hulchul
-
దడ పుట్టిస్తున్న కోతుల గ్యాంగ్
-
కాకినాడ జిల్లా బూరుపూడిలో మందుబాబు వీరంగం
-
Suryapet: ఉండ్రుగొండలో అఘోరీ ప్రత్యక్షం
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో అఘోరీ హల్చల్ చేసింది. శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి నుంచి వేములవాడకు వెళ్తూ మార్గమధ్యంలో ఉండ్రుగొండ గ్రామ శివారులోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఆర్చి వద్ద భోజనం చేసేందుకు ఆగింది. పలువురు ఆమెను ఫొటోలు తీస్తుండటంతో తనను ఎందుకు ఫొటోలు తీస్తున్నారని వారిపై దాడికి ప్రయత్నించింది. దీంతో వారు ఆమెను కొట్టారు. ఆమె తన కారులో ఉన్న తల్వార్ తీసి గొడవ చేసింది. గ్రామస్తులు సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెకు నచ్చజెప్పి గ్రామం నుంచి తీసుకువచ్చారు. రాత్రి ఖాసీంపేట గ్రామ శివారులో తన కారులోనే నిద్రించింది. ఆదివారం తెల్లవారుజామున టిఫిన్ చేయడానికి వెళ్లడంతో ఓ యువకుడు ఆమెను సెల్ఫీ అడగడంతో అతడిపై దాడికి దిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేశ్వర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అక్కడి నుంచి పంపించారు. -
సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లో ముగ్గురు యువకుల హల్ చల్
-
గంజాయి బ్యాచ్ వీరంగం
ఉప్పల్: రామంతాపూర్‌లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. ఏకంగా ఇంట్లోకి చొరబడి ఓ యువకుడిని చితక బాదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పొలీసులు, బాధితులు తెలిపిన మేరకు..రామంతాపూర్ లక్ష్మీ శ్రీకాంత్‌నగర్ కాలనీలో నివాసముంటున్న బాల నర్సింహ కుమారుడు భరత్ కుమార్(30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన ఆటోను ఇంటి ముందు పార్క్‌చేసి లోపలకు వెళ్లాడు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి ఆటోలో కూర్చుని గంజాయి తాగుతున్నారు. ఇది గమనించిన భరత్ వారిని మందలించడంతో వారు మరికొందరిని పిలిపించారు. దీంతో భరత్ భయపడి ఇంట్లోకి వెళ్లాడు. రెచ్చి పోయిన అల్లరి మూక తలుపులు పగుల గొట్టి ఇంట్లోకి చొరబడి భరత్‌ను విచక్షణా రహితంగా చితక బాదారు. ఈ దాడిని చూసిన స్థానికులు అక్కడకు వెళ్లడంతో వారు పరారయ్యారు. భరత్‌ను చికిత్స నిమిత్తం ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయులో ఉంచినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో కాలనీ వాసులంతా ఉప్పల్ పోలీస్‌స్టేషన్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
పులికి చుక్కలు చూపించిన ఫారెస్ట్ ఆఫీసర్స్..
-
ఒంగోలు జిల్లాలో పులి సంచారం
-
నాగ్ బాబా హల్ చల్
-
‘సార్..దయచేసి మా అమ్మను ఇంటికి పంపకండి.. జైలుకు పంపండి..’
ఫిలింనగర్: మద్యం మత్తులో ఓ మహిళ (44) పార్కు పక్కన తూలిపోతూ..రోడ్డు పక్కన పడుకుని న్యూసెన్స్ చేస్తుండగా సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని సయ్యద్‌నగర్ బస్తీలో నివసించే ఓ మహిళ గత కొంతకాలంగా మద్యానికి బానిసై అర్ధరాత్రి దాకా రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. శుక్రవారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్బీటీనగర్ ప్రాంతంలో మద్యం మత్తులో న్యూసెన్స్ చేస్తుండగా బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడకు వెళ్లి ఆమె ఇంట్లో అప్పగించి వచ్చారు. అయితే ఇంట్లో చెప్పకుండానే ఆమె మళ్లీ అదే అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో బయటకు వచి్చంది. ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని లోటస్‌పాండ్ పార్కు వద్ద వివస్త్రగా పడి ఉంది. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె గురించి ఆరా తీయగా సయ్యద్‌నగర్‌లో నివసిస్తుందని తెలిసింది. దీంతో ఆమె కూతురికి ఫోన్ చేయగా ‘సార్..దయచేసి మా అమ్మను ఇంటికి పంపకండి..జైలుకు పంపండి..’ అంటూ ఆమె ఇంట్లో చేసిన న్యూసెన్స్‌ను మొరపె ట్టుకుంది. ఆమె భర్త పెయింటర్‌గా పనిచేస్తుంటాడని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, మద్యానికి బానిసై నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గత నెల రోజుల నుంచి 10 మార్లు పోలీసులు ఆమెను ఇలా గే రోడ్లపై మద్యం మత్తులో తిరుగుతుండగా కు టుం బసభ్యులకు అప్పగించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
-
సూర్యాపేటలో దొంగల ముఠా హల్చల్
-
బాబు అండతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
-
మంత్రి కాన్వాయ్ అడ్డుకుని మందుబాబులు రచ్చ..
-
మహానందిలో మరోసారి చిరుత సంచారం
-
కారుపై పెద్దపులి దాడి..
-
వికారాబాద్ జిల్లా గడిసింగాపూర్ గ్రామంలో లారీ బీభత్సం
-
నాకు సీఎం సార్ కావాలి...ప్రగతి భవన్ ముందు యువకుడు హల్ చల్
-
ఏలూరు జిల్లా దెందులూరులో పెద్దపులి సంచారం
-
Vizag: విశాఖ రైల్వేస్టేషన్లో వ్యక్తి హల్చల్..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. రైల్వేస్టేషన్లో రూఫ్ టాప్‌పైకి ఎక్కి కరెంట్ తీగలను పట్టుకుంటాను అంటూ అక్కడున్న వారిని బెదిరించాడు. దీంతో, ప్రయాణికులు హడిలిపోయారు. రైల్వేస్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. విశాఖ స్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ప్రయాణికులతోపాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులను టెన్షన్ పెట్టాడు. రూఫ్‌టాప్ పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరింపులకు దిగాడు. అతడిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. తొలుత విద్యుత్ సరఫరా నిలిపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా.. నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుపైకి దూకాడు. దీంతో అతడి వెంట పరుగులు పెట్టిన పోలీసులు.. ఎట్టకేలకు ప్రయాణికుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే, సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తోంది. అనంతరం, పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
సలార్2 లో అదిరిపోనున్న శ్రీయ రెడ్డి క్యారెక్టర్..
-
కామారెడ్డిలో రేవంత్ రెడ్డి తమ్ముడు హల్ చల్
-
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేత దండెం రాంరెడ్డి, అనుచరుల హంగామా
-
విందు కోసం హారన్ కొట్టు.. చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం..
న్యూఢిల్లీ: కొంతమంది క్రియేటివిటీని చూస్తే.. దడపుట్టాల్సిందే. అలాంటిదే ఈ కారు వెనుక ఉన్న అస్థిపంజరం బొమ్మ. కానీ, ముందు భయపడినా ఆ క్రియేటివిటీలోని సరదాను చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం. ఇన్స్ట్రా గామ్‌లో హల్చల్ చేస్తున్న ఈ కారు వీడియోకు లైక్ కొట్టుకుండా ముందుకు కదలేం. @behindtheshield911 ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేసిన ఆ వీడియోలో ఏముందంటే.. ఓ కారు, కారు వెనుక అస్థిపంజరం బొమ్మ. పక్కనే ‘విందు కావాలంటే హరన్ కొట్టు’ అనే కాప్షన్. దాన్ని చూసి సరదాగా హరన్ కొడితే ఆ అస్థి పంజరం బొమ్మ వెనక ఉన్న కారుపై పడేలా నీళ్లను వెదజల్లుతుంది. అస్థిపంజరాన్ని చూసి భయపడిన మనకు అది నీళ్లు వెదజల్లే విధానం చూస్తే నవ్వురాకుండా ఉండదు. చదవండి: థియేటర్ మొత్తం మంటలు, సినిమా చూస్తూ నిమగ్నమైన ప్రేక్షకులు -
మన్యం జిల్లాలో గజరాజుల గుంపు బీభత్సం
-
డోంగర్ గామ్ లోని హనుమాన్ ఆలయంలో పాము సంచారం
-
రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేసిన ఎలుగు బంటి
-
హడల్ పుట్టిస్తున్న రంగూన్ రాణులు
-
కారులో శబ్ధం.. డోర్ ఓపన్ చేయగానే గుండె ఝల్లుమంది!
జయపురం: పట్టణంలోని ఇండాల్ సర్వీసింగ్ కేంద్రానికి వచ్చిన కారులో 6 అడుగుల నాగుపాము కనిపించింది. దీంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే... నవరంగపూర్ జిల్లాలోని ఇంద్రావతిగుడకు ఆదిత్య పట్నాయక్ తన కారును సర్వీసింగ్ నిమిత్తం తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో బోనెట్ ఎత్తి పరిశీలిస్తున్న మెకానిక్కు లోపలి నుంచి శబ్ధం వినిపించింది. కారు డోర్ ఓపన్ చేసి టార్చ్‌లైట్ వేసి పరిశీలించగా, సర్పం కనిపించింది. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఇంతలో కొందరు చాకచక్యంగా పామును బంధించి నక్కిడొంగర పర్వత ప్రాంతంలో విడిచి పెట్టారు. నవరంగపూర్ లోనే కారు ఇంజిన్‌లో పాము చేరి ఉంటుందని సర్వీసింగ్ సెంటర్ యజమాని తదితరులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వాళ్లందరికి రేషన్ కార్డు రద్దు! -
ఫుల్లుగా తాగి ముగ్గురు అమ్మాయిల రచ్చ
-
దొంగోడికోసం అవ్వ కాపలా..
-
పార్వతిపురం జిల్లా బందవలసలో ఏనుగుల బీభత్సం
-
అపార్ట్ మెంట్ వాసులపైకి కుక్కలను వదులుతున్న సీఐ నాగేంద్ర
-
మద్యం మత్తులో యువతి హల్చల్..
జగిత్యాల: స్థానిక ప్రధాన చౌరస్తాలో యువతి హల్చల్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆటో దిగిన తర్వాత డబ్బులు అడిగిన డ్రైవర్‌పై యువతి రాళ్లతో దాడికి దిగింది. అక్కడే ఉన్న కొందరు యువతి నిర్వాకాన్ని సెల్ఫోన్లో వీడియోతీశారు. వివరాల్లోకి వెళితే సదరు యువతి కరీంనగర్ నుంచి గోదావరిఖనికి ఆటో ఎంగేజ్ మాట్లాడుకోగా రూ.1200కు బేరం కుదుర్చుకుని అక్కడి నుంచి బయల్దేరారు. మార్గమధ్యలో డీజిల్ కోసం డబ్బులు అడగ్గా గోదావరిఖనికి వెళ్లిన తర్వాత డబ్బులు ఇస్తానంది. తీరా గోదావరిఖని చౌరస్తాకు చేరడంతో తనవద్ద డబ్బులు లేవని డ్రైవర్‌ను బెదిరిస్తూ దుర్భాషలాడింది. అంతేకాకుండా అక్కడున్న రాళ్లతో డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. దీంతో అక్కడున్న ప్రజలంతా విస్తుపోయారు. చివరకు పోలీసుల జోక్యంతో ఆటోడ్రైవర్‌కు డబ్బులు ఇప్పించారు. మద్యంమత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు స్థానికులు పేర్కొన్నారు. -
హైదరాబాద్ లో రెచ్చిపోయిన దుండగులు
-
శ్రీకాకుళం, మన్యం జిల్లాలో ఏనుగులు హల్ చల్
-
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం
-
హైదరాబాద్: మీర్పేట్ కార్పొరేటర్ భర్త వీరంగం
-
Viral Video : వినూత్న కారు.. వీధుల్లో షికారు
-
హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
ప్రేమిస్తున్నానంటూ యువతికి జనసేన నేత వేధింపులు
-
అరకు : మద్యం మత్తులో యువతి విచిత్ర ప్రవర్తన
-
అరకు: మద్యం మత్తులో యువతి హల్చల్..
