
నడిరోడ్డుపై ఆటో డ్రైవర్లపై దాడి
జగిత్యాల: స్థానిక ప్రధాన చౌరస్తాలో యువతి హల్చల్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆటో దిగిన తర్వాత డబ్బులు అడిగిన డ్రైవర్‌పై యువతి రాళ్లతో దాడికి దిగింది. అక్కడే ఉన్న కొందరు యువతి నిర్వాకాన్ని సెల్‌ఫోన్‌లో వీడియోతీశారు. వివరాల్లోకి వెళితే సదరు యువతి కరీంనగర్ నుంచి గోదావరిఖనికి ఆటో ఎంగేజ్ మాట్లాడుకోగా రూ.1200కు బేరం కుదుర్చుకుని అక్కడి నుంచి బయల్దేరారు.
మార్గమధ్యలో డీజిల్ కోసం డబ్బులు అడగ్గా గోదావరిఖనికి వెళ్లిన తర్వాత డబ్బులు ఇస్తానంది. తీరా గోదావరిఖని చౌరస్తాకు చేరడంతో తనవద్ద డబ్బులు లేవని డ్రైవర్‌ను బెదిరిస్తూ దుర్భాషలాడింది. అంతేకాకుండా అక్కడున్న రాళ్లతో డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. దీంతో అక్కడున్న ప్రజలంతా విస్తుపోయారు. చివరకు పోలీసుల జోక్యంతో ఆటోడ్రైవర్‌కు డబ్బులు ఇప్పించారు. మద్యంమత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు స్థానికులు పేర్కొన్నారు.