jagtial
-
Jagtial: మొన్న తల్లి.. నేడు పిల్లలు
పెగడపల్లి (జగిత్యాల జిల్లా) : ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి.. తానూ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన విషాదాంతంగా ముగిసింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ తల్లి శుక్రవారం మృతిచెందగా.. పిల్లలు కృష్ణంత్ (10), మయాంతలక్ష్మి (8) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కన్నుమూశారు. పిల్లల మృతదేహాలను స్వగ్రామమైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి తరలించారు. కాగా, తమ అల్లుడు తిరుపతి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు అదనంగా కట్నం తేవాలని వేధించినందుకే తమ కూతురు ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుందని హారిక తల్లిదండ్రులు అల్లెం మల్లయ్య, పోచవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఆందోళన..పిల్లల మృతదేహాలను ఆదివారం మధ్యాహ్నం మద్దులపల్లికి తీసుకొచ్చారు. అప్పటికే హారిక కుటుంబ సభ్యులు, బంధువులు మద్దులపల్లికి తరలివచ్చారు. హారికతోపాటు పిల్లల మృతికి తిరుపతే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని హారిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. అప్పటివరకు పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు చేయమని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అక్కడికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రవి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి.. -
వీడియో తీసి.. రూ.8.5 లక్షలు వసూలు
జగిత్యాల క్రైం: విలేకరినని పరిచయం చేసుకున్నాడు.. డబ్బులిస్తుంటే వీడియో తీశాడు.. తర్వాత బెదిరించి, పరిశ్రమల శాఖ జగిత్యాల జనరల్ మేనేజర్ యాదగిరి నుంచి పలు దఫాలుగా రూ.8.50 లక్షలు వసూలు చేశాడు. నిందితుడితోపాటు అతనికి సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ఎర్ర యాదగిరి పరిశ్రమల శాఖ జగిత్యాల జిల్లా జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గత నెల 20న విధుల్లో ఉండగా డీపీఆర్వో కార్యాలయ అటెండర్, జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌కు చెందిన బాలె జగన్ వచ్చాడు. రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ తండాకు చెందిన భూక్య సంతోష్‌నాయక్‌ను ఓ చానల్ విలేకరని ఆయనకు పరిచయం చేశాడు.మరుసటి రోజు లోన్ కావాలని..21న సంతోష్‌నాయక్ జనరల్ మేనేజర్ యాదగిరి ఆఫీస్‌కు ఓ మహిళను తీసుకెళ్లాడు. తన బంధువని చెప్పి, సబ్సిడీపై కారు లోన్ కావాలని అడిగాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. రూ.5 వేలను కవర్లో పెట్టి, ఆయన టేబుల్‌పై పెట్టాడు. తర్వాత రహస్యంగా వీడియో తీశాడు. అదేరోజు రాత్రి ప్రెస్ గ్రూప్‌లో పెడతామంటూ ఆ వీడియోను అధికారికి వాట్సాప్ చేసి, బెదిరించాడు. కాసేపటికి సంతోష్‌కుమార్‌కు సంబంధించిన ఒడ్డెలింగాపూర్‌కు చెందిన పాలకుర్తి రాకేశ్, లోక్యానాయక్ తండాకు చెందిన మాలోతు తిరుపతి, భూక్య గంగాధర్‌లు కారులో వచ్చి, యాదగిరిని జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట శివారుకు తీసుకెళ్లారు. రూ.3 లక్షలు డిమాండ్ చేస్తూ కొట్టారు. దీంతో ఆయన రూ.35 వేలు ఇచ్చారు. అవి సరిపోవని చెప్పడంతో మళ్లీ రూ.35 వేలతోపాటు ఫోన్‌పే ద్వారా మరో రూ.30 వేలు ముట్ట జెప్పారు. సంతోష్‌కుమార్ 22న ఫోన్ చేసి, డబ్బులు సరిపోలేదని బెదిరించడంతో కలెక్టర్ కార్యాలయంలోని ఇరిగేషన్ ఆఫీసు వద్ద రూ.2 లక్షలు ఇచ్చారు. 23న మా చానల్ చైర్మన్ ఒప్పుకోవడం లేదనడంతో 25న కలెక్టర్ కార్యాలయ సమీపంలోని వాటర్‌ట్యాంక్ వద్ద రూ.5.50 లక్షలు అప్పగించారు. ఇలా.. నిందితులు మొత్తం రూ.8.50 లక్షలు వసూలు చేశారు.బెదిరింపులు ఆగకపోవడంతో ఫిర్యాదు..అయినా, బెదిరింపులకు పాల్పడటంతో అనుమానం వచ్చిన జీఎం యాదగిరి 30న జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. భూక్య సంతోష్‌కుమార్, పాలకుర్తి రాకేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.1.75 లక్షల విలువైన బంగారం, రూ.16 వేలు, రెండు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. వసూలు చేసిన డబ్బులో నుంచి కొంత మొత్తం తీసి, సంతోష్‌కుమార్ తన అప్పులు కట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్న తిరుపతి, గంగాధర్, జగన్ పరారీలో ఉన్నారని, త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్ పాల్గొన్నారు. -
జగిత్యాలలో పులి సంచారం..భయాందోళనల్లో ప్రజలు
సాక్షి,జగిత్యాలజిల్లా:జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పులి తిరుగుతోందన్న ప్రచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పులి జనవరి 23న గుండు బాబు అనే రైతుకు చెందిన ఆవుపై దాడి చేసింది. పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు.ఎంత గాలించినా పెద్దపులి ఆచూకీ దొరకలేదు. తాజాగా పులి అడుగులు కనిపించడంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. అధికారుల పరిశీలనలో అవి పులి అడుగులుగానే గుర్తించారు. పులి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి అడవుల వైపు వెళ్లినట్టుగా అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండ: ఆ సినిమా చూసి..మృతదేహం మాయం చేశాడు -
కూతురు పుట్టిందని.. సెల్ఫోన్లు పంచిపెట్టారు!
సారంగాపూర్: కూతురు పుట్టడంతో.. మహాలక్ష్మి పుట్టిందని ఆ దంపతులు సంబరపడ్డారు. తమ సంతోషాన్ని పదిమందితో పంచుకోవాలని సంకల్పించారు. ఈ మేరకు వారు సోమవారం గ్రామంలోని 25 మంది ఆటో డ్రైవర్లకు రూ.3.5 లక్షల విలువ చేసే సెల్ఫోన్లు బహూకరించారు. మరో 1,500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దీనికి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ వేదికగా మారింది. గ్రామానికి చెందిన ఓగుల అజయ్, అనీల దంపతులకు 18 రోజుల క్రితం కూతురు జన్మించింది. దీంతో తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడ్డారు. ఆ సంతోషంతో గ్రామంలోని ప్రతి ఆడబిడ్డకు (1,500 మంది మహిళలకు) ఇటీవల చీరలు పంపిణీ చేశారు. తాజాగా ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కటి రూ.14 వేల విలువైన సెల్‌ఫోన్ అందజేశారు.అజయ్ పెళ్లికి ముందు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ.30 కోట్ల ప్రైజ్‌మనీ వచ్చింది. తరువాత స్వదేశానికి వచ్చిన ఆయన.. శ్రీకృష్ణ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల చదువుకు.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, ఆలయాల నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు. చదవండి: ఒక్కరే టీచర్.. ఇద్దరు విద్యార్థులు -
పార్టీ మారిన నేతలు.. అసెంబ్లీలో ఏ ముఖంతో మాట్లాడతారు: కవిత
సాక్షి, జగిత్యాల: జగిత్యాల అంటే బీఆర్ఎస్ అడ్డా అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేసిందని ఘాటు విమర్శలు చేశారు.ఎమ్మెల్సీ కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జగిత్యాల అంటే బీఆర్ఎస్ అడ్డా. మీరు గెలిపించిన నాయకుడు పార్టీకి ద్రోహం చేసిన వెళ్లిపోయాడు. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతాడో చూద్దాం. జగిత్యాలకి ఒక్క రూపాయి రాలేదు, జగిత్యాలలో అభివృద్ధి ఏమీ జరగలేదు.పైసల కోసం సంజయ్ పార్టీ మారాడు. పైసలా కోసం పార్టీ మారిన వ్యక్తులు నాయకులే కాదు. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది మీలో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. కేసీఆర్‌కు సైనికులుగా మీరంతా ఉన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేసింది. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అంటూ ాటు వ్యాఖ్యలు చేశారు. -
అక్క అదృష్టం.. సూపర్ పోలీసులు
-
ధర్మపురిని దర్శిస్తే... యమపురి ఉండదట !
ధర్మపురి: ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం ప్రాంగణంలోనే యమధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడి యమధర్మరాజు విగ్రహం దేశంలోనే అరుదైనదిగా చెబుతుంటారు. భక్తులు ముందుగా యమధర్మరాజును దర్శించుకున్న తర్వాతే శ్రీలక్ష్మీనృసింహ, వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. యమధర్మరాజు భరణి జన్మనక్షత్రం సందర్భంగా ప్రతి నెలా ఆలయ ప్రాంగణంలో ఆయుష్షు హోమం, హారతి, మంత్రపుష్పం తదితర పూజలు చేస్తారు. ఏటా దీపావళి పర్వదినం సందర్భంగా యమ ద్వితీయ వేడుకలు నిర్వహిస్తారు. యమ ద్వితీయ రోజు యమధర్మరాజు నరక ద్వారాలను మూసివేసి తన సోదరి అయిన యమి ఇంటికి వెళ్లి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. నరక ద్వారాలు మూసిన సందర్భంగా ఆరోజు మృతిచెందిన వారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని నమ్మకం. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వస్తుంటారు. యమధర్మరాజు ఆలయంలో ఆయుష్షు హోమం ఇదీ ఆలయ ప్రాశస్త్యం పూర్వం యముడు తాను చేసిన పాపాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. మనస్సుకు శాంతి కావాలని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు. చివరగా నృసింహస్వామిని దర్శించుకునేందుకు ధర్మపురికి చేరుకున్నాడు. పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి.. నృసింహుడిని శరణు వేడుకుంటాడు. స్వామి అనుగ్రహం లభించి పాప విముక్తుడయ్యాడు. నృసింహుని కృపతో ఆలయంలో దక్షిణ దిశలో వెలిశాడు. ముందు భక్తులు తనను దర్శించుకున్న తర్వాతే నృసింహుడిని దర్శించుకునేలా వరం పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి. కాగా యముడు గోదావరి నదిలో స్నానం ఆచరించిన చోట యమగుండాలు అనే పేరు వచ్చింది. క్రీ.శ 850– 928 నాటి ఆలయం ధర్మవర్మ అనే రాజు పాలించినందుకు ధర్మపురికి ఆ పేరు వచ్చింది. ఈ క్షేత్రం క్రీ.శ. 850– 928 నాటి కంటే ముందునుంచే ఉన్నా.. క్రీ.శ. 1422–1436 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. అనంతరం 17వ శతాబ్దంలో నృసింహ ఆలయాన్ని పునరుద్ధరించినట్టు చరిత్ర చెబుతోంది.మా ఇలవేల్పు లక్ష్మీనృసింహుడు ధర్మపురి లక్ష్మీనృసింహుడు మా ఇంటి ఇలవేల్పు. స్వామివారి దర్శనం కోసం వస్తూనే ఉంటాం. ఇక్కడున్న యమ ధర్మరాజును దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని మా నమ్మకం. – భారతి, భక్తురాలు, కరీంనగర్యముని దర్శనం కోసం వస్తాం ధర్మపురిలోని యమ ధర్మరాజు దర్శనం కోసం వస్తుంటాం. దేశంలో ఇలాంటి ఆలయం ఎక్కడా లేదని అంటుంటారు. అందుకే ఏటా యమున్ని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో వస్తాం. – సాహితి, భక్తురాలు, మంచిర్యాలఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ధర్మపురిలోని యమధర్మరాజు ఆలయాన్ని దేశంలోనే అరుదైనదిగా భావిస్తారు. అందుకే యముడు, లక్ష్మీనృసింహుని దర్శనం కోసం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. – శ్రీనివాస్, ధర్మపురి ఆలయ ఈవో -
ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ ఫ్రాడ్
-
ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది: హరీశ్‌రావు
సాక్షి,జగిత్యాల: రైతు సీఎం కేసీఆర్ అయితే,బూతుల సీఎం రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు విమర్శించారు. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న హరీష్‌రావు మాట్లాడారు.‘ఎమ్మెల్యే సంజయ్ రైతుల కష్టాలు చూసిండు కాబట్టే పాదయాత్ర చేపట్టిండు. ధాన్యం దళారుల పాలైపోయింది. రూ.500 బోనస్ ఇస్తానన్నాడు. బోనస్‌తో కలిపి 2820 రూపాయలు క్వింటాలుకు అందాల్సి ఉంటే పద్దెనిమిది,పందొమ్మిది వందలకే దళారులకు అమ్ముకుంటున్రు.వడ్లు కొన్న 24 గంటల్లో పైసలు పడాలని నాడు కేసీఆర్ చెబుతుండే.ఈ కాంగ్రెస్ ప్రభుత్వానివి మాటలెక్కువ,పని తక్కువ. ఎన్నికల సమయంలో కూడా రైతుల విషయంలో రాజకీయం చేసిన్రు, రైతుబంధు విషయంలో ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసిన్రు. ఈ సర్కారు వచ్చాక ఒక్క విడత కూడా రైతుబంధు పడలే. దాన్ని ప్రశ్నించడానికే మా సంజయ్ పాదయాత్ర చేసిండు.అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాండ్ పేపర్లు రాసిచ్చిండు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒట్లు పెట్టిండు రేవంత్. రైతు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తా అన్నడు. రుణమాఫీ అయిందా..?రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు కొందరు రైతుల మిత్తీ పెరిగి ఇబ్బందులు పడుతున్నారు.రైతుబంధుకు, రుణమాఫీకి డబ్బుల్లేవంటగానీ మూసీకి మాత్రం లక్షా యాభై వేల కోట్ల ఖర్చు పెడతానంటుండు రేవంత్ రెడ్డి. 24 గంటల కరెంట్ ఇచ్చి చూపిన ఘనత కేసీఆర్‌ది. మా సంజయ్ పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమే..రేపు ముందర ఉంది 70 ఎంఎం సినిమా.జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తిగా దండోరా ప్రకటించాం’అని హరీశ్‌రావు అన్నారు.ఇదీ చదవండి: ఢిల్లీలో హీట్.. ఇటు కేటీఆర్..అటు రేవంత్.. గవర్నర్ కూడా -
కాళ్ల పారాణి ఆరకముందే.. వధువు కుటుంబంలో విషాదం
సాక్షి, జగిత్యాల జిల్లా: పచ్చని పందిళ్లు..మేళతాళాలు.. మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాలతో వధూవరులు ఏకమయ్యారు. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ వధువు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ వధువు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం ఉదయం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వధువు తల్లిదండ్రులు చావు బతుకులు మద్య కొట్టుమిట్టాడుతుంటే అన్న , అతని స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయారు. వధువు వివాహం జరిగిన గంటల వ్యవధిలో ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయిజగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండలో రిసెప్షన్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న వధువు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారును జగిత్యాల డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అన్న సంకీర్త్, స్నేహితురాలు రాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వెనుక సీట్లో కూర్చున్న వధువు తల్లి,దండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కాంగ్రెస్‌లో దశాబ్దాల పోరాటం మాది.. నేడు కంచం లాక్కున్నట్టుంది: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉండి పోరాటం చేశామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్ళు వచ్చి కంచం లాక్కున్నట్టుంది మా పరిస్థితి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.జగిత్యాలలో నేడు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాటం చేశాం. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్లు వచ్చి కంచం లాక్కున్నట్టుంది మా పరిస్థితి. విప్ లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జగిత్యాల కాంగ్రెస్ నాయకులకు ఆత్మస్థైర్యం కల్పించే విధంగా అండగా ఉండాలి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకుందాం. కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. నవంబర్ నెల చివరి వరకు సర్వే రిపోర్ట్ వస్తే డిసెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక చేసుకోవచ్చు. తద్వారా జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని పదేళ్లు నిండా ముంచారు. పదవులు లేకపోతే కేటీఆర్, కేసీఆర్ ఉండలేకపోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టుగా శ్వేతపత్రం విడుదల చేశారు. చేసిన అప్పులు కొరకే ప్రజలను క్షమించమంటూ కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడని ప్రజలకు వివరించాలి. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. -
జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య కేసులో కీలక పరిణామం
జగిత్యాల జిల్లా: జిల్లాలో సంచలనం రేపిన కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు బత్తిని సంతోష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నిందితుడి వివరాల్ని వెల్లడించారు. నిందితుడు సంతోష్ గ్రామంలో గీతకార్మికుడు. నిందితునిపై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయి. 15 సంవత్సరాలుగా నిందితుడికి భూ తగాదా కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు పెట్టించింది కూడా గంగారెడ్డే. కొద్ది రోజుల క్రితం కేసు విషయంలో రాజీ కుదుర్చుకునేందుకు సంతోష్ ప్రయత్నించాడు. ఆ సమయంలో గంగారెడ్డి,సంతోష్ మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి గంగారెడ్డిపై సంతోష్ కోపం పెంచుకున్నాడు. పథకం ప్రకారం బైక్‌పై హోటల్ నుంచి ఇంటికి వెళ్తున్న గంగారెడ్డిని కారుతో ఢీకొట్టాడు. అనంతరం హత్య ఎస్పీ తెలిపారు. నిందితుడి వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ వివరించారు.ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి హత్య జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డిని 20 ఏళ్ల వయస్సున్న సంతోష్ అనే యువకుడు దారుణంగా హత మార్చాడు. పథకం ప్రకారం ముందుగా హోటల్ నుంచి ఇంటికి వెళ్తున్న గంగారెడ్డిని వెంటాడి కారుతో ఢీకొట్టాడు. కింద పడిపోయిన గంగారెడ్డిపై 20కిపైగా కత్తిపోట్లు పొడిచాడు. హత్య చేసి పారిపోతున్న వీడియో సీసీ కెమెరాల్లో రికార్డైంది. కొన ఊపిరితో ఉన్న ఆయనను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. -
జీవన్‌రెడ్డి అలక.. స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,హైదరాబాద్: జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి వ్యవహారంపై మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం(అక్టోబర్ 23) స్పందించారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్‌పై సీరియస్‌గా ఉన్నామన్నారు. మర్డర్ ఎవరు చేసినా ఎవరు చేయించినా వదిలేది లేదన్నారు. జిల్లా ఎస్పీతో ఈ విషయమై ఇప్పటికే మాట్లాడామన్నారు. ‘జీవన్ రెడ్డితో ఇప్పటికే పీసీసీ చీఫ్ మాట్లాడారు. జీవన్‌రెడ్డితో నేను కూడా మాట్లాడుతా. జీవన్‌రెడ్డి పార్టీలో అత్యంత సీనియర్ నేత.. ఆయన సేవలను మేము వినియోగించుకుంటాం. పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించం. చనిపోయిన గంగారెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. అందరితో సమన్యాయం చేసుకోని మాట్లాడాలని పీసీసీ చీఫ్ నాకు సూచించారు’అని శ్రీధర్‌బాబు తెలిపారు.ఇదీ చదవండి: అవమానాలు చాలు ఇకనైనా బతకనివ్వండి : జీవన్‌రెడ్డి -
TG: జీవన్‌రెడ్డి వ్యవహారంపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గంగారెడ్డి హత్యను పార్టీ సీరియస్‌గా తీసుకుందని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఈ విషయమై మహేష్‌కుమార్ గౌడ్ మంగళవారం(అక్టోబర్ 22) మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ నేత గంగారెడ్డి హత్య వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మాట్లాడాను.జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు హత్యకు గురికావడంతో ఆయన ఆవేదనతో ఉన్నారు.జీవన్ రెడ్డి పార్టీ సీనియర్ నేత ఆయన ఆవేదనను అర్థం చేసుకుంటాం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవన్నీ త్వరలో పరిష్కారమవుతాయి. జీవన్‌రెడ్డి అంశాన్ని మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగించాం. ఆయన త్వరలో అన్ని సర్దుకునేలా చేస్తారు’అని మహేష్‌కుమార్ గౌడ్ చెప్పారు.ఇదీ చదవండి: జగిత్యాలలో కాంగ్రెస్ నేత దారుణ హత్య -
ఫారెస్ట్ ఆఫీస్‌లో లిక్కర్ పార్టీ.. ముగ్గురు అధికారులపై వేటు
సాక్షి, జగిత్యాల జిల్లా: దసరా వేడుకలకు అటవీశాఖ కార్యాలయాలన్నే బార్ అండ్ రెస్టారెంట్‌గా మార్చేసిన అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దసరాకు ఒక రోజు ముందు నుంచే కార్యాలయంలో మందు పార్టీతో పాటు, అడవి జంతువుల మాంసంతో అధికారులు విందు చేసుకున్నారు. చిత్రీకరిస్తున్న మీడియాపైనా అధికారులు చిందులు తొక్కారు మీడియా కథనాలతో అటవీ శాఖ అధికారులు స్పందించారు.విచారణ చేపట్టిన అటవీశాఖ.. జగిత్యాల డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అరుణ్ కుమార్‌తో పాటు, ముత్యంపేట బీట్ ఆఫీసర్ సాయిరాంపై సస్పెన్షన్ వేటు వేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వాచర్ లక్ష్మణ్‌ను విధుల నుంచి తొలగించింది.ఇదీ చదవండి: TG: బస్సు ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ -
డిక్లరేషన్ కోసం ఢీ
జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతులు వివిధ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా షరతుల్లే కుండా రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధర, బోనస్, మూతపడిన చక్కర ఫ్యాక్టరీని తెరిపించాలన్న డిమా ండ్లతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లా నలు మూలల నుంచి వేలాదిమంది రైతులు తరలిరాగా.. నిజా మాబాద్ రోడ్డులోని మార్కెట్ యార్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్, పటేల్‌చౌక్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు.దాదాపు 4 గంటల పాటు ఆందో ళన నిర్వహించారు. కథలాపూర్‌కు చెందిన ఒక రైతు సొమ్మ సిల్లి పడిపోవడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కలె క్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించి న కలెక్టర్ సత్యప్రసాద్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.అనంతరం రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రూణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్య క్రమంలో రైతు వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు మిట్టపల్లి తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్నె రాజేందర్, బందెల మల్లన్న, బద్దం మహేందర్, వందలాది మంది రైతులు పాల్గొన్నారు. -
ఒకటి కాదు.. రెండు కాదు.. ఓకే వ్యక్తికి 5 ప్రభుత్వ ఉద్యోగాలు
-
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. నడిరోడ్డుపై టైర్లు ఊడిపోయి..