సాక్షి, అల్లూరి జిల్లా: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులో ఓ యువతి మద్యం మత్తులో రెచ్చిపోయింది. పీకల దాకా మద్యం సేవించి ఓ దుకాణ యజమానురాలితో అనుచితంగా ప్రవర్తిస్తూ హల్చల్ చేసింది. అంతటితో ఆగకుండా ఆమెను బూతులు తిడుతూ హంగామా చేసింది. ఆమె చేష్టలకు అక్కడున్న వారంతా షాకయ్యారు. అయితే, ఆమెను దారుణంగా తిట్టిన తర్వాత ఓ చోట కూర్చుని ఆమె విచిత్రంగా ప్రవర్తించింది. బుట్టు పీక్కుంటూ నేను ఏ తప్పు చేయలేదు. నేనేమీ చేయలేదు అంటూ గట్టిగా అరస్తూ కేకలు పెట్టింది. ఈ క్రమంలో సదరు మహిళపై.. దుకాణం యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం.. పోలీసులు యువతిని స్టేషన్‌కు తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. -
నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు గురించి విస్తుపోయే విషయాలు
-
ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తోన్న చిరుత పులులు
-
వైరల్ వీడియో: కార్ పై ప్రయోగం చేస్తున్న కోతులు
-
కృష్ణ జిల్లా: మద్యం మత్తులో నారాయణ కాలేజ్ బస్సు డ్రైవర్ హల్చల్
-
మద్యం మత్తులో నారాయణ కాలేజ్ బస్సు డ్రైవర్ హల్చల్.. విద్యార్థుల కేకలు!
సాక్షి, కృష్ణ: జిల్లాలో మద్యం మత్తులో నారాయణ కాలేజీ బస్సు డ్రైవర్ హల్చల్ చేశాడు. పీకాల దాకా మద్యం తాగి విద్యార్ధులు ప్రయాణిస్తున్న బస్సును నడిరోడ్డుపై వదిలేశాడు. దీంతో, విద్యార్థులు తమను రక్షించాలంటూ కేకలు వేశారు. వివరాల ప్రకారం.. మద్యం మత్తులో నారాయణ కాలేజీ బస్సు డ్రైవర్ నడిరోడ్డుపై హంగామా చేశాడు. కాలేజీ పూర్తైన తర్వాత ఉయ్యూరు నుంచి విద్యార్థులతో బస్సు బయలుదేరింది. ఈ క్రమంలో ఫుల్లుగా మద్యం సేవించిన డ్రైవర్..రోడ్డుపై బస్సును ప్రమాదకరంగా నడిపాడు. దీంతో, విద్యార్థులు కేకలు వేయడంతో పామర్రు మండలం కనుమూరు జాతీయ రహదారిపై బస్సును నిలిపివేశాడు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై ఉన్న డివైడర్‌ను పట్టుకుని హల్చల్ చేశాడు. కాగా, డ్రైవర్ ప్రవర్తనతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. తమను రక్షించాలంటూ పెద్ద కేకలు వేశారు. ఈ క్రమంలో విద్యార్థులు నారాయణ స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. కానీ, విద్యార్థులు ఆందోళన చెందుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా, డ్రైవర్ ప్రవర్తనతో విద్యార్థుల పేరెంట్స్, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ నడిబొడ్డున భారీ కొండచిలువ కలకలం
-
లారీ డ్రైవర్ కు కనిపించిన పులుల గుంపు..
-
మద్యం మత్తులో బీజేపీ ఎమ్మెల్యే కొడుకు హంగామా.. నడిరోడ్డుపై..
Sandeep Kanwar.. మాజీ హోం మంత్రి కుమారుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. పీకాలదాకా మద్యం సేవించి ఒళ్లు మరిచిపోయి నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ మాజీ హోం మంత్రి, రాంపూర్ ఎమ్మెల్యే నానకీరామ్ కన్వర్ కుమారుడు సందీప్ కన్వర్ ఫుల్‌గా మద్యం సేవించి నడిరోడ్డుపై రచ్చచేశాడు. బస్సును ఆపి.. బస్సు కండక్టర్‌పై దాడికి ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా.. నడిరోడ్డు మీద బస్సుకు అడ్డంగా పడుకున్నాడు. దీంతో, ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సందీప్ కన్వర్ అక్కడి నుంచి ఆయన ఇంటికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, సందీప్ కన్వర్ ప్రస్తుతం కోర్బా ఏరియా నంబర్ 1 జిల్లా పంచాయతీ సభ్యుడిగా ఉన్నారు. సందీప్ తండ్రి నానకీరామ్ కన్వర్.. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో(2008-13) ఉన్న కాలంలో నానకీరామ్ హోం మంత్రిగా బాధ్యతలు కొనసాగించారు. -
మునుగోడులో మస్తు దావత్‌లు.. మద్యం మత్తులో రెచ్చిపోయిన యూత్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ ఓటర్లుకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్నకొద్దీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందకు పొలిటికల్ లీడర్లు.. మందు, చికెన్, మటన్‌తో పెద్ద ఎత్తున దావత్‌లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫుల్‌గా తాగిన మందుబాబులు పొట్టుపొట్టు తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ పార్టీ నేతలు కొందరు యువకులకు మందు పార్టీలు ఇచ్చారు. ఈ సందర్భంగా తమకు మందు సరిపోలేదంటూ దావత్లో యువకులు తన్నుకున్నారు. తమకు మందు కావాలని డిమాండ్ చేయడం విశేషం. మరోవైపు.. దీపావళి పండుగ నేపథ్యంలో ఓ పార్టీకి చెందిన నేతలు.. మునుగోడులో ఓటర్లుకు కొత్త బట్టలు సైతం కొని ఇచ్చినట్టు సమాచారం. -
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పాము కలకలం
-
నాయుడుపేటలో మహిళ హల్చల్
నాయుడుపేటటౌన్: నాయుడుపేట పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై ఓ మహిళ బైఠాయించి గంటకు పైగా హల్చల్ చేసింది. రోడ్డుకి అడ్డంగా కూర్చుండిపోవడంతో రహదారిపై వాహనాలు బారులుతీరి నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న సీఐ సీహెచ్ ప్రభాకర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళతో మాట్లాడారు. ఆ మహిళ సీఐతో పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో ఆమె మానసిక స్థితి సరిగా లేన్నట్లు గుర్తించారు. ఆమె బ్యాగులో బురఖా ఉండడంతో ముస్లిం మహిళ అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. తర్వాత మహిళకు నచ్చజెప్పి స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్ వద్ద ఉన్న రిసెప్షన్ సెంటర్‌కు తరలించారు. -
రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
-
పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టులు కలకలం
-
తిరుమలలో సినీనటి అర్చనా గౌతమ్ వీరంగం
-
ఖమ్మం జిల్లా తుంబూరులో క్షుద్రపూజలు కలకలం
-
మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా!
Metro station.. మనుషులు చేసే కొన్ని తప్పులు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాయి. చిన్న తప్పుల కారణంగా కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. మెట్రో రైల్వే ట్రాక్‌పై నడుస్తూ హంగామా క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో మెట్రో కింద ఉన్న ప్రజలు కిందకు దిగాలని ఎంతగా అరుస్తున్నా, కేకలు వేస్తున్నా అతను మాత్రం అవేవీ పట్టించుకోకుండా కనీసం వారి వైపు కూడా చూడకుండా నడుచుకుంటూ వెళ్లాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. లంచ్ తర్వాత తిన్నది అరిగేందుకు మధ్యాహ్నం వాక్ చేస్తున్నాడని కామెంట్ చేశాడు. A man running on a Track Near nangloi metro station Green Line @OfficialDMRC @ACPAshishKumar pic.twitter.com/NnwY7vka4I — Ravi Rai (@RaviRai76784793) August 20, 2022 -
కొత్తవలస మండలంలో పులి సంచారం
-
అనకాపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం
-
హైదరాబాద్‌లో కొత్త గ్యాంగ్ హల్చల్
-
మెట్రో రైలులో లవర్స్ రచ్చ!.. అవాక్కైన ప్రయాణికులు
వారిద్దరూ లవర్స్ అనుకుంటా.. సరదాగా మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా సీరియస్ అయిన ఆమె.. యువకుడిని పొట్టుపొట్టు కొట్టింది. ఇంతలో నన్నే కొడతావా అంటూ యువకుడు సైతం చెంపపై ఒక్కటిచ్చాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ యువతి, యువకుడు.. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ఇంతలో వారి మధ్య టీ షర్ట్ ధరపై వాగ్వాదం మొదలైంది. ఆమె తాను వేసుకున్న టీ షర్ట్‌ను వేయి రూపాయలకు కొనుగోలు చేశానని చెప్పింది. ఈ క్రమంలో యువకుడు.. ఆ టీ షర్ట్ రూ. 150కే దొరుకుతుందని ఫన్నీగా అన్నాడు. దీంతో, ఆమె కోపంతో ఊగిపోయి.. యువకుడి చెంప చెల్లుమనిపించింది. ఈ క్రమంలోనే "మమ్మీ కో బోలుంగీ మెయిన్" (నేను తల్లికి చెబుతాను) అని చెబుతుంది. దీనికి వెంటనే.. సదరు యువకుడు.."తేరే జైసా లడ్కా కిస్కికో నా మైలే" (నీలాంటి వ్యక్తి ఎవరికీ ఉండకూడదు) అంటూ బదులిచ్చాడు. దీంతో, మరింత రెచ్చిపోయిన యువతి.. వరుసగా ఆమె చెంపదెబ్బలు కొడుతుండటంతో యువకుడు కూడా ఆమె చెంప చెల్లుమనిపించాడు. అనంతరం ఒకరిపై ఒకరు అరుచుకుంటూ స్టేషన్ రాగానే రైలు దిగి వెళ్లిపోయారు. అనంతరం వారి చేష్టలకు షాకైన ప్రయాణికులు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. Delhi metro entertainment 😂😂pic.twitter.com/LLdIDHB54N— kartik (@Kartik_sharmaji) July 12, 2022 ఇది కూడా చదవండి: ‘సార్.. ప్లీజ్ మమ్మల్ని విడిచి వెళ్లొద్దు’.. టీచర్ అంటే ఇలా ఉండాలా? -
హయత్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ కలకలం
-
మెహిదీపట్నంలో గంజాయి బ్యాచ్ వీరంగం
-
కృష్ణ జిల్లా మచిలీపట్నంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
-
మాజీ మంత్రి కొడుకు హల్చల్.. కారులో మందు తాగుతూ రోడ్డుపై..
మద్యం మత్తులో కాంగ్రెస్ మాజీ మంత్రి కొడుకు రెచ్చిపోయాడు. ఫుల్లుగా తాగి వాహనం నడుపుతూ రోడ్డుపై హల్చల్ చేశాడు. మద్యం మత్తులోనే ఓ వ్యాపారి కారును ఢీకొని అతడితో వాగ్వాదానికి దిగి కత్తితో బెదిరించాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షాజాపూర్‌కు చెందని కాంగ్రెస్ మాజీ మంత్రి హుకుమా కరాడ కొడుకు రోహితప్ సింగ్ మద్యం మత్తులో రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. తన ఎస్వీయూ(SVU) కారులో మద్యం తాగుతూ రోడ్డు మీద ఉన్న వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీకొట్టాడు. దినేస్ అహుజా అతడి అనుచరులతో కలిసి భోపాల్ నుంచి ఇండోర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, భాదితులు దినేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రోహితప్ సింగ్ మద్యం తాగుతూ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై తన కారును ఢీకొట్టడంతో వారు అతడిని ప్రశ్నించగా.. రోహితప్ మరింత రెచ్చిపోయాడు. బాధితులు తాము పోలీస్ స్టేషన్‌కు వెళతాము. నష్ట పరిహారం ఇవ్వాలని కోరడంతో వారు రోహితప్ మరింత రెచ్చిపోయాడు. మరోసారి దినేష్ కారును ఢీకొట్టాడు. దీంతో దినేష్, అతడి అనుచరులు.. రోహితప్ను బయటకు దిగాలని కోరడంతో అతడు వారిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయినట్టు తెలిపారుకాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు అష్టా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ యాదవ్ తెలిపారు. కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. Former minister and senior @INCIndia leader Hukum Singh Karada's heavily drunk son Rohitap who was driving an SUV hit the car of a businessman When asked him to come to the local police, Karada again dashed the car with his SUV @ndtv @ndtvindia pic.twitter.com/quzQf5sh1P — Anurag Dwary (@Anurag_Dwary) May 23, 2022 ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- లారీ ఢీకొని తొమ్మిది మంది మృతి -
గుంటూరు జిల్లాలో గుజరాత్ అమ్మాయిల ఆగడాలు
-
రోడ్డుపై అమ్మాయిల హల్చల్.. వీడియో వైరల్
సాక్షి, గుంటూరు: జిల్లాలో గుజరాత్ అమ్మాయిలు హల్చల్ చేశారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఆపి అమ్మాయిల ముఠా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా బలవంతపు వసూళ్లపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
Hyderabad: మెట్రో స్టేషన్ వద్ద యువకుడి హంగామా
Hyderabad Metro.. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఓ యువకుడు హంగామా సృష్టించారు. మెట్రో అధికారులకు చెమటలు పట్టించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ యువకుడు మెట్రో ట్రాక్ పక్కనే ఉన్న జాలి వద్ద దాక్కున్నాడు. దీంతో మెట్రో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, సదరు యువకుడు ఎంతకీ బయటకు రాకపోవడంతో అధికారులు అతడికి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు అతడిని బయటకు తీసుకువచ్చి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సికింద్రాబాద్ నుంచి యథావిధిగా మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇది కూడా చదవండి: పోలీసులు ఓవరాక్షన్.. అర్ధరాత్రి భార్యాభర్తలకు చేదు అనుభవం -
ఆర్టీసీ బస్సులో మహిళ హల్చల్.. బట్టలు ఊడదీసుకుని..
