మొదలుపెట్టాడు. షబ్నా కేవలం ఐదడుగుల ఎత్తు ఉంటుంది. కాని నెల రోజుల మొదటి దశలోనే ఆమె రాజేంద్రన్‌ను తన అదుపులోకి తీసుకోగలిగింది. కూర్చోమన్నప్పుడు కూర్చునేలా చేయడం, వెనక్కు తిరగమన్నప్పుడు వెనక్కు తిరిగేలా చేయడం, తొండం ఎత్తమన్నప్పుడు తొండం ఎత్తేలా చేయడం మావటీ సామర్థ్యానికి గుర్తు. రాజేంద్రన్ ఈ మూడు కమేండ్స్ను షబ్నా దగ్గర స్వీకరిస్తోంది. చేసి చూపిస్తోంది. పెరిగిన డిమాండ్ షబ్నా మావటీ విద్యను అభ్యసిస్తోంది అని ఆ నోటా ఈ నోటా కేరళ దేవాలయాలకు తెలిశాక దేవాలయ ఉత్సవాలకు రాజేంద్రన్‌ను, మావటీగా షబ్నాను పిలవాలని నిశ్చయించుకున్నారు. వీరిరువురు ప్రత్యేక ఆకర్షణ కాగలరని వారి భావన. ‘దేవాలయ ఉత్సవాల్లో అంత సమూహం మధ్య ఏనుగును కంట్రోల్ చేయడమే ఏ మావటీకైనా సవాల్. ఆ సవాల్‌ను ఎదుర్కొనగలననే అనుకుంటున్నాను’ అని షబ్నా అంది. ఈ కరోనా రాకపోయి ఉంటే ఈసరికి మనం దేవాలయ ఉత్సవాల్లో షబ్నా ఏనుగు మీద కూచుని ఉన్న ఫొటోను చూసి ఉండేవాళ్లం. కనీసం ఈ వినాయ చవితి వేడుకల్లో అయినా చూసి ఉండేవాళ్లం. ఈ సంవత్సరం కరోనాకు వదిలిపెట్టిన వచ్చే సంవత్సరం షబ్నాదే. – సాక్షి ఫ్యామిలీ భారతదేశ తొలి మహిళా మావటి అస్సాంకు చెందిన పార్బతి -
వైరల్: ఇందులో నాలుగు ఏనుగులు.. కాదు!
మెదడుకు పని చెప్పే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఏనుగుల కుటుంబం కలిసి ఓ నది వద్ద నీళ్లు తాగుతున్న వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. అంతలా ఇందులో ఏముంది అని ఆశ్చర్యపోతున్నారా. ఏనుగుల ఫోటో చూసి అందులో ఎన్ని ఏనుగులు ఉన్నాయో గుర్తు పట్టాలి. ఫోటో చూసి నాలుగే ఏనుగులు ఉన్నాయి కదా అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అసలు ఇందులో ఎన్ని ఏనుగులు ఉన్నాయో తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియో పూర్తి అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. (వైరల్: రెండు ఏనుగులు ప్రేమతో సరదాగా..) ఈ వీడియోను వైల్డ్లైన్స్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. 70 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో నాలుగు ఏనుగులు నదిలో నీటిని తాగడం కనిపిస్తుంది. ఆ తర్వాత పెద్ద ఏనుగులు కదులుతుండటంతో వాటి వెనకాల మరి కొన్ని చిన్న ఏనుగులు బయటకు వస్తుండంటంతో ఏనుగుల సంఖ్య పెరుగుతుంది. అలా చివరికి 7 ఏనుగులు అవుతాయి. నమ్మకం లేకుంటే మరి నిజంగా ఈ వీడియోలో గజరాజులు ఎన్ని ఉన్నాయో మీరు కూడా కనుక్కోండి. (వైరల్: బిడ్డ ప్రాణాలు కాపాడిన తల్లి ఏనుగు) Few days back we have posted this image as 7in1 Frame, now watch carefully till the end how this is 7in1 frame. #Elephant Love. #wildlense.@susantananda3 @ParveenKaswan @SudhaRamenIFS @Saket_Badola https://t.co/rvdXnGohrT pic.twitter.com/sN7Y9ag4me — WildLense® (@WildLense_India) July 30, 2020 -
వైరల్: రెండు ఏనుగులు ప్రేమతో సరదాగా..