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో బస్సు రోడ్డుపై కుంగిపోయింది. అధిక లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.కాగా, జగిత్యాల నుండి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు ప్రమాదానికి గురైంది. అయితే, బస్సులో దాదాపు 150 మంది ప్రయాణీకులు ఎక్కారు. దీంతో, బస్సు కొంత దూరం వెళ్లగానే అధిక లోడ్ కారణంగా టైర్లు ఊడిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్ధంతో బస్సు రోడ్డుపై కుంగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన పరిణామంతో ఏమైందో అర్థం కాక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ ఎంతో చాకచక్యంగా బస్సును నిలిపాడు.మరోవైపు.. ఈ ప్రమాదం కారణంగా ఊడిపోయిన బస్సు వెనుక భాగంలోని రెండు చక్రాలు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడిపోయాయి. కాగా, ఈ ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, వరుస సెలవుల కారణంగా ప్రయాణీకులు స్వగ్రామాలకు వెళ్తున్నారు. -
గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే.. ఎమ్మెల్యే సంజయ్‌కు కేటీఆర్ చురకలు
సాక్షి, జగిత్యాల: గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను ఉద్ధేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలకు పట్టిన శని పోయిందని నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనషుల విలువ తెలుస్తుందని తెలిపారు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు. గట్టి నాయకులు కొట్టుకుపోరని అన్నారు. గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమేనని తెలిపారు.కార్యకర్తలు ఎమ్మెల్యేను తయారు చేశారు కానీ.. ఎమ్మెల్యే, కార్యకర్తలను తయారు చేయలేదని తెలిపారు. వేల మంది కష్టపడితే ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇప్పుడు దొంగల్లో కలిశాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతులకు ఆశపడి పోయిండని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బుద్ది ఇవాళ తెలిసి వచ్చిందన్నారు.‘అభివృద్ధి కోసం పోయినా అని సంజయ్ అన్నాడు. జగిత్యాల జిల్లా రద్దు చేస్తా.. మెడికల్, నర్సింగ్ కాలేజీ రద్దు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నందుకు సంజయ్ కాంగ్రెస్‌లోకి వెళ్లిండా..? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4500 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినందుకు రద్దు చేయమని పోయావా..? ఏ అభివృద్ధి ఆశించి పోయిండు సంజయ్. ఆయన పోయింది ఒక్కదాని కోసం..వియ్యంకుడి బిల్లులు రావాలి.. ఆయన క్రషర్ ఆగొద్దని పోయిండు. సొంత అభివృద్ధి కోసం పోయిండు.. జగిత్యాల అభివృద్ధి కోసం పోలేదు. ఎమ్మెల్యే సంజయ్‌కు దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలి.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది కాంగ్రెస్ పార్టీనే. దేశంలో ఆయారాం, గయారాం సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెసే. దేశంలో ఎన్నో ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశాయి. స్థానిక సంస్థల్లో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. జగిత్యాల ఎమ్మెల్యే తనకు తానే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు.2014 తర్వాత రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి జైలుకు పోయాడు. మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు. టీడీపీ, బీఎస్పీ నుంచి మూడింట రెండొంతుల మంది మన పార్టీలో రాజ్యాంగబద్ధంగా విలీనం అయ్యారు. మనం రాజ్యాంగాన్ని, చట్టాన్ని తుంగలో తొక్కలేదు. 2014లో టీడీపీ నుంచి 15 మంది గెలిస్తే 10 మంది, బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు కలిసి బీఆర్ఎస్లో విలీనం అయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి 18 మంది గెలిస్తే.. 12 మంది చేరారు. రాజ్యాంగబద్దంగా మూడింట రెండొంతుల మంది చేరారు. ఒక్కొక్కరు వచ్చి కండువా కప్పుకోలేదు. ఆ పని కేసీఆర్ చేయలేదు అని కేటీఆర్ వివరించారు.పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలను కుక్కల మాదిరి రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఎవరు పిచ్చికుక్క.. ఎవర్నీ రాళ్లతో కొట్టిచంపాలి. మీ చెమట, మీ రక్తం ధారపోసి గెలిపించాక పార్టీ ఫిరాయింపులు చేస్తే అలాంటి వారిని రాళ్లతో కొట్టిచంపమని రేవంత్ రెడ్డే చెప్పాడు. మరి ఎవర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలి..? ఎవర్నీ రాళ్లతో కొట్టాల్సిన అవసరం లేదు కానీ.. రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే.. నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా.. ఓట్లతో కొట్టి ఆ ఆరుగురిని రాజకీయంగా శ్వాశతంగా సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా.. ట్విస్ట్ ఇచ్చిన జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం, తనకు సమాచారం లేకుండానే ఇదంతా జరగిందంటూ టి. జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఇవాళ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన ఈ పంచాయితీలో.. ఆయన్ని బుజ్జగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఆయన మాత్రం రాజీనామాకే మొగ్గు చూపిస్తున్నారు.సోమవారమంతా జగిత్యాల కేంద్రంలో హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో.. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో జీవన్ రెడ్డి సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. జగిత్యాల నుంచి కాంగ్రెస్ శ్రేణులంతా తనకు మద్దతుగా గాంధీభవన్‌కు రావాలంటూ ఆయన పిలుపు ఇవ్వడంతో.. అక్కడే ఆయనతో అధిష్టానం సంప్రదింపులు జరుపుతుందని అంతా భావించారు. ఈలోపు ఆయన మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఉదయం అసెంబ్లీకి వెళ్లి కార్యదర్శికి తన రాజీనామా లేఖ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ హుటాహుటిన నగరంలోని జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈలోపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఫోన్ చేసి రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని జీవన్‌రెడ్డిని కోరారు. తాను హైదరాబాద్‌కు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ‘‘నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. నా ప్రమేయం లేకుండా జరగాల్సిందంతా జరిగింది. నేను పార్టీ మారను. ఏ పార్టీ నుండి నాకు కాల్స్ రాలేదు. బీజేపీ నుంచి ఎవరూ నన్ను సంప్రదించలేదు. నన్ను ఏ పార్టీ ప్రభావితం చేయలేదు. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. నాతో కాంగ్రెస్ ఇంచార్జీ మున్షీ మాట్లాడారు. నిన్నటి నుండి మంత్రులు మాట్లాడుతున్నారు’’ అని జీవన్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. జీవన్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.శ్రీధర్ బాబు దౌత్యం విఫలం?సంజయ్ చేరిక ఎపిసోడ్లో.. సోమావారమంతా జీవన్ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో జీవన్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంపై నిరసనగా కార్యకర్తల భేటీలోనే జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డిని బుజ్జగించే యత్నం చేశారు. అయితే జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపినా ఫలించలేదు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి, కార్యకర్తల మనోభావాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. దీంతో.. ఆయనను ఒక్కరోజు గడువుకోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన అర్ధరాత్రి హైదరాబాద్‌కు వచ్చారు.నన్ను సంప్రదించకుండా ఎలా? జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌కు విధేయుడిగా కొనసాగుతున్న తనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలిసింది. తన అవసరం పార్టీకి లేదని భావించే, కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని ఆయన అన్నట్టు సమాచారం. మూడు విడతలు తలపడిన జీవన్‌రెడ్డి, సంజయ్ జగిత్యాల నియోజకవర్గంలో జీవన్‌రెడ్డి ప్రస్థానం 1983 నుంచి మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2014 నుంచి మూడు పర్యాయాలు సంజయ్, జీవన్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో జీవన్‌రెడ్డి గెలిచినప్పటికీ, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ చేతిలో ఓడిపోయారు. 2024లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా పరాజయం తర్వాత 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలావుండగా కాంగ్రెస్‌లో సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కో ఆర్డినేటర్ పదవీకి వాకిటి సత్యంరెడ్డి రాజీనామా చేశారు. -
జగిత్యాల కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. ఎమ్మెల్సీకి జీవన్ రెడ్డి రాజీనామా?