సాక్షి,మలక్‌పేట(హైదరాబాద్): ఆర్టీసీ బస్సులో గురువారం ఓ మహిళ హల్చల్ చేసింది. తోటి ప్రయాణికులను కొట్టి, తన మూడేళ్ల కూతురును బస్సు నుంచి కిందికి విసిరేసింది. ఆందోళన చెందిన బస్సు డ్రైవర్, కండక్టర్ మలక్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కండక్టర్, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం... 37 వయస్సు కలిగిన వివాహిత తన మూడేళ్ల కూతురుతో తన ఇంటికి వెళ్లడానికి అఫ్జల్‌గంజ్‌లో రాత్రి 7 గంటలకు హయత్‌నగర్–2 డిపోకు చెందిన బస్సు ఎక్కింది. అక్కడ నుంచి ఎల్బీనగర్కు టికెట్ తీసుకుంది. అఫ్జల్‌గంజ్ నుంచి బస్సు బయలుదేరి వస్తుండగా ఎంజీబీఎస్‌కు రాగానే ఆమె బస్సులో గొడవ చేయడం మొదలు పెట్టింది. బట్టలు ఊడదీసుకోవడం, పక్క నున్న వారిని దూషించడం చేసింది. కండక్టర్ వారించబోగా అతడిపై కూడా చెయ్యి చేసుకుంది. ఎన్టీఆర్ నగర్ వెళ్లడానికి మలక్‌పేటలో 60 సంవత్సరాల మహిళ బస్సు ఎక్కి ఆమె పక్కన ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుగా ఆమెను కూడా కొట్టింది. తన కుమార్తెను బస్సు కిటికీ నుంచి విసిరేయడానికి చూడగా ప్రయాణికులు అడ్డుకున్నారు. దీంతో బస్సు డ్రైవర్ మలక్‌పేట పీఎస్ ఎదురుగా బస్సు ఆపాడు. బస్సు డోర్ నుంచి పాపను కిందికి విసిరేసింది. బస్సు టైర్ల కింది కూర్చుంది. అదృష్టవశాత్తు పాపకు ఎలాంటి గాయా లు కాలేదు. కండక్టర్ పోలీసులకు ఈ విషయం చెప్పాడు. బస్సును కదలనీయకుండా బస్సు టైర్లను ఆనుకుని కూర్చుంది. మహిళా పోలీసులు, కొందరు స్థానికులు యువతులు ఆమె దగ్గరకు నచ్చజెప్పి దుస్తులు తొడి ఆమెను, పాపను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ మహిళ వివరాలు అడిగి తెసుకుని సరూర్‌నగర్‌లో ఉండే ఆమె అక్కకు అప్పగించారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిçస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
Karnataka Lovers Arrest: న్యూసెన్స్ ప్రియుడు అరెస్టు
యశవంతపుర (కర్ణాటక): హద్దులు మీరి బైకుపై ముద్దులు పెట్టుకుంటూ ప్రయాణించిన యువకుడు కటకటాలు లెక్కబెడుతున్నారు. ఆ వీర ప్రేమికున్ని చాజరాజనగర పోలీసులు అరెస్ట్ చేశారు. గుండ్లుపేట–చాజరాజనగర మార్గంలో బైకు నంబర్ ఆధారంగా బైకిస్టు ఎస్సి స్వామిని అరెస్ట్ చేశారు. ప్రియురాలితో ముద్దులు పెట్టుకుంటూ బైక్‌పై దూసుకెళ్లిన దృశ్యాలు వైరల్ కావడం తెలిసిందే. దీంతో నిర్లక్ష్యపు డ్రైవింగ్, న్యూసెన్స్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. చదవండి: (Lovers Hulchul: బైక్‌పై లవర్స్ హల్చల్.. వీడియో వైరల్) -
ఎమ్మెల్యే కుమారుల వీరంగం.. ఎఫ్ఐఆర్ నమోదు
ఎమ్మెల్యే కొడుకులు వీరంగం సృష్టించారు. తమ అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటున్నారనే నెపంతో అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు కుమారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షియోపూర్‌లోని బుధేరా ఫారెస్ట్ రేంజ్లో అటవీ శాఖ అధికారులపై విజయ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సీతారాం ఆదివాసీ కుమారులు దాడి చేశారు. తమ అక్రమ వ్యాపారాలను అడ్డుకున్నందుకే వారు దాడి చేశారని అధికారులు వెల్లడించారు. కాగా, ఎమ్మెల్యే కుమారులు ధనరాజ్, దీనదయాళ్.. అక్రమ మైనింగ్, అడవి నుంచి ఇసుక, రాళ్ల అక్రమ రవాణా, అక్రమంగా చెట్ల నరికివేతకు పాల్పడుతున్నారని ఫారెస్ట్ రేంజ్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు వారిని అడ్డుకోవడంతో దాడి జరిగింది. అయితే, బుధేరా ఫారెస్ట్ రేంజ్‌లోని పిప్రాని ఫారెస్ట్ పోస్ట్‌లో తన వాహనాలను అడ్డుకున్నందుకు ధనరాజ్ అటవీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అతని పక్కనే ఉన్న సోదరుడు దీనదయాళ్ సహనం కోల్పోయి వారి సహచరులతో కలిసి ఫారెస్ట్ గార్డులు రామ్రాజ్ సింగ్, రిషబ్ శర్మ, డ్రైవర్ హసన్ ఖాన్‌లను తిడుతూ వారిపై దాడి చేశారు. ఈ విషయం వారు అటవీశాఖ సీనియర్ అధికారులకు తెలపడంతో వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కుమారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు షియోపూర్ పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీసర్ రామ్ తిలక్ మాల్వియా తెలిపారు. BJP MLA'S SONS BEAT FOREST OFFICIALS In #MadhyaPradesh, a #BJP MLA's sons beat up forest workers on duty. In a video, Vijaypur Assembly's MLA #SitaramAdivasi's both sons can be seen beating forest officials on duty.@govindtimes reports. pic.twitter.com/o33tGNj4Sm — Mirror Now (@MirrorNow) April 23, 2022 ఇది కూడా చదవండి: లక్కీ ఫెలో.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు -
Lovers Hulchul: బైక్‌పై లవర్స్ హల్చల్
Lovers Hulchul: ప్రేమ జంట నడిరోడ్డుపై రెచ్చిపోయి హల్చల్ చేసింది. బైక్‌పై రైడ్ చేస్తుండగా ఒకరినొకరు హత్తుకుని రోడ్డుపై హంగామా చేశారు. దీంతో రోడ్డుమీద వెళ్లే వాళ్లు వారిని చూసి ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వీరి హల్చల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ప్రేమ పక్షులు తాము రోడ్డుపై ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి.. ఎదురుగా వచ్చే వాహనాలేవీ తమకేవీ అడ్డుకావన్నట్టుగా నడిరోడ్డుపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లారు. పల్సర్ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ప్రియురాలిని కూర్చోపెట్టుకుని ప్రియుడి రెచ్చిపోయాడు. వీరి రైడ్‌ను వారి వెనకాలే వస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇది చదవండి: బెడ్రూమ్లో పక్కింటి వ్యక్తితో భార్య అలా చేస్తూ.. ఆ తర్వాత.. -
Banjara Hills: భూకబ్జా ముఠా హల్చల్.. ఎంపీ టీజీ వెంకటేశ్‌పై కేసు
బంజారాహిల్స్(హైదరాబాద్): బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ప్రభుత్వ స్థలంలోకి ఆదివారం కొందరు రౌడీలు మారణాయుధాలతో ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో సంబంధమున్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, అతని అన్న కుమారుడు విశ్వ ప్రసాద్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్లెర్స్‌కు ప్రభుత్వం 2005లో కేటాయించిన రెండున్నర ఎకరాల్లో అర ఎకరం స్థలాన్ని ఓ వ్యక్తి బోగస్ పత్రాలతో ఆక్రమించుకున్నాడు. తన ఆధీనంలోకి తీసుకున్న ఈ స్థలాన్ని ఎంపీ టీజీ వెంకటేష్ అన్న కుమారుడు విశ్వప్రసాద్‌కు విక్రయించాడు. చదవండి: పరువు హత్య కలకలం.. తాళ్లతో కట్టేసి.. తలపై మేకులు కొట్టి.. విశ్వప్రసాద్ ఆదివారం 80 మంది రౌడీలను మారణాయుధాలతో ఈ ప్రభుత్వ స్థలంలోకి పంపించాడు. వారు ఈ స్థలంలోకి ప్రవేశించి అక్కడున్న సెక్యురిటీ గార్డుల్ని కొట్టి బయటకు తరిమారు. రౌడీమూకల దౌర్జన్యంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని 62 మంది రౌడీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన రౌడీలు పరారయ్యారు. ఈ సంఘటనపై బంజారాహిల్స్ పోలీసులు ఎంపీ టీజీ వెంకటేశ్, విశ్వప్రసాద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్మల్ జిల్లాలో చిరుత కలకలం
-
క్షుద్ర పూజల కలకలం..
-
వేములవాడ: రాజన్న కోడెకు ఎంత కష్టం..!!
-
ఆర్టీసీ బస్సు డ్రైవర్ చొక్కా పట్టుకొని మహిళ వీరంగం
-
హైదరాబాద్ లో రౌడీషీటర్ హల్ చల్
-
ఒంటిమీద దుస్తులు లేకుండా దోపిడీకి యత్నం
తాడేపల్లి రూరల్(మంగళగిరి): చెడ్డీ గ్యాంగ్ తాడేపల్లి ప్రాంతంలో కలకలం రేపింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో దోపిడీకి విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఐదుగురు సభ్యుల గ్యాంగ్ కుంచనపల్లిలో అదే రకంగా ప్రయత్నించి విఫలమైనట్లు ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసులకు చెడ్డీగ్యాంగ్ వచ్చినట్లు చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. చెడ్డీగ్యాంగ్‌లో ఉన్న ఐదుగురు సభ్యులు ఒంటిమీద దుస్తులు లేకుండా ఒక్క చెడ్డీ మాత్రమే ధరించి, తలపాగాలు చుట్టి రెండు ఇళ్ల మధ్యలో ఉన్న సందులో వెళ్తున్నట్లు దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు తాడేపల్లి, మంగళగిరి, కాజా, పెదకాకాని, గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులను అప్రమత్తం చేసి రాత్రి పూట గస్తీలను పెంచారు. దీంతో పాటు నేరస్తులను పట్టుకోవడంలో నైపుణ్యం పొందిన పోలీసులను మఫ్టీలో వివిధ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేశారు. తాడేపల్లి ప్రాంతంలో కనిపించిన ఐదుగురు సభ్యులున్న చెడ్డీగ్యాంగ్ గుంటుపల్లిలో ఉన్న చెడ్డీగ్యాంగ్ పోలికలు ఒకే విధంగా ఉండడంతో బెజవాడ పోలీసులు, గుంటూరు పోలీసులు సంయుక్తంగా ఆ గ్యాంగ్ ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న విశ్వసనీయ సమాచారం. పోలీసులను చెడ్డీగ్యాంగ్ మీద వివరణ అడుగగా ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా రాత్రి సమయంలో అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. -
Dangerous Snake: అమ్మో ఎంత పెద్ద పామో.. బుసలు కొడుతూ..