రెండు భారీ ఏనుగులు సరదాగా పోట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ‘షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్’ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘జసిరి, ఫరాజా అనే రెండు అనాథ ఎనుగులు కెన్యాలోని అంబోసేలి ప్రాంతం నుంచి రక్షించబడ్డాయి. ఈ రెండు ఏనుగులు గుర్రపు ఆటను ఇష్టపడతాయి. మా సంరక్షణలో ఉన్న ఇతర ఏనుగుల వలే కాకుండా ముదురు బూడిద రంగు చర్మంతో ఉన్నాయి. ఈ రెండు ఏనుగులు తెలికపాటి చర్మంతో పాటు రాగి తోక జుట్టు, వెంట్రులు కలిగి ఉన్నాయి. ఇవి ఎప్పుడూ ఒకదాన్ని ఒకటి పోట్లాడుకుంటూ సరదాగా బురదలో ఆడుకుంటాయి’ అని కామెంట్ జతచేసింది. ఈ వీడియోను ట్విటర్లో 8 వేల మంది వీక్షించగా, 1500మంది లైక్ చేశారు. ఏనుగులు ఆడుకుంటున్న ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యంగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇది ఆద్భుతమైన వీడియో’, ‘రెండు ఏనుగులను చూస్తే చాలా సరదా ఉంది’, ‘అవి ఒకదానిపై ఒకటి ప్రేమతో సరదాగా ఆడుకుంటున్నాయి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ కెన్యాలోని అనాధ ఏనుగుల రక్షణ, వన్యప్రాణుల పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. -
వైరల్: బిడ్డ ప్రాణాలు కాపాడిన తల్లి ఏనుగు
ఏనుగులకు సంబంధించిన ఘటనలు తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఏనుగుల అల్లరి, మంచితనంతో మనల్ని కట్టిపడేసే వీడియోలు నిత్యం కంటపడుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి గజరాజుల సాహస దృశ్యాలు దర్శనమిచ్చాయి. ఈ వీడియో ద్వారా తమ వారికి ఆపద ఎదురైతే మనుషులే కాదు ఏ మూగ జీవి అయినా ప్రాణాలకు తెగించి కాపాడుకుంటుందనే వాస్తవాన్ని రుజువు చేసింది. ఈ ఘటన భూటాన్ సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. (వైరల్: జలకాలాటల్లో ఏమీ హాయిలే..) ఈ వీడియోలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన ఓ పిల్ల ఏనుగును కాపాడేందుకు తల్లి ఏనుగు, మరో ఏనుగు ప్రయత్రం చేస్తున్నాయి. ‘ఏనుగుల కుటుంబ బంధం చాలా బలమైనది. తల్లి, ఆంటీలిద్దరూ కలిసి పిల్ల ఏనుగురు నది నుంచి కాపాడేందుకు సాయం చేస్తున్నాయి’. అని ఈ వీడియోను భారత అటవీశాఖ అధికారి సుశాంత్ నందా తన ట్విటర్ ఖాతాలో ఆదివారం షేర్ చేశారు. 29 సెకన్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఎంతో మంది వీక్షించగా అనేకమంది కామెంట్లు చేస్తున్నారు. తల్లి ఏనుగును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. (ఛత్తీస్‌గడ్‌లో మరో రెండు ఏనుగులు మృతి) Elephants have one of the strongest family bonding. Mother & aunty helping the calf to get out from the swirling river. Near Bhutan boarder. Shared by @bikash63.. pic.twitter.com/4Qh6SXpiYM — Susanta Nanda IFS (@susantananda3) July 26, 2020 -
అందుకే కోట్ల ఆస్తి ఆ ఏనుగులకు రాశా!