సాక్షి, జగిత్యాల: తెలంగాణ కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ నడుస్తోంది. సీనియర్ నేతలకే పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరికపై స్థానిక నేత జీవన్ రెడ్డికి అధిష్టానం సమాచారం ఇవ్వలేదు. ఇక, సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసహనం నెలకొంది. దీంతో, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, సోమవారం ఉదయం నుంచే జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు.. జీవన్‌తో అధిష్టానం మాట్లాడుతున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. అంతకుముందు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రతీ రాజకీయ పార్టీ వారి సిద్దాంతాలకు అనుగుణంగా పని చేయాలి.. పోరాటం చేయాలి. రాష్ట్రంలో ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాల్సిన పనిలేదని నా భావన’ అని కామెంట్స్ చేశారు. అయితే, జీవన్ రెడ్డి ఇలా కామెంట్స్ చేసిన మరుసటి రోజే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారు విశేషం.సీఎం రేవంత్ సమక్షంలో ఆదివారం సంజయ్ కుమార్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో రెండు పవర్ సెంటర్స్‌పై విస్తృత చర్చ నడుస్తోంది. కాగా, జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ప్రత్యర్థులుగా ఉన్న విషయం తెలిసిందే. -
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో మాజీ సీఎం కేసీఆర్ బస్సును ఆపి ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల అధికారులకు సహకరించారు. బస్సులో ఎలాంటి నగదు లేకపోవడంతో ఎన్నికల అధికారులు వెనుదిరిగారు. కాగా మరికాసేపట్లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేసీఆర్ బస్సు యాత్ర చేరుకోనుంది. నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. మంగళవారం కామారెడ్డి లో పర్యటించనున్నారు. జగిత్యాలలో కేసీఆర్ బస్సును తనిఖీ చేస్తున్న ఎన్నికల అధికారులుఎన్నికల అధికారులకు సహకరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/y19WeT2S7D— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024 -
దారి తప్పుతున్న పోలీస్ సిబ్బంది
జగిత్యాలక్రైం/మెట్పల్లి: జిల్లాలో కొందరు పోలీస్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖకు కళంకం తెస్తోంది. శాంతిభద్రతల విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ప్రజల మెప్పు పొందేలా ఉన్నతాధికారులు వ్యవహరిస్తుంటే కిందిస్థాయిలో మాత్రం కొందరు సిబ్బంది ఖాకీ చొక్కాను అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేస్తూ పోలీస్ శాఖను అభాసు పాల్జేస్తున్నారు. దారి తప్పిన సిబ్బందిపై ఉన్నతాధికారులు వారం వ్యవధిలోనే వేటువేయడం ఇందుకు అద్దం పడుతోంది. జేబులు నింపుతున్న అక్రమదందాలు పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల నుంచే కాకుండా బయట అక్రమదందాలు నడిపే వారి నుంచి కూడా కొందరు సిబ్బంది వసూళ్లకు పాల్ప డుతున్నారు. ఇసుక, పేకాట, బెల్టు, మద్యం, కల్లు, దాబాలు, రేషన్ బియ్యం తదితర దందాలు చేసే వారి నుంచి నెలవారీగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్టేషన్ల ఖర్చులతో పేరుతో కొన్నిచోట్ల ఎస్హెచ్ఓలు ఈ వసూళ్లకు పాల్పడుతుంటే.. కింది సిబ్బంది సైతం వారినే అనుసరిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కొన్ని స్టేషన్లలో సివిల్ పంచాయితీలకు పెద్దపీట వేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. సివిల్ కేసుల్లో పోలీసులు తల దూర్చరాదు. కానీ ఈ కేసుల్లో అధిక సొమ్ము వస్తుందనే ఆశతో ఎక్కువగా ఇలాంటి వాటిపైనే దృష్టి పెడుతున్నారు. ఉన్నతాధికారుల చర్యలతో దారికొచ్చేనా..? అక్రమ వసూళ్లు, మహిళల పట్ల వంకరబుద్ధి ప్రదర్శిస్తున్న పోలీస్ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో జరుగుతున్న పోలీ సుల వ్యవహారంపై ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి కఠిన చర్యలు చేపడుతోంది. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2023 నవంబర్ 28న ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ శేఖర్‌నాయక్ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విచారణ చేపట్టిన అధికారులు సస్పెండ్ చేశారు. ♦ మల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ సుదర్శన్ అక్రమ వసూళ్లకు పాల్పడగా విచారణ చేపట్టిన పోలీసులు ఈనెల 22న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ♦ జగిత్యాల పట్టణ సీఐగా పనిచేస్తున్న నటేశ్ అవినీతి ఆరోపణలు, క్రైం బర్కింగ్ ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టి ఫిబ్రవరి 23న సస్పెండ్ చేస్తూ మల్టీజోన్–1 ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ♦ రాయికల్ పోలీస్ స్టేషన్లో కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ మహేందర్ అల్లీపూర్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద కోర్టు విషయంలో వసూళ్లకు పాల్పడగా 2024 ఫిబ్రవరి 2న సస్పెండ్ చేశారు. ♦ డీసీఆర్బీ ఎస్సైగా పనిచేస్తున్న వెంకట్రావ్ కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నసమయంలో ఓ మహిళ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు విచారణ చేపట్టిన పోలీసులు ఈనెల 23న సస్పెండ్ చేస్తూ మల్టీజోన్–1 ఐజీ ఉత్తర్వులు జారీచేశారు. ► ఇబ్రహీంపట్నం ఏఎస్సైగా పనిచేస్తున్న రాములు ఓ మహిళ పోలీస్‌స్టేషన్‌కు వస్తే ఆమెతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా ఉండగా ఫొటోలు తీయించుకున్నాడు. అవి వైరల్ కావడంతో ఏఎస్సైని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఈనెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు మల్టీజోన్ ఐజీకి నివేదిక సమర్పించారు. ► మల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే హెడ్‌కానిస్టేబుల్‌తోపాటు, ఇద్దరు కానిస్టేబుళ్లు వారం క్రితం బయట వ్యక్తులతో పోలీస్‌స్టేషన్‌లోనే మద్యం సేవించిన విషయం వెలుగు చూడటంతో విచారణ చేపట్టిన పోలీసులు త్వరలోనే క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. పోలీస్‌స్టేషన్‌లోనే మాంసం, మద్యంతో జల్సా ►హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్ల నిర్వాకం ► ఈనెల 17న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి మల్లాపూర్: ఈనెల 17న మల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు సిబ్బంది మాంసం, మద్యంతో జల్సా చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు జగిత్యాలలో ప్రధాని మోదీ సభ ఉండడంతో బందోబస్తు కోసం ఎస్సై కిరణ్‌కుమార్ వెళ్లారు. దీంతో హెడ్‌కానిస్టేబుల్ అశోక్, కానిస్టేబుళ్లు ధనుంజయ్, సురేశ్ పోలీస్‌స్టేషన్‌లోకి మాంసం, మద్యం తెచ్చుకుని పార్టీ చేసుకున్నారని, వీరితో మరో ఇద్దరు బయటి వ్యక్తులు కూడా పాల్గొన్నారని సమాచారం. వారు పార్టీ చేసుకునే సమయంలో అక్కడికి వెళ్లిన ఓ అధికారి ఆ తతంగాన్ని చూసి సదరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీలో పాల్గొన్నవారిలో ఒకరు విషయాన్ని బయట పెట్టడంతో విషయం జిల్లా పోలీస్ బాస్ దృష్టికి చేరింది. ఆయన సదరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేసి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. వీరిపై రెండు, మూడు రోజుల్లోనే క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయమై ఎస్సైని సంప్రదించగా.. పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది జల్సా చేసుకుంది నిజమేనని, సిబ్బందిపై ఎస్పీకి నివేదించామని పేర్కొన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు పోలీస్ అధికారులు, సిబ్బంది అంతా క్రమశిక్షణతో పనిచేయాలి. ప్రజలకు సత్వర సేవలందించడంతోపాటు, న్యాయం జరిగేలా చూడాలి. ఎలాంటి ఆరోపణలు వచ్చినా విచారణ చేపట్టి నిజమని తేలితే చర్యలు తీసుకుంటాం. – సన్‌ప్రీత్‌సింగ్, ఎస్పీ -
జగిత్యాల గడ్డ మీద ప్రధాని మోదీ
సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పని అయిపోతుందన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. కాగా, జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ..‘మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. మాల్కాజ్గిరిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్.. 400 పార్ అంటున్నారు. మొన్ననే లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గడిచిన మూడు రోజుల్లో రెండు సార్లు తెలంగాణకు వచ్చాను. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణలో కూడా అభివృద్ధి జరుగుతుంది. బీఆర్ఎస్పై ప్రజలకు ఉన్న ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది. తెలంగాణను దోచుకున్న వాళ్లను మేము వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యం. తెలంగాణలో ఎన్నో వేల కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే.. నాకు అంత శక్తి వస్తుంది. పసుపు రైతులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదు. బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులకు ఎంతో మేలు చేసింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పని అయిపోతుంది. పదేళ్లపాటు బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంది. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ ఆడుకుంటోంది. ఇప్పుడు కాంగ్రెస్.. తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంటోంది. బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ ఫైల్స్‌ను పక్కన పెడుతోంది. కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మకయ్యాయి. లిక్కర్ స్కామ్‌లోనూ బీఆర్ఎస్ కమీషన్లు తీసుకుంది. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు నన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నాయి. కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది. ఇక్కడ దోచిన డబ్బును కుట్రలకు వాడుతున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు ఢిల్లీలో కుటుంబ పార్టీ పెద్దలకు వెళ్తున్నాయి. దేశంలో జరిగిన స్కామ్‌లన్నింటికీ కుటుంబ పార్టీలే కారణం. శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ.. తన పోరాటం శక్తికి వ్యతిరేకం అని చెప్పారు. శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరగబోతుంది. నాకు ప్రతీ మహిళా.. ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తుంది. శక్తిని ఖతమ్ చేస్తామన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నాను. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతానికి కూడా శివశక్తి అని పేరు పెట్టాను. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో.. జూన్ నాలుగో తేదీన తెలుస్తుంది. నేను భారతమాతకు పూజారిని’ అంటూ కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీ @ జగిత్యాల సభ నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ మొదలైంది తెలంగాణ ప్రజలు కొత్త ఇతిహాసాన్ని లిఖించేందుకు సిద్ధమయ్యారు వికసిత భారత్ లో భాగంగా దేశం అభివృద్ధి చెందితే.. తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది నేను గత మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు మరోసారి వచ్చాను ఆదిలాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం తెలంగాణలోని ప్రతి మారుమూల ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాం తెలంగాణలో బీజేపీని గెలిపించి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను సాఫ్ చేయండి 4 జూన్ కో.. 400 పార్.. బీజేపీకి ఓటు వేయాలని తెలుగులో కోరిన ప్రధాని నా ముందు శక్తి స్వరూపులైన వేషధారణలో ఉన్న చిన్నారి ఉంది.. ఆమెతో పాటు ఇంతమంది శక్తి స్వరూపులైన మహిళలు నన్ను ఆశీర్వదించేందుకు వచ్చారు నిన్న ముంబైలో ఇండి అలయన్స్ ర్యాలీ జరిగింది ఆ ర్యాలీలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు వారు శక్తిని ఖతం చేయడానికి యుద్ధం చేస్తున్నారు కానీ నాకు శక్తి స్వరూపులైన మహిళలంతా అండగా ఉన్నారు నేను శక్తి స్వరూపులైన మిమ్మల్ని పూజిస్తాను భారత మాతకు, శక్తి స్వరూపులైన మహిళలకు పూజారిని ఈ ఎన్నికల్లో ఇండి అలయన్స్ శక్తిపై చేస్తున్న యుద్ధాన్ని స్వీకరిస్తున్నాను ఈ యుద్ధంలో నేను మీకోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమే.. భారత గడ్డపై శక్తిని వినాశనం చేస్తానని మాట్లాడుతున్నారు యావత్ దేశం శక్తిని పూజిస్తాం శివశక్తి పేరుతో చంద్రయాన్ సక్సెస్ చేసుకున్నాం శక్తిని వినాశనం చేసే అవకాశం వారికిద్దామా? శక్తిని విచ్ఛిన్నం చేసే వారు విచ్ఛిన్నం కావాలా? వద్దా? ఈ యుద్ధంలో శక్తిని పూజ చేసే వారు ఒక వైపు.. శక్తిని విచ్ఛిన్నం చేసేవారు ఒకవైపు ఈ యుద్ధంలో గెలుపెవరిదో జూన్ 4వ తేదీన తేలనుంది తెలంగాణ పుడమి సాధారణమైనది కాదు ఆంగ్లేయులు, రజాకార్ల అత్యాచారాలపై పోరాడిన గడ్డ తెలంగాణ కలలను కల్లలు చేసింది కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని దోచుకుంది ఇప్పుడు కాంగ్రెస్.. తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంది ఇక్కడి ప్రజలు డబ్బులు ఢిల్లీకి చేరుతున్నాయి కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలకు చేరుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేసింది.. కానీ ఇప్పుడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ నోరు మెదపడం లేదు కాళేశ్వరం అవినీతిపై ఎవరూ ప్రశ్నించడంలేదు ఎన్నో గ్యారెంటీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలుచేయడం లేదు దీనిపై బీఆర్ఎస్ కూడా నోరుమెదపడం లేదు ఈరెండు పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయి ఈ రెండు పార్టీలకు మోడీని తిట్టడం తప్పితే వేరే పనిలేదు ఈ పార్టీల నాయకులు ఎన్నడైనా భారత్ మాతా కీ జై అనడం వినిపించిందా? ఈ రెండు పార్టీలు ఎన్ని కవర్ ఫైర్లు చేసినా మేం బయటకుతీస్తాం తెలంగాణను దోచుకున్న వారిని విడిచిపెట్టం.. ఇది మోడీ గ్యారెంటీ కుటుంబ పార్టీలు కేవలం దేశాన్ని దోచుకునేందుకు రాజకీయం చేస్తాయి, అభివృద్ధి కోసం పనిచేయవు దేశంలో అవినీతి ఎక్కడ జరిగినా దాని వెనుక కుటుంబ పార్టీ హస్తం ఉంటుంది నేను దీనిపై మీడియా వారికి కూడా హోంవర్క్ ఇస్తున్నా.. కావాలంటే చూసుకోవచ్చు 2జీ స్కామ్, బోఫోర్స్, నేషనల్ హెరాల్డ్ కేసులో ఎవరి పేర్లొచ్చాయి? ఇలాంటి అవినీతే.. తెలంగాణలోనూ జరిగింది కాళేశ్వరం అవినీతితో పాటు లిక్కర్ స్కామ్ తో ఢిల్లీ వరకు వచ్చి కమీషన్లు తిన్నారు కాంగ్రెస్.. అయినా.. బీఆర్ఎస్ అయినా.. వారికి దూరంగా ఉండటమే మనకు మెడిసిన్. అందుకే బీజేపీని గెలిపించాలి శక్తిని వచ్ఛిన్నం చేసే వారిని విచ్ఛిన్నం చేసేందుకు నాకు మీ ఆశీర్వాదాలతో శక్తినివ్వండి కుర్చీతో సంబంధం లేకుండా మీ బాగు కోసం నేనుంటా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కోపంతో ఎలాగైనా ఆ పార్టీని ఓడించాలనుకున్నారు.. ఓడించారు కానీ ఈసారి జరిగేవి కేంద్రంలో మరోసారి మోడీ సర్కారును తెచ్చేది అందుకే బీజేపీకి ఓటు వేయండి 2014కు ముదు వరకు ఇతర పార్టీలు చేసిన అభివృద్ధి చూడండి 2014 తర్వాత నుంచి కేవలం పదేండ్లలో జరిగిన అభివృద్ధి చూడండి జూన్ లో మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. మరింత అభివృద్ధి చేపడుతాం.. బండి సంజయ్, అర్వింద్, గోమాస శ్రీనివాస్ ను తమ్ముళ్లుగా పిలిచి.. మరీ అభ్యర్థులను పరిచయం చేసిన మోడీ నేను టెక్నాలజీ వినియోగించి మీతో తెలుగులో మాట్లాడుతాను ట్విట్టర్(ఎక్స్) వేదికగా ‘నమో ఇన్ తెలుగు’ డౌన్ లోడ్ చేసుకోండి వందకు వంద శాతం కాకపోయినా.. 80 నుంచి 90 శాతం వరకు ఇది సక్సెస్ అవుతుంది అందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి మీరు నా టీచర్లు.. నాకు తెలుగు నేర్పిస్తారు కదా.. ఎవరైనా ఏమైనా అంటే.. గడ్ బడ్.. చేయకు.. మోడీ నా జేబులో ఉన్నాడని చెప్పండి తెలంగాణలోని ప్రతి మొబైల్ లో మోడీ ఉండాలి మీ మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి నాకు అండగా ఉంటానని గ్యారెంటీ ఇవ్వండి -
జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ
ప్రధాని మోదీ జగిత్యాల పర్యటన.. బహిరంగ సభ అప్డేట్స్ ప్రధాని మోదీ కామెంట్స్.. భారత్ వికాసంతో తెలంగాణా వికాసం కూడా సులభమైతుంది. మూడురోజుల్లో మూడుసార్లు తెలంగాణా వచ్చాను. వందల కోట్ల రూపాయలు తెలంగాణా వికాసం కోసం కేంద్రం కేటాయిస్తున్నాం. తెలంగాణాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఊసే లేదిప్పుడు. తెలంగాణాతో పాటు, దేశం మొత్తం మళ్ళీ బీజేపీ కావాలని కోరుతోంది. సమృద్ధ భారత్ కోసం 400 సీట్లు దాటాలి. అందుకే బీజేపీకే ఓటు వేయాలి. శక్తి స్వరూపిణిలైన ఇంతమంది స్త్రీలు, యువత ఆశీర్వచనం ఇచ్చేందుకు వచ్చారంటే.. నేనెంత అదృష్టవంతుణ్ని!. నేను భారతమాత పూజారిని. ఇండియన్ అలయెన్స్‌కు నామారూపాల్లేకుండా చిత్తు చేసేందుకు ఈ నారీశక్తి అంతా ఒక్క తాటిపైకి రావాలి. చంద్రయాన్ సఫలీకృతం కావడంలో కూడా ఈ నారీశక్తిది కీలకపాత్ర. శక్తి వినాశనాన్ని కోరుకునే వారికి ఇక్కడ స్థానం లేదు, వారిని తుదముట్టించాలి. తెలంగాణా ప్రజల కలలను నిర్వీర్యం చేసిన ప్రజా ఘాతకులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు తెలంగాణా ఏటీఎం కార్డులా మారింది. తెలంగాణాను మోసం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూదొందే. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే. అందుకే కాళేశ్వరంకు సంబంధించి ఎలాంటి చర్యల్లేవ్. ఆ రెండు పార్టీలు మోదీని తిట్టడం, మోదీ జపం చేయడం మాత్రమే చేస్తున్నాయి. మోదీ తెలంగాణా ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నాడు.. తెలంగాణాను దోచుకునే వారినెవరినీ వదిలిపెట్టడని. కాంగ్రెస్ కాదది స్కాంగ్రెస్. ఢిల్లీలో లిక్కర్ స్కాంతో ఇక్కడి బీఆర్ఎస్ ఏం చేసిందో చూశారు. కాబట్టి ఆ రెండు పార్టీలను గెలిపిస్తే అంతే సంగతులు. మీరెన్ని సీట్లలో తెలంగాణాలో బీజేపీని గెలిపిస్తే తెలంగాణాలో అంత అభివృద్ధి జరుగుతుంది. వికసత్ తెలంగాణా కావాలంటే బీజేపీని అత్యంత మెజారిటీతో అన్ని సీట్లలో గెలిపించాలి కిషన్‌రెడ్డి ప్రసంగం.. మోదీ పాలనలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోంది 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు రూ.6 వేలు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు ఆర్టికల్ 370 నుంచి మొదలుపెడితే.. రామమందిర నిర్మాణం వరకు సుస్థిర పాలన రామగుండం ఎరువుల పరిశ్రమ, జాతీయ రహదారులు, పసుపు బోర్డు, గ్రామపంచాయతీ నిధులివ్వడం.. వీటన్నిటినీ మోడీ ప్రభుత్వం ఎంత అంకితభావంతో చేస్తుందో చూస్తున్నాం సమ్మక్క సారక్క పేరుతో ట్రైబల్ యూనివర్సిటీని ఇచ్చింది మోదీనే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది కాళేశ్వరం, లిక్కర్, దళితబంధు, భూ కేటాయింపుల పేరిట దోపిడీలకు పాల్పడింది కేసీఆర్ కుటుంబం లిక్కర్ స్కాంతో తెలంగాణా రాష్ట్రాన్ని తలదించుకునేలా చేసింది కుక్క తోక వంకర అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తీరుతుంది ఆరు గ్యారంటీలని చెప్పి వాటిని అమలు చేయని కాంగ్రెస్ ఇక్కడవసరమా..? అందుకే మళ్లీ మోదీని మూడోసారి ప్రధానిని చేసుకోవాల్సిన అవసరముంది. జగిత్యాల: అర్వింద్ కామెంట్స్ ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ మోదీ భారత దేశం సురక్షింతంగా ఉండాలంటే మోదీ మూడోసారి ప్రధాని కావాలి జగిత్యాలలో ప్రారంభమైన బీజేపీ విజయ సంకల్ప సభ హాజరైన ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి జగిత్యాల బీజేపీ సభకు వర్షం ముప్పు? సభకు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన బీజేపీ నేతలు ప్రధాని మోదీ సభకు భారీ జనసమీకరణ ప్లాన్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి జగిత్యాల బయల్దేరిన ప్రధాని మోదీ జగిత్యాలలో కాసేపట్లో బీజేపీ విజయ సంకల్ప సభ సభలో పాల్గొని ప్రసంగించనున్న ప్రధాని మోదీ పాల్గొననున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రధాని మోదీ. రాష్ట్రంలోని 17 లోక్ సభ సీట్లలో బీజేపీని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్న ప్రధాని. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ ఉదయం రాజ్‌భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్ఎయిర్పోర్ట్కు చేరుకుని.. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో జగిత్యాల వెళ్తారు. నిన్నసాయంత్రం ఏపీ చిలకలూరిపేట జనగళం సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. రాత్రికి హైదరాబాద్ చేరుకుని రాజ్‌భవన్‌లో బసచేశారు. -
నేడు జగిత్యాలకు ప్రధాని మోదీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ జగిత్యాలకు రానున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా సోమవారం జగిత్యాలలోని గీతా విద్యాలయ మైదానంలో విజయ సంకల్పసభ పేరుతో నిర్వహించతలపెట్టిన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతా ఏర్పాట్లను నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్సీజీ)తోపాటు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సభ బందోబస్తుకు 1,600 మందికిపైగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే హెలికాప్టర్ల ల్యాండింగ్ ట్రయల్స్, కాన్వాయ్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించారు. మైదాన పరిసరాలను పూర్తిగా ఎన్ఎస్జీ బలగాలు తమ అ«దీనంలోకి తీసుకున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, పీఎఫ్ఐ, ఐఎస్ఐ తదితర ఉగ్రవాద సానుభూతిపరులకు పట్టున్న ప్రాంతం కావడంతో కేంద్ర, రాష్ట్ర అధికారులు భద్రత విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. అయితే జగిత్యాల విజయసంకల్ప సభకు వర్షం గండం పొంచి ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, 30–40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వర్షం, ఈదురుగాలుల హెచ్చరిక నేపథ్యంలో అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్, కాన్వాయ్ మూమెంట్ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యామ్నాయాలు సిద్ధం చేశారు. -
బెంగళూర్ కేఫ్ పేలుడుతో జగిత్యాలకు లింక్?