మాడుగుల: నాగ జాతిలో అత్యంత ప్రాణాంతకర పాము గిరి నాగు విశాఖ జిల్లా మాడుగుల మండలం కృష్ణంపాలెం గ్రామంలో బుధవారం కనిపించింది. ఓ ఇంటి నుంచి పాము పామాయిల్ తోటలోకి వెళ్తుండగా స్థానికులు వణ్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే రంగంలోకి దిగి 14 అడుగుల గిరి నాగును పట్టుకున్నారు. దాన్ని వంట్లమామిడి మహా అడవిలో వదిలారు. వన్యప్రాణి సంరక్షణ అధికారి కంఠిమహంతి మూర్తి, మాడుగుల గ్రామానికి చెందిన స్నేక్ కేచర్ పి.వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్చల్
సాక్షి, సైదాబాద్: అపార్ట్మెంట్లో బోర్‌నీటి వినియోగ వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండే మహిళ తమకు నీరు అందకుండా ఇబ్బందులు సృష్టిస్తోందంటూ పెంట్‌హౌస్‌లో నివసించే దంపతులు అపార్ట్మెంట్ వాటర్‌ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటామని హల్చల్ చేశారు. వివరాలు..సైదాబాద్ ఎల్ఐసీ కాలనీలోని రక్షిత అపార్ట్మెంట్లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించే మహిళకు మిగిలిన పది కుటుంబాలకు కొంతకాలంగా బోర్‌వాటర్ వినియోగించుకోవడంపై వివాదం నడుస్తోంది. ఇరువర్గాలు గతంలో ఒకరిపై ఒకరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మూడురోజుల క్రితం బోర్‌మోటర్‌ను గ్రౌండ్‌ఫ్లోర్‌లోని మహిళ తొలిగించింది. దీంతో అపార్ట్మెంట్లో వారికి బోర్‌నీటి సరఫరా లేక ఇబ్బందులు తలెత్తాయి. స్థానిక నేతలను సదరు మహిళ, అపార్టుమెంట్ వాసుల మధ్య రాజీకి యతి్నంచినా ఫలితం లేదు. అపార్ట్మెంట్లో బోర్‌నీటి కోసం తరచూ గొడవలు జరగటంతో పెంట్‌హౌస్‌లో నివసించే ప్రేమ్ దంపతులు మనస్తాపానికి గురయ్యారు. గురువారం అపార్ట్మెంట్ 3వ అంతస్తులోని పెంట్‌హౌస్‌పై ఉన్న వాట ర్‌ట్యాంక్‌పైకి నిచ్చెన సహాయంతో ఎక్కారు. అక్కడి నుంచి దూకుతామని బెదిరించారు. సైదాబా ద్ పోలీ సులు వచ్చి వారికి సర్దిచెప్పి కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించే మహిళ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని ప్రేమ్ దంపతులు తెలిపారు. -
కర్రలతో బుద్దా వెంకన్న, టీడీపీ కార్యకర్తల హల్చల్
సాక్షి, విజయవాడ: కర్రలతో టీడీపీ నేత బుద్దా వెంకన్న, కార్యకర్తలు హల్చల్ చేశారు. కర్రలతో ఉన్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బుద్దా వెంకన్నను హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. బందర్ రోడ్డులో టీడీపీ నేతలు హల్చల్ చేస్తూ.. బలవంతంగా షాపులు మూయించేందుకు యత్నించారు. ప్రజలకు ఉపయోగం లేని బంద్‌కు మద్దతు ఇవ్వలేమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే ప్రకటించింది. -
కొమరం భీం జిల్లాలో పెద్ద పులి కలకలం
-
కింగ్ కోబ్రా కలకలం: అమ్మో ఎంత పెద్దదో..
ప్రత్తిపాడు రూరల్: తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని చింతలూరులో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. 12 అడుగుల పొడవైన ఈ పాము గ్రామంలో బొడ్డు లోవరాజు, సూరిబాబుకు చెందిన సరుగుడు తోటలో సంచరిస్తుంది. ఈ పాము మనుషులను చూస్తూ ఆగి ఆగి వెళ్తూ భయాందోళనకు గురిచేస్తుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు పాము ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. తమకు ఎటువంటి అనవాళ్లు లభించలేదని తెలిపారు. -
తిరుమలలో 7 అడుగుల నాగుపాము హల్చల్..
సాక్షి, తిరుపతి: తిరుమలలో పాము హల్చల్ చేసింది. భయంతో భక్తులు పరుగులు తీశారు. వివరాలు.. గరుడాద్రి అతిథి గృహాల సమీపంలో 546 గది వద్దకు పాము వచ్చింది. అక్కడున్న వాళ్లు విషయం గమనించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో... పాములు పట్టే భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు ఏడు అడుగుల పొడవైన నాగుపాము బుసలు కొడుతున్నప్పటికీ ఎంతో చాకచక్యంగా భాస్కర్ దానిని పట్టుకున్నాడు. అనంతరం సురక్షిత ప్రాంతంలో పామును వదిలేశారు. -
మధురవాడలో టీడీపీ నేత హల్చల్
సాక్షి, విశాఖపట్నం: మధురవాడలో టీడీపీ నేత మొల్లి లక్ష్మణరావు హల్చల్ సృష్టించారు. టీడీపీ కార్పొరేటర్‌నంటూ వార్డు సచివాలయంలో కార్యకర్తలతో కలిసి లక్ష్మణరావు తనిఖీలు చేశారు. జీవీఎంసీ 5వ వార్డు కార్పొరేటర్ తండ్రి లక్ష్మణరావు.. కుమార్తె స్థానంలో తానే కార్పొరేటర్ అంటూ నానా హంగామా చేశారు. సచివాలయంలో సిబ్బంది వివరాలు చెప్పాలంటూ బెదిరింపులకు దిగారు. ఇకపై సచివాలయంలో తనకు తెలీకుండా ఏమీ జరగకూడదంటూ హుకుం జారీ చేశారు. చదవండి: భూముల స్వాధీనంపై ఎల్లోమీడియా గగ్గోలు: అంబటి త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు: ఆదిమూలపు -
కామారెడ్డి జిల్లా: చిట్యాలలో ఎలుగుబంటి హల్చల్
-
చిట్యాలలో ఎలుగుబంటి హల్చల్
సాక్షి, కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి నీటి కోసం గ్రామ శివారులోకి రాగా గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామస్తులు ఎలుగుబంటిని తరిమికొట్టగా గ్రామ శివారులో గల నీళ్లు లేని బావిలో పడింది. దాంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా వలల సహాయంతో ఎలుగుబంటిని పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నించారు. గ్రామస్తుల అరుపులు కేకలతో ఓ సందర్బంలో దాడి చేయడానికి ఎలుగుబంటి ప్రయత్నించి అడవిలోకి పారిపోయింది. చదవండి: విచిత్ర సంఘటన.. డ్రైవర్‌గా మారిన పెళ్లికొడుకు మంచె మీదే బీటెక్ విద్యార్థి ఐసోలేషన్.. చెట్టుమీదే -
బాబోయ్ భల్లూకం: ఎలుగుబంట్ల హల్చల్
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దానం, తీర ప్రాంతాల్లో గత కొద్ది కాలంగా ఎలుగు బంట్లు (భల్లూకాలు) హల్చల్ చేస్తుండంతో ప్రజలు భయందోళన చెందుతున్నారు. ప్రధానంగా మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని పలు గ్రామాల్లో ఉన్న జీడి తోటలు, సముద్ర తీరాల్లో సంచరిస్తున్నాయి. ప్రస్తుతం జీడి పిక్కలను ఎరేందుకు రైతులు తోటల్లోనే ఎక్కువ సమయం ఉంటున్నారు. దీంతో ఏ సమయంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. అనేక మందికి గాయాలు.. ►ఇప్పటికే అనేక మందిపై ఎలుగులు దాడిచేసి గాయపరిచాయి. చికిత్స పొందుతూ క్షతగాత్రులు పదుల సంఖ్యలో మృతి చెందారు. ►మూడేళ్ల క్రితం తాడివాడ వద్ద రైతులు పంట రక్ష ణకు ఏర్పాటు చేసుకున్న కంచెలో ఎలుగు చిక్కింద ►రెండేళ్ల క్రితం చినవంక గ్రామ దేవత ఆలయంలో ఎలుగు చొరబడింది. ►అక్కుపల్లిలో కిరాణా దుకాణంపై దాడిచేశాయి. ► రాజాంలో అంగన్వాడీ కేంద్రంలో ఎలుగులు చొరబడి నూనె, పప్పు, ఇతర నిత్యావసర సరుకుల ను ధ్వంసం చేశాయి. ►డెప్పూరులో రాత్రి సమయంలో గ్రామ వీధుల్లో సంచరించి ప్రజలకు ప్రాణభయం కలిగించాయి. ►కిడిసింగిలో నిర్మాణం జరుగుతున్న ఇంటిలో రెండు ఎలుగులు కనిపించడంతో భవన నిర్మాణ కార్మికులు బయటకు పరుగులు తీశారు. ►గత మూడు రోజుల నుంచి డోకులపాడు సము ద్ర తీరంలో రెండు ఎలుగులు సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికారు లు స్పందించి ఎలుగుల సంచారాన్ని నియంత్రించా లని ఉద్దాన, తీర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. తీరంలో ఎలుగుబంట్లు.. వజ్రపుకొత్తూరు: మండలంలోని ఉద్దాన తీరప్రాంత గ్రామాల్లో ఎలుగుబంట్లు భయాందోళన కు గురిచేస్తున్నాయి. బుధ, గురువారాల్లో డోకు లపాడు తీర ప్రాంతంలో రెండు ఎలుగుబంట్లు సంచరించడంతో జీడి రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒంటరిగా తిరగొద్దు ప్రస్తుత సీజన్లో పనస, జీడి పండ్లు తీనేందుకు ఎలుగులు తోటల్లో సంచరిస్తా యి. తోటలకు వెళ్లేటప్పు డు, రాత్రి సమయంతో ఆరు బయటకు వచ్చేటప్పుడు ఒంటరిగా రావొ ద్దు. ఎలుగులను కవ్వించకూడదు. వాటి సంచారాన్ని గమనిస్తూ పలు జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించాం. – రాజనీకాంతరావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కాశీబుగ్గ రేంజ్ చదవండి: సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు! కొడుకును బావిలో పడేసి...ఆపై తండ్రీ ఆత్మహత్య -
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో భార్య కాపురానికి రావడం లేదని బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి ఆందోళన చేపట్టాడు. గత మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు సురేష్ ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం జరగడం లేదంటూ , తన భార్యను పిల్లల్ని పిలిపించి మాట్లాడాలని కోరుతున్నాడు. సురేష్‌కు కుమార్తె,కుమారుడు ఉన్నారు. కాగా, సురేష్‌ను సెల్ టవర్ నుండి దించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సురేష్ భార్యతో పోలీసులు సెల్ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. చదవండి: దారుణం: భార్య, అత్తను గొడ్డలితో నరికి హత్య కూకట్పల్లి: యువతిని ఎరగా వేస్తారు, ఆశపడ్డావో అంతే! -
మద్యం మత్తులో ఏఎస్పీ హల్చల్
కోవూరు(నెల్లూరు జిల్లా): మద్యం మత్తులో పలువురిని దూషించడంతో పాటు చేయి చేసుకున్న ఏఎస్పీ శ్రీధర్, అతని స్నేహితులపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. నెల్లూరు జిల్లా కోవూరు శాంతినగర్‌కు చెందిన పంతంగి దేవేంద్ర తన స్నేహితుడు సూర్యవర్ధన్తో కలిసి ఆదివారం రాత్రి కోవూరు హైవే పై ఉన్న ఓ హోటల్‌కు టీ తాగేందుకు వెళ్లారు. అదే సమయంలో ఏఎస్పీ(వీఆర్) శ్రీధర్, అతని స్నేహితులు మద్యం సేవించి కారులో హోటల్ వద్దకు వచ్చారు. మాస్కులెందుకు వేసుకోలేదంటూ దేవేంద్ర, సూర్యవర్ధన్లను తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు చేయి చేసుకున్నారు. కారులో ఉన్న శ్రీధర్ స్నేహితులిద్దరూ హోటల్ వద్దనున్న మహిళలను అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో బాధితులు కోవూరు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కె.రామకృష్ణారెడ్డి, ఎస్ఐ సీహెచ్ కృష్ణారెడ్డి ఘటనా స్థలికి చేరుకుని ఏఎస్పీని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ్నుంచి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు మేరకు ఏఎస్పీ శ్రీధర్, అతని స్నేహితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కోవూరు ఎస్ఐ తెలిపారు. చదవండి: స్నేహితురాలిని రహస్యంగా తీసుకెళ్లి.. చివరకు ఇలా.. ఆరోగ్యశ్రీ.. నా బిడ్డకు మళ్లీ మాటలిచ్చింది -
ఒంటిపై దుస్తులు తీసేసి యువతి హల్చల్
సాక్షి, బంజారాహిల్స్: మద్యం మత్తులో ఓ యువతి హల్చల్ చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. రహ్మత్‌నగర్‌కు చెందిన యువతి(30) బుధవారం మధ్యాహ్నం భరత్ అనే యువకుడికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపింది. దీంతో భరత్ కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. యువతి కృష్ణకాంత్ పార్కు వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. (చదవండి: పది పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆస్తి కోసం..) జూబ్లీహిల్స్ పోలీసులు కృష్ణకాంత్ పార్కు వెళ్ళి పరిశీలించగా అంతకు అరగంటముందే ఆమె ఆటోలో వెళ్ళినట్లుగా స్థానికులు చెప్పారు. ఆటో నంబర్ ఆధారంగా పోలీసులు బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రహ్మత్‌నగర్‌లో ఆమెను గుర్తించారు. పోలీస్ అవుట్ పోస్ట్‌కు విచారణ కోసం తీసుకురాగా అప్పటికే మత్తులో ఉన్న సదరు యువతి పోలీసులు చూస్తుండగానే ఒంటిమీద దుస్తులు తీసేసి చిందులేసింది. ఇద్దరు మహిళల సాయంతో ఆమెకు సర్దిచెప్పి భరత్‌ను పిలిపించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. (చదవండి: భార్యకు రెండు పెళ్లిళ్లు.. అనుమానంతో హత్య) -
మానసిక రోగి హల్చల్
సాక్షి, మల్కాపురం (విశాఖ పశ్చిమ) : గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా 24 గంటలపాటు ఓ మానసిక రోగి చెట్టుపై కూర్చున్నాడు. ఎవరు ఎంత ప్రయత్నించినా కిందకు దిగలేదు. చివరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది అతికష్టం మీద కిందకు దించారు. వివరాల్లోకి వెళ్తే... ఓ మానసిక రోగి సోమవారం ఉదయం డాక్‌యార్డ్ మార్గం నుంచి సింథియా వైపు వచ్చాడు. అలా వస్తూ సింథియా మలుపు షిప్‌యార్డ్‌కు వెళ్లే మార్గంలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. గంటలు గడిచినా కిందకు దిగకపోవడంతో సమీపంలోని ఆటో స్టాండ్‌లో గల డ్రైవర్లు కిందకు దించే యత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారు వెళ్లిపోయారు. మళ్లీ మంగళవారం ఉదయం స్టాండ్‌కు వచ్చిన ఆటో డ్రైవర్లకు చెట్టుపై మానసిక రోగి కనిపించడంతో మీడియా, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న మల్కాపురం పోలీసులు షిప్‌యార్డ్ ఫైర్ సిబ్బంది సాయంతో రోగిని కిందకు దించారు. అనంతరం మానసిక వైద్యశాలకు తరలించారు. -
గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో చిరుత కలకలం
-
మద్దిలో పాము హల్చల్
సాక్షి, జంగారెడ్డిగూడెం : మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం పాము హల్చల్ చేసింది. ఆలయ పరిసరాల్లో పాము తిరిగాడటంతో సిబ్బంది స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపకులు చదలవాడ క్రాంతికుమార్‌కి సమచారం ఇచ్చారు. ఆయన ఇక్కడకు వచ్చి పామును పట్టుకుని జనావాసాలు లేని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
విశాఖపట్నం: పీపీఈ కిట్‌తో హల్చల్..