పాట్నా : తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు ఏనుగుల పేరిట ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని రాసేశాడో వ్యక్తి. ఈ సంఘటన బిహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫుల్వారీషరీఫ్, జానిపుర్ గ్రామానికి చెందిన అక్తర్ ఇమామ్‌కి చిన్నప్పటినుంచి ఏనుగులంటే ప్రాణం. అందుకే 12 ఏళ్ల వయసునుంచే వాటిని సంరక్షించటం మొదలు పెట్టాడు. 15 ఏళ్ల క్రితం ‘ఐరావత్’ పేరిట ఓ ఎన్జీఓ సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం అతడి దగ్గర మోతీ, రాణి అనే రెండు ఏనుగులు ఉన్నాయి. వాటి పేర దాదాపు ఐదు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని వీలునామా రాసేశారు ఇమామ్. వాటికి ఎలాంటి హానీ కలగకుండా ప్రాణపదంగా చూసుకుంటున్నారు. ( సింహం ఘటనపై దేశాధ్యక్షుడి ఆగ్రహం! ) ఇమామ్ మాట్లాడుతూ.. ‘‘ నేను ఏనుగుల పేరిట కోట్ల ఆస్తి రాయటం పిచ్చి నిర్ణయం కాదు. మోతీ,రాణిలు నా ప్రాణాలు కాపాడాయి. అవే నా నిజమైన కుటుంబం. వాటిని సంరక్షించటం నా కెంతో ఇష్టం. నా ప్రాణాలకు ప్రస్తుతం ప్రమాదం ఉంది. వేటగాళ్లు, ఏనుగుల స్వగ్లర్ల నుంచి ముప్పు ఉంది. అందుకే నా ఆస్తిని వాటి పేరిట రాసేశాను. నేను చనిపోయినా అవి సంతోషంగా బ్రతుకుతాయి. అవి చనిపోయిన తర్వాత నా కుటుంబానికి కూడా ఆ ఆస్తి చెందదు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్జీఓకు బదిలీ అవుతుంది. నేను ఇదివరకే నాకు చెందిన పెద్దల ఆస్తిలో నా అక్కాచెల్లెళ్లకు, మాజీ భార్యకు, ముగ్గురు కుమారులకు వాటా పంచాను’’ అన్నారు. ( ఏనుగు మృతి: ప్రమాదవశాత్తూ జరిగిందేమో! ) అలా నా ప్రాణాలు కాపాడాయి కొన్ని సంవత్సరాల క్రితం ఓ పనిమీద ఆరా సిటీకి వెళ్లాను. మోతీని కూడా వెంటతీసుకెళ్లాను. అర్థరాత్రి నేను గదిలో నిద్రలో ఉండగా మోతీ అరుపులు వినిపించాయి. వెంటనే కిటికీలోంచి బయటకు చూశాను. సంకెళ్లు తెంచుకున్న మోతీ తుపాకులతో ఉన్న దుండగులను తరుముతోంది. -
క్రూర మానవులు!
-
ఆడితే ఆడావు.. వాటిపై కాలు మాత్రం పెట్టకు
ముంబై : సాధారణంగా మనం చూసే కొన్ని వీడియోలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. కొన్ని జంతువులు జాతి వైరం లేకుండా ఇతర జంతువులతో,పక్షులతో హాయిగా గడిపేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు ఇప్పటికే చాలా చూశాం. తాజాగా ఏనుగులు గుంపులోని ఒక గున్న ఏనుగు కొంగలతో ఆడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. మొత్తం 14 సెకెన్ల నిడివి ఉన్న వీడియోలో పంటచేపులో పెద్ద ఏనుగులు మేత మేస్తుండగా అక్కడే ఉన్న గున్న ఏనుగు మాత్రం కొంగలను ఆటపట్టిస్తూ గడిపింది. కొంగలను తరుముతూ అవి ఎక్కడికి వెళితే వాటి వెనకాలే గున్న ఏనుగు పరుగులు పెట్టింది. అక్కడే ఉన్న గున్న ఏనుగు తల్లి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియోనూ ఐఎఫ్ఎస్ అధికారి సుషాంత్ నందా తన ట్విటర్లో షేర్ చేశారు.' ఆనందం అనేది దేవుడు నిర్ణయిస్తాడు. మనం దానిని ఎంజాయ్ చేస్తూ పోవాల్సిందే' అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు 8వేల మంది వీక్షించగా వేల సంఖ్యలో రీట్వీట్స్ వచ్చాయి. ' చూడడానికి చాలా క్యూట్‌గా ఉన్నావు.. కానీ వాటి మీద అడుగు పడకుండా చూసుకో' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (టిక్‌టాక్‌ను ఉతికారేసిన వీడియో ట్రెండింగ్) -
కౌండిన్యలో గజరాజులు కనుమరుగు!
