చిత్తూరు జిల్లాలో పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి.
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో పోలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. రామకుప్పం మండలంలోని పల్లికుప్పం, పండ్యాలమడుగు గ్రామాలపై శుక్రవారం తెల్లవారుజామున ఏనుగులు దాడి చేశాయి. గ్రామంలోని పంట పోలాల్లో ప్రవేశించిన ఏనుగులు... పంటలను ధ్వంసం చేశాయి. దాంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.