-
అమ్మో ఎంత పెద్ద పామో..!
కంచిలి: కింగ్ కోబ్రా గురువారం రాత్రి హల్చల్ చేసింది. డోల గోవిందపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గణేష్.. పోలేరు గ్రామానికి చీకటి పడిన తర్వాత తన మోటారు సైకిల్ మీద వెళుతుండగా, గ్రామం ప్రారంభంలో ఆంజనేయస్వామి విగ్రహం జంక్షన్లో ఈ పాము ఎదురుపడింది. అంత పెద్ద పామును చూసి ఆయన భయపడి బైక్ వదిలేశారు. దీంతో బైక్ పాము మీద పడింది. అంతలోనే స్థానికులు అక్కడకు చేరుకున్నారు. సోంపేటలో ఉండే పాములు పట్టే రాజారావుకు ఫోన్ చేశారు. ఆయన వచ్చి పామును పట్టుకున్నారు. సర్పం 13 అడుగుల పొడవు, 16 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు. -
చిత్తూరులో సైకో వీరంగం
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని యాదమర్రి మండలం మాదిరెడ్డి పల్లె గ్రామంలో శుక్రవారం సురేష్ అనే వ్యక్తి సైకోలా ప్రవర్తించాడు. తనకు అడ్డువచ్చిన గ్రామస్థులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో సురేష్ సైకో ప్రవర్తనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి అతని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సురేశ్ చేతిలో ఉన్న కర్రతో పోలీసులపై తిరగబడ్డారు. దీంతో పాటు ఎస్ఐ నాగేశ్వరరావుపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. అతి కష్టం మీద సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం చిత్తూర్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో కూడా సురేష్ సిబ్బందిపై దాడి చేయబోయాడు. సురేష్ పై ఇది వరకే అత్యాచారం, హత్య కేసులు ఉన్నాయని ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. -
రాజమండ్రిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
-
కత్తితో యువకుడు హల్చల్..
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో శుక్రవారం ఓ యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. అక్కయ్యపాలెం షిర్డీసాయి ఆలయంలో కత్తి పట్టుకొని చచ్చిపోతానని అనిల్ అనే యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. మూడు కిలోమీటర్ల మేర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించాడు. తనను పట్టుకోడానికి ప్రయత్నిస్తే కత్తితో పొడుచుకుంటానని పోలీసులకు హెచ్చరికలు అందించాడు. తనను హరే రామ హరే కృష్ణ దేవాలయానికి తీసుకెళ్లాలని పోలీసులను కోరాడు. దీంతో ద్విచక్ర వాహనంలో అనిల్‌ను తీసుకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మద్యం మత్తులో యువకుడి వీరంగం
-
బాన్సువాడ పోలీస్ స్టేషన్ మూసివేత
సాక్షి, కామారెడ్డి : బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీకి చెందిన ఒక మహిళ(62) కరోనా బారిన పడింది. కాగా కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ కుమారుడు బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు రావడంతో పోలీసులు ఆందోళన చెందారు. తనకు కరోనా వచ్చిందని, టెస్టులు చేయడం లేదని ఆమె కుమారుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి హంగామా సృష్టించాడు. దీనిపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక వైద్యులకు సమాచారం ఇచ్చి ఆమె కుమారుడిని పరీక్ష నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా బాన్సువాడ పోలీస్‌స్టేషన్ ఎదుట బారీకేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్‌ను మూసివేశారు.అయితే దీనిపై మహేశ్ గౌడ్ మాట్లాడుతూ..అనుమానితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వస్తుండడంతో ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయించామన్నారు. పోలీస్‌స్టేషన్‌లో శానిటైజర్లను అందుబాటులో ఉంచామన్నారు. బాధితులు ఎవరు వచ్చినా మాస్కులు ధరించి, శానిటైజ్ చేసుకున్నాకే లోపలికి రావాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు. (భారత్: ఒక్కరోజే 15968 పాజిటివ్ కేసులు) ఎలా వచ్చిందో.. కరోనా వచ్చిన మహిళ వారం క్రితం తన చిన్న కుమారుడికి వైద్యం నిమిత్తం హైదరాబాద్ సూరారంలోని ఓ ఆస్పత్రికి ఆర్టీసీ బస్సులో వెళ్లింది. అక్కడ ఆమెకు ఛాతీ నొప్పి రావడంతో వైద్యులు ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని చికిత్స అందించారు. కరోనా పరీక్షలు కూడా చేశారు. మంగళవారం ఉదయం ఆమె తన ఇద్దరు కుమారులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కారులో బాన్సువాడకు వచ్చింది. మధ్యాహ్నం సూరారంలోని ఆస్పత్రి నుంచి వైద్యు డు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వెంటనే పోలీస్ స్టేషన్లో, ఏరియా ఆస్పత్రిలో రిపోర్టు చేయాలని సూచించారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో ఆమె పెద్ద కుమారుడిని పట్టణంలోని పోలీ స్ స్టేషన్‌కు పిలిపించారు. స్థానిక వైద్యులకు సమాచారం ఇచ్చి, కుటుంబ సభ్యులను పరీక్ష నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా కరోనా వచ్చిన మహిళ బాన్సువాడలో ఎవరినీ కలవలేదని, కుటుంబ సభ్యులు మాత్రమే ప్రథమ కాంటాక్ట్‌లో ఉన్నారని అధికారులు గుర్తించారు. పాజిటివ్ వచ్చిన మహిళతో పాటు ఏడుగురు కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్లో ఉంచారు. (కరోనా లేదని నిరూపించలేక 965 కి.మీ..) 18 మందికి నెగెటివ్.. కాగా జిల్లాపై కరోనా పంజా విసిరింది. ఒకే రోజు పది మంది పాజిటివ్ వచ్చింది. దీంతో కోవిడ్ కేసుల సంఖ్య 34కు చేరింది. ఇందులో 12 మంది రెండు నెలల క్రితమే కోలుకుని ఇంటికి చేరారు. 22 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాకేంద్రం నుంచి ఆదివారం 24 మంది రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వాటి ఫలితాలు మంగళవారం వచ్చాయి. ఆరు పాజిటివ్ రాగా.. 18 నెగెటివ్ వచ్చాయి. కామారెడ్డి పట్టణంలోని అశోక్నగర్కాలనీలో నివసించే 72 ఏళ్ల వ్యక్తికి, వాసవినగర్‌లో నివసించే 37 ఏళ్ల వ్యక్తికి, ఆజంపురాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి, బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తికి, సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తితోపాటు 48 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు. వీరందరూ శనివారంనాటి పాజిటివ్ కేసుల ప్రైమరీ కాంటాక్ట్‌లని పేర్కొన్నారు. జనగామ కేసును హైదరాబాద్‌కు రిఫర్ చేయగా మిగతా వారిని హోం క్వారంటైన్లో ఉంచామన్నారు. కరోనా బాధితుల ప్రైమరీ కాంటాక్ట్‌ల వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఆశోక్నగర్కాలనీలో మరొకరికి.. పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో నివసించే ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా రు. ఆయన అక్కడే ఉంటూ వారానికోసారి కామా రెడ్డి వచ్చి వెళ్తుంటారు. అనారోగ్యానికి గురికావడంతో ఆయన ఆదివారం హైదరాబాద్‌లో కరోనా పరీక్ష చేయించుకోగా.. మంగళవారం పాజిటివ్ వచ్చింది. ఆయన భార్య జిలాలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్లో ఉంచారు. -
చేపల మార్కెట్లో రివాల్వర్‌తో బెదిరింపు..
-
చిరుత చిక్కలే!
