సాక్షి, జగిత్యాల: జగిత్యాలలో ఓ ప్రేమికుడు హల్‌చల్ చేశాడు. పెట్రోల్ బాటిల్‌తో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఆత్మహత్యకు యత్నించాడు. అరగంటపాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. కరీంనగర్‌కు చెందిన యువతిని ప్రేమిస్తే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారనిని ఆందోళన వ్యక్తం చేశాడు. జగిత్యాలకు చెందిన వెంకటరమణ ప్రేమ పేరుతో తమ కూతురును వేధిస్తున్నాడని యువతి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వెంకటరమణను పోలీస్ స్టేషన్‌కు పిలువగా భయాందోళనకు గురైన ప్రేమికుడు పెట్రోల్ బాటిల్ తో స్టేషన్‌కు వచ్చి హంగామా చేశాడు.
ఒంటిపై పెట్రోలు పోసుకుని దగ్గరకు వస్తే నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడుతానని హెచ్చరించాడు. దీంతో పోలీసులు అమ్మాయిని రప్పించాలని డిమాండ్ చేశాడు. మీడియా సమక్షంలో స్టేషన్‌లోకి వస్తానని షరతు విధించాడు. చివరికి ప్రేమికుడిని ఎలాగోలా సముదాయించి స్టేషన్‌లోకి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాత్కాలికంగా యువకుడిని వదిలేసినా.. తర్వాత తమదైన శైలిలో విచారించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
చదవండి: 3.46లక్షల ఫాలోవర్స్..‘మీ డై హార్ట్ ఫ్యాన్’ అంటూ
పాక్‌లో మ్యాచ్.. సిటీలో బెట్టింగ్
Comments
Please login to add a commentAdd a comment