కౌండిన్య అటవీ సమీప గ్రామాల ప్రజలకు, పొలాల్లోకి వచ్చే ఏనుగులకు దినదినగండగా మారింది. ఏనుగుల కారణంగా రైతులు ప్రాణాలు, పంటలను కోల్పోయే పరిస్థితి నెలకొంటోంది. అదే సమయంలో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీసుకుంటున్న చర్యలు ఏనుగుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇది అధికారులకు నిద్ర లేకుండా చేస్తోంది. సాక్షి, పలమనేరు: కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీలో ఏనుగుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. వివిధ కారణాలతో గజరాజులకు ప్రాణగండం తప్పడం లేదు. మేత, నీటి కోసం అడవిని దాటి కరెంటు తీగలకు బలవుతున్నాయి. రైతులు వన్యప్రాణుల నుంచి పంటలకు రక్షణగా కరెంటు తీగలను అమర్చడం వల్ల కొన్ని చనిపోతున్నాయి. మరికొన్ని అనారోగ్యంతో చనిపోతున్నాయి. పదేళ్లలో వివిధ కారణాలతో 17 ఏనుగులు మృతిచెందాయి. పలమనేరు సమీపంలో ట్రాన్స్ఫార్మర్ను తగిలి గతంలో ఓ పిల్ల ఏనుగు మృతిచెందగా తల్లి ఏనుగు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. (నోట్లో బాటిల్ మెడలో పాము) గత డిసెంబరులో బంగారుపాళెం మండలం మొగిలివారిపల్లిలో ఓ మదపుటేనుగు కిందిగా ఉన్న కరెంటు తీగలకు బలైంది. తాజాగా సోమవారం రాత్రి గంగవరం మండలం మన్నారునాయనిపల్లి సమీపంలో రైతు పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కరెంటుకు మరో మదపుటేనుగు బలైంది. ఏనుగులు అడవిలోంచి బయటకుపోకుండా అటవీ శాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, ట్రెంచింగ్‌లు అనుకున్న ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో అడవి లోపల, బయట వీటి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ఇలాగే కొనసాగితే కౌండిన్యలో ఏనుగులు కనుమరుగుకాక తప్పదు. మదపుటేనుగులకే ఎక్కువ ప్రమాదాలు పలమనేరు ఫారెస్ట్ రేంజి పరిధిలోని కౌండిన్య అభయారణ్యంలో గతంలో 38దాకా ఏనుగులు ఉండేవి. ఈ పదేళ్లలో వీటి సంతతి పెరిగి 48కి చేరాయి. పలమనేరు రేంజికి సంబంధించి నాలుగు మదపుటేనుగులు ఒంటరిగా సంచరిస్తుండేవి. ఇందులో రౌడీ అనే పేరు కలిగిన ఏనుగు గతేడాది బంగారుపాళెం మండంలం శెట్టేరి మామిడితోపులో మృతిచెందింది. పలమనేరు మండలంలోని కాలువపల్లి గ్రామ సమీపంలో సంచరించే మరో మదపుటేనుగు మొగిలివారిపల్లి వైపు వెళ్లి కరెంట్ తీగలు తగిలి గత డిసెంబరులో మృతిచెందింది. మొన్నటిదాకా గాం«దీనగర్, జగమర్ల, మొగిలిఘాట్‌లో సంచరించిన మదపుటేనుగే సోమవారం రాత్రి మన్నారునాయునిపల్లి వద్ద రైతు పెట్టిన కరెంటు తీగలకు మృతి చెందింది. అడవిని విడిచి ఎందుకొస్తున్నాయంటే.. కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవసరమైన ఆహారం, నీటిలభ్యత తక్కువ. దీనికితోడు మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే తమిళనాడు అటవీ శాఖ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి, కౌండిన్య వైపునకు మళ్లిస్తున్నారు. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండడం లేదు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన సోలార్‌ఫెన్సింగ్, ఎలిఫెంట్ ట్రెంచ్‌లు దెబ్బతిని ఏనుగులు బయటకొచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. -