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో సీసీ కెమెరాలకు చిక్కిన చిరుతను పట్టుకునేందుకు అటవీ, పోలీసు శాఖల అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గ్రేహౌండ్స్, ఫైరింగ్రేంజ్, నార్మ్, గగన్‌పహాడ్ అటవీ ప్రాంతాన్ని శుక్రవారం ఇరు శాఖల అధికారులు సంయుక్తంగా జల్లెడ పట్టారు. అటవీ శాఖ రంగారెడ్డి జిల్లా రేంజ్ అధికారి విక్రమ్‌చంద్ర, రాజేంద్రనగర్ ఎస్సై సురేశ్ తమ సిబ్బందితో సీసీ కెమెరాలలో కనిపించిన ప్రాంతంతో పాటు బయోడైవర్సిటీ పార్క్, చెరువు, గ్రేహౌండ్స్ రేంజ్ పరిసరాలను పరిశీలించారు. చెరువుతో పాటు బయోడైవర్సిటీ పార్కు, గ్రేహౌండ్స్ ఖాళీ ప్రదేశాల్లో చిరుత అడుగు జాడలు కనిపించాయి. బుద్వేల్ రైల్వే అండర్ పాస్ వద్ద కనిపించిన చిరుత గురువారం రాత్రి నార్మ్లో కనిపించిన చిరుత ఒకటే అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వర్సిటీ ఖాళీ ప్రదేశంలో కనిపించిన అడుగుల ముద్రలు, శుక్రవారం కనిపించిన అడుగుల ముద్రలు పోలి ఉన్నాయని తెలిపారు. చెరువు ప్రాంతంలో చిరుత అడుగు జాడలు స్పష్టంగా కనిపించగా..చిరుత జాడ కోసం మధ్యాహ్నం వరకు వెతికిన అధికారులు అనంతరం తిరిగి వెళ్లిపోయినట్లు చెప్పారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని ప్రజలందరినీ అప్రమత్తం చేశామని అధికారులు తెలిపారు. స్థానికుల భయాందోళన నార్మ్ ప్రాంతంలో చిరుత జాడ కనిపించడంతో రాజేంద్రనగర్ వాసులు ఉలిక్కిపడ్డారు. బుద్వేల్ రైల్వే అండర్ పాస్ వద్ద కనిపించి జాడ తెలియకుండా పోయి గురువారం రాత్రి చిరుత సీసీ కెమెరాలకు చిక్కింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. నార్మ్ ప్రధాన రహదారి పక్క నుంచే మాణిక్యమ్మ కాలనీ, అంబేడ్కర్ బస్తీ, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయా లని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. వామ్మో.. చిరుత! రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి అడవి పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరించడం కలకలం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం మల్కపేట రిజర్వాయర్ కాలువ మరమ్మతు పనులు జరుగుతుండగా.. సమీప ప్రాంతం నుంచి చిరుత వెళ్లడాన్ని ఓ టిప్పర్ డ్రైవర్ తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు చేరవేశాడు. చిరుత నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి జూ పార్కుకు తరలించాలని అక్కపల్లి సర్పంచ్ మధుకర్ కోరారు. మల్కపేట రిజర్వాయర్ కాలువ వెంట వెళ్తున్న చిరుత మళ్లీ పెద్దపులి కలకలం మంచిర్యాల జిల్లా తాండూర్‌తో పాటు గిరిజన గూడేల్లో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మారుమూల అటవీ ప్రాంతం శివారు గూడేల వైపు పెద్దపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తాజాగా గుర్తించారు. నర్సాపూర్, అబ్బాపూర్, బెజ్జాల గిరిగూడేల మీదుగా మాదారం త్రీఇంక్లైన్ శివారు అటవీ ప్రాంతం వరకు పులి అడుగులను శుక్రవారం బెల్లంపల్లి అటవీ రేంజ్ అధికారి మజారొద్దీన్, డిప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి, బీట్ అధికారి తన్వీర్‌ఖాన్ సేకరించారు. పులి పాదముద్రలను కొలతలు తీసుకున్నారు. పులి కదలికలపై నిఘా వేసి ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పులి తిష్ట వేసిన లొకేషన్‌ను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పెద్దపులి పాదముద్ర కొలత తీసుకుంటున్న దృశ్యం -
ఇనుప కంచెలో చిక్కిన చిరుత
చండూరు/ బహదూర్‌పురా (హైదరాబాద్): నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం రాజుపేట తండా సమీపంలో ఓ చిరుతపులి అధికారులను హడలెత్తించింది. తోట చుట్టూ ఉన్న ఇనుప కంచె లో చిక్కుకున్న ఈ చిరుతను బంధించేందుకు అటవీ, పోలీసు శాఖ సిబ్బంది హైరానా పడాల్సి వచ్చింది. ఆరు గంటలపాటు కష్టపడి దానిని పట్టు కున్నా.. హైదరాబాద్ తీసుకెళుతుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. రాజుపేట తండా సమీపంలో ఓ రైతు తన తోట చుట్టూ ఇనుప ఫెన్సింగ్ వేశారు. గురువారం తెల్లవారుజామున నల్లమల అటవీప్రాంతం నుంచి వచ్చిన చిరుత.. పరిసర ప్రాంతంలో ఓ గొర్రెను తిని తోట దగ్గరకు చేరుకున్న సమయంలో ఫెన్సింగ్‌లో కాలు పడటంతో అందులో చిక్కుకుపోయింది. ఉదయం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే మత్తు మం దు ఇచ్చే ప్రయత్నంలో చిరుత ఫెన్సింగ్ నుంచి తప్పించుకుని సిబ్బందిపై దాడి చేసింది. ఈ ఘట నలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. అనంతరం చెట్ల పొదల్లోకి దూరింది. కాగా, మత్తు మందు ప్రయోగించే ఆయుధం సరిగా పనిచేయలేదని తెలుస్తోంది. చిరుతకు ఏడు సార్లు మత్తు మందు ఇచ్చేందుకు ఆయుధాన్ని వాడగా వారి ప్రయత్నా లు ఫలించలేదు. చివరికి 8వ సారి వాహనం దగ్గర చిరుత పడిపోవడంతో దగ్గరగా వెళ్లి మత్తు మందు ఇవ్వడంతో అది స్పృహ కోల్పోయింది. అనంతరం దానిని బోనులో బంధించారు. అయితే, చిరుతను బంధించే క్రమంలో మర్రిగూడ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. చిరుతను పట్టుకునే క్రమంలో ఒక్కసారిగా అది సీఐ మీదకు దూసు కొచ్చింది. వెంటనే ఆయన పక్కనే ఉన్న జీపు పైకి ఎక్కడంతో అది పక్కనుంచి వెళ్లిపోయింది. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చిరుతను బంధించిన అనంతరం హైదరాబాద్‌లో ని జూకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయి నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. కాళ్లు ఇనుప ఫెన్సింగ్‌లో ఇరుక్కుపోవడంవల్ల ఏర్పడిన గాయాలకు తోడు అడవిలో అటూ ఇటూ పరుగెత్తడంవల్ల చిరుతకు గాయాలైనట్లు తెలిసింది. జూ ఆసుపత్రిలో జూపార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఎ.హకీం, విశ్రాంత డాక్టర్ నవీన్ కుమార్, జూ వెటర్నరీ అసిస్టెంట్ వైద్యులు శంభులింగం, కోటి నాడుతో పాటు వీబీఆర్ఐ డాక్టర్లు చిరుతపులి కళేభరానికి పోస్టుమార్టం నిర్వహించారు. గాయాల వల్ల రక్తస్రావం, షాక్, అక్సెషియా (ఉక్కిరిబిక్కిరి) తదితర కారణాలవల్ల చిరుత మృతి చెందినట్లు జూ వెటర్నరీ వైద్యులు తెలిపారు. మృతి చెందిన చిరుతపులి నమూనాలను సేకరించి బీవీఆర్ఐకు పంపించామని జూపార్కు క్యూరేటర్ క్షితిజా తెలిపారు. -
మంచిర్యాలలో ముసుగుదొంగ హల్చల్!
-
హస్తినాపురంలో కారు బీభత్సం
-
కొత్త కాన్సెప్ట్
రుద్రాక్ష, ధన్య బాలకృష్ణ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హల్ చల్’. గణేష్ కొల్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ బాగుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉందనిపిస్తోంది. ట్రైలర్ చూసిన వారు తప్పకుండా సినిమా చూస్తారు’’ అన్నారు. ‘‘మూడు సంవత్సరాలు ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి నిర్మించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఎమ్ఎస్కె డిజిటల్ ద్వారా మల్కాపురం శివకుమార్‌గారు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు’’ అన్నారు గణేష్ కొల్లూరి. ‘‘మంచి కథతో కూడిన ఇలాంటి సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం’’ అన్నారు రుద్రా„Š . ‘‘సరికొత్త కథతో రూపొందిన చిత్రమిది. గణేష్‌గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను’’ అన్నారు శ్రీపతి కర్రి. -
మద్యం మత్తులో యువకుల హల్చల్
చిత్తూరు,చౌడేపల్లె : మద్యం మత్తులో యువకులు చౌడేపల్లెలో బుధవారం సాయంత్రం హల్చల్ చేశారు. చిత్తూరు నగర సమీపంలోని తేనెబండ హరిజనవాడకు చెందిన కొందరు యువకులు వాహనాల్లో బోయకొండ గంగమ్మ దర్శనం కోసం వచ్చారు. దర్శనం అనంతరం బోయకొండ కింద విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఫూటుగా మద్యం సేవించారు. బోయకొండ నుంచి చౌడేపల్లె మీదుగా చిత్తూరుకు బయలుదేరి వెళ్తుండగా చిన్నకొండామర్రి సమీపంలో అదే గ్రామానికి చెందిన సురేంద్ర, మరో మహిళ కలిసి బైక్‌మీద చౌడేపల్లెకు బయలుదేరారు. ఇదే మార్గంలో యువకులు ప్రయాణిస్తున్న టాటా సుమోకు ఎదురుగా మరో వాహనం వచ్చింది. ఈ సందర్భంలో బైక్‌ను సుమో ఢీకొనడంతో అదుపు తప్పి వాహనదారులు కిందపడ్డారు. సుమో డ్రైవర్‌ను, ద్విచక్రవాహనదారుడు సురేంద్ర ప్రశ్నించగా వెంటనే వాహనంలోని యువకులు అతనితోపాటు మరో మహిళను దుర్భాషలాడి, దాడిచేసి గాయపరిచి పరారయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు పలమనేరు మార్గంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో సుమో వెళ్తుండగా చేజ్‌చేసి పట్టుకున్నారు. జరిగిన సంఘటన పై ప్రశ్నించిన పోలీసులు లోకేష్, మంజునాథ్‌పై వారు దాడికి యత్నించారు. కానిస్టేబుళ్లు ఎస్ఐ అనిల్‌కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. వెంటనే ఎస్ఐ సిబ్బందితో అక్కడికి చేరుకోగా వారు పంట పొలాల వైపు పరుగులు తీశారు. ఎస్ఐ, సిబ్బంది వెంటాడి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొన్నారు. క్షతగాత్రులు ఎస్ఐకు ఫిర్యాదు చేశారు. అతిగా మద్యం సేవించి హల్‌చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించి నిందితులను విచారిస్తున్నారు. -
బీభత్సం సృష్టించిన స్పోర్ట్స్ కారు
-
ఛండీగఢ్‌లో యువతి హల్చల్
-
ఇబ్రహీంపట్నంలో కారు బీభత్సం
-
చెడ్డీగ్యాంగ్ హల్చల్
నిజామాబాద్‌అర్బన్: నగరంలో చెడ్డీ గ్యాంగ్ మరోమారు హల్చల్ చేసింది. ముబారక్‌నగర్ శివారు ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి చోరీకి యత్నిం చింది. ఈ ముఠా సుమారు దాదాపు గంట పాటు ఓ ఇంట్లో కలకలం రేపింది. మామ, అల్లుడు అడ్డుకునేందుకు యత్నించగా దాడికి తెగబడింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మాక్లర్ మండలం సింగంపల్లి తండాకు చెందిన తోలియ.. నగరంలోని ఆదర్శనగర్‌లో గల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన నెల రోజుల క్రితమే ముబారక్‌నగర్ ప్రాంతంలోని పెద్దమ్మ ఆలయ సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. చుట్టుపక్కల పెద్దగా ఇళ్లు లేవు. తోలియా, అతని భార్య సవిత, ఇద్దరు పిల్లలతో పాటు అత్తమ్మ చంద్రకళ, మామ గోపి సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. అయితే, అర్ధరాత్రి 2 గంటల సమయంలో నలుగురు సభ్యులు గల చెడ్డీ గ్యాంగ్ తోలియా ఇంటికి చేరుకుంది. చెడ్డీలు, బనియన్లు వేసుకుని వచ్చిన దుండగులు తలుపులు కొడుతూ తెరవాలని అరుస్తూ హల్చల్ చేసింది. ఈ అలజడితో మెలకువ వచ్చిన తోలియా, అతని మామ గోపి హాల్లోకి వచ్చి చూసే సరికి దొంగలు బయట తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మామ, అల్లుడు కలిసి తలుపులు తెరుచుకోకుండా అడ్డుగా నిలబడ్డారు. దీంతో దొంగలు పెద్ద బండరాయితో తలుపును బద్దలు కొట్టి, కిటికీలను ధ్వంసం చేశారు. కర్రలతో కిటికీల నుంచి మామ అల్లుళ్లపై దాడికి పాల్పడ్డారు. అయినా కూడా వారిద్దరు ధైర్యంగా డోర్‌కు అడ్డంగా నిలబడ్డారు. దాదాపు 45 నిమిషాల పాటు చోరుల ప్రయత్నాన్ని వారు నిలువరించారు. ఇదే క్రమంలో తోలియా ‘100’కు ఫోన్ చేయడంతో రూరల్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వస్తున్నట్లు గుర్తించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెళ్తూ వెళ్తూ పగిలిన అద్దం ముక్కలు విసరడంతో గోపిని నుదిటిపై గాయమైంది. వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గాయపడిన గోపి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మామ, అల్లుడు అడ్డుకోక పోతే ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగేదని కుటుంబ సభ్యులు వాపోయారు. గతంలోనూ కలకలం.. చెడ్డీ గ్యాంగ్ గతంలోనూ జిల్లాలో పలుమార్లు పంజా విసిరింది. వినాయక్‌నగర్‌లో అర్ధరాత్రి ఓ అపార్టమెంట్లోకి ప్రవేశించి, చోరీకి యత్నించారు. వినాయక్‌నగర్‌లోనే మరో ప్రాంతంలో దొంగతనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో ఓ కానిస్టేబుల్ చేతి వేలు తెగి పోయింది. అలాగే కామారెడ్డిలో చోరీకి పాల్పడి పారిపోతూ, జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లోనూ దొంగతనానికి యత్నించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో చెడ్డీగ్యాంగ్ సభ్యులు పరారయ్యారు. ఏటా చెడ్డీగ్యాంగ్ జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతోంది. పెట్రోలింగ్ కరువు.. జిల్లా కేంద్రానికి మహారాష్ట్ర సరిహద్దు దగ్గరగా ఉండడంతో, ఆ ప్రాంతానికి చెందిన దొంగల ముఠాలు తరచూ జిల్లాలో పంజా విసురుతున్నాయి. షెట్టర్ గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్ తదితర ముఠాలు మధ్యాహ్నం వేళ రెక్కీ నిర్వహించి రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్నాయి. నరగంలో వరుస చోరీలు జరుగుతున్నా పోలీసుల్లో పెద్దగా స్పందన కరువైంది. దొంగతనాల నివారణపై ప్రత్యేక కార్యాచరణ కొరవడింది. అన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయడం లేదు. పోలీసులు ఎన్నికల హడావుడిలో, బందోబస్తు విధుల్లో ఉండడం, పెట్రోలింగ్ తగ్గడంతో దొంగలు తప పని కానిచ్చేస్తున్నారు. -
అర్ధరాత్రి దోపిడీ దొంగల హల్చల్
-
పాతబస్తీలో కత్తులతో యువకుల హల్చల్
-
‘చెడ్డీ’.. అలర్ట్!