సాక్షి, బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుతో.. తెలంగాణ జిల్లా జగిత్యాలకు సంబంధం ఉందా?.. తాజా అరెస్టుతో ఆ దిశగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ NIA మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అయితే అతని స్వస్థలం జగిత్యాల కావడం.. పైగా అతనొక మోస్ట్ వాంటెడ్ కావడంతోకీ అంశం తెర మీదకు వచ్చింది.. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో.. నిషేధిత పీఎఫ్ఐ కీలక సభ్యుడు సలీం హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న అతన్ని ఎన్ఐఏ వైఎస్సార్ జిల్లా(ఏపీ) మైదుకూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో అరెస్ట్ చేసింది. బెంగళూరు పేలుడు కేసులో.. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. సలీం స్వస్థలం జగిత్యాల కేంద్రంలోని ఇస్లాంపురా. చాలాకాలంగా పరారీలో ఉన్న అతన్ని.. NIA సెర్చ్ టీం మైదుకూరులో అదుపులోకి తీసుకుంది. రామేశ్వరం కెఫ్ బాంబు పేలుడులో.. ఇతని హస్తమున్నట్టు ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అలాగే సలీంతో పాటు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎండీ అబ్దుల్ అహ్మద్, నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ ఇలాయస్ అహ్మద్ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్లిద్దరి కోసం ఇప్పుడు ఎన్ఐఏ టీంలు గాలింపు చేపట్టాయి. ఇదిలా ఉంటే.. గతంలో ఉగ్రమూలాలకు కేరాఫ్‌గా జగిత్యాల పేరు పలుమార్లు వినిపించింది. ఇప్పుడు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసు లింకుతో మరోసారి జగిత్యాల్లో ఉగ్రమూలాలపై చర్చ నడుస్తోంది. గతంలో జగిత్యాలతో పాటు కరీంనగర, నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు, పలువురి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్ పాలన ఎక్కువకాలం నిలబడదు.. ప్రజలే తిరగబడతారు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో ఉన్నది ఖాకీ రాజ్యమా? కాంగ్రెస్ రాజ్యమా? అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినన అభివృద్ధిని ఓర్వలేక అధికారం మారడంతో పార్టీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెడితే సహించేదే లేదని, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలన ఎక్కువకాలం నిలబడదడని.. ఇలానే కక్షపూరితంగా వ్యవహరిస్తే ప్రజలే తిరగబడతారని అన్నారు. జగిత్యాల జైలులో ఉన్న హబ్సీపూర్ బీఆర్ఎస్ సర్పంచ్ గంగారెడ్డిని ఎమ్మెల్సీ కవిత గురువారం పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. అభివృద్ధిని పక్కనపెట్టి, సాధ్యం కానీ హామీలిచ్ఛి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలను రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. యూనివార్సిటీ భూముల విషయంలో విద్యార్థిని జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ తెలంగాణలో లేదని పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యకర్తలకు, నాయకులకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. చదవండి: రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం -
నల్లిబొక్క కోసం లొల్లి.. పెళ్లి క్యాన్సిల్.. ‘బలగం’ సీన్ రిపీట్
పెళ్లంటే జీవితాంతం గుర్తుండిపోయే ఘట్టం. ప్రతి ఒక్కరు తమ వివాహాన్ని ఎంతో ఆర్భాటంగా చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి అందమైన ఈ వేడుకను కొంతమంది చిన్న చిన్న విషయాలతో ముడిపెట్టి.. పెళ్లిని రద్దు చేసుకునే వరకు వెళ్తున్నారు. అమ్మాయి వాళ్లు మర్యాదలు సరిగా చేయలేదని, కట్నం ఎక్కువ ఇవ్వలేదని పెళ్లి క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వింత వింత కారణాలతో ఏకంగా పీటల మీద కూడా పెళ్లిళ్లు ఆపేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే తెలంగాణలో జరిగింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. నిశ్చితార్థం రోజు మటన్‌లో నల్లి బొక్క వడ్డించలేదని ఆగ్రహం చెందిన వరుడి కుటుంబ సభ్యులు చివరికి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన వధువుకి, జగిత్యాలకు చెందిన వరుడితో వివాహం నిశ్చయమైంది. గత నెల నవంబర్‌లో వధువు ఇంటి వద్ద నిశ్చితార్థం వేడుక నిర్వహించారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు భోజనాలను ఘనంగా ఏర్పాటు చేశారు. వివాహానికి వచ్చిన అతిథులందరికీ నాన్ వెజ్ వంటలు వండించారు. అయితే నిశ్చితార్థం అనంతరం తమకు మటన్‌లో మూలుగ బొక్క వడ్డించలేదని అబ్బాయి బంధువులు చెప్పడంతో గొడవకు దారితీసింది. దీనిపై స్పందించిన వధువు కుటుంబ సభ్యులు మూలుగు బొక్క వంటకాలలో చేయించలేదని చెప్పడంతో గొడవ కాస్తా పెద్దదిగా మారింది. ఈ వివాదం కాస్తా చివరికి పోలీసుల వరకు చేరుకోవడంతో.. అబ్బాయి కుటుంబ సభ్యులను నచ్చజెప్ప ప్రయత్నం చేశారు. కానీ వారు ససేమిరా అంటూ తమను అవమానించారని అన్నారు. అంతేగాక నల్లి బొక్క మెనూలో లేదన్న విషయాన్ని వధువు కుటుంబసభ్యులు ఉద్దేశపూర్వకంగా తమకు తెలియకుండా దాచిపెట్టారని వాదించారు. చివరికి ఈ పెళ్లి వద్దంటూ వరుడి కుటుంబం తెగేసి చెప్పడంతో వివాహం రద్దు చేసుకున్నారు. అయితే ఈ ఘటన అచ్చం ఇటీవల టాలీవుడ్లో వచ్చిన ‘బలగం’ సినిమాలోని కథను గుర్తు చేసింది. మార్చిలో విడుదలైన ఈ సినిమాలో.. మూలుగ బొక్క కోసం బావ బామ్మర్ధుల మధ్య గొడవ జరిగి విడిపోతారు. ఇక్కడ కూడా అలాగే మూలుగ బొక్క కోసం గొడవ పడి చివరకు పెళ్లి సంబంధం రద్దయింది. -
కేసీఆర్ చదివిన బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది
సాక్షి, జగిత్యాల: దీర్ఘకాలిక లక్ష్యాలతో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాలను జోడుగుర్రాల్లా పరిగెత్తించడమే కాంగ్రెస్ లక్ష్యమని జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సాక్షితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ పాలనను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక్షస పాలనగా అభివర్ణించారు. కానీ, ఆయన చదువుకున్న బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది. నాకు ఇవే చివరి ఎన్నికలంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ మాట నేనెప్పుడూ అనలేదు. ఇంకా రెండేళ్లు ఎమ్మెల్సీ ఉంది కదా.. మళ్లీ ఎమ్మెల్యే బరిలోకి ఎందుకు దిగుతున్నానంటూ కొందరు నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య తేడాల్ని గుర్తించాలివాళ్లు.. అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు కౌంటర్ ఇచ్చారాయన. తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడేవాళ్లకు.. పొలాస అగ్రికల్చర్ కాలేజ్, జేఎన్టీయూ, న్యాక్ వంటి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారాయన. వైఎస్సార్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉంటూ జగిత్యాలను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారాయన. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసి తీరుతామని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి పది నుంచి పదకొండు సీట్లు కాంగ్రెస్‌వేనని ధీమా వ్యక్తం చేశారు జీవన్‌రెడ్డి. -
ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
-
బీఆర్ఎస్ ను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం: కవిత
-
దోసెలు వేసిన రాహుల్
-
స్కూటీలో దూరి.. చుక్కలు చూపించి..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: చిన్నదే కానీ చుక్కలు చూపించింది. స్కూటీలో దూరి ఓనర్ని టెన్షన్ పెట్టించింది. దానిని చూసేందుకు జనం సైతం ఎగబడడంతో భారీగా ట్రాఫిక్‌ఝామ్ కూడా అయ్యింది. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద జరిగిన హైడ్రామా.. స్నేకా.. మజాకా అని అందరితో అనిపించింది. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ వద్ద షబ్బీర్ అనే వ్యక్తి ఓ షాప్ ముందుకు తన స్కూటీని ఉంచాడు. అయితే.. నెమ్మదిగా అందులోకి దూరింది ఓ పాము. సమాచారం అందన్కున్న స్నేక్ క్యాచర్ గంటపాటు శ్రమించి బండి మొత్తం పార్ట్స్ విప్పదీశాడు. ఎట్టకేలకు ఆ చిన్నపామును పట్టుకోగలిగాడు. ఆపై దానిని వాటర్ బాటిల్లో దూర్చి దూరంగా తీసుకెళ్లాడు. స్కూటీలో పాము దూరిందనే వార్త సాధారణంగానే జనాలను ఆకట్టుకుంది. చుట్టూ మూగి ఆ డ్రామా అంతా చూస్తూ ఉండిపోయారు. చివరకు పామును స్నేక్‌క్యాచర్ పట్టేయడంతో స్కూటీ ఓనర్ ఊపిరి పీల్చుకున్నాడు. -
Korutla Death Mystery: కోరుట్ల టెక్కీ దీప్తి కేసులో సరికొత్త ట్విస్ట్
జగిత్యాల: కోరుట్ల సాఫ్ట్వేర్ దీప్తి మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. దీప్తి అనుమానాస్పద మృతి తర్వాత ఓ యువకుడితో వెళ్లిపోయిన దీప్తి సోదరి చందన పేరిట ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. తాము మద్యం సేవించిన మాట వాస్తవమేనని, కానీ తాను అక్కను చంపలేదంటూ.. తన సోదరుడు సాయికి చందన ఆ వాయిస్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. ‘‘అరేయ్ సాయి నేను చందక్కను రా.. నిజమెంటో చెప్పాలారా. దీప్తిక్క నేను తాగుదామనుకున్నాం. కానీ, నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్ చేత తెప్పించా. అది నేను ఒప్పుకుంటా. కానీ, అక్కనే తాగింది. తాగిన తర్వాత తన బాయ్‌ఫ్రెండ్‌ను పిలుస్తా అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం సరే అన్నా.. నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నాం. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాం. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయిన. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు.. నన్ను నమ్ము సాయి.. నా తప్పేం లేదు.. ప్లీజ్‌రా నమ్మురా మేం రెండు బాటిల్స్ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగా. అక్క వోడ్కా తాగింది. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయిన ఇట్లా అయితదనుకోలేదు. నేనెందుకు చంపుత సాయి.. నేనేందుకు మర్డర్ చేస్తా!.’’ అంటూ వాయిస్ మెసేజ్‌లో ఉంది. దీప్తి ఒంటిపై గాయాలు కోరుట్ల దీప్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీప్తి శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఎడమ చేయి కూడా విరిగిపోయి ఉండడంతో.. ఇదే హత్యేననే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కిచెన్‌లో వోడ్కా, బ్రీజర్ బాటిళ్లు, వెనిగర్, నిమ్మకాయలు ఉండటంతో రాత్రి వేళ దీప్తి, చందన కలిసి మద్యం సేవించారా..? అనే అనుమానాలు వ్యక్తం కాగా.. తాజా ఆడియోక్లిప్‌తో అవి నిర్ధారణ అయ్యాయి. చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకునే క్రమంలో గొడవ జరిగి ఆ గొడవలో తగలరాని చోట దెబ్బతగిలి దీప్తి చనిపోయిందా..? అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. మృతురాలు దీప్తి సోదరి చందన దొరికితేనే ఈ కేసు చిక్కుముడి వీడేది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వాళ్లు నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో చందన ఆచూకీ కోసం రెండు బృందాలను రంగంలోకి దించారు పోలీసులు. మరోవైపు చందనతో ఉన్న యువకుడు ఎవరు? అనే దానిపైనా ఆరాలు తీస్తున్నారు. కేసు నేపథ్యం ఇదే.. ఆంధ్రకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులు సుమారు పాతికేళ్లుగా కోరుట్లలోని భీమునిదుబ్బలో స్థిరపడ్డారు. ఇటుకబట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాస్‌రెడ్డికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు సాయి బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెద్ద కూతురు దీప్తి(24) పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్‌ఫ్రం హోం పద్ధతిన ఇంట్లో నుంచి పనిచేస్తోంది. చిన్నకూతురు చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. సోమవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి– మాధవి హైదరాబాద్‌లోని బంధువుల గృహాప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు తండ్రితో అక్కాచెల్లెళ్లు ఫోన్లో మాట్లాడారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి తన కూతుళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించగా పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ కాలేదు. చిన్నకూతురు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండుమూడు సార్లు ఫోన్లో కూతుళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌రెడ్డి చివరికి పక్క ఇంట్లో ఉన్నవారికి ఫోన్ చేశాడు. తమ కూతుళ్లు ఫోన్ ఎత్తడం లేదని చెప్పి, ఓ సారి ఇంటిదాకా వెళ్లి చూడమని కోరాడు. పక్క ఇంట్లో ఉండే ఓ మహిళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. చుట్టుపక్కల వారికి విషయం చెప్పగా వారు దీప్తిని పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా మెట్పల్లి డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు కిరణ్, చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
అక్క అనుమానాస్పద మృతి.. చెల్లెలి అదృశ్యం.. ఏం జరిగింది?
కోరుట్ల/రాయికల్: ‘సోమవారం రాత్రి ఆ ఇంట్లో అక్కాచెల్లెళ్లు మాత్రమే ఉన్నారు. తెల్లారేసరికి అక్క చనిపోయి సోఫాలో పడి ఉంది. ఇంటి బయట తలుపునకు గొల్లెం పెట్టి చెల్లి ప్రియుడితో కలిసి పరారైంది’. ఇంట్లోని కిచెన్‌లో ఓడ్కా, బ్రీజర్ బాటిళ్లు ఉన్నాయి. అసలు ఆ రాత్రి ఇంట్లో ఏం జరిగి ఉంటుంది..? అక్క చనిపోవడానికి చెల్లెలే కారణమా..? ప్రియుడితో కలిసి చెల్లె వెళ్లిపోతుంటే అక్క అడ్డుకున్న క్రమంలో గొడవ జరిగిందా.. ఈ గొడవలోనే అక్క ప్రాణాలు పోయాయా..? లేదా ఓడ్కాలో అక్కకు మత్తు ఇచ్చి చెల్లెలు గుర్తుతెలియని యువకుడితో కలిసి పరారైందా..? వోడ్కాలో కలిపిన మత్తు మందు డోసు ఎక్కువై అక్క చనిపోయిందా..?! అనేక అనుమానాలు కోరుట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బంక దీప్తి మృతి వెనక లెక్కలేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులు సుమారు పాతికేళ్లుగా కోరుట్లలోని భీమునిదుబ్బలో స్థిరపడ్డారు. ఇటుకబట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాస్‌రెడ్డికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెద్ద కూతురు దీప్తి(24) పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్‌ఫ్రం హోం పద్ధతిన ఇంట్లో నుంచి పనిచేస్తోంది. చిన్నకూతురు చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. సోమవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి– మాధవి హైదరాబాద్‌లోని బంధువుల గృహాప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు తండ్రితో అక్కాచెల్లెళ్లు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. తెల్లారేసరికి.. మంగళవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి తన కూతుళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించగా పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ కాలేదు. చిన్నకూతురు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండుమూడు సార్లు ఫోన్లో కూతుళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌రెడ్డి చివరికి పక్క ఇంట్లో ఉన్నవారికి ఫోన్ చేశాడు. తమ కూతుళ్లు ఫోన్ ఎత్తడం లేదని చెప్పి, ఓ సారి ఇంటిదాకా వెళ్లి చూడమని కోరాడు. పక్క ఇంట్లో ఉండే ఓ మహిళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. చుట్టుపక్కల వారికి విషయం చెప్పగా వారు దీప్తిని పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా మెట్పల్లి డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు కిరణ్, చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ రాత్రి ఏం జరిగినట్లు..? సోమవారం ఉదయం తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని బంధువు ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లగా రాత్రి అక్కాచెల్లెల్లు ఇద్దరే ఇంట్లో ఉన్నారు. కిచెన్‌లో వోడ్కా, బ్రీజర్ బాటిళ్లు, వెనిగర్, నిమ్మకాయలు ఉండటంతో రాత్రి వేళ దీప్తి, చందన కలిసి మద్యం సేవించారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి మద్యం బాటిళ్లు ఎవరు తెచ్చి ఇచ్చారు, ప్రియుడితో కలిసి పరారయ్యేందుకు ముందుగానే పథకం వేసుకున్న చందన అతడితోనే మద్యం తెప్పించి ముగ్గురు కలిసి మద్యం తీసుకున్నారా..? అన్న విషయంలో స్పష్టత లేదు. దీప్తికి మద్యంలో మత్తు కలిపి తాము పరారయ్యేందుకు పథకం వేశారా..? మత్తు డోసు ఎక్కువ కావడంతో దీప్తి మృతి చెంది ఉంటుందా..? అన్న అనుమానాలున్నాయి. చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకునే క్రమంలో గొడవ జరిగి ఆ గొడవలో తగలరాని చోట దెబ్బతగిలి దీప్తి చనిపోయిందా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీప్తి శరీరంపై పెద్దగా గాయాలు కనిపించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. బస్టాండ్ సీసీ ఫుటేజీలో చందన.. కోరుట్ల బస్టాండ్‌లోని సీసీ కెమెరాల్లో మంగళవారం వేకువజామున 5 గంటలకు చందన ఓ యువకుడితో కలిసి ఉన్న వీడియోలను పోలీసులు గుర్తించారు. చందన, మరో యువకుడు లగేజీ తీసుకుని నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు సీసీ పుటేజీల్లో రికార్డు అయింది. చందన ఫోన్‌కాల్ డేటా ఆధారంగా ఆమె ఓ యువకుడితో గంటల తరబడి ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి చందన ఫోన్ లొకేషన్ హైదరాబాద్‌లో వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారని సమాచారం. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
Kavitha : కూతురు కవిత విషయంలో కేసీఆర్ వ్యూహమేంటీ?