బావిలో పడిన ఏనుగు
గంగవరం : మండలంలోని కీలపట్ల పంచాయతీ గాంధీనగర్ వ్యవసాయ పొలాల్లోని బావిలో ప్రమాదవశాత్తు ఏనుగు పడిపోయింది. బుధవారం రాత్రి పొలాల్లోకి వచ్చిన ఏనుగును గమనించిన రైతులు పెద్దగా కేకలు వేయడంతో పరుగులు తీస్తూ నీరు లేని నేల బావిలోకి జారిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న ఇన్చార్జ్ ఎఫ్ఆర్ఓ కృష్ణప్రసాద్ తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. గురువారం ఉదయం జేసీబీతో బావిలోకి దారి చేసేందుకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఏనుగును బంధించి జూ పార్క్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. దీంతో జిల్లా అటవీశాఖ అధికారి సునీల్‌కుమార్‌రెడ్డి గ్రామానికి చేరుకుని స్థానికులతో చర్చించారు. ఏనుగు పొలాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రైతుల అనుమతితో బావిలో నుంచి దారి ఏర్పాటు చేశారు. దీంతో ఏనుగు సురక్షితంగా బయటకు వచ్చి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. -
ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ ఏనుగులు!
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పాడి ప్రాంతంలో రెండు గున్న ఏనుగులు ప్రమాదవశాత్తూ నీటి కుంటలో కూరుకుపోయాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. వాటిని బయటికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, కుంట లోతుగా ఉండటం, చుట్టూ గుట్టలు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మూడు గంటలపాటు శ్రమించిన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు ఏనుగులను రక్షించారు. జేసీబీతో చుట్టూ ఉన్న మట్టిని కుంటలోకి నెట్టడంతో ఏనుగులు బయటకు రాగలిగాయి. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన గజరాజులు అడవిలోకి పరుగులు పెట్టాయి. -
పెయింటర్‌ను ఆటపట్టించిన ఏనుగు పిల్ల
-
పెయింటర్‌ను ఆటపట్టించిన గజరాజు
మనుషులకు, జంతువులకు మధ్య స్నేహం చాలా అరుదుగా ఉంటుంది. కుక్కల తర్వాత మనుషులతో స్నేహం చేయగలిగే జీవుల్లో ఏనుగులు కూడా ఒకటి. ఒకసారి వాటికి అలవాటైతే ఎంతో ప్రేమిస్తాయి. అప్పుడప్పుడు తమ వారిని ఆటపట్టిస్తుంటాయి. అలాంటి ఘటనే థాయిలాండ్‌లోని ఓ జూపార్క్‌లో చోటు చేసుకుంది. జూలో ఏర్పాటు చేసిన కంచెకు రంగులు వేస్తున్న జూ కీపర్‌ను ఓ గున్న ఏనుగు సరదాగా ఆటపట్టించింది. అతను రంగు వేయకుండా కంచె పై నుంచి తన తొండంతో తడిమింది. గున్న ఏనుగు ఫన్నీగా పెయింటర్‌తో ఆడిన ఆట వీడియోను ఎంపీ పరిమల్ నత్వానీ ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో గతేడాది థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మైలో షూట్ చేసినదని, ఆ గున్న ఏనుగు పేరు ఖున్సుక్ అని, పెయింటర్ పేరు డాన్ డయీంగ్ అని ఓ జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. ఇక వీడియో ప్రకారం.. డాన్ డయీంగ్ అనే పెయింటర్ జూలో ఏర్పాటు చేసిన కంచెకు రంగు వేస్తున్నాడు. ఇంతలో ఎన్‌క్లోజర్‌లో నుంచి ఖున్సుక్ అనే గున్న ఏనుగు డాన్ డయీంగ్ దగ్గరకు వచ్చింది. రంగులేస్తుంటే..