‘చెడ్డీ’ గ్యాంగ్.. ఏడాది కాలంగా రాష్ట్ర పోలీసులకు సవాలుగా మారింది. ఈ గ్యాంగ్ ఎప్పుడు ఏ నగరంపై పడి దోచుకుంటుందోనన్న ఆందోళన ప్రస్తుతం అందరిలోనూ కనిపిస్తోంది. మొన్న ఏలూరులో హల్చల్ చేసిన ఈ గ్యాంగ్.. ఆ తర్వాత కర్నూలు.. తిరుపతి నగరాల్లో అలజడి సృష్టించింది. తాజాగా విశాఖపట్నంలో జరిగిన వరుస చోరీల్లో చెడ్డీ గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడపై ఈ గ్యాంగ్ కన్నేసినట్లుగా నిఘా విభాగాలు అనుమానిస్తున్నాయి. సాక్షి, అమరావతిబ్యూరో : శివారు ప్రాంతాలను మాత్రమే ఎక్కువగా టార్గెట్ చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ విజయవాడపై కన్నేసిందా..? అంటే అవుననే చెబుతున్నాయి రాష్ట్ర నిఘా వర్గాలు. ఈ నేపథ్యంలో నగరంలోకి కొత్తగా ప్రవేశించే వారిపైనా.. శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని సంచార జాతుల్లా జీవించే వారిపై పోలీసు శాఖ పటిష్ట నిఘా పెట్టింది. కాగా.. అర్ధరాత్రి వేళ ఎవరైనా అనుమానితులు తలుపుతడితే తియ్యోద్దంటూ పోలీసు సూచిస్తున్నారు. ఇదీ ‘చెడ్డీ’ గ్యాంగ్ చరిత్ర.. తమ చోరీల కోసం చెడ్డీ గ్యాంగ్ ముందుగా ఓ నగరాన్ని ఎంచుకుంటుంది. ఆ తర్వాత ముఠా సభ్యులంతా అక్కడికి చేరుకుంటారు. స్థానిక రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లలో మకాం వేస్తారు. మరికొందరు నగర శివారు ప్రాంతాల్లో.. రోడ్ల పక్కన గుడారాలు వేసుకుని సంచారజాతుల్లా జీవిస్తారు. పగలంతా రెక్కీ చేయడం రాత్రివేళల్లో దొంగతనాలు చేయడం వీరి తీరు. అంతేకాక పగటిపూట చిన్న చిన్న వ్యాపారులుగా.. రోడ్లపై బెలూన్లు అమ్ముకుంటుంటారు. కొంతమంది బిచ్చగాళ్లు గాను సంచరిస్తారు. ఆ క్రమంలోనే చోరీకి అనువైన ఇంటిని గుర్తిస్తారు. ప్రధానంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లలోనే చోరీలకు ఎంచుకుంటారు. ఆ ఇంటి బాల్కనీలో ఆరేసిన బట్టల ఆధారంగా ఖరీదైన ఇళ్లుగా అంచనా వేస్తారు. దాదాపుగా ముఠాలోని మహిళా సభ్యులే ఈ పనులు చేస్తుంటారని సమాచారం. ఆ సమాచారాన్ని ముఠాలోని పురుషులకు చెబితే.. రాత్రి వేళ చోరీకి రంగం సిద్ధం చేసుకుంటారు. నడుముకు చెప్పులు కట్టుకుని.. చోరీ సమయంలో ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు, ఎక్కడా అలికిడి వినిపించకుండా ఉండేందుకు ఈ గ్యాంగ్ చాలా జాగ్రత్తలే తీసుకుంటుంది. ఒంటికి నూనె లేదా గ్రీజు రాసుకునే చోరీలకు వెళ్తారు. చోరీకి వెళ్లేటప్పుడు అడుగుల శబ్ధం వినిపించకుండా ఉండేందుకు చెప్పుల్ని నడుముకు కూడా కట్టుకుంటారు. చోరీ కోసం ఇనుప వస్తువులు, రాడ్లు, గొడ్డళ్లు వంటి వాటినే ఎక్కువగా వెంట తీసుకెళ్తారు. కొన్నిసార్లు నాటు తుపాకులు కూడా తీసుకెళ్తారు. చోరీ సమయంలో ఎవరైనా అడ్డుపడితే లుంగీలు, తాళ్లతోనే కట్టేస్తుంటారు. అవసరమైతే హత్యలకూ వెనుకాడరు. మకాం షిఫ్ట్.. వరుస చోరీల తర్వాత ఆ ప్రాంతంలో నిఘా పెరిగిందని భావిస్తే.. వెంటనే తట్టా బుట్టా సర్దుకుని మరో నగరానికి వెళ్లిపోతారు చెడ్డీ గ్యాంగ్. దేవాలయాల్లోను వీరు చేతివాటం ప్రదర్శిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదిరత రాష్ట్రాల్లో ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం కమిషనరేట్ పోలీసులు నగరంలో పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపించినా.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. అనుమానితులపై నిఘా.. అనుమానితులపై నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. నేరస్తులు ఎవరైనా ఎలాంటి నేరాలకు పాల్పడ్డా.. తక్షణమే గుర్తించి నేరాలను నివారించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సంచార జాతులుగా వలస వచ్చేవారిపై ప్రత్యేక నిఘా పెడతామని పేర్కొన్నారు. వారి రోజు వారి కార్యకలాపాలపై దృష్టి ఉంచి అనుమానాస్పదంగా ఉంటే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. -
చెలరేగిన చెడ్డీ గ్యాంగ్
గాజువాక: గాజువాకలో చెడ్డీ గ్యాంగ్ చెలరేగింది. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్లను టార్గెట్ చేసుకున్న ముఠా స్థానిక విశ్వేశ్వరయ్య కాలనీలోని మూడు ఫ్లాట్లలో వరుస చోరీలకు పాల్పడి పోలీసులకు సవాలు విసిరింది. మరో రెండు ఫ్లాట్లలో దొంగతనానికి విఫల యత్నం చేసింది. ఈ సంఘటన గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో సంచలనమైంది. బుధవారం అర్ధరాత్రి ఈ చోరీ చోటు చేసుకుంది. దసరా సెలవులకు కుటుంబాలతో సహా ఊరెళ్లిన ఐదుగురి ఫ్లాట్లను గుర్తించిన దొంగలు ఈ దొంగతనాలకు తెగబడ్డారు. గాజువాక క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విశ్వేశ్వరయ్య కాలనీలో 50 బ్లాక్‌లు గల అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన దొంగలు ముందుగా జనం ఉన్న ఫ్లాట్లను గుర్తించారు. ఆ ఫ్లాట్ల నుంచి నివాసులు బయటకు రాకుండా గెడలు పెట్టారు. అనంతరం అంతకుముందే తాము గుర్తించిన హర్షవర్థన బ్లాక్, అశోక బ్లాక్, సీలేరు సదన్‌లోని ఒక్కో ఫ్లాట్‌లోకి దూరి దొరికినదంతా దోచుకుపోయారు. ప్రతి ఫ్లాట్లోను వస్తువులను చిందరవందర చేసేశారు. అనంతరం అదే అపార్టుమెంట్‌లోని శ్రీకృష్ణదేవరాయ బ్లాక్‌లోని రెండు ఫ్లాట్లలో చోరీకి యత్నించినప్పటికీ సెంట్రల్ లాకింగ్ వల్ల తలుపులు తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. గురువారం ఉదయం ఫ్లాట్ల నుంచి బయటకు వచ్చిన నివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటు గాజువాక, అటు దువ్వాడ పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు సంబంధిత ఫ్లాట్లను పరిశీలించి దొంగతనానికి సంబంధించిన వివరాలను సేకరించడానికి ప్రయత్నించారు. ఫ్లాట్ల యజమానులు అందుబాటులో లేకపోవడంతో ఏ ఇంట్లో ఎంత పోయిందన్న సమాచారం లభించలేదు. డాగ్ స్క్వాడ్‌తో దొంగల ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ సమాచారం లభించలేదు. నిక్కర్లు వేసుకున్న తొమ్మిది మంది ఈ చోరీలకు పాల్పడ్డారని నివాసులు పోలీసులకు తెలిపారు. దీంతో చెడ్డీ గ్యాంగ్ పనిగా పోలీసులు భావిస్తున్నారు. 50 యూనిట్లున్న అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేకపోవడంపై పోలీసులు విస్మయం వ్యకం చేశారు. గాజువాక క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగర్లు
-
టీడీపీ ఎమ్మెల్సీ బూతు పురాణం
-
భూవివాదంలో తుపాకీతో రెచ్చిపోయిన జవాన్
-
విజయవాడలో కాల్‌మనీ వేధింపుల కలకలం
-
సికింద్రాబాద్‌లో రౌడీ షీటర్ హల్చల్
-
సంచలనం రేపుతున్న ఎమ్మెల్యే ఆడియో టేపులు
-
అర్ధరాత్రి సైకో హల్చల్..
సాక్షి. నెల్లూరు: నగరంలోని బొడిగాడి తోట రోడ్డు వద్ద ఓ సైకో హల్చల్ చేశాడు. గురువారం అర్ధరాత్రి ఎవరూలేని సమయంలో ఓ ఇంట్లోకి చోరబడి వీరంగం సృష్టించాడు. అది గమనించిన స్థానికులు సైకోని పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. -
రిజిస్ట్రార్ ఆఫీస్‌లో టీడీపీ నేత హల్చల్
-
రైల్వే ఉద్యోగులను పచ్చి బూతులు తిట్టిన మహిళ : వైరల్ వీడియో
పోలీసు అయితే ఏం చేస్తారు...? నా వెంట్రుక కూడా పీకలేరు... చెప్పుతో కొడతా లం... ఇక్కడే కూర్చుంటా.. ఎవడు వస్తాడో రండిరా... ఇవి గుంటూరు రైల్వేస్టేషన్లో ఆదివారం ఓ మహిళ అందుకున్న తిట్ల దండకం. తనకు టికెట్టు ఇవ్వలేన్న కోపంతో రైల్వే అధికారిపై నోటికి వచ్చిన తిట్లు అన్నీ తిట్టేసింది. అంతటితో ఆగకుండా రైల్వే పోలీసులపై కూడా ఒంటికాలిపై లేచింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ టికెట్టు తీసుకోవడానికి గుంటూరు రైల్వే స్టేషన్ కౌంటర్లో నిలబడింది. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి సకాలంలో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమెకు వెళ్లాల్సిన ట్రైన్ కాస్తా వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన మహిళ సదరు ఉద్యోగిపై తిట్ల దండకం అందుకుంది. నోటికొచ్చినట్టు రైల్వే సిబ్బందిని బూతులు తిట్టింది. సమస్య తెలుసుకోవడానికి వచ్చిన రైల్వే పోలీస్‌ని కూడా చెడామడా వాయించేసింది. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. (ప్రసార అర్హం కాని పదాలను తొలగించాం) -
రైల్వే ఉద్యోగులను పచ్చి బూతులు తిట్టిన మహిళ
-
ఎవరడ్డుకుంటారో చూస్తా!