దెబ్బ తిన్న చోటే పోరాడి గెలిచి చూపించాలన్నది సీఎం కెసిఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటు స్థానానికి పోటీ చేసిన కవిత అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. కవిత రాజకీయ భవితవ్యంపై అప్పట్లో ఓ రకంగా సంధిగ్దత నెలకొంది. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చినా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మండలిలో అడుగు పెట్టారు కవిత. జగిత్యాల ? నిజామాబాద్ .?? గత రెండేళ్లుగా కవిత ప్రధానంగా రెండు నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఒకటి నిజామాబాద్ అర్బన్ కాగా, మరొకటి జగిత్యాల. బతుకమ్మ వేడుకల నుంచి ప్రతీ చిన్న కార్యక్రమానికి ఈ రెండు చోట్ల కవిత హాజరు కావడంతో ఈ రెండింటిలో ఏదో ఒక చోట కవిత పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సంజయ్ కూడా తనకు టికెట్ దక్కుతుందో లేదో అన్న అనుమానాల్ని నిన్నటి వరకు కూడా వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో జగిత్యాల నుంచి కవితకు టికెట్ ఖాయం అన్న ప్రచారం జరిగింది. అయితే సీఎం కెసిఆర్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేదు. తాజా జాబితాలో కవితకు చోటివ్వలేదు. Dumdaar Leader - Dhamakedaar Decision !! Our leader KCR Garu announced 115 exceptional candidates for the forthcoming Assembly elections out of 119 seats. It truly is a testament to the people's faith in CM KCR Garu's courageous leadership and the impactful governance of the… pic.twitter.com/G3czjqZeNK — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 21, 2023 మళ్లీ ఢిల్లీకే.! ఓడిన చోటే కవిత ఘనవిజయం సాధించాలన్నది కెసిఆర్ పట్టుదలగా కనిపిస్తోంది. నిజామాబాద్‌లో కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలవడం కెసిఆర్ పొలిటికల్ కెరియర్లో ఇబ్బంది పడ్డ క్షణం. ఓ రకంగా రాజకీయంగా ఉద్ధండుడైన కెసిఆర్.. తన బిడ్డను గెలిపించుకోలేకపోయాడన్న ప్రచారం జరిగింది. టార్గెట్ పార్లమెంట్ 2024 ఎండాకాలంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం కవితను సీఎం కెసిఆర్ సిద్ధం చేస్తున్నట్టు తాజా టికెట్ల ప్రకటనతో తేలింది. నిజామాబాద్ నుంచే కవితను బరిలో దించి ఘనవిజయం సాధించేలా అడుగులు కదపాలన్నది కెసిఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది. The spirit of Telangana and the celebration of “Car and KCR Sarkar”! ✊🏻 This Padyatra today reflects on the tremendous energy and enthusiasm towards BRS Government led by CM KCR Garu. Jai Telangana! Jai KCR! pic.twitter.com/5dVkm3NaSJ — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 16, 2023 -
జగిత్యాల: కుక్క దాడిలో గాయపడ్డ బాలిక మృతి
సాక్షి, జగిత్యాల: కుక్క కాటు మరో బాలిక జీవితాన్ని బలిగొంది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె మృత్యువుతో పోరాడింది. రెండువారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ .. చివరకు కన్నుమూసింది. గొల్లపెల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో పదిహేను రోజుల కిందట ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఊర్లో దాదాపు పది మందిని గాయపర్చింది. అయితే సంగెపు సాహిత్య అనే 12 ఏళ్ల బాలిక మాత్రం కుక్క దాడిలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆ చిన్నారి ఇవాళ(శనివారం) ఉదయం కన్నుమూసింది. తమ ముందు ఆడిపాడిన చిన్నారి ఇక లేదనే విషయం తెలిసి.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: గుండెలో రంధ్రం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి.. -
కేసీఆర్ సారు సల్లంగుండాలె బిడ్డా..
సాక్షి, మల్యాల(చొప్పదండి): ‘ఇంటింటికీ పింఛన్లు ఇచ్చుకుంట.. మాకు ధీముగా ఉన్న కేసీఆర్ సారు సల్లంగుండాలె బిడ్డా..’అని రోడ్డు వెంట మక్కకంకులు కాల్చి విక్రయిస్తున్న ఓ మహిళ వ్యాఖ్యానించింది. ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారులో కాసేపు ఆగారు. అక్కడే మక్కకంకులు అమ్ముతున్న ఓ మహిళ వద్దకు వెళ్లి వాటిని కొనుగోలు చేశారు. ఆమెతో మాటలు కలుపుతూ, కంకులు తింటూ సీఎం కేసీఆర్ పాలనపై కవిత ఆరా తీశారు. అయితే, తనకే కాదు ఇంటింటికీ పింఛన్ వస్తోందని ఆ మహిళ సంతోషంగా చెప్పింది. ‘కేసీఆర్ సారు పదికాలాలు సల్లంగుండాలె’అని దీవించింది. సీఎం కేసీఆర్ కూతురు కవిత తన వద్దకు వచ్చి కంకులు కొనుగోలు చేయడం చాలా సంతోషంగా ఉందని ఉబ్బితబ్బిబ్బయింది. ఎమ్మెల్సీ కవితను చూసి వచ్చిన స్థానికులు ఆమెతో సెల్ఫీలు దిగారు. -
90ఎం.ఎల్. పోయట్లేదు.. బెల్ట్‌షాప్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సాక్షి, జగిత్యాల జిల్లా: జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామంలోని బెల్ట్‌షాపు నిర్వాహకుడు మద్యం పోయడం లేదని ఓ వ్యక్తి మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హబ్సీపూర్ గ్రామానికి చెందిన చిరంజీవి మంగళవారం ఉదయం గ్రామంలోని రవికి చెందిన బెల్ట్‌షాపులోకి వెళ్లాడు. తనకు 90 ఎం.ఎల్.మద్యం పోయాలని కోరగా.. అందుకు నిర్వాహకుడు నిరాకరించాడు. అయితే, తనను కులం పేరుతో తిట్టడమే కాక తనకు మద్యం పోయకుండా అవమానించాడని బాధితుడు రాత్రి పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. చిరంజీవి ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
థియేటర్లో ఫ్రీగా కేరళ స్టోరీ ప్రదర్శన, ఎక్కడంటే?
ది కేరళ స్టోరీ చిత్రాన్ని మతం కోణంలో కాకుండా ఉగ్రవాద కోణంతో చూడాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి ముదుగంటి రవీందర్‌రెడ్డి కోరారు. మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ది కేరళ స్టోరీ సినిమాను ఉచితంగా ప్రదర్శించగా నాయకులు ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మతోన్మాదులు, తీవ్రవాదులు ఏ విధంగా హిందూ మహిళలు, యువతులను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, ఉగ్రవాద శిబిరాలకు తరలిస్తున్నారో ఈ చిత్రంలో చూపించారని తెలిపారు. యువతులు, తల్లిదండ్రులు ఈ చిత్రాన్ని తప్పక చూడాలని కోరారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణశాఖ అధ్యక్షుడు వీరబత్తిని అనిల్, నాయకులు గుర్రం రాము, జిట్టవేణి అరుణ్, ప్రభాకర్, నారాయణరెడ్డి, బిట్టు, మహిళా నాయకులు పాల్గొన్నారు. కేరళ స్టోరీ విషయానికి వస్తే.. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం రూ.250 కోట్లకు చేరువలో ఉంది. చదవండి: ఇంటి పనంతా మాతోనే: స్నేహ -
ఏడో నెలలో పుట్టిన శిశువు.. 750 గ్రాములే బరువు.. ప్రాణం పోసిన డాక్టర్లు..
జగిత్యాల: తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు 40 రోజులపాటు చికిత్స అందించి.. ప్రాణాలు నిలిపారు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. బతుకుతుందో లేదోనన్న బిడ్డ ఆరోగ్యంగా బయటికి రావడంతో తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కథలాపూర్ మండలం తక్కళ్లపల్లికి చెందిన శ్రీలత డెలివరీకోసం మార్చి 29న కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. బ్లీడింగ్ అధికంగా కావడంతో అదేరోజు సిజేరియన్ చేయగా పాప జన్మించింది. ఏడో నెలలో పుట్టిన శిశువు కావడంతో 750 గ్రాముల బరువే ఉంది. శ్వాససంబంధ రుగ్మత, రక్తం ఇన్ఫెక్షన్, తీవ్ర రక్తహీనతతో ఉంది. బతుకుతుందా లేదా అనే ఆందోళన మొదలైంది. అయితే బంధువులు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. పాపను వెంటనే పరీక్షించిన వైద్యులు.. కంటికి రెప్పలా కాపాడుతూ 40 రోజులపాటు వైద్యం అందించారు. దీంతో శిశువు 1,100 గ్రాముల బరువుకు చేరడంతోపాటు, ఆరోగ్యంగా తయారైంది. దీంతో సోమవారం తల్లీబిడ్డను డిశ్చార్జి చేశారు. తమ పాపను కాపాడిన వైద్యులు, సిబ్బందికి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. శిశువుకు మెరుగైన చికిత్స అందించిన వైద్యులు, సిబ్బందిని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది ఉన్నారని, జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్ఎంవో శశికాంత్‌రెడ్డి, ప్రొఫెసర్ అజామ్, డాక్టర్ స్నేహలత, నర్స్‌లు పాల్గొన్నారు. చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
మావోయిస్టుల కార్యకలాపాలు లేవు
జగిత్యాలక్రైం: జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేవని ఎస్పీ భాస్కర్ తెలిపారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీర్పూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులకు ఈనెల 6న నకిలీ లెటర్ప్యాడ్లు పోస్టు చేశారని అన్నారు. ఇందులో బాధ్యులైన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. హెచ్చరిక లేఖలపై నర్సింహులపల్లి సర్పంచ్ ప్రభాకర్ ఫిర్యాదు చేయడంతో వాటిని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టామని అన్నారు. ఈక్రమంలో నర్సింహులపల్లికి చెందిన మాజీ మిలిటెంట్ బోగ లక్ష్మీరాజంపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు. అయితే, తానే ఆ లేఖలు రాసినట్లు అతడు అంగీకరించాడని వివరించారు. లోతైన విచారణలో సిరిసిల్ల పట్టణంలోని వెంకట్రావ్కాలనీకి చెందిన పోలు ప్రకాశ్.. తన కంప్యూటర్ ద్వారా మావోయిస్టుల పేరిట లెటర్ప్యాడ్లు ప్రింట్ చేసి లక్ష్మీరాజానికి ఇచ్చాడన్నారు. ఇదిలా ఉంటే.. లక్ష్మీరాజానికి, తన చిన్నబాపు కుమారుడు బోగ సత్తన్నతో కొంతకాలంగా భూ వివాదం నడుస్తోందని ఎస్పీ చెప్పారు. నర్సింహులపల్లికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కొందరు అధికారులు, గ్రామస్తులు కూడా సత్తన్నకే మద్దతు ఇవ్వడంతో మనసులో పెట్టుకున్న లక్ష్మీరాజం.. తన ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేందుకు మావోయిస్టుల పేరిట లేఖలు ముద్రించి పోస్టు చేశాడని ఎస్పీ వెల్లడించా రు. దీంతో లేఖలు పోస్టు చేసిన బోగ లక్ష్మీరాజం, వాటిని ముద్రించిన సిరిసిల్లకు చెందిన పోలు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. వారినుంచి కంప్యూటర్, మానిటర్, ప్రింటర్, సీపీయూ, కలర్ ప్రింటర్, లేఖ రాసేందుకు ఉపయోగించిన కాగితాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు. వరుసకు సోదరుడైన వ్యక్తితో ఉన్న వ్యక్తిగత కక్షలతోనే లక్ష్మీరాజం నకిలీ ఉత్తరాలు రాసి పో స్టు చేశాడని పేర్కొన్నారు. లక్ష్మీరాజం 50 లెటర్ప్యాడ్లు తీసుకుని, 30 లేఖలు రాసి ఆర్మూర్ పోస్ట్‌బాక్స్‌లో వేశాడని అన్నారు. అతడు పీపుల్స్‌వార్‌లో 1981 నుంచి 2000 సంవత్సరం వరకు పనిచేశాడని, 2008లో పోలీసులకు లొంగిపోయాడని చెప్పారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ ఆరీఫ్‌అలీఖాన్, బీర్పూర్ ఎస్సై అజయ్, సారంగాపూర్ ఎస్సై మనోహర్‌రావు, కానిస్టేబుళ్లు రవి, జలేందర్, సుమన్‌ను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రకాశ్, రూరల్ ఎస్సై అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
జగిత్యాల పెద్దాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం...మహిళా కడుపులో గుడ్డ మర్చిన వైద్యులు
-
అప్పుడప్పుడు అలా జరుగుతుంది.. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అప్పుడప్పుడు వైద్యం వికటించడం సహజమని, డాక్టర్లే కాకుండా సిబ్బంది వల్ల కూడా తప్పు జరగొచ్చంటూ వ్యాఖ్యానించారు. స్వయంగా డాక్టర్ అయిన సంజయ్ కుమార్ కు కంటి వైద్యంలో మంచి పేరుంది. డాక్టర్లు, చికిత్స గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. ఒకటి రెండు సంఘటనల వల్ల ప్రభుత్వాసుపత్రుల పట్ల అభిప్రాయాన్ని చెడుగా మార్చుకోవద్దని కోరారు. "మహిళ కడుపులో గుడ్డ ఉంచి కుట్లు వేశారన్నది రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఘటన.. కానీ ఇపుడు పేపర్లలో వస్తోందన్నారు. కింది స్థాయిలో ఒకరు చేసిన పొరపాటుకు మొత్తం వ్యవస్థను నిందించవద్దు. డాక్టర్లు, నర్సుల సమిష్ఠి బాధ్యతతో ఆపరేషన్లు జరుగుతాయని, ప్రభుత్వాసుపత్రులపై నమ్మకంతో రండి, మాతా శిశు ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం చేయించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. కాగా, జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన గత వారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన నవ్యశ్రీ అనే మహిళకు పదహారు నెలల క్రితం.. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు కడుపులోనే క్లాత్ వదిలేయడం కలకలం రేపింది. ఏడాది తర్వాత నవ్యశ్రీకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంది. స్కానింగ్‌లో కడుపులో బట్ట ఉన్నట్టు గుర్తించగా.. వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్ట తొలగించారు. ఈ మొత్తం విషయాన్ని లేఖలో పేర్కొంటూ నవ్యశ్రీ కుటుంబీకులు జగిత్యాల DMHOకు ఫిర్యాదు చేశారు. చదవండి: నిప్పులకొలిమి.. ఎండకు వెళ్తే మండిపోతారు! డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక -
కావాలనే స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్ చేశారు..
-
నేడు జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను తెరవనున్న అధికారులు
-
‘సారూ.. బడిలో మంచినీళ్లు లెవ్వు’
సాక్షి,జగిత్యాల టౌన్: ‘సారూ మా బడిలో తాగేందుకు మంచినీళ్లు లెవ్వు. మూత్రశాలలు పనిచేయడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నం. మీరైనా జోక్యం చేసుకోండి’ అని ఆరో తరగతి విద్యార్థి ప్రజావాణి ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన రాజమల్లు కుమారుడు పి.విశ్వాంక్ ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. తమ పాఠశాలలో మూత్రశాలలు శిథిలమయ్యాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఒకటి, రెంటికి బడి సమీపంలోని పబ్లిక్ సులభ్ కాంప్లెక్స్‌లోకి వెళ్తున్నామని, అక్కడ నిర్వాహకులు పైసలు వసూలు చేస్తున్నారని తెలిపాడు. తమతోపాటు ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి అని వివరించాడు. అసలే పేదోళ్లమని, తాముపైసలు చెల్లించలేకపోతున్నామని వాపోయాడు. ప్రస్తుతం ఎండాకాలమని, దాహంతో తపి స్తున్నామన్నాడు. ప్రజావాణి ద్వారా జిల్లా సంక్షేమాధికారి నరేశ్‌కు వినతిపత్రం అందజేశాడు. -
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బీఆర్ఎస్ నేత
-
జగిత్యాల: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బీఆర్ఎస్ నేత
సాక్షి, జగిత్యాల: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ పాల్గొనాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం వాయిదా పడినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ రజని భర్త, బీఆర్ఎస్ నేత బండారి నరేందర్ హఠాన్మరణంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఆత్మీయ సమ్మేళనం సంబురాల్లో.. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే.. అక్కడే ఉన్న కార్యకర్తలు వెంటనే ఆయనకు సీపీఆర్ అందించారు. మంచి నీళ్లు తాగించి.. స్పృహలోకి తీసుకొచ్చారు. ఆలస్యం చేయకుండా అక్కడే ఉన్న వాహనంలో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కోలుకుని క్షేమంగా తిరిగొస్తారని భావించిన బీఆర్ఎస్ శ్రేణులు.. ఆ మరణం వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇదిలా ఉంటే గుండెపోటుతోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కవిత ఆధ్వర్యంలో జగిత్యాలలో ఇవాళ రోడ్‌షో, ఆపై బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద BRS నాయకులు ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేయగా.. అందులో నరేందర్ పాల్గొన్నారు. స్థానిక నేత మృతితో సమ్మేళనం బీఆర్ఎస్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కవిత కార్యక్రమాలు రద్దు బీఆర్ఎస్ సీనియర్ నేత బండారి నరేందర్ హఠాన్మరణంతో.. జగిత్యాలలో నేటి కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వేదిక వద్దే నరేందర్ చిత్రపటానికి, అలాగే ఆయన పార్థీవ దేహానికి కవిత నివాళులర్పించారు. ఆపై ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు. -
మద్యం మత్తులో యువతి హల్చల్..