ఖున్సుక్ కంచె పై నుంచి తన తొండంతో డాన్ డయీంగ్ను తడిమింది. డాన్ డయీంగ్ మాత్రం తన పని చేసుకోవాలన్నట్లుగా ఏనుగుకు సైగ చేశాడు. అయితే గున్న ఏనుగు మాత్రం అతన్ని వదల్లేదు. కంచెపై నుంచి తొండంతో అతన్ని తాకుతూ..కాళ్లు పైకి లేపి ఎన్‌క్లోజర్ నుంచి వచ్చేందుకు ప్రయత్నించింది. డాన్ డయీంగ్ ఇక చేసేదేమి లేక కాసేపు ఆ ఏనుగుతో సరదాగా ఆడుకున్నాడు. చూడడానికి చాలా ఫన్నీగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే ..5వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. -
జూలో కలకలం
ఆరిలోవ(విశాఖతూర్పు): ఓ వైపు సందర్శకుల కిటకిట.. అంతలోనే అలజడి.. దీంతో ఒక్కసారిగా జూ పార్కులో కలకలం రేగింది. జూలో బంధించి ఉన్న కృష్ణ పరుగులెత్తింది..జూ అధికారులను, సిబ్బందిని, సందర్శకులను ఆందోళనకు గురిచేసింది. కృష్ణ అనే 34 ఏళ్ల మగ ఏనుగు ఆదివారం హడావుడి చేసింది. అధికారుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఇదీ పరిస్థితి : ఇది ఇక్కడ మావాటి వారి మాట కూడా వినదు. తోటి ఏనుగుల మీద సైతం దాడిచేస్తుంది. దీంతో సుమారు 10 ఏళ్లగా కృష్ణను జూ సిబ్బంది ఇనుప సంకెళ్లతో కట్టి ఏనుగుల మోటోలో సందర్శకులకు దూరంగా ఉంచారు. ఏనుగులు సాధారణంగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో శృంగార తాపానికి గురవుతుంటాయని యానిమల్ కీపర్లు అంటున్నారు. ఇక్కడ ఉన్న నాలుగు ఏనుగుల్లో మిగిలిన మూడింటిని దాని నుంచి వేరుచేసి దూరంగా ఉంచుతున్నారు. దీంతో తోడులేని ఆ ఏనుగు కకావికలమై దాని కాళ్లకు కట్టిన ఇనుప సంకెళ్లను సైతం తెంపేసింది. మోటో నుంచి బయటకు రావడానికి విశ్వప్రయత్నం చేసింది. ఎత్తైన గోడలు, మోటు లోపల గోడలను ఆనుకొని ట్రంచ్ తవ్వి ఉండటంతో బయటకు రాలేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయం మోటులో పరుగులు పెడుతూ గీంకరిస్తూ సిబ్బందిని ఆటాడించింది. దాన్ని పట్టుకోవడానికి సిబ్బంది నానా హైరానా పడ్డారు. ఓ దశలో జూ అధికారులు దీన్ని ఎలా కట్టడిచేయాలో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. మత్తిచ్చి పట్టుకోవడానికి కూడా ఆలోచన చేశారు. ఎట్టకేలకు చాకచక్యంతో సిబ్బంది ఇనుప గొలుసులు, తాళ్లతో బందించి పట్టుకొన్నారు. దీంతో జూ అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. కృష్ణ హడావుడి చేసిన వెంటనే సందర్శకులను అటుగా వెళ్లకుండా జూ సిబ్బంది జాగ్రతపడ్డారు. ఏనుగు బయటకు వచ్చేసిందంటూ టికెట్లు కొన్నవారు కూడా తిరుగుముఖం పట్టారు. గతంలో శాంతి హడావుడి : సుమారు 13 ఏళ్ల కిందట వేరే జూ పార్కు నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన శాంతి అనే ఆడ ఏనుగు ఇదే మాదిరిగా చిందులేసింది. మోటు బయట పరుగులెడుతూ అప్పటి జూ అధికారులను బెంబేలిత్తించింది. లారీ నుంచి దించుతుండగా ఇక్కడ మోటులోకి వెళ్లకుండా బయటకు పరుగులు తీసింది. -
కుప్పంలో గజరాజులు బీభత్సం
సాక్షి, చిత్తూరు: కుప్పంలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ ప్రాంతం సమీపంలోని పంటలను నాశనం చేశాయి. దీంతో అటవీ సమీపంలో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారలు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గజరాజుల నుంచి తమ పంటపొలాలను కాపాడాలని కోరుతున్నారు.