ద్వారకాతిరుమల: ప్రభుత్వ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న మహిళా తహసీల్దారు ముందు ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు. తవ్వకాలను ఎవరడ్డుకుంటారో చూస్తా.. పనులు కానివ్వండంటూ రెవెన్యూ అధికారుల ముందే అతడు హడావిడి చేశాడు. ఇంత ధీమాగా అతడు హల్చల్ చేయడానికి కారణం అతను వెనకున్న టీడీపీ నేతలేనని తెలుసుకున్న తహసీల్దారు చివరకు వెనక్కి తగ్గారు. వివరాలు ఇవి.. ద్వారకాతిరుమల మండలం రాళ్లకుంట గ్రామంలోని సర్వే నంబర్ 91/1ఎ లోని 19 సెంట్ల బండిదారిలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మండల యూత్ అధ్యక్షుడు గుర్రాల లక్ష్మణ్ తహసీల్దారు టీడీఎల్ సుజాతకు బుధవారం ఫిర్యాదు చేశాడు. దీంతో తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తవ్వకం పనులను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. జేసీబీ, ట్రాక్టర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో రాళ్లకుంటకు చెందిన చుక్కా నాని అక్కడికి చేరుకుని పనులు తానే చేయిస్తున్నానంటూ తహసీల్దారుకు చెప్పాడు. అంతటితో ఆగకుండా ఫిర్యాదు చేసింది ఎవరంటూ నోటికొచ్చినట్టు దుర్భాషలాడటం ప్రారంభించాడు. దీంతో నానికి, ఫిర్యాదుదారుడైన లక్ష్మణ్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో అక్కడికి కొందరు టీడీపీ నాయకులు చేరుకున్నారు. దీంతో నాని తహసీల్దారును సైతం లెక్కచేయకుండా పనులను ఎవరు అడ్డగిస్తారో రండి చూస్తానంటూ సవాల్ విసిరాడు. కలెక్టరొచ్చినా భయపడేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. అప్పటికే నియోజకవర్గ ముఖ్య నేత నుంచి తహసీల్దారుకు ఫోన్ రావడంతో ఆమె చేసేది లేక వెనక్కి తగ్గారు. మొక్కుబడి జరిమానాలతో సరి రాళ్లకుంటలో నిర్మిస్తున్న వేబ్రిడ్జికి, ఓ రియల్ ఎస్టేట్ భూమి మెరకకు ఈ మట్టిని తోలుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఒక జేసీబీతోపాటు 9 ట్రాక్టర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. టీడీపీ నేతల ఒత్తిడి కారణంగా తహసీల్దారు జేసీబీతో పాటు, ఒక ట్రాక్టరును మాత్రమే లెక్కలో చూపారు. అక్రమంగా మట్టి తవ్వినందుకు జేసీబీకి రూ.10 వేలు, ఒక ట్రాక్టరుకు రూ.5 వేలు జరిమానా విధిస్తున్నట్టు తహసీల్దారు సుజాత విలేకర్లకు తెలిపారు. -
తిరుమలలో గజరాజుల హల్చల్
-
మద్యం మత్తులో యువకుడి హల్చల్
-
మరో ‘పార్థీ’ అనుమానితుడు పట్టివేత
దర్శి: పట్టణంలోని సందువారిపాలెంలో పిల్లలను ఎత్తుకెళ్లే పార్థీ ముఠాకు చెందిన వ్యక్తిగా అని అనుమానించిన వ్యక్తిని స్థానికులు తాళ్లతో బంధించి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. సందువారి పాలెంలో జక్కా శ్రీను నివాసంలోకి వెళ్లి ఐదేళ్ల బాలుడిని చేయి పట్టుకుని ఇంట్లోంచి బయటకు రమ్మని తీసుకువెళుతుండగా చుట్టు పక్కల నివాసాల వారు చూసి ఎవరని ప్రశ్నించారు. కానీ అతను సమాధానం చెప్పలేదు. దీంతో స్థానికులు దేహశుద్ధి చేసి కట్టివేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లి అప్పజెప్పారు. తనను ఆ వ్యక్తి రమ్మని చెప్పాడంటూ బాలుడు పోలీసులతో చెప్పాడు. అయితే పట్టుబడ్డ వ్యక్తి గడ్డం పెంచుకుని భయానకంగా కనిపిస్తున్నాడు. పోలీసులు ప్రశ్నించగా తన పేరు శీతాకాలం సీతారాముడని, పశ్చిమగోదావరి జిల్లా అని చెప్తున్నాడు. తమలాంటి వాళ్లు 3 వేల మంది ఉన్నామని పిచ్చిగా సమాధానం చెప్తున్నాడు. దీంతో మతి స్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులో ఉంచుకుని విచారిస్తున్నారు. ఆవ్యక్తి గత వారం రోజులుగా దర్శి పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడని స్థానికులు చెప్తున్నారు. ఎవరు మంచి వారో..ఎవరు చెడ్డవారో అర్థం కావడం లేదని వాపోతున్నారు. -
మద్యం మత్తులో యువతి హాల్చల్
-
ఫిల్మ్ నగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్.. యువతి హాల్చల్..
సాక్షి, హైదరాబాద్: ఫిల్మ్ నగర్లో ఓ యువతి మద్యం మత్తులో హాల్చల్ చేసింది. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అంతేకాక ఆ యువతి కారు దిగి పోలీసులు, మీడియాపై రాళ్లతో దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకుంది. వివరాలివి.. నగరంలో ఫిల్మ్‌నగర్ సహా ఏడు ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తాగి డ్రైవింగ్ చేస్తున్న మందుబాబులను పోలీసులు పట్టుకున్నారు. దాదాపుగా 80 కేసులు నమోదు అయినట్లు ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. యువతి, ఆమె స్నేహితుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. ఆ యువతి పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. మహిళా పోలీసులు రంగంలోకి దిగి ఆమెను ఆదుపులోకి తీసుకున్నారు. -
UTF సదస్సులో ఉపాధ్యాయుడి ప్రసంగం
-
మద్యం మత్తులో హెడ్మాస్టర్ వీరంగం
-
అనంతపురంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
-
అర్ధరాత్రి మద్యం మత్తులో వ్యక్తి హల్చల్
-
గాంధీలో వీరంగం సృష్టిస్తున్న మందుబాబులు
-
ఏపీ రాజధానిలో నకిలీ అధికారి హల్చల్
-
ఏపీ రాజధానిలో నకిలీ అధికారి హల్చల్
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిలో నకిలీ అధికారి హల్చల్ చేశాడు. రెవెన్యూ అధికారినంటూ రాజధాని రైతులను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు నకిలీ అధికారి అని తెలియడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. వివరాలు.. తుళ్ళూరు మండలం వెంకటపాలెం చెక్ పోస్టు వద్ద ఓ వ్యక్తి ' నా పేరు చల్లపల్లి ప్రసాద్ రావు.. నేను రెవెన్యూ డిపార్టుమెంట్ లో డిప్యూటి సెక్రటరీగా పని చేస్తున్నాను.. మీరు ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన సర్వే నంబర్ 171 లో ఉన్న రెండెకరాల 75 సెంట్ల పొలానికి హద్దులు లేవు.. పైగా దానిలో 15 సెంట్లు మిగులు భూమి ఉంది.. నేను అడిగినంత డబ్బు ఇస్తే ఈ విషయాన్ని సీఆర్డీఏ కు చెప్పను. లేదంటే మిగుల భూమి గురించి సీఆర్డీఏ అధికారులకు చెప్పి ఈ భూమిని నీకు లేకుండా చేస్తా' అని అల్లూరి రామకృష్ణ అనే రైతును నకిలీ అధికారి బెదిరించాడు. దీంతో బెంబేలెత్తిన రైతు రామకృష్ణ ఊరిలోని పెద్ద మనుషుల్ని ఆశ్రయించాడు. ఆ నకిలీ అధికారి తో పెద్ద మనుషులు పంచాయితీ పెట్టినా లాభం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన వారు అసలు రెవెన్యూ డిపార్డుమెంట్ లో నువ్వు ఏమి చేస్తావు.. అంటూ డిపార్డుమెంట్ లో పని చేస్తున్న కొంత మంది అధికారులు పేర్లు చెప్పి.. వాళ్లు తెలుసా అంటూ నకిలీ అధికారిని గట్టిగా ప్రశ్నించారు. దీంతో తను ఇప్పుడు వేరే డిపార్టుమెంట్‌కు మారినట్టు బుకాయించాడు. అంతేకాకుండా తన అల్లుడు గొల్లపూడిలో తహసీల్ధార్ గా పనిచేస్తున్నాడని తెలిపాడు. తనకు చాలా రాజకీయ పలుకుబడి ఉందని.. మర్యాదగా అడిగిన డబ్బులు ఇవ్వమని చెలరేగిపోయాడు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న మీడియాను చూసి నకిలీ అధికారి పారిపోయాడు. రైతులు అతన్ని పట్టుకోవడానికి వెంటపడినా ఫలితం లేకుండా పోయింది. అయితే పదిహేను రోజుల క్రితం ఇదే వ్యక్తి సీఆర్డీఏ కార్యాలయంలో తాను రెవెన్యూ అధికారిని అని భూములు వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అది సాధ్యపడలేదు. ఈ విషయాన్ని సీఆర్డీఏ అధికారులు గోప్యంగా ఉంచారు. దీంతో సీఆర్డీఏ అధికారులకు, రైతులను బెదిరిస్తన్న నకిలీ అధికారికి సంబంధాలు ఉన్నాయని రాజధానిలో ప్రచారం జరుగుతోంది. -
ఇన్అఆర్బిట్ మాల్లో హిరో నిఖిల్ సందడి
-
హైదరాబాద్ మల్లేపల్లిలో తాగుబోతు వీరంగం
-
రెచ్చిపోయిన మావోయిస్టులు
రాంచి(జార్ఖండ్): జార్ఖండ్ రాష్ట్రం పలమావు జిల్లాలో మావోయిస్టులు హల్చల్ చేశారు. ఒక జేసీబీని, ఒక బైక్‌ను, 11 ట్రాక్టర్లను అగ్నికి ఆహుతి చేశారు. పిపిరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సరాయా గ్రామ సమీపంలో జరుగుతున్న ఓ నిర్మాణం వద్దకు గురువారం సాయంత్రం చేరుకున్న మావోయిస్టులు నిర్మాణంలో వాడుతున్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో అవన్నీ కాలి బూడిదయ్యాయి. వారు అడిగినంత మేర మామూళ్లు ఇవ్వనందునే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధిత కాంట్రాక్టర్ తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్‌లో కారు బీభత్సం.
-
తిరువూరులో ఏసీటీవో పద్మ కలకలం
-
కనిగిరిలో ఆర్టీసీ బస్సు బీభత్సం
కనిగిరి: ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలోలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని కనిగిరి బస్టాండ్ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మతుడు ప్రసాద్(45)గా గుర్తించారు. -
బ్లేడ్ బ్యాచ్ వీరంగం
విజయవాడ: నగరంలో ఓ బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో పట్టపగలే ఓ దుకాణంలో సెల్ ఫోన్ల చోరీకి ప్రయత్నించింది. అడ్డుకోబోయిన వారిపై బ్లేడ్లతో దాడికి యత్నించారు. దుకాణాల సిబ్బంది అంతా రావటంతో నలుగురు పరారయ్యారు. చాకచక్యంగా దుకాణదారులు ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నగరంలో అర్ధరాత్రి అరాచకాలు
-
రెచ్చిపోయిన పంచాయతీ ఛైర్మెన్