జగిత్యాల: స్థానిక ప్రధాన చౌరస్తాలో యువతి హల్చల్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆటో దిగిన తర్వాత డబ్బులు అడిగిన డ్రైవర్‌పై యువతి రాళ్లతో దాడికి దిగింది. అక్కడే ఉన్న కొందరు యువతి నిర్వాకాన్ని సెల్ఫోన్లో వీడియోతీశారు. వివరాల్లోకి వెళితే సదరు యువతి కరీంనగర్ నుంచి గోదావరిఖనికి ఆటో ఎంగేజ్ మాట్లాడుకోగా రూ.1200కు బేరం కుదుర్చుకుని అక్కడి నుంచి బయల్దేరారు. మార్గమధ్యలో డీజిల్ కోసం డబ్బులు అడగ్గా గోదావరిఖనికి వెళ్లిన తర్వాత డబ్బులు ఇస్తానంది. తీరా గోదావరిఖని చౌరస్తాకు చేరడంతో తనవద్ద డబ్బులు లేవని డ్రైవర్‌ను బెదిరిస్తూ దుర్భాషలాడింది. అంతేకాకుండా అక్కడున్న రాళ్లతో డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. దీంతో అక్కడున్న ప్రజలంతా విస్తుపోయారు. చివరకు పోలీసుల జోక్యంతో ఆటోడ్రైవర్‌కు డబ్బులు ఇప్పించారు. మద్యంమత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు స్థానికులు పేర్కొన్నారు. -
పెళ్లింట విషాదం.. అప్పుడు వరుడి తండ్రి.. ఇప్పుడు వధువు తండ్రి..
సాక్షి, జగిత్యాల: మల్లాపూర్ మండలం కొత్తందారాజుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. దుబాయ్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నఈ గ్రామ వాసి రాజిరెడ్డి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వీరి కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. 20 రోజుల క్రితమే రాజిరెడ్డి కూతురి వివాహం జరగాల్సింది. పెళ్లికి గంట ముందు పెళ్లి కొడుకు తండ్రి గుండెపోటుతో మరణించాడు. దీంతో విహవాం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ ఘటనతో తీవ్ర మానసిక వేదనకు గురై రాజిరెడ్డికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి తరలించే లోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం -
బీజేపీలో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి
న్యూఢిల్లీ: జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి బీజేపీలో చేరారు. ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో చేరిన అనంతరం శ్రావణి మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో తనను అణచివేశారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చినా బీఆర్ఎస్ అధిష్టానం తనను ఓదార్చలేదన్నారు. ఆత్మాభిమానంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. జగిత్యాలలో బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయం.. బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రటరీ ఆయనే.. -
Karimnagar: ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు రావొద్దమ్మా.. కేసీఆర్ ఆదేశాలు?
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర నినాదం ఎత్తుకున్నప్పటి నుంచి నేటి వరకు జిల్లాపై ప్రత్యేకమైన అభిమానం ప్రదర్శిస్తున్నారు. 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 13 స్థానాలకు గాను, 12 చొప్పున అసెంబ్లీ స్థానాలు సాధించి బలాన్ని చాటుకుంది. ఇప్పుడు కూడా పూర్వపు తరహాలోనే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ స్పష్టమైన ఆదేశాలు పంపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంత్రులు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా వారంలో కనీసం ఆరురోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. మిగిలిన ఎమ్మెల్యేలు అత్యవసరమైతే తప్ప.. ఇకపై నుంచి చీటికి మాటికి రాజధానికి రావాల్సిన అవసరం లేదని, నియోజకవర్గపు సమస్యలపై దృష్టి సారించాలని స్పష్టంచేసినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన దరిమిలా.. ఈ మేరకు అందరు ఎమ్మెల్యేలకు సీఎం, పార్టీ అధిష్టానం నుంచి సందేశం అందినట్లు సమాచారం. ఎమ్మెల్యేలపై నిరంతర నిఘా..! పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అందులో భాగంగా ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? స్థానికంగా ప్రజలకు ఎన్నిరోజులు అందుబాటులో ఉంటున్నారు? హైదరాబాద్‌లో ఎన్నిరోజులు ఉంటున్నారు? అన్న విషయాలపై నిరంతరం సమాచారం తెప్పించుకుంటున్నారు. వీటి ఆధారంగా వాటి పనితీరును ఆయన బేరీజు వేస్తున్నారని తెలిసింది. ఇటీవల సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్ కూడా ఉమ్మడి జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. గతవారం కొండగట్టు మాస్టర్ ప్లాన్ సందర్భంగా స్మితా సభర్వాల్ ఒకరోజు ముందే వచ్చారు. తాజాగా కరీంనగర్లో జరుగుతున్న తీగలవంతెన, ఎంఆర్ఎఫ్, స్మార్ట్‌సిటీ అభివృద్ధి కార్యక్రమాలను ఆమె పరిశీలించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటలిజెన్స్, పార్టీ, ఇతర వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సీఎంవోకు రిపోర్టు అందుతూనే ఉంది. అందుకు అనుగుణంగా సీఎం నుంచి తగిన సూచనలు, సలహాలు వసూ్తనే ఉన్నాయి. అన్ని పార్టీలు వస్తున్న క్రమంలో..! రాష్ట్రంలో పాత కరీంనగర్‌కు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, బీఎస్పీ, వైఎస్సార్ టీపీ తదితర పార్టీలు కొంతకాలంగా ప్రయత్నాలు సాగి స్తున్నాయి. తాజాగా వీటికి తోడుగా ఎంఐఎం కూడా చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం చేసిన పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ.. పెండింగ్ పనులను పూర్తి చేయాలని సీఎం నుంచి సీనియర్ లీడర్ల ద్వారా ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ప్రత్యర్థి పార్టీల సంఖ్య, రాజకీయ పోటీ పెరుగుతున్న దరిమిలా.. నిరంతరం ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటికే మొదలు.. జిల్లాలో మంత్రి కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ పరంగా జిల్లాల్లో వరుస సమావేశాలతో బిజీగా ఉంటున్నారు. అటు కేబినెట్ ఇటు జిల్లా కలెక్టర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 13 సమావేశాల్లో హుజూరాబాద్, మంథని మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అధికార పార్టీ గెలిచింది. సీఎం ఆదేశాలతో దాదాపుగా ఎమ్మెల్యేలంతా స్పీడు పెంచారు. ►జగిత్యాల: డా.సంజయ్‌కుమార్ పల్లె నిద్రపేరుతో గ్రామాల్లో నిద్రిస్తున్నారు. ►కోరుట్ల: విద్యాసాగర్‌రావు లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ►ధర్మపురి: ఈశ్వర్ నిరంతరం జిల్లా సమీక్షలు, లబ్ధిదారులతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. ►సిరిసిల్ల: కేటీఆర్ వేములవాడ మాస్టర్‌ప్లాన్ జిల్లాపై సమీక్షలు.. ►వేములవాడ: రమేశ్ కొద్దికాలంగా పెరిగిన పర్యటనలు. ►కరీంనగర్: గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎంఆర్ఎఫ్, స్మార్ట్‌సిటీ పనులపై సమీక్ష ►చొప్పదండి: రవిశంకర్ కొండగట్టు మాస్టర్‌ప్లాన్‌తో పెరిగిన స్పీడు.. ►మానకొండూరు: బాలకిషన్ పల్లెల్లో మార్నింగ్ వాక్‌లకు ప్లాన్ ►పెద్దపల్లి: మనోహర్‌రెడ్డి నిత్యం లబ్ధిదారులతో సమావేశాలు ►రామగుండం: చందర్ నిరంతరం సేవా, వసతుల కల్పనపై సమీక్షలు ►హుస్నాబాద్: సతీశ్‌బాబు స్థానిక సమస్యలపై ప్రజలతో సమావేశాలు. -
దొంగలు ఉత్తరభారతీయులా?
జగిత్యాలక్రైం/కొండగట్టు(చొప్పదండి): విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ దోపిడీలో పాల్గొన్న దొంగలు ఉత్తరభారతీయులు లేదా పొరుగు రాష్ట్రంవారు అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీలో నిక్షిప్తమైన వీడియోల ఆధారంగా.. పోలీసులు ఈ మేరకు నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం. ఆలయం వెనక భాగాన ఉన్న భేతాళుడి గుడి నుంచి దొంగలు తలుపులు బద్దలు కొట్టినట్లు గుర్తించారు. చూసేవారికి అనుమానం రాకుండా సెక్యూరిటీ గార్డులను తలపించేలా డ్రెస్సింగు వేసుకుని, చేతిలో లాఠీలు పట్టుకున్నారు. సీసీ కెమెరాల్లో ముఖాలు కనబడకుండా తలలకు మంకీ క్యాపులు ధరించి, ఒంటిని పసుపురంగు శాలువాలతో కప్పుకున్నారు. తలుపులు బద్దలు కొట్టేందుకు వీలుగా ఉండే రెంచ్‌లు, ఇతర పనిముట్లను శాలువాల చాటును లోనికి తీసుకువచ్చారు. వీరి కదలికలు ఆహార్యం, ఆకారాలను బట్టి వీరు ఉత్తరభారతీయులుగా అనుమానిస్తున్నారు. వారంరోజులుగా జిల్లాలో వరుసగా జరుగుతున్న ఆలయాల చోరీలకు, వీటికి ఏదైనా లింకుందా లేదా? అన్న విషయాలను సైతం పోల్చిచూస్తున్నారు. రాత్రిపూట వెండి తాపడాలను పనిముట్లతో తొలచుకుపోయినా ఎలాంటి చడీచప్పుడు రాకుండా జాగ్రత్తపడ్డారంటే వీరంతా పక్కా ప్రొఫెషనల్ గ్యాంగ్ అన్న నిర్ధరణకు వచ్చారు. వీరికి సంబంధించిన కీలక సమాచారం కూడా పోలీసుల వద్ద ఉన్నట్లు సమాచారం. వీరు మహా రాష్ట్రవైపు పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులపై చర్యలు..! ఈ క్రమంలో ఆలయానికి రాత్రిపూట భద్రత కల్పించిన పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు విధుల్లో అలసత్వం వహించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. దొంగలను గుర్తించిన పోలీసులు? అంజన్న ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పోలీసులు ఎట్టకేలకు గుర్తించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సీసీపుటేజీల్లో రికార్డుల ప్రకారం దొంగలను పోలీసులు గుర్తించి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా వారి ఉన్న ఆచూకి కూడా కనుగొన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వీరి అరెస్టును పోలీసులు ధ్రువీకరిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. -
క్షయ నివారణ అందరి బాధ్యత
జగిత్యాల: క్షయ నివారణ ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి శ్రీధర్ అన్నారు. శుక్రవారం మోతెవాడలో నిక్షయ్ దివస్ కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్షయ నిర్ధారణ జరిగితే ఉచితంగా ఆరు మాసాల పాటు మందులు అందించడంతోపాటు ప్రతినెలా పోషణ భత్యం కింద రూ.500 అందిస్తామని అన్నారు. క్షయవ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, వైద్యురాలు గీతిక, సూపర్వైజర్ శ్రీనివాస్, మహేశ్, రూప, సృజన్ తదితరులు పాల్గొన్నారు. -
అంజన్నకే శఠగోపం
కొండగట్టు(చొప్పదండి): ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన, ఏళ్లచరిత్రగల కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం వేకువజామున చోరీ జరిదింది. చోరీ చిన్నదే అయినా.. ఆలయ చరిత్రలో తొలిసారి కావడం కలకలం రేపుతోంది. అధికార యంత్రాంగం దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది. సీఎం కేసీఆర్ ఇటీవల ఆలయాన్ని సందర్శించి అభివృద్ధికి వరాల జల్లు కురిపించారు. అయితే, కొద్దిరోజుల తేడాతోనే దొంగలు చోరీకి పాల్పడడం విస్మయం కలిగిస్తోంది. దొంగతనం జరిగింది ఇలా.. శుక్రవారం వేకువజామున 1.10 గంటల ప్రాంతంలో ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు ఆలయంలోకి చొరబడ్డారు. 2.20గంటల వరకు తమ పనికానిచ్చేశారు. తొలుత ఆలయం వెనకాల ద్వారాల తాళాలు పగుల గొట్టారు. అనంతరం అంతరాలయంలోకి వెళ్లే దారికి అడ్డుగా ఉన్న తలుపుల పట్టీలు తొలగించి లోనికి ప్రవేశించారు. గర్భాయంలోని స్వామివారి కిరీటం, మకర తోరణం, శ్రీరామ రక్షగొడుగులు, మకర తోరణ స్తంభం, రెండు శఠగోపాలు, కవచం, అంతారాలయ తోరణాలు, ,శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయలోని మరోరెండు శఠగోపాలు, మరికొన్ని వస్తువులను అపహరించారు. ఆలయంలోని హనుమాన్ విగ్రహంపై గల శంఖుచక్రం, బంగారు శ్రీరామ రక్ష తోకవారం, పదుకలు, ఉత్సవమూర్తి, అంతరాలయంలని తోరణం, శ్రీలక్ష్మీఅమ్మవారి ఆలయంలోని వెండి తోరణం, పాదుకలు, శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని శ్రీరామ పట్టాభిషేకం వస్తువుల జోలికి వెళ్లలేదు. మొత్తంగా 15కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని, వీటి విలువ సుమారు రూ.9లక్షల విలువ ఉంటాయని ఈవో వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం.. ఆలయానికి పటిష్టమైన భద్రత లేదు. ఉన్న ఒక అధికారి కూడా రాత్రి సమయాల్లో అందుబాటులో ఉండడంలేదు. దీంతో సిబ్బంది తమకు ఇష్టమైనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భక్తులు నిత్యం గర్భాలయంలోకి రావడం, వారితోనే అధికారులు, అర్చకులు వివిధ పనులు చేయించుకోవడం, అధికారులు, సిబ్బంది చేయాల్సిన విధులను సెక్యూరటీ గార్డులు, ఇతర వ్యక్తులతో చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈవో, ఆలయ సూపరింటెండెంట్ పర్యవేక్షణ లోపం కారణమని అంటున్నారు. మొత్తంగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడం లోపంగా కనిపిస్తోంది. 12మందితో సెక్యూరిటీ.. ఆలయంలో భద్రతా చర్యలు చేపట్టేందుకు 12మంది హోంగార్డులు ఉన్నారు. వీరు ఉదయం 6గంటల – 6 గంటల వ రకు ఆరుగురి చొప్పున విధులు నిర్వర్తిస్తారు. రాత్రివేళలో న లుగురు విధుల్లో ఉంటారు. రోజూ మాదిరిగానే రాత్రి వరకు ఓ హోంగార్డు విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత తన గదికి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో ముగ్గురు దొంగలు ఆలయంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయాన్నే ఆలయాన్ని శుభ్రపరచడానికి వెళ్లిన స్వీపర్లు.. గర్భాయంలో కోతులు ఉండటం, సామగ్రి చెల్లాచెదురుగా పడిఉండడాన్ని గమనించారు. వెంటనే ఆలయ ఉపప్రధాన అర్చకుడు చిరంజీవస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆలయ ఈవో వెంకటేశ్‌కు సమాచారం అందించారు. ఆలయ ఈవో ఘటపై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన డాగ్‌స్క్వాడ్.. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆలయానికి చేరుకున్నారు. భేతాళస్వామి ఆలయ పరిసరాల్లో డాగ్‌స్క్వాడ్‌తో తని ఖీలు చేశారు. సాగర్ గెస్ట్‌హౌస్ సమీపంలో హనుమాన్ కవచానికి సంబంధించిన ఓ ఫ్రేమ్‌ను వారికి దొరికింది. ఫింగర్ ప్రింట్ ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం, సైబర్ టీం ఆల య పరిసరాల్లో అణువణువూ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. భక్తు ల కోరికలు తీర్చే అంజన్న ఆలయంలోనే చోరీ జరగడం బాధాకరమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి చేస్తామన్న సమయంలో ఇలా దొంగతనం జరగడం విషాదకరమన్నారు. 10 ప్రత్యేక బృందాలతో గాలింపు డీఎస్పీ ప్రకాశ్ నేతృత్వంలో 10 ప్రత్యేక పోలీసు బృందాలు దొంగల కోసం గాలిస్తున్నాయి. ఆలయంలో దొంగతనం జరగడం చాలా బాధాకరం. ప్రాయశ్చిత్తం కోసం హోమం, మూడు దేవతలకు 11లీటర్ల పాలతో అభిషేకం, 1008 నామాలతో పూజలు నిర్వహించాం. ఆ తర్వాతనే భక్తులకు అనుమతించాం. – జితేంద్రప్రసాద్, అర్చకుడు, కొండగట్టు ఆలయం -
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి స న్నిధిలో మార్చి 3 – 15వ తేదీవరకు జరిగే స్వా మివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజగోపురాలకు రంగులు వేస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు నిర్మిస్తున్నారు. తాగునీరు, నీడ వసతుల కల్పనలో నిమగ్నమయ్యారు. వెదురు తడకలతో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికై డ్రెస్ ఛేంజింగ్ రూంలతోపాటు డ్రెస్సింగ్ రూంల వివరాలు భక్తులకు తెలిసేలా కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఆలయ రాజగోపురాలు, ఆలయాలకు విద్యుత్ దీపాలు అలంకరిస్తున్నారు. స్వామివారి కల్యాణ వేదిక వద్ద ప్ర త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రసాదాల కోసం ఒక లక్ష లడ్డూలు, 25 క్వింటాళ్ల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక మెట్పల్లి(కోరుట్ల): పట్టణంలోని వెంకట్రావ్‌పే ట మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకు ల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు శనివారం హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో బి.శ్రీహిత, డి.హన్సిక, వి.స్పందన, బి.నిమ్నిత ప్రతిభ చూపడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వీరిని ప్రిన్సిపాల్ కోటగిరి ఆనందంతోపాటు అధ్యాపకులు అభినందించారు. వెంకన్నకు క్షీరాభిషేకం ధర్మపురి : శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం క్షీరాభిషే కం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారిని రంగురంగుల పూలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యుల మంత్రోచ్ఛవాలతో ప్రత్యేకపూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి సందర్శన రాయికల్(జగిత్యాల): స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ని రాష్ట్ర కుస్ఠు నివారణ బృందంలోని సభ్యులు వెంకటేశ్వరాచారి, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహారెడ్డి, హిర్యానాయక్ శుక్రవారం సందర్శించారు. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం అందించే సాయం తదితర అంశాలపై వివరించారు. మెడికల్ ఆఫీసర్ సతీశ్‌కుమార్, ఎంపీహెచ్ఎస్ శ్రీధర్ పాల్గొన్నారు. పనులను వేగవంతంగా చేయాలి జగిత్యాల: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం పూర్తిచేయాలని కలెక్టర్ యాస్మిన్ బాషా ఆదేశించారు. అధికారులతో శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన తెలంగాణ క్రీడా ప్రాంగణాల పనులు, వైకుంఠధామాలు, గ్రామపంచాయతీ భవనాల పనులను సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. మన ఊరు.. మన బడి పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మకరంద్, లత, ఆర్డీవోలు మాధురి, వినోద్‌కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మున్సిపల్ కమిషనర్లతో ‘సాక్షి’ ఫోన్ ఇన్
జగిత్యాల/మెట్పల్లి/ధర్మపురి: జిల్లాలోని జగిత్యాల, మెట్పల్లి, ధర్మపురి మున్సిపాలిటీల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న కుక్కలు, కోతుల బెడద, మంచినీటి సరఫరా, పారిశుధ్య లోపం, వీధిలైట్ల నిర్వహణలో సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను పురపాలిక కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ అవకాశం కల్పిస్తోంది. వారితో శనివారం ‘సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టింది. బల్దియావాసులు తమ సమస్యలను కమిషనర్ల దృష్టికి తీసుకెళ్తే.. వారు పరిష్కారం చూపిస్తారు. జగిత్యాల మున్సిపాలిటీ కమిషనర్ : బోనగిరి నరేశ్ సంప్రదించాల్సిన నంబరు : 98499 05877 సమయం : శనివారం ఉదయం : 9.30 – 10.30గంటల వరకు మెట్పల్లి మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్ : వెంకటలక్ష్మి సంప్రదించాల్సిన నంబరు : 95730 46157 సమయం : శనివారం 11.00 – మధ్యాహ్నం 12.00గంటల వరకు ధర్మపురి మున్సిపాలిటీ కమిషనర్ : రమేశ్ సంప్రదించాల్సిన నంబరు 88866 49051 సమయం : శనివారం ఉదయం 11.00 – మధ్యాహ్నం 12.00 గంటల వరకు నేడు -
ఆదాయాభివృద్ధి పనులు చేపట్టాలి
జగిత్యాలరూరల్: మహిళా సంఘాలు రుణాలతో ఆదా యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారాయణ సూచించారు. సంఘం సభ్యురాలు గర్వందుల భాగ్య పీఎంఎఫ్ఎంఈ ద్వారా ఏర్పాటు చేసుకున్న కోల్డ్ఫ్రెష్ ఆయిల్ మిల్లును లక్ష్మీనారా యణ శుక్రవారం సందర్శించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాయితీతో కూడిన రుణాలు అందిస్తామన్నారు. ఇప్పటివరకు 66 యూనిట్లకు ప్రతిపాదనలు రాగా అందులో 24 యూనిట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యాయని తెలి పారు. ఇందులో 12 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. సెర్ప్ అధికారి వెంకటేశం, సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ నలువాల సునీత, ఉపసర్పంచ్ రఘుపతిరెడ్డి, ఏపీఎం గంగాధర్, సీసీ గంగారాం, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సత్తవ్వ, వీవో అధ్యక్షురాలు భాగ్యలక్ష్మీ, రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
వెల్గటూర్(ధర్మపురి): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎండపల్లి మండలంలోని గొడిశెలపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కందికట్ల లచ్చయ్య(45) దుస్తుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా వ్యాపారం సాగకపోవడంతో తాగుడుకు బానిసయ్యాడు. ఈ విషయమై ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తన భర్త తాగుడుకు బానిసై, జీవితం మీద విరక్తి చెంది, ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్కుమార్ తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు సారంగాపూర్(జగిత్యాల): బీర్పూర్ మండలంలో ని కొల్వాయి గ్రామంలో ఓ వ్యక్తిపై దాడికి పాల్ప డిన మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై అజయ్ తె లిపారు. ఆయన వివరాల ప్రకారం.. గత నెల 31న కొల్వాయికి చెందిన శాకపురం రామచంద్రం ఇంట్లోకి అతనికి వరుసకు తమ్ముడైన శాకపురం లక్ష్మణ్ అక్రమంగా ప్రవేశించి, దాడి చేశాడు. పాత గొడవలు మనసులో పెట్టుకొని, కొట్టాడని రామచంద్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించండి
రాయికల్(జగిత్యాల): బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సురతాని భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామంలో ప్రజాగోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, విస్మరించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు అన్నవేని వేణు, ఎంపీటీసీ సభ్యుడు ఆకుల మహేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్, నాయకులు తిరుపతినాయక్, పర్శరాం, సాయిరాజ్గౌడ్, నర్సయ్య, ఆకుల శేఖర్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. -
చేయని నేరానికి దళిత యువకుడిని బలి చేస్తారా?
బుగ్గారం(ధర్మపురి): స్థానిక ఉన్నత పాఠశాలలో గతంలో చెట్లు నరికిన ఘటనలో కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అమాయక దళిత యువకుడిని కేసులో ఇరికించారని బుగ్గారం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు, వీడీసీ కోర్ కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి హాజరై మాట్లాడారు. గతేడాది నవంబర్‌లో స్థానిక జెడ్పీహెచ్ఎస్ మైదానంలో 6 చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండానే ఎస్ఎంసీ చైర్మన్ మూల శ్రీనివాస్‌గౌడ్ నరికించి, మాయం చేశారన్నారు. దీనిపై వీడీసీ ఆధ్వర్యంలో తాను అధికారులకు ఫిర్యాదు చేయగా గ్రామపంచాయతీ కార్మికుడు దూడ కిరణ్‌ను ఇందులో ఇరికించి, చైర్మన్ తప్పించుకున్నారని పేర్కొన్నారు. చేయని నేరానికి దళిత యువకుడిని బలి చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ మూల సుమలత, ఆమె భర్త శ్రీనివాస్‌గౌడ్‌ల ఆగడాలు ఎక్కువయ్యాయని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడీసీ అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ టైరుకు చీరకొంగు చుట్టుకొని..
కోరుట్ల రూరల్: రోడ్డు ప్రమాదంలో రాయికల్ మండలంలోని మైతాపూర్‌కు చెందిన వల్లకొండ జమున (57) మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. జమున పని నిమిత్తం శుక్రవారం కుమారుడు సుధాకర్ గౌడ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై కోరుట్లకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో జోగిన్‌పెల్లి శివారులోకి రాగానే ఆమె చీరకొంగు బైక్ వెనుక టైరుకు చుట్టుకుంది. ఈ ఘటనలో ఆమె కిందపడి, తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికు మారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కోనాపూర్ వంతెన పూర్తి చేయండి
సారంగాపూర్(జగిత్యాల): కోనాపూర్ హైలెవల్ వంతెన పనులను నిర్దేశిత వ్యవధిలో పూర్తిచేస్తేనే ప్రజారవాణాకు ఇబ్బందులు ఉండవని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కోనాపూర్ శివారులో ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో రూ.5.65 కోట్ల వ్యయంతో చేపట్టిన హైలెవల్ వంతెన పనులకు మంత్రి శుక్రవారం భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడారు. వర్షాలు ప్రారంభం కాకముందే వంతెన పనులు పూర్తిచేయాలని చెప్పారు. దీనిద్వారా మంచిర్యాల జిల్లా జన్నారం, జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్పూర్ మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కాగా, అక్కడి నుంచి మంత్రి రామగుండం ఎన్టీపీసీకి వెళ్లగా.. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత రూ.86 లక్షలతో చేపట్టిన దుబ్బరాజన్న ఆలయ అభివృద్ధి, పెంబట్ల పాఠశాలలో రూ.30లక్షలతో నిర్మించిన మన ఊరు–మన బడి భవనాలు ప్రారంభించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్‌గౌడ్, ఎంపీపీ కోల జము న, జెడ్పీటీసీ మేడిపల్లి మనోహర్‌రెడ్డి, డీఈవో జగన్మోహన్రెడ్డి, ఆలయ ఈవో కాంతారెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, శిలాఫలకంపై తన పేరులేదని చంద్రశేఖర్‌గౌడ్ ఆర్ అండ్ బీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. రూ.70 కోట్లతో మన ఊరు..మన బడి పనులు జగిత్యాల:జిల్లాలో రూ.70 కోట్ల వ్యయంతో పాఠశాలల్లో మన ఊరు.. మన బడి పనులు చేపట్టామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్థానిక 8వ వార్డు బుడిగజంగాల కాలనీలో మన ఊరు.. మన బడి కింద రూ.11.70 లక్షలతో చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉచిత విద్య అందిస్తున్నాం.. జగిత్యాలరూరల్:ఉచిత వైద్యం, విద్య అందిస్తూ దేశంలోనే మనం అగ్రగామిగా ఉన్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి చల్గల్లో రూ.17.35 లక్షలతో చేపట్టిన మన ఊరు మన బడి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు దేశంలో పిచ్చోళ్ల రాజ్యం తయారైందన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు, ఉచిత విద్యుత్, రైతుబీమా లాంటి పథకాలు అమలు చేస్తున్నారన్నారు. -
ఐదు గంటల్లో వివాహం.. ఆగిపోయిన పెళ్లి
కోరుట్ల(జగిత్యాల): పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి.. బంధువులందరూ తరలివచ్చారు. ఇళ్లంతా సందడిగా ఉంది.. భాజాభజంత్రీలతోపాటు సంప్రదాయాలన్నీ పూర్తి చేశారు. ఉదయం 10.30 గంటలకు వివాహ ముహూర్తం.. పెళ్లి కూతురి బంధువులు వరుడిని తీసుకెళ్లడానికి ఉదయం 5 గంటలకే వచ్చారు.. అంతలోనే వరుడి తండ్రి ఛాతిలో నొప్పి వస్తుందంటూ కుప్పకూలి, అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల పట్టణానికి చెందిన కూసరి గంగారాం(57) కుమారుడు ప్రశాంత్‌కు మల్లాపూర్ మండలంలోని కొత్తదాంరాజ్‌పల్లిలో ఓ యువతితో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి కుమారుడిని తీసుకెళ్లడానికి వధువు తరఫు బంధువులు ఉదయం 5 గంటలకు కోరుట్ల చేరుకున్నారు. వరుడిని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా అతని తండ్రి గుండెనొప్పితో ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. బంధువులు రెండు ప్రైవేటు ఆస్పత్రుల వద్దకు తీసుకెళ్లినా తెరిచి లేవు. చివరకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం కావడంతో కొన ఊపిరితో ఉన్న గంగారాం మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనతో ప్రశాంత్ వివాహం ఆగిపోయింది. అప్పటివరకు పెళ్లి భాజాలు మోగిన ఆ ఇంట్లో అనూహ్యంగా చావుడప్పులు వినిపించాయి. గంగారాంకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. -
యువత అన్ని రంగాల్లో ముందుండాలి
జగిత్యాలటౌన్: యువత అన్ని రంగాల్లో ముందుండి, దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని నెహ్రూ యువకేంద్రం డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ వెంకటరాంబాబు అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ అనే అంశంపై యువతకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధికంగా యువతను కలిగి ఉన్నది మన దేశమేనని గుర్తు చేశారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, సమాజంలో వస్తున్న మార్పులు, అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, డేటాసైన్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. జీ20 దేశాలకు మన దేశం అధ్యక్షత వహించనుండటం హర్షణీయమని పేర్కొన్నారు. విపత్తుల సమయంలో యువత దేశానికి అండగా నిలిచేందుకు సన్నద్ధంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌వైకే యువజన వలంటీర్ చింత అనిల్, రాపాక సాయి, మనవాడ నందు, పాదం మహేందర్, లవకుమార్, సాయికిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయండి
జగిత్యాల: ప్రభుత్వ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాలు లేకుండా ఆక్రమణకు గురైన ఆబాది, గ్రామకంఠం, శిఖం, వక్ఫ్, దేవాదాయ భూములు వివరాలను ప్రొఫార్మా–1 ప్రకారం సేకరించామని, వాటి క్రమబద్దీకరణకు ఉన్న అవకాశాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ జీవోలు 58, 59 ప్రకారం ప్రభుత్వ భూములు, గ్రామకంఠం, ఆబాది తదితర కారణాల వల్ల హోల్డ్‌లో పెట్టిన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని చెప్పారు. కంటి వెలుగు శిబిరాలను విజయవంతం చేయాలని, జిల్లాలకు చేరే కళ్లాద్దాలను పంపిణీ చేసి, వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. పోడు భూముల పంపిణీకి సంబంధించి జిల్లాస్థాయి కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ.. జిల్లాలో పనులను వేగవంతం చేశామని, కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోడు భూములపై నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లత, మకరంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పరిమిత నమ్మకాలే అభివృద్ధికి ఆటంకం
దర్మపురి: ప్రతి వ్యక్తిలో అపరిమితమైన శక్తి ఉంటుందని, చాలా మంది దాన్ని తక్కువ చేసుకొని, తమ నమ్మకాలను పరిమితం చేసుకోవడం అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని ఇంపాక్ట్ ట్రైనర్, సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ అన్నారు. ధర్మపురి మండలం మగ్గిడి గ్రామంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏగాగ్రతపై పలు సూచనలు చేశారు. విజయం సాధించాలని బలమైన కోరిక ఉన్నప్పుడు తప్పకుండా నెరవేరుతుందని, విద్యార్థి దశనుంచే ఒక విజన్‌తో ఉండాలని చెప్పారు. అనవసరపు ఆలోచనలు మెదడులోకి చేరవేస్తే దాని సామర్థ్యం తగ్గిపోతుందని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ రవీందర్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏడుస్తోంది.. పాలు తాగలేకపోతోంది
బుగ్గారం(ధర్మపురి): 45 రోజుల పసిపాప.. పాల కోసం గుక్కపట్టి ఏడుస్తోంది.. కానీ తల్లి పాలు పడుతుంటే తాగలేకపోతోంది.. ఆందోళన చెందిన ఆ తల్లిదండ్రులకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తుల జబ్బు, గొంతువాపుగా తేలింది. తల్లిదండ్రులు తాము కూడబెట్టుకున్న డబ్బులన్నీ వైద్యానికి ఖర్చు చేశారు. ఇక చేతిలో చిల్లిగవ్వ లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బుగ్గారం మండంలోని సిరికొండ గ్రా మానికి చెందిన గజ్జెల నరేష్–రజిత దంపతులది నిరుపేద కుటుంబం. ఇద్దరూ వ్యవసాయ కూలీలు. వీరికి 45 రోజుల పాప నాగలక్ష్మి ఉంది. కూతురు పుట్టిందన్న సంతోషిస్తున్న సమయంలో ఒక్కసారిగా వారి జీవితంలో కుదుపు. పాప పాల కోసం ఏడుస్తోంది.. కానీ తాగలేకపోతోంది. త ల్లిదండ్రులు తొలుత జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా గొంతువాపుతోపాటు ఊపిరితి త్తుల జబ్బు ఉందని వైద్యులు తెలిపారు. గత జనవరిలో 10 రోజులు చికిత్స పొందగా కొంత నయమవడంతో ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ ఈ నెలలో సమస్య తీవ్రమైంది. 20వ తేదీన ఆస్పత్రిలో చేర్పించారు. హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు.. పాప ఆరోగ్యం బాగుపడటం కోసం నరేష్–రజిత దంపతులు పైసా పైసా పోగేసుకున్న రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం అప్పు చేసి, నాగలక్ష్మికి వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నారు. వైద్యులు మరో రూ.4 లక్షలు కావాలన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లమంటున్నారని, చేతిలో చిల్లిగవ్వ లేదని ఆ దంపతులు విలపిస్తున్నారు. దాతలు స్పందించి, తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. దాతలు సంప్రదించాల్సిన అడ్రస్.. బ్యాంక్ అకౌంట్ నంబర్ : 200422010024976 ఐఎఫ్ఎస్సీ కోడ్ : టీఎస్ఏబీ0020004 బ్రాంచి: కరీంనగర్ డిస్ట్రిక్ట్ కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, ధర్మపురి ఫోన్ నంబర్ : 95735 07907 (మోతె కరుణాకర్, పాప మేనమామ, ఫోన్ పే, గూగుల్ పే). -
సీఎం కేసీఆర్ చెప్పేదొకటి.. చేసేదొకటి
మల్యాల(చొప్పదండి): సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్నివర్గాలు విసిగి, వేసారిపోయారు, ఆయన చెప్పేదొకటి, చేసేది మరోటని, ఈ పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షుడు నేరెళ్ల శ్రావణ్ ఆధ్వర్యంలో ప్రజా గోస.. బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అథితిగా ఈటెల రాజేందర్ హాజరై మాట్లాడారు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు.. ఇప్పటిదాకా ఏదీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటూ ప్రచారం చేసుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో సామాన్యులకు న్యాయం అందడం లేదని అన్నారు. కేసీఆర్‌కు ఓటు వేయకపోతే రైతుబంధు రాదని, పింఛన్ బంద్ చేస్తరని, కల్యాణలక్ష్మీ ఇవ్వరంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఎవరు ఉన్నా ఇవన్నీ వస్తాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. హుజూరాబాద్‌లో తనను ఓడించేందుకు రూ.6వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజలు ధర్మంవైపే నిలిచారని గుర్తుచేశారు. కోటీశ్వరులకు సైతం రైతుబంధు ఇస్తూ నిరుపేదల కడుపుకొడుతున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేద దళితబంధు ఇస్తామని, కోటీశ్వర్లకు ఇవ్వమన్నారు. రైతులు, రైతు కూలీలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. తనతో జతకట్టిన కాంగ్రెస్, బీఎస్పీ, టీడీపీలను కేసీఆర్ ఖతం చేశారని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయడం లేదని, సర్పంచులకు అధికారం లేదని, అధికారం అంతా ఎమ్మెల్యేల చేతుల్లోనే కేంద్రీకృతం చేశారని విమర్శించారు. గతంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేవారని, ఇప్పుడు ఎమ్మెల్యేల ఆదేశాలకు అనుగుణంగా బీజేపీ నాయకులను అరెస్టు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి వచ్చే 15 ఆర్థిక సంఘం నిధులతోనే గ్రామ పంచాయతీల్లో వేతనాలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కేసీఆర్ పాలన కొనఊపిరితో ఉందని, కరీంనగర్ జిల్లా ప్రజలు చైతన్యవంతులని, రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి, గెలిపించాలని ఆయన కోరారు. నాయకులు బొడిగె శోభ, సుద్దాల దేవయ్య, ముదుగంటి రాజు, బొబ్బిలి వెంకటస్వామి, కెల్లేటి రమేశ్, పొన్నం మల్లేశం, జనగం రాములు, సురేశ్, మల్లేశం, ఎంపీటీసీలు రాచర్ల రమేశ్, సంగని రవి పాల్గొన్నారు. -
కంకర టిప్పర్ బోల్తా
జగిత్యాల క్రైం: జగిత్యాల రూరల్ మండలంలోని హన్మాజీపేట శివారులో శుక్రవారం సాయంత్రం ఓ కంకర టిప్పర్ బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల అర్బన్ మండలంలోని పెర్కపల్లి నుంచి సారంగాపూర్ మండలంలోని రంగపేట వరకు డబుల్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం కంకర తీసుకువస్తున్న టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బోల్తా పడింది. ఆ సమయంలో రహదారి వెంట ఎవరూ వెళ్లకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అనంతరం టిప్పర్‌ను జేసీబీ సహాయంతో తొలగించారు. ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం ఇబ్రహీంపట్నం(కోరుట్ల): మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ సమీపంలో ఓ పూరి గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన దేవ్‌సింగ్ తన కుటుంబసభ్యులతో కలిసి మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో చెరుకు కోసేందుకు వచ్చాడు. ఇక్కడే గుడిసెలో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం అందరూ చెరుకు కోసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకుంది. చుట్టుపక్కలవారు ఆర్పేందుకు ప్రయత్నించగా పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో గుడిసె లోపల ఉన్న దుస్తులు, బియ్యం, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.20 వేల వరకు నష్టం జరిగిందని బాధితుడు దేవ్‌సింగ్ తెలిపారు. ఇటుకలబట్టీ పాఠశాల పరిశీలన కోరుట్ల: పట్టణ శివారులోని కల్లూర్ రోడ్లో ఇటుకలబట్టీ వద్ద ఏర్పాటు చేసిన పాఠశాల(పని వద్ద పాఠశాల)ను జిల్లా సెక్టోరియల్ అధికారి కె.రాజేశ్ శుక్రవారం పరిశీలించారు. ఇక్కడ 12 మంది ఒడిశా విద్యార్థులకు ఒడియా భాషలో ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో మాట్లాడి, విద్యాబోధన తీరును తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇటుకలబట్టీ నిర్వాహకులు రామసుబ్బయ్య, కిష్టయ్య, సీఆర్పీ గంగాధర్ పాల్గొన్నారు. సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలి మెట్పల్లి(కోరుట్ల): సాధారణ ప్రసవాల కలిగే ప్రయోజనాలపై మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి జైపాల్‌రెడ్డి సిబ్బందికి సూచించారు. పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో శుక్రవారం వైద్య సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. సీజేరియన్లతో కలిగే అనర్థాలను గర్భిణులకు వివరించాలని పేర్కొన్నారు. తప్పనిసరి అయితే తప్ప సిజేరియన్లు చేయవద్దని సూచించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వైద్యులు అంజిరెడ్డి ఉన్నారు. -
కల్యాణం... కమనీయం
రాయికల్(జగిత్యాల): భూపతిపూర్ గ్రామంలోని లక్ష్మీనృసింహస్వామి కల్యాణం శుక్రవారం కమనీయంగా జరిపించారు. అర్చకులు గిరిధారాచార్యులు, రామకృష్ణాచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు తొలుత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణ మధ్య కల్యాణం జరిపించారు. వేలాదిమంది భక్తులు కల్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ మహేశ్వర్‌రావు, ఉపసర్పంచ్ అన్నవేని వేణు, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు ముత్యంరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సంకోజి మహేశ్, అర్చకులు వెంకటకృష్ణ, రమణ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పాలన రాష్ట్రానికి అరిష్టం: ఈటల
జగిత్యాల టౌన్: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. అన్ని వర్గాలను అరిగోస పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం ఇంకా కొనసాగడం రాష్ట్రానికి అరిష్టమని విరుచుకుపడ్డారు. మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ పదవితోపాటు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బోగ శ్రావణిని శుక్రవారం ఆయన కలిసి సంఘీభావం తెలిపారు. బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. మహిళగా, యువ వైద్యురాలిగా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన శ్రావణికి ఎంతో భవిష్యత్ ఉందన్నారు. తమతో కలిసి వస్తే బీజేపీలో మంచి అవకాశాలు లభిస్తాయని ఈటల భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం లేకుండా పోయిందని, అణగారిన వర్గాలు, మహిళలను అవమానా లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. శ్రావణి ఇందుకు నిదర్శమని వ్యాఖ్యానించారు. -
కొడుకు మృతిని తట్టుకోలేక.. తల్లి ఆత్మహత్య
సాక్షి, మెట్పల్లి(జగిత్యాల): తన కొడుకు మృతిని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఆ తల్లి బావిలో దూకి బలవన్మరణానికి ఒడిగట్టింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూర్ మండలంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్ గ్రామానికి చెందిన నేరేళ్ల లక్ష్మీరాజం – రాజగంగు(53) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు శివకుమార్(23) ఉన్నారు. కూతుళ్లకు వివాహం కాగా, చదువుకుంటున్న కుమారుడు మూడు నెలల క్రితం వరదకాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఉపాధి నిమిత్తం లక్ష్మీరాజం దుబాయ్‌కి వెళ్లగా, రాజగంగు ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. కుమారుడి మరణంతో మానసికంగా కకుంగిపోయిన ఆమె.. తనకు ఇక బతకబుద్ధి కావడం లేదని తరచూ కుటుంబ సభ్యులతో చెబుతూ బాధపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కూతుళ్లు ఆమెకు ఫోన్ చేయగా, స్వీచ్‌ఆఫ్ అని రావడంతో వారు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. బంధువులతో కలిసి పలుచోట్ల వెతికారు. చివరకు శివారులోని వ్యవసాయ బావిలో చూడగా మృతదేహం కనిపించింది. విగతజీవిగా మారిన తల్లిని చూసి కూతుళ్లు బోరున విలపించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ శ్యామ్‌రాజ్ తెలిపారు. -
కొండగట్టు ఆలయ అభివృద్ధి సీఎం కేసీఆర్ సమీక్ష
-
ఈనెల 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 14న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యాదాద్రి ఆలయ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి ఆదివారం కొండగట్టుకు వెళ్లనున్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించిననున్నారు ఆనంద్ సాయి. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను జగిత్యాల ఎస్పీ భాస్కర్ పరిశీలించారు. కాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. దేవాలయ అభివృద్ధికోసం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద ఈ నిధులను మంజూరు చేస్తూ ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె, రామకృష్ణా రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు విడుదల చేస్తామని గత డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వగా.. ఈ మేరకు నిధులు విడుదల చేశారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ కేసు: మరోసారి తెరమీదకు ఎమ్మెల్సీ కవిత పేరు -
కరెంట్ కోతలపై అన్నదాతల నిరసన
జగిత్యాల రూరల్: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలోని రైతులు ఆదివారం స్థానిక సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. వ్యవసాయ రంగానికి వచ్చే త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులను కార్యాలయంలోని ఓ గదిలో ఉంచి తాళం వేశారు. సబ్‌స్టేషన్ ఎదుట సుమారు రెండు గంటలపాటు బైఠాయించారు. వ్యవసాయ రంగానికి నిరంతరం త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కనీసం ఐదు గంటలు కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. సమయపాలన లేకుండా అధికారులు కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాత్రి, పగలు తేడాలేకుండా 24 గంటలపాటూ వ్యవసాయ బావుల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాస్తున్నామని పేర్కొన్నారు. కాగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. గది తాళం తీసి వారికి విముక్తి కల్పించారు. -
అమ్మా, పెళ్లికి వెళ్లొస్తాం.. శుభకార్యం కోసం వెళ్లి మృత్యుఒడిలోకి!
సాక్షి, జగిత్యాల: ‘అమ్మా.. నాన్నతో కలిసి పెళ్లికి వెళ్తున్నం.. అక్క, నువ్వు కూడా వస్తే బాగుండు.. కానీ, మీరు ఎందుకు రావడం లేదు..? అయినా మేం వెళ్లి వస్తం.. బైబై’ అంటూ తండ్రితో కలిసి సంతోషంగా బయటకు వెళ్లారు.. పెళ్లి వేడుకకు హాజరై విందు ఆరగించారు.. ఆ తర్వాత ఇంటిదారి పట్టారు.. కొద్దిక్షణాల్లో ఇంటికి చేరుకుంటామనే లోపే.. తండ్రి వారిద్దరినీ బావిలోకి తోసేశాడు.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం రాత్రి 9.30గంటల సమయంలో నర్సింగాపూర్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గడ్డం జలపతిరెడ్డి(45) – కవిత దంపతులు. వీరికి కూతుళ్లు జాష్మిత, ప్రణిత్య, మధుమిత ఉన్నారు. జాష్మిత కండ్లపల్లి మోడల్ స్కూల్లో ఏడోతరగతి, మిగతా ఇద్దరు జగిత్యాలలోని ఓ ప్రైవేట్ బడిలో వరుసగా నాలుగో, రెండోతరగతి చదువుతున్నారు. తను అప్పు ఇచ్చి.. మరికొందరి వద్ద అప్పు చేసి. జలపతిరెడ్డి కొందరికి కొంత అప్పు ఇచ్చాడు. వారు తిరిగి ఇవ్వడంలేదు. తన కుటుంబ అవసరాలకో సం అతడు కూడా రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు.అవి తీర్చే దారిలేకపోవడం, ప్రభుత్వం సేకరించిన నాలుగెకరాలకు సంబంధించిన పరిహారం ఇప్పించడంలో ఓ న్యాయవాది తీవ్ర జాప్యం చేయడంతో కొంతకాలంగా మనస్తాపంతో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు తన రెండోకూతురు ప్రణిత్య, చిన్నకూతురు మధుమితను వెంటబెట్టుకుని ద్విచక్ర శుక్రవారం రాత్రి 8గంటలకు జగిత్యాలకు బయలు దేరాడు. ► ఓ ఫంక్షన్హాల్లో వేడుకకు హాజరై అందరూ విందు భోజనం చేశారు. ► రాత్రి 9.30 గంటల సమయంలో ముగ్గురూ ఇంటికి బయల్దేరారు. ► నర్సింగాపూర్ శివారులోని ఎల్లమ్మగుడి వద్దగల వ్యవసాయ బావివద్దకు చేరుకున్నారు. ► తొలుత తన ఇద్దరు కుమార్తెలను జలపతిరెడ్డి బావిలో తోసేశాడు. ► ఆపై తానూ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ► రాత్రి 10 గంటల వరకూ పిల్లలు, భర్త ఇంటికి రాకపోవడంతో భార్య కవిత ఆందోళన చెందింది. ► పలుమార్లు ఫోన్‌చేయగా లిఫ్ట్ కాలేదు. మనసులో ఏదో కీడు శంచింకింది. ► ఉదయం 8 గంటల సమయంలో నర్సింగాపూర్ ఎల్లమ్మ గుడి వద్ద తన సోదరుడు రాజిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద జలపతిరెడ్డి మృతదేహం లభ్యమైంది. ► సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ ప్రకాశ్, రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్సై అనిల్.. బాలికల కోసం ఆరా తీశారు. ► అయితే, ధరూర్‌కు చెందిన చల్ల వెంకన్నకు జలపతిరెడ్డి తనకు తనకు మిగిలిన ఎకరం విక్రయించిన భూమిలోని బావిలో చిన్నారుల మృతదేçహాలు కనిపించాయి. పథకం ప్రకారమే.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న జలపతి రెడ్డి.. భార్య కవితకు కుమార్తెలు భారం కాకూడదని భావించాడు. పథకం ప్రకారమే కూతుళ్లను శుభకార్యానికి తీసుకెళ్లేందుకు సిద్ధం చేశాడు. పిల్లల్ని బావిలో తోసేస్తూ తన ఫోన్లో చిత్రీకరించినట్లు తెలిసింది. అంతకు ముందే అక్కడ సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకున్నాడు. భార్యకు వాట్సాప్‌లో పోస్ట్ చేశాడు. పెద్దకూతురు ప్రాణాలు కాపాడిన హోంవర్క్ పెద్దకుమార్తె జాష్మితను తమతోపాటే తీసుకెళ్లేందుకు జలపత్తిరెడ్డి యత్నించాడు. కానీ తన కు హోంవర్క్ ఉందని, పెళ్లికి రాను అని బాలి క మొండికేసింది. తండ్రి బుజ్జగించినా ససే మిరా అనడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. గ్రామంలో విషాదం. లపతిరెడ్డి తన ఇద్దరు కుమార్తెలతో ఆత్మహత్య చేసుకోవడం నర్సింగాపూర్ గ్రామంలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. జలపతిరెడ్డి అందరితో కలిసిమెలిసి ఉండేవాడని గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. భార్య, పెద్దకూతురు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, పెద్ద కుమార్తె జాష్మిత.. తన తండ్రి చితికి నిప్పంటించగా ప్రణిత్య, మధుమితల మృతదేహాలకు పూడ్చిపెట్టారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియలకు హాజరయ్యారు. న్యాయవాదే కారణమని సూసైడ్ నోట్ జగిత్యాల శివారులోని టీఆర్‌నగర్ గ్రామం స్థాపించేందుకు రాష్ట్రప్రభుత్వం 1985లో జలపతిరెడ్డికి ఉన్న ఐదెకరాల్లో నాలుగు ఎకరాలు సేకరించింది. ఆయనతోపాటు నర్సింగాపూర్ గ్రామానికే చెందిన రైతుల నుంచి కూడా 45.20 ఎకరాలు సేకరించింది. అయితే, కోర్టులో కేసు వేయగా తొలిదశలో ఎకరాకు రూ.16వేల చొప్పున వడ్డీతో కలిపి మొత్తం రైతుల కోసం రూ.45,95,516 సొమ్మును రెవెన్యూ శాఖ కోర్టులో జమచేసింది. ఆ సొమ్ములో తనకు రావాలి్సన సొమ్ము ఇప్పించాలని న్యాయవాదిని జలపతిరెడ్డి చాలాసార్లు కలిసి విన్నవించాడు. డబ్బులు ఇప్పించడంలో లాయర్ నిర్లక్ష్యం చేశాడు. ఒకవైపు తనకున్న ఎకరం విక్రయించినా చేసిన అప్పులు తీరే దారిలేకపోవడం, ఇతరులకు ఇచ్చిన అప్పులు రాకపోవడం కూడా తోడుకావడంతో జలపతిరెడ్డి మనస్తాపం చెందాడు. తన చావుకు న్యాయవాదే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన భర్త ఆత్మహత్యకు న్యాయవాది కారణమని మృతుడి భా ర్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు న్యాయవాది దామోదర్‌రా